![Seasonal Diseases Awareness Should be Increased - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/3/Seasonal-Diseases.jpg.webp?itok=RuQWStFI)
తూర్పు గోదావరి (రంగంపేట): కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై అవగాహన పెంచుకుని నివారణకు జాగ్రత్తలు పాటించాలని సత్యసాయి సేవా సంస్ధల జిల్లా అధ్యక్షుడు బలుసు వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక సత్యసాయి మందిరం వద్ద శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన చెవి, ముక్కు, గొంతు, ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
రాజమహేంద్రవరానికి చెందిన శ్రీసత్యసాయి సరస్వతి చెవి, ముక్కు, గొంతు వైద్యశాల డాక్టర్ పి. ప్రవీణ్‌కుమార్ రెడ్డి ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 50 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగ సమన్వయ కర్త సుక్కిరెడ్డి సాయి సుధాకర్, రంగంపేట సజ్జోన్ కనీ్వనర్ మల్రెడ్డి వీర్రాజు, గరిమెళ్ళ అరుణ, సేవా సంస్థ కనీ్వనర్లు టి.గోవిందరాజులు, కె.వెంకట అమర్నాధ్, చావా బోధియ్య, ఉండవిల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment