details
-
ఇతడేమో టాలీవుడ్ విలన్.. భార్య విదేశీ సింగర్.. గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
ట్రెండింగ్‌లో సాక్షి మాలిక్: ఆమె భర్త ఎవరో తెలుసా? అతడి బ్యాగ్రౌండ్ ఇదే! (ఫొటోలు)
-
అనుమానమొస్తే వెంటనే చెప్పండి: జేకే పోలీసులు
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరుగుతున్న నేపద్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలు కూడా రాష్ట్రంలో అణువణువునా తనిఖీలు చేపడుతున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్ పోలీసులు రాష్ట్రంలోని ప్రజలకు పలు సూచనలు చేశారు.ఉగ్రవాదులు తరచూ దాడులకు తెగబడుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలోని ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అలాగే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులుగానీ, వస్తువు గానీ కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.అనుమానాస్పదుల ఎత్తు, వారు ధరించిన దుస్తులు, వారి దగ్గర ఏవైనా ఆయుధాలు కనిపిస్తే ఆ వివరాలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని జమ్ము పోలీసు అధికారి అజయ్ శర్మ తెలిపారు. ఇటీవల కొందరు అనుమానాస్పద వ్యక్తులు స్థానికంగా ఉన్న ఓ బాలునికి కనిపించారని, ఈ విషయాన్ని ఆ బాలుడు సమీపంలోని సెక్యూరిటీ ఏజెన్సీకి తెలియజేశాడన్నారు. అయితే అది ఆ బాలుని ఊహ మాత్రమేనని, నాలుగు గంటలపాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఎవరి ఆచూకీ తెలియలేదన్నారు. -
ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ రాకెట్ ఫోర్స్?
ఒకప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ సత్సంబంధాలు కలిగిన దేశాలు. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఇరు దేశాలు బద్ధశత్రువులుగా మారాయి. ఈనెల (ఏప్రిల్) ఒకటిన సిరియా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో 13 మంది ఇరాన్ సైనికులు మరణించారు. ఈ దాడిపై స్పందించిన ఇరాన్.. ఇజ్రాయెల్‌ను నిందించింది. ఇజ్రాయెల్‌పై చర్య తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది. దీని తరువాత ఏప్రిల్ 13న ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. నిజానికి ఇరాన్ నుండి ఇజ్రాయెల్‌కు వేల కిలోమీటర్ల దూరం ఉంది. అయినా ఇరాన్ దాడులను విజయవంతంగా నిర్వహించింది. దీనిని చూస్తే ఇరాన్ రాకెట్ ఫోర్స్ ఎంతో శక్తివంతమైనదని అర్థమవుతుంది. ఇరాన్ వద్ద అత్యంత శక్తివంతమైన తొమ్మిది బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇవి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్‌పై దాడి చేసే శక్తిని కలిగివున్నాయి. ఈ క్షిపణుల్లో అత్యంత ప్రమాదకరమైనది ‘సెజిల్’. ఈ క్షిపణి గంటకు 17 వేల కిలోమీటర్ల వేగంతో 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యంపై దాడి చేయగలదు. ఖిబార్ క్షిపణి పరిధి రెండు వేల కిలోమీటర్లు. దీనితో పాటు, హజ్-ఖాసేమ్ దాడి పరిధి 14 వందల కిలోమీటర్లు. ఇరాన్ వద్ద హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. గత సంవత్సరం ఇరాన్ తన స్వదేశీ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించే వాటిని హైపర్సోనిక్ క్షిపణులు అంటారు. ఈ క్షిపణులను వాటి వేగం కారణంగా అడ్డుకోవడం అసాధ్యం. ఇరాన్ దగ్గర అణుశక్తితో రూపొందిన క్రూయిజ్ క్షిపణి కూడా ఉంది. దీని పరిధి మూడు వేల కిలోమీటర్లు. ఇరాన్‌కు డ్రోన్ల ఆయుధాగారం కూడా ఉంది. ఇరాన్ వద్ద మొహజిర్-10 అనే ప్రాణాంతక డ్రోన్ ఉంది. దీని పరిధి రెండు వేల కిలోమీటర్లు. ఇది 300 కిలోల బరువును మోయగలదు. ఇరాన్ దగ్గరున్న రాకెట్ ఫోర్స్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. -
అప్పులు, గ్యారంటీల వివరాలు పంపండి
సాక్షి, హైదరాబాద్: వివిధ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీ) ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లించాల్సిన వడ్డీలు, ఈ రుణాల కోసం ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల వివరాలను వెంటనే పంపాలని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇటీవల అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశారు. ఆయా శాఖల పరిధిలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు, ఎస్పీవీల ద్వారా 2023– 24 నాటికి తీసుకున్న అన్ని రుణాలు, వాటికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, 2024–25లో తీసుకోవాల్సిన రుణాలు, 2025 మార్చి 31 నాటికి వాటి ఖాతాల నిల్వల వివరాలను పంపాలని ఆ లేఖలో కోరారు. ఆర్టీకల్ 293(3) ప్రకా రం ఈ వివరాలను కేంద్రానికి సమర్పించి అప్పులు తీసుకునేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉన్నందున అత్యవసరంగా ఈ వివరాలను పంపాలని ప్రభుత్వ శాఖలకు రాసిన లేఖలో కోరారు. ఆర్థిక శాఖ వివరాలు కోరిన ఈ జాబితాలో డిస్కంలు, స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, ఐటీఈఅండ్‌సీ, టీఎస్ఐఐసీ, జలమండలి, జీహెచ్ఎంసీ, మెట్రో రైల్, యూఎఫ్ఐడీసీ, టీడీడబ్ల్యూఎస్సీఎల్ (మిషన్ భగీరథ), రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఆర్డీసీఎల్, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్, కాళేశ్వరం తదితర కార్పొరేషన్లు ఉన్నాయి. -
వైష్ణోదేవి దర్శనానికి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ!
వేసవి సెలవుల్లో మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించాలనుకునేవారికి ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ మూడు రాత్రులతో పాటు మొత్తం నాలుగు రోజులు ఉండనుంది. ఈ ప్యాకేజీ న్యూఢిల్లీ నుండి ప్రారంభంకానుంది. ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీలో మాతా వైష్ణో దేవి ఆలయంతో పాటు, కంద్ కండోలి ఆలయం, రఘునాథ్ ఆలయం, బేగ్ బహు గార్డెన్లను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఐఆర్సీటీసీ అన్ని సదుపాయాలను కల్పిస్తుంది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ పేరు ‘మాతారాణి- రాజధాని’ ఈ యాత్రలో ప్రయాణికులు థర్డ్ ఏసీలో ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ప్రయాణికులకు ప్రయాణ సమయంలో ఆహారపానీయాలను ఐఆర్సీటీసీ అందిస్తుంది. ఈ ప్యాకేజీ కింద రెండు బ్రేక్‌ఫాస్ట్‌లు, ఒక లంచ్, ఒక డిన్నర్ అందజేస్తారు. అలాగే బస ఏర్పాట్లను కూడా ఐఆర్సీటీసీ కల్పిస్తుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకునేవారు రూ.6,390 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వివిధ టారిఫ్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీలో ప్రయాణానికి గరిష్ట ఛార్జీ రూ.8,300. మరిన్ని వివరాల కోసం irctctourism.comని సందర్శించవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. -
టీచర్ కొలువుకు వేళాయె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 11,062 టీచర్ పోస్టులతో డీఎస్సీని ప్రకటించింది. గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఇచి్చన నోటిఫికేషన్‌ను బుధవారం రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం వాటికి అదనంగా 5,973 పోస్టులను చేరుస్తూ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారనే వివరాలతో కూడిన పోస్టర్‌ను వారు ప్రదర్శించారు. కొత్తగా ప్రకటించిన పోస్టుల్లో ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయ నియామకాలు కూడా ఉండటం విశేషం. ఈ నెల 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. డీఎస్సీ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు, ప్రత్యేక అవసరాలు ఉండే విద్యార్థులకు బోధించే టీచర్లకు సంబంధించిన ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరీక్షకు సంబంధించిన విధివిధానాలను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు నుంచే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఇచి్చన నోటిఫికేషన్ సమయంలో 1.75 లక్షల మంది దరఖాస్తు చేశారు. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసినప్పటికీ గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తులు పంపాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష.. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలోనే డి్రస్టిక్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 ఆన్లైన్ కేంద్రాలను గుర్తించింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డిలలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని తెలిపింది. 2023 జూలై ఒకటవ తేదీ నాటికి 18–46 ఏళ్ల మధ్య ఉన్న వారిని డీఎస్సీకి అనుమతిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి నుంచి మినహాయింపు ఉండనుంది. పరీక్షకు సంబంధించిన సిలబస్, సబ్జెక్టులవారీ పోస్టులు, రిజర్వేషన్ నిబంధనలకు సంబంధించిన సమాచార బులెటిన్ ఈ నెల 4న https:// schooledu. telangana. gov. in వెబ్సైట్లో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. డీఎస్పీ మే 20 తర్వాత 10 రోజులపాటు ఉండే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. 21 వేల ఖాళీలను గుర్తించినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు డీఎస్సీని ప్రకటించడం ఇది మూడోసారి. 2017 అక్టోబర్ 21న 8,792 పోస్టుల భర్తీకి తొలిసారి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆరీ్ట) పేరుతో తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 2023 సెపె్టంబర్ 5న 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం 11,062 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడింది. విద్యాశాఖలో ప్రస్తుతం 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నాయని అధికారులు గుర్తించారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను 70 శాతం ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. మరో 30 శాతం పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతులకు న్యాయ సమస్యలు అడ్డంకిగా మారడంతో పూర్తిస్థాయి నియామకాలు చేపట్టలేకపోతున్నారు. -
కస్టమర్ల వివరాల కోసం పేటీఎంకు ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో (పీపీబీఎల్) లావాదేవీలు జరిపే కస్టమర్ల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇతరత్రా దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయి. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ బుధవారం స్టాక్ ఎక్సే్చంజీలకు ఈ విషయం తెలియజేసింది. తమతో లావాదేవీలు జరిపిన వారి వివరాలను ఇవ్వాలంటూ ఈడీ సహా ఇతరత్రా దర్యాప్తు సంస్థల నుంచి తమకు, తమ అనుబంధ సంస్థలు, అసోసియేట్ సంస్థ పీపీబీఎల్‌కు నోటీసులు, అభ్యర్ధనలు వస్తున్నట్లు వన్97 తెలిపింది. అధికారులు అడుగుతున్న సమాచారాన్ని, పత్రాలను, వివరణను ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై పీపీబీఎల్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన ప్రభావంతో పేటీఎం షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈడీ కూడా విచారణ జరుపుతోందన్న వార్తలతో కంపెనీ షేర్లు బుధవారం మరో 10 శాతం క్షీణించి రూ. 342 వద్ద క్లోజయ్యాయి. -
Parliament security breach: వారి ‘ఫేస్బుక్’ వివరాలివ్వండి
న్యూఢిల్లీ: లోక్‌సభలో పొగబెట్టిన ఉదంతంలో అరెస్టయిన నిందితుల ‘ఫేస్బుక్’ ఖాతాల వివరాలు ఇవ్వాలని ‘మెటా’ సంస్థను ఢిల్లీ పోలీసులు కోరారు. నిందితులు సభ్యులుగా ఉన్న, ప్రస్తుతం మనుగడలో లేని ‘భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్’ ఫేస్బుక్ పేజీ వివరాలను అందించాలని ‘మెటా’కు ఢిల్లీ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం లేఖ రాసిందని సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఈ ఫేస్బుక్ పేజీని నిందితులే క్రియేట్ చేసి ఘటన తర్వాత డిలీట్ చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లకు ‘మెటా’ మాతృసంస్థ. ఈ నేపథ్యంలో నిందితుల మధ్య జరిగిన వాట్సాప్ ఛాటింగ్లనూ తమకు ఇవ్వాలని పోలీసులు ‘మెటా’ను కోరారు. -
లెక్కలు తీస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి ఏమిటో ప్రజలకు చెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ‘ఇది ప్రజాప్రభుత్వం’అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజే ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి కేబినెట్ సమావేశంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఈ పదేళ్ల కాలంలో నిధుల విడుదల, ఖర్చు, మిగులు తదితరాలు ప్రజలకు వివరించాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే ప్రభుత్వ శాఖల వారీగా నివేదికలు సేకరించాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా బడ్జెట్ రూపకల్పనలో భాగంగా శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల, చేసిన ఖర్చులకు సంబంధించి సమాచారం విభాగాధిపతులు సమర్పించడం ఆనవాయితీ. సీఎం ఆదేశాలతో శుక్రవారం పలు విభాగాధిపతులు ఆగమేఘాల మీద ఈ ఏడాదికి సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి సమర్పించారు. ప్రత్యేక ఫార్మాట్ రూపకల్పన ! శాఖలవారీగా చేసిన ఖర్చులకు ప్రత్యేక ఫార్మాట్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్టు తెలిసింది. 2014 నుంచి ఇప్పటివరకు వార్షిక బడ్జెట్లో జరిపిన కేటాయింపులు, నిధుల విడుదలకు సంబంధించి బడ్జెట్ రిలీజింగ్ ఉత్తర్వులు, చేసిన ఖర్చు, సంవత్సరం వారీగా నిధుల మిగులుకు సంబంధించిన సమాచారం సమర్పించాల్సి ఉంటుంది. ఖర్చుకు సంబంధించిన అంశాలను పథకాల వారీగా వ్యయం, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతోపాటు మరమ్మతులు తదితరాలను పూర్తిస్థాయిలో సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో కూడిన జాబితాతోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, విడుదలైన నిధులు, చేసిన ఖర్చు వివరాలు కూడా వేరుగా సమర్పించాలని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, సమావేశాలు ముగిసేనాటికి వీటిని ప్రజాక్షేత్రంలో ఉంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి పదేళ్ల కాలంలో రూ.25వేల కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా. -
స్కిల్ కుంభకోణం వివరాలు బహిర్గతం చేయకుండా ఆదేశాలివ్వండి
సాక్షి, అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులను, దర్యాప్తు చేస్తున్న అధికారులను లక్ష్యంగా చేసుకుంటూ భౌతిక దాడులకు, తీవ్ర ఆరోపణలకు దిగిన తెలుగుదేశం పార్టీ వర్గాలు... ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు ఎలాంటి ఊరట రాకుండా న్యాయస్థానాల్లో గట్టిగా వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని, సీఐడీ చీఫ్ సంజయ్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. అందులో భాగంగా స్కిల్ కుంభకోణం గురించిన వాస్తవాలను పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు వివరించేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఎన్.సంజయ్‌లపై ఆ వర్గాలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశాయి. స్కిల్ కుంభకోణం కేసు లేదా ఇతర ఏ కేసుకు సంబంధించిన సమాచారాన్ని కూడా బహిర్గతం చేయకుండా, ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా సుధాకర్‌రెడ్డి, సంజయ్‌ను ఆదేశించాలని కోరుతూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పత్రికా సమావేశాలు పెట్టడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా వారిద్దరిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో కోర్టును కోరారు. అంతేకాక సుధాకర్‌రెడ్డి, సంజయ్ నిర్వహించిన సమావేశంపై విచారణ జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. అలాగే పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సంజయ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. సమావేశాలు పెడుతూ, హోటళ్లలో ఉంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సత్యనారాయణ తన పిటిషన్లో పేర్కొన్నారు. సెంట్రల్ సివిల్ సర్వెంట్ రూల్స్‌కు విరుద్దంగా వీరు వ్యవహరిస్తున్నారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు వివరాలను రహస్యంగా ఉంచాల్సింది పోయి సమావేశాలు పెట్టి బహిర్గతం చేయడం నైతిక విలువలకు విరుద్ధమన్నారు. చంద్రబాబుతో పాటు ఇతర నిందితుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ, స్టేట్మెంట్లు ఇస్తున్నారని వివరించారు. స్కిల్ కేసులో నిర్వహించిన సమావేశాల కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని సుధాకర్‌రెడ్డి, సంజయ్ నుంచి వసూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సత్యనారాయణ తన పిటిషన్లో కోర్టును కోరారు. -
ఓటు ప్లాట్‌ఫామ్‌పై వందేభారత్
గౌరిభట్ల నరసింహమూర్తి: ఎన్నికల్లో తొలిసారి ‘రైలు’ ప్రచారాస్త్రంగా నిలవబోతోంది. గతంలో కొన్ని ప్రాంతాల్లో ‘ఇన్ని దశాబ్దాలు గడిచినా మా ప్రాంతానికి రైలు రాలేదు’ అన్న నెగెటివ్ అంశం ప్రచారంలో వినిపించినా.. ఇప్పుడు దానికి భిన్నంగా, ఓ రైలు ఘనతను తమకు అనుకూలంగా మలుచుకుంటూ నేతలు ప్రసంగ పాఠాన్ని సవరించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో కనిపించిన ఈ పంథా, ఇప్పుడు తెలంగాణ ఎనిక్నల్లోనూ కనిపించబోతోంది. కేంద్రప్రభుత్వం ట్రెయిన్ 18 పేరుతో ప్రయోగాలు నిర్వహించిన తర్వాత ‘’వందేభారత్’గా పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. తొలి రైలే ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. బ్లూ చారలున్న తెలుపు రంగు కోచ్‌లు, ప్రత్యేకంగా పుష్ పుల్ పద్ధతిలో రెండు వైపులా ఇన్‌బిల్ట్ ఇంజిన్‌తో ఉండటం, 180 కి.మీ. వేగం అందుకునే సామర్ధ్యం, విలాసంగా కనిపించే కోచ్‌లు.. ఇలా ఒకటేమిటి, ఇంతకాలం విదేశాల్లోనే కనిపించిన రైలు మన పట్టాలపై పరుగు పెడుతుంటే ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఫలితంగా మా ప్రాంతానికి కావాలంటే మా ప్రాంతానికి కావాలంటూ రైల్వేపై అన్ని రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరిగింది. ఏకంగా మూడు రైళ్లతో.. దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ వందేభారత్ రైళ్లు తెలంగాణకు ఏకంగా మూడు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలకు వాటిని కేటాయించనే లేదు. ఈ తరుణంలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాచిగూడ నుంచి బెంగళూరు మధ్య మూడు వందేభారత్ రైళ్లు పరుగుపెడుతున్నాయి. ఇప్పుడు ఇదే బీజేపీకి పెద్ద ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కొన్ని దశాబ్దాల కాలంలో తెలంగాణకు సాధారణ రైళ్లు మంజూరు కావటమే గొప్ప అనుకుంటున్న తరుణంలో, మోదీ ప్రభుత్వం సెమీ బుల్లెట్ రైళ్లుగా పేర్కొనే వందేభారత్ రైళ్లను మూడింటిని కేటాయించటాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జరిగిన సభల్లో వందేభారత్ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వాటి ప్రారంబోత్సవ కార్యక్రమాల్లో కేంద్రమంత్రి హోదాలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రముఖంగా పేర్కొంటూ తెలంగాణకు వరాలుగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు వందేభారత్‌ను కీర్తిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జనవరి నాటికి స్లీపర్ క్లాస్ రైళ్లు కూడా.. ప్రస్తుతం పగటి పూట నడిచే చెయిర్‌కార్ కోచ్ రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయి. జనవరి నాటికి స్లీపర్ క్లాస్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటి చార్జీ ఎక్కువగా ఉన్నందున, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా వందే సాధారణ్ రైళ్ల తయారీని కూడా ప్రారంభించారు. ప్రచారం చేయాలని.... ఆ రైళ్లపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయం మొత్తంగా వందేభారత్ రైళ్లు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు రైల్వే శాఖ నుంచి సేకరించారు. వాటి వివరాలను పార్టీ కార్యకర్తలకు కూడా అందిస్తున్నారు. ప్రచారంలో వీటిని విస్తృతంగా ప్రజలకు తెలియజెప్పాలని సూచిస్తున్నారు. మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు ప్రారంభించిన రైలు సర్వి సు కూడా ప్రచారంలో భాగమవుతోంది. ఆ రైలు సర్వీసు ప్రారంభం రోజు ఆ ఘనత తమదంటే తమది అంటూ బీజేపీ–బీఆర్ఎస్ నేతలు పేర్కొంటూ దాడులు చేసుకున్న సంగతి విదితమే. దీంతో ఎన్నికల్లో కూడా స్థానికంగా అది ప్రచారాస్త్రంగా మారబోతోంది. రెండు దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసి కాచిగూడ నుంచి దేవరకద్ర మీదుగా కర్ణాటక సరిహద్దులోని కృష్ణా స్టేషన్ వరకు రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వి సును ఇటీవల ప్రారంభించారు. ఈ రెండు రైళ్లను ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొద్ది రోజుల ముందు స్వయంగా ప్రధాని మోదీ వచ్చి ప్రారంభించిన విషయం తెలిసిందే. అమృత్ భారత్స్టేషన్ల పేరుతో రాష్ట్రంలో 21 స్టేషన్లకు పూర్తి ఆధునిక భవనాలు నిర్మించే పని ప్రారంభించారు. ఆధునిక రూపు తెస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. -
విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతోపాటు అన్ని యాజమాన్యాల్లోని విద్యార్థుల వివరాలను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పోర్టల్‌లో నమోదు చేసేలా కలెక్టర్లు, డీఈవోలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు అందించిన విద్యార్థుల వివరాలను అధికారులు తనిఖీ చేసి ధ్రువీకరించాలన్నారు. ఇప్పటికే వలంటీర్లు చేసిన సర్వే ప్రకారం18 లక్షల మంది విద్యార్థుల పేర్లు ఇంకా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పోర్టల్‌లో అప్డేట్ కాలేదన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ప్రారంభించి బుధవారానికి వంద రోజులు అవుతున్నందున అన్ని స్కూళ్ల హెచ్ఎంలు అప్లోడ్ చేసేలా కలెక్టర్లు తీసుకోవాలన్నారు. విద్యార్థుల వివరాలు అప్లోడ్ చేయకుంటే కఠిన చర్యలు తప్పవని మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. -
డేంజర్: ఇది జరిగితే మీ బ్యాంక్ అకౌంట్ ప్రమాదంలో ఉన్నట్టే..
ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. అమాయక ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మీ డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు అత్యంత తేలికగా స్కామర్ల చేతికి చేరుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. పలు అక్రమ వైబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, కార్డ్ హోల్డర్ పేర్లు, సీవీవీతో సహా వివరాలను స్కామర్లకు విక్రయిస్తున్నాయి. అదీ కూడా ఒక్కో కార్డు వివరాలు కేవలం 5 యూఎస్ డాలర్లు. అంటే రూ.410లకు మాత్రమే. పశ్చిమ దేశాలలో చెల్లింపులు ప్రాసెస్ చేయడానికి కార్డు వివరాలు ఉంటే సరిపోతుంది. ఓటీపీ అవసరం ఉండదు. అందుకే ఆయా దేశాల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. కానీ భారత్‌లో వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ద్వారా రెండు-కారకాల ప్రామాణీకరణ తప్పనిసరి. అయినప్పటికీ దీన్ని కూడా అధిగమించడానికి స్కామర్లు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఉన్నట్టుండి సిమ్ డీయాక్టివేట్ అయితే.. బాధితుల ఒరిజినల్ సిమ్‌ను డీయాక్టివేట్ చేయడం ద్వారా స్కామర్లు ఓటీపీని ఎలా యాక్సెస్ చేస్తున్నారో భారతీయ పోలీసు అధికారులను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకిస్తూ పేర్కొంది. హ్యాకర్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలను బాధితుడి పేరు, ఫోన్ నంబర్‌తో సహా షాడో వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. సైబర్ మోసగాళ్లు ఈ వివరాలను కొనుగోలు చేసి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించి బాధితుల సిమ్ కార్డ్ డీయాక్టివేట్ చేయిస్తున్నారు. తర్వాత డూప్లికేట్ సిమ్ పొంది ఓటీపీలను సునాయాసంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. నష్టం జరిగేంత వరకు బాధితుడి ఈ మోసం గురించి తెలియదు. కాబట్టి మీ సిమ్ కార్డ్ ఉన్నట్టుడి డీయాక్టివేట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. కొన్ని నిమిషాల్లోనే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఈ వెబ్సైట్లను నిర్వహిస్తున్నదెవరు? నివేదిక ప్రకారం.. అక్రమ వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లను రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన హ్యాకర్లు నిర్వహిస్తున్నట్లుగా తేలింది. వీళ్లు వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా కార్డ్ వివరాలను హ్యాక్ చేసి విక్రయిస్తున్నారు. సంపన్న పాశ్చాత్య దేశాలకు చెందిన వారి కార్డు వివరాలకు ఒక్కో కార్డుకు 10 డాలర్లు (రూ.820) చొప్పున తీసుకుంటుండగా భారత్ సహా ఆసియా దేశాలకు చెందిన బాధితుల కార్డుల వివరాలకు చవగ్గా కేవలం 5 డాలర్లు (రూ.410)కే అమ్మేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. 2022 జనవరిలో అటువంటి అక్రమ వెబ్సైట్ ఒకదానిని అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. కానీ అలాంటి అక్రమ వెబ్సైట్లు, టెలీగ్రామ్ చానెళ్లు లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి. ఇదీ చదవండి: ఇంటర్నెట్ షట్‌డౌన్: ఆరు నెలల్లో ఇన్ని వేల కోట్ల నష్టమా? -
భారత్‌లో అధికంగా విక్రయమయ్యే కండోమ్ బ్రాండ్స్..
