న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో (పీపీబీఎల్) లావాదేవీలు జరిపే కస్టమర్ల వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇతరత్రా దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయి. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ బుధవారం స్టాక్ ఎక్సే్చంజీలకు ఈ విషయం తెలియజేసింది. తమతో లావాదేవీలు జరిపిన వారి వివరాలను ఇవ్వాలంటూ ఈడీ సహా ఇతరత్రా దర్యాప్తు సంస్థల నుంచి తమకు, తమ అనుబంధ సంస్థలు, అసోసియేట్ సంస్థ పీపీబీఎల్‌కు నోటీసులు, అభ్యర్ధనలు వస్తున్నట్లు వన్97 తెలిపింది.
అధికారులు అడుగుతున్న సమాచారాన్ని, పత్రాలను, వివరణను ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన ప్రభావంతో పేటీఎం షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈడీ కూడా విచారణ జరుపుతోందన్న వార్తలతో కంపెనీ షేర్లు బుధవారం మరో 10 శాతం క్షీణించి రూ. 342 వద్ద క్లోజయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment