Iranian
-
భ్రుకు టీ ముడిపడే సీన్!
శివుని జటాఝూటంలోని గంగ గురించి మనకు తెలుసు. అయితే ఇరానీ మోడల్ శిరోజాలలోని ‘టీపాట్’ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. హెయిర్ స్టైల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే ‘టీ పాట్ హెయిర్‌స్టైల్’ గురించి మాత్రం ఎప్పుడూ విని ఉండం. ఇరాన్‌కు చెందిన హెయిర్ స్టైలిస్ట్ సైదెహ్ ‘టీపాట్ హెయిర్‌స్టైల్’ వీడియోను చూసి నెటిజనులు ‘ఆహో వోహో’ అంటున్నారు. ఈ వీడియో నాలుగు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. హెయిర్ పిన్స్‌తో మోడల్ సబుర్ నగర్‌కు పోనీ టెయిల్ వేసింది. ఆ తరువాత మెటల్ వైర్లు, గ్లూ గన్‌తో టీపాట్ స్ట్రక్చర్స్‌ను సెట్ చేసింది. ఈ శిరో టీపాట్‌లో టీ ΄ోసి ఆ తరువాత కప్పులోకి ఒంపి తాగింది. ‘ఫ్యాషన్ స్టైల్ అనేది ఎన్నో వెరైటీలకు కేంద్రం. హెయిర్ స్టైల్‌కు సంబంధించి సహజంగా ఉండేలా ఏదైనా చేయాలనుకున్నాను. రెండు రోజుల కృషి ఫలితమే ఈ విజయం. ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు’ అని తన ఇన్స్టాగ్రామ్ ΄ోస్ట్‌లో చెప్పింది సైదేహ్. -
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ రాకెట్ ఫోర్స్?
ఒకప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ సత్సంబంధాలు కలిగిన దేశాలు. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఇరు దేశాలు బద్ధశత్రువులుగా మారాయి. ఈనెల (ఏప్రిల్) ఒకటిన సిరియా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో 13 మంది ఇరాన్ సైనికులు మరణించారు. ఈ దాడిపై స్పందించిన ఇరాన్.. ఇజ్రాయెల్‌ను నిందించింది. ఇజ్రాయెల్‌పై చర్య తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది. దీని తరువాత ఏప్రిల్ 13న ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. నిజానికి ఇరాన్ నుండి ఇజ్రాయెల్‌కు వేల కిలోమీటర్ల దూరం ఉంది. అయినా ఇరాన్ దాడులను విజయవంతంగా నిర్వహించింది. దీనిని చూస్తే ఇరాన్ రాకెట్ ఫోర్స్ ఎంతో శక్తివంతమైనదని అర్థమవుతుంది. ఇరాన్ వద్ద అత్యంత శక్తివంతమైన తొమ్మిది బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇవి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్‌పై దాడి చేసే శక్తిని కలిగివున్నాయి. ఈ క్షిపణుల్లో అత్యంత ప్రమాదకరమైనది ‘సెజిల్’. ఈ క్షిపణి గంటకు 17 వేల కిలోమీటర్ల వేగంతో 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యంపై దాడి చేయగలదు. ఖిబార్ క్షిపణి పరిధి రెండు వేల కిలోమీటర్లు. దీనితో పాటు, హజ్-ఖాసేమ్ దాడి పరిధి 14 వందల కిలోమీటర్లు. ఇరాన్ వద్ద హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. గత సంవత్సరం ఇరాన్ తన స్వదేశీ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించే వాటిని హైపర్సోనిక్ క్షిపణులు అంటారు. ఈ క్షిపణులను వాటి వేగం కారణంగా అడ్డుకోవడం అసాధ్యం. ఇరాన్ దగ్గర అణుశక్తితో రూపొందిన క్రూయిజ్ క్షిపణి కూడా ఉంది. దీని పరిధి మూడు వేల కిలోమీటర్లు. ఇరాన్‌కు డ్రోన్ల ఆయుధాగారం కూడా ఉంది. ఇరాన్ వద్ద మొహజిర్-10 అనే ప్రాణాంతక డ్రోన్ ఉంది. దీని పరిధి రెండు వేల కిలోమీటర్లు. ఇది 300 కిలోల బరువును మోయగలదు. ఇరాన్ దగ్గరున్న రాకెట్ ఫోర్స్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. -
ఆత్రేయపురం పూతరేకులను తలపించే ఇరానీ పుతరేకు!
ఆత్రేయపురం పూతరేకులు అమెరికా వరకు ప్రసిద్ధి పొందాయి. పూతరేకులను తలపించే పిండివంటకం ప్రపంచంలో మరెక్కడా లేదనుకుంటాం గాని, ఇరాన్లో పూతరేకులను తలపించే మిఠాయి పిండివంటను తయారు చేస్తారు. ఇరాన్‌లోని గిలాన్ ప్రావిన్స్‌లో ప్రసిద్ధి పొందిన ‘రెష్తే ఖోష్కర్’ అనే ఈ మిఠాయి తయారీ దాదాపు పూతరేకుల తయారీ పద్ధతిలోనే ఉంటుంది. దీని తయారీకి ఎక్కువ పరిమాణంలోని వరిపిండికి, గోధుమపిండి కలిపి జారుగా ఉండేలా పిండిముద్దను తయారు చేస్తారు. దీనిని జంతికల గొట్టంలాంటి సాధనంలో వేసి, మంటపై బోర్లించిన మూకుడు మీద సన్నని గడులు గడులుగా వచ్చేలా వేస్తారు. ఇలా పొరలు పొరలుగా సన్నని వలలా వేసి, వీటి మధ్యలో ఏలకులు, దాల్చిన పొడి, వాల్నట్స్, బాదం, పిస్తా, చక్కెర వేసి పూతరేకుల మాదిరిగానే జాగ్రత్తగా చుడతారు. ఏటా రంజాన్ నెలలో దీనిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. (చదవండి: కృష్ణఫలం గురించి విన్నారా? తింటే బొలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
పాక్ ఉగ్రస్థావరాలపై ఇరాన్ దాడులు
జెరూసలేం: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ తమ దేశంలో ఉగ్రదాడులకు తెగబడుతున్న జైష్ అల్–అదిల్ ఉగ్రసంస్థ స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడులతో విరుచుకుపడింది. దీంతో ఇప్పటికే హమాస్–ఇజ్రాయెల్ యుద్ధంతో ఉద్రిక్తతలు పెరిగిన పశి్చమాసియాలో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఇన్నాళ్లూ దౌత్య సంబంధాలు మాత్రమే కొనసాగుతున్న పాకిస్తాన్, ఇరాన్‌ల మధ్య ఒక్కసారిగా వైరం ప్రజ్వరిల్లింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని గ్రీన్ మౌంటేన్ పర్వతప్రాంతంలోని జైష్ అల్ అదిల్(ఆర్మీ ఆఫ్ జస్టిస్) సంస్థకు చెందిన రెండు స్థావరాలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బలగాలు డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయపడ్డారు. ఇరాన్ విదేశాంగ మంత్రితో పాక్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్లా దావోస్ నగరంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో మంతనాలు జరిపిన రోజే ఈ దాడులు జరగడం గమనార్హం. ఇరాన్ రాయబారిపై వేటు జైష్ అనేది 2012లో పాక్‌లో నెలకొలి్పన సున్నీ ఉగ్రసంస్థ. ఇరాన్లో జైష్ తరచూ ఇరాన్ భద్రతాబలగాలపై దాడులకు దిగుతోంది. సైనికులను అపహరిస్తూ ఇరాన్ ప్రభుత్వానికి పెద్దతలనొప్పిగా తయారైంది. పాక్ సరిహద్దు పట్టణం పంజ్‌ఘర్ కేంద్రంగా పనిచేస్తూ జైష్ దాడులకు దిగుతోందని ఇప్పటికే పలుమార్లు ఇరాన్ ఆరోపించింది. ఈనెలలో సున్నీ ఉగ్రసంస్థ ఒకటి సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో జంట ఆత్మాహుతి దాడులకు పాల్పడి వంద మందిని బలితీసుకున్న విషయం తెల్సిందే. దీంతో సున్నీ ఉగ్రసంస్థలపై ఉక్కుపాదం మోపాలని ఇరాన్ నిశ్చయించుకుంది. అందులోభాగంగానే పాక్‌లోని జైష్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. అయితే తమ భూభాగంపై విదేశీ దాడిని పాకిస్తాన్ తీవ్రంగా ఆక్షేపించింది. పాక్‌లోని ఇరాన్ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారిని పిలిపించుకుని తన నిరసన వ్యక్తంచేసింది. తమ దేశంలోని ఇరాన్ రాయబారిని బహిష్కరించింది. ఇరాన్‌లోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంది. ‘పాక్ గగనతలాన్ని అనుమతిలేకుండా వినియోగించడం, దురి్వనియోగం చేయడం ద్వారా ఇరాన్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించింది. ఇది పాక్ సార్వ¿ౌమత్వాన్ని అవమానించడమే. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను అపహాస్యం చేస్తూ ఇలా దాడులకు దిగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీని తీవ్ర పరిణామాలను ఇరాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని పాక్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇరాన్ ఆర్మీ అధికారి కాల్చివేత జైష్ ఉగ్రస్థావరాలపై దాడి జరిగిన మరుసటి రోజే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారిని ఉగ్రవాదులు కాలి్చచంపారు. పాక్, అఫ్గానిస్తాన్‌లతో సరిహద్దు పంచుకుంటున్న సిస్తాన్–బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఈ ఉగ్రదాడి ఘటన జరిగిందని ఇరాన్ అధికార వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ బుధవారం తెలిపింది. -
ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు!
ఇప్పటి వరకు 'దినార్, రియాల్, ఫౌండ్, యూరో, డాలర్' వంటి ప్రపంచంలో అత్యంత ఖరీదైన కరెన్సీలను గురించి తెలుసుకుని ఉంటారు. అయితే ఈ కథనంలో ప్రపంచంలో టాప్ చీపెస్ట్ కరెన్సీలు ఏవి? ఇండియన్ కరెన్సీతో వాటికున్న వ్యత్యాసం ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. చీపెస్ట్ కరెన్సీ కలిగిన టాప్ 5 దేశాలు.. 👉ఇరానియన్ రియాల్ (IRR) 👉వియత్నామీస్ డాంగ్ (VND) 👉సియెర్రా లియోనియన్ లియోన్ (SLL) 👉లావో/లావోషియన్ కిప్ (LAK) 👉ఇండోనేషియా రుపియా (IDR) ఇరానియన్ రియాల్ (IRR) ఇరాన్ కరెన్సీ ఇరానియల్ రియాల్ అనేది ప్రపంచంలో చీపెస్ట్ కరెన్సీలలో ఒకటి. అయితే ఇదే పేరుతో ఉన్న ఒమాని రియాల్ అనేది ప్రపంచంలో ఖరీదైన కరెన్సీలలో ఒకటిగా ఉంది. ఇండియన్ ఒక్క రూపాయి 511 ఇరానియల్ రియాల్స్‌కి సమానం. కాగా ఒక అమెరికన్ డాలర్ 42,275 ఇరానియల్ రియాల్స్‌కి సమానం అని తెలుస్తోంది. ఈ దేశంలో రాజకీయ అశాంతి, వ్యాపారం, తలసరి జీడీపీ కారణంగా ఈ దేశ కరెన్సీ విలువ చాలా తక్కువగా ఉంది. వియత్నామీస్ డాంగ్ (VND) వియత్నాం చారిత్రాత్మకంగా కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ కింద పనిచేస్తోంది, అయితే ఆర్థిక వ్యవస్థను స్థాపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కాగా ప్రస్తుతం తక్కువ విలువ గల కరెన్సీ కలిగిన దేశాల్లో ఇది కూడా ఒకటి. 291 వియత్నామీస్ డాంగ్స్ భారతీయ కరెన్సీ రూపాయికి సమానం. ఒక అమెరికన్ డాలర్ 24,085 వియత్నామీస్ డాంగ్స్కి సమానం. వియాత్నం ఆర్ధిక వ్యవస్థ 2024కి వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. సియెర్రా లియోనియన్ లియోన్ (SLL) ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్ తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటోంది. వినాశకరమైన అంతర్యుద్ధంతో సహా పశ్చిమ ఆఫ్రికాలో కుంభకోణాలు, అవినీతి కారణంగానే ఆ దేశ కరెన్సీకి విలువ తగ్గినట్లు సమాచారం. భారత రూపాయి 238 సియెర్రా లియోనియన్ లియోన్లకి సమానం, కాగా అమెరికన్ డాలర్ 19,750 సియెర్రా లియోనియన్ లియోన్లకి సమానం. ఇదీ చదవండి: అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 10 దేశాల్లో 'భారత్' ఎక్కడుందంటే? లావో/లావోషియన్ కిప్ (LAK) 1952 నుంచి కూడా లావోషియన్ కిప్ కరెన్సీకి విలువ చాలా తక్కువగానే ఉంది. ప్రస్తుతం ఒక ఇండియన్ రూపీ 239 లావోషియన్ క్లిప్‌లలో సమానం, ఒక అమెరికన్ డాలర్ 19,773 లావోషియన్ క్లిప్లకి సమానం కావడం విశేషం. కాగా ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలలో ఇది ఒకటిగా ఉంది. ఇదీ చదవండి: ఆర్బీఐ ఊరుకున్నా.. ఈ రెండు బ్యాంకులు తగ్గలే.. వడ్డీ రేట్లు ఇలా! ఇండోనేషియా రుపియా (IDR) గత ఏడు సంవత్సరాలుగా ఇండోనేషియా రూపాయి విలువలో ఎలాంటి మెరుగుదల లేదు. విదేశీ మారక నిల్వలు క్షీణించడం, కరెన్సీని కాపాడుకోవడంలో సెంట్రల్ బ్యాంక్ వైఫల్యం కారణమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. అయితే భారతీయ కరెన్సీ రూపాయికి 184 ఇండోనేషియా రూపాయలకు సమానం. అదే విధంగా ఒక అమెరికన్ డాలర్ 15,225 ఇండోనేషియా రూపాయలకు సమానం. ప్రస్తుతం పారిశ్రామిక కార్యకలాపాలలో ఇండోనేషియా కొంత వృద్ధి చెందుతున్నట్లు తెలుస్తోంది. -
మాస్కా మజాకా.. ఈ కార్టూన్ చూడండి.. భాష అక్కర్లేదు..
ఇరాన్ కార్టూనిస్ట్ ఆయత్ నదేరి యానిమేటర్, యానిమేషన్ డైరెక్టర్ కూడా. ఇదంతా ఒక ఎత్తయితే టీచర్‌గా ఆయత్‌కు మంచి పేరు ఉంది. ఇస్ఫాహన్ యూనివర్శిటీ ఆఫ్ ది ఆర్ట్స్‌లో ఆయన చెప్పే పాఠాలు ఎన్నో కుంచెలకు పదును పెట్టాయి. క్యారికేచర్ గ్రామ్, తాష్ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకుడైన ఆయత్‌కు కార్టూన్ ఐడియాలు ఎలా వస్తాయి? చదవండి: ఇదో చెత్త ప్రశ్న.. ఇంటర్వ్యూలో యువతి షాకింగ్ రిప్లై.. వీడియో వైరల్ ‘ప్రయాణంలో’ అని చెబుతారు ఆయన. ఆయత్‌కు నచ్చిన ఇరాన్ కార్టూనిస్ట్ మాసూద్. ఏడు సోలో ఎగ్జిబిషన్స్ చేసిన ఆయత్ ఎన్నో అవార్డ్లు అందుకున్నాడు. తన తొలి కార్టూన్ ‘పర్యావరణం’ అనే అంశంపై వేశాడు. అది తనకు బాగా గుర్తింపు తీసుకొచ్చింది. తాజాగా వేసిన ఈ కార్టూన్ చూడండి. భాష అక్కర్లేదు. ప్రపంచంలో ఏ మూలకు తీసుకువెళ్లినా అర్ధమవుతుంది. కరోనాకు మాస్కే మందు, మాస్కే తిరుగులేని ఆయుధం. -
పారాలింపిక్స్‌లో ఇరాన్ సైక్లిస్ట్ దుర్మరణం
రియో డి జనీరో: పారాలింపిక్స్ పోటీల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పురుషుల రోడ్ రేస్ సీ4-5 ఈవెంట్లో పాల్గొన్న ఇరాన్ సైక్లిస్ట్ సర్ఫరాజ్ బహమాన్ గోల్బర్నెజాద్ ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. శనివారం జరిగిన ఈ ఈవెంట్లో 48 ఏళ్ల సర్ఫరాజ్ రేసు మధ్యలో సైకిల్ నుంచి కిందపడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలాడు. అయితే ఆస్పత్రికి చేరేలోపే తనకు గుండెపోటు వచ్చిందని అంతర్జాతీయ పారాలింపిక్స్ కమిటీ (ఐపీసీ) అధికారులు వివరణ ఇచ్చారు. ‘ఇది నిజంగా మాకు దిగ్భ్రాంతికర వార్త. 56 ఏళ్ల పారాలింపిక్స్ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. సర్ఫరాజ్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం’ అని ఐపీసీ అధ్యక్షుడు ఫిలిప్ క్రావెన్ అన్నారు. 1980లో జరిగిన యుద్ధంలో సర్ఫరాజ్ తన కాలును కోల్పోయాడు. 2002 నుంచి సైక్లింగ్‌ను కెరీర్‌గా మలుచుకుని లండన్ గేమ్స్‌లోనూ పాల్గొన్నాడు. అటు ఇరాన్ పారాలింపిక్ కమిటీ కూడా అతడి అంకితభావాన్ని కొనియాడింది. అథ్లెట్ మృతికి సంతాపసూచకంగా క్రీడా గ్రామంలో ఇరాన్ జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ముగింపు వేడుకల్లోనూ మౌనం పాటించనున్నారు. -
క్యాబ్ ను లైబ్రరీగా మార్చేశాడు!
టెహ్రాన్ః మనిషి ఆలోచనల్ని క్రమబద్ధీకరించడానికి, వ్యక్తిలో ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి పుస్తక పఠనం ఎంతగానో దోహద పడుతుంది. అందుకే పుస్తక ప్రేమికులను ప్రోత్సహించేందుకు ఓ ఇరానియన్ క్యాబ్ డ్రైవర్ ప్రయత్నం ప్రారంభించాడు. ప్రయాణీకులను ఆకట్టుకోవడంతోపాటు.. పుస్తక ప్రియులకు అందుబాటులో ఉండేట్టుగా తన నూతన ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. ఇరాన్ లోని రాస్ట్ సిటీ లో నడిపే తన ట్యాక్సీలో పుస్తకాలను నింపేసి ప్రయాణీకులకు ఓ మినీ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చాడు. తన షెటిల్ టాక్సీని ఓ మొబైల్ లైబ్రరీగా మార్చేశాడు ఇరాన్ కు చెందిన సాహెల్ ఫిల్ సూఫ్. పుస్తక పఠనంతో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నమ్మిన అతడు... తన ప్యాసింజర్లను పఠనానికి ప్రోత్సహించాలన్న ఉద్యేశ్యంతో తన టాక్సీలో ప్రయాణించే వారికి లైబ్రరీని అందుబాటులోకి తెచ్చాడు. కొంతకాలం క్రితమే తనకు లైబ్రరీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిందని, అందుకు తన క్యాబ్ ను వినియోగించి ప్రజలకు చేరువవ్వచ్చునన్న ఆలోచనను ఆచరణలో పెట్టానని సాహెల్ చెప్తున్నాడు. ఆధునిక కాలంలో అనేక ఒత్తిళ్ళతో సతమతమౌతున్న ప్రజలకు పుస్తక పఠనం ఎంతగానో ఉపకరిస్తుందని, ఉపశమనం కలిగిస్తుందని భావించానని, అందుకే ఈ మొబైల్ లైబ్రరీ ని ఏర్పాటు చేశానని సాహెల్ చెప్తున్నాడు. తన క్యాబ్ ట్యాక్సీలో సాహెల్ వివిధ రకాల పుస్తకాలను సుమారు 50 వరకూ పాఠకులకు అందుబాటులో ఉంచాడు. మనస్తత్వ శాస్త్రం, పిల్లల పుస్తకాలు, చరిత్ర వంటి ఎన్నో గ్రంథాలతో ఇప్పుడు సాహెల్ క్యాబ్ లైబ్రరీ పుస్తాకాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పైగా తన లైబ్రరీకి ఫ్యాన్స్ గా మారిన ప్యాసింజర్లు ఎక్కువగా మహిళలు, యువకులేనని సాహెల్ చెప్తున్నాడు. గిలాన్ ఉత్తర ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల అధికారులను అనుమతి కోరానని, వారు తన మొబైల్ లైబ్రరీ నాణ్యత పెరిగే పుస్తకాలను సూచించి సహకరించారని సాహెల్ వివరించాడు. నా కారులో ప్రయాణించే వారు చదివేందుకు మంచి పుస్తకం ఇమ్మని అడిగినప్పుడు నాకెంతో ఆనందంగా ఉంటుందని, నేను మంచి పని చేశానన్న సంతోషం కలుగుతుందని సాహెల్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.