medical camp
-
పార్వతీపురంలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో తో కలిసి మన్యం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. తాజాగా పార్వతీపురంలో నాట్స్, గ్లో సంస్థలు సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. ఇందులో ముఖ్యంగా విద్యార్ధుల ఆరోగ్యంపై దృష్టి సారించాయి. గిరిజన విద్యార్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందించాయి. గిరిజనుల సంక్షేమానికి తన వంతు చేయూత అందించేందుకు నాట్స్ ముందు ఉంటుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. గ్లో సంస్థ సహకారంతో గిరిజనులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.(చదవండి: చికాగోలో నాట్స్ వింటర్ క్లాత్ డ్రైవ్) -
న్యూజెర్సీలో మాటా ఫ్రీ హెల్త్ క్యాంప్
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ ను ప్రారంభించింది. న్యూజెర్సీ, ఎడిసన్‌లోని సాయి దత్త పీఠం అండ్ కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్‌కి విశేష స్పందన వచ్చింది. ఫ్లు ఇంజెక్షన్ తోపాటు Free Medication అందజేశారు. వాలంటీర్లు, డాక్టర్లు పాల్గొని సేవలందించారు.ఈ సందర్భంగా మాటా తరుపున చేస్తున్న సేవా కార్యక్రమాలను సంస్థ సభ్యులు వివరించారు. అమెరికాలో ఉన్న తెలుగు అసోసియేషన్స్‌లో అతి తక్కువ టైమ్ లో ఎక్కువ మందికి చేరువైన సంస్థ మాటా అన్నారు. మూడు వేల మంది సభ్యులతో ప్రారంభించి.. అనేక రాష్ట్రాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఫ్రీ హెల్త్ క్లినిక్ లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లు, డాక్టర్లందరికీ మాటా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాటా సంస్థని పలువురు అభినందించారు. ముఖ్య అతిథిలుగా విచ్చేసిన పలువురు ప్రముఖులు మాటా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.(చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక) -
పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!
పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో నాట్స్ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంగా నిర్వహించిన సభకు లక్ష్మణ్ రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పెదనందిపాడులో పలుమార్లు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి వందలాది మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయించడం నిజంగా చాలా గొప్ప విషయమన్నారు. జన్మభూమి రుణం తీర్చుకోవాలనే తపనతో పని చేస్తున్న నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతిని లక్ష్మణరావు అభినందించారు. అమెరికాలో ఉంటున్న బాపు నూతి తన స్వగ్రామమైన పెదనందిపాడులో చేస్తున్న సేవా కార్యక్రమాలు నేటి యువతలో సేవా భావాన్ని, దేశభక్తిని పెంపొందించడానికి తోడ్పడతాయని అన్నారు. నాట్స్ చేపడుతున్న కార్యక్రమాల్లో తాను కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని లక్ష్మణరావు అన్నారు. రెండు రాష్ట్రాల్లో కుట్టు మిషన్ శిక్షణ శిబిరాలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు ,ప్రభుత్వ పాఠశాలలకు సైకిల్ స్టాండు నిర్మాణం,మెడికల్ క్యాంపులు నిర్వహించడం, గ్రూప్ 2 అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ అందజేయడం వంటి కార్యక్రమాలపై లక్ష్మణరావు ప్రశంసల వర్షం కురిపించారు. వైద్యం పొందడానికి పేదరికం అనేది శాపం కాకూడదనేది నాట్స్ లక్ష్యమని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి అన్నారు. గత కొన్నేళ్లుగా నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెదనందిపాడులో వందలాది మందికి ఉచిత కంటి పరీక్షలు చేయించడంతో పాటు.. అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించామని తెలిపారు. నల్లమల అడవి ప్రాంతంలో మహిళా సాధికారత కోసం గిరిజన మహిళలకు కుట్టుశిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పేద ప్రజలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి, ఆనందం మరే దానిలో తనకు లభించలేదని బాపు నూతి అన్నారు. ఈ సభకు కాకుమాను నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. మెగా కంటి వైద్య శిబిరాలు పేద ప్రజలు చక్కగా వినియోగించుకున్నారని ఆల్ ఇండియా లాయర్ యూనియన్ రాష్ట్ర నాయకులు నర్రా శ్రీనివాసరావు అన్నారు. ప్రాంగణంలో కంటి వైద్య శిబిరాన్ని శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, మాజీ ఎంపీపీ మర్ర బాలకృష్ణ ,ముద్దన నాగరాజుకుమారి ,పారిశ్రామిక వేత్తలు దాసరి శేషగిరిరావు, అరవపల్లి కృష్ణమూర్తి ,ముద్దన రాఘవయ్య, శీలం అంకారావు ,కొల్లా సాంబశివరావు తదితరులు బాపయ్య చౌదరి చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం నూతి బాపయ్య చౌదరి ,ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, నర్రా శ్రీనివాస్‌లను రైతు సంఘాల ప్రతినిధులు శాలువాతో సత్కరించారు. ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో 620 మంది పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 374 మంది ఆపరేషన్లు అవసరమని వైద్యులు నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో వైద్య శిబిరం నిర్వహణ కమిటీ సభ్యులు దాసరి సుబ్బారావు, దాసరి రమేష్ ,ఎస్ చౌదరి ,లావు శివప్రసాద్ ,పి.పోతురాజు,కాకుమాను చెన్నకేశవులు ,కే శ్రీనివాసరావు,పి. గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. నాట్స్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.పేద విద్యార్ధులకు సాయం చేయడంలో తాను ఎప్పుడూ ముందుంటానని ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని బాపు నూతి సందర్శించారు..ఎంతో మంది పేద రైతులు పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఏర్పాటుకు సహకరించారని బాపు నూతి అన్నారు. ఈ కాలేజీలో చదువుకున్న వారు అనేక రంగాల్లో మంచి విజయాలు సాధించారని.. అందులో తాను కూడా ఉన్నానని అన్నారు. పెదనందిపాడు అభివృద్ధికి తాను వంతు చేయూత అందించేందుకు ఎప్పుడూ ముందుంటానని చెప్పారు. పేద విద్యార్ధులకు ఉపకార వేతనాలు ఇచ్చి వారిని ప్రోత్సాహిస్తున్నామని బాపు నూతి తెలిపారు. అమెరికాలో తెలుగువారికి నాట్స్ కొండంత అండగా నిలుస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. దివ్యాంగుల స్వశక్తితో నిలబడేలా వారికి చేయూత అందించే కార్యక్రమాలను నాట్స్ చేపడుతుందని వివరించారు. పెదనందిపాడు ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ వీరరాఘవయ్య, నంది పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణలతో కళశాల ఆధ్యాపకులు కలిసి బాపయ్య చౌదరిని ఘనంగా సన్మానించారు.(చదవండి: కర్నూల్లో నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరం!) -
కర్నూలులో నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరం!
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా కర్నూలు నగరంలోని ఓల్డ్ సిటీలో నాట్స్ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. పేదరికం కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకుడదనే సంకల్పంతో నాట్స్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు, దివ్యాంగులకు చేయూత, విద్యార్ధులకు ఉపకారవేతనాలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. సుశీల నేత్రాలయం, మైత్రి హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో దాదాపు 1000 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందించారు. ఈ శిబిరంలో నాట్స్ సభ్యులతో పాటు స్థానికులు సుబ్బారావు దాసరి, ఎస్ చౌదరి, నారాయణ, బాలకాశి పాల్గొని దీనిని విజయవంతం చేశారు. నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వైద్యులకు, సభ్యులకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తి మృతి..వాటర్ ట్యాంక్‌ని క్లీన్ చేస్తుండగా..) -
కట్టమూరులో నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తోంది. దీనిలో భాగంగా నాట్స్ తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి చొరవతో కాటూరు మెడికల్ కాలేజీ వారి సహకారంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దాదాపు 500 మందికి పైగా రోగులకు శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందించారు. ఈ మెగా వైద్య శిబిరంలో బీపీ, షుగర్, గుండె, శ్వాస కోస, ఊపిరితిత్తులు, కళ్ళు, ముక్కు, చెవి, గొంతు, ఎముకలు, కీళ్లు ఇలా 12 విభాగాలకు చెందిన వైద్యులు.. రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. జన్మభూమి రుణం కొంత తీర్చుకోవాలనే లక్ష్యంతోనే తాము ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి ఈ సందర్భంగా తెలిపారు.. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ అధ్యక్షుడు, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ మోహన కృష్ణ మన్నవ, స్థానిక ప్రముఖులు మాగలూరి భాను ప్రకాష్, బొల్లు సురేశ్, హరి కొల్లూరు, కిరణ్ కుంచనపల్లి, గ్రామ పెద్దలు శివప్రసాద్, మల్లికార్జున రావు, నరేష్, శ్రీనివాస రావు, బాబు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్యం, మందులు అందించడం అభినందనీయమని శ్రీ హరి మందాడిని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రశంసించారు. మెగా ఉచిత వైద్య శిబిరంలో ఉచిత వైద్య సేవలు పొందిన వారు తమ కోసం శ్రీ హరి మందాడి చూపిన చొరవ, సేవాభావాన్ని కొనియాడారు.(చదవండి: టంపాబే లో అనాథల కోసం నాట్స్ సరికొత్త సేవా కార్యక్రమం!) -
ఆటా ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్
-
‘జగనన్న ఆరోగ్య సురక్ష’కు విశేష స్పందన
కడప: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని జిల్లా నోడల్ అధికారి మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని వి.కొత్తపల్లె గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష పనితీరుపై తెలుసుకునేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాలకు నోడల్ అధికారులను నియమించిందన్నారు. వైద్యశిబిరానికి వచ్చిన రోగులను అడిగి.. అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన బీపీ చెకప్ చేయించుకున్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ స్టాల్స్‌ను పరిశీలించి అక్కడి గర్భవతులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ అర్జున్ రావు, ఎంపీడీఓ విజయరాఘవరెడ్డి, తహసీల్దార్ వెంకటసుబ్బయ్య, మండల ఉపాధ్యక్షురాలు లీలావతి, సర్పంచ్ గంగరాజు, వైద్యులు పాల్గొన్నారు. -
ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్న వైదులు
-
ఆచంట నియోజకవర్గంలో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం
-
రాష్ట్ర సచివాలయంలో ఉచిత వైద్య శిబిరం
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేశారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్ స్పెషలిస్ట్, క్యాన్సర్ వైద్య పరీక్షలతో పాటు, ఈసీజీ, 2డీ ఎకో ఇతర వైద్య పరీక్షలు చేశారు. మొత్తం 750 మంది వైద్య సేవలు పొందారు. శిబిరంలో డాక్టర్ వేణు గోపాల్‌రెడ్డి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ శివ, ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
TANA: గుడివాడలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం
గుడివాడ (కృష్ణా జిల్లా): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా గుడివాడలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక రోటరీ క్లబ్ సహాయంతో కళ్లు, ఈఎన్టీ, కేన్సర్ క్యాంప్ చేపట్టారు. స్కూల్ విద్యార్దినిలకు తానా చేయూత ద్వారా 55 మందికి స్కాలర్షిప్లు, తానా ఆదరణ ప్రోగ్రాం ద్వారా 25 కుట్టు మిషన్లు, 15 సైకిల్స్, 4 వీల్ చైర్స్ అందజేశారు. శశికాంత్ వల్లేపల్లి తన తండ్రి వల్లేపల్లి సీతా రామ్మోహన్ రావు పేరు మీద రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ - రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్, గుడివాడ వారికి వైకుంఠ రథం బహూకరించారు. తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బారావు చెన్నూరి, టీఎన్ఐ లైవ్ ఎడిటర్ ముద్దు కృష్ణ నాయుడులను సత్కరించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ ఈ సందర్భంగామాట్లాడుతూ.. డిసెంబర్ 2 నుంచి జనవరి 4 వరకు తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో జరిగే సేవా కార్యక్రమాల గురించి వివరించారు. తానా టీమ్ స్క్వేర్ ద్వారా అమెరికాలోని తెలుగువారికి ఆపద, విపత్కర సమయాల్లో ఏ విధంగా సహాయం చేస్తున్నామో తానా సెక్రెటరీ సతీష్ వేమూరి వివరించారు. తానా చైతన్య స్రవంతి కార్యక్రమానికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా రావి వెంకటేశ్వర రావు, వర్ల కుమార్ రాజా, గుడివాడ రోటరీ క్లబ్ పాలక సభ్యులు పాల్గొన్నారు. అమెరికా నుంచి వచ్చిన తానా నాయకులు శశికాంత్ వల్లేపల్లి, పురుషోత్తం గూడె, సునీల్ పాంత్రా, శశాంక్ యార్లగడ్డ, శ్రీమతి ఉమా కటికి, జోగేశ్వరరావు పెద్దిబోయిన, టాగోర్ మలినేని, రాజ కాసుకుర్తి, డాక్టర్ రావు మొవ్వా, శ్రీనివాస ఓరుగంటి, నాగ పంచుమర్తి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. (క్లిక్: హైదరాబాద్‌లో తానా మహాసభల సన్నాహక సమావేశం జయప్రదం) -
కాలానుగుణ వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి
తూర్పు గోదావరి (రంగంపేట): కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై అవగాహన పెంచుకుని నివారణకు జాగ్రత్తలు పాటించాలని సత్యసాయి సేవా సంస్ధల జిల్లా అధ్యక్షుడు బలుసు వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక సత్యసాయి మందిరం వద్ద శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన చెవి, ముక్కు, గొంతు, ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజమహేంద్రవరానికి చెందిన శ్రీసత్యసాయి సరస్వతి చెవి, ముక్కు, గొంతు వైద్యశాల డాక్టర్ పి. ప్రవీణ్‌కుమార్ రెడ్డి ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 50 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగ సమన్వయ కర్త సుక్కిరెడ్డి సాయి సుధాకర్, రంగంపేట సజ్జోన్ కనీ్వనర్ మల్రెడ్డి వీర్రాజు, గరిమెళ్ళ అరుణ, సేవా సంస్థ కనీ్వనర్లు టి.గోవిందరాజులు, కె.వెంకట అమర్నాధ్, చావా బోధియ్య, ఉండవిల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఆషామాషీ కాదు: మోదీ
అహ్మదాబాద్: మన దేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ఇది ఆషామాషీ విజయం విజయం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విజయమని, ఈ ఒరవడిని కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విజయంతో మరింత కష్టపడి, మరిన్ని పెద్ద విజయాలను సాధించగలమనే ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని ఒల్పాడ్లో గురువారం జరిగిన మెడికల్ క్యాంప్‌లో వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు లబ్ధిదారులతో ముచ్చటించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందేందుకు అవకాశమున్న ప్రకృతి సేద్యం వైపు మరలాలని రైతులను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.2 లక్షల కోట్లను జమ చేశామన్నారు. ఇంటర్నెట్, సాంతికేక పరిజ్ఞానం పుస్తకాల స్థానాన్ని భర్తీ చేయలేవని ప్రధాని మోదీ అన్నారు. పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని కోరారు. నవభారత్ సాహిత్య మందిర్ అహ్మదాబాద్‌లో నిర్వహించిన పుస్తక ప్రదర్శన ప్రారంభం సందర్భంగా మోదీ సందేశం పంపించారు. -
పెదనందిపాడులో నాట్స్ మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరం
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగునాట కూడా తన సేవా పరంపరను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పెదనందిపాడులో మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించింది. పెదకాకాని శంకర కంటి ఆస్పత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థలతో కలిసి నాట్స్ ఈ ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరాన్ని పెదనందిపాడు పీఎఎస్ కళాశాలలో విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు, విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా హాజరయ్యారు. అమెరికాలోనే కాకుండా సాటి తెలుగువారి కోసం నాట్స్ ఇక్కడ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎంపీ లావు కృష్ణ దేవరాయలు అన్నారు. నాట్స్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బాపయ్య చౌదరి తన పుట్టిన గడ్డకు ఎంతో కొంత మేలు చేయాలనే సంకల్పంతో ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని కృష్ణదేవరాయలు ప్రశంసించారు. ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, పేదలకు ఎంతో ఉపయోగం ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు బాపయ్య చౌదరి మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. పెదనందిపాడు గడ్డ ఎన్నో పోరాటాలకు కేంద్రబిందువుగా ఉందని, అలాంటి ప్రాంతానికి చెందిన బాపయ్య చౌదరి అమెరికాలో ఉన్నత పదవులు అధిరోహించి, తమ జన్మభూమికి సేవ చేయడం అభినందించదగ్గ విషయమని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. కరోనా సందర్భంలో కూడా బాపయ్య చౌదరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. పెదనందిపాడులో ప్రతిభ గల విద్యార్ధులకు ఉపకార వేతనాలు కూడా ఇస్తున్న బాపయ్య చౌదరి దాతృత్వం గొప్పదని ప్రశంసించారు. బాపయ్య ఈ ప్రాంతానికి మరి ఎన్నో సేవలు చేయాలని ఆకాంక్షించారు. నాట్స్ సంస్థ భాషే రమ్యం సేవే గమ్యం వంటి ఉన్నత ఆశయాలతో స్థాపించిబడింది అని, ఆ సంస్థలో బాపయ్య చౌదరి అంచెలంచెలుగా సేవ చేస్తూ నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం మన ప్రాంతానికి గర్వకారణమని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తా: బాపయ్య చౌదరి, నాట్స్ అధ్యక్షుడు నాట్స్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి తెలిపారు. విద్య, వైద్యం తదితర అంశాలపై రాబోయే కాలంలో రెండు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మిత్రులకు, గ్రామ పెద్దలకు, శంకర కంటి ఆస్పత్రి సిబ్బందికి, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరానికి 2500 మంది పరీక్షలు చేయించుకొగా... వారిలో లో 570 మందిని ఆపరేషన్లు చేయడానికి అర్హులుగా వైద్యులు తేల్చారు. వీరికి విడతలవారీగా బస్సులు ఏర్పాటు చేసి శంకర కంటి ఆసుపత్రి లో ఆపరేషన్లు చేయిస్తామని బాపయ్య చౌదరి తెలిపారు. నాట్స్ చైర్మన్ అరుణ గంటి అమెరికా నుండి పాత కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీలతో సమావేశమయ్యారు. బాపు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. టెలిఫోన్ ద్వారా బాపయ్య చౌదరికి ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. సేవా కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమానికి తమ వంతు మద్దతు అందిస్తామని కాకుమాను నాగేశ్వరరావు, కుర్రా హరిబాబు అన్నారు. ఈ సభకు కాకుమాను నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ వైద్య శిబిరానికి శంకర కంటి ఆసుపత్రి వైద్యులు కే అనూష, ఎస్ శ్రీదివ్య, కే సంకల్ప, క్యాంప్ ఎగ్జిక్యూటివ్ బీవీ నాగబాబులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ అధ్యక్షులు, బోర్డ్ అఫ్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మాదల రాజేంద్ర, సభ్యులు ధూళిపాళ్ల సురేంద్ర, కాళహస్తి సత్యనారాయణ, లావు రత్తయ్య, కొల్లా రాజమోహన్ రావు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ నర్రా శ్రీనివాస్, నూతి శ్రావణి, పోపూరి, లక్ష్మీనారాయణ, కుర్రా హరిబాబు, నూతి శ్రీనులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. చదవండి: ఆపి 40 వార్షిక సదస్సు వివరాలు -
