ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్‌ రాకెట్‌ ఫోర్స్‌? | Iran Attacks Israel Through These Missiles - Sakshi
Sakshi News home page

Iranian Rocket Force: ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్‌ రాకెట్‌ ఫోర్స్‌?

Published Sun, Apr 14 2024 1:39 PM | Last Updated on Sun, Apr 14 2024 1:49 PM

Iran Attacking Israel Through These Rockets - Sakshi

ఒకప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ సత్సంబంధాలు కలిగిన దేశాలు. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఇరు దేశాలు బద్ధశత్రువులుగా మారాయి. ఈనెల (ఏప్రిల్‌) ఒకటిన సిరియా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో 13 మంది ఇరాన్ సైనికులు మరణించారు. 

ఈ దాడిపై స్పందించిన ఇరాన్.. ఇజ్రాయెల్‌ను నిందించింది. ఇజ్రాయెల్‌పై చర్య తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది. దీని తరువాత ఏప్రిల్ 13న ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. నిజానికి ఇరాన్ నుండి ఇజ్రాయెల్‌కు వేల కిలోమీటర్ల దూరం ఉంది. అయినా ఇరాన్‌ దాడులను విజయవంతంగా నిర్వహించింది. దీనిని చూస్తే ఇరాన్ రాకెట్ ఫోర్స్ ఎంతో శక్తివంతమైనదని అర్థమవుతుంది. 

ఇరాన్ వద్ద అత్యంత శక్తివంతమైన తొమ్మిది బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇవి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్‌పై దాడి చేసే శక్తిని కలిగివున్నాయి. ఈ క్షిపణుల్లో అత్యంత ప్రమాదకరమైనది ‘సెజిల్’. ఈ క్షిపణి గంటకు 17 వేల కిలోమీటర్ల వేగంతో 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యంపై దాడి చేయగలదు. ఖిబార్ క్షిపణి పరిధి రెండు వేల కిలోమీటర్లు. దీనితో పాటు, హజ్-ఖాసేమ్ దాడి పరిధి 14 వందల కిలోమీటర్లు.

ఇరాన్ వద్ద హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. గత సంవత్సరం ఇరాన్ తన స్వదేశీ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించే వాటిని హైపర్‌సోనిక్ క్షిపణులు అంటారు. ఈ క్షిపణులను వాటి వేగం కారణంగా అడ్డుకోవడం అసాధ్యం. 

ఇరాన్  దగ్గర అణుశక్తితో రూపొందిన క్రూయిజ్ క్షిపణి కూడా ఉంది. దీని పరిధి మూడు వేల కిలోమీటర్లు. ఇరాన్‌కు డ్రోన్‌ల ఆయుధాగారం కూడా ఉంది. ఇరాన్ వద్ద మొహజిర్-10 అనే ప్రాణాంతక డ్రోన్ ఉంది. దీని పరిధి రెండు వేల కిలోమీటర్లు. ఇది 300 కిలోల బరువును మోయగలదు. ఇరాన్‌ దగ్గరున్న రాకెట్‌ ఫోర్స్‌ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement