ప్రచారంతో ప్రోత్సాహం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏదైనా సంస్థ నిలబడాలంటే.. ఓ మంచి ఆలోచన, ప్రజలకు ఉపయోగపడే సేవలు, దాన్ని నిలబెట్టుకోవాలనే తపన ఉంటే చాలదు. వాటికి ప్రచారం కూడా అవసరమే మరి. అందుకే ఇలాంటి స్టార్టప్స్ సంస్థలను ప్రోత్సహించేందుకు ‘స్టార్టప్ డైరీ’ పేరుతో ప్రతి శనివారం ‘సాక్షి’ ఓ ప్రత్యేక కథనాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. విద్య, వైద్యం, ఆరోగ్యం, షాపింగ్, మొబైల్స్.. ఇలా ప్రతి విభాగానికి సంబంధించిన ఓ కొత్త స్టార్టప్‌ను ఎంపిక చేసి.. ఆ సంస్థ ఆవిర్భావం నుంచి మొదలుపెడితే అందిస్తున్న సేవలు.. నిధుల సమీకరణ.. భవిష్యత్తు ప్రణాళిక.. వంటి సమస్త సమాచారాన్ని పాఠకులకు సవివరంగా సాక్షి సవివరంగా అందిస్తోంది.
ప్రతి కంపెనీ సేవలు వేటికదే ప్రత్యేకం. సరికొత్త ఆలోచనలతో.. ప్రజలకు ఉపయోగపడే సేవలు అందిస్తోన్న కంపెనీల వివరాలు చూసిన పాఠకులు స్పందిస్తూ ఆయా స్టోరీలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు. తమకు పాఠకులు మెయిళ్లు, ఫోన్లు చేసి అభినందించడంతో పాటు తమ స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్నట్లు ఆయా కంపెనీల యజమానులు ‘సాక్షి’కి చెపుతున్నారు.
ఆ వివరాలు...
విదేశీ కస్టమర్లు పెరిగారు..
ఇప్పటివరకు ఈకిన్‌కేర్.కామ్‌లో చాలా వరకు కస్టమర్లు స్థానికులు. కానీ, సాక్షి స్టార్టప్ డైరీలో మా సంస్థ అందిస్తున్న సేవలను ప్రచురించాక.. విదేశీ కస్టమర్ల సంఖ్య చాలా వరకు పెరిగిందని ఈకిన్‌కేర్.కామ్ సీఈఓ కిరణ్ కే కలకుంట్ల చెప్పారు. దాదాపు 350-400 మంది ఎన్నారైలు ఈకిన్‌కేర్. కామ్‌లో రిజిస్టర్ అయ్యారు. ఎన్నారైలు ఇక్కడున్న వారి తల్లిదండ్రులు, కుటుంబీకుల ఆరోగ్య సంరక్షణ కోసం వారి మెడికల్ రికార్డ్‌లను ఈకిన్‌కేర్.కామ్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో వారికొచ్చిన వ్యాధేంటి.. అది ఏ స్థాయిలో ఉంది? వాటి తాలుకు వివరాలను గ్రాఫులు, రంగుల రూపంలో తెలుసుకోవచ్చు. దీంతో వ్యాధి తీవ్రం కాకముందే నివారణ చర్యలు తీసుకోవచ్చు.
పాఠశాలలు కదిలొచ్చాయ్..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువులంటే ఎందకో చిన్న చూపు. కారణం.. టీచర్లు, వసతులు సరిగా ఉండవని. అయితే సాక్షి స్టార్టప్ డైరీలో smartur3d.com గురించి వార్తా కథనం ప్రచురితమయ్యాక.. చాలా మందిలో అప్పటివరకున్న అభిప్రాయం తప్పనిపించిందంటున్నాడు సంస్థ సీఈఓ నీరజ్ జువెల్కర్. ‘‘మా పాఠశాలల్లోని విద్యార్థులకు కూడా టఝ్చట్టఠట3ఛీ.ఛిౌఝ ద్వారా విద్యా బోధన చేస్తాం.. మీ సాఫ్ట్‌వేర్‌ను మాకు అందించండని’’ పలు పాఠశాలల ప్రిన్సిపల్స్ మా కంపెనీకి మెయిల్స్, ఫోన్లు చేశారు. నావరకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం వెనక కారణం కూడా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉపయోగపడితే చాలని.
రూ.10-12 లక్షల వ్యాపారం జరిగింది..
ఈ-కామర్స్ వ్యాపారాన్ని ఎం-కామర్స్ ఎలా అధిగమించనుంది.. భవిష్యత్తులో ఎం-కామర్స్ సైట్లకు డిమాండ్ ఎలా ఉండబోతోందన్న విషయాన్ని సాక్షి స్టార్టప్ డైరీ చాలా విపులంగా వివరించింది. దీంతో చాలా మంది వ్యాపారులు ఎం-కామర్స్ సైట్‌ను డిజైన్ చేయించుకునేందుకు ఆసక్తి చూపించారంటున్నారు మార్ట్‌మోబీ.కామ్ సీఈఓ సత్యక్రిష్ణ గన్ని. రూ.3 వేల ఖర్చుతో ఒక్క రోజులోనే ఎం-కామర్స్ సైట్‌ను రూపొందిస్తున్న మార్ట్‌మోబీ సేవలను చూసిన సుమారు 30-40 కంపెనీలు ఎం-కామర్స్ సైట్‌ను రూపొందించుకునేందుకు సంప్రదించాయి. వీటి ద్వారా మా సంస్థకు సుమారు రూ.10-12 లక్షల వ్యాపారం జరిగింది.