మర్రిపాడు (సరుబుజ్జిలి), న్యూస్‌లైన్ : మండలంలోని షళంత్రి పంచాయతీ మర్రిపాడులో డయేరియా ప్రబలింది. రెండు రోజుల నుంచి 11 మంది చిన్నారులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. కొల్ల హాసిని, మజ్జి భరణి, కొమ్ము వివేకానంద, ఇప్పిలి కీర్తన, ఇప్పిలి ధనుష్, కొల్ల రుషేంద్ర, కందుల భార్గవి తదితరులు అతిసారతో బాధపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అతిసార బాధితుల్లో 11 నెలల నుంచి ఐదేళ్ల బాలబాలికలు ఉన్నారు.
కలుషితమైన బోరు నీరే కారణం
గ్రామంలో బోరు నీరు కలుషితం కావడంతో తరచూ వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామానికి చెందిన కొల్ల శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య లోపంతో పాటు ఏఎన్‌ఎం హెడ్‌క్వార్టర్స్‌లో నివసించకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. అత్యవసర పరిస్థితిలో కూడా సాధారణమాత్రలు అందించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ప్రైవేట్ వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నామని చెప్పారు. పారిశుద్ధ్యం మెరుగు చేయాలని, గ్రామంలో అతిసార బాధితులకు వైద్యసేవలందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
లావేటిపాలెంలో వైద్యశిబిరం ఏర్పాటు
లావేరు: మండలంలోని లావేటిపాలెం గ్రామంలో శనివారం లావేరు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. లావేటిపాలెం గ్రామానికి చెందిన భైరి జయప్రకాష్ డెంగీ జ్వరంతో బాధపడుతున్నట్లు ప్రైవేట్ వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ‘లావేటిపాలెంలో బాలునికి డెంగీ’ శీర్షికన శనివారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురిమైంది. దీనికి స్పందించిన లావేరు పీహెచ్‌సీ వైద్యాధికారిణి భారతీకుమారి దేవి, రణస్థలం క్లస్టర్ ఎస్‌పీహెచ్‌వో ఎంపీవీ నాయక్ గ్రామంలో పర్యటించారు. లావేటిపాలెం గ్రామంలో శనివారం వైద్యశిబిరం ఏర్పాటు చేసి 67 మందికి డాక్టర్ భారతీకుమారి దేవి వైద్యసేవలందించారు. ఇంటింటా వెళ్లి జ్వర పీడితుల వివరాలను సేకరించారు. లావేటిపాలెంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంపై రణస్థలం క్లస్టర్ ఎస్‌పీహెచ్‌వో ఎంపీవీ నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రణస్థలం క్లస్టర్ సీహెచ్‌వో రాజగోపాలరావు, హెల్త్ సూపర్‌వైజర్ రమణమూర్తి, హెచ్‌వీ హేమకుమారి, హెల్త్ సూపర్‌వైజర్ పీవీ రమణమూర్తి, ఏఎన్‌ఎంలు ఆర్.రమణమ్మ, జి.త్రివేణి, ఎస్.భవానీ, సరోజిని, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
మర్రిపాడులో ప్రబలిన డయేరియా
Published Sun, Aug 18 2013 4:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
Advertisement
Advertisement