Seasonal diseases
-
3 వైరస్ల ముప్పు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు వెలుగుచూశాయి. ఈ వైరస్ పాతదే అయినప్పటికీ అది సోకితే వచ్చే వ్యాధుల ప్రభావం పిల్లలు, వృద్ధుల్లో అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది. చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తిపై ఈ ఏడాది మొదటివారంలో ఈ సంస్థ అధ్యయనం చేసింది. చైనాతోపాటు, భారత్‌లో వైరస్ వ్యాప్తి గురించి వివరిస్తూ తాజాగా నివేదిక విడుదల చేసింది. హెచ్ఎంపీవీతోపాటు ఇన్ఫ్లుయెంజా, ఆర్‌ఎస్‌వీల వ్యాప్తి కూడా పెరిగినట్లు వెల్లడించింది.పాతవే.. అయినా జాగ్రత్త ముఖ్యం..మనదేశంలో హెచ్ఎంపీవీ 2015 – 2017 మధ్య కాలంలో వ్యాప్తి చెందినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 60 ఏళ్లలోపు వయ సున్న ప్రతి లక్ష మందిలో సగటున 220 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. 60–74 ఏళ్ల మధ్య వయస్కుల్లో వైరస్ వ్యాప్తి వేగంగా ఉంది. 80 ఏళ్లకు పైబడిన వారిలో రెట్టింపు స్థాయిలో ఉంది. 2018లో ప్రపంచవ్యాప్తంగా 1.1 కోట్ల హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.వీరిలో ఆస్పత్రిలో చేరిన వారి రేటు 5% ఉండగా, మరణాల రేటు ఒకశాతం ఉంది. హెచ్ఎంపీవీతోపాటు ఇన్ఫ్లుయెంజా, ఆర్‌ఎస్‌వీలు యువకుల్లో పెద్దగా ప్రభావం చూపవని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. నాలుగేళ్లలోపు చిన్నారులు, 60 సంవత్సరాలు పైబడినవారిలో వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని వెల్లడించింది. 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు వారిలో వైరస్‌ను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉందని పేర్కొంది.న్యుమోనియా ప్రమాదం..హెచ్ఎంపీవీ, ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వీ వైరస్లు సోకినప్పుడు అత్యధికుల్లో రోగ నిరోధక శక్తి క్రియాశీలమై వైరస్‌ను జయిస్తున్నారు. అయితే, ఇన్‌పేషెంట్ కేటగిరీ రోగుల్లో ఇన్ఫ్లుయెంజా బారిన పడిన వారు 30 శాతం ఉండగా, హెచ్ఎంపీవీతో 6.2 శాతం, ఎడినో వైరస్‌తో 3.7 శాతం, రినో వైరస్‌తో 4.9 శాతం ఆసుపత్రుల పాలవుతున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. శ్వాస, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలున్న వారికి ఈ వైరస్లు హాని తలపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా దగ్గు, జలుబు ఉన్న వారిలో ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరుతుందని, అది క్రమంగా న్యుమోనియాకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.జాగ్రత్తలు పాటించాలిచిన్న పిల్లల్లో, వృద్ధుల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉండడంతో బయ టి వ్యక్తులతో ఎక్కువగా కలువొద్దు. కోవిడ్– 19 సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించ డంతో వైరస్ వ్యాప్తి తగ్గింది. దీంతో వాటికి సంబంధించిన యాంటిబాడీస్ క్షీణించాయి. ఇప్పుడు వైరస్ వ్యాప్తితో సమస్యలు వస్తు న్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలిక సమస్యలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలున్నవారు వైద్యడి సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ తీసు కోవడం మంచిదే. – డాక్టర్ కిరణ్ మాదల,క్రిటికల్ కేర్ హెచ్ఓడీ, గాంధీ మెడికల్ కాలేజీ -
వింటర్లో వ్యాధులు : మిరియాలతో చాలా మేలు!
లేదు..రాలేదు అనుకుంటూ ఉండగానే చలి పులి పరుగెత్తుకొచ్చేసింది. మరోవైవు ఫంగెల్ ప్రభావం, వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశంఉంది. చలికాలంలో వచ్చే కొన్ని అనారోగ్యసమస్యల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని వంటింటి చిట్కాలను పాటించాల్సిందే. ఇంట్లోనే లభించే నల్ల మిరియాలతో చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు మొదలైన సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. నల్ల మిరియాల్లో ఎన్నో ఔషధగుణాలుంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉన్నాయి. ఉంటాయి. ఇవి అంటువ్యాలులు సోకకుండా కాపాడతాయి. అలాగే నొప్పులనుంచి ఉపశమనం కలిగిస్తాయి. నల్ల మిరియాల్లోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా మెగ్నీషియం, రాగి, ఇనుము, కాల్షియం, భాస్వరం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలకు మంచి మూలం. ఇందులో విటమిన్లు ఎ, కె, ఇ బి విటమిన్ కూడా ఉన్నాయి. ఇందులోని పైపెరిన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ప్రేగులను శుభ్రం చేస్తుంది.మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా నల్ల మిరియాలను సేవిస్తే మలబద్ధకం సమస్య తీరుతుంది.రక్త ప్రసరణను మెరుగుపరచడంలో చక్కగా పనిచేస్తాయి.అంతేకాదుబరువు తగ్గడంలో కూడా మిరియాలు బాగా పనిచేస్తాయి. ఇందులో లభించే ఫైటో న్యూట్రియెంట్స్ అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతాయి. జీవక్రియను వేగవంతం చేస్తాయి.అలాగే చలికాలంలో కీళ్లు,ఎముకల నొప్పులు బాగా వేధిస్తాయి. ఈ బాధలనుంచి ఉపశమనం కలిగించే ఔషధ గుణాలు మిరియాల్లో ఉన్నాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులకు కూడా ఇవి మేలు చేస్తాయి. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి. నల్ల మిరియాలు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి. క్యాన్సర్‌ను నివారణలోనూ ఉపయోగపడ తాయంటున్నారు నిపుణులుమనకున్న అనారోగ్య సమస్యను బట్టి తులసి ఆకులు, పసుపు మిరియాలతో చేసిన కషాయం, మిరియాల పాలు,మిరియాలు తేనె, మిరియాలు, తమలపాకు రసం కలుపుకొని తాగవచ్చు.గ్రీన్ టీకి చిటికెడు నల్ల మిరియాలు కలుపుకోవచ్చు.కూరలు, సలాడ్లలో మిరియాల పొడి జల్లు కోవచ్చు. మిరియాలు ,యూకలిప్టస్ నూనె వేసి మరిగించిన నీళ్లో ఆవిరి పట్టవచ్చు. నోట్: ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. మిరియాలు అందరికి ఒకేలా పనిచేయవు. శరీర తత్వాన్ని బట్టి, నిపుణుల సలహామేరకు తీసుకోవాలి. మిరియాలను ఎక్కువగా తీసుకుంటే కొన్ని నష్టాలు కూడా ఉంటాయనేది గమనించాలి. -
పెరుగుతోన్న చలి తీవ్రత.. రోగాల బారిన పడకుండా ఉండాలంటే..
చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చల్లటి గాలులు కూడా వణికిస్తున్నాయి. అయితే చలిగాలులు అనేక రకాల వ్యాధులను కూడా మోసుకొస్తున్నాయి. ఈ సీజన్లో ప్రజల్లో వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలిగాలులు శరీరంలోకి వెళ్లడంతో వైరస్లు మరింత వృద్ధి చెందే ప్రమాదం ఉందని అంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చలితీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు కూడా పేర్కొంటున్నారు.సమస్యలు.. ఫ్లూ, సైనసైటిస్, ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి(సీవోపీడీ), ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతాయి. హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డ కట్టి గాయాలు కావటం, పెర్నియో, ఇమ్మర్షన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.లక్షణాలు.. దగ్గు, జలుబు, గొంతునొప్పి, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆయాసం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలు.. చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో మాస్కులు ధరించాలి. దీంతో వైరస్ సోకదు. వేరేవారికి సోకకుండా ఉంటుంది. ఎవరైనా వాతావరణాన్ని అంచనా వేసుకుని బయటకు రావాలి. మరీ చలితీవ్రత అధికంగా ఉంటే బయటకు రాకుండా ఉంటే మంచిది. ము ఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇన్హేలర్లను వాడుతుండాలి.ఎవరికి ఇబ్బంది.. చలి తీవ్రత నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు వేడివేడిగా సరైన ఆహారం తీసుకోవాలి. పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలి. చలిగాలులు ఉన్నప్పుడు చిన్నారులను బయట తిప్పకూడదు. ఎక్కువరోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి రక్తం రావటం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చలిగాలుల్లో ఆరు బయట పనిచేసే కార్మికులు, వీధుల్లో గడిపే నిరాశ్రయులు జాగ్రత్తగా ఉండాలి.చదవండి: ఈ డివైజ్‌తో మొటిమలలు, మచ్చలు ఇట్టే మాయం..!కారణాలు.. ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల వైరస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో శరీరంలో వైరస్ కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి. ఈ వాతావరణంలో ఒకరి నుంచి మరొకరికి వేగంగా ఫ్లూ వ్యాప్తి చెందుతుంది.వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవాలి.. చలికాలంలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. దీంతో పౌష్టికాహారం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఉసిరి, నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం మరింత మంచిది. విపరీతమైన చలికి జాగ్రత్తలు తీసుకోకపోతే, అవయవాల్లో గాయాలై మరణాలు సంభవించవచ్చు. – డాక్టర్ ఎం.రాజీవ్, పల్మనాలజిస్ట్, టీజీఎంఎస్ సభ్యుడు -
‘హ్యాండ్ ఫుట్ మౌత్’తో చిన్నారులు ఉక్కిరిబిక్కిరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్నారులను సీజనల్ వ్యాధులైన జలుబు, జ్వరం, దగ్గు, డెంగీ, మలేరియా వంటివి అల్లాడిస్తున్నాయి. ఇప్పుడు వాటికి తోడు హ్యాండ్ ఫుట్ మౌత్ అనే వ్యాధి పిల్లలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాక్సీకీ అనే వైరస్ ద్వారా నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయసు గల చిన్నారుల వరకు ఎక్కువగా ఈ వ్యాధి వ్యాపిస్తోంది. చేతులు, కాళ్లు, నోటి మీద దద్దుర్లు, పొక్కులు, పుండ్లు వంటి వాటితో ఇబ్బంది పెడుతుంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఈ వైరస్ ఔట్ బ్రేక్ ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖ నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లోని చిన్నపిల్లల ఆస్పత్రులకు రోజూ కనీసం నాలుగు కేసులు ఇలాంటివి వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే, ఇది ప్రాణాంతక వ్యాధి కాదని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు. ఇవీ వ్యాధి లక్షణాలు..» వ్యాధి సోకిన పిల్లల్లో చేతులు, కాళ్లు, ముఖం, నోటిలో ర్యాషస్, పుండ్లు, పొక్కులు రావడం వంటి లక్షణాలు ఉంటాయి. వీటితోపాటు కొందరిలో జ్వరం, జలుబు, గొంతు నొప్పి, నోటిలో మంట ఉంటుంది. » ఒకటి, రెండు రోజులకు కురుపులు మోకాళ్లు, మోచేతులు, పిరుదులపై కూడా కనిపిస్తాయి. » ర్యాషస్, పుండ్లు, పొక్కుల వల్ల దురద, మంటతోపాటు ఆహారం తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడతారు. » వైద్యులను సంప్రదించి మందులు వాడితే నాలుగు, ఐదు రోజుల్లో వ్యాధి అదుపులోకి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వారం రోజులపాటు వ్యాధి లక్షణాలు ఉంటాయి.» వ్యాధిగ్రస్తుల మలం, లాలాజలం, దగ్గు, తుమ్ముల వల్ల వచ్చే తుంపర్లలోని వైరస్ నోటి ద్వారా కడుపులోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించలేక అలాగే పాఠశాలలకు పంపుతుండటంతో వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. లక్షణాలు ఉన్న పిల్లలను బయటకు పంపొద్దుహ్యాండ్ ఫుట్ మౌత్ ప్రాణాంతకమైన వ్యాధి కాదు. అయినప్పటికీ తల్లిదండ్రులు కొంత జాగ్రత్తగా ఉండాలి. నోటి తుంపర్ల ద్వారా వ్యాధి ఇతరులకు సోకుతుంది. వ్యాధి లక్షణాలు ఉన్న పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలలకు పంపకుండా, వైద్యులను సంప్రదించి మందులు వాడాలి. జ్వరం, దగ్గు, జలుబు తగ్గడానికి పారాసెటమాల్ వంటి సాధారణ మందులు సరిపోతాయి. పొక్కులు, పుండ్లు మానడానికి ఆయింట్మెంట్స్ వాడాలి. చాలా అరుదుగా నిమోనియా పాంక్రియాటైటిస్, మెదడువాపు, జ్వరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలా లక్షల్లో ఒకరికి వస్తుంది. – డాక్టర్ బి.రమేశ్‌కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, చిన్నపిల్లల విభాగం, గుంటూరు జీజీహెచ్ -
Telangana: రాష్ట్రవ్యాప్తంగా 'జోరు వాన'
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి, చెరువులు అలుగుపోస్తున్నాయి. రహదారులపై నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని.. ఆదివారం విశాఖపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్, పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎర్రుపాలెంలో 18.83 సెంటీమీటర్లు శనివారం రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 18.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధిరలో 16.38, బోమన్‌దేవిపల్లిలో 13.75, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 12.35, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 10.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర ప్రణాళిక విభాగం గణాంకాల మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా 45 చోట్ల 5 సెం.మీ. కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. మొత్తంగా శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 2.33 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. సీజన్ సగటులో అధిక వర్షపాతం నైరుతి సీజన్లో ఆగస్టు చివరినాటికి రాష్ట్రంలో 57.59 సెం.మీ. సగటు వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఈసారి 66.37 సెం.మీ. కురిసింది. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం.. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, వికారాబాద్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, ములుగు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాలన్నీ సాధారణ వర్షపాతానికి కాస్త అటు ఇటుగా ఉన్నాయి. పలు జిల్లాల్లో విస్తారంగా వానలు.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్లలోని పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. ఏకబిగిన వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం నార్లాపూర్‌కు చెందిన పుట్ట మహేశ్ (17) పశువులను మేపడానికి వెళ్లి పిడుగుపాటుతో మృతి చెందాడు. ⇒ ములుగు జిల్లా జగ్గన్నగూడెం సమీపంలోని బొగ్గులవాగు, పస్రా–ఎస్ఎస్ తాడ్వాయి మండలాల మధ్య జలగలంచవాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పస్రా– తాడ్వాయి మధ్య కొండపర్తి సమీపంలో జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో పాకాల వాగు ఉప్పొంగడంతో.. వందల ఎకరాల్లో పొలాలు నీటమునిగాయి. ⇒ ఖమ్మం జిల్లా మధిర పట్టణం జలదిగ్బంధమైంది. బస్సులు, వాహనాల్లో ఉన్న ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయి ఆందోళనలో పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి.. భారీ వర్షాల నేపథ్యంలో హుటాహుటిన మధిరకు బయలుదేరారు. అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఎర్రుపాలెం మండలం మీనవోలు–పెగళ్లపాడు మధ్య రహదారిపై చేరిన వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. పోలీసులు స్థానికుల సాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఇక్కడి నక్కలవాగులో భవానిపురానికి చెందిన మలిశెట్టి సాంబశివరావు(19) గల్లంతయ్యాడు. ⇒ కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్లో భారీ వర్షం కురిసింది. పట్టణంలో ప్రధాన రహదారిపై నీరు చేరి వాహనాలు నీట మునిగాయి. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా రాజాపేటలో, అడ్డ గూడూరు మండలం చౌళ్లరామారంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో పొలాలు నీటమునిగాయి. ⇒ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. నారాయణపేట జిల్లా బండగొండలో ఇద్దరు యువకులు వాగులో పడి కొట్టుకుపోగా.. స్థానికులు గమనించి కాపాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలో దుందుభి, వర్నె వాగు ఉధృతంగా పారుతున్నాయి. జడ్చర్లలో ఏరియా ఆస్పత్రి జలదిగ్బంధమైంది వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం దావాజీపల్లి సమీపంలో కేఎల్ఐ కాల్వకు గండిపడటంతో పొలాలు నీటమునిగాయి. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెనచర్లలో ఓ ఇంటి పైకప్పు కూలింది. ⇒ జగిత్యాల జిల్లా కేంద్రంలోని వెంకటాద్రినగర్ వద్ద బ్రిడ్జిపై నుంచి వరద పారుతోంది. అధికారులు ప్రజలను జేసీబీ సహాయంతో వాగును దాటిస్తున్నారు. గ్రేటర్ సిటీకి ముసురు హైదరాబాద్ మహానగరానికి ముసురు పట్టింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీనితో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. ట్రాఫిక్ చాలా నెమ్మదిగా సాగింది. లో తట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. హై దరాబాద్ జిల్లా పరిధిలో పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. విస్తారంగా వానలతో హిమాయత్‌నగర్, గండిపేట జంట జలాశయాల్లోకి వరద పెరిగింది. దీ నితో మూసీ పరీవాహక ప్రాంతాల వారిని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ప్రభుత్వ సీఎస్ శాంతికుమారిని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన నేపథ్యంలో శనివారం ఆయన సీఎస్‌తో సమీక్షించారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. జలాశయాల గేట్లు ఎత్తేసే నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. అన్ని జిల్లా కలెక్టరేట్లు, జీహెచ్ఎంసీ, సచివాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిందని.. ఎలాంటి ఆకస్మిక విపత్తు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకలు, చెరువులు పొంగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా అధికారిని నియమించి.. జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల పరిస్థితికి అనుగుణంగా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించే విషయంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.బొగత జలపాతం సందర్శన నిలిపివేత వాజేడు: ఎగువన కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలోని బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం నుంచి జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రేంజర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. మళ్లీ ఎప్పుడు అనుమతిస్తారనేది మీడియా ద్వారా తెలియజేయనున్నట్లు వెల్లడించారు.సీజనల్ వ్యాధులపై జాగ్రత్తవైద్య సిబ్బందికి మంత్రి దామోదర సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. తమ శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు తగ్గే వరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అంతా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. ఎవరికీ సెలవులు మంజూరు చేయొద్దని డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ రవీందర్ నాయక్‌ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులకు అండగా నిలవాలని కోరారు. డెంగీ, చికున్ గున్యా, మలేరియా తదితర వ్యాధుల కట్టడిపై శనివారం ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాగా, రాష్ట్రంలో డెంగీ, చికున్ గున్యా, మలేరియా కేసులు నియంత్రణలోనే ఉన్నాయని అధికారులు మంత్రికి నివేదించారు.డెంగీ: రాష్ట్రంలో జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు పరీక్షించిన మొత్తం 1,06,356 నమూనాలలో రిపోర్ట్ అయిన డెంగీ కేసులు 6,242 అని అధికారులు తేల్చారు. డెంగీ హైరిస్క్ తొలి పది జిల్లాల్లో హైదరాబాద్‌లో (2,073), సూర్యాపేట (506), మేడ్చల్ మల్కాజ్గిరి (475), ఖమ్మం (407), నిజామాబాద్ (362), నల్లగొండ (351), రంగారెడ్డి (260), జగిత్యాల (209), సంగారెడ్డి (198), వరంగల్ (128) కేసులు నమోదయ్యాయి.చికున్ గున్యా: ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పరీక్షించిన 3,127 నమూనాలలో రిపోర్ట్ అయిన వాటిలో చికున్ గున్యా కేసులు 167. చికున్ గున్యా హైరిస్క్ జిల్లాల్లో హైదరాబాద్ (74), మహబూబ్‌నగర్ (20), వనపర్తి (17), రంగారెడ్డి (16), మేడ్చల్ (11) కేసులు నమోదయ్యాయి.మలేరియా: జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు మొత్తం 22,80,500 నమూనాలు పరీక్షిస్తే మలేరియా పాజిటివ్‌గా 197 కేసులు నమోదయ్యాయి. -
సీజనల్ వ్యాధులపై జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. తమ శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు తగ్గే వరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అంతా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. ఎవరికీ సెలవులు మంజూరు చేయొద్దని డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ రవీందర్ నాయక్‌ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులకు అండగా నిలవాలని కోరారు. డెంగీ, చికున్ గున్యా, మలేరియా తదితర వ్యాధుల కట్టడిపై శనివారం ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాగా, రాష్ట్రంలో డెంగీ, చికున్ గున్యా, మలేరియా కేసులు నియంత్రణలోనే ఉన్నాయని అధికారులు మంత్రికి నివేదించారు.డెంగీ: రాష్ట్రంలో జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు పరీక్షించిన మొత్తం 1,06,356 నమూనాలలో రిపోర్ట్ అయిన డెంగీ కేసులు 6,242 అని అధికారులు తేల్చారు. డెంగీ హైరిస్క్ తొలి పది జిల్లాల్లో హైదరాబాద్‌లో (2,073), సూర్యాపేట (506), మేడ్చల్ మల్కాజ్గిరి (475), ఖమ్మం (407), నిజామాబాద్ (362), నల్లగొండ (351), రంగారెడ్డి (260), జగిత్యాల (209), సంగారెడ్డి (198), వరంగల్ (128) కేసులు నమోదయ్యాయి.చికున్ గున్యా: ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పరీక్షించిన 3,127 నమూనాలలో రిపోర్ట్ అయిన వాటిలో చికున్ గున్యా కేసులు 167. చికున్ గున్యా హైరిస్క్ జిల్లాల్లో హైదరాబాద్ (74), మహబూబ్‌నగర్ (20), వనపర్తి (17), రంగారెడ్డి (16), మేడ్చల్ (11) కేసులు నమోదయ్యాయి.మలేరియా: జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు మొత్తం 22,80,500 నమూనాలు పరీక్షిస్తే మలేరియా పాజిటివ్‌గా 197 కేసులు నమోదయ్యాయి. -
రాష్ట్రాన్ని చుట్టుముట్టిన రోగాలు రాలిపోతున్న ప్రాణాలు
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం అచ్చబా గ్రామానికి చెందిన గిరిజన బాలిక బిడ్డిక రషి్మత(8) మలేరియాతో గత నెల 6వతేదీన మృత్యువాత పడింది. జూన్ 22న సరుబుజ్జిలి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చేరిన ఈ చిన్నారి నాలుగు రోజుల అనంతరం జ్వరం బారిన పడింది. పీహెచ్సీలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో మలేరియా పాజిటివ్‌గా తేలడంతో శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. రషి్మతతో పాటు మరికొందరు బాలికలు కూడా మలేరియా బారినపడ్డారు. గత నెలలో సీతంపేట ఏరియా ఆస్పత్రికి రెండు రోజుల వ్యవధిలో 30 మంది పిల్లలు జ్వరాలతో రాగా 15 మందికి మలేరియా నిర్ధారణ అయింది. పాడేరు మండలం దేవాపురంలో కె.రత్నామణి(37) గత నెల పాడేరు ప్రభుత్వాస్పత్రిలో మలేరియాకు చికిత్స పొందుతూ మృతి చెందింది. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్యం అధ్వానంగా మారడంతోపాటు అంటురోగాలు, విష జ్వరాలు విలయ తాండవం చేస్తున్నా సర్కారు మొద్దునిద్ర వీడటం లేదు. ప్రజారోగ్య విభాగం పడకేసింది. తాగునీటిని సరిగా క్లోరినేషన్ చేయకపోవడంతో జూన్, జూలైలో డయేరియా ప్రబలగా, ఇప్పుడు డెంగీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఉత్తరాంధ్ర, గిరిజన ప్రాంతాల్లో ఏ ఇంట్లో చూసినా మంచం పట్టినవారే కనిపిస్తున్నారు. అనారోగ్య పీడితులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. మలేరియా, డెంగీ, డయేరియా, విష జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులను నియంత్రించి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఇక జ్వరాల బాధితుల్లో వింత లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. డెంగీ నెగిటివ్ అని వచి్చనప్పటికీ కొంతమందిలో ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. యంత్రాంగం ద్వారా ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు నిర్వహించి కొత్త రకం వైరల్ జ్వరాలు, వైరస్ల వ్యాప్తిౖò³ ప్రజలను జాగృతం చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మృత్యు ఘంటిక మోగిస్తున్న డెంగీ ఈ ఏడాది ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకుపైగా మలేరియా కేసులు, 2 వేలకుపైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి. గత సోమవారం విశాఖ కేజీహెచ్‌లో ఎనిమిదేళ్ల బాలిక డెంగీతో మరణించింది. గుంటూరు జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళ డెంగీకి చికిత్స పొందుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో మృత్యువాత పడింది. గత వారం బాపట్ల జిల్లా ముత్తాయపాలెంలో డెంగీ లక్షణాలతో ఓ అంగన్వాడీ కార్యకర్త చనిపోగా చిత్తూరు జిల్లా మేలుపట్ల గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఏడో తరగతి బాలిక ఈ నెలలోనే కన్ను మూసింది. ఇక రాష్ట్రంలో నమోదైన మలేరియా కేసుల్లో అధిక శాతం ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనే ఉన్నాయి. గత నెల 15వతేదీ నుంచి 28 మధ్య రెండు వారాల్లో ఏఎస్ఆర్ జిల్లాలో అత్యధికంగా 260, పార్వతీపురం మన్యంలో 178 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా బాధితుల్లో చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో జనరల్ ఓపీల్లో మూడో వంతు జ్వర బాధితులే ఉన్నారు. పాడేరు ప్రభుత్వాస్పత్రి కిక్కిరిసిపోతోంది. రోజుకు 400 వరకూ ఓపీలు నమోదవుతుండగా మలేరియా, డెంగీ, విష జ్వరాల కేసులు అధికంగా ఉంటున్నాయి. కొత్త రకం వైరస్ వ్యాప్తి వైరల్ జ్వరాల్లో కొత్త లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల శరీర ఉష్ణోగ్రత 103, 104 వరకూ వెళుతోంది. వికారం, కీళ్లు, ఒంటి నొప్పులు, నీరసం, ఆకలి మందగించడం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కాళ్లు, చేతులు వాపులు, ఒంటిపై ఎర్రటి దద్దుర్లు, కళ్ల మంట లాంటి లక్షణాలు వారం నుంచి 10 రోజులు ఉంటున్నాయి. ప్లేట్లెట్స్ 30 వేల వరకూ పడిపోతున్నాయి. బాధితులు తీవ్ర నొప్పులతో మంచం నుంచి లేవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. డెంగీ అనుమానంతో పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ కనిపిస్తోంది. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే మిగిలిన కుటుంబ సభ్యులకు సోకుతోంది. దీంతో కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. డయేరియా విలయతాండవం గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. తాగునీటిని సరిగా క్లోరినేషన్ చేయడం లేదు. దీంతో జూన్, జూలైలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 56 చోట్ల డయేరియా ప్రబలింది. ఈ ఏడాది జూన్‌లో జగ్గయ్యపేట నుంచి డయేరియా విజృంభణ మొదలైంది. జగ్గయ్యపేట, వత్సవాయి ప్రాంతాల్లో 107 మంది డయేరియా బారినపడగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. అదే నెలలో తిరుపతి జిల్లా కాట్రపల్లిలో డయేరియాతో రెండేళ్ల చిన్నారి కన్నుమూయగా గత నెలలో కర్నూలు జిల్లా సుంకేశ్వరిలో నాలుగేళ్ల చిన్నారిని మత్యువు కబళించింది. ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కలుషిత నీటి సరఫరా కారణంగా ఏకంగా 250 మందికి డయేరియా సోకగా ఏడుగురు మృతి చెందారు. మంత్రి నారాయణ సమీక్షలు నిర్వహించినా పారిశుద్ధ్య నిర్వహణలో మాత్రం మార్పు రాలేదు. ‘దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను డ్రోన్ల ద్వారా గుర్తించి డ్రోన్ల ద్వారానే మందు పిచికారీ చేసి వాటిని చంపేసే వ్యవస్థను తెస్తాం. సీజనల్ వ్యాధులను సున్నాకు కట్టడి చేస్తాం..’ అని వైద్య శాఖపై నిర్వహించిన తొలి సమావేశంలో సీఎం చంద్రబాబు గంభీరంగా ప్రకటించారు. అయితే ప్రభుత్వం డ్రోన్లను ఎగరేసి దోమలను చంపే లోపే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఫీవర్ సర్వే ఊసే లేదు సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ప్రాథమిక దశలోనే వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారి కాంటాక్ట్‌లను నిర్ధారించి పరీక్షలు చేయడం, అవసరమైన చికిత్సలు అందించడం ఎంతో కీలకం. ఇందుకోసం సీజనల్ వ్యాధుల కట్టడికి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గత ప్రభుత్వం క్రమం తప్పకుండా ఫీవర్ సర్వే నిర్వహించేది. ఆశా, ఏఎన్ఎంలు ప్రతి ఇంటిని సందర్శించి జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలు, ఇతర లక్షణాలున్న వారిని గుర్తించేవారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్లే పీహెచ్సీ వైద్యులు స్థానికంగా వ్యాధులు ప్రబలుతున్న తీరును గమనించి ప్రజలకు జాగ్రత్తలు సూచించేవారు. ఫీవర్ సర్వేలో అవసరం మేరకు కిట్ల ద్వారా గ్రామాల్లోనే పరీక్షలు నిర్వహించి ప్రాథమికంగా వ్యాధిని నిర్ధారించేవారు. స్వల్ప లక్షణాలున్న వారికి ఇంటి వద్దే మందులు అందించేవారు. అవసరం మేరకు ఆస్పత్రులకు రెఫర్ చేసి వైద్యం అందేలా సమన్వయం చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలను గాలికి వదిలేసింది. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించడం కోసం ఇంటింటి సర్వే ఇప్పటి వరకూ నిర్వహించనే లేదు. దీంతో మలేరియా, డెంగీ బారిన పడ్డ బాధితులు ఆస్పత్రులకు వెళ్లడంలో జాప్యం కారణంగా ప్రాణాలు విడుస్తున్నారు. సీజనల్ వ్యాధుల కట్టడిలో పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణ, రక్షిత నీటి సరఫరా, ముందస్తు జాగ్రత్తలు చాలా కీలకం. మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మూడు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారి మురికి కూపాలు దోమలకు ఆవాసాలుగా మారాయి. ⇒శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నంలో జ్వరాల కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 63,932 మంది జ్వర పీడితులున్నట్లు ప్రకటించారు. డెంగీ కేసులు 25 నమోదు కాగా, మలేరియా 30, టైఫాయిడ్ 196, డయేరియా 3,113 కేసులున్నాయి. ⇒విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 110 డెంగీ కేసులు నమోదయ్యాయి. మలేరియా కేసులు 491 నమోదయ్యాయి. జిల్లాలో 2.45 లక్షల మంది విషజ్వరాల బారిన పడ్డారు.⇒విశాఖ జిల్లాలో 329 డెంగీ కేసులు, 114 మలేరియా కేసులు నమోదు అయినట్టు జిల్లా మలేరియా అధికారి తులసి తెలిపారు. ⇒పార్వతీపురం మన్యం జిల్లాలో గత నెలలో 24 డెంగీ కేసులు, 345 మలేరియా, 911 వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. èఅల్లూరి సీతారామరాజు జిల్లాలో జ్వరాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.èఅనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు 20,100 జ్వరాల కేసులు నమోదయ్యాయి. 52 డెంగీ కేసులు నిర్ధారణ అయ్యాయి.⇒విజయవాడ ప్రభుత్వాస్పత్రితో పాటు జిల్లాలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి పది మంది అనారోగ్య పీడితుల్లో ఐదుగురు విష జ్వరాలతో బాధపడుతుండగా ఇద్దరు డెంగీ బాధితులు ఉంటున్నారు. డెంగ్యూ ఎన్ఎస్ 1 పాజిటివ్ కేసులు విజయవాడలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ⇒ప్రకాశం జిల్లాలో డెంగీ కేసులు 56 నమోదయ్యాయి. ఈ నెల 3వ తేదీన కంభం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలుడు డెంగీతో మృతి చెందాడు. టైఫాయిడ్ కేసులు సుమారు 800, విషజ్వరాలు 1,100 నమోదయ్యాయి.⇒ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైరల్ జ్వరాలు చెలరేగుతున్నాయి. గత రెండు నెలలుగా రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో 150 మంది వైరల్ జ్వరాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. 17 డెంగీ కేసులు నమోదయ్యాయి. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఉండి, ఆచంట నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు.⇒డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కొంకాపల్లిలో 60 మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఆరుగురు డెంగీ బారినపడ్డారు. కొత్తపేట మండలం వానపల్లి, అవిడి పీహెచ్‌సీల పరిధిలో ఈ నెలలో సుమారు 800 జ్వరాలు కేసులు రాగా 100 టైఫాయిడ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఐదు వరకు డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో సుమారు 32 డెంగీ కేసులు నమోదయ్యాయి.èశ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, ధర్మవరం, కదిరి ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మడకశిరలో అతిసారం ఆందోళన కలిగిస్తోంది. ధర్మవరంలో డెంగీ ప్రభావం ఎక్కువగా ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 60 డెంగీ కేసులు నమోదయ్యాయి. ⇒వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా అధికారికంగా జనవరి నుంచి ఇప్పటివరకు డెంగీ కేసులు 244, మలేరియా కేసులు 11 నమోదయ్యాయి. ⇒కర్నూలు జిల్లాలో డెంగీ కేసులు అధికంగా పట్టణ ప్రాంతాల్లో 63 నమోదయ్యాయి. ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాల్టీ, గూడురు నగర పంచాయతీలో అపరిశుభ్రత తాండవిస్తోంది. నంద్యాల జిల్లాలో ఇంటికొకరు జ్వరాల బారిన పడుతున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 77 డెంగీ కేసులు నమోదయ్యాయి. గత జూన్ 21న జూపాడు బంగ్లా మండలం చాబోలులో అతిసార ప్రబలి 20 మంది ఆసుపత్రి పాలు కాగా నడిపి నాగన్న మృతి చెందాడు.⇒అన్నమయ్య జిల్లాలో ఇప్పటివరకు 132 వరకు డెంగీ కేసులు నమోదయ్యాయి. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో ఈ నెలలో 45 డెంగీ, 30 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. రాయచోటిలోని వంద పడకల ఆస్పత్రిలో 69 డెంగీతోపాటు 104 మలేరియా కేసులు నమోదయ్యాయి. ⇒అనంతపురం జిల్లాలోని అనంతపురం అర్బన్, రూరల్, కళ్యాణదుర్గం, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ తదితర ప్రాంతాల్లో డెంగీ కేసులు వందకు పైగా నమోదైనట్లు సమాచారం.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఇంటి ఆవరణ, పరిసరాల్లో పనికిరాని వస్తువులు,టైర్లు, వాడిన కొబ్బరి చిప్పలు ఉంచరాదు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటిని నిల్వ చేసే పాత్రలను శుభ్రపరచి వాటిపై మూతలు ఉంచాలి. ఆర్వో నీటిని లేదా కాచి వడగట్టిన నీటిని తాగాలి. తాజా కాయగూరలు, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దోమల నుంచి రక్షణ కోసం దోమ తెరలు వాడాలి. గర్భిణులు, చిన్న పిల్లలు తప్పనిసరిగా దోమతెరల రక్షణలో నిద్రించాలి. సీజనల్ వ్యాధులు.. లక్షణాలు వ్యాధి లక్షణాలుమలేరియా: చలి, జ్వరం, తలనొప్పి, దగ్గు, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, నీరసం డయేరియా: విరేచనాలు, కడుపు నొప్పి, వికారంటైఫాయిడ్: జ్వరం, నీరసం, కడుపులో నొప్పికలరా: నీళ్ల విరేచనాలు, వాంతులు, కాళ్లు లాగడండెంగ్యూ: హఠాత్తుగా జ్వరం, భరించలేని తల, కండరాలు, కీళ్లు నొప్పులు, ఆకలి మందగించడం, వాంతులు, ఒంటిపై ఎర్రటి మచ్చలుకామెర్లు: జ్వరం, అలసట, కడుపునొప్పి, మూత్రం పచ్చగా రావడం, వికారం, కళ్లు పచ్చబడటం -
డెంగీ హైరిస్క్ ప్రాంతాలు 2,071
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. దీంతో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈసారి తెలంగాణలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య,ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో ఏకంగా 65.62 లక్షల మంది జనాభా ఉన్నారని నిర్ధారించడం ఆందోళన కలిగిస్తోంది. గత సంవత్సరాల్లో వచి్చన డెంగీ కేసుల ఆధారంగా ఈ నిర్ధారణకు వచి్చనట్టు వైద్య,ఆరోగ్యశాఖ వెల్లడిస్తూనే, అప్రమత్తమై 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది.42 డెంగీ పరీక్ష కేంద్రాలు, ఆస్పత్రులు, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను గుర్తించి వాటిల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 53 బ్లడ్ బ్యాంకులను గుర్తించగా, వాటిలో 26 బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్ యూనిట్లు ఉన్నాయని తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ శానిటైజేషన్, నీటినిల్వ ప్రాంతాల్లో దోమలు రాకుండా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినాజడ్.చోంగ్తు ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు ఆమె శుక్రవారం డెంగీ, సీజనల్ వ్యాధుల పరిస్థితిపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించడంలో భాగంగా ఆశ, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లాలని, నీటిలో డెంగీ కారక దోమల సంతానోత్పత్తిని నివారించాలని కోరారు. లార్వా వ్యాప్తి ఇతర జిల్లాల కంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ వంటి కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని వైద్య,ఆరోగ్యశాఖ ప్రకటించింది. జూలై నెలలోనే 800 కేసులు వాతావరణ మార్పులు, వర్షాల నేపథ్యంలో దోమల తీవ్రత కారణంగా డెంగీ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ వరకు రాష్ట్రంలో 1,078 కేసులు నమోదైతే... ఒక్క జూలైలోనే 800 వరకు కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. నీటి నిల్వలు భారీగా పెరుగుతుండటం, పారిశుధ్యలోపం కారణంగా ఆగస్టు, సెపె్టంబరు నెలల్లో డెంగీ బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు డెంగీ బాధితులు వస్తున్నారు. ఔట్ పేషెంట్ల సంఖ్య కూడా పెరిగింది. ఇక గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందంటున్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి..
వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు నీరు నిల్వ ఉండడం, పరిసరాల పరిశుభ్రత లోపించడం, తాగు నీరు కలుషితం వల్ల వివిధ రకాల వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.కీటక జనిత వ్యాధులు, అంటువ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆరోగ్య సిబ్బంది ద్వారా ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలోనూ ప్రజలు సహరించాలని కోరారు. దోమల ఉత్పత్తిని తగ్గించడానికి, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని కోరారు.కలుషిత నీటి నివారణ కోసం క్లోరినేషన్ చేసిన లేదా కాల్చి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. అపరిశుభ్ర ఆహారాన్ని తీసుకోవద్దని, ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే సంబంధిత ఆస్పత్రిని, వైద్యాధికారిని సంప్రదించాలని సూచించారు. -
వర్షాకాలం..వ్యాధుల కాలం..వీటి బారినపడకూడదంటే..!
సూర్యుడి భగభగలు నుంచి తొలకరి జల్లులతో వర్షాకాలం సమీపించి చల్లదనంతో సేదతీరేలా చేస్తుంది. కానీ ఇది ఎంత చల్లగా ఆహ్లాదంగా ఉన్నా..ఈ తేమకు ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అవుతారు ప్రజలు. వీటిని ఎలా ఎదుర్కోవాలి?, ఈ వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందాం.!వాతావరణ మార్పుల కారణంగా రోజురోజుకి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సీజన్లో సాధారణ వ్యాధులు పెరుగుతాయి. ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ దాడికి గురి చేస్తాయి. ఈ కారణంగా చాలా సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.జలుబు, జ్వరం..ఈ వర్షాకాలంలో సాధారణంగా వచ్చే సమస్యల్లో జలుబు, జ్వరం సర్వ సాధారణం. వైరల్ ఇన్ఫెక్షన్లకి ఇవి సాధారణ రూపం. కాబట్టి, వీటి కారణంగా ఎక్కువగా చాలా మంది జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. అసలు సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.దోమలు..రుతుపవనాలు వచ్చాయంటే చాలు మలేరియా వచ్చిట్లే. వర్షం పడినప్పుడు నీరు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోతుంది. దీని వల్ల దోమలు పెరుగుతాయి. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వస్తాయి.డెంగ్యూ..డెంగ్యూ జ్వరం పెద్ద సమస్యే. ప్రాణాంతకంగా మారింది. ఇది డెంగ్యూ వైరస్ కారణంగా వచ్చినప్పటికీ, క్యారియర్ దోమ, కాబట్టి, దోమ కాటు నుంచి రక్షించుకోవచ్చు.కలరా..కలరా అనేది కలుషిత నీటి ద్వారా వచ్చే సమస్య. ఇది జీర్ణాశయ సమస్యలు, అతిసారం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల, కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల చాలా మంచిది.టైఫాయిడ్..టైఫాయిడ్ ఫీవర్ కూడా కలుషిత ఆహారం, నీటి కారణంగా వస్తుంది. ఇది సాల్మొనెల్లా టైఫీ వల్ల వచ్చే మరో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సరైన పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని పాటించడం, పరిశుభ్రత పాటించడం వల్ల సమస్యని దూరం చేయొచ్చు.హెపటైటిస్..కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకడం, కలుషితాహారం, నీటి వల్ల హెపటైటిస్ ఎ సమస్య వస్తుంది. ఈ సమస్య లక్షణాలు జ్వరం, వాంతులు, దద్దుర్లు మొదలైనవి వస్తాయి. సరైన పరిశుభ్రతను పాటించడం ముఖ్యం.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ వలన ఎక్కువగా జలుబు, నోస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు మాస్క్ ధరించి దీని బారి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు వేడి నీళ్లతో ఆవిరి పట్టడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. ఇక గొంతు నొప్పి రాకుండా ఉండేందుకు కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు అయిల్ ఫుడ్‌ని దూరంగా పెట్టాలని సూచించారు. ఆహారం తిన్న వెంటనే నోటిని శుభ్రంగా కడుక్కోవాలని, ఉప్పు నీటిని వాడితే మంచి ఫలితం ఉంటుందన్నారు. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల భారీ నుండి తప్పించుకోవచ్చు. అంతేగాదు వర్షాకాలంలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, ముందు నుంచి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.పోషకాహారం తీసుకోవాలి.ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి.కాచి చల్లార్చిన నీటిని తాగాలి.దోమలు పెరగకుండా చుట్టూ ఉన్న పరిసరాలను క్లీన్ చేసుకోవాలి.దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి.అల్లం, వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవాలి.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యుల సలహాల మేరకు పాటించటం ఉత్తమం. (చదవండి: ఏకంగా 172 సార్లు పాము కాటుకి గురయ్యాడు..దీంతో అతడి రక్తం..! -
డ్రోన్ల ద్వారా దోమలను కనిపెడదాం
సాక్షి, అమరావతి: ‘దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను డ్రోన్ల ద్వారా గుర్తించి, ఆ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా మందు పిచికారి చేసి.. వాటిని చంపేసే వ్యవస్థను 2019కి ముందు ఉపయోగించాం. మళ్లీ అదే వ్యవస్థను తీసుకు వచ్చి డ్రోన్లతో దోమలను చంపేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 డయేరియా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపారు. తొమ్మది మంది డయేరియాతో చనిపోయారన్నారు. ఈ నేపథ్యంలో సీఎం మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల నియంత్రణకు 2014 నుంచి 2019 మధ్య అనుసరించిన విధానాలను మళ్లీ అనుసరించాలని వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. దోమల నియంత్రణకు అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో కలుషిత తాగునీరు, పారిశుధ్య లోపం, దోమల నివారణకు చర్యలు తీసుకోక పోవడం వల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. రక్షిత తాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల బారినపడే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, వారిపై వైద్య, ఆరోగ్య శాఖ మరింత దృష్టి పెట్టాలని సూచించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే మాత్రం ఉపేక్షించబోనన్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో మూడు శాఖలు సమన్వయంతో పని చేయాలని, అప్పుడే ఫలితాలు వస్తాయన్నారు. శాఖల మంత్రులు, అధికారులు దీనిపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, మూడు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు సమయం లేదు మళ్లీ వింటా.. రాష్ట్రంలో త్వరలో వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల ప్రక్రియ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఫీజులు ఖరారు చేయడంతో పాటు, కొత్త వైద్య కళాశాలల్లో తరగతుల ప్రారంభం, ఇతర అంశాల్లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నించగా ప్రస్తుతం సమయం లేదని, మళ్లీ వింటానని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి పులివెందుల, ఆదోని, మార్కాపురం, ఆదోని, పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించాల్సి ఉంది. ఈ తరుణంలో ఆయా వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ నుంచి అనుమతులు రాబట్టడంతో పాటు, తరగతులు ప్రారంభించడానికి వీలుగా ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వసతులు కల్పించాల్సి ఉంది. ఇదిలా ఉండగా అమరావతిపై శ్వేత పత్రం విడుదల చేసిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దోమలు అధికంగా ఉన్న 20 వేల ప్రాంతాలను గుర్తించామన్నారు. ఆ ప్రాంతాల్లో డ్రోన్లతో మందును పిచికారి చేస్తూ దోమలు లేని ప్రాంతాలను సున్నాకు తీసుకుని రావాలని ప్రణాళిక రచించామని చెప్పారు. -
సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టడి చేసేందుకు సమగ్ర ప్రణాళికను అధికారులు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఏటా వర్షాకాలంలో వాతావరణం మారే సమయంలో వచ్చే వ్యాధులు గ్రామీణుల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయన్నారు. తాగునీటి కాలుష్యం మూలంగానే అతిసార వ్యాధి, విష జ్వరాలు లాంటివి ప్రబలుతున్నాయని చెప్పారు. పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవలæ కాకినాడ జిల్లా కొమ్మనపల్లి, బెండపూడి, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో అతిసార ప్రబలిన నేపథ్యంలో శుక్రవారం శాసనసభ సమావేశ మందిరంలో అత్యవసరంగా పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.ఇందులో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. నీరు కలుషితమైన చోట నీటి సరఫరా ఆపేసి తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను పవన్ ఆదేశించారు.కార్యాచరణ సిద్ధం చేయాలిపైపులైన్ల తనిఖీ ఎప్పటికప్పుడు జరిగేలా చొరవ తీసుకోవాలని, మరమ్మతులు అవసరమైతే తక్షణమే చేయాలని మంత్రులు ఆదేశించారు. ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరా విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ తగదని, ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులను అరికట్టేందుకు పంచాయతీరాజ్, పురపాలక, వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. కాగా, కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు, స్థానిక సంస్థలకు వివిధ పన్నుల రూపంలో వచ్చే ఆదాయ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అతిసార వ్యాధి నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్మి తదితరులు పాల్గొన్నారు. -
‘సీజన్’ ముంచుకొస్తోంది
సాక్షి, హైదరాబాద్: వానాకాలం అంటేనే సీజనల్ వ్యాధుల ముప్పు ఉంటుంది. అధికారులకు ముందస్తు ప్రణాళిక లేకుంటే జనంపై వ్యాధులు పంజా విసురుతాయి. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాల్లో వ్యాధులు ప్రబలిపోతాయి. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా సహా ఇతరత్రా వ్యాధులు సోకుతాయి. అయితే ఇప్పటివరకు ఆ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించలేదు. ప్రధానంగా దోమలతో వచ్చే వ్యాధులతో జనం సతమతమవుతారు. నీటి వల్ల వచ్చే రోగాలతో ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడతుంది. కానీ వ్యాధుల నివారణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక అమలుకు ప్రభుత్వం సన్నద్ధం కాలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. జ్వరాలు సర్వసాధారణం... సీజన్ మారిందంటే జ్వరాలు సర్వసాధారణం అవుతాయి. ఒక్కోసారి పరిస్థితి అదుపు తప్పుతుంది. మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలితే పరిస్థితి మన నియంత్రణలో ఉండదు. దీనికి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికే కాదు. అందుకు అవసరమైన అమలు కూడా ఉండాలి. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలి. అన్నిచోట్లా మందులు అందుబాటులో ఉంచాలి. జ్వరం క్లినిక్‌లను తీసుకురావాలి. సాయంత్రం కూడా క్లినిక్‌లు తెరవాలి.మలేరియా, డెంగీ నియంత్రణకు టెస్టింగ్ కిట్లు ఆస్పత్రులకు పంపాలి. డెంగీ వంటి జ్వరాల్లో ప్లేట్లెట్లు పడిపోతే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్లేట్లెట్లు అందుబాటులో లేకుంటే పేదలు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ప్లేట్లెట్లు ఎక్కించేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడతాయి. రూ.50 వేల నుంచి రూ. లక్షకు పైగా వసూలు చేస్తాయి. ఇలాంటి పరిస్థితులను నియంత్రించాలంటే అన్ని రకాల చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే ఆ శాఖ మంత్రి సమీక్షలకే పరిమితం కాగా, వైద్య విద్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఆస్పత్రుల పనితీరుపై ఎలాంటి సమీక్షలూ జరపలేదు. అధికారులూ అంతే... అధికారుల తీరుపై విమర్శలు ఉన్నాయి. ఆస్పత్రుల తనిఖీలు లేవు. వైద్యవిధాన పరిషత్ కమిషనర్, ప్రజారోగ్య సంచాలకులు సహా రాష్ట్రస్థాయిలో ఉన్న అధికారులు బయట కాలుపెట్టడంలేదన్న విమర్శలున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో అనేక ఆస్పత్రుల్లో కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న డాక్టర్లు, నర్సులు చాలా మంది వెళ్లడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉంటూ కొందరు కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారు. బయోమెట్రిక్ ఉన్నా వాటి కన్నుగప్పి తప్పించుకుంటున్నారన్న విమర్శలున్నాయి. వాతావరణ మార్పులతో వ్యాధుల ముప్పుజాగ్రత్తలు సూచించిన ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ బి.రవీందర్ నాయక్సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో ఉ ష్ణోగ్రతల తగ్గుదల, గాలిలో తేమ వంటి వాతావరణ మా ర్పుల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని, అలాగే దోమలు, ఆహారం, నీటి ద్వారా వ్యాధుల వ్యాప్తి పొంచి ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పబ్లిక్ హెల్త్, ఫ్యా మిలీ వెల్పేర్ విభాగం డైరెక్టర్ డాక్టర్ బి.రవీందర్ నాయక్ అ న్నారు. దోమల బెడద కారణంగా మలేరియా, డెంగీ, చికు న్‌గున్యా వంటి వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవా లని సూచించారు.వర్షాకాలం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కిటికీలకు దోమ తెరలు/ స్క్రీన్లు పెట్టుకోవాలని, దోమల సంతానోత్పత్తి సమయాలైన ఉదయం, సాయంత్రం తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని సూచించారు. దోమలు కుట్టకుండా క్రీములు, లోషన్లు వంటివి రాసుకోవాలని తెలిపారు. మురుగు కాల్వల్లో నీళ్లు నిలిచిపోకుండా చూడాలని, సెప్టిక్ ట్యాంకులను మెష్‌లతో కవర్ చేయాలని పేర్కొన్నారు. ప్రతీ శుక్రవారం ఇంటి చుట్టూ నీళ్లు నిలిచిపోకుండా డ్రైడే నిర్వహించాలని, కాచి వాడబోసిన నీళ్లు, బయట ఉన్నపుడు బాటిల్డ్ వాటర్ తీసుకోవాలని తెలిపారు. -
మీ బుజ్జాయికి జలుబు చేసిందా? ఇలా చేస్తే వెంటనే తగ్గుతుంది
అప్పటివరకూ ఎక్కడ ఉంటుందో తెలియదు కాని సీజన్ మారగానే ఒక్కసారిగా వచ్చి పట్టేస్తుంది జలుబు. పెద్దవాళ్లయితే ఏదో విధంగా తట్టుకుంటారు కాని పిల్లలు నీరసించిపోతారు. ఒకరి నుంచి ఒకరికి వెంటనే వ్యాపించే ఈ జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ నివారణకు చిట్కాలు. ►జలుబు, జ్వరం లక్షణాలు కనిపించగానే ఎక్కువ హానికరం కాని పారాసిటమాల్ టాబ్లెట్లు వాడవచ్చు. జలుబు పూర్తిగా దారికి వచ్చే వరకు రోజుకు మూడుసార్లు వేడి నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిటపట్టించాలి.. ►రోజులో కనీసం మూడుసార్లయినా పసుపు లేదా, అదుబాటులో ఉండే జండూబామ్ వేసుకుని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు ఉపశమనం కలుగుతుంది. ► ఈ సీజన్లో నీళ్ల నుంచి అనేక జబ్బులు వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లలు, పెద్దల దాకా అందరూ కాచి, చల్లార్చి వడపోసిన నీళ్లు మాత్రమే తాగితే మంచిది. ► జలుబు లక్షణాలను త్వరగా తగ్గించే వాటిలో ముఖ్యమైనది నిమ్మపండు.. గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు. ► మిరియాలు, వెల్లుల్లి, అల్లం వంటివి ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు, జలుబు చేసిన సమయంలో రిలీఫ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి. ► జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు ఆవనూనెకు వెల్లుల్లి కలిపి చిన్నారి ఛాతీపైనా, మెడ, వీపు భాగాల్లోనూ మసాజ్ చేయాలి. ► పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి ఆరారగా మంచినీరు తాగిస్తుండటం వల్ల కోల్పోయిన నీటి శాతం భర్తీ అయి శరీరానికి వ్యాధితో సమర్థంగా పోరాడగల శక్తి వస్తుంది. -
జర జాగ్రత్త.. నెలలో రెండు లక్షల మందికి జ్వరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరాల కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. డెంగీ, మలేరియా కేసులు కూడా భారీగా వెలుగుచూస్తున్నాయి. గత నెల రోజుల్లోనే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది జ్వరాల బారినపడినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాతావరణం మారడం, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా జ్వరాలతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగినట్లుగా వైద్య యంత్రాంగం అంచనా వేసింది. వానాకాలమంతా జ్వరాలు కొనసాగే పరిస్థితి ఉందని హెచ్చరిస్తోంది. ఆస్పత్రుల్లో రోగుల క్యూ సీజనల్ వ్యాధులతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రి, ఉస్మానియా, గాంధీ సహా జిల్లాల్లోని ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ఓపీలో సగం మంది సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నవారే. పీహెచ్‌సీల్లో కానరాని డాక్టర్లు కొన్ని చోట్ల వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగ నిర్లక్ష్యం బాధితులకు శాపంగా మారింది. అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా ప్రభుత్వం వేసిన అంచనాలకు మించి జ్వరాలు, డెంగీ, మలేరియా కేసులున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పగటి పూట కుట్టే దోమతో డెంగీ.. డెంగీ కారక ఈడిస్ ఈజిప్ట్ దోమ అన్ని దోమల్లాంటిది కాదు. పగటిపూటే కుడుతుంది. ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో నిల్వ ఉంచే మంచినీటిలోనే పుట్టి పెరుగుతుంది. ఒక వారం రోజులు కదపకుండా దోసెడు నీరున్నా చాలు. అందులో పునరుత్పత్తి ప్రక్రియ కొనసాగిస్తుంది. ఎయిర్ కూలర్లలో, డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన మంచినీటిలో, వాడకుండా పక్కన పడేసిన పాత టైర్లు, రేకు డబ్బాల్లో వాన నీరు కురిస్తే ఆ చిన్ననీటి గుంతల్లోనూ జీవనం కొనసాగిస్తుంది. అందుకే ఇంట్లో, కార్యాలయాల్లో ఎక్కడైనా కొద్దిపాటి నీటి నిల్వలున్నాయా అని పరిశీలించాలి. డెంగీ వస్తే ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు అయినట్లు కనిపించడం, కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. అధిక దాహంతో పాటు రక్తపోటు స్థాయిలు పడిపోతాయి. ఐజీఎం పరీక్షతోనే డెంగీ నిర్ధారణ డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమాదకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ఎల్రక్టాల్ పౌడర్, పళ్లరసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపులోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తుంది. ఇక వైరల్ ఫీవర్ వస్తే విపరీతంగా మంచినీరు తాగాలి. పండ్ల రసాలు తీసుకుంటే ప్లేట్లెట్లు పడిపోకుండా కాపాడుతాయి. ఇది కూడా చదవండి: నిరుత్సాహపర్చిన బీసీలకు ‘లక్ష’ సాయం! -
ఇది చినుకు కాలం, జనం వణుకు కాలం.. 3-4 వారాలు బాధించే జ్వరం..
ఇది చినుకుల కాలం. వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగుతూ... మానవ విసర్జకాలు మంచినీళ్లతో కలవడం మామూలే. ఆ నీళ్లు తాగడం, అలా కలుషితమైన నీళ్లతో వండిన ఆహారాలతో టైఫాయిడ్ రావడం సా«ధారణం. మురికివాడలూ, పారిశుద్ధ్యవసతి అంతగా లేని ప్రాంతాల్లో ఇది ఇంకా ఎక్కువ. సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియమ్ టైఫాయిడ్ జ్వరానికి కారణం. ఇదే జాతికి చెందిన సాల్మొనెల్లా పారాటైఫీ అనే మరో రకం బ్యాక్టీరియా కూడా ఉంది. కాకపోతే దీంతో తీవ్రత కాస్తంత తక్కువ. ఈ సీజన్లో టైఫాయిడ్ వచ్చేందుకు అవకాశాలు ఉండటంతో ఈ జ్వరంపై అవగాహన కోసం ఈ కథనం. టైఫాయిడ్ బ్యాక్టీరియా మనుగడ సాగించేది కేవలం మానవ శరీరంలోనే. కొంతమందిలో దీని లక్షణాలేమీ బయటకు కనిపించవు. కానీ వారి నుంచి ఇతరులకు బ్యాక్టీరియా వ్యాపించినప్పుడు ఇతరుల్లో టైఫాయిడ్ బయటపడవచ్చు. ఇలా లక్షణాలు లేకుండా వ్యాప్తి చేసేవారిని క్యారియర్స్ అంటారు. మురికిగా ఉండే మెస్‌లూ, క్యాంటీన్లు, అపరిశుభ్రమైన హోటళ్లలో పనిచేసేవారిలో ఇది నిద్రాణంగా ఏళ్లతరబడి ఉండే అవకాశం ఉంది. వీళ్ల విసర్జకాలతో ఆహారం కలుషితమై... ఇతరులకు వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశాలు ఎక్కువ. వీళ్లను క్రానిక్ క్యారియర్స్‌గా చెబుతారు. దేహంలోకి బ్యాక్టీరియా ప్రవేశించిన వారం లేదా రెండు వారాలలో లక్షణాలు బయటపడతాయి. టైఫాయిడ్ జ్వరమొచ్చాక అది దాదాపు 3 – 4 వారాల పాటు బాధిస్తుంది. లక్షణాలు: ► తీవ్రమైన జ్వరం (ఒక్కోసారి 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు మించి) ► ఆకలి మందగించడం ► తలనొప్పి ► గుండె స్పందనలు తగ్గడం (బ్రాడీకార్డియా) ► రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గడం (ల్యూకోపీనియా) ► కొందరిలో నీళ్ల విరేచనాలు, పొట్టనొప్పి ► ఒంటి నొప్పులు ∙తీవ్రమైన అలసట, నిస్సత్తువ, నీరసం ► కొందరిలో ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ► చాలా అరుదుగా కొందరిలో ర్యాష్‌తో పాటు మెడ, పొట్ట మీద గులాబీరంగు మచ్చలు కనిపించవచ్చు. ► జ్వరం కారణంగా దుష్ప్రభావాలు కనిపించకపోతే మూడు నుంచి నాలుగు వారాల్లో జ్వరం దానంతట అదే తగ్గుతుంది. నిర్ధారణ: మొదటివారంలో రక్తపరీక్షతో (బ్లడ్ కల్చర్) కచ్చితంగా కనుగొనవచ్చు. అందుకే మొదటివారంలో చేసే రక్తపరీక్షను గోల్డ్‌స్టాండర్డ్ పరీక్షగా పేర్కొనవచ్చు. రెండోవారంలో వైడాల్ టెస్ట్ అనే రక్తపరీక్షతో నిర్ధారణ చేస్తారు. మూడో వారంలో ఎముక మజ్జ (బోన్‌మ్యారో) కల్చర్ పరీక్షతో నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షలతో పాటు బయటకు కనిపించే టైఫాయిడ్ సాధారణ లక్షణాలను బట్టి దీన్ని నిర్ధారణ చేయవచ్చు గానీ... ఇలాంటి లక్షణాలే చాలా జ్వరాల్లో కనిపిస్తాయి కాబట్టి కేవలం లక్షణాలను బట్టే నిర్ధారణ అంత తేలిక కాదు. వైద్యపరీక్షలతో దీన్ని కచ్చితంగా నిర్ధారణ చేయవచ్చు. డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్... ఇటీవల మందులకు లొంగని టైఫాయిడ్ ఎక్కువగా కనిపిస్తోంది. చిన్న చిన్న సమస్యలకూ విచక్షణరహితంగా యాంటీబయాటిక్స్ వాడటం, అది కూడా సరైన మోతాదులో కాకుండా ఇష్టం వచ్చిన మోతాదుల్లో వాడుతూ తుండటంతో డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ ఎక్కువగా కనిపిస్తోంది. పైగా దీని లక్షణాలు కూడా టైఫాయిడ్లా కనిపించవు. ఇలాంటి కేసుల్లో రోగికి చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వైద్యం అందించాలి. గతంలో చాలా సాధారణ మందులతోనే అంటే క్లోరో క్వినలోన్స్ వంటి చాలా ప్రాథమికమైన మందులతోనే టైఫాయిడ్ త్వరగా తగ్గిపోయేది. కానీ డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ వచ్చిందంటే అది ఒక పట్టాన తగ్గక చాలా రకాల ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. మందులు కూడా పనిచేయకపోవడంతో వైద్యులు మరింత శక్తిమంతమైన మందులు వాడాల్సిన పరిస్థితి. అందుకే ఆన్ కౌంటర్ మందులు వద్దని డాక్టర్లు సూచిస్తుంటారు. టీకా అందుబాటులో... టైఫాయిడ్ నివారణకు టీకా అందుబాటులో ఉన్నందున... వచ్చాక మందుల వాడకం కంటే ముందుగా టీకాతోనే నివారించుకునే అవకాశం ఇప్పుడు ఉంది. ఈ సీజన్లో దూర ప్రయాణాలు చేసేవారికి ఇదెంతో మంచిది. నివారణ చర్యలతో, టీకాతో నివారణ తేలికే కాబట్టి దీన్ని నివారించుకోవడమే మేలు. చికిత్స : టైఫాయిడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే... దీని కారణంగా ఇది సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరు మరణించే అవకాశముంటుంది. అలా చూసినప్పుడు ఇది కొంచెం ప్రమాదకరమైన వ్యాధి. అందుకే చికిత్స తప్పనిసరి. పైగా 104 డిగ్రీలకు పైగా జ్వరం కారణంగా మరికొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు. చికిత్స అందకపోయినా లేదా తీవ్రత ఎక్కువగా ఉన్నా మెదడును దెబ్బతీసేలా మెనింజైటిస్, గుండెకు నష్టం చేకూరేలా మయోకారై్డటిస్, ప్యాంక్రియాస్‌ను దెబ్బతీస్తూ ప్యాంక్రియాటైటిస్, కొందరిలో పేగుల్లో రంధ్రం పడటం (పెర్ఫొరేషన్), పేగుల్లో రక్తస్రావం కావడం, కిడ్నీలు దెబ్బతినడం వంటి అనర్థాలు రావచ్చు. కొన్నిసార్లు చాలా అవయవాలు విఫలం కావడం (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్) జరగవచ్చు. అందుకే టైఫాయిడ్ రోగులు సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఫ్లూరోక్వినలోన్స్ / సెఫాలోస్పోరిన్స్ వంటి యాంటీబయాటిక్స్‌తో సాల్మొనెల్లా బ్యాక్టీరియా పూర్తిగా చనిపోతుంది. అయితే ఈ యాంటీబయాటిక్స్ పూర్తికోర్స్ వాడటం చాలా అవసరం. లేదంటే జబ్బు తిరగబెట్టవచ్చు. అది మరింత తీవ్రరూపం దాల్చవచ్చు. నివారణ : ఈగలతో దీని వ్యాప్తి చాలా ఎక్కువ. మలం మీద వాలి, అవే మళ్లీ ఆహారపదార్థాల మీద వాలే అవకాశం ఉన్నందున ఈగలను ముసరనివ్వకూడదు. ఈ సీజన్లో కుండల్లో చాలాకాలం నిల్వ ఉన్న నీటిని ఏమాత్రం తాగకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పట్టిన నీళ్లే తాగాలి. వీలైనంతవరకు నీటిని కాచి, వడపోసి చల్లార్చి తాగడం మంచిది. చేతులు కడుక్కునే అలవాటు లేనివారిలో ఇది ఎక్కువగా రావడం కనిపిస్తుంది. అందుకే తినేముందు లేదా తాగే ముందర చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక మల విసర్జన తర్వాత తప్పనిసరిగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి. అన్నం, కూరలు వేడివేడిగా ఉండగానే తినెయ్యాలి. వేడి చేయకుండా... నేరుగా నీళ్లను ఉపయోగించే చేసే తినుబండారాలతో టైఫాయిడ్ వ్యాప్తికి అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే ఈ సీజన్లో వేడిచేయకుండా నేరుగా నీళ్లను వాడే పానీపూరీ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. వీలైనంతవరకు ఈ సీజన్ అంతా బయటి ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది. ఒకవేళ బయటి పదార్థాలు తినాల్సి వస్తే చల్లారిపోయాక అస్సలు తినకూడదు. కలుషిత జలాలతో తయారు చేసే ఐస్‌తో కూడా ఇది వ్యాపించే అవకాశం ఉన్నందున, అలాంటి ఐస్ వాడే చెరుకు రసం వంటి పానీయాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. డాక్టర్ లింగయ్య మిర్యాల సీనియర్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ (చదవండి: వర్షాలలో ఎలుకలతో వచ్చే జబ్బు! ) -
నేటి నుంచి ఫీవర్ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి ఇంటింటి ఫీవర్ సర్వేను ప్రారంభిస్తోంది. ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు రాష్ట్రంలోని 1.63 కోట్ల గృహాలను సందర్శించి డెంగీ, మలేరియా, విష జ్వరాలతో బాధపడుతున్న వారిని, లక్షణాలున్న వారిని ఈ సర్వే ద్వారా గుర్తించనున్నారు. ఈ సర్వే కోసం సోమవారం ఉన్నతాధికారులు జిల్లాల వైద్య శాఖ, ఇతర శాఖల అధికారులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే చేపట్టాల్సిన విధానం, మార్గదర్శకాలను వివరించారు. కరోనా వ్యాప్తి సమయంలో వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఫీవర్ సర్వేను ప్రారంభించింది. ఆరోగ్య సిబ్బంది రాష్ట్రంలోని ప్రతి ఇంటిని సందర్శించి, లక్షణాలున్న వారిని గుర్తించి, పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రారంభ దశలోనే వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడింది. ఆ తర్వాత కూడా వ్యాధుల నియంత్రణకు సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు 49 విడతలు రాష్ట్రంలో సర్వే నిర్వహించారు. ఇదే తరహాలో ప్రస్తుతం సీజనల్ వ్యాధుల నియంత్రణకు సర్వే చేపడుతున్నారు. డెంగీ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులున్న వారిని, లక్షణాలున్నవారిని గుర్తిస్తారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. బాధితులకు మందులు అందిస్తారు. అవసరమైన వారిని ఆస్పత్రుల్లో చేర్పిస్తారు. సీజనల్ వ్యాధులను గుర్తించడానికి ఫీవర్ సర్వే యాప్‌లో మార్పులు చేశామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గతంలో కరోనా వైరస్ ప్రశ్నావళి మాత్రమే ఉండేదని, ప్రస్తుతం డెంగీ, మలేరియా, విష జ్వరాల లక్షణాల ప్రశ్నావళిని అదనంగా చేర్చామని చెప్పారు. ఫీవర్ సర్వే నిర్వహణపై అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలను సమన్వయం చేసుకుంటూ వైద్య శాఖ పనిచేస్తోందని వివరించారు. -
రాష్ట్రంపై డెంగీ పంజా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోందని.. ఈ ఏడాది ఇప్పటివరకు 583 డెంగీ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. అందులోని ఇటీవలి మే, జూన్ నెలల్లోనే అధికంగా కేసులు నమోదయ్యాయని నివేదికలో వెల్లడించింది. సాధారణంగా వానాకాలం సీజన్ మొదలయ్యాక డెంగీ, ఇతర విష జ్వరాలు వ్యాపిస్తుంటాయి. కానీ ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభం కాకముందే మే నెలలోనే డెంగీ కేసులు నమోదవడం ఆందోళనకరంగా మారింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 218 డెంగీ కేసులురాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 44, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్ జిల్లాల్లో 38 చొప్పున కేసులు నమోదయ్యాయి. వానలు మొదలైన నేపథ్యంలో డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఆ పది జిల్లాల్లో రిస్క్ రాష్ట్రంలో డెంగీ హైరిస్క్ జిల్లాలను ప్రజారోగ్య కార్యాలయం గుర్తించింది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మేడ్చల్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో గతేడాది నమోదైన డెంగీ కేసుల్లో ఈ జిల్లాల్లోనే 80 శాతం వరకు నమోదైనట్టు పేర్కొంది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు 121 మలేరియా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలను హైరిస్క్ జిల్లాలుగా వైద్యారోగ్యశాఖ గుర్తించింది. గతేడాది రాష్ట్రంలో నమోదైన మలేరియా కేసుల్లో ఈ ఏడు జిల్లాల్లోనే 91.5 శాతం కేసులు వచ్చాయని పేర్కొంది. అధికారులతో మంత్రి సమీక్ష వానాకాలం మొదలైన నేపథ్యంలో డెంగీ, మలేరియా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల నియంత్రణపై ప్రత్యేకంగా అన్ని జిల్లాల డీఎంహెచ్వోలతో మంత్రి హరీశ్‌రావు తాజాగా సమీక్ష నిర్వహించారు. కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులు మిషన్ భగీరథతో తగ్గిపోయాయని.. కానీ కీటకాలతో వ్యాపించే వ్యాధుల నియంత్రణపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. మలేరియాను గుర్తించే 8 లక్షల ర్యాపిడ్ కిట్లను, డెంగీని గుర్తించే 1.23 లక్షల ఎలిజా కిట్లను ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపామని తెలిపారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్‌రూరల్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ, ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, సంక్షేమ పథకాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం మావలలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని 468 గ్రామపంచాయతీల్లో పారిశుధ్య పనులను నిరంతరంగా కొనసాగించాలని సూచించారు. ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సెగ్రిగేషన్ షెడ్‌కు తరలించాలన్నారు. రోడ్లపై వర్షపునీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. అలాగే మురుగు కాలువలను శుభ్రం చేయాలన్నారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. దోమలతో వ్యాప్తి చెందే డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. హరితహారంలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది 25 లక్షల 5వేల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఖాళీ స్థలాలు గుర్తించడం, గుంతలు తవ్వడం వంటి ఏర్పాట్లు చేసుకోవాలని, నాటిన ప్రతీ మొక్కను సంరక్షించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈనెల 30 నుంచి 8,702 ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ ఉంటుందన్నారు. అర్హులైన బీసీ చేతివృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రెండో విడత దళితబంధులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయనుందని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక, శిక్షణ, అవగాహన కార్యక్రమాలను ఎంపీడీవోల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన, అర్హులైన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. సమగ్ర ఓటరు జాబితా తయారీకి బీఎల్వోలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం ఇటీవల జాతీయ జలశక్తి అవార్డు అందుకున్న కలెక్టర్‌ను అధికారులు సత్కరించారు. సమావేశంలో జెడ్పీ ిసీఈవో గణపతి, డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, ఐటీడీఏ డీడీ దిలీప్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, డిప్యూటీ సీఈవో రాథోడ్ రాజేశ్వర్, ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
కాలానుగుణ వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి
తూర్పు గోదావరి (రంగంపేట): కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై అవగాహన పెంచుకుని నివారణకు జాగ్రత్తలు పాటించాలని సత్యసాయి సేవా సంస్ధల జిల్లా అధ్యక్షుడు బలుసు వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక సత్యసాయి మందిరం వద్ద శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన చెవి, ముక్కు, గొంతు, ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజమహేంద్రవరానికి చెందిన శ్రీసత్యసాయి సరస్వతి చెవి, ముక్కు, గొంతు వైద్యశాల డాక్టర్ పి. ప్రవీణ్‌కుమార్ రెడ్డి ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 50 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగ సమన్వయ కర్త సుక్కిరెడ్డి సాయి సుధాకర్, రంగంపేట సజ్జోన్ కనీ్వనర్ మల్రెడ్డి వీర్రాజు, గరిమెళ్ళ అరుణ, సేవా సంస్థ కనీ్వనర్లు టి.గోవిందరాజులు, కె.వెంకట అమర్నాధ్, చావా బోధియ్య, ఉండవిల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
వేపను వదలని శిలీంధ్రం
సాక్షి, హైదరాబాద్: గతేడాది వేప చెట్లను అతలాకుతలం చేసిన ఫంగస్ ఇక కొన్నేళ్లపాటు ఆ వృక్ష జాతి పాలిట ‘సీజనల్ వ్యాధి’గా కొనసాగనుంది. వచ్చే ఐదారేళ్లపాటు ఆగస్టు, సెప్టెంబర్ సమయంలో ఆ శిలీంధ్రం ఆశించి వేప చెట్లకు నష్టం చేసే అవకాశం ఉంది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం తాజాగా ఈ విషయం గుర్తించింది. ఈ నెల 15 నుంచి జరిపిన పరిశోధనలో, గతేడాది తీవ్ర ప్రభావం చూపిన ఫోమోప్సిస్ అజాడిరెక్టే, ఫ్యుజేరియం అనే ఫంగస్ వేప చెట్లకు మళ్లీ ఆశించినట్టు తేల్చారు. గతేడాది ప్రభావం తీవ్రంగా ఉండగా, ఈసారి కాస్త తక్కువగా ఉంది. దాదాపు 20 శాతం చెట్లు చనిపోతాయన్న అంచనా గతేడాది వ్యక్తమైనా, చివరకు ఔషధ వృక్షంగా పేరుగాంచిన వేప తనను తాను బతికించుకుంది. అతి తక్కువ సంఖ్యలోనే చెట్లు చనిపోయాయి. ప్రభావం తీవ్రంగా ఉన్నా చివరకు ప్రమాదం నుంచి వాటంతట అవే బయపడడాన్ని చూసి శిలీంధ్రాన్ని విజయవంతంగా జయించినట్టేనని, ఇక ఆ శిలీంద్రం అంతమైనట్టేనని భావించారు. కానీ, సరిగ్గా మళ్లీ గత ఆగస్టు చివరికల్లా కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మల చివర్లు ఎండిపోవటం మొదలైంది. క్రమంగా సమస్య పెరుగుతుండటంతో ఈ నెల రెండో వారంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం సంచాలకులు జగదీశ్వర్ ఆదేశం మేరకు డాక్టర్ సి.నరేందర్‌రెడ్డి, డాక్టర్ ఎస్జే రహమాన్, డాక్టర్ జి.ఉమాదేవి, డాక్టర్ ఎస్.హుస్సాని, డాక్టర్ ఎం.లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎం.వెంకటయ్య, డాక్టర్ బి.రాజేశ్వరి, డాక్టర్ మాధవిలతో కూడిన బృందం వివిధ ప్రాంతాల్లో పర్యటించి వేప నమూనాలు సేకరించి యూనివర్సిటీ ల్యాబ్‌లో వారం పాటు బీఓడీ ఇంక్యుబేటర్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఫొమోప్సిస్ అజాడిరెక్టే, ఫ్యుజేరియం ఫంగస్ భారీగానే ఉన్నట్టు తేలింది. అయితే ఈసారి వాటిపై రసాయనాలు పిచికారీ చేయాల్సిన అవసరం లేదని, మళ్లీ పొడి వాతావరణం వచ్చేసరికి ఫంగస్‌ను వేప జయిస్తుందని పరిశోధన విభాగం సంచాలకులు జగదీశ్వర్ పేర్కొన్నారు. భారీ వర్షాలతోనే.. గతేడాది ఆశించిన శిలీంధ్రం పూర్తిగా మాయం కాకముందే వరసపెట్టి భారీగా కురిసిన వర్షాలతో మళ్లీ అది ఉత్తేజితం అయిందని జగదీశ్వర్ చెప్పారు. మధ్యలో దాదాపు పక్షం రోజుల పాటు పూర్తి పొడి వాతావరణం కొనసాగిన సమయంలో వీచిన గాలులకు శిలీంద్రం వాతావరణంలో కలిసి మిగతా ప్రాంతాలకు వేగంగా విస్తరించిందని పేర్కొన్నారు. అయితే దాన్ని తట్టుకునే శక్తి వేపకు ఈపాటికే వచ్చిందని, భారీ నష్టం లేకుండానే క్రమంగా అది తగ్గుముఖం పడుతుందని వివరించారు. కానీ సీజనల్ వ్యాధి మాదిరి కొన్నేళ్లపాటు వేపను ఆశించే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతేడాది క్రిమినాశకాలు, శిలీంధ్ర నాశకాలను ప్రభుత్వానికి సిఫారసు చేసినప్పటికీ, ఈ సారి మాత్రం అలాంటి సిఫారసులు చేయటం లేదని తెలిపారు. నర్సరీల్లో పెంచే వేప మొక్కలకు మాత్రం మందులను పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. కార్బెండిజమ్, మాంకోజెబ్, థియామెథాక్సమ్, అసెటామాప్రిడ్లను పిచికారీ చేయొచ్చని సూచించారు. -
తెలంగాణకు ‘ఫుల్ ఫీవర్’.. డెంగీ, మలేరియాతో ఆస్పత్రులకు జనం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి జ్వరమొచ్చింది. ఇక్కడా, అక్కడా అని తేడా లేకుండా ఇంటింటా విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో జనం సతమతం అవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిర్వహిస్తున్న జ్వర సర్వేలోనే ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) నుంచి బోధనాస్పత్రుల దాకా రోజూ వేలాది మంది ఔట్ పేషెంట్లు క్యూకడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులూ నమోదవుతున్నాయి. వానలు.. దోమలతో.. ఈసారి తరచూ వానలు పడుతుండటం, మారిన వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు తగ్గడం, అన్నిచోట్లా నీరు నిల్వ ఉండటం, పారిశుధ్య నిర్వహణ లోపం.. ఇవన్నీ కలిసి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. కలుషితాలు వ్యాపిస్తున్నాయి. దీనితో వైరల్ జ్వరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చాలా మంది గొంతు నొప్పి, జ్వరంతో ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా న్యుమోనియా, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలూ పెరుగుతున్నాయని అంటున్నారు. పెరుగుతున్న డెంగీ కేసులు అపరిశుభ్ర పరిస్థితులు, దోమల వ్యాప్తి కారణంగా డెంగీ, మలేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 7 వేలకుపైగా డెంగీ కేసులు నమోదుకాగా.. ఇందులో ఒక్క ఆగస్టులోనే 3,602 కేసులు వచ్చినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న డెంగీ కేసుల వివరాలు సరిగా అందక ఈ సంఖ్య తక్కువగా కనిపిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీవ్రంగా.. విష జ్వరాలు, సీజనల్ వ్యాధుల తీవ్రత గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రులు సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులు, బస్తీ దవాఖాలకు వచ్చే బాధితుల సంఖ్య బాగా పెరిగింది. పలు ఆస్పత్రుల్లో బెడ్లు రోగులతో నిండిపోయాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులూ నమోదవుతున్నాయి. ఒక్క మేడ్చల్ పరిధిలోనే 492 డెంగీ కేసులు వచ్చినట్టు జ్వర సర్వేలో వెల్లడైంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీకి తెరతీశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా తీవ్రత గత ఐదు నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు 49.67 లక్షల మంది ఔట్ పేషెంట్లు వచ్చారని వైద్యారోగ్యశాఖ బుధవారం వెల్లడించిన నివేదిక తెలిపింది. సగటున నెలకు 9.93 లక్షల ఓపీ నమోదైనట్టు పేర్కొంది. ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధికంగా అనారోగ్యాల బాధితులు ఉన్నారని.. ఇందులో విష జ్వరాల కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కడ చూసినా జ్వర బాధితులే.. ► నల్లగొండ జిల్లాలో విష జ్వరాల బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. అధికారికంగానే 56 మందే డెంగీ బారినపడ్డట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. ► కరీంనగర్ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 236 డెంగీ కేసులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రికి రోజూ 150 మంది వరకు విష జ్వరాల బాధితులు వస్తున్నట్టు వైద్యులు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డెంగీ 38, వైరల్ జ్వరాలు 1,872 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలో ఈ ఒక్క నెలలోనే 188 డెంగీ కేసులు వచ్చాయి. పెద్దపల్లి జిల్లాలో రోజూ వందల్లో జ్వర బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. ► ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోనూ సీజనల్ వ్యాధుల కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి రోజూ 1,500 మందికిపైగా రోగులు వస్తున్నారని, అందులో విష జ్వరాల బాధితులు ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో గత 15 రోజుల్లో 90 డెంగీ కేసులు వచ్చాయి. ► విష జ్వరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను హడలెత్తిస్తున్నాయి. ప్రతీ ఇంట్లో ఒకరైనా మంచం పట్టి కనిపిస్తున్నారు. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు సరిపోక కింద పరుపులు వేసి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 547 డెంగీ కేసులు, 83 చికున్ గున్యా కేసులు వచ్చాయి. ► ఉమ్మడి నిజామాబాద్ పరిధిలోనూ విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత నాలుగు నెలల్లో 86 డెంగీ కేసులు నమోదుకాగా.. వేల మంది వైరల్ జ్వరాల బారినపడ్డారు. ► సీజనల్ వ్యాధులు, జ్వరాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వస్తున్న వారిలో 10 శాతం మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్న పరిస్థితి ఉంది. పిల్లల వార్డులో బెడ్లు నిండిపోయాయి. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచి చికిత్స చేస్తున్నారు. జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యవర్గాలు చెప్తున్నాయి. మూడు రోజులుగా జ్వరంతో.. మా బాబు మహేశ్ వయసు ఎనిమిదేళ్లు. మూడు రోజులుగా తీవ్రంగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. బాగా నీరసంగా ఉంటే ఈ రోజు ఆస్పత్రికి తీసుకొచ్చాం. వైరల్ జ్వరంలా ఉంది.. పరీక్షలు చేయించాలని వైద్యులు అంటున్నారు. – మహేశ్ తల్లి, ఉప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో తగ్గక ప్రైవేటుకు వెళ్లాం డెంగీ రావడంతో వారం రోజుల క్రితం ఫీవర్ ఆస్పత్రిలో చేరి ఐదు రోజులు చికిత్స తీసుకున్నాను. ప్లేట్ లెట్స్ తగ్గిపోతూనే ఉన్నాయి. మా ఇంట్లోవాళ్లు ఆందోళనతో ఫీవర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయించి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. – సాయి కిరణ్ (20), బాగ్ అంబర్‌పేట ఇదీ చదవండి: ‘గులాబీ’ బాస్‌కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్’! -
గురుకులాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
సాక్షి, అమరావతి: ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడటానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గురుకులాల విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే చికిత్స అందించాలని.. అవసరమైన ఔషధాలను కూడా అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. గురుకులాల ఆవరణల్లో అపరిశుభ్ర వాతావరణం లేకుండా చూడాలన్నారు. గతంలో సెర్ప్ ద్వారా విద్యార్థులకు అమలు చేసిన ఇన్‌స్రూ?న్స్ను పునరుద్ధరించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. ప్రతి విద్యాసంస్థలో తప్పనిసరిగా హెల్త్ సూపర్వైజర్, హాస్టల్ కేర్ టేకర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పోస్టులు ఎక్కడైనా ఖాళీగా ఉంటే భర్తీ చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలోనూ ప్రభుత్వ మెనూ అమలవ్వాలని స్పష్టం చేశారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్షి్మ, గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి పావనమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
క్షేత్ర స్థాయిలో పర్యటనలు తప్పనిసరి
సాక్షి, అమరావతి: జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఆదేశించారు. దీనివల్ల పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, డీహెచ్‌లు, ఏహెచ్‌లలో వైద్య సేవలు మెరుగవుతాయన్నారు. సీజనల్ వ్యాధులపై మంగళగిరి నుంచి అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో సోమవారం మంత్రి రజని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న చోట్ల వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధుల వ్యాప్తిని గమనిస్తూ అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. డెంగీ, మలేరియా వ్యాధి నిర్ధారణ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ రూ.వేల కోట్లు వైద్య శాఖ కోసం ఖర్చు చేస్తున్నారని గుర్తు చేశారు. అన్ని విషజ్వరాలకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందేలా చేస్తున్నారన్నారు. డెంగీ, మలేరియా, చికెన్‌గున్యాతోపాటు కలరా, డయేరియా నివారణకు కావాల్సిన మందులన్నీ ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే వినతులపై తక్షణమే స్పందించాలన్నారు. ఈ విషయంలో స్పందించని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని మరింత చిత్తశుద్ధితో నిర్వహించాలని చెప్పారు. వెంటనే ఫీవర్ సర్వేను చేపట్టాలని, 15 రోజుల్లోగా ఇది పూర్తికావాలని ఆదేశించారు. ఈ సర్వేకు సంబంధించి ఏ రోజు వివరాలు ఆ రోజు తనకు నేరుగా పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్, డీఎంఈ రాఘవేంద్రరావు, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిర ప్రసాద్, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్‌కుమార్, డీహెచ్ డాక్టర్ వి.రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జ్వరాలొస్తున్నాయ్.. జాగ్రత్త! వైరల్ ఫీవర్, మలేరియా, డెంగీ...
సాక్షి, అమరావతి: వాతావరణంలో మార్పులు, వర్షాలతో రాష్ట్రంలో వైరల్ ఫీవర్; మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మలేరియా ఎక్కువగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 32.98 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా 945 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇందులో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 531, పార్వతీపురం మన్యంలో 238 కేసులు నమోదు అయ్యాయి. ఐదు జిల్లాల్లో ఓ మోస్తరుగా, 13 జిల్లాల్లో నామమాత్రంగా కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 1,387 డెంగీ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 387 కేసులు ఉన్నాయి. విజయనగరంలో 173, కాకినాడలో 99, అనకాపల్లిలో 82 కేసులు నమోదయ్యాయి. డెంగీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నియంత్రణకు పారిశుధ్య నిర్వహణ, నీళ్లు నిల్వ ఉండకుండా చూడటం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు. డెంగీకు సంబంధించి 54 ప్రభుత్వ బోధనాస్పత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రులను సెంటినల్ నిఘా ఆసుపత్రులుగా గుర్తించారు. వ్యాధిని గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,34,270 టెస్ట్ కిట్లను పంపిణీ చేశారు. విశాఖపట్నంలో వైద్య సిబ్బందికి సెరా నమూనాలపై అవగాహన కల్పించారు. మలేరియా ఎక్కువగా ఉన్న ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు, అనకాపల్లి, ఏలూరు, విశాఖపట్నం జిల్లాల్లో నియంత్రణ చర్యలను వైద్య శాఖ చేపట్టింది. వ్యాధి ఎక్కువగా ఉన్న 4–5 గ్రామాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. దోమల నుంచి రక్షణ కోసం 25.94 లక్షల దోమ తెరలను ప్రభుత్వం పంపిణీ చేసింది. పరిసరాలను పరిశుభ్రతకు, దోమల నివారణకు చర్యలు చేపడుతోంది. వెక్టార్ కంట్రోల్, ఏఎన్ఎంలు వారి పరిధిలో అపరిశుభ్రంగా, నీరు నిలిచిన ప్రాంతాల ఫోటోలను హైజీన్ యాప్‌లో అప్లోడ్ చేసి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. వెంటనే గ్రామ/వార్డు కార్యదర్శులు అక్కడి సమస్యలను పరిష్కరిస్తున్నారు. అదే విధంగా ఫ్రైడే–డ్రై డే ప్రచార కార్యక్రమం ప్రతి శుక్రవారం అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► ఇంటి ఆవరణ, చుట్టుపక్కల పనికిరాని వస్తువులు, టైర్లు, వాడిన కొబ్బరి చిప్పలు ఉంచరాదు. ► మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ► నీటిని నిల్వ చేసే పాత్రలు శుభ్రపరచి, వాటిపై మూతలు ఉంచాలి ► ఆర్వో నీటిని లేదా కాచి వడగట్టిన నీటిని తాగాలి ► తాజా కాయగూరలు, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ► దోమ తెరలు వినియోగించాలి. గర్భిణిలు, చిన్న పిల్లలకు దోమతెరలు తప్పనిసరి నిర్లక్ష్యం చేయద్దు జ్వరం, దగ్గు, జలుబు, విరేచనాలు, వాంతులు సహా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. సొంత వైద్యం చేసుకోకూడదు. సీజనల్ వ్యాధులపై వైద్య శాఖ అప్రమత్తంగా ఉంది. జ్వర బాధితులకు వైద్య పరీక్షలు చేస్తున్నాం. ఫీవర్ సర్వే కొనసాగిస్తున్నాం. – డాక్టర్ రామిరెడ్డి, రాష్ట్ర సీజనల్ వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ఏడీ ప్రాథమిక దశలోనే గుర్తించాలి వాతావరణంలో మార్పుల వల్ల వైరల్ ఫీవర్ (విష జ్వరం)లు ఎక్కువగా వస్తాయి. దోమల ద్వారా మలేరియా, డెంగీ, ఇతర వ్యాధులు వస్తాయి. అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం కీలకం. జ్వరం, ఇతర అరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి. ఇంట్లో ఇతరులకు దూరంగా ఉండాలి. వర్షంలో తడవకూడదు. మాస్క్ ధరించాలి. మాస్క్ వల్ల కరోనాతోపాటు ఇతర వ్యాధులు, వైరస్లు, భ్యాక్టీరియాల నుంచి రక్షణ లభిస్తుంది. – డాక్టర్ రఘు, గుంటూరు జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్ -
కామ్‌గా ఉంటే కబళించే దోమ కాటు.. క్యూలెక్స్, ఏడిస్, అనాఫిలిస్తో జరపైలం!
నేరడిగొండ (ఆదిలాబాద్): వర్షాకాలం కావడంతో దోమల సీజన్ మొదలైంది. చిన్నదోమే కదా.. కుడితే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. దోమల నివారణ, నియంత్రణపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే అనారోగ్యంతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. దోమల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దోమల వ్యాప్తితో ప్రమాదం.. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగునీటి గుంతలు, కంప చెట్లు, పిచ్చిమొక్కలు, నీరు నిల్వ ఉండే ప్రా ంతాల్లో దోమలు నివాసం ఏర్పర్చుకుంటాయి. గు డ్డు, లార్వా, ప్యూపా వృద్ధి చెంది దోమగా మారి యుద్ధానికి సిద్ధమవుతుంది. ఈప్రమాదాన్ని ని వా రించాలంటే నీటిని సక్రమంగా వినియోగించా లి. దోమల నివారణకు మందులు పిచికారీ చేయాలి. నిర్లక్ష్యం చేస్తే.. క్యూలెక్స్తో దోమ కాటుతో హఠాత్తుగా జ్వరం వస్తుంది. విస్తారమైన నీటి నిల్వలో పెరిగే క్యూలెక్స్ దోమతో ఈవైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈవ్యాధిని చికిత్స ద్వారా నియంత్రించడం కష్టం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మేలు. పంట పొలాలు, పెద్ద పెద్ద స్థలాలు, మైదానాల్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పందులను నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. ఏడిస్ దోమతో.. 1 ఆకస్మాత్తుగా ఎముకలు, కండరాలు, కీళ్ల నొప్పులతో కూడిన జ్వరం వస్తుంది. తగ్గినట్లుగానే తగ్గి వారం లేదా పది రోజుల్లో మళ్లీ తిరగబెడుతుంది. ఏడిస్ దోమ కాటు కారణంగా ఈవ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాళ్లలో నొప్పి, శరీరంపై చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడుతాయి. డెంగీ, చికెన్‌గున్యా వ్యాధి లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. నెలల తరబడి నొప్పులు బాధిస్తాయి. దీని నివారణ కోసం దోమల పెరుగుదలను అరికట్టాలి. ఎప్పటికప్పుడు నీటి నిల్వలను తొలగించాలి. వ్యాధి పట్ల సరైన అవగాహన పెంచుకొని తగిన చికిత్స చేయించుకోవాలి. దోమ కాటుకు గురైతే.. అనాఫిలిస్ దోమ కాటుతో మలేరియా, చలి, వణుకుతో కూడిన జ్వరం వస్తుంది. వ్యాధి ప్రారంభంలో సరైన చికిత్స చేయించకపోతే నెలల తరబడి బాధిస్తుంది. గర్భిణులకు, చిన్నారులకు ఈవ్యాధి తీవ్రత అధికంగా ఉంటుంది. చలితో జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్ధారించుకోవాలి. సకాలంలో మందులు వాడుతూ జాగ్రత్తలు తీసుకోవాలి. -
సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ
సాక్షి, అమరావతి: సీజనల్ వ్యాధుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో సీజనల్ వ్యాధులు, కోవిడ్, ఫ్యామిలీ డాక్టర్ విధానం, మంకీ ఫాక్స్ తదితర అంశాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల కారణంగా ఒక్క మరణం సంభవించినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులను గుర్తిస్తే.. వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, పరీక్షల కిట్లు, రక్తపు నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కోవిడ్ ప్రికాషన్ డోసు పంపిణీని వేగవంతం చేయాలన్నారు. ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్న ఫ్యామిలీ డాక్టర్ విధా నంపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులు ఉంటారని, వారిలో ఒకరు పూర్తిగా 104 వాహనం ద్వారా గ్రామాలకు వెళ్లి సేవలందిస్తారని తెలిపారు. సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నివాస్ తదితరులున్నారు. -
సీజనల్ వ్యాధులకు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టినందున సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. డెంగీ, మలేరియా, ఇతర వ్యాధులు ప్రబలకుండా ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని, అధికారులు కూడా ఇంటింటి సర్వే ద్వారా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో మంత్రుల సమీక్ష జరిగింది. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాలు, గూడేలతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్త వహించాలని కోరారు. మలేరియా, డెంగీ కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, అన్ని జిల్లాల్లో కిట్స్ అందుబాటులో ఉంచామని వెల్లడించారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ను అంటువ్యాధులకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలిపారు. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గురుకులాల్లో నిల్వ ఉంచిన బియ్యం స్థానంలో తాజా బియ్యాన్ని సరఫరా చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ను కోరినట్లు చెప్పారు. వరదల వల్ల ఏర్పడిన కరెంటు ఇబ్బందుల పరిష్కారానికి సంబంధిత శాఖలకు రూ.పదేసి కోట్ల చొప్పున విడుదల చేసినట్లు తెలిపారు. సమీక్షలో హరీశ్‌రావుతోపాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు. గురుకులాలకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు సంక్షేమ విద్యాసంస్థల్లో ఆహార నాణ్యతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలకు ఉపక్రమించింది. కొన్ని రోజులుగా సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, వసతిగృహాలతోపాటు ఇతర విద్యాసంస్థల్లో ఆహారం వికటిస్తున్న సందర్భాలు వెలుగుచూస్తున్న క్రమంలో సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గురుకుల విద్యాసంస్థలు, సక్షేమ వసతి గృహాల్లో ఆహార నాణ్యతను పరిశీలించాలని కోసం ఫుడ్ ఇన్స్పెక్టర్లను ఆదేశించింది. మంకీపాక్స్‌పై అప్రమత్తంగా ఉన్నాం మంకీపాక్స్ వ్యాధి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ‘కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన ఇబ్రహీం అనే వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించాం. ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇబ్రహీం నమూనాలను పుణేలోని ఎన్ఐవీ ల్యాబ్‌కు పంపాం. మంకీపాక్స్ చికిత్సకు ఫీవర్ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. గాంధీ ఆసుపత్రిలో మంకీపాక్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మంకీపాక్స్ లక్షణాలుంటే వెంటనే ఫీవర్ ఆసుపత్రిని సందర్శించాలి’అని హరీశ్‌రావు చెప్పారు. ప్లేట్లెట్స్ పడిపోతే ఆందోళనలతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని, అన్ని జిల్లా, బోధనాసుపత్రుల్లో ప్లేట్లెట్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
సీజన్ వచ్చేసింది.. వణికించే వ్యాధుల జాబితా! లక్షణాలు, ముందు జాగ్రత్తలు
తొలకరి మొదలైంది.. రోజూ వర్షాలు కురుస్తుండడంతో వీధుల్లో నీరు నిల్వ చేరుతోంది. దోమలు వ్యాప్తి చెందుతుండడంతో సీజనల్ వ్యాధుల విజృంభణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వెల్లడిస్తున్నారు. జ్వరం.. జలుబు వచ్చిన వెంటనే చికిత్స పొందాలని కోరుతున్నారు. ప్రాణాంతకం కాకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. చిత్తూరు రూరల్ : వర్షాకాలంలో ప్రజలు అధికంగా సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు. వాతావరణ మార్పులతో తరచుగా జ్వరం, జలుబుతో బాధపడుతుంటారు. రోగాల వ్యాప్తికి ప్రధానంగా దోమలే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇళ్ల వద్ద, వీధుల్లో నీరు నిల్వ చేరడంతో దోమలు విపరీతంగా పెరిగి వ్యాధుల వ్యాప్తికి కారకాలుగా మారుతున్నాయని వివరిస్తున్నారు. వైరల్ జ్వరాలను ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ► తేలికపాటి జ్వరం.. జలుబు: సీజన్ మార్పుతో పెరిగే సూక్ష్మక్రిముల వల్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. ఇవి గాలి, నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి . ఈ వైరల్ ఫీవర్ 3 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. జాగ్రత్తలు: భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్ర పరుచుకోవాలి. నిల్వ పదార్థాలు తినకూడదుౖ తాజా పండ్లు తీసుకోవాలి . వర్షంలో తడవకూడదు . తడిచిన బట్టలలో ఎక్కువ సేపు ఉండ కూడదు. మాస్క్ తప్పనసరిగా ధరించాలి. ► చికెన్ గున్యా: దోమ కాటు వల్ల చికెన్ గున్యా వస్తుంది. తీవ్రమైన జ్వరం , కీళ్ల నొప్పులు చికెన్ గున్యా లక్ష ణాలు , ఇది సోకితే మొదటి రెండు , మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉంటుంది . జాగ్రత్తలు: ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి . కూలర్లు, టైర్లు మొదలైన వాటిలో నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలి. శరీరం మొత్తం కప్పేలా దుస్తులు ధరించాలి . ► మలేరియా: తీవ్రమైన తలనొప్పి, వణుకుతో కూడిన అధిక జ్వరం మలేరియా లక్షణాలు . జ్వరం తగ్గి మళ్లీ వస్తుంది . ఆడ దోమ కాటుతో మలేరియా జిరమ్స్ శరీరంలో లోపలికి వెళ్తాయి . 14 రోజుల తర్వాత అధిక జ్వరం వస్తుంది . ఈ దోమలు నిల్వ ఉన్న వర్షపు నీటిలో వృద్ధి చెందుతాయి. జాగ్రత్తలు: దోమతెరలు వినియోగించాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు నిల్వ చేరితే అందులో కిరోసిన్ గాని పురుగు మందుగాని పిచికారీ చేయించాలి. ► డెంగీ: వైరల్ జ్వరం మాదిరి అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. తీవ్రమైన ఒళ్లు నొప్పులు వస్తాయి. ఎముకలు విరిగిపోతున్నంత బాధ కలుగుతుంది . ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావం జరుగుతుంది. పొట్ట, కాళ్లు , చేతులు , ముఖం , వీపు భాగాల చర్మంపై ఎరగ్రా కందినట్టు చిన్నచిన్న గుల్లలు కనిపిస్తాయి . ఒక్కోసారి ప్లేట్లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా మారుతుంది . ఈడిస్ ఈజిప్టు అనే దోమ కాటుతో డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఇళ్లలోని కుండీలు , ఓవర్ హెడ్ ట్యాంక్‌లు , ఎయిర్ కూలర్లు , పరిసరాల్లో నిర్లక్ష్యంగా పడేసిన కొబ్బరి బొండాలు , ప్లాస్టిక్ కప్పులు , పగిలిన సీసాలు , టైర్లు వంటి వాటిల్లో చేరిన వర్షపు నీటిలో గుడ్లు పెట్టి ఈడిస్ దోమలు వృద్ధి చెందుతాయి. జాగ్రత్తలు: ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి . చెత్తాచెదారం సమీపంలో ఉండకూడదు. ఇంట్లో దోమల మందు చల్లించుకోవాలి . దోమ తెరలు వాడడం శ్రేయస్కరం . వారంలో ఒక రోజు డ్రైడే పాటించాలి . ఇంటి పరిసరాల్లో కొబ్బరి బొండాలు , పాత టైర్లు , ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి . ఎయిర్ కూలర్లు , ఎయిర్ కండిషన్లు , పూలకుండీల్లో నీటిని తరచూ మార్చాలి. నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి. శరీరమంతా కప్పి ఉంచుకునేలా దుస్తులు వేసుకోవాలి. ► హెపటైటిస్–ఏ: వర్షాకాలంలో హెపటైటిస్– ఎ ( కామెర్లు) వ్యాధి వచ్చే అవకాశం ఉంది . ఇది కాలేయ కణాలలో సంక్రమణ వల్ల కలుగుతుంది. కలుషితమైన ఆహార పదార్థాల నుంచి , తాగునీటి నుంచి రోగ కారకక్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి . కాలేయ వ్యాధి కారణం గా రక్తంలో బిలిరుబిన్ పరిమాణం పెరుగుతుంది. దీంతో శరీర భాగాలు పసుపు రంగులోకి మారిపోతాయి. జాగ్రత్తలు: శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. బయట ఆహారం తినకూడదు. వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించాలి. ► టైఫాయిడ్: వర్షాకాలంలో టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది . ఇది సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా వల్ల వస్తుంది . కలుషిత నీరు తాగడం, ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జాగ్రత్తలు: కాచి చల్లార్చిన నీటిని తాగాలి. బయట ఆహారం తినకూడదు. రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని సేవించాలి. ముఖ్యంగా పండ్ల రసం, కొబ్బరి నీరు, సూప్ వంటివి తీసుకోవడం మంచిది. అప్రమత్తత తప్పనిసరి వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటే రోగాలు రాకుండా రక్షణ పొందవచ్చు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. ఏమాత్ర జ్వరం, జలుబు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. వర్షంలో తడవకుండా చూసుకోవాలి. – శ్రీనివాసులు, డీఎంఓ -
వానలతో జ్వరాల ‘వరద’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఏర్పడిన వాతావరణ మార్పులతో అనేక మంది జలుబు, దగ్గు, జ్వరం, తీవ్రమైన తలనొప్పి తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రధానంగా డెంగీ, మలేరియా, కరోనా ప్రజలను పట్టిపీడిస్తు న్నాయి. దీంతో బాధితులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. డెంగీ, కరోనా సోకినవారికి దాదాపు ఒకే రకమైన లక్షణాలు ఉండటంతో ఏది ఏ వ్యాధో అంతుచిక్కక జనం ఆందోళన చెందుతున్నారు. కరోనా కేసులు కూడా 10 రోజుల నుంచి రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రోగ లక్షణాలు కనిపించిన వెంటనే ఆయా వ్యాధులను నిర్ధారించుకుని చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో వైరల్ ఫీవర్లు, జలుబు, శ్వాసకోశ సంబంధ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా డెంగీ, కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లాల్లో ఇప్పుడిప్పుడే డెంగీ కేసులు వస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే కాలంలో సీజనల్ వ్యాధులు. కోవిడ్ నుంచి కాపాడుకోవడానికి ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలతోపాటు ప్రజలు కూడా వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలని వైద్యు లు కోరుతున్నారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటే డెంగీ పరీక్ష చేయించుకోవాలి. కొద్దిగా విరేచనాలు, ముక్కు కారడం, గొంతులో గరగర ఉంటే కరోనా అయ్యే అవకాశమున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. డెంగీ, కరోనాకు వేరు వేరు గా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇవి రెండూ ఒకే సారి కూడా వచ్చే అవకాశముంది. దీంతో పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ ఈ నెల మొదటి వా రంలో సర్వే మొదలు పెట్టింది. రాష్ట్రంలో చెత్త, చెదారం, నిల్వనీరు తొలగించడం ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. మూడేళ్ల తర్వాత డెంగీతో ఆస్పత్రుల్లో చేరే రోగులు పెరిగినట్లు డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో 2019లో 13 వేలకు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 800 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి హరీశ్‌రావు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వర్షాల కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధతతో ఉండాలని సూచించారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, విభాగాధిపతులు, వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లోని పరిస్థితుల గురించి ఆరా తీశారు. సబ్‌సెంటర్ స్థాయి నుంచి జిల్లా ఆస్పత్రి వరకు వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖ లతో సమన్వయం చేసుకుంటూ సేవలు అందించా లని సూచించారు. 108 వాహ నాలు వెళ్లలేని ప్రాంతాలను ముందే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలన్నారు. హౌస్సర్జన్లు, జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లుసహా డైట్, పారిశుధ్య సిబ్బందికి సకాలంలో వేతనాలు అందే విధంగా బిల్లులు çసమర్పించాలని మంత్రి ఆదేశించారు. కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందించే మందుల సంఖ్య 720 నుంచి 843కు పెరిగింది. ప్రతి డాక్టర్‌కు ఈ జాబితాలోని మందుల వివరాలు తెలిసేలా బుక్లెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. -
అవగాహన, పరీక్షలు, చికిత్స
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు మూడంచెల విధానం అనుసరించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అవగాహన కల్పించడం, వ్యాధి నిర్ధారణ చేయడం, త్వరితగతిన చికిత్స అందించడం చేపట్టాలని సూచించారు. సీజనల్ వ్యాధులపట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు పంచాయతీరాజ్ సహా ఇతర శాఖలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. గిరిజనుల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందంతో ప్రచారం చేయాలన్నారు. మంగళవారం ఏటూరునాగారం, ఉట్నూర్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌ర్నూల్ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలోని జిల్లాల్లో సీజనల్ వ్యాధులపై మంత్రి హరీశ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులను పూర్తిస్థాయిలో నియంత్రించాలని సూచించారు. ఎక్కడైనా కేసులు నమోదైతే ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. కరోనా లక్షణాలు, సీజనల్ వ్యాధుల లక్షణాలు దాదాపు ఒకేలా ఉన్నందున నిర్లక్ష్యం చేయకుండా బాధితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. 108 వాహనాలు వెళ్లలేని ప్రాంతాలను ముందే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. ప్రజలు నాటు వైద్యం, మూఢ నమ్మకాలను ఆశ్రయించకుండా చూడాలన్నారు. దోమ తెరలను విస్తృతంగా పంపిణీ చేయాలని, ఫాగింగ్, నీటి నిల్వ లేకుండా చూడాలన్నారు. సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాశ్రావు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతా మహంతి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, డీఎంఈ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలు కాచిగూడ (హైదరాబాద్): ప్రైవేట్ ఆస్పత్రుల్లో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలందేలా వెంటనే తగు చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) ప్రతినిధులు మంగళవారం హరీశ్‌రావును కలిసి జర్నలిస్టుల వైద్య సమస్యలపై వినతిపత్రం అందించారు. జర్నలిస్టు హెల్త్ స్కీం (జేహెచ్ఎస్) ప్రైవేట్ ఆస్పత్రుల్లో అమలు కావడం లేదని, వైద్యం చేయటానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని, దీంతో జర్నలిస్టు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యూనియన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి నిరంజన్ మంత్రికి వివరించారు. ఆయన్ను కలిసిన వారిలో హెచ్‌యూజే నాయకులు పద్మరాజు, రాజశేఖర్, అరుణ్ తదితరులున్నారు. -
సీజనల్ వ్యాధులపై 24 గంటల ‘సెల్’
సాక్షి, హైదరాబాద్: సీజనల్ వ్యాధులను నియంత్రిస్తూనే.. కరోనా వంటి వైరస్‌లను అరికట్టేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కేలెండర్ రూపొందించింది. ఏ సీజన్లో ఏయే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది... ప్రభుత్వం, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అన్న సమాచారాన్ని అందులో వివరించింది. జూలై నుంచి అక్టోబర్ మధ్య డెంగీ, మలేరియా, సీజనల్ జ్వరాలు, నవంబర్–మార్చి మధ్య స్వైన్‌ఫ్లూ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, ఏప్రిల్–జూన్ మధ్యకాలంలో వడదెబ్బ, డయేరియా వంటివి ఇబ్బంది పెడతాయని వెల్లడించింది. ఈ మేరకు సవివర సీజనల్ కేలెండర్‌ను విడుదల చేసింది. కానీ కరోనా మాత్రం సీజన్‌కు సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఎప్పుడైనా సోకే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటికే కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. పైగా కరోనా, డెంగీ వంటి వాటి లక్షణాలు సమీపంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులను ఎదుర్కొనడానికి అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేయాలని, కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కీలక పాత్ర పోషించాలని.. పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని కోరింది. ఇక సీజనల్ అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు 24 గంటలూ నడిచే ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. అంటువ్యాధులకు సంబంధించిన సమస్యలను ఈ సెల్ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని సూచించింది. -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సమీపిస్తున్న నేపథ్యం లో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. ఈ మేరకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. శుక్రవారం రాష్ట్రంలోని ఆశ కార్యకర్తలు, ఏఎన్ ఎంలతో నెల వారీ సమీక్షను మంత్రి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల మందులను సరఫరా చేస్తుంది కాబట్టి ఎక్కడా మందులు లేవనే మాట రావొద్దని స్పష్టం చేశారు. ఈ– ఔషధి ద్వారానే అన్ని రకాల మందుల పంపిణీ జరగాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్సీడీ స్క్రీనింగ్‌ను ఈ నెల చివరికల్లా వంద శాతం పూర్తి చేయాలన్నారు. రోగ నిర్ధారణ అయిన వారికి అవసరమైన మం దుల కిట్లను వెంటనే అందజేయాలని సూచించారు. పీహెచ్‌సీలు, ప్రభుత్వా సుపత్రుల్లో డెలివరీలు పెరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని, సాధారణ డెలివరీలను ప్రోత్సహించాలని చెప్పారు. ఎనీమియా ఉన్న గర్భి ణులను గుర్తించి క్రమం తప్పకుండా మందులు అందించాలని ఆదేశించారు. పుట్టిన బిడ్డలకు మొదటి గంటలోనే తల్లి పాలు అందేలా చూడాలన్నారు. గర్భిణులను ప్రసవాలు, తనిఖీల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకొస్తున్న ఆశ కార్యకర్తల కోసం ప్రత్యేక గది, కనీస సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఉన్నతాధికారులు జిల్లాల పర్యటన చేయాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓ పక్క ఒమిక్రాన్.. మరో పక్క సీజనల్ వ్యాదులు.. గర్భిణీలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే..
మాతృత్వం ఓ వరం. బిడ్డకు జన్మనిచ్చిన క్రమంలో గర్భిణులకు ఎదురయ్యే సవాళ్లు.. ఇబ్బందులు వర్ణనాతీతం. గర్భిణులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ.. శిశువును నవ మాసాలు మోస్తూ కాన్పు సమీపిస్తున్న కొద్దీ మరింత అప్రమత్తంగా ఉంటారు. రక్తహీనత, పోషకాహార లేమితో సతమతమయ్యే గర్భిణులు.. రెండేళ్లుగా కోవిడ్ విసురుతున్న సవాళ్లకు ఎదురీదుతున్నారు. కరోనా వేళ.. కాబోయే అమ్మకు అండగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. జిల్లా వైద్య శాఖ వీరి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి.. తద్వారా వారికి అవసరమైన సేవలందిస్తోంది. – సాక్షి, విశాఖపట్నం కరోనా మహమ్మారి భయపెడుతోంది. నిన్న మొన్నటివరకు పదుల సంఖ్యలో ఉన్న కేసులు నేడు వందలు దాటి వేలకు చేరుకుంటున్నాయి. ఒక పక్క ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్.. మరో పక్క సెకండ్‌వేవ్‌లో చుట్టేసిన డెల్టా వేరియంట్, సీజనల్ జ్వరాలు విస్తరిస్తున్న తరుణంలో కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కరోనా రెండో దశతో పోల్చితే థర్డ్ వేవ్‌ను ఎందుర్కొనేందుకు ముందస్తుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 7,531 ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు నోడల్ అధికారులను నియమించింది. జిల్లాలో 15 ఏళ్లు దాటిన వారికి దాదాపుగా వ్యాక్సినేషన్ పూర్తయింది. మొదటి, రెండో దశల్లో 4,012 మంది గర్భిణులు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణులు, బాలింతలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడంతో పాటు వారికి రక్షణగా నిలుస్తోంది. గర్భిణుల్లో బీపీ, మధుమేహం, ఇతర రుగ్మతలున్న వారిని ముందుగానే గుర్తించి.. వారికి వ్యాక్సినేషన్ పూర్తయిందా.. లేదా అని ఆరా తీసుకున్నారు. ఒక వేళ టీకా వేసుకోకపోతే నేరుగా వారి ఇంటికే వెళ్లి వ్యాక్సిన్ వేసే బాధ్యతను స్థానిక ఏఎన్ఎంలకు అప్పగించారు. కరోనా మూడో దశలో భారీగా కేసులు నమోదవుతున్న దృష్ట్యా.. జిల్లా ఉన్నతాధికారులు తరచూ వైద్యాధికారులు, వైద్యులతో సమీక్షలు నిర్వహిస్తూ.. అప్రమత్తం చేస్తున్నారు. మూడు నెలలు నిండిన గర్భిణి నుంచి ప్రసవం అయ్యే వరకు ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు, ప్రసవం అయిన తర్వాత శిశువుకు మెరుగైన వైద్యం అందించడం, అవగాహన కల్పించడం వంటి బాధ్యతలు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు నిర్వర్తిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. పీహెచ్సీ వైద్యాధికారుల పర్యవేక్షణలో వైద్య సేవలందిస్తున్నారు. ‘తల్లీబిడ్డ’సంరక్షణకు ప్రాధాన్యం కరోనా వేళ తల్లీబిడ్డ జాగ్రత్తగా ఉండాలంటే.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ముందుకు వెళితే ఎలాంటి వైరస్లు దరిచేరవు. ఇంటిలో ఉన్నా.. ఆస్పత్రిలో ఉన్నా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. తల్లికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక బాలింతలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. గర్భిణులు కూడా కడుపులో ఉన్న బిడ్డను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు అనుసరించాలి. పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే కరోనా కష్టకాలాన్ని సులభంగా అధిగమించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి కరోనా విజృంభిస్తున్న వేళ బాలింతలు, గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాలి. కరోనా ఉధృతి తగ్గేవరకు ఇంటికే పరిమితం కావాలి. ఇతరులతో పలకరింపులు కూడా తగ్గించుకోవాలి. జలుబు, జ్వరం, ఇతర వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. బయటకు వెళ్లే సమయంలో మాస్క్ ధరించడం..భౌతిక దూరాన్ని పాటించడం మరిచిపోవద్దు. ఈ కొద్ది కాలం గర్భిణులు, బాలింతలు జాగ్రత్తగా ఉండాల్సిందే.. – డాక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్‌వో బర్త్ వెయిటింగ్ హాళ్లు ప్రసవ సమయంలో గర్భిణులకు మరింత మెరుగైన వైద్యసేవలందించాలనే లక్ష్యంతో ‘బర్త్ వెయింటిక్ హాళ్లు–ప్రెగ్నెంట్ వుమెన్ హాస్టల్’ఏర్పాటు చేశారు. ఐటీడీఏ పరిధిలోని మొత్తం 15 బర్త్ వెయింటింగ్ హాళ్లలో కరోనా నిబంధనలు తప్పనిసరి చేశారు. ప్రసవం తేదీకి 10 రోజుల ముందు నుంచే వారి పర్యవేక్షణ బాధ్యతలు, కరోనా జాగ్రత్తలు చెప్పడంతో పాటు ఆచరించేలా చూసే బాధ్యతలను ముగ్గురు ఏఎన్ఎంలు, ఓ డాక్టర్‌కు అప్పగించారు. అనుక్షణం అప్రమత్తం ► కరోనా వేళ గర్భిణులు, బాలింతలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ► రెండు గంటలకు ఒకసారి 20–40 సెకన్ల పాటు చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో పూర్తిగా శుభ్రపరుచుకోవాలి. ► బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్‌ను ధరించాలి. ► కరోనా లక్షణాలు ఉన్న వారు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. ► ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోకపోతే వెంటనే ఏఎన్ఎంలను సంప్రదించి.. టీకా తీసుకోవాలి. ► బాలింతలు, గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ► ఇంటిలో కుటుంబ సభ్యులతో మెలిగే సమయంలో మీటరు దూరం ఉండేలా చూసుకోవడంతో పాటు వీలైనంత మేర మాస్క్ ధరించడం మంచిది. ► ఎక్కువగా జనం ఉన్న రద్దీ ప్రదేశాలకు వెళ్లకూడదు. ► ఇరుగు పొరుగు వారితో కూడా గతంలో లాగా గుంపులుగా కూర్చొని చర్చలు నిర్వహించకుండా ఇంటికే పరిమితం కావడం మంచిది. 17 అంబులెన్స్‌ల ద్వారా సేవలు జిల్లా వ్యాప్తంగా యాంటినాటల్ మెటర్నటీ చెకప్‌కు 17కు పైగా 108 అంబులెన్స్‌లను కేటాయించారు. ఐటీడీఏ పరిధిలో 8, మిగతా నియోజవర్గాల్లో 9 అంబులెన్స్‌ల ద్వారా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు, తర్వాత అంబులెన్స్ మొత్తం శానిటైజేషన్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
ఒమిక్రాన్ భారత్: అంతా అయోమయం.. గందరగోళమే!
భారత్‌లో థర్డ్ వేవ్‌ను దాదాపుగా ఒమిక్రాన్ వేవ్‌గా పరిగణిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. శరవేగంగా చొచ్చుకుపోతున్న ఈ వేరియెంట్.. ఎక్కువ మందిలో మైల్డ్ సింటమ్స్ చూపిస్తుండడం గమనార్హం. అదే టైంలో దగ్గు, జలుబు, జ్వరాల లక్షణాలతో తమకు సోకింది కరోనాయేనా? కాదా? అనే గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారు కోట్ల మంది!. భారత్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. అయితే వ్యాక్సినేషన్, తీవ్రత లేని వేరియెంట్ల వల్ల ప్రభావం తక్కువగా ఉందని ప్రభుత్వ వైద్య నిపుణులు పేర్కొంటున్నప్పటికీ.. ఒకవైపు రెండు డోసులు తీసుకున్న వాళ్లపైనా వైరస్ దాడి చేస్తుండడం, మరోవైపు ఆస్ప్రత్రుల్లో, ఐసీయూల్లో చేరుతున్న సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల పేషెంట్ల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుండడం.. కరోనా తీవ్రత ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ తరుణంలో ఒమిక్రాన్ వేరియెంట్ రానున్న రోజుల్లో మరింత విజృంభించనుందనే ప్రకటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే సామాజిక వ్యాప్తిలో ఉన్న ఒమిక్రాన్ వేరియెంట్.. ముందు ముందు మరింత ప్రభావం చూపెట్టనుందనేది కొందరు టాప్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెప్తున్నా.. ఆస్పత్రుల్లో పేషెంట్లు నిండిపోవడం, పాజిటివిటీ రేటు-మరణాలు పెరగడం, ప్రభుత్వాల తరపున టెస్ట్‌ల సంఖ్య తగ్గిపోతుండడం, లక్షణాలున్నా జనాలు టెస్టులకు ఆసక్తి చూపించకపోవడం లాంటి కారణాలు ఉంటున్నాయి. కాబట్టి, కరోనా సాధారణం అయిపోయిందన్న వాదనను పక్కనపెట్టి.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ తగ్గినా.. వారం పెరిగింది గత 24 గంటల్లో దేశంలో 3,06,064 కొత్త కేసులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించుకుంది. అంటే సగటు డెయిలీ కేసులు 8 శాతం తగ్గిందని, మరణాలు 439 నమోదు అయ్యాయని, గత ఐదు రోజుల్లో ఇవే తక్కువ మరణాలని కేంద్రం ప్రకటించింది. సాధారణంగా వారాంతంలో టెస్టులు జరిగేవి తక్కువ. తద్వారా వచ్చే ఫలితాల సంఖ్య కూడా తక్కువే ఉంటోంది. ఈ తరుణంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయంటూ ఆరోగ్య శాఖ ప్రకటన ఆశ్చర్యం కలిగించేదే!. కానీ, వీక్లీ పాజిటివిటీ రేటు గనుక చూసుకుంటే.. భారీ స్థాయిలో పెరుగుతూ వస్తోంది. కిందటి నెలలో(డిసెంబర్ 2021, 27వ తేదీన) పాజిటివిటీ రేటు 0.63 శాతంగా ఉంది. అది జనవరి 24 నాటికి 17.03 శాతానికి చేరుకుంది. కిందటి వారం మరణాలు 1,396 నమోదుకాగా.. జనవరి 17-23 తేదీల మధ్య 2,680 మరణాలు నమోదు అయ్యాయి. ఇందుకు కారణం.. ఒమిక్రాన్ వేరియెంట్‌తో ఉధృతంగా పెరుగుతున్న కరోనా కేసులే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్టీపీసీఆర్కు చిక్కకుండా.. కరోనా ఒమిక్రాన్ వేరియంట్లో ‘దొంగ ఒమిక్రాన్’ అనే ఉపరకం ఈ ఆందోళనకు మూలకారణం. ‘బీఏ.2’.. ఇది ఆర్టీపీసీఆర్ టెస్ట్ లకు దొరక్కుండా విస్తరిస్తుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒమిక్రాన్‌లో బీఏ.1, బీఏ.2, బీఏ.3 ఉపరకాలు ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ఇందులో బీఏ.1 ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో విస్తరించింది. ఇప్పుడు బీఏ.2 కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో వేరియెంట్ విస్తరిస్తున్నా.. బయటపడక పోవడానికి కారణం బీఏ.2 కేసులు.. బీఏ.1 వేరియెంట్‌ను దాటి పోవడమే కారణంగా భావిస్తున్నారు సైంటిస్టులు. బీఏ.1 మ్యూటేషన్ లో ఎస్ లేదా స్పైక్ జీన్ తొలగిపోవడం అన్నది ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో గుర్తించొచ్చు. కానీ, బీఏ.2 మ్యూటేషన్ భిన్నంగా ఉంది. దీంతో ఇది ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో చాలామందికి ‘పాజిటివ్’ నిర్ధారణ కావడం లేదు. ఫిబ్రవరిలో.. కరోనా తారాస్థాయికి చేరడం గురించి జనవరి మొదటి వారం నుంచే విస్తృతస్థాయిలో చర్చ నడుస్తోంది. ప్రస్తుత ఉధృతి కొనసాగితే.. ఫిబ్రవరి 15 నుంచి భారత్‌లో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టవచ్చని కేంద్ర వర్గాలు చెప్తున్నాయి. కానీ, ఆరోగ్య నిపుణలు మాత్రం రాబోయే వారాలే మరి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సంబంధిత వార్త: సాధారణ జలుబుగానే వచ్చి వెళ్లిపోతోందని ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దు! తలనొప్పి, గొంతులో గరగరా? -
జ్వరం, జలుబు, దగ్గుతో ఉక్కిరిబిక్కిరి.. కరోనా కావచ్చేమోనని?
సాక్షి, హైదరాబాద్: ఎల్లారెడ్డిగూడకు చెందిన సతీష్‌కు 10 రోజులుగా జలుబు, దగ్గు. రాత్రిళ్లు శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారింది. ఇంటి వైద్యాలు, అలవాటైన మందులు వాడుతున్నా తగ్గినట్టే తగ్గుతూ పెరుగుతూ ఉంది. జలుబూ దగ్గు వదలకపోవడం ఒళ్లునొప్పులు, తేలికపాటి జ్వరం.. ఇవన్నీ చూసి కరోనా పరీక్షలు చేయించుకోమంటూ సన్నిహితులు పోరు చేస్తున్నారు.. ప్రస్తుతం నగరంలో అనేక మందికి సతీష్ లాంటి పరిస్థితి ఎదురవుతోంది. తమకు వచ్చింది సాధారణ సీజనల్ సమస్యా? కరోనా? అనే సందేహాలతో సతమతమవుతున్నవారు. ఇలాంటివారు నగరంలో రోజురోజుకూ పెరుగుతున్నారు. కష్టాలు పెంచిన వర్షాలు... గత కొన్ని రోజులుగా నగరంలో చలి తీవ్రతను మించి వర్షాలు, చలిగాలుల తాకిడి ఎక్కువైంది. ఇది సహజంగానే సిటిజనుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఓ వైపు వింటర్ సీజన్. మరోవైపు అకాల వర్షాలు.. దీంతో సీజనల్‌గా వచ్చే జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్.. వంటివి మరింతగా పెరిగాయి. మరోవైపు కరోనా సైతం విజృంభిస్తుండడం దీని లక్షణాలు కూడా దాదాపుగా అవే కావడంతో ఏది సాధారణ వ్యాధో, ఏది మహమ్మారో తెలియక నగరవాసులు అయోమయానికి, భయాందోళనకు గురవుతున్నారు. పరీక్షకు వెళ్లాలంటే ఓ రకమైన భయం, వెళ్లకపోతే మరో రకమైన భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కంగారు పడవద్దని కాస్త అప్రమత్తంగా ఉంటే చాలని వైద్యులు చెబుతున్నారు. చదవండి: ‘ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించడం లేదు’ సాధారణమైతే సందేహం వద్దు.. జలుబు, దగ్గు కొందరికి సీజనల్‌గా దాదాపు ప్రతి యేటా వస్తుంటాయి. అలాంటివారికి ఈ అకాల వర్షాల వాతావరణంలో మరింత సులభంగా వస్తాయి. అంతేకాకుండా అస్తమా, డయాబెటిస్ వంటి వ్యాధులున్నా, బైపాస్ సర్జరీ చేయించుకున్నా, స్టంట్ వేయించుకున్న వారిలో సహజంగానే ఇమ్యూనిటీ తక్కువగా ఉండి శ్వాసకోస వ్యాధులు, సీజనల్ ఫ్లూ రావచ్చు. ► ఇలాంటి వారు చల్లటి వస్తువులు తీసుకోవడం, చల్లటి ప్రదేశాల్లో ఉండడం, వర్షంలో తడవాల్సి రావడం వల్ల ఈ సమస్యలు రెట్టింపవుతాయి. వెంటనే ఇది కరోనా కావచ్చని ఆందోళన చెందనక్కర్లేదు. అలాగే ఎక్కువగా బయటకు వెళ్లాల్సిన, సమూహాల్లో పనిచేయాల్సిన అవసరం లేనివాళ్లు కూడా బెంబేలెత్తనవసరం లేదు. అలాగని మరీ నిర్లక్ష్యం చేయకూడదనీ వైద్యులు చెబుతున్నారు. చదవండి: దేశీయ వ్యాక్సిన్‌తో ఒమిక్రాన్‌కి చెక్! 3 రోజులు దాటితే... తగినంత ఇమ్యూనిటీ ఉండి, సీజనల్ వ్యాధులకు గురయ్యే మెడికల్ హిస్టరీ లేనివాళ్లు, జ్వరం, ఒళ్లునొప్పులు తదితర సమస్యలు 3 రోజులు దాటి ఉంటే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవడం మంచిది. ఒకవేళ కరోనా అని తేలినా ఆందోళన చెందనవసరం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడితే 2 వారాల వ్యవధిలోనే పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ఏదేమైనా భయాందోళనలకు గురికాకపోవడం అన్నిరకాలుగా మంచిది. ఏ సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభం నుంచే వైద్యుల సలహా మేరకు నడచుకోవడం ఇప్పటి పరిస్థితుల్లో అవసరం. పాజిటివ్ పెరుగుతున్నా... తీవ్రత లేదు సీజనల్ వ్యాధులన్నీ కరోనా కావచ్చనే భయం సహజమే అయినా అన్నీ అవుతాయనుకోలేం. ఫ్లూ లక్షణాలు 3 రోజులు పైబడి ఉన్నవారికి కరోనా పరీక్షలు తప్పనిసరిగా సిఫారసు చేస్తున్నాం. అలా సిఫారసు చేస్తున్నవారిలో ప్రస్తుతం గత 10 రోజులుగా చూస్తే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారే ఎక్కువ. గతంలో ఉన్నంత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేకపోవడం మాత్రం ఊరట కలిగించే అంశం. – డా.జి.నవోదయ, కేర్ ఆస్పత్రి -
ప్రాణి చిన్నదే.. హాని పెద్దది
సాక్షి, కడప కార్పొరేషన్/రూరల్: జిల్లాలో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత లోపించడంతో దోమల వ్యాప్తి అధికమవుతోంది. దీంతో కొద్దిపాటి జ్వర లక్షణాలు కనిపించినా ప్రజలు ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. డెంగీ నిర్ధారణ పరీక్షలకు క్యూ కడుతున్నారు. జిల్లాలో 19 డెంగీ కేసులు, 13 మలేరియా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అనధికారికంగా నమోదయ్యే కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రైల్వేకోడూరుతోపాటు జిల్లా వ్యాప్తంగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. పరీక్షల పేరుతో దోపిడీ జిల్లా వ్యాప్తంగా డెంగీతోపాటు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతుండటం ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులకు వరంగా మారింది. జ్వరాలు ఎక్కువగా వస్తున్నందున ప్రజలు అది కోవిడ్ వల్ల వచ్చిందా, డెంగీ, మలేరియా, వైరల్ ఫీవరా తెలియక పరీక్షలకు వేలకు వేలు ఖర్చు చేస్తూ అవస్థలు పడుతున్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగీ, ప్లేట్లెట్ కౌంట్ పరీక్షల పేరుతో ప్రైవేటు ల్యాబ్‌ల వారు రోగుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. జిల్లాలో కడప రిమ్స్, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి, పులివెందుల ఆసుపత్రుల్లో డెంగీకి ఎలీషా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఇవి అందుబాటులో ఉన్నాయని తెలియక, అవగాహన లేక ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లి నష్టపోతున్నారు. నిజానికి ప్రభుత్వాసుపత్రుల్లోనే డెంగీ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. దడ పుట్టిస్తున్న దోమలు మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ఎక్కువగా దోమ కాటువల్లే సంభవి స్తాయి. వ్యాధి కలిగిన జీవిని ఇది కుట్టి ఆరోగ్యంగా ఉన్న మరో జీవిని కుట్టడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందేలా చేస్తాయి. వీటి ద్వారా మలేరియా, బోదకాలు, చికున్‌గున్యా, డెంగీ, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులు సంక్రమిస్తాయి. ప్రస్తుత వర్షా కాలంలో దోమల వల్ల ప్రతి ఇంట్లో జనం జ్వరాల బారిన పడటం అధికమైంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దగ్గు, జలుబు, విష జ్వరాలు జిల్లాను వణికిస్తున్నాయి. కేవలం పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. గతంలో దోమలు ఆయా కాలం, వాతావరణ పరిస్థితులను బట్టి ఉధృతంగా ఉండేవి. అయితే ఇటీవల అన్ని కాలాల్లోనూ, అన్ని వేళల్లోనూ దోమలు ఉంటున్నాయి. దోమల ఆవాసాలుగా ఖాళీ స్థలాలు: పారిశుధ్యంపై మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నిర్లక్ష్యం దోమల ఉధృతి పెరగడానికి కారణమవుతోంది. ఖాళీ స్థలాల్లో నిల్వ ఉంటున్న నీరు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, ఫాగింగ్, స్ప్రేయింగ్ సరిగా చేయకపోవడం వల్ల దోమలు ఎక్కువగా పెరుగుతున్నాయి. దోమల నివారణకు మలాథియాన్ స్ప్రేయింగ్ సక్రమంగా చేస్తున్న దాఖలాలు కన్పించడం లేదు. చాలా మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఫాగింగ్, స్ప్రేయింగ్ మెషీన్లు పనిచేయక మూలనపడ్డాయి. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్య ధోరణితో ప్రజలు మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు ఒక వైపు చెబుతున్నా తప్పని పరిస్థితి ఏర్పడుతోంది డెంగీ లక్షణాలు ♦ శరీర ఉష్ణోగ్రత పెరగడం ♦ వాంతులు, విరేచనాలు ♦ కళ్లు మంటలు, తీవ్రమైన తలనొప్పి ♦ చర్మ సమస్యలు ♦ చిగుళ్ల నుంచి రక్తస్రావం ♦ మూత్రంలో, మలంలో రక్తం పడటం ♦ కడుపు నొప్పి, జలుబు, దగ్గు ♦ నీరసం అప్రమత్తంగా ఉండాలి డెంగీ, మలేరి యా, టైఫాయిడ్ జ్వరాలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు, పెద్దలు పారాసిటమాల్ తప్ప వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులు వాడకూడదు. కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలి. 101 డిగ్రీలకు మించి జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, వాంతులు తదితర లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. – కె. నాగరాజు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి -
Corona Virus: కరోనా ట్విండెమిక్‌గా మారుతుందా?
న్యూఢిల్లీ/పిట్స్బర్గ్/మాస్కో/లండన్: అమెరికాలోని వైద్యాధికారులకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఆ దేశంలో ప్రస్తుతం శీతాకాలం జరుగుతోంది. దీంతో కరోనా రోగంతో పాటు సీజనల్‌గా వచ్చే ఫ్లూ (జలుబు) కూడా సోకుతోంది. ప్రస్తుతం కరోనాను పాండెమిక్ (మహమ్మారి) అని పిలుస్తున్న నేపథ్యంలో కరోనా, సీజనల్ ఫ్లూని కలిపి ట్విండెమిక్‌గా (రెండు పాండెమిక్‌లు కలసి) వ్యవహరిస్తారు. ఈ తరహా రూపంలో వచ్చే కేసులను ప్రస్తుతం మేథమేటికల్ మోడల్స్ ద్వారా అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరాడేందుకు తీసుకునే చర్యలు ఫ్లూకి కూడా అడ్డుకట్ట వేస్తాయని అన్నారు. మరోవైపు ఇంగ్లండ్‌లో గత మూడు వారాల్లో 20 లక్షల మందికి బూస్టర్ డోస్ ఇచ్చినట్లు యూకే ఆరోగ్య సంస్థ శనివారం ప్రకటించింది. కోవిడ్ నుంచి అత్యధిక ముప్పు ఉన్న వర్గాలను ఎంపిక చేసి వారికి వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు వెల్లడించింది. 19,740 కొత్త కరోనా కేసులు భారత్‌లో శనివారం 19,740 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,35,309కు చేరుకుంది. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 2,36,643కు తగ్గింది. గత 206 రోజుల్లో ఇదే అత్యంత కనిష్ట సంఖ్య కావడం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,32,48,291కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్త రికవరీ రేటు 97.98గా ఉంది. మరణాల శాతం 1.33గా ఉంది. ఇదిలా ఉండగా అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతంలో గత 24 గంటల్లో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో 10 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకూ 94.62 కోట్ల డోసులకు పైగా వ్యాక్సినేషన్ జరిగింది. మరోవైపు ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ.. భారత్‌కు ప్రపంచ నలుమూలల నుంచి వ్యాక్సిన్ తయారీ ముడి పదార్థాల సరఫరా కొనసాగాలని కోరారు. భారత్‌లో వ్యాక్సిన్ల తయారీ ఊపు అందుకున్న నేపథ్యంలో కోవ్యాక్స్ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి కూడా వ్యాక్సిన్లను అందించేందుకు అది ఉపకరిస్తుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ మైత్రి ద్వారా ఐక్యరాజ్య సమితి ద్వారా 2021 నాలుగో త్రైమాసికంలో వ్యాక్సిన్లను అందిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా రష్యాలో రోజూవారీ మరణాలు శనివారం ఏకంగా 968 నమోదయ్యాయి. సెపె్టంబర్ చివరి రోజులతో పోలిస్తే 100కు పైగా అధిక మరణాలు సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రష్యాలో శనివారం 29 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్లో మరణాలు 6 లక్షలు దాటాయి. ఈ నేపథ్యంలో అక్కడ పలు బార్లు నిండిపోయి కనిపిస్తున్నాయి. డెల్టా వైరస్ విస్తరిస్తోందన్న అనుమానాలు ఓ వైపు ఉండగా, ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగోలో ఎబోలా కేసు.. ప్రమాదకరమైన ఎబోలా వైరస్ సోకి మూడేళ్ల బాలుడు మరణించిన ఘటన కాంగోలో చోటు చేసుకుంది. గత అయిదు నెలలుగా కాంగోలో ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదు. అంతకు ముందు 6 మంది ఎబోలా కారణంగా మరణించారు. బాలున్ని ఆస్పత్రిలో చేర్చినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని, అక్టోబర్ 6న కన్నుమూసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరణించాక ఎబోలా పాజిటివ్‌గా తేలిందన్నారు. -
నోటి నుంచి దుర్వాసన, దగ్గు, పుండ్లతో బాధపడుతున్నారా.. ఇవి పాటిస్తే!
ఇమ్యునిటీ బలహీనంగా ఉంటే సీజనల్ వ్యాధులు ఎప్పుడూ పొంచి ఉంటాయి. ఇక జలుబు, దగ్గు వంటి వ్యాధులైతే దాడి చేస్తూనే ఉంటాయి. గొంతు పొడిబారటం, పొడి దగ్గు రావటం వీటి ప్రధాన లక్షణాలు. సాధారణంగా కఫం ఉత్పత్తికాకపోతే దగ్గు వస్తుంది. ఒక్కోసారి అయితే వైరల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీల వల్ల కూడ దగ్గు వస్తుంది. ఇది ఎక్కువకాలం కొనసాగితే ఆహారం నమలడం, మింగడంలో సమస్యలు తలెత్తుతాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ క్రానియోఫేషియల్ రీసెర్చ్ నివేదికల ప్రకారం నోరు మంట, పెదాల పగుళ్ళు, గొంతులో చికాకు, దగ్గు, నోటి పుండ్లు, దుర్వాసన వంటివి పొడిగా ఉండే నోటి లక్షణాలు. మనలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య ఇది. అయితే ఇంటిలో సులభంగా తయారు చేసుకునే రెమిడీలతో వీటినుంచి ఉపశమనం పొందవచ్చు! నిపుణులు సూచించిన ఈ చిట్కాల ద్వారా పొడిగొంతు సమస్యను ఏ విధంగా అధిగమించవచ్చో తెలుసుకుందాం.. తులసి, తేనెలతో టీ పూర్వం నుంచే మన ఆయుర్వేద శాస్త్రంలో తులసి, తేనెలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రకృతి అందించే సహజసిద్ధమైన తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఫంగల్ కారకాలు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలను నివారించడంలో తోడ్పడతాయి. అలాగే తులసిలో కూడా ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇంటి వైద్యం, నాటు వైద్యాలలో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసి, తేనెలతో తయారు చేసిన టీ పొడి దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపు కలిపిన పాలు పొడి గొంతు సమస్యలకు, దగ్గు సంబంధిత రుగ్మతలకు ఇది బాగా పనిచేస్తుంది. పసుపును ఆహారంలో భాగంగా తీసుకున్నట్టయితే వ్యాధుల బారి నుంచి కాపాడటమేకాక, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. గ్లాసు వేడిపాలల్లో, చిటికెడు పసుపు వేపి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. నెయ్యితో మిరియాల పొడి యాంటీ బ్యాక్టీరియల్ (సూక్ష్మజీవుల వినాశక), యాంటీ ఫంగల్ (తాపనివారక) లక్షణాలు నెయ్యిలో అధికంగా ఉంటాయి. ఒక టేబుల్ స్ఫూన్ వేడి నెయ్యిలో చిటికెడు మిరియాల పొడిని కలిపి తినండి. గొంతు తడిగా ఉంచడానికి ఇది బాగా పనిచేస్తుంది. అయితే దీనిని తిన్నతర్వాత ఏ విధమైన పానియాలు తాగకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ములేథి లేదా లికోరైస్ మూలిక చూర్ణం లికోరైస్ అనేది ఒక ఆయుర్వేద మూలిక. ఈ ఔషధ మొక్క రుచి తియ్యగా ఉండటం వల్ల దీనిని అతిమధురం అని కూడా అంటారు. ఈ మూలికను చిన్న ముక్కగా తుంచి, నోట్లో వేసుకుని నమలడం వల్ల రోజంతా గొంతును తడిగా ఉంచుతుంది. సాధారణంగా దీనిని శ్వాస, పేగు సంబంధిత రుగ్మతల నివారణకు వినియోగిస్తారు. ఉప్పునీరు పొడి గొంతు సమస్య నివారణకు తేలికైన, అత్యంత ప్రభావవంతమైన మరొక పద్ధతి ఉప్పు నీటి పుక్కిలింత. వేడి నీటిలో ఉప్పు కలిపి రోజుకి కనీసం రెండు సార్లైనా పుక్కిలించాలి. ఈ విధంగా చేయడం వల్ల గొంతులో పేరుకుపోయిన జిగట వంటి శ్లేష్మాన్ని కరిగించి పలచబరుస్తుంది. తక్షణ ఉపశమనానికి ఇది చక్కని మార్గం. హెర్బల్ టీ కాలుష్యం, దుమ్మూ ధూళి వల్ల గొంతులో చికాకుపుట్టించే సమస్యలకు శ్రేష్ఠమైన పరిష్కారం హెర్బల్ టీ. వీటివల్ల ఊపిరితిత్తులు కూడా ప్రభావితం అవుతాయి. పచ్చ యాలకులు, లవంగ మొగ్గలు వంటి సమాలా దినుసుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటితో తయారు చేసిన టీ తాగడం వల్ల కాలుష్యకారకాలైన ధూళికణాలు ఆరోగ్యానికి హాని తలపెట్టకుండా నిరోధించడంలో తోడ్పడుతుంది. మెంతుల డికాషన్ వివిధ రకాల గొంతు రుగ్మతలను నివారించడంతోపాటు, పలు ఆరోగ్య సమస్యల నివారణలో కూడా మెంతులు ఉపయోగపడతాయి. మెంతి గింజలను నీటిలో వేసి రంగు మారేంతవరకు ఉడికించాలి. అనంతరం ఈ డికాషన్‌ను చల్లార్చి, రోజుకు రెండు సార్లైనా పుక్కిలించాలి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా పొడి దగ్గు, గొంతు పొడిబారడం వంటి రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: Weight Loss: ప్రతి ఉదయం ఈ డ్రింక్ తాగారంటే.. మీరే ఆశ్చర్యపోతారు!! -
విషజ్వరాలూ ఆరోగ్యశ్రీలోకి..
