నాలుగు గంటల్లో రూ.482 కోట్లు ఆర్జించి రికార్డ్ సృష్టించారు రేఖా ఝున్‌ఝున్‌వాలా. ఆమె దివంగత ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి. దేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు. ఆమె భర్త కూడా ప్రీ-ఐపీఓ కాలం నుంచి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టారు. గతేడాది ఆయన మరణానంతరం స్టార్ హెల్త్‌తో సహా ఆయనకు సంబంధించిన అన్ని షేర్లు రేఖకు బదిలీ అయ్యాయి.
స్టార్ హెల్త్ షేరు ధర సోమవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఇన్‌ట్రా డే గరిష్ట స్థాయి రూ.556.95ను తాకింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన నాలుగు గంటల్లోనే ఇన్‌ట్రాడేలో ఒక్కో ఈక్విటీ షేర్ రూ.47.90 పెరిగింది. స్టార్ హెల్త్ షేర్ ధర పెరగడంతో రేఖా ఝున్‌ఝున్‌వాలా దాదాపు రూ. 482 కోట్లు ఆర్జించారు.
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన తర్వాత రాకేష్ జున్‌జున్‌వాలా రెండింటిలోనూ 10,07,53,935 స్టార్ హెల్త్ షేర్‌లను కలిగి ఉండేవారు. ఇది కంపెనీ మొత్తం చెల్లింపు మూలధనంలో 17.50 శాతం. ఆ షేర్లన్నీ ఇప్పుడు రేఖా ఝున్‌జున్‌వాలా సొంతమయ్యాయి. ఒక్కో షేరుకు రూ.47.90 పెరగడం ద్వారా ఆమె రూ.482 కోట్ల భారీ మొత్తం ఆర్జించిన్లయింది. టాటా కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఆమె ఇటీవల రెండు వారాల్లోనే రూ.1000 కోట్లు సంపాదించారు. రేఖా ఝున్‌జున్‌వాలా నికర ఆస్తి విలువ రూ. 47,650 కోట్లుగా అంచనా.
(ఇదీ చదవండి: తెలిసిన జాక్‌మా జాడ! ఎక్కడ ఉన్నాడంటే..)
Comments
Please login to add a commentAdd a comment