కరోనా ఉగ్రరూపం
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కత్తులు దూస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. వరుసగా ఐదో రోజు 15 వేలకుపైగా కేసులు బహిర్గతమయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం దాకా.. కేవలం 24 గంటల వ్యవధిలో ఏకంగా 19,906 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఈ సంఖ్యే అత్యధికం. గత 24 గంటల్లో 410 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం.. ఇండియాలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 5,28,859కు, మరణాలు 16,095కు చేరాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,03,051 కాగా, 3,09,712 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. ఇండియాలో జూన్ 1 నుంచి 28వ తేదీ వరకు 3,38,324 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటిదాకా 82,27,802 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. రికవరీ రేటు 58.56 శాతం దేశంలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా పెరుగుతుండడం సానుకూల పరిణామం. రికవరీ రేటు ప్రస్తుతం 58.56 శాతానికి చేరింది. యాక్టివ్ కేసులు, కరోనా నుంచి కోలుకున్నవారి మధ్య తేడా లక్షకుపైగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వ్యత్యాసం ఆదివారం నాటికి 1,06,661 అని తెలియజేసింది. దేశవ్యాప్తంగా 1,055 ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటళ్లలో 1.77 లక్షల ఐసోలేషన్ పడకలు, 23,168 ఐసీయూ పడకలు, 78,060 ఆక్సిజన్ సపోర్టెడ్ బెడ్లు ఉన్నాయి. అలాగే 2,400 కోవిడ్ హెల్త్ సెంటర్లలోనూ సేవలందిస్తున్నారు. అంతేకాకుండా 8.34 లక్షల పడకలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ముంబైలోని ఓ మురికివాడలో మెడికల్ క్యాంపు నిర్వహించేందుకు వెళ్తున్న ఆరోగ్య కార్యకర్తలు -
మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభించిన మల్లాది
-
‘కొందరిలోనే సమాజసేవ ఆకాంక్ష’
సాక్షి, హిందూపురం : సమాజ సేవ చేయాలనే ఆకాంక్ష కొందరిలోనే ఉంటుందని, అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని రాష్ట్ర మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన వారు సమాజ సేవకు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. స్థానిక పంచజన్య శ్రీనివాసభారతి చారిటుబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్స్ వెల్ఫర్ అసిసోయేషన్, బెంగళూరు పీపుల్స్ ప్రీ హాస్పిటల్స్ సౌజన్యంతో పంచజన్య స్కూల్లో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఏటా మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేదలకు నాణ్యమైన వైద్య చికిత్సలను ఉచితంగా అందజేస్తున్న పంచజన్య శ్రీనివాస్ సేవలను అభినందించారు. ఇతర దేశాల్లో స్థిరపడ్డ వైద్యులను ఇక్కడకు రప్పించి, వారి చేత వైద్య సేవలు అందించడం చాలా గొప్ప విషయమన్నారు. కేవలం వైద్య శిబిరాలే కాకుండా ఇతర సామాజిక సేవా కార్యక్రమాలపై కూడా దృష్టి సారించాలని కోరారు. శ్రీనివాసులు మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆస్పత్రి వైద్య నిపుణులు 15 మందిని ఒక చోట చేర్చి అన్నిరకాల రోగాలకు ఉచితంగా పరీక్షలు చేయించడంతో పాటు మందులూ ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి శంకరనారాయణ వైద్యశిబిరంలో పర్యటిస్తూ రోగులకు పంపిణీ చేస్తున్న మందుల వివరాలు, చికిత్స విధానాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి అతి«థులుగా ప్రీపుల్స్ హాస్పిటల్ సీఈఓ చంద్రశేఖర్, మునియప్ప, మున్సిపల్ కమిషనర్ మోహన్‌రావు, ఎంఈవో గంగప్ప, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పుల్లారెడ్డి హాజరయ్యారు. శిబిరంలో సుమారు 1,500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచజన్య స్కూల్ కోశాధికారి నందకిషోర్, ఏఓ భాస్కర్, హెచ్ఎం గాయత్రి, ఏహెచ్ఎంలు విజయేంద్ర, శశికళ, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు వేణుగోపాల్, రియాజ్, ముస్తఫా అలీఖాన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆటా ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్
వాషింగ్టన్ : ప్రవాస తెలుగు వారికే కాకుండా ప్రవాస భారతీయులందరికీ అండగా నిలిచే ఆటా, ఆగస్టు 17న అత్యున్నత స్థాయిలో హెల్త్ క్యాంపు నిర్వహించింది. అమెరికాలో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేపట్టే ఆటా నేడు చేసిన హెల్త్ క్యాంపు వల్ల పలు వర్గాల వారికి బహు విధాలా ప్రయోజనకరంగా వారి సేవలు అందించారు. ఆట వాషింగ్టన్ డీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు ఆరు వందలకు పైగా అమెరికా వాసులు, వారి బంధు మిత్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అతి విజయవంతంగా చేసారు. హేర్నడోన్ కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన ఈ ప్రోగ్రాం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2 వరకు నడిచింది. కార్యక్రమంలో ౩౦ మంది పైగా డాక్టర్లు పాల్గొన్నారు. వైద్యో నారాయణో హరి: అన్నట్లుగానే వచ్చిన వైద్యులు చాలా ఓపికతో వచిన వారికీ సలహాలు ఇచ్చి వారి సమస్యలకు స్పందించారు. వచ్చిన వారందరు పలు స్పెషాలిటీస్ లో ఆరితేరిన నిపుణులు మరియు 10ఏళ్లకు పైగా అనభవాం కలిగిన వైద్యులు కావడం విశేషం. అరుదైన విధంగా హృదయేతర కార్డియాలజిస్ట్ , కిడ్నీ స్పెషలిస్ట్స్, ఇంటర్నల్ మెడిసిన్, దంత మరియు ఆర్థోపెడిక్ డాక్టర్స్, పిల్లల డాక్టర్స్, న్యూరాలజీ, అల్లెర్జీస్ సంబంధించిన నిపుణులను మరియు అనేక ఫార్మాసిస్ట్స్లను ఒకే చోటుకు తీసుకు వచ్చిన ఖ్యాతి ఆటా ఒక్కదానికే దక్కింది. వారికి వారే సాటి! అన్ని రకాల వైద్యులు ఒకే చోట ఉన్నందున వచ్చిన ప్రతి వ్యక్తి హర్షం వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ ఉన్నా ఎన్నోసార్లు తిరగాల్సిన అవసరం లేకుండా ఆటా ఈ విధంగా తమకి ఎంతో సాయం చేసిందని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రక్త పరీక్ష మరియు బీపీ చెకప్ చేయించుకొని డాక్టర్ల చేత సలహాలు పాందారు. డాక్టర్ రామకృష్ణన్ గారి హృదయ సమస్యల పరమైన అవగాహన మరియు ఆరోగ్యకరమైన జీవన విధానం, డాక్టర్ వీరపల్లి గారి వ్యాధుల లక్షణాలు తెలుసుకోవడం, డాక్టర్ పాలువోయ్ గారిచే అల్లెర్జిఎస్ ఎలా అరికట్టాలో వినడం తమకు ఎంతో ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు. వచ్చిన వారందరూ ఆటా ఈ క్యాంపు ద్వారా తమ రుగ్మతలను సకాలంలో వైద్య సదుపాయాలందించిందని అభినందించారు. వచ్చిన వైద్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ భువనేశ్ మాట్లాడుతూ.. సామాజిక ప్రయోజనమే లక్షంగా పెట్లుకొని ఈ ప్రొగ్రాం నిర్వహించామని , వైద్య సదుపాయాలు తెచ్చామని , ఆరోగ్యకరమైన అవగాహన కల్సించాలని , సామాజిక అభ్యున్నతికి సర్వ విధాలా ఆటా తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన వైద్యులకు ధన్యవాదాలు తెలియచేస్తూ , డాక్టర్ వెంకట్ గారి ప్రేరణనను అభినంధిస్తూ , వైద్యులందరికి కృతజ్ఞత భావంగా మెమెంటోలని సమర్పించారు .ఇంత పెద్ద ఎత్తున క్యాంపు ఎవరు చేయలేదని , ఇదే చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నారు. ఆట బోర్డు అఫ్ ట్రస్టీస్ సౌమ్య కొండపల్లి మరియు జయంత్ చల్ల గార్లు మాట్లాడుతూ.. ఆట సంవత్సరం పొడువునా అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ప్రవాస తెలుగు వారికీ ఉన్నత విద్యలో స్కాలర్షిప్స్ ఇస్తుందని, భారతదేశంలో మానవీయ సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తుందని పేర్కొని , ఇంత భారీ ఎత్తున క్యాంపు చేసినందుకు ఆట డీసీ చాప్టర్ కు అభినందలు తెలిపారు . -
దివ్యాంగులు, అనాథ పిల్లలకు ఉచిత వైద్య శిబిరం
సందేశాత్మక లఘు చిత్రాలు, మ్యూజిక్ వీడియోస్‌తో ఆకట్టుకున్న దర్శకుడు డాక్టర్ ఆనంద్ చిన్నారులు, దివ్యాంగులు, అనాథ పిల్లల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. జనయిత్రి ఫౌండేషన్ మరియు బంజారా మహిళా యన్.జీ వొ సంయుక్తంగా డాక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బోడుప్పల్ ,పీర్జాది గూడా ప్రాంతంలో వున్న దివ్యాంగులు, అనాథ పిల్లల కోసం ఒక ఉచిత వైద్య శిబిరాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ‘డాక్టర్ కావ్య (గైనకాలజిస్ట్), డాక్టర్ మధు( ఫిజీషియన్), డాక్టర్ అర్జున్ (డెంటిస్ట్) కలిసి, దాదాపు 200 మంది చిన్న పిల్లలకు వైద్య పరీక్షలతో పాటు, రక్త పరీక్షలను కూడా నిర్వహించినట్లుగా తెలిపారు. ముఖ్యంగా ఆటిజం, బాధిర్యం, మానసిక ఎదుగుదల లోపం, అంధత్వం, మస్తిష్క పక్షవాతం లాంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు, వారి తల్లి తండ్రులకు సహాయ సహకారాలను అందిచామ’ని తెలిపారు. ఇలాంటి కార్య క్రమాల ద్వారా ఎంతో మంది చిన్నారులకు లబ్ది చేకూరుతుందని, మరెన్నో కార్యక్రమాలను దేశ మంతటా నిర్విస్తున్నట్లు డాక్టర్ ఆనంద్ తెలియ చేసారు. బీహార్ చిన్న పిల్లల కోసం, ఒడిషా ఫాని తుఫాను బాధితుల కోసం పలు వైద్య శిబిరాలను నిర్వహించిన ఆనంద్‌ను ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. -
బాబోయ్ జ్వరాలు..
సాక్షి, గార: మండలంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు రావడం, ఎండలు మండిపోతుండడంతో ఉపాధి వేతనదారులు, చిన్నారులు, వృద్ధులు జ్వరాల బారిన పడుతున్నారు. అయితే అంతా ఎన్నికల బిజీలో ఉండడంతో వీరు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మండలంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. మండలంలో శ్రీకూర్మం పంచాయతీలో సెగిడిపేట తదితర గ్రామాలతో పాటు, సైరిగాం పంచాయతీ అప్పోజీపేట, రామచంద్రాపురం, గొంటి పంచాయతీల పరిధిలో అధికంగా జ్వర బాధితులు ఉన్నారు. ఏడు రోజులుగా బాధపడుతున్నా.. ఏడు రోజులుగా జ్వరం వస్తోంది. గ్రామంలోని డాక్టరును అడిగితే మందులు ఇచ్చారు. కానీ తగ్గలేదు. మండలంలో పెద్ద డాక్టరు దగ్గరుకు వెళ్లినా ఏమాత్రం మార్పులేదు. మందులు వాడుతున్నా జ్వరం తగ్గడం లేదు. – బరాటం వెంకటేశ్వరరావు, అప్పోజీపేట మరో ఊరెళ్తున్నాం.. ఊర్లో జ్వరం ఉందని చెబితే మందులిచ్చారు. తగ్గలేదు సరికదా ఒళ్లంతా (శరీరమంతా) ఊపేస్తుంది. ఇంకో ఊరెళ్లి వైద్యం చేయించుకుంటున్నాం. అయినా జ్వరం తగ్గడం లేదు. తిండి తినడం లేదు. – కిల్లాన అచ్చెమ్మ, సెగిడిపేట, శ్రీకూర్మం -
విశాఖలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
ప్రారంభమైన వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, అమరావతి: నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల కోసం తపించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. డిసెంబర్ 21 జననేత పుట్టిన రోజు కావడంతో.. ఒకరోజు ముందుగానే అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను ప్రారంభించారు. రాష్ట్రంలోని పలుచోట్ల కేక్‌లు కట్‌చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాడిపత్రిలో వృద్దులకు దుస్తుల పంపిణీ.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో శ్రీ కృష్ణ వృద్దాశ్రమంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌రెడ్డి వృద్దాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. అనంతరం ఆశ్రమంలోని వృద్దులకు దుస్తులు పంపిణీ చేశారు. వైజాగ్‌లో భారీ కేక్ కట్ చేసిన పార్టీ శ్రేణులు వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా వైజాగ్‌లోని మనోరమ జంక్షన్లో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ రమణ మూర్తి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బారీ కేక్ కట్ చేశారు. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం కన్వీనర్ గరికిన గౌరి, వార్డు అధ్యక్షురాలు భారతిలు పాల్గొన్నారు. విజయవాడలో మెడికల్ క్యాంపు.. జననేత జన్మదిన వేడుకల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, తనుబుద్ది చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ల చేతుల మీదుగా ఈ క్యాంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు రక్షణ నిధి, జోగి రమేశ్, ఇక్బాల్, ఉదయభాను, మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్, అసిఫ్, తోట శ్రీనివాస్, ఎంవీఆర్ చౌదరి, అరిమండ వరప్రసాద్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
ప్రజలు వైద్యం కోసం ఎదురు చూస్తున్నారు
ప్రకాశం, గిద్దలూరు: రాష్ట్రంలో ప్రజలకు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక కాశిరెడ్డినగర్లోని శ్రీ శ్రీనివాస డిగ్రీ కళాశాల, సాయిటెక్నో స్కూల్లలో వైవీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్యశిబిరాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నప్పటికీ అందులో వైద్యులు, సిబ్బంది కొరత, మందుల కొరతతో ప్రజలకు వైద్యం అందడం లేదన్నారు. కరువుతో అల్లాడుతున్న ప్రజలు ఉచిత వైద్య శిబిరాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజలకు వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం అందించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నీరుగార్చిందన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పటిష్టంగా అమలు పరిస్తే ప్రజలు ఉచిత వైద్య శిబిరాల వైపు చూడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. జిల్లాలో 555 ఆరోగ్య కేంద్రాలు, 90 పీహెచ్‌సీలు, 14 సీహెచ్‌సీలు ఉన్నా ప్రయోజనం శూన్యమన్నారు. ప్రజలకు తగిన వైద్యం అందడం లేదని గ్రహించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తాను అన్ని నియోజకవర్గాల్లో మెగా ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే మార్కాపురం, దర్శి, కనిగిరి, గిద్దలూరులో నిర్వహించినట్లు చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ప్రజలకు ఉపయోగపడేలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల నుంచి సైతం వేలాది మంది ప్రజలు వైద్య శిబిరానికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారన్నారు. అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్టు వైద్యులతో శిబిరాలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. శిబిరంలో పాల్గొన్న వారందరికీ భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి 6,500 మంది వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరికి మందులు, భోజన వసతి కల్పించారు. మంచినీటి సరఫరాలో లోపం వలనే ప్రజలకు అనారోగ్యం:ప్రభుత్వం ప్రజలకు శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయకపోవడం వలనే అనారోగ్యం పాలవుతున్నారని ఆయన అన్నారు. 2014 ఎన్నికల ముందు ప్రతి గ్రామంలో మినరల్ ప్లాంట్ ద్వారా తాగునీరందిస్తామని చెప్పిన చంద్రబాబు నేటికీ ఏర్పాటు చేయలేదన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెయ్యి అడుగుల లోతులో బోరుబావులు తవ్వితే కానీ నీరు లభించని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ నీటిని తాగిన ప్రజలు కీళ్లనొప్పులు, కిడ్నీ, ఫ్లోరోసిస్ వ్యాధిబారిన పడి మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు సాగర్ జలాలు వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడంతో అవి ప్రజలకు చేరువకావడం లేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు కావస్తున్నా ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. ఫలితంగా ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు లేదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టు, గుండ్లమోటు ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరందిస్తామన్నారు. కంభం చెరువుకు నీరు నింపి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు మరుగున పడటం వలన సాగులో ఉన్న ఖరీఫ్, రబీ రెండు పంటలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన అరకొర పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పంటను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. 2014 ఎన్నికల ముందు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు అధికారంలోకి రాగానే రైతులను ఆదుకునేందుకు స్వామినాథన్ కమిషన్ సిపార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారని, నేటికీ రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించిన దాఖలాలు లేవన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రైతును ఆదుకునేందుకు అన్నివిధాలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ తిరిగి అధికారం చేపట్టాలన్న దురుద్దేశంతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోనే 5,227 ఓట్లను తొలగించేందుకు ఫారం–7 పెట్టారని, వారి కుట్రలను భగ్నం చేస్తూ సమన్వయకర్త ఐవీ రెడ్డి, నాయకులతో కలిసి 4,463 ఓట్లను పునరుద్ధరించేలా చేశారన్నారు. ప్రజలకు సేవచేసి వారి మన్ననలను పొందలేని అధికార పార్టీ నాయకులు ఇలాంటి నీచానికి దిగజారుతున్నారు. ప్రజల కోసం సేవచేస్తున్న వారికి మద్దతు పలికి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిడతల సాయికల్పనారెడ్డి, యాళ్లూరి వెంకటరెడ్డి, కే.పి.కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, నాయకులు కామూరి రమణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ సీహెచ్.రంగారెడ్డి, యేలం వెంకటేశ్వర్లు, కే.వి.రమణారెడ్డి, మండల కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు. సాగర్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి పొదిలి: సాగర్ కుడి కాలువ కింద వరి సాగు చేసిన రైతులకు సకాలంలో నీరు అందించటంలో విఫలం కావటంతో వరి ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యుడు వైవి.సుబ్బారెడ్డి అన్నారు.మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి స్వగృహంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ వాటిని ప్రణాళిక బద్ధంగా రైతులకు అందించటంలో విఫలమయ్యారన్నారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. పొదిలి ప్రాంతంలోని ఫ్లోరైడ్ సమస్య, నీటి సమస్య గురించి ఢిల్లీ స్థాయిలో గళం వినిపించామని, ఫలితంగా కేంద్ర అధికారులు వచ్చి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారన్నారు. మంచినీటి ప్రాజక్టుల కోసం కేంద్రం నిధులు మంజూరు చేసిందని, అయితే చర్యలు తీసుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. పశ్చిమ ప్రాంతం వారికి కరవు లేకుండా చేసే వెలుగొండ ప్రాజక్టు నిర్మాణం చంద్రబాబుతో కాదన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన సంవత్సరం లోపు ప్రాజెక్టు పూర్తి చేయటంతో పాటు, పొదిలి ప్రాంత ప్రజల తాగునీటి ఇబ్బందులు తీరుస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సానికొమ్ము పిచ్చిరెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. -
పెదమానాపురంలో వైద్యశిబిరం
దత్తిరాజేరు విజయనగరం : మండలంలోని పెదమానాపురం దళిత కాలనీలో సోమవారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. వారం రోజులుగా కాలనీవాసులు జ్వరాలతో అవస్థలు పడుతున్న నేపథ్యంలో ‘మంచం పట్టిన మానాపురం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి విజయలక్ష్మి ఆదేశాల మేరకు స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి రామేశ్వరి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేసి రోగులకు వైద్యసేవలందించారు. రాజన శాంతి, మరియాల వెంకటలక్ష్మి, బొత్స రమ, ఈశ్వరమ్మ, చిన్నారులు గౌతమి, నాని, మౌనిక, తదతర జ్వర పీడితులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. ఇంటింటికీ వెళ్లి జ్వరపీడితుల వివరాలు సేకరించారు. అనంతరం డాక్టర్ రామేశ్వరి మాట్లాడుతూ, పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే జ్వరాలు ప్రబలినట్లు చెప్పారు. స్థానిక పశువుల ఆస్పత్రి ఆవరణలో పశువులను నిత్యం ఉంచడం వల్ల మురుగు పేరుకుపోవడంతో వ్యాధులు ప్రబలాయని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులపై జిల్లా పంచాయతీ అధికారి బి. అప్పారావు ఆరా తీశారు. పనులు సక్రమంగా చేపట్టాలని మండల పంచాయతీ అధికారి రాంబాబును ఆదేశించారు. ఈ విషయమై గ్రామ ప్రత్యేక అధికారి, మండల తహసీల్దార్ కల్పవల్లి స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి పారిశుద్ధ్య పనులు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో సీహెచ్ఓ సత్యనారాయణ, హెల్త్ సూపర్వైజర్ నరసింహులు, ఫార్మాసిస్టు సీతారాం, వీఆర్వోలు తిరుపతి, రాజేష్, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో ఏర్పాటుచేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ బుధవారం ప్రారంభించారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం, అపోలో ఆస్పత్రులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరం 3 రోజులు కొనసాగనుంది. ఈ సందర్భంగా జస్టిస్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, న్యాయవాద వృత్తిలో తీవ్ర ఒత్తిడి ఉంటుందని, అందువల్ల ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడాన్ని అలవాటు చేసుకోవాలని న్యాయవాదులను కోరారు. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆలోచన విధానం సరిగ్గా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, అపోలో ఆస్పత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, ఇరు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.