క్యూఆర్‌ కోడ్‌తో స్టార్‌ హెల్త్‌ పాలసీ కొనుగోలు | Star Health launches UPI QR code based payments | Sakshi
Sakshi News home page

క్యూఆర్‌ కోడ్‌తో స్టార్‌ హెల్త్‌ పాలసీ కొనుగోలు

Published Fri, Sep 15 2023 1:07 AM | Last Updated on Fri, Sep 15 2023 1:07 AM

Star Health launches UPI QR code based payments - Sakshi

న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలు, రెన్యువల్‌ ప్రక్రియను మరింత సులభతరం చేయడంపై స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు జరిపే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచి్చంది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) తోడ్పాటుతో దీన్ని రూపొందించినట్లు సంస్థ ఎండీ ఆనంద్‌ రాయ్‌ తెలిపారు. దీనితో లావాదేవీకి పట్టే సమయం గణనీయంగా తగ్గగలదని వివరించారు.

ప్రీమియం చెల్లింపును గుర్తు చేసేందుకు పంపించే సందేశాల్లో యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని, అందులో ఎంత ప్రీమియం కట్టాలనే వివరాలు నిక్షిప్తమై ఉంటాయని సంస్థ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ చిట్టి బాబు తెలిపారు. దాన్ని స్కాన్‌ చేయడం ద్వారా లేదా లింక్‌ను క్లిక్‌ చేసి యూపీఐ యాప్‌ ద్వారా సెకన్లలో చెల్లింపును పూర్తి చేయొచ్చన్నారు. స్టార్‌ హెల్త్‌ కూడా సౌకర్యవంతమైన యూపీఐ ఆధారిత ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ను ప్రవేశపెట్టడం సంతోషకరమని ఎన్‌పీసీఐ చీఫ్‌ (ప్రోడక్ట్స్‌) కునాల్‌ కలావతియా చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement