నిజామాబాద్ అర్బన్ : ఆసుపత్రి అభివృద్ధి సంఘం నిధులు పక్కదారి పడుతున్నాయి. సౌకర్యాల ఏర్పాటుకు, పరికరాల కొనుగోలుకు వినియోగించుకోవాల్సిన ఈ నిధులను కొందరు అధికారులు తప్పుడు బిల్లులతో తమ జేబులలోకి పంపుతున్నారు. అసలే ఆరోగ్య కేంద్రాలలో రోగుల సంఖ్య తక్కువ. నిధుల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. అధికారులు మాత్రం ఖర్చు పేరిట నిధులను మింగేస్తున్నారు. దీంతో ఏటా లక్షలాది రూపాయలు దుర్వినియోగమవుతున్నాయి.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు ఏరియా ఆసుపత్రులు, ఒక జిల్లా ఆసుపత్రి, మూడు కమ్యూనిటీ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర సర్కారు ఏటా ఆసుపత్రి అభివృద్ధి సంఘాలకు నిధులను విడుదల చేస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 1.75 లక్షలు, ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రులకు రూ.రెండు లక్షలు, జిల్లా ఆసుపత్రికి రూ. ఐదు లక్షల చొప్పున నిధులు వస్తాయి.
ఆసుపత్రి భవనం నిర్వహణ, రంగులు వేయడం, పిచ్చిమొక్కలు తొలగించడ ం, అభివృద్ధి పనులు చేపట్టడం, ఆపరేషన్ థియేటర్‌కు పనిముట్లు, ఇతర సౌకర్యాలకు ఈ నిధులను వినియోగించాల్సి ఉంటుంది. ఆసుపత్రి అభివృద్ధి సంఘాలకు ఎస్ పీహెచ్‌ఓలు కన్వీనర్లుగా ఉంటారు. వీరు మెడికల్ ఆఫీసర్, ఇతర సభ్యులతో చర్చించి నిధులను ఖర్చు చేయాలి. కానీ ఎక్కడ కూడా ఇలా జరుగడం లేదు. మెడికల్ ఆ ఫీసర్లు తూతూ మాత్రంగంగానే సంతకాల సేకరించి నిధులు వినియోగిస్తున్నారు. పాత బిల్లులను తాజాగా చూపెడుతూ వాటిని దుర్వినియోగం చేస్తున్నారు.
పాత బిల్లులే
ఎల్లారెడ్డి డివిజన్‌లోని నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మూడేళ్ల నుంచీ ఒకే రకం బిల్లులు సమర్పించినట్టు సమాచారం. మోర్తాడ్ పరిధిలోని ఓ ఆరోగ్య కేంద్ర ంలోనూ ఇదే వ్యవహరం కొనసాగుతోందని అంటున్నారు. బాన్సువాడ పరిధిలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొరం వేసినట్లు మూడుసార్లు అదే బిల్లు పెడుతూ రూ. లక్ష 30 వేలు కాజేశారని తెలిసింది. డిచ్‌పల్లి పరిధిలోని మొక్కల పెంపకం పేరిట రెండేళ్లుగా 1.75 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు బిల్లులు సమర్పించారు. వా స్తవానికి మొక్కల పెంపకం అనేది అక్కడ లేనేలేదు.
ఇలా ఆయా పీహెచ్‌సీలలో తప్పుడు బిల్లులతో నిధులను కాజేస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఆడిట్‌కు భారీ మొత్తంలో ముడుపులు చెల్లిస్తూ తప్పించుకుంటున్నారు. ఓ అధికారికి రూ. 25 వేలు, మండల స్థాయి అధికారికి రూ. 15 వేలు, కార్యాలయ సూపరిడెంట్‌కు రూ. 10 వే ల రూపాయల చొప్పున పంచుతున్నట్టు తెలిసింది.
అధికారి శుభకార్యానికి అభివృద్ధి నిధులు
ఇటీవలే ఓ అధికారి తన ఇంటిలో శుభకార్యం నిర్వహించారు. ఇందుకోసం వైద్యుల నుంచి రూ. 20 వేల చొప్పున ఖర్చుల నిమిత్తం వసూలు చేశారని సమాచారం. ఓ సూపరిడెంట్ మధ్యవర్తిగా ఉండి ఈ వ్యవహారం నడిపించారని తెలిసింది. ఆసుపత్రి అభివృద్ధి నిధులు ఉన్నాయి కదా.. పాత బిల్లులనే తిరగేసి డబ్బులను అందిం చాలంటూ చెప్పుకచ్చారు.
ఓ సీనియర్ వైద్యాధికారి డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో ఆయనను ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించారు. ముందే డబ్బులు ఇచ్చిన ఓ వైద్యుడికి జిల్లా కేంద్రంలో డిప్యూటేషన్ ఇచ్చారని అంటున్నారు. డబ్బులు ఇవ్వని వైద్యాధికారులకు తనిఖీల పేరిట ఆందోళన కలిగించిన అంశాలే ఎక్కువగా ఉన్నా యి. సమగ్రంగా విచారణ జరిపితే అసలు నిధుల దుర్వినియోగం బయటపడే అవకాశం ఉంది.
మింగేస్తున్నారు!
Published Mon, Sep 29 2014 2:22 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement