నిజామాబాద్ అర్బన్: ఈ ఏడాది సీజనల్ వ్యాధుల ప్రభా వం తీవ్రంగా ఉంది. గత రెండు నెలల నుంచి రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వారం రోజులుగా వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పులతోనే జ్వరపీడితులు పెరుగుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అపరిశుభ్రత, దోమల బెడద ప్రజలను వ్యాధిగ్రస్తులను చేస్తున్నాయి. తగు చర్యలు తీసుకోవడంలో వైద్యశాఖ పూర్తిగా విఫలమమవుతోంది.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 375 ఆరోగ్య ఉపకేంద్రాలు, మూ డు ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వీటిలో వైద్య సేవలు పొందుతారు. ఈ ఏడాది సీజనల్ వ్యాధుల నమోదు వేగంగా పెరుగుతోంది. మలేరియా కేసులు ఎక్కువగా నమోదువుతున్నా యి. గత ఏడాది రెండు నెలలలో 33 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 46 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ అర్బన్, బాల్కొండ మండలం సరి హద్దు ప్రాంతంలో దీని ప్రభావం అధికంగా ఉంది.
దోమల బెడదతో జ్వరా లు అధికంగా ప్రబలుతున్నాయి. డయేరియా కేసులు 44 నమోదయ్యాయి. అతిసార 114, కలుషిత ఆహారం 18 కేసులు నమోదయ్యాయి. డెంగీ అధికంగా ప్రభావం చూపుతుంది. గత ఏడాది ఆరు కేసులు నమోదు కాగా, ప్ర స్తుతం 14 కేసులు నమోదయ్యాయి. ఎడపల్లి గురుకులం విద్యార్థులు సుమారు 50మంది జ్వరంతో బాధపడుతున్నారు. సదాశివనగర్ మండలం గొకుల్‌తండాలో సుమారు 30మంది వరకు అతిసార వ్యాధి బారిన పడ్డారు.
చిన్నారులు కూడా
జ్వర పీడితులు, న్యూమోనియా బాధితులతో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులు నిండిపోతున్నాయి. రోజుకు 200 నుంచి 300 మంది వరకు రోగులు ఆసుపత్రులకు వస్తున్నారు. జిల్లా కేంద్రంలోని చిన్నపిల్లల ఆసుపత్రులలో సుమారు 40 నుంచి 50 వరకు చిన్నారులు జ్వరాలతో చేరుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ల సంఖ్య 320 నుంచి 380 వరకు పెరిగింది.
అధికారులేం చేస్తున్నారో!
వ్యాధులను నియంత్రించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమవుతోంది. ముం దస్తుగానే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఆయా మండలాలకు ఇన్‌చార్జిల ను నియమించాల్సి ఉంటుంది. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగించాల్సి ఉంటుంది. మందులను అందుబాటులో ఉంచి, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. కానీ, వీరు నేటి వరకు సమావేశాలు నిర్వహించ లేదు. గ్రామాలు, పట్టణాలు, నగరంలో పారిశుధ్య పనులు కూడా సక్రమంగా సా గడం లేదు.
వైద్య సేవలను పరిశీలించాల్సిన జిల్లా అధికారి, క్లస్టర్ అధికారు లు కార్యాలయానికే పరిమితమవుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమావేశాల పేరిట తరచూ హైదరాబాద్‌కు వెళ్లడం, అందుబాటులో ఉ న్నప్పుడు జిల్లా కేంద్రంలో సమావేశాలలో పాల్గొనడంతో ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల తీరు ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా జిల్లా సరిహద్దు ప్రాంతాలలో పరిస్థితి దారుణంగా ఉంది. అధికారులు మాత్రం వ్యాధులకు సంబంధించిన వివరాలను, పరిస్థితులను తెలియజేసేందుకు నిరాకరిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి గోవింద్‌వాగ్మారే వివరణ కోరగా స్పందించ లేదు.
రోగాల దాడి
Published Thu, Aug 28 2014 4:15 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement