వైద్యసేవలపై సబ్‌కలెక్టర్‌ ఆరా | subcollector visit medical camp | Sakshi
Sakshi News home page

వైద్యసేవలపై సబ్‌కలెక్టర్‌ ఆరా

Published Fri, Jul 22 2016 6:26 PM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM

subcollector visit medical camp

దొరవారిసత్రం: ఏకొల్లు ఎస్సీ కాలనీలో కొనసాగుతున్న వైద్యశిబిరం ద్వారా ప్రజలకు అందుతున్న వైద్యసేవలపై సబ్‌ కలెక్టర్‌ గిరీషా ఆరా తీశారు. శుక్రవారం ఆయన కాలనీలో పర్యటించి జ్వరంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పలువురి ఇళ్లను సందర్శించి లార్వా సర్వే చేపట్టారు. రోజూ సురక్షిత నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో పాటు పంచాయతీ పాలకులకు సూచించారు. జ్వరాలు పూర్తిగా తగ్గే వరకూ వైద్యశిబిరం కొనసాగించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఒకే వైద్యాధికారి కావడంతో అందరికీ వైద్యసేవలు అందడం లేదని, జ్వరాలు తగ్గుముఖం పట్టే వరకూ మరో వైద్యాధికారిని నియమించాలని స్థానికులు సబ్‌కలెక్టర్‌ను కోరారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యురాలు విజేత, తహసీల్దార్‌ శ్రీనివాసులు, సర్పంచ్‌లు కష్ణమూర్తి, జాన్‌ రమేష్‌ ఉన్నారు. 
వివాదాస్పద భూమి పరిశీలన 
నెలబల్లిలో ఇరువర్గాల మధ్య సమస్యగా మారిన ప్రభుత్వ స్థలాన్ని సబ్‌కలెక్టర్‌ పరిశీలించారు. అనుమతి లేకుండా దిగకుండా చర్యలు తీసుకోమని స్థానిక రెవెన్యూ అధికారులకు సబ్‌కలెక్టర్‌ ఆదేశించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement