Star Health
-
పాలసీదారుల డేటా లీక్..! ఐటీ సిస్టమ్‌ల ఆడిట్
పాలసీదారుల డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయాలని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ బీమా కంపెనీలను ఆదేశించింది. ఇందుకోసం స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకోవాలని సూచించింది. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తామని వివరించింది.ఐఆర్డీఏఐ ప్రకటనలోని వివరాల ప్రకారం..‘డేటా ఉల్లంఘనలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. పాలసీదారుల ప్రయోజనాలు కాపాడేందుకు సంస్థ చర్యలు తీసుకుంటోంది. బీమా తీసుకున్నవారి డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో రెండు సంస్థలకు(పేర్లు వెల్లడించలేదు) చెందిన ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయాలి. ఇందుకు స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకోవాలి. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి ఐఆర్డీఏఐ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది’ అని తెలిపింది.ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..రెండు సంస్థల పేర్లను ఐఆర్డీఏఐ వెల్లడించకపోయినప్పటికీ ఆ జాబితాలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లుగా భావిస్తున్నారు. డేటా లీకేజీ జరిగిన మాట వాస్తవమేనని ఆ కంపెనీ ఇటీవలే వెల్లడించడం ఇందుకు కారణం. ఇక డేటా ఉల్లంఘన బారిన పడిన రెండో సంస్థ పేరు తెలియరాలేదు. ఇదిలాఉండగా, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్‌లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి పెట్టినట్టు తెలిసింది. -
డేటా లీక్.. రూ.57 లక్షలు డిమాండ్!
కస్టమర్ డేటా, మెడికల్ రికార్డుల లీక్ వ్యవహారానికి సంబంధించి దేశంలో అతిపెద్ద ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ కొత్త విషయాన్ని వెల్లడించింది. సైబర్హ్యాకర్లు తమను 68,000 డాలర్లు (రూ.57 లక్షలు) డిమాండ్ చేసినట్లు తెలిపింది.టెలిగ్రామ్ చాట్బాట్లు, వెబ్‌సైట్‌ను ఉపయోగించి పన్ను వివరాలు, మెడికల్ క్లెయిమ్ పేపర్లు సహా కస్టమర్ల సున్నితమైన డేటాను హాకర్ లీక్ చేసినట్లు రాయిటర్స్ నుంచి కథనం వెలువడిన తర్వాత కంపెనీ వ్యాపార సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో స్టార్ హెల్త్ షేర్లు 11% క్షీణించాయి. ఈ డేటా లీక్ వ్యవహారంపై కంపెనీ అంతర్గత విచారణ చేపట్టింది. టెలిగ్రామ్, హ్యాకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంది.టార్గెటెడ్ సైబర్అటాక్కు గురైనట్లు గతంలో చెప్పిన స్టార్, హ్యాకర్ తమను 68,000 డాలర్లు డిమాండ్ చేస్తూ గత ఆగస్ట్‌లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్‌లకు ఈమెయిల్ పంపినట్లు తాజాగా వెల్లడించింది.డేటా లీక్‌లో తమ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై కంపెనీ దర్యాప్తు చేస్తోందని రాయిటర్స్ నివేదికపై భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు స్టార్ నుండి వివరణలు కోరిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. అంతర్గత విచారణ కొనసాగుతున్నప్పటికీ, అధికారి అమర్జీత్ ఖనుజా ఎలాంటి తప్పు చేయలేదని స్టార్ పునరుద్ఘాటించడం గమనార్హం. -
స్టార్ హెల్త్ ఫౌండర్ జగన్నాథన్ రాజీనామా
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటసామి జగన్నాథన్ కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు రాజీనామా చేశారు. జగన్నాథన్ కంపెనీ బోర్డు నుంచి తక్షణమే వైదొలుగుతూ తన రాజీనామాను సమర్పించారని స్టార్ హెల్త్ జూన్ 10న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 79 ఏళ్ల జగన్నాథన్ నెల రోజుల కిందటే కంపెనీ సీఈవో పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఆనంద్ రాయ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. కాగా జూన్ 10న కంపెనీ బోర్డుకు రాజీనామా చేసే వరకు జగన్నాథన్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇన్సూరెన్స్ పరిశ్రమలో విశేష అనుభవం ఇన్సూరెన్స్ పరిశ్రమలో జగన్నాథన్‌కు విశేష అనుభవముంది. ఆయన నాయకత్వంలో స్టార్ హెల్త్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 619 కోట్ల లాభాన్ని సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 1,041 కోట్ల నష్టాన్ని చవిచూసిన కంపెనీకి ఆయన తర్వాత సంవత్సరంలో ఏకంగా రూ. 619 కోట్ల లాభాన్ని ఆర్జించిపెట్టారు. స్టార్ హెల్త్‌ని ప్రారంభించే ముందు జగన్నాథన్ ప్రభుత్వ రంగ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో పని చేశారు. 2001లో నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థకు ఆయన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2004 నాటికి ఆటుపోట్లను తిప్పికొట్టి రూ. 450 కోట్ల లాభాన్ని సాధించగలిగారు. 2006లో జగన్నాథన్ స్థాపించిన స్టార్ హెల్త్ దేశంలోని ప్రముఖ స్టాండ్-అలోన్ మెడికల్ ఇన్సూరెన్స్‌లో ఒకటిగా అవతరించింది. -
Rekha Jhunjhunwala: నాలుగు గంటల్లో రూ.482 కోట్లు..
నాలుగు గంటల్లో రూ.482 కోట్లు ఆర్జించి రికార్డ్ సృష్టించారు రేఖా ఝున్‌ఝున్‌వాలా. ఆమె దివంగత ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి. దేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు. ఆమె భర్త కూడా ప్రీ-ఐపీఓ కాలం నుంచి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టారు. గతేడాది ఆయన మరణానంతరం స్టార్ హెల్త్‌తో సహా ఆయనకు సంబంధించిన అన్ని షేర్లు రేఖకు బదిలీ అయ్యాయి. స్టార్ హెల్త్ షేరు ధర సోమవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఇన్ట్రా డే గరిష్ట స్థాయి రూ.556.95ను తాకింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన నాలుగు గంటల్లోనే ఇన్ట్రాడేలో ఒక్కో ఈక్విటీ షేర్ రూ.47.90 పెరిగింది. స్టార్ హెల్త్ షేర్ ధర పెరగడంతో రేఖా ఝున్‌ఝున్‌వాలా దాదాపు రూ. 482 కోట్లు ఆర్జించారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టయిన తర్వాత రాకేష్ జున్‌జున్‌వాలా రెండింటిలోనూ 10,07,53,935 స్టార్ హెల్త్ షేర్లను కలిగి ఉండేవారు. ఇది కంపెనీ మొత్తం చెల్లింపు మూలధనంలో 17.50 శాతం. ఆ షేర్లన్నీ ఇప్పుడు రేఖా ఝున్‌జున్‌వాలా సొంతమయ్యాయి. ఒక్కో షేరుకు రూ.47.90 పెరగడం ద్వారా ఆమె రూ.482 కోట్ల భారీ మొత్తం ఆర్జించిన్లయింది. టాటా కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఆమె ఇటీవల రెండు వారాల్లోనే రూ.1000 కోట్లు సంపాదించారు. రేఖా ఝున్‌జున్‌వాలా నికర ఆస్తి విలువ రూ. 47,650 కోట్లుగా అంచనా. (ఇదీ చదవండి: తెలిసిన జాక్‌మా జాడ! ఎక్కడ ఉన్నాడంటే..) -
స్టార్ హెల్త్ ఐపీవో.. రూ.7,249 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఆరోగ్య బీమా దిగ్గజం స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 7,249 కోట్ల నిధులు సమీకరించనుంది. ఇందుకోసం షేర్ల ధర శ్రేణిని రూ. 870–900గా నిర్ణయించింది. నవంబర్ 30న ప్రారంభమయ్యే ఇష్యూ డిసెంబర్ 2తో ముగుస్తుంది. కనీసం 16 షేర్ల కోసం బిడ్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు రూ. 100 కోట్ల విలువ చేసే షేర్లను రిజర్వ్ చేశారు. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా వంటి దిగ్గజ ఇన్వెస్టర్లకు ఇందులో పెట్టుబడులు ఉన్నాయి. డ్రీమ్ స్పోర్ట్స్ రూ. 6,252 కోట్ల సమీకరణ న్యూఢిల్లీ: స్పోర్ట్స్ టెక్ కంపెనీ డ్రీమ్ స్పోర్ట్స్ తాజాగా 84 కోట్ల డాలర్లు(రూ. 6,252 కోట్లు) సమీకరించింది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో ఫాల్కన్ ఎడ్జ్, డీఎస్టీ గ్లోబల్, డీ1 క్యాపిటల్, రెడ్‌బర్డ్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్ తదితరాలున్నాయి. దీంతో కంపెనీ విలువ 8 బిలియన్ డాలర్లను తాకింది. అంతేకాకుండా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన టీపీజీ, పుట్‌పాత్ వెంచర్స్ తదితరాలు సైతం నిధులను సమకూర్చాయి. -
ఐపీఓ బాటలో స్టార్ హెల్త్, రూ.2వేల కోట్ల
న్యూఢిల్లీ: ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్సంస్థ.. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం దరఖాస్తు దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.2,000 కోట్ల విలువ చేసే తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అదే విధంగా ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూపు కంపెనీలు మరో 6,01,04,677 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద విక్రయించనున్నట్టు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీహెఆర్హెచ్పీ) ఆధారంగా తెలుస్తోంది. కంపెనీ ఉద్యోగులకు కొన్ని షేర్లను రిజర్వ్ చేశారు. ఐపీవోలో భాగంగా తాజా షేర్ల రూపంలో సమకూరే నిధులను కంపెనీ బలోపేతానికి వినియోగించనుంది. అంటే పెట్టుబడులు, ఇతర వృద్ధి అవకాశాల కోసం కంపెనీ వినియోగించనుంది. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, రాకేశ్జున్జున్వాలా స్టార్ హెల్త్‌లో వాటాదారులుగా ఉన్నారు. -
కార్పొ బ్రీఫ్స్...
స్టార్ హెల్త్ నుంచి గోల్డ్ ప్లాన్ టాప్ అప్.. సూపర్ సర్ప్లస్ ఇన్సూరెన్స్, స్టార్ సర్ప్లస్ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ పథకాల కింద స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంస్థ కొత్తగా గోల్డ్ ప్లాన్ ఆవిష్కరించింది. ఈ టాప్ అప్ పాలసీ అత్యంత చౌకగా మరింత ఎక్కువ కవరేజీ అందిస్తుందని సంస్థ చెబుతోంది. ఆస్పత్రి వ్యయాలు పాలసీదారు నిర్దేశించిన పరిమితిని దాటిన పక్షంలో గోల్డ్ ప్లాన్‌తో క్లెయిమ్ చేసుకోవచ్చు. గది అద్దెపై ఎటువంటి పరిమితులు ఉండవు. పైగా ఎయిర్ అంబులెన్స్, 405 డే కేర్ ప్రొసీజర్స్‌కి వర్తింపు తదితర ప్రయోజనాలు ఉంటాయి. ముందస్తు వైద్య పరీక్షలేమీ లేకుండా 65 ఏళ్ల దాకా వయసు గల వ్యక్తులు ఈ ప్లాన్ కింద రూ.25 లక్షల దాకా కవరేజీ పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఈజీ హెల్త్ ప్లాన్.. శస్త్రచికిత్సలు, క్రిటికల్ ఇల్నెస్ మొదలైన వాటి కవరేజీకి సంబంధించి పాలసీదారు ఏకమొత్తం లేదా వాయిదాల పద్ధతిలో ప్రీమియంలు కట్టే వెసులుబాటు కల్పిస్తూ హెచ్డీఎఫ్సీ లైఫ్ తాజాగా ఈజీ హెల్త్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. అయిదేళ్ల కాల వ్యవధికి గరిష్టంగా రూ. 5,00,000 దాకా కవరేజీకి దీన్ని తీసుకోవచ్చు. దీని కింద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అవసరాన్ని బట్టి రోజువారీ రూ. 250 నుంచి రూ. 5,000 దాకా, 138 శస్త్రచికిత్సలు.. 18 క్రిటికల్ ఇల్నెస్ అంశాల్లో ఏకమొత్తం పొందవచ్చు. సమ్ అష్యూర్డ్ పూర్తిగా వినియోగమయ్యే దాకా పలు సర్జరీలకు క్లెయిమ్ చేసుకోవచ్చు. బిర్లా సన్‌లైఫ్ సెక్యూర్ప్లస్ ప్లాన్.. ఇటు బీమా కవరేజీతో పాటు అటు కట్టిన ప్రీమియానికి రెట్టింపు మొత్తాన్ని అందించేలా బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ బీఎస్‌ఎల్‌ఐ సెక్యూర్ప్లస్ ప్లాన్ ప్రవేశపెట్టింది. దీనికింద రెండు ఆప్షన్లు ఉంటాయి. ఉదాహరణకు ఆప్షన్ ఏ ఎంచుకున్న వారు 12 ఏళ్ల పాటు ఏటా రూ. 1 లక్ష చొప్పున కడితే.. 14వ ఏడాది రూ. 2 లక్షలు, 15వ ఏడాది రూ. 3 లక్షలు.. ఇలా 19వ సంవత్సరంలో రూ. 6 లక్షలు పొందవచ్చు. రెండో ఆప్షన్లో 12 ఏళ్ల పాటు .. కట్టిన ప్రీమియంలకు రెట్టింపు మొత్తాన్ని పొందవచ్చు. ఉదాహరణకు.. 12 ఏళ్ల పాటు ఏటా రూ. 1 లక్ష కడితే.. 14వ సంవత్సరం మొదలుకుని ప్రతీ సంవత్సరం రూ. 2 లక్షల చొప్పున అందుకోవచ్చు. చెల్లించే ప్రీమియంకు 14.5-19 రెట్లు లైఫ్ కవరేజీ ఉంటుంది. -
ఆరోగ్యబీమా మాటున దర్జాగా దగా
కంబాల చెరువు (రాజమండ్రి) : అనుకోకుండా జబ్బు చేస్తే.. అదే సమయంలో జేబులు ఖాళీగా ఉంటే ఎదురయ్యే దురవస్థకు విరుగుడుగా ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) చేయించుకుంటారు. బీమా చేయించుకున్నాం కదా.. ఒకవేళ రాకూడని నలత వచ్చినా, చికిత్సకు డబ్బుల కోసం తంటాలు పడనక్కరలేదనుకుంటారు. అయితే ‘స్టార్ హెల్త్’ ఇన్సూరెన్స్ రాజమండ్రి శాఖ (దానవాయిపేట)లో జూనియర్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఆనందరాజు పలు వురికి ఆ ధీమాను కరువు చేశా డు. అనేకుల వద రూ.10 వేల ప్రీమియం చొప్పున కట్టించుకుని, నకిలీ పాలసీపత్రాలను ఇచ్చాడు. ఈ వైనం బయటకు రావడంతో ఆనందరాజు పరారవగా ‘స్టార్ హెల్త్’ ఉన్నతాధికారులు శనివారం రాజమండ్రి శాఖలో తనిఖీలు జరిపారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వ్యవహారంపై ‘సాక్షి’ కొందరు పాలసీదారులతో ఫోన్లో మాట్లాడింది. స్థానికంగానూ, ఇతర ప్రాంతాల్లోనూ ఆనందరాజు, మరికొందరి వల్ల మోసపోయిన వారు చాలామందే ఉన్నట్టు సమాచారం. గతంలో సొమ్ము కట్టించుకుని నకి లీ పాలసీ ఇచ్చారని, తాను గుర్తించి, గొడవ పెట్టుకుంటే అసలు పాలసీ ఇచ్చారని నగరానికి చెందిన సిమ్ కార్డుల వ్యాపారి తెలిపాడు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఒక ప్రముఖ సంస్థ 200 మంది ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించగా, అందులోనూ కొన్ని నకిలీ పాలసీలున్నట్టు తెలుస్తోంది. పశ్చిమలోని తణుకు, ఇతర ప్రాంతాల్లోనూ బాధితులున్నట్టు తెలుస్తోంది. ఆనందరాజు గోల్మాల్ వ్యవహారం బయట పడిన నేపథ్యంలో పాలసీదారులు కార్యాలయానికి వచ్చి వారి పాలసీలను తనిఖీ చేసుకుంటే నకిలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.