ఆత్రేయపురం పూతరేకులు అమెరికా వరకు ప్రసిద్ధి పొందాయి. పూతరేకులను తలపించే పిండివంటకం ప్రపంచంలో మరెక్కడా లేదనుకుంటాం గాని, ఇరాన్‌లో పూతరేకులను తలపించే మిఠాయి పిండివంటను తయారు చేస్తారు. ఇరాన్‌లోని గిలాన్ ప్రావిన్స్‌లో ప్రసిద్ధి పొందిన ‘రెష్తే ఖోష్కర్’ అనే ఈ మిఠాయి తయారీ దాదాపు పూతరేకుల తయారీ పద్ధతిలోనే ఉంటుంది. దీని తయారీకి ఎక్కువ పరిమాణంలోని వరిపిండికి, గోధుమపిండి కలిపి జారుగా ఉండేలా పిండిముద్దను తయారు చేస్తారు.
దీనిని జంతికల గొట్టంలాంటి సాధనంలో వేసి, మంటపై బోర్లించిన మూకుడు మీద సన్నని గడులు గడులుగా వచ్చేలా వేస్తారు. ఇలా పొరలు పొరలుగా సన్నని వలలా వేసి, వీటి మధ్యలో ఏలకులు, దాల్చిన పొడి, వాల్‌నట్స్, బాదం, పిస్తా, చక్కెర వేసి పూతరేకుల మాదిరిగానే జాగ్రత్తగా చుడతారు. ఏటా రంజాన్ నెలలో దీనిని ప్రత్యేకంగా తయారు చేస్తారు.
(చదవండి: కృష్ణఫలం గురించి విన్నారా? తింటే బొలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!)
Comments
Please login to add a commentAdd a comment