Health care
-
ఈ వయసులో ఇలాంటి సర్జరీతో కాంప్లికేషన్స్ అంటున్నారు.. నిజమేనా?
నా వయసు 35 సంవత్సరాలు. ముగ్గురు పిల్లలు. నాకు ట్యూబ్స్, ఓవరీస్‌లో ఇన్ఫెక్షన్ ఉందని ఈమధ్యే సర్జరీ చేసి రెండు ఓవరీస్‌ను తీసేశారు. ఈ వయసులో ఇలాంటి సర్జరీతో కాంప్లికేషన్స్ ఉంటాయి అంటున్నారు. నిజమేనా? – లక్ష్మీపద్మజ, కిసాన్నగర్ఓవరీస్ అనేవి పిల్లలు కావటానికి మాత్రమే కాదు, అవి కొన్ని హార్మోన్స్‌ని రిలీజ్ చేయ్యటం వలన ఆరోగ్యానికీ చాలా అవసరం. 50 నుంచి 55 సంవత్సరాల మధ్య అండాల విడుదల ఆగిపోయా, ఓవరీస్ ఎండిపోతాయి. అప్పుడు ఇంక హార్మోన్స్ విడుదల ఉండదు. నెలసరి కూడా ఆగిపోతుంది. దాన్ని నేచురల్ మెనోపాజ్ అంటాం. కానీ 50 ఏళ్లలోపు ఏ కారణంతో అయినా సర్జరీ ద్వారా ఓవరీస్‌ను తొలగిస్తే దానిని సర్జికల్ మెనోపాజ్ అంటాం. చిన్న వయసులో హఠాత్తుగా పీరియడ్స్ ఆగిపోతాయి. హర్మోన్స్ రిలీజ్ ఆగిపోతుంది. ఇలా సర్జరీ తర్వాత మెనోపాజ్ వచ్చిన వాళ్లకి చాలా సింప్టమ్స్ ఉంటాయి. ఒంట్లోంచి వేడివేడి పొగలు రావడం, రాత్రుళ్లు చెమటపట్టడం, గుండె దడ, మూడ్ స్వింగ్స్, యాంగ్జయిటీ, నిద్ర పట్టకపోవడం, నీరసం, మతిమరుపు, వజైనల్ డ్రైనెస్, యూరీనరీ ఇన్ఫెక్షన్స్, జాయింట్ పెయిన్స్, చర్మం పొడిబారిపోవడం వంటివి ఉంటాయి. అయితే వీటన్నిటినీ జీవనశైలి మార్పుతో తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, పోషకాహారాన్ని తీసుకోవడం, కాఫీ, టీలను తగ్గించడం, మసాలా ఫుడ్‌కి దూరంగా ఉండటం, ఒత్తిడి తగ్గించుకోవటం, మెడిటేషన్, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ వంటివాటితో మెనోపాజ్ ఇబ్బందులను చాలావరకు పరిష్కరించుకోవచ్చు. ఆరోగ్య సమస్యలను విభజించి.. పాజిటివ్ అప్రోచ్‌తో డీల్ చెయ్యడాన్ని టాకింగ్ థెరపీ అంటారు. దీంతో కూడా ప్రిమెనోపాజ్ సింప్టమ్స్‌ను తగ్గించవచ్చు. సింప్టమ్స్ తీవ్రంగా ఉన్న వారికి ఇలాంటివేమీ పనిచేయకపోవచ్చు. అలాంటివారికి డాక్టర్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ)ని సూచిస్తారు. హార్మోన్స్‌ని టాబ్లెట్ రూపంలో ఇవ్వడమే హెచ్ఆర్టీ. ఇవి జెల్స్, ప్యాచెస్, స్ప్రేలుగానూ అందుబాటులో ఉన్నాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది గుండె, ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. ప్రొజెస్టిరాన్ హార్మోన్ గర్భసంచి ఆరోగ్యానికి అవసరం. మీకు గర్భసంచి తీయలేదు కాబట్టి కేవలం ఈస్ట్రోజన్ మాత్రమే ఇస్తే సరిపోదు. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ రెండూ ఇవ్వాలి. కుటుంబంలో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ల చరిత్ర ఉన్నవారికి హెచ్ఆర్టీ మంచిది కాదు. అలాంటివారికి కొన్ని ప్రత్యామ్నాయ మందులను సూచిస్తారు. వాటిని ఎస్సెస్సారై ( ఖఐ) అంటారు. ఈ మెడిసిన్‌ను డాక్టర్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. వజైనా డ్రైనెస్, ఇచింగ్ తగ్గడానికి వజైనల్ ఈస్ట్రోజన్ క్రీమ్స్‌ను సూచిస్తారు. ఇలా ఒక్కోవ్యక్తికి వాళ్ల వాళ్ల ఆరోగ్యపరిస్థితిని బట్టి సరైన చికిత్సను అందిస్తే రిస్క్, కాంప్లికేషన్స్ తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుంది.నాకు మూడు సిజేరియన్స్ అయ్యాయి. మొదటి ఆపరేషన్ తర్వాత కుట్ల మీద నల్లటి పెద్ద మచ్చ ఏర్పడింది. దాన్ని కెలాయిడ్ అంటారని చెప్పారు. చివరి రెండు సర్జరీల్లో దాన్ని తొలగించినా, మళ్లీ ఏర్పడింది. అక్కడ చర్మం పొడిబారిపోయి.. దురదగా ఉంటోంది. ఇది శాశ్వతంగా ఉంటుందా? దీనికి ట్రీట్మెంట్ లేదా? – అంజలి, వైజాగ్సిజేరియన్స్కి పెద్దగా కోత పెడతాం కాబట్టి ఆ ఆపరేషన్ తర్వాత వచ్చే కెలాయిడ్స్ పెద్దగానే ఉంటాయి. ఈ టెండెన్సీ ఉన్న వారిలో తర్వాత డెలివరీలో ఆ కెలాయిడ్ స్కార్ను తీసేసినా హీలింగ్ ప్రాసెస్‌లో మళ్లీ ఫామ్ అవుతుంది. కొంచెం లైట్‌గా ఉన్న కెలాయిడ్ స్కార్‌కి అయితే కార్టిసోన్ అనే స్టెరాయిడ్ క్రీమ్ లేదా ఇంజెక్షన్స్‌ని ట్రై చేస్తారు. వీటిని అనుభవజ్ఞులైన డెర్మటాలజిస్ట్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఈ ఇంజెక్షన్లను నెలకొకటి చొప్పున ఆరునెలల పాటు వాడినవారిలో ఈ మచ్చ ఫేడ్ అవటం కనిపించింది. అయితే కొంతమందికి పిగ్మెంటేషన్ స్కార్స్ కూడా రావచ్చు. కొంతమందిలో ఈ స్టెరాయిడ్ క్రీమ్ వల్ల సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. క్రిప్టోథెరపీ అని.. లిక్విడ్ నైట్రోజన్‌ను అప్లై చేసిన కొంతమందిలో మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. Pulsed dye laser థెరపీ ద్వారా 80 నుంచి 90 శాతం కెలాయిడ్ స్కార్‌ని తగ్గించవచ్చు. ఈ ట్రీట్మెంట్ 4 నంచి 8 వారాలుంటుంది. లో లెవెల్ రేడియోథెరపీ అనేది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. దీంతో మచ్చ మాసిపోవడమే కాక, దురద, అనీజీనెస్ కూడా తగ్గుతాయి. ఈ చికిత్సను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. కెలాయిడ్ స్కార్‌ని ఆపరేషన్ ద్వారా తీసేసి, 48 గంటల్లోపే ఫస్ట్ డాక్స్ ఆఫ్ ఎక్స్–రే థెరపీని ఇస్తారు. వారం తర్వాత రెండో డాక్స్‌ను ఇస్తారు. ఈ ప్రోసీజర్కు 2 నుంచి 3 గంటలు పడుతుంది. నొప్పి ఉండదు. కొన్ని షార్ట్‌టర్మ్ సైడ్ఎఫెక్ట్స్ 2 నుంచి 3 వారాలు ఉండి తగ్గిపోతాయి. కొంచెం మంట ఉంటుంది. దీనికి డ్రెస్సింగ్‌ను సూచిస్తారు. లాంగ్‌టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్.. అంటే కొంతమందికి 3 నుంచి 6 నెలల తర్వాత స్కిన్ డార్క్ అవటం, పింగ్మేంటేషన్ కనిపిస్తుంది. సన్‌స్క్రీన్ వాడాల్సి వస్తుంది. పాజిటివ్ అప్రోచ్‌తో డీల్ చెయ్యడాన్ని టాకింగ్ థెరపీ అంటారు. దీంతో కూడా ప్రిమెనోపాజ్ సింప్టమ్స్‌ను తగ్గించవచ్చు. సింప్టమ్స్ తీవ్రంగా ఉన్న వారికి ఇలాంటివేమీ పనిచేయకపోవచ్చు. -
ఈ అలవాట్లు ఉంటే! 50లో హెల్దీ అండ్ హ్యాపీ..!
రొటీన్‌గా చేసే పనుల్లో చేసుకోదగిన చిన్న చిన్న మార్పులు న్యూ ఇయర్(New Year)తో 50 ఏళ్లు నిండుతాయా...ఎంతో హుషారుగా, మరెంతో శ్రమతో లేదంటే.. గడిచిన నాలుగు పదులనూఓ జ్ఞాపకంలా మార్చుకుంటూ ఐదు పదుల్లోకి అడుగుపెట్టి ఉంటారు. ఇప్పటివరకు ఒక లెక్క...ఇక నుంచి ఒక లెక్క అన్నట్టు 50 ఏళ్ల నుంచి మహిళల శరీరంలోనూ, మనస్తత్వంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇంటా బయట ఎదురయ్యే ఒత్తిళ్లు, తమ పట్ల తాము పట్టించుకోని విధానం ఎప్పుడూ ఉంటుంది. పర్లేదు అని నిర్లక్ష్యం చేసే రోజువారీ అలవాట్లను వదిలేసికొత్తగా ఈ అలవాట్లను అలవరచుకోండి. 50 ఏళ్లలోనూ ఫిట్ అండ్ హెల్తీగా ఉండండి.వ్యాయామాలు(Exercises)కార్డియో ఎక్సర్సైజులు చేయాలనుకోకండి. శరీరానికంతటికీ శక్తినిచ్చే వ్యాయామం కండర కణజాలాన్ని సంరక్షిస్తుంది. ఎముక నష్టం కాకుండా పోరాడుతుంది. సమతుల్యతను కాపాడుతుంది. సడెన్‌గా పడిపోయే ప్రమాదాలను నివారిస్తుంది. సెల్ఫ్‌కేర్(Self Care)ఎప్పుడూ తమ కన్నా ముందు ఇతరులకు ఇవ్వడానికే శక్తిని ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక నుంచి రోజులో కొంత సమయం ‘నా కోసం నేను’ అనేలా మిమ్మల్ని మీరు సంతోషపరుచుకునే మానసిక ఆరోగ్యాన్ని పెం΄÷ందించే అలవాట్లు, కార్యకలా΄ాలకు ప్రాధాన్యత ఇవ్వండి.చురుకుగా ఉండటానికి..50 లలో ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. గంటల తరబడి కూర్చుంటే గుండె జబ్బుల రిస్క్ పెరగవచ్చు. ఊబకాయం వల్ల కీళ్లపై భారం పడి మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. అందుకని శరీరం, మైండ్ చురుకుదనానికి రెగ్యులర్ మూవ్మెంట్స్ ఉండేలా చూసుకోవాలి.నిల్వ పదార్థాలకు ‘నో’ఉప్పు, చక్కెర మోతాదు నిల్వ పదార్థాలలో ఎక్కువ. అంతేకాదు, వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకని మైదాతోపాటు ఇతర నిల్వ ఉండే పదార్థాలను పక్కనపెట్టండి.చర్మం పట్ల జాగ్రత్త! (Skin Care)చర్మ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే వృద్ధాప్యం వేగంగా వచ్చేస్తుంది. చర్మ కేన్సర్ ప్రమాదాన్నీ పెంచుతుంది. వయసుతోపాటు చర్మమూ పొడిబారుతుంటుంది. ఎండవేళలో బయటకు వెళ్లినప్పుడు ఈ సమస్య మరీ పెరుగుతుంది. అందుకని, ఎండ నేరుగా చర్మంపై పడకుండా ఎస్పిఎఫ్ ప్రొటెక్షన్ ఉన్న క్రీమ్స్ ఉపయోగించాలి..ప్రోటీన్స్(Proteins)ఇన్నిరోజులు రుచిగా ఉండే ఆహారంపైన దృష్టి పెట్టి ఉంటారు. కానీ, తినే ఆహారంలో ప్రోటీన్ తక్కువ ఉంటే కండరాలకు వేగంగా నష్టం వాటిల్లడమే కాదు రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందుకని నట్స్, గుడ్లు, మొక్కల నుంచి లభించే ప్రోటీన్లు గల ఆహారాన్ని భోజనంలో చేర్చండి.తరచూ నీళ్లుడీహైడ్రేషన్ ప్రభావాలు చర్మం సాగే గుణం, అజీర్తి, శక్తి స్థాయిలపై పడుతుంది. దాహం వేయడం అనే సంకేతాలు వయస్సుతోపాటు తగ్గుతుంటాయని గ్రహించి, తరచూ నీళ్లు తాగుతుండాలి.హాయిగొలిపే నిద్రనిద్రలేమి జీర్ణక్రియ, మానసిక స్థితి, జ్ఞాపశక్తిపైన ప్రభావం చూపుతుంది. ఈ రోజుల్లో మొబైల్, టీవీ స్క్రీన్ల వల్ల అర్ధరాత్రి తర్వాత నిద్రకు ఉపక్రమించేవాళ్లే ఎక్కువ. ఈ జాబితాలో మీరుంటే, స్క్రీన్లను త్వరగా కట్టిపెట్టి రోజూ 6–8 గంటల సమయాన్ని నిద్రకు కేటాయించండి. రాత్రివేళ కెఫీన్ వంటి పానీయాలకు దూరంగా ఉంటే నిద్ర లేమి సమస్య తలెత్తదు.అభిరుచులుఈ వయసులో తలెత్తే మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా డిప్రెషన్‌ని విస్మరిస్తే అవి దీర్ఘకాలం నష్టం జరగవచ్చు. అందుకని మానసిక శ్రేయస్సును ప్రోత్సహించే శ్రద్ధ, అభిరుచుల కోసం సమయం కేటాయించుకోవాలి. (చదవండి: 'యూపీఎస్సీ చాట్ భండార్'..నాటి స్వాతంత్య్ర సంగ్రామాన్ని..!) -
శుభమస్తు.. ఆరోగ్య‘మస్త్’
కొత్త ఏడాది నాడు.. పెద్దలు దీవెనలిస్తారు.. ఫ్రెండ్స్ విషెస్ చెబుతారు .. పిల్లలకు కానుకలిస్తారు మరి పెద్ద పెద్ద డాక్టర్లో..? కొత్త సంవత్సరంలో ‘అందరికీ ఆరోగ్యమస్తు’ అని దీవిస్తూనే.. ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహా–సూచనలను ‘కన్సల్టేషన్’గా అందిస్తున్నారు. దాన్నే సమగ్రంగా, సంక్షిప్తంగా, చిరు కానుకగా ప్రత్యేక పేజీ రూపంలో ‘సాక్షి’ అందిస్తోంది. ‘ఓమ్’ ప్రథమం గట్ బయోమ్జీర్ణ వ్యవస్థ చాలా సంక్లిష్టమైన వ్యవస్థ. గతంలో జీర్ణవ్యవస్థ అనేది కేవలం జీర్ణం చేయడానికి ఉపయోగడపతుందని అనుకున్నారు. ఇటీవలి పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే జీర్ణవ్యవస్థలో కోటాను కోట్ల బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగీ వంటి జీవులు నివసిస్తుంటాయనీ, ‘గట్ బయోమ్’గా పేర్కొనే వీటి సమతౌల్యత వల్లనే మానసిక ఆరోగ్యం, వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయడం వంటివన్నీ ఆధారపడి ఉంటాయని తెలిసింది.అంటే ఓ వ్యక్తి ఆహారం అరిగించడంలోనే కాకుండా, అతడు తినే పదార్థాల తీరు తెన్నులు అతడి మానసిక ఆరోగ్యాన్నీ, రోగనిరోధక వ్యవస్థ పనితీరును నిర్దేశిస్తుంటాయన్నమాట. ఈ బయోమ్ వ్యవస్థ బాగుంటేనే... ఓ వ్యక్తితాలూకు భావోద్వేగాలు (మూడ్స్), నిద్ర, అతడి మానసిక ఆరోగ్యం ఇవన్నీ బాగుంటాయి. మంచి జీవనశైలిని అనుసరిస్తూ, పూర్తిగా సమతులాహారం తీసుకుంటూ ఉంటే గట్ బయోమ్ సమతౌల్యత బాగుంటుంది. మన భారతీయ సంప్రదాయ ఆహారంలో మొక్కలూ, వృక్షాల నుంచి లభ్యమయ్యే ఆహారం తీసుకుంటుంటాం. అంటే... మనం తినే అన్నంలోనే కాయధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కాయగూరలతో పాటు పులవడానికి సిద్ధంగా ఉండే ఇడ్లీ, దోశలు, భోజనం చివర్లో పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయాటిక్ ఆహారాలను తీసుకుంటాం. ఇవన్నీ జీర్ణవ్యవస్థలో ఉండే గట్ బయోమ్ను ఆరోగ్యకరంగా, సమతౌల్యంగా ఉండేలా చూస్తాయి. ఇటీవల మనం తీసుకుంటున్నప్రాసెస్డ్ ఫుడ్, చక్కెరతో చేసే తీపిపదార్థాల్లో ఇవి అంతగా ఉండవు. అందుకే మంచి సమతులాహారం తీసుకోవడంతో పాటు మంచి జీవనశైలిలో భాగంగా ఒంటికి తగినంత శ్రమ కలిగేలా తేలికపాటి వ్యాయామాలు, వేళకు కంటి నిండా నిద్రపోవడం వంటి చర్యలతో గట్ బయోమ్ సమతౌల్యత సమర్థంగా నిర్వహితమవుతూ ఉంటుంది. దీనివల్ల మంచి జీర్ణక్రియ, తిన్నది ఒంటికి పట్టడమే కాకుండా మంచి మూడ్ (భావోద్వేగాల) నిర్వహితమవుతుండటం, వ్యాధి నిరోధక వ్యవస్థ చురుగ్గా, క్రియాశీలకంగా మారడం, పూర్తిస్థాయి భౌతిక, మానసిక ఆరోగ్యాల నిర్వహణ జరుగుతాయి. అందుకే స్వాభావికమైన, పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు, పులవడానికి సంసిద్ధంగా ఉండే పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్, తేలికపాటి వ్యాయామాలతో గట్ బయోమ్ సమతౌల్యతతో నిర్వ‘హిత’మయ్యేలా చూసుకోవాలని ఆకాంక్షిస్తున్నా. - డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ,సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ చైర్పర్సన్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీకదలికే ‘కీళ్ల’కంపోషకాలు తీసుకోవడానికి జాయింట్స్‌కు నోరు లేదు. అదెలాగంటారా? మన దేహంలోని ప్రతి కణానికీ రక్తం ద్వారా పోషకాలూ, ఆక్సిజన్ అందుతాయి. రక్తప్రసరణ వ్యవస్థతో నేరుగా అనుసంధానమై ఉండటం వల్ల వాటికి నేరుగా న్యూట్రియెంట్స్ (పోషకాలు) అందుతాయి. కానీ, కీళ్ల విషయం వేరు. అవి రక్తప్రసరణ వ్యవస్థతో నేరుగా అనుసంధానమై ఉండవు. మరి వాటికి పోషకాలు అందడమెలా? కీళ్లు ఎంతగా కదులుతుంటే అంతగా వాటికి పోషకాలు అందుతాయి. ఒకవేళ శరీరం కదలికలు మందగించి, కీళ్లలో కదలిక లేకపోతేనో?... అప్పుడు వాటికి పోషకాలు అందవు. నేరుగా రక్తప్రసరణ వ్యవస్థతో అనుసంధానమై ఉన్న కణాలకు ఉన్నట్లు వాటికి సప్లై ఉండదు కాబట్టే... వాటికి నోరు లేదు అన్నది. నోరున్న వాడు నోరు చేసుకు బతుకుతాడు. మరప్పుడు నోరు లేని కీళ్లు కష్టం చేసుకుని బతకాల్సిందే కదా. అందుకే కీలాడితే గానీ వాటికి బతుకాడదు. అందుకే కీళ్ల ఆరోగ్యం బాగుండాలంటే, వాటికీ పోషకాలు అందాలంటే వ్యాయామం తప్పనిసరి అన్నమాట. ఇక మరోమాట... ఎవరిలోనైనా కీళ్లు బాగా అరిగిపోతే (అంటే కీళ్లపై ఉండే కార్టిలేజ్ అనే ΄పోర అరిగితే) అప్పుడు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అవసరం. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది కీళ్లలోకి ఇంజెక్షన్ ఇస్తామంటూ పీఆర్పీలు, స్టెరాయిడ్స్ ఎక్కిస్తారు. అవి అందగానే నొప్పులన్నీ తగ్గుతాయి. దాంతో ఇంజెక్షన్‌తోనే నొప్పి అంతా తగ్గిపోయిందంటూ చాలామంది ఆనందపడతారు. అలాంటి ఇంజక్షన్స్ చేయమంటూ ఆర్థోపెడిక్ సర్జన్ల దగ్గరికి రోజూ పదుల సంఖ్యలో వస్తుంటారు. నాలుగో స్టేజీలో ఉన్న మోకాళ్ల ఆర్థరైటిస్‌కి ఏ డాక్టర్ అయినా పీఆర్పీ ఇంజెక్షన్ ఇస్తే అతడు డాక్టర్ కాదు... ఆపరేషన్ అంటే భయపడే అమాయకులైన పేషెంట్లను మోసం చేస్తున్నాడని గ్రహించాలి. ఇంజెక్షన్ చేయడమనేది ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థులు మొదలు కాం΄ûండర్లూ చేయగలిగేదే. స్టెరాయిడ్స్ ఇవ్వడంతో తొలుత నొప్పులు ఉపశమించినట్లు కనిపించినా... ఆ తర్వాత అవి బోలుగా మారడం, తేలిగ్గా విరగడం జరుగుతుంది. మహామహా కీళ్లమార్పిడి నిపుణులు చిన్నపాటి ఇంజెక్షన్ చేయలేరా? ఎందుకు చేయరంటే బాధితుల పాలిట అదో ద్రోహం. వాళ్ల ఎముకల్ని గుల్ల చేసేసే ఓ అనైతిక (అన్ ఎథికల్) పద్ధతి. అందుకే కీళ్లు పూర్తిగా అరిగాక ఎవరైనా ఇంజెక్షన్స్‌తో మాన్పిస్తామంటే... వాళ్లు నొప్పి నివారణ మందులూ, స్టెరాయిడ్స్ కలిపి ఇంజెక్షన్ చేస్తూ, దీర్ఘకాలికంగా ఎముకల్ని గుల్ల గుల్ల చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. -డాక్టర్ గురవారెడ్డి కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల నిపుణులుమూత్ర పిండం బ్రహ్మాండంగా ఉండాలంటే..గతంలో పెద్దవయసు వారిలోనే కనిపించే చాలా ఆరోగ్య సమస్యలు ఇప్పుడు చిన్నవయసు వారిలోనూ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇటీవల పెరిగిన ఆరోగ్య స్పృహ కారణంగా ముందుగానే చేయిస్తున్న వైద్య పరీక్షల వల్ల అనేక జబ్బులు బయటపడటమూ జరుగుతోంది. దీనివల్ల రెండు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటిది... జబ్బులు బయటపడటం వల్ల వాటి సంఖ్య విపరీతంగా పెరిగిందనేది ఆందోళన కాగా... ఇక రెండో అంశం... ఆరోగ్యస్పృహ ఇంతగా పెరగకపోయి ఉంటే, అవి మరింత ముదిరాక బయటపడి ఇంకా సమస్యాత్మకంగా మారేవనే పాజిటివ్ అంశం.ఉదాహరణకు గతంలో మూత్రవ్యవస్థకు సంబంధించిన జబ్బుల్లోనూ కిడ్నీల్లో రాళ్లు, పెద్దవయసువారిలో మూత్ర విసర్జన కష్టం కావడం ఇక డయాబటిస్, హైపర్‌టెన్షన్ బాధితుల్లో కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి సాధారణంగా కనిపించే సమస్యలు. కానీ ఇటీవల యుక్తవయసువారిలోనూ, ఆమాటకొస్తే చాలా చిన్నపిల్లల్లోనూ కిడ్నీలో రాళ్ల సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణం కావచ్చు. మన ఆహారపు అలవాట్లు, కలుషిత వాతావరణం, జీవనశైలి మార్పులు వంటివి కారణాలు కావచ్చు. అయితే ఇప్పుడు ఓ ఆరోగ్య సమస్య వచ్చిందంటే... ఉదాహరణకు ‘కిడ్నీలో రాళ్లు’ సమస్యను తీసుకుంటే... ఇటీవల అత్యాధునికమైన వైద్య ప్రక్రియలూ, లేజర్లు, రొబోటిక్ సర్జరీలూ అందుబాటులోకి రావడంతో కోత, గాటూ లేకుండా, రక్తం చిందకుండా సర్జరీ చేస్తున్నామని అనుకోవడం తప్ప అసలివి రాకుండా చేసుకోవడానికి నివారణలేమిటి అనే ఆలోచనకు తావులేకుండా పోయింది. నిజానికి మనం ఆలోచించాల్సింది వ్యాధుల నివారణ గురించే. ఉదా: కిడ్నీలు, మూత్ర వ్యవస్థ విషయానికి వస్తే... రాళ్లు ఏర్పడటానికి ఆస్కారమిచ్చే ఆహారానికి దూరంగా ఉండటం, నీళ్లు ఎక్కువగా తాగుతుండటం వంటి నివారణ చర్యల గురించి గురించి ఆలోచించాలి. సమాజంలో ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ సమస్య కూడా పెరిగింది. వీటన్నింటికీ కారణం మన జీవనశైలిలోని మార్పులే. దీనికి తోడు మన జీవితాల్లో పెరుగుతున్న తీవ్రమైన ఒత్తిడి (స్ట్రెస్) కూడా మరో ప్రధాన కారణం. దీనివల్లనే హైబీపీ, డయాబెటిస్... మళ్లీ వీటివల్లనే కిడ్నీ జబ్బులు... ఇలా ఓ చైన్ రియాక్షన్‌లా కొనసాగుతున్నాయి. ఇవన్నీ జీవనశైలిలో మార్పుల వల్ల జరుగుతున్నాయని గ్రహించి మన లైఫ్‌స్టైల్‌ను పునర్నిర్వచించుకొని హెల్దీ జీవనశైలిని అనుసరించాలి. -డాక్టర్ మల్లికార్జున ఎండీ అండ్ చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీమీరు బరువైతే గుండె చెరువేగుండెను అందరూ పదిలంగా చూసుకోవాల్సిన అవసరముంది. అందుకు కొన్ని సూచనలు... ⇒ మనం మన ఒత్తిడి (స్ట్రెస్)కి కారణమైన అంశాలని చెబుతున్న వాటిల్లో 90 శాతం అంశాలు అంతగా ఒత్తిడికి గురిచేసేవే కాదు. అసలు స్ట్రెస్ కంటే... మనం దానికి భయపడుతున్న తీరే ఎక్కువగా ఒత్తిడికి గురిచేస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలనే పరిష్కార మార్గాలు ఆలోచిస్తే స్ట్రెస్ దానంతట అదే తగ్గిపోతుంది. ⇒ మహిళలకు ప్రత్యేకంగా చెబుతున్న విషయమేమిటంటే... నిత్యజీవితంలోని ఒత్తిడి (స్ట్రెస్) పురుషులకంటే మహిళలకే ఎక్కువగా హాని చేస్తుందని అధ్యయనాల్లో తేలింది. మహిళలు ఒత్తిడి నుంచి దూరంగా ఉండటం గుండెకు మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ వల్ల గుండెకు కలిగే రక్షణ తొలగిపోతుంది కాబట్టి వయసు పెరుగుతున్న కొద్దీ మానసిక స్థైర్యాన్ని మరింతగా పెంచుకుంటూ, సమస్యలను తేలిగ్గా పరిష్కరించుకుంటూ మానసికంగా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరముంది.ఇందుకోసం చేయాల్సిన పనులూ సులువు కూడా. మొబైల్ ఫోన్‌ను పరిమితంగా వాడితే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే టెలివిజన్‌కే అంటిపెట్టుకొని ఉండటం. ఒకేచోట కూర్చుని అదేపనిగా వీటిని వాడుతుంటే స్థూలకాయం వస్తుంది. ఇది కేవలం గుండెకే కాదు... అనేక ఆరోగ్య అనర్థాలకు కారణం. ఆరోగ్యకరమైనవి తింటూ, తగినంత వ్యాయామం చేస్తూ, ఒత్తిడికి దూరంగా ఉంటే కేవలం గుండెజబ్బులే కాదు... ఇతర వ్యాధులూ తగ్గుతాయి. -డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిమ్స్ హాస్పిటల్స్ఈ ఎన్ టీ ‘తల’మానికంమన ముక్కు చెవులనూ, అలాగే మన తలను మిగతా దేహంతో అనుసంధానం చేసే మెడ... వీటన్నింటి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ చెవుల సంరక్షణ కోసం... ∙అతి భారీ శబ్దాలు వినికిడి సమస్యను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే చోట్లలో / పనిప్రదేశాలలో ఇయర్ ప్లగ్స్ వాడుకోవాలి. ∙చెవులు వినబడుతుంటేనే చిన్నారులు మాటలు నేర్చుకునేది. అందుకే చిన్నారి పుట్టగానే ఆ పిల్లలకు వెంటనే వినికిడి పరీక్షలు చేయించాలి. ఇలాచేయడం వల్ల అటు వినికిడి సమస్యనూ, ఇటు మాటలు రాకపోవడాన్నీ ఏకకాలంలో అరికట్టవచ్చు. ఇక ముక్కు ఆరోగ్యం కోసం... ⇒ అన్ని అవయవాలనుంచి తేమను లాగేసినట్టే... ముక్కు నుంచి కూడా తేమను లాగేస్తుంది ఈ సీజన్. అందుకే ముక్కు తాలూకు తేమ బాగానే నిర్వహితమయ్యేలా చూసుకునేందుకు నీళ్లు తాగుతూ హైడ్రేటిడ్గా ఉండాలి. ⇒ ముక్కులు బిగదీసుకుపోయే తత్త్వం ఉన్నవారు (ఇది ఈ సీజన్లో మరీ ఎక్కువ) సెలైన్ నేసల్ స్ప్రేలు వాడటం వల్ల ముక్కు ఆరోగ్యం బాగుంటుంది. గొంతు ఆరోగ్యం (థ్రోట్ హైజీన్) కోసం... ⇒ స్మోకింగ్, మద్యం అలవాటు మానుకుంటే కేవలం గొంతు ఆరోగ్య మాత్రమే కాదు... మొత్తం దేహం ఆరోగ్యమంతా బాగుంటుంది. ⇒గొంతు ఆరోగ్యం కోసం గొంతును శుభ్రంగా ఉంచుకోవడం మేలు చేస్తుంది. ఇందుకు గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసుకుని పుక్కిలించడం ఓ మంచి చిట్కా. మసాలాలు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల గొంతులో ఇరిటేషన్లు, యాసిడ్ గొంతులోకి వచ్చి గొంతు మండటం అనే సమస్యలు నివారితమవుతాయి. ఇక వీటితో పాటు ఈ చలి సీజన్లో మరింత చల్లటి గాలికీ, నీటికి దూరంగా ఉండటం, కాలుష్యానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తవహించడం వంటి జాగ్రత్తలు మేలు చేస్తాయని గ్రహించాలి. -డాక్టర్ ఈసీ వినయ కుమార్ హెచ్ఓడీ అండ్ సీనియర్ ఈఎన్టీ సర్జన్, అపోలో హాస్పిటల్స్ఇంటి పని ఒంటికి మంచిదిమంచి వ్యాయామంతో ఇటు కీళ్లూ, అటు గుండె రెండూ ఒకేసారి ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ వ్యాయామాలు చేయడానికి తమకు సమయం లేదంటూ చాలామంది చెబుతుంటారు. ఈరోజుల్లో కొన్ని ఇంటి పనులు అందరూ చేయాలి. ముఖ్యంగా ఇంట్లోని ఇల్లాళ్లతో పాటు ఇంటి మగవాళ్లు కూడా. ఉదాహరణకు... తోటపనీ, వస్తువులు తేవడం, లేవగానే బెడ్‌షీట్స్ మడతపెట్టడం, ఇల్లు ఊడ్చటం, తుడవడం ఇవన్నీ ఇంట్లోని మహిళలు చేయాల్సిన పనులుగా చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ ఇవన్నీ చేస్తే కీళ్లకు కదలికలు సమకూరి వాటి ఆరోగ్యం మెరుగుపడటం, పోషకాలు అందడం జరుగుతాయి. ఇవే పనులు గుండెజబ్బుల ముప్పునూ తప్పిస్తాయి. అంటే ఒకే పనితో ఎన్నో ప్రమోజనాలుంటాయి.ఉదా: క్రమం తప్పని వ్యాయామం వల్ల గుండె బలంగా అవుతుంది. (కీళ్లు కూడా) అంతేకాదు... పది లక్షల సార్లు గుండె కొట్టుకుంటే కలిగే శ్రమను ఒక్కసారి చేసే వ్యాయామం దూరం చేస్తుంది. వ్యాయామం వల్ల రక్త ప్రసరణ ప్రక్రియ మెరుగవుతుంది. శరీరంలో కొవ్వు తగ్గుతుంది. ఎముకలు బలంగా మారతాయి. ఒత్తిడీ, నిద్రలేమి వంటివీ తగ్గుతాయి. చాలామంది పురుషులు ΄పోగతాగడం, మద్యంతాగడం తమ జన్మహక్కుగా భావిస్తారు. పైగా కొద్దిపాటి మద్యం గుండెకు మేలు చేస్తుందని సమర్థించుకుంటారు. కానీ... ΄పోగ, మద్యం ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. చాలామంది కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలు పరచడానికి కొత్త సంవత్సరాన్ని ఒక సందర్భంగా తీసుకుంటారు. మీ నిర్ణయం ఏదైనా... అంటే వ్యాయామం చేయడం, బరువు తగ్గడం, ΄పోగ, మద్యం వంటి అలవాట్లు మానేయడం... ఇవన్నీ వాయిదా వేయకండి. ఇప్పుడే ఈ కొత్త సంవత్సరంలో మొదలుపెట్టండి. -డాక్టర్ గాయత్రి కామినేని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్, కామినేని హాస్పిటల్స్డబ్బు జబ్బుకు ‘బీమా’త్రలుగత కొన్నేళ్లుగా పర్యావరణంలో వస్తున్న మార్పుల కారణంగా క్యాన్సర్లు అలాగే లైఫ్‌స్టెల్ డిసీజెస్ అని పిలిచే హైపర్‌టెన్షన్, డయాబెటిస్ వంటివి విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. జబ్బు వచ్చాక చికిత్స ఎలాగూ తప్పదు. ఇప్పుడు వీటి చికిత్సల గురించి ఆలోచించడం కంటే అసలివి రాకుండా ఉండేలా నివారణ చర్యలపై దృష్టి కేంద్రీకరించడానికి ఇదో మంచి సమయం. ప్రస్తుత కాలం చాలా అనిశ్చితంగా ఉంది. మన ఆర్థిక పరిస్థితుల్లోగానీ రోజువారీ కార్యక్రమాల్లోగానీ ఎలాంటి మార్పులు వస్తాయో తెలియని అనిశ్చితి. అందుకే మున్ముందు మనందరి ఆరోగ్యాల రక్షణ కోసం, చికిత్సల కోసం మెడికల్ ఇన్సూ్యరెన్స్ను సిఫార్సు చేస్తున్నాను. మీతో పాటు మీ కుటుంబమంతటికీ ఇన్సూ్యరెన్స్ వచ్చేలా పాలసీ తీసుకోండి. క్యాన్సర్లు వస్తే అయ్యే ఖర్చులకు బెంబేలెత్తడం కంటే అవి రాకుండా నివారించడానికి అనుసరించాల్సిన మార్గాలు చాలా సులువైనవి. సమాజంలోని అందరూ... ముఖ్యంగా నలభై దాటిన ప్రతివారూ తరచూ ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అయితే ప్రస్తుతం సాంకేతిక మార్పులతో అందుబాటులోకి వచ్చిన చికిత్సలకు అయ్యే ఖర్చు తడిసిమోపెడు కానుంది. ఆ ఖర్చులు తట్టుకోవాలంటే ఇన్సూ్యరెన్స్ ఒక మార్గం. వాటితో పాటు మన జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగిస్తూ నివారించుకోవడం మరో మార్గం. ఈ రెండు మార్గాలను ఎంచుకుని మనల్ని మనం అటు ఆరోగ్యపరంగా, ఇటు ఆర్థికంగా కాపాడుకోవడం మన చేతుల్లో ఉన్న పని. - డాక్టర్ బి. కిశోర్‌రెడ్డి ఎండీ అమోర్ హాస్పిటల్స్, అండ్ చీఫ్ ఆర్థో ఆంకాలజిస్ట్ అమోర్ హాస్పిటల్ఆరోగ్యానికి బోన్.. మెయిన్ఒక భవనం పడిపోకుండా స్థిరంగా ఉండాలన్నా, ఈ దేహం ఒంగిపోకుండా నిటారుగా నిలబడాలన్నా... చిత్రంగా ఈ రెంటికీ అవసరమైనది క్యాల్షియమ్. దాదాపు 30 ఏళ్ల వయసులో ఇది గరిష్టంగా ఉండి, ఆ తర్వాత అనేక అంశాల కారణంగా ఇది కొద్దికొద్దిగా తగ్గుతూ పోతుంటుంది. అయితే దాన్ని మరింత కాలం నిలుపుకుంటూ దేహపు ఫ్రేమ్ వర్క్ అయిన ఎముకల సాంద్రతను (బోన్ డెన్సిటీని) గరిష్టకాలం పాటు నిలుపుకోవాలంటే చేయాల్సింది చాలా సులువైన పనులే. మంచి సమతులాహారం తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేసుకోవడం. ఎముకల ఆరోగ్యాన్నీ, సాంద్రతనూ నిలుపుకోవడానికి తీసుకునే ఆహారంలోనూ రుచికరమైనవే ఎక్కువ. ఉదాహరణకు పాలు, వెన్న లాంటి డెయిరీ ఫుడ్స్; చిక్కుళ్లు, బెండకాయ, క్యాబేజీ, బ్రాకలీ లాంటి రుచికరమైన కూరగాయలు; టేస్టీగా ఉండే అంజీర్ లాంటి ఎండుఫలాలు, జీడిపప్పు, బాదం, పిస్తా వంటి నట్స్‌తో పాటు చాలామంది టేస్టీగా ఫీలై తినే చేపలు. ఇవి ఎముకలతో పాటు మొత్తం దేహ సంపూర్ణ ఆరోగ్యాన్నీ కాపాడతాయి. అయితే వ్యాయామాలు లేకుండా కేవలం ఆహారాలు మాత్రమే ఎముకల సాంద్రత పెంచలేవు. అందుకే... నడక వంటి తమకు అనువైన వ్యాయామాలతో పాటు శ్రమ ఎక్కువగా చేయలేనివారు నడకతో పాటు ఇతరులు సైక్లింగ్, జాగింగ్, ఈత, తమకు ఇష్టమైన స్పోర్ట్స్ ఆడటం వంటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు చేస్తుంటే ఎముకలలోని క్యాల్షియమ్ చాలాకాలం పదిలంగా ఉంటుంది. -డాక్టర్ సుధీర్‌రెడ్డి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్‌మార్క్ హాస్పిటల్ -
ప్రముఖ కంపెనీ సీఈవోపై కాల్పులకు తెగబడ్డ నిందితుడు ఇతడే
వాషింగ్టన్ : అమెరికాలో ప్రముఖ ఇన్సూరెన్సు సంస్థ యునైటెడ్ హెల్త్‌కేర్ సీఈవో బ్రియాన్ థాంప్సన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. థాంప్సన్‌ను హత్య చేసిన నిందితుడి ఫొటోలను న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ (ఎన్‌వైపీడీ) విడుదల చేసింది. అంతేకాదు నిందితుడిని పట్టించిన వారికి భారీ మొత్తంలో ఫ్రైజ్‌మనీ అందిస్తామని తెలిపింది.గతవారం, మిడ్టౌన్లోని హిల్టన్ హోటల్ బయట ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో థాంపన్స్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ముఖానికి మాస్కుతో వచ్చిన దుండగుడు బ్రియాన్‌ను లక్ష్యంగా కాల్పులు జరిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.ఈ సందర్భంగా థాంపన్స్పై దాడి చేసిన నిందితుణ్ని గుర్తించేందుకు ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఆ సీసీ కెమెరా ఫుటేజీల్లో నిందితుడి ఆచూకీ లభ్యమైంది. ఆ ఫొటోలను విడుదల చేశారు.🚨UPDATE: Below are photos of a person of interest wanted for questioning regarding the Midtown Manhattan homicide on Dec. 4.The full investigative efforts of the NYPD are continuing, and we are asking for the public's help—if you have any information about this case, call the… https://t.co/U4wlUquumf pic.twitter.com/243V0tBZOr— NYPD NEWS (@NYPDnews) December 8, 2024ఆ ఫొటోల్లోని ఒక ఫ్రేమ్‌లో థాంప్సన్‌ను హత్య చేసిన అనంతరం ఓ ట్యాక్సీలో తాపీగా కూర్చున్నాడు. రెండో ఫ్రేమ్‌లో బ్లాక్ డౌన్ జాకెట్ ధరించి వీధిలో నడుచుకుంటూ వస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. వాటిల్లో ఒకటి అనుమానితుడు కెమెరాను నేరుగా చూస్తూ, టాక్సీ డ్రైవర్‌తో విండో ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నట్లు చూపిస్తుంది. హిల్టన్ హోటల్ వెలుపల థాంపన్స్ జరిగిన తర్వాత అనుమానితుడు సెంట్రల్ పార్క్ సమీపంలో టాక్సీ తీసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు.ఫోటోల విడుదల అనంతరం, పోలీసు కమిషనర్ జెస్సికా టిస్చ్ మాట్లాడుతూ.. ఫొటోల్లోని నిందితుడి గురించిన సమాచారం అందిస్తే ఎఫ్‌బీఐ 50వేల డాలర్లు బహుమతిని అందిస్తుంది. ఎన్‌వైపీడీ అదనంగా మరో 10వేల డాలర్లు బహుమతిగా అందిస్తున్నట్లు ప్రకటించారు. నిందితుడు దేశం వదిలి పారిపోకుండా సరిహద్దుల్లో పోలీసులు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. -
ఎఫ్ఎంసీజీ.. ఆరోగ్య‘మస్తు’!
తక్కువ కొలెస్ట్రాల్ గల నెయ్యి, వంట నూనెలు.. రోగనిరోధక శక్తిని పెంచే గోధుమ పిండి, బియ్యం.. విటమిన్లతో కూడిన టీ పొడి.. ఐరన్–విటమిన్లు పుష్కలంగా ఉన్న ఉప్పు.. ఇలా ఎఫ్ఎంసీజీ కంపెనీలన్నీ ఇప్పుడు ఆరోగ్య మంత్రం జపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలను నివారించే ప్రీమియం ప్రోడక్టులకు డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీలకు దండిగా అదనపు ఆదాయం సమకూరుతోంది. గజిబిజి నగర జీవితం.. జీవనశైలి ఆరోగ్య సమస్యల ప్రభావంతో ఆరోగ్యంపై మరింతగా శ్రద్ధపెట్టే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఆర్గానిక్ ప్రోడక్టులు, చిరు ధాన్యాలకు తోడు ఆరోగ్యాన్ని కాపాడే ఉత్పత్తుల పేరుతో ఫంక్షనల్ ఫుడ్స్‌పై ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. తమ ప్రస్తుత ప్రోడక్ట్ జాబితాలో ఈ ప్రీమియం ఉత్పత్తులను చేర్చడం ద్వారా సరికొత్త వ్యూహానికి తెరతీశాయి. ఐటీసీ, అదానీ విల్మర్, టాటా కన్జూమర్, బిగ్‌బాస్కెట్, ఇమామీ ఆగ్రోటెక్ సహా పలు బడా కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఇటీవలే ఐటీసీ ‘రైట్ షిఫ్ట్’ అనే కొత్త ఫుడ్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. 40వ పడిలోకి అడుగుపెట్టిన వారి కోసం ప్రత్యేకంగా మీల్స్, డ్రింక్స్, స్నాక్ ఉత్పత్తులను అందిస్తోంది. దీంతోపాటు తక్కువ కొలె్రస్టాల్ నెయ్యి వంటివి కూడా ఇందులో ఉన్నాయి. సాధారణంగా విక్రయించే ఉత్పత్తుల రేంజ్‌తో పోలిస్తే వీటి రేటు 26 శాతం మేర ఎక్కువ కావడం విశేషం. అయినాసరే, కస్టమర్ల నుంచి డిమాండ్ బాగానే ఉండటం గమనార్హం. ఇక మధుమేహం (డయాబెటిక్) విషయంలో అప్రమత్తంగా ఉండేవారు, ఇమ్యూనిటీ బూస్టర్ కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని అదానీ విల్మర్ కొత్త వంటనూనెను తీసుకొచి్చంది. సాధారణ సన్‌ఫ్లవర్ నూనె కంటే దీని ధర 22–46 శాతం అధికం! అలాగే డయాబెటిక్ వినియోగదారుల కోసం త్వరలోనే తక్కువ గ్లయిసెమిక్ ఇండెక్స్ బియ్యం, గోధుమ పిండి వంటి ప్రీమియం ప్రోడక్టులను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. ఫిట్నెస్.. లైఫ్ స్టయిల్... నగరాల్లో బిజీగా ఉంటూ... లైఫ్ స్టయిల్, ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసే కన్జూమర్లు ప్యాకేజ్డ్ ఫుడ్‌లో ఆరోగ్యకరమైన అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ మాలిక్ చెబుతున్నారు. ‘ప్రీమియం ఆహారోత్పత్తుల మార్కెట్ భారీగా వృద్ధి చెందుతోంది. దేశంలో ఇటువంటి ప్రత్యేకతను కోరుకునే సంపన్న కన్జూమర్ల సంఖ్య 3 కోట్లకు పైగానే ఉంది. పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, రుచి, నాణ్యత వంటి ప్రయోజనాలను అందించే విలువ చేకూర్చిన, వినూత్న ఉత్పత్తులకు అధిక రేట్లను చెల్లించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. టాటా గ్రూప్ కంపెనీ బిగ్ బాస్కెట్ తక్కువ జీఐ గల బంగాళాదుంపలను 21% ఎక్కువ రేటుతో విక్రయిస్తోంది. ఇక జీఐ తక్కువగా ఉన్న చక్కెర రేటయితే ఏకంగా 120 శాతం అధికం కావడం విశేషం. ఖపాలీ గోధుమ లేదా ఎమ్మర్ గోధుమలో ఫైబర్ మోతాదు కాస్త ఎక్కువగా ఉంటుంది. పలు బ్రాండ్లు ఈ గోధుమ పిండిని కేజీ రూ.150–250 మధ్య విక్రయిస్తున్నాయి. అంటే సాధారణ గోధుమ పిండితో పోలిస్తే 3–5 రెట్లు ఎక్కువ. డిమాండ్ ఫుల్.. సరఫరా డల్కొన్నిసార్లు తగినంత సరఫరా లేకపోవడం వల్ల కూడా రేటు భారీగా పెరిగేందుకు దారితీస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. ఉదాహరణకు చాలా తక్కువ మంది రైతులు మాత్రమే తక్కువ జీఐ గల బంగాళాదుంపలను పండిస్తున్నారు. స్టాక్ తక్కువగా ఉండటం వల్ల ప్రీమియం ధరకు అమ్మాల్సి వస్తోందని బిగ్‌బాస్కెట్ చీఫ్ మర్చెండైజింగ్ ఆఫీసర్ శేషు కుమార్ చెప్పారు. మరోపక్క, ఇటువంటి ప్రీమియం ప్రోడక్టుల తయారీ కోసం టెక్నాలజీ వినియోగం వల్ల కూడా ధర పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ప్రీమియం బ్రాండ్ల పేరుతో జేబు గుల్ల చేస్తున్న ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు, అమూల్ బ్రాండ్ రూ.650కి కేజీ నెయ్యిని విక్రయిస్తుండగా... వేరే బ్రాండ్లు ‘ఏ2 నెయ్యి’ పేరుతో కేజీ రూ.2,500కి పైగా ధరకు విక్రయిస్తుండటం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇలాంటి ప్రోడక్టులపై ఉక్కుపాదం మోపుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
2026కల్లా నక్సలిజం అంతం
న్యూఢిల్లీ/షహీబ్‌గంజ్ (జార్ఖండ్): దేశంలో నక్సలిజం 2026 మార్చి నాటికి పూర్తిగా అంతమైపోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘‘2026 మార్చి 31లోగా నక్సల్స్ హింసను, భావజాలాన్ని దేశం నుంచి తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. అంతకంటే ముందే నక్సలిజాన్ని అంతం చేస్తాం’’ అని పేర్కొన్నారు. హింసను విడనాడి ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. నక్సల్ హింసకు గురైన 55 మంది బాధితులనుద్దేశించి బుధవారం ఆయన మాట్లాడారు. ‘‘మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా దళాలు భారీ విజయాలు సాధించాయి. సమస్య ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. పశుపతినాథ్ (నేపాల్) నుంచి తిరుపతి (ఏపీ) దాకా కారిడార్ ఏర్పాటు చేయాలని మావోయిస్టులు ఒకప్పుడు అనుకున్నారు. కానీ ఆ ప్రణాళికలను మోదీ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర హోం శాఖ త్వరలో సంక్షేమ పథకం రూపొందిస్తుంది. ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర రంగాల్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా సాయం చేస్తుంది’’ అని వెల్లడించారు. జార్ఖండ్‌లో జేఎంఎం–కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను విపరీతంగా ప్రోత్సహిస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. దీనికి అడ్డుకట్ట వేయని పక్షంలో మరో పాతికేళ్లలో చొరబాటుదారులే రాష్ట్రంలో మెజారిటీ ప్రజలుగా మారిపోతారని హెచ్చరించారు. స్థానిక గిరిజన సంస్కృతిని వాళ్లు సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్‌లోని గిరి«ద్లో పరివర్తన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. వీటి దెబ్బకు సంతాల్ పరగణాల్లో స్థానిక గిరిజనుల జనాభా 44 శాతం నుంచి 28 శాతానికి తగ్గిందన్నారు. -
హెల్త్‌కేర్ బడ్జెట్ 2024-25: కేన్సర్ రోగులకు భారీ ఊరట!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి తన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్లో కేన్సర్ రోగులకు భారీ ఊరట కలిగించారు. కేన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేలా మూడు మందులను కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ చర్య రోగులపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా అవసరమైన మందుల ధరలను గణనీయంగా తగ్గించగలదని భావిస్తున్నారు విశ్లేషకులు. అలాగే స్థానిక తయారీని పెంచడానికి మెడికల్ ఎక్స్-రే మెషీన్లలో ఉపయోగించే ఎక్స్-రే ట్యూబ్‌లు, ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్ల ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీలో మార్పులు ప్రతిపాదించారుదీన్ని పారిశ్రామిక పెద్దలు స్వాగతించారు. వాళ్లంతా నిర్మలా సీతారామన్ చర్యను అభినందించారు. దీని కారణంగా రోగ నిర్థారణ సామర్థ్యాలు మెరుగుపడతాయని, దేశీయ వైద్య పరికరాల పరిశ్రమ వృద్ది చెందుతుందని రూబీ హాల్ క్లినిక్ సీఈవో బెహ్రామ్ ఖోడైజీ అన్నారు. అలాగే కస్టమ్స్ డ్యూటీ నుంచి మూడు అదనపు కేన్సర్ చికిత్స ఔషధాలను మినహాయించడం అనేది కేన్సర్ రోగులకు కీలకమైన చికిత్సలను మరింత అందుబాటులోకి ఉండేలా చేస్తుంది. ఈ చర్యలు భారత దేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, రోగుల సంరక్షణను మెరుగుపర్చడం కోసం తీసుకున్న వ్యూహంలా ప్రతిబింబిస్తున్నాయని వైద్యుల ఖోడైజీ అన్నారు. ఇది భారత ప్రభుత్వానికి చాలా అవసరం అని చెప్పారు. ఇక ఈ మినహాయింపులో చేర్చబడిన మందులు ప్రధానంగా వెన్నెముక, కండరాల క్షీణత వంటి అరుదైన, తీవ్రమైన వైద్య పరిస్థితుల్లో చికిత్స చేయడానికి ఉపయోగిస్తారని అన్నారు. ఈ చర్య కారణంగా క్లిష్టమైన చికిత్సలు అవసరమయ్యే రోగులపై వ్యయభారం తగ్గుతుంది. ఇక ఈ బడ్జెట్లో వైద్య రంగంలో స్థానిక తయారీ, ఆవిష్కరణలకు మద్దతు ఇస్తూనే సమాజంలో అన్ని వర్గాలకు తమ స్థోమతలో ఆరోగ్య సంరక్షణ పొందేలా విస్తృత వ్యూహాన్ని పరిగణలోని తీసుకుని మరీ బడ్జెట్‌ని కేటాయించారు సీతారామన్. ఔషధాలు సాధారణంగా 10% ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ఆకర్షిస్తాయి. అయితే కొన్ని రకాల ప్రాణాలను రక్షించే మందులు, టీకాలు 5% లేదా నిల్ రాయితీ రేటుని ప్రకటించారు. గతేడాది కేన్సర్ కణాలను నిరోధించడంలో సహాయపడే పీడీ1కి సంబంధించిన ఇమ్యునిథెరపీ ఔషధంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం తగ్గించడం జరిగింది. ఇదిలా ఉండగా, గణాంకాల ప్రకారం 2023లో 9.3 లక్షల మంది దాక ప్రాణాంతక కేన్సర్‌తో బాధపడుతున్నట్లు అంచనా. ఆసియాలో అత్యధిక కేన్సర్ మరణాలలో భారత్ రెండో స్థానంలో ఉంది. భారతదేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరూ జీవితంలో ఏదో ఒక సమయంలో కేన్సర్ బారిననపడుతున్నారు. ఇక 2025 నాటికి వార్షిక కేన్సర్ కేసుల సంఖ్య 12.8% పెరుగుతాయని అంచనా.ఎందుకు మినహాయించారంటే..గతేడాది పార్లమెంటరీ ప్యానెల్ కేన్సర్ మందులపై జీఎస్టీని మినహాయించాలని, మందుల ధరలను, రేడియేషన్ థెరపీ వ్యయాన్ని నియంత్రించడానికి కఠినమైన చర్యలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. రోగుల సహాయార్థం కేన్సర్‌ని నోటిఫై చేయదగ్గ వ్యాధిగా గుర్తించాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. అంతేగాదు ప్యానెల్ సభ్యులు దేశంలో కేన్సర్ చికిత్సకు అవుతున్న అధిక ఖర్చుని హైలైట్ చేయడమే గాక సమగ్ర ధరల నియంత్రణల అవసరాన్ని కూడా నొక్కి చెప్పడంతో ప్రభుత్వం స్పందించి ఇలా వాటిని ప్రాథమిక సుంకంలో మినహాయింపు ఇచ్చింది. ఎలా పొందుతారంటే..కేంద్ర లేదా రాష్ట్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ లేదా జిల్లా వైద్యాధికారి/సివిల్ సర్జన్ నుంచి రోగులు ధృవీకరణ పత్రాన్ని అందుకుంటే వారికి ఈ మినహాయింపు లభిస్తుంది. ఇది రోగులకు గణనీయమైన ఖర్చుని ఆదా చేస్తుంది.(చదవండి: దేశ బడ్జెట్‌ని మార్చగలిగేది మహిళలే! ఎలాగంటే..!) -
సనోఫీ హెల్త్‌కేర్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న ఫ్రెంచ్ సంస్థ సనోఫీ భారత్‌లో సుమారు రూ.3,655 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌లోని గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ) కోసం 2030 నాటికి ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు సనోఫీ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మ్యాడలిన్ రోచ్ వెల్లడించారు. ఇందులో రూ.914 కోట్లు వచ్చే ఏడాదికల్లా వ్యయం చేస్తామని చెప్పారు. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి సనోఫీ జీసీసీ నూతన భవనాన్ని బుధవారం ప్రారంభించిన సందర్భంగా రోచ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రంలో ప్రస్తుతం 1,000 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. కొత్త ఫెసిలిటీకి 2,600 మంది ఉద్యోగులు కూర్చునే సామర్థ్యం ఉందన్నారు. -
రూ.300 కోట్లతో ఏఐ ఫార్మా హెల్త్‌కేర్ ఐటీ హబ్
పల్సస్ గ్రూప్ సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో ఏఐ ఆధారిత ఫార్మా హెల్త్‌కేర్ ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దానివల్ల సుమారు 50,000 ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉన్నట్లు కంపెనీ సీఈఓ, ఎండీ డాక్టర్ గెడెల శ్రీనుబాబు తెలిపారు.హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ..‘కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రాజెక్ట్ హెల్త్‌కేర్‌తో పాటు ఐటీ రంగానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల స్థానిక యువతకు 10,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, దాదాపు 40,000 పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అత్యాధునిక కృత్రిమేమేధ సహాయంతో ఔషధాలను అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్ట్ తోడ్పడుతుంది. దానివల్ల రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు, మందులను అందించవచ్చు. ఇది దేశంలోనే హెల్త్‌కేర్ ఇన్నోవేషన్‌లో తెలంగాణను ముందంజలో ఉంచుతుంది’ అని శ్రీనుబాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..‘ఫార్మా పరిశ్రమలో అత్యాధునిక ఏఐ సాంకేతికతను ఉపయోగించడం వల్ల తక్కువ ధరకే రోగులకు మందులు, చికిత్స అందే వీలుంటుంది. గ్లోబల్ ఫార్మా క్యాపిటల్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9-10 ఫార్మా జోన్ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని సీఏం రేవంత్ రెడ్డి నిర్ణయించారు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: హాట్‌స్టార్‌లో అనంత్-రాధికల వివాహ వేడుకదేశంలో బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో 40 శాతం వాటా హైదరాబాద్ కంపెనీలదే కావడం విశేషం. అందుకనే హైదరాబాద్‌ను ‘బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అంటారు. ప్రపంచంలోని చాలా వ్యాక్సిన్లు స్థానిక కంపెనీలు తయారుచేసినవే. ఫార్మా రంగంలో హైదరాబాద్‌ను ‘వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’ అని కూడా పిలుస్తారు. -
హెల్త్‌కేర్ మోసాలకు పాల్పడ్డ భారత సంతతి ఫిజిషియన్
అమెరికాలో భారత సంతతికి చెందిన ఫిజిషియన్ మోనా ఘోష్ హెల్త్ కేర్ మోసానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రసూతికి సంబంధించిన స్త్రీ జననేంద్రియ సేవల్లో నైపుణ్యం కలిగిన ఆమె చికాగోలో ప్రోగ్రెసివ్ ఉమెన్స్ హెల్త్ర్ను నిర్వహిస్తున్నారు. అయితే ఆమె ప్రైవేట్ బీమా సంస్థలకు కూడా లేని సేవలకు బిల్లులు క్లయిమ్ చేసిన మోసాని పాల్పడ్డారు. ఆమె విచారణలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన రెండు మోసాలకు పాల్పడినట్లు అంగీకరించారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఘోష్ మోసాపూరితంగా పొందిన రీయింబర్స్‌మెంట్‌లలో దాదాపు రూ.27 కోట్లకు జవాబుదారిగా ఉన్నట్లు ఆరోపించింది. అయితే ఘోష్ తన అభ్యర్థన ఒప్పందంలో రూ. 12 కోట్లకు మాత్రమే జవాబుదారిగా ఉన్నానని పేర్కొంది. ఈ మోసాలకు గానూ అమెరికా జిల్లా న్యాయమూర్తి ఫ్రాంక్లిన్ యు వాల్డెర్రామా అక్టోబర్ 22న శిక్ష ఖరారు చేశారు. ఆమె 2018 నుంచి 2022 వరకు తన ఉద్యోగులు సమర్పించిన మెడిసెడ్, ట్రైకేర్ వంటి వాటికి ఇతర బీమా సంస్థలు కూడా అందించని లేదా వైద్యపరంగా అవసరం లేని సేవలకు కూడా మోసపూరితంగా క్లెయిమ్‌లను సమర్పించారని కోర్టు పేర్కొంది.ఇదంతా రోగి అనుమతి లేకుండానే ఆమె ఈ మోసానికి పాల్పడ్డట్లు తెలిపింది. అందుకుగానూ ఆమె ఎంత మొత్తం చెల్లించాల్సిందనేది శిక్షాకాలంలో కోర్టే నిర్ణయిస్తుందని తీర్పులో పేర్కొంది. ఇక ఘోష్ కూడా అధిక రీయింబర్స్మెంట్లు పొందేందుకు టెలిమెడిసిన్ సందర్శనలు ఎక్కువగా చేసినట్లు పేషెంట్ మెడికల్ రికార్డ్లను సృష్టించానని అంగీకరించింది. అలాగే అవసరం లేని బిల్లింగ్ కోడ్లను క్లైయిమ్ చేసినట్లు కూడా ఘోష్ విచారణలో ఒప్పుకుంది.(చదవండి: నాలుగేళ్ల తరువాత ఇంటికి బయలుదేరిన యువతి: విమానంలోనే కన్నుమూత) -
Beauty Tips: పాదాలలో.. ఇలాంటి సమస్యలున్నాయా? అయితే ఇలా చేయండి!
మారుతున్న వేడి వాతావరణం కారణంగా చర్మ సమస్యలు రావచ్చు. పాదాల విషయానికొస్తే.. దుమ్ము, దూళితో పాదాలు నలుపెక్కే అవకాశం ఉంది. చెమటతో మరింత మందంగా చీలికలేర్పడవచ్చు. కనుక మృదువైన పాదాల సంరక్షణకై ఈ చిన్న చిట్కాలు ఏంటో చూద్దాం.ఇలా చేయండి..చేతులు, పాదాలపై నల్లటి మచ్చలుంటే వాడేసిన నిమ్మతొక్కతో రుద్దితే పోతాయి.సమ్మర్లో బయటకు వెళ్ళేటప్పుడు పాదాలకు సాక్స్ వేసుకుంటే పగుళ్ళు రాకుండా ఉంటాయి.రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత మసాజ్ క్రీమ్ లేదా ఆయిల్‌తో ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి.పదిహేను రోజులకు ఒకసారి పెడిక్యూర్ చేసుకోవాలి.స్నానం పూర్తయిన తర్వాత పమిస్ స్టోన్‌తో పాదాలను మెల్లగా రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలగిపోయి పాదాలు నునుపుగా ఉంటాయి.ఇవి చదవండి: ఎముక పుచ్చిపోయింది..నడవొద్దన్నారు: ఇపుడు ఏకంగా సిక్స్‌ప్యాక్ -
టెక్ దిగ్గజం టీసీఎస్‌కు జాక్ పాట్..మరో 15ఏళ్ల వరకు ఢోకాలేదు!
భారత్ టెక్ దిగ్గజం టీసీఎస్ జాక్ పాట్ కొట్టింది. ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ అవివా ఇప్పటికే టీసీఎస్‌తో కుదర్చుకున్న ఒప్పందాన్ని మరో 15ఏళ్ల పొడిగింది. 15 ఏళ్ల పాటు బీమా చట్టాల నిర్వాహణ, కస్టమర్ ఎక్స్పీరియన్స్ వంటి కార్యకాలాపాలు నిర్వహించేలా టీసీఎస్‌కు అప్పగించిన ప్రాజెక్ట్‌ను పొడిగిస్తున్నట్లు అవివా అధికారిక ప్రకటన చేసింది. అయితే ఇరు కంపెనీల మధ్య ఒప్పందం అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉండగా పలు నివేదికల ప్రకారం..ఈ డీల్ విలువ 500 మిలియన్ల కంటే ఎక్కువ మొత్తంలో ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. యూకేలో అవివా సంస్థ గత 20 ఏళ్లుగా టీసీఎస్‌తో కలిసి పనిచేస్తుంది. ఇక ఈ కొత్త ఒప్పందంలో భారత్ కంపెనీ అవివా ఎండ్ టు ఎండ్ పాలసీ అడ్మినిస్ట్రేషన్, 5.5 మిలియన్లకు పైగా పాలసీలను సేవల్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా అవివా సీఈఓ డౌగ్ బ్రౌన్ మాట్లాడుతూ..‘ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం ద్వారా మేము మా కస్టమర్లకు అందించే సేవలతో పాటు, కార్యకలాపాల్ని మరింత విస్తరించేందుకు అవకాశం ఉంది. మా ఆశయాలకు అనుగుణంగా సంస్థ సామర్థ్యాన్ని మెరుగు పరుస్తూ అటు కస్టమర్లకు, ఇటు వ్యాపారంలో గణనీయమైన ప్రయోజనాల్ని అందిస్తుందని’ అన్నారు. -
వైద్య రంగంలో పెనుమార్పులు.. మతి పోగొడుతున్న కొత్త టెక్నాలజీలు!
ఇది సాంకేతిక విప్లవయుగం. సాంకేతిక విప్లవం ప్రపంచంలోని ప్రతి రంగాన్నీ ప్రభావితం చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, నానో టెక్నాలజీ వంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు వైద్యరంగంలోకి కూడా దూసుకొస్తున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వైద్యరంగంలో పెనుమార్పులకు దారులు వేస్తోంది. ప్రస్తుత శతాబ్దిలో ఇప్పటికే వైద్యరంగంలోకి అధునాతన సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఏడాది కొత్త కొత్త పరికరాలు వైద్యరంగంలోకి అడుగుపెడుతూ చికిత్స పద్ధతులను మరింతగా సులభతరం చేస్తున్నాయి. జ్వరం తెలుసుకోవాలంటే థర్మామీటర్... ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోవాలంటే స్టెతస్కోప్... శరీరంలోని ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవడానికి పల్సాక్సి మీటర్...ఇప్పటి వరకు మనం ఉపయోగిస్తున్న పరికరాలు. ఈ అన్ని లక్షణాలనూ తెలిపే పరికరం తాజాగా రూపుదిద్దుకుంది. మన అందచందాలను చూసుకోవడానికి అద్దం వాడుతుంటాం. మరి, మన మానసిక పరిస్థితిని తెలుసుకోవడానికో? దానికి కూడా ఒక అధునాతన అద్దం అందుబాటులోకి వచ్చేసింది. తలనొప్పి వస్తే తలకు ఏ అమృతాంజనం పట్టించుకోవడమో లేదా ఒక తలనొప్పి మాత్ర వేసుకోవడమో చేస్తుంటాం. ఇక ఆ బెడద లేకుండా, తలనొప్పి తీవ్రతకు తగినంత మోతాదులో ఔషధాన్ని విడుదల చేసే హెడ్‌బ్యాండ్ తయారైంది. ఆరోగ్యరంగంలో పెనుమార్పులకు దారితీయగలిగిన వస్తువుల్లో ఇవి కొన్ని. ఇలాంటివే మరికొన్ని అద్భుతమైన సాంకేతిక పరికరాలు కూడా గడచిన ఏడాదికాలంలో తయారయ్యాయి. ఈ పరికరాలను వాటి తయారీదారులు లాస్ వేగస్‌లో ఈ ఏడాది జనవరి 9 నుంచి 12 వరకు జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో–2024 (సీఈఎస్) వేదికపై ప్రదర్శించారు. వీటికి శాస్త్రవేత్తల నుంచి మాత్రమే కాకుండా, సామాన్య సందర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. సరికొత్త వైద్య పరికరాలపై సంక్షిప్త పరిచయంగా ఈ కథనం మీ కోసం.. ఫోర్ ఇన్ వన్ ‘బీమ్‌ఓ’ అరచేతిలో ఇమిడిపోయే ఈ ఒక్క చిన్నపరికరం దగ్గర ఉంటే థర్మామీటర్, స్టెతస్కోప్ వంటివేవీ అవసరం ఉండదు. ఇది ఫోర్ ఇన్ వన్ పరికరం. అమెరికాలోని శాన్‌హోసే స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల సాయంతో ‘బీమ్‌ఓ’ కంపెనీ ఈ ఫోర్ ఇన్ వన్ పరికరాన్ని తయారుచేసింది. దీనిని నుదుటి మీద ఆనించి జ్వరం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఛాతీ మీద ఆనించి ఊపరితిత్తుల పనితీరును, గుండె పనితీరును తెలుసుకోవచ్చు. అలాగే శరీరంలోని ఆక్సిజన్ స్థాయిని తెలుసుకోవచ్చు. దీనిలోని సెన్సర్లు శరీరంలోని సూక్ష్మమైన తేడాలను సైతం ఇట్టే గుర్తించి, శరీర ఆరోగ్య స్థితిగతులపై కచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి. ఇది స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా పనిచేస్తుంది. దీని ద్వారా ఫోన్‌కు చేరిన సమాచారాన్ని డాక్టర్‌కు చూపించి సత్వరమే తగిన చికిత్స పొందడానికి వెసులుబాటు కల్పిస్తుంది. ‘బీమ్‌ఓ’ పరికరం విస్తృతంగా వాడుకలోకి వచ్చినట్లయితే, వైద్యరంగంలో ఇప్పటివరకు వాడుకలో ఉన్న థర్మామీటర్, స్టెతస్కోప్, పల్సాక్సిమీటర్ వంటి పరికరాలు దాదాపు కనుమరుగు కాగలవు. ‘బీమ్‌ఓ’ ఈ ఏడాది జూన్‌లో మార్కెట్లోకి రానుంది. దీని ధర 249 డాలర్లు (రూ.20,701) మాత్రమే! మనసును చూపించే అద్దం అద్దంలో ముఖం చూసుకోవడం మామూలే! ఈ అద్దం మాత్రం మన మనసుకే అద్దంపడుతుంది. మన ఒత్తిడి, చిరాకు, పరాకు, దిగులు, గుబులు వంటి లక్షణాలను ఈ అద్దం ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. అమెరికాలోని సీయాటల్కు చెందిన ‘బారాకోడా’ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ స్మార్ట్ అద్దాన్ని ‘బి మైండ్’ పేరుతో రూపొందించింది. ఈ అద్దం బాత్రూమ్లో ఉపయోగించుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇది టచ్‌స్క్రీన్‌గా కూడా పనిచేస్తుంది. ఇందులోని కేర్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మన మానసిక స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇందులోని నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా ఈ అద్దం మన భావోద్వేగాల్లోని మార్పులను సత్వరమే గుర్తించి, అప్రమత్తం చేస్తుంది. భావోద్వేగాల్లో తేడాలు ఉన్నట్లయితే, ఇందులోని లైట్ థెరపీ ఆటోమేటిక్‌గా పనిచేసి, సాంత్వన కలిగిస్తుంది. సీఈఎస్–2024లో ప్రదర్శించిన ఈ స్మార్ట్ అద్దం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇది ఈ ఏడాది చివరిలోగా మార్కెట్లోకి రానుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్‌వాచీ ఇప్పటికే ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్‌వాచీలను పలు కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. అమెరికన్ కంపెనీ గార్మిన్ తాజాగా ‘లిలీ–2’ పేరుతో ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్‌వాచీని విడుదల చేసింది. దీనిని సీఈఎస్–2024 షోలో ప్రదర్శించింది. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్‌వాచీ స్మార్ట్‌ఫోన్ యాప్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్‌వాచీలతో పోల్చుకుంటే దీని బరువు తక్కువే కాకుండా, డిజైన్ ఆకర్షణీయంగా ఉండటం విశేషం. ‘లిలీ–2’ స్మార్ట్ వాచీలను గార్మిన్ కంపెనీ ‘క్లాసిక్’, ‘స్పోర్ట్స్’ అనే రెండు మోడల్స్‌లో విడుదల చేసింది. దీని డయల్‌పై ఉన్న టచ్‌స్క్రీన్‌ను తడితే, ఇది సమయం చూపడమే కాకుండా, శరీరంలోని ఎనర్జీ లెవల్స్‌ను, స్లీప్ స్కోర్‌ను చూపిస్తుంది. ఇది ధరించిన వారి శరీరం పనితీరును నిరంతరాయంగా గమనిస్తూ, స్మార్ట్‌ఫోన్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. గుండె పనితీరు, అలసట స్థాయి, నిద్ర తీరుతెన్నులు, ఆటలాడేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు ఖర్చయ్యే కేలరీలు, శరీరంలో నీటి స్థాయి, శ్వాస తీరు, ఆక్సిజన్ లెవల్స్, మహిళల నెలసరి పరిస్థితుల వంటి అంశాలపై ఇది కచ్చితమైన సమాచారాన్ని తెలియజేస్తుంది. లిలీ–2 స్పోర్ట్స్ మోడల్ ధర 249.99 డాలర్లు (రూ.20,782), క్లాసిక్ మోడల్ ధర 279.99 డాలర్లు (రూ.23,276) మాత్రమే! వృద్ధుల కోసం మెడికల్ అలర్ట్ సిస్టమ్ చూడటానికి ఇది దోమలను పారదోలే పరికరంలా కనిపిస్తుంది గాని, ఇది వృద్ధులకు ఆసరగా పనిచేసే అధునాతన మెడికల్ అలర్ట్ సిస్టమ్. ఫ్రాన్స్‌కు చెందిన ‘జో కేర్’ కంపెనీ నిపుణులు దీనిని ‘జో ఫాల్’ పేరుతో రూపొందించారు. కాలుజారడం, రక్తపోటు పడిపోవడం, గుండెపోటు, పక్షవాతం వంటి కారణాలతో ఇళ్లలోని వృద్ధులు అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు వైఫై ద్వారా ఈ పరికరంలోని సెన్సర్లు వెంటనే గుర్తించి, దీనికి అనుసంధానమైన స్మార్ట్‌ఫోన్‌కు చేరవేసి అప్రమత్తం చేస్తుంది. సీసీ కెమెరాలు, తొడుక్కోవలసిన పరికరాలతో పనిలేకుండా, దీనిని గోడకు ప్లగ్ సాకెట్‌కు తగిలించుకుంటే చాలు. నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దీనిని అమర్చిన ప్రదేశానికి 800 చదరపు మీటర్ల పరిధిలో నేల మీద ఎవరు పడిపోయినా, వెంటనే అప్రమత్తం చేస్తుంది. సీఈఎస్–2024 షోలో దీనికి సందర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. ఇంటిల్లిపాదికీ ఆరోగ్యరక్షణ ఇవి పోషకాల గుళికలు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా తయారైన స్మార్ట్ గమ్మీస్ ఇవి. ఏడు పోషకాలతో కూడిన ఈ స్మార్ట్ గమ్మీస్‌ను ఫిన్లండ్‌కు చెందిన ‘ఇలో స్మార్ట్ న్యూట్రిషన్’ కంపెనీ విడుదల చేసింది. సాధారణమైన విటమిన్ మాత్రలైతే, అందరికీ ఒకేలాంటివి దొరుకుతాయి. వీటిని ఎవరి అవసరాలకు తగినట్లుగా వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకునే వీలు ఉండటం విశేషం. 38.9 కోట్ల కాంబినేషన్లలోని పోషకాల మోతాదులతో కూడిన ఈ స్మార్ట్ పిల్స్‌ను కోరుకున్న రుచులతో త్రీడీ ప్రింటింగ్ ద్వారా ముద్రించుకోవచ్చు. నోటికి నచ్చిన రుచుల్లో దొరికే వీటిని నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు, శరీరంలోని పోషక లోపాలన్నీ సత్వరమే నయమవుతాయి. పోషకాల కాంబినేషన్లను బట్టి ఈ గమ్మీస్ ఒక్కో ప్యాక్ ధర 15 డాలర్ల నుంచి 20 డాలర్ల (రూ.1247 నుంచి రూ.1662) వరకు ఉంటుంది. అల్ట్రాహ్యూమన్ హోమ్ వైఫై రూటర్‌లా కనిపించే ఈ పరికరం ఇంటిల్లిపాదికీ ఆరోగ్యరక్షణ కల్పిస్తుంది. అమెరికన్ కంపెనీ ‘అల్ట్రాహ్యూమన్’ ఈ పరికరాన్ని ‘అల్ట్రాహ్యూమన్ హోమ్’ పేరుతో రూపొందించింది. రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ పరికరాన్ని ఇంట్లో అనువైన చోట అమర్చుకుని, ఆన్ చేసుకుంటే చాలు. ఇది నిరంతరం ఇంటి వాతావరణంలోని మార్పులను గమనిస్తూ, యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తుంది. ఇంట్లోని ఉష్ణోగ్రత, గాలిలో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు, ధూళికణాలు, కార్బన్ కణాలు వంటివి ఏ మేరకు ఉన్నాయో కచ్చితంగా చెబుతుంది. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా మార్చుకునేందుకు ఇది అందించే సమాచారం బాగా దోహదపడుతుంది. ‘అల్ట్రాహ్యూమన్’ ఈ పరికరాన్ని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని ధర 349 డాలర్లు (రూ.29,011) మాత్రమే! స్మార్ట్ పరుపు ఇది చాలా స్మార్ట్ పరుపు. కావలసిన రీతిలో దీని మెత్తదనాన్ని లేదా గట్టిదనాన్ని మార్చుకోవచ్చు. ఇలా మార్చుకోవడానికి వీలుగా దీనికి ఒక బటన్ అమర్చి ఉంటుంది. సాధారణమైన పరుపులతో పోల్చుకుంటే దీని బరువు దాదాపు ఎనబై శాతం తక్కువగా ఉంటుంది. సాధారణ పరుపులలో వాడే స్ప్రింగులు, ఫోమ్ వంటివేవీ ఇందులో ఉండవు. దాదాపు 1.40 కోట్ల పాలీస్టర్ దారపు పోగులతో దీనిని తయారుచేయడం విశేషం. దీని బటన్‌ను ఉపయోగిస్తూ, పది కుషన్ లెవల్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కొరియన్ కంపెనీ ‘ఆన్సిల్’ ఈ పరుపును సీఈఎస్–2024 షోలో ప్రదర్శించింది. ‘స్మార్ట్ స్ట్రింగ్ ఐ4’ పేరుతో తయారు చేసిన ఈ స్మార్ట్ పరుపులో మరికొన్ని అదనపు సౌకర్యాలూ ఉన్నాయి. ఇందులోని సెన్సర్లను నిద్ర తీరుతెన్నులను గమనిస్తూ, ఆ సమాచారాన్ని యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తుంది. ఒంటి బరువులో మార్పులు, గురక వంటి ఇబ్బందులను కూడా ఇది గుర్తిస్తుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. మార్కెట్లోకి దీనిని ఎప్పుడు విడుదల చేయనున్నదీ త్వరలోనే ప్రకటించనున్నట్లు ‘ఆన్సిల్’ కంపెనీ తెలిపింది. పర్సనలైజ్డ్ న్యూట్రిషనల్ ఫుడ్ ప్రింటర్ మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో స్థాయిలో పోషకాహార అవసరాలు ఉంటాయి. ఇళ్లల్లో వండుకునే ఉమ్మడి వంటతోనో లేదా హోటళ్లు, రెస్టారెంట్లలో దొరికే వంటకాలతోనో పోషకాహార అవసరాలు పూర్తిగా తీరే పరిస్థితి ఉండదు. వ్యక్తిగత అవసరాలకు తగినట్లుగా పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను కోరుకున్న రుచులతో అందించేందుకు అమెరికన్ కంపెనీ ‘ఆనరీ’ ఇటీవల ‘ఇనొవేటివ్ ఇండివిడ్యువలైజ్డ్ న్యూట్రిషనల్ కిట్’ (ఐఐఎన్కే) పేరుతో ఈ త్రీడీ ఫుడ్ ప్రింటర్‌ను రూపొందించింది. ఇందులో ముడి పదార్థాలను తగిన మోతాదులో వేసుకుని, స్విచాన్ చేసుకుంటే చాలు. కొద్ది నిమిషాల్లోనే మనకు కావలసిన ఆహారాన్ని, మనకు అవసరమైన పోషకాలు ఉండేలా ముద్రించి పెడుతుంది. ఇది దాదాపు మిగిలిన త్రీడీ ఫుడ్ ప్రింటర్లాగానే పనిచేస్తుంది. అయితే, దీని తయారీదారులు మాత్రం దీనిని 4డీ ఫుడ్ ప్రింటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది కేవలం మూడు కొలతల్లో ఆహారాన్ని ముద్రించే త్రీడీ ప్రింటర్ మాత్రమే కాదని, అంతకు మించి ఇది పదార్థాల్లోని పీహెచ్ స్థాయిని, వేడిని కోరుకున్న రీతిలో, కోరుకున్న సమయానికి అందిస్తుందని, అందువల్ల ఇది 4డీ ప్రింటర్ అని చెబుతున్నారు. దీనిని సీఈఎస్–2024 షోలో ప్రదర్శించారు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. పెంపుడు జంతువులకు హెల్త్ట్రాకర్ చాలామంది ఇళ్లల్లో పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులను పెంచుకుంటుంటారు. పెంపుడు జంతువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పర్వాలేదు గాని, వాటి ఆరోగ్యానికి సమస్యలు తలెత్తితే ఇబ్బందే! పెంపుడు జంతువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ పెట్ హెల్త్ట్రాకర్ బాగా ఉపయోగపడుతుంది. ఇళ్లల్లో పెంచుకునే పిల్లులు లేదా జాగిలాలకు మెడలో దీనిని తగిలిస్తే చాలు. యాప్ ద్వారా ఇది వాటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఇన్వోక్సియా కంపెనీ ఈ పెట్ హెల్త్ట్రాకర్ను ‘మినిటాయిల్జ్ స్మార్ట్ పెట్‌ట్రాకర్’ పేరుతో రూపొందించింది. ఇది పెంపుడు జంతువుల దినచర్యపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతుంది. పెంపుడు జంతువుల తినే వేళలు, నడక వేళలు, ఆట వేళలు, వాటి భావోద్వేగాలు, వాటి జీర్ణ సమస్యలు, గుండె సమస్యలను ఇది తక్షణమే గుర్తించి, యాప్ ద్వారా యజమానులను అప్రమత్తం చేస్తుంది. ఈ పెట్‌ట్రాకర్ శునకాల కోసం ఒక మోడల్, పిల్లుల కోసం ఒక మోడల్ రూపొందించింది. అయితే, రెండిటి ధర ఒక్కటే– 99 డాలర్లు (రూ.8,230) మాత్రమే! ఈ పెట్‌ట్రాకర్ ఈ ఏడాది మార్చిలో అందుబాటులోకి రానుంది. పట్టుతప్పిన చేతులకు స్మార్ట్గ్లోవ్స్ వార్ధక్యంలో కొందరు పార్కిన్సన్స్ వ్యాధి బారినపడతారు. ఈ వ్యాధికి లోనైనవారిలో కీళ్లు బిగుసుకుపోయి, వణుకు పెరిగి, చేతులు పట్టుతప్పుతాయి. పట్టుతప్పిన చేతులతో టీ కప్పు వంటి తేలికపాటి వస్తువులను పట్టుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి బ్రిటన్‌కు చెందిన ‘గైరోగేర్’ కంపెనీ ఈ ‘గైరోగ్లోవ్’ను రూపొందించింది. దీని పనితీరును ఇటీవల సీఈఎస్–2024 షోలో ప్రదర్శించినప్పుడు దీనికి నిపుణుల ప్రశంసలు లభించాయి. ఇది మాగ్నటిక్ కనెక్టర్‌తో రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీనిని చేతికి తొడుక్కుని, ఆన్ చేసుకున్న వెంటనే ఇది చేతి వణుకును నియంత్రిస్తుంది. చేతికి పట్టునిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడేవారు దీనిని తొడుక్కుని తమ పనులను తామే స్వయంగా చేసుకునేందుకు దోహదపడుతుంది. దీని ధర 550 డాలర్లు (రూ.45,726). వైద్య ఆరోగ్య రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులకు ఈ వస్తువులు తాజా ఉదాహరణలు. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించే స్మార్ట్ వాచీలు, నొప్పి నివారణ కోసం వాడే స్మార్ట్ పట్టీలు, ఇన్సులిన్ ఇంజక్షన్ల బదులుగా వాడే స్ప్రేలు వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ పరిజ్ఞానాలు శస్త్రచికిత్సలను మరింతగా సులభతరం చేస్తున్నాయి. ఈ సాంకేతికత ఆరోగ్యరంగాన్ని మరింత అభివృద్ధి చేయగలదని, మానవాళి ఆరోగ్యానికి మరింత భరోసా ఇవ్వగలదని భావించవచ్చు. -
పిల్లల సైకాలాజికల్ సెషన్స్ ఎక్కడ తీసుకుంటే మంచిది..?
-
బ్రెయిన్ లో ఏ కెమికల్ తేడా ఉన్నాయో చెప్పే టెక్నాలజీ
-
పిల్లలు చదవలేక, రాయలేక పోతున్నారు అంటే కారణాలు..!
-
స్ట్రెస్ హ్యాండిల్ చేయాలంటే: సాజిదా ఖాన్
-
పిల్లల బిహేవియర్ ఇష్యూస్ ని అడ్రస్ చేసే విధానం..!
-
ఒక మదర్ గా చెబుతున్న... పిల్లలు వాళ్లే మారతారు లే అని వదిలేస్తే..!
-
పిల్లల మెదడు విశ్లేషణ గురించి యండమూరి వీరేంద్రనాథ్
-
చిన్న పిల్లలకు మాటలు సరిగ్గా రాకపోతే... పేరెంట్స్ ఇలా చెయ్యండి
-
డాక్టర్ రెడ్డీస్ చేతికి మెనో ల్యాబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తాజాగా అమెరికాకు చెందిన మహిళల ఆరోగ్య సంరక్షణ, సప్లిమెంట్స్ ఉత్పత్తుల సంస్థ మెనోల్యాబ్స్ను కొనుగోలు చేసింది. అమెరికన్ బయోటెక్నాలజీ కంపెనీ అమిరిస్లో భాగమైన మెనోల్యాబ్స్ను దివాలా కోడ్ ద్వారా దక్కించుకున్నట్లు పేర్కొంది. మెనోల్యాబ్స్ పోర్ట్‌ఫోలియోలో ఏడు బ్రాండెడ్ ఉత్పత్తులు, యాప్ మొదలైనవి ఉన్నట్లు వివరించింది. మహిళల పౌష్టికాహార, వెల్నెస్ ఉత్పత్తుల మార్కెట్లో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు మెనోల్యాబ్స్ కొనుగోలు ఉపయోగపడగలదని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉత్తర అమెరికా విభాగం సీఈవో మార్క్ కికుచి తెలిపారు. మెనోల్యాబ్స్ అమెరికాలో తమ సొంత ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్‌తో పాటు అమెజాన్, వాల్‌మార్ట్ ద్వారా కూడా ఉత్పత్తులను విక్రయిస్తోంది. -
బచ్చలికూర ఎంత మేలో.. తెలిస్తే అస్సలు వదులుకోరు!
'మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకుకూరల్లో బచ్చలి కూర ఒకటి. కానీ, బచ్చలికూరను చాలామంది ఇష్టపడరు.. అయితే, బచ్చలికూరలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం నిజంగా బంగారమే అంటారు.' బచ్చలి కూరలో విటమిన్ ఎ, సి, ఇ, కె, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, ఐరన్, కాపర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్స్‌కు భాండాగారం. రక్తహీనతతో బాధపడే వారికి బచ్చలి కూర దివ్యౌషధంలా పని చేస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడగలరని నిపుణులు చెబుతున్నారు. హైబీపీ పేషెంట్లు బచ్చలి ఆకులను రసంగా చేసుకుని తాగుతుంటే.. రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు.. బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలికూరను తరచూ తీసుకోవటం ద్వారా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది. బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. బచ్చలి కూరలో అధికంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, నియాసిన్, సెలీనియం నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో సహా యపడతాయి. అంతేకాదు, మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్‌గా బచ్చలి కూరను తీసుకోవడం వల్ల మూత్ర విసర్జనలోని సమస్యలు తొలగిపోతాయి, పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలికూరను తింటే ఈ సమ స్యనుంచి ఉపశమనం లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇవి చదవండి: 'ఇంగువ'ని ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు! -
ఉద్యోగుల ఆరోగ్యంపై రాజీ ప్రసక్తే లేదు: APSRTC
సాక్షి, ఎన్టీఆర్: ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య సదుపాయలు కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. ప్రభుత్వ ఉద్యోగులతో ఆర్టీసీ ఉద్యోగుల్ని సమానంగా చూస్తోందని.. పైగా వైద్య సదుపాయాలు అందించే విషయంలో ప్రత్యేక చొరవ కనబరుస్తోందని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ చెబుతోంది. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంతో సర్కార్ చెలగాటం పేరిట ఇవాళ ఈనాడులో ప్రచురితమైన కథనాన్ని మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ ఖండిస్తూ.. పూర్తి వివరాలను తెలియజేసింది. ‘‘ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు అనేక సదుపాయాలు పొందుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా హెల్త్ కార్డులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులకు రిఫర్ చేయబడిన ఆసుపత్రులలోనే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా మెరుగైన వైద్యం అందుతోంది. ఈహెచ్ఎస్ ఆసుపత్రుల్లో చికిత్స, ఓపీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జిల్లాకొక లైజనింగ్ అధికారిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది కూడా.. .. ఇటీవల కాలంలో ఉద్యోగులకు తలెత్తుతున్న అనారోగ్య సమస్యలపై ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగులందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోంది. కార్డియాక్ కేర్ Try-cog మెషీన్ల ద్వారా ఉద్యోగులకు ఏర్పడే హృద్రోగ సమస్యలను ముందుగానే పసిగట్టి వైద్యం అందిస్తున్నాం. అలా ఇప్పటి వరకూ 149 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ముందస్తు పరీక్షల ద్వారా ఆరోగ్య భద్రత కల్పించాం’’ అని తెలిపింది. వైద్య సేవల విషయానికొస్తే.. అనారోగ్యం బారినపడిన ఆర్టీసీ ఉద్యోగులకు వైద్యపరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. తద్వారా సకాలంలో చికిత్స అందేలా చూస్తున్నారు. ఆర్టీసీకి సంబంధించిన అన్నిడిస్పెన్సరీలలో నిరంతరం వైద్యం.. ఔషధాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నారు. 2021లో సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో వైఎస్సార్ జిల్లాలో డా.వైఎస్సార్ ఏరియా ఆర్టీసీ ఆసుపత్రి ఏర్పాటైంది. తిరుపతి, నరసరావుపేట, మచిలీపట్నంలో ఉద్యోగుల కోసం శరవేగంగా ఆర్టీసీ ఆస్పత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయి. -
Swachhata Hi Seva: స్వచ్ఛ భారత్.. స్వాస్థ్ భారత్
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛతా కీ సేవా’ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో లాంఛనంగా శ్రీకారం చుట్టారు. స్వయంగా చీపురు చేతపట్టి రహదారిని శుభ్రం చేశారు. ఆయన ఈ శ్రమదాన కార్యక్రమంతో వినూత్నంగా ఫిట్నెస్, ఆరోగ్య సంరక్షణను కూడా జోడించారు. ప్రముఖ ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ అంకిత్ బైయాన్‌పూరియాతో కలిసి శ్రమదానంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి పిలుపుమేరకు దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో జరిగిన స్వచ్ఛతా కీ సేవాలో లక్షలాది మంది స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు. గంటపాటు శ్రమించారు. తమ పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. మార్కెట్లు, జల వనరులు, బస్ స్టాండ్లు, టోల్ వసూలు కేంద్రాలు, గోశాలలు, జంతు ప్రదర్శనశాలలు, సముద్ర తీర ప్రాంతాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, కళాశాలల్లోనూ శ్రమదానం చేశారు. 4 నిమిషాల నిడివి గల తన శ్రమదానం వీడియోను ప్రధాని మోదీ తన అధికారిక ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘నేడు దేశమంతా స్వచ్ఛతపై దృష్టి పెట్టింది. నేను, అంకిత్ బైయాన్‌పూరియా స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నాం. కేవలం పరిసరాలను శుభ్రం చేయడమే కాదు, ఫిట్నెస్, ఆరోగ్య సంరక్షణను కూడా జతకలిపాం. ఇదంతా స్వచ్ఛ భారత్, స్వాస్థ్ భారత్ కోసమే’’ అని మోదీ ఉద్ఘాటించారు. 9.20 లక్షలకుపైగా ప్రదేశాల్లో.. స్వచ్ఛతా కీ సేవా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు చీపుర్లకు పనిచెప్పారు. ఇళ్ల చుట్టుపక్కన, బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం ఊడ్చేశారు. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, మార్కెట్ సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, ధార్మిక సంస్థలు, వాణిజ్య సంఘాలు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా 9.20 లక్షలకుపైగా ప్రదేశాల్లో ఈ కార్యక్రమం జరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శ్రమదానం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలోని ఝండేవాలన్ ఏరియాలో శ్రమదానంలో పాల్గొన్నారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి ఢిల్లీలో స్వచ్ఛతా యజ్ఞంలో భాగస్వాములయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీతాపూర్‌లో ‘స్వచ్ఛతా పఖ్వాడా’ నిర్వహించారు. ‘చెత్త రహిత భారత్’ను సాధిద్దాం దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలని కేంద్రప్రభుత్వం తీర్మానించుకుందని, ఇదొక పెద్ద సవాలు అయినప్పటికీ చేసి చూపిస్తామని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. స్వచ్ఛతా యజ్ఞంతో మహాత్మా గాం«దీకి నివాళులర్పిద్దామని కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పురి ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా కీ సేవాలో పాల్గొన్ని, కొత్త చరిత్ర సృష్టిద్దామని ఉద్బోధించారు. ‘చెత్త రహిత భారత్’ అనే కలను నెరవేర్చుకుందామని సూచించారు. ప్రజలు శ్రమదానంలో పాల్గొనాలంటూ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ ఇచి్చన ‘స్వచ్ఛ భారత్’ పిలుపును ప్రజలు అందిపుచ్చుకుంటారని తాము ఆశిస్తున్నట్లు బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ చెప్పారు. -
ఒక టెకీ హెల్త్‌కేర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కొత్త ఒరవడి సృష్టించింది!
సౌమ్యంగా సాధించింది సౌమ్య ఈ తరం టెకీ. సాంకేతికతను ఆరోగ్యానికి అద్దింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో వైద్యరంగంలో కొత్త ఒరవడి తెచ్చింది. వైద్యరంగం, ఔషధాల తయారీ రంగాలు సాంకేతికతను అందుకోవాల్సినంత వేగంగా అందుకోవడం లేదనుకుంది సౌమ్య. ‘మల్టిప్లైయర్ ఏఐ’ పేరుతో హెల్త్‌కేర్ రంగంలో ప్రవేశించింది. ఇంత సునిశితమైన, సంక్లిష్టమైన పరిశ్రమను నిర్వహించడం మగవాళ్లకే సాధ్యం అనే అభిప్రాయాన్ని చెరిపేసిందామె. ‘మగవాళ్ల ప్రపంచం అనే భావన మహిళలు ప్రవేశించేటంత వరకే. ఒకసారి మహిళలు ప్రవేశిస్తే ఇక అది అపోహ మాత్రమేనని నిర్ధారణకు వచ్చేస్తాం. మా టీమ్ లో సగానికి పైగా మహిళలే. సేల్స్ విభాగంలో కూడా మహిళలు సమర్థంగా పని చేస్తున్నార’ని చెప్పింది. ఒక టెకీ హెల్త్‌కేర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి దారితీసిన పరిస్థితులను, హైదరాబాద్‌లో సంస్థ స్థాపించి సక్సెస్ అందుకున్న వైనాన్ని సాక్షితో పంచుకున్నారు సౌమ్య. భారీ మూల్యం చెల్లించాం ‘‘నన్ను హెల్త్‌కేర్ ఇండస్ట్రీలోకి రప్పించిన కారణాలు అత్యంత బాధాకరమైనవి. మాది ఉత్తరప్రదేశ్, ప్రయాగరాజ్ (అలహాబాద్). నాన్న రవిప్రకాశ్ శ్రీవాస్తవ ఐఏఎస్ ఆఫీసర్. నాన్న డయాబెటిస్తో బాధపడుతుండేవారు. రొటీన్ టెస్ట్‌లు, మెడికేషన్ ఇవ్వడంలో ఎక్కడో పొరపాటు జరిగిపోయింది. మా జీవితాలు భారీ మూల్యం చెల్లించుకున్న పొరపాటు అది. వైద్యుల నిర్లక్ష్యం, రాంగ్ మెడికేషన్ కారణంగా ఆయన హటాత్తుగా ప్రాణాలు వదిలారు. నేనప్పుడు బీటెక్ సెకండియర్‌లో ఉన్నాను. ఆ తర్వాత కొద్దిసంవత్సరాల్లోనే అమ్మకు ఒవేరియన్ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. మేము తెలుసుకునేటప్పటికే వ్యాధి మూడవ దశకు చేరింది. చికిత్స మొదలు పెట్టినప్పటికీ ఆరు నెలలకే అమ్మను కూడా కోల్పోయాను. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లోనే బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీలో బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేశాను. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ వైద్యరంగం ఆ వేగాన్ని అందిపుచ్చుకోవడంలో వెనకబడుతోంది. ఆ వెనుకబాటు తెచ్చిన నష్టంలో మా అమ్మానాన్నల మరణాలు కూడా భాగమేననిపించింది. ఈ రెండు రంగాల మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేయాలనే సంకల్పం కలిగింది, చేయగలననే నమ్మకం కూడా. సమాచారలోపం తలెత్తని విధంగా మెడికల్ డాటాను పరిరక్షించగలిగే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి పూనుకున్నాను. మల్టిప్లైయర్ ఏఐ స్థాపించి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా డాటా అనలైజేషన్, డాటా మెయింటెయిన్ చేస్తున్నాం. మా సంస్థకు ‘ఐఎస్ఓ 27001’ సర్టిఫికేట్ వచ్చింది. మా సర్వీస్‌ను దేశవిదేశాల్లో పెద్ద ఆరోగ్య సంస్థలు తీసుకుంటున్నాయి. పేషెంట్ కేర్‌లో మొదటిది పేషెంట్ ఆరోగ్య చరిత్ర, క్రమం తప్పని పరీక్షల ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం, పరీక్షల నివేదికల నిర్వహణ ప్రధానమైనవి. ఇక్కడ పొరపాటు జరిగితే ప్రాణాలు దక్కవని చెప్పడానికి మా పేరెంట్సే ఉదాహరణ. ఫాలో అప్ సర్వీస్ వ్యాధి నిర్ధారణ ఆధారంగా వైద్యం అందించిన తర్వాత తదనంతర పరీక్షలను, వైద్యాన్ని అందించాల్సిన సమయానికి ఫాలో అప్ చేయడం కూడా మా సర్వీస్‌లో భాగంగా ఉంది. అలాగే భవిష్యత్తులో టెలిమెడిసిన్ విస్తరించాల్సిన అవసరం ఉంది. వైద్యచికిత్సను కుగ్రామాలకు చేరడానికి చక్కటి మాధ్యమం ఇది. పేషెంట్‌ను ఉన్న చోటనే ఉంచి ఆరోగ్యపరిస్థితిని మానిటర్ చేయడం సాధ్యమవుతుంది. నేను చదివిన టెక్, బయోటెక్ పరిజ్ఞానం ఇందుకు దోహదం చేసింది. నాకు సవాళ్లు ఎదురయ్యాయా అంటే సవాళ్లు లేని ప్రొఫెషన్ అంటూ ఏదైనా ఉంటుందా? డిజిటల్ బ్రాండింగ్, మార్కెటింగ్‌లో అవరోధాలు వచ్చాయి. మా క్లయింట్ల సందేహాలను తీరుస్తూ, వాళ్లు సమాధానపడే వరకు సహనంగా వివరించాం. సవాళ్లకు సమాధానాలు వెతుక్కుంటూ ముందుకు పోవడమే సక్సెస్‌కు దారి తీస్తుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మా నాన్నను కోల్పోవడమే నన్ను ఈ రంగం వైపు నడిపించింది. ప్రతి విజయంలో మా అమ్మానాన్న కనిపిస్తున్నారు’’ అని వివరించారు సౌమ్య. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే! హైకోర్టు జస్టిస్ ఆదేశం!) -
ఈ–సైకిళ్ల జోరు.. ప్రయాణంలో హుషారు
సాక్షి, అమరావతి: భారతదేశంలో సైక్లింగ్‌పై మక్కువ పెరుగుతోంది. కరోనా తర్వాత ఆరోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ స్పృహతో చాలామంది సైకిళ్లను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో ఈ–సైకిళ్ల వాడకం జోరందుకుంది. సంప్రదాయ శిలాజ ఇంధనాలను విడుదల చేసే వాహనాలు తక్కువ దూరం ప్రయాణించడంలో పర్యావరణాన్ని దెబ్బతీయడంతోపాటు రవాణాకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ–సైకిళ్లే భవిష్యత్‌గా గుర్తించిన కంపెనీలు బహుళార్థ సాధక ప్రయోజనాన్ని కలిగేలా డిజైన్లు చేస్తున్నాయి. కొన్ని మెట్రో సిటీలు, నగరాల్లో సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు రోడ్లపై ప్రత్యేక పాత్‌వేలు నిర్మిస్తుండటం విశేషం. యాప్ సాయంతో కంట్రోల్ టెక్ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీలు ఈ–సైకిళ్లలో కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నాయి. యాప్ సాయంతో నియంత్రించే ఈ–సైకిల్, ఈ–బైక్‌లు మార్కెట్లోకి వచ్చేశాయి. మొబైల్ ఆధారిత యాప్‌ల ద్వారా వినియోగదారులకు వారి వేగం, దూరం, కేలరీలు కరిగిపోవడం, హృదయ స్పందన రేటుపై రియల్ టైమ్ అప్డేట్లను అందిస్తున్నాయి. వాస్తవానికి దేశంలో ఈ–సైకిళ్లు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ వాటి కొనుగోళ్లు ఏటా రెట్టింపు అవుతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ), క్లిన్వెల్డ్ పీట్ మారి్వక్ గోర్డెలర్ (కేపీఎంజీ) నివేదిక ప్రకారం త్వరలోనే భారతదేశ ఈ–సైకిల్ మార్కెట్ మిలియన్ యూనిట్లకు పైగా ఉంటుందని అంచనా. గ్లోబల్ ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్ పరిమాణం 2021లో 18.58 బిలియన్ల డాలర్ల నుంచి 2028లో 52.36 బిలియన్ల డాలర్లకు వృద్ధి చెందడంతోపాటు భారతదేశంలో ఈ–సైకిల్ మార్కెట్ విలువ 2021లో 1.02 మిలియన్ డాలర్ల నుంచి 2026 నాటికి 2.08 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తర్వాత సైక్లింగ్ గణనీయంగా పెరుగుతుందనడానికి ఉదాహరణ.. యూరప్ మొత్తం పరిశ్రమల్లో 50 శాతం కంటే ఎక్కువ ఈ–సైకిళ్లు ఉత్పత్తి కావడమే. సైక్లిస్ట్ ఫ్రెండ్లీ వాతావరణం ప్రస్తుతం దేశంలో చిన్నారులు, యువతతో పాటు మౌంటైన్ బైక్స్ విభాగంలో ఈ–సైకిళ్లలో ఎక్కువ వృద్ధి నమోదవుతోంది. ప్రతిరోజూ దాదాపు 20 కోట్ల మంది ప్రజలు తక్కువ దూరం (20 కిలోమీటర్ల లోపు) ప్రయాణిస్తున్నట్టు సెన్సస్ డేటా చెబుతోంది. ఈ ప్రయాణ విధానానికి ఈ–సైకిల్స్ సరైన పరిష్కారమని పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు. చురుకైన జీవనశైలి, సాహనం, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే పట్టణ వాసులే ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. పాశ్చాత్య నగరాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా సైక్లిస్ట్ ఫ్రెండ్లీ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఈ–సైకిళ్లలో థొరెటల్ అసిస్ట్, పెడల్ అసిస్ట్ అనే రెండు రకాలు ఉన్నాయి. థొరెటల్ అసిస్ట్ అంటే మోటార్‌ను ఆన్ చేస్తే బైక్ పెడల్ చేయకుండా ముందుకు కదులుతుంది. పెడల్ అసిస్ట్ అంటే సైక్లిస్ట్ పెడల్ చేస్తున్నప్పుడు మాత్రమే మోటార్ రన్నింగ్‌లో ఉంటుంది. పెడల్ సహాయక ఎలక్ట్రిక్ బైక్‌లను మనం సంప్రదాయ సైకిల్‌ను తొక్కడంతో పోలి్చనప్పుడు మానవ ప్రయత్నాన్ని 70–80 శాతం వరకు తగ్గిస్తాయి. అయితే ప్రామాణిక మోటార్ బైక్‌లతో పోలిస్తే ఈ–సైకిళ్లు వైరింగ్, డిజైన్, మోటార్/మినీ ఇంజిన్, బ్యాటరీ శక్తి కారణంగా ఖరీదైనవిగా మారుతున్నాయి. ఈ–సైకిల్ ధర ఎక్కువగా దాని గ్రేడ్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. సుమారు రూ.20 వేల నుంచి రూ.1.50 లక్షలకు పైగా పలుకుతోంది. -
కునో నేషనల్ పార్కులోని 6 చీతాలకు రేడియో కాలర్ల తొలగింపు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కు(కేఎన్పీ)లో ఉన్న చీతాల్లో ఆరింటికి రేడియో కాలర్లను తొలగించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. కేఎన్పీ వైద్యులు, నమీబియా దక్షిణాఫ్రికాల నుంచి వచ్చిన నిపుణులు వీటి ఆరోగ్య పరిస్థితిపై పరిశీలన జరుపుతారని వెల్లడించారు. కేఎన్‌పీలో ప్రస్తుతం 11 చీతాలున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి 5 పెద్ద చీతాలు, 3 కూనలు చనిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేఎన్‌పీలో ఉన్న ఆరు చీతాల ఆరోగ్యాన్ని పరిశీలిస్తామని, మరో నాలుగు చీతాలకు ఏర్పాటు చేసిన రేడియో కాలర్లను కూడా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. రేడియో కాలర్ల వల్లే చీతాలు మృతి చెంది ఉంటాయనే అనుమానాలున్నాయా అన్న ప్రశ్నకు.. అటువంటిదేమీ లేదని ఆ అధికారి అన్నారు. ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసే అవసరమున్న చీతాలకు మాత్రమే రేడియో కాలర్లను తొలగిస్తున్నామని వివరించారు. -
హెల్త్ కేర్ సెంటర్‌గా భారత్
సాక్షి, అమరావతి: భారతదేశం ప్రపంచానికి హెల్త్ కేర్ సెంటర్‌గా మారిందని రాజ్యసభ సభ్యుడు వినయ్ టెండూల్కర్, డాక్టర్ సందేశ్ యాదవ్ తెలిపారు. జీ–20 సదస్సులో భాగంగా సోమ, మంగళవారాల్లో స్విట్జర్లాండ్, ఇటలీలలో హెల్త్‌కేర్‌పై జరిగిన సన్నాహక సదస్సుల్లో పల్సస్ గ్రూప్ పాలుపంచుకుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని పల్సస్ సంస్థ కార్యాలయాన్ని వినయ్ టెండూల్కర్, డాక్టర్ సందేశ్ యాదవ్ సందర్శించారు. అందరికీ ఆరోగ్యమే లక్ష్యంగా పల్సస్ గ్రూప్ కృషి చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ ఆరోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. సమావేశాల కో–కన్వెనర్ డాక్టర్ శ్రీనుబాబు గేదెల పాల్గొన్నారు. -
బయోఫ్యాక్చురాతో అరబిందో కంపెనీ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోనోక్లోనల్ యాంటీబాడీ ఉస్టెకినుమాబ్ బయోసిమిలర్ కోసం ప్రత్యేక హక్కులను తమ అనుబంధ కంపెనీ క్యూరాటెక్ బయాలాజిక్స్ పొందినట్టు అరబిందో ఫార్మా తెలిపింది. స్టెలారా (ఉస్టెకినుమాబ్) ప్రతిపాదిత బయోసిమిలర్ అయిన బీఎఫ్ఐ–751ని వాణిజ్యీకరించడానికి యూఎస్‌కు చెందిన బయోఫ్యాక్చురాతో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. పేగుల్లో వచ్చే వ్యాధులు, సొరియాసిస్, కీళ్ల వాతం వంటి రోగాల చికిత్సకు ఈ ఔషధం వాడతారు. ఒప్పందం ప్రకారం యూఎస్, ఈయూ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇతర పాక్షిక నియంత్ర, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో సహా అన్ని ప్రధాన నియంత్రిత మార్కెట్లలో బీఎఫ్ఐ–751ని వాణిజ్యీకరించడానికి క్యూరాటెక్కు ప్రత్యేక లైసెన్స్ హక్కులు ఉంటాయి. -
ప్రెగ్నెన్సీ సమయంలో ఈ విధంగా చేస్తే నార్మల్ డెలివరీ పక్కా..
-
ప్రెగ్నెన్సీ సమయంలో యాంటీ అలర్జీ మెడిసిన్ వాడితే ప్రమాదమా..?
-
ఆరోగ్యమే మహా భాగ్యం!
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం... ఈ నినాదాన్ని భారతీయులు తరతరాలుగా ఒక సందేశంగా తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ భారతీయులకు దీని అవసరం ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే 2022–23 ఆర్థిక సంవత్సరంలో తమ కుటుంబ ఆదాయాల్లో పది శాతానికిపైగా ఆరోగ్య పరిరక్షణకు భారతీయులు వ్యయం చేస్తున్నట్టుగా ఇటీవల నివేదికలో వెల్లడైంది. దీనికి సంబంధించి అత్యధికంగా ఖర్చు చేస్తున్న టాప్–5 రాష్ట్రాల్లో కేరళ, మహారాష్ట్ర, యూపీ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ నిలుస్తున్నాయి. ఇది 2017–18 స్థాయిలను బట్టి చూస్తే గణనీయంగా వైద్య, ఆరోగ్యంపై ఖర్చు పెరగడానికి ప్రధానంగా కోవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిన విపత్కర, అనిశి్చత పరిస్థితులే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్) పురోగతిపై తాజాగా ‘మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’విడుదల చేసిన డేటాలో ఆయా అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా మొత్తంగా చూస్తే.. 2022–23లో 6.67 శాతం ప్రజలు తమ ఆదాయాల్లో పదిశాతానికిపైగా (2017–18లో ఇది 4.48 శాతం) వ్యయం చేశారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా... మొత్తం కుటుంబ ఆదాయాల్లో 25 శాతానికి పైగా ఖర్చు చేస్తున్న వారు 2.3 శాతం మంది ఉన్నట్టుగా ఈ డేటా స్పష్టం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో పోలి్చతే పట్టణ ప్రాంతాల్లోని వారే తమ ఆదాయంలో పదిశాతానికి పైగా వ్యయం చేస్తున్నట్టుగా వెల్లడైంది. ఐతే కొన్ని సందర్భాల్లో...పరిస్థితులు చేయి దాటడం లేదా విపత్కర పరిస్థితులు ఎదురుకావడం వంటివి చోటుచేసుకున్నపుడు మాత్రం గ్రామాల్లోని ప్రజలు తమ కుటుంబ ఆదాయాల్లో 25 శాతానికి పైగా ఖర్చు చేయాల్సి వస్తోన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... భారతీయుల వైద్య, ఆరోగ్యానికి సంబంధించి తలసరి వ్యయం 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి (కరోనా తరువాత) అత్యధికంగా పెరిగినట్టుగా కేంద్ర మంత్రిత్వశాఖ నేషనల్ హెల్త్ అకౌంట్స్ (ఎన్హెచ్ఏ) అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్యం, కుటుంబాల ‘ఔట్ ఆఫ్ ప్యాకెట్’వైద్య, ఆరోగ్య వ్యయంపై ప్రభుత్వం ఖర్చు పెంచాక ఈ వృద్ధి నమోదైనట్టుగా ఈ అంచనాల్లోపేర్కొన్నారు. 2014–15 లలో ప్రభుత్వం చేస్తున్న తలసరిఖర్చు రూ. 1,100 కాగా, 2019–20 కల్లా అది రూ. 2,014కు పెరిగినట్టు ఇందులో తెలిపారు. -
ఆధునిక ప్రపంచంలో 'ఏఐ' ఈ పనులను చేస్తుందా? ఆ పరిణామాలెలా ఉంటాయి!
Artificial Intelligence: ప్రపంచం అభివృద్దివైపు దూసుకెళ్తోంది.. టెక్నాలజీ అంతకు మించిన వేగంతో అభివృద్ధి చెందుతోంది. ఈ రోజు మనిషి చేసే దాదాపు అన్ని పనులు యంత్రాలు చేయగలుగుతున్నాయి, చేయగలిగేలా తయారు చేస్తున్నారు. మనిషి చేయగల ఏ పనినైనా మిషన్స్ మరో 20 సంవత్సరాల్లో చేస్తాయని 1965లోనే సైంటిస్ట్ & నోబెల్ గ్రహీత 'హెర్బర్ట్ సైమన్' అన్నాడు. నేడు అదే పరిస్థితి మొదలైందా అని తలపిస్తోంది. వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, మిలటరీ రంగం వరకు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇది ఈ రంగాల్లో సానుకూల ప్రభావం చూపుతుందా? లేదా చీకటి భవిష్యత్తులోకి తీసుకెళుతుందా అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. ఆరోగ్య సంరక్షణ గతంలో వైద్య సంరక్షణలో మనుషుల పాత్ర ఎక్కువగా ఉండేది. ఏదైనా ఆపరేషన్ వంటివి చేయాలంటే ఎక్కువ మంది అవసరం పడేది. అయితే ఈ రోజుల్లో MRI స్కాన్స్, X-రేస్ వంటి వాటితో ఎక్కడ ప్రమాదముంది అని ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఇవన్నీ వైద్యరంగాన్ని మరింత సులభతరం చేశాయి. స్మార్ట్‌ఫోన్ ద్వారా డిమెన్షియా నిర్ధారణపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని యాప్స్ మనిషి రోజు వారీ కదలికలను కూడా చెప్పేస్తున్నాయి. అయితే ఒక రోగిని ఒక గది నుంచి మరో గదికి తరలించాలంటే ఖచ్చితంగా మనిషి అవసరం ఉంది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. మానవ ప్రమేయం లేకుండా అనుకున్న విజయం సాధించే అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లాగిన్ చేయవచ్చు, రోగికి సంబంధించిన రోగాన్ని తెలుసుకోవచ్చు. అయితే ఆ తరువాత దాన్ని ఒక వైద్యుడే పూర్తి చేయాలి. మనిషి ప్రమేయం లేకుండా AI మాత్రమే ఏమి సాధించలేదు. అదే సమయంలో మనిషి చేయాల్సిన పని మరింత వేగవంతం కావడానికి 'ఏఐ' చాలా ఉపయోగపడుతుంది. విద్య ఇప్పటికే అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో బోధించడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారు. అయితే ఒక ప్రొఫెసర్ చెప్పే క్లాస్ ఆటోమేషన్ చెబితే భిన్నంగా ఉంటుంది. తరగతిలో సమయాన్ని బట్టి ఏది ఎలా చెప్పాలో ఒక గురువు మాత్రమే నిర్ణయిస్తాడు. కానీ ఆటోమేషన్ తనకు ఇచ్చిన క్లాస్ పూర్తి చేసి వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కానీ అన్ని సందర్భాల్లోనూ ఇదే ఉపయోగించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మనిషి భావాన్ని, భావోద్వేగాన్ని గ్రహించదు. కావున విద్యార్థులతో పరస్పర సంబంధం కోల్పోతుంది. ఆ సంబంధం కేవలం గురువు మాత్రమే పొందగలడు. కాల్ సెంటర్లు కాల్ సెంటర్లలో మాత్రమే AI తప్పకుండా చాలా ఉపయోగకరమైనదనే చెప్పాలి. ఎందుకంటే కాల్ సెంటర్లు తరచుగా ఒత్తిడితో నిండిన వాతావరణం కలిగి ఉంటాయి. ఇది అక్కడ పనిచేసేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ స్థానంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇది వాయిస్-టోన్ గుర్తింపును ఉపయోగించి సిబ్బంది, నిర్వాహకులు తమ కస్టమర్లు, కార్మికుల భావోద్వేగ స్థితిని అంచనా వేయడానికి అనుమతిస్తుంది. (ఇదీ చదవండి: చాలా గర్వంగా ఉంది.. కాబోయే భార్య గురించి ట్వీట్ చేసిన జే కోటక్ - వైరల్ అవుతున్న పోస్ట్) వ్యవసాయం ప్రస్తుతం ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వ్యవసాయ రంగంలో కూడా ఆటోమేషన్ రాజయమేలుతున్నాయి. క్లైమేట్ ఫోర్కాస్టింగ్ అండ్ తెగుళ్లు, వ్యాధి నిరోధకతలో AI ఉపయోగపడుతున్నాయి. అంతే కాకుండా ఇందులో రోబోటిక్స్ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. నిజానికి ఏ పనైనా చేయడానికి ఉపయోగపడే ఈ టెక్నాలజీ కొన్ని సందర్భాల్లో ఉపయోగపడవు. ఏ ట్రక్కు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ట్రక్కులో ఏమి నింపాలి అనే విషయాలు అది అర్థం చేసుకున్నప్పటికీ మానవ ప్రమేయం లేకుండా ఇది మాత్రమే ఏమి చేయలేదు. ఆలా జరిగితే తప్పకుండా ప్రమాదాలు సంభవిస్తాయి. (ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, కారవ్యాన్, హెలికాఫ్టర్స్ - ఎవరీ యువ బిలీనియర్?) మిలటరీ ఇక చివరగా మిలటరీ విభాగం విషయానికి వస్తే, AIలో సైనిక పెట్టుబడులు ఇప్పటికే చాలా పెట్టినట్లు తెలుస్తోంది. ఇది యుద్ధ భవిష్యత్తును నడిపిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. కానీ సెమీ అటానమస్ డ్రోన్లు, ట్యాంకులు, జలాంతర్గాములను ప్రవేశపెట్టినప్పటికీ, సాంకేతికత ఊహించిన దాని కంటే తక్కువగా ఉపయోగపడుతుంది. యుద్ధం వంటి వాటిలో ఈ టెక్నాలజీ అంతగా ఉపయోగపడకపోవచ్చు. ధైర్యం, దయ, కరుణ వంటి లక్షణాలు కేవలం సైనికులకు మాత్రమే ఉంటాయి. AI టెక్నాలజీకి అలాటివి ఉండవు. అయితే దీనివల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. యుద్ధంలో మరణించే సైనికుల సంఖ్యను తగ్గిస్తుంది. భవిష్యత్తులో మనిషి ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ముందుకు వెళతాడు అనేది సమ్మతించాల్సిన విషయమే. -
డిశ్చార్జికి.. రీచార్జికి మధ్య ‘ట్రాన్సిషనల్ కేర్’.. కొత్త వైద్యసేవలకు డిమాండ్
నాగేందర్ (55) దిల్సుఖ్నగర్ నివాసి. తీవ్రమైన నరాల వ్యాధికి గురై ఖైరతాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. శస్త్రచికిత్స తర్వాత డిశ్చార్జయి ఇంటికి వెళ్లారు. కానీ నాలుగైదు రోజుల్లోనే సమస్యలు తిరగబెట్టి ఆస్పత్రి పాలయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేవల లోపం దీనికి కారణమని వైద్యులు నిర్ధారించారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే, వైద్యుల సూచనలను కచ్చితంగా అమలు చేస్తే.. ఈ పరిస్థితి వచ్చేదికాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినప్పటి నుంచి పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ‘ట్రాన్సిషనల్ కేర్’అవసరమని గుర్తించారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థ మన దేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యం పాలైన కొందరు రోగులు చికిత్స పొంది, డిశ్చార్జి అయ్యాక తిరిగి ఆస్పత్రుల పాలవుతున్నారు. వైద్యుల సూచనలను సరిగా పాటించలేకనో, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనో.. అనారోగ్య సమస్యను మొదటికి తెచ్చుకుంటున్నారు. చికిత్స తర్వాత జాగ్రత్తలు లోపిస్తే అత్యంత అధునాతనమైన చికిత్స సైతం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ట్రాన్సిషనల్ కేర్ సేవలు పుట్టుకొచ్చాయి. ఆస్పత్రిలో చికిత్స ముగిసినప్పటి నుంచి పూర్తిస్థాయిలో సాధారణ జీవితాన్ని మొదలుపెట్టేవరకు మధ్యలో అవసరమైన సేవలే ట్రాన్సిషనల్ కేర్. కొందరికి చికిత్స తర్వాత నర్సింగ్ కేర్, ఫిజియోథెరపీ వంటివి అవసరం. వ్యాధి సమస్యల కారణంగా ఎదుర్కొనే మానసిక క్షోభను తగ్గించేందుకు మానసిక పర్యవేక్షణ కావాలి. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్, న్యూరోసైన్స్, కార్డియాలజీకి సంబంధించిన సర్జరీల తర్వాత చికిత్సానంతర సమస్యలను తగ్గించడానికి, పూర్తిగా రికవరీ కావడానికి ట్రాన్సిషనల్ కేర్ మంచి పరిష్కారమని నిపుణులు చెప్తున్నారు. ఎలాంటి వారికి? ఎప్పుడు? ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే ప్రతి లక్ష మంది బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో 120కిపైగా మళ్లీ స్ట్రోక్ బారిన పడే చాన్స్ ఉందని అంచనా. వారు డిశ్చార్జి తర్వాతా ఆస్పత్రులకు, ఇంటికి తిరగాల్సి ఉంటుంది. ఈ ప్రయాణ, ఆస్పత్రి ఖర్చుల్ని తగ్గించుకోవడం, జాగ్రత్తల కోసం ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లు ఉపయుక్తమని నిపుణులు చెప్తున్నారు. న్యూరో సర్జరీ, వెన్నెముక గాయాలు, హిప్, మోకాలి మారి్పడి వంటివాటిల్లో చికిత్సానంతరం ఇంటికి వెళ్లేందుకు పట్టే రెండు–మూడు వారాల వ్యవధిలో ప్రత్యేక ట్రాన్సిషనల్ కేర్ అవసరమని వివరిస్తున్నారు. డిశ్చార్జ్ అనంతరం కొందరికి ఫిజియోథెరపీ, మానసిక కౌన్సెలింగ్ వంటివి సుదీర్ఘకాలం చేయాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోగిని ఇంటికి తీసుకెళ్లడానికి బదులుగా కేర్ సెంటర్‌ను ఎంచుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. అల్జీమర్స్ సమస్య ఉన్నవారికీ ట్రాన్సిషనల్ కేర్ అవసరమని అంటున్నారు. ఇక స్వాలో, స్పీచ్ థెరపిస్ట్, మసు్క్యలోస్కెలెటల్ ఫిజియోథెరపిస్ట్ సేవలు, ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి రావడం, ట్యూబుల ద్వారా ఆహారం అందించాల్సి రావడం, కదలికలకు తోడ్పడే పరికరాలు, మెషీన్లు, కొన్ని రకాల ప్రత్యేక బెడ్లు అవసరం ఉన్నప్పుడు ఈ సేవలను ఎంచుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. కేర్ సెంటర్లు ఏం చేస్తాయి? ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లలో వైద్యులు, నర్సులు, ఫిజియోథెరపిస్ట్‌లు, డైటీíÙయన్లు, సైకాలజిస్టులు, ఆక్యుపేషనల్, స్పీచ్, రెస్పిరేటరీ థెరపిస్ట్‌లు, న్యూరో, కార్డియాక్ ఫిజియో థెరపిస్టులు, సైకోథెరపిస్టులు, రోగి పూర్తిగా కోలుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఆధునిక సౌకర్యాలు, అనుభవజు్ఞలైన, మల్టీడిసిప్లినరీ రీహ్యాబ్ కేర్ టీమ్ రోగులను పూర్వస్థితికి తీసుకురావడానికి సాయపడుతుంది. రోగి డిశ్చార్జి సమ్మరీని పరిశీలించి, వైద్యులతో మాట్లాడి అవగాహన ఏర్పరుచుకుని, అవసరమైన సేవలను అందిస్తారు. రోగుల పొజిషన్లను మార్చే బెడ్‌సైడ్ అసిస్టెంట్లు, ఆహారాన్ని అందించే నర్సులు కేర్ సెంటర్లో అందుబాటులో ఉంటారు. ఇంటర్నల్ మెడిసిన్‌కు చెందిన వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. వ్యయ ప్రయాసలు తగ్గించే క్రమంలో.. దేశంలో 65ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. వారికి తరచూ ఆరోగ్య సమస్యలు రావడం, ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం ఎక్కువ. కొందరి విషయంలో ఇంట్లోనే ఉంటే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలోనే ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ల అవసరం ఏర్పడింది. సర్జరీ/ ప్రధాన చికిత్స వంటివి జరిగాక.. పూర్తిగా కోలుకోవడానికి ఆస్పత్రిలోనే ఉండటం తీవ్ర వ్యయ భారంతో కూడుకున్నది. అంతేగాకుండా ఇతర రోగులకు చికిత్స అందడంలో ఇబ్బందులు రావచ్చు. అలాంటప్పుడు ఈ సపోర్టివ్ కేర్ సేవలు అందిస్తుంది. – డాక్టర్ రామ్ పాపారావు, చైర్మన్, ఉచ్ఛా్వస్ ట్రాన్సిషనల్ కేర్ చదవండి: డాక్టర్లూ పదండి పల్లెకు పోదాం! -
ఇన్సూరెన్స్‌దేఖో చేతికి వేరక్
న్యూఢిల్లీ: దేశీ బీమారంగ స్టార్టప్ ఇన్సూరెన్స్‌దేఖో తాజాగా ముంబై సంస్థ వేరక్ను కొనుగోలు చేసింది. ఎస్ఎంఈ ఇన్సూరెన్స్ పంపిణీ సంస్థ వేరక్ను సొంతం చేసుకున్నట్లు ఇన్సూరెన్స్‌దేఖో వ్యవస్థాపకుడు, సీఈవో అంకిత్ అగర్వాల్ వెల్లడించారు. వేరక్ ప్రారంభమైనప్పటినుంచి పటిష్టంగా ఎదుగుతున్నట్లు, కొత్త విభాగం మైక్రోబిజినెస్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో విస్తరించినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. తద్వారా తొలిసారి చిన్న వర్తకులను బీమా పరిధిలోకి తీసుకువస్తున్నట్లు తెలియజేశారు. ప్రతీ నెలా ప్రీమియంలో 30 శాతం నెలవారీ వృద్ధిని సాధిస్తున్నట్లు వెల్లడించారు. -
గ్రామీణుల ఆరోగ్య సంరక్షణకు టాస్క్‌ఫోర్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణ ద్వారా ఆరోగ్య రంగంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సాధన కోసం ప్రతి గ్రామంలో ఎస్డీజీ టాస్క్‌ఫోర్స్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ స్థాయిలో కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్– ఎంఎల్‌హెచ్‌పీ) నాయకత్వంలో ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ వర్కర్, స్కూలు హెల్త్ అంబాసిడర్, గ్రామ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సభ్యులుగా ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా గర్బిణులు, శిశువులు, మహిళలు, పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారణతో పాటు జీవనశైలి జబ్బుల నివారణ, చికిత్సలపై ఈ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుంది. తద్వారా ఆరోగ్య రంగంలో సుస్థిర అభివృద్ధి లక్ష్లాలను సాధించాలని ప్రభుత్వం నిర్దేశించింది. గ్రామీణ ప్రజలకు గ్రామాల్లోనే వైద్య సేవలందించాలనే ఉదాత్తమైన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసింది. వీటిలో కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్కూల్ హెల్త్ అంబాసిడర్, స్వయం సహాయక సంఘాల సమన్వయంతో గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి గ్రామంలో వీరితో ఎస్డీజీ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విధులను ప్రభుత్వం నిర్దేశించింది. ఈమేరకు క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేయాలని ఆయా శాఖలకు సీఎస్ సూచించారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కౌన్సిలింగ్, రక్తహీనత పర్యవేక్షణ ఐఎఫ్ఏ ట్యాబెలెట్లు పంపిణీ, నిల్వల పర్యవేక్షణను కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ సమన్వయంతో అంగన్వాడీ వర్కర్లు నిర్వహించేలా మహిళా శిశు సంక్షేమ శాఖ తగిన ఆదేశాలు జారీ చేయాలి. అలాగే ఎస్డీజీల సాధనకు పాఠశాల విద్యా శాఖ, సెర్ప్ తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. ఎస్డీజీ టాస్క్‌ఫోర్స్ విధులు.. ♦ రక్తహీనత పర్యవేక్షణ, ప్రసూతి మహిళల ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం, జీవనశైలి జబ్బుల నిర్ధారణ, నివారణ, చికిత్స తదితర ఆరోగ్య కార్యకలాపాలపై ఏఎన్ఎం, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ఎంఎల్‌హెచ్‌పీ మార్గనిర్దేశం చేస్తారు ♦పాఠశాలల్లోని పిల్లల ఆరోగ్య వివరాలను పాఠశాల విద్యా శాఖ ఎంఎల్‌హెచ్‌పీకి అందించాలి. కౌమార దశలో ఉన్న బాలికలు, బరువు తక్కువగా ఉన్న పిల్లల్లో రక్తహీనతను స్కూల్ అంబాసిడర్ పర్యవేక్షించడంతో పాటు వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లతో సమన్వయం చేసుకోవాలి. రక్తహీనత గల కౌమార దశలోని బాలికలకు రోజూ ఐఎఫ్ఏ మాత్రలను పంపిణీ చేయాలి. ఇతర పిల్లలకు పోషకాహారం అందించాలి. ♦ యుక్త వయస్సులోని బాలికలకు శానిటరీ నాప్కిన్ సరఫరా వివరాలు, బరువు తక్కువగా ఉన్న పిల్లలకు మధ్యాహ్న భోజనం వివరాలను ఎంఎల్‌హెచ్‌పీకి పాఠశాల విద్యా శాఖ అందించాలి. ఫ్యామిలీ ఫిజీషియన్ ద్వారా పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ఇందుకు స్కూల్ అంబాసిడర్‌తో ఎంఎల్‌హెచ్‌పీ సమన్వయం చేసుకోవాలి. ♦ అంగన్వాడీ కేంద్రాల్లో సేవల సామరŠాధ్యన్ని పెంచడంతోపాటు గ్రామాల్లో రక్తహీనత పర్యవేక్షణ, గర్భిణులకు ప్రసవానికి ముందు, ప్రసవానంతర సంరక్షణ, నులిపురుగుల నిర్మూలన మందులు పంపిణీ, ప్లిలల ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం అందించడం వంటి సేవలు సక్రమంగా అందేలా ఎంఎల్‌హెచ్‌పీ సమన్వయం చేసుకోవాలి. ♦ సెర్ప్ గ్రామ ఆర్గనైజేషన్ సమావేశాల్లో ఎంఎల్‌హెచ్‌పీ భాగస్వామిగా ఉంటూ జీవనశైలి జబ్బుల నివారణ, పరీక్షలు, చికిత్సలు, ఇతర అంశాలపై అవగాహన కల్పించాలి. గర్భిణిలలో రక్తహీనతకు కారణాలు, తల్లి, పిల్లలపై చూపే దుష్ప్రభావాలు వివరించి, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. ♦ ప్రసవానికి ముందు యాంటినేటల్ పరీక్షల సమయంలో యుఎస్‌జీ స్కానింగ్ ప్రాముఖ్యత, ఇమ్యునైజేషన్ ద్వారా రోగ నిరోధకతను పెంచడం ద్వారా వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలి. ♦ బాల్య వివాహాల నివారణ ద్వారా యుక్త వయస్సు గర్భాలను నిరోధించాలి. ♦ కుటుంబ నియంత్రణ ప్రణాళిక అమలు చేయాలి ♦ ప్రతి శుక్రవారం డ్రై డే పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలి ♦ క్షేత్రస్థాయిలో సిబ్బంది సమన్వయంతో సేవలందించేలా చూడాల్సిన బాధ్యత పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్‌కు ఉంటుంది. -
బయో ఆసియా విజేతలుగా ఐదు స్టార్టప్‌లు..
సాక్షి, హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌సైన్సెస్, ఆరోగ్య రక్షణ సదస్సు బయో ఆసియా–2023లో రెండో రోజు జరిగిన చర్చా గోష్టిలో అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రతినిధులు, కార్పొరేషన్లు, పేరొందిన ఆరోగ్య రక్షణ రంగ నిపుణులు, విద్యాసంస్థల అధినేతలు, స్టార్టప్‌ల ప్రతినిధులు ప్రపంచ ఆరోగ్య రక్షణ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. బయో ఆసియా సదస్సులో భాగంగా రెండో రోజు ఐదు కీలక అంశాలపై చర్చా గోష్టులు జరగ్గా ఆపిల్ హెల్త్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సుంబుల్ దేశాయ్, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి మధ్య ఫైర్‌సైడ్ చాట్ జరిగింది. 50కి పైగా దేశాల నుంచి రెండువేల మందికిపైగా ప్రతినిధులు హాజరు కాగా, రెండు రోజుల్లో రెండు వేల ముఖాముఖి వాణిజ్య సమావేశాలు జరిగాయి. 76 స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను ప్రదర్శించగా, అత్యంత వినూత్న ఆవిష్కరణలు ప్రదర్శించిన ఐదు స్టార్టప్‌లను విజేతలుగా ప్రకటించారు. విజేతలైన ఎక్సోబోట్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, లాంబ్డాజెన్ థెరాప్యుటిక్స్, ప్రతిభ హెల్త్‌కాన్, రాంజా జీనోసెన్సర్, సత్య ఆర్ఎక్స్ ఫార్మా ఇన్నోవేషన్స్ స్టార్టప్‌ల ప్రతినిధులను మంత్రి కేటీఆర్ సత్కరించారు. ఈ సదస్సు ఆదివారం ముగియనుంది. -
వైద్యంలో దేశానికే దిక్సూచి..
సాక్షి, హైదరాబాద్: హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్ రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున కృషి చేస్తోందని, దేశానికే దిక్సూచిగా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్ వేదికగా రెండు రోజులపాటు జరిగిన బయో ఆసియా సదస్సు ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. దేశంలో హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రస్తుతం 80 బిలియ¯న్ డాలర్లుగా ఉన్న తెలంగాణ భాగస్వామ్యం... 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రా, ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే మూడు ‘ఐ’లు భారత్‌కు నాలుగో కన్నుగా ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాయన్నారు. సాంకేతికతను ఉపయోగించి వైద్య పరికరాలు, లైఫ్ సైన్సెస్‌లో నూతన ఆవిష్కరణలను తీసుకురాగల అర్హతలు, ప్రపంచస్థాయి సౌకర్యాలు, వనరులు భారత్‌లో ఉన్నాయని ఆయన వివరించారు. భౌగోళిక, సామాజిక, ఆర్థిక అసమానతల సరిహద్దులకు అతీతంగా దేశం ఎదుగుతుందని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఇన్నోవేషన్స్ తీసుకురావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బయో ఆసియా సదస్సుకు 50 దేశాల నుంచి 215 మంది ప్రతినిధులు హాజరయ్యారని, 175 స్టార్టప్ కంపెనీలు వచ్చాయని వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న స్టార్టప్స్ కంపెనీలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, బయో ఆసియా సీఈవో శక్తి నాగప్పన్, రిపబ్లిక్ ఆఫ్ లిథువేనియా వైస్ మినిస్టర్ కరోలిస్, ఈస్టోనియా రాయభారి కత్రిన్ కియి, ఒడిశా మంత్రి అశోక్‌చంద్ర పాండే, మాజీ ఐఏఎస్ బీపీ ఆచార్య, రెడ్డి ల్యాబ్స్ సతీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.150 కోట్లతో కామినేని ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడంటే?
వైద్య సేవల రంగంలో ఉన్న కామినేని హాస్పిటల్స్ తాజాగా కర్నూలులో నూతన ఆసుపత్రిని ప్రారంభించింది. జెమ్కేర్ కామినేని హాస్పిటల్స్ పేరుతో రూ.150 కోట్లతో 150 పడకలతో ఇది ఏర్పాటైంది. ఈ ఏడాదే రూ.75 కోట్లతో 75 పడకల సామర్థ్యంతో క్యాన్సర్ చికిత్స కేంద్రం సైతం స్థాపించనున్నారు. మెరుగైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో వైద్య సేవలను ఈ కేంద్రం తదుపరి స్థాయికి మారుస్తుందని సంస్థ తెలిపింది. అందుబాటు ధరలో ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించడం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పినట్టు కామినేని హాస్పిటల్స్ వివరించింది. కార్డియాక్, న్యూరో, అనస్తీషియా, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, మెడికల్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఈఎన్టీ, జనరల్, మినిమల్ యాక్సెస్ సర్జరీ, ప్లాస్టిక్/కాస్మెటిక్ సర్జరీ, రెనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, యూరాలజీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్, డయాబెటాలజీ, ఎండోక్రినాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ, రుమటాలజీ వంటి విభాగాల్లో నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని కామినేని ఆస్పత్రి యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు. -
Prem Sagar Reddy: అగ్రరాజ్యంలో ఆస్పత్రి కట్టిన రైతు బిడ్డ
‘అప్పట్లో.. అనగనగా ఓ ఊరు.. రాత్రయితే కానరాని వెలుతురు.. కిరోసిన్ బుడ్డి కిందే చదువు.. అయినా ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే.. సాధారణ రైతు బిడ్డగా జన్మించి.. అగ్రరాజ్యానికి హృదయ స్పందనై నిలిచారు.. జన్మ భూమిని.. పల్లె ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేదు.. సప్త సముద్రాల అవలి నుంచే సొంతూరి దాహం తీరుస్తూ.. విద్యతోనే ఉన్నతని నిరూపిస్తూ.. గ్రామంలో బాటలు వేస్తూ.. ప్రజలందరితో ఎంతమంచి మా ‘ప్రేమ్’యో అంటూ కీర్తి పొందారు. ఆయన మరెవరో కాదు.. డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి..’ సాక్షి,అమరావతి: అమెరికా.. ప్రపంచంలోనే అగ్రరాజ్యం. అక్కడ అడుగు పెట్టాలంటేనే ఎంతో కష్టం. కానీ, ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన యువకుడు మూడు దశాబ్దాల కిందటే అమెరికాలో ఆస్పత్రి కట్టాడు. అప్పటి వరకు ఏ తెలుగువాడికి కూడా ఇంత సాహసం చేయలేదు. అనతి కాలంలోనే ప్రైమ్ హెల్త్‌కేర్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అప్పటి నుంచి ప్రేమ్ అమెరికాకు హృదయ స్పందనగా మారిపోయారు. డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి విద్యుత్ సౌకర్యం కూడా లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టి కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకుని వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాళెం అనే ఒక చిన్న గ్రామంలో 1949లో జూన్ 26న ననమాల సుందరామిరెడ్డి, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. నలుగురు సంతానంలో ప్రేమ్ పెద్దవారు. గ్రామంలోనే హైసూ్కల్ వరకు చదువుకున్నారు. విజయవాడలో పీయూసీ, తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో చేరి 1973లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వెల్లూరులో హౌస్ సర్జన్ అయ్యాక అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని డౌన్ స్టేట్ మెడికల్ సెంటర్లో ఇంటర్నల్ మెడిసిన్‌లో రెసిడెన్సీతో పాటు కార్డియాలజీలో ఫెలోషిప్ పూర్తి చేశారు. 1981లో సదరన్ కాలిఫోర్నియాలో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. అయిదు వేలకుపైగా కార్డియాక్ ప్రొసీజర్స్ చేసి సమర్థుడైన వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. 1985లో కాలిఫోరి్నయాలోనే ‘ప్రైమ్ కేర్ మెడికల్ గ్రూప్స్’ పేరుతో మల్టీస్పెషాలిటీ మెడికల్ గ్రూప్ ప్రారంభించారు. 1990లో ప్రేమ్ హెల్త్‌కేర్ సర్వీసెస్ ఇంటర్నేషన్ల్ సంస్థను స్థాపించి వైద్య అవసరాలకు అనుగుణంగా విస్తరించారు. ఇందులో భాగంగానే చినోవ్యాలీలో 126 పడకల చినోవ్యాలి మెడికల్ సెంటర్‌ను, కాలిఫోర్నియాలో సొంతంగా 150 పడకల అక్యూట్ కేర్ హాస్పిటల్ని నిర్మించారు. ఇప్పుడు ప్రైమ్ హెల్త్‌కేర్ ఆధ్వర్యంలో అమెరికాలోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. 45 వేల మందికిపైగా యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. యూఎస్‌లో అగ్ర వైద్య వ్యవస్థల్లో ఏడాదికి 5 బిలియన్ల డాలర్ల టర్నోవర్‌తో టాప్ 5 స్థానంలో ప్రైమ్ కేర్ గుర్తింపు పొందింది. చారిటబుల్ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. అమెరికాలోని అనేక స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు, స్థానిక ప్రభుత్వం నుంచి అనేక ఉత్తమ సేవా అవార్డులు అందుకున్నారు. సాహితీ సేవలోనూ.. సాహిత్యం అంటే ప్రేమ్‌రెడ్డికి చాలా ఇష్టం. దువ్వూరి రామిరెడ్డి రచించిన గులాబీ తోట, పండ్లతోట అనే ముద్రణకు నోచుకోని రెండు కావ్యాలను సొంతంగా ముద్రించారు. కడపటి వీడ్కోలు కావ్యాన్ని ఇంగ్లిష్‌లో అనువాదం కూడా చేశారు. ఆయని ఇతర రచనలను ద లాస్ట్ ఫేర్వెల్ అండ్ అదర్ పోయెమ్స్ పేరుతో పెద్ద సంపుటిగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇదీ కుటుంబం.. ప్రేమ్ ఎస్.రెడ్డి తనతోపాటు మెడిసిన్‌ను అభ్యసించిన అమ్మాయినే (శాంతిరెడ్డి) వివాహం చేసుకుని జంటగా అమెరికాలో అడుపెట్టారు. ప్రేమ్‌రెడ్డికి ముగ్గురు సంతానం. పెద్దమ్మాయి కవితారెడ్డి అమెరికాలోని పిడియాట్రిక్స్ పూర్తి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. రెండో అబ్బాయి అశోక్‌రెడ్డి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. మూడో సంతానం సునీతారెడ్డి. నేడు ప్రేమ్‌కు పౌర సన్మానం ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు నెల్లూరులో ప్రేమ్‌సాగర్‌రెడ్డికి పౌర సన్మానం చేయనున్నారు. 15 ఏళ్ల తర్వాత సొంత గడ్డకు వస్తున్న నేపథ్యంలో సోమవారం గొలగమూడి రోడ్డులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు వేలాది మంది మధ్య ఘనంగా సత్కరించనున్నారు. సొంతూరిని మర్చిపోలేదు ప్రేమ్ ఎస్.రెడ్డి ఎంత ఎదిగినా.. వచ్చిన దారిని మర్చిపోలేదు. అందుకే తన సొంత గ్రామంలో హైసూ్కల్‌ను కట్టించడంతో పాటు రోడ్లను అభివృద్ధి చేస్తూ ప్రేమను చాటుకుంటున్నారు. దాదాపు 50 చుట్టుపక్కల గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లోని గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో రూ.కోట్ల విలువైన ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లను ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి తన బాధ్యతను చాటుకున్నారు. సంపాదించినదంతా సమాజానికే.. ‘నేనెప్పుడూ పేరు కోసమో, ప్రచారం కోసమో పనిచేయలేదు... సంపాదించినదంతా సమాజానిదే.. అందుకే సమాజసేవకే దానిని ఉపయోగించాలి. ఇక్కడ సంపాదించిన దానిని ఇక్కడే సమాజసేవకు ఉపయోగిస్తున్నాను. జన్మనిచ్చినందుకు మాతృభూమికి కూడా సేవ చేస్తున్నాను‘.. అంటారు డాక్టర్ ప్రేమ సాగర్‌రెడ్డి. -
హెల్త్ కేర్ రంగానికి ‘జీఎస్టీ’ ఊరట ఇవ్వండి
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) భారం తగ్గించాలని హెల్త్‌కేర్ ఇండస్ట్రీ వేదిక– నట్హెల్త్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అలాగే చిన్న నగరాలు, పట్టణాలలో ప్రజలకు మెరుగైన బీమా కవరేజీని కల్పించే చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు 2023–24 బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని నట్హెల్త్ ప్రెసిడెంట్ శ్రావణ్ సుబ్రహ్మణ్యం కోరారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రీ–బడ్జెట్ నివేదిక పత్రంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఇతర రంగాల తరహాలో ఆరోగ్య సంరక్షణ రంగం జీఎస్టీ పరివర్తన ప్రయోజనాలను పొందలేకపోయింది. ►వాస్తవానికి, జీఎస్టీ ముందు కాలంతో పోలిస్తే, అనంతర కాలంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో పన్నులు పెరిగాయి. ►పూర్తి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లను క్లెయిమ్ చేసుకునే అవకాశంతో అన్ని ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ( ప్రభుత్వ, ప్రైవేట్) అవుట్‌పుట్ హెల్త్‌కేర్ సేవలపై 5 శాతం మెరిట్ రేటును విధించాలి. అలాగే అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల కోసం అవుట్‌పుట్ సేవలపై 5 శాతం జీఎస్టీ రేటును దీనిపై ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ఐచ్ఛిక డ్యూయల్ రేట్ స్ట్రక్చర్‌ను విధించవచ్చు. ►ప్రస్తుతం ఆరోగ్య సేవలపై జీఎస్టీ మినహాయింపు ఉంది. అయితే ఈ సేవలపై 5 మెరిట్ రేటును విధించవచ్చు. దీనివల్ల హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్లు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి వీలుకలుగుతుంది. తద్వారా వారి ఎంబెడెడ్ (ఉత్పత్తి లేదా సేవ మూల ధర ను పెంచే పన్ను) పన్నుల భారం తగ్గుతుంది. ►ప్రొవైడర్లు, ప్రొక్యూర్మెంట్ సంస్థలకు వర్కింగ్ క్యాపిటల్ బకాయిలనూ క్లియర్ చేయాలి. ►ప్రజలు నాణ్యమైన, క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ సేవలకు తగిన రీతిన పొందడానికి మౌలిక సదుపాయాల సామర్థ్యాల పెంపు, విస్తరణ అవసర. టైర్–1, టైర్–2 నగరాల్లో ఆసుపత్రులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అవసరం. ఇది హెల్త్‌కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ►ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పూర్తి స్థాయిలో విస్తరణ మరో కీలక అంశం. ►ఇన్సూరెన్స్, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కింద ప్రొవైడర్లు అలాగే సప్లయర్ల కోసం అన్ని పేమెంట్ బ్యాక్‌లాగ్‌లు క్లియర్ చేయాలి. అది హెల్త్‌కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పురోగతి, లభ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ►ఆరోగ్య రంగానికి బడ్జెటరీ కేటాయింపులు భారీగా పెరగాలి. -
చంపుతున్న చలి.. గుండె జబ్బులున్నవారు వాకింగ్ చేస్తున్నారా!
తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దినదినం రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వణికించే చలి కారణంగా వ్యాధులు చుట్టుముట్టే అవకాశముంది. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం, గుండె జబ్బులున్నవారికి ప్రమాదం పొంచి ఉంది. ఉదయం, రాత్రివేళలో బయటకు వెళ్తే చర్మం పొడి బారి బిగుసుగా మారనుంది. కాళ్ల మడిమలు, పాదాలు పగులుతాయి. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి అధిగవిుంచవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. చర్మ సంరక్షణ ఇలా.. చలికాలంలో శరీరానికి మాయిశ్చరైజర్లు తప్పనిసరి. క్రీమ్ టేస్ట్ మాయిశ్చరైజర్లను ఉపయోగిస్తే చర్మం మృదువుగా ఉంటుంది. చలికి పెదాలు పగిలి రక్తం కారకుండా వ్యాజిలిన్, లిప్‌బామ్ రాసుకోవాలి. చర్మం తెల్లగా పొడిబారకుండా ఉండేందుకు గ్లిజరిన్ సబ్బులు వాడాలి. స్నానానికి ముందు ఆలీవ్ ఆయిల్, కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకొని గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఖర్చు తగ్గించుకోవాలనుకునేవారు ఇంట్లోనే అందుబాటులో ఉండే శనగపిండితో స్నానం చేయాలి. వివిధ పనుల కోసం బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా ఉన్ని దస్తులు ధరించాలి. బైక్‌పై వెళ్లేవారు మంకీ క్యాప్, కాళ్లకు బూట్లు, చేతులకు గ్లౌస్లు వాడాలి. ఎండకు వెళ్లాలనుకుంటే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. రాత్రివేళ నిద్రించే ముందు మోచేతులు, మోకాళ్లు పగలకుండా నూనె, లేపనం రాసుకుంటే మంచిది. థైరాయిడ్ తరహా సమస్యలున్నవారు పైజాగ్రత్తలతో పాటు ఇంట్లో సాక్స్‌లు ధరించడం మేలు. దగ్గు, జలుబు, ఫ్లూ, జ్వరం ఉంటే ఇంటి వ ద్దనే విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. మధుమేహం, గుండెజబ్బులున్నవారు శరీరంపై గీతలు పడకుండా జాగ్రత్తపడాలి. చదవండి: Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే.. పాదాలు పగిలితే.. చలికాలంలో చాలామందికి పాదాలు పగులుతాయి. ఉప్పునీరు కలిసిన గోరు వెచ్చని నీటిలో పది నిమిషాల పాటు పాదాలు ఉంచాలి. ఆ తర్వాత సబ్బుతో శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డతో తుడవాలి. పగిలిన చోట మాయిశ్చరైజర్ రాయాలి. విటమిన్–ఈ క్రీమ్ రాస్తే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సలహాలు పాటించాలి. అస్తమా ఉంటే.. చలికాలంలో అస్తమా ఉన్నవారు నిత్యం వాడే మందులను అందుబాటులో ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి పనులకు దూరంగా ఉండాలి. గాలికి తిరగవద్దు. డాక్టర్ సలహా మేరకు మందులు, ఇన్హేలర్, నెబ్యులైజర్ లాంటివి వాడాలి. గుండె జబ్బులుంటే.. చలికాలంలో గుండెజబ్బులున్న వారు, గుండె ఆపరేషన్ చేయించుకున్నవారు వాకింగ్ చేయవద్దు. చలిలో ఎక్కువగా తిరిగితే రక్త నాళాలు సంకోచించి గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. బీపీ, షుగర్ ఉన్న వారు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఆహారంలో మార్పులు అవసరం చలికాలంలో సమతుల ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా జామ, దానిమ్మ, బొప్పాయి, సంత్ర, అరటిపండ్లు ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ ‘సీ’ ఉన్న పండ్లు జలుబు, ఫ్లూ వంటి జబ్బుల నుంచి కాపాడుతాయి. మరీ పచ్చిగా ఉన్నవి, బాగా పండినవి కాకుండా మధ్యస్తంగా ఉన్న పండ్లు ఎంపిక చేసుకోవాలి. చలికాలంలో సహజంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు, వంటివి త్వరగా వస్తాయి. ఆహారం అరుగుదల తక్కువగా ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. మనిషి శరీరానికి యాంటీ యాసిడ్స్ ఎంతో అవసరం. గుడ్లు, చేపల్లో ఇవి అధికంగా లభిస్తాయి. జింక్ ఉండే బాదం వంటి ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. రోగకారక క్రిములతో పోరాడే పెరుగును తీసుకోవడం ఉత్తమం. వేడిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. మార్కెట్లో లభిస్తున్న నల్లద్రాక్ష చర్మ సంరక్షణకు దోహదం చేస్తుంది. వీటిలో విటమిన్ ఏ, బీ1, బీ2 ఉంటాయి. పిల్లల్లో కడుపునొప్పికి నివారణిగా పని చేస్తాయి. జాగ్రత్తలు తప్పనిసరి చలికాలంలో శరీరానికి వేడిచేసే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అల్కహాలి క్ పానీయాలను స్వీకరించొద్దు. పొడి దుస్తులను ధరించాలి. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా చూడాలి. సూర్యోదయం తర్వాతే జాగింగ్, వ్యా యామం చేయాలి. ఏదైన ఆరోగ్య సమ స్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. – రత్నాకర్, జనరల్ ఫిజీషియన్, నిర్మల్ జిల్లా ఆస్పత్రి -
మానసిక ఆరోగ్యంపై పెరిగిన దృష్టి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో రోజువారీ ప్రాధాన్యాలు, లక్ష్యాలు మారిపోతున్నాయి. శారీరకంగా ధృఢంగా, చురుకుగా ఉండడం (ఫిజికల్ ఫిట్నెస్) కంటే కూడా మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించడం పెరిగింది. సగటు మనిషి జీవనంలోని పలు అంశాలపై మానసిక ఆరోగ్యం చూపే ప్రభావంపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. గత రెండున్నరేళ్ల కరోనా మహమ్మారి ప్రభావిత కాలంలో చోటుచేసుకున్న అనేక మార్పులతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం వంటి వాటికి పెరిగిన ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. మానసిక ప్రశాంతత కొరవడిన వ్యక్తులపై వివిధ సమస్యలు ఏ విధంగా ప్రభావితం చూపుతున్నాయనేది క్రమంగా ప్రపంచానికి తెలిసొస్తోంది. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే అది నేర్చుకునే గుణం, పనిలో మెరుగైన ఉత్పాదకత, ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలు పెంపొందించుకోవడంపై ప్రభావం చూపుతున్నట్టు వివిధ పరిశోధనలు, అధ్యయనాల్లో గుర్తించారు. ఈ పరిశీలనల్లో భాగంగా కోవిడ్ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా జాబ్‌మార్కెట్ ఒడిదొడుకుల్లో ఉద్యోగులు మానసికస్థితి ఒత్తిళ్లకు గురవుతున్నట్లు గుర్తించారు. 2022 జూన్‌లో డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసిన నివేదికలో ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది ఏదో ఒక రూపంలో మానసికంగా ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లు వెల్లడైంది. సోమవారం ‘వరల్డ్ మెంటల్ హెల్త్‌డే’ సందర్భంగా ఆయా అంశాలు, విషయాలు చర్చనీయాంశమయ్యాయి. మానసిక ఆరోగ్య పరిరక్షణ అనేది ముఖ్యం.. ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య పరిరక్షణ చాలా ముఖ్యం. గత రెండున్నరేళ్ల కరోనా కాలంలో భవిష్యత్‌పై అనిశ్చితితో అధిక శాతం మంది జీవన ప్రమాణాలు దిగజారడం, తగిన ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడంతో చాలా కుటుంబాల్లో మానసిక ఒత్తిళ్లు పెరిగాయి. దాంతో మానసిక ప్రశాంత సాధనతోపాటు మానసిక ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఏర్పడింది. డబ్ల్యూహెచ్‌వో కూడా ‘మెంటల్ వెల్నెస్’పై దృష్టి పెట్టాలని చెబుతోంది. అయితే ప్రభుత్వాలు మన దగ్గర ఇప్పటిదాకా ‘మెంటల్ హెల్త్’పై ప్రత్యేక దృష్టి పెట్టలేదు. కోవిడ్ మహమ్మారి తీసుకొచ్చిన పరిస్థితుల ప్రభావంతో ఈ దృష్టిలో మార్పు వచ్చింది. ఇన్ని రోజులుగా పట్టించుకోని ముఖ్యమైన అంశంపై తప్పక దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. శారీరకంగా ఎదురయ్యే అనేక సమస్యలకు మానసిక అనారోగ్యం కారణమవుతోంది. వాస్తవాలను అంగీకరించే స్థితికి చేరుకుంటే మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. మానసిక ఆరోగ్యంతోనే ఉత్పాదకత పెరగడం, మెరుగైన కుటుంబ సంబంధాలతో శారీరక ఆరోగ్యం కూడా మెరుగౌతుంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
భారత ఆరోగ్యరంగంపై బిల్‌గేట్స్ ప్రశంసలు
న్యూఢిల్లీ: కాలానికి అనుగుణంగా భారత ఆరోగ్యరంగం కొత్త పుంతలు తొక్కుతోందని మైకోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ శ్లాఘించారు. దేశీయంగా ఆరోగ్య, డిజిటల్ రంగాల దినదినాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారంటూ ప్రధాని మోదీని పొగిడారు. దేశాభివృద్ధిలో ఆరోగ్య, డిజిటల్ రంగాల ముఖ్యపాత్రను గ్రహించి వాటికి సముచిత స్థానం ఇవ్వడం అద్భుతమన్నారు. As India celebrates its 75th Independence Day, I congratulate @narendramodi for prioritizing healthcare and digital transformation while spearheading India’s development. India's progress in these sectors is inspiring and we are fortunate to partner in this journey #AmritMahotsav — Bill Gates (@BillGates) August 15, 2022 ఇదీ చదవండి: భారత్‌పై మరోమారు పాక్ మాజీ ప్రధాని ప్రశంసలు -
అమెజాన్ చేతికి వన్ మెడికల్
వాషింగ్టన్: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆరోగ్య సేవల రంగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వన్ మెడికల్ సంస్థను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. షేరు ఒక్కింటికి 18 డాలర్ల చొప్పున మొత్తం 3.9 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు వివరించింది. మెంబర్షిప్ ప్రాతిపదికన వన్ మెడికల్ తమ సభ్యులకు వైద్యుల కన్సల్టింగ్, ఫార్మసీ సర్వీసులు అందిస్తోంది. మార్చి ఆఖరు నాటికి 25 మార్కెట్లలో కంపెనీకి 7,67,000 మంది సభ్యులు, 188 మెడికల్ ఆఫీసులు ఉన్నాయి. 254 మిలియన్ డాలర్ల ఆదాయంపై 91 మిలియన్ డాలర్ల నష్టం నమోదు చేసింది. అమెజాన్ గతేడాది నుంచే అమెజాన్ కేర్ పేరిట టెలీమెడిసిన్ సర్వీసులను కంపెనీలకు అందించడం ప్రారంభించింది. 2020లో ఆన్లైన్ ఔషధాల స్టోర్‌ను ఏర్పాటు చేసింది. అమెజాన్ గతంలో 13.7 బిలియన్ డాలర్లతో హోల్ ఫుడ్స్‌ను, 8.5 బిలియన్ డాలర్లతో హాలీవుడ్ స్టూడియో ఎంజీఎంను కొనుగోలు చేసింది. అమెజాన్ కొనుగోలు చేస్తోందన్న వార్తలతో వన్ మెడికల్ మాతృ సంస్థ 1లైఫ్ హెల్త్‌కేర్ షేర్లు 68 శాతం ఎగిసి 17.13 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి. -
ఆకస్మిక చలి.. ఆరోగ్యం జాగ్రత్త.. వాట్సాప్, ఫేస్బుక్లో సందేశాల వెల్లువ
సాక్షి, సిటీబ్యూరో: 'వాతావరణంలో ఏర్పడుతున్న ప్రత్యేక పరిస్థితి కారణంగా గత శుక్రవారం నుంచి అనూహ్యంగా చలి పెరిగింది. ఈ చలి తీవ్రత వల్ల నెలన్నర రోజుల పాటు ప్రజలకు రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తనున్నాయి’. ఈ మేరకు వాట్సాప్, ఫేస్బుక్ తదితర మాధ్యమాలలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు తగ్గట్టే ఆకస్మికంగా తీవ్రమైన చలి, దగ్గు, జలుబు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పోస్టు చర్చనీయాంశంగా మారింది. భూమితో సహా అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయనేది తెలిసిందే. అలా తిరిగే క్రమంలో సంవత్సరానికి ఒకసారి సూర్యుడి నుంచి భూమి నిర్ధిష్ట దూరం కన్నా ఎక్కువ దూరంగా జరుగుతుంది. దీనిని అఫెలియన్ స్థితి అని పేర్కొంటారు. చలి పెరిగి...అనారోగ్యం కలిగి.. సూర్యుడి నుంచి భూమి దూరంగా కదులుతున్న నేపథ్యంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం సహజంగానే ఉంటుంది. ఈ రకమైన అఫెలియన్ స్థితి గురువారం ఉదయం 5.27 గంటలకు ప్రారంభమైందనీ, ప్రాంతాలను బట్టి ఒక్కో చోట ఒక్కో సమయంలో దీని ప్రభావం ప్రారంభమవుతుందని సోషల్ సందేశాలు చెబుతున్నాయి. అలాగే ఈ పరిస్థితి ఆగస్ట్ 22న ముగుస్తుందనీ అంటున్నారు. భూమికి సూర్యునికి మధ్య దూరం సాధారణం కంటే 6.6 శాతం ఎక్కువ కావడం వల్ల ఈ అఫెలియన్ కాలంలో చలి బాగా పెరిగి, దీంతో ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. కావున వెచ్చని వస్త్రాలు ధరించాలని, రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్లు, సప్లిమెంట్లను వినియోగించాలని సూచనలు కూడా జోడిస్తున్నారు. వాస్తవం ఉందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? దీనిపై నగరానికి చెందిన వాతావరణ నిపుణులొకరు మాట్లాడుతూ...ఇప్పటికే నాసా దీనిపై స్పష్టత ఇచ్చిందన్నారు. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ప్రకారం, భూమికీ సూర్యునికీ మధ్య సగటు దూరం దాదాపు 150 మిలియన్ కిమీ కాగా, అఫెలియన్ సమయంలో అది దాదాపు 152 మిలియన్ కి.మీ.కి చేరుతుందనీ, ఈ వ్యత్యాసం ఉష్ణోగ్రతపై ప్రభావం చూపడానికి సరిపోదన్నారు. నిజానికి అఫెలియన్ అనేది ఏటేటా సర్వసాధారణంగా ఏర్పడే పరిస్థితేనన్నారు. భూమి దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నందున, సూర్యుడు భూమి మధ్య దూరం సంవత్సరం పొడవునా మారుతూ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా, భూమి సాధారణం కన్నా ఎక్కువగా సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు పెరిహెలియన్ స్థితి అంటారనీ , అఫెలియన్ సాధారణంగా ప్రతి సంవత్సరం జూలై 6న ప్రారంభమైతే, జనవరి 2వ తేదీన పెరిహెలియన్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. వీటివల్లనే ఆరోగ్య సమస్యలు వస్తాయనేందుకు ఎటువంటి రుజువులు లేవన్నారు. వాతావరణ మార్పులతోనే ఆరోగ్య సమస్యలు బంజారాహిల్స్: వానాకాలంలో వాతావరణ మార్పుల వల్ల విస్తరించే వైరస్‌లను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని ‘మా’ఈఎన్టీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈఎన్టీ చీఫ్ సర్జన్ డాక్టర్ కే.ఆర్. మేఘనాథ్ మాట్లాడారు. ప్రస్తుతం జ్వరం, జలుబు, చెవి, గొంతు నొప్పి, దగ్గులకు వైరస్ కారణంగా ఆయన చెప్పారు. మాస్క్ ధరించే అలవాటు కొనసాగించడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందదన్నారు. జలుబు, దగ్గు తదితర సమస్యలు తీవ్రంగా లేకపోతే ఆవిరి పట్టడం, కషాయం వంటివి ఉపకరిస్తాయన్నారు. మనం తినే ఆహారంలో విటమిన్లు, మినరల్స్ ఉండేలా చూసుకుంటే రోగాలతో పోరాడేందుకు మరింత శక్తి సమకూరుతుందన్నారు. - డాక్టర్ కేఆర్ మేఘనాథ్ -
ప్రయోగాత్మకంగా ప్రారంభం.. పురుషుల కోసం ప్రత్యేకంగా ఆరోగ్యకేంద్రాలు
శివాజీనగర(బెంగళూరు): అనారోగ్యాలతో బాధపడే పురుషులకు వైద్య పరీక్షల కోసం త్వరలోనే మల్లేశ్వరంలో, రామనగర జిల్లాసుపత్రిలో ఆరోగ్య కేంద్రాలను ప్రయోగాత్మకంగా ఆరంభించనున్నట్లు మంత్రి సీ.ఎన్.అశ్వత్థ్‌నారాయణ తెలిపారు. మంత్రి మాట్లాడుతూ పురుషులు పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు, అయితే వీరిలో ఎక్కువమంది ఆసుపత్రికి రావటం లేదు. ఈ సమస్యను అధిగమించేలా వారి కోసమే ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి లభించే స్పందనను బట్టి మునుముందు రోజుల్లో అన్నిచోట్లకు విస్తరించే ఆలోచన ఉందన్నారు. మధుమేహం, క్యాన్సర్, నరాల వ్యాధులు పురుషులను ఎక్కువగా పీడిస్తున్నాయని తెలిపారు. వీటికి తోడుగా ఒత్తిడి జీవితం, మద్యం, పొగ, అశాస్త్రీయ ఆహార సేవనం తదితరాలు పురుషులకు పెను ముప్పుగా మారాయన్నారు. ఈ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. చదవండి: వివాహమైనా ప్రియుడితో సన్నిహితంగా.. ఆహారంలో విషంపెట్టి.. -
బోస్టన్‌లో హెల్త్ కేర్ ఎట్ గ్లాన్స్ సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్
-
సమ్మర్ కష్టాలు దాటేయండిలా..
-
ఒకే పోష్చర్‌లో చాలాసేపు కంప్యూటర్‌పై పనిచేస్తున్నారా? ఈ సమస్యలు తప్పవేమో!
కంప్యూటర్‌పై పనిచేస్తుండే సమయంలో కొందరు ఒకే భంగిమ (పోష్చర్)లో చాలాసేపు కూర్చుండిపోతారు. ఏకాగ్రతతో పనిలో మునిగిపోయినందున తమ పోష్చర్ విషయం పట్టించుకోరు. కేవలం కంప్యూటర్ మీద పనిచేసేవారే కాదు... చాలాసేపు కదలకుండా ఉండి పేషెంట్స్‌ను చూసుకునే వైద్యరంగాల్లోని వారికీ (హెల్త్ కేర్ గివర్స్), పోష్చర్ మారకుండా పనిచేసే ఇతర రంగాల్లోని వారికీ... కొద్దిసేపటి తర్వాత మెడ, ఒళ్లునొప్పులు రావడం, ఎంత జాగ్రత్తగాఉన్నా తప్పులు దొర్లడం వంటి సమస్యలు వస్తుంటాయి. దీనికి కారణం ‘స్టాటిక్ లోడింగ్’ అనే పరిస్థితి. నిజానికి ఈ పదం పూర్తిగా వైద్యరంగానిది కాదు. చాలాకాలం పాటు ఒకేచోట ఉండే వస్తువు స్థితిని తెలపడానికి భౌతిక/ఇంజనీరింగ్ శాస్త్రాల్లో ఉన్న పారిభాషిక పదమే... ఆ తర్వాత వైద్యశాస్త్రం వాడుకలోకి వచ్చింది. ఒకే పోష్చర్‌లో చాలాసేపు కూర్చుని / కదలకుండా ఉండటంతో వచ్చే ఈ కండిషన్ చాలా రకాల అనర్థాలకు దారితీస్తుంది. దీనివల్ల రక్తప్రసరణ వేగం 20 శాతం వరకు తగ్గుతుంది. శ్వాస ప్రక్రియ కూడా మందగిస్తుంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు 30 శాతం వరకు తగ్గుతాయి. అందుకే దేహానికి అవసరమైన ఆక్సిజన్ మోతాదులు సైతం 30 శాతం తగ్గిపోతాయి. ఫలితంగా కణాలన్నింటికీ అవసరమైన ప్రాణవాయువు తగ్గుతుంది. శారీరకంగా ఎలాంటి శ్రమ లేనప్పటికీ... తీవ్రమైన అలసట కలుగుతుంది. చాలాసేపు కంప్యూటర్‌పై టైపింగ్ వల్ల వేళ్ల సమస్యలూ, ఒకే భంగిమలో సుదీర్ఘకాలం కూర్చోవడంతో కీళ్లనొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఇటు కంప్యూటర్‌పై పనిచేసేవారూ లేదా ఇతరత్రా పనుల్లో చాలాసేపు ఒకే పోష్చర్‌లో ఉండేవారు.... కొద్ది కొద్ది సేపటి తర్వాత ఒకసారి లేచినిలబడి, కాసేపు అటు ఇటు తిరగాలి. కంప్యూటర్ స్క్రీన్‌ను అదేపనిగా రెప్పవాల్చకుండా చూడకూడదు. ఇది కంటికి శ్రమ కలిగించడం, కనురెప్పలు కొట్టకపోవడం (బ్లింక్ చేయకపోవడం)తో లాక్రిమల్ గ్లాండ్స్ నుంచి స్రవించే కన్నీరు కంటిపై సమంగా విస్తరించదు. దాంతో కన్నుపొడిబారడం, కన్ను అలసటకు గురికావడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ప్రతి గంట తర్వాత కనీసం 10 నిమిషాల బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. ఒకేచోట కూర్చుని పనిచేసే వృత్తుల్లో ఉండేవారు రోజూ కనీసం 30 – 45 నిమిషాల పాటు వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు కనురెప్పలు తరచూ మూస్తుండాలి. దాంతో ‘స్టాటిక్ లోడింగ్’ అనర్థాలను చాలావరకు నివారించవచ్చు. చదవండి: మొదటిసారే గుండెపోటు తీవ్రంగా.. మరణానికి దారితీసే పరిస్థితి, ఎందుకిలా? -
వైద్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
కాప్రా: ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం కావడంలో ఆశ వర్కర్లది కీలక పాత్ర అని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కొనియాడారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ జమ్మిగడ్డలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు ఆవ వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి అధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. ఆశవర్కర్లు టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రజలకు మరిన్ని మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు. గత ప్రభుత్వాల హయాంలో వేతనాలు సరిగా అందక, ఎప్పుడు వస్తుందో తెలియక ఆశ వర్కర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వారి వేతనాలు పెంచి ప్రతి నెల సమయానికి అందేలా చొరవ చూపుతోందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆశ వర్కర్లకు వేతనాలు అందిస్తున్న ఘనత ఒక్క కేసీఆర్‌దే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషరెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కాసం మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ ఉప్పల్ నియోజకవర్గం నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి వైద్యులు సంపత్‌కుమార్, స్వప్న పాల్గొన్నారు. దుప్పట్ల పంపిణీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం జమ్మిగడ్డలో టీఆర్ఎస్ పార్టీ సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఏఎస్‌రావునగర్ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి హాజరై వృద్ధులు, పేదలకు దుప్పట్లు, దుస్తులు, పండ్లు అందించారు. -
సీఎం జగన్‌తో సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వి భేటీ
సాక్షి, అమరావతి: ఫార్మాస్యూటికల్స్ రంగంలో పెద్ద కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా రాష్ట్రంలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పడానికి ఆసక్తిగా ఉంది. దీనిలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాయంలో కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ కలిశారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగం ప్రగతి, సన్ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. పారిశ్రామిక ప్రగతికోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. అవకాశాలను వినియోగించుకోవాలని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సమగ్రాభివృద్ధి ధ్యేయంగా తీసుకుంటున్న చర్యలనూ ముఖ్యమంత్రి వివరించారు. దీనిపై దిలీప్ సంఘ్వీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగం ప్రగతి, సన్ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయని తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు ప్రకటన రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పర్యావరణ హిత విధానాలపై సీఎం ఆలోచనలు తనను ముగ్దుడ్ని చేశాయని సన్‌ఫార్మా అధినేత సంఘ్వీ పేర్కొన్నారు. -
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ షురూ
న్యూఢిల్లీ: దేశ పౌరుల ఆరోగ్య సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించనుంది. ఇందులోభాగంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’కు శ్రీకారం చుట్టింది. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక చర్యలకు నడుం బిగించామని డిజిటల్ మిషన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. డిజిటల్ మిషన్‌లో భాగంగా పౌరులకు డిజిటల్ హెల్త్ ఐడీ కార్డును జారీచేయనున్నారు. గతంలో పోల్చితే సాంకేతికతను ఆరోగ్యరంగానికి మరింతగా జోడించడంతో సత్వర వైద్యసేవలు పెరిగాయని మోదీ అన్నారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీపీఎంజేఏవై) మూడో వార్షికోత్సవం రోజునే ఈ కార్యక్రమం మొదలవడం విశేషం. పీఎంజేఏవై కింద పేదలకు రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. పీఎంజేఏవై కింద 2 కోట్ల మంది ఇప్పటికే ఉచితంగా పలు వ్యాధులకు చికిత్స తీసుకున్నారని మోదీ చెప్పారు. డిజిటల్ హెల్త్ ఐడీ కార్డుతో ప్రయోజనాలు.. వ్యక్తి ఆధార్ కార్డు లేదా మొబైల్ నంబర్‌ను ఉపయోగించి 14 అంకెలు ఉండే డిజిటల్ హెల్త్ ఐడెంటిఫికేషన్(ఐడీ) నంబర్ కేటాయిస్తారు. ప్రతీ వ్యక్తి ఆరోగ్య వివరాలు, గత మెడికల్ రిపోర్టులు, కుటుంబ వివరాలు, ఉండే ప్రాంతం, చిరునామా తదితరాలను తీసుకుంటారు. కార్డులో పౌరుల ఆరోగ్య చరిత్ర నిక్షిప్తమై ఉంటుంది. వ్యక్తికి హఠాత్తుగా ఆరోగ్య సమస్య ఎదురైతే తోడుగా ఆస్పత్రికి హెల్త్ కార్డు తీసుకెళ్తే హెల్త్ హిస్టరీ సాయంతో సరైన చికిత్స సకాలంలో పొందే అవకాశాలు బాగా మెరుగుపడతాయి. దీంతో వేరే ప్రాంతాల, వేరే రాష్ట్రాల పౌరులకూ చికిత్స చేయడం అక్కడి వైద్యులకు సులభం అవుతుంది. పేద, మధ్య తరగతి వర్గాలకు సైతం ఈ సౌకర్యం ఎంతో ప్రయోజనకరం. ఖాతా వివరాలను ఒక మొబైల్ అప్లికేషన్‌తో అనుసంధానిస్తారు. హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ, హెల్త్‌కేర్ ఫెసిలిటీస్ రిజిస్ట్రీస్‌గా దీనిని పిలుస్తారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఏ) తరహాలో యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్(యూహెచ్ఐ)ను ఈ వ్యవస్థలో వాడనున్నారు. వైద్యులు, వైద్యశాలలు, డయాగ్నస్టిక్ ల్యాబ్, ఫార్మసీలు యూహెచ్ఐ ద్వారా రోగుల గత రిపోర్ట్‌లను తీసుకుంటాయి. తద్వారా సత్వర వైద్య సేవలు అందిస్తాయి. దేశంలో ఎంత మంది ఏ విధమైన వ్యాధులతో బాధపడుతున్నారో తెలిస్తే.. ప్రభుత్వం సైతం తగు విధంగా విధానపర ‘ఆరోగ్య’ నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. టెలీ మెడిసన్ వంటి సదుపాయాలు ఈ హెల్త్ కార్డు ద్వారా సులభంగా పొందొచ్చు. దీంతో టెలీ మెడిసిన్ వ్యవస్థ మరింతగా విస్తరించనుంది. -
Sakshi Excellence Awards: మరింత మందికి సేవ చేసే అవకాశం
-
తుపాను ముందు.. ప్రశాంతత!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను తుపాను ముందటి ప్రశాంతతగా పరిగణించాల్సి ఉంటుందని ఢిల్లీలోని ఎయిమ్స్ మాజీ పల్మనరీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి, పీఎస్ఆర్ఐ (పుష్పవతి సింఘానియా రీసెర్చి ఇన్స్టిట్యూట్) హాస్పిటల్ ఆఫ్ పల్మనరీ–స్లీప్ మెడిసిన్స్ చైర్మన్ డాక్టర్ గోపీచంద్ ఖిల్నానీ పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మేలో కరోనా సెకండ్‌వేవ్‌కు ముందు ఎలాంటి పరిస్థితులున్నాయో, ఇప్పుడు దాదాపుగా అవే పరిస్థితులు నెలకొని ఉన్నాయన్న విషయాన్ని అందరూ గ్రహించాలని చెప్పారు. ఒకరకంగా మనం ఇంకా ‘టైం బాంబు’పైనే కూర్చుని ఉన్నామనే విషయం అందరూ గ్రహించాలని సూచించారు. కొత్త వేరియంట్లు, మ్యూటెంట్లతో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. యూఎస్‌లో మాస్క్‌లు తీసేయడంతో పాటు, ప్రయాణాలు, నైట్‌క్లబ్‌లు, పార్టీలు అంటూ విచ్చలవిడిగా వ్యవహరించడంతో ఇప్పుడు అక్కడ కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయని తెలిపారు. గత కొన్నిరోజులుగా రోజుకు లక్షకు పైగా పాజిటివ్ కేసులొస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం మనదగ్గర కూడా చాలాచోట్ల మాస్క్‌లు పెట్టుకోవడం లేదని, ఇతర జాగ్రత్తలు పాటించడం లేదని అన్నారు. యూఎస్, ఇతర పశ్చిమ దేశాలను చూసైనా మనం పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు. దేశంలో ఇప్పుడు రోజుకు 30–40 వేల మధ్యే కేసులు వస్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండడం సరికాదన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పరిస్థితి ఉందని, మనదగ్గర సెకండ్‌వేవ్ అనేది పూర్తిగా ముగియలేదని స్పష్టం చేశారు. ఫ్లూ లేదా స్వైన్‌ఫ్లూ వంటివి ఎపిడమిక్ నుంచి ఎండమిక్ జోన్లోకి వెళతాయని, కానీ కోవిడ్ విషయంలో అలా జరగడం లేదంటున్న డాక్టర్ ఖిల్నానీతో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. మాస్క్ ధరించడం చాలా ముఖ్యం ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలతో మరికొన్ని నెలలు అప్రమత్తంగానే ఉండాలి. మన దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉండడంతో పాటు ప్రయాణాలు, రకరకాల రోజువారీ కార్యకలాపాల కారణంగా భౌతిక దూరం పాటించడం కొంత కష్టంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో సరైన విధంగా, తగిన జాగ్రత్తలతో మాస్క్ ధరించడం అనేది అత్యంత ఆవశ్యకం. కోవిడ్ వైరస్ గాలి ద్వారానే వ్యాప్తి చెందుతున్నందున జాగురూకతతో వ్యవహరించాలి. ప్రయాణికులను సూపర్ స్ప్రెడర్స్గానే పరిగణించాలి అన్నిరకాల ప్రయాణాలతో ప్రమాదం పొంచి ఉంది. పండుగలు, వేడుకల సందర్భంగా ప్రయాణాలు, హాలీడే ట్రిప్పులు, ఇతర దేశాలకు రాకపోకలు.. ఇలా ఏ ప్రయాణం చేసేవారినైనా ‘సూపర్ స్ప్రెడర్స్’గానే పరిగణించాల్సి ఉంటుంది. కోవిడ్ మహమ్మారి ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రానందున అన్నిరకాల ప్రయాణాలపై నియంత్రణలు, ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉంది. ఎవరికి వారు అత్యంత అవసరమైతేనే తప్ప ఇతర చోట్లకు ప్రయాణించకూడదనే నిబంధన విధించుకోవాలి. 90% వరకు రక్షణ ఉంటేనే హెర్డ్ ఇమ్యూనిటీ మొదట్లో 70 శాతం మందికి ఇమ్యూనిటీ వస్తే సామూహిక రక్షణ (హెర్డ్ ఇమ్యూనిటీ) లభించినట్టేననే అంచనా వేశారు. కానీ వైరస్ తీవ్రత, వ్యాప్తిని బట్టి ఇది మారుతుందని స్పష్టమైంది. 80, 90 శాతం మందికి రక్షణ ఏర్పడితేనే హెర్డ్ ఇమ్యూనిటీగా పరిగణించాలి. ఎవరికైనా రోగనిరోధకశక్తి అనేదే ప్రధానం. అందువల్ల ఎవరికి వారు ఇమ్యూనిటీని పెంపొందించుకోవాలి. టీకా రెండు డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలి. 66.70% మందిలో యాంటీబాడీస్ తాజా సీరో సర్వే ప్రకారం దేశంలోని 66.70 శాతం మందిలో యాంటీబాడీస్ ఏర్పడ్డాయి. అదే ఢిల్లీ విషయంలో 79 శాతంగా ఉండగా, మరికొన్ని చోట్ల తక్కువగా ఉంది. కరోనా ఇన్ఫెక్షన్ సోకాక లేదా వ్యాక్సిన్ వేసుకున్నాక ఏర్పడే యాంటీబాడీస్ ఆరునెలల దాకా ఉంటాయి. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుదల మొదలవుతుంది కాబట్టి జాగ్రత్తలు అవసరం. ఆస్పత్రులను సన్నద్ధంగా ఉంచాలి కొత్త వేరియంట్లు, మ్యూటెంట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితోనే ప్రమాదం పొంచి ఉంది. సెకండ్‌వేవ్‌కు డెల్టా కారణం కాగా, ఏవైనా కొత్త వేరియంట్లు వస్తే ఇమ్యూనిటీ ఏ మేరకు కాపాడుతుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కొత్త వేరియంట్లను ఎదుర్కొనేంత రోగనిరోధకశక్తి మనలో లేకపోతే ఒక్కసారిగా కేసులు పెరిగి థర్డ్‌వేవ్‌కు కారణమౌతాయి. ప్రస్తుతం మనదగ్గరున్న వ్యాక్సిన్లు డెల్టా వైరస్‌పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు రుజువైంది. కానీ కొత్త వేరియంట్లు వస్తే ఎంతవరకు పనిచేస్తాయన్నది చెప్పలేం. ఏదిఏమైనా కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిం చకుండా నిరోధించేది, నియంత్రించ గలిగేది టీకాలు మాత్రమే. అందువల్ల అత్యధిక శాతం జనాభాకు వ్యాక్సిన్లు వేయడం ఒక్కటే మార్గం. అప్పటిదాకా థర్డ్‌వేవ్ వంటివి వచ్చినా ఎదుర్కొనేలా టీకాల కార్యక్రమంలో వేగం పెరగాలి. ఆక్సిజన్‌తో సహా అన్ని వసతులు, సౌకర్యాలతో ఆసుపత్రులను సర్వసన్నద్ధంగా ఉంచాలి. థర్డ్‌వేవ్ వస్తుంది కానీ.. థర్డ్‌వేవ్ తప్పకుండా వస్తుంది. అయితే మన సువిశాల దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల్లో భిన్నమైన భౌగోళిక పరిస్థితులున్నాయి. అందువల్ల థర్డ్‌వేవ్ అనేది మొత్తంగా కాకుండా కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే అవకాశాలున్నాయి. ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో ప్రాంతంలో కొన్నిచోట్ల కేసులు నమోదయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ మాటకొస్తే సెకండ్ వేవ్ పూర్తిగా కనుమరుగుకాలేదు. ఢిల్లీ, హరియాణా, యూపీ, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో రెండోదశ ముగిసింది. ఒరిస్సా, తమిళనాడు, కేరళ, ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. ‘సాక్షి’ఇంటర్వూ్యలో ఎయిమ్స్ మాజీ పల్మనరీ విభాగాధిపతి డాక్టర్ జీసీ ఖిల్నానీ -
వారి ఆలోచనల్లో నుంచి పుట్టిందే ఆరా హెల్త్‌టెక్
ఒకరికి ‘సమస్య’ పరిచయం అయింది. ఒకరికి ‘ఉత్సాహం’ తోడైంది. ఒకరికి ‘ఓటమి’ ఎదురైంది. ఒకరికి తన అనుభవమే పాఠం అయింది. ‘సమస్య’ ‘ఉత్సాహం’ ‘ఓటమి’ ‘పాఠం’... ఈ నాలుగు పదాల ప్రయోగశాలలో పుట్టిందే ఆరా హెల్త్‌కేర్. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన అహిల్య మెహతా, మల్లిక సాహ్ని, ప్రగ్యా సాబు, నవ్యనందా ఈ స్టార్టప్ కంపెనీకి సూత్రధారులు. ‘ఆరా’ అనే ఉమెన్–సెంట్రిక్ హెల్త్‌టెక్ కంపెనీ ద్వారా నాణ్యమైన హెల్త్‌కేర్–ప్రొడక్ట్స్, సేవలను మహిళలకు చేరువ చేస్తున్నారు.... సమాచారం తక్కువైతే జరిగే నష్టం మాట ఎలా ఉన్నా, అతి అయితే మాత్రం గందరగోళం ఏర్పడుతుంది. ‘ఏది వాస్తవం?’ ‘ఏది అవాస్తవం?’ అని తేల్చుకోవడానికే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. ఈ సమస్యతో పాటు స్త్రీలు ఎదుర్కొంటున్న రకరకాల ఆరోగ్య సమస్యల గురించి గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో ముంబైలో చర్చించుకున్నారు అహిల్య మెహతా, మల్లిక సాహ్ని, ప్రగ్యా సాబు, నవ్య నందా. వారి ఆలోచనల్లో నుంచి పుట్టిందే ఆరా హెల్త్‌టెక్ కంపెనీ. శాన్ఫ్రాన్సిస్కో(యూఎస్)లో ఐటీ కన్సల్టెంట్‌గా పనిచేసిన అహిల్య మెహతా స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఆన్లైన్ పర్సనల్ స్టైలింగ్ ప్లాట్‌ఫామ్ ‘స్టైల్‌క్రాకర్’లో అసోసియేట్ ప్రొడక్ట్స్ మేనేజర్‌గా పనిచేసింది. ఒక స్వచ్ఛందసేవా సంస్థతో కలిసి రాజస్థాన్‌లోని ట్రైబల్ విలేజ్ కొట్రాలో పని చేస్తున్నప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల ఆరోగ్యసమస్యలను దగ్గర నుంచి తెలుసుకునే అవకాశం వచ్చింది. యూఎస్‌లో బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన మల్లిక సాహ్నికి ఎంటర్ ప్రెన్యూర్షిప్ అంటే అనురక్తి. ఎంటర్ ప్రెన్యూర్‌గా విజయబావుటా ఎగరేయాలనే ఆమె కలకు ‘ఆరా’తో అంకురార్పణ జరిగింది. ‘తరగతి గదిలో బిజినెస్ పాఠాలు వినడం వేరు, ఆచరణ వేరు’ అంటున్న మల్లిక ‘ఆరా’ స్టార్టప్ ద్వారా కొత్త విషయాలెన్నో నేర్చుకుంది. ఇంజనీరింగ్ చేసిన ప్రగ్యా సాబు హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీ ‘ఆస్కార్ హెల్త్’లో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేసింది. ఆ తరువాత కొన్ని స్టార్టప్ కంపెనీలు మొదలుపెట్టింది కాని అవేమీ సత్ఫలితాలు ఇవ్వలేదు. అయితే ‘మళ్లీ ప్రయత్నిద్దాం’ అనే పట్టుదల తప్ప నిరాశను ఎక్కడా దరి చేరనివ్వలేదు. ‘మన హెల్త్‌కేర్ సిస్టమ్‌ను అర్థం చేసుకోవడానికి ఒకప్పటి నా ఉద్యోగం ఉపకరించింది’ అంటుంది ప్రగ్యా. ఈ బృందంలో అందరికంటే చిన్నవయసు ఉన్న అమ్మాయి నవ్య నందా. నటదిగ్గజం అమితాబ్ బచ్చన్ మనవరాలు ఈ నవ్య. డిజిటల్ టెక్నాలజీలో పట్టా పుచ్చుకుంది. ‘ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, ఎంత ఉన్నత చదువులు చదివినప్పటికీ గర్భనిరోధకం, లైంగిక ఆరోగ్యం... మొదలైన విషయాలు మాట్లాడుకోవడానికి, సమస్య గురించి చర్చించడానికి సంకోచించే వారు, ఇబ్బందికి గురయ్యేవారు మన సమాజంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారు తమ సమస్యను చెప్పుకోవడానికి, పరిష్కారానికి ఆరా ఒక ఆత్మీయనేస్తంలా ఉండాలనుకున్నాం’ అంటుంది నందా. ఒకప్పుడు నందా కొన్ని మానసిక సమస్యలకు గురైంది. వాటి నుంచి త్వరగానే బయటపడింది. తన అనుభవాలనే పాఠాలుగా ఉపయోగించుకుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘ఆరా’లో వైద్యనిపుణులు ధృవీకరించిన సమాచారం ఉంటుంది. మహిళలు తమకు సంబంధించిన ఆరోగ్యసమస్యల గురించి స్వేచ్ఛాయుతంగా చర్చించుకోవడానికి, వైద్యసలహాల కోసం వాట్సాప్, టెలిగ్రామ్, జూమ్...వేదికల ద్వారా కమ్యూనిటీ మీటప్స్ నిర్వహిస్తున్న ఆరా ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్’ అనే అరోగ్యసూత్రాన్ని ఆచరణ లో చూపడానికి ప్రయత్నిస్తుంది. ప్రతివారం సమాచారాన్ని అప్డేట్ చేస్తుంటారు. ‘షాప్’ విభాగంలో తమ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 140మంది నిపుణులు, సంస్థలతో కలిసి పనిచేస్తోంది ఈ స్టార్టప్. కాస్త సరదాగా ‘కరోనా మాకు మేలే చేసింది’ అంటున్నారు నలుగురు మిత్రులు. ‘అదెలా?’ అంటే – ‘కరోనా వల్లే లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వల్లే మేము సమావేశం అయ్యాం. దీనివల్లే ‘ఆరా’కు అంకురార్పణ జరిగింది’ అంటున్నారు! -
ముఖంపై ముడతలు పోయి, 60లో 20లా కనిపించాలని ఉందా?
మనలో చాలా మందికి 60లో 20లా కనిపించాలని పరితపిస్తుంటారు. కానీ వయోబేధం లేకుండా రకరకాల కారణాల వల్ల లేదంటే వయసు రిత్యా చర్మంపై ముడతలు వస్తుంటాయి. అయితే అలాంటి ముడతల్ని తగ్గించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. వాటిని ఫాలో అయితే తప్పని సరిగా శరీరంపై ఉన్న ముడతలు పోవడమే కాదు మొఖం కాంతివంతంగా తయారవుతుందని అంటున్నారు. అయితే ఇప్పుడు మనం ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం..! ప్రస్తుతం మార్కెట్లో విరివిగా దొరుకుతున్న నేరేడు పండులో విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. నేరేడు పండ్లను తినడంవల్ల చర్మంపై ముడతలు, మొటిమలు ఏర్పడవు. రక్త శుద్ధి జరిగి మేనిఛాయ నిగారింపును సంతరించుకుంటుంది. ∙డయాబెటిస్ ఉన్నవారు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తగ్గి ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది.∙డైలీ ఆహారంలో నేరేడు పండ్లను చేర్చడం ద్వారా రక్త పీడనం సమతులంగా ఉండడమేగాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.∙పీచు పదార్థం అధికంగా ఉండడంతో జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి పేగుల్లో అల్సర్లు ఏర్పడకుండా కాపాడుతుంది. ∙కేలరీలు తక్కువ, అధికమొత్తం లో పీచు పదార్థం ఉండడం వల్ల జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. దీనివల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలిగి తక్కువ తింటాము. ఫలితంగా బరువు అదుపు లో ఉంటుంది. యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు అధికంగా ఉండడంతో దంతారోగ్యం కూడా మెరుగుపడుతుంది. నేరేడు చెట్టు ఆకులను ఎండబెట్టి పొడి చేసి పళ్లు తోముకుంటే దంత సమస్యలు తొలగి పోతాయి. పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఇన్ఫెక్టివ్, యాంటీ మలేరియల్ సుగుణాలు ఉండడంతో నేరేడు శరీరానికి మంచి ఇమ్యూనిటి బూస్టర్‌గా పనిచేస్తుంది. -
పిల్లలు ఏం చేసినా వాంతులవుతున్నాయా?
కొంతమంది పిల్లలకు తరచూ వాంతులు అవుతుంటాయి. వాళ్లు కడుపునిండా తిన్నతర్వాత లేదా విపరీతంగా నవ్వినా, ఆడినా, పరుగెత్తినా వాంతులు కావచ్చు. అలాంటి లక్షణాలు కనిపిస్తుంటే అది ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్’ అనే కండిషన్ వల్ల కావచ్చు. ఈ కండిషన్ ఉన్న పిల్లల్లో లోయర్ ఈసోఫేగస్ కింది భాగంలోని స్ఫింక్టర్ కండరాలు (గట్టిగా పట్టి ఉంచే కండరాలు) కొంచెం వదులుగా ఉంటాయి. దాంతో కడుపులో ఉన్న ద్రవాలు (యాసిడ్ కంటెంట్స్) కడుపు నుంచి ఈసోఫేగస్ వైపునకు నెట్టినట్లుగా పైకి తన్నుకుంటూ వస్తాయి. అలా కడుపులోని ద్రవాలు పైకి తన్నడాన్నే ‘రిఫ్లక్స్’ అంటారు. దాంతో ఇలా వాంతులు అవుతుంటాయి. చాలామంది చిన్నపిల్లల్లో ఈ రిఫ్లక్స్ ఎంతోకొంత కనిపిస్తుంటుంది. ఈ రిఫ్లక్స్ తీవ్రంగా ఉన్నవాళ్లలో పుట్టిన మొదటి 10 రోజుల్లో /ఆరు వారాల్లో బయటపడతాయి. రెండేళ్ల వయస్సు వచ్చేనాటికి ఈ సమస్య చాలామంది పిల్లల్లో దానంతట అదే తగ్గిపోతుంది. అయితే కొద్దిమంది పిల్లల్లో మాత్రం ఇది పెద్దయ్యాక కూడా కనిపించవచ్చు. కొంతమందిలో ఈ రిఫ్లక్స్ తీవ్రంగా ఉన్నప్పుడు దగ్గుతూ ఉండటం, ఆస్తమా, నిమోనియా, ఎదుగుదలలో లోపాలు (గ్రోత్ రిటార్డేషన్), ఈసోఫేగస్‌లో స్ట్రిక్చర్ వంటి సమస్యలు కూడా కనిపించవచ్చు. కొంతమందిలో ఇవే లక్షణాలతో ‘హయటస్ హెర్నియా’ అనే కండిషన్ మరో సమస్య కూడా కనిపిస్తుంటుంది. పెద్దవాళ్లలోనూ ఉండవచ్చు... కొందరు పెద్దవాళ్లలోనూ ఈ రిఫ్లక్స్ సమస్య ఉంటుంది. మరీ ముఖ్యంగా ఊబకాయం (ఒబేసిటీ) ఉన్నవాళ్లలో ఇది ఎక్కువ. అలాగే కాఫీలు, సిగరెట్లు ఎక్కువగా తాగడం, తరచూ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వంటి అలవాట్లు ఉన్నవారిలో ఇది ఎక్కువ. (చదవండి: కోవిడ్–19తో కళ్లకు ముప్పు ఉంటుందా?) భోజన ప్రియులైన కొందరిలో భోజనం ఎక్కువ పరిమాణంలో తీసుకున్న తర్వాత, అందునా కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలోనూ ఈ రిఫ్లక్స్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. కొన్ని సరిపడని మందుల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. మరికొంతమంది కుటుంబ ఆరోగ్య చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ)లో ఈ సమస్య ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యుల్లోనూ ఇది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. నిర్ధారణ పరీక్షలు బేరియం ఎక్స్‌రే, 24 గంటల పీహెచ్ మానిటరింగ్, ఎండోస్కోపీ వంటి పరీక్షలతో ఇలాంటి కండిషన్ ఉన్న పిల్లల్లో దీన్ని నిర్ధారణ చేసి, తీవ్రతను అంచనా వేయవచ్చు. అయితే కొన్నిసార్లు ఎక్స్–రేలో ఇది బయటపడే అవకాశం తక్కువ. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కనిపించే దీని స్వభావంతో ఒక్కోసారి ఇది ఎక్స్–రేలో కనిపించకపోవచ్చు. మేనేజ్మెంట్ / చికిత్స చాలామంది పిల్లల్లో ఇది దానంతట అదే తగ్గిపోతుంది. అయితే వాంతులు కావడం ఎక్కువగా ఉంటే ద్రవపదార్థాలు తక్కువగా ఇవ్వడం, ప్రోకైనెటిక్ డ్రగ్స్ (ఉదాహరణకు సిసాప్రైడ్, మెటాక్లోప్రమైడ్ వంటి మందులు), ఎసిడిటీ తగ్గించే మందులు వాడటం వల్ల చాలా మటుకు ఉపశమనం ఉంటుంది. దీంతోపాటు భోజనం చేసిన వెంటనే పడుకోబెట్టకపోవడం, తల కొద్దిగా ఎత్తున ఉంచి పడుకోబెట్టడం, తిన్న వెంటనే పొట్టపై ఒత్తిడి పెంచే (ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ కలిగించే) యాక్టివిటీస్ అవాయిడ్ చేయడం వంటివి చేయాలి. అయితే అరుదుగా కొందరిలో ఈ సమస్యను ‘ఫండోప్లెకేషన్’ అనే ఆపరేషన్ ద్వారా సరిచేయాల్సి రావచ్చు. కానీ అది చాలా అరుదు. - డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్పీడియాట్రీషియన్ -
కోవిడ్–19తో కళ్లకు ముప్పు ఉంటుందా?
కరోనా వైరస్ దుష్ప్రభావాలు ఎన్నెన్నో అవయవాలపై ఉండటం మనకు తెలిసిందే. అన్నిటికంటే ఎక్కువగా ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మెదడు వంటి శరీర భాగాలపై ఎలా ఉంటుందనే విషయంపై చాలా అధ్యయనాలు జరిగాయి. కానీ కంటి విషయంలో కరోనా ప్రభావాలపై అటు అధ్యయనాలుగానీ... ఇటు అవగాహన గానీ చాలా తక్కువ. అత్యంత సున్నితమైనదీ, కీలకమైనది అయిన కన్ను విషయంలో అమెరికాలోని యూఎస్సీ రాస్కి ఇన్స్టిట్యూట్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ క్లినికల్ ఆఫ్తాల్మాలజీ డాక్టర్ ఆనీ గ్యూయెన్ వంటివారు ‘కంటిపై కరోనా ప్రభావం’ విషయంలో కొన్ని పరిశీలనలు జరిపారు. ఆ అధ్యయనాల్లో తెలిసిన అంశాలను వివరించే కథనం ఇది. చిన్న పిల్లలను కాస్త సరదాగా భయపెట్టడానికో లేదా వారిని థ్రిల్ చేయడానికో కొందరు పెద్దవాళ్లు తమ పై కనురెప్పలను పైకి మడిచి లేత గులాబీరంగులోని కనురెప్పల వెనకభాగాన్ని చూపించి వాళ్లను ఆడిస్తుంటారు. అలా కనురెప్పల వెనక లేత గులాబీరంగులో కనిపించేదే మ్యూకస్ మెంబ్రేన్. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... కరోనా వైరస్లు మ్యూకస్ మెంబ్రేన్‌కు అంటుకున్న తర్వాత అక్కణ్నుంచి శరీరం లోపలికి వెళ్తాయన్న విషయం చాలామందికి తెలుసు. మన నోట్లో, ముక్కులో ఉన్నట్లే కళ్లలోనూ ఈ మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. కళ్ల ఉపరితం మీద, కనురెప్పల వెనక ఉండే ఈ మ్యూకస్ పొర లైనింగ్నే కంజంక్టివా అంటారు. వైరస్ ఉన్న నీటితుంపర్లు (డ్రాప్లెట్స్) మ్యూకస్ మెంబ్రేన్ ద్వారా లోపలికి వెళ్లి, దేహంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ లెక్కన చూస్తే కళ్ల నుంచి కూడా వైరస్ లోపలికి వ్యాపిస్తుందన్న మాట. ఏవైనా వస్తువులనూ, ఉపరితలాన్ని అంటుకున్న తర్వాత ఆ చేతులతో (కడుక్కోకుండాగానీ లేదా శానిటైజ్ చేసుకోకుండాగానీ) కళ్లను రుద్దుకోవద్దని చెప్పడం వ్యాధి వ్యాప్తిని నివారించేందుకే. కళ్లనూ కడుక్కోవాలా? అలాగైతే కంటిపొరలనుంచి కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి... చేతులను కడుక్కున్నట్టే తరచూ కళ్లనూ కడుక్కోవాలా అనే సందేహం కొందరికి రావచ్చు. ఇక్కడ ఓ రక్షణ వలయం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. కళ్ల ఉపరితలాన్ని ఆక్యులార్ సర్ఫేస్‌గా చెబుతారు. ఈ ఆక్యులార్ సర్ఫేస్ను పరిరక్షించడానికి ఓ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. అక్కడ చేరే మైక్రోబ్స్ (వైరస్‌లూ, ఇతర బ్యాక్టీరియా వంటి అతి సూక్ష్మక్రిముల) వంటి వాటిని తుదముట్టించడానికి కన్నీరు ఎప్పుడూ స్రవిస్తూ ఉంటుంది. కన్నీరు ఊరే గ్రంథుల (లాక్రిమల్ గ్లాండ్స్) నుంచి నీరు స్రవిస్తూ కంటి ఉపరితలాన్ని ఎప్పుడూ తడిగా కూడా ఉంచుతూ సంరక్షిస్తుంటుంది. కోవిడ్ సోకితే లక్షణాలూ కంట్లోనూ కనిపిస్తాయా? కోవిడ్ సోకిన లక్షణాలు కొందరికి కళ్ల ద్వారా కూడా వ్యక్తమవుతాయి. కన్ను లేత పింక్ రంగులోకి మారడం, ఎర్రబారడం, దురదలు వంటి లక్షణాలు కనిపిస్తే అది కోవిడ్‌గా అనుమానించాలి. ఇలా కన్ను పింక్ రంగులోకి మారడం కంజంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ రావడం కారణంగా జరుగుతుంది. మరోమాటగా చెప్పాలంటే కరోనా వైరస్ ఒక రకంగా కళ్లకలకకూ కారణమవుతుందన్నమాట. మరి రక్షణ ఎలా? కళ్లజోడు వాడేవారికి ఎంతోకొంత రక్షణ లభించేమాట వాస్తవమే అయినా అది పూర్తి రక్షణ కాదు. అందుకే కంటిని రక్షించుకోవాలనుకునేవారు ‘ఫేస్ షీల్డ్స్’ వాడటం మంచిదే. ఇక కాంటాక్ట్ లెన్సెస్ వాడేవారు కొంతకాలం పాటు కళ్లజోడు వాడటం మంచిది. (Delta Varient: డెల్టా వేరియంట్ చాలా డేంజర్) కోవిడ్–19తో కళ్లకు ముప్పు ఉంటుందా? కనురెప్పల లైనింగ్‌కు ఉన్న మ్యూకస్ పొర ద్వారా కోవిడ్–19 వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ, ముక్కు, నోరుతో పోలిస్తే అది ఒకింత తక్కువే. అయితే కోవిడ్–19 వల్ల మరో ముప్పుకూడా ఉంటుంది. అదే ఊపిరితిత్తులకూ, గుండెకూ, మెదడుకూ ఆక్సిజన్ సరఫరా తగ్గడం. కంటి విషయంలోనూ ఇదే జరుగుతుందా అన్న విషయం ఇప్పుడు అధ్యయనంలో ఉంది. (సూపర్ వ్యాక్సిన్.. అన్ని వేరియంట్లకు అడ్డుకట్ట) కోవిడ్ అనంతరం ‘బ్లాక్‌ఫంగస్’ రూపంలో... కోవిడ్–19 సోకినప్పుడు... అది తన లక్షణాల్లో భాగంగా కళ్లను ఎర్రబార్చడం, కొంత పింక్ రంగులో కనిపించేలా చేయడం, దురదలు పుట్టించడం తప్ప నేరుగా ప్రభావితం చూపదు. కానీ కోవిడ్–19 అనంతర పరిణామంగా ‘బ్లాక్‌ఫంగస్’ రూపంలో అది కంటిని దెబ్బతీసే ప్రమాదం మాత్రం ఉంది. బ్లాక్ ఫంగస్ వచ్చినవారిలో ముఖంలో కొన్ని మార్పులు (ఫేషియల్ డిఫార్మిటీ), తలనొప్పి వంటి లక్షణాలతో బయటపడటంతో పాటు... వినికిడి, వాసన తెలిపే జ్ఞానాన్ని ప్రభావితం చేసినట్టే... చూపునూ దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఫలితంగా చూపు మందగించడం, బాగా మసక మసగ్గా (హేజీగా) కనిపించడం, కళ్లలో ఎర్రజీరలు కనిపించవచ్చు. కళ్లు వాచడంతో పాటు కంటి పరిసరాలైన చెంపలు, ముఖం సైతం వాచడం జరగవచ్చు. అప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. బ్లాక్‌ఫంగస్ అంధత్వాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉన్నందున ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కంటి విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి... ► దేనినైనా ముట్టుకున్న తర్వాత లేదా ఉపరితలాలను తాకిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అవే చేతులతో కంటిని తాకవద్దు. ∙అలా ముట్టుకోవాల్సి / తాకవలసి వచ్చినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ► కాంటాక్ట్ లెన్స్‌లు వాడేవారు కొంతకాలం పాటు వాటికి దూరంగా ఉంటూ... కళ్లజోడు మాత్రమే వాడాలి. ► కళ్ల సమస్యలు ఉన్నవారు డాక్టర్లు సూచించిన మందులను తప్పనిసరిగా వాడుతూ ఉండాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు (ఇమ్యునో కాంప్రమైజ్డ్ పర్సన్స్) తమ కళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ► అన్నిటికంటే ముఖ్యంగా కోవిడ్–19 అనంతర పరిణామంగా ‘బ్లాక్‌ఫంగస్’తో ఉన్న ముప్పు కారణంగా కన్ను దెబ్బతినడం/ అంధత్వం రావడం వంటి అవకాశాలున్నందున కళ్లలో ఎర్రజీరలు / పింక్‌రంగులో మారడం, వాపురావడం, నీళ్లుకారడం వంటి లక్షణాలు కనిపించగానే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. - డాక్టర్ రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు -
క్యూర్‌ఫిట్‌లో రూ. 545 కోట్ల పెట్టుబడి..టాటాకు వాటా
ముంబై: ఫిట్నెస్ సర్వీసుల సంస్థ క్యూర్‌ఫిట్ హెల్త్‌కేర్‌లో టాటా డిజిటల్ సంస్థ వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 75 మిలియన్ డాలర్లు (సుమారు 545 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. దీనికి సంబంధించి క్యూర్‌ఫిట్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా డిజిటల్ తెలిపింది. అయితే, ఎంత మేర వాటాలు తీసుకుంటున్నదీ మాత్రం వెల్లడించలేదు. ఈ డీల్ ప్రకారం క్యూర్‌ఫిట్ వ్యవస్థాపకుడు, సీఈవో ముకేశ్ బన్సల్.. టాటా డిజిటల్లో ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడతారు. సంస్థకు ఆయన అనుభవం గణనీయంగా తోడ్పడగలదని టాటా డిజిటల్ మాతృ సంస్థ టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. టాటా డిజిటల్లో భాగం కావడం వల్ల దేశవ్యాప్తంగా కస్టమర్లకు మరింతగా చేరువయ్యేందుకు తోడ్పాటు లభించగలదని బన్సల్ తెలిపారు. దేశీయంగా ఫిట్నెస్, వెల్నెస్ మార్కెట్ ఏటా 20 శాతం వృద్ధి చెందుతోందని, 2025 నాటికి 12 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదన్న అంచనాలు ఉన్నాయని టాటా డిజిటల్ పేర్కొంది. చదవండి : డివిడెండ్ ప్రకటించిన ఎంఆర్ఎఫ్ -
రండి.. పెట్టుబడులు పెట్టండి!
న్యూఢిల్లీ: కరోనా రాకతో ఫార్మా, హెల్త్‌కేర్ కంపెనీల వ్యాపార అవకాశాలు భారీగా పెరిగాయి. ఏడాది కాలంలో వాటి ఆదాయాలు, లాభాలు గణనీయంగా వృద్ధి చెందడాన్ని గమనించొచ్చు. ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన విస్తృతం కావడంతో భవిష్యత్తులోనూ ఈ కంపెనీలకు వ్యాపార అవకాశాలు పుష్కలమేనని మార్కెట్ పండితుల అంచనా. ఇన్వెస్టర్ల నుంచి నిధుల సమీకరణకు ఫార్మా, హెల్త్‌కేర్ కంపెనీలకు ఇంతకంటే అనుకూల సమయం ఎప్పుడుంటుంది? అందుకేనేమో చాలా కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో/ప్రజలకు తొలిసారిగా వాటాలను ఆఫర్ చేయడం) కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కరోనా వైరస్‌తో లాభపడే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లలో ఆసక్తి ఇతోధికం అయినట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఇదే మద్దతుగా 2021లో సుమారు 12 ఫార్మా, హెల్త్ కేర్ కంపెనీలు నిధులను సమీకరించనున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల నుంచి కేవలం ఏడు కంపెనీలే ఐపీవోకు రాగా.. ఈ ఒక్క ఏడాది రికార్డు స్థాయి ఐపీవోల వర్షం కురవనుందని తెలుస్తోంది. కొన్ని ఇప్పటికే దరఖాస్తులు: ఐపీవోకు సంబంధించి ఎనిమిది కంపెనీలు ఇప్పటికే ‘డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్’ (డీఆర్‌హెచ్‌పీ)ను సెబీ వద్ద దాఖలు చేశాయి. ఈ జాబితాలో గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్, సుప్రియా లైఫ్ సైన్సెస్, క్రస్నా డయాగ్నొస్టిక్స్, కిమ్స్, తత్వ చింతన్ ఫార్మా, సిఘాచి ఇండస్ట్రీస్, విండ్లాస్ బయోటెక్ కంపెనీలు ఉన్నాయి. అలాగే, థర్డ్‌పార్టీ బీమా సేవలు అందించే ప్రముఖ కంపెనీ మెడిఅసిస్ట్ సైతం సెబీ వద్ద డీఆర్‌హెచ్‌పీ సమర్పించింది. డీఆర్హెచ్పీనే ఆఫర్ డాక్యుమెంట్గానూ పిలుస్తారు. ఐపీవోకు సంబంధించిన వివరాలతో మర్చంట్ బ్యాంకర్లు రూపొందించే ప్రాథమిక డాక్యుమెంట్ ఇది. అదే విధంగా మిగిలిన కంపెనీల ఐపీవో ప్రణాళికలు సైతం వివిధ దశల్లో ఉన్నాయి. ఇలా ఐపీవో ప్రక్రియను ఆరంభించిన కంపెనీల్లో ఎమ్క్యూర్ ఫార్మా, వెల్నెస్ ఫరెవర్, విజయా డయాగ్నోస్టిక్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఫార్మా, హెల్త్‌కేర్, వాటి అనుబంధ రంగాల్లోని పటిష్టమైన కంపెనీల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగినట్టు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్ అజయ్ సరఫ్ తెలిపారు. ఎమ్క్యూర్ నుంచి పెద్ద ఇష్యూ.. గ్లెన్‌మార్క్ ఫార్మా అనుబంధ కంపెనీ అయిన గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ గత నెలలో ఐపీవోకు సెబీ వద్ద దరఖాస్తు దాఖలు చేయగా.. సుమారు రూ.2,000 కోట్ల మేర నిధులను సమీకరించే ప్రతిపాదనతో ఉంది. పుణేకు చెందిన ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ జనరిక్ డ్రగ్ తయారీలో ప్రముఖ కంపెనీ. ఈ సంస్థ ఐపీవో రూపంలో రూ.3,500–4,000 కోట్లను సమీకరించాలనుకుంటోంది. ఇందుకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లతో సంప్రదింపులు మొదలు పెట్టింది. సిరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత అదర్ పూనవాలాకు చెందిన రిటైల్ ఫార్మసీ చైన్ కంపెనీ వెల్నెస్ ఫరెవర్ రూ.1,200 కోట్లను ఐపీవో ద్వారా సమీకరించే ప్రతిపాదనతో ఉంది. ‘‘కరోనా కారణంగా భారత హెల్త్‌కేర్ వ్యవస్థలో భారీ మార్పు చోటు చేసుకుంది. ఔషధాలు, టీకాలు, వ్యాధి నిర్దారణ పరీక్షలు, వైద్య ఉపకరణాలు, హాస్పిటల్స్ తదితర కంపెనీల వ్యాపార అవకాశాలు రానున్న కాలంలో ఎన్నో రెట్లు పెరగనున్నాయి. హెల్త్‌కేర్ రంగం మొత్తం మీద ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపిస్తున్నారు’’ అని డీఏఎమ్ క్యాపిటల్ ఎండీ, సీఈవో దర్మేష్ మెహతా చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి కరోనా రెండో విడత మొదలు కాగా.. అప్పటి నుంచి నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 7 శాతం ర్యాలీ చేసింది. ఇదే కాలంలో నిఫ్టీ–50లో రాబడులు ఏమీ లేవు. 2020లో ఈ రంగం నుంచి ఐపీవోకు వచ్చిన ఏకైక కంపెనీగా గ్లాండ్ ఫార్మాను చెప్పుకోవాలి. ఈ సంస్థ ఐపీవో రూపంలో రూ.5,230 కోట్లను (2020 నవంబర్‌లో) సమీకరించింది. ఐపీవో ఇష్యూ ధర రూ.1,500 కాగా.. ఆరు నెలల్లోనే స్టాక్ నూరు శాతం రాబడులను ఇచ్చింది. పబ్లిక్ ఆఫర్ బాటలో.. కంపెనీ ఐపీవో ఇష్యూ అంచనా (రూ.కోట్లలో) ఎమ్క్యూర్ ఫార్మా 3,500 స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 3,000 గ్లెన్‌మార్క్ లైఫ్‌సైన్సెస్ 2,000 సుప్రియా లైఫ్‌సైన్సెస్ 1,200 క్రస్నా డయాగ్నొస్టిక్స్ 1,200 వెల్నెస్ ఫరెవర్ 1,200 మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ 840 కిమ్స్ హాస్పిటల్స్ 700 విండ్లాస్ బయోటెక్ 600 తత్వ చింతన్ ఫార్మా 450 -
ఆరోగ్య సంరక్షణ గాల్లో దీపమేనా?
వైద్యం పేరిట ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయి. ఇది పోవాలంటే, మెరుగైన వైద్యం ప్రజలకు అందాలంటే దేశంలోని ప్రతి జిల్లాలోనూ పోస్ట్ గ్రాడ్యుయేట్ రెఫరల్ ఆసుపత్రిని తప్పకుండా నెలకొల్పాలి. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. దేశంలో ప్రజారోగ్య సంరక్షణ సమర్థంగానూ, ఉచితంగానూ అందుబాటులో ఉంటున్నట్లయితే ప్రైవేట్ ఆసుపత్రుల అవసరం సామాన్యులకు ఉండదు. అలాగే ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వాల ప్రథమ బాధ్యతల్లో ఒకటి అనే చైతన్యం ఓటర్లలో పెంపొందాలి. కులం, తెగ, జెండర్, నేపథ్యంతో పనిలేకుండా ఏ భారతీయుడినైనా సరే వారికీ వారి కుటుంబానికి ప్రప్రథమంగా కావలసింది ఏమిటి అని అడిగితే పదిమందిలో కనీసం ఎనిమిదిమంది మంచి ఆరోగ్యం, దాంతోపాటు సంతోషం కావాలని కోరుకుంటారు. అయితే ఒక పోలింగ్ బూత్‌లోని ఏ వ్యక్తినైనా పట్టుకుని అభ్యర్థిని ఎంచుకోవడంలో అతడి లేక ఆమె ప్రధమ ప్రాధాన్యత ఏది అని అడిగారనుకోండి.. ఆరోగ్య సంరక్షణను కల్పించే అభ్యర్థి తమకు కావాలనే సమాధానం వారినుంచి కలికానిక్కూడా వినిపించదు. భారతదేశంలో ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థ కుప్పగూలిపోవడానికి మన ఓటర్లలోని ఈ నిర్లిప్తతే ప్రధాన కారణం. తాము ఎన్నుకుంటున్న ప్రభుత్వ ప్రధాన విధుల్లో ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, ఉండాలని మన ఓటర్లు అస్సలు ఆలోచించడం లేదు. మరిన్ని ఆసుపత్రులు నిర్మించడం, ఉన్న ఆస్పత్రులను నవీకరించి మెరుగుపర్చడం అనేది జరగకపోతే, అభివృద్ధి కావాలంటే ఓటు వేయండని రాజకీయ పార్టీల, నేతలు చెప్పే దానికి ఏమాత్రం విలువ ఉంటుంది? ఒకసారి అభివృద్ధి లేక వికాస్ అనే భావనను ఎవరికీ అర్థం కాని అమూర్త భావనగా మార్చేశాక, మన రాజకీయ నాయకులు దాన్ని వాడుకోవడంలో మీడియా సైతం బ్రహ్మాండంగా తనవంతు పాత్ర పోషిస్తోంది. పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకేసి చూద్దాం. ఈ మూడు రాష్ట్రాలకు చండీగడ్ లోని పీజీఐ ఆసుపత్రి మాత్రమే ఏకైక దిక్కుగా ఉంటోంది. దశాబ్దాలుగా ఈ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతూ ఉంటోంది. చండీగఢ్ లోని పీజీఐ ఆసుపత్రి గేటు వద్దకు చేరుకోవడానికి ముందే అంబులెన్స్‌లోనే ప్రాణాలు కోల్పోతున్న భయానక గాథలు ఎన్నో ఎన్నెన్నో. ఒకవేళ ప్రాణాలు నిలుపుకుని వారు ఆసుపత్రిలోకి అడుగుపెడితే చికిత్సకోసం గంటలపాటు ఆసుపత్రి ప్రాంగణంలో వేచి చూడక తప్పదు. దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. దేశంలో ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్న ఎయిమ్స్, పీజీఐ వంటి రిఫరల్ ఆసుపత్రులు తమ సామర్థ్యానికి మించి రోగులకు సేవలందిస్తూ అలిసిపోతున్నాయి. నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ దేశంలో కలికానిక్కూడా లేదు కాబట్టే.. ఇలాంటి రిఫరల్ ఆసుపత్రులపై ఇంత అలవిమాలిన భారం పడుతోంది. చాలా ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతే ఇవ్వడం లేదు. అందువల్లనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు కనీస అవసరాలకు కూడా దూరమైపోయాయి. దేశ స్థూల దేశీయోత్పత్తిపై, ఆర్థిక వ్యవస్థపై పేలవమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల ప్రభావం ఏ స్థాయిలో ఉందనే అంశం ఇప్పటికే చాలాసార్లు వెల్లడవుతూవచ్చింది. ఇలాంటి దుష్ప్రభావం బారిన పడకుండా అభివృద్ధి చెందిన దేశాలు చాలావరకు తమ పౌరులకు ఏదో ఒక రూపంలో రక్షణ ఛత్రాన్ని ఏర్పాటు చేయగలిగాయి. అదే భారతదేశం విషయానికి వస్తే కుటుంబంలో ఒక్క సభ్యుడు తీవ్ర వ్యాధికి, అస్వస్థతకు గురైతే సంవత్సరాలుగా పొదుపు చేస్తూ వచ్చిన మొత్తాలు కరిగిపోతాయి. ఈవిధంగా ఆరోగ్య సంబంధిత వ్యయం కారణంగానే ప్రతి సంవత్సరమూ దేశ జనాభాలో 3.5 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువ స్థాయికి పడిపోతున్నారని మీడియా వార్తలు చెబుతున్నాయి. తమ ప్రియతముల, ఆప్తుల వైద్య ఖర్చులు భరించడానికి సమస్తాన్ని అమ్ముకుంటున్న, తాకట్టుపెడుతున్న కుటుంబాల గాధలు ఒకటీ రెండూ కాదు. చాలావరకు ఇలాంటి గాథలు విషాదాంతాలుగానే ముగిసిపోతుంటాయి. ఆస్తుల్ని కరగదీసినా కుటుంబం వ్యాధుల పాలైన తన ప్రియతములను కోల్పోతూనే ఉంటుంది. దేశంలోని పేలవమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల బారినపడి ఘోరంగా నలుగుతున్న బాధితుల్లో దిగువ మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా ఉంటున్నాయి. వీరికి ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు అందని ద్రాక్షపండుగానే ఉంటున్నాయి. పైగా అత్యుత్తమమైన టయర్ 1 ఆసుపత్రులు వీరికి అందుబాటులో ఉండటం లేదు. దీంతో అనివార్యంగా వీరు ప్రమాణాలు లేని, నాసిరకం సామగ్రితో కునారిల్లుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల బారిన పడుతున్నారు. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు రోగి కుటుంబాలనుంచి లక్షలాది రూపాయలను కొల్లగొడుతూ చికిత్సను మధ్యలోనే నిలిపివేస్తున్నాయి. ఇలాంటి ఆసుపత్రుల చుట్టూ ఉంటున్న ల్యాబ్‌లు డాక్టర్ల తరపున సేవలందించే అటెండెంట్లతో నిండి పచ్చి మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ ప్రయోగశాలలు అందించే కమిషన్ల కోసం కక్కుర్తిపడుతున్న వైద్యపుంగవులు అయినదానికి కానిదానికి టెస్టుల మీద టెస్టులు రాస్తూ రోగులను ఇలాంటి ల్యాబ్‌ల బారిన పడేస్తున్నారు. కోవిడ్–19 సంక్షోభం వైద్యులు, ల్యాబ్‌లు వంటి ఈ తరహా పరాన్న జీవుల పంట పండిస్తున్నట్లుంది. భారత్ నిజమైన గ్లోబల్ లీడర్‌గా ఆవిర్భవించాలంటే ఈ సమస్యను తప్పకుండా పరిష్కరించాల్సిందే. ఉచిత, ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ అనేది ఏ రకంగానూ ఉచితంగా లభిస్తోందని చెప్పడానికి లేదు. దాన్ని ఇకనుంచి మనం ప్రీ–పెయిడ్ (ముందస్తుగా చెల్లించిన) ఆరోగ్య సంరక్షణ అని పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్య సంరక్షణపై పెట్టే ప్రతి పైసానూ మనం ఏదో ఒకరకంగా పన్నుల నుంచే చెల్లిస్తున్నామని గ్రహించి తీరాలి. చివరకు అంగట్లో అగ్గిపెట్టె కొనుక్కునే కూలీ సైతం దానిపై పరోక్షంగా పన్ను చెల్లిస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలో పన్నుల రూపంలో లక్షల కోట్ల రూపాయలను పిండుకుంటున్న ప్రభుత్వాలు పన్ను చెల్లింపుదార్లకు కనీసమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించాల్సి ఉంటుంది. దేశంలో నెలకొల్పిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో చాలావరకు రాజ కీయ కుటుంబాల ప్రత్యక్ష యాజమాన్యంలో ఉంటున్నాయి లేక వారు అనుమతించిన వారి యాజమాన్యంలో ఉంటున్నాయి. ఈ ఆసుపత్రులకు ఉచితంగా భూమిని అప్పగిస్తున్నారు. రాజకీయ నేతల సమ్మతి లేనిదే దేశంలో నిజమైన వాణిజ్య సంస్థలు సైతం ఇలాంటి రాయితీలను ఒక్కదాన్నైనా పొందలేవు. ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపర్చడానికి రాజకీయ వర్గానికి ఈ భారీ స్థాయి రాయితీలే అడ్డుపడుతున్నాయి. దేశంలో ప్రజారోగ్య సంరక్షణ సమర్థంగానూ, ఉచితంగానూ అందుబాటులో ఉంటున్నట్లయితే ఈ ప్రైవేట్ ఆసుపత్రులను ఉపయోగించుకునేది ఎవరు? పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య సంస్థలు (పీజీఐ) దేశంలో 1950, 60లలో ఉనికిలోకి రాగా, అప్పటినుంచి దేశ జనాభా ఎన్నో రెట్లు పెరుగుతూ వచ్చింది. ఇప్పటి వైద్య అవసరాలు తీరాలంటే కనీసం జిల్లాకు ఒక పీజీఐ స్థాయి రెఫరల్ ఆసుపత్రిని తప్పక నిర్మించాల్సి ఉంది. రెండు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. ఉచిత, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కల్పన రాజకీయ పార్టీలకు ప్రధమ ప్రాధాన్యతగా ఉండాలి. ఈ ప్రాథమిక అంశాలను మేనిఫెస్టోల్లో పొందుపర్చేవారికే ఓటువేసేలాగా మన ఓటర్లు కుల, తెగ పరమైన రాజకీయాలకు అతీతంగా పరిణితి చూపాల్సిఉంది. ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వాల ప్రథమ బాధ్యతల్లో ఒకటి అనే చైతన్యం ఓటర్లకు కలిగినప్పుడు రాజకీయ పార్టీలనుంచీ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయగలుగుతారు. ప్రజారోగ్య వ్యవస్థ కుప్పగూలిపోవడానికి బాధ్యులెవరో కూడా గ్రహించి వారే ఈ సమస్యను పరిష్కరించాలని ఓటర్లు డిమాండ్ చేయాలి. గుల్ పనాగ్ వ్యాసకర్త రచయిత్రి, నటి, వాణిజ్యవేత్త (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కరోనాపై భయం వద్దు.. జయం మనదే!
ధైర్యంగా ఉంటే కరోనాపై సగం గెలిచినట్టే. నిజానికి మొదట్లో కరోనా సోకినవారి కంటే ఇప్పటి బాధితులు కొంత అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే మన దేశంతోపాటు అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇటలీ.. ఇలా ప్రపంచవ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న పరిశోధనలతో గతంలో కంటే ఎక్కువ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దాంతో వ్యాధి తీరుపై కొత్త విషయాలు తెలిసి, మరింత స్పష్టత ఏర్పడింది. దానికి అనుగుణంగా చికిత్స ప్రక్రియల్లోనూ మార్పులొచ్చాయి. ఫలితంగా గతంలో కంటే మరెన్నో ప్రాణాలు కాపాడటం ఇప్పుడు సాధ్యమవుతోందని అంటున్నారు పలువురు వైద్య నిపుణులు. కరోనా చికిత్స పద్ధతుల్లో వెలుగులోకి వస్తున్న కొత్త పరిజ్ఞానంతో ప్రస్తుతం రోగులను కాపాడటం గతంలో కంటే సులువైంది. పైగా దాదాపు ఒక శాతం రోగులకు మాత్రమే ప్రాణాపాయం కలగజేసే కరోనా ఇతర వైరస్‌లతో పోలిస్తే నిరపాయకరమైనదే. ఇప్పుడు మనమంతా చేయాల్సింది కరోనాకు భయపడటం, ఆందోళన చెందడం కాదు.. అది సోకిన వారిని సానుభూతితో చూడటం, ఆత్మహత్యల వంటి వాటికి పాల్పడకుండా మానసికంగా అక్కున చేర్చుకోవడమే. కరోనా వెలుగుచూసిన కొత్తలో లాక్డౌన్ వల్ల చాలావరకు ప్రయోజనం చేకూరి దాని వ్యాప్తి అదుపులో ఉంది. కానీ సడలింపులు మొదలుపెట్టినప్పటి నుంచి దాని వ్యాప్తి విస్తృతమైంది. అలా విస్తరించడం మరింత తీవ్రమైనప్పటికీ దాని నుంచి రక్షించుకునే విధానాలు, మార్గాలు కొత్తవి తెలిసివచ్చాయి. అవేమిటంటే.. అప్పట్లో ఊపిరితిత్తుల సమస్య.. కానీ ఇప్పుడు.. కోవిడ్–19 సోకితే అది నిమోనియాతో ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ కలిగిస్తుందనేది కరోనా వ్యాప్తిచెందిన తొలినాళ్లలో ఏర్పడిన సాధారణ అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం ఆ దిశగానే ఆలోచిస్తూ, అందుకు అనుగుణంగా వీలైనన్ని వెంటిలేటర్లు అందుబాటులో ఉంచారు. కానీ ఇది రక్తంలో గడ్డలు (క్లాట్స్) కూడా ఏర్పరుస్తుందనీ, దాంతో ఎంబాలిజమ్ సమస్యతో మరణాలు సంభవించవచ్చని తరువాత రోజుల్లో తెలిసింది. దీనికి అనుగుణంగా జూన్ నుంచి రోగులకు కొత్త ప్రొటోకాల్ అందుబాటులోకి వచ్చింది. రక్తంలో క్లాట్స్ వచ్చే అవకాశం ఉన్న వారికి ఆస్పిరిన్, హిపారిన్ వంటి రక్తాన్ని పలచబార్చే మందులనిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. నాడు గుర్తించని ‘హ్యాపీ హైపాక్సియా’ రక్తంలో ఆక్సిజన్ మోతాదులు తగ్గడాన్ని హైపాక్సియా అంటారు. హైపాక్సియా ఉన్న రోగికి ఆయాసం, ఊపిరి సరిగా అందకపోవడం వంటి సమస్యలుంటాయి. కానీ కొద్దిమంది రోగుల్లో ఆక్సిజన్ శాచ్యురేషన్ తగ్గుతున్నా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అంటే ఆయాసం, ఊపిరి అందకపోవడం వంటివి ఉండవు. దాంతో వారు ఉన్నట్లుండి కుప్పకూలిపోతారు. ఆక్సిజన్ తగ్గినా ఎలాంటి లక్షణాలు కనిపించని కండిషన్‌ను ‘హ్యాపీ హైపాక్సియా’ అంటారు. గతంలో కొందరు బాధితుల్ని హాస్పిటల్‌కు తీసుకొచ్చే సమయానికి వారి రక్తంలో ఆక్సిజన్ మోతాదు 70% వరకు ఉండేది. కానీ లక్షణాలుండేవి కావు. ఇటువంటి వారు అకస్మాత్తుగా కుప్పకూలి మరణించేవారు. అయితే ఇప్పుడు పెరిగిన పరిజ్ఞానంతో చాలామంది ఆక్సీమీటర్/పల్స్ ఆక్సీమీటర్లతో స్వయంగా తామే రక్తంలో ఆక్సిజన్ మోతాదులను చెక్ చేసుకుంటున్నారు. 93% కంటే తక్కువ ఆక్సిజన్ ఉంటే అది ప్రమాదకరమని గుర్తించి, హాస్పిటల్‌కు వస్తున్నారు. ఫలితంగా అవాంఛిత మరణాలు తగ్గుతున్నాయి. పాత మందులే సరికొత్తగా.. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నాటికి లక్షణాలను బట్టి వాడే మందులు (సింప్టమాటిక్ ట్రీట్మెంట్) తప్ప, పేషెంట్లకు ఎలాంటి మందులు వాడాలనే విషయమై అవగాహన లేదు. కానీ ఇటీవల ఫావిపిరావిర్, రెమ్డిస్విర్ వంటి యాంటీవైరల్ మందులతో పాటు వైరస్‌పై వాటి ప్రభావాలు తెలియవచ్చాయి. దీంతో వాటి సాయంతో రోగిలో వైరల్ లోడ్ తగ్గిస్తూ, అసలు రోగి హైపాక్సియా స్థితికి వెళ్లకుండానే కాపాడే ఔషధ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. కరోనా నుంచి రక్షణకు ‘గౌట్’ మందులు కరోనా బాధితుల్లోని రక్తప్రసరణ వ్యవస్థలో రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడే చిన్నచిన్న క్లాట్స్ కారణంగా ప్రాణాపాయం సంభవిస్తోంది. మన రక్తంలో ఉండే తెల్లరక్తకణాలు ఉత్పత్తి చేసే ‘ఆల్ఫా డిఫెన్సిన్’ అనే రసాయనం కారణంగా ఇవి ఆవిర్భవిస్తున్నాయని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి ఊపిరితిత్తులు, గుండెకు చేరి అకస్మాత్తు మరణాలకు దారితీస్తున్నాయి. అయితే మనుషుల్లో బొటనవేలు ఎర్రగా వాచడం, కీళ్ల మధ్య యూరిక్ యాసిడ్ స్ఫటికం ఏర్పడటం వల్ల తీవ్రమైన నొప్పితో బాధపట్టే ‘గౌట్’ అనే కీళ్లవాతానికి ఉపయోగించే మందు ‘కాల్చిసిన్’ వంటివి వాడుతూ ఈ క్లాట్స్‌ను అరికట్టవచ్చని తేలింది. దాంతో ఇటీవల ‘కాల్చిసిన్’ వినియోగం చాలా ప్రాణాలను కాపాడుతోంది. ప్లాస్మా థెరపీ కరోనా సోకిన తర్వాత, యాంటీబాడీస్ ఇంకా అభివృద్ధి కాకుండా, పరిస్థితి క్లిష్టంగా ఉన్న రోగులకు ప్లాస్మాథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ రూపేణా కూడా ప్రాణాలను కాపాడే వీలు కలిగింది. ఓరగా పడుకోబెడితే ‘ఊపిరి’ బాధితుడికి ఊపిరి అందనప్పుడు ముఖం/తల ఒకపక్కగా ఓరగా ఉంచుతూ బోర్లా పడుకోబెడితే ఊపిరి మరింత ఎక్కువగానూ, సౌకర్యంగానూ అందుతుంది. ఇలా బోర్లా పడుకోబెట్టే భంగిమను ‘ప్రోన్ పొజిషన్’ అంటారు. ఇలా చేయడం ద్వారా కూడా రోగికి మరింత ఆక్సిజన్ అందేలా చేసి, హైపాక్సియాకు గురికాకుండా చూసి, రోగి ప్రాణాలు రక్షించవచ్చు. వైరస్ కంటే ‘సైటోకైన్స్’తోనే ఒక్కోసారి హాని ఒకనాడు వైరస్ కారణంగానే రోగికి ముప్పు కలుగుతోందనే అభిప్రాయం వైద్యవర్గాల్లో ఉండేది. కానీ ఇప్పుడు తెలిసిన కొత్త విషయమేమిటంటే–ఓ వ్యక్తిని కాపాడేందుకు ఉద్దేశించిన సొంత రోగనిరోధక వ్యవస్థే తీవ్రంగా ప్రవర్తిస్తూ రోగికి నష్టం చేస్తోందని. సాధారణంగా రోగిలోకి ఏవైనా బయటి అపాయాలు ప్రవేశిస్తే, అతడిని రక్షించడానికి వ్యాధినిరోధక వ్యవస్థ రంగంలోకి దిగుతుంది. ఇందులో భాగంగా ‘సైటోకైన్స్’ అనే రక్షణ కణాలు పెద్దఎత్తున పుడతాయి. శక్తిమంతమైన ఈ కణాలు దేహంలో పెద్దసంఖ్యలో ఉత్పత్తవుతూ వైరస్‌పై దాడిచేస్తాయి. వాటిని తుదముట్టించే క్రమంలో ఓ తుపాన్‌లా విరుచుకుపడే ఈ సైటోౖకైన్ ముట్టడిని ‘సైటోకైన్ స్టార్మ్’ అంటారు. నిజానికి ఈ సైటోకైన్ కణాలు వైరస్ అంతుచూసే ప్రక్రియలో భాగంగా విచక్షణారహితంగా చెలరేగిపోతూ.. రోగి తాలూకు ఆరోగ్యకరమైన సొంత కణాలనే దెబ్బతీస్తాయి. దాంతో వైరస్ కంటే ఒక్కోసారి సొంత రోగనిరోధక కణాలే మని షికి హానికరంగా మారతాయి. ఈ విషయం తెలిశాక వైద్యనిపుణులు తాము ఎప్పట్నుంచో వాడుతూ వస్తున్న ‘ప్రెడ్నిసోన్’ వంటి స్టెరాయిడ్స్‌ను వాడటం మొదలుపెట్టి సత్ఫలితాలను రాబట్టారు. మనకు ఈ స్టెరాయిడ్స్ వాడటం ఎప్పట్నుంచో తెలుసు. కానీ సొంత వ్యాధి నివారణ కణాల తీవ్రమైన, ప్రతికూలమైన చర్యలెలా దెబ్బతీస్తున్నాయో తెలిసినప్పటి నుంచి స్టెరాయిడ్స్‌ను అత్యంత చాకచక్యంగా వాడుతూ డాక్టర్లు రోగులను రక్షిస్తున్నారు. స్టోరీ ఇన్పుట్స్ ► డాక్టర్ మహబూబ్‌ఖాన్, సూపరింటెండెంట్ అండ్ ప్రొఫెసర్, హెచ్ఓడీ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి, ఎర్రగడ్డ, హైదరాబాద్ ► డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు, సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్, మేనేజింగ్ డైరెక్టర్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ ► డాక్టర్ రాహుల్ మెడెక్కర్, సీఈవో, కాంటినెంటల్ హాస్పిటల్స్ -
ఈమెయిల్ ట్రిక్స్.. సైబర్ ఎటాక్స్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో బ్యాంకులు, హెల్త్‌కేర్ రంగంలో పనిచేస్తున్న పలు సంస్థలను సైబర్‌దాడులు గజగజలాడిస్తున్నాయి. ప్రతిరోజూ సరాసరిన మూడు సైబర్ ఎటాక్స్ తమ వద్ద నమోదవుతున్నట్లు నగర కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ అండ్ కంట్రోల్ అసోసియేషన్’ తాజా అధ్యయనంలో తేలింది. సైబర్ దాడులతోపాటు ఫిషింగ్ మెయిల్స్‌తో ఆయా బ్యాంకింగ్, నాన్‌బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, హెల్త్‌కేర్ రంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థలు ఈ దాడులకు గురవుతున్నట్లు ఈ సంస్థ తాజా అధ్యయనంలో తేలింది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, మేనేజ్మెంట్ హోదాలో ఉన్నవారికి నిత్యం వివిధ సంస్థలు, వ్యాపార, వాణిజ్య లావాదేవీల నిమిత్తం వచ్చే మెయిల్స్‌లో సుమారు 26 శాతం ఫిషింగ్ మెయిల్స్(చౌర్యానికి పాల్పడేవి) ఉన్నాయని.. ఉద్యోగులు ఏమరుపాటుగా వీటిని తెరిచి చూస్తే ఆయా సంస్థల డేటాబేస్ చౌర్యంతోపాటు సిస్టం, సాఫ్ట్వేర్లు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని తేల్చింది. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు విధిగా సైబర్ సెక్యూరిటీ అంశంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ఇప్పటికే తమ సంస్థకు చెందిన సుమారు 800 మంది నిపుణులు సైబర్‌దాడుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా సంస్థలకు అవగాహన కల్పించడంతోపాటు పరిశోధన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ఉపయోగాలివే.. సైబర్ దాడుల నిరోధానికి ఇప్పటికే నగరంలో సైబర్ సెక్యూరిటీ క్లస్టర్లు పనిచేస్తున్నాయని.. వాటితో చేకూరే ప్రయోజనాలను ఈ సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. సైబర్ నేరగాళ్ల సమాచారం, వారు వినియోగిస్తున్న సాంకేతికతపై సమస్త సమాచారాన్ని తెలుసుకునే హబ్‌ను ఏర్పాటు చేయడం, సైబర్ సెక్యూరిటీ క్లస్టర్లో చేరిన సంస్థలు లేదా దేశాలు, సంస్థలకు సైబర్ నేరాల నిరోధానికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తారు. నేరాలపై జరిపే పరిశోధనకు నిపుణులు సహకరిస్తారు. ఆయా సంస్థల మధ్య సమన్వయం సాధించడంతోపాటు సైబర్ నేరాలు జరిగిన తీరును సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తారు. భవిష్యత్‌లో ఇలాంటి నేరాలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తారు. విశ్వవ్యాప్తంగా సైబర్ నేరాల నిరోధానికి అవలంభించాల్సిన సాంకేతిక వ్యూహాలను సిద్ధం చేస్తారు. ఈ విషయంలో ఆయా సంస్థలకు అవగాహన కల్పించడంతోపాటు మార్గనిర్ధేశం చేస్తారు. చర్యలివే.. సైబర్ దాడులపై అప్రమత్తమైన రాష్ట్ర ఐటీశాఖ సైతం ఈ విషయంలో పలు చర్యలు చేపట్టింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాల డేటా భద్రంగా దాచేందుకు సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్‌ను నిర్వహిస్తున్న విషయం విధితమే. సైబర్‌దాడుల నిరోధానికి సైబర్ సెక్యూరిటీ పాలసీని కూడా తీసుకొచ్చినట్లు ఐటీశాఖ వర్గాలు‘సాక్షి’కితెలిపాయి.సెక్యూరిటీఆపరేషన్స్‌సెంటర్‌తోపాటుహేగ్‌సెక్యూరిటీడెల్టా,సీడాక్‌సంస్థలసౌజన్యంతోసైబర్‌దాడులనిరోధానికి ప్రయత్నిస్తున్నామన్నాయి. పెరుగుతున్న సైబర్ నేరాలు.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గతేడాదిగా సుమారు వెయ్యికిపైగా సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఇందులో సాంకేతిక, సాంకేతికేతర అంశాలున్నాయి. పలు బ్యాంకులు, ఆర్థిక, వాణిజ్య సంస్థలకు చెందిన కంప్యూటర్లు, కంప్యూటర్ల నెట్వర్క్, హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, డేటా, సైబర్ స్పేస్‌కు ముప్పు వాటిల్లడం, డేటా తస్కరణ, క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలు వంటి నేరాలు చోటుచేసుకున్నాయి. ఈ నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, ప్రోగ్రామ్‌లు రూపొందించే అంశాలను సైబర్ సెక్యూరిటీ కోర్సులో భాగంగా ఉన్నాయి. ఈ రంగంలో మరింత పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. సమాచారం, డేటా భద్రత వంటి అంశాలకు ఇటీవలి కాలంలో పలు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ కోర్సులకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోందని విశ్లేషిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ అంశంపై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉన్నతాధికారులకు అవగాహన తప్పనిసరి అని.. ఇందుకోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఈ సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. -
‘కోవిడ్ చికిత్సకు అదనంగా రూ.1000 కోట్లు’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో అదనంగా మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ సదుపాయలు కల్పించే దిశగా సాగుతున్నామని, వాటిలో ఇప్పటికే 3 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కోవిడ్ సమీక్షా సమావేశంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. కొత్తగా తూర్పు గోదావరి జీజీహెచ్, పశ్చిమగోదావరిలో ఆశ్రం, గుంటూరు జీజీహెచ్, అనంతపూర్ జీజీహెచ్, శ్రీకాకుళం జీజీహెచ్ ఆస్పత్రులను రాష్ట్రస్థాయి కోవిడ్ ఆస్పత్రులుగా మారుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. తద్వారా క్రిటికల్‌కేర్ కోసం 2380 బెడ్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అనంతపూర్, శ్రీకాకుళం తప్ప మిగిలిన మూడు ఆస్పత్రులనూ క్రిటికల్ కేర్ సేవలు అందించడానికి సిద్ధం చేశామన్నారు. మొత్తంగా 8 ఆస్పత్రులు క్రిటికల్ కేర్ ఆస్పత్రులుగా మార్చామన్నారు. కాగా, వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు చెప్పారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం వీటిని ఖర్చు చేయాలని సూచించారు. అవసరమైన సిబ్బందిని నియమించుకుని మరణాలు తగ్గిచండంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్ వంటి మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై దృష్టిపెట్టాలని సీఎం చెప్పారు. క్వారంటైన్ సెంటర్లలో సేవలపై ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వెల్లడించారు. కోవిడ్ టెస్టులు, క్వారంటైన్ సదుపాయాలకోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. (చదవండి: కొత్త మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు) రికార్డుస్థాయిలో పరీక్షలు రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, పాజిటివిటీ అంశాలను అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో రోజుకు రికార్డు స్థాయిలో 58వేల పరీక్షలు చేస్తున్నామన్నారు. కంటైన్ మెంట్ క్లస్టర్లు, కోవిడ్ సోకడానికి ఆస్కారం అధికంగా ఉన్న వారిపై దృష్టి పెట్టి ఈ పరీక్షలు చేస్తున్నామని, దీనివల్ల పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగిందని వివరించారు. దాదాపు 90 శాతం పరీక్షలు వీరికే చేస్తున్నామన్నారు. రానున్న కొన్నిరోజులు కేసుల తీవ్రత ఇలాగే కొనసాగి, తర్వాత తగ్గుముఖం పడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలిపారు. ఈ అంకెలను చూసి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. నిమ్మ ధరలపై కీలక ఆదేశం రాష్ట్రంలో నిమ్మ ధరలు పడిపోవడంపై సీఎం వైఎస్ జగన్ శుక్రవారం సమీక్షించారు. రైతులకు మేలు చేసేలా కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రభుత్వమే నిమ్మ కొనుగోలు చేసి మద్దతు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశాలిచ్చారు. రేపటి నుంచి నిమ్మ కొనుగోలు చేపడతామని ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి కన్నబాబు మీడియాకు తెలిపారు. ఏలూరు, గుడివాడతో పాటు నిమ్మ మార్కెట్లలన్నింటిలో కొనుగోలు చేపడుతామని చెప్పారు. రైతుకు మద్దతు ధర వచేలా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. (ఫుడ్ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించాలి) -
నువ్వక్కడుంటే.. నేనిక్కడుంటా!
ఒంగోలు మెట్రో: ‘‘నువ్వక్కడుంటే నేనిక్కడుంటా.. ప్రాణం విలవిలా..’’ ఓ సినీ గేయంలో పల్లవి కావొచ్చు కానీ కరోనా మాత్రం ఇదే సందేశం ఇస్తోంది.! లాక్డౌన్ కాలంలో నువ్వు ఇంట్లోనే ఉంటే, నేను వ్యాప్తికి దూరంగా ఉంటానంటోంది.! కరోనా వైరస్ వ్యాప్తి సమాజాన్ని రోజురోజుకూ భయపెడుతోంది. అంతేకాదు, బంధుమిత్రులకు దూరం చేస్తోంది. కేవలం ఫోన్ సంభాషణలే తృప్తికి సంకేతాలుగా మలుస్తోంది. ఇంకోవైపు శుభకార్యాలకీ, అశుభకార్యాలకీ దూరం పెడుతోంది. సన్నిహితులు, బంధుమిత్రులు మరణించినా సరే.. వెళ్లే అవకాశం లేకుండా చేస్తోంది. చివరికి కుటుంబ సభ్యులు మరణించినా ఫోన్ లైవ్‌లో అంత్యక్రియలు చూడాల్సిన దుస్ధితిని కరోనా మహమ్మారి తెచ్చిపెట్టింది. కరోనా సామాజిక జీవితాన్ని మార్చివేసింది. వైరస్ వ్యాప్తికి భయపడి కష్టసుఖాలకు కూడా వెళ్లలేని పరిస్ధితిని చవిచూపిస్తోంది. గతంలో బంధువుల్లో ఎవరికైనా కష్టం వస్తే వెళ్లి పరామర్శించి రావడం ఒక అనివార్య అలవాటు. ఇప్పుడా అలవాటుని కరోనా మార్చేసింది. అదేవిధంగా ఏదైనా శుభకార్యం జరిగితే బంధుమిత్రుల సమూహమంతా పండగ సందడితో నిండి ఉండేది. కుటుంబాలకు కుటుంబాలు రోజుల తరబడి కలిసి మెలసి ఉంటూ ఆహ్లాదకర వాతావరణంలో కబుర్లతో ఉత్సాహంగా గడిపేవారు. ఇప్పుడవేవీ లేవు. నిజానికి విభేదాలు ఉన్నవారు సైతం దుఃఖ సమయాల్లో పరామర్శించుకుంటారు. ఇప్పుడు సొంతవాళ్లు కూడా వెళ్లకుండా కరోనా కట్టడి చేస్తోంది. చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు కనుక, అతడు/ఆమె అంత్యక్రియల్లో పాల్గొని నివాళులరి్పంచి రావడం నాగరిక సమాజంలో సర్వసాధారణం. ఇప్పుడా పరిస్థితి లేదు. శుభకార్యాలకూ దూరం తరతరాల బంధుమిత్రుల సమూహం మధ్య శుభకార్యాలు నిర్వహించుకోవడం మన సంప్రదాయం. అటు ఏడు తరాలు, ఇటు ఏడుతరాలను ఆహా్వనించి శుభకార్యాలు నిర్వహించుకోవడం ఒక గౌరవంగా భావిస్తారు. హిందూ సంప్రదాయంలో ప్రతి సందర్భమూ ఒక పండగే. పంచల పండగ నుంచి రజస్వలలు, వివాహాలు, బారసాలలు తదితర ప్రతీ సందర్భాన్నీ ఉత్సవంలా నిర్వహిస్తారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా వివిధ సందర్భాలను సందడిగా నిర్వహిస్తారు. బంధుమిత్రులు ఒకచోట చేరి విందు భోజనాలు చేసి సంతోషంగా గడపుతారు. ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూ కష్టసుఖాలు పంచుకోవడం అనేది సామాజిక జీవితంలో అత్యవసరం. అటువంటిది కరోనా అన్ని పండగలను, శుభకార్యాలను దూరం చేసింది. సమూహంగా చేరడాన్ని కట్టడి చేసింది. నువ్వక్కడుంటే నేనిక్కడుంటా అంటూ హెచ్చరిస్తోంది. మౌనం గలగలా అంటూ పరిహాసం చేస్తోంది. లేదంటే రానున్న కాలంలో అన్నింటికీ దూరం అవుతారని ప్రమాద ఘంటిక మోగిస్తోంది. ఈ హెచ్చరికలను బుద్ధిపూర్వకంగా స్వీకరించి ఆచరించడం ద్వారా మాత్రమే మంచి రోజులు వస్తాయని వాస్తవాన్ని గుర్తు చేస్తోంది. అన్నీ ఫోన్లోనే.. ప్రస్తుతం అన్నింటికీ ఫోన్ మాత్రమే పెద్ద దిక్కు అయింది. అనారోగ్యంతో ఉన్నవారినైనా, చనిపోయిన వారి కుటుంబ సభ్యులనైనా ఫోన్లోనే పరామర్శించాల్సి వస్తోంది. ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతానికి వెళ్తే కరోనా వైరస్ ప్రమాదం పొంచి ఉంటుందనే భయంతో పరామర్శలకు కూడా జనం వెళ్లడం లేదు. బాధా సందర్భాలైనా సరే, ఫోన్లోనే పరామర్శిస్తున్నారు.కరోనా వైరస్ వ్యాప్తి దరిమిలా ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. -
జుట్టు రాలకుండా ఉండాలంటే....
ప్రపంచంలోనే అందమైన శిరోజాలు కావాలని అందరు కోరుకుంటారు. మనిషికి అందాన్నిచ్చేవి శిరోజాలే. అలాంటిది జుట్టు రోజూ కొద్దికొద్దిగా రాలిపోతుంటే.. బట్టతల వస్తుందనే ఆందోళన మొదలవుతుంది. పౌష్టికాహార లోపం, మానసిక ఒత్తిడి కారణంగా కొందరికి జుట్టు రాలడం సర్వసాధారణమయింది. ఈ క్రమంలో మెరుగైన జీవనశైలిని ఆచరించడం వల్ల జుట్టురాలే సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయిదు నియమాలు పాటించినట్లయితే ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆహార నియమాలు మనం తీసుకునే ఆహార నియమాల ద్వారానే మెరుగైన శిరోజాలను సొంతం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుకోసం కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లలతో కూడిన సమతుల ఆహారమే దివ్యౌషదమని వైద్యులు సూచిస్తున్నారు. జుట్టు రాలడాన్ని నివారించడంలో విటమిన్ ఏ, విటమిన్ ఇ, బయోటిన్, ప్రొటీన్, జింక్ తదితర పోషకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. నిత్యం తలకు నూనె వాడడం చాలామంది తలకు నూనె రాయడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. క్రమం తప్పకుండా నూనెను వాడడం వల్ల జుట్టు రాలే సమస్యను నివారించవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. మీ శిరోజాల రకానికి అనుగుణమమైన ఏ నూనె అయినా ఎంచుకోవచ్చు. హేర్‌స్టైల్ అందంగా కనిపించడానికి చక్కటి హేర్‌స్టైల్ ఉండడం అవసరమే, కానీ స్టైల్ కోసమని విపరీతంగా కెమికల్స్ వాడడం వల్ల జుట్టు రాలే సమస్య మరింత పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కండీషనర్ వాడడం తలస్నానం చేశాక కండీషనర్‌ను వాడడం తప్పనిసరిగా చేయాలి. జుట్టుకు పోషణ ఇవ్వడంతో పాటు మృదువుగా చేయడంలో కండీషనర్ ఎంతో మేలు చేస్తుంది. జుట్టు రాలే వాటిని నివారించడంలో కండీషనర్‌ను ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి జుట్టు రాలే సమస్యకు మానసిక ఒత్తిడి ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు. కేవలం జుట్టు రాలే సమస్యే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న అనేక వ్యాధులకు మానసిక ఒత్తిడి ప్రధాన కారణమని ప్రపంచ ఆహార సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. -
వీటితో చర్మ, జలుబు సమస్యలు దూరం
సాక్షి, చింతలపాలెం(హుజూర్నగర్) : చలికాలంలో పిల్లలు తరుచూ జబ్బుల బారిన పడుతుంటారు. దీనికి కారణం పిల్లల్లో వాతావరణ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు తగినంత రోగ నిరోధక శక్తి లేకపోవడం. దీనికితోడు తినే పదార్థాలు ఇవి ఇష్టంలేదు.. అవి ఇష్టం లేదు అంటూ తినకుండా మొండికేస్తుండడం అందరి ఇళ్లలో చూస్తుంటాం. దీంతో కలిగే చెడుప్రభావాన్ని కూడా శరీరంతోపాటు చర్మం కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అయితే చలికాలంలో చర్మానికి కాంతిని, ఆరోగ్యాన్ని అందించే విటమన్ ‘సి’ ఉన్న పళ్లను ఇతర పదార్థాలను తీసుకుంటే మంచిది. ఈ కాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను నివారించగల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని వినియోగించుకుని చలి కాలంలో వచ్చే రుగ్మతలను దూరం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని ఎక్కువగా తాగాలి అన్నింటికంటే ముందుగా చలికాలంలో నీటిని ఎక్కువగా తాగే అలవాటు చేసుకోవాలి. వేసవికాలంలో ఎంత నీరు తాగుతామో చలికాలంలో అందులో 20 శాతం నీటిని కూడా తాగం. ఈ కాలంలో వాతావరణంలో తేమ కూడా ఉండదు. దీని దుష్ప్రభావం శరీర ఆరోగ్యంపై చూపుతుంది. అంతే కాకుండా చర్మం మీద కూడా దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అల్లం: చలికాలంలో ఎక్కువగా అల్లం టీని ఇష్టపడతారు. ఈకాలంలో గొంతుకు ఉపశమనం కలిగించే అద్భుతమైన మందు అల్లం. పిల్లలు దగ్గు, శ్లేషంతో బాధపడుతుంటే వాళ్లకు అల్లం టీ తాగించాలి. దీని ప్రభావంతో రక్త ప్రసరణ కొంత మెరుగుపడుతుంది. చలి కారణంగా జీవ క్రియ మందగించడం లాంటి శారీరక క్రియల్లోనూ కూడా వేగం పుంజుకుంటుంది. బెల్లం: చలికాలంలో బెల్లం తినాలి. బెల్లం తింటే శరీరంలో వేడి పుట్టి అవసరమైన ఉష్ణం నిలిచి ఉంటుంది. బెల్లంలో ప్రొటీన్, మెగ్నీషియం, మినరల్స్, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్ మొదలైనవి తగినంత మోతాదులో ఉంటాయి. చల్లదనంతో మందగించిన రక్త ప్రసరణకు ఇది చురుకుదనం కలిగిస్తుంది. జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. సాధారణంగా పిల్లలు బెల్లం తినడానికి ఇష్ట పడరు. కాబట్టి వారికి బెల్లం హల్వా ఇతర వంటకాలను చేసి తినిపించాలి. సూప్.. చలికాలంలో అందరూ ఎక్కువగా ఇష్టపడే పానీయం సూప్. మీరు కూడా రకరకాల సూప్‌లను తయారు చేసుకోవచ్చు. సాధారణంగా అందరూ ఎక్కువగా ఇష్టపడేది టమాట సూప్. ఇంట్లో తయారు చేసుకునే టమాటా సూప్ చర్మానికి ఆరోగ్యానికి ఆశ్చర్యకరమైన ఫలితాలను అందిస్తుంది. మీ పిల్లల కోసం దీనిని మీరు తయారు చేసేటప్పుడు అందులో వెన్న మిరియాలు తప్పనిసరిగా కలపాలి. మిరియాలు జీర్ణ శక్తికి, దగ్గుకు బాగా పనిచేస్తాయి. టమాటా సూప్‌తో పాటు బఠాణీలు, పప్పులు, మొక్కజొన్న పిండి, కూరగాయల సూప్‌లను తయారు చేసుకోవచ్చు. ఉసిరి రసం: ఉసిరిలో విటమిన్ ‘సి’ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. స్వభావ రీత్యా విటమిన్ ‘సి’ ని వేడిచేస్తే అది నశించిపోతుంది. కాని ఉసిరిలో ఉండే విటమిన్ ‘సి’ వేడిచేసినా మరే విధంగా నశించిపోదు. ఉసిరితో పచ్చడి చేసో, మురబ్బా చేసో పిల్లలకు తినిపించవచ్చు. దీంతో పిల్లలకు జీర్ణ శక్తి బాగు పడుతుంది. చర్మం, శిరోజాలలో కూడా నిగారింపు వస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ కూడా. బత్తాయి: చలికాలంలో దొరికే అద్బుతమైన పండ్లలో బత్తాయి కూడా ఒకటి. ఇందులో విటమిన్ ‘సి’ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని చలికాలంలో వాడితే చర్మ, జలుబు లాంటి సమస్యలు దూరమవుతాయి. ఈపండుకు చలువ చేసే స్వభావం ఉంటుంది. రాత్రి, ఉదయం లాంటి చల్లని వాతావరణంలో కాకుండా ఎండలో దీన్ని తినడం మంచిది. మీరు రోజుకు రెండు బత్తాయి పండ్లు తినగలిగితే అది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మ ‘టీ’: చలికాలంలో టీ వాడకం ఎక్కువగా ఉంటుంది. చలి కాలంలో మీరు నిమ్మ టీ తాగి చూడండి. శక్తి లభిస్తుంది. నిమ్మ కారణంగా లభించే విటమిన్ ‘సి’ తో చాలా లాభం కలుగుతుంది. పిల్లలకు ఇచ్చే సలాడ్లలో కూడా నిమ్మ రసం కలిపి సర్వ్ చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. ఆహారం ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి చలి కాలంలో చిన్న పిల్లల ఆహారం ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. చలి కాలంలో గోరు వెచ్చని నీరు తాగాలి. స్వెట్టర్లు, మఫ్లర్లు, మాస్క్‌లు ధరించాలి. చలి గాలిలో తిరగవద్దు. ఎంపిక చేసిన ఆహారం తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి మంచిది. ఆకు కూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ అవసరానికి తగినట్లు తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తిని అందజేస్తాయి. – డాక్టర్ ప్రేమ్‌సింగ్, మండల వైద్యాధికారి -
పెట్టుబడి 0%.. ఫలితాలు 100%
న్యూఢిల్లీ: దేశంలో ప్రతీ ఒక్కరు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ సూచించారు. ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచడంలో భాగంగా ప్రభుత్వం ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ను మొదలు పెట్టింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గురువారం దీనిని ప్రారంభించాక మోదీ మాట్లాడారు. ‘ఫిట్నెస్ అనేది సున్నా శాతం పెట్టుబడి పెడితే వంద శాతం ఫలితాలు ఇచ్చేది. కొన్ని దశాబ్దాల క్రితం ఒక సాధారణ వ్యక్తి కూడా కనీసం 8–10 కిలోమీటర్లు నడవటమో, పరుగెత్తడమో చేసేవాడు. టెక్నాలజీ పెరిగాక ఇది తగ్గిపోయింది. ఫిట్నెస్ అనేది కేవలం ఒక మాటగా మిగిలిపోకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించేందుకు విప్లవంలా సాగాలి’అని మోదీ వ్యాఖ్యానించారు. ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ను నిరంతరాయంగా కొనసాగించేందుకు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో 28 మంది సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 86వేల కోట్ల ఏడీబీ రుణం భారత్‌కు సుమారు రూ.86 వేల కోట్ల రుణం అందించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) అంగీకారం తెలిపింది. వచ్చే మూడేళ్లలో పైపుల ద్వారా అందరికీ నీటి సరఫరా, రహదారి భద్రతకు సంబంధించి చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ఈ నిధులను ప్రభుత్వం వినియోగించనుంది. ఏడీబీ ప్రెసిడెంట్ టకెహికో నకావో గురువారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా మార్పు చెందేందుకు తమ సాయం దోహదపడుతుందని నకావో అన్నారు. -
‘నఫిల్’తో అల్లాహ్ ప్రసన్నత
‘ప్రతి వస్తువుకూ ఏదో ఒక జకాత్ ఉన్నట్లుగానే, శరీరానికీ జకాత్ ఉంది. అదే ’రోజా’ అని మహాప్రవక్త సెలవిచ్చారు. రమజాన్ నుండి రమజాన్ వరకు ప్రతినెలా మూడురోజులు పాటించడం పుణ్యఫలం రీత్యా సదా ఉపవాసాలు పాటించడంతో సమానమని ప్రవక్త మహనీయులు చెప్పారు. అంటే రమజాన్ నెలలో పాటించే 30 రోజాలు కాకుండా ప్రతినెలా మూడురోజులు రోజా పాటించడం ఎంతో పుణ్యప్రదం. శాశ్వతపుణ్యఫలం పొందాలనుకునేవారు నెలకు మూడురోజులు ఉపవాసాలు పాటించే అలవాటు చేసుకోవాలి. ధార్మిక దృష్టికోణంలోనే కాకుండా నెలకు మూడురోజులు ఉపవాసాలు చేయడం ఆరోగ్య పరిరక్షణకూ దివ్య ఔషధంగా ఉపకరిస్తుంది. ఈ విషయం అబూజర్ (ర)కు ఉపదేశిస్తూ..‘నువ్వు నెలకు మూడురోజాలు పాటించాలనుకుంటే .. పదమూడు, పద్నాలుగు, పదిహేను తేదీల్లో పాటించు.’అని చెప్పారు. వీటిని ధార్మిక పరిభాషలో ‘అయ్యామె బైజ్ ’ అంటారు. ఈ తేదీల్లో పాటించడం వీలుకాకపోతే ఎప్పుడైనా పాటించవచ్చు. ఎలాంటి తప్పూ లేదు. ప్రవక్తవారు కూడా నఫిల్ రోజాలను అప్పుడప్పుడూ పాటించేవారు.. అప్పుడప్పుడూ వదిలేసేవారు. అయితే షాబాన్ నెలలో మాత్రం ఆయన అధికంగా నఫిల్ రోజాలు ఆచరించే వారు. దీనికి అనేక కారణాలున్నాయి. కొన్ని హదీసుల్లో సూచన ప్రాయంగా చెప్పబడిన ప్రకారం.. ప్రవక్తవారిని ఈవిషయమై అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పారు. ‘షాబాన్ నెలలో అల్లాహ్ దివ్యసన్నిధిలో దాసుల కర్మలు ప్రవేశ పెట్టబడతాయి. ఆ క్రమంలో నా కర్మలు కూడా ప్రవేశపెట్టబడినప్పుడు రోజా స్థితిలో ఉండాలన్నది నా కోరిక.’ అన్నారు. హజ్రత్ ఆయిషా సిద్దీఖా(ర.అన్ హా)గారి హదీసు ఇలా ఉంది. ‘ప్రవక్తవారు షాబాన్ నెలలో ఇంత అధికంగా రోజాలు ఎందుకు పాటించే వారంటే, సంవత్సరం మొత్తంలో మరణించబోయేవారి జాబితాను ఈనెలలోనే మలకుల్ మౌత్ (ప్రాణాలు తీసే దూత)కు సమర్పించడం జరుగుతుంది. అయితే ఆ దూత ప్రవక్త వారి వద్దకు వచ్చినప్పుడు రోజా స్థితిలో ఉండాలని ఆయన కోరుకునేవారు.’ అంతేగాక, రాబోయే రమజాన్ (షాబాన్ తరువాత రమజాన్ )నెలతో, దాని ప్రత్యేక శుభాలతో సాన్నిహిత్యం, మానసిక, ఆత్మీయ సంబ«ందాన్ని ఏర్పరచుకోవాలన్న ప్రత్యేక శ్రద్ధాసక్తులు కూడా బహుశా దీనికి కారణం కావచ్చు. షాబాన్ రోజాలతో రమజాన్ రోజాలకు ఉన్న సంబంధం ఎలాంటిదంటే, ఫర్జ్ నమాజులకు ముందు చేయబడే నఫిల్ నమాజులకు ఫర్జ్ నమాజులతో ఉన్న సంబంధం లాంటిది. కనుక రాబోయే రమజాన్‌కు స్వాగతం పలకడానికి మనసును మానసికంగా సంసిద్ధం చేసుకోడానికి షాబాన్ నెల నఫిల్ రోజాలు, ఆరాధనలు ఇతోధికంగా దోహదపడతాయి. అందుకని వీలైనంత అధికంగా ఈనెలలో రోజాలు పాటిస్తూ ఆత్మను శరీరాన్ని సంసిద్ధం చేసుకోడానికి ప్రయత్నించాలి. తద్వారా ప్రవక్త వారి ఆచరణా విధానాన్ని పాటించిన వారమై, అల్లాహ్ సామీప్యతను, ప్రేమను పొందగలుగుతాము. అందరికీ రమజానుకు ఘనస్వాగతం పలికే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
డయాగ్నోస్టిక్ సేవల మార్కెట్ @ 22,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారుతున్న జీవనశైలితో కొత్తకొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మనిషినిబట్టి చికిత్స మారుతోంది. దీంతో వైద్య సేవల రంగంలో ఇప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలదే కీలకపాత్ర అయింది. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు (డయాగ్నోస్టిక్ సెంటర్లు) ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఆసుపత్రుల అవసరాలకు తగ్గట్టుగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఇవి నూతన టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నాయి. ముందస్తు పరీక్షల పట్ల ప్రజల్లో అవగాహన అంతకంతకూ పెరుగుతుండడం కూడా ల్యాబొరేటరీల విస్తరణకు కారణం అవుతోంది. 70 శాతం ప్రత్యేక పరీక్షల కోసం ఆసుపత్రులు పెద్ద ల్యాబ్‌లపై ఆధారపడుతున్నాయంటే వీటి ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. రూ.22,000 కోట్ల విలువైన భారత రోగ నిర్ధారణ పరీక్షల విపణిలో క్రమంగా వ్యవస్థీకృత రంగం పైచేయి సాధిస్తోంది. ఇదీ భారత మార్కెట్.. దేశంలో రోగ నిర్ధారణ పరీక్షల మార్కెట్ రూ.22,000 కోట్లుంది. అవ్యవస్థీకృత రంగంలో దేశవ్యాప్తంగా ఒక లక్ష వరకు ల్యాబ్‌లు ఉంటాయని సమాచారం. వ్యవస్థీకృత రంగం వాటా 15 శాతం మాత్రమే. అయినప్పటికీ ఈ విభాగం వృద్ధి రేటు ఏకంగా 22 శాతం ఉంది. ఈ రంగంలో డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, థైరోకేర్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఇటీవలే లిస్ట్ అయిన మెట్రోపోలిస్ హెల్త్‌కేర్ ఆరు రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిందంటే పరిశ్రమలో ఉన్న అవకాశాలను అంచనా వేయొచ్చు. ఎస్ఆర్ఎల్ డయాగ్నోస్టిక్స్ 397 కేంద్రాలతో పలు రాష్ట్రాల్లో విస్తరించింది. ఇక ప్రతి రాష్ట్రంలో మూడు నాలుగు పెద్ద కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టెనెట్, విజయ, ఎల్బిట్ వంటివి ప్రాచుర్యంలో ఉన్నాయి. కీలక పరీక్షల కోసం గతంలో ముంబై, ఢిల్లీ ల్యాబొరేటరీలపై తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రులు ఆధారపడేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ రంగంలో ల్యాబొరేటరీలను అనుసంధానించే అగ్రిగేటర్లూ రంగ ప్రవేశం చేశాయి. మొత్తంగా పరిశ్రమలో రూ.15,000 కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చినట్టు సమాచారం. వ్యవస్థీకృత రంగంవైపు.. మార్కెట్ క్రమంగా వ్యవస్థీకృత రంగంవైపు మళ్లుతోంది. దీనికి కారణం పెద్ద ల్యాబొరేటరీలు నాణ్యత ప్రమాణాలు పాటించడమే. నిపుణులైన వైద్యులు, టెక్నీషియన్లను నియమించుకుంటున్నాయి. ఈ రంగంలో చాలా ల్యాబొరేటరీలకు ఎన్ఏబీఎల్ ధ్రువీకరణ ఉంది. అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటించే సంస్థలకే ఈ ధ్రువీకరణ లభిస్తుంది. పైగా వ్యవస్థీకృత రంగ సంస్థలు ఎఫ్‌డీఏ, సీఈ ధ్రువీకరణ ఉన్న మెడికల్ కిట్స్‌నే వినియోగిస్తున్నాయి. ఇక పీసీఆర్, తదుపరి తరం సీక్వెన్సింగ్ టెక్నాలజీ, మల్టీప్లెక్స్ పీసీఆర్, ఎల్సీఎంఎస్ వంటి ఖరీదైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద సంస్థలు వినియోగిస్తున్నాయి. ఈ టెక్నాలజీ రాకతో రోగ నిర్ధారణ పరీక్షలు త్వరితగతిన పూర్తి కావడంతోపాటు కచ్చితత్వం ఉంటోంది. ఔషధ పరీక్షలు జరిపే కంపెనీలు పెద్ద ల్యాబొరేటరీల సాయం తీసుకుంటున్నాయి. క్లినికల్ డేటా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి వైద్య పరిశోధనలకు ల్యాబొరేటరీల్లో ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలన్నది కంపెనీల మాట. భవిష్యత్‌లో భారత్ నుంచి.. వైద్య సేవల రంగం మాదిరిగా రోగ నిర్ధారణ పరీక్షల రంగంలో కూడా వచ్చే రెండేళ్లలో భారత్ కేంద్ర బిందువు కానుంది. ఇప్పటికే మధ్యప్రాచ్య దేశాల్లోని ఆసుప్రతుల నుంచి రోగ నిర్ధారణ పరీక్షల కోసం శాంపిళ్లు ముంబై, ఢిల్లీకి వస్తున్నాయి. భవిష్యత్తులో యూరప్ ఆసుపత్రులకు భారత్ సేవలందించే అవకాశాలు ఉన్నాయని టెనెట్ డయాగ్నోస్టిక్స్ చైర్మన్ దేవినేని సురేశ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘యూరప్‌తో పోలిస్తే ఇక్కడే వ్యయం తక్కువ. ఇప్పటికే అక్కడి నుంచి టెనెట్‌కు ఎంక్వైరీలు వస్తున్నాయి. ఆఫ్రికాకు కూడా భారత్ సేవలు అందించనుంది. వచ్చే అయిదేళ్లలో ఈ పరిశ్రమలో కఠిన నిబంధనలు అమలులోకి వస్తాయి. దీంతో నాణ్యత ప్రమాణాలు పాటించని చిన్న ల్యాబొరేటరీలు దాదాపు కనుమరుగవుతాయి. వ్యవస్థీకృత రంగంలో కాన్సాలిడేషన్ జరుగుతుంది. పోటీ పెరగడంతోపాటు అవకాశాలు అదే స్థాయిలో ఉంటాయి. కొత్త టెక్నాలజీని సొంతం చేసుకునే కంపెనీలే మిగులుతాయి’ అని వివరించారు. -
బరువు అదుపు చేయాలంటే...
నా వయసు 48. మెనోపాజ్ దశలో బరువు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సమయంలో డైటింగ్ చేయడం మంచిదేనా? ఎలాంటి ఆహారం తీసుకుంటే బరువును అదుపులో పెట్టుకోవచ్చు అనేది వివరంగా తెలియజేయగలరు. – కె.స్వాతి, నిర్మల్ మెనోపాజ్ దశలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల 5 శాతం వరకు పొట్ట దగ్గర.. పిరుదులు దగ్గర కొవ్వు చేరే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల శరీరం మెటబాలిజం తగ్గి కొవ్వు పెరుగుతుంది. అలాగే ఈ వయసులో పని చెయ్యటం తగ్గుతుంది. దాని వల్ల కూడా కొద్దిగా బరువు పెరుగుతారు. ఈ మార్పులు అందరిలో జరగాలని ఏం లేదు. అవి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, వారు చేసే పనులను బట్టి ఆహారపు అలవాట్లను బట్టి ఉంటుంది. ఈ వయసులో ఉండే కొన్ని బాధ్యతలు, పిల్లలు దూరంగా వెళ్లడం, బందువుల మరణాలు, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటి వల్ల శరీరంలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఈ హార్మోన్ ప్రభావం వల్ల కూడా కొందరు బరువు పెరుగుతారు. డైటింగ్ అంటే తిండి బాగా తగ్గించడం కాదు. మితంగా తీసుకోవడం, ఈ సమయంలో బరువు పెరగకుండా ఉండటానికి, బరువు తగ్గడానికి, ఆహారంలో అన్నం తక్కువ తీసుకోవడం, నీళ్లు బాగా తాగడం, తృణధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, కొద్దిగా పండ్లు, పాలు వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. మాంసాహారులు అయితే గుడ్లు, చికెన్, మటన్, చేపలు వారానికి రెండు మూడు సార్లు తీసుకోవచ్చు. అలాగే వాకింగ్, ధ్యానం, యోగా, చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఎముకలు దృఢపడతాయి. ఆహారంలో స్వీట్లు, బేకరీ ఐటమ్స్, జంక్‌ఫుడ్, నూనె వస్తువులు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. రోజూ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఈ వయసులో కొందరిలో బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి, పైన చెప్పిన ఆహార నియమాలు, వ్యాయామాలు, నీటిని కూడా అదుపులో ఉంచుతాయి. ఆహారం కొద్దిగా కొద్దిగా విభజించుకుని 5–6 సార్లుగా తీసుకోవడం మంచిది. కాఫీ, టీలు కూల్ డ్రింకులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మా చెల్లెలికి పిల్లలు లేరు. తన వయసు 36. వైద్యులను సంప్రదిస్తే ‘ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్’ అని చెప్పారు. ఇది ఎందుకు వస్తుంది? భవిష్యత్‌లో పిల్లలు కనే అవకాశం ఉండదా? పూర్తి వివరాలను తెలియజేయగలరు. – బి.స్వర్ణలత, హిందూపురం సాధారణంగా ఆడవారు 45 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపల పీరియడ్స్ ఆగిపోయి, మెనోపాజ్ దశకు చేరుకుంటారు. కొందరిలో అనేక కారణాల వల్ల ఒవరీస్ (అండాశాయాల) పనితీరు ఆగిపోయి) 40 సంవత్సరాల కంటే ముందే పీరియడ్స్ ఆగిపోతాయి. దీనినే ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ లేదా ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. సాధారణంగా అండాశయాల నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల అవుతుంది. అలానే అండాలు విడుదల అవుతూ ఉంటాయి. జన్యుపరమైన కారణాల వల్ల స్మోకింగ్, హార్మోన్స్‌లో లోపాలు ఆటోఇమ్యూన్ సమస్యలు, చిన్నతనంలో వైరల్ ఇన్ఫెక్షన్స్, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇంకా ఎన్నో తెలియని కారణాలు వల్ల అండాశయంలోని అండాలు త్వరగా నశించిపోతాయి. అలానే అండాశయాల పనితీరు తగ్గిపోయి, ఈస్టోజన్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోవటం వల్ల, పీరియడ్స్ కొందరిలో 40 సంవత్సరాల కంటే ముందే ఆగిపోతాయి. మీ చెల్లెలికి ఈ సమస్య వల్ల అండాశయాల నుంచి అండాలు విడుదల అవట్లేదు. కాబట్టి సాధారణంగా పిల్లలు పుట్టే అవకాశం చాలా వరకు లేదు. కాకపోతే, వీరికి హార్మోన్ల పరీక్షలు చేసి వాటి విలువలను బట్టి, ఈవీఎఫ్ చికిత్స ద్వారా అనేకరకాల, ఎక్కువ డోస్ కలిగిన హార్మోన్స్, ఇంజెక్షన్లు, మందుల ద్వారా ప్రయత్నిస్తే.. 5–10 శాతం గర్భం నిలిచే అవకాశాలుంటాయి. అలా ప్రయత్నించినా గర్భం రాకపోతే, దాత నుంచి (డోనర్) తీసిన అండాలను ఉపయోగించి, గర్భం రావడానికి ప్రయత్నించవచ్చు. నా వయసు 29. పెళ్లి అయ్యి ఐదేళ్లు దాటుతోంది. ఇప్పటికింకా పిల్లలు లేరు. సంతానలేమి సమస్యను నివారించడానికి ఫోలిక్ యాసిడ్ లాంటి సప్లిమెంట్లు తీసుకోవడం మంచిదేనా? ఒకవేళ తీసుకుంటే సైడ్ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అనే విషయాలను దయచేసి పూర్తిగా వివరించండి. – ఆర్.నీలిమ, రాజమండ్రి కేవలం ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల సంతానలేమి సమస్య తీరదు. ఫోలిక్‌యాసిడ్ అనేది విటమిన్ బి9. ఇది జన్యువులోని డీఎన్ఏ తయారీకి తోడ్పడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల, అండం నాణ్యతకు, శుక్రకణాల నాణ్యతకు, కదలికలకు దోహదపడుతుంది. తద్వారా పిండం ఆరోగ్యకరంగా తయారుకావడానికి ఉపయోగపడుతుంది. పిండంలో కొన్ని అవయవలోపాలు, వెన్నుపూస, మెదడు లోపాలను చాలా వరకు రాకుండా అడ్డుపడి శిశువు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి గర్భం కోసం ప్రయత్నించే మూడునెలల ముందు నుంచి, దంపతులు ఇద్దరూ ఫోలిక్ యాసిడ్ మాత్ర రోజుకొకటి చొప్పున తీసుకోవడం మంచిది. ఇది నీటిలో కరిగిపోయే విటమిన్. దీనివల్ల ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్‌లు లేవు. -
టైమ్స్ మాగజైన్ ‘హెల్త్ కేర్-50’లో ముగ్గురు మనోళ్లే!
టైమ్స్ మాగజైన్ 2018 ఏడాదికి గాను అమెరికాలో ఆరోగ్య రంగాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన ప్రతిభావంతుల జాబితాలో ముగ్గురు భారతీయ సంతతికి చెందినవారికి చోటు దక్కింది. అమెరికాలో ఆరోగ్యరక్షణకు కృషిచేసిన దివ్యానాగ్, డాక్టర్ రాజ్ పంజాబీ, అతుల్ గవాండేలకు ఈ గౌరవం దక్కింది. ప్రజారోగ్యం, వైద్యం, టెక్నాలజీ, ధర అనే నాలుగు విభాగాల్లో వీరిని ఎంపిక చేస్తారు. టైమ్స్ మాగజైన్ హెల్త్ ఎడిటర్లు, రిపోర్టర్లు అమెరికాలో ఆరోగ్యపరిరక్షణకు చేసిన సేవలను బట్టి వీరిని నామినేట్ చేస్తారు. ఆరోగ్యపరిరక్షణకు ఎనలేని కృషి చేసిన వైద్యులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ రంగాల్లోని వారిని ఈ జాబితాలో చేర్చుతారు. దివ్యానాగ్ ప్రతిష్టాత్మక యాపిల్ కంపెనీలో హెల్త్‌కేర్‌లో ప్రత్యేక ప్రాజెక్టు చేస్తున్నారు. ఇటు డాక్టర్లకూ, అటు పేషెంట్లకూ రోగి సమాచారాన్ని, వివరాలనూ అందించే యాప్‌ను రూపొందించారు. ఇది వైద్య రంగంలోనే ఓ అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసింది. వాచ్‌ని ధరించిన వారు స్పందిచకపోయినా, హృదయస్పందనని పర్యవేక్షించే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఆరోగ్యరంగంలో ఓ సంచలనం. రాజ్ పంజాబీ... ఆరోగ్యసేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో కమ్యూనిటీ ఆరోగ్యకార్యకర్తలకి శిక్షణనిచ్చే గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకుగాను లాస్ట్‌మైల్ హెల్త్ సహ వ్యవస్థాపకులు లైబీరియా నుంచి అమెరికాకి శరణార్థిగా వచ్చిన హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ రాజ్పంజాబీకి కూడా టాప్ 50 జాబితాలో చోటు దక్కింది. 2014 నుంచి 2016 వరకు ఎబోలాను తరిమికొట్టడంలో లాస్ట్‌మైల్ సంస్థ ఎనలేని కృషి చేసింది. రాజ్ పంజాబీ నేతృత్వంలోని ఈ సంస్థ రిమోట్ ఏరియాలో పనిచేసే ఆరోగ్యకార్యకర్తలకు వీడియో, ఆడియోల్లో సందేశాలను పంపేలా ప్రత్యేక శిక్షణనిచ్చేందుకు కమ్యూనిటీ హెల్త్ ఎకాడమీనీ ఏర్పాటు చేయడం ఎంత వారికి ఎంతో ఉపయుక్తంగా మారింది. అతుల్ గవాండే... అమేజాన్, బెర్క్‌షైర్ హాత్వే, జేపీ మోర్గాన్ లాంటి ప్రముఖ కంపెనీల్లో పనిచేసే దాదాపు ఒక కోటి మంది ఉద్యోగులకు ఉచితంగా సేవలందించే ఆరోగ్యపరిరక్షణా కార్యక్రమాన్ని అతుల్ గవాండే ప్రవేశపెట్టినందుకుగాను గవాండేని టాప్ 50 జాబితాలో చేర్చి గౌరవించారు. -
హైదరాబాద్‌కు ‘యాంథెమ్’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ రెండో అతిపెద్ద హెల్త్ కేర్ సేవల సంస్థ యాంథెమ్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. దీంతో 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. యాంథెమ్ ప్రస్తుతం అమెరికాలోని ఇండియానా పోలీస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల జారీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ వంటి రంగాల్లో అనుసరిస్తున్న వినూత్నమైన పాలసీలు, ఐటీ సేవల రంగాల్లో నగరం సాధించిన పురోగతిని పరిగణనలోకి తీసుకుని తమ కార్యాలయ ఏర్పాటుకు నగరాన్ని ఎంపిక చేశామని యాంథెమ్ పేర్కొంది. హెల్త్ కేర్ సర్వీసెస్ కంపెనీలకు హైదరాబాద్ హబ్‌గా మారడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పోలీసులకు శిక్షణ ఇవ్వండి: అత్తాపూర్ ఘటన నేపథ్యంలో పోలీసు సిబ్బందికి అప్రమత్తత, తక్షణ స్పందన అంశాల్లో తగిన శిక్షణ ఇవ్వాలని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా డీజీపీ, నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. -
అల్జీమర్స్‌పై అవగాహన అవసరం: గవర్నర్
హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండటంతో మనుషుల జ్ఞాపకశక్తి తగ్గుతోందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని పినిక్స్ ఎరీనాలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవెరథాన్ (బృహత్ జాగృతికరణ)ను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడటం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కోల్పోతున్నారన్నారు. అవసరమైనంత వరకే టెక్నాలజీని వాడాలని సూచించారు. ప్రస్తుతం ఇండియాలో 40 లక్షల మంది అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారని, ఈ వ్యాధి వారి దగ్గరి కుటుంబీకులు 12 లక్షల మందిపై కూడా ప్రభావం చూపుతోందన్నారు. బంధిత రాజకీయ విధానాలను రూపొందించడానికి భారతదేశంలో ఇది ఒక ఆరోగ్య ప్రధానమైన విషయంగా పరిగణించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అల్జీమర్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రోజుకు 50 మంది రోగులకు పైగా పరీక్షించగల సామర్థ్యంతో డెమోన్షియా కేర్ సెంటర్‌ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర శాఖ, బెంగళూర్‌లోని నైటింగేల్స్ మెడికల్ ట్రస్ట్ సంయుక్తంగా స్థాపించినట్లు రెడ్ క్రాస్ చైర్మన్ పాపారావు తెలిపారు. అల్జీమర్స్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు వివిధ సేవలు, విపత్తు, అత్యవసర పరిస్థితులలో సహాయాన్ని అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ రెడ్ క్రాస్ అని చెప్పారు. -
హెల్త్‌ప్రో వేదికపై అన్ని ఆరోగ్య సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్‌కేర్ టెక్నాలజీ కంపెనీ కేర్4యు తాజాగా ‘హెల్త్‌ప్రో’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆసియాలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన తొలి యాప్ ఇదే. ఆసుపత్రులు, వైద్యులు, రోగ పరీక్ష కేంద్రాలు, మందుల షాపులు, బీమా కంపెనీలను రియల్ టైంలో ఒకతాటిపైకి తీసుకొస్తుంది. సమాచారం క్షణాల్లో చేరుతుంది. భారత్‌లో ఎస్తోనియా రాయబారి రిహో క్రూవ్ చేతుల మీదుగా హెల్త్‌ప్రో యాప్‌ను ఆవిష్కరించారు. కేర్4యు హెల్త్‌కేర్ సొల్యూషన్స్ కంపెనీని మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ వ్యవస్థాపకులైన డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి స్థాపించారు. యాప్ ద్వారా బీమా కంపెనీ నుంచి 30 సెకన్లలో ప్రీ–అప్రూవల్ వస్తుందని కేర్4యు డైరెక్టర్ ప్రబిన్ బర్దన్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. సమయం ఆదా అవడమేగాక పారదర్శకత, సమాచార గోప్యత ఉంటుందని చెప్పారు. కేంద్రీకృత వ్యవస్థ మొత్తం లావాదేవీలను పరిశీలిస్తుందని, సమాచారం అంతా యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదవుతుందని గుర్తుచేశారు. 350 ఆసుపత్రులు, క్లినిక్స్‌తో కంపెనీ చేతులు కలిపింది. బిజినెస్ పార్టనర్‌గా బీమా సంస్థ ఫ్యూచర్ జనరాలీ వ్యవహరిస్తోంది. మరో 8 బీమా కంపెనీలతో కేర్4యు చర్చిస్తోంది. యాప్ సహకారంతో క్లెయిమ్ ప్రాసెస్ త్వరతగతిన పూర్తి అవుతుందని ఫ్యూచర్ జెనరాలీ ఎండీ కె.జి.కృష్ణమూర్తి రావు చెప్పారు. -
శిశువులు – ఆరోగ్యకర ఆహారం
‘ఆషోడశాత్ భవతే బాలః కుమారః’ అంటుంది ఆయుర్వేదం. 16 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలు వివిధ దశల్లో పరిణతి చెందుతారనేది దీనర్థం. వారి ఆరోగ్య పరిరక్షణకు ఇది చాలా విశిష్టమైన సమయం. తల్లిదండ్రులు సూచించే ఆహారవిహారాల పైనే పెరిగే వయసులో ఉన్న పిల్లల శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శారీరక వ్యాయామం, వినయవిధేయతలు, సామాజిక సాంస్కృతిక స్పృహ... వీటి మీద కూడా పిల్లల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ‘లోకో భిన్న రుచిః’ అన్న ఆర్యోక్తి వాస్తవమే అయినా, పెరిగే వయసులో ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు నేర్పే ఆహారపుటలవాట్లు వారిపై జీవితాంతం ప్రభావం చూపుతాయన్నది శాస్త్ర సమ్మతం. మనం చేసే అలవాటుని బట్టే మన నాలుక రుచుల్ని కోరుతుందన్నది మరచిపోకూడదు. శరీర పోషణకు ఎలాంటి ఆహారం అవసరమన్నది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఇది కల్తీ పదార్థాల వ్యాపారంతో నిండిన కాలమని అర్థం చేసుకుని, పిల్లలకు ఇచ్చే ఆహారపదార్థాలను నిర్ణయించుకోవాలి. వీటిని తీసుకోకూడదు... ఉప్పుని అతి తక్కువ ప్రమాణంలోనే అంటే రోజు మొత్తం మీద మూడు గ్రాములు దాటి సేవించకూడదు. నూనెను మరిగించి (డీప్ ఫ్రై) చేసే వంటకాలు (పూరీలు, గారెలు, సమోసా, చిప్స్ వంటివి) నెలకు రెండు సార్లకు మించి ఎక్కువగా తినకూడదు. పంచదార నిషేధం. (దానికి బదులు బెల్లం, తేనె, ఖర్జూరం వాడుకోవచ్చు). రిఫైన్డ్ ఆయిల్స్ బదులు నువ్వులనూనె వాడటం మంచిది. బజారులో అమ్మే తినుబండారాలను విడిచిపెట్టడం ఉత్తమం. ఐస్‌క్రీములు, చాకొలేట్లు, లాలీపాప్, స్వీట్స్, భుజియా, సేవ్, నూడుల్స్, పిజ్జా, బర్గర్, శీతల పానీయాలు, బిస్కెట్లు, బ్రెడ్ మొదలైనవి. మైదాపిండి వాడకం మానేస్తే మంచిది. ఎందుకు తినకూడదు... పైన చెప్పిన పదార్థాలలో పోషక విలువలకి సంబంధించి ‘విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రొటీన్లు ఉండవు. పైగా కొవ్వులు, శర్కర కలిగిన పిండి పదార్థాలు అధిక స్థాయిలో ఉండి, అక్కర్లేని అధిక క్యాలరీలను మాత్రం అందిస్తాయి. వీటి తయారీలో వాడే కృత్రిమ రంగులు, తీపికోసం + నిల్వ కోసం వాడే కెమికల్స్, అధిక ఉప్పు, చౌకబారు కారం, నూనెలు మొదలైనవన్నీ రోగాలు కలిగిస్తాయి. బయట అమ్మే చెరుకురసం, పానీపూరీ వంటి వాటిలో కల్తీతో పాటుగా ఇన్ఫెక్షన్ సమస్య ప్రధానమైనది. వాంతులు, విరేచనాలు, వివిధ జ్వరాలు, పచ్చకామెర్ల వంటివి చాలా తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువ. వీటిని తినొచ్చు... ∙ఇంట్లో వండుకుని తయారుచేసుకున్నవి మాత్రమే పిల్లల ఆరోగ్యానికి మంచిది. ∙ఇడ్లీ, దోసెలు, పెసరట్లు లేదా రకరకాల ఇతర అట్లు చక్కగా తినొచ్చు. ∙రాగులు కంద కూడా వాడుకోవచ్చు ∙సాధారణంగా వరి అన్నంతో పులిహోర తయారుచేస్తాం. కొర్రల వంటి ఇతర బియ్యాలను కూడా వాడుకుంటే మంచిది. ∙అటుకులు, నిమ్మరసం, కొత్తిమీర ఉపయోగించి వంటకాలు చేసుకుంటే అధిక పోషక విలువలు లభిస్తాయి. ∙బొంబాయిరవ్వతో చేసే ఉప్మా కంటే బియ్యపురవ్వతో చేసుకునే ఉప్పుడు పిండి మంచిది. ఇందులో ఇంగువ కూడా వాడితే రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మంచిది. ∙కిచిడీ, పులగం, బిరియానీలలో పోషకాలు లభిస్తాయి. ∙మినపరొట్టె, పప్పు బియ్యపు రొట్టె వంటివి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొదలైన తాజా చట్నీలతో తింటే బలకరం. ∙సేమ్యా ఉప్మా అప్పుడప్పుడు తింటే పరవాలేదు.∙కాయగూరలతో చేసిన సూప్స్‌లో కొంచెం మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకోవాలి. అలాగే క్యారట్, టొమాటో, పచ్చి జ్యూస్, గ్రీన్ సలాడ్స్ తినడం మంచిది. ∙బెల్లానికి బదులు పచ్చి ఖర్జూరాల్ని వాడుకుని, వేరుసెనగ పలుకుల ఉండలు, చక్కీలు, మరమరాల ఉండలు, అటుకుల ఉండలు, నువ్వుల ఉండలు, డ్రైఫ్రూట్స్ ఉండలు పిల్లలకు ఇస్తే పోషక విలువలు సమృద్ధిగా ఉండటమే కాకుండా, అధిక క్యాలరీలు, కల్తీల సమస్య ఉండదు. ∙బెల్లంతో చేసే మినపసున్ని, కొబ్బరి ఉండలు కూడా మంచిది. ∙సేమ్యాపాయసం, బియ్యం పాయసం, జున్ను మొదలైనవాటిని తేనెతో చేస్తే పోషకాలు బావుంటాయి. గుమ్మడి, టొమాటో, ఆకుకూరలతో చేసిన వడియాలు, పిండి వడియాలు, పేల వడియాలు అప్పుడప్పుడు తినడం ప్రయోజనకరం. ∙అరటిపండ్లు, సీతాఫలం, సపోటా, మామిడి, పనసతొనలు లభించడాన్ని బట్టి తినడం మంచిది. ∙దానిమ్మ, జామ, బొప్పాయి పండ్ల వలన చాలా పోషకాలు లభిస్తాయి. ∙బత్తాయి, కమలా, పుచ్చకాయలు ‘రస’ ప్రధానమైనవి. ఇవి కూడా మంచిది. ∙ద్రాక్ష, ఆపిల్ వంటివి అత్యధిక క్రిమిసంహారక మందుల ప్రభావానికి గురవుతాయి కనుక వాటి జోలికి పోవకపోవడమే మంచిది. ∙డ్రైఫ్రూట్స్‌ని తగు ప్రమాణంలో ప్రతిరోజూ పిల్లలకు ఇవ్వాలి. ∙ చెరకుని నమిలి తినడం, కొబ్బరినీళ్లు, అల్లం, కరివేపాకులతో చేసిన పలుచని మజ్జిగ మొదలైనవి మంచిది. ∙పళ్ల రసాల కంటే పండుని మొత్తంగా తినడం మంచిది. గమనిక: కార్బైడ్, పెస్టిసైడ్స్ వంటి విషాలు చాలా ప్రమాదకరం. ప్రస్తుతం ఇది ఒకసామాజిక సమస్యగా మారింది. పండ్ల వలన కలిగే లాభాల కన్నా, ఈ విషాల వల్ల కలిగే హాని అధికంగా ఉంది. వీటి గురించి వైద్యులు వివరించగలరే కాని ‘నివారణ/నిర్మూలన’ వారి చేతుల్లో లేదని గమనించాలి. డ్రైఫ్రూట్స్: తగు ప్రమాణంలో మితంగా తినడం మంచిది. ప్రతిరోజూ కొంచెం కొంచెం పిల్లలకివ్వాలి. పానీయాలు: చెరకుని నమిలి తినడం, కొబ్బరినీళ్లు, అల్లం, కరివేపాకులతో చేసిన పలుచని మజ్జిగ మొదలైనవి మంచిది. పళ్ల రసాల కంటే పండుని మొత్తంగా తినడం మంచిది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు -
ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి కృషి జరుగుతోంది
-
ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి కృషి జరుగుతోంది
సాక్షి, హైదరాబాద్ : ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి కృషి జరుగుతోందని గవర్నర్ నరసింహన్ అన్నారు. గురువారం నారాయణ గూడలోని తెలంగాణ డయాగ్నొసిస్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకే చోట అన్ని పరీక్షలు నిర్వహించి 24 గంటల్లో ఫలితాలు ఇచ్చే కేంద్రాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి, అధికారులు చాలా కష్టపడుతున్నారని, బస్తీ దవాఖానాలు బాగా నడుస్తున్నాయని అన్నారు. హెల్త్ ముఖ్యమైన శాఖ కాబట్టే ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నానని తెలిపారు. అన్ని శాఖలపై దృష్టి పెడుతున్నానని అన్నారు.