భారత్‌లో పలు కంపెనీలు తమ కండోమ్‌లను విక్రయిస్తున్నాయి. కండోమ్స్ ప్రొడక్ట్ రేంజ్ కూడా అధికంగానే ఉంటుంది. డ్యూరెక్స్ కండోమ్ భారత్‌తో పాటు ప్రపంచంలోనే అత్యధికంగా విక్రయమయ్యే నంబర్ వన్ బ్రాండ్. 150 దేశాల్లో ఈ కండోమ్స్ విక్రయమవుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలోని మ్యాన్‌ఫోర్స్ బ్రాండ్ భారత్‌లో అత్యధికంగా కండోమ్స్ విక్రయించే కంపెనీగా చెప్పుకుంటుంది. సంబంధిత చార్ట్‌లో ఈ బ్రాండ్ పేరు టాప్‌లో కనిపిస్తుంది. మ్యాన్కోర్స్ బ్రాండ్ మ్యాన్‌కైండ్ ఫార్మ్‌కు సంబంధించినది. ఇటీవలే ఈ కంపెనీ లిస్టింగ్ షేర్ మార్కెట్లోకి ప్రవేశించింది. స్కోర్.. టీటీకే ప్రొటెక్టివ్ డివైజెస్ లిమిటెడ్‌కు చెందిన ప్రముఖ కండోమ్ బ్రాండ్. బారత్‌లో ఈ బ్రాండ్ విక్రయాలు జోరుగా దూసుకుపోతున్నాయి. కామసూత్ర భారత్‌లోని ప్రముఖ కండోమ్ బ్రాండ్లలో ఒకటి. 2017లో రేమాండ్ ఈ కామసూత్ర బాండ్‌ను కొనుగోలు చేసింది. కోహినూర్ కండోమ్ బ్రాండ్ విక్రయాల విషయంలో భారత్‌లో ముందుంది. రాకెట్ అండ్ బెంకింజర్ ఇండియా 1979లో కోహినూర్ కండోమ్ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీనితోపాటు భారత్‌లో ‘మూడ్స్’ కూడా ఆదరణ పొందిన కండోమ్ బ్రాండ్. మార్కెట్లో మూడ్స్ కండోమ్‌లలో పలు రకాల సిరీస్ అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా చదవండి: యోగాకు గుర్తింపునిచ్చిన గురువులు వీరే.. -
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోండి
-
జయలలిత ఆస్తులను వివరాలను ఇవ్వండి!
ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు నిరాకరించిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆపీసర్(పీఓఐ) ఉత్తర్వును సివిల్ కోర్టు కొట్టేసింది. అలాగే ప్రత్యేక కోర్టు ఆదేశించిన ఉత్తర్వుల మేరకు దివగంత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందేనని పీఓ అధికారిని కోర్టు ఆదేశించింది. 1996 డిసెంబర్ 11న జప్తు చేసిన ఆస్తుల వేలానికి సంబంధించి ప్రత్యేక కోర్టు ఆదేశాలపై సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ కార్యకర్త టీ నరసింహమూర్తి కోరారు. వాస్తవానికి జయలలిత ఆదాయనికి మించిన ఆస్తుల కేసును 2003లో సుప్రీం కోర్టు కర్ణాటకకు బదిలీ చేసింది. ఈ మేరకు జయలలిత చీరలు, శాలువాలు, పాదరక్షలతో సహా స్వాధీనం చేసుకుని బెంగళూరుకి తరలించారు. ఐతే 2014లో జయలలితతోపాటు, ఇతర నిందితులను ఇక్కడి ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. కానీ ఈకేసుకి సంబంధించిన భౌతిక ఆధారాలు కస్టడీలోనే ఉన్నాయి. ఆయా ఆస్తులను ఆర్టీఐ కార్యకర్త నరసింహమూర్తి వేలం వేయాలని కోరారు. ఈ క్రమంలో ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పీఐఓ) నిరాకరించారు. పైగా ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఐతే సివిల్ కోర్టు ప్రత్యేక కోర్టు తుది ఉత్తర్వుల తోపాటు కోర్టు నియమించిన ప్రత్యేక ప్రాసిక్యూటర్ ముందు ఆస్తుల వివరాలను వెల్లడించాలని అధికారులను ఆదేశించింది. (చదవండి: లక్నో భవనం కూలిన ఘటన: సమాజ్‌వాద్ పార్టీ నేత భార్య, తల్లి దుర్మరణం) -
ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు
నేపాల్ విమానం కూలిన విషాద ఘటన గురించి ప్రత్యక్ష సాక్షులు కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాకి వివరించారు. ఈ మేరకు ఒక స్థానిక నివాసి కల్పనా సునార్ ఆ విమానం బాంబు లాంటి పేలుడుతో తమ వైపుకు దూసుకురావడాన్ని చూసినట్లు పేర్కొంది. ఆ సమయంలో తాను బట్టలు ఉతుకుతున్నానని చెప్పింది. ఆ విమానం పాత విమానాశ్రయానికి, కొత్త విమానాశ్రయానికి మధ్య ఉన్న సేతి నది వద్ద కుప్పకూలిందని, ఆ నది లోయ చుట్టు నల్లటి దట్టమైన పొగ కమ్మేయడం చూశానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో విమానం అసాధారణ రీతిలో వంగి ఉండటం చూశానని చెప్పుకొచ్చింది. మరో ప్రత్యక్ష సాక్షి గీతా సునార్ తమ ఇంటికి 12 మీటర్ల దూరంలో విమానం రెక్క పడిందని తెలిపారు. అది మా నివాసాలకు కాస్త దూరంలో పడిందని లేదంటే మా నివాసాలు దగ్ధమయ్యేవని, చాలా నష్టం వాటిల్లేదని చెప్పింది. సేతి నదికి రెండువైపులా మంటలు చెలరేగాయని, మృతదేహాలు చెల్లచెదురుగా పడి ఉన్నాయని చెప్పింది. అలాగే 11 ఏళ్ల పిల్లలు సమీర్, ప్రజ్వల్ తాము ఆసమయంలో ఆడుకుంటుండగా ఏదో బొమ్మ విమానం పడుతున్నట్లుగా కనిపించిందని, ప్రయాణికులు అరుపులు కూడా వినిపించాయని చెప్పారు. కాసేపటికి మా వైపుకి దూసుకురావడంతో భయంతో పారిపోయామని చెప్పారు. ఏదో టైర్ క్రాష్ అయినంత సౌండ్ వినిపించిందని అది మమ్మల్ని తాకినట్లు అనిపించిందని చెప్పుకొచ్చారు. క్రాష్ అయిన కాసేపటికి దగ్గరకు వెళ్దామంటే దట్టమైన పొగ వ్యాపించి ఏమి కనిపించలేదని స్థానికుల చెప్పారు. అయితే విమానంలోని సుమారు ఏడు నుంచి ఎనిమిది విండోలు చెక్కు చెదరకుండా ఉంటే ఎవరైనా సజీవంగా బతికి ఉంటారని భావించామని అన్నారు. మరికొంతమంది ఈ ఘటన జరగుతుండగా భయాందోళనతో ఉన్నామని, తాము చూస్తుండగానే విమానం మిగతా సగం వైపుకి కూడా మంటలు వ్యాపించాయని చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఘటనలో సుమారు 68 మంది ప్రయాణికులు చనిపోగా..ఇంకా నలుగురు మృతదేహాల ఆచూకి లభించలేదు. సోమవారం కూడా వారి కోసం నేపాల్ భద్రతా సిబ్బంది గాలించడం పునః ప్రారంభించారు. అలాగే ప్రమాద స్థలం నుంచి బ్లాక్‌బాక్స్‌ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: నేపాల్ విమాన ఘటన: కోపైలట్ విషాద గాథ..నాడు భర్తలాగే భార్య కూడా..) -
ఈపీఎఫ్.. వెరీటఫ్..! మారిన రూల్స్.. ఈ విషయాలు తెలుసుకోకుంటే కష్టమే!
అమరేందర్‌రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ పదవీ విరమణ పొందాడు. సర్వీసు పూర్తి కావడంతో కుటుంబ అవసరాల కోసం తన ఈపీఎఫ్ ఖాతాలోని రూ.8.75 లక్షల నగదు ఉపసంహరణకు, పెన్షన్ పొందేందుకూ ప్రయత్నించాడు. కానీ అతని వినతిని ఈపీఎఫ్ఓ తిరస్కరించింది. అతడి ఈపీఎఫ్ ఖాతాలో తండ్రిపేరు నమోదు కానందునే ఇలా జరిగింది. వాస్తవానికి తండ్రి పేరును ఆన్లైన్లో పొందుపర్చి... కోవిడ్ సమయంలో రెండుసార్లు నగదును ఉపసంహరించుకున్న అమరేందర్‌రెడ్డి.. తాజాగా తండ్రి పేరు లేదని వినతిని తిరస్కరించడంతో ఆందోళనకు గురయ్యాడు. ఆన్లైన్లో తండ్రిపేరు సవరణకు రిక్వెస్ట్ సమర్పించినప్పటికీ దాన్ని కూడా రిజెక్ట్ చేయడంతో తను చివరగా పనిచేసిన కంపెనీని ఆశ్రయించాడు. సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించి ఆర్నెల్లు కావస్తున్నా ఇప్పటికీ ఆయనకు పీఎఫ్ డబ్బులు అందలేదు. సాక్షి, హైదరాబాద్: ఉద్యోగి భవిష్యనిధి (ఈపీఎఫ్) ఖాతాలో వివరాల సవరణ అత్యంత కష్టతరంగా మారింది. సాధారణంగా కొత్తగా సంస్థలో ఉద్యోగంలో చేరినప్పుడు ఉద్యోగి సమర్పించిన వాస్తవ వివరాలను కంపెనీ యాజమాన్యం ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో నమోదు చేస్తుంది. సరైన వివరాలు పొందుపరిచినప్పటికీ ఇటీవల పలువురు ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో ఆ వివరాలు కనిపించడం లేదు. దీంతో అకస్మాత్తుగా నగదు అవసరమైనప్పుడు ఈపీఎఫ్ ఖాతా నుంచి తీసుకోవాలనుకున్న ప్రయత్నాలు ఫలించక ఖాతాదారులు నివ్వెరపోతున్న ఘటనలు ఇటీవల అనేకం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివరాల సవరణలోనే చాలామంది నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు అన్ని వివరాలు సమర్పించి సరిచూసుకున్నప్పటికీ కొన్నాళ్ల తర్వాత తండ్రి పేరు, పుట్టినతేదీ, పాన్, ఆధార్, బ్యాంకు ఖాతా లింకు లేదని వెబ్సైట్లో సూచించడం గమనార్హం. ఇలాంటి వాటికి సాంకేతిక కారణాలను సాకుగా చూపి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అంతా ఆన్లైన్లో అయినా... ప్రతి ఈపీఎఫ్ ఖాతాదారుడికి యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ఉంటుంది. ఉద్యోగి వివిధ కంపెనీలు మారినప్పటికీ యూఏఎన్ మాత్రం ఒకటే ఉంటుంది. ఈపీఎఫ్ వెబ్సైట్లో తమ వివరాలు సరిగ్గా లేవని గుర్తించిన పలువురు ఉద్యోగులు.. ఆన్లైన్లో సవరణల కోసం నమోదు చేసుకున్న వినతులు పెద్ద సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్నాయి. చిన్నపాటి సవరణలకూ ఆధా రాలు సమర్పిస్తున్నప్పటికి వాటిని తిరస్కరించడం పట్ల ఖాతాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు రెండు, మూడుసార్లు దరఖాస్తులు సమర్పించుకుంటుండగా.. మరికొందరు నేరుగా ఈపీఎఫ్ కార్యాలయాలకు వెళ్లినప్పటికీ సవరణలు పొందలేకపోతున్నారు. నిబంధనలు కఠినతరం చేయడంతో పలువురి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. యాజమాన్యం ధ్రువీకరణ తప్పనిసరి ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో వివరాల సవరణలో యాజమాన్యం ధ్రువీకరణను కేంద్రం తప్పనిసరి చేసింది. దీంతో ఎలాంటి అంశాలకైనా యాజమాన్యం అనుమతి కావాలంటూ తిరస్కరిస్తున్నారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ఈ నిబంధనతో పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ... ఉద్యోగం మానేసిన, ఇతర కంపెనీకి మారి పీఎఫ్ పరిధిలోకి రాకున్నా, ఉద్యోగం ఊడి కొత్త ఉద్యోగం పొందలేని వారికి మాత్రం సవరణ ప్రక్రియ కత్తిమీద సాములా మారింది. ప్రధానంగా యాజమాన్యం సహకారం కొరవడటం, ఈపీఎఫ్ కార్యాలయాల్లోకి ప్రవేశం లేకుండా కేవలం ఇన్వార్డ్ సెల్ వరకే ఖాతాదారులకు అనుమతి ఉండటం లాంటి కారణాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ►ఉద్యోగి పేరు లేదా ఇంటి పేరు సవరణ చేయించాలంటే ప్రభుత్వ గెజిట్ తప్పనిసరి అయ్యింది. స్వల్ప మార్పులకైనా సరైన ఆధారాలు సమర్పించాల్సిందే. ►సవరణల కేటగిరీలో ఆధార్, పాన్ కార్డులను అప్లోడ్ చేసినప్పటికీ యాజమాన్యం ధ్రువీకరణ చేయాలి. సర్వీసులో లేని వారికి ఈ నిబంధన ప్రతిబంధకంగా మారింది. ►కొన్ని సందర్భాల్లో సవరణలకు ఒరిజినల్ పత్రాలు సమర్పించాలనే నిబంధన ఉంది. దీనికోసం ఉద్యోగి వ్యక్తిగతంగా ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ►సవరణలను యాజమాన్యాలు ధ్రువీకరించినప్పటికీ సంబంధిత అధికారులు సంతకాలు పెట్టకపోవడం వల్ల, కొన్నిసార్లు సంబంధిత అధికారులకు బదులు కిందిస్థాయి అధికారులు ధ్రువీకరించడం వల్ల సైతం వినతులు తిరస్కరణకు గురవుతున్నాయి. -
ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్ న్యూస్: ఇక ఆ అవసరమే ఉండదు
LIC WhatsApp Service: దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) వినియోగదారులకు అద్భుతమైన వార్త అందింది. పాత, కొత్త పాలసీ వివరాలు, ప్రీమియం, బోనస్ ఇతర సర్వీసులపై తన కస్టమర్లకు పూర్తి సమాచారం అందించేలా వాట్సాప్ సర్వీస్‌ను ఎల్ఐసీ ప్రారంభించింది. ఇకపై ప్రతీ చిన్న పనికి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఏజెంట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఈ చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వాట్సాప్ సర్వీస్ ప్రారంభమైందంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. తమ పాలసీ వివరాలను ఎల్ఐసీ పోర్ట్‌లో రిజస్టర్ చేసుకున్న రిజిస్టర్డ్ మెంబర్స్‌కు ఈ సేవలు అందుబాటులో ఉంటాయిని తెలిపారు. (లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్ పవర్ అంటున్న మ్యూజిక్ డైరెక్టర్) వాట్సాప్ నంబర్ ద్వారా అనేక సేవలు రిజిస్టర్డ్ వినియోగదారులు మొబైల్ ఫోన్ నుండి ‘8976862090’నంబర్‌కు 'హాయ్' అని మెసేజ్ పంపితే చాలు.. క్లయింట్లు ఎలాంటి సమాచారాన్నైనా పొందవచ్చు. (మారుతి కార్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్: ఆ కారణం చెప్పి..!) ►ప్రీమియం బకాయి ► బోనస్ సమాచారం ► పాలసీ స్థితి ►లోన్ అర్హత కొటేషన్ ►లోన్ రీపేమెంట్ కొటేషన్ ►చెల్లించవలసిన రుణ వడ్డీ ► ప్రీమియం చెల్లింపు సర్టిఫికేట్ ►ULIP-యూనిట్ల స్టేట్మెంట్ ►LIC సర్వీస్ లింక్‌లు ►సేవలను ప్రారంభించడం/నిలిపివేయడం ఎలా నమోదు చేసుకోవాలి? ► పాలసీ నంబర్స్, ఇన్స్టాల్మెంట్ ప్రీమియం, పాస్‌పోర్ట్ లేదా పాన్ కార్డ్ స్కాన్ చేసిన కాపీ (ఫైల్ సైజ్ 100kb) ►ఎఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ‘కస్టమర్ పోర్టల్’ ఎంచుకోవాలి. ►మీరు ఇంతకు ముందు నమోదు చేసుకోకుంటే, ‘న్యూ యూజర్’పై క్లిక్ చేయండి. ►బేసిక్ సర్వీసెస్‌లో వినియోగదారు ID, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. పాలసీ వివరాలను నమోదు చేసి యాడ్ పాలసీని సెలెక్ట్ చేయాలి. దీంతో మీ పాలసీ వివరాలన్నీ స్వయంచాలకంగా రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో రిజిస్టర్ అయి ఉంటాయి. కాగా ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్, కొత్త టెక్-టర్మ్ అనే రెండు ప్లాన్లు ఇటీవలే పునఃప్రారంభం చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం విడుదల చేసిన ఈ రెండు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను మళ్లీ లాంచ్ చేశామని ఎల్ఐసీ తెలిపింది. ఈ పాలసీలు ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. -
ఎక్కువ అప్పులు చేశారంటూ జగన్ సర్కార్‌పై ఎల్లో మీడియా విషం
-
ఏపీ సర్కార్‌పై ఎల్లో మీడియా విషం.. పార్లమెంట్ సాక్షిగా వెల్లడైన వాస్తవాలు
సాక్షి, ఢిల్లీ: వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పుల వివరాలను వెల్లడించారు. దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రాలు మూడు ఉన్నాయి. రూ.6 లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రాలు తమిళనాడు, యూపీ, మధ్యప్రదేశ్.. రూ.5 లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రం బెంగాల్. రూ. 4లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రాలు కర్ణాటక, గుజరాత్. జనాభా తక్కువ ఉన్న కేరళ అప్పులు రూ.3.35 లక్షల కోట్లు ఉండగా, అప్పుల్లో తమిళనాడు నంబర్‌వన్‌గా ఉంది. చదవండి: మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలి: సీఎం జగన్ తమిళనాడు అప్పులు రూ.6.59 లక్షల కోట్లు కాగా.. రెండు, మూడు స్థానాల్లో యూపీ, మధ్యప్రదేశ్ ఉన్నాయి. బీజేపీ పాలిత యూపీ అప్పులు రూ.6.53 లక్షల కోట్లు, బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ అప్పులు రూ.3.17 లక్షల కోట్లు, బీజేపీ పాలిత గుజరాత్ అప్పులు రూ.4.02 లక్షల కోట్లు, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ అప్పులు రూ.4.77 లక్షల కోట్లు. తృణమూల్ అధికారంలో ఉన్న బెంగాల్ అప్పులు రూ.5.62 లక్షల కోట్లు. ధనిక రాష్ట్రమైన తెలంగాణకు 3.12 లక్షల కోట్ల అప్పులు ఉండగా, ఏపీకి అప్పులు రూ.3.98 లక్షల కోట్లు ఉన్నాయి. ఎక్కువ అప్పులు చేశారంటూ సీఎం జగన్ ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషం చిమ్ముతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పులు ఆంధ్రప్రదేశ్: 3,98,903 లక్షల కోట్లు అరుణాచల్ ప్రదేశ్: 15, 122 వేల కోట్లు అస్సాం: 1,07,719 లక్షల కోట్లు బీహార్: 2,46,413 లక్షల కోట్లు చత్తీస్‌గఢ్: 1,14,200 లక్షల కోట్లు గోవా: 28,509 వేలకోట్లు గుజరాత్: 4,02,785 లక్షల కోట్లు హర్యానా: 2,79,022 లక్షల కోట్లు హిమాచల్ ప్రదేశ్: 74,686 వేల కోట్లు ఝార్ఖండ్: 1,17,789 లక్షల కోట్లు కర్ణాటక: 4,62,832 లక్షల కోట్లు కేరళ: 3,35,989 లక్షల కోట్లు మధ్యప్రదేశ్: 3,17,736 లక్షల కోట్లు మహరాష్ట్ర: 6,08,999 లక్షల కోట్లు మణిపూర్: 13,510 వేల కోట్లు మేఘాలయ: 15,125 వేల కోట్లు మిజోరాం: 11,830 వేల కోట్లు నాగాలాండ్: 15,125 వేల కోట్లు ఒడిశా: 1,67,205 లక్షల కోట్లు పంజాబ్: 2,82,864 లక్షల కోట్లు రాజస్థాన్: 4,77,177 లక్షల కోట్లు సిక్కిం: 11,285 వేల కోట్లు తమిళనాడు: 6.59 లక్షల కోట్లు తెలంగాణ: 3,12,191 లక్షల కోట్లు త్రిపుర: 23,624 వేల కోట్లు ఉత్తప్రదేశ్: 6,53,307 లక్షల కోట్లు ఉత్తరాఖండ్: 84,288 వేల కోట్లు వెస్ట్ బెంగాల్: 5,62,697 లక్షల కోట్లు -
సెక్స్ వర్కర్ల ఓటర్ ఐడీలపై నివేదికివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జీహెచ్ఎంసీతోపాటు అన్ని జిల్లాల్లో ఉన్న సెక్స్ వర్కర్లను ఓటర్లుగా నమోదు చేయడంతోపాటు వారికి ఓటర్ ఐడీ కార్డులెన్ని ఇచ్చారన్న దానిపై నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్ లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలు, నియోజక వర్గాల వారీగా సెక్స్ వర్కర్ల నమోదు, వారికి ఓటరు కార్డుల పంపిణీపై వీలున్నంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. పీపుల్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేయండి: సీఎస్ సాక్షి, హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, ఇదే విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని సీఎస్ సోమేశ్‌కుమార్ పలు శాఖల ఉన్నతాధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు బీఆర్కే భవన్లో ఆయన రెవెన్యూ, పౌరసరఫరాలు, రవాణా, విద్యుత్, గృహ నిర్మాణం, మున్సిపల్, కార్మిక తదితర 12 విభాగాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ద్వారా స్టేక్హోల్డర్లతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించాలని సీఎస్ సూచించారు. ఈ 12 శాఖల్లోని 20 విభాగాల పరిధిలో 301 సంస్కరణలు అమలవుతున్నాయని, వీటిని మరింత సరళీకృతం చేసి యూజర్, పీపుల్స్ ఫ్రెండ్లీ విధానాలను అమల్లోకి తేవాలన్నారు. చదవండి: కూతురు ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య -
భార్యపై కోపంతో మ్యాట్రిమెునిలో వివరాలు
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులు తీసుకోవాలని కోర్టును కూడా ఆశ్రయించారు. విచారణ సాగుతున్న క్రమంలో భార్యకు సంబంధించిన వివరాలను మ్యాట్రిమొనిలో పెట్టి వక్రబుద్ధి చాటుకున్నాడు. మామ ఫిర్యాదుతో చివరికి అరెస్టయ్యాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌కి చెందిన యువతి(32)కి వెళ్లియూర్ పంచాయతీ అధ్యక్షుడు సురేష్‌బాబు కుమారుడు ఓంకుమార్(34)తో 2016లో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. విడాకులు కావాలని పూందమల్లి కోర్టులో ఓంకుమార్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ సాగుతోంది. రెండు వారాల క్రితం ప్రముఖ మ్యాట్రిమొనిలో వరుడు కావాలని భార్య వివరాలను ఉంచాడు. ఆసక్తి ఉన్న వారు యువతి తండ్రిని సంప్రదించాలని పేర్కొన్నాడు. యువతి తండ్రికి ఫోన్‌కాల్స్ రావడంతో ఆయన తిరువళ్లూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో ఓంకుమార్ విషయం తెలిసింది. పోలీసులు బుధవారం ఓంకుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: 'లవ్‌స్టోరి'ని తలపిస్తున్న తమిళనాడు జంట కథ