Star Health and Alain Insurance
-
3.1 కోట్ల కస్టమర్ల డేటా లీక్‌పై క్లారిటీ
పాలసీదారుల కీలక సమాచారం లీక్ కావడంతో స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంస్థ తన భద్రతను పటిష్టం చేసుకునేందుకు పలు చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించింది. ఈ తరహా డేటా లీకేజీ ఘటన మరోసారి చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో ఆనంద్‌రాయ్ తెలిపారు.ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన డేటా లీకేజీ ఘటనలో 3.1 కోట్ల స్టార్ హెల్త్ కస్టమర్ల మొబైల్ ఫోన్, పాన్, చిరునామా తదితర సున్నిత సమాచారం బయటకు రావడం గమనార్హం. షెంజెన్ అనే హ్యాకర్ ఈ సమాచారాన్ని ఏకంగా ఒక పోర్టల్‌లో విక్రయానికి పెట్టినట్టు వార్తలు వచ్చాయి.రక్షణ ఏర్పాటు చేసుకోవాల్సిందే..‘ఒకరితో ఒకరు అనుసంధానమై పనిచేయాల్సిన ప్రపంచం ఇది. ఏజెంట్లు, ఆసుపత్రులు, బీమా కంపెనీలు అన్ని అనుసంధానమై పని చేసే చోట తమ వంతు రక్షణలు ఏర్పాటు చేసుకోవాల్సిందే. బలహీన పాస్వర్డ్లు తదితర వాటిని హ్యాకర్లు సులభంగా గుర్తించగలరు. కేవలం అంతర్గతంగానే కాకుండా, స్వతంత్ర నిపుణుల సాయంతో మేము ఇందుకు సంబంధించి రక్షణ చర్యలు తీసుకున్నాం’ అని ఆనంద్‌రాయ్ వివరించారు. ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయంటూ, బీమా కంపెనీలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో నిలిచిన కొత్త పెళ్లి కూతురు.. ఇంకొందరు..అసలేం జరిగింది..?స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్‌లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి ఉంచినట్లు గతంలో గుర్తించారు. స్టార్ హెల్త్ ఇండియాకు చెందిన కస్టమర్ల అందరి సున్నిత డేటాను బయటపెడుతున్నానని, ఈ సమాచారాన్ని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే అందించిందని హ్యాకర్ షెంజెన్ క్లెయిమ్ చేయడం గమనార్హం. మద్రాస్ హైకోర్ట్ ఆదేశాల మేరకు స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ నిపుణులతో ఫోరెన్సిక్ దర్యాప్తు చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. -
స్టార్ హెల్త్ కస్టమర్ల డేటా లీక్
న్యూఢిల్లీ: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన 3.1 కోట్ల కస్టమర్ల వ్యక్తిగత డేటా ఉల్లంఘన పాలైనట్టు యూకే కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు జేసన్ పార్కర్ ఆరోపించారు. కంపెనీకి చెందిన ఓ సీనియర్ ఉద్యోగి 3.1 కోట్ల కస్టమర్లకు సంబంధించి మొబైల్ నంబర్లు, చిరునామా తదితర వివరాలను విక్రయించినట్టు సంచలన విషయాన్ని బయటపెట్టారు. మూడో పక్షం నుంచి మోసపూరిత చర్యలకు (ఉల్లంఘైన డేటా ఆధారంగా) అవకాశం ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలంటూ కస్టమర్లకు స్టార్ హెల్త్ సంస్థ ఈ మెయిల్ ద్వారా హెచ్చరించడం ఉల్లంఘన ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. యూకేకు చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు జేసన్ పార్కర్ షెంజెన్ అనే హ్యాకర్ స్టార్ హెల్త్ నుంచి పొందిన డేటాను వెబ్సైట్లో పెట్టినట్టు ప్రకటించారు. ‘‘స్టార్ హెల్త్ ఇండియా కస్టమర్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లకు సంబంధించి సున్నితమైన డేటాను లీక్ చేస్తున్నాను. ఈ డేటాను నాకు నేరుగా విక్రయించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీదే ఇందుకు బాధ్యత’’అంటూ షెంజెన్ పోస్ట్‌ను పార్కర్ ప్రస్తావించారు. టెలీగ్రామ్ బోట్లను సృష్టించడం ద్వారా 2024 జూలై నాటికి 3,12,16,953 మంది కస్టమర్ల డేటాను, 57,58,425 క్లెయిమ్‌ల డేటాను హ్యాకర్ పొందినట్టు చెప్పారు. డేటా లీకేజీకి గాను 1,50,000 డాలర్ల డీల్ కుదిరినట్టు కూడా పార్కర్ తెలిపారు. అప్రమత్తత.. స్టార్ హెల్త్ ఉద్యోగులమని చెబుతూ ప్రస్తుత పాలసీని నిలిపివేయండనే చర్యలకు థర్డ్ పారీ్టలు పాల్పడొచ్చంటూ స్టార్ హెల్త్ తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. ఈ తరహా మోసపూరిత చర్యలు వ్యక్తిగత సమాచారానికి ముప్పు కలిగించడంతోపాటు, దీర్ఘకాలంలో పాలసీ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తాయని హెచ్చరించింది. క్లెయిమ్‌ల డేటాను అనధికారికంగా పొందినట్టు గుర్తు తెలియని వ్యక్తి నుంచి తమకు మెయిల్స్ కూడా వచి్చనట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు కంపెనీ సమాచారం ఇచి్చంది. ఐఆర్డీఏఐ నిబంధనలకు అనుగుణంగా తగిన సైబర్ భద్రతా వ్యవస్థలు, నియంత్రణలను అమలు చేస్తున్నామని, దీనిపై మళ్లీ తాజా సమాచారం విడుదల చేస్తామని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ప్రకటించింది. -
బ్రెయిలీ భాషలో స్టార్ హెల్త్ పాలసీ
చెన్నై: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఆదర్శనీయమైన నిర్ణయం తీసుకుంది. ‘స్పెషల్ కేర్ గోల్డ్’ పాలసీని ‘బ్రెయిలీ’ భాషలో విడుదల చేసింది. కంటి చూపు సరిపడా లేని వారు సైతం ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని స్వయంగా తెలుసుకుని, తగిన నిర్ణయం తీసుకునేందుకు ఇది వీలు కలి్పస్తుందని సంస్థ తెలిపింది. దేశంలో 3.4 కోట్ల మంది దృష్టి లోపంతో బాధపడుతున్నారని.. వారికి తగిన నైపుణ్యాలు, శిక్షణ ఇచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా అవకాశం ఇవ్వడం ద్వారా మద్దతుగా నిలవనున్నట్టు ప్రకటించింది. సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా ఆరోగ్య బీమా సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని.. బ్రెయిలీలో స్పెషల్ కేర్ గోల్డ్ పాలసీ విడుదల ఈ దిశగా మైలురాయి అని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ఆనంద్‌రాయ్ పేర్కొన్నారు. అంధులైన వారి సమగ్రమైన, సమ్మిళిత ఆరోగ్య బీమా రక్షణ అవసరాలను ఈ పాలసీ తీరుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంధుడైన పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీకాంత్ బొల్లా పాల్గొన్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్ సహకారంతో స్పెషల్ కేర్ గోల్డ్ పాలసీ బ్రెయిలీ వెర్షన్‌ను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రూపొందించింది. -
స్టార్ హెల్త్ నుంచి ‘హోమ్ హెల్త్‌కేర్’ సేవలు
చెన్నై: ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ దేశవ్యాప్తంగా 50 పట్టణాల్లో ఇంటి వద్దే ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రారంభించింది. ‘హోమ్ హెల్త్‌కేర్ సర్వీస్’ పేరుతో తీసుకొచి్చన ఈ సేవలను రానున్న రోజుల్లో మిగిలిన పట్టణాలకు సైతం విస్తరిస్తామని సంస్థ ఎండీ, సీఈవో ఆనంద్‌రాయ్ తెలిపారు. దేశవ్యాప్తంగా కస్టమర్ల ఇంటివద్దే ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు వీలుగా కేర్24, పోరి్టయా, కాల్హెల్త్, అతుల్య హోమ్‌కేర్, అర్గాలాతో సహకార ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. కోయింబత్తూర్, పుణె, ఢిల్లీ, కోల్‌కతాలో ఈ సేవలను పరీక్షించి చూశామని, ఆ తర్వాతే ఇతర పట్టణాలకు విస్తరించాలని నిర్ణయించినట్టు ఆనంద్‌రాయ్ వెల్లడించారు. జ్వరం, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటరైటిస్, తీవ్రమైన గ్యాస్ట్రైటిస్, మూత్రనాళ ఇన్ఫెక్షన్తో బాధపడేవారు 044–69006900 నంబర్‌కు లేదా స్టార్ హెల్త్ మొబైల్ అప్లికేషన్ నుంచి అభ్యర్థన పంపి, ఇంటి వద్దే వైద్య సేవలను అందుకోవచ్చు. కస్టమర్ నుంచి అభ్యర్థన వచి్చన వెంటనే వైద్య బృందం స్టార్ హెల్త్ కస్టమర్ ఇంటికి చేరుకుని, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఔషధాలు సూచిస్తారు. ఐదు రోజుల చికిత్సకు (వైద్యులు, నర్సుల ఫీజులు సహా) ఒక్క రోగి రూ.7,000–7,500 వరకు చెల్లించాల్సి ఉంటుందని స్టార్ హెల్త్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిహర సూదన్ తెలిపారు. తదుపరి చికిత్స అవసరం పడితే సమీపంలోని హాస్పిటల్‌ను సూచిస్తామని చెప్పారు. -
క్యూఆర్ కోడ్‌తో స్టార్ హెల్త్ పాలసీ కొనుగోలు
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలు, రెన్యువల్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంపై స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరిపే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచి్చంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తోడ్పాటుతో దీన్ని రూపొందించినట్లు సంస్థ ఎండీ ఆనంద్ రాయ్ తెలిపారు. దీనితో లావాదేవీకి పట్టే సమయం గణనీయంగా తగ్గగలదని వివరించారు. ప్రీమియం చెల్లింపును గుర్తు చేసేందుకు పంపించే సందేశాల్లో యూపీఐ క్యూఆర్ కోడ్ ఉంటుందని, అందులో ఎంత ప్రీమియం కట్టాలనే వివరాలు నిక్షిప్తమై ఉంటాయని సంస్థ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ చిట్టి బాబు తెలిపారు. దాన్ని స్కాన్ చేయడం ద్వారా లేదా లింక్‌ను క్లిక్ చేసి యూపీఐ యాప్ ద్వారా సెకన్లలో చెల్లింపును పూర్తి చేయొచ్చన్నారు. స్టార్ హెల్త్ కూడా సౌకర్యవంతమైన యూపీఐ ఆధారిత ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ను ప్రవేశపెట్టడం సంతోషకరమని ఎన్పీసీఐ చీఫ్ (ప్రోడక్ట్స్) కునాల్ కలావతియా చెప్పారు. -
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు జగన్నాథన్ గుడ్‌బై
చెన్నై: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ బోర్డ్‌కు వెంకటస్వామి జగన్నాథన్ రాజీనామా ప్రకటించారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. 78 ఏళ్ల జగన్నాథన్ కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. తక్షణం తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు జూన్ 10న జగన్నాథన్ నుంచి ఈ మెయిల్ వచ్చినట్టు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. జగన్నాథన్‌ను బీమా రంగం వెటరన్‌గా చెబుతారు. ప్రభుత్వరంగంలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌కు చైర్మన్, ఎండీగా పని చేసిన ఆయన, పదవీ విరమణ తర్వాత.. దుబాయికి చెందిన ఈటీఏ గ్రూప్ మద్దతుతో ప్రైవేటు రంగంలో స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌ను స్థాపించారు. కొత్త బాట.. తన రాజీనామాపై జగన్నాథన్ స్పందించారు. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌కు రాజీనామా చేసినట్టు ధ్రువీకరించారు. ‘‘ప్రతీ ఆరంభానికి ముగింపు ఉంటుంది. అలాగే, ప్రతీ ముగింపునకు ఓ ఆరంభం ఉంటుందని నేను నమ్ముతాను. వచ్చే రెండు నెలల్లో ఏదో ఒకటి కొత్తగా ప్రారంభిస్తాను. అది ఏ రంగంలో అయినా ఉండొచ్చు. అది నా హృదయానికి దగ్గరగా ఉంటుంది’’అని చెప్పారు. 12 మందితో ఆయన ప్రారంభించిన స్టార్ హెల్త్ నేడు రూ.30వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా అవతరించడం గమనార్హం -
స్టార్ హెల్త్ ఐపీవో.. ఫ్లాప్!
న్యూఢిల్లీ: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఐపీవో ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోయింది. ఆఫర్ చేస్తున్న షేర్లకు సరిపడా బిడ్లు కూడా దాఖలు కాలేదు. గురువారం ఇష్యూ ముగియగా 0.79 శాతం మేర సబ్స్క్రయిబ్ అయింది. ఈ సంస్థలో వెస్ట్బ్రిడ్స్ క్యాపిటల్, రాకేశ్ జున్‌జున్‌వాలా తదితరులకు వాటాలున్నాయి. మొత్తం 4,49,08,947 షేర్లను కంపెనీ విక్రయానికి పెట్టగా.. 3,56,02,544 షేర్లకే బిడ్లు వచ్చాయి. రిటైల్ విభాగంలో మాత్రం పూర్తి స్థాయి బిడ్లను అందుకుంది. ఆఫర్ చేస్తున్న షేర్లతో పోలిస్తే 1.10 రెట్ల సబ్స్క్రిప్షన్లు వచ్చాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల (క్యూఐబీ) కోటా కూడా 1.03 రెట్ల స్పందన అందుకుంది. కానీ, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (పెద్ద ఇన్వెస్టర్లు) పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఒక్కో షేరు ధరల శ్రేణిగా రూ.870–900ను కంపెనీ ప్రకటించడం గమనార్హం. ఖరీదైన వ్యాల్యూషన్లతో కంపెనీ ఐపీవోకు రావడం కూడా పేలవ ప్రదర్శనకు కారణంగా భావిస్తున్నారు. -
ఐపీఓ బాటలో స్టార్ హెల్త్, రూ.2వేల కోట్ల
న్యూఢిల్లీ: ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్సంస్థ.. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం దరఖాస్తు దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.2,000 కోట్ల విలువ చేసే తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అదే విధంగా ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూపు కంపెనీలు మరో 6,01,04,677 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద విక్రయించనున్నట్టు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీహెఆర్హెచ్పీ) ఆధారంగా తెలుస్తోంది. కంపెనీ ఉద్యోగులకు కొన్ని షేర్లను రిజర్వ్ చేశారు. ఐపీవోలో భాగంగా తాజా షేర్ల రూపంలో సమకూరే నిధులను కంపెనీ బలోపేతానికి వినియోగించనుంది. అంటే పెట్టుబడులు, ఇతర వృద్ధి అవకాశాల కోసం కంపెనీ వినియోగించనుంది. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, రాకేశ్జున్జున్వాలా స్టార్ హెల్త్‌లో వాటాదారులుగా ఉన్నారు. -
వ్యాక్సిన్ తీసుకుంటే.. ఆస్పత్రి ఖర్చులు తగ్గుతున్నాయ్
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా తీసుకున్న రోగుల్లో మరణాలు 81 శాతం, ఐసీయూలో చేరాల్సిన పరిస్థితులు 66 శాతం మేర తగ్గినట్లు ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఒక అధ్యయన నివేదికలో వెల్లడించింది. దీనితో టీకా తీసుకున్న రోగుల ఆస్పత్రి వ్యయాలు 24 శాతం తగ్గినట్లు పేర్కొంది. టీకా తీసుకోని వారి ఆస్పత్రి వ్యయాలు సగటున రూ. 2.77 లక్షలుగా ఉండగా, తీసుకున్న వారి వ్యయాలు రూ. 2.1 లక్షలుగా ఉందని సంస్థ ఎండీ ఎస్ ప్రకాష్ తెలిపారు. కోవిడ్–19 టీకాల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు .. దేశీయంగా వేక్సినేషన్ మొదలైన 42 రోజుల తర్వాత ఈ అధ్యయనం నిర్వహించారు. 45 ఏళ్లు పైబడి, ఆస్పత్రిలో చేరిన 3,820 మందిపై దీన్ని నిర్వహించారు. -
అమ్మాయిలతో పైనాన్స్ ఎర
--గిప్ట్ కూపన్ తగిలిందని మాయమాటలు --నమ్మి ఆఫీసుకు వస్తే ఇన్సూరెన్స్ అంటూ గారడీ --రూ.లక్షలు కట్టించుకుని బాండ్లు ఇవ్వని వైనం --బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మదనపల్లె టౌన్: మీరు బెస్ట్ కపుల్స్‌కు ఎంపికయ్యారు. మీకు ఊహించని గిప్ట్ ఫ్యాక్ తగిలింది. డబ్బు కట్టనవసరం లేదు.ఆఫీసుకు వచ్చి గిప్ట్ తీసుకెళ్లండంటూ అమ్మాయిలు ఫోన్లో సంభాషించి ఎరవేస్తారు. తీరా నమ్మి వాళ్ల ఆఫీసుకు వెళ్తే మాయ మాటలతో గారడీ చేస్తారు. వారి మాయమాటలలో పడివిన వారి వద్ద రూ.లక్షలు ఇన్సూరెన్స్ పేరుతో కట్టించుకుని మోసం చేస్తారు.ఇలా ఒకరిద్దరు కాదు వేల మందిని తరచూ ఫోన్లలో ప్రలోభపెట్టి మోసం చేసి డబ్బు కాజేస్తున్న స్టార్హెల్త్ అండ్ అలైన్ ఇన్సూరెన్స్ కంపెనీ బాగోతం శుక్రవారం మదనపల్లెలో వెలుగు చూసింది. టూటౌన్ ఎస్ఐలు గంగిరెడ్డి,నాగేశ్వరావుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రిలయన్స్‌లైఫ్ ఇన్సూరెన్స్ ఛానల్ డెవలప్మెంట్ అసోసియేట్ పేరును ఉపయోగిస్తూ అనంతపురం, కర్నూల్, చిత్తూరు జిల్లాలలో ఇన్సూరెన్స్ కంపెనీ పేరుమీద ఈ బోగస్ కంపెనీ నడుస్తోందన్నారు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని కేకే కాంప్లక్స్‌లో గత రెండేళ్లుగా సుమారు 10 మంది యువతులతో ఈ వ్యవహారం సాగిస్తున్నారన్నారు. నిర్వాహకురాలు అనంతపురానికి చెందిన పద్మప్రియగా పట్టుబడిన నిర్వాహకులు తెలిపారని చెప్పారు. ఈ సంస్థ ఆరు నెలలుగా ఎవరికి బాండ్లు ఇవ్వకపోవడంతో నమ్మి నగదు డిఫాజిట్ చేసిన బాధితులు పలువురు శుక్రవారం నిర్వాహకులను నిలదీయడం జరిగిందన్నారు. వారి వద్ద నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఫిర్యాదు చేశారని చెప్పారు. వెంటనే రంగ ప్రవేశం చేసి విచారణ చేపట్టగా అంతా బోగస్ అని తేలిందని చెప్పారు. ఇక్కడ ప్రజలను మోసం చేస్తున్న నిర్వాహకులు అశోక్, మరి కొంత మందిని అదుపులోకి తీసుకుని , రికార్డులను,కంప్యూటర్లు, ల్యాబ్టాప్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. విచారణ అనంతరం ఎంతమేరకు నగదు మోసం చేశారు, కంపెనీ నిబంధనలు పాటిస్తోందా లేదో విచారణలో తేలాల్సివుందన్నారు.ఈ దాడుల్లో ఎస్ఐలు గంగిరెడ్డి,నాగేశ్వరావు, స్పషల్ బ్రాంచ్ సీఐ, ఎస్ఐలు మునిరాజ, గణి, శివ తదితరులు ఉన్నారు.