one97 Communications
-
పేటీఎంకు ఎన్పీసీఐ ఊరట
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు ఊరటనిస్తూ కొత్త యూపీఐ యూజర్లను చేర్చుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) అనుమతించింది. నిర్దేశిత మార్గదర్శకాలు, నిబంధనలను పాటించడాన్ని బట్టి అనుమతులు ఉంటాయని ఎన్పీసీఐ పేర్కొన్నట్లు ఎక్సే్చంజీలకు ఇచి్చన సమాచారంలో పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) వెల్లడించింది. నిబంధనలను పదే పదే ఉల్లంఘించినందుకు గాను కార్యకలాపాలు నిలిపివేయాలంటూ ఈ ఏడాది జనవరిలో అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను (పీపీబీఎల్) ఆర్బీఐ ఆదేశించడం తెలిసిందే. ఎన్పీసీఐ అనుమతుల వార్తలతో బుధవారం ఓసీఎల్ షేరు ధర 8 శాతం లాభంతో రూ. 745 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 12 శాతం ఎగబాకింది. -
పేటీఎం పేమెంట్స్‌లో పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ సరీ్వసెస్‌లో (పీపీఎస్ఎల్) పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినట్లు పేటీఎం బ్రాండ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం ఆగస్టు 27న అనుమతులు మంజూరు చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. దీంతో పేమెంట్ అగ్రిగేటర్ (పీఏ) లైసెన్సు కోసం మరోసారి దరఖాస్తు చేసుకోనున్నట్లు వివరించింది. ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్ సేవలను, పేమెంట్ అగ్రిగేటర్ సరీ్వసులను ఒకే కంపెనీ అందించకూడదనే నిబంధన కారణంగా, 2022 నవంబర్‌లో పీఏ లైసెన్సు కోసం పేటీఎం సమరి్పంచిన దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలకు సంబంధించిన ప్రెస్ నోట్ 3కి అనుగుణంగా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రెస్ నోట్ 3 ప్రకారం భారత సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్రం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. అప్పట్లో పేటీఎంలో చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ అతి పెద్ద వాటాదారుగా ఉండేది. తాజాగా మారిన పరిస్థితుల ప్రకారం కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, ప్రెస్ నోట్ 3 నిబంధనలకు అనుగుణంగా పేటీఎం మరోసారి పీఏ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోనుంది. -
పేటీఎమ్ నుంచి సాఫ్ట్‌బ్యాంక్ ఔట్
న్యూఢిల్లీ: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ నుంచి పెట్టుబడుల జపనీస్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ పూర్తిగా వైదొలగింది. పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ పేమెంట్ తదితర సేవలందించే వన్97లో సాఫ్ట్‌బ్యాంక్ 2017లో దశలవారీగా 150 కోట్ల డాలర్లు(సుమారు రూ. 12,525 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. అయితే ఈ పెట్టుబడులపై 10–12 శాతం నష్టానికి పేటీఎమ్ నుంచి పూర్తిగా బయటపడినట్లు తెలుస్తోంది. వెరసి పెట్టుబడులపై 15 కోట్ల డాలర్ల(సుమారు రూ. 1,250 కోట్లు) నష్టం వాటిల్లినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తొలుత భారీ వాటా సాఫ్ట్‌బ్యాంక్ తొలుత అంటే 2021 పబ్లిక్ ఇష్యూకి ముందు పేటీఎమ్‌లో 18.5 శాతం వాటా పొందింది. ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్(కేమన్) ద్వారా 17.3 శాతం, ఎస్వీఎఫ్ పాంథర్(కేమన్) లిమిటెడ్ ద్వారా మరో 1.2 శాతం వాటాను కలిగి ఉంది. ఐపీవోలో పూర్తి వాటాను ఎస్వీఎఫ్ పాంథర్ 22.5 కోట్ల డాలర్ల(రూ. 1,689 కోట్లు)కు విక్రయించింది. ఈ సమయంలోనే సొంత ప్రణాళికలకు అనుగుణంగా సాఫ్ట్‌బ్యాంక్ 24 నెలల్లోగా మిగిలిన వాటాను అమ్మివేయనున్నట్లు ప్రకటించింది. నిజానికి పేటీఎమ్‌లో వాటాను షేరుకి రూ. 800 సగటు ధరలో సాఫ్ట్‌బ్యాంక్ చేజిక్కించుకుంది. లిస్టింగ్‌లో డీలా ఇష్యూ ధర షేరుకి రూ. 2,150కాగా.. పేటీఎమ్ 9 శాతం తక్కువగా రూ. 1,955 ధరలో లిస్టయ్యింది. తదుపరి ధర పతనమవుతూ వచ్చింది. సహచర సంస్థ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(పీపీబీఎల్)ను ఆర్బీఐ నిõÙధించడంతో షేరు ధర మరింత దిగజారింది. ఈ ఏడాది మే 9న చరిత్రాత్మక కనిష్టం రూ. 310ను తాకింది. పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై నిషేధం నేపథ్యంలో గతేడాది(2023–24) చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో రూ. 550 కోట్ల నష్టాలను ప్రకటించింది. ఈ కాలంలో పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాల భవిష్యత్ అనిశ్చితుల రీత్యా పీపీబీఎల్‌లో రూ. 227 కోట్ల పెట్టుబడుల(39 శాతం వాటా)ను రద్దు చేసింది. ఈ బాటలో మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 1,422 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అయితే అంతక్రితం ఏడాది(2022–23)లో రూ. 1,776 కోట్లకుపైగా నష్టం వాటిల్లిన విషయం విదితమే. కాగా.. 7 నెలల క్రితం యూఎస్ బిలియనీర్ వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథవే సైతం పేటీఎమ్ నుంచి నష్టాలకు వైదొలగడం గమనార్హం! షేరుకి దాదాపు రూ. 1,280 ధరలో కొనుగోలు చేసిన బెర్క్‌షైర్ నవంబర్‌లో రూ. 877.3 సగటు ధరలో అమ్మివేసింది. దీంతో రూ. 2,179 కోట్ల పెట్టుబడులకుగాను రూ. 1,371 కోట్లు అందుకుంది.గత వారాంతాన పేటీఎమ్ షేరు బీఎస్ఈలో 2.5 % నష్టంతో రూ. 467 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
పేటీఎంలో ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ: పేటీఎం బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఫిన్‌టెక్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ మరోమారు ఉద్యోగుల్లో కోత విధించింది. వీరికి ఔట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్ అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రెజ్యూమే రూపకల్పనకు సాయం చేయడంతోపాటు ఇంటర్వ్యూకు సన్నద్ధం చేయడం, మెళకువలు నేర్పడం, మార్కెట్లో ఉన్న ఉద్యోగావకాశాలను తెలియజేయడం వంటివి ఔట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్ అంటారు. తీసివేతకు గురైన సిబ్బందికి సాయం చేసేందుకు.. మార్కెట్లో నియామకాలు చేపడుతున్న 30 కంపెనీలతో పేటీఎం మానవ వనరుల విభాగం చేతులు కలిపింది. కాగా, ఎంత మందిని తొలగించిందీ అన్న విషయం మాత్రం వన్97 కమ్యూనికేషన్స్ వెల్లడించలేదు. -
పేటీఎంకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ క్యూ4లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 168 కోట్ల నుంచి రూ. 550 కోట్లకు చేరింది. పేటీఎం బ్రాండ్ కంపెనీ మొత్తం ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 2,267 కోట్లకు పరిమితమైంది. యూపీఐ లావాదేవీలు తదితరాలలో తాత్కాలిక అవరోధాలు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(పీపీబీఎల్)కు శాశ్వత అంతరాయం కారణంగా పనితీరు దెబ్బతిన్నట్లు కంపెనీ పేర్కొంది. బ్యాంక్ భవిష్యత్ బిజినెస్‌పై అనిశ్చితి కొనసాగనున్న నేపథ్యంలో పీపీబీఎల్‌లో 39 శాతం వాటాకుగాను క్యూ4లో రూ. 227 కోట్ల పెట్టుబడులను రద్దు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక మొత్తం ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 2,267 కోట్లను తాకినట్లు తెలియజేశారు. 2022–23లో రూ. 2,465 కోట్ల టర్నోవర్ సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక గతేడాది నికర నష్టం రూ. 1,422 కోట్లకు చేరగా.. 2022–23లో రూ. 1,777 కోట్ల నష్టం నమోదైంది. ఫలితాల నేపథ్యంలో పేటీఎం షేరు బీఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 369 వద్ద ముగిసింది. -
కస్టమర్ల వివరాల కోసం పేటీఎంకు ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో (పీపీబీఎల్) లావాదేవీలు జరిపే కస్టమర్ల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇతరత్రా దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయి. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ బుధవారం స్టాక్ ఎక్సే్చంజీలకు ఈ విషయం తెలియజేసింది. తమతో లావాదేవీలు జరిపిన వారి వివరాలను ఇవ్వాలంటూ ఈడీ సహా ఇతరత్రా దర్యాప్తు సంస్థల నుంచి తమకు, తమ అనుబంధ సంస్థలు, అసోసియేట్ సంస్థ పీపీబీఎల్‌కు నోటీసులు, అభ్యర్ధనలు వస్తున్నట్లు వన్97 తెలిపింది. అధికారులు అడుగుతున్న సమాచారాన్ని, పత్రాలను, వివరణను ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై పీపీబీఎల్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన ప్రభావంతో పేటీఎం షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈడీ కూడా విచారణ జరుపుతోందన్న వార్తలతో కంపెనీ షేర్లు బుధవారం మరో 10 శాతం క్షీణించి రూ. 342 వద్ద క్లోజయ్యాయి. -
నష్టాలను తగ్గించుకున్న పేటీఎం
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ, పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ డిసెంబర్ త్రైమాసికంలో నష్టాలను రూ.222 కోట్లకు తగ్గించుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర నష్టం రూ.392 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.2,850 కోట్లకు దూసుకుపోయింది. సబ్‌్రస్కిప్షన్ ఆదాయం గణనీయమైన వృద్ధిని చూసిందని, మార్జిన్లు మెరుగుపడ్డాయని, చెల్లింపుల వ్యాపారం ఆదాయం పెరిగినట్టు పేటీఎం ప్రకటించింది. వర్తకులు వినియోగించే పేటీఎం పేమెంట్ డివైజ్‌లు డిసెంబర్ చివరికి 1.06 కోట్లకు పెరిగాయి. పేమెంట్స్ వ్యాపారం ఆదాయం 45 శాతం పెరిగి రూ.1,730 కోట్లు, నికర చెల్లింపుల మార్జిన్ 63 శాతం పెరిగి రూ.748 కోట్లుగా ఉన్నాయి. మర్చంట్స్ పేమెంట్స్ వ్యాల్యూమ్ (జీఎంవీ) 47 శాతం వృద్ధితో రూ.5.10 లక్షల కోట్లకు చేరింది. ఫైనాన్షియల్ సరీ్వసుల ద్వారా ఆదాయం 36 శాతం పెరిగి రూ.607 కోట్లుగా నమోదైంది. డిసెంబర్ త్రైమాసికంలో రూ.15,535 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఇందులో 56 శాతం వృద్ధిని చూపించింది. గడిచిన ఏడాదిలో పేటీఎం ద్వారా రుణాలను తీసుకునే యూజర్లు 44 లక్షలు పెరిగి మొత్తం 1.25 కోట్లకు చేరారు. -
పేటీఎమ్ నుంచి బెర్క్‌షైర్ ఔట్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్‌లోగల మొత్తం 2.46 శాతం వాటాను ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్‌షైర్ హాథవే తాజాగా విక్రయించింది. ఓపెన్ మార్కెట్ ద్వారా పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్లోగల 1.56 కోట్లకుపైగా షేర్లను ఆఫ్‌లోడ్ చేసింది. షేరుకి రూ. 877.29 సగటు ధరలో విక్రయించిన వీటి విలువ దాదాపు రూ. 1,371 కోట్లు. అనుబంధ సంస్థ బీహెచ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ద్వారా మొత్తం వాటాను విక్రయించింది. కాగా.. దీనిలో 1.19 శాతం వాటాకు సమానమైన 75,75,529 షేర్లను కాప్తాల్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్ కొనుగోలు చేయగా.. 42.75 లక్షల షేర్ల(0.67 శాతం వాటా)ను ఘిసల్లో మాస్టర్ ఫండ్ ఎల్పీ సొంతం చేసుకుంది. ఇందుకు షేరుకి రూ. 877.2 సగటు ధరలో దాదాపు రూ. 1,040 కోట్లు వెచ్చించాయి. ఈ నేపథ్యంలో పేటీఎమ్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతంపైగా క్షీణించి రూ. 895 వద్ద ముగిసింది. -
పేటీఎమ్‌లో విజయ్‌కు అదనపు వాటా
న్యూఢిల్లీ: పేటీఎమ్ బ్రాండ్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మకు అదనపు వాటా లభించింది. చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ సంస్థ యాంట్‌ఫిన్ విజయ్‌కు పేటీఎమ్‌లోగల 10.3 శాతం వాటాను బదిలీ చేసింది. అయితే ఈ వాటాకు సంబంధించిన ఆరి్థక హక్కులు(ఎకనమిక్ రైట్స్) యాంట్‌ఫిన్‌వద్దనే కొనసాగనున్నాయి. కంపెనీ వాటాదారుల్లో ఒకటైన యాంట్‌ఫిన్(నెదర్లాండ్స్) హోల్డింగ్ బీవీ సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం 6,53,35,101 షేర్లను బదిలీ చేసినట్లు పేటీఎమ్ పేర్కొంది. దీంతో పేటీఎమ్‌లో యాంట్‌ఫిన్ వాటా 23.79 శాతం నుంచి 13.49 శాతానికి తగ్గినట్లు తెలియజేసింది. ఇదే సమయంలో విజయ్ వాటా 19.55 శాతానికి బలపడినట్లు వెల్లడించింది. వెరసి పేటీఎమ్‌లో విజయ్ అతిపెద్ద వాటాదారుగా నిలిచినట్లు పేర్కొంది. వాటా బదిలీకిగాను యాంట్‌ఫిన్.. ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఓసీడీలు)ను పొందనుంది. ఈ డీల్‌లో ఎలాంటి నగదు లావాదేవీలు జరగకపోగా.. షేరుకి రూ. 795 ధరలో వాటా బదిలీ చేపట్టింది. -
పేటీఎం అమ్మకాల్లో 40 శాతం వృద్ధి..
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో తమ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగిన స్థూల అమ్మకాలు (జీఎంవీ) 40 శాతం వృద్ధి చెందాయి. విలువపరంగా క్రితం క్యూ4లో రూ. 2.59 లక్షల కోట్లుగా ఉండగా ఈసారి రూ. 3.62 లక్షల కోట్లకు పెరిగాయి. సమీక్షాకాలంలో నెలవారీ లావాదేవీలు నిర్వహించే యూజర్ల సంఖ్య (ఎంటీయూ) 27 శాతం పెరిగి 9 కోట్లకు చేరిందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. పేమెంట్ డివైజ్‌ల కోసం చందా చెల్లించే వ్యాపారుల సంఖ్య 2022 డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే 10 లక్షలు పెరిగి 68 లక్షలకు చేరినట్లు వివరించింది. పేటీఎం ప్లాట్‌ఫాం ద్వారా రుణ వితరణ పరిమాణం రూ. 3,553 కోట్ల నుంచి మూడు రెట్లు పెరిగి రూ. 12,554 కోట్లకు ఎగిసిందని తెలిపింది. -
పేటీఎమ్‌లో అలీబాబా వాటా విక్రయం
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్‌లో మిగిలిన ప్రత్యక్ష వాటాను సైతం చైనీస్ కంపెనీ అలీబాబా తాజాగా విక్రయించింది. పేటీఎమ్ బ్రాండుతో సర్వీసులందించే వన్97లో బ్లాక్‌డీల్ ద్వారా 3.16 శాతం వాటాను అమ్మివేసినట్లు తెలుస్తోంది. డీల్ విలువ రూ. 1,360 కోట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో అలీబాబాకు పేటీఎమ్‌లో ప్రత్యక్షంగా ఎలాంటి వాటా మిగల్లేదని తెలియజేశాయి. 2022 డిసెంబర్‌కల్లా 6.26 శాతం ప్రత్యక్ష వాటాను కలిగి ఉన్న అలీబాబా తొలుత ఈ జనవరిలో 3.1 శాతం వాటాను విక్రయించింది. కాగా.. గ్రూప్ సంస్థ యాంట్(ఏఎన్‌టీ) ఫైనాన్షియల్ ద్వారా పేటీఎమ్‌లో 25 శాతం వాటాను అలీబాబా కలిగి ఉన్న సంగతి తెలిసిందే. బ్లాక్‌డీల్ ద్వారా శుక్రవారం(10న) మొత్తం 2.8 కోట్ల పేటీఎమ్ షేర్లు విక్రయమైనట్లు తెలుస్తోంది. అలీబాబాతోపాటు ఇతరులు సైతం లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రూ. 645–655 ధరలో లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. బ్లాక్‌డీల్ నేపథ్యంలో పేటీఎమ్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 8% పతనమై రూ. 651 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 640 వరకూ క్షీణించింది. -
పేటీఎం నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నష్టాలు తగ్గించుకుంది. కన్సాలిడేటెడ్‌గా రూ.392 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.778 కోట్లతో పోలిస్తే దాదాపు సగం తగ్గినట్టు తెలుస్తోంది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు 42 శాతం పెరిగి రూ.2,062 కోట్లకు చేరింది. ఈసాప్ వ్యయాలు మినహాయించి చూస్తే డిసెంబర్ త్రైమాసికంలో నిర్వహణ లాభం లక్ష్యాన్ని చేరుకున్నట్టు (ఎబిటా బ్రేక్ ఈవెన్) పేటీఎం వ్యవస్థాపకుడు, సంస్థ సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో దీన్ని చేరుకుంటామని చెప్పగా, అంతకు మూడు త్రైమాసికాల ముందే సాధించినట్టు ప్రకటించారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ ఫలితాలు విడుదలయ్యాయి. -
పేటీఎంలో ఆలీబాబా వాటాల విక్రయం
న్యూఢిల్లీ: పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో ఆలీబాబా సింగపూర్ ఈ–కామర్స్ దాదాపు 3 శాతం వాటాలను విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 1,031 కోట్లు. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ డేటా ప్రకారం ఆలీబాబా సింగపూర్ ఈ–కామర్స్ 1.92 కోట్ల షేర్లను (సుమారు 2.95 శాతం వాటా) షేరు ఒక్కింటికి రూ. 536.95 రేటుకి విక్రయించింది. దీనితో వన్97లో ఆలీబాబా మొత్తం వాటాలు 31.14 శాతం నుంచి 28.19 శాతానికి తగ్గాయి. గురువారం పేటీఎం షేర్లు 6 శాతం క్షీణించి రూ. 543.50 వద్ద ముగిశాయి. పేటీఎం రుణ వృద్ధి 4 రెట్లు కాగా, డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రుణ వృద్ధి గత నెల నాలుగు రెట్లు ఎక్కువగా నమోదైంది. డిసెంబర్లో రూ. 3,665 కోట్లు విలువ చేసే 37 లక్షల రుణాలను విడుదల చేసింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే ఇది 330 శాతం అధికమని పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. దీనితో డిసెంబర్ త్రైమాసికంలో మంజూరు చేసిన మొత్తం రుణాలు 357 శాతం పెరిగి రూ. 9,958 కోట్లకు చేరినట్లు వివరించింది. క్లిక్స్ క్యాపిటల్, పిరమల్ ఫైనాన్స్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల భాగస్వామ్యంతో పేటీఎం తమ కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. -
పేటీఎంపై రూ.30కే రూ.10వేల కవరేజీ
ముంబై: పేటీఎం పేరిట చెల్లింపులు, బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్ సహా సమగ్ర ఆర్థిక సేవల్లోని వన్97 కమ్యూనికేషన్స్.. హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ‘పేటీఎం పేమెంట్ ప్రొటెక్ట్’ ఉత్పత్తిని విడుదల చేసింది. ఇది గ్రూపు ఇన్సూరెన్స్ ప్లాన్. యూపీఐ ద్వారా యాప్‌లు, వ్యాలెట్ల నుంచి నిర్వహించే అన్ని రకాల లావాదేవీలకు ఇది రక్షణ కల్పిస్తుందని పేటీఎం తెలిపింది. ఏడాదికి కేవలం రూ.30 చెల్లించడం ద్వారా.. రూ.10,000 వరకు కవరేజీ పొందొచ్చని పేర్కొంది. యూపీఐ లావాదేవీల్లో మోసాల వల్ల నష్టపోయిన వారికి ఈ ప్లాన్ కింద గరిష్టంగా రూ.10వేల పరిహారం లభించనుంది. త్వరలోనే ఇదే ప్లాన్ కింద రూ.లక్ష వరకు రక్షణ కవరేజీని ఆఫర్ చేయనున్నట్టు పేటీఎం తెలిపింది. పరిశ్రమలో ఈ తరహా ఉత్పత్తి ఇదే మొదటిది అని, డిజిటల్ చెల్లింపుల పట్ల నమ్మకాన్ని పెంచడంతోపాటు, డిజిటల్ చెల్లింపులను మరింత మందికి చేరువ చేయడం ఈ ఉత్పత్తి లక్ష్యమని పేర్కొంది. -
లాభాలను చేరుకునే మార్గంలోనే పేటీఎం
న్యూఢిల్లీ: పేటీఎం పేరుతో డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవలను అందించే వన్97 కమ్యూనికేషన్స్.. లాభాలు, సానుకూల నగదు ప్రవాహాలను నమోదు చేసేందుకు సరైన మార్గంలోనే ప్రయాణం చేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు వాటాదారులకు ఒక లేఖ రాశారు. తద్వారా సంస్థ భవిష్యత్తు పనితీరుపై నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. అక్టోబర్ నెలలకు సంబంధించి పనితీరు గణాంకాలను తెలియజేశారు. దేశంలో ఎంతో అధిక డిమాండ్ ఉన్న రుణ వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నట్టు చెప్పారు. ‘‘ఏడాది క్రితం పబ్లిక్ మార్కెట్ (ఐపీవో, లిస్టింగ్)కు వచ్చాం. పేటీఎం విషయంలో ఉన్న అంచనాలపై మాకు అవగాహన ఉంది. లాభదాయకత, మిగులు నగదు ప్రవాహాల నమోదు దిశగా కంపెనీ సరైన మార్గంలో వెళుతోంది. మరింత విస్తరించతగిన, లాభదాయక ఆర్థిక సేవల వ్యాపారం ఇప్పుడే మొదలైంది’’అని తన లేఖలో పేర్కొన్నారు. సెప్టెంబర్ త్రైమాసికానికి పేటీఎం రూ.571 కోట్ల నష్టాలను ప్రకటించడం తెలిసిందే. వచ్చే ఏడాది ప్రయాణంపై ఎంతో ఆసక్తి ఉందంటూ, ఎబిట్డా లాభం, ఫ్రీక్యాష్ ఫ్లో సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ‘‘మన దేశంలో రుణాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. తక్కువ మందికే రుణ సదుపాయం చేరువ కావడం, రుణ వ్యాపారంలో ఉన్న కాంపౌండింగ్ స్వభావం దృష్ట్యా, దీనిపై మేము ఎంతో ఆశాభావంతో ఉన్నాం’’అని శర్మ తెలిపారు. -
పేటీఎమ్: 2023 సెప్టెంబర్‌కల్లా లాభాల్లోకి
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ 2023 సెప్టెంబర్ త్రైమాసికానికల్లా లాభాల్లోకి ప్రవేశించగలదని కంపెనీ ఎండీ, సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. గతంలో ప్రకటించినట్లే వచ్చే సెప్టెంబర్‌కల్లా కంపెనీ నిర్వహణా లాభాలు ఆర్జించగలదని 22వ వార్షిక సమావేశం సందర్భంగా వాటాదారులకు తెలియజేశారు. పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ చెల్లింపులను నిర్వహిస్తున్న కంపెనీ షేరు ధరను ప్రభావితం చేయబోమని, అయితే కంపెనీ లాభదాయకంగా మారేందుకు కృషి చేస్తామని వ్యాఖ్యానించారు. 2018–19 వరకూ కంపెనీ విస్తరణలో ఉన్నదని, 2019–20లో మానిటైజేషన్ బాట పట్టిందని తెలియజేశారు. షేరు ధరను తాము ప్రభావితం చేయబోమని, పలు అంశాలు ఇందుకు కారణమవుతుంటాయని వివరించారు. రూ. 2,150 ధరలో ఐపీవో చేపట్టగా వారాంతాన షేరు రూ. 771 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కాగా.. ఎండీ, సీఈవోగా మరో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించేందుకు విజయ్ శేఖర్ శర్మను వాటాదారులు ఎంపిక చేసినట్లు కంపెనీ దాఖలు చేసిన స్క్రూటినైజర్ నివేదిక వెల్లడించింది. శర్మకు అనుకూలంగా 99.67 శాతం మంది వాటాదారులు ఓటు చేసినట్లు నివేదిక పేర్కొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల సలహాదారు సంస్థ(ఐఐఏఎస్) శర్మ పునర్నియామకానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. -
‘డేటా’ నిబంధనలను పాటిస్తున్నాం
న్యూఢిల్లీ: డేటా స్థానికతకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన నిబంధనలన్నింటినీ పూర్తిగా పాటిస్తున్నామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) స్పష్టం చేసింది. తమ బ్యాంక్ డేటా అంతా దేశీయంగానే భద్రపరుస్తున్నామని వివరించింది. పర్యవేక్షణపరమైన లోపాల కారణంగా కొత్త ఖాతాలు తెరవొద్దంటూ పీపీబీఎల్‌ను ఆర్బీఐ గత వారం ఆదేశించిన నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. పీపీబీఎల్ సర్వర్లలోని వివరాలు చైనా సంస్థల చేతుల్లోకి వెడుతున్నాయనే వార్తలతో సోమవారం పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేరు ఒక్కసారిగా పతనమైంది. ఈ వన్97 కమ్యూనికేషన్స్‌లో చైనా ఆలీబాబా గ్రూప్ సంస్థలకు 31 శాతం వాటాలు ఉన్నాయి. తద్వారా పీపీబీఎల్‌లో కూడా చైనా కంపెనీలకు పరోక్షంగా వాటాలు ఉన్నాయి. -
పేటీఎమ్‌కు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 778 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. పేటీఎమ్ బ్రాండు సర్వీసుల ఈ కంపెనీ గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 536 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే మొత్తం టర్నోవర్ మాత్రం 88 శాతం జంప్‌చేసి రూ. 1,456 కోట్లయ్యింది. వినియోగదారులకు అందించిన పేమెంట్ సర్వీసుల ద్వారా లభించిన ఆదాయం 60 శాతం ఎగసి రూ. 406 కోట్లకు చేరింది. -
పేటీఎం ఐపీవోకు ఇన్వెస్టర్ల క్యూ..
ముంబై: డిజిటల్ చెల్లింపు సేవల దిగ్గజం పేటీఎం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) 1.89 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ 4.83 కోట్ల షేర్లను పబ్లిక్ ఇష్యూలో విక్రయానికి ఉంచగా, స్టాక్ ఎక్సే్చంజీల గణాంకాల ప్రకారం 9.14 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం సత్వరం ఓవర్ సబ్‌స్క్రైబ్ కాగా, ఇష్యూ ఆఖరు రోజైన బుధవారం నాడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) సహా సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారీగా రంగంలోకి దిగారు. దీంతో వారికి కేటాయించిన షేర్లకు 2.79 రెట్లు బిడ్లు వచ్చాయి. దీంతో వచ్చే వారం పేటీఎం లిస్టింగ్ భారీగా ఉండనుందని అంచనాలు నెలకొన్నాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ)కు 2.63 కోట్ల షేర్లను కేటాయించగా, 7.36 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్లకు 87 లక్షల షేర్లు ఆఫర్ చేయగా ఈ విభాగం 1.66 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. నవంబర్ 15న షేర్లను అలాట్ చేయనుండగా, 18న లిస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. లిస్టింగ్ రోజున పేటీఎం దాదాపు 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.50 లక్షల కోట్లు) పైగా వేల్యుయేషన్ దక్కించుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కోల్ ఇండియాను మించిన ఇష్యూ.. ఇప్పటిదాకా దేశీయంగా అత్యంత భారీ ఐపీవోగా కోల్ ఇండియా పబ్లిక్ ఇష్యూనే ఉంది. కోల్ ఇండియా దాదాపు దశాబ్దం క్రితం రూ. 15,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతం పేటీఎం ఐపీవో విలువ దాన్ని మించి ఏకంగా రూ. 18,300 కోట్లుగా ఉంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 1.39 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో.. షేరు ధర శ్రేణి రూ. 2,080 – 2,150గా కంపెనీ నిర్ణయించింది. విజయ్ శేఖర్ శర్మ 2000లో వన్97 కమ్యూనికేషన్స్‌ని (పేటీఎం మాతృ సంస్థ) ప్రారంభించారు. దాదాపు దశాబ్దం క్రితం మొబైల్ రీచార్జి, డిజిటల్ చెల్లింపు సేవల సంస్థగా ఏర్పాటైన పేటీఎం .. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్లు యాంట్ గ్రూప్, సాఫ్ట్ బ్యాంక్ మొదలైన వాటికి ఇందులో పెట్టుబడులు ఉన్నాయి. సఫైర్ ఫుడ్స్‌కు 1.07 రెట్ల స్పందన న్యూఢిల్లీ: కేఎఫ్‌సీ, పిజా హట్ అవుట్‌లెట్స్ నిర్వహణ సంస్థ సఫైర్ ఫుడ్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ రెండో రోజున పూర్తి స్థాయిలో సబ్‌స్క్రైబ్ అయింది. 96.63 లక్షల షేర్లను ఆఫర్ చేస్తుండగా 1.03 కోట్ల షేర్లకు (1.07 రెట్లు) బిడ్స్ వచ్చినట్లు ఎన్ఎస్ఈ గణాంకాల్లో వెల్లడైంది. రిటైల్ వ్యక్తిగత ఇన్వెస్టర్ల (ఆర్ఐఐ) విభాగం 5.38 రెట్లు, సంస్థాగతయేతర ఇన్వెస్టర్ల విభాగం 29 శాతం, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ) విభాగం 3 శాతం మేర సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఈ ఇష్యూ ద్వారా సఫైర్ ఫుడ్స్ రూ. 2,073 కోట్లు సమీకరిస్తోంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 933 కోట్లు సమీకరించింది. ఐపీవో ధరల శ్రేణి షేరు ఒక్కింటికి రూ. 1,120–1,180గా కంపెనీ నిర్ణయించింది. మార్చి 31 నాటికి సఫైర్ ఫుడ్స్ భారత్, మాల్దీవుల్లో 204 కేఎఫ్‌సీ రెస్టారెంట్లను.. భారత్, శ్రీలంక, మాల్దీవుల్లో 231 పిజా హట్ రెస్టారెంట్లను, శ్రీలంకలో రెండు టాకో బెల్ రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. -
పేటీఎమ్ మెగా ఐపీవో రెడీ
కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లతో పోటీ పడుతున్న ప్రైమరీ మార్కెట్ వచ్చే వారం మరింత స్పీడందుకోనుంది. డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్‌సహా మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. వెరసి సెకండరీ మార్కెట్ మరింత కళకళలాడనుంది. న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లలో వచ్చే వారం ఐపీవోల సందడి నెలకొననుంది. పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ సేవలందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్‌తోపాటు.. కేఎఫ్‌సీ, పిజ్జా హట్ ఔట్లెట్ల నిర్వాహక కంపెనీ సఫైర్ ఫుడ్స్, ఐటీ సర్వీసుల సంస్థ లేటెంట్ వ్యూ అనలిటిక్స్ పబ్లిక్ ఇష్యూలకు తెరలేవనుంది. మూడు కంపెనీల ఇష్యూలనూ కలిపితే రూ. 21,000 కోట్లను సమకూర్చుకునే అవకాశముంది. కాగా.. ఈ వారం ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్ వెంచర్స్, నైకా, ఫినో పేమెంట్స్ బ్యాంక్, పీబీ ఫిన్‌టెక్(పాలసీబజార్), ఎస్‌జేఎస్ ఎంటర్ప్రైజెస్, సిగాచీ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలను చేపట్టిన సంగతి తెలిసిందే. పేటీఎమ్ ఐపీవో సోమవారం(8న) ప్రారంభమై బుధవారం(10న) ముగియనుంది. సఫైర్ ఫుడ్స్ ఐపీవో 9–11 మధ్య, లేటెంట్ వ్యూ అనలిటిక్స్ 10–12 మధ్య పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. పేటీఎమ్ జోరు ఐపీవో ద్వారా వన్97 కమ్యూనికేషన్స్ రూ. 18,300 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు షేరుకి రూ. 2,080–2,150 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా రూ. 8,300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. దీంతో కంపెనీ విలువ రూ. 1.48 లక్షల కోట్లను తాకనుంది. ఐపీవో విజయవంతమైతే.. కోల్ ఇండియా తదుపరి రెండో పెద్ద ఇష్యూగా నిలవనుంది. ఇంతక్రితం 2010లో కోల్ ఇండియా అత్యధికంగా రూ. 15,200 కోట్లు సమకూర్చుకుంది. బుధవారం పేటీఎమ్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 8,235 కోట్లు సమీకరించింది. సఫైర్ ఫుడ్స్ ఇలా ఐపీవోకు రూ. 1,120–1,180 ధరల శ్రేణిని సఫైర్ ఫుడ్స్ ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు 1.757 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నాయి. తద్వారా రూ. 2,073 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. సఫైర్ ఫుడ్స్ మారిషస్ 55.69 లక్షలు, డబ్ల్యూడబ్ల్యూడీ రూబీ 48.46 లక్షలు, అమెథిస్ట్ 39.62 లక్షలు, క్యూఎస్ఆర్ మేనేజ్మెంట్ ట్రస్ట్ 8.5 లక్షల షేర్లు చొప్పున విక్రయానికి ఉంచనున్నాయి. లేటెంట్ వ్యూ అనలిటిక్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా లేటెంట్ వ్యూ అనలిటిక్స్ రూ. 474 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 126 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. ఐపీవోకు రూ. 190–197 ధరల శ్రేణిని ప్రకటించింది. తద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ప్రమోటర్ వి.వెంకటరామన్ రూ. 60.14 కోట్లు, వాటాదారుడు రమేష్ హరిహరన్ రూ. 35 కోట్లు, గోపీనాథ్ కోటీశ్వరన్ రూ. 23.52 కోట్ల విలువైన వాటాలను ఆఫర్ చేయనున్నారు. 46 కంపెనీలు ఈ కేలండర్ ఏడాది(2021)లో ఇప్పటివరకూ 46 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. తద్వారా ఉమ్మడిగా రూ. 80,102 కోట్లను సమీకరించాయి. ఏడాది పూర్తయ్యేసరికి ప్రైమరీ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణ రూ. లక్ష కోట్లను మించగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది(2020)లో ఐపీవోల ద్వారా 15 కంపెనీలు కేవలం రూ. 26,611 కోట్లు సమకూర్చుకున్నాయి. గతంలో 2017లో మాత్రమే ఈ స్థాయిలో 36 కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా రూ. 67,147 కోట్లను అందుకోవడం ద్వారా రికార్డు నెలకొల్పాయి! -
పేటీఎం విలువ రూ. 1.48 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపు సేవల కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 18,300 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది. షేరు ధర శ్రేణి రూ. 2,080–2,150గా ఉంటుందని తెలిపింది. దీని ప్రకారం కంపెనీ వేల్యుయేషన్ దాదాపు రూ. 1.48 లక్షల కోట్లుగా ఉండనుంది. 2010లో ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా ఐపీవో (రూ. 15,200 కోట్లు) కన్నా పేటీఎం మరింత భారీ స్థాయిలో ఉండనుండటం గమనార్హం. నవంబర్ 8న ప్రారంభమై 10న పబ్లిక్ ఇష్యూ ముగుస్తుంది. ఐపీవోకు ముందస్తు నిర్వహించిన కార్యక్రమంలో వన్97 కమ్యూనికేషన్స్ ఎండీ విజయ్ శేఖర్ శర్మ ఈ విషయాలు తెలిపారు. ‘పేటీఎం నిర్ణయించిన షేరు ధర శ్రేణిని చూస్తే కంపెనీ విలువ సుమారు 19.3–19.9 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ప్రస్తుత మారకం రేటు బట్టి ఇది రూ. 1.44 లక్షల కోట్లు–1.48 లక్షల కోట్లుగా ఉండవచ్చు‘ అని గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా సెక్యూరిటీస్ ఎండీ సుదర్శన్ రామకృష్ణ తెలిపారు. ఇది భారత దశాబ్దం..: 2010–20 దశాబ్దం.. ఆసియాలోని చైనా, జపాన్ తదితర దేశాలకు చెందినదైతే.. 2020–30 దశాబ్దం మాత్రం పూర్తిగా భారత్‌దేనని శర్మ వ్యాఖ్యానించారు. ‘ఇది భారత యుగం. మీది ప్రైవేట్ కంపెనీ కావచ్చు, కొత్త స్టార్టప్ కావచ్చు, లిస్టెడ్ కంపెనీ లేదా లిస్టయ్యే అవకాశాలు ఉన్న సంస్థ కావచ్చు. ప్రస్తుత తరుణంలో ప్రపంచం మీకు నిధులు అందిస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. తాము ముసాయిదా ప్రాస్పెక్టస్ సమర్పించినప్పటి నుంచి దేశ, విదేశ బ్లూ చిప్ ఇన్వెస్టర్లు .. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారని పేటీఎం ప్రెసిడెంట్ మధుర్ దేవరా తెలిపారు. ఐపీవోలో భాగంగా శర్మ రూ. 402.65 కోట్ల విలువ చేసే షేర్లు, కంపెనీలో ఇన్వెస్టరయిన యాంట్‌ఫిన్ హోల్డింగ్స్ రూ. 4,704 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద విక్రయించనున్నాయి. -
10 ఎకరాల భూమిని కొన్న పేటీఎం
బెంగళూరు : ఆన్లైన్ లావాదేవీలు చేయాలంటే.. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆశ్రయించేది పేటీఎంనే. పేటీఎం ఆ రేంజ్లో ఆదరణ పొందింది. 2010లో విజయ్ శేఖర్ శర్మ ప్రారంభించిన ఈ కంపెనీ.. ఎనిమిదేళ్లలో తిరుగులేని స్థాయికి ఎదిగింది. పూర్తి స్థాయి ఆర్థిక సేవల సంస్థగా అవతరించింది. తాజాగా ఈ సంస్థ కొత్త ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయబోతుందట. దీని కోసం 10 ఎకరాల భూమిని కూడా నోయిడాలో కొనుగోలు చేసిందని తెలిసింది. ఇటీవల కాలంలో దేశీయ కన్జ్యూమర్ ఇంటర్నెట్ స్టార్టప్‌లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీల్ ఇదే. ఈ డీల్ పరిమాణం రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్ల మేర ఉంటుందని తెలిసింది. పేటీఎం భూమిని కొనుగోలు చేసిన నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలో ఒక్కో ఎకరానికి రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల మేర మార్కెట్ ధర పలుకుతుందని ప్రాపర్టీ కన్సల్టెంట్లు చెప్పారు. పేటీఎం ఓనర్ వన్97 కమ్యూనికేషన్స్, నోయిడా అథారిటీ నుంచే డైరెక్ట్‌గా ఈ భూమిని కొనుగోలు చేయడంతో, కొంచెం తక్కువ ధరకే ఈ భూమిని పేటీఎం కొనుగోలు చేసినట్టు కన్సల్టెంట్లు తెలిపారు. నోయిడా మౌలిక సదుపాయాలకు ఈ అథారిటీ నోడల్ బాడీ. కంపెనీ కొత్త ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు పేటీఎం భూమిని కొనుగోలు చేసినట్టు పేటీఎం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కిరణ్ వాసిరెడ్డి కూడా ధృవీకరించారు. ఈ డీల్‌కు సంబంధించి ఎలాంటి ఆర్థిక, ఇతర వివరాలను ఆయన వెల్లడించలేదు. ఈ కొత్త ప్రధాన కార్యాలయంతో, దేశంలో ఉన్న ప్రతిభావంతులను మరింత మందిని ఆకట్టుకోవచ్చని వాసిరెడ్డి తెలిపారు. ఈ కొత్త ప్రధాన కార్యాలయం 15 వేల మందికి పైగా ఉద్యోగులకు అవకాశం కల్పించనుందని అంచనావేస్తున్నారు. ప్రస్తుతం పేటీఎంలో 20వేల మంది ఉద్యోగులున్నారు. వారిలో నోయిడా హెడ్ ఆఫీసులో 760 మంది పనిచేస్తున్నారు. మిగతా వారు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాల్లో పనిచేసేవారే. పేటీఎం కొత్త ఆఫీసు పర్యావరణ అనుకూలమైన, ఎనర్జీ సామర్థ్యంతో రూపొందుతుందని తెలిపారు. కాగ, గతేడాది మే నెలలోనే పేటీఎం 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ నుంచి రాబట్టింది. -
పేటీఎం నుంచి కొత్త ఆన్లైన్ షాపింగ్ యాప్
పేటీఎం మాల్’ ఆవిష్కరణ ముంబై: వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ విభాగం ‘పేటీఎం ఈ–కామర్స్’ తాజాగా కొత్త ఆన్లైన్ షాపింగ్ యాప్ ‘పేటీఎం మాల్’ (మాల్ అండ్ బజార్ ఆన్లైన్ షాపింగ్)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. పేటీఎం మాల్లో ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ఫ్యాషన్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మొబైల్స్, కిచెన్, ఫుట్‌వేర్, ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ వంటి పలు కేటగిరిలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇందులో 1,40,000 విక్రయదారులకు చెందిన దాదాపు 6.8 కోట్ల ప్రొడక్టులను అందుబాటులో ఉంచామని తెలిపింది. కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నామని పేర్కొంది. పేటీఎం ఎప్పటి నుంచో తన వాలెట్, ఈ–కామర్స్ బిజినెస్‌లను ఒకే వేదికగా (యాప్) నిర్వహిస్తూ వస్తోంది. వాలెట్ బిజినెస్‌ను పేమెంట్స్ బ్యాంక్‌లో కలిపేస్తుండటంతో కంపెనీ ఆన్లైన్ షాపింగ్‌కు ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా పేటీఎం తన ఈ–కామర్స్ బిజినెస్ కోసం ఇటీవలనే అలీబాబా నుంచి 200 మిలియన్ డాలర్లను సమీకరించింది. అలీబాబాకు స్నాప్‌డీల్‌లో కూడా వాటాలున్నాయి.