న్యూఢిల్లీ: ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్‌సంస్థ.. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం దరఖాస్తు దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.2,000 కోట్ల విలువ చేసే తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అదే విధంగా ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూపు కంపెనీలు మరో 6,01,04,677 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద విక్రయించనున్నట్టు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీహెఆర్‌హెచ్‌పీ) ఆధారంగా తెలుస్తోంది.
కంపెనీ ఉద్యోగులకు కొన్ని షేర్లను రిజర్వ్ చేశారు. ఐపీవోలో భాగంగా తాజా షేర్ల రూపంలో సమకూరే నిధులను కంపెనీ బలోపేతానికి వినియోగించనుంది. అంటే పెట్టుబడులు, ఇతర వృద్ధి అవకాశాల కోసం కంపెనీ వినియోగించనుంది. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, రాకేశ్‌జున్‌జున్‌వాలా స్టార్ హెల్త్‌లో వాటాదారులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment