స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటసామి జగన్నాథన్ కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు రాజీనామా చేశారు. జగన్నాథన్ కంపెనీ బోర్డు నుంచి తక్షణమే వైదొలుగుతూ తన రాజీనామాను సమర్పించారని స్టార్ హెల్త్ జూన్ 10న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
79 ఏళ్ల జగన్నాథన్ నెల రోజుల కిందటే కంపెనీ సీఈవో పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఆనంద్ రాయ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. కాగా జూన్ 10న కంపెనీ బోర్డుకు రాజీనామా చేసే వరకు జగన్నాథన్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇన్సూరెన్స్ పరిశ్రమలో విశేష అనుభవం
ఇన్సూరెన్స్ పరిశ్రమలో జగన్నాథన్‌కు విశేష అనుభవముంది. ఆయన నాయకత్వంలో స్టార్ హెల్త్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 619 కోట్ల లాభాన్ని సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 1,041 కోట్ల నష్టాన్ని చవిచూసిన కంపెనీకి ఆయన తర్వాత సంవత్సరంలో ఏకంగా రూ. 619 కోట్ల లాభాన్ని ఆర్జించిపెట్టారు.
స్టార్ హెల్త్‌ని ప్రారంభించే ముందు జగన్నాథన్ ప్రభుత్వ రంగ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో పని చేశారు. 2001లో నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థకు ఆయన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2004 నాటికి ఆటుపోట్లను తిప్పికొట్టి రూ. 450 కోట్ల లాభాన్ని సాధించగలిగారు. 2006లో జగన్నాథన్ స్థాపించిన స్టార్ హెల్త్ దేశంలోని ప్రముఖ స్టాండ్-అలోన్ మెడికల్ ఇన్సూరెన్స్‌లో ఒకటిగా అవతరించింది.
Comments
Please login to add a commentAdd a comment