
ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్(star health) భారతదేశంలో హోమ్ హెల్త్ కేర్ (HHC) సర్వీస్‌ను 100 ప్రాంతాలకు విస్తరించినట్లు తెలిపింది. తమ కస్టమర్ బేస్‌లో 85 శాతం మంది ఈ సర్వీస్ పరిధిలోకి వచ్చినట్లు పేర్కొంది. హెచ్‌హెచ్‌సీ వల్ల కేవలం మూడు గంటల్లో ఇంటివద్దే వైద్య సంరక్షణను అందిస్తున్నట్లు తెలిపింది. రోగులకు అదనపు ఖర్చులు అవసరం లేకుండా నాణ్యమైన వైద్య సహాయం పొందేలా ఈ చర్యలు చేపట్టినట్లు కంపెనీ స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ ఆనంద్ రాయ్ మాట్లాడుతూ..‘జులై 2023లో ప్రారంభించిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెచ్‌హెచ్‌సీ సర్వీసులు వేగంగా విస్తరిస్తున్నాయి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ కవరేజీని మించిన సాధనం. ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండేందుకు వీలుగా సరసమైన ధరలకే పాలసీలు అందిస్తున్నాం. అధిక హాస్పిటలైజేషన్ ఖర్చులు, లాజిస్టిక్ సవాళ్లను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. నాణ్యమైన వైద్య సంరక్షణను వినియోగదారులకు చేరువ చేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. వివిధ అంటువ్యాధుల బారిన పడిన రోగులకు హెచ్‌హెచ్‌సీ కార్యక్రమం ద్వారా సకాలంలో వైద్య సంరక్షణ అందుతుంది. ఈ కార్యక్రమం కింద రోగి పరిస్థితిని అంచనా వేయడానికి, రోగ నిర్ధారణను నిర్వహించడానికి ప్రత్యేకంగా వైద్యుడిని కేటాయిస్తారు. రోగి లక్షణాల మేరకు ఆసుపత్రిలో చేరడం అనవసరమని భావిస్తే అందుకు తగిన చికిత్సను సదరు వైద్యుడు ఇంటివద్దే అందిస్తాడు. క్రమం తప్పకుండా ఫాలోఅప్‌లు ఉంటాయి. తర్వాత రోగి ఆరోగ్య పరిస్థితి, తీవ్రత ఆధారంగా ఆసుపత్రిలో చేరేందుకు వైద్యుడు సిఫారసు చేయవచ్చు’ అని చెప్పారు.
ఇదీ చదవండి: గాల్లో ఎగిరే కారు వచ్చేసింది..! ధర ఎంతంటే..
‘ముంబై, ఢిల్లీ, పుణె వంటి నగరాలు ఈ సేవలను స్వీకరించడంలో ముందున్నాయి. ఈ హెచ్‌హెచ్‌సీ సేవలు ప్రధానంగా వైరల్ ఫీవర్, డెంగ్యూ, ఎంటరిక్ ఫీవర్, అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటి వాటికి చికిత్స అందించడంపై దృష్టి సారించాయి. హోమ్ అడ్మిషన్స్, హోమ్ బేస్డ్ కన్సల్టేషన్ల ద్వారా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ హోమ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ద్వారా 15,000 మందికి పైగా రోగులు ప్రయోజనం పొందారు. హెచ్‌హెచ్‌సీ సర్వీసుల కోసం కేర్ 24, పోర్టియా, అర్గాలా, అతుల్య, అపోలోతో సహా ప్రముఖ ఆసుపత్రులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం’ అని ఆనంద్ రాయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment