Sweet
-
కాఫీ బ్రేక్, మ్యాంగో మూడ్ చాక్లెట్లు గుర్తున్నాయా..? అవెలా వచ్చాయంటే..
చిన్నతనంలో ఇష్టంగా తిన్న ఎరుపు రంగుని తెచ్చే పాన్ పంద్, మ్యాంగో మూడ్, కాఫీ బ్రేక్ వంటి చాక్లెట్లు గుర్తున్నాయా..?. ఆ సయమంలో ఒక రూపాయికే నాలుగు లేదా రెండు చాక్లెట్లు వచ్చేవి. అవి తింటుంటే నాలుకంతా రంగు మారిపోతుంటే అబ్బో ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. ప్రస్తుతం ఎన్నో ఫ్లేవర్లతో కూడిన ఖరీదైన చాక్లెట్లు మరెన్నో వచ్చినపపటికీ..వాటి రుచి ఆ క్రేజ్ వేరు. చిన్నగా చెరుకు మిల్లులతో మొదలైన చాక్లెట్ల వ్యాపారం కాస్తా హిందూస్తాన్ కనెస్ట్రక్షన్ కంపెనీ, విమానా తయారీల కంపెనీలుగా వ్యాపార సామ్రజ్యాన్ని విస్తరించాడు మహారాష్ట్రకు చెందిన వాల్చంద్ హిరాచంద్ దోషి. ఆయన ప్రధాని మోదీ చెప్పే స్వాలంభనకు ఆనాడే బీజం వేశాడు. ఆవిష్కరణలకు పర్యాయ పదంగా నిలిచిన అతడి ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం.!. 1923 బ్రిటిష్ పాలనలో భారత్ ఉన్న సమయంలో సేథ్ వాల్చంద్ హిరాచంద్ దోషి దూరదృష్టితో మహారాష్ట్రలోని రావల్గావ్కు వచ్చారు. ఆయన భారత ఆర్థిక స్వేచ్ఛకు మార్గం రాజకీయ వాక్చాతుర్యం కాదు పారిశ్రామిక స్వావలంబనలోనే ఉందని నమ్మాడు. ఆ నేపథ్యంలోనే భారతదేశానికి వెన్నుముక అయిన వ్యవసాయంపై దృష్టిసారించాడు. అదే ఆయన్ను 1,500 ఎకరాల బంజరు భూమి వైపు ఆకర్షించేలా చేసింది. నిజానికి ఇది రాళ్లతో నిండిపోయి.. వ్యవసాయానికి పనికిరాని భూమి ..కానీ దోషికి ఇందులో బంగారం పండిచొచ్చనిపించింది. అందరికీ అది నిరూపయోగమైన భూమిలా కనిపిస్తే.. ఆయనకు మాత్రం పనికొచ్చే భూమిలా అనిపించింది. ఆ నేపథ్యంలోనే రసాయన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల బృందాన్ని సమీకరించి చెరకు సాగుకు అనువైన సారవంతమైన నేలగా మార్చే ప్రక్రియకు పూనుకున్నాడు. అలా ఆయన తన పట్టుదలతో 1933లో రావల్గావ్ షుగర్ ఫామ్ లిమిటెడ్ స్థాపించారు. ఇదే భారత్‌లోని తొలి చక్కెర మిల్లులో ఒకటి. అక్కడితో ఆగిపోలేదు దోషి పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేశాడు. ఆ నేపథ్యంలోనే మిల్లు చుట్టూ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, పాఠశాలలతో పూర్తి సమృద్ధి గల పట్టణాన్ని నిర్మించాడు. ఆ తర్వాత ఆ ప్రాంతం క్రమేణ వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు నిలయంగా మారింది.ఇది చక్కెర మిల్లింగ్ నుంచి వివిధ పరిశ్రమలకు భారీ ఇంజనీరింగ్ పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది.అలా నిర్మాణ రంగంలోకి వెళ్లి హిందూస్తాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ముంబైలోని బాంద్రా-వర్లి సీ లింక్ వంటి ఐకానిక్ నిర్మాణాలను నిర్మించారు. అతని కారణంగానే 1940లో భారత్ తొలి విమానాయన తయారీ సంస్థ, 1946లో షిప్‌యార్డ్ వంటివి స్థాపించారు. ఆ తర్వాత ఆ రెండు కంపెనీలు వ్యూహాత్మక ప్రాముఖ్యత కారణంగా జాతీయం చేసింది ప్రభుత్వం. అయితే 1940లలో రావల్గావ్ చక్కెర ఉత్పత్తి నుంచి తయారైన చాక్లెట్లు మాత్రం మిఠాయి వ్యాపారంగానే ఉండిపోయింది. అయితే భారతీయ చాక్లెట్లకు రావల్గావ్ బ్రాండ్‌గా ఉండేది ఆ కాలంలో. ఆయన చక్కెర మిల్లుల కారణంగా తయారయ్యే పాన్పసంద్ పెద్దవాళ్లలా పాన్ని తిన్నట్లుగా నోరంతా ఎరుపు రంగు తెప్పించేది. ఏడాది పొడవునా మ్యాంగో తిన్న అనుభూతిని కలిగించే మ్యాంగో మూడ్, కాఫీ బ్రేక్, చాకో క్రీమ్ తరదితరాలు ఆ కాలంలో అందరికీ నచ్చే చాక్లెట్లు. ఆ విధంగా మహారాష్ట్ర భారతదేవశంలోని అతిపెద్ద చక్కెర ఉత్పత్తి రాష్ట్రంగా నిలుస్తోంది. ఇప్పటికీ రావల్గావ్ షుగర్ ఫామ్ లిమిటెడ్ స్వతంత్రంగానే పనిచేస్తోంది. దీన్ని ఇటీవలే రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) రావల్గావ్ బ్రాండ్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో ట్రేడ్‌మార్క్‌లు, వంటకాలు , మేధో సంపత్తి హక్కులు ఉన్నాయి. కరోనా సమయంలో తీవ్రమవుతున్న ఖర్చులు, మార్కెట్ పోటీ కారణంగా రావల్గావ్ చాక్లెట్ల వ్యాపారం పలు ఒడిదుడుకులు ఎదుర్కొంది. అయితే రావల్గావ్ పేరుమీదు ఉన్న మిగతా ఇండస్ట్రీలను మాత్రం యథావిధిగా నిలుపుకుంది. తీపి పదార్థాల నుంచి నిర్మాణ రంగం, పారిశ్రామిక రంగ పరంగా భారతదేశాన్ని అభివృద్ధి బాటపట్టేలా చేశారు. ఆయన వారసత్వం నిర్మించిన సంస్థల్లోనే కాదు, దేశ రూపు రేఖలను మార్చడంలోనే అందించారు. పారిశ్రామిక వేత్త అంటే తనను అభివృద్ధి చేసుకుంటూ..దేశాన్ని కూడా ప్రగతిపథంలోకి తీసుకుపోయేవాడని చాటి చెప్పారు వాల్చంద్ హిరాచంద్ దోషి.(చదవండి: '8 సిటీస్ 8 బర్డ్ వాక్‌లు': ఇది చిన్నారులకు ప్రత్యేకం..!) -
దోస్తీకి దొన్ను చెక్కీ
భేదభావాలు చూపనిది, షరతులు లేనిది ఈ సృష్టిలో స్నేహం ఒక్కటే! దీన్ని మించిన మాధుర్యం లేదు ఈ లోకంలో! అలాంటి దోస్తీని దొన్ను చెక్కీతో మరింత తీపి చేసుకుంటారు ఉత్కళాంధ్రులు! ఆ మిఠాయి ధనుర్మాసానికి ప్రత్యేకం! శతాబ్దాలనాటిదీ సంప్రదాయం!ఆ స్వీట్ స్టోరీ ..