
కొత్త యూపీఐ యూజర్లను చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు ఊరటనిస్తూ కొత్త యూపీఐ యూజర్లను చేర్చుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) అనుమతించింది. నిర్దేశిత మార్గదర్శకాలు, నిబంధనలను పాటించడాన్ని బట్టి అనుమతులు ఉంటాయని ఎన్‌పీసీఐ పేర్కొన్నట్లు ఎక్సే్చంజీలకు ఇచి్చన సమాచారంలో పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) వెల్లడించింది. నిబంధనలను పదే పదే ఉల్లంఘించినందుకు గాను కార్యకలాపాలు నిలిపివేయాలంటూ ఈ ఏడాది జనవరిలో అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను (పీపీబీఎల్) ఆర్‌బీఐ ఆదేశించడం తెలిసిందే.
ఎన్‌పీసీఐ అనుమతుల వార్తలతో బుధవారం ఓసీఎల్ షేరు ధర 8 శాతం లాభంతో రూ. 745 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 12 శాతం ఎగబాకింది.