Subcollector
-
శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్‌లకు పోస్టింగ్స్
సాక్షి, అమరావతి: శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్‌లకు పోస్టింగ్స్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ సబ్‌కలెక్టర్‌గా జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, తెనాలి సబ్‌కలెక్టర్‌గా నిధి మీనా, టెక్కలి సబ్‌కలెక్టర్‌గా ఎం.వికాశ్, పాడేరు సబ్‌కలెక్టర్‌గా వి.అభిషేక్, పెనుగొండ సబ్‌కలెక్టర్‌గా ఎన్.నవీన్,నర్సాపురం సబ్‌కలెక్టర్‌గా సి.విష్ణుచరణ్, కందుకూరు సబ్‌కలెక్టర్‌గా అపరాజిత సింగ్, రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా కొట్ట సింహాచలం, పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా భావన, నంద్యాల సబ్‌కలెక్టర్‌గా సి.బాజ్పాల్ ను నియమించారు. చదవండి: ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి -
పోలింగ్ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ
సాక్షి, చంద్రగిరి రూరల్: నియోజకవర్గంలోని సెక్టోరల్ మేజిస్ట్రేట్లను 42 నుంచి 64కు పెంచామని, సమస్యాత్మక కేంద్రాలపై అవగాహన కలిగి ఉండాలని తిరుపతి సబ్ కలెక్టర్, చంద్రగిరి ఆర్ఓ మహేష్‌కుమార్ అన్నారు. ఆదివారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలోని తహసీల్దార్లు, సెక్టోరల్ అధికారులతో ఆయన సమావేశమై మండలాల వారీగా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సంబంధించి 325 పోలింగ్ కేంద్రాలకు 42 మంది సెక్టోరల్ అధికారులను నియమించామని, అయితే కొంత ఇబ్బందులు తలెత్తడంతో మరో 22 మంది అదనంగా నియమించినట్లు తెలిపారు. సెక్టోరల్ మేజిస్ట్రేట్లు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పట్టు సాధించాలని, సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించాలన్నారు. ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన కలిగించి, పోలింగ్ శాతాన్ని పెంచాలన్నారు. పోలింగ్ కేంద్రాల వసతుల కల్పన, వికలాంగులకు ర్యాంపు ఏర్పాట్లు పూర్తి చేసి రోజువారీ నివేదికను ఇవ్వాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో జాగ్రత్తలు వహించి, సెక్టోరల్ అధికారులు పోలీసులతో సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు. ఈసీ సూచించిన సెక్టోరల్ అధికారులు విధులను అవగాహనతో సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు హరికుమార్, సత్యనారాయణ, ముని, రామ మోహన్, శ్రీనివాసులు, దస్తగిరయ్య, జయరాములు, సబ్ కలెక్టర్ కార్యాలయ ఏఓ కిరణ్ కుమార్, డీటీలు లక్ష్మీనారాయణ, అశోక్ పిళ్లై ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
వైద్యసేవలపై సబ్‌కలెక్టర్ ఆరా
దొరవారిసత్రం: ఏకొల్లు ఎస్సీ కాలనీలో కొనసాగుతున్న వైద్యశిబిరం ద్వారా ప్రజలకు అందుతున్న వైద్యసేవలపై సబ్ కలెక్టర్ గిరీషా ఆరా తీశారు. శుక్రవారం ఆయన కాలనీలో పర్యటించి జ్వరంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పలువురి ఇళ్లను సందర్శించి లార్వా సర్వే చేపట్టారు. రోజూ సురక్షిత నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పాటు పంచాయతీ పాలకులకు సూచించారు. జ్వరాలు పూర్తిగా తగ్గే వరకూ వైద్యశిబిరం కొనసాగించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఒకే వైద్యాధికారి కావడంతో అందరికీ వైద్యసేవలు అందడం లేదని, జ్వరాలు తగ్గుముఖం పట్టే వరకూ మరో వైద్యాధికారిని నియమించాలని స్థానికులు సబ్‌కలెక్టర్‌ను కోరారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యురాలు విజేత, తహసీల్దార్ శ్రీనివాసులు, సర్పంచ్‌లు కష్ణమూర్తి, జాన్ రమేష్ ఉన్నారు. వివాదాస్పద భూమి పరిశీలన నెలబల్లిలో ఇరువర్గాల మధ్య సమస్యగా మారిన ప్రభుత్వ స్థలాన్ని సబ్‌కలెక్టర్ పరిశీలించారు. అనుమతి లేకుండా దిగకుండా చర్యలు తీసుకోమని స్థానిక రెవెన్యూ అధికారులకు సబ్‌కలెక్టర్ ఆదేశించారు. -
జిల్లాలో పర్యటించిన ఎస్టీ కమిషన్ చైర్మన్
♦ బోయ, వాల్మీకులను ఎస్టీలో చేర్చాలని పలువురి వినతి ♦ త్వరలో ప్రభుత్వానికి నివేదిక : డాక్టర్ చెల్లప్ప వికారాబాద్/ధారూరు : బోయ, వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించే విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం నియమించిన ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులు సోమవారం జిల్లాలోని వికారాబాద్, ధారూరు మండలాల్లో పర్యటించారు. వికారాబాద్ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సబ్‌కలెక్టర్ శ్రుతిఓజా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బోయ, వాల్మీకులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాలో తక్కువ శాతం ఉన్నందుకే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తమ పట్ల చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో వాల్మీకి, బోయలను ఎస్టీలుగా ఉన్నారన్నారు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ తమకు గుర్తింపు లేకపోవడంతోనే ఆర్థిక, విద్యా పరంగా వెనుకబడి ఉన్నామని తెలిపారు. కేవలం ఏజెన్సీ ప్రాంతంలో ఉండే వాల్మీకి, బోయలను మాత్రమే ఎస్టీ జాబితాలో ఉంచారని తెలిపారు. తమను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని కమిషన్ చైర్మన్, సభ్యులు ఎదుట విన్నవించారు. ధారూరు మండలం కుక్కింద పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎస్ చెల్లప్ప గ్రామంలోని బోయలతో మాట్లాడారు. ప్రభుత్వం అందించే వివిధ పథకాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. వాల్మీకి, బోయల్లో సామాజిక స్వాతంత్య్రం రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ చెల్లప్ప మాట్లాడుతూ ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాలో పర్యటించి బోయ, వాల్మీకుల స్థితిగతులు, విద్య, ఆర్థిక అంశాలపై అధ్యయనం చేశామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పర్యటించి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఇదిలా ఉండగా.. బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చ వద్దను ఎస్టీ కుల సంఘం నాయకులు కమీషన్ బృందం ఎదుట అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్టీ కమీషన్ కార్యదర్శి కే వీరమల్లు, సభ్యుడు జగన్నాథరావు, బీసీ వెల్ఫేర్ డీడీ విద్యారెడ్డి, జెడ్పీటీసీ పట్లోళ్ల రాములు, డీటీడబ్ల్యూఓ అశోక్‌కుమార్, ఏటీడబ్ల్యూఓ రామేశ్వరీదేవి, ఏఎస్డబ్ల్యూఓ శ్యామెల్, తహసీల్దార్ బీ శ్రీనివాస్, వాల్మీకి,బోయ ఐక్యపోరాట సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి వెంకటేశ్, వికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు నాగయ్య, సభ్యులు రాజారత్నం, బాలయ్యలు, వీఆర్ఓ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.