మద్దిలి కేశవరావు, ఇచ్ఛాపురం రూరల్ సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన రోజున ఉత్కళాంధ్రులు నెలగంటును వేస్తారు. ధనుర్మాసం తొలిరోజు నుంచి మకర సంక్రాంతి వరకు పేలాలు, బెల్లం, చక్కెర, నెయ్యి, జీడి పప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు ద్రాక్ష, బాదంపప్పు, ఖర్జూరం వేసి వివిధ ఆకృతుల్లో తయారుచేసిన ‘దొన్ను చెక్కీ’ని ప్రతిరోజూ వైష్ణవాలయాల్లో దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ధనుర్మాసంలోనే ప్రత్యేకంగా తయారుచేసే ఈ మిఠాయిని ‘ధనుర్మువ్వా’ అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదన్నది ఇక్కడి ఆచారం. ప్రాణప్రదంగా ప్రేమించే వ్యక్తుల మధ్య ఉన్న చెలిమిని ఇక్కడ దోస్తీ, నేస్తాలు, మోఖర, సొంగాతి, మిత్తరికం వంటి పేర్లతో పిలుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు పరస్పరం సొంత పేర్లతో పిలుచుకునే అవకాశం ఉండదు. అలాంటి అనుబంధాలకు గుర్తుగా ఈ మువ్వా చెక్కీలను బహుమతిగా ఇచ్చిపుచ్చుకుంటారు. వీటితో పాటు చాలా ప్రాంతాల్లో దుస్తులు, కాయగూరలనూ ఇస్తుంటారు. అంతేకాదు ఈ చెక్కీతోనే సంక్రాంతికి కొత్త అల్లుడిని అత్తారింటికి ఆహ్వానిస్తారు. అమ్మాయి తల్లిదండ్రులు, సోదరులు ఈ స్వీట్‌తో మర్యాదపూర్వకంగా అల్లుడిని, కూతురిని తమ ఇంటికి తీసుకొస్తారు. ఈ ఆచార సంప్రదాయాలన్నీ ముఖ్యంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కనిపిస్తాయి. నెలల తరబడి పాడవకుండా ఉండే ఈ మువ్వా చెక్కీలను ఎక్కువగా బరంపురంలో తయారుచేస్తుంటారు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, పర్లాకిమిడి వంటి ప్రాంతాల్లోనూ తయారు చేస్తున్నప్పటికి బరంపురం చెక్కీకున్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఇక్కడ తయారయ్యే చెక్కీలను అటు బెంగళూరు, ఇటు కోల్కత్తా వరకు ఎగుమతి చేస్తుంటారు. విదేశాల్లో ఉన్న మనవారికీ పంపిస్తుంటారు. డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే దొరికే ఈ దొన్ను చెక్కీలు కేజీ, అరకేజీ, పావు కేజీల్లో రూ.40 నుంచి రూ.350 వరకు దొరుకుతాయి. ప్రత్యేకంగా తయారు చేసిన చెక్కీ రూ.450 వరకు ధర పలుకుతోంది.ధనుర్మాసంలో మువ్వా చెక్కీని విష్ణుమూర్తికి ఆరగింపునివ్వడం ఇక్కడి సంప్రదాయం. బెల్లం, పంచదారలో పేలాలతో పాటు పలురకాల పదార్థాలను కలిపి తయారు చేసిన ఈ చెక్కీని శీతాకాలంలో తింటే ఆరోగ్యం!∙ నారాయణ పాఢీ, పురోహితుడు, ఇచ్ఛాపురం -
Doodh Peda: ప్రపంచమే చూడగా.. ధార్వాడ పేడా
బనశంకరి: చాలామంది ఇష్టంగా తినే మిఠాయిల్లో ధారవాడ దూద్ పేడా ఒకటి. ఎంతో రుచిగా, తియ్యగా బాగుంటుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయి మృదువుగా ఎంతో రుచికరంగా ఉంటుంది. పండుగల సమయాల్లో ఇంట్లో దూద్‌పేడా చేసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. కర్ణాటకలోని ధారవాడలో చిన్నగల్లీ నుంచి ప్రారంభమైన దూద్‌పేడా ప్రయాణం నేడు విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంది. పాలతో తయారుచేసే పదార్థాలపైకి అధికకాలం వినియోగంలోకి రావడంతో ధారవాడ దూద్‌పేడా జీఐ ట్యాగ్ పొందింది. బయటి వాతావరణంలో ఐదారు రోజులు పాటు దూద్‌పేడా చెడిపోకుండా రుచికరంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ఉన్నావోలో 19వ శతాబ్దం ప్రారంభంలో ప్లేగ్ మహమ్మారి అనంతరం ధారవాడకు వలస వచ్చిన ఠాకూర్ కుటుంబం దూద్‌పేడాను తయారు చేసి వ్యాపారం ప్రారంభించారు. మిఠాయి వ్యాపారి రామ్‌రతన్‌సింగ్ ఠాకూర్ స్థానికంగా దూద్‌పేడా తయారు చేసి విక్రయించేవారు. అనంతరం ఇదే కుటుంబం ఈ వ్యాపారం విస్తరించారు. రామ్రతన్సింగ్ఠాకూర్ మనవడు బాబుసింగ్ఠాకూర్ ధారవాడ లైన్‌బజార్ దుకాణంలో దూద్‌పేడా వ్యాపారం మరింత విస్తరించగా నేడు ఇదే కుటుంబం 6వ తరం కొనసాగిస్తోంది. ధారవాడలో 177 ఏళ్ల క్రితం పుట్టుకొచ్చిన తీపి వంటకం నేడు పెద్ద పరిశ్రమగా మారిపోయింది. ఇన్నేళ్లు గడిచినప్పటికీ ధారవాడ దూద్‌పేడా నాణ్యత, రుచిలో ఎలాంటి మార్పు రాలేదు ఏడాది నుంచి ఏడాదికి దూద్‌పేడా డిమాండ్ హెచ్చుమీరగా మార్కెట్ కూడా విస్తరించింది. బ్రిటిష్ వారి నుంచి గౌరవం ధారవాడ పారిశ్రామికవాడ ప్రదేశంలో దూద్‌పేడా ప్రదర్శనలో పాల్గొనడానికి (1913 నవంబరు 17) అప్పటి బాంబే గవర్నర్ హెచ్ఇ.లార్డ్స్విల్లింగ్టన్, బాబుసింగ్ఠాకూర్కు వెండిపతకం సరి్టఫికెట్ అందించి గౌరవించారు. అంతేగాక ధారవాడ దూద్‌పేడా కు రాజీవ్‌గాందీ శ్రేష్ట పురస్కారం, ప్రియదర్శిని ఇందిరాగాంధీ పురస్కారాలు అందుకున్నారు. దూద్‌పేడా ప్రత్యేకతలు.. తీపి తిండి రంగంలో ధారవాడ దూద్‌పేడా గత ఏడాది 2023లో దసరా, దీపావళి పండుగ సమయంలో రికార్డుస్థాయిలో 25 వేల కిలోలు విక్రయం కాగా 2022లో 20 టన్నులు విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం ప్రతిరోజు సరాసరి 9–10 వేల కిలోల ధారవాడ పేడా రాష్ట్ర వ్యాప్తంగా విక్రయిస్తున్నారు. ధారవాడ–హుబ్లీ మాత్రమే కాకుండా బెంగళూరు, బెళగావిలో దూద్‌పేడా పెద్దపెద్ద దుకాణాలు ఏర్పాటుకాగా ప్రాంచైసీ దుకాణాల సంఖ్య 1000కి పైగా ఉండటం విశేషం. హైదరాబాద్ కోల్కత్తా, ముంబై, ఢిల్లీ, చెన్నైతో పాటు ప్రముఖ 150 నగరాల్లో ధారవాడ దూద్‌పేడా విక్రయిస్తున్నారు. ప్రముఖ రైల్వే, బస్స్టేషన్లలో కూడా దూద్‌పేడా అందుబాటులోకి వచ్చింది. రుచిలో సరిసాటి నాణ్యత రుచిలో ధారవాడ దూద్పేడాకు సరిసాటి ఏదీలేదు. దూద్‌పేడాను స్వచ్ఛమైన నెయ్యి, కోవా, చక్కెరతో తయారు చేస్తారు. ధారవాడ స్థానిక ప్రదేశాలనుంచి సేకరించిన పాలను వినియోగించి కోవా తయారు చేస్తారు. ముందుగా ఒక లీటరు పాలు తీసుకుని వాటిని 50 ఎంఎల్ అయ్యేవరకు మరిగించాలి. అలా మరిగించిన పాలల్లో చక్కెర వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత అందులో ప్లెయిన్ కోవా, ఇలాచి పొడివేసి మరోసారి బాగా కలుపుకుని దగ్గరగా ముద్దలా అయ్యేలా చేసుకోవాలి. అనంతరం పేస్ట్‌ను నెయ్యిరాసిన ప్లేట్‌మీద పరుచుకుని కాస్త చల్లారిన తరువాత గుండ్రంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే కమ్మని దూద్‌పేడా తయారవుతుంది. -
Diwali 2024 దివాలీకి ఈ స్వీట్లు చేసిపెడితే : దిల్ ఖుష్!
దీపాల పండుగ దీపావళి (Diwali 2024) కోసం ఉత్సాహంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా పిల్లా పాపా అంతా ఎదురు చూస్తున్నారు. దీపావళి దీప కాంతులు, బాణాసంచా వెలుగులతో పాటు, స్వీట్ల సందడి కూడా ఉంటుంది.మరి ఈ క్రమంలో టేస్టీగా, ఈజీగా, హెల్దీగా చేసుకునే రెండు హల్వాల గురించి తెలుసుకుందాం. ఒకటి మూంగ్ హల్వా, రెండు క్యారెట్–ఖర్జూరం హల్వా. మరి వీటికి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇదిగో..ఇలా..!మూంగ్ హల్వాకావల్సిన పదార్థాలునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లుచాయ పెసరపప్పు – అరకప్పు (కడిగిపెట్టుకోవాలి)నీళ్లు – రెండు కప్పులునెయ్యి – అరకప్పుగోధుమ పిండి – రెండు టేబుల్ స్పూన్లుపంచదార – ముప్పావు కప్పుఫుడ్ కలర్ – చిటికెడుయాలకుల పొడి – పావు టీస్పూనుజీడిపలుకులు – రెండు టేబుల్ స్పూన్లుకిస్మిస్లు – రెండు టేబుల్ స్పూన్లుతయారీ స్టవ్ మీద ప్రెజర్ కుకర్ పెట్టి వేడెక్కిన తరువాత టీస్పూను నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించాలి.తరువాత రెండు కప్పుల నీళ్లుపోయాలి, కుకర్ మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.పప్పు చల్లారాక మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ∙స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని పావుకప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ వేయించాలి.పిండి వేగిన తరువాత పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉడికించాలి.ఐదు నిమిషాల తరువాత ముప్పావు కప్పు పంచదార వేసి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించాలి.ఇప్పుడు పప్పు మిశ్రమం బాగా ఉడికి బాణలికి అంటుకోకుండా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఫుడ్ కలర్ వేసి మరో ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. స్టవ్‌మీద మరో పాన్ పెట్టి టేబుల్ స్పూను నెయ్యి, జీడిపలుకులు, కిస్మిస్లు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంతవరకు వేయించి హల్వాలో వేయాలి. యాలకులపొడి వేసి రెండు నిమిషాలు తిప్పితే మూంగ్ హల్వా రెడీ. క్యారెట్–ఖర్జూరం హల్వా కావల్సిన పదార్థాలు ఖర్జూరం – పావు కప్పు (గింజలు తీసి, కడిగి, కొన్ని మంచి నీళ్లలో కొంత సేపు నానబెట్టి తీసి, ఉడికించి, మిక్సీ పట్టుకోవాలి)క్యారెట్ తురుము– 1 కప్పు, కొబ్బరి పాలు– 2 కప్పులుకొబ్బరి కోరు, కస్టర్డ్ మిల్క్– పావు కప్పు చొప్పున, నెయ్యి,పంచదార– పావు కప్పు చొప్పున (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), కుంకుమ పువ్వు – చిటికెడు, వెనీలా ఎసెన్స్– 1 టీ స్పూన్కిస్మిస్ గుజ్జు– 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు– కొన్ని (నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి)తయారీముందుగా ఖర్జూరం గుజ్జు, కొబ్బరి పాలు, పంచదార, ఏలకుల పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని.. అందులో ఖర్జూరం మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద, గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి.కాస్త దగ్గర పడుతున్నప్పుడు క్యారెట్ తురుము, కస్టర్డ్ మిల్క్, ఫుడ్ కలర్ వేసుకుని తిప్పుతూ ఉండాలి.ఆ తర్వాత కిస్మిస్ గుజ్జు, కొబ్బరి కోరు, వెనీలా ఎసెన్స్ ఒకదాని తరవాత ఒకటి వేసుకోవాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడగానే, డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి, సర్వ్ చేసుకోవాలి. -
మోదీకి ఛక్–ఛక్ లడ్డూ, కొరొవాయ్ కేక్.. రష్యా స్పెషల్!
కజాన్: బ్రిక్ శిఖరాగ్ర సదస్సులో వాడీవేడీ చర్చల కోసం రష్యాలోని కజాన్ నగరంలో ల్యాండయిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఛక్–ఛక్ లడ్డూలు, కొరొవాయ్ కేకులు స్వాగతం పలికాయి. ఈ కొత్తరకం పేర్ల వంటకాలను చూసి నెటిజన్లు ఆన్లైన్లో వీటి ప్రత్యేకత గురించి తెగ వెతికేస్తున్నారు. ప్రధాని మోదీకి రష్యా స్థానిక మైనారిటీలైన టాటర్ మహిళలు తమ సంప్రదాయ వేషధారణ, వంటకాలతో స్వాగతం పలికారు. ఇందులో ప్రధానంగా ఛక్–ఛక్ లడ్డూ, కొరొవాయ్ కేకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వంటకాల్లో రష్యా సంప్రదాయ, చారిత్రక విశిష్టత దాగి ఉంది. కజాన్ నగరం ఉన్న టాటర్, బష్కిర్ ప్రాంతాల ఆహార, ఆతిథ్య సంప్రదాయాలు వీటిలో సమ్మిళితమై ఉన్నాయి. ఏమిటీ ఛక్–ఛక్ లడ్డూ? ఛక్–ఛక్ లడ్డూను ప్రధానంగా గోధుమ పిండితో తయారుచేస్తారు. గోధుమపిండితో చపాతీలు చేసి పెనంపై కాల్చకుండా సన్నగా నిలువుగా, అడ్డంగా చిన్నచిన్న చతురస్రాకారపు గడుల్లా కత్తిరించుకోవాలి. తర్వాత వీటిని నూనెలో బంగారం రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత బెల్లం లేదా చక్కెర పాకం తయారుచేసి అందులో కలుపుకుని గట్టిపడ్డాక లడ్డూలాగా గుండ్రంగా చేసుకోవాలి. అంతే ఛక్–ఛక్ లడ్డూ తయార్. ఛక్–ఛక్ లడ్డూ అంటే ఇక్కడి ప్రాంతవాసులకు ఎంతో ఇష్టం. దీన్ని రుచిచూడటానికి ఇవ్వగానే మోదీ ఒకింత ఆశ్చర్యపోయారు. ఇది భారత్‌లో తయారుచేసే వంటకంలా ఉందని వ్యాఖ్యానించారు. బిహార్ వంటకం ముర్హీ కా లాయ్, పశ్చిమబెంగాల్ వంటకం మురీర్ మోవా, ఒడిశా వంటకం మువాలా ఉందని సరదాగా అన్నారు. ఛక్–ఛక్ లడ్డూ మూలాలు టాటర్స్థాన్, బష్కోర్టోస్థాన్లలో ఉన్నాయని స్థానికులు చెబతున్నారు. టాటర్‌స్థాన్‌లో ఇది జాతీయ మిఠాయిగా ప్రఖ్యాతిగాంచింది. కొరొవాయ్ కథాకమామిషు.. మోదీ రుచిచూసిన మరో తీపి పదార్థం కొరొవాయ్ కేకు. బేకరీ వంటకమైన ఈ కొరొవాయ్ కేకు అక్కడ ప్రతి పెళ్లి వేడుకల్లో తప్పకుండా ఉండాల్సిందే. అతిథులకు వడ్డించడం కోసమే ప్రత్యేకంగా దీనిని సిద్దంచేస్తారు. తూర్పు స్లావిక్ ప్రాంతవాసులు ఈ బ్రెడ్ కేక్‌ను తయారుచేసేవాళ్లు. అదే ఇప్పుడు సంప్రదాయంగా వస్తోంది. స్లావ్ ప్రాంత ప్రజలు సూర్యుడిని పూజించేవాళ్లు. వృత్తాకార సూర్యుడికి గుర్తుగా ఈ కేకును గుండ్రంగానే తయారుచేస్తారు.చదవండి: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి.. అన్నివిధాలా సహకరిస్తాం: మోదీపెళ్లయిన జంట భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ పెళ్లిలో అందరికీ పంచిపెడతారు. కొన్ని సార్లు కేకు పిండి ముద్దలను పొడవుగా జడపాయల్లా అల్లి తర్వాత గుండ్రంగా చుట్టి బేక్ చేస్తారు. పూర్వం ఈ కేకులో ఉప్పు కాస్తంత ఎక్కువ వేసేవాళ్లు. ఉప్పు అతిథులతో బంధాన్ని మరింత బలపరుస్తుందని వారి నమ్మకం. బ్రిక్ సదస్సులో మాత్రం అతిథులకు దీనికి తోడుగా తేనెను అందిస్తున్నట్లు తెలుస్తోంది. -
Diwali 2024 ఈజీగా, హెల్దీగా బొప్పాయి హల్వా, టేస్ట్ అదిరిపోవాలంతే!
దీపావళి వెలుగు దివ్వెలు, మతాబులు, చిచ్చబుడ్ల వెలుగులు మాత్రమే కాదు స్వీట్ల పండుగ కూడా. అయితే ఎప్పడూ చేసుకునే తరహాలో కాకుండా, ఆయిల్ లేకుండా ఆరోగ్య కరంగా చేసుకునే స్వీట్ల గురించి తెలుసుకుందాం. ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం పట్టదు కూడా. ఈజీగా, హెల్దీగా బొప్పాయి హల్వా ఎలా చేయాలో చూద్దాం రండి!బొప్పాయిహల్వాకావల్సిన పదార్ధాలునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లుబొప్పాయి పండు – ఒకటి (తొక్క తీసి తురుముకోవాలి)పంచదార – పావు కప్పుబాదం పప్పు పొడి – మూడు టేబుల్ స్పూన్లుయాలకుల పొడి – టీ స్పూనుకోవా తురుము – మూడు టేబుల్ స్పూన్లుబాదం పలుకులు, ఎండు ద్రాక్షలు – రెండు టీస్పూన్లు.తయారీ విధానంముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి బొప్పాయి తురుము వేసి 15 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి.నీరంతా ఇగిరాక, పంచదార వేసి మరో పదినిమిషాలు తిప్పుతూ ఉడికించాలి.ఇప్పుడు యాలకుల పొడి, కోవా తురుము, బాదంపప్పు పొడి, బాదం పలుకులు వేసి తిప్పితే పపయా హల్వా రెడీ. సహజతీపితో ఉండే ఈ హల్వాలోని పోషకాలు బొప్పాయిలో విటమిన్ సి ,బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్, డైటరీ ఫైబర్‌లో కూడా ఎక్కువే. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.జీర్ణక్రియకు ,గట్ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇందులోని బెల్లం ఇనుము , మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు సహజమైన తీపిని అందిస్తుంది.బాదం, ఎండుద్రాక్షలతో రుచిని పెంచడమే కాకుండా ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్ E, మెగ్నీషియం లభిస్తాయి. -
గణపయ్య బొజ్జనిండేలా పాలతాలికలు, రెసిపీ ఇదిగో
వినాయక చవితి వేడుకలలకు రంగం సిద్ధమైంది. వివిధ ఆకారాల్లో గణనాయకులు ఇప్పటికే గణేష్ మంటపాలకు మేళ తాళాలతో తరలి వెళ్లాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో విఘ్ననాయకుడిని కొలుచుకునేందుకు భక్తులు సన్నద్ధమై ఉన్నారు. ముఖ్యంగా వినాయక చవితి అనగానే రకరకాల పూలు, పళ్లుతో పాలవెల్లి అలంకరణ, పూజకోసం 21 రకాల పత్రి సేకరణ, పుస్తకాలకు, ( పలకలకు) పసుపు పూసిబొట్లు పెట్టి అలంకరించుకోవడం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే వినాయకుడి ప్రసాదాలు మరింత ప్రత్యేకం. కుడుములు, పాల తాలికలు, బెల్లం తాలికల తెలుగువారి ప్రేత్యేకమైన పిండి వంటలలను బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా పెడతారు. పాలతాలికల రుచి గొప్పదనం గురించి కవుల ప్రస్తావన, వర్ణన కూడా ఉంటుంది. అలాంటి పాల తాలికలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.పాలతాలికల రెసిపీ తడి బియ్యం పిండి వాడితేనే పాలను బాగా పీల్చుకుని,రుచిగా తాలికలు మృదువుగా వస్తాయి. వేరే మార్గం లేనివాళ్లు పొడి బియ్యం పిండిని కూడా వాడవచ్చు. బియ్యాన్ని కడిగి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు శుభ్రంగా కడిగి వడబోసుకుని వడకట్టి , నీడన ఆరబెట్టుకోవాలి. కొంచెం తడిపొడిగా ఉండగానే బియ్యాన్ని పిండి పట్టించి, జల్లించుకోవాలి. అరిసెల కోసం తయారుచేసుకునే పిండిలాగా మృదువుగా ఉంటే బావుంటుంది. పొడి పిండి అయితే కొద్దిగా నీళ్లు కలిపి పెట్టుకొని, పైన తడి గుడ్డ కప్పి ఉంచుకోవాలి. బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరగనివ్వండి, బెల్లం కరిగాక అప్పుడు తడి బియ్యం పిండి వేసి స్టవ్ ఆపేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత వీటిని తాలికలుగా చపాతీ పీటపైగానీ, చెక్కపై గానీ వత్తు కోవాలి. పాలను మరింగించుకోవాలి. ఇపుడు ముందే నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యం వేసి మరికొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇపుడు ముందే రెడీ చేసి పెట్టుకున్న తాలికలను జాగ్రత్తగా విరిగిపోకుండా వేసుకోవాలి. ఇలా కొద్ది సేపు ఉడకనివ్వాలి. ఇపుడు కొద్దిగా బియ్యం పిండిలో కాసిని నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలిపి ఈ పాకంలో కలుపుకోవాలి. తాలికలు ఉడికినతరువాత బెల్లం పాకం వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందులో యాలికల పొడి, నేతిలో వేయించిన ఎండు కొబ్బరి పలుకులు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటే చాలు. దీన్ని వేడిగా తిన్నా, చల్లారిన తిన్నా భలే రుచిగా ఉంటాయి.పాలు ఇష్టం లేనివారు, ఉత్తి బెల్లం పాకంలో తాలికలను వేసి, ఉడికించుకుని, , జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవచ్చు. -
నాణ్యతలేని ‘పతంజలి సోన్‌పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
యోగాగురు రామ్‌దేవ్ బాబాకు చెందిన ఆహార ఉత్పత్తుల సంస్థ పతంజలికి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లోని టెస్టింగ్ లాబొరేటరీలో పతంజలి ఆహార ఉత్పత్తి నాణ్యతా పరీక్షలో విఫలమవడంతో పితోర్‌ఘర్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్‌తో సహా ముగ్గురికి జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించారు.వివరాల్లోకి వెళ్తే.. 2019లో ఉత్తరాఖండ్ పితోర్‌ఘర్‌లోని బెరినాగ్ ప్రధాన మార్కెట్లోని లీలా ధర్ పాఠక్ దుకాణంలో పతంజలి నవరత్న ఎలైచి సోన్ పాపిడి నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన తర్వాత, సోన్‌పాపిడి నమూనాలను సేకరించి డిస్ట్రిబ్యూటర్‌కు, పతంజలి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.నాణ్యత పరీక్షలో పతంజలి సోన్‌పాపిడి విఫలం కావడంతో రుద్రపూర్‌లోని టెస్టింగ్ లేబొరేటరీ.. రాష్ట్ర ఆహార భద్రతా విభాగానికి నోటీసు పంపింది. ఈ ఘటన తర్వాత దుకాణదారుడు లీలా ధర్ పాఠక్, డిస్ట్రిబ్యూటర్ అజయ్ జోషి, పతంజలి అసిస్టెంట్ మేనేజర్ అభిషేక్ కుమార్లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ముగ్గురికి వరుసగా రూ. 5,000, రూ.10,000, రూ.25,000 చొప్పున జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించారు. -
Eid 2024 ఘుమ ఘుమల షీర్ కుర్మా టేస్టీ అండ్ హెల్దీగా ఇలా..!
ఈద్ 2024: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగ పవిత్ర రంజాన్. నెలరోజుల ఉపవాస దీక్ష తరువాత చంద్ర దర్శనంతో ఈద్-ఉల్-ఫితర్ ఉత్సాహంగా జరుపుకుంటారు. నెలవంకతో ప్రారంభమై 30 రోజుల కఠిన ఉపవాస దీక్షలు తదుపరి నెల నెలవంకతో ముగుస్తాయి. రంజాన్ పండుగ చేసుకుంటారు. దీన్నే ఈద్ అని కూడా అంటారు. ఈ రోజున ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి, ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. తీపి విందు చేసుకుంటారు. ముఖ్యగా రంజాన్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఒకటి హలీం. రెండోది షీర్ ఖుర్మా. షీర్ ఖుర్మా అనేది దక్షిణ ఆసియా నుండి వచ్చిన రుచికరమైన, వెల్వెట్ డెజర్ట్. సేవయాన్ అని పిలిచే సున్నితమైన సెమోలినా నూడిల్. ఏలకులు , కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలు, రోజ్ వాటర్, వివిధ రకాల గింజలు, డ్రైఫ్రూట్స్‌తో ఎంతో రుచికరంగా తయారు చేస్తారు. మరి షీర్ ఖుర్మా రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా..! షీర్ ఖుర్మాకు కావాల్సిన పదార్థాలు: చిక్కని పాలు, సేమియా, చక్కెర, బాదం, జీడి పప్పు, పిస్తా, ఖర్జూరం, కిస్మిస్, నెయ్యి, కోవా, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు తయారీ: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకొద్దిగా నెయ్యి వేసి.. డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టు కోవాలి. అదే కడాయిలో సేమియాను కూడా వేసి జాగ్రత్తగా వేయించాలి. ఆ తరువాత మరో గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. చిక్కగా మరిగాక మంట సిమ్‌లో పెట్టుకొని, ఇంకొంచెం మరిగాక పంచదార పొడి, కోవా వేసి బాగా కలపాలి. మధ్య మధ్యలో అడుగంట కుండా కలుపుతూ ఉండటం మర్చిపోకూడదు. ర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఖర్జూరాలను, సేమియాలను వేయాలి. ఇపుడిక ఊరికే కలపకూడదు. రోజ్ వాటర్ కూడా వేసి మెల్లిగా కలపాలి. కొద్దిగా చిక్కగా అయిన తరువాత దింపేసుకోవాలి. తరువాత ముందే వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్, కుంకుమ పువ్వు రేకలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఘుమఘుమలాడే టేస్టీ అండ్ హెల్దీ షీర్ కుర్మా సిద్ధం. *సాక్షి పాఠకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు* -
చూడటానికి పసందైనా.. ధరకి వామ్మో అనాల్సిందే..!
చూడటానికి ఎంతో పసందుగా ఉన్న ఈ మిఠాయి ఖరీదు తెలుసుకుంటే మాత్రం కళ్లు చెదురుతాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మిఠాయి. ఈ మిఠాయి పేరు ‘స్ట్రాబెర్రీస్ ఆర్నాడ్’. అమెరికాలోని న్యూ ఆర్లీన్‌లో ఉన్న ‘ఆర్నాడ్’ రెస్టారెంట్ ప్రత్యేకంగా రూపొందించిన మిఠాయి ఇది. సన్నగా తరిగిన స్ట్రాబెర్రీ ముక్కలు, నారింజ ముక్కలు, లవంగం, దాల్చినచెక్క, వెనీలా ఐస్‌క్రీమ్, బాగా గిలకొట్టిన పాలమీగడతో తయారు చేసిన ఈ మిఠాయిపైన ఆరురకాల ఖరీదైన షాంపేన్ చిలకరించి, దీనిపైన తాజా పుదీనా ఆకులను, మేలిమి బంగారు రేకులను అలంకరిస్తారు. దీని ఖరీదు 9.85 మిలియన్ డాలర్లు (రూ.81.50 కోట్లు). దీనికి ఇంత ఖరీదు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? దీనిని అలా ఊరకే కప్పులో పెట్టి వడ్డించి వదిలేయరు. దీంతో పాటే, కప్పు అడుగున ఉన్న సాసర్లో చక్కని పెట్టెలో 10.06 కేరట్ల వజ్రాలను పొదిగిన బంగారు ఉంగరాన్ని ఉంచి మరీ వడ్డిస్తారు. ఐస్‌క్రీమ్ తినేసి, వజ్రాల ఉంగరాన్ని తీసేసుకోవచ్చు. ఇవి చదవండి: ఈ పండుగ కొందరకి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’.. -
500 ఏళ్ల తర్వాత అయోధ్యలో హోలీ వేడుకలు
భగవాన్ రామ్‌లల్లా నూతన రామాలయంలో కొలువైన దరిమిలా రామనగరిలో ప్రతి క్షణం ఉత్సాహం కనిపిస్తోంది. దాదాపు 500 ఏళ్ల పోరాటం తర్వాత రామాలయం రూపుదిద్దుకుంది. దీంతో బాలరాముడు తన జన్మ స్థలంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఇకపై ప్రతి పండుగను అయోధ్యలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కోవలో అయోధ్యలో 500 ఏళ్ల తరువాత హోలీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ హోలీ చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. ఈనెల 25న జరగబోయే హోలీ వేడుకలకు రామాలయం ముస్తాబవుతోంది. రామ భక్తులు ఆరోజు బాలరామునితో హోలీ వేడుకలు చేసుకోనున్నారు. హోలీ నాడు 56 వంటకాలను బాలరామునికి నైవేద్యంగా సమర్పించనున్నారు. అలాగే ఆరోజున ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ప్రసాద వితరణ చేయనున్నారు. రామమందిరం ట్రస్ట్ కార్యాలయ ఇన్చార్జి ప్రకాష్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ ఇకపై హోలీ వేడుకలు రాముని ఆస్థానంలో జరగనున్నాయని, ఈ నేపధ్యంలో అయోధ్య అంతటా ఆనందం నెలకొన్నదన్నారు. ఇందుకోసం రామమందిర ట్రస్ట్ సన్నాహాలు చేస్తున్నదన్నారు. హోలీ వేడుకల సందర్భంగా అయోధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. -
ప్రపంచంలోనే బెస్ట్ డెజర్ట్‌గా భారతీయ స్వీట్!
ప్రపంచంలోనే అత్యుత్తమ డెజర్ట్‌గా భారతీయ తీపి వంటకానికి చోటు దక్కింది. టాప్ 10 బెస్ట్ చీజ్ డెజర్ట్‌లో ఈ భారతీయ తీపి వంటకం ఒకటిగా నిలిచింది. ఇంతవరకు ప్రముఖ ఫుడ్ గైడ్ సంస్థ టేస్ట్ అట్లాస్ బెస్ట్ కూర, బెస్ట్ కాఫీ, బెస్ట్ అల్పహార జాబితాను విడుదల చేసింది. తాజాగా భోజనం తర్వాత హాయిగా ఆస్వాదించే డెజర్ట్(స్వీట్) రెసిపీల జాబితాను విడుదల చేసింది. టేస్ట్ అట్లాస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 బెస్ట్ చీజ్ డెజర్ట్‌ల జాబితాను విడుదల చేసింది. అందులో భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌కు చెందిన 'రసమలై' రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ 'రసమలై' స్వీట్‌ని ఇష్టపడని వారుండరు. దీన్ని పాలు, పంచదార, కుంకుమ పువ్వు, నిమ్మరసం వంటి వాటితో తయారు చేస్తారు. దీన్ని తీసుకుంటే కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. హోళీ, దీపావళి వంటి పండగల సమయాల్లో దీనిని ఎక్కువగా తయారు చేస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమ చీజ్ డెజర్ట్‌లలో ఒకటిగా ఈ రసమలై గుర్తింపు పొందడం భారతదేశం గొప్ప పాక వారసత్వానికి ఈ తీపి వంటకంగా నిదర్శనంగా అని పలువురు పేర్కొన్నారు. ఇక ఈ జాబితాలో పోలాండ్‌కు చెందిన సెర్నిక్కి తొలి స్థానం దక్కించుకుంది. పోలాండ్‌కు చెందిన సెర్నిక్ అనేది గుడ్లు, చక్కెర ట్వరోగ్తో తయారు చేసే చీజ్ వంటకం. ఇది ఒక రకమైన పెరుగు చీజ్. ఈ చీజ్ సాధారణంగా చిన్న ముక్కలుగా ఉండే కేక్‌లా తయారు చేస్తారు. దీన్ని ఒక్కోసారి బేక్ చేస్తారు లేదా బేక్ చేయకుండానే కూడా చేయొచ్చు. ఇది చూడటానికి స్పాంజ్ కేక్‌లా జెల్లిలా ఉండి పైన ఫ్రూట్స్‌తో అలంకరించి ఉంటుంది. టేస్టీ అట్లాస్ విడుదల చేసిన ఈ చీజ్ డెజర్ట్‌ల జాబితాలో జపనీస్ చీజ్,బాస్క్ చీజ్ వంటి ఇతర ప్రసిద్ధ చీజ్ డెజర్ట్‌లు కూడా ఉన్నాయి. టేస్టీ అట్టాస్ విడుదల చేసిన ఉత్తమ చీజ్ డెజర్ట్ పూర్తి జాబితా సవివరంగా ఇదే.. 1. సెర్నిక్, పోలాండ్ 2. రసమలై, భారతదేశం 3 3. స్ఫకియానోపిటా, గ్రీస్ 4. న్యూయార్క్ తరహా చీజ్, USA 5. జపనీస్ చీజ్, జపాన్ 6. బాస్క్ చీజ్, స్పెయిన్ 7. రాకోజీ టురోస్, హంగరీ 8. మెలోపిటా, గ్రీస్ 9. కసెకుచెన్, జర్మనీ 10. మిసా రెజీ, చెక్ రిపబ్లిక్ View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: బెస్ట్ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌కి చోటు! ఎన్నో ర్యాంకులో నిలిచిందంటే..) -
ఒక్క జిలేబీ చాలు.. కుటుంబానికి పండుగే!
కళ, సాహిత్యం, సంస్కృతి, ఆహారం.. ఇవే తాజ్ మహోత్సవ్ ప్రత్యేకతలు. యూపీలోని ఆగ్రాలోగల శిల్పగ్రామ్లో ఫిబ్రవరి 17న తాజ్ మహొత్సవ్ ప్రారంభమయ్యింది. ఇది ఫిబ్రవరి 27 వరకూ కొనసాగనుంది. ప్రస్తుతం జరుగుతున్న తాజ్ మహోత్సవ్‌లో 300లకు పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వంటకాలకు సంబంధించిన స్టాల్స్ ఆహార ప్రియులను అమితంగా అలరిస్తున్నాయి. వీటిలో హరియాణా జిలేబీ స్టాల్ ప్రత్యేకంగా నిలిచింది. హరియాణాకు చెందిన నరేష్ కుమార్ ఏర్పాటు చేసిన ఈ స్టాల్ ముందు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఈ జిలేబీ ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్క జిలేబీ కుటుంబం అంతటికీ సరిపోతుంది. ఐదుగురు సభ్యులు కలిగిన కుటుంబం ఈ ఒక్క జిలేబీని హాయిగా ఆరగించి ఆనందించవచ్చు. 1952లో తన తాత హరిశ్చంద్ర హల్వాయి ఈ జిలేబీని తయారు చేయడం ప్రారంభించాడని నరేష్ తెలిపారు. తమ మూడో తరం కుటుంబ సభ్యులు కూడా జిలేబీ వ్యాపారంతోనే ఆదాయం సమకూర్చుకుంటున్నామన్నారు. గత 15 ఏళ్లుగా తాజ్ మహోత్సవ్‌లో జలేబీ స్టాల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తాము తయారు చేసే జిలేబీ బరువు దాదాపు 250 గ్రాములు ఉంటుందని తెలిపారు.ఈ జిలేబీ ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయదని పేర్కొన్నారు. తాజ్ మహోత్సవ్‌ను సందర్శించే ప్రతీఒక్కరూ ఈ జిలేబీని రుచి చూడాలని కోరుకుంటారని, ఒక్కో జిలేబీ ధర రూ. 400 అని స్టాల్ నిర్వాహకులు నరేష్ తెలిపారు. తాము రూపొందించే జిలేబీని మాజీ ఉప ప్రధాని చౌదరి దేవి లాల్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రుచి చూశారని నరేష్ కుమార్ మీడియాకు తెలిపారు. -
ఆత్రేయపురం పూతరేకులను తలపించే ఇరానీ పుతరేకు!
ఆత్రేయపురం పూతరేకులు అమెరికా వరకు ప్రసిద్ధి పొందాయి. పూతరేకులను తలపించే పిండివంటకం ప్రపంచంలో మరెక్కడా లేదనుకుంటాం గాని, ఇరాన్లో పూతరేకులను తలపించే మిఠాయి పిండివంటను తయారు చేస్తారు. ఇరాన్‌లోని గిలాన్ ప్రావిన్స్‌లో ప్రసిద్ధి పొందిన ‘రెష్తే ఖోష్కర్’ అనే ఈ మిఠాయి తయారీ దాదాపు పూతరేకుల తయారీ పద్ధతిలోనే ఉంటుంది. దీని తయారీకి ఎక్కువ పరిమాణంలోని వరిపిండికి, గోధుమపిండి కలిపి జారుగా ఉండేలా పిండిముద్దను తయారు చేస్తారు. దీనిని జంతికల గొట్టంలాంటి సాధనంలో వేసి, మంటపై బోర్లించిన మూకుడు మీద సన్నని గడులు గడులుగా వచ్చేలా వేస్తారు. ఇలా పొరలు పొరలుగా సన్నని వలలా వేసి, వీటి మధ్యలో ఏలకులు, దాల్చిన పొడి, వాల్నట్స్, బాదం, పిస్తా, చక్కెర వేసి పూతరేకుల మాదిరిగానే జాగ్రత్తగా చుడతారు. ఏటా రంజాన్ నెలలో దీనిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. (చదవండి: కృష్ణఫలం గురించి విన్నారా? తింటే బొలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
క్రంచీ..క్రంచీ ఎల్లు చిక్కీ: చాలా సింపుల్‌గా, చక చకా !
సంక్రాంతి అంటేనే స్వీట్ల పండుగ. అరిసెలు, పూతరేకులు, కొబ్బరి బూరెలు, కరకజ్జ, జంతికలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దదే. అయితే వీటికి సమయంతోపాటు, నైపుణ్యం కూడా కావాలి. అందుకే చాలా తేలిగ్గా, తక్కువ సమయంలో, చాలా తక్కువ పదార్థాలతో చేసుకునే స్వీట్ గురించి తెలుసుకుందాం. ఎల్లు చిక్కీ. అంటే నువ్వులు ( తెల్లవి, నల్లవి) బెల్లంతో కలిపి తయారుచేసుకునే రుచికరమైన , క్రిస్పీ స్వీట్. ఎల్లు అంటే తమిళంలో నువ్వులు అని అర్థం. నువ్వుల చిక్కిని ఎల్లు మిట్టై, నువ్వుల బర్ఫీ,టిల్ చిక్కి అని కూడా అంటారు. ఇందులో జీరో షుగర్ , జీరో ఆయిల్ అన్ని వయసుల వారికి పర్ఫెక్ట్గా హ్యాపీగా తినవచ్చు ముఖ్యంగా నువ్వులు పెరుగుతున్న పిల్లలకు మంచి శక్తిని ఇస్తాయి. వృద్ధులు, మహిళల ఆరోగ్యం కోసం ఎల్లు చిక్కీని నెలకోసారి చేసుకుని రోజూ కనీసం ఒక్క పట్టీ అయినా తినాలి. కావలసిన పదార్థాలు నువ్వులు – పావు కేజీ; బెల్లం – పావు కేజీ; నెయ్యి –కొంచెం ఎలా చేసుకోవాలి? నువ్వులను మందపాటి పెనంలో వేసి సన్నమంట మీద వేయించాలి. చిటపట పేలడం మొదలు పెట్టిన తర్వాత కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అపుడు స్టవ్ ఆపేసి పెనం పక్కన పెట్టి చల్లారనివ్వాలి. మరొక పాత్రలో బెల్లంతోపాటు, కొద్దిగి నీళ్లు వేసుకుని, మరిగేవరకు మీడియం మంట మీద ఉంచాలి. కరిగిన తర్వాత మంట తగ్గించి పాకం వచ్చే వరకు ఉడికించాలి. పాకం వచ్చిన తర్వాత అందులో నువ్వులు, నెయ్యి వేసి కలపాలి. ఒక వెడల్పాటి ప్లేట్‌కు నెయ్యి రాసి బెల్లం, నువ్వుల మిశ్రమాన్ని వేసి పూరీల కర్రతో అంతటా ఒకేమందం వచ్చేటట్లు వత్తాలి. వేడి తగ్గిన తర్వాత చాకుతో ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి వేరు చేసి గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకుంటే నాలుగు వారాల పాటు నిల్వ ఉంటాయి. వేరుశెనగలను కూడా కలుపుకొని కూడా కావాలంటే లడ్డూల్లా కూడా తయారు చేసుకోవచ్చు. వీటిల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పెద్దగా నెయ్యి అవసరం పడదు. ఎల్లు చిక్కీ లాభాలు ఫైబర్ కంటెంట్ ఎక్కువ మలబద్దకాన్ని నివారిస్తుంది, వాపులను తగ్గిస్తుంది పొత్తికడుపు కొవ్వును కరిగిస్తుంది. ఎనర్జీ బూస్టర్, జీర్ణ ఆరోగ్యం -
నోరూరించే.. ఈ గరం గరం సమోసాల తయారీ ఎలాగో తెలుసా?
స్వీట్ కోవా సమోసా.. కావలసినవి: మైదా – రెండు టీస్పూన్లు; సమోసా పట్టి షీట్లు – పన్నెండు(రెడీమేడ్); వేరు శనగ నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా; పిస్తా – గార్నిష్‌కు సరిపడా. స్టఫింగ్: నెయ్యి – టీస్పూను; జీడిపప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు; పిస్తా పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు; పంచదార – పావు కప్పు; యాలకుల పొడి – పావు టీస్పూను; ఉప్పు – ముప్పావు టీస్పూను; కోవా తురుము – కప్పు. సిరప్: పంచదార – అరకప్పు; యాలకుల పొడి – పావు టీస్పూను; నీళ్లు – అరకప్పు; కుంకుమ పువ్వు– చిటికెడు. తయారీ: జీడిపప్పుని నెయ్యిలో వేసి బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించాలి. జీడిపప్పు వేగిన తరువాత పిస్తా, కొబ్బరి తరుము, పంచదార, కోవా తురుము వేయాలి. ఇవన్నీ దోరగా వేగిన తరువాత రుచికి సరిపడా ఉప్పు, యాలకులపొడి వేసి కలిపి దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత అరగంట రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙బాణలిలో కుంకుమ పువ్వును దోరగా వేయించాలి. ఇది వేగిన తరువాత పంచదార, అరకప్పు నీళ్లు, యాలకుల పొడి వేసి, సిరప్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. మైదాలో కొద్దిగా నీళ్లుపోసి గమ్‌లా తయార చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన మిశ్రమాన్ని.. సమోసా పట్టి షీట్‌పైన టేబుల్ స్పూను వేసి సమోసాలా చుట్టుకోవాలి. లోపల స్టఫింగ్ బయటకు రాకుండా ఉండేలా మైదా గమ్‌ను రాసుకుంటూ సమోసాను చుట్టుకోవాలి. సమోసాలన్నీ రెడీ అయ్యాక బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు డీప్‌ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన వేడివేడి సమోసాలను సుగర్ సిరప్‌లో అరనిమిషం ఉంచాలి. సుగర్ సిరప్ నుంచి తీసిన సమోసాపై పిస్తా పప్పు తురుము వేస్తే స్వీట్ సమోసా రెడీ. చికెన్ సమోసా.. కావలసినవి: మైదా – కప్పు; వాము – చిటికెడు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు. ఖీమా ఫిల్లింగ్: నెయ్యి – టేబుల్ స్పూను; ఇంగువ – చిటికెడు; జీలకర్ర – టీస్పూను; క్యారట్ ముక్కలు – అరకప్పు (చిన్నముక్కలు); వెల్లుల్లి రెబ్బలు – రెండు; అల్లం – అంగుళం ముక్క; చికెన్ ఖీమా – పావు కేజీ; కారం – అర టీస్పూను; ధనియాల పొడి – టీస్పూను; గరం మసాలా – అర టీస్పూను; పసుపు – పావు టీస్పూను; పచ్చిబఠాణి – అరకప్పు; స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: మైదాలో వాము, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కలిపాక, నీళ్లు పోసి ముద్ద చేయాలి. ఈ పిండి ముద్దపైన తడి వస్త్రాన్ని కప్పి అరగంట నానబెట్టుకోవాలి. టేబుల్ స్పూను నెయ్యిలో జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. జీలకర్ర వేగిన తరువాత అల్లం, వెల్లుల్లిని సన్నగా తరగి వేయాలి. వీటితోపాటే క్యారట్ ముక్కలు వేసి వేయించాలి. క్యారట్ వేగిన తరువాత చికెన్ ఖీమా వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి గరిటతో కలిపి, మూతపెట్టి మగ్గనివ్వాలి. ఆరు నిమిషాల తరువాత స్ప్రింగ్ ఆనియన్ తరుగు, పచ్చిబఠాణి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాలు వేయించి దించేయాలి. మైదాముద్దను చిన్న ఉండలుగా చేసి, చపాతీలా వత్తుకోవాలి. చపాతీని కోన్ ఆకారంలో మడిచి, మధ్యలో చికెన్ ఖీమా మిశ్రమంతో నింపాలి. మిశ్రమం బయటకు రాకుండా కోన్‌ను మూసివేయాలి. ఇలా అన్ని సమోసాలు రెడీ అయిన తరువాత బేకింగ్ ట్రేలో పెట్టాలి. ఈ ట్రేను అవెన్‌లో పెట్టి 350 ఫారిన్ హీట్స్ వద్ద ఇరవై నిమిషాల పాటు బేక్ చేస్తే చికెన్ సమోసా రెడీ. ఎగ్ సమోసా.. కావలసినవి: గుడ్లు – ఆరు; పచ్చి బంగాళ దుంపల తురుము – కప్పు; క్యారట్ ముక్కలు – అరకప్పు; ఉల్లిపాయలు – నాలుగు; పచ్చిమిర్చి – మూడు; నూనె – ఐదు టేబుల్æస్పూన్లు; వంటసోడా – అరటీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; వాము – అరటీస్పూను; కొత్తి మీర – చిన్న కట్ట; మైదా – రెండున్నర కప్పులు; రిఫైన్డ్ నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకోవాలి ∙మైదాలో వంటసోడా, వాము, అరటీస్పూను ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కలపాలి. నీళ్లుపోసి ముద్దచేసి గంటపాటు నానపెట్టుకోవాలి. మూడు టేబుల్ స్పూన్ల నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత క్యారట్ ముక్కలు, బంగాళ దుంప తురుము వేసి వేయించాలి. నిమిషం తరువాత కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. మిశ్రమం మెత్తబడిన తరువాత గుడ్ల సొన వేసి వేయించాలి. గుడ్ల సొన వేగిన తరువాత దించేసి చల్లారనివ్వాలి. మైదా ముద్దను చిన్న ఉండలుగా చేసి, చపాతీల్లా వత్తుకోవాలి. ఈ చపాతీలను త్రికోణాకృతిలో మడతపెట్టి మధ్యలో ఒక టీ స్పూన్ గుడ్డు మిశ్రమాన్ని పెట్టి మిశ్రమం బయటకు రాకుండా అంచులకు కొద్దిగా తడిచేసి అతుక్కునేటట్లు వేళ్లతో మెల్లగా నొక్కాలి ఇలా అన్ని తయారయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేస్తే ఎగ్ సమోసా రెడీ. ఇవి కూడా చదవండి: క్యాబేజ్‌తో ఎగ్ భుర్జి.. ఎప్పుడైనా ట్రై చేశారా? చపాతీలో బావుంటుంది -
పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట.. ఆరుగురికి తీవ్రగాయాలు!
యూపీలోని ఆగ్రాలో ఒక విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిని విన్నవారంతా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇక్కడి శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఒక వివాహ వేడుకలో రసగుల్లా విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలతో కొట్టుకునేంత వరకూ వివాదం దారితీసింది. ఈ గొడవలో ఒక మహిళతో సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నయాబన్స్ రోడ్డు సమీపంలోని సంతోషి మాత దేవాలయం దగ్గర ఒక వివాహ వేడుకలో విందు జరిగింది. ఈ సందర్భంగా రసగుల్లా తినే విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది పరస్పరం కొట్టుకునేవరకూ దారితీసిందని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనిల్ శర్మ తెలిపారు. క్షతగాత్రులందరినీ వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. విందు ఏర్పాటు చేసిన గౌరీశంకర్ శర్మపై కేసు నమోదు చేశామని, ఈ వివాదంపై విచారణ చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: హిమాచల్‌లోనూ సొరంగ ప్రమాదం.. ఎప్పుడంటే.. -
దీపావళి పండుగకి ఈజీగా కాజు పిస్తా రోల్స్ చేసుకోండిలా!
కాజు పిస్తా చేయడానికి కావలసినవి: జీడిపప్పు – ఒకటిన్నర కప్పులు పిస్తా పప్పు – ఒకటిన్నర కప్పులు కండెన్స్డ్ మిల్క్ – ఒకటింబావు కప్పులు గ్రీన్ ఫుడ్ కలర్ – ఐదు చుక్కలు బటర్ – రెండు టేబుల్ స్పూన్లు పంచదార పొడి – కప్పు యాలకులపొడి – పావు టీస్పూను; తయారీ విధానం: జీడిపప్పును దోరగా వేయించి, మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయిన తరువాత జల్లెడపట్టి పొడిని తీసుకోవాలి. బాణలిలో వెన్న వేసి వేడెక్కనివ్వాలి. కరిగిన బటర్లో కండెన్స్డ్ మిల్క్ పోయాలి. నిమిషం పాటు పాలను కలుపుతూ ఉండాలి. తరువాత జీడిపప్పు పొడి వేయాలి. సన్నని మంటమీద తిప్పుతూ ఐదునిమిషాలు వేయించాలి. తరువాత దించేసి చల్లారనివ్వాలి. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని జీడిపప్పు మిశ్రమాన్ని ముద్దలా కలిపి పెట్టుకోవాలి. ∙ఇప్పుడు పిస్తాపప్పుని దోరగా వేయించి మెత్తగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని జల్లెడపట్టి మెత్తటి పొడిని తీసుకోవాలి. పిస్తా పొడిలో పంచదార పొడి, యాలకుల పొడి, ఫుడ్ కలర్ కొద్దిగా వేడి నీళ్లు చల్లుకుంటూ ముద్దలా కలపాలి. ఇప్పుడు జీడిపప్పు ముద్దను రెండు ముద్దలుగా చేసి, ఒక్కో ముద్దను మందపాటి చపాతీలా వత్తుకుని, కాస్త వెడల్పుగా ఉండేలా ముక్కలు కోయాలి. పిస్తా ముద్దను చిన్న ఉండలుగా చేసి, వీటిని పొడవాటి రోల్స్‌లా చుట్టుకోవాలి. జీడిపప్పు ముక్కపైన పిస్తా రోల్‌ను పెట్టి, జీడిపప్పు ముక్కను రోల్ చేయాలి. పిండి ముద్దను మొత్తాన్ని ఇలా రోల్ చేసి, పైన కుంకుమ పువ్వు, సిల్వర్ పేపర్‌తో గార్నిష్ చేస్తే కాజుపిస్తా రోల్స్ రెడీ. (చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
కిలో స్వీట్ రూ.21,000.. ఇదే ప్రత్యేకత..
దీపావళి సమీపిస్తున్న తరుణంలో మార్కెట్లో వివిధ రకాల స్వీట్లు ఆదరణ పొందుతున్నాయి. వాటిలో అహ్మదాబాద్‌లోని గ్వాలియాలో విక్రయిస్తున్న 'స్వర్ణ ముద్ర' అనే స్వీట్ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఏకంగా ఆ స్వీట్ ఖరీదు కేజీ రూ.21వేలు. స్వర్ణ ముద్ర ఒక్క ముక్క రూ.1,400 రూపాయలు. ఒక కిలో స్వీట్లో దాదాపు 15 ముక్కలు ఉంటాయి. ఇంతకీ దాని ప్రత్యేకత ఎంటో తెలుసుకుందాం. ఆ స్వీట్ తయారీలో 24 క్యారెట్ల బంగారు పొరను ఉపయోగిస్తారు. దీన్ని బ్లూబెర్రీస్, బాదం, పిస్తా, క్రాన్బెర్రీస్ వంటి వాటితో తయారుచేస్తారు. పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని చాలామంది ఆర్డర్ చేసి మరీ ఈ స్వీట్‌ను తీసుకుంటారని నిర్వాహకులు చెబుతున్నారు. పండగలులేని సమయంలో పెళ్లివేడుకలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో బహుమతులు ఇవ్వడానికి ఈ స్వర్ణముద్రను ఉపయోగిస్తారని తెలిపారు. -
దోమలను ఎందుకు ఇష్టంగా తింటారు? ఒక టిక్కీకి ఎన్ని దోమలు కావాలి?
ప్రస్తుత కాలంలో మనుషులు దోమల కారణంగా ఇబ్బంది పడినంతగా మరే ఇతర జీవుల వల్ల కూడా ఇబ్బంది పడివుండరంటే అతిశయోక్తి కాదు. సాయంత్రం కాగానే దోమల సైన్యం మన ఇంటిపై దాడి చేసి, కుటుంబ సభ్యుల రక్తాన్ని పీల్చేస్తుంది. ముఖ్యంగా ఇంటికి సమీపంలో నీరు నిల్వ ఉండే ప్రాంతం ఉంటే దోమల దాడి మరింత అధికంగా ఉంటుంది. దోమలను నివారించడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే దోమలను లొట్టలేసుకుంటూ తినేవారి గురించి మీకు తెలుసా? ఇది మీ ఊహలోకి కూడా రాకపోవచ్చు. దోమలను ఎంతో ఇష్టంగా తినే ప్రజలు ఉండే ప్రదేశం ఒకటి ఉంది. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దోమలను లొట్టలేసుకుంటూ తినే ప్రజలు ఆఫ్రికాలో నివసిస్తున్నారు. ఈ సంఘాన్ని మిడ్జెస్ అంటారు. వారు దోమలను వేటాడేవారిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆఫ్రికాలోని విక్టోరియా సరస్సు వర్షాకాలంలో నీటితో నిండినప్పుడు, అందులో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతాయి అప్పుడు మిడ్జెస్ జాతి ప్రజలు ఈ దోమలను వేటాడి, ఇష్టంగా తింటారు. వర్షాల సమయంలో దోమలను పట్టుకునేందుకు ఇక్కడి ప్రజలు పలు రకాల పాత్రలను ఉపయోగిస్తారు. సాయంత్రం పూట దోమలను అధికంగా సేకరించి, వాటిని దగ్గరగా కలిపి, బాగా మెత్తగా చేసి, రుచికరమైన టిక్కీలు తయారు చేస్తారు. పలు నివేదికల ప్రకారం వారు ఒక్కో టిక్కీని తయారు చేయడానికి కనీసం 5 లక్షల దోమలను ఉపయోగిస్తారు. అక్కడ ఒక వ్యక్తి రోజుకు కనీసంగా రెండు టిక్కీలు తింటే, అతను 10 లక్షల దోమలను తిన్నాడని అర్థం. ఈ దోమలు ప్రొటీన్ కారకాలని, వాటిని తింటే తమ శరీరానికి సరిపడా ప్రొటీన్లు లభిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇది కూడా చదవండి: ఎత్తయిన భవనాలపై ఎర్ర లైట్లు ఎందుకు? -
సున్నండలు.. తింటే మంచి బలం, మీరూ ట్రై చేయండి
సున్నండలు తయారీకి కావల్సినవి: మినప్పప్పు – 2 కప్పులు, పంచదార పొడి – 2 కప్పులు, నెయ్యి – 1 కప్పు, ఏలకులపొడి – 1/2 టీ