సాక్షి, విశాఖపట్నం: సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియాతో పాటు విషజ్వర పీడితులకు కూడా ఆరోగ్యశ్రీలో వైద్యం అందించనున్నట్లు ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. విశాఖ జిల్లాలో సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు, వైద్యులతో మంగళవారం ఆయన ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. (చదవండి: ఉపాధ్యాయుడికి దేహశుద్ధి) రాష్ట్రవ్యాప్తంగా విశాఖ జిల్లాలోనే అత్యధిక మలేరియా, డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 462 డెంగీ, 708 మలేరియా, 24 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయని తెలిపారు. లోతట్టు, నీటి నిల్వలున్న ప్రాంతాలు, దోమల లార్వా నిల్వ ప్రాంతాల్లో ప్రతిరోజూ శానిటైజేషన్ చేయడమే కాకుండా వైద్య శిబిరాలు నిర్వహించేలా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశామని మంత్రి నాని చెప్పారు. అలాగే, ఐటీడీఏ పరిధిలోని పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య పరికరాలు, పరీక్షలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హాట్‌స్పాట్ ప్రాంతాల గుర్తింపు విషజ్వరాలు, డెంగీ, మలేరియాతో పాటు సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్న ప్రాంతాలను ‘హాట్ స్పాట్’ ప్రాంతాలుగా గుర్తించి.. అక్కడే వైద్య సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆళ్ల నాని వెల్లడించారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాల్లో డెంగీ ప్రబలుతున్న ప్రాంతాల్లో నిరంతరంగా ఫాగింగ్, స్ప్రే చేయిస్తున్నామని, ఏజెన్సీలో దోమ తెరలు పంపిణీ ప్రక్రియను వేగవంతంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రజలు కూడా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: Bigg Boss 5 Telugu: జనాలను పిచ్చోళ్లను చేసిన లోబో, సిరి) -
సీజనల్ వ్యాధులను నిరోధిస్తాం
సాక్షి అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో సీజనల్ వ్యాధులను నియంత్రించడానికి ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్లో సీజనల్ వ్యాధులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి వర్షాకాలంలో మలేరియా, డెంగీ, చికున్‌గున్యాలను ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎక్కువగా ఐదు జిల్లాల్లో సీజనల్ వ్యాధులు నమోదవుతున్నాయన్నారు. ప్రధానంగా.. గుంటూరు, విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి,కృష్ణా జిల్లాల్లో 1,575 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. గుంటూరు జిల్లాలో కూడా 276 డెంగీ కేసులు, 13 మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ వైద్య ఆరోగ్య శాఖతోపాటు మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారన్నారు. ఆయా జిల్లాలకు వెళ్లి ఎక్కువ కేసులు నమోదైన చోట నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే గుంటూరులో సమీక్ష నిర్వహించామని.. మంగళవారం విశాఖలో సమీక్ష నిర్వహించనున్నామని ఆళ్ల నాని తెలిపారు. దోమల వల్ల ఈ వ్యాధులు వస్తున్న నేపథ్యంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వైద్య సేవల పరంగా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కోవిడ్ మూడో వేవ్‌కు సంబంధించి కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు ఏమీ రాలేదని చెప్పారు. అయినా సీఎం వైఎస్ జగన్ పూర్తి సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. అన్ని ఆస్పత్రుల్లో సీఎస్ఐ, ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వైద్యుల నియామకం పూర్తి చేశామన్నారు. చిన్న పిల్లలకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అధికారులతో ఆళ్ల నాని సమీక్ష
సాక్షి, గుంటూరు: సీజనల్ వ్యాధులపై ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్, కిలారి రోశయ్య, ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంది. ఎక్కడైతే డెంగ్యూ, మలేరియా వ్యాధులు ఎక్కువ వస్తున్నాయో.. అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలి’’ అన్నారు. ‘‘జ్వరాలకు సంబంధించిన సర్వే చేయాలి. ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా వ్యాధులు నమోదవుతున్నాయో ఆ ప్రాంతంలో జ్వరాలకు సంబంధించిన నిర్ధారణ పరీక్షల శిబిరాలను ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంతంలోనే ప్రత్యేకంగా జ్వరాల ట్రీట్మెంట్కి సంబంధించిన స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాలి’’ అని ఆళ్ల నాని సూచించారు. (చదవండి: థర్డ్‌వేవ్ హెచ్చరికలు: ఏపీ సర్కార్ ముందస్తు ప్రణాళిక) ‘‘మురికివాడలు, ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు నీరు నిల్వ ఉండకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులను మానిటరింగ్ చేయడానికి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి నియమించాం. ఆరోగ్యశాఖ మున్సిపల్ పంచాయితీ శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో పనిచేయాలి. మందులు అందుబాటులో ఉంచాలి. ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం’’ అని ఆళ్ల నాని తెలిపారు. చదవండి: పకడ్బందీ ప్రణాళికతో కరోనాకు చెక్ -
‘డెంగీ’ఉంది..‘జ్వర’భద్రం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సీజనల్ వ్యాధుల పెరుగుదలతో పాటు డెంగీ వ్యాప్తి అత్యధికంగా ఉన్నందున జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని అది డెంగీనా లేక కరోనా అన్నది నిర్ధారించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, అయితే ఇదే సమయంలోనూ కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రధానంగా డెంగీ, కరోనాలకు సంబంధించిన లక్షణాలు దాదాపుగా ఒకే విధంగా ఉన్నందున కచ్చితమైన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, వేడుకలు అంటూ విపరీతంగా తిరిగేస్తున్నారని, ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లోనూ ఇలా ఏదైనా సమూహంలో గడిపి వచ్చిన వారిలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులుంటున్నాయని స్పష్టం చేస్తున్నారు. కుటుంబంలోని ఒకరికి వస్తే సహజంగానే అందరూ దాని బారిన పడుతున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాలు పెరుగుతున్నందున వాటి లక్షణాలు, కరోనా నేపథ్యంలో ఎలాంటి పరీక్షలు చేయించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’తో పల్మనాలజిస్ట్ డా.వి.వి.రమణప్రసాద్, కన్సల్టెంట్ ఫిజీషియన్ డా.ప్రభుకుమార్ చల్లగాలి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే... డెంగీ వచ్చిన వారిలో కూడా కరోనా పాజిటివ్ లక్షణాల మాదిరే దగ్గు, జ్వరం, గొంతునొప్పి ఉంటున్నాయి. వీరి పరీక్షల్లో తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు డెంగీ పాజిటివ్‌గా ఉంటోంది. సీజనల్ ఫ్లూ, వైరల్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించి డెంగీ ఇతర సీజనల్ వ్యాధులను నిర్ధారించుకోవాల్సి ఉంది. ముందుగా కరోనా ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. డెంగీ లక్షణాలు ఉండి, ఆర్టీపీసీఆర్లో కరోనా నెగెటివ్ వచ్చినా ఐదురోజుల తర్వాత దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలుంటే సీటీ స్కాన్‌తో నిర్ధారించాల్సి వస్తోంది. డెంగీకి ర్యాపిడ్టెస్ట్ మాదిరి ఎన్సెస్ వన్ యాంటీజెన్, డెంగీ సీరోలజీ టెస్ట్‌లు చేసి నిర్ధారిస్తున్నాము. ప్రస్తుతం డెంగీ సీజన్ కావడంతో ఈ కేసులు పెద్ద సంఖ్యలోనే వస్తున్నాయి. ఆస్తమా, దీర్ఘకాలిక బ్రాంకైటిస్, గొంతునొప్పి, ఇతర వైరల్ లక్షణాలున్న సీజనల్ వ్యాధుల కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. మళ్లీ టీబీ కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల వీటన్నింటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. డా.వి.వి.రమణప్రసాద్, పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్, కిమ్స్ ఆస్పత్రి ప్రతీరోజు వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగీకి సంబంధించి కేసులు నమోదవుతున్నాయి. వాటిలో కొన్ని కోవిడ్ కేసులుంటున్నాయి. గతానికి భిన్నంగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ, కోవిడ్, ఊపిరితిత్తుల సమస్యలు, అన్నీ చలిజ్వరంతో వస్తున్నాయి. ఒళ్లు, కంటి నొప్పులు, ఎముకలు చిట్లేంత నొప్పులు, కీళ్లు, కండరాలు, కంటి వెనక నొప్పులు ఇలా రకరకాల నొప్పులతో జ్వరాలు వస్తుండటంతో వైద్యపరీక్షలతో నిర్ధారించుకోవాల్సి వస్తోంది. ఈ జ్వరాలతో రోగులకు విపరీతమైన బలహీనత, తట్టుకోలేని నొప్పులతోపాటు కడుపు ఉబ్బరం, అసౌకర్యంగా ఉండటం వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. వర్షాకాలంలో నీటిలో కాలుష్యం పెరగడం, దోమలు, ఈగలు పెరిగిపోవడం, ప్రధానంగా ఆహారం, మంచినీరు వంటివి కలుషితం కావడంతో జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. డెంగీలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంతోపాటు పొట్టలో రక్తస్రావం అయ్యి, కాళ్ల రక్తనాళాల రంగుమార్పు, నల్లటిరంగులో మలవిసర్జన వంటివి జరుగుతాయి. వీటిని బట్టి ఎక్కడో రక్తస్రావం అవుతుందని గ్రహించాలి. అవసరమైన డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ప్లేట్లెట్ల సంఖ్యను జాగ్రత్తగా గమనిస్తూ, చికిత్స తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ప్రతీ జిల్లాలో ప్లేట్లెట్ల యూనిట్లను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూడాలి. – డా. ప్రభుకుమార్ చల్లగాలి, కన్సల్టెంట్ ఫిజిషియన్, వృందాశ్రీ జూబ్లీ క్లినిక్ సరైన సమయంలో చికిత్సతోనే... ఒకరోజు అకస్మాత్తుగా గొంతునొప్పితో కూడిన చలిజ్వరం వచ్చింది. మూడు రోజుల తర్వాత మా కుటుంబవైద్యుడి దగ్గరకు వెళ్లాను. వైరల్ జ్వరం అనే అనుమానంతో అన్ని వైద్యపరీక్షలు చేయించారు. డెంగీ జ్వరం నిర్ధారణ అయింది. ఇంట్లోనే ఉంటూ తగిన చికిత్స తీసుకున్నాను. రెండు మూడు రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. ఐతే ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులకు కూడా ఇవే లక్షణాలతో జ్వరం వచ్చింది. వారుకూడా ఫోన్లోనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడారు. ఇప్పుడు అందరూ కోలుకున్నారు. –అప్పరాజు అనిల్ కృష్ణ, మణికొండ -
రాష్ట్రంలో సెకండ్ వేవ్ ముగిసింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ముగిసిపోయిందని, కానీ థర్డ్ వేవ్ రాకుండా కోవిడ్ మార్గదర్శకాలను పాటించాల్సిందేనని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1.65 కోట్ల మందికి టీకాలిచ్చామన్నారు. 56 శాతం మందికి తొలి డోస్, 34 శాతం మందికి రెండో డోస్ పూర్తయిందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 90 శాతం మందికి తొలి డోసు వేయగా, హైదరాబాద్‌లో 100 శాతం సింగిల్ డోసు తీసుకున్నట్లు ఆయన బుధవారం మీడియాకు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటింటికీ తిరికి వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పోస్ట్ కోవిడ్‌తో ఆస్పత్రుల్లో ఎక్కువమంది ఉన్నారని, లాంగ్ టర్మ్ కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా మానసిక సమస్యలు పెరుగుతున్నాయన్నారు. అయితే అన్ని జ్వరాలను కరోనాగా భావించవద్దని, జ్వర లక్షణాలు ఉన్నోళ్లంతా వైద్యుడిని సంప్రదించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, అయితే ఈ వ్యాధులు పెరగకుండా వైద్య,ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోందన్నారు. రెండు జిల్లాల్లో అధికంగా డెంగీ కేసులు హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు అత్యధికంగా రాగా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో మలేరియా కేసులు ఎక్కువగా వచ్చాయని శ్రీనివాసరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 220, ములుగు జిల్లాలో 120పైగా మలేరియా కేసులు నమోదైనట్లు చెప్పారు. గతేడాది రాష్ట్రంలో 2,173 డెంగీ కేసులు నమోదైతే, ఈ ఏడాది ఇప్పటికే 1,200 నమోదయ్యాయన్నారు. అందులో 448 డెంగీ కేసులు హైదరాబాద్‌లో నమోదయ్యాయన్నారు. దోమలు, లార్వా అభివృద్ధి చెందకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. లార్వాను సూచించే బృటా ఇండెక్స్ హైదరాబాద్‌లో 46 శాతం, రంగారెడ్డి జిల్లాలో 39.9 శాతం ఉందన్నారు. అనేక జిల్లాల్లో ఇది 35 శాతం కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. ‘ఎవరికైనా జ్వరం, విరేచనాలు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. పెద్ద ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. డెంగీ చికిత్స కోసం 24 ప్లేట్లెట్ ఎలక్ట్రిక్ యంత్రాలను సిద్ధంగా ఉంచాం. పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. డెంగీ దోమ పగటి వేళలోనే కుడుతుందని, అందువల్ల ఇళ్లలోకి దోమలు రాకుండా చూసుకోవాలన్నారు. 2025లోపు తెలంగాణను మలేరియారహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. చదవండి: ప్రేయసి కోసం ‘ఆమె’లా మారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన లవర్ చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ -
రాష్ట్రంలో అటు కరోనా.. ఇటు సీజనల్ వ్యాధుల దాడి
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కరోనా భయపెడుతుంటే, మరోవైపు సీజనల్ జ్వరాలతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నెలన్నర రోజుల్లో దాదాపు 10 లక్షల మంది జ్వరాల బారినపడినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. ఇందులో అనేకమంది కరోనా రోగులుండగా.. మరింత మంది సాధారణ, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి జ్వరాలకు గురయ్యారు. కొందరికి డెంగీతో పాటు కరోనా కూడా సోకుతోందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒకే వ్యక్తికి కరోనాతోపాటు డెంగీ, మలేరియా పరీక్షలు కూడా చేయాల్సి వస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 352 డెంగీ కేసులు, 374 మలేరియా కేసులు నమోదు కాగా, అందులో గత 20 రోజుల్లోనే 52 డెంగీ, 41 మలేరియా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు డెంగీ కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంటింటా జరుపుతున్న పరీక్షల్లో లక్షలాది జ్వరం కేసులు గుర్తిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు రోజుకు దాదాపు లక్షన్నర మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇలా పరీక్షలకు వచ్చే వారిలో చాలామంది జ్వరాలతోనే వస్తున్నారు. ఈ క్రమం లో హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రికి వచ్చే ఔట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. అలాగే మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి పది రోజుల కిందట 1,400 ఔట్పేషెంట్లు (ఓపీ) రాగా, బుధవారం 1,800 ఓపీ నమోదైంది. ఇక్కడ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 12 డెంగీ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాధారణ జ్వరాలతో పాటు డెంగీ, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం జిల్లాల్లో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చినా, అక్కడ అన్ని పరీక్షలు చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చాలావరకు ప్రాథమిక ఆస్పత్రుల్లో మందులు, ఇంజెక్షన్లు ఉండటం లేదని, చీటీలు రాసి ఇచ్చి బయట తెచ్చుకోవాలని చెబుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. కొన్నిచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వేలు గుంజుతున్న ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పటివరకు కరోనాతో దండుకొన్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రస్తుతం సీజనల్ వ్యాధులను సొమ్ము చేసుకుంటున్నాయి. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు రక్త పరీక్షలు, ప్లేట్లెట్ల పేరుతో బాధితుల నుంచి వేలకు వేలు గుంజుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిన ఒక బాధితుడికి వింతైన అనుభవం ఎదురైంది. సాధారణ జ్వరం వచ్చిందని వెళితే సీబీపీ, ఈఎస్సార్, డెంగీ టెస్టులు చేయాలని డాక్టర్ సూచించాడు. అందుకోసం అదే ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోగా ఏకంగా రూ.9 వేల బిల్లు వేశారు. ఇక ప్లేట్లెట్లను ఎక్కిస్తే రూ. 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు హైదరాబాద్‌లో ఎన్నో ఉన్నాయి. సాధారణ ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్లేట్లెట్లు 40 వేల దిగువకు పడిపోతేనే సమస్య ఉంటుందని వైద్యులు అంటున్నారు. కానీ 50 వేలున్నా తక్కువ ఉన్నాయంటూ ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత కారణంగానే రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. చలి జ్వరం వస్తే మలేరియా వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత సీజనల్ జ్వరాలు పెరుగుతాయని వైద్య ఆరోగ్యశాఖ చెబుతుంది. ఏజెన్సీలో మలేరియా, ఇతర ప్రాంతాల్లో డెంగీ జ్వరాలు అధికంగా వ్యాపిస్తాయి. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ జ్వరాలను రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు సూచిస్తున్నాయి. మలేరియా వ్యాధి సోకితే చలి, వణుకుతో మొదలై జ్వరం వస్తుంది. చలి ప్రారంభమైనప్పుడే తలనొప్పి, ఒళ్లు నొప్పులు కూడా వస్తాయి. తర్వాత చలి బాగా పెరిగి ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా వణుకు తగ్గదు. జ్వర తీవ్రత తగ్గినప్పుడు విపరీతంగా చెమట పడుతుంది. ఈ జ్వరం ప్రతిరోజూ లేక రోజు విడిచి రోజు లేక నాలుగు రోజులకు ఒకసారి వస్తుంది. డెంగీలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి డెంగీలో ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది. డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇలా.. – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ జ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. జ్వరాలతో ఆసుపత్రులకు వచ్చే వారికి తీవ్రతను బట్టి మూడు నుంచి ఐదు రోజులకు మందులు ఇస్తున్నారు. కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో వైద్యులు సమయానికి విధులకు హాజరుకావడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇక భద్రాచలం ఏరియా ఆస్పత్రికి ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా సీజనల్ వ్యాధులతో ప్రజలు వస్తున్నారు. దీంతో పడకలు సరిపోవడం లేదు. ఈ ఆసుపత్రిలో డెంగీ కిట్లు అందుబాటులో లేవు. – మహబూబ్‌నగర్‌లో జిల్లాలో కూడా విష జ్వరాలు మొదలయ్యాయి. జనరల్ ఆస్పత్రిలో వైద్యులు రెగ్యులర్‌గా వస్తున్నా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎవరూ అందుబాటులో ఉండడం లేదనే విమర్శలున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం పది మంది వరకు బాధితులు సాధారణ జ్వరాలతో ఆసుపత్రికి వస్తున్నారు. – అదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 17 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఒక మలేరియా కేసు నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లాలో 41 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో బాధితులకు మందులు బయట కొనుక్కోవాలని చెబుతున్నట్టు సమాచారం. మంచిర్యాల జిల్లాలో 11 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లోని కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని బాధితులు చెబుతున్నారు. – ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌లో డెంగీకి సంబంధించిన ఎలిసా టెస్ట్ అందుబాటులో ఉంది. కానీ 90 శాంపిళ్లు వచ్చినప్పుడు మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. దీంతో బాధితులకు సకాలంలో వైద్యం అందడం లేదు. గత రెండ్రోజుల్లో ఐదుగురికి మలేరియా పాజిటివ్‌గా తేలింది. మందులు అందుబాటులో ఉంచాలి కొత్తగూడెం ఆస్పత్రిలో జ్వరానికి సంబంధించి కొన్ని మందులు లేకపోవడం వల్ల బయట షాపులకు వెళ్లి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. – మౌనిక, కొత్తగూడెం వైద్యులు సమయపాలన పాటించాలి ఆసుపత్రి వైద్యులు సమయపాలన పాటించాల్సిన అవసరం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు నిత్యం అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి. – లక్ష్మి, రుద్రంపూర్ ప్లేట్లెట్ కౌంట్ మిషిన్ పనిచేయడం లేదు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో డెంగీకి సంబంధించి ప్లేట్ లెట్స్ కౌంట్ మిషన్ పనిచేయడం లేదు. దీనివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధుల సమయంలో బాగు చేయాల్సిన అవసరం ఉంది. – పుష్ప, వెంకటాపురం టీటీ ఇంజెక్షన్లు లేవు కాలికి గాయమై కల్వకుర్తి కమ్యూనిటీ ఆసుపత్రికి వెళితే అక్కడ టీటీ ఇంజెక్షన్ కూడా అందుబాటులో లేదు. ఆసుపత్రి సిబ్బంది చీటీ రాసి ఇచ్చి తెచ్చుకోమన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే వారే దుకాణానికి వెళ్లి తెచ్చిచ్చారు. చదువుకున్నవారి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక నిరక్షరాస్యులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థం అవుతుంది. ఉన్నతాధికారులు ఆసుపత్రిలో మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉండేలా చూడాలి. –జ్యోతి ప్రసాద్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ -
కరోనా కాలంలో పిల్లలకు సీజనల్ జ్వరాలు.. జాగ్రత్తలు
ప్రపంచమంతా ఇప్పుడు కరోనా మహమ్మారితో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఏ చిన్న జ్వరం వచ్చినా అది కరోనాయే అనేంత ఆందోళన. ప్రతి జ్వరమూ కరోనా కాకపోవచ్చు. అయితే పిల్లల్లో వచ్చిన జ్వరం కరోనా వల్లనా కాదా అన్నది పరీక్షలు లేకుండా చెప్పలేంగానీ... సాధారణంగా ఈ సమయంలో జ్వరాలూ, జబ్బులు ముసిరే సీజన్. జూన్ నెల ఆఖరికి వస్తూ జులైలో ప్రవేశిస్తున్న ఈ సమయంలో అనేక సీజనల్ వ్యాధులు వచ్చే టైమిది. అందుకే ప్రతి జ్వరాన్నీ కోవిడ్–19గా అనుమానించనక్కర్లేదనీ, అలా అనుమానించి ఆందోళన చెందక్కర్లేదని తెలుసుకోవాల్సిన సీజన్ ఇది. ఇలాంటి సీజన్లో పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సీజనల్ జ్వరాలకు ఎలాంటి నివారణ చర్యలు అవసరం అనే అంశాలపై అవగాహన కోసం ఈ కథనం... చినుకు పడీ పడగానే దోమలు వచ్చేస్తాయి. వాన నీరు వచ్చీ రాగానే పుట్టే దోమల వల్ల మలేరియా, డెంగీ వంటి జ్వరాలు వచ్చే సంగతి మనకు తెలుసు. అలాగే చిత్తడితో కలుషితమైన నీళ్ల కారణంగా డయేరియా, నీళ్ల విరేచనాలు మొదలుకొని టైఫాయిడ్ వరకూ జబ్బులు చుట్టుముడతాయి. ఇదే సమయంలో సీజనల్‌గా వచ్చే ఫ్లూ ఎప్పుడూ కాచుకుని ఉంటుంది. అయితే ఈ జబ్బులన్నింటిలో ఉండే లక్షణాలన్నీ కరోనాలోనూ కనిపిస్తాయి. అలాంటప్పుడు చిన్నారికి వచ్చింది కరోనాయేనా, కాదా అనే సందేహాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తాయి. మూడు రోజులూ వేచి చూడండి... పిల్లలకు ఈ సీజన్లో వచ్చే జబ్బు మలేరియా, డెంగీ, డయేరియా, టైఫాయిడ్, ఫ్లూ ఏదైనా సరే... మొదట కనిపించే లక్షణం జ్వరమే. దాంతోపాటు పిల్లల్లో తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, ఒళ్లునొప్పులు, కడుపు నొప్పితో పాటు వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇక ఫ్లూ అయితే దాదాపుగా కరోనానే పూర్తిగా పోలి ఉంటుంది. పైగా అది కరోనా మాదిరిగానే నీటితుంపర్లతోనే వ్యాప్తి చెందుతుంది. అందువల్ల వచ్చే జ్వరం ఏదైనా లేదా కరోనా వల్లనే అయినా తొలిరోజుల్లో జ్వరాన్ని నియంత్రించడానికి వాడాల్సింది తగిన మోతాదులో పారసిటమాల్ వంటి మాత్రమేనన్న విషయం మనకు తెలిసిందే. అందుకే జ్వరం రాగానే ఆందోళన లేకుండా పారాసిటమాల్ మొదలుపెట్టాలి. అది సాధారణ ఫ్లూ అయితే మూడు రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. ఇక నీటికాలుష్యం కారణంగా కలిగే డయేరియా, నీళ్లవిరేచనాల విషయంలోనూ జ్వరం ఉంటే పారసిటమాల్‌తో పాటు వాంతులు, నీళ్లవిరేచనాల వల్ల కోల్పోయిన నీటిని భర్తీ చేసేందుకు ఓఆర్ఎస్, ఆరోగ్యకరమైన ద్రవాహారాలు ఇస్తూ వీటి విషయంలోనూ మూడు రోజులు ఆగవచ్చు. ఇలాంటివన్నీ తమంతట తామే అదుపులోకి వచ్చే (సెల్ఫ్ లిమిటింగ్) జ్వరాలు అయినందున మూడు రోజుల్లో వాటి స్వభావం తెలిసి రావడం లేదా జ్వరం పూర్తిగా తగ్గిపోవడంతో తల్లిదండ్రుల ఆందోళన దూరమవుతుంది. అలా కాకుండా అది మలేరియా, డెంగీ లేదా టైఫాయిడ్ లాంటి జ్వరాలైతే వాటి లక్షణాలూ కాస్తంత పరిశీలనతో మనకు తెలిసిపోతుంటాయి. ఉదాహరణకు మలేరియా అయితే నిర్ణీత వ్యవధి లో చలిజ్వరం మాటిమాటికీ తిరగబెడుతూ ఉండటం, డెంగీ లాంటివి అయితే తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం, ఒంటిపైన ర్యాష్ వంటివి కనిపించడం (కొన్ని అరుదైన కేసుల్లో కరోనాలోనూ ఒంటిపైన ర్యాష్ రావచ్చు) జరుగుతాయి. దాంతో అవి వాటంతట అవే తగ్గక హాస్పిటల్‌కు తీసుకోరావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది కరోనా కాదని తేలడం ఇక్కడ ఒక చిన్న ఊరటే అయినా హాస్పిటల్ కోసం పిల్లలను బయటకు తీసుకెళ్లాల్సి రావడంతో మళ్లీ కరోనా ముప్పు పొంచి ఉంటుంది. అందువల్ల జ్వరం ఏదైనప్పటికీ తొలి మూడు రోజులూ ఒకింత టెన్షన్‌గా ఉన్నప్పటికీ సందర్భాన్ని, లక్షణాలను బట్టి పారాసిటమాల్, ఓఆర్ఎస్, ద్రవాహారాలు వంటి సాధారణ మెడికేషన్ సరిపోతుంది. మూడు రోజులు దాటాక... తొలి మూడు రోజులూ దాటాక కూడా పిల్లల శ్వాసప్రక్రియ చాలా వేగంగా జరుగుతూ ఉండటం, చిన్నారులు ఆయాసపడటం, మూత్రం పరిమాణం తగ్గడం, అన్నం తినడానికి నిరాకరించడం, చంటిపిల్లలైతే పాలు సరిగా తాగకపోవడం, పొట్టలో విపరీతమైన నొప్పి, వాంతులు, విరేచనాలు ఆగకుండా అదేపనిగా కొనసాగుతూ ఉంటే వెంటనే తప్పనిసరిగా పిల్లల డాక్టర్‌ను కలవాలి. పిల్లలపై మానసిక ఒత్తిడి పడకుండా నివారించడం ఎలా... తాము మునపటిలా బయటకు వెళ్లి ఆడుకోలేకపోవడం, స్కూలు లేకపోవడంతో తమ ఈడు పిల్లలతో కలయిక (సోషలైజింగ్) తగ్గడం, ప్రస్తుత కరోనా సీజన్లో... పరిసరాల్లోనూ లేదా తెలిసినవాళ్లలోనూ ఎవరో ఒకరు కరోనా బారిన పడుతుండటం, మరోవైపున సీజనల్ జ్వరాలు ముప్పిరిగొనడంతో వాళ్ల లేత మనసులు ఆందోళనకు గురవుతాయి. ఈ అంశం వారి పసి మనసులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అలా జరగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... చిన్న చిన్న పిల్లల్లో (ఎనిమిదేళ్ల లోపు)... పిల్లలు అటెన్షన్‌ను ఎక్కువగా కోరుకుంటారు. తల్లిదండ్రులు వాళ్లకు నాణ్యమైన సమయం (క్వాలిటీ టైమ్) కేటాయించి, ఎలాంటి పరిస్థితి ఎదురైనా తాము ఉన్నామనీ, ఎప్పుడూ అండగా ఉంటామనే ధైర్యం చెబుతూ, వాళ్లలో ఆత్మస్థైర్యం నింపాలి. ఇప్పుడున్న స్థితిలో వాళ్లను అయోమయంలో ఉంచకుండా... కోవిడ్ అంటే ఏమిటి; ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలా తీసుకుంటే ఏమీ కాదనేలా వాళ్లకు అవగాహన కల్పించాలి. ఇలాంటి చర్యలన్నీ వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం కరోనా మహమ్మారి గురించీ, ఇతరత్రా జబ్బుల గురించి ఆలోచించేలా కాకుండా వాళ్లను ఏదో వ్యాపకంలో నిమగ్నం చేయడంతో ఉంచడంతోపాటు, వాళ్లకు వ్యాధినిరోధక శక్తిని (ఇమ్యూనిటీని) పెంచుతాయి. కరోనాతో పాటు ఈ సీజనల్ జబ్బులను ఎదుర్కోడానికీ ఈ వ్యాధి నిరోధక శక్తి వాళ్లకు బాగా ఉపకరిస్తుంది. ఇతర జబ్బులతో బాధపడే పిల్లల కోసం... పిల్లందరూ పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉండరు. కొంతమంది పిల్లలు పుట్టుకతోగానీ లేదా ఆ తర్వాతగానీ కొన్ని ఇతర రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవారు ఉంటారు. ఉదాహరణకు ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ ఏక్టివిటీ డిజార్డర్, సెరిబ్రల్ పాల్సీ, పెరుగుదల లోపాలు (డెవలప్మెంట్ డిలే) లాంటి సమస్యలతో బాధపడే పిల్లలు ప్రస్తుత లాక్డౌన్ / ఆంక్షల సమయంలో ఇతరత్రా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. దానికి తోడు ఈ సమయంలో వాళ్లకు ఒకవేళ సీజనల్ జబ్బులు వస్తే పరిస్థితి మరికొంత సమస్యాత్మకంగా మారవచ్చు. ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు వాళ్ల వాళ్ల సంబంధిత డాక్టర్ల ఫోన్ నంబర్లను సంసిద్ధంగా ఉంచుకోవడం, అవసరమైతే వాళ్లతో తక్షణం సంప్రదించేలాంటి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే గుండెసమస్యలు, క్యాన్సర్ల వంటి తీవ్రమైన జబ్బులు ఉన్న పిల్లల విషయంలో చికిత్సను అందించే డాక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలి. సీజనల్ జబ్బుల నివారణ కోసం... టఈ సీజన్‌లోని దాదాపు అన్ని వ్యాధులతో జ్వరాలు, ఇతర లక్షణాలకు ఓ ప్రధాన కారణం కలుషితమైన నీరే. కాబట్టి వీలైనంతవరకు ఈ సీజన్ అంతా నీటిని కాచి చల్లార్చి తాగాలి. టపల్లెవాసులు కుండల్లో, బిందెల్లో ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉన్న నీటిని తాగకూడదు. వీలైతే రోజూ నీటిని మార్చడం... కుదరకపోతే నల్లా (కుళాయి)లో మంచినీళ్లను రోజు విడిచి రోజైనా పట్టుకుని వాడటం మంచిది. టనీటిని క్లోరినేషన్ ద్వారా శుభ్రం చేసి తాగడం మేలు. టబయటి ఆహార పదార్థాలు ఈ సీజన్లో వద్దు. టఇంట్లోనే వండిన పదర్థాలను అవి వేడిగా ఉండగానే తినడం మంచిది. వండటానికి వీలైనంతవరకు తాజా పదార్థాలనే వాడాలి. నిల్వ ఉన్నవి అంత మంచిది కాదు. చల్లారిన ఆహారాన్ని వూటి వూటికీ వేడి చేసి తినడం సరికాదు. టవూంసాహారం కంటే శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. మాంసాహారం తినాల్సి వస్తే అప్పటికప్పుడు తాజాగా తెచ్చుకోవాలి. ఫ్రిజ్æలో చాలారోజుల పాటు నిల్వ ఉన్నది అంత మంచిదికాదు. టపరిసరాల పరిశుభ్రత పాటించాలి. పరిసరాలన్నీ చాలా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తాయి కాబట్టి వాటిని మన ఇంటి ఆవరణల్లో, పరిసరాల్లో ఉంచకుండా (పోగు కాకుండా) జాగ్రత్త పడాలి. టమురుగు నీటి కాల్వల నీళ్లు... మంచినీటి పైప్‌లతో కలవకుండా జాగ్రత్త పడాలి. (ఇది సామాజికంగా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్త). టఈ సీజన్లో దోవులతో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోడానికి శరీరవుంతా కప్పే దుస్తులు వేసుకోవాలి. టవ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వుల, వుూత్ర విసర్జనకు వుుందు, తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో లేదా బూడిదతో కడుక్కోవాలి. టసింక్లో ఉన్న పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. కొందరు తమ వంట పాత్రలనూ, ఇంట్లోని కంచాలు, ఇతర సామగ్రిని వుట్టితో శుభ్రం చేస్తారు. అలా ఎప్పుడూ చేయవద్దు. పాత్రలు శుభ్రం చేసే సవుయంలో సబ్బు వాడాలి. పల్లెటూళ్లలో అలా సబ్బు అందుబాటులో లేకపోతే బూడిదతో శుభ్రం చేయాలి. డాక్టర్ ఎమ్. అరవింద్ కుమార్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ -
భయం పోయి భరోసా రావాలి!
రుతుపవనాలు ఈసారీ సకాలంలోనే పలుకరించి వెళ్లాయి. మళ్లీ వర్షాలు లేక తెలుగునాట రైతాంగం దిగాలుగా ఉంది. ఆందోళన చెందాల్సిన పని లేదు, వర్షాలున్నాయని వాతావరణ విభాగం చెబు తోంది. ప్రస్తుతం గాలులు బలహీనంగా ఉండి వర్షాలు కాస్త ఆలస్యమవుతున్నాయే తప్ప. రైతులు నిశ్చింతగా సాగుకు సన్నద్ధం కావొచ్చని భరోసా ఇస్తున్నారు. అయిదారు రోజుల్లోపే గాలులు బలపడి వర్షాలు కురియవచ్చంటున్నారు. వ్యవసాయ శాఖా నింగి చూపులతో, వాన కోసం నిరీక్షి స్తోంది. ఈ క్రమంలో రైతాంగం గ్రహించాల్సింది ఒకటే! రుతుపవన గమనంపైన, కారణమయ్యే గాలులపైన ‘వాతావరణ మార్పులు’ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మనిషి విపరీత చేష్టల వల్ల పుట్టే పలు కాలుష్యాలు, కర్బన ఉద్గారాలు, భూతాపోన్నతి వంటివి ఈ మార్పులకు కారణం! ఫలితంగా వర్షాల రాకలో అనిశ్చితి నెలకొంటోంది. గడచిన అయిదారు సంవత్సరాల అనుభవాల్ని పరిశీలించినా... వర్షరుతువే కాస్త వెనక్కి జరిగిన భావన కలుగుతోంది. జూన్ రెండో భాగం, జూలై మాసాల్లో రావాల్సిన వర్షాలు జూలై రెండో భాగం, ఆగస్టు... ఒకోసారి సెప్టెంబరు నెలల్లో భారీగా కురుస్తున్నాయి. ఇటీవల ఏడాది పొడుగునా అడపా దడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. తేమ శాతం పెరిగి వర్షాలకు డోకా ఉండటం లేదు, ఎటొచ్చీ వానలు కురిసే సమయమే సరిగా లేక రైతు గందరగోళానికి గురవుతున్నాడు. ఇదంతా వాతావరణ మార్పు ప్రభావమే! రైతాంగం ఈ వాస్తవాన్ని గ్రహించి పంటల ఎంపిక, విత్తే సమయం, భరోసా ఇచ్చే గట్టి వర్షాల వరకు వేచిచూడటం, అంతర పంటలు తదదితరాల్లో వ్యూహాలు–ఎత్తుగడలను మార్చుకోవాల్సి ఉంది. వ్యవసాయ శాఖ అప్రమ త్తమై రైతులతో నిరంతర సంపర్కం జరపాలి. గరిష్ట ప్రయోజనం కలిగేలా సూచనలు, సలహాలి వ్వాలి. కానీ, వాస్తవంలో అలా జరగటం లేదు. అందుకే రైతులిప్పుడు ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా తొలకరి వానల మురిపెంతో పంట విత్తిన వారు విత్తనం, తమ శ్రమ... రెంటినీ నష్ట పోవాల్సి వస్తోంది. మరో నాలుగయిదు రోజులు వర్షాలు రాకుంటే... ఎండవేడికి విత్తనం మట్టిలో మాడిపోతుంది. మళ్లీ విత్తుకోవాల్సి వస్తుంది. ఇదంతా నష్టమే! తెలంగాణలో ఇప్పటిరవకు 2.20 లక్షల ఎకరాల్లో విత్తనం వేస్తే, అందులో 1.79 లక్షల ఎకరాలు వాణిజ్య పంటైన పత్తి వేశారు. వాతావరణ మార్పుల్లో భాగమైన ‘లానినో’, నైరుతి రుతుపవనాలతో స్థూలంగా మనకు వర్షాలు బాగానే పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సీజన్ సగటు వర్షపాతం 566 మిల్లీమీటర్లు కాగా గత యేడు 720 మి.మీ కురిసింది. తెలంగాణలో సాధారణ వర్షపాతం 720.4 మి.మీ కాగా నిరుడు 1043.4 మి.మీ పడింది. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి. అంతకు ముందు, ‘ఎల్‌నినో’ ప్రభావం వల్ల ప్రతికూల పరిస్థితి ఉండి, వర్షాలు కురవక కరువు తలెత్తింది. బంగాళఖాతంలో పేరుకుపోయిన మృతికపొరల్ని తవ్వితీసి, జరిపిన ఓ అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. దక్షిణాసియా దేశాల్లో దీర్ఘకాలంగా రుతుపవన క్రమం, వాతావరణ మార్పు ప్రభావంపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు, తేమ పెరిగి ఎక్కువ విడతలు అధిక, అసాధారణ వర్షాలే కురుస్తున్నట్టు నిర్ధారించారు. ఈ తేడాల్ని రైతులు, వ్యవసాయ నిపుణులు, ప్రభుత్వాధికారులు గుర్తించాలి. అప్పుడే, తగిన చర్యలకు ఆస్కారం. ఈ యేడు కూడా జూన్ 3న కేరళ తీరం తాకిన నైరుతి రుతుపవనాలు అత్యంత వేగంగా రెండు తెలుగు రాష్ట్రాలను చేరాయి. 4, 5 తేదీల్లో ఏపీని, 6, 7 తేదీల్లో తెలంగాణను తాకి వర్షాలు కురిపించాయి. రుతుపవనాలు సకాలంలో వచ్చినా, ‘యాస్’ తుఫాన్ వల్ల మేఘాలు వేగంగా కదిలి ఇక్కడ పెద్దగా పడలేదు. ఉత్తరాదిలో భారీగా కురిసాయి. ఈ తేడాలే కాకుండా వాతావరణ మార్పుల వల్ల రుతు పవనాలు, వాటి గమనం, వర్ష తీవ్రత ఎక్కువ ప్రభావితం అవటం ప్రమాదకరం! వేసవి సౌర ధార్మికతకే నైరుతి రుతుపవనాలు సున్నితంగా ప్రభావితం అవుతాయనేది తప్పుడు భావన అని శాస్త్రీయంగా రుజువైంది. భౌగోళిక స్థితిని సాంకేతికంగా చెప్పడం కాకుండా వాతావరణ విభాగం లోతైన అధ్యయనాలు జరపాలి, విశ్లేషణలు చేయాలి. రాగల పరిస్థితుల ప్రభావాలను వివరిస్తూ రైతులకు ఉపయుక్త సమాచారం నిరంతరం ఇవ్వగలగాలి. దాని ఆధారంగా వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రైతును అప్రమత్తం చేసి, చైతన్యపరచాలి. ఏ ‘వాతావరణ మండలం’లో ఎంత వర్షపాతం ఉంటుంది? ఏం పంటలు వేసుకోవాలి? ఎప్పుడేం చర్యలు? చెప్పాలి. వ్యవసాయ విస్తరణాధికారుల వ్యవస్థను పటిష్టపరచాలి. ఇంతకుమునుపు రైతు చైతన్యయాత్రలు జరిగేవి. ఇప్పుడవన్నీ కాగితాల్లోనే! ఏమంటే, మేం రైతుబంధు పనుల్లో ఉన్నామనో, రైతుభీమా వ్యవహారాల్లో ఉన్నామనో అంటారు. తొలకరికే పులకించిపోయే రైతు ఆశతో విత్తనాలు అలుకుతాడు. సాలు (సాగు యోగ్య స్థితి) వచ్చిందా చూసుకోడు! కనీసం 3 అంగుళాలైనా తడవకుండా, నీరు నేలలో ఇంక కుండా విత్తనాలకు రక్షణ ఉండదు. కొన్నాళ్లు వర్షం జాప్యమైనా... విత్తనాలుగానో, చిన్నపాటి పిలకలుగానో మాడి మసై పోతాయి. విత్తనంతోపాటు రైతు శ్రమ, వ్యయం ఇక గాలికే! ఆర్థికంగా దెబ్బతింటాడు. వాతావరణ విభాగం పరిశీలనలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల పరిశోధనలు, ప్రభుత్వ శాఖల ప్రణాళికలు... వెరసి రైతును ఆదుకోవాలి. రుతుపవన సమాచారం నుంచి సరైన మార్కెట్ ద్వారా పంట నగదుగా రైతుల చేతికి వచ్చే వరకు చేయూత ఇవ్వాలి! అప్పుడే మన వ్యవసాయం రైతన్న రాజ్యం! మనదేశం రైతాంగ భారతం! -
కరోనాపై హెచ్చరిక.. అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: డెంగీ, మలేరియా, ఇతర వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఏవైనా సీజనల్‌గా వస్తుంటాయి. కానీ కరోనా మాత్రం.. సీజన్‌కు సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఎప్పుడైనా సోకే అవకాశం ఉంటుందని వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. అందువల్ల ప్రతి నిత్యం తగిన జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. మిగతా వ్యాధులకు సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు సోమవారం సీజనల్ వ్యాధుల కేలండర్‌ను విడుదల చేసింది. ఏ సీజన్లో ఏయే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది, ప్రభుత్వం, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అన్న సమాచారాన్ని అందజేసింది. జూలై నుంచి అక్టోబర్ మధ్య డెంగీ, మలేరియా, సీజనల్ జ్వరాలు వ్యాపిస్తాయని.. నవంబర్–మార్చి మధ్య స్వైన్‌ఫ్లూ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయని.. ఏప్రిల్– జూన్ మధ్య వడ దెబ్బ, మలేరియా వంటివి ఇబ్బంది పెడతాయని తెలిది. కరోనా ఏడాది పొడవునా పట్టి పీడించే అవకాశం ఉందని పేర్కొంది. సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేయాలని, తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేసింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కీలక పాత్ర పోషించాలని.. పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని కోరింది. ఇక సీజనల్ అంటు వ్యాధులను ఎదుర్కొనేందుకు 24 గంటలపాటు నడిచే ప్రత్యేక సెల్‌ను వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసింది. దీనికి 040–24651119 ఫోన్ నంబర్ కేటాయించింది. అంటు వ్యాధులకు సంబంధించిన సమస్యలను ఈ సెల్ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని సూచించింది. వానాకాలంలో మరింత జాగ్రత్త వైద్యారోగ్య శాఖ క్యాలెండర్ ప్రకారం.. ప్రస్తుత సీజన్లో కరోనాతోపాటు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్, డయేరియా, ఇన్‌ఫ్లూయెంజా, న్యూమోనియా, సీజనల్ జ్వరాలు వచ్చే అవకాశముంది. పాము కాట్లు సంభవిస్తాయి. ఈ అంశాలపై స్థానిక సంస్థలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ప్రచార కార్యక్రమం నిర్వహించాలి. శుక్రవారం డ్రైడే నిర్వహించాలని.. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, బాగా వండిన ఆహారాన్నే తినాలని తెలియజేయాలి. అంటువ్యాధులన్నింటినీ నియంత్రించేందుకు మాస్క్, భౌతిక దూరం, పరిశుభ్రత పాటించేలా చూడాలి. దోమల నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించాలి. మురికి కాల్వలు, ఆరు బయట నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, పొదలను శుభ్రం చేయాలి. స్టోరేజీ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేపట్టాలి. ప్రజల్లోకి వెళ్లి ఫీవర్ సర్వే చేయాలి. అవసరమైన మందుల కిట్లు అందజేయాలి. హైరిస్క్ ప్రాంతాల్లో దోమ తెరలు పంపిణీ చేయాలి. ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ ఓపీలను నిర్వహించాలి. ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలి. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలి. యాంటీ బయాటిక్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, యాంటీ స్నేక్ వీనమ్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాలి. చలికాలంలో వైరస్ల ప్రమాదం చలికాలంలో కరోనాతోపాటు స్వైన్‌ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ సీజన్లో వైరస్ల ప్రమాదం అధికం. గాలి నుంచి సోకే వైరల్ వ్యాధులను నియంత్రించేందుకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల శుభ్రత తప్పనిసరి. లక్షణాలు లేని కోవిడ్ రోగుల కోసం ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వానాకాలం తరహాలో చలికాలంలోనూ ఫీవర్ సర్వే చేసి, అవసరమైన మందులు అందజేయాలి. స్వైన్‌ఫ్లూ, కోవిడ్ టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఆస్పత్రుల్లో ఫీవర్ ఓపీ చేయాలి. ఒసెల్టామివిర్/డాక్సిసైక్లిన్, యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉంచుకోవాలి. అవసరమైన ఆక్సిజన్ నిల్వ, సరఫరా ఉండాలి. చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు ఇబ్బందిపెడతాయి. వాటికి సంబంధించి చికిత్స అందించడంతోపాటు ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించాలి. ఎండాకాలంలో కోవిడ్‌తో పాటు మలేరియా, డయేరియా వంటివి వచ్చే అవకాశం ఉంది. ఎండల కారణంగా వడదెబ్బ, కుక్కకాట్లు వంటివి సంభవిస్తాయి. యథావిధిగా కరోనా జాగ్రత్తలు తప్పనిసరి. ప్రజలు ఇళ్లు, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మున్సిపాలిటీలు, పంచాయతీలు పబ్లిక్ స్థలాల్లో నీడ వసతి, మంచినీరు అందుబాటులో ఉంచాలి. వైద్య సిబ్బంది ఫీవర్ సర్వేను కొనసాగించాలి. కోవిడ్, మలేరియా పరీక్షల కిట్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఆస్పత్రుల్లో ఫీవర్ ఓపీ, ఐసోలేషన్ వార్డులు ఉంచుకోవాలి. ఆక్సిజన్ స్టోరేజీ, సరఫరా ఏర్పాట్లు తప్పనిసరి. క్లోరోక్విన్/డాక్సిసైక్లిన్ సిద్ధంగా పెట్టుకోవాలి, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుకోవాలి. అన్ని కాలాల్లో కరోనా సీజనల్ వ్యాధులు ఆయా కాలాలను బట్టి వస్తూ పోతుంటాయి. కానీ కోవిడ్ మాత్రం అన్ని సీజన్లలోనూ వ్యాపిస్తోంది. కరోనా వైరస్ అన్ని కాలాల్లో మనగలుగుతుంది. కాబట్టి సీజనల్ కేలండర్లో దాన్ని మూడు సీజన్లలోనూ ప్రస్తావించాం. ప్రజలు ప్రతినిత్యం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. - డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు -
కరోనా పేరుతో కుబేర వర్గాల ఆట
ఏడాది కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనేవుంది. నాటకంలోని పాత్రధారుడిలా రోజుకో కొత్త రూపును తీసుకుంటూ శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతూనే ఉంది. అయితే ఈ అంటువ్యాధి మూలాలను అనుమానాలు తీరేలా ఇంతవరకు ఎవరూ నిర్ధారించలేకపోయారు. కానీ సామ్రాజ్యవాద దేశాలు సాగిస్తున్న యుద్ధాల బీభత్సంలోంచే సూక్షా్మవతారాలు పుట్టుకొస్తున్నాయని మేధావులు హెచ్చరిస్తున్నారు. దీనికంటే బీభత్సం ఈ ఉధృతిలోనే ప్రపంచ కుబేరులు తమ సంపదను కొండల్లాగా పెంచుకుంటూపోవడం; ప్రపంచంలోని పేద వర్గాల ప్రజలను అన్నిరకాలుగానూ తమ గుప్పిట్లోకి తీసుకోవడం. కోవిడ్ ఇకమీదట ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజాల మాదిరిగానే సీజనల్ వ్యాధిగా మారే అవకాశాలు కానవస్తున్నాయి. శ్వాసకోశ వ్యాధులన్నీ ఆయా రుతువులను బట్టి, గాలిలో నాణ్యతను బట్టి వస్తాయి. సమశీతోష్ణస్థితి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఇలాంటి వ్యాధులు విజృంభి స్తుంటాయి. కరోనా, ఫ్లూ ఇంచుమించుగా ఒకేరకం వ్యాధులు కావడంతో ప్రస్తుత పరిస్థితి కొన్నేళ్లు కొనసాగితే కరోనా కూడా సీజనల్ వ్యాధిగా మారుతుంది. కరోనా వ్యాప్తి గురించి ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ కేంద్రం ఏర్పాటు చేసిన 16 మంది ప్రసిద్ధుల అధ్యయన బృందం వెల్లడించిన తాజా నివేదిక(జెనీవా: 18 మార్చి 2021).ఈ బృందానికి ప్రసిద్ధ శాస్త్రవేత్త జెయిట్ చిక్ నేతృత్వం వహించారు.సరిగ్గా సంవత్సరంగా కోవిడ్–19 వ్యాధి సరికొత్త ‘సూక్ష్మావతారం’గా లక్షల సంఖ్యలో ప్రాణాలు తోడుకుంటూ ఉంది. ఈ అంటువ్యాధి అసలు మూలాలను ఇప్పటికీ శాస్త్రవేత్తలు అనుమానాలకు తావులేకుండా నిర్ధారించలేక పోతున్నారు. అయినా నాటకంలో కొందరు పాత్రధారులు రూపాలు మార్చుకొని ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేసిన విధంగా, వైరస్ తన రూపాలను మార్చుకుంటోంది. కొత్త లక్షణాలతో 5,000 రూపాలు బయట పడుతూండటాన్ని వైద్య శాస్త్రవేత్తలు, క్రిమిశాస్త్ర పరిశోధకులు శ్రద్ధగా గమనిస్తున్నారు. అదే సమయంలో అంతమాత్రాన ఎవరూ అజాగ్రత్తగా ఉండరాదనీ, ఎక్కడికి వెళ్లినా మూతికి ఆచ్ఛాదన (మాస్క్) విధిగా ఉండి తీరాలనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరికలు చేస్తోంది. ప్రకృతి రీత్యా వాతావరణంలో వచ్చే మార్పులకు తోడు, ప్రపంచ దేశాల సంపదపైన, అస్వతంత్ర, నూతన స్వతంత్ర దేశాలపైన తమ పీడనా దోపిళ్లను కొనసాగించడానికి ప్రపంచ పాత, కొత్త వలస సామ్రాజ్యవాద రాజ్యాలైన బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూని యన్లు దఫదఫాలుగా కొనసాగిస్తున్న యుద్ధాలు కూడా ఎబోలా, సార్స్ లాంటి క్రిములు ప్రకోపించడానికి కారణం అవుతున్నాయి. వర్ధమాన దేశాల సమస్యల పైన సుప్రసిద్ధ పరిశోధకుడైన ప్రొఫెసర్ మైఖేల్ చోసుడొవస్కీ తాజాగా వెల్లడించిన పలు అంశాలు మనకు కనువిప్పు కల్గించేలా ఉన్నాయి. ‘ఏకధ్రువ ప్రపంచం’ పేరిట, దేశాల ఆర్థిక వ్యవస్థల ప్రపంచీకరణ పేరిట ఐక్యరాజ్యసంస్థను ఆసరాగా చేసుకొని ప్రపంచ కుబేర వర్గాల తరపున పాత, కొత్త సామ్రాజ్యవాద ప్రభుత్వాలు మరి పదేళ్లలో (2030) ఏం చేయబోతున్నాయో చోసుడొవస్కీ ఇలా వివరించారు: ‘2030 సంవత్సరానికల్లా ప్రపంచ కుబేర వర్గాలు ప్రపంచవ్యాపిత సర్దుబాటు (గ్లోబల్ ఎడ్జెస్ట్‌మెంట్) పేరిట ప్రపంచ సంపదను తమ గుప్పెట్లోకి గుంజుకోబోతున్నారు. ఆ క్రమంలోనే ఈ కుబేరులు ప్రపంచంలో పెక్కు రంగాలకు చెందిన ప్రజలను దోచేసుకుని శంకరగిరి మాన్యాలు పట్టించనున్నారు!’ అదే సమయంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటిరెస్ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారిని ఆరోగ్య సంక్షోభానికి మించిన సంక్షోభంగా ప్రకటించారు. కానీ ఈ సంక్షోభానికి అసలు కారణాల్ని విశ్లేషించి, అర్థవంతమైన వివరణను సమితి ప్రజలకు అందించలేకపోయింది. ఇందుకు ఈనాటి ఐక్యరాజ్యసమితి ఉదాసీన వైఖరే ప్రధాన కారణమని చోసుడొవస్కీ కుండబద్దలు కొట్టి చెప్పారు. అయినా 2020 సెప్టెంబర్‌లో సమితి ప్రపంచ దేశాలకు అందజేసిన నివేదికలోని అంశాలు మన కళ్లు తెరిపించగలగాలి. ‘ఇప్పటికే లక్షలాది మంది ప్రపంచ ప్రజలు తమ జీవితాలను కోల్పోయారు. మరికొన్ని లక్షల కోట్లమంది ప్రజల జీవితాలు కకావికలమైపోయాయి. ఆరోగ్య సమస్యకు తోడు అసంఖ్యాక దేశాలలో, ప్రజల మధ్య విస్తారంగా ఉన్న అసమానతలు పదింతలు పెరిగిపోయాయి. ఫలితంగా వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘజీవులుగా, సమాజాలుగా ఎక్కడికక్కడే జీవనం చెల్లాచెదురై పోయింది. ఇది సమాజంలోని ప్రతీ మనిషిని, చివరికి ఇంకా పుట్టని బిడ్డలపైన కూడా తీవ్ర ప్రభావం కల్గిస్తుంది. దేశాల మధ్య, జాతుల మధ్య ఆ మాటకొస్తే వ్యవస్థల మధ్య ఉన్న బలహీనతల్ని ఇది మరింత ప్రకోపింపజేస్తుంది. పొంచివున్న ఈ సమష్టి ప్రమాదాలకు సమన్వయ పూర్వకమైన ప్రపంచ వ్యాపిత స్పందన అవసరాన్ని ఈ సంక్షోభం కలిగించింది. అయితే, ప్రపంచవ్యాపితంగా, సామాజికంగా ఆర్థికంగా సాగుతున్న వినాశనానికి దారితీసిన ఈ పరిణామాలపైన సమితి భద్రతా సంఘం ఇంతవరకూ చర్చించకుండా మూగనోము పట్టింది. దీనికి కారణం అందులోని అయిదు శాశ్వత సభ్యదేశాలే! కానీ అదే సమయంలో ప్రపంచ కుబేర వర్గాల ప్రయోజనాలను కాపాడే ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ ప్రతిపాదించిన ప్రపంచవ్యాపిత ‘ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్య వ్యవస్థ సలహాకు మాత్రం ఐక్యరాజ్యసమితి అప్పనంగా ‘తాతాచార్యుల ముద్ర’ వేసి కూర్చుందని మరచిపోరాదు. అందుకే ప్రొఫెసర్ చోసుడోవస్కీతో పాటు, ప్రొఫెసర్ చామ్స్కీ (ప్రసిద్ధ అమెరికన్ భాషా శాస్త్రవేత్త) కరోనా వైరస్ సామ్రాజ్యవాద పాలకులు సృష్టించిన యుద్ధాల కారణంగా వాతావరణం కలుషితమై పుట్టుకొచ్చిందని అభిప్రాయపడుతున్నారు. జింక్, సి విటమిన్, డి–3, బీటాగ్లుకాన్, ఎన్.ఎ.సి. లాంటి తక్షణ ప్రత్యామ్నాయాల ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యభాగ్యం కల్గించవచ్చునని డాక్టర్ పాల్ క్రెగ్ రాబర్ట్స్, మన దేశంలోని సీసీఎంబీ లాంటి పరిశోధనా సంస్థల పలువురు విశ్లేషకులు సూచించారు. అయినా ఈ వైరస్‌ని ప్రతిఘటించే పేరిట ఔషధ గుత్త కంపెనీలు ‘ఆలసించిన లాభాలకు ఆశాభంగం’ అని భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యరంగంలో సాగుతున్న పోరాటం – ధనికవర్గ వ్యవస్థలో పాతుకుపోయిన కొన్ని ఫార్మా కంపెనీలకూ, జనాభాలో ఎక్కువ శాతం ఉన్న అసంఖ్యాక పేద, మధ్యతరగతి ప్రజా బాహుళ్య ప్రయోజనాలకూ మధ్యనేనని గుర్తించాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ‘పునర్వ్యవస్థీకరణ’ అన్నా, ‘ఏకధృవ ప్రపంచం’ అన్నా, క్వాడ్ అన్నా, ఆసియా పసిఫిక్, యూరోపియన్ యూనియన్ కూటమి అన్నా ఒకే తానులోని ముక్కలు. సామ్రాజ్యవాదం మానవ ముఖం తగిలించుకుంటే తప్ప బతికే రోజులు ముగుస్తున్నాయి. సరైన వ్యాక్సిన్ రావడానికి అయిదు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుందని క్రిమిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మూడు దశల పరీక్షలు పూర్తిగా నెగ్గితే గానీ వ్యాక్సిన్ ప్రయోగించరాదని నిపుణులు మొత్తు్తకుంటున్నారు. అయినా ఒక వైపు నుంచి బడా ఫార్మా కంపెనీలు, మరోవైపు నుంచి పాలకవర్గాలు పరస్పర ధన ప్రయోజనాలతో కరోనా కట్టడి పేర బేరసారాలు ప్రారంభించాయి. ఉదాహరణకు కరోనా నంజుడు మొదలైన తర్వాత, సెకండ్ వేవ్ కరోనా ముట్టడించక ముందే 2020 మార్చి 18 నుంచి 2020 అక్టోబర్ 8 మధ్య ఒక అమెరికన్ మహా కోటీశ్వరుడు తన సంపదను 850 బిలియన్ డాలర్లకు పెంచేసుకున్నారని అంచనా. అక్కడే కాదు, మన దేశంలోనూ కోవిడ్ పైనే సమయాన్ని చాటు చేసుకుని సుమారు 40 మంది కోటీశ్వరులు తమ సంపదను కొండలుగా పెంచేశారు. గత పదేళ్లలో పెరిగిన వీరి సంపదకన్నా ఒక్క 2020 కోవిడ్ ఉధృతిలోనే 83 బిలియన్ డాలర్లకు చేరింది. ఈలోగా మరో వైపు నుంచి దొంగ సన్యాసులు కూడా రోగుల్ని మోసగిస్తుంటారని పానుగంటివారి సాక్ష్యం. ఎలా? భగవత్ కటాక్షం ఉంటే రోగికి వైద్యుని అవసరం లేదు. భగవత్ కటాక్షం లేకపోతే వైద్యుని అవసరం లేదు. కాబట్టి అసలు వైద్యుడే అవసరం లేనట్లు కన్పిస్తోందని ఓ ‘విట్టు’గా ఒక సందర్భంలో చమత్కరించారు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కోవిడ్ సీజనల్ వ్యాధిగా మారే ప్రమాదం!
జెనీవా: కోవిడ్ ఇకపై సీజనల్ వ్యాధిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ పరిస్థితుల ఆధారంగా కరోనా సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచ దేశాలకు హితవు పలికింది. చైనాలోని వూహాన్లో తొలిసారిగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఏడాది గడిచిపోయినప్పటికీ దాని చుట్టూ ఇంకా ఎన్నో సందేహాలు నెలకొని ఉన్నాయి. కరోనా వ్యాప్తికి వాతావరణ పరిస్థితులు, గాలిలో నాణ్యత వంటి అంశాలు ఎలా ప్రేరేపిస్తున్నాయనే దిశగా యూఎన్‌కి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటు చేసిన 16 మంది సభ్యుల బృందం అధ్యయనం నిర్వహించింది. వీరి అధ్యయనంలో ఈ వైరస్ సీజనల్ వ్యాధిగా మారే ప్రమాదముందని తేలింది. శ్వాస కోశకు సంబంధించిన వ్యాధులన్నీ సీజనల్‌గానే వస్తాయని, శీతల వాతావరణం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి వ్యాధులు ఎక్కువని చెప్పింది. ఇక ఫ్లూ తరహా వ్యాధులు కూడా సమశీతోష్ణ ప్రాంతాల్లో కూడా తరచూ విజృంభిస్తూ ఉంటాయని వెల్లడించింది . కరోనా, ఫ్లూ ఇంచుమించుగా ఒకటే రకం వ్యాధి కావడంతో ఇదే పరిస్థితి కొన్నేళ్లు కొనసాగితే కరోనా కూడా సీజనల్ వ్యాధిగా మారుతుందని ఆ బృందం అభిప్రాయపడింది. అందుకే ఇప్పటికిప్పుడు వాతావరణ మార్పుల్ని అంచనా వేసుకొని కోవిడ్ ఆంక్షల్ని సడిలించవద్దని హెచ్చరించింది. అత్యంత శీతల వాతావరణంలో కరోనా వ్యాప్తి ఎలా చెందుతోందో, వేడి వాతావరణంలో కూడా అదే స్థాయిలో విజృంభిస్తోందని వచ్చే సీజన్లలో కూడా అలాగే జరిగే అవకాశం ఉందని బృందానికి నేతృత్వం వహించిన జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి శాస్త్రవేత్త బెన్ జెయిట్‌చిక్ చెప్పారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం!
►అతని పేరు సురేష్ (పేరు మార్చాం)... ఆదిలాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగి. 15 రోజుల క్రితం 101 నుంచి 102 ఫారిన్ హీట్ జ్వరం వచ్చింది. సమీపంలోని ప్రైవేట్ డాక్టర్ వద్దకు వెళ్లాడు. ప్రస్తుతం సీజన్ కదా సాధారణ వైరల్ ఫీవరేనని, పారాసిటమాల్ మాత్రలు వాడమన్నాడు. నాలుగైదు రోజులు వాడినా జ్వరం తగ్గకపోగా దగ్గు తోడైంది. దీంతో అతని కుటుంబసభ్యులు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించారు. పాజిటివ్ అని తేలింది. ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ అయినట్లు సీటీస్కాన్ లో తేలింది. అతని రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి ఆయాసం ఎక్కువైంది. అప్పటికప్పుడు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నాడు. అతని ఇంట్లో అందరికీ పాజిటివ్ వచ్చింది. ►సంగారెడ్డి జిల్లాకు చెందిన శరత్ (పేరు మార్చాం) ప్రైవేట్ ఉద్యోగి. 35 ఏళ్ల ఇతనికి 20 రోజుల కిందట అధిక జ్వరం వచ్చింది. తెలిసిన డాక్టర్ వద్దకు వెళ్లగా.. సాధారణ వైరల్ ఫీవర్ అని చెప్పి మాత్రలు ఇచ్చాడు. ఐదారు రోజులైనా జ్వరం తగ్గలేదు. ఒకరోజు రాత్రి తీవ్ర ఆయాసం వచ్చింది. ఆక్సి జన్ స్థాయి పడిపోయింది. అప్పటి కప్పుడు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. తర్వాత ఆ కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు ఆ కుటుంబం రోడ్డున పడింది. సాక్షి, హైదరాబాద్: ఇలాంటి కేసులు రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో నమోదవు తున్నాయి. కొందరు సీనియర్ డాక్టర్లు, మరికొం దరు శిక్షణలేని ప్రాక్టీషనర్ల నిర్లక్ష్యం.. అమాయక ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. సాధారణ మాత్రలతో తగ్గాల్సిన కరోనా సీరియస్ పరిస్థితికి చేరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువకులు కూడా కరోనా పోరాటంలో ఓడిపోతున్నారు. ఏం కాదులే.. రెండు, మూడ్రోజులు చూద్దాం.. లేకుంటే తదుపరి పరీక్షలు చేద్దాం.. అని కొందరు వైద్యులు నానబెడుతున్నారు. దీంతో బాధితులకు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. జ్వరమొస్తే పారసిటమాల్, దగ్గు వస్తే సిరప్... రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై జ్వరమొచ్చినా, అనుమానిత లక్షణాలున్నా తక్షణమే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని పదే పదే చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే.. లక్షణాలు లేకున్నా టెస్టులు చేయించుకోవాలని సూచిస్తోంది. ఆ మేరకు ప్రభుత్వం రాష్ట్రంలోని 1,100 కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. రోజుకు 60 వేలకుపైగా పరీక్షలు చేస్తున్నారు. అయినా కొందరు వైద్యులు మాత్రం మారడంలేదు. జ్వరం వచ్చిందా పారసిటమాల్ వెయ్యి... దగ్గు వచ్చిందా ఫలానా సిరప్ తాగు... జలుబు చేసిందా ఇదిగో మాత్ర... ఒళ్లు నొప్పులంటే సీజన్ లో ఇలాగే ఉంటుంది...అంటూ సాదాసీదాగా చెబుతున్నారు. ఈ నిర్లక్ష్యం బాధితులను ప్రాణాల మీదకు తీసుకురావడమే గాక, కరోనా కుటుంబంలో ఉన్న వారందరికీ సోకేలా చేస్తోంది. ఇదిలావుంటే చాలామంది బాధితులు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలంటే భయపడుతున్నారు. ‘కరోనా పరీక్ష అంటే హడలిపోతున్నారు. పాజిటివ్ వస్తే అందరూ వెలివేస్తారేమో అన్న భయం వారిని వెంటాడుతోందని’ ఒక వైద్యాధికారి అభిప్రాయపడ్డారు. ఇంటింటి సర్వేలెక్కడ? ప్రతీ ఇంటికీ వెళ్లి జ్వర నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా చాలాచోట్ల అది అమలుకావడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో బాధితులను గుర్తించడం సాధ్యంకావడంలేదు. అనేకమంది ప్రైౖవేట్ క్లినిక్‌లకు వెళుతున్నారు. అంతేకాదు ప్రతీ ప్రైౖవేట్ క్లినిక్‌లలో జ్వరం కౌంటర్లు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. పైగా జ్వరం సహా ఇతరత్రా లక్షణాలుంటే పై ఆసుపత్రికి రిఫర్ చేయడంలో, యంత్రాంగానికి సమాచారం ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం జరుగుతోంది. పైగా ప్రైౖవేట్ క్లినిక్‌లు, ప్రాక్టీషనర్లపై స్థానిక వైద్య,ఆరోగ్య యంత్రాంగం పర్యవేక్షణ కరువైంది. జిల్లాల్లో పర్యటించాలని, పరిస్థితిని పర్యవేక్షించి సూచనలు ఇచ్చి రావాలని రాష్ట్ర వైద్య యంత్రాంగానికి ప్రభుత్వం ఆదేశించినా ఎవరూ హైదరాబాద్ నుంచి కదలడంలేదన్న ఆరోపణలున్నాయి. దీంతో జిల్లాల్లో ఏం జరుగుతుందో కూడా సమాచారం రావడం లేదు. ఇక జిల్లాల్లో ప్రైవేట్ డాక్టర్లు, ప్రాక్టీషనర్లకు కరోనాపై ప్రత్యేక శిక్షణ ఇవ్వకపోవడం ప్రధాన లోపంగా చెబుతున్నారు. దీంతో ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు వైద్యం చేసుకుంటూ కరోనా వ్యాప్తికి పరోక్షంగా బాధ్యులు అవుతున్నారు. బాధితుడి పరిస్థితి సీరియస్ అయ్యాక పై ఆసుపత్రికి వెళ్లడంటూ చిన్నపాటి రిఫరెన్స్‌లు ఇస్తున్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో డయేరియా, మలేరియా, చికున్ గున్యా, డెంగీలతో పాటు వైరల్ ఫీవర్లతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశమున్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులను అరికట్టేందుకు వైద్య శాఖ ఉన్నతాధికారులతో బుధవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలతో సమన్వయం చేసుకొని నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఈ వ్యాధులపై ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యంగా వర్షాలు ఎక్కువ కురుస్తున్న జిల్లాల మీద దృష్టి పెట్టి నివారణ చర్యలు చేపట్టాలని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాస్‌రావును ఆదేశించారు. ఇటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు అన్ని ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డికి ఆదేశాలిచ్చారు. ఉస్మానియా హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్లో అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందేలా చూడాలని వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డికి సూచించారు. గ్రామస్థాయిలో ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు రోజువారీ సర్వే చేయాలని ఆదేశించారు. జ్వరంతో పాటుగా ఇతర జబ్బులు కూడా పరిశీలించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల నివారణ చర్యలు, చికిత్సపై శుక్రవారం జిల్లా వైద్య అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. -
కరోనా సీజనల్ వైరస్ కాదు: డబ్ల్యూహెచ్‌వో
లండన్: కోవిడ్ –19 సీజనల్‌గా వచ్చిపోయే వైరస్లాగా కనిపించడం లేదని, అందుకే దీన్ని కట్టడిచేయడం కష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సేవల విభాగం డాక్టర్ మైఖేల్ రయాన్ వెల్లడించారు. ఈ వైరస్ ఏ సీజన్లో వస్తుందో చెప్పలేకపోతున్నామని, శ్వాస సంబంధిత వైరస్ ఇన్ఫ్లుయెంజా ప్రధానంగా శీతాకాలంలో వ్యాప్తి చెందుతుందని, అయితే కరోనా వైరస్ మాత్రం వేసవిలో కూడా విజృంభిస్తోందని ఆయన అన్నారు. కొందరు శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు కరోనా వైరస్ ఎండ వేడిమికి తట్టుకోలేదని, వేసవి కాలంలో మనగలగలేదని గతంలో ఊహించారు. వైరస్‌ని ఎంత అణచివేయాలని చూసినప్పటికీ అది తిరిగి విజృంభిస్తూనే ఉందని రయాన్ అన్నారు. -
సీజనల్ వ్యాధులపై మరింత అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సీజనల్ వ్యాధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులు విజృంభించే అవకాశముందని, వీటికి ప్రధాన కారణమైన దోమలను అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దోమలు ఇళ్లలో పేరుకుపోయిన మంచినీళ్లపై వేగంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యాన్ని పెంచడం ద్వారా సీజనల్ వ్యాధులను నిర్మూలించేందుకు తలపెట్టిన ‘ప్రతి ఆదివారం–10 గంటలకు 10 నిమిషాలు’అనే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వరుసగా రెండోవారం పాల్గొని ప్రగతి భవన్‌లోని తన నివాసంతో పాటు, పరిసరాలను పరిశీలించారు. తాజాగా కురిసిన వర్షాలకు పలు పాత్రల్లో నిండిన నీటిని ఖాళీ చేయడంతో పాటు వివిధ ప్రాంతాల్లో పేరుకుపోయిన వాన నీటిని సైతం తొలగించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలకు అదనంగా ప్రతి ఒక్కరు తమ ఇళ్లతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు తమ ఇంటి పరిశుభ్రత, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కేటాయించాలని తద్వారా ప్రస్తుత వర్షాకాలంలో వచ్చే అన్ని రకాల సీజనల్ వ్యాధులను అరికట్టే అవకాశం కలుగుతుందని తెలిపారు. -
వ్యాధులనుంచి ప్రజలను కాపాడుకుందాం
సాక్షి, హైదరాబాద్: సీజనల్ వ్యాధుల నివారణ లక్ష్యంగా పు రపాలక శాఖ ఆధ్వర్యంలో శ్రీ కారం చుట్టిన ‘ప్రతి ఆదివారం– పది గంటలకి –పది నిమిషాలు’ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరూ పాల్గొనడంతో పాటు ప్రజలు పాల్గొనేలా ప్రోత్సహించాలని ఆ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను నివారిద్దామని కోరారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులందరికీ మంత్రి కేటీఆర్ ఆదివారం లేఖ రాశారు. సీజనల్ వ్యాధుల నివారణకు కట్టుదిట్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని ఈ లేఖలో తెలిపారు. కరోనాపై చేస్తున్న స మష్టి పోరాటం వల్ల ప్రజారో గ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అందరిలో అవగాహన పెరిగిందన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించ కుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అదేశించారని, పట్టణ ప్రగతిలో భాగంగా భారీ ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. దోమల నివారణకు జాగ్రత్తలు పాటిస్తే ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చన్నారు. ఇందుకోసం వారానికి కనీసం 10 నిమిషాలను మన కోసం, మన పరిసరాల పరిశుభ్రత కోసం కేటాయించాలని నిర్ణయించామన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ఆరోగ్య శాఖ సహకారంతో పురపాలక శాఖ ఒక క్యాలెండర్ రూపంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందన్నారు. ఇందులో భాగంగా కీటక నివారిణిల వినియోగం, దోమల నిర్మూలనకు మలాథియాన్ స్ప్రే, ఆయిల్ బాల్స్, ఫాగింగ్ చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని వారానికోసారి స్ప్రే చేస్తున్నామన్నారు. మురికి కాల్వల పూడిక తీత, లోతట్టు ప్రాంతాల్లో నిలిచి న నీటిని ఎత్తిపోయడం, రోజూ చెత్త తరలింపును పకడ్బందీగా నిర్వహించాలని పురపాలికల ను ఆదేశించామన్నారు. ఆదివారం శుభ్రత కోసం.. మన ప్రజలను, పట్టణాలను కా పాడుకునే కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు గత వారం ‘ప్రతి ఆదివారం –పది గంటలకు–పదినిమిషాలు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని,. రానున్న పదివారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నా రు. శాసన సభ్యులు ముందుగా ఈ కార్యక్రమాన్ని తమ ఇళ్ల నుంచే ప్రారంభించాలని, తర్వాత తమ పరిధిలోని పట్టణాల్లో విస్తృతంగా తిరుగుతూ ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. డాక్యుమెంట్ రైటర్స్ రూ.4లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ సంక్షేమ సంఘం రూ. 4 లక్షల విరాళాన్ని అందించింది. ఆదివారం రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డితో కలిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివనాగేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి మురళి కృష్ణమాచారి తదితరులు ప్రగతి భవన్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు చెక్కును అందజేశారు. -
ప్రజా ప్రతినిధులకు కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్ : సీజనల్ వ్యాధుల బారినుంచి కుటుంబాలను, పట్టణాలను, ప్రజలను కాపాడుకోవాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులను కలిసికట్టుగా ఎదుర్కొందామంటూ ఆదివారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పోరేషన్ ఛైర్మన్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్లకు ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో.. ‘‘ ప్రతి ఆదివారం- పది గంటలకి- పది నిమిషాలు’’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారికి పిలుపునిచ్చారు. పురపాలక శాఖ చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలన్నారు. సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు పకడ్బందీ ప్రణాళికతో పురపాలక శాఖ ముందుకు వెళ్తోందని తెలిపారు. పురపాలక శాఖ కార్యక్రమాలతో కలిసి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
డెంగీ.. స్వైన్‌ఫ్లూ.. నగరంపై ముప్పేట దాడి
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌ను సీజనల్ వ్యాధులు చుట్టుముట్టాయి. ఇప్పటికే డెంగీ జ్వరాలు మృత్యు ఘంటికలు మోగిస్తుండగా, తాజాగా విస్తరిస్తున్న స్వైన్‌ఫ్లూ కూడా ప్రజల ప్రాణాలు తీస్తోంది. డెంగీతో ఇప్పటి వరకు 38 మంది మృతి చెందగా, స్వైన్‌ఫ్లూతో ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 21 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూ కారక వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ గ్రేటర్ వాసులపై ముప్పేట దాడి చేస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గురువారం నిలోఫర్‌లో ఓ బాలిక డెంగీతో ప్రాణాలు వదలగా.. బోడుప్పల్‌కు చెందిన మరోవిద్యార్థి విషజ్వరంతో మరణించాడు. 1106 ఫ్లూ కేసులు నమోదు హైదరాబాద్‌లో మొదటిసారిగా 2009లో ‘హెచ్1ఎన్1’ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వెలుగులోకి వచ్చింది. తర్వాత నగరంలో స్వైన్‌ఫ్లూ కేసులు, మరణాలు భారీగా నమోదయ్యాయి. ఏడాది పాటు నిశ్శబ్దంగా ఉన్న వైరస్ మళ్లీ 2012లో తన ప్రతాపం చూపించింది. 2017కు ముందు ‘కాలిఫోర్నియా స్ట్రెయిన్’గా వ్యాప్తిలో ఉన్న వైరస్ రెండేళ్ల కిందట ‘మిషిగాన్ స్ట్రెయిన్’గా కొత్త అవతారమెత్తింది. గతేడాది కొంత తగ్గిన ఈ వైరస్ ఈ ఏడాది ఆరంభం నుంచే విజృంభిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో తీవ్రస్థాయిలో ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,366 మంది నుంచి నమూనాలు సేక రించి పరీక్షించగా, వీరిలో 1297 మందికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్ నిర్ధారణ అయింది. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 671, రంగారెడ్డి జిల్లాలో 208, మేడ్చల్ జిల్లాలో 227 ప్లూపాజిటివ్ కేసులు నమోదవగా 21 మంది మృత్యువాత పడ్డారు. మారిన వాతావరణ పరిస్థితులకు తోడు ఇటీవల గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జనసమూహం లో ఎక్కువగా గడపడం వల్ల ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి సులభంగా విస్తురించినట్టు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. డెంగీతో 38 మంది మృతి గ్రేటర్లో డెంగీ జ్వరాల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. పెద్దలతో పోలిస్తే చిన్నప్లిలల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం, స్కూలు పరిసరాల్లో పారిశుధ్య లోపం, ఇంటి పరిసరాల్లో పూలకుండీల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో వీరు ఎక్కువగా డెంగీ బారిన పడుతున్నారు. గ్రేటర్లో కేవలం పది రోజుల్లో 1,767 డెంగీ కేసులు నమోదు కాగా, బాధితుల్లో 50 శాతం మంది 14 ఏళ్లలోపు పిల్లలే. ఒక్క నిలోఫర్‌లోనే జూలై నుంచి ఇప్పటి వరకు సుమారు 900కి పైగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గాంధీ జనరల్ మెడిసిన్ విభాగంలో కేవలం 12 రోజుల్లో 471 మంది జ్వరపీడితుల నుంచి రక్తపు నమూనాలు సేకరించి, పరీక్షించగా వీరిలో 109 మందికి డెంగీకి పాజిటివ్ నిర్థారణ అయింది. ఇప్పటి వరకు 38 మంది మృతి చెందగా, వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. అయితే, ప్రభుత్వం ఈ మరణాలను డెంగీ మరణాలుగా ధృవీకరించడం లేదు. డెంగీ లక్షణాలు ఇలా ఈడిస్ ఈజిఫ్టై (టైగర్ దోమ) కుట్టడం ద్వారా డెంగీ సోకుతుంది. పగటి పూట కుట్టే ఈ దోమ.. ప్రస్తుతం లైటింగ్ ఎక్కువగా ఉండటంతో రాత్రిపూట కూడా దాడి చేస్తోంది. దోమకుట్టిన 78 రోజులకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం రావడంతో పాటు కళ్లు కదలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకలు, కండరాల్లో నొప్పి, శరీరంపై ఎర్రటి పొక్కులు వస్తాయి. సాధారణంగా మనిషి రక్తంలో 1.50 నుంచి 4.50 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. డెంగీ బాధితుల్లో ఈ సంఖ్య 40 వేలలోపు పడిపోతుంది. 20 వేలకంటే తగ్గిపోతే ప్రమాదం. పిల్లల ఆరోగ్యం జాగ్రత్త పిల్లలు డెంగీ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు సాధ్యమైనంత వరకు కాళ్లు, చేతులు పూర్తిగా కవర్ చేసే దుస్తువులు వేయాలి. ఇంట్లో మస్కిటో మ్యాట్, మస్కిటో కాయిల్స్, ఆల్ అవుట్ వంటివాటితో దోమలను నియంత్రించాలి. ఇంట్లోని పూలకుండీలతో పాటు ఇంటిపై ఉన్న ఖాళీ డబ్బాలు, వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఇంటి, పాఠశాల ఆవరణతో పాటు చుట్టుపక్కల పరిసరాల్లో పారిశుధ్యం లోపం లేకుండా చూడాలి. ఫాగింగ్, యాంటీ లార్వా చర్యల ద్వారా ఎప్పటికప్పుడు దోమలను నియంత్రించాలి. – డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్,నిలోఫర్ ఆస్పత్రి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్లూ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్ గాలిలోకి ప్రవేశించి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న వారు జన సమూహంలోనికి వెళ్లక పోవడమే ఉత్తమం. బాధితులు ఉపయోగించిన రుమాలు, టవల్ వంటివి వాడవద్దు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముఖానికి అడ్డంగా ఖర్చీఫ్‌ను పెట్టుకోవాలి. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారితో కరచాలనం, ఆలింగనాలు చేయొద్దు. మందులు వాడుతున్నా లక్షణాలు తగ్గకపోతే స్వైన్‌ఫ్లూ కావచ్చేమోనని అనుమానించి వైద్యున్ని సంప్రదించాలి. – డాక్టర్ శ్రీహర్ష, నోడల్ ఆఫీసర్, హైదరాబాద్ జిల్లా -
అవసరమైతే పల్లెనిద్ర: డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలో మలేరియా,డెంగీ జ్వరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. గిరిజన గ్రామాలతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా వాటర్ ట్యాంకుల్లో క్లోరిన్ వేసి శుభ్రత చర్యలు చేపట్టాలన్నారు. వారం రోజుల్లో అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ‘నాలుగైదు రోజుల్లో గ్రామాల్లో పర్యటిస్తానని..అవసరమైతే పల్లెనిద్ర’ కూడా చేస్తానని తెలిపారు. సీజనల్ వ్యాధులను నివారించడానికి రేపటి నుంచి మూడురోజుల పాటు అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. రోగులు ఇబ్బందులు పడకుండా..మందులను 24 గంటలు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. -
వ్యాధుల నివారణకు క్యాలెండర్
సాక్షి, హైదరాబాద్: సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణలకు ఏ నెలలో, ఏమేం చేయాలో వార్షిక క్యాలెండర్‌ను రూపొందించనున్నామని మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. మంగళవారం నుంచే వివిధ స్థాయిల్లోని అధికారులతోపాటు ప్రజాప్రతినిధు లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని, పారిశుధ్య కార్యక్రమాలు పరిశీలిస్తారని, ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. వ్యాధులు, పారిశుధ్యం, రహదారులు తదితర అంశాలపై మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి మునిసిపల్ పరిపాలన, వైద్యారోగ్యశాఖల ఉన్నతాధికారులతో సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివరాలను విలేకరుల సమావేశంలో కేటీఆర్ వెల్లడించారు. సీజన్ మార్పుతో వైరల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, జ్వరాలన్నీ డెంగీకాదని అన్నారు. ఈ విషయంలో ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రతిపక్షాలతోపాటు మీడియా కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని కోరారు. పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగులతో సçహా వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతం గా ప్రచారం నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపా రు. పారిశుధ్య కార్యక్రమాలు మెరుగుపడేందుకు యుద్ధప్రాతిపదికన రేçపు ఉదయం 5.30 నుంచే హైదరాబాద్‌లో మేయర్, డిప్యూటీ మేయర్, మునిసిపాలిటీల్లో కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. వెయ్యికిపైగా ఉన్న గార్బేజి పాయింట్లలోని చెత్తను 16వ తేదీలోగా తొలగిం చాలని నిర్ణయించామన్నారు. పాఠశాలలు/కళాశాలలు, స్లమ్స్/బస్తీలు, అపార్ట్మెంట్లు/కాలనీల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తారన్నా రు. ఈ కార్యక్రమాల్లో తాను, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కూడా పాలుపంచుకుంటామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ఒక ఇంటిని కూడా సందర్శించి ప్రజలకు వివరించాలన్నారు. బస్తీ దవాఖానాల్లో సాయంత్రం కూడా ఓపీ నగరంలో యూహెచ్‌పీలు సహా 106 బస్తీ దవా ఖానాల్లో సాయంత్రం కూడా ఓపీ సేవలు అందు బాటులో ఉంటాయని కేటీఆర్ చెప్పారు. వచ్చిన రోగుల్ని గంటలోగా తిరిగి పంపించే ప్రయత్నం జరుగుతోందన్నారు. సీఎం అనుమతితో బస్తీదవాఖానాలను 300కు పెంచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. నగరంలో ప్రత్యేకంగా 25 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. దాదాపు 53 వేల గణేశ్ మండపాల వద్ద వ్యాధులు ప్రబలకుండా అవసరమైన సిబ్బందిని కూడా నియమిస్తామన్నారు. వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు.. నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేసేవారిపై, వాటిని ఇష్టానుసారం తరలించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటా మని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు మునిసిపల్ పరిపాలన ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేయడంతోపాటు రవాణాశాఖతో కూడా మాట్లాడి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నగరంలో రహదారుల పరిస్థితి మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్, డైరెక్టర్ టీకే శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించకుంటే శిక్షలే.. ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ జరిమానాలకు సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ పౌరస్పృహ లేనివారికి జరిమానాలు, శిక్షలు ఉండాల్సిందేనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నగరంలో పారిశు ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటామన్నారు. డెంగీపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. వందలాది మరణాలంటూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయన్నారు. విమర్శలు సహేతుకమైతే స్వీకరిస్తామన్నారు. తమిళిసై నియామకంపై మాట్లాడేదేముంటుంది: కేటీఆర్ రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ను నియమించడంపై కేంద్రం నిర్ణయం తీసుకుందని, రాష్ట్రపతి నియమించారని, ఈ అంశంపై మాట్లాడేందుకేముంటుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం జీహెచ్ఎంసీలో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇటీవల రాజకీయసంబంధాలు కలిగినవారిని గవర్నర్లుగా నియమిస్తున్నారు. దీనిపై మీ స్పం దన ఏమిటన్న’ విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ.. ఈ అంశంపై నేనేం కామెంట్ చేయగలనంటూ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఆమె గవర్నర్‌గా వచ్చాక మంత్రిగా తాను ప్రమాణం చేశానని, ఆమెను గవర్నర్‌గానే చూస్తామన్నారు. -
ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ఫలితం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలుతున్న విష జ్వరాలను అరికట్టడానికి తమ శాఖ గత నాలుగు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తోందని వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ప్రస్తుతం డెంగ్యూ లక్షణాలు మారాయని.. ప్రస్తుతం రోగుల సంఖ్య పెరిగినా.. త్వరగానే నయం అవుతుందని అన్నారు. ఫీవర్ ఆస్పత్రిలో 51వేల మందికి టెస్ట్ చేస్తే.. కేవలం 62 మందికే డెంగ్యూ ఉన్నట్లు తెలీందన్నారు. గాంధీ ఆస్పత్రిలో కూడా 419మందికి నయం చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, భోదన ఆస్పత్రుల్లో సాయంత్రం కూడా ఓపీ నడుపుతున్నామన్నారు. సెలవులు లేకుండా వైద్యులు పని చేస్తున్నారని పేర్కొన్నారు. మందులు కూడా అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి రోజు మినిస్టర్ పేషీ జ్వరాల మీద పని చేస్తోందని.. జూన్ నుంచి జ్వరాలపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేయాలని.. అవసరమైతే అద్దెకు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రజలు కూడా వారి పరిసరాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరారు. ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ఈ పరిస్థితుల నుంచి భయటపడగలమన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేసి పని చేసే వారి స్థైర్యాన్ని దెబ్బ తీయవద్దని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రతి రోజు సాయంత్రం ఖచ్చితంగా పేషెంట్స్ నివేదికను డీఎంహెచ్ఓకి అందించాలని ఆదేశించామన్నారు. సాధరణ జ్వరంతో వచ్చే వారిని డెంగ్యూ అని భయపెట్టవద్దని ప్రైవేట్ ఆస్పత్రులను హెచ్చరించారు ఈటెల. -
పబ్లిసిటీ కోసం గాలి మాటలొద్దు..
సాక్షి, హైదరాబాద్: వాస్తవాలు విస్మరించి.. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినట్లుగా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.శుక్రవారం ఆయన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. నగరంలో వైద్యులంతా అప్రమత్తంగా ఉన్నారని...ఆదివారం కూడా వైద్యసేవలు అందిస్తున్నారని తెలిపారు. వాతావరణం మార్పుతో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని తెలిపారు. విష జర్వాలను అదుపు చేయడానికి వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. దేశంలోనే బెస్ట్ మెడికల్ సేవలు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయొద్దని హితవు పలికారు. డెంగీ లేదనడం లేదని.. డెంగీని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పబ్లిసిటీ కోసం గాలి మాటలు మాట్లాడవద్దని ప్రతిపక్షాలను దుయ్యబట్టారు. -
జ్వరాలన్నీ డెంగీ కాదు..
సాక్షి, హైదరాబాద్: జ్వరాలన్నీ డెంగీ, స్వైన్ ఫ్లూ కాదని..ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. సీజనల్ వ్యాధులపై బుధవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.విష జ్వరాలువ్యాపించకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఫీవర్ ఆసుప్రతుల్లో సాయంత్రం కూడా ఓపీ సేవలు అందిస్తున్నామని తెలిపారు. డెంగీ మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఆగస్టులో 62 మందికి మాత్రమే డెంగీ నిర్ధారణ అయ్యిందని...అందరూ కోలుకున్నారన్నారు. విష జ్వరాల నివారణ చర్యల్లో ఇబ్బందులుంటే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఈటల సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. విష జ్వరాలపై ప్రజలు భయబ్రాంతులకు గురికాకుండా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. నగరాన్నిపరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షించే బాధ్యత జీహెచ్ఎంసీ దేనని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు మల్లారెడ్డి, మహముద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్ఎంసి కమిషనర్, హెల్త్ అధికారులు పాల్గొన్నారు. -
బ్లడ్ అలెర్ట్!
సాక్షి, విశాఖపట్నం: ఏదైనా ఆపద రానుందని తెలిస్తే అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలెర్ట్ ప్రకటిస్తారు. ఇప్పుడు విశాఖకు ‘బ్లడ్’ అలెర్ట్ ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. విశాఖపట్నంలో రోజురోజుకు రక్తానికి డిమాండ్ పెరుగుతోంది. ఉత్తరాంధ్ర నుంచే కాదు.. పొరుగు జిల్లాలు, పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రోగులు, క్షతగాత్రులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీరికి అవసరమైన రక్తాన్ని ఇక్కడ ఉన్న బ్లడ్‌బ్యాంకులు సమకూరుస్తున్నాయి. విశాఖలో శస్త్రచికిత్సలు, ప్రసవాలు, డెంగీ బాధితులు, అవయవ మార్పిడులు పెరుగుతున్నాయి. ఒకపక్క రక్తదాతలు పెరుగుతున్నా అంతకు మించి డిమాండ్ పెరుగుతోంది. ఇలా ఏటా 10 శాతం చొప్పున రక్తదాతల అవసరం పెరుగుతూ వస్తోంది. సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం జనాభాలో ఒక శాతం రక్తం నిల్వలు అవసరమవుతాయి. జిల్లా జనాభా 44 లక్షలుంది. ఈ లెక్కన ఏటా 44 వేల యూనిట్ల రక్తం సరిపోతుంది. కానీ ఇరుగు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి విశాఖ వచ్చే రోగులు/క్షతగాత్రుల తాకిడితో ఇప్పుడు లక్ష యూనిట్లకు పైగా రక్తం కావలసి వస్తోంది. వీటిని సమకూర్చడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ.. విశాఖలో 17 బ్లడ్ బ్యాంకులున్నాయి. ఇవి పెరుగుతున్న రక్తం డిమాండ్‌కు అనుగుణంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలతో ఈ బ్లడ్ బ్యాంకులు అవగాహన కుదుర్చుకున్నాయి. ఏటా రెండు సార్లు ఈ కళాశాలల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తపు నిల్వలను సమకూర్చుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు కూడా విరివిగా రక్తదానానికి ముందుకొస్తున్నారు. ఇలా సగటున ఏటా 85 వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తున్నాయి. ఒకసారి సేకరించిన రక్తం 30 రోజులకు మించి నిల్వ ఉండదు. అందువల్ల రక్త సేకరణ జరిగాక ఆ 30 రోజుల్లోగా వినియోగించకపోతే వృథా అయిపోతుంది. కొన్నిసార్లు ఎక్కువ రక్తం యూనిట్లు అవసరం పడడం, మరికొన్ని సార్లు అంతగా డిమాండ్ లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏ ఏడాది సేకరణ ఎంత ? సంవత్సరం యూనిట్లు 2016–17 82,390 2017–18 82,339 2018–19 97,626 మూడు నెలల్లో సేకరించిన యూనిట్లు మార్చి 6,984 ఏప్రిల్ 6,314 మే 7,539 2018 ఎపిడమిక్ సీజన్లో.. ఆగస్ట్ 11,532 సెప్టెంబర్ 11,150 అక్టోబర్ 6,418 వ్యాధుల సీజన్ మొదలు.. వర్షాలతో పాటు వ్యాధుల సీజనూ మొదలవుతోంది. దోమకాటుతో డెంగీ, టైఫాయిడ్, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు విజృంభించనున్నాయి. వీటి బారిన పడిన వారికి ఒక్కసారిగా ప్లేట్లెట్లు పడిపోతాయి. వీరికి తక్షణమే రక్తం ఎక్కించి ప్రాణం కాపాడవలసి ఉంటుంది. వర్షాకాలం సీజన్లో విశాఖ నగరం, ఏజెన్సీలో ఏటా పెద్ద సంఖ్యలో ఈ జ్వర మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ సోకిన వారికి ప్లేట్లెట్లు శరవేగంగా పడిపోయి. రోగి ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. వీరికి రక్తం నుంచి ప్లేట్లెట్లను వేరు చేసి రోగికి ఎక్కిస్తారు. కొన్ని జబ్బుల వారికి ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా వంటివి అవసరమవుతాయి. వీటిని కూడా రక్తం నుంచి సెపరేట్ చేసి అవసరమైన వారికిస్తారు. మిగిలిన రక్తాన్ని హిమోగ్లోబిన్ అవసరమున్న వారికిస్తారు. ఏజెన్సీలో రక్తహీనత, తలసేమియా, ఎనీమియా, సికిల్‌సెల్ వంటి వ్యాధులతో బాధపడే వారు అధికంగా ఉంటారు. వీరికి రక్తం ఎక్కించి ప్రాణాపాయం నుంచి తప్పిస్తారు. ఇప్పుడు వ్యాధుల సీజను ప్రారంభం కావడంతో మరో నాలుగు నెలల పాటు రెట్టింపు రక్తపు నిల్వలు కావలసి ఉంటుంది. సాధారణ రోజుల్లో నెలకు ఐదారు వేల యూనిట్ల రక్తం అవసరం ఉండగా ఈ ఎపిడమిక్ సీజనులో రెట్టింపు సంఖ్యలో అంటే.. 12 వేల యూనిట్ల రక్తం అవసరమవుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో 22 వేలకు పైగా యూనిట్ల రక్తం నిల్వ ఉంది. కొరత రాకుండా చూస్తున్నాం విశాఖ ఆస్పత్రులకు రక్తం అవసరం ఉండే రోగులు, క్షతగాత్రులు ఎక్కువగా వస్తుంటారు. రక్తదాతల్లో అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి తక్షణమే సమకూర్చే చర్యలు తీసుకుంటున్నాం. కాలేజీ విద్యార్థులే కాదు.. 80 శాఖల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నాం. వ్యాధుల సీజన్ ప్రారంభం కావడంతో డెంగీ తదితర రోగులకు సరిపడినన్ని ప్లేట్లెట్లను అందుబాటులో ఉంచుతున్నాం. పాడేరులో త్వరలో బ్లడ్‌బ్యాంకు ఏర్పాటవుతోంది. అక్కడున్న బ్లడ్ స్టోరేజి యూనిట్‌ను ముంచంగిపుట్టుకు తరలిస్తాం. జిల్లాలో మొబైల్ బ్లడ్ కలెక్షన్ వాహనాన్ని నర్సీపట్నం, అనకాపల్లిల్లో అందుబాటులో ఉంచాం. ఎపిడమిక్ సీజన్లో రక్తం కొరత రాకుండా అప్రమత్తంగా ఉన్నాం. – రోణంకి రమేష్, ఏడీఎంహెచ్‌వో -
‘చిటుక’లో ముంచుకొచ్చే ముప్పు!
గొర్రెల్లో సీజను వారీగా, వయస్సు వారీగా కొన్ని వ్యాధులు బయల్పడుతుంటాయి. వాటికి సరిపడా యాజమాన్యముగానీ, చికిత్స గానీ, టీకా గానీ ఇవ్వకపోతే జీవాలు మృత్యువాత పడుతుంటాయి. తొలకరి వర్షాల్లో గొర్రెలకు సోకే ముఖ్యమైన వ్యాధి చిటుక రోగం. సాధారణంగా చాలా వ్యాధులకు టీకా వేయించినట్లయితే, అవి సోకకుండా ఉండే అవకాశముంది. కానీ, టీకా వేయించకుండా, వ్యాధి సోకిన తర్వాత, ఏ లక్షణాలు చూపుకుండా, వైద్యానికి సమయం ఇవ్వకుండా గొర్రెలు మృతి చెందేది ఒక చిటుక వ్యాధితో మాత్రమే. మంచి ఆరోగ్యంగా ఉండే జీవాలకు ఈ వ్యాధి సోకుతుంది. క్లాస్ట్రిడియమ్ పెర్‌ఫ్రిజన్స్ టైప్ డి అనే బ్యాక్టీరియా వలన సోకుతుంది. ఎక్కువగా స్టార్చ్ సంబంధిత మేతను తింటే ఈ వ్యాధి సోకుతుంది. తొలకరి వర్షాల తర్వాత మొలిచిన లేత గడ్డిని మేసినప్పుడు ఈ సూక్ష్మ క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధి సోకిన తర్వాత ఏ లక్షణాలు చూపకుండా, చిటిక వేసే లోపే చనిపోతాయి. కాబట్టి చిటుక వ్యాధి అంటారు. కొన్ని ప్రాంతాల్లో నెత్తిపిడుగు వ్యాధి అని కూడా అంటారు. కొన్నిచోట్ల గడ్డి రోగం అని అంటారు. జీవాలు నీరసంగా ఉండటం, చనిపోయే ముందు గాలిలోకి ఎగిరి గిలగిలా కొట్టుకుంటాయి. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా కనబడుతుంది. దీని కారక సూక్ష్మజీవి ‘ఎప్పిలాన్’ అనే విష పదార్థాన్ని జీవం శరీరంలోకి విడుదల చేస్తుంది. దీనివలన జీవాలు చనిపోతాయి. చిటుక వ్యాధి నివారణ ఇలా.. ► ఈ నెలలో అన్ని జీవాలకు టీకా వేయించాలి. ► తొలకరి వర్షాలకు మొలచి, వాడిపోయిన తేగ గడ్డిని గొర్రెలు మేసినట్లయితే ఈ వాధి సూక్ష్మ క్రిముల ద్వారా ప్రబలుతుంది. అందుచేత వాడిపోయి మళ్లీ మొలచిన గడ్డిని గొర్రెలు మేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ► మందలో ఒకటి, రెండు జీవాలకు వ్యాధి కనిపించినట్లయితే, మిగిలిన వాటికి టీకా వేయించాలి. వలస వెళ్లే జీవాల్లో ఎక్కువగా ఈ వ్యాధి కనపడుతుంది. – డా. ఎం. వి. ఎ. ఎన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్ అండ్ హెడ్, పశుగణ క్షేత్ర సముదాయం, పశువైద్య కళాశాల, తిరుపతి -
చిన్నజీవని వదిలేస్తే.. చిదిమేస్తుంది..!
మలేరియా.. ఒకప్పుడు సీజనల్ వ్యాధిగా ప్రచారంలో ఉన్న తీవ్ర జరం. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్రామాలు సహా పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణలోపం, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి సమస్యల కారణంగా ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చిత్తూరు అర్బన్ : చూసేందుకు అది చిన్న జీవే. కానీ కుడితే కలిగే నష్టం అపారం. మనిషిని నిలువునా కుంగదీస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలమీదకే తెస్తుంది. అదే మలేరియాకారక దోమ. జిల్లాలో ఈ సమస్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. అప్రమత్తంగా లేకుంటే చేజేతులా ప్రాణాలపైకి కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అందుకే ప్రజల్ని చైతన్యం చేయడానికి ఏటా ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దోమల నియంత్రణకు ప్రభుత్వం కోట్లలో నిధులు ఖర్చు చేస్తోంది. వైద్యశాఖ దీన్ని సరిగా ఉపయోగించుకోకపోవడంతో నిధుల వ్యయం తప్ప ఫలితం కనిపించడం లేదు. ఫాగింగ్, దోమల నివారణకు చేపట్టే చర్యల్లో నిర్లక్ష్యం, అవినీతి కారణంగా మలేరియా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్ప ప్రైవేటు ఆసుపత్రి, నర్సింగ్ హోమ్‌లలో రోగుల గురించి రికార్డులు అధికారిక లెక్కల్లోకి రావడం లేదు. దీంతో మలేరియా ప్రమాదకరంగా మారుతోంది. ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మలేరియా కారక దోమలను అరికట్టవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. వేసవి తరువాత.. ఎండాకాలం పూర్తవుతుండగానే వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, చిన్నపాటి తుంపర్ల నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతుంటాయి. మలేరియా వ్యాప్తికి ఈ సీజన్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఒకప్పుడు మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా కన్పించే ఈ వ్యాధి ఇటీవల పట్టణాలు, నగరాలను సైతం విజృభిస్తోంది. గత ఏడాది జిల్లాలో 44 కేసులు నమోదయినట్లు అధికారిక లెక్కల్లో ఉంటే ఇది 200కు దాటిందనేది వాస్తవం. అపరిశుభ్ర వాతావరణం, మురుగు కాలువల నిర్వాహణ సక్రమంగా లేకపోవడం, దోమల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు తూతూమంత్రంగా ఉండడం తదితర కారణాలు వ్యాధికి దోహదం చేస్తున్నాయి. అయితే ప్రైవే టు ఆసుపత్రులకు వస్తున్న కేసులు గురించి బయటకు తెలియడం లేదు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న రోగులకే లెక్కల కింద చూపుతున్నారు. జిల్లాలో ఇవే అధికం.. మలేరియాకు కారణమయ్యే ఫ్లాస్మోడియం పరాన్నాజీవి ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఇవి మురుగునీటి కాలువలు, చెరువులు, కుంటలు, పంట కాలువలు, పొలాల్లో ఎక్కువగా పెరుగుతాయి. చాలా వేగంగా ఎగురుతూ రాత్రి పూట కుడుతాయి. అవి కుట్టినప్పుడు నొప్పి, శరీరంలో దద్దుర్లు కొందరికి రావచ్చు. శరీరంలోకి ప్రవేశించిన ఫ్లాస్మోడియం పరాన్నజీవి ఎర్రరక్త కణాలపై దాడి చేస్తుంది. మలేరియాలో ఫ్లాస్మోడియం వైవాక్స్ (పీవీ), ప్లాస్మోడియం పాల్సీఫారం (పీపీ) అనేవి రెండు దశాలు. మొదటి దశలో కన్నా జిల్లాలో రెండో దశ వల్ల ఎక్కువ మంది మలేరియా బారిన పడుతున్నారు. వ్యాధి లక్షణాలు ఇలా.. ♦ మలేరియా దోమ ఆరోగ్యవంతుల్ని కుట్టిన 10 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ♦ తొలుత జ్వరం, ఒళ్లుæ నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి.. అంత ప్రమాదకరం కాదు. మందులు వేస్తే తగ్గిపోతుంది. రెండో రకమైన ఫ్లాస్మోడియం పాల్సీఫారం మాత్రం ప్రమాదకరమే. ♦ రెండో దశను త్వరగా గుర్తించి చికిత్స అందజేయకపోతే కాలేయం, కిడ్నీలు, రక్త కణాలను దెబ్బతీస్తుంది. ఒక్కోసారి మెదడుపై ప్రభావం చూపి రోగి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ♦ రోజు విడిచి రోజు జ్వరం తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. చలిజ్వరం, చమటలు పట్టడం, కొన్నిసార్లు వాంతులవుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సప్రదించి రక్త పరీక్షలు చేసుకుని చికిత్స తీసుకోవాలి. జాగ్రత్తలు తప్పనిసరి.. ♦ సమస్య వచ్చిన తర్వాత చికిత్స కంటే.. ముందే జాగ్రత్త పడడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా దోమకాటు బారిన పడకుండా చూసుకోవడం ప్రధానం. ♦ బయటకు వెళ్లేటప్పుడు కాళ్లు, చేతులను పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. ♦ ఇంటి చుట్టు పక్కల దోమలు పెరగకుండా చూసుకోవాలి. కూలర్లు, కుండీల్లో వారానికోసారి నీరు మారుస్తుండాలి. నీటి పంపులు, ట్యాంకులపైన మూతలు తప్పనిసరి. టైర్లు, కప్పులు, కొబ్బరి చిప్పలు, పాత్రలు వంటివి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండకుండా చూసుకోవాలి. ♦ సెప్టిక్‌ట్యాంకు నుంచి గాలివెళ్లే పైపులకు మెస్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ♦ నిద్రించేటప్పుడు దోమ తెరలు వాడాలి. కిటికీలు, తలుపులకు దోమలు రాకుండా తెరలు అమర్చుకోవాలి. ♦ దోమలు బాగా ఉన్న ప్రాంతంలో జ్వరాలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి మలేరియా అవునో, కాదో తేల్చుకోవాలి. ఒకవేళ అది కాకపోతే డెంగీ అనే అనుమానుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ప్రజలు బాధ్యతగా ఉండాలి.. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ప్రజల బాధ్యతే. పంచాయతీలు, మునిసిపాలిటీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపడుతున్నా.. ఇంటి చుట్టుపక్కల ఉన్న వ్యర్థాలను మనమే తీసేయాలి. ముఖ్యంగా వర్షపు నీరు నిల్వ ఉండే కొబ్బరి చిప్పలు, టైర్లను తీసేయండి. ప్రతీ శుక్రవారం కావాల్సిన నీళ్లను ఉంచుకుని డ్రై డేను పాటించాలి. రెండు రోజుల పాటు జ్వరం తగ్గకుంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. – డాక్టర్ ఇ. ఉస్సేనమ్మ,జిల్లా మలేరియా అధికారి -
సీజనల్ వ్యాధుల నివారణకు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ఏజెన్సీకి ఫీవర్’ శీర్షికతో ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యాధి నిర్ధారణ కిట్లు, మందులు సిద్ధం చేశామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, గతంలోలాగే అధికారులు, వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించామని మంత్రి చెప్పారు. వైద్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉంద న్నారు. ఈ సీజన్లో సాధారణం గా డెంగీ, స్వైన్‌ఫ్లూ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, వైరల్ హెపటైటిస్ (జాండీస్), విరేచనాలు, వాంతులు, డిప్తీరియా వంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయని, వైరల్, సీజనల్ వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంటుందన్నారు. అందుకని ఇలాంటి వ్యాధి లక్షణాలు కనిపించిన వారు వెంటనే సమీప ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్ళాలని సూచించారు. ఈ సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి, ప్రజలకు సత్వర వైద్యం అందడానికి వీలుగా వ్యాధి నిర్ధారణ కిట్లు, మందులతో సిబ్బంది, డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ల్యాబ్ టెస్టులు చేయడానికి స్టాఫ్, కిట్లు, ఓపీలోనూ తగు సదుపాయా లు, ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ సిద్ధం చేశామన్నారు. దోమలు పెరగకుండా, నీళ్ళు నిల్వ ఉండకుండా, బురద, మురుగునీరు చేరకుండా, పారిశుద్ధ్యం సరిగా ఉండేలా మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ వంటి శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి... ఏజెన్సీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఇప్పటికే మాట్లాడామన్నారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో చర్చించామన్నారు. ప్రజల్లో వ్యాధుల పట్ల అవగాహన, చైతన్యం పెంచామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైద్యశాలల్లోనూ సదుపాయాలు, మందులు, పరికరాలు పెంచామని, అనేక మంది స్పెషలిస్టు డాక్టర్లను కూడా నియమించామని, దీంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఇప్పుడిప్పుడే సీజనల్ వ్యాధు లు వస్తున్నాయని, వీటిని మొగ్గలోనే తుంచే విధంగా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రాథమిక దశలోనే వైద్యశాలలకు చేరితే ఎలాంటి ప్రమాదాలుండవన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి తదితరులతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. -
సీజనల్ వ్యాధుల పట్ల ఇంత నిర్లక్ష్యమా?
తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో చెరువులు, కుంటలు, నీటితో నిండి కనువిందు చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లడంతో వివిధ గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు సీజనల్ వ్యాధులవల్ల అనారోగ్యం పాలవుతున్నారు. విషజ్వరాలు సైతం ప్రబలి మంచాలకే పరిమితమవుతున్నారు. జ్వరం, దగ్గు, నీళ్ల విరేచనాలతో ప్రజలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులవైపు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుల కొరతతో పాటు సరైన మందులు లేకపోవడంతో ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటూ ఆర్థికంగా ఇబ్బం దుల పాలవుతున్నారు. ఇదే అదనుగా భావిం చిన ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు తమ దగ్గరకు వచ్చే రోగులకు వివిధ రకాల పరీక్షలు, మందుల పేరిట అందినకాడికి డబ్బులు గుంజుకుంటున్నారు. గ్రామాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైంది. వర్షాకాలంలో ప్రబలేవ్యాధులు, నివారణోపాయాలపై గ్రామాలవా రీగా సమావేశాలు పెట్టి అవగాహన కల్పిస్తూ వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత వైద్యశాఖపై ఉన్నప్పటికీ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఏజెన్సీ వాసులు నిరక్షరాస్యులు కావడం, సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో వ్యాధులతో బాధపడేవారికి సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. విషజ్వరాలే కాకుండా వివిధ రకాల ప్రాణాంతక వ్యాధులకు ప్రజలు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులను అరికట్టడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ప్రభుత్వ దవాఖానా పట్ల నమ్మకం పెంచాలి. వైద్య వృత్తి పవిత్రతను కాపాడాలి. -కామిడి సతీష్ రెడ్డి, జెడలపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ‘ 98484 45134 -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : వర్షాలు కురుస్తున్నందున వాతావరణంలో మా ర్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రమ్మోహన్ రావు సూచించారు. సోమవారం కలెక్టర్ వీడి యో కాన్ఫరెన్స్‌లో మండలాధికారులతో మాట్లాడారు. ఎక్కడ కూడా వర్షపు నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని, ము రుగునీరు ఇళ్ల పరిసరాల్లో రాకుండా చూ సుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో మురుగు కాలువలను, వీధులను శుభ్రం చేయించడానికి పారిశుధ్య కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలన్నారు. ఈ ఏడాది 1.85 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో వ్యవసాయ, ఉద్యా, అబ్కారీ, నీటి పారుదల శాఖలకు ఎక్కువ లక్ష్యాలు కేటాయించినట్లు తెలిపారు. అడవుల్లో 21లక్షల పండ్ల మొక్కలను ఈ సారి నాటనున్నామని, తద్వారా కోతులు తిరిగి అడవుల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. రెండు లక్షల వెదురు మొక్కలు కూడా నాటుతున్నామన్నారు. మేదరి కులవృత్తులను పోత్సహించి ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రతి మండలానికి రెండేసి లక్షల టేకు మొక్కలను అందిస్తున్నామని, వీటిని రైతులకు ఇవ్వాలన్నారు. ధరణి కార్యక్రమంలో పనులు మరింత వేగవంతం చేయాలని, రోజువారీ డిజిటల్ సంతకాలు ఇంకా ఎక్కువ సంఖ్యలో జరగాలని కలెక్టర్ తహసీల్దార్లను ఆదేశించారు. మొత్తం 33,763 ఆమోదానికి గాను 18,863 సంతకాలు అయ్యాయని, ఇంకా 14,906 పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఏర్గట్ల మండలంలో మూడు రోజలుగా సంతకాలు కాకపోవడంపై, ముప్కాల్ మండలంలో నాలుగు రోజులకు గాను 15 సంతకాలు కావడంపై కలెక్టర్ తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల సంతకాలు పూర్తయ్యేలా చూడాలన్నారు. కళ్యాణలక్ష్మికి ఇప్పటి వరకు 5,137 దరఖాస్తులకు గాను 4,858 దరఖాస్తులను తహశీల్దార్లు పరిశీలించారని, మరో 279 పరిశీలించాల్సి ఉందని చెప్పారు. షాదీ ముబారక్‌లో 1,978 దరఖాస్తులకు గాను 1,875 పరిశీలించగా, 103 పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ రవీం దర్ రెడ్డి, జడ్పీ సీఈఓ గోవింద్, డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఎఫ్ఓ ప్రసాద్, ఆర్డీఓ వినోద్ కుమార్, తదితరులున్నారు. టీఎస్ ఐపాస్‌పై సమీక్ష... టీఎస్ ఐపాస్‌పై కలెక్టర్ రామ్మోహన్ రావు తన చాంబర్లో అధికారులతో సమీక్షించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన వారికి నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వాలని, దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టవద్దన్నారు. -
గోలీ.. ఖాళీ
♦ పెద్దాస్పత్రిలో ఔషధాల కొరత ♦ ఓ వైపు విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు ♦ మరోవైపు అందుబాటులో లేని మందులు ♦ అరకొర మాత్రలతో రోగులకు తిప్పలు ♦ జీఎస్టీ పేరుతో చేతులెత్తేస్తున్న కాంట్రాక్టర్లు ఓ పక్క సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.. పెద్దాస్పత్రిగా పేరుగాంచిన మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో నమోదయ్యే ఓపీ సాధారణ రోగుల సంఖ్య రోజుకు రెండు వేల నుంచి మూడు వేలకు చేరుకుంది. ఇలాంటి సీజన్లో అప్రమత్తంగా ఉండి రోగులకు మెరుగైన సేవలందించాల్సిన అధికారులు ఏమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో నెలకొన్న ఔషధాల కొరత వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పిడియాట్రిక్ విభాగంలో చిన్న పిల్లలు, పెద్దలకు జ్వరం, దగ్గు వంటి తదితర వ్యాధులకు సంబంధించిన పలురకాల మందులు పూర్తిస్థాయిలో నిండుకున్నాయి. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రి.. ‘యమ’జీఎంగా మారింది. ఏటేటా పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సేవలందకపోవడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వైద్య పరికరాల లేమి.. వసతుల కొరత.. అధికారులు, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వెరసి ప్రభుత్వ వైద్యం అందని దైన్య పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. ఎంజీఎం: ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిని ఔషధాల కొరత పీడిస్తోంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా ఎలాంటి ఔషధాలు ఉన్నాయి.. వర్షాకాలం సీజన్ నేపథ్యంలో ఎంత మేర అవసరమవుతాయో.. అనే కోణంలో పరిపాలనాధికారులు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. వైద్యులు రాసిన చీటీలు పట్టుకుని ఔషధాల కోసం కుస్తీ పట్టగా.. రాసిన ఐదు రకాల్లో ఒకటో.. రెండో తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో మందులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించడానికి వెళితే.. ఆస్పత్రిలో పరిపాలనాధికారుల జాడ తెలియడం లేదని రోగులు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో పెద్దాస్పత్రికి వస్తున్నామని.. వందల రూపాయలు వెచ్చించి బయట కొనుగోలు చేయలేకపోతున్నామని వాపోతున్నారు. అరకొర మందులతో వ్యాధుల తగ్గుముఖం పట్టకపోవడంతో నానా అవస్థలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజనల్ కాలంలో... సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న క్రమంలో ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో మేల్, ఫిమేల్ ఓపీలలో నిత్యం వందలాది మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఇందులో పరిస్థితి విషమంగా ఉన్న రోగులను ఇన్‌పెషెంట్‌గా అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. మిగతా రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి యాంటీబయోటిక్‌తో పాటు వివిధ రకాల ఔషధాలను రాసి పంపిస్తున్నారు. వైద్యులు రాసిన చీటీలు పట్టుకుని ఆస్పత్రిలో ఫార్మసీ విభాగానికి వెళ్లిన రోగులకు భంగపాటు తప్పడం లేదు. అరకొరగా మాత్రలు ఇస్తుండడంతో పేద రోగులు ఏంచేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్నారు. వారం క్రితమే నిండుకున్నాయి.. సీజనల్ వ్యాధుల సమయంలో అందించే ఆమాక్సిలిన్ క్లవ్నెట్ వంటి యాంటీబయోటిక్ మాత్రల నిల్వలు వారం రోజుల క్రితమే నిండుకుంటున్నాయి. అయినప్పటికీ పరిపాలనాధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అంతేకాకుండా సాధారాణంగా అందించే బీపీ, కోలోబీపీ, కొలెస్ట్రాల్, లివర్, మలేరియాకు సంబంధించిన ఔషధాల నిల్వలు ఆస్పత్రిలో పూర్తిగా నిండుకున్నాయి. నొప్పులకు కోసం అందించే ఔషధాలు సైతం ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల విభాగానికీ తప్పని తిప్పలు.. ఎంజీఎం ఆస్పత్రిలో పిడియాట్రిక్ విభాగాన్ని సైతం ఔషధాల కొరత ఇబ్బంది పెడుతోంది. చిన్న పిల్లలకు అందించే పారాసిట్మాల్ సిరప్ సైతం అందుబాటులో లేదు. దగ్గు, యాంటీబయోటిక్ సిరప్లు లేకపోవడంతో చిన్నారులు తల్లులు వైద్యుల చీటీలు పట్టుకుని ప్రైవేట్ మెడికల్ హాళ్లకు పరుగులు పెడుతున్నారు. పిడియాట్రిక్ విభాగంలో రెండు నెలల నుంచి సెఫీక్సిమ్ యాంటీబయోటిక్ సిరప్ సరఫరా నిలిచిపోయింది. కాగా, జీఎస్టీ పేరుతో కాంట్రాక్టర్లు సరఫరా చేయకుండా చేతు లెత్తేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. స్టోర్ సిబ్బంది నిర్లక్ష్యం.. ఔషధాల కొరతను గుర్తించి.. నిండుకున్న నిల్వలపై ఎప్పటికప్పడు ఎంజీఎం పరిపాలనాధికారులకు సమాచారం అందించాల్సిన స్టోర్ సిబ్బందిలో నిర్లక్ష్యం ఆవహించినట్లు తెలుస్తోంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్ ద్వారా సరఫరా లేని సమయంలో అలాంటి ఔషధాలను టెండర్ ద్వారా కొనుగోలు చేసి రోగులకు అందించాల్సి ఉంది. ఔషధాలు పూర్తి స్థాయిలో నిండుకున్నప్పటికీ.. వారు స్పందించడం లేదు. పూర్తి స్థాయిలో మందులు ఇవ్వడం లేదు.. కడుపునొప్పితో వచ్చా. ఒక రకం గోలి లేదని పంపించేశారు. ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో మందులు అందించాలి. – బాబు, వరంగల్ -
రిమ్స్‌కు సుస్తి..!
► జ్వర పీడితులతో కిక్కిరిసిన ఆస్పత్రి ► ఒక్కో పడకపై ఇద్దరేసి రోగులు ► కంపుకొడుతున్న మరుగుదొడ్లు ► ఇదీ.. పెద్దాస్పత్రి తీరు జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రబలు తుండడంతో రోగులు రిమ్స్ ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. దీంతో ఆస్పత్రిలోని ఆయా వార్డులు కిక్కిరిసిపోతున్నాయి. బెడ్లు సరిపడా లేక ఒక్కోదానిపై ఇద్దరేసి రోగులను పడుకోబెట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అలాగే ఆస్పత్రిలో సరైన వసతులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్: జిల్లాలోని గిరిజన ప్రాం తాలైన నార్నూర్, ఉట్నూర్, నేరడిగొండ, ఇంద్రవెల్లి, బోథ్ తదితర మండలాల నుంచి రోగులు రిమ్స్‌కు వస్తున్నారు. వీరిలో చాలా మంది టైఫాయిడ్, మలేరియాతో జ్వరాలతో వస్తున్నారు. జిల్లా నలుమూలల నుం చి రోగులు వస్తుండగా వార్డుల్లో ఒక్కో పడకపై ఇద్దరు చొప్పున పడుకోబెడుతున్నారు. ఏటా వర్షాకాలంలో సీజన ల్ వ్యాధులతో రోగులు అధికసంఖ్య లో రిమ్స్‌కు వస్తుంటారు. అలాంటిది ముందస్తు చర్యలు తీసుకుని రోగులకు సరిపడా వార్డులు, పడకలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకే బెడ్‌పై ఇద్దరు చొప్పున.. రిమ్స్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగిపోయింది. ప్రతీరోజు ఓపీ విభాగంలో వెయ్యికిపైగా కేసులు వస్తున్నాయి. ఇన్‌పేషంట్‌గా 200 మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. వీరిలో 30మంది వరకు జ్వరా>లతో బాధ పడుతున్నవారే. ఐటీడీఏ వార్డులో గత రెండు రోజుల్లోనే 25మంది వరకు రోగులు చేరారు. కాగా రోగులకు సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్కో పడకపై ఇద్దరు రోగులను పడుకోబెట్టడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్న జబ్బు తగ్గడమేమోగానీ కొత్త జబ్బు పట్టుకునేలా ఉందని రోగులు వాపోతున్నారు. ఒకే పడకపై ఇద్దరు రోగులు ఉండడంతో ఎటూ కదలలేని పరిస్థితి. అటు సిబ్బందికి కూడా చికిత్స చేయడం ఇబ్బందే. రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా పడకలు ఏర్పాటు చేయడం లేదు. ఎప్పుడూ తాళమే.. ఆస్పత్రిలోని మరుగుదొడ్లకు ఎప్పుడు చూసినా తాళం వేసి కనబడుతోంది. రూ.లక్షలు వెచ్చింది మరుగుదొడ్లు నిర్మిస్తే వాటికి తాళాలు వేసి నిరుపయోగంగా మార్చడం సరైంది కాదని పలువురు పేర్కొంటున్నారు. ఆస్పత్రిలోని వారి బంధువులను పరామర్శించేందుకు వస్తే అత్యవసర సమయంలో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. స్త్రీల కోసం మూత్రశాలలు మాత్రమే అందుబాటులో ఉంచారు. అందులో కూడా కొన్నింటికి తాళాలు వేసి కనిపిస్తున్నాయి. పైన పటారం.. లోన లొటారం అన్న మాదిరిగా.. ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేస్తున్నా మరుగుదొడ్లను మాత్రం మరిచిపోతున్నారు. ఆస్పత్రికి నిత్యం వందల సంఖ్యలో రోగులు, వారి బంధువులు వస్తూ వెళ్తుంటారు. రోగులున్న వార్డుల్లోని మరుగుదొడ్లను మాత్రమే శుభ్రం చేయిస్తున్నారు. కింది నుంచి మూడంతస్తుల వరకు బయటి మరుగుదొడ్లను అలాగే వదిలేస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో ఒంటికి.. రెంటికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రోగులను పరామర్శించేందుకు వచ్చి ఇక్కడి అపరిశుభ్రతతో ఇతరులు అనారోగ్యం బారిన పడే పరిస్థితులను తీసుకురావద్దని, పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు. దీనికి తోడు నీటి సరఫరాలో అంతరాయం.. మరుగుదొడ్లలోని సింకులు, పైప్‌లు లేకపోవడంతో ఓ కారణంగా తెలుస్తోంది. ఏదేమైనా నిత్యం రోగుల తాకిడితో కిటికిటలాడే రిమ్స్ ఆస్పత్రిలో సరైన సదుపాయాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు. నా దృష్టికి రాలేదు ప్రస్తుతం గతంలో మాదిరిగానే సాధారణ కేసులు వస్తున్నాయి. గతేడాది కంటే జ్వరాలతో ఈ ఏడాది తక్కువగానే ఉన్నాయి. వార్డుల్లో ఇద్దరేసి రోగులను పడుకోబెట్టినట్లు నా దృష్టికి రాలేదు. ఒకవేళ అలా ఉంటే పరిశీలించి సరిపడా పడకలు ఏర్పాట్లు చేస్తాం. – అశోక్, రిమ్స్ డైరెక్టర్ రిమ్స్ ఆస్పత్రిలో రోగులకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని చెబుతున్న అధికారులు కనీస వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. సీజనల్ వ్యాధులు పెరుగుతున్నా ముందస్తు చర్యలు చేపట్టడంలేదు. ఒక్కో పడకపై ఇద్దరేసి రోగులను పడుకోబెడుతుండగా వారికి ఇక్కట్లు తప్పడంలేదు. గత రెండు రోజుల్లోనే చిల్డ్రన్స్ వార్డులో 75మంది చేరగా వారిని జబ్బుతో పాటు పడకల కొరత వేధిస్తోంది. – చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
డెంగీపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
అనంతపురం అర్బన్ : ‘వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డెంగీ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి. పారిశుద్ధ్యం మెరుగుపర్చాలి. డెంగీ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించండి’ అని కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ నుంచి డెంగీ వ్యాధి, గృహ నిర్మాణం, నీరు - ప్రగతి పనులపై వేర్వేరుగా ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి నాల్గో శనివారం దోమలపై దండయాత్ర కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించేలా ప్రజలను చైతన్యపర్చాలన్నారు. ఆర్ఎంపీలు జ్వరంతో వచ్చిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేయాలని, అలా కాకుండా వైద్యం అందిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ గ్రామీణ, పట్టణ గృహ పథకం కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల తీరు సక్రమంగా లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 11,487 ఇళ్లు గ్రౌండింగ్ చేశారని, 2,285 మాత్రమే పూర్తి చేశారని, పట్టణాల్లో 2,590 గ్రౌండింగ్ చేశారని, 153 మాత్రమే పూర్తి చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామసభలు నిర్వహించి 2017 - 18, 2018 - 19 సంవత్సరాలకు లబ్ధిదారులను వారం రోజుల్లోగా ఎంపిక చేయాలని ఆదేశించారు. నీరు - ప్రగతి కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. టెండర్ల ద్వారా చేపట్టాల్సిన పనులకు సంబంధించి వారంలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. సమావేశంలో జేసీ - 2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఇరిగేషన్ ఎస్ఈ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా చైతన్యమే కీలకం!
♦ సీజనల్ వ్యాధుల అడ్డుకట్టకుపక్కా ప్రణాళిక ♦ అమలుకు ప్రజల సహకారం చాలా అవసరం ♦ గతానుభవాలతో ఏజెన్సీపై ప్రత్యేక దృష్టి ♦ పీహెచ్‌సీల్లో తగినంతగా మందులు సిద్ధం ♦ తాగునీటి బావుల్లో క్లోరినేషన్ ప్రారంభం ♦ ఉద్దానంలో మిగతా వారికీ వైద్య పరీక్షలు ♦ డీఎంహెచ్‌వో డాక్టర్ సనపల తిరుపతిరావు జూన్ నెల వచ్చిందంటే వర్షాలతో పాటే సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది. వీటికి ప్రధాన కారణం దోమలే. మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాలే వీటికి ఆవాసాలు! జనావాసాల మధ్య మురుగు కాలువలు, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా ఉండాల్సిందే. వైద్య, ఆరోగ్య విభాగం సిబ్బంది కృషికి తోడు ప్రజా చైతన్యం తోడైతేనే సీజనల్ వ్యాధులకు పక్కాగా అడ్డుకట్ట వేయగలమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ సనపల తిరుపతిరావు చెబుతున్నారు. గతానుభవాలు పునరావృతం కాకుండా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయడానికి కసరత్తు చేస్తున్న ఆయన ‘సాక్షి’ ఇంటర్వూ్యలో పలు విషయాలు వెల్లడించారు. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: సాక్షి: సీజనల్ వ్యాధుల నిరోధానికి ప్రత్యేక ప్రణాళిక ఏమైనా ఉందా? డీఎంహెచ్‌వో: ఈ సీజన్లో డయేరియా, జ్వరాల విషయానికొస్తే చికున్‌గున్యా, డెంగీ, మలేరియా ఎక్కువగా ప్రబలే ప్రమాదం ఉంటుంది. మలేరియా నిరోధానికి జిల్లావ్యాప్తంగా ఈనెల ఒకటో తేదీ నుంచి స్ప్రేయింగ్ ప్రారంభించాం. జిల్లాలో 469 హైరిస్క్ గ్రామాలు ఉన్నాయి. తొలివిడతగా అక్కడ చేపట్టాం. అన్ని రకాల జ్వరాల నిరోధానికి ఒక ప్రణాళిక రూపొందించాం. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు సిద్ధం చేశాం. జిల్లాలో జ్వరాల బాధితుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మీ శాఖపరమైన అప్రమత్తత ఎలా ఉంది? ఎవ్వరికైనా ప్రాథమికంగా జ్వరం లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ఆస్పత్రికి వీలైనంత త్వరగా వెళ్లాలి. అక్కడ మూడ్రోజుల నుంచి తగ్గకుండా జ్వరం వస్తుంటే ఎన్ఎస్–1 పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ పాజిటివ్ వస్తే వారి రక్త నమూనాలు సేకరించి శ్రీకాకుళంలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు కానీ, విశాఖలోకి కింగ్‌జార్జి ఆసుపత్రి (కేజీహెచ్)కు కానీ ఎలీజా పరీక్షకు పంపిస్తారు. ఆ పరీక్షల్లోనూ పాజిటివ్ వస్తే అది చికెన్ గున్యా లేదా డెంగీ జ్వరంగా నిర్ధారించి తగిన వైద్యం అందిస్తాం. ఇందుకు అవసరమైన అత్యవసర మందులు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచాం. సబ్సెంటర్లలో, ఏఎన్ఎంల వద్ద కూడా ఐవీ ఫ్లూయిడ్స్ కొంతమేర ఉంచాం. ఆశా కార్యకర్తల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాం. పారిశుద్ధ్యలోపం, కలుషిత తాగునీరు కూడా వ్యాధులకు కారణమవుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలేమిటి? ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుద్ధ్యం పాటించాలి. హెల్త్ ఎడ్యుకేషన్ కూడా చాలా అవసరం. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి రోజు ఎవ్వరు ఏ గ్రామంలో అవగాహన కార్యక్రమం చేపట్టాలనేది ప్రణాళిక రూపొందించి, ఆ ప్రకారం కొనసాగిస్తున్నాం. తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ఏటా సగటున తొమ్మిది నుంచి పది వరకూ డయేరియా కేసులు నమోదవుతున్నాయి. అలాంటి గ్రామాల్లో ప్రజలు కచ్చితంగా కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలి. ప్రతి గ్రామంలోనూ తాగునీటి బావులన్నీ క్లోరినేషన్ చేయిస్తున్నాం. పది లక్షల వరకూ క్లోరిన్ టాబ్లెట్లు జిల్లాకు అవసరమని ఇండెంట్ పెట్టాం. ప్రజలు కూడా వారానికొకసారి డ్రైడే తప్పనిసరిగా నిర్వహించాలి. పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరత సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారు? ఏజెన్సీలో తగిన సంఖ్యలోనే సిబ్బంది ఉన్నారు. సీహెచ్‌సీల్లో కొన్నిచోట్ల ప్రత్యేక వైద్యాధికారులు, ముఖ్యంగా ప్రసూతి వైద్యుల కొరత ఉంది. ఆమేరకు జిల్లా పరిధిలో సర్దుబాటు చేస్తున్నాం. ప్రతి పీహెచ్‌సీకి ఒక వైద్యాధికారి ఉండేలా చూస్తున్నాం. ఏజెన్సీలో సమస్య ఉంటే మైదాన ప్రాంతాల నుంచి డిప్యూటేషన్‌పై నియమిస్తాం. అలాగే ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ అన్ని పీహెచ్‌సీల్లోనూ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చాం. వ్యాధుల పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రతిరోజూ నివేదికలు ఇవ్వాలని చెప్పాం. మందుల కొరత సమస్యను ఎలా అధిగమిస్తారు? ఓపీలో వస్తున్న పేషెంట్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఇండెంట్ పెడితే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి మందులు వస్తాయి. గతంలో ఈ ప్రక్రియ సరిగా నిర్వహించకపోవడం వల్ల కొరత ఏర్పడింది. ఇ–ఔషధి ద్వారా ప్రతిరోజూ వైద్యాధికారులు స్థానికంగా వ్యాధుల పరిస్థితిని సమీక్షించి ఇండెంట్లు పెడుతున్నారు. దోమతెరల పంపిణీ ఎంతవరకూ వచ్చింది? ప్రపంచబ్యాంకు నిధులతో కేంద్ర ప్రభుత్వం దోమతెరల పంపిణీ చేపట్టింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సుమారు రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి. గత ఏడాది 46,900 దోమతెరలు ఏజెన్సీలోని గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులతో పాటు హైరిస్క్ గ్రామాల్లో ప్రజలుకు పంపిణీ చేశాం. ఈ సంవత్సరం 90 వేల దోమతెరలు అవసరమని ఇండెంట్ పెట్టాం. అవి ఇంకా రావాల్సి ఉంది. జిల్లాలోని చాలా ప్రాంతాలకు 104 సంచార వైద్య వాహనాలు వెళ్లకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎలా పరిష్కరిస్తారు? గతంలో గుర్తించిన గ్రామాలను కచ్చితంగా కవర్‌చేసేలా 104 వాహనాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక 108 అంబులెన్స్‌ల విషయానికొస్తే పాడైన వాటిని మార్చేసి ఇటీవల ఐదు కొత్తవాటిని తెప్పించాం. డీజిల్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. జిల్లాలో రోగుల అవసరానికి తగిన రక్తనిధి ఏర్పాటుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? డెంగీనే కాదు ఏ రకమైన జ్వరం బారిన పడినా రోగుల రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. వాస్తవానికి జిల్లాలో జాతీయరహదారి తదితర రహదారులపై జరుగుతున్న ప్రమాదాల బాధితులకు, రోజువారీ ఆసుపత్రులకు వచ్చే జ్వరాల పీడితులు, ఇతరత్రా శస్త్రచికిత్సలకు అవసరాన్ని బట్టి చూస్తే 24 వేల యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది. కానీ ఆ స్థాయిలో అందుబాటులో లేదు. విద్యార్థులు మాత్రమే రక్తదానానికి ముందుకొస్తున్నారు. ప్రజలు కూడా రక్తదానానికి ముందుకు రావాలి. ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఎంతవరకూ వచ్చింది? ఇప్పటికే ఉద్ధానం ప్రాంతంలో 15 మొబైల్ టీమ్‌లు 176 గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి రక్త, సీరమ్ పరీక్షలు చేశాయి. వీటి ద్వారా 13వేల మంది కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వారిలో నాలుగు వేల మందికి రెండో దశ పరీక్షలు పూర్తయ్యాయి. వేసవికాలం దృష్ట్యా కొంతకాలం ఈ పరీక్షలు ఆపేసినా ఈనెల రెండో వారం నుంచి మిగతావారికి మళ్లీ ప్రారంభించాం. 176 గ్రామాల్లో జనాభా 2.67 లక్షలకు పైగా ఉంది. వారిలో 18 ఏళ్లు నిండినవారికి పరీక్షలు నిర్వహించారు. ఇంకా 70 వేలమంది వరకూ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. రిమ్స్‌లో నెఫ్రాలజిస్టు కూడా నియమితులయ్యారు. -
సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి
అధికారులకు లక్ష్మారెడ్డి ఆదేశం సాక్షి, హైదరాబాద్: సీజనల్ వ్యాధుల నివారణపై దృష్టి సారించాలని అధికారు లను మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. ఏజెన్సీ సహా మైదాన, లోతట్టు, బస్తీ ప్రాంతాలనూ పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలన్నారు. శుక్రవారం సచివాలయంలో సీజనల్ వ్యాధులు, ఉద్యోగ నియామకాలు, కేసీఆర్ కిట్ల పథకం అమలుపై ఉన్నతాధికారులతో లక్ష్మారెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశుధ్యం, దోమలు, వ్యాధుల నివారణపై పంచాయతీరాజ్, పట్టణ, నగర పాలక సంస్థలతో కలసి పనిచేయాలన్నారు. వ్యాధు లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ప్రాథమిక స్థాయిలోనే పరీక్షలు చేయించుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రాంతాలను తీవ్ర, మాధ్యమిక, సామాన్య విగా గుర్తించి వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశిం చారు. ఇప్పటి వరకు 6,279 కేసీఆర్ కిట్ల పంపిణీ జరిగిం దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మున్ముందు మరిన్ని ప్రసవా లు పెరిగే అవకాశం ఉంటుందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. -
ముప్పు ముంచుకొస్తున్నా.. మొద్దు నిద్రే!
కలెక్టర్లతో మంత్రి లక్ష్మారెడ్డి సమావేశమైనా అప్రమత్తం కాని వైద్యాధికారులు రాష్ట్రంలో వ్యాధుల సీజన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలున్నాయి. దోమల స్వైరవిహారానికి సమయం ఆసన్నమైంది. ప్రతియేటా వర్షకాలంలో మురుగు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నా అధికారులు అలసత్వం మాత్రం వీడడంలేదు. ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ అమాత్యుడు ఆదేశించినా.. పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు సైతం వెక్కిరిస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ డెంగీ హైరిస్క్ జిల్లాలు పాత ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి,నిజామాబాద్, మహబూబ్‌నగర్ డెంగీ హైరిస్క్‌లో ఉండే ప్రజలు 54,23,000 మలేరియా హైరిస్క్ జిల్లాలు ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ మలేరియా హైరిస్క్ గ్రామాలు 2,067 మలేరియా హైరిస్క్‌లో ఉండే ప్రజలు 9,57,000 ఈ సీజన్లో వచ్చే ముఖ్య వ్యాధులు... తాగునీటి కాలుష్యంతో.. డయేరియా, టైఫాయిడ్ దోమల కారణంగా.. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా చిన్నారులకు.. న్యూమోనియా ఏజెన్సీ ప్రాంతాల్లో.. విషజ్వరాలు ఏంచేయాలి.. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను ఆదుకునేందుకు జిల్లాకో రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేయాలి. ఒకేచోట పెద్ద ఎత్తున సీజనల్ వ్యాధులు సంభవిస్తే జిల్లా టీంలు రంగంలోకి దిగుతాయి. అవసరమైతే రాష్ట్రస్థాయి టీం కూడా రంగంలోకి దిగాలి. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు 61 రకాల మందులను అందుబాటులో ఉంచాలి. ఏం చేస్తున్నారు... మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించినా.. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తం కాలేదు. రెస్పాన్స్ టీమ్ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. 61 రకాల మందులకుగాను కొన్నింటినే అందుబాటులో ఉంచారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
► విధులు విస్మరిస్తే కఠిన చర్యలు ∙మంచిర్యాల, కుమురంభీం, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు ఉట్నూర్(ఖానాపూర్): వర్షాకాలం ప్రారంభం అవుతున్నందువల్ల గిరిజన గ్రామాల్లోæ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఐటీడీఏ చైర్మన్ ఎం. జ్యోతి బుద్ద ప్రకాశ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేబీ ప్రాంగణం పీఏమ్మార్సీ సమావేశ మందిరంలో మంచిర్యాల, కుమురం భీం జిల్లాల కలెక్టర్లతో కలిసి రాయిసెంటర్ల సార్మేడీలు, గ్రామపటేళ్లు, దేవారీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో కలుషిత నీరు లేకుండా, పారిశుధ్యం లోపించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య నివారణతో పాటు గ్రామాల్లో దోమలు ప్రబలకుండా గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. మంచినీటి పథకాల వద్ద ప్రతీవారం క్లోరినేషన్ చేయడంతో పాటు నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గిరిజన గ్రామాల్లో వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. నాటు వైద్యం, మూఢనమ్మకాల బారిన గిరిజనులు పడకుండా దేవారీలు, గ్రామ పటేళ్లు, రాయిసెంటర్ సార్మేడీలు అవగాహన కల్పించాలన్నారు. ఆర్ఏంపీ, పీఏంపీ వైద్యులు తెలిసీ తెలియని వైద్యం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో ఉట్నూర్, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న ఐసీయూల ద్వారా గిరిజనులకు అత్యవసర వైద్యం అందుబాటులోకి రానుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎంపిక చేసిన 12 ప్రభుత్వ ఆసుత్రుల్లో స్కానింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆర్వీకర్ణన్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా మలేరియా అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో గుర్తించిన 986 గ్రామాల్లో పంచాయతీ రాజ్ అధికారులతో కలిసి ఇంటింటికి దోమల మందు పిచికారి చేయాలన్నారు. ఆశ కార్యకర్తలు ఎప్పటికప్పుడు గ్రామంలోని పరిస్థితులను పైఅధికారులకు వివరించాలన్నారు. గ్రామాల్లో నిత్యం వైద్యసిబ్బంది పర్యటిస్తూ పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో జ్వరాలు ప్రబలితే వెంటనే రక్త నమూనాలు సేకరించి మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఏజెన్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడా అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామన్నారు. కుమురం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా గతేడాది తీసుకున్న చర్యలను పరిశీలించి తగు ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ గోపి, ఆర్డీవో విద్యాసాగర్, ఐటీడీఏ ఏపీవో జనరల్ నాగోరావ్, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి అల్హం రవి, నాలుగు జిల్లాల వైద్యాధికారులు, గ్రామీణ నీటి పారుదల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీ ప్రాంతాల్లో 5 లక్షల దోమ తెరలు
► పంపిణీ చేస్తామన్న వైద్య ఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డి ► 9 జిల్లాల కలెక్టర్లతో సీజనల్ వ్యాధులపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: సీజనల్ అంటు వ్యాధులపై అప్రమత్తంగా వ్యవహరించి, వాటి నివారణకు ప్రజల్లో చైతన్యం కలిగిం చాలని జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. వివిధ శాఖల సమన్వయంతో వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అందుకోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు 5 లక్షల దోమ తెరలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై ఏజెన్సీ ప్రాంతాలున్న తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, అక్కడి వైద్యాధికారులతో బుధవారం మంత్రి లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతేడాది వర్షాకాల సీజన్ కంటే ముందే పలు ఏజెన్సీ ప్రాంతాలను పర్యటించి తీసుకున్న చర్యల వల్ల ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించామని, ఈ ఏడాది కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, ఐకేపీ, ఫిషరీస్ వంటి వివిధ విభాగాలతో వైద్య ఆరోగ్యశాఖ సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి అంటు వ్యాధుల నివారణకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా గ్రామాల సమస్యలను బట్టి క్షేత్ర స్థాయిలో క్లీనింగ్, స్ప్రేయింగ్ వంటి చర్యలతో దోమల నివారణకు నడుం బిగించాలన్నారు. వచ్చే జూన్, జులై నెలల్లో ఈ కార్యక్రమాలు పూర్తి చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించా మన్నారు. అవసరమైన సిబ్బందిని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతుల్లో కలెక్టర్లు నియమించుకోవచ్చన్నారు. బాలింతలకు అందించనున్న కేసీఆర్ కిట్‌ను మంత్రి ప్రదర్శించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ కిట్‌ను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్‌రావు, భూపాలపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, కుమ్రం భీమ్, మహబూబబాద్, నాగర్ కర్నూలు జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన పెంచాలి
నెల్లూరు(అర్బన్): సీజనల్ వ్యాధులైన డెంగీ, చికున్‌గున్యా, మలేరియా, మెదడు వాపు, ఫైలేరియా తదితర వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా వైద్య శిక్షణ మండలి డాక్టర్ పెద్దిశెట్టి రమాదేవి అన్నారు. స్థానిక గాంధీనగర్‌లోని మహిళా ప్రాంగణంలో ఆశ కార్యకర్తలకు సీజనల్ వ్యాధులు, కలుషిత నీటి వల్ల వచ్చే జబ్బులు, నివారణ మార్గాలు గురించి మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, నీరు నిల్వ లేకుండా చూడటం వల్ల పలు రకాల వ్యాధులను అరికట్టవచ్చన్నారు. ఇళ్లలో పాత టెంకాయ చిప్పలు, టైర్లు, పూలకుండీలు, పెంకుల్లో నిల్వ ఉండే కొద్దిపాటి నీటిలోనే దోమలు గుడ్లు పెడతాయని, వాటిని లేకుండా చూడాలని కోరారు. డెంగీ అని అనుమానం వస్తే వెంటనే పరీక్ష చేయించాలని కోరారు. డాక్టర్ శ్రీనాథ్ ఫ్లోరోసిస్ గురించి వివరించారు. కార్యక్రమలలో హెల్త్ ఎడ్యుకేటర్ సుధాకర్‌రావు, లక్ష్మీనారాయణ, డీసీఎం సునీత తదితరులు పాల్గొన్నారు. -
'తగిన చర్యలు తీసుకుంటున్నాం'
హైదరాబాద్: భారీ వర్షాలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా.. తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన నగరవాసులకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాల్లో యాంటీ లార్వాను సిద్ధం చేసి ఉంచామని సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. -
దోమల నిర్మూలనకు సహకరించండి
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు(హాస్పిటల్): జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజంభిస్తున్నాయని, దోమల నిర్మూలనకు సహకరించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ జిల్లా యంత్రాంగాన్ని కోరారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ అనే అంశంపై మండల స్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని శాఖల పరస్పర సహకారంతో దోమలను నిర్మూలిద్దామని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో ఇంటింటా తిరిగి అవగాహన కల్పించడంతోపాటు జ్వరపీడితులకు రక్తపరీక్షలు చేసి మందులు ఇవ్వాలన్నారు. ఇందుకు పెన్షనర్లు, మహిళా సంఘాలు, రైతుల సహకారం తీసుకోవాలన్నారు. ఈ నెల 24న గ్రామ, పంచాయతీ, మండల స్థాయిలో ఆయా స్థాయి అధికారులు దోమల నిర్మూలనపై ర్యాలీ నిర్వహించాలన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులను దోమల నిర్మూలనకు ఖర్చు చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్–2 రామస్వామి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మి, డీపీవో ఆనంద్‌నాయక్, జెడ్పీ సీఈవో ఈశ్వర్, డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి, డీఆర్డీఏ, డ్వామా, మెప్మా పీడీలు రామకష్ణ, డ్వామా పుల్లారెడ్డి, రామాంజనేయులు, నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు పాల్గొన్నారు. -
సాకులు చెప్పొద్దు..
అనంతపురం సిటీ : సీజనల్ వ్యాధులు ప్రబలిన నేపథ్యంలో బాధితులకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ కోన శశిధర్ వైద్యాధికారులను ఆదేశించారు. సాకులు చెబితే కుదరదని, సమన్వయంతో పని చేయాలని హితవు పలికారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో సోమవారం వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జ్వరాలబారిన పడిన చిన్నారుల కోసం నాలుగు వార్డుల ఏర్పాటు చేసే విషయంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ జగన్నాథ్, అన్ని విభాగాల హెచ్ఓడీలతో చర్చించారు. అయితే వైద్యులు, నర్సుల కొరతతోపాటు మందులు కూడా తగినన్ని లేవని చెప్పడంతో కలెక్టర్ మండిపడ్డారు. అన్నింటికీ ఇలా సాకులు చెప్పొద్దన్నారు. డ్రగ్ స్టోర్ అధికారితో కలెక్టర్ ఫోన్లో మాట్లాడగా నిబంధనల మేరకే మందులు తీసుకోవాలని అనడంతో ‘ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతుంటే రూల్స్ ఏంటి’ అంటూ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి మందుల కొరత సమస్యకు పరిష్కారం చూపారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న సైకియాట్రిక్ వార్డ్‌లో ఫిమేల్, మేల్ చిన్నారులను ఉంచేందుకు రెండు వార్డులు ఎంపిక చేసి 50 పడకలు ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి ఈ వార్డుల్లో చిన్నారులను అడ్మిషన్ చేసుకుని, వైద్యసేవలందించాలని ఆదేశించారు. డెంగీ జ్వరాలతో బాధపడుతున్న చిన్నారులను ట్రామా కేర్ సెంటర్లో ప్రత్యేక పడకలను ఏర్పాటు చేసి, నలుగురు వైద్యులను నియమించారు. -
విష జ్వరాలతో విలవిల
⇒ యాచారం మండలంలో విజృంభించిన సీజనల్ వ్యాధులు ⇒ వందల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్న రోగులు ⇒ జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన యాచారం: మండల పరిధిలోని పలు గ్రామాలు విష జ్వరాలతో మంచం పట్టాయి. ఏ గ్రామంలో చూసినా ఇదే దుస్థితి కనిపిస్తోంది. విష జ్వరాలు, వాంతులు, విరేచనాలు, కాళ్లు, కీళ్ల నొప్పులతో అవస్థలు పడుతున్నారు. పారిశుద్ధ్య లోపమో.. కలుషిత నీటి ప్రభావమో.. వాతావరణ మార్పులో.. కారణమేదైనా.. బాధితులు మాత్రం కంటిమీద కునుకు లేకుండా ఉన్నారు. వారం రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు యాచారం, మాల్ కేంద్రాల్లోని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పేదలు మాత్రం యాచారంలోని ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్నారు. దీంతో స్థానిక పీహెచ్సీ గురువారం రోగులతో కిటకిటలాడింది. ఎప్పుడూ లేని విధంగా 200 మందికి పైగా వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చారు. వీరిలో 70 శాతానికి పైగా జ్వరాలు, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారే ఉన్నారు. నందివనపర్తి, యాచారం, నక్కర్తమేడిపల్లి, నస్దిక్‌సింగారం, కుర్మిద్ద, చౌదర్పల్లి, మంతన్‌గౌరెల్లి, కొత్తపల్లి, తక్కళ్లపల్లి తదితర గ్రామాల నుంచి పదుల సంఖ్యలో వచ్చారు. దీంతో దవాఖానాలోని బెడ్లు పూర్తిగా నిండిపోయాయి. వైద్యాధికారి ఊపేందర్రెడ్డి దగ్గరుండి రోగులకు వైద్య సేవలుందించారు. పారిశుద్ధ్య లోపమేనా...? వారం రోజులుగా అప్పుడప్పుడు మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా మారింది. వర్షాల వల్ల డ్రైనేజీ కాల్వలు నిండిపోవడం, పైపు లైన్లలో లీకేజీలు ఏర్పడటం వల్ల తాగునీరు కలుషితమవుతోంది. ప్రజలు వ్యాధుల బారిన పడటానికి ఇదే కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని స్వయంగా జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు ఆదేశాలిచ్చినా.. అధికారులు, ప్రజాప్రతినిధుల్లో స్పందన లేకుండా పోయింది. ఏ గ్రామంలో చూసినా నీటి ట్యాంకులు శుభ్రం చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లిన దాఖాలాలు లేవు. ముసుర్ల వల్ల గ్రామాల్లో ఇళ్ల మధ్యనే బురద నీళ్లు చేరి దుర్వాసన వస్తోంది. ఇవి దోమలకు ఆవాసంగా మారాయి. మంతన్‌గౌరెల్లి, దీని అనుబంధ గిరిజన తండాల్లో శానిటేషన్ వ్యవస్థ దారుణంగా ఉంది. తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి, యాచారం, నందివనపర్తి, మాల్ ,చింతపట్ల తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ట్యాంకులు శుభ్రం చేయకపోవడం, పైకప్పులు లేకపోవడంతో నీళ్లలో పురుగులు పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఎయిర్వాల్వ్లపై కప్పులు లేకపోవడం వల్ల చెత్తాచెదారం పడి నీళ్లు కలుషితం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై వైద్యాధికారి ఊపేందర్రెడ్డిని సంప్రదించగా ప్రజలు కచ్చితంగా కాచి, చలార్చిన నీటినే తాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
పాశ్చ్యానాయక్‌తండ(చివ్వెంల) : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట డివిజన్ మలేరియా నియంత్రణ అధికారి తీగల నర్సింహ అన్నారు. పీహెచ్సీ ఆధ్వర్యంలో ఆదివారం మండల పరిధిలోని పాశ్చ్యానాయక్‌తండా ఆవాసాలు బద్యాతండా, పిల్లల జెగ్గుతండా, తుమ్మల జెగ్గుతండా, భోజ్యతండా, జయరాం గుడి తండా, హలవత్తండా, భీమ్లాతండా, పాండుతండాల్లో ఇళ్లలో దోమల నివారణ మందులను స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఇళ్ల మందు మురుగు నీరు నిలువ కుండా చూసుకోవాలని, వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ బూతరాజు సైదులు, ఎఎన్ఎం లూర్దు మేరి, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి, ఆశ వర్కర్లు జ్యోతి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
నో.. స్టాక్!
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలో సీజనల్ వ్యాధుల ప్రభావం తీవ్రంగా ఉంది. మురికివాడల ప్రాంతాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాలు మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. నగరంలో 10 పట్టణ ఆరోగ్య కేంద్రాల (యూహెచ్‌సీ)తో పాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఉంది. ఒక్కో పట్టణ ఆరోగ్యకేంద్రంలో 40–50 మంది వైద్య సేవల కోసం వస్తుండగా, జనరల్ ఆస్పత్రిలో ఆ సంఖ్య 320కి పైగా ఉంది. ఇందులో జ్వరాలు, డయేరియా, మలేరియా, డెంగీ తదితర కేసులే అధికంగా ఉన్నాయి. నగరంలోని మాలపల్లిలో వారం క్రితం ఐదు డెంగీ కేసులు నమోదయ్యాయి. జనరల్ ఆసుపత్రిలో 100–150 వరకు జ్వరాలకు సంబంధించి కేసులు నమోదవుతుండగా, డయేరియా కేసులు 50 వరకు ఉంటున్నాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 10–15 విష జ్వరాలు, డయేరియా కేసులు నమోదవుతున్నాయి. వీరికి తప్పనిసరిగా ఆర్ఎల్ సైలెన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవి అందుబాటులో లేవు. సిప్రో ప్లబ్ జేషన్ యాంటీ బయోటిక్ మెట్రోమోడజైల్ (ఐవీ వ్లూయిడ్స్) ఎన్ఎస్ సెలైన్ బాటిళ్లు కావాల్సినంత స్టాక్ లేవు. జెంటిమెడిసిన్ (యాంటి బయోటిక్) 100 ఎం.జీ. కొరతగా ఉంది. నొప్పులకు ఉపయోగించే మాత్రలు కూడా అందుబాటులో లేవు. వచ్చిన రోగుల కల్లా పారాసెటిమల్ మాత్రలు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మందుల కొరత ప్రభావం తీవ్రంగా ఉంది. రోజూ 600–700 ఆర్ఎల్ సెలైన్ బాటిళ్లు అవసరం కాగా, ప్రస్తుతం 100లోపే అందుబాటులో ఉన్నాయి. ఐవీ ఫ్లూయిడ్స్ 25 వేలు అవసరం ఉండగా, స్టాక్ అస్సలే లేదు. ఏప్రిల్ నుంచి ఆస్పత్రికి మందుల కొరత ఉన్నా అధికారులు స్పందించలేదు. అత్యవసర మందులను ప్రతిరోజు కొనుగోలు చేస్తున్నారు. మందులు అందుబాటులో లేక రోగులు బయటకు వెళుతున్నారు. మందులను కొనుగోలు చేస్తున్నాం.. ఆస్పత్రిలో మందుల కొరత ఉంది. అవసరమైన మందులను కొనుగోలు చేస్తున్నాం. ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం, మరో 2–3 రోజుల్లో అవసరమైన మందులు అందుబాటులోకి రానున్నాయి. కొరత తీరనుంది. – నరేంద్రకుమార్, సూపరింటెండెంట్, జనరల్ ఆస్పత్రి -
సిటీపై డెంగీ దాడి
-
సిటీపై డెంగీ దాడి
► నగరాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు ► శుక్రవారం ఒక్కరోజే 10 డెంగీ, ► 2 స్వైన్‌ఫ్లూ కేసుల నమోదు ► డెంగీ, డిఫ్తీరియాతో 11 మంది మృత్యువాత ► తాజాగా మెహదీపట్నంలో మరో బాలిక మృతి ► కార్యాచరణ ప్రణాళిక రూపొందించని అధికారులు ► సీజనల్ వ్యాధులపై ఆందోళనలో బస్తీవాసులు సాక్షి, హైదరాబాద్: ‘గ్రేటర్’లో సీజనల్ వ్యాధులు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. డెంగీ, డిఫ్తీరియా తదితర వ్యాధులు నగరంలో వేగంగా విస్తరిస్తూ.. ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. గత 15 రోజుల్లో డిఫ్తీరియాతో ఏడుగురు, డెంగీతో నలుగురు మృత్యువాతపడ్డారు. శుక్రవారం గుడిమల్కాపూర్ మందులగూడలో ఏడేళ్ల బాలిక డెంగీతో ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లాకు చెందిన మహేశ్‌రెడ్డి భార్యపిల్లలతో మందులగూడలోని ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. మహేశ్ కుమార్తె పి.పాయస్యా(7) గుడిమల్కాపూర్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 2వ తరగతి చదువుతోంది. కొన్ని రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతుండటంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి పాయస్యా మృతి చెందింది. మరోవైపు శుక్రవారం ఒక్కరోజే సికింద్రాబాద్‌లోని వివిధ ఆస్పత్రుల్లో ఐదు, ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో నాలుగు, ఫీవర్ ఆస్పత్రిలో ఒక డెంగీ, మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవటంతో బస్తీవాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. స్వైన్‌ఫ్లూతో గుల్బార్గాకు చెందిన ఓ మహిళ(33) యశోద ఆస్పత్రిలో, బోరబండకు చెందిన బాలిక(4) లోటస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యశోదలో చికిత్స పొందుతున్న మహిళ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆరోగ్య శిబిరాల ఊసే లేదు.. గత కొంత కాలంగా కలరా, డెంగీ, డిఫ్తీరియా, స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులు నగరంలో విస్తరిస్తూ.. ప్రజల ప్రాణాలను హరిస్తున్నా అధికారుల్లో చలనం రావడం లేదు. పైగా సీజనల్ వ్యాధుల కారణంగా నమోదైన మరణాలను గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. అంతే కాకుండా వ్యాధుల నివారణకు కనీస చర్యలను కూడా వారు చేపట్టడం లేదు. దోమల నియంత్రణకు గ్రేటర్ ఏటా రూ.20 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. వర్షాకాలానికి ముందే యాంటి లార్వా, మలాథియాన్ స్ప్రే చేయడం, ఫాగింగ్ నిర్వహించడం వంటి పనులు చేయాలి. కానీ చాలా బస్తీలు ఇప్పటి వరకు ఫాగింగ్కే నోచుకోలేదు. అలాగే సీజన్ మార్పుతో వచ్చే వ్యాధులపై హై రిస్క్ బస్తీల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి. ఇంటింటికీ కరపత్రాల పంపిణీతో వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలి. కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం. లక్షలు ఖర్చు చేసి ముద్రించిన కరపత్రాలు కూడా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని స్టోర్రూమ్స్లోనే మగ్గుతున్నాయి. అంతే కాకుండా సీజనల్ వ్యాధులకు సంబంధించి ఏ ఆస్పత్రిలో ఏ కేసు న మోదవుతుందో కూడా తెలుసుకునేందుకు కూడా అధికారులు ప్రయత్నించడం లేదు. ఆస్పత్రి నుంచి ఫోన్ చేసి సమాచారం ఇస్తే తప్ప ఫీల్డ్ విజిట్ వెళ్లట్లేదు. ఇదిలా ఉంటే ఫీవర్ ఆస్పత్రికి రోగుల తాకిడి అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం 1,750 మందికిపైగా రోగులు ఆస్పత్రికి రాగా.. వీరిలో 30 మందిని అడ్మిట్ చేసుకుని చికిత్స చేస్తున్నారు. గ్రేటర్లో నమోదైన సీజనల్ వ్యాధులు ఇలా.. వ్యాధి పేరు 2011 2012 2013 2014 2015 2016 మలేరియా 352 528 189 125 84 112 డెంగ్యూ 177 452 52 19 140 105 స్వైన్‌ఫ్లూ 11 320 67 31 1,082 8 -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
హుజూర్నగర్ : ప్రస్తుత వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ విజయదుర్గాచారి అన్నారు. గురువారం స్థానిక టౌన్హాల్లో జరిగిన ఆశా వర్కర్ల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ అమలుచేస్తున్న పథకాలు గ్రామస్థాయిలో ప్రజలకు చేరువయ్యేలా ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలతో కలిసి పనిచేయాలన్నారు. గర్భిణులకు ఆరోగ్య సంబంధ విషయాల్లో అవగాహన కల్పించి వైద్యశాలల్లో కాన్పులు జరిగేలా చూడాలన్నారు. నగరపంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాల్లో ఆశా కార్యకర్తల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జి.నిర్మల, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ రవి, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ ప్రేమ్‌సింగ్, డాక్టర్ ఫిరోజ్, డాక్టర్ హలీం, డీపీఎంఓ సురేష్‌బాబు, మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసరాజు, టీబీ సూపర్వైజర్ నిమ్మల వెంకటేశ్వర్లు, శ్రీనివాసన్, కిరణ్, రామకృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఆశ కార్యకర్తలు కీలకం
ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ ఉట్నూర్ ఆశ కార్యకర్తల సమ్మేళనం ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో వ్యాధులు, జ్వరాలు అరికట్టడంలో ఆశ కార్యకర్తలు నిర్వర్తించే పాత్ర కీలకమైనదని ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ అన్నారు. వర్షకాలంలో సీజన్ వ్యాధులు ప్రబలుతున్నందున్న ఎల్లప్పుడు ఆశ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం మండల కేంద్రంలోని హెచ్‌కేజీఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆశ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో జ్వరాలు, వ్యాధులు ప్రబలినప్పుడు వెంటనే సంబంధిత వైద్యాధికారులకు సమాచారం అందించడంతోపాటు ప్రాథమిక చికిత్స అందించాలని చెప్పారు. గిరిజన గ్రామాల్లో ఇంటింటా పర్యటిస్తూ పారిశుధ్యం లోపించకుండా తీసుకోవాల్సిన చర్యలు, దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యలు వివరించాలని పేర్కొన్నారు. గర్భిణులు ఆస్పత్రుల్లో ప్రసవం అయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో దోమల నివారణకు కాంట్రాక్టర్ల ద్వారా కాకుండా వీటీడీఏ, ఆశ కార్యకర్తల ఆధ్వర్యంలో స్ప్రే చేయిస్తామని, అందుకు సంబంధించిన నిధులు ఆశ కార్యకర్తల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. జ్వరాలు ప్రబలితే ఆర్డీ కీట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించేలా చర్యలు చేపడితే రూ.50 ప్రోత్సాహకంగా అందిస్తామని తెలిపారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 18 మంది ఆశ కార్యకర్తలకు ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆశరెడ్డి, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి, ఏఎమ్‌వో వెంకటేశ్వర్లు, వైద్యులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాష్ట్రంపై జ్వరాల పంజా!
- విషజ్వరాలు, సీజనల్ వ్యాధుల బారిన ఐదున్నర లక్షల మంది - హైదరాబాద్ పరిధిలోనే లక్ష మందికిపైగా బాధితులు - కబళిస్తున్న మలేరియా,డెంగీ, చికున్‌గున్యా - విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు, అంటు రోగాలు - అపరిశుభ్రత, దోమలే కారణం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాన్ని విష జ్వరాలు, మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వ్యాధులు కబళిస్తున్నాయి.. రోజురోజుకూ పెద్ద సంఖ్యలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి.. మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు వీటి బారినపడి బెంబేలెత్తుతున్నారు. పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ విష జ్వరాల బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదున్నర లక్షల మంది జ్వరాల బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలే చెబుతున్నాయి.ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ ఏడాది ఇప్పటివరకు 1,284 మలేరియా, 188 డెంగీ, 15 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. క్షేత్రస్థాయిలో ఈ సంఖ్యలు చాలా ఎక్కువగా ఉంటాయని అంచనా. వర్షాకాలం మొదలైనా పట్టణ, పల్లె ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించడం.. దోమల స్వైర విహారంతో పరిస్థితి మరింత విషమిస్తోంది. నీటి కాలుష్యంతో విరేచనాలు, అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. మరోవైపు ఇదే అదనుగా ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు లేకపోవడంతో పట్టణాలు, పల్లెల్లోని రోగులు వైద్యం కోసం పట్టణాల్లోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోనే అత్యధికం... రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్‌లో ఈ ఏడాది లక్ష మందికిపైగా జ్వరాల బారినపడ్డారు. అందులో ఎక్కువగా గత రెండు నెలల్లోనే నమోదైనట్లు చెబుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 68 డెంగీ, 75 మలేరియా, ఒక చికున్‌గున్యా, 30కిపైగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు వస్తున్నారు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. రోజూ వందలాది మంది పిల్లలు విష జ్వరాలతో నీలోఫర్ ఆసుపత్రికి వస్తున్నారు. ఈ సంఖ్య సాధారణం కంటే మూడింత లు ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే పిల్లలకు చికిత్స చేసేందుకు అవసరమైన మౌలిక వసతులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీజనల్ వ్యాధుల తీవ్రత పెరిగిందని నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. పారిశుద్ధ్య లోపంతో విరేచనాలు, అంటువ్యాధుల తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి మురికివాడలు దుర్గంధం వెదజల్లుతున్నాయని, దీంతో తాగునీరు కలుషితమై విషజ్వరాలు విజృంభిస్తున్నాయని అంటున్నారు. ఇక హైదరాబాద్‌వ్యాప్తంగా అనేకచోట్ల పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ.. విష జ్వరాలతో చికిత్స కోసం వస్తున్న బాధితులకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు డెంగీ పరీక్షలు చేస్తున్నాయి. సాధారణ చికిత్సతో నయం చేసే అవకాశమున్నా ప్లేట్లె ట్ల సంఖ్య తగ్గిందంటూ ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నారు. సాధారణంగా ప్లేట్లెట్ల సంఖ్య 10 వేల లోపునకు తగ్గితేనే ప్లేట్లెట్లు ఎక్కించాలి. అంతకుమించి ఉంటే అవసరం లేదు. కానీ 20 నుంచి 50 వేల వరకు ప్లేట్లెట్లు ఉన్న వారికి కూడా రిస్క్ ఎందుకంటూ ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నారు. చివరికి వేలకు వేలు బిల్లులు వేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. నాలుగైదింతలు పెరిగిన జ్వరం కేసులు సాధారణ రోజుల్లో మా ఆసుపత్రికి ఐదారు జ్వరం కేసులు వచ్చేవి. ఇప్పుడు సరాసరి 30 వరకు జ్వరం కేసులు వస్తున్నాయి. సీజనల్ జ్వరాలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత విస్తరించే ప్రమాదం ఉంది. విషజ్వరాల్లో సాధారణంగా ఎక్కువ ఫీవర్ ఉంటుంది. రెండు మూడు రోజులు అలాగే ఉంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. ప్రధానంగా నీరు కలుషితం కావడం, పారిశుద్ధ్యం లోపించడం, దోమల కారణంగా విషజ్వరాలు, మలేరియా, డెంగీ ప్రబలుతాయి. పరిశుభ్రత ముఖ్యం.. - డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, ఖమ్మం సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. నిలోఫర్‌కు వచ్చే పిల్లల్లో ప్రస్తుతం జ్వరాలతో వస్తున్న వారి సంఖ్య పెరిగింది. సాధారణ రోజుల కంటే ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకు తగ్గట్లుగా చర్యలు చేపడుతున్నాం.. - డాక్టర్ లాలూప్రసాద్, ఆర్ఎంవో, నిలోఫర్ ఆసుపత్రి ప్రబలకుండా చర్యలు చేపట్టాం సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా అప్రమత్తమయ్యాం. క్లోరిన్ టాబ్లెట్లు, బ్లీచింగ్ పౌడర్లను జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాం. తాగునీటి గొట్టాలు, నల్లాలను మరమ్మతులు చేయించేలా చర్యలు చేపట్టాం. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖలు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రాష్ట్రంలో విషజ్వరాల తీవ్రత పెద్దగా లేదు.. - డాక్టర్ జి.సుబ్బలక్ష్మి, అంటువ్యాధుల విభాగం జేడీఏ -
పత్తాలేని ‘పారిశుధ్య’ కమిటీలు..!
పారిశుధ్య కమిటీ, సీజనల్ వ్యాధులు, మంచిర్యాల కమిటీ సభ్యులకు కొరవడిన శిక్షణ సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కరువు విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు ఆందోళనలో గ్రామీణులు సాక్షి, మంచిర్యాల : పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. కురుస్తున్న వర్షాలు.. పేరుకుపోతున్న చెత్తాచెదారంతో గ్రామీణ ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. లోపిస్తున్న పారిశుధ్యం.. వ్యాధులపై వారికి అవగాహన కరువైంది. ఇప్పటికే అనేక గ్రామాలను సీజనల్ వ్యాధులు చుట్టుముట్టాయి. ఎంతో మంది జ్వరాలతో మంచంపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ‘గ్రామజ్యోతి’ పారిశుధ్య కమిటీలు జిల్లాలో పత్తా లేకుండాపోయాయి. ప్రతినెలా సమావేశమై.. ప్రణాళికలు రూపొందించుకుని కార్యక్రమలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా.. జిల్లాలో పదుల సంఖ్యలో మాత్రమే కమిటీలు చురుకుగా పనిచేస్తున్నాయి. అసలు కమిటీలున్నాయో లేవో కూడా చాలా వరకు గ్రామీణ ప్రజలకు తెలియదంటే అతిశయోక్తి కలగకమానదు. కొన్ని చోట్లయితే.. ఇంత వరకు కమిటీ సభ్యులకు శిక్షణ కొరవడింది. దీంతో కార్యక్రమాలు చేపట్టేందుకు కమిటీ సభ్యులు వెనకడుగు వేస్తున్నారు. 866 గ్రామ పంచాయతీలు.. జిల్లాలో 27 మేజర్.. 839 మైనర్లతో కలుపుకుని మొత్తం 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో అభివృద్ధి పనుల గుర్తింపు.. మంజూరు.. నిర్మాణాల బాధ్యతంతా గ్రామస్థాయిలోనే జరిగేలా గతేడాది ఆగస్టు 17న రాష్ట్ర ప్రభుత్వం ‘గ్రామజ్యోతి’ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రారంభం నుంచి పది రోజులపాటు జిల్లాలో పర్యటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు 406 గ్రామాలనూ దత్తత తీసుకున్నారు. గ్రామాల అభివృద్ధి బాధ్యత తమదేనంటూ పల్లె ప్రజలకు భరోసా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించారు. ఎనిమిది నెలల క్రితమే కమిటీ ఏర్పాటు గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందేలా దాదాపు ఎనిమిది నెలల క్రితమే అన్ని గ్రామాల్లో ఏడేసి కమిటీలు ఏర్పాటు చేశారు. పారిశుధ్యం-తాగునీరు, సహజవనరుల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, సామాజిక భద్రత-పేదరిక నిర్మూలన, ఆరోగ్యం-పౌష్టికాహారం, విద్యాకమిటీలు ఏర్పాటు చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, మహిళలు, అధికారులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఈ కమిటీలో ఏ ఒక్క కమిటీ చురుకుగా పనిచేయడం లేదు. ప్రస్తుత సీజన్లో పారిశుధ్యం-తాగునీటి కమిటీల పాత్ర కీలకం. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డుమెంబర్, మహిళా సంఘ నాయకురాలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, పదవీ విరమణ పొందిన ఓ ఉద్యోగి ఈ కమిటీలో ఉంటారు. వర్షాకాలం నీరు కలుషితం కావడం.. పారిశుధ్య లోపంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందునా సీజన ల్ వ్యాధులపై స్పందించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీలో ఉన్న నిధులతో వీరు తమ కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంది. కాగా.. పథకం ప్రారంభంలో చురుకుగా పనిచేసిన ఈ కమిటీ ప్రస్తుతం పత్తా లేకుండాపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రబలుతున్న వ్యాధుల దృష్యా పారిశుద్ద్య కమిటీలు సమర్ధంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి.. గ్రామజ్యోతి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరూ ప్రతినెలా విధిగా సమావేశం నిర్వహించి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. ప్రస్తుతం జిల్లాలో కొన్ని గ్రామాల్లోనే కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించడం లేదు. దాదాపు అన్ని చోట్ల సమావేశమవుతున్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రతి కమిటీ సభ్యుడు బాధ్యతాయుతంగా పని చేయాలి. - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి -
సర్దన.. వ్యాధులతో హైరానా
అస్తవ్యస్తంగా డ్రై నేజీ వ్యవస్థ పేరుకుపోతున్న పారిశుద్ధ్యం పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు ఇద్దరికి మలేరియా పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు మెదక్‌రూరల్:వర్షాకాలం ప్రారంభమైంది.. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.. గ్రామల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని కలెక్టర్ మొదలుకొని తహశీల్దార్ వరకు వారం వారం వీడియోకాన్ఫరెన్స్‌లలో పదే పదే చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో సీజనల్ వ్యాధులు పొంచి ఉండగా, ఇప్పటికే మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మెదక్ మండలంలోని సర్ధన గ్రామంలో మురికి కాల్వలు సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో పారిశుద్ధ్యం పేరుకుపోయింది. అలాగే మురికి కాల్వలపై ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు మురికి కాల్వల్లో ఎక్కడికక్కడ మురికి నీరు నిల్వ ఉండటంతో గ్రామంలో దోమలు, ఈగలు విపరీతంగా వద్ధి చెందాయి. దీంతో రాత్రి పగలు అనే తేడాలేకుండా ప్రజలు దోమలు, ఈగలతో అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. దోమలు విపరీతంగా పెరగడంతో ప్రజలు మలేరియా వంటి వ్యాధులకు గురికావస్తుంది. ఇప్పటికే గ్రామంలోని శ్రీకాంత్, దాసు అనే ఇద్దరు వ్యక్తులు మలేరియా వ్యాధికి గురికాగా, మరికొంతమంది వాంతులు, విరేచనాలకు గురై ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. ప్రజాప్రతినిధులుగాని, అధికారులుగాని పట్టించుకోక పోవడంతో ప్రజలంతా దోమలతో మలేరియా వ్యాధులకు గురవుతుండగా, ఈగలతో వాంతులు, విరేచనాలకు గురవుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, దోమల నివారణ మందులు వేయించాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి వెంటనే గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి గ్రామప్రజలను సీజనల్ వ్యాధులనుంచి రక్షించాలని పలువురు కోరుతున్నారు. ఇద్దరు మలేరియాకు గురయ్యారు: గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించక పోవడంతో మురికి కాల్వల్లో చెత్తా చెదారం పేరుకుపోయింది. దీంతో విపరీతంగా దోమలు, ఈగలు పెరిగిపోయాయి. ఫలితంగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మలేరియాకు గురికాగా, చాలా మంది సీజనల్ వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. –రాంచందర్, సర్ధన గ్రామస్తుడు ఎవరూ పట్టించుకోవడం లేదు: గ్రామంలో పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నా అధికారులుగానీ, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదు. గ్రామంలో సమస్యలపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించాం. అయినప్పటికీ అధికారులు ఎవరు మా గ్రామంవైపు కన్నెత్తి చూడటం లేదు. డ్రై నేజీలతోపాటు రోడ్లు కూడా అధ్వాన్నంగానే ఉన్నాయి. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికి గ్రామానికి చెందిన రోడ్లు ఎక్కడికక్కడ గుంతలమాయంగా మారి ప్రజలు కాలి నడకన కూడా నడవలేని స్థితికి చేరింది. –కిరణ్‌కుమార్, సర్ధన గ్రామస్తుడు. మలేరియా వచ్చింది గ్రామంలో విపరీతంగా దోమలు ఉన్నాయి. మురికి కాల్వలు శుభ్రం చేయడం లేదు. గ్రామంలో దోమలు, ఈగలు పెరిగిపోయి వ్యాధులు ప్రబలుతున్నాయి. నేను ఇటీవల మలేరియాకు గురికాగా ప్రై వేట్ ఆస్పత్రికి వెళ్తే వేల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. –శ్రీకాంత్, మలేరియా బాధితుడు -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
మరికల్ (ధన్వాడ) : వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధులపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని నారాయణపేట క్లస్టర్ అధికారిణి సౌభాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం మరికల్ పీహెచ్సీలో ఆశ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్షకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధుల పట్ల ఆశ కార్యకర్తలు ఎప్పటికప్పుడు గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఆస్పత్రి అవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డాక్టర్ హరినాథ్, సిబ్బంది హన్మంతు, ఆయుబ్ఖాన్, బస్వారాజ్, ఆశమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
మృత్యుఘంటికలు..!
ఏజెన్సీలో ప్రబలుతున్న జ్వరాలు, వ్యాధులు ర్యాపిడ్ ఫీవర్ సర్వేతో వాస్తవాలు వెలుగులోకి.. అధికారిక లెక్కల ప్రకారం అతిసారతో ఇప్పటికే ముగ్గురు మృతి ఉట్నూర్ : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్ వ్యాధులు, జ్వరాలు మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. గిరిజన తండాలు, గూడేలు మంచం పట్టాయి. రోజు రోజుకు ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు అడవి బిడ్డల పాలిట శాపంగా మారుతున్నాయి. జ్వరాలు, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అధికార యంత్రాంగం ప్రచారం చేస్తుందే గానీ క్షేత్ర స్థాయిలో చర్యలు కనిపించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక ఉపశమన చర్యలే తప్ప శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ర్యాపిడ్ ఫీవర్ సర్వేలో వెలుగు చూస్తున్న నిజాలు, అధికారుల లెక్కలు చూస్తే ఏజెన్సీలోని పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సర్వేలో చేదు నిజాలు ఏజెన్సీలో సీజనల్, వ్యాధులు, జ్వరాలు అంచనా వేసి చర్యలు తీసుకునేందుకు ఏజెన్సీ వైద్యశాఖ జూన్ 15 నుంచి మొదటి విడతలో భాగంగా ఏజెన్సీలోని దంతన్‌పల్లి, ఇంద్రవెల్లి, పిట్టబోంగరం, నార్నూర్, ఝర్రి, గాదిగూడ, సిర్పూర్(యు), లింగపూర్, జైనూర్, కెరమెరి, తిర్యాణి, రోంపల్లి, గిన్నెధరి, అడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించింది. రెండో విడతలో భాగంగా జూలై 1 నుంచి ఏజెన్సీలోని 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేపట్టారు. ఈ సర్వే ద్వారా ఏజెన్సీలో వాస్తవ పరిస్థితి బయట పడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం.. జూన్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో 3,996 వైద్యశిబిరాలు ఏర్పాటు చేసిన అధికారులు 1,29,973 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 2,455 అతిసార కేసులు నమోదు కాగా.. 22,247 మందిS జ్వరాలతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు మలేరియా పాజిటివ్ కేసులు 501 నమోదు కాగా.. సర్వే కాలంలో 68 కేసులు నమోదయ్యాయని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అతిసారతో ముగ్గురు మృతిచెందినట్లు అధికార లెక్కలు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏటేటా తాత్కాలిక చర్యలే.. వర్షాకాలం వచ్చిందంటే చాలు గిరిజన ప్రాంతంలో వ్యాధులు, జ్వరాలు గిరిజనులను చుట్టుముడుతుంటాయి. ప్రతీసారి అధికార యంత్రాంగం తాత్కాలిక ఉపశమానానికి చర్యలు తీసుకోవడం తప్ప శాశ్వత నివారణ మార్గాలు అన్వేషించడం లేదు. అడవి బిడ్డలకు తగినంత పౌష్టికాహరం లభించకపోవడం, హిమోగ్లోబిన్ శాతం సరిపడా లేకపోవడంతో చిన్నపాటి జ్వరాలకే ప్రాణాలు కోల్పోతున్నారు. గిరిజనులకు పౌష్టికాహరం అదించేందకు ఏర్పాటు చేసిన పోషకాహర కేంద్రాలు మూలనపడుతున్నాయి. గిరిజన గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం, తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ చేపట్టేవారు లేకపోవడం గిరిజనుల పాలిట శాపంగా మారుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో బావులు, ఇతర నీటి వనరుల్లోకి కొత్త నీరు చేరడం.. ఆ నీటిని గిరిజనులు తాగుతుండడంతో అతిసార ప్రబలుతోంది. శనివారం సిర్పూర్(యు) మండలం దేవుడిపల్లిలో 40 గిరిజనులు వాంతులు, విరేచనాలతో అతిసార బారిన పడ్డారు. ఏజెన్సీలో 235 గ్రామపంచాయితీలు ఉన్నాయి. క్లోరినేషన్, పారిశుధ్యం నివారణకు ఎన్ఆర్హెచ్ఎం నుంచి ప్రతీ గ్రామ పంచాయతీకి శానిటేషన్ నిధులు రూ.10 వేలు, అన్‌టైడ్ నిధులు రూ.10 వేలు చొప్పున విడుదల చేస్తున్నా.. వాటిని∙సంబంధిత బాధ్యులు ఖాతాల్లో నుంచి డ్రా చేయకుండా చివరికి నకిలీ బిల్లులు సృష్టించి కాజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కెరమెరి, తిర్యాణి, వాంకిడి మండలాల్లో గిరిజనులకు 1800 దోమతెరలు అందించడంతోపాటు ఏజెన్సీ మొత్తంగా మరో పది వేల దోమతెరలు అందించాలని ఐటీడీఏ నిర్ణయం తీసుకున్నా.. వాటి సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది.S కానరాని వైద్య సౌకర్యాలు గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయి వైద్య సౌకర్యాలు కల్పించడం లేదు. స్థానికంగా ఉంటూ గిరిజనులకు వైద్యం అందించాలని ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా చాలామంది వైద్యసిబ్బంది దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో సకాలంలో సరైన వైద్యం అదండం లేదు. ఏజెన్సీ పరిధిలోని 31 పీహెచ్‌సీల్లో 73 మంది వైద్యాధికారులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో 13 మంది వైద్యాధికారులకు పీజీలు రావడంతో వారు పీహెచ్‌సీల నుంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు వెళ్లిపోతే ఏజెన్సీ పీహెచ్‌సీల్లో వైద్యం అందించాడానికి 47 మంది వైద్యాధికారులు మాత్రమే ఉంటారు. మెరుగైన వైద్యం అదించేందుకు గతంలో ఐటీడీఏ ప్రారంభించిన పిన్ పాయింట్ కార్యక్రమం పడకేసింది. కొన్నేళ్లుగా వ్యాధులు, జ్వరాల పరిస్థితులను అంచనా వేస్తూ తగిన చర్యలు తీసుకోవడానికి ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపించడమే తప్ప.. సర్వేలో వెల్లడైన అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించి శాశ్వత నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ప్రస్తుతం ఏజెన్సీలోని నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిర్పూర్(యు), జైనూర్ సమస్యాత్మక మండలాల్లో ఐటీడీఏ ప్రత్యేకంగా పారిశుధ్యం నివారణకు ఎంపీడీవో, ఈవోపీఆర్డీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆరు వాహనాలు ఏర్పాటు చేసి ప్రతి వాహనంలో పది సిబ్బందిని నియమించి వారంలో మండలంలోని అన్ని గ్రామాల్లో చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసినా ఆశించిన ఫలితాలు రావడం లేదనే విమర్శలున్నాయి. చర్యలు తీసుకుంటున్నాం.. జ్వరాలు, వ్యాధుల నివారణకు తగిన చర్యలు చేపతున్నాం. వైద్యాధికారులతోపాటు వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు గిరిజన గ్రామాల్లో సందర్శించి చర్యలు తీసుకునేలా కార్యాచరణ చేపట్టాం. ఏజెన్సీలోని 1567 గిరిజన గ్రామాల్లో కీటక వ్యాధుల నివారణకు, 1049 గిరిజన గ్రామాల్లో నీటి కాలుష్యంతో వ్యాప్తి చెందే వ్యాధులు, జ్వరాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి అమలు చేస్తున్నాం. అన్ని పీహెచ్‌సీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాం. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. – ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అదనపు వైద్యాధికారి -
వ్యాపిస్తున్న జ్వరాలు..వణుకుతున్న జనాలు
♦ జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైన జ్వరం కేసులు 619 ♦ వీటిలో మలేరియా 441, డెంగీ 15, టైఫాయిడ్ 163 ఖమ్మం వైద్య విభాగం : జిల్లావాసులను సీజనల్ వ్యాధులైన జ్వరాలు వణికిస్తున్నాయి. వర్షాలు, వరదలతో ఏజెన్సీలో ఇప్పటికే అనేకమంది మంచాన పడ్డారు. జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1,93,187 మంది నుంచి రక్త నమూనాలను ప్రభుత్వ వైద్యులు పరీక్షించారు. 441 మందికి మలేరియా, 15 మందికి డెంగీ, 163 మందికి (జూన్‌లో 93, జూలైలో 70) టైఫాయిడ్ సోకినట్టుగా గుర్తించారు. ప్రయివేటు ఆసుపత్రులు, ఆర్ఎంపీ వైద్యుల వద్దకు వెళ్లిన కేసులు ఇంకా ఎన్ని ఉంటాయో..?! కానరాని దోమ తెరలు జిల్లాలోని మారుమూల గ్రామాల్లో 2012లో 2.60 లక్షల దోమ తెరలను వైద్య ఆరోగ్య శాఖ పంపిణీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దోమ తెరలు పంపిణీ చేయలేదు. ఈ ఏడాది 1.40 లక్షల దోమతెరలు కావాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఇప్పటివరకూ స్పందన లేదు. ఇటీవల జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. ‘‘దోమ తెరలను వెంటనే అందేలా చూస్తా’’నని ఇచ్చిన హామీ గాల్లో కలిసింది. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటింది. వర్షాలు, గోదావరి వరదలతో ప్రధానంగా ఏజెన్సీ (పాల్వంచ, భద్రాచలం డివిజన్లలోని) గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు ఎక్కువయ్యాయి. అందుకే, ఆయా గ్రామాల్లో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. వ్యాధుల నివారణకు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆరోగ్య శాఖ సమన్వయంగా కృషి చేస్తే ఫలితం కనిపించేంది. కానీ, ఈ మూడు శాఖల మధ్య సమన్వయ లోపం కూడా వ్యాధుల వ్యాప్తికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది. జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇల్లెందు: జిల్లాలో జ్వరాల వ్యాప్తిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా మలేరియా అధికారి(డీఎంఓ) డాక్టర్ రాంబాబు చెప్పారు. ఇల్లెందు మండలంలోని డెంగీ, మలేరియా ప్రభావిత ప్రాంతాలైన కాకతీయనగర్, రొంపేడును ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం, ఇల్లెందులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి నెల 7 నుంచి 17వ తేదీ వరకు గ్రామాల్లో ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1266 గ్రామాల్లో సుమారు 5.22 లక్షల మందిని సర్వే చేశామన్నారు. 658 గ్రామాలను డెంగీ ప్రభావిత సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్టు చెప్పారు. సమస్యాత్మక గ్రామాల్లో ఇప్పటికే 166 వైద్య శిబిరాలు నిర్వహించినట్టు, 464 గ్రామాల్లో ఇండోర్ రెసిడ్యూల్ స్ప్రే పూర్తిచేసినట్టు చెప్పారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను పీహెచ్‌సీల్లో సిద్ధంగా ఉంచామన్నారు. ఏ జ్వరం వచ్చినా ప్లేట్లెట్స్ తగ్గుతాయని, అంతమాత్రాన భయపడాల్సిన అవసరం లేదన్నారు. జ్వరం వచ్చిన వెంటనే ప్యారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుని, ఒంటిని తడి గుడ్డతో పూర్తిగా తుడిస్తే జ్వరం తగ్గే అవకాశం ఉంటుందన్నారు. అంతకీ తగ్గనప్పుడు దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాలన్నారు. ఇల్లెందు పట్టణంలోని కాకతీయనగర్, మండలంలోని రొంపేడులో; గుండాల మండలంలోని గుండాల, ఆళ్లపల్లిలో డెంగీ లక్షణాలు ఉన్నాయన్నారు. నర్సాపూర్, మంగపేట, ఎదిర, అశ్వాపురం తదితర ప్రాంతాల్లో మలేరియా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. మురుగు నీటిలో జీవించే దోమలు కుట్టితే పైలేరియా వ్యాధి సోకుతుందన్నారు. జిల్లాలో ఇటువంటివి 2360 కేసులు ఉన్నాయన్నారు. వీరికి ఆసరా పింఛన్ కోసం ప్రతిపాదించామన్నారు. ఇలా వస్తాయి... ఇవీ లక్షణాలు మలేరియా: ‘ఎనాఫలిస్’ అనే ఆడ దోమ కాటుతో వస్తుంది. ఇది మనిషి నుంచి రక్తంతోపాటు కొన్ని సూక్ష్మ జీవులను పీల్చుకుంటుంది. ఈ సూక్ష్మజీవులు దోమ ఉదరంలో 10 నుంచి 14 రోజుల్లో పెరుగుతాయి. ఆ తరువాత, ఈ దోమ ఎవరినైనా కుట్టినప్పుడు.. దానిలోని సూక్ష్మజీవులు (ఆ వ్యక్తి) శరీరంలోకి ప్రవేశించి, మలేరియా జ్వరం వస్తుంది. ఇది ముందుగా చలి, వణుకుతో మొదలవుతుంది. తల, ఒళ్లు నొప్పులు వస్తాయి. ఆ తరువాత తీవ్రమైన జ్వరం వస్తుంది. జ్వరం తీవ్రత తగ్గినప్పుడు విపరీతంగా చెమటలు పోస్తాయి. ఈ జ్వరం ప్రతి రోజుగానీ, రోజు విడిచి రోజుగానీ, నాలుగు రోజులకు ఒకసారిగానీ వస్తుంది. జ్వరం వచ్చిన వెంటనే మలేరియా పరీక్ష చేయించుకుంటే మంచిది. డెంగీ: ‘ఆర్ధ్రెటిస్’ జాతికి చెందిన సూక్ష్మజీవితో వస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందటానికి ‘ఏడిస్’ అనే ఈజిప్ట్ దోమలు ముఖ్య కారణం. ఇవి డెంగీ, చికున్‌గున్యా వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. ఈ దోమలు పగటి పూట మాత్రమే కుడతాయి. వీటిని ‘టైగర్ దోమలు’ అని కూడా అంటారు. ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తల నొప్పి, కళ్ళు తెరవడం కూడా కష్టమవడం, కదిపితే నొప్పి రావడం, చర్మంపై దద్దుర్లు, కండరాలు.. కీళ్ళ నొప్పులు, అధిక దాహం, రక్తపోటు (బీపీ) పడిపోవటం.. ఈ లక్షణాలు ఉన్నట్టయితే డెంగీగానీ, చికున్గున్యాగానీ వచ్చినట్టుగా భావించి చికిత్స చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ♦ నివాస పరిసరాల్లో రోజులతరబడి నీరు నిల్వ ఉండకుండా (పడేసిన కొబ్బరి బోండాలు, పాత టైర్లు, కుండలు, వాటర్ బాటిళ్లు, సిమెంట్ డ్రమ్ములు, వాడని రోళ్ళు, ఖాళీ డబ్బాలు, మురుగు కాల్వలు.. గుంతల్లో) చూసుకోవాలి. ♦ నీరు నిల్వ ఉండే కుండలు, డ్రమ్ములు, ట్యాంకులు, కూలర్లు తదితరాలను కనీసంగా వారినికి ఒక్కసారైనా శుభ్రపరిచి ఆరబెట్టి, ఆ తరువాత వాడుకోవాలి. ♦ నీరు నిల్వ ఉంచే పాత్రలు, నీటి తొట్టెలు, డ్రమ్ములు, ట్యాంకులపై సరైన రీతిలో మూతలు ఉంచాలి. ♦ దోమ తెరలు, కిటికీలకు మెష్‌లు అమర్చుకోవాలి. నిండు దుస్తులు ధరించాలి. ♦ కాయిల్స్, లిక్విడ్స్ ఓడోమాన్ వంటివి వాడాలి. ఇంట్లో వేపాకు పొగ కూడా వేసుకోవచ్చు. ♦ దోమలు కుట్టకుండా వీలైనంత వరకు పగటిపూట పొడుగు చేతుల చొక్కా, పైజామా, ప్యాంట్, పంచె, కాళ్ళకు మేజోళ్లు వేసుకోవాలి. ♦ తీవ్ర జ్వరం ఉన్నప్పుడు పారాసిటమల్ మాత్రలు వాడాలి. ఇతర వివరాలకు దగ్గరలోని ఏరియా ఆస్పత్రి... ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోగాని, ఆరోగ్య కార్యకర్తనుగానీ సంప్రదించాలి. -
పడకేసిన పారిశుద్ధ్యం
పబలుతున్న రోగాలు పందుల సైరవిహారం పట్టించుకోని పాలకులు, అధికారులు కొత్తకోట పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దీంతో దోమలు వద్ధి చెందిన ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న ముసురు వర్షాలకు డ్రెయినేజీల్లో వరదనీటితోపాటు ఇళ్లల్లోని మురుగునీరు ముందుకు వెళ్లలేక దుర్వాసన వెదజల్లుతోంది. దీనికితోడు పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమలు వద్ధి చెంది ప్రజలు సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులపాలవుతున్నారు. పట్టణంలోని 20 వార్డుల్లో 26వేల మంది జనాభా నివసిస్తున్నారు. పలు కాలనీల్లో డ్రెయినేజీ సౌకర్యం లేక రోడ్ల పైనే మురుగునీరు ప్రవహిస్తోంది. మరికొన్ని కాలనీల్లో ఇళ్లమధ్యనే దుర్గంధపునీరు చెరువులా నిల్వ ఉంటున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండు,పాత పోలీస్‌స్టేషన్,మటన్ మార్కెట్,శంకరసముద్రం కాలువలు మరింత దుర్గంధంగా మారాయి. దీంతో దోమలు వద్ధి చెంది రాత్రి పూట నిద్రపోనివ్వడంలేదని పట్టణవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రోజుకు వంద మంది అస్వస్థత వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందాయి. పారిశుద్ధ్యలోపం, పందులు, దోమలబెడదతో ప్రజలు చలిజ్వరం, వాంతులు, బేదులు, మలేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు.ప్రతి రోజూ వందకు పైగా జనం అస్వస్థతకు గురవుతున్నారు. రోగులతో ప్రభుత్వ,ప్రై వేటు ఆస్పత్రులు కిటకిట లాడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం డ్రెయినేజీలో మురుగునీరు నిల్వ ఉన్నా, రోడ్లు దుర్గంధం వెదజల్లుతున్నా గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మురుగుకాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కోరినా స్పందించడంలేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ చెన్నకేశవరెడ్డి పట్టణంలో నెలకొన్న పరిస్థితులపై దష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
కలెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి మహబూబ్‌నగర్ న్యూటౌన్ : వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో గ్రామా లు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి ఆదేశించారు. గురువారం రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల నివారణపై జిల్లా సమన్వయకమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు పూర్తి అవగాహన వచ్చేలా ప్రచారం చేయాలని, ఇంటి పరిసరాల్లో దోమలు పెరగకుండా నీటి నిల్వలను తొలగించాలని, డ్రమ్ములు, నీటితొట్లను వారాకోసారి ఖాళీ చే యాలని, వృథాగా ఉన్న టైర్లు, డబ్బా లు, వాడి పడేసిన కొబ్బరి బొం డాలను కాల్చివేయాలన్నారు. వీధుల్లో దోమల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు. విద్యార్థుల ఆరోగ్యం జాగ్రత్త హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా ప్రతినెల సంక్షే మ హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయాలని కోరారు. జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాల్లో అనాథలు, బాలకార్మికులు చదువుకుంటున్నారని, వారి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ప్రతివారం కస్తూర్బా పరిధిలోని మెడికల్ ఆఫీసర్లు సందర్శించి వైద్యం అందిస్తూ ఆరోగ్య సూత్రాలను తెలియజేయాలన్నారు. గ్రామాల్లోని ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు సమన్వయంతో ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, వ్యాధులు వచ్చాక చర్యలు తీసుకునేకంటే రాకముందే అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ పార్వతి, అదనపు డీఎంహెచ్ఓ నాగారాం, డీపీఓ వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారి శశికాంత్ పాల్గొన్నారు. పిల్లలను బడిలో చేర్పించాలి బడిబాట కార్యక్రమంలో గుర్తించిన పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ శ్రీదేవి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ ఈఓలు, మండల విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సలో పలు ఆదేశాలు జారీచేశారు. ఊర్లో ఉన్న పిల్లల్లో కనీసం 50 శాతం మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా కృషి చేయాలని, స్వయంగా డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు పర్యవేక్షించాలని కోరారు. అంగన్వాడీల్లో ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల వివరాలు సేకరించి పాఠశాలల్లో చేర్పించాలని సీడీపీఓలకు ఆదేశించారు. ప్రతి ఊర్లో 40వేల మొక్కలు నాటాలి భూత్పూర్ : ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ టీకే శ్రీదేవి పిలుపునిచ్చారు. గురువారం మద్దిగట్లలో జరిగిన హరితహారంలో మొక్కలు నాటారు. మానవ మనుగడ అడవులపై ఆధారపడి ఉందని, పచ్చదనం పెరిగితేనే వర్షాలు కురుస్తాయనే విషయాన్ని అందరు మరిచిపోయారన్నారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో 100శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, నీటివనరుల పెంపునకు ఇంకుడుగుంతలు తప్పని సరన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈ ఓ లక్ష్మినారాయణ, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, డీఎఫ్ఓ రాంమూర్తి, ఆర్వీఎం పీఓ గోవిందరాజులు, ఎం పీపీ సుకన్య, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ గోపాల్‌నాయక్, సర్పంచ్ చంద్రయ్య పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు
కలె క్టర్ నీతూప్రసాద్ కరీంనగర్: జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెందకుండా ముందస్తు చర్య లు తీసుకుంటున్నట్లు కలెక్టర్ నీతూప్రసాద్ తెలి పారు. వివిధ శాఖల అధికారులతో క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు పడగానే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశముందన్నారు. వారంపాటు అన్ని గ్రామపంచాయతీలు, పట్టణాల్లో ఆరోగ్యం, పరిశుభ్రతపై వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాధులు రాకుండా గ్రామాల్లో సర్పంచులు, కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, రెవెన్యూ అధికారులు, ఆశావర్కర్లు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌శాఖ వారోత్సవాలపై షెడ్యూల్ విడుదల చేస్తారని అన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.5వేలు కేటాయించనున్నామని, వీటితో బ్లీచింగ్ పౌడర్, స్ప్రేలు కొనుగోలు చేసుకోవాలని అన్నారు. అన్ని మురికి కాలువలు, మంచినీటి ట్యాంకర్లను శుభ్రపరుస్తారని అన్నారు. ప్రాథమిక వైద్య కేంద్రంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని అన్నారు. సాధారణంగా వచ్చే వ్యాధులకు సంబంధించిన మందులను అన్ని వైద్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. గతంలో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యాధులు ప్రబలే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ఆమె వివరించారు. 108లు అందుబాటులో ఉండాలి 108 అంబులెన్స్‌లో అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 32 అంబులెన్సులు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఫోన్‌కాల్ రాగానే వెంటనే స్పందించాలని సిబ్బందిని ఆదేశించారు. రోగులకు ప్రైవేట్ ఆసుపత్రులకు పంపినట్లు తెలిస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించి వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు చేర్చాలని అన్నారు. గర్భిణులు నెలసరి పరీక్షలకు 108 సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి రాజేశం, సీపీవో సుబ్బారావు, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, ఐసీడీఎస్ పీడీ వసంత, 108 రీజినల్ మేనేజర్ భవిత, జిల్లా కోఆర్డినేటర్ జితేందర్, ప్రభాకర్ పాల్గొన్నారు. -
గ్రామంలో వైద్య శిబిరం
కోటపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం షట్పల్లి గ్రామంలో ప్రత్యేక వైద్య, ఆరోగ్య శిబిరాన్ని జిల్లా వైద్యులు నిర్వహించారు. శుక్రవారం గ్రామంలో జరిగిన వైద్య శిబిరంలో గ్రామస్తులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని వైద్య అధికారులు ముందస్తుగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. -
ఊరి నిండా ‘చెత్త’
కార్మికుల సమ్మెతో కంపుకొడుతున్న గ్రామాలు - దుర్గంధం వెదజల్లుతున్న మురికి కాలువలు, రోడ్లు - ప్రత్యామ్నాయ మార్గాలు చూడని పంచాయతీ అధికారులు - నెల రోజులైనా పట్టించుకోని ప్రభుత్వం - వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులు ఇందూరు : పంచాయతీ కార్మికుల సమ్మె పారిశుద్ధ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. గత నెల రోజులుగా తమను రెగ్యులర్ చేయాలంటూ వారు విధులు మానుకుని సమ్మెకు దిగడంతో గ్రామాలలో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయింది. ప్రధానంగా రోడ్లు, మురికి కాలువలు ఆధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా చెత్తే దర్శనమిస్తోంది. తద్వారా పల్లె ప్రజలు దోమల బెడదతో డెంగీ, విష జ్వరాలబారిన పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 718 పంచాయతీలలో దాదాపు కాంట్రాక్టు, తాత్కాలిక ఇతర పద్ధ తులలో పని చేస్తున్న కార్మికులు మూడు వేల మందికి పైగా ఉన్నారు. వీరికి రెండు యూనియన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు యూనియన్ల కార్మికులు సమ్మె చేస్తున్నా రు. కార్మికులు రోజూ ప్రజలకు ఎలాంటి రోగాల రాకుండా రోడ్లను, మురికి కాలువలను పరిశుభ్రం చేసేవారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలిగించేవారు. అలాగే తాగునీ టి, వాటర్, విద్యుత్ దీపాలు వేసే బాధ్యతలు, పంచాయతీ కార్యాలయాలను శుభ్రంగా ఉంచే బాధ్యత కార్మికులపైనే ఉంది. కానీ గత నెల రోజులుగా వారు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో గ్రామాలన్నీ కంపుకొడుతున్నాయి. చెత్తతో, దుమ్ము దూళితో మండల కేంద్రాలతో పాటు చిన్న చిన్న గ్రామాలు ఆధ్వానంగా త యారయ్యాయి. ఇదిలా ఉండగా మురికి కాలువలు తీయకపోవడం, నీరు నిలువ ఉండడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమల బెదడ తీవ్రం కావడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇటు వాటర్ ట్యాంకులను శుభ్రపరిచి, బ్లీచింగ్ పౌడర్ చల్లె వారు లేకపోవడంతో ట్యాంకులు కూడా ఆపరిశుభ్రంగా మారాయి. పట్టించుకోని పంచాయతీ అధికారులు పంచాయతీ కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నా పంచాయతీ శాఖ మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. గ్రామాలన్నీ చెత్తతో నిండిపోతున్నా, మురికి కాలువలు కంపు కొడుతున్నా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. పన్నులు వసూలు చేయడంలో ఉన్నంత శ్రద్ధ, అత్యవసర పరిస్థితులలో చేపట్టాల్సిన పారిశుద్య పనులపై ఎందుకు చూపడం లేదని పల్లె ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటు ప్రభుత్వమైన స్పందించి కార్మికులచే సమ్మెను విరమింపజేయాలని, లేదా అధికారులు ప్రత్యామ్నయ మార్గాలతో గ్రామాలను పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు. -
సీజనల్ వ్యాధులతో అప్రమత్తం
జోనల్ మలేరియా అధికారి డాక్టర్ వాణిశ్రీ గుంటూరు మెడికల్ : జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు వర్షాలు కురిసి దోమలు వృద్ధి చెంది వ్యాధులను కలుగజేస్తాయని, సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జోనల్ మలేరియా అధికారి డాక్టర్ వాణిశ్రీ హెచ్చరించారు. డీఎంహెచ్ఓ చాంబర్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దోమ కాటు ద్వారా పలు వ్యాధులు వస్తాయని, వాటి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ దోమ తెరలు వాడాలని సూచించారు. దోమలు పెరగకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వారానికి ఒకసారి డ్రై డే పాటించాలని చెప్పారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి అక్కడ సిబ్బందిని అప్రమత్తం చేశామని, సీజనల్ వ్యాధులకు మందులు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి మాట్లాడుతూ జూన్ 1 నుంచి 30 వ తేదీ వరకు నెలరోజుల పాటు సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారని. జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేసి మందులు అందజేస్తారని చెప్పారు. జిల్లా మలేరియా అధికారి వరదా రవీంద్రబాబు మాట్లాడుతూ జూన్ నెలను యాంటీ మలేరియా నెలగా, జూలై నెలను యాంటీ డెంగీ నెలగా నిర్ణయించి ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు. దోమలద్వారా, నీటి ద్వారాా, గాలి ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయని, వ్యాధులు దరిచేరకుండా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వారానికి ఒకసారి వైద్య పరీక్షలు చేస్తున్నామన్నారు. చర్చిలు, మసీదులు, గుడుల్లో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ గ్రామాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో గత ఏడాది 130 మలేరియా కేసులు నమోదవగా ఒక్క గుంటూరు నగరంలోనే 102 కేసులు నమోదు అయినట్టు తెలిపారు. -
పేరుకు తగ్గ వ్యాధి... శ్యాడ్!
ఆ వ్యాధి పేరు ‘శ్యాడ్’. ఇంగ్లిష్‌లో ఆ వ్యాధి పేరైన ‘సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్’ అనే వ్యాధి పేరుకు సంక్షిప్తరూపమే ఈ ‘శ్యాడ్’. పేరుకు తగ్గట్లు లక్షణాలూ అలాగే ఉంటాయి. ఈ డిజార్డర్ సోకినవారు వ్యాకులతతో ‘డిప్రెషన్’లో మునిగిపోయి ఉంటారు. విచారంగా కనిపిస్తుంటారు. అందుకే వ్యాధి పేరు తాలూకు సంక్షిప్త రూపానికీ, దాని లక్షణాలకూ సరిగ్గా సరిపోయింది. ‘శ్యాడ్’కు కారణాలు... ఈ వ్యాధి రావడానికి అనేక కారణాలను చెబుతున్నారు నిపుణులు. వాటిలో ప్రధానమైన కారణాలు కొన్ని... కుటుంబసభ్యుల్లో కొందరికి ఈ వ్యాధి అప్పటికే ఉండటం, ఈ వ్యాధి కలిగిన కుటుంబ చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) ఉండటం. మెదడులోని న్యూరో కెమికల్స్ అని పిలిచే కొన్ని రసాయనాల్లో అసమతౌల్యత.కుటుంబంలో ఏదైనా విషాదకర సంఘటన చోటు చేసుకోవడం. అంటే చాలా దగ్గరి వారు దూరం కావడం, దగ్గరి మిత్రులతో సంబంధం కోల్పోవడం, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం వంటివి. ప్రధాన కారణం సూర్యకాంతి వ్యవధి తగ్గడమే... శ్యాడ్ వ్యాధిగ్రస్థుల్లో ఆ వ్యాధి వచ్చేందుకు కారణమవుతున్నట్లుగా గమనించిన మరో ప్రధాన కారణం ‘సూర్యకాంతి’కి తగినంత ఎక్స్పోజ్ కాకపోవడమే. ప్రధానంగా చలికాలంలో పగటివేళ నిడివి తగ్గడం వల్ల తగినంత సూర్యకాంతి లేకపోవడంతో ‘శ్యాడ్’ రుగ్మత లక్షణాలు పెరుగుతున్నాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అందుకే ఈ వ్యాధి సూర్యకాంతీ, పగటి నిడివి తక్కువగా ఉండే నవంబరు, డిసెంబరు మాసాల్లో మరీ ఎక్కువ అని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. మహిళల్లో ఎక్కువ... హార్మోన్ల అసమతౌల్యత ‘శ్యాడ్’కు దారితీస్తుందన్న అంశంపై విస్తారమైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఆడపిల్లలు యౌవనదశలో ప్రవేశించే సమయంలోనూ, రుతుస్రావం ఆగిపోయే మెనోపాజ్ సమయంలోనూ... వారు హార్మోన్ల అసమతౌల్యతలకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే శ్యాడ్ వ్యాధి మహిళల్లో ఎక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని మహిళల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుండటం ఒక విశేషం. లక్షణాలు... ఈశ్యాడ్ రుగ్మత ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలివి... త్వరగా కోపం రావడం, ఉద్రేకాలకు గురికావడం వంటి భావోద్వేగపరమైన మార్పులు చోటుచేసుకుంటుంటాయి. మూడ్స్ త్వరగా మారిపోతుంటాయి. నీరసం, నిస్సత్తువ, నలుగురితో కలవాలన్న కోరిక లేకపోవడం (సోషల్ విత్‌డ్రావల్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువసేపు నిద్రపోవడం తాము తీవ్రమైన నిరాశాపూరితమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా భావించడం. చికిత్స శ్యాడ్ రుగ్మతకు చికిత్స చాలా సులభం. దీనికి ప్రధాన కారణం... తగినంత వెలుతురుకు ఎక్స్పోజ్ కాకపోవడమేనని నిర్ధారణ జరగడంతో... ఈ వ్యాధి గ్రస్తులు ఎక్కువసేపు పగటివేళ సూర్యకాంతిలో గడువుతూ ఉండాలంటున్నారు వైద్యనిపుణులు. దీన్నే లైట్ థెరపీ లేదా ఫోటో థెరపీగా పేర్కొంటున్నారు. దీనితో పాటు రోగులతో వారి బంధువులు ఎక్కువగా సంభాషిస్తూ ఉండాలనీ, వారిలో స్ఫూర్తి నిండేలా మాట్లాడుతూ/వ్యవహరిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. శ్యాడ్ వ్యాధిగ్రస్తుల్లో డిప్రెషన్ తగ్గేందుకు వాళ్లను ఎవరో ఒకరు ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండటం మంచిదంటున్నారు వైద్యులు. ఇవన్నీ చేస్తూ సైకియాట్రిస్ట్‌ను ఒకసారి సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు ‘శ్యాడ్’ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్న అధ్యయనవేత్తలు. -
దోమలపై యుద్ధం!
* నేటి నుంచి జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ * ఇంటింటికీ వెళ్లి తనిఖీలు..దోమల నివారణ చర్యలు * కరపత్రాల ద్వారా ప్రచారం * మూడు షిఫ్టుల్లో 60 మందితో కార్యక్రమం... సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సీజనల్ వ్యాధులు తీవ్రమవుతుండడం, డిఫ్తీరియా, డెంగీ కేసులు పెరుగుతుండడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమవుతోంది. మలేరియా, డెంగీ, దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నిరోధానికి స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. దోమల నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఇప్పటివరకు అనుసరించిన విధానాలకు భిన్నంగా సరికొత్త వ్యూహంతో పదిరోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారంనుంచి రోజుకొక డివిజన్ చొప్పున మలేరియా సిబ్బంది ఇంటింటికీ వెళతారు. కేటాయించిన డివిజన్లోని ఏ ఒక్క ఇంటిని కూడా విడిచిపెట్టకుండా వెళ్లి దోమలు వృద్ధి చెందకుండా అవసరమైన మందులు చల్లుతారు. నిలువనీరు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇళ్ల యజమానులకు సూచిస్తారు. దోమల నివారణపై అవగాహన కల్పిస్తారు. ఒకవేళ ఎవరైనా మలేరియా సిబ్బందిని ఇంట్లోకి రాకుండా నిరోధిస్తే సదరు ఇంటినెంబరు, చిరునామా రాసుకొని స్థానిక కార్పొరేటర్‌కు తెలియజేస్తారు. కార్పొరేటర్ సమన్వయంతో ప్రజలకు నచ్చచెబుతారు. తద్వారా ఏ ఒక్క ఇంటిని కూడా మిన హాయించకుండా దోమల నివారణ చేపట్టవచ్చునని భావిస్తున్నారు. ముఖ్యంగా పాతబస్తీ పరిధిలో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని తొలిదశలో పాతబస్తీ పరిధిలోని నాలుగు సర్కిళ్లలోని 59 డివిజన్లలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటితోపాటు కోర్ సిటీలో వ్యాధుల జాడ ఎక్కువగా ఉన్న భోలక్‌పూర్ వంటి డివిజన్లలోనూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ వెంకటేశ్ తెలిపారు. ఈ స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా వ్యాధుల జాడలున్న ప్రాంతాలకు జిల్లా వైద్యాధికారి సహకారంతో సదరు ప్రాంతాల్లో బ్లడ్‌శాంపిల్స్ సేకరిస్తారు. అవసరాన్ని బట్టి వైద్యశిబిరాలూ ఏర్పాటు చేస్తారు. మలేరియా సిబ్బంది తనిఖీలు చేసిన ఇళ్లకు వారు సందర్శించినట్లు తెలియజేసే స్టిక్కర్లు అంటిస్తారు. దోమల నివారణకు సంబంధించిన సూచనలతో కూడిన కరపత్రాలను అందజేస్తారు. ఇందులో భాగంగా ఒక డివిజన్లోని ఇళ్లన్నింటినీ ఒకేరోజు పూర్తి చేస్తారు. ఇందుకుగాను 60 మంది సిబ్బందిని మూడు షిప్టుల్లో నియమిస్తారు. అదనపు సిబ్బంది అవసరమైతే నియమిస్తారు. ఎటొచ్చీ ఒక డివిజన్లోని ఇళ్లన్నింటినీ ఒకేరోజు పూర్తి చేస్తారు. రోజుకు దాదాపు ఆరు డివిజన్ల చొప్పు పదిరోజుల్లో ఈ స్పెషల్‌డ్రైవ్ పూర్తిచేస్తారు. మలిదశల్లో మిగతా సర్కిళ్లలోనూ ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించ నున్నట్లు వెంకటేశ్ తెలిపారు. -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
కాచి చల్లార్చిన నీటి వినియోగం తప్పనిసరి ఏడీఎంహెచ్ఓ డాక్టర్ లీలా ప్రసాద్ పాడేరు : ఏజెన్సీలోని గిరిజనులంతా సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి ఏడీఎంహెచ్ఓ డాక్టర్ లీలా ప్రసాద్ కోరారు. ఇటీవల అనారోగ్య మరణాలు నమోదైన లింగాపుట్టు గ్రామాన్ని శనివారం ఆయన సందర్శించి ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామంలోని 32 మంది గిరిజనులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇద్దరు జ్వరపీడితులకు రక్తపరీక్షలు నిర్వహించి సాధారణ జ్వరాలుగా నిర్ధారించి మందులు పంపిణీ చేశారు. ఏడీఎంహెచ్ఓ లీలా ప్రసాద్‌తో పాడేరు క్లష్టర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ విశ్వేశ్వరనాయుడు కూడా ఇంటింటా తిరిగి గిరిజనుల ఆరోగ్యంపై సమీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ లీలాప్రసాద్ మాట్లాడుతూ ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా సకాలంలో వైద్యసేవలు పొందాలన్నారు. ఆశ కార్యకర్త వద్ద పుష్కలంగా మందులు ఉన్నాయన్నారు. నీటి కాలుష్యం కారణంతో డయేరియా, విషజ్వరాలు సోకుతాయని, అయితే గిరిజనులు తాము సేకరించిన నీటిని బాగా మరగబెట్టి చల్లారిన తరువాత సేవించడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. గెడ్డలు, వాగులు, ఊటలు నుంచి సేకరించిన నీటిని నేరుగా సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. వ్యాధులపై కూడా గిరిజనులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులకు వైద్యసేవలు కూడా అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీహెచ్ కామేశ్వరి, పీహెచ్ఎన్ దేవి, హెల్త్ సూపర్వైజర్లు సుబ్రహ్మణ్యం, నాయుడు, ప్రకాష్ వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
ఏజెన్సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలి
కొత్తగూడెం రూరల్: సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవలను మెరుగుపర్చాలని డీఎంహెచ్ఓ భానుప్రకాష్‌ను ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మండలంలోని పెనుగడప గ్రామాన్ని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలిసి ఎంపీ సోమవారం సందర్శించారు. తొలుత పెనుగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. రోజుకు ఎంతమంది ఓపీలను పరీక్షిస్తున్నారని, ఎంత మంది వైద్యు లు ఉన్నారని డాక్టర్ గురుభార్గవ్ను అడిగి తెలుసుకున్నారు. రోజుకు సుమారు వంద మందిని పరీక్షిస్తున్నామని, ఇద్దరు డాక్టర్లు ఇద్దరే ఉన్నారని గురుభార్గవ్ తెలిపారు. దీంతో డీఎంహెచ్ఓతో ఎంపీ ఫోన్లో మాట్లాడారు. ఏజెన్సీలో విష జర్వాలు ప్రబలుతున్నాయని, మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. వైద్యులు తక్కువ ఉన్నచోట అదనంగా నియమించాలని ఆదేశించారు. పెనుగడప లో విషజర్వాలు తగ్గుముఖం పట్టే వరకూ వైద్య శిబిరం కొనసాగించాలన్నారు. జర్వ పీడితుల రక్తం సేకరించి పరీక్షలు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు పూర్తి స్థాయిలో అవగహన కలిగి ఉండాలన్నారు. వర్షా కాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలన్నారు. ఇదిలా ఉండగా ఓపెన్‌కాస్ట్ వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోం దని పలువురు గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సింగరేణి అధికారులతో మాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం పెనుగడపలో విష జర్వంతో మృతి చెందిన కమాలుద్దీన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఎంపీ పర్మామర్శించారు. డెంగ్యూ తో బాధపడుతున్న జలీల్‌ను పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాణోతు కేస్లీ, సర్పంచ్ మాళోతు కళావతి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధులు ఆకుల మూర్తి, మిట్టపల్లి పాండురంగచార్యులు, వైఎస్సార్సీపీ నాయకులు జె. బి.ఎస్.చౌదరి, కందుల సుధాకర్‌రెడ్డి, తహశీ ల్దార్ అశోక్ చక్రవర్తి, ఎంపీడీవో శాంత దేవి, ఈఓపీఆర్డీ రమేష్, ప్రబాకర్, రాజేశ్వరి, పెనుగడప గ్రామ కమిటీ అధ్యక్షుడు గోర్రె బాబు, దుర్గ, కిరణ్, కారం సీతయ్య, వేముల రాము, సుధాకర్, విజయ భాస్కర్ పాల్గొన్నారు. ట్రాక్టర్ల తయారీలో కొత్త టెక్నాలజీ రావాలి ఖమ్మం అర్బన్ : వ్యవసాయ రంగానికి మరింత ఉపయోగపడేలా ఆధునిక టెక్నాలజీతో ట్రాక్టర్లు తయారీ జరగాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలోని బైపాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన పవర్ ట్రాక్ కంపెనీకి చెందిన శ్రీవెంకట పద్మావతి ట్రాక్టర్ల షోరూంను ఎంపీ సోమవారం సందర్శించారు. కూలీల కొరత, పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో ఆయా కంపెనీలు ట్రాక్టర్ల తయారీ చేపట్టాలన్నారు. ఎంపీతో వెంట శ్రీవెంకట పద్మావతి ట్రాక్టర్ షోరూం మేనేజింగ్ డెరైక్టర్ కోయ రాజేష్‌కుమార్, ప్రోప్రైటర్ కోయ రామయ్య, వైఎస్సార్సీపీ నాయకుడు ఆకుల మూర్తి తదితరులు ఉన్నారు. రామయ్య సన్నిధిలో పొంగులేటి భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట, పినపాక ఎమ్మేల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఏఈఓ శ్రవణ్‌కుమార్, ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాథాచార్యులు ఆల య మర్యాదలతో స్వాగతం పలికారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేసి, అంతరాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, అభయాంజనేయస్వామి వారి ఉపాలయాల్లో పూజలు జరిపారు. ఆలయ ప్రాశస్థాన్ని అర్చకులను అడిగి తెలుసుకున్నారు. రుష్యమూఖ మ్యూజియంలో సీతారామ లక్ష్మణుల ఆభరణాలను తిలకించి వాటి గురించి వివరాలు తెలుసుకున్నారు. దేవస్థానం తరఫున ఎంపీ, ఎమ్మేల్యేలకు ఏఈఓ శ్రావణ్‌కుమార్ జ్ఞాపిక, స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ భద్రాచలం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తెల్లం వెంకట్రావ్, బీసీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు కడియం రామాచారి, సీనియర్ నాయకులు మంత్రిప్రగడ నర్సింహారావు, గంటా కృష్ణ, మహిళా నాయకురాలు దామర్ల రేవతి, మహేష్, బిజ్జెం శ్రీనివాసరెడ్డి, వీరంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వ్యాధులతో గిరిజనులు విలవిల!
టేక్మాల్: సీజనల్ వ్యాధులతో గ్రామీణ ప్రాంత ప్రజలు విలవిలాడుతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజలు వ్యాధులతో వణికిపోతున్నారు. సమయానికి వైద్యపరీక్షలు నిర్వహించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా టేక్మాల్ మండలంలోని ఎల్లుపేట మదిర నల్లకుంట తండాకు చెందిన గిరిజనులంతా సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. తండాకు చెందిన దేవీసింగ్ (50) దోలీబాయి (40), ఇఠ్యానాయక్ (32),అంబ్యా నాయక్ (55), చాందిబాయి(40), దుమ్యా నాయక్ (54) సేవ్యానాయక్(24), ప్రవీణ్, వైష్ణవి, చరణ్, సునీత, శ్రీకాంత్, శ్రావణ్, రోహిత్, శ్రీలత తదితరులు (పది సంవత్సరాల లోపు చిన్నారులు) తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వారంతా జ్వరంతో, నొప్పులతో బాధపడుతూ మంచం పట్టారు. రోగాలు చిన్నారులకు ఎక్కువగా సోకడంతో పాఠశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు గత నాలుగు రోజులుగా వెళ్లడం లేదని ండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తండాలోని నల్లాలు, చేతిపంపులు, జెట్ పంపుల చుట్టూ, ఇళ్ల చుట్టూ మురికి నీరు పేరుకుపోయింది. కాలువల్లో నీరంతా ఎక్కడి కక్కడ దుర్గధం వెదజల్లుతోంది. తండాలో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో నీరంతా కలుషితమై, ఈగలు, దోమలు వ్యాప్తి చెంది పలువురు అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పలుమార్లు వైద్యాధికారులు ఫిర్యాదు చేసినా వారు తొంగి చూసిన పాపాన పోలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక దగ్గరలో ఉన్న పాపన్నపేట మండలంలోని నార్సింగ్, శంకరంపేట, టేక్మాల్, మెదక్ తదితర పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందుతున్నామన్నారు. దీంతో విపరీతమైన డబ్బు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగాలు ఒకరి నుంచి మరోకరికి వ్యాప్తి చెందడంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తండాలో పారిశుద్ధ్య పనులు చేపట్టి వైద్య సేవలను అందించాలని గిరిజనులు కోరుతున్నారు. -
రోగాల దాడి
నిజామాబాద్ అర్బన్: ఈ ఏడాది సీజనల్ వ్యాధుల ప్రభా వం తీవ్రంగా ఉంది. గత రెండు నెలల నుంచి రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వారం రోజులుగా వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పులతోనే జ్వరపీడితులు పెరుగుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అపరిశుభ్రత, దోమల బెడద ప్రజలను వ్యాధిగ్రస్తులను చేస్తున్నాయి. తగు చర్యలు తీసుకోవడంలో వైద్యశాఖ పూర్తిగా విఫలమమవుతోంది. ఇదీ పరిస్థితి జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 375 ఆరోగ్య ఉపకేంద్రాలు, మూ డు ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వీటిలో వైద్య సేవలు పొందుతారు. ఈ ఏడాది సీజనల్ వ్యాధుల నమోదు వేగంగా పెరుగుతోంది. మలేరియా కేసులు ఎక్కువగా నమోదువుతున్నా యి. గత ఏడాది రెండు నెలలలో 33 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 46 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ అర్బన్, బాల్కొండ మండలం సరి హద్దు ప్రాంతంలో దీని ప్రభావం అధికంగా ఉంది. దోమల బెడదతో జ్వరా లు అధికంగా ప్రబలుతున్నాయి. డయేరియా కేసులు 44 నమోదయ్యాయి. అతిసార 114, కలుషిత ఆహారం 18 కేసులు నమోదయ్యాయి. డెంగీ అధికంగా ప్రభావం చూపుతుంది. గత ఏడాది ఆరు కేసులు నమోదు కాగా, ప్ర స్తుతం 14 కేసులు నమోదయ్యాయి. ఎడపల్లి గురుకులం విద్యార్థులు సుమారు 50మంది జ్వరంతో బాధపడుతున్నారు. సదాశివనగర్ మండలం గొకుల్తండాలో సుమారు 30మంది వరకు అతిసార వ్యాధి బారిన పడ్డారు. చిన్నారులు కూడా జ్వర పీడితులు, న్యూమోనియా బాధితులతో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులు నిండిపోతున్నాయి. రోజుకు 200 నుంచి 300 మంది వరకు రోగులు ఆసుపత్రులకు వస్తున్నారు. జిల్లా కేంద్రంలోని చిన్నపిల్లల ఆసుపత్రులలో సుమారు 40 నుంచి 50 వరకు చిన్నారులు జ్వరాలతో చేరుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ల సంఖ్య 320 నుంచి 380 వరకు పెరిగింది. అధికారులేం చేస్తున్నారో! వ్యాధులను నియంత్రించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమవుతోంది. ముం దస్తుగానే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఆయా మండలాలకు ఇన్చార్జిల ను నియమించాల్సి ఉంటుంది. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగించాల్సి ఉంటుంది. మందులను అందుబాటులో ఉంచి, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. కానీ, వీరు నేటి వరకు సమావేశాలు నిర్వహించ లేదు. గ్రామాలు, పట్టణాలు, నగరంలో పారిశుధ్య పనులు కూడా సక్రమంగా సా గడం లేదు. వైద్య సేవలను పరిశీలించాల్సిన జిల్లా అధికారి, క్లస్టర్ అధికారు లు కార్యాలయానికే పరిమితమవుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమావేశాల పేరిట తరచూ హైదరాబాద్‌కు వెళ్లడం, అందుబాటులో ఉ న్నప్పుడు జిల్లా కేంద్రంలో సమావేశాలలో పాల్గొనడంతో ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల తీరు ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా జిల్లా సరిహద్దు ప్రాంతాలలో పరిస్థితి దారుణంగా ఉంది. అధికారులు మాత్రం వ్యాధులకు సంబంధించిన వివరాలను, పరిస్థితులను తెలియజేసేందుకు నిరాకరిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి గోవింద్వాగ్మారే వివరణ కోరగా స్పందించ లేదు. -
వ్యవసాయానికి 5 గంటలే..
ముకరంపుర : వ్యవసాయానికి 5 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుందని, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య ఆదేశించారు. వ్యవసాయ, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టరేట్లోని సమావేశ మంది రంలో మంగళవారం ఆయన సమీక్షించారు. అవసరానికి కంటే తక్కువగా విద్యుత్ సరఫరా అవుతోందని, 5 గంటలకు మించి ఇవ్వలేమని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ తెలిపారని కలెక్టర్ చెప్పారు. పంటలు కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు సాంకేతిక సలహాలు అందించాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు పంటల పరిస్థితి, విద్యుత్ సరఫరా, తాగునీటిపై సమీక్ష నిర్వహిం చాలన్నారు. తాగునీటి ఇబ్బందులు రాకుండా ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీల్లో ఉన్న నీరు వచ్చే వేసవి వరకు తాగునీటి సరఫరా కోసమే వినియోగించాలన్నారు. 15 రోజులకోసారి తాగునీటి సరఫరాపై నివేదికలు పంపాలని ఆదేశించారు. పంచాయతీలు బకాయి ఉన్న రూ.70 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వర్షాభావ పరిస్థితులపై సూచనలు అందించాలన్నారు. మరమ్మతులో ఉన్న 154 తాగునీటి పథకాల పునరుద్ధరణకు అవసరమైన నిధులు జెడ్పీ, మండల పరి షత్ల నుంచి వినియోగించుకోవాలన్నారు. ఏజేసీ టి.నంబయ్య, జేడీఏ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ మొదలెట్టండి జిల్లాలో వర్షాభావ పరిస్థితులేర్పడుతున్నందున అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ పనులపై కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో సమీక్షించారు. పనికోసం వలసలు పోకుండా చూడాలన్నారు. 15 రోజుల్లో రెండు లక్షల మంది కూలీలకు పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సెప్టెంబర్ నెలాఖరుకు లక్ష మరుగుదొడ్ల నిర్మాణం పూర్తవుతుందని, మొదలుపెట్టని యూనిట్లను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ గణేశ్ తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. వైద్యశాఖ అధికారులతో మంగళవారం తన చాంబర్లో సమీక్షించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో జనవరి నుంచి ఇప్పటివరకు 5 మలేరియా కేసులు నమోదయ్యాయని, వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 34 మలేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. దోమల నివారణకు పారిశుధ్య చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రాథమిక వైద్యకేంద్రాల్లో వైద్యులను అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు జేసీ టి.నంబయ్య, వైద్యారోగ్యశాఖాధికారి, మలేరియా అధికారి తదితరులు పాల్గొన్నారు. -
పశువులు భద్రం
లక్సెట్టిపేట : పశు సంపద మానవులకు ఎన్నో విధాలుగా మేలు చేస్తూ లాభాలనిస్తోంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. కాలం, వాతావరణాన్ని బట్టి మానవుల మాదిరిగానే పశువుల్లోనూ వ్యాధులు వస్తుంటాయి. సీజనల్ వ్యాధులపై జాగ్రత్త వహించాలి. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు, ఇతర వ్యాధుల బారి నుంచి వాటిని కాపాడుకోవాలి. పశువులకు సీజనల్‌గా వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండి తొలిదశలోనే గుర్తిస్తే నివారణ సులభమని లక్సెట్టిపే పశు వైద్యాధికారి వీరయ్య వివరించారు. వర్షాకాలంలో పరిసరాల ప్రభావం, వరద నీళ్లు, మెలిచిన పసక గడ్డిపైన ఉండే కీటకాలు, అటువంటి మేత తినడం వల్ల గేదెలు, మేకలు, గొర్రెలు, రకరకాల పశువులకు పలురకాల వ్యాధులు సోకి అనారోగ్యానికి గురవుతాయి. దీని వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అంటువ్యాధుల బారిన పడి చివరకు చనిపోయే ప్రమాదం ఉంటుంది. వ్యాధులు.. నివారణ.. గొంతు వాపు వ్యాధి : ఈ వ్యాధిని గురకవ్యాధి అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మ జీవుల వలన సంక్రమిస్తుంది. కలుషితమైన నీరు, మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడుతాయి. ఇది అంటువ్యాధిగా ఇతర పశువులకు సోకుతుంది. గొంతు కిందకు నీరు దిగి గొంతువాపు వస్తుంది. నోటి నుంచి చొంగకారుస్తూ, గురక, శ్వాస పీల్చడం కష్టమవుతుంది. కళ్లు వస్తాయి. నివారణ : వర్షాకాలం ముందు జూన్, జూలైలో వ్యాధి నిరోధక టీకాలు చేయించాలి. వ్యాధి ఉన్న పశువుల దొడ్డిని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి. ఇతర పశువుల కు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమీప పశువుల వైద్యాధికారిని సంప్రదించాలి. గాలి కుంటు వ్యాధి : ఇది వైరస్ సోకడం లేదా కలుషితమైన గాలి ద్వారా వస్తుంది. తల్లిపాల ద్వారా దూడలకు వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరం ఉంటుంది. నోరు గిట్టల మధ్య బొబ్బలు, నోటి నుంచి సొంగ కారడం జరుగుతుంది. నివారణ : నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిజరిన్ కలిపి రాయాలి. గిట్టల మధ్య పుండ్లకు పరమాంగనెట్ ద్రావణంతో శుభ్రం చేసి వేపనూనె రాయాలి. దీనితో గాలికుంటు వ్యాధులను నివారించవచ్చు. గొర్రెలలో నీలినాలుక వ్యాధి : గ్రామాల్లో చాలామంది గొర్రెలను మేపుతూ వాటిపైనే జీవనోపాధి పొందుతారు. గొర్రెల్లో వచ్చే వ్యాధులలో చాలా ముఖ్యమైన వ్యాధి నీలినాలుక వ్యాధి. దీనినె మూతి వాపు వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి దోమకాటు వలన వస్తుంది. ఈ వ్యాధి సోకిన గొర్రె మేత వేయడం మానేస్తాయి. నెమరు వేయదు. జ్వరం ఉంటుంది. నాలుక వాచి నీలి రంగుగా మారుతుంది. కాళ్ల గిట్టలు వాచి పుండ్లు అవుతాయి. ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించి వారం రోజులలో చనిపోతాయి. నివారణ : వ్యాధి సోకిన గొర్రెలను సకాలంలో గుర్తించి వైద్యులతో చికిత్స చేయించాలి. నోటిపుండ్లను ఒక శాతం బోరిక్ యాసిడ్ లోషన్‌తో శుభ్రం చేయాలి. రెండు శాతం బొరిగ్లిసరిన్ పూయాలి. గొర్రెలు ఆకలితో చనిపోకుండా ఉండేందుకు జావలాంటిది అందించాలి. వైద్యుల సలహాతో యాంటిబయోటెక్ ఇంజక్షన్ ఇప్పించాలి. -
విజృంభిస్తున్న వ్యాధులు
పింప్రి, న్యూస్‌లైన్ : కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. పుణే, పింప్రి-చించ్వడ్ జంట నగరాలతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది రోగాల బారిన పడుతున్నారు. వర్షాలు, చల్లటి గాలులు, మరో పక్క ఎండ కూడా కాయడంతో గొంతు నొప్పి, జలుబు, దగ్గు, జ్వరాలతోపాటు డెంగీ, మలేరియా లాంటి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. నాలుగు రోజుల్లో రోగాల బారిన పడిన వారి సంఖ్య మరింత ఎక్కువైంది. జూన్‌లో కురవాల్సిన వర్షాలు జూలైలో కురుస్తుండడంతో వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా బ్యాక్టీరియా విస్తృతంగా వ్యాప్తి చెందడం ద్వారా నగర ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లతోపాటు నగర ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్యుడు రవీంద్ర ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేస్తున్నారు. సీజనల్ వ్యాధులపై నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు కలుషిత నీటిని తాగడం ద్వారా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, విరేచనాలు, వాంతులు, జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. నీటిని మరిగించి, చల్లార్చి, వడపోసిన తర్వాత సేవించాలి. బయటి తినుబండారాలను, పులిసిన పుల్లటి పదార్థాలను, వీలైనంత వరకు మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలి, నూనె పదార్థాలను తగ్గించాలి, సులువుగా జీర్ణమయ్యే వాటినే ఎక్కువగా తీసుకోవాలి. సూప్‌లను తరచూ తాగాలి. ముఖ్యంగా ఇలాంటి వాతావరణంలో సొంటి, తులసి, మిరియాలు, లవంగాలు ఉపయోగించాలి. ఆహార పదార్థాలలో సూప్‌లలో వీటిని వినియోగించాలి స్వచ్ఛమైన గాలిని ఇచ్చే తుసి మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకోవాలి. తులసి మొక్కలు 24 గంటలు ఆక్సీజన్ గాలిలోకి విడుదల చేస్తాయి. దోమలు కూడా పరిసరాలలోకి రావు. తులసిని సేవించడం డెంగీ నివారణకు దోహదపడుతోంది. -
బీఎంసీ అప్రమత్తం
సాక్షి, ముంబై : సీజనల్ వ్యాధుల నివారణ కోసం బీఎంసీ కృషి చేస్తోంది. వర్షా కాలంలో మలేరియా విజృంభిస్తుండడంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హౌసింగ్ సొసైటీలకు తమ ఇంటి టెరస్ ఇతర చోట్ల నీరు నిలువ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నోటీసులు జారీ చేసింది. ఒకవేళ నీటిని తొలగించనట్లయితే జరిమానా వసూలు చేయనున్నట్లు హెచ్చరించింది. కార్పొరేషన్ వెల్లడించిన గణాంకాల మేరకు.. జూన్‌లో కె-వెస్ట్ వార్డ్ (అంధేరి తూర్పు) 234 నోటీసులు, ఎం-వెస్ట్ వార్డ్ (చెంబూర్) 199 నోటీసులు, ఈ-వెస్ట్ వార్డు (బైకల్లా)కు 171 నోటీసులు అందుకున్నాయి. దోమల వృద్ధి ప్రాంతాల గుర్తింపు వర్షాకాలంలో నగర వాసులు డెంగీ, మలేరియా లాంటి జబ్బుల బారిన పడకుండా దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతున్న ప్రాంతాలను బీఎంసీ ఇటీవలె గుర్తించింది. డెంగీ వ్యాపింపజేసే దోమలు ఎక్కువగా మొక్కలు, ఫ్లవర్ పాట్స్, ఫిష్ ట్యాంక్‌ల ద్వారా వృద్ధి చెందుతున్నాయని అధికారులు గుర్తిం చారు. మలేరియా దోమల వృద్ధికి సంబంధించి నగర వ్యాప్తంగా 593 ప్రదేశాలు, డెంగీ దోమలకు సంబంధించి 388 స్థలాలను బీఎంసీ క్రిమి సం హారక విభాగం సిబ్బంది గుర్తించారు. మలేరియా, డెంగీ వ్యాధులను వ్యాపింపజేసే దోమల వృద్ధి స్థలాలు సొసైటీకి చెందినవైతే వారికి నోటీసులు జారీ చేశారు. వీటి నివారణ చర్యలు తీసుకోవాలని ఆ సొసైటీలను కార్పొరేషన్ సూచిం చింది. నివారణ చర్యలు తీసుకోని సొసైటీలకు జరిమానా విధిస్తుంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1888 ప్రకారం రూ.రెండు వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చు. ఈ ఏడాది జూన్ చివరి వరకు కార్పొరేషన్ దాదాపు 8,246 సొసైటీలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో 351 సొసైటీలకు జరిమానా విధించింది. కార్పొరేషన్‌కు జరి మానా రూపంలో రూ.11.91 లక్షల ఆదాయం చేకూరింది.జూన్‌లో కార్పొరేషన్.. హౌసింగ్ సొసైటీలు, కార్యాలయాలు, ఇనిస్టిట్యూట్స్, నిర్మాణంలో ఉన్న భవనాలకు 2,284 నోటీసులను జారీ చేసింది. 2013లో 13,889 నోటీసులను జారీ చేయగా రూ.27.60 లక్షలను జరిమానా రూపంలో కార్పొరేషన్ వసూలు చేసింది. వ్యాధుల నివారణే ధ్యేయం నోటీసులు జారీ చేసి జరిమానా విధించడం తమ లక్ష్యం కాదనీ, మలేరియా, డెంగీ నివారణే తమ ముఖ్య ఉద్దేశమని కార్పొరేషన్ క్రిమి సంహారక విభాగం అధికారి డాక్టర్ రాజన్ నైరన్గేకర్ తెలి పారు బీఎంసీ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మజా కేస్కర్ మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా ఉన్న హౌసింగ్ సొసైటీలకు చేరుకొని వివిధ కార్యక్రమా ల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు. ఈ సారి కూడా మలేరియా, డెంగీ నివారణకు కొత్త విధానాలను అవలంభిస్తున్నామని తెలిపారు. -
మంచమెక్కిన ‘అనంత’
సాక్షి, అనంతపురం : వారం రోజుల పాటు కురిసిన వర్షాల ప్రభావంతో జిల్లాలో వేలాది మంది విష జ్వరాలతో మంచం పట్టారు. జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభించాయి. రోజుల తరబడి జ్వరం తగ్గక పోవడంతో చికిత్స కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రవాణా సౌకర్యం లేని గ్రామాల్లో మాత్రం ఏదో పసరు తాగి ఇంటి వద్దే మంచాలపై మగ్గుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, చికున్ గున్యా, డెంగీ జ్వరాలు విసృ్తతంగా వ్యాపించాయి. వీటి నివారణకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖాధికారులు గొప్పలు చెబుతున్నా.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు సరిగా అందుబాటులో లేక పోవడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. గడిచిన మూడు నెలల్లోనే జిల్లాలో 1,044 జ్వరాల కేసులు నమోదయ్యాయి. ఇందులో మలేరియా కేసులు ఏడు, విషజ్వరం కేసులు 286 తేలాయి. తరిమెల పీహెచ్సీ పరిధిలోని కల్లుమడికి చెందిన రాజేంద్రప్రసాద్, కరకముక్కల పీహెచ్సీ పరిధిలో రాజేష్, గుత్తి మండలం వన్నేదొడ్డికి చెందిన జ్యో త్స్న డెంగీతో బాధపడుతున్నారు. అపరిశుభ్రతే కారణం ఇటీవల కురిసిన జడివాన వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. ఇళ్ల ముందే వర్షపు నీరు నిలిచి.. పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దోమలు విజృంభిస్తూ... ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీనికితోడు ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లు తుప్పుపట్టి రంధ్రాలు పడ్డాయి. దీనివల్ల తాగునీటిలోకి వర్షపు నీరు, మురుగు నీరు కలుషితమవుతోంది. పారిశుద్ధ్యం మెరుగుదలకు పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా... గ్రామాల్లో పరిస్థితి మాత్రం మారడం లేదు. ప్రభుత్వ వైద్యులు తమ సొంత ఆస్పత్రుల్లో శుభ్రతపై చూపిస్తున్న శ్రద్ధ.. ప్రభుత్వ ఆస్పత్రులు, గ్రామాలపై చూపడం లేదు. ప్రైవేటు ప్రాక్టీస్‌పైనే దృష్టి పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యుల్లో 90 శాతం మంది పట్టణాల్లోనే కాపురముంటున్నారు. పీహెచ్‌సీల్లో మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తూ.. సొంత నర్సింగ్ హోమ్‌ల అభివృద్ధిపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. పీహెచ్‌సీలకు వెళ్లే రోగులను సైతం తమ నర్సింగ్ హోమ్‌లకు పిలిపించుకుంటూ జేబులకు చిల్లు పెడుతున్నారు. ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లలో రోగులకు రకరకాల వైద్య పరీక్షలను సిఫారసు చేస్తూ వేలాది రూపాయలు గుంజుతున్నారు. మలేరియా బాధితులకు రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1500, డెంగీ రోగులకైతే రూ.3 వేల వరకు, టైఫాయిడ్ బాధితులకు రూ.800 నుంచి రూ.900 వరకు బిల్లు చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నెల క్రితం అనంతపురంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన పద్మ టైఫాయిడ్‌తో బాధపడుతూ... ఇంటి ఎదురుగా ఉండే నర్సింగ్‌హోమ్‌కు వెళ్లింది. మూడు రోజుల పాటు ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాలని వైద్యులు సూచించారు. రోజుకు ఒక ఫ్లూయిడ్ చొప్పున ఎక్కించారు. మందుల బిల్లు రూ.2,500 కాకుండా..ఫ్లూయిడ్స్ ఎక్కించిన దానికే రూ.5,500 వేశారు. ఈ బిల్లు చూసి పద్మ భర్త విస్తుపోయాడు. ఆందోళన కల్గిస్తున్న విష జ్వరాలు జిల్లా వ్యాప్తంగా విజృంభిస్తున్న విష జ్వరాలు ప్రజలకు ఆందోళన కల్గిస్తున్నాయి. వారం పదిరోజులైనా జ్వరం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదని రోగులు వాపోతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విష జ్వరాలతోనే 18 మంది మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ సంఖ్య 30 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో 3,21,507 మందికి రక్త పరీక్షలు చేశారు. 95 మంది మలేరియా, ముగ్గురు డెంగీ, ఒకరు చికున్ గున్యా, 27 మంది విష జ్వరాలతో బాధపడుతున్నట్లు తేలిందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి మలేరియా, విష జ్వరాల పీడితులు వేల సంఖ్యలోనే ఉన్నారు. ఒక్క అనంతపురం సర్వజనాస్పత్రిలో ఆగస్టులో 474 మందికి వైద్య పరీక్షలు చేయగా 103 మందికి విష జ్వరాలు ఉన్నట్లు తేలింది. సెప్టెంబర్‌లో 467 మందికి గాను 97, అక్టోబర్‌లో 292 మందికి గాను 86 మంది విష జ్వరాలతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. అలాగే ఈ మూడు నెలల్లోనే ఏడు మలేరియా కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మలేరియా, టైఫాయిడ్, విషజ్వర పీడితుల సంఖ్యకు లెక్కేలేదు. అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టకపోతే సీజనల్ వ్యాధులు మరింత విజృంభించే ప్రమాదముంది. -
ప్రాణాలు హరీ
జిల్లాకు జ్వరమొచ్చింది. కొద్ది రోజులుగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలు, అతిసారం, డెంగీ, మలేరియా వంటి వ్యాధులతో జనం మంచం పడుతున్నారు. సర్కారు ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఓవైపు రోగాలతో ఒళ్లు గుళ్లవుతుండగా, మరోవైపు వైద్య ఖర్చుల కోసం జేబులు ఖాళీ అవుతున్నాయి. జిల్లాలో నెల రోజుల్లో ఇరవై మందికి పైగా మృత్యువాతపడ్డారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం అప్రమత్తం కాకపోవడంతో వారికి ప్రజారోగ్యం పట్ల ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోంది. - న్యూస్‌లైన్, కరీంనగర్ హెల్త్ రోజుకు రూ.వెయ్యి ఖర్చు.. నాకు 25 రోజుల క్రితం జ్వరం వచ్చింది. గత ఆదివారం ప్రభుత్వాసుపత్రిలో చేరాను. డాక్టర్లు డెంగీ వచ్చిందని చెప్పారు. వైద్య పరీక్షలకే రూ.20వేలకు పైగా ఖర్చయింది. ఇతర ఖర్చులు రోజుకు వెయ్యి అవుతున్నాయి. - రాజ్‌కుమార్, డిగ్రీ విద్యార్థి, ధర్మపురి పొట్టనపెట్టుకున్న మలేరియా.. వెల్గటూర్ మండలం కొత్తపేటకు చెందిన కుష్నపెల్లి సత్తమ్మ(28)కు పదిరోజుల క్రితం జ్వరం రాగా ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయిం చుకుంది. అయినా తగ్గకపోవడంతో బంధువులు ఆమెను వారం రోజుల క్రితం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల్లో మలేరియా వచ్చినట్లు తేలింది. చేతులెత్తేసిన ్రైపైవేట్ వైద్యులు ఆమెను మూడు రోజుల క్రితం ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడా సరైన వైద్యం అందక సత్తమ్మ శనివారం చనిపోయింది. భర్త వెంకటేష్ దుబాయ్ వెళ్లగా, కుట్టుపని చేసుకుంటూ పిల్లలను పోషించుకునేది. తల్లి మృతితో అరవింద్, వంశీ దిక్కులేనివారయ్యారు. ఆసుపత్రిలోనే రంజాన్ ఎన్టీపీసీకి చెందిన ఎండీ.సుమోరా(12)కు వారం రోజుల క్రితం జ్వరంరాగా గోదావరిఖని ప్రభుతాస్పత్రిలో చూపించారు. డెంగీ, మలేరియా వల్ల రక్తకణాలు 40వేలకు పడిపోయినట్లు వైద్యులు చెప్పారు. దీంతో సుమోరానుగురువారం కరీంనగర్ ఆస్పత్రిలో చేర్పించారు. రంజాన్ పండగ హాస్పిటల్లోనే గడిచిందని,ఇప్పటికే పది వేలు ఖర్చయ్యాయని ఆమె తండ్రి అబ్దుల్కరీం తెలిపారు. కరీంనగర్ హెల్త్, న్యూస్‌లైన్: ఇటీవల జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వరదలు ముంచెత్తాయి. ఎడతెగని ముసురు వల్ల పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. దీనికితోడు కలుషిత నీరు, వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావంతో వ్యాధులు ప్రబలుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. వ్యాధులు ఇంకా తీవ్రమయ్యే అవకాశాలున్నాయని, వెంటనే పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదని పేర్కొంటున్నారు. అయితే వర్షాకాలం ప్రారంభంలోనే పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు. దోమల వల్ల వచ్చే వ్యాధులు, అంటురోగాల గురించి విసృతంగా ప్రచారం చేయాల్సి ఉండగా ప్రకటనలకే పరిమితమయ్యారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి మంగళవారం డ్రైడేగా పాటించాలనే ఆదేశాలను క్షేత్రస్థాయిలో బేఖాతరు చేస్తున్నారు. అధికారులంతా ఎన్నికల హడావుడిలో పడి ప్రజారోగ్యాన్ని విస్మరించారనే విమర్శలున్నాయి. జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య బాధ్యతలు చేపట్టి రెండు నెలలవుతున్నా ఇంతవరకు నగరంలోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించలేదు. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలందించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సామాజిక, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు కరువయ్యాయి. వైద్య సిబ్బంది కొరత, ఉన్నవారు స్థానికంగా నివాసం ఉండకపోవడం, గైర్హాజరు కావడం, మందుల సరఫరా లేకపోవడం వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల పరిస్థి తి దయనీయంగా మారింది. పలువురు రోగులు స్థాని కంగా ఉన్న ఆర్ఎంపీలు, పీఎంపీల వద్ద చికిత్స పొందు తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాం తాల నుంచి రోజుకు వందల సంఖ్యలో రోగులు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రికి వస్తున్న పేద రోగులను సరిగా పట్టించుకోకుండా మెరుగైన వైద్యసేవల కోసమంటూ వరంగల్ ఎం జీఎంకు, ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. రక్త, మూత్ర పరీక్షలు, స్కానింగ్‌ల పేరిట ఆసుపత్రుల్లో అందినంత దోచుకుంటున్నారు. చిన్నపాటి జ్వరంతో వెళ్లినా డాక్టర్ ఫీజు రూ.150, వైద్య పరీక్షలకు రూ.500, మందులు రూ.500.. మొత్తం రూ.1500 వరకు గుంజుతున్నారని రోగులు పేర్కొంటున్నారు. అప్పటికీ నయం కాకుంటే ఇన్‌పేషంట్లుగా చేర్చుకుంటున్నారు. రక్తకణాలు తగ్గాయంటూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీని నియంత్రించినా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అసలే పట్టించుకోవడం లేదు. రూ.40వేలు ఖర్చయినా నయం కాలేదు.. మాది వీణవంక మండలం బేతిగల్. నేను నా భార్య కూలి పనులకు పోతం. నాకు పదిహేను రోజుల కిందట జ్వరమొచ్చింది. ఆర్ఎంపీ దగ్గర మందులు వాడినా తగ్గలే. జమ్మికుంటల ఓ ప్రైవేట్ దావఖానకు పోయిన. డాక్టర్లు అన్ని ప రీక్షలు టైఫాయిడ్ వచ్చిందన్నరు. మూ డ్రోలు బెడ్‌పైన ఉంచుకున్నరు. పదిహే ను వేలు ఖర్చయింది. అక్కడ తగ్గలేదని ఇంకో హాస్పిటల్ల చేరిన. మలేరియా, టైఫాయిడ్ వచ్చిందని చెప్పిండ్రు. అక్కడ నాలుగు రోజులున్న. పదహారు వేలు ఒడిసినయి. అప్పటికీ జ్వరం తగ్గకుంటే వరంగల్ల ప్రయివేట్ హాస్పిటల్లో చూపించుకున్న. అక్కడ ఆరువేలు ఖర్చయింది. ఇప్పటికే అక్కడా ఇక్కడా అప్పులు చేసిన. ఇక అప్పు కూడా పుట్ట క ఇంటికచ్చిన. ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, ఏఎన్ఎంలు మా దిక్కు వచ్చుడే లేదు. ఏం చేసుడో.. ఎట్ల బాగైతనో.. - న్యూస్‌లైన్, వీణవంక -
ప్రాణాలు హరీ
జిల్లాకు జ్వరమొచ్చింది. కొద్ది రోజులుగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలు, అతిసారం, డెంగీ, మలేరియా వంటి వ్యాధులతో జనం మంచం పడుతున్నారు. సర్కారు ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఓవైపు రోగాలతో ఒళ్లు గుళ్లవుతుండగా, మరోవైపు వైద్య ఖర్చుల కోసం జేబులు ఖాళీ అవుతున్నాయి. జిల్లాలో నెల రోజుల్లో ఇరవై మందికి పైగా మృత్యువాతపడ్డారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం అప్రమత్తం కాకపోవడంతో వారికి ప్రజారోగ్యం పట్ల ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోంది. - న్యూస్‌లైన్, కరీంనగర్ హెల్త్ రోజుకు రూ.వెయ్యి ఖర్చు.. నాకు 25 రోజుల క్రితం జ్వరం వచ్చింది. గత ఆదివారం ప్రభుత్వాసుపత్రిలో చేరాను. డాక్టర్లు డెంగీ వచ్చిందని చెప్పారు. వైద్య పరీక్షలకే రూ.20వేలకు పైగా ఖర్చయింది. ఇతర ఖర్చులు రోజుకు వెయ్యి అవుతున్నాయి. - రాజ్‌కుమార్, డిగ్రీ విద్యార్థి, ధర్మపురి పొట్టనపెట్టుకున్న మలేరియా.. వెల్గటూర్ మండలం కొత్తపేటకు చెందిన కుష్నపెల్లి సత్తమ్మ(28)కు పదిరోజుల క్రితం జ్వరం రాగా ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయిం చుకుంది. అయినా తగ్గకపోవడంతో బంధువులు ఆమెను వారం రోజుల క్రితం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల్లో మలేరియా వచ్చినట్లు తేలింది. చేతులెత్తేసిన ్రైపైవేట్ వైద్యులు ఆమెను మూడు రోజుల క్రితం ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడా సరైన వైద్యం అందక సత్తమ్మ శనివారం చనిపోయింది. భర్త వెంకటేష్ దుబాయ్ వెళ్లగా, కుట్టుపని చేసుకుంటూ పిల్లలను పోషించుకునేది. తల్లి మృతితో అరవింద్, వంశీ దిక్కులేనివారయ్యారు. ఆసుపత్రిలోనే రంజాన్ ఎన్టీపీసీకి చెందిన ఎండీ.సుమోరా(12)కు వారం రోజుల క్రితం జ్వరంరాగా గోదావరిఖని ప్రభుతాస్పత్రిలో చూపించారు. డెంగీ, మలేరియా వల్ల రక్తకణాలు 40వేలకు పడిపోయినట్లు వైద్యులు చెప్పారు. దీంతో సుమోరానుగురువారం కరీంనగర్ ఆస్పత్రిలో చేర్పించారు. రంజాన్ పండగ హాస్పిటల్లోనే గడిచిందని,ఇప్పటికే పది వేలు ఖర్చయ్యాయని ఆమె తండ్రి అబ్దుల్కరీం తెలిపారు. కరీంనగర్ హెల్త్, న్యూస్‌లైన్: ఇటీవల జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వరదలు ముంచెత్తాయి. ఎడతెగని ముసురు వల్ల పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. దీనికితోడు కలుషిత నీరు, వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావంతో వ్యాధులు ప్రబలుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. వ్యాధులు ఇంకా తీవ్రమయ్యే అవకాశాలున్నాయని, వెంటనే పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదని పేర్కొంటున్నారు. అయితే వర్షాకాలం ప్రారంభంలోనే పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు. దోమల వల్ల వచ్చే వ్యాధులు, అంటురోగాల గురించి విసృతంగా ప్రచారం చేయాల్సి ఉండగా ప్రకటనలకే పరిమితమయ్యారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి మంగళవారం డ్రైడేగా పాటించాలనే ఆదేశాలను క్షేత్రస్థాయిలో బేఖాతరు చేస్తున్నారు. అధికారులంతా ఎన్నికల హడావుడిలో పడి ప్రజారోగ్యాన్ని విస్మరించారనే విమర్శలున్నాయి. జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య బాధ్యతలు చేపట్టి రెండు నెలలవుతున్నా ఇంతవరకు నగరంలోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించలేదు. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలందించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సామాజిక, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు కరువయ్యాయి. వైద్య సిబ్బంది కొరత, ఉన్నవారు స్థానికంగా నివాసం ఉండకపోవడం, గైర్హాజరు కావడం, మందుల సరఫరా లేకపోవడం వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల పరిస్థి తి దయనీయంగా మారింది. పలువురు రోగులు స్థాని కంగా ఉన్న ఆర్ఎంపీలు, పీఎంపీల వద్ద చికిత్స పొందు తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాం తాల నుంచి రోజుకు వందల సంఖ్యలో రోగులు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రికి వస్తున్న పేద రోగులను సరిగా పట్టించుకోకుండా మెరుగైన వైద్యసేవల కోసమంటూ వరంగల్ ఎం జీఎంకు, ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. రక్త, మూత్ర పరీక్షలు, స్కానింగ్‌ల పేరిట ఆసుపత్రుల్లో అందినంత దోచుకుంటున్నారు. చిన్నపాటి జ్వరంతో వెళ్లినా డాక్టర్ ఫీజు రూ.150, వైద్య పరీక్షలకు రూ.500, మందులు రూ.500.. మొత్తం రూ.1500 వరకు గుంజుతున్నారని రోగులు పేర్కొంటున్నారు. అప్పటికీ నయం కాకుంటే ఇన్‌పేషంట్లుగా చేర్చుకుంటున్నారు. రక్తకణాలు తగ్గాయంటూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీని నియంత్రించినా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అసలే పట్టించుకోవడం లేదు. రూ.40వేలు ఖర్చయినా నయం కాలేదు.. మాది వీణవంక మండలం బేతిగల్. నేను నా భార్య కూలి పనులకు పోతం. నాకు పదిహేను రోజుల కిందట జ్వరమొచ్చింది. ఆర్ఎంపీ దగ్గర మందులు వాడినా తగ్గలే. జమ్మికుంటల ఓ ప్రైవేట్ దావఖానకు పోయిన. డాక్టర్లు అన్ని ప రీక్షలు టైఫాయిడ్ వచ్చిందన్నరు. మూ డ్రోలు బెడ్‌పైన ఉంచుకున్నరు. పదిహే ను వేలు ఖర్చయింది. అక్కడ తగ్గలేదని ఇంకో హాస్పిటల్ల చేరిన. మలేరియా, టైఫాయిడ్ వచ్చిందని చెప్పిండ్రు. అక్కడ నాలుగు రోజులున్న. పదహారు వేలు ఒడిసినయి. అప్పటికీ జ్వరం తగ్గకుంటే వరంగల్ల ప్రయివేట్ హాస్పిటల్లో చూపించుకున్న. అక్కడ ఆరువేలు ఖర్చయింది. ఇప్పటికే అక్కడా ఇక్కడా అప్పులు చేసిన. ఇక అప్పు కూడా పుట్ట క ఇంటికచ్చిన. ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, ఏఎన్ఎంలు మా దిక్కు వచ్చుడే లేదు. ఏం చేసుడో.. ఎట్ల బాగైతనో.. - న్యూస్‌లైన్, వీణవంక -
మంచం పట్టిన ఏజెన్సీ
ఏటూరునాగారం/కమలాపురం, న్యూస్‌లైన్ : ఏజెన్సీ ప్రాంతాలు జ్వరాలతో వణికిపోతున్నారుు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ఏటూరునాగారం మండల పరిధిలోని గొత్తికోయల గూడేలు, కమలాపురం శివారు గ్రామాలు మంచం పట్టారుు. చింతలపాడులో పోడెం జోగి, మూడేళ్ల చిన్నారి సునీతతోపాటు గుర్రాలబావి గొత్తికోయగూడెంలో పలువురు జ్వరంతో విలవిల్లాడుతున్నారు. గుర్రాలబావిలో ఇటీవల ఓ చిన్నారి పాముకాటుకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. సకాలంలో వైద్యం అందక ఆమె మృత్యువాత పడింది. అరుునా ఏటూరునాగారం గిరిజన సమగ్రాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోని వైద్య, ఆరోగ్య శాఖ పట్టించుకున్న దాఖలాలు కనబడడం లేదు. ఇందుకు గుర్రాలబావిలో జ్వరంతో బాధపడుతున్న మండకం సోమి మాటలే నిదర్శనంగా నిలుస్తున్నారుు. ‘మూడు రోజులుగా జ్వరంతో అల్లాడుతున్నా... నర్సు గానీ... ఏ ఒక్కరూ గానీ ఇటు వచ్చిన పాపాన పోలేదు. రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో డొల్లాలే దిక్కవుతున్నారుు. దీంతో ఆస్పత్రికి వెళ్లాలనిపించడం లేదు.’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏటూరునాగారం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న చింతలపాడు... చెల్పాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి వస్తుంది. గుర్రాలబావి సైతం చెల్పాక పీహెచ్సీ పరిధిలోనే ఉంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నప్పటికీ... ప్రజలను అప్రమత్తం చేయాల్సిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంతో గిరిజనులకు సకాలంలో వైద్యం అందకుండా పోతోందని వారి ఆవేదనను బట్టి ఇట్టే గ్రహించవచ్చు.