కర్నూలులో నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరం! | NATS Mega Free Medical Camp Held In Kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరం!

Published Wed, May 29 2024 1:19 PM | Last Updated on Wed, May 29 2024 1:21 PM

NATS Mega Free Medical Camp Held In Kurnool

అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా కర్నూలు నగరంలోని ఓల్డ్ సిటీలో నాట్స్ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. పేదరికం కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకుడదనే సంకల్పంతో నాట్స్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు, దివ్యాంగులకు చేయూత, విద్యార్ధులకు ఉపకారవేతనాలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.  సుశీల నేత్రాలయం, మైత్రి హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో దాదాపు 1000 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందించారు. ఈ శిబిరంలో నాట్స్ సభ్యులతో పాటు స్థానికులు సుబ్బారావు దాసరి, ఎస్ చౌదరి, నారాయణ, బాలకాశి పాల్గొని దీనిని విజయవంతం చేశారు. నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వైద్యులకు, సభ్యులకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

(చదవండి: సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తి మృతి..వాటర్‌ ట్యాంక్‌ని క్లీన్‌ చేస్తుండగా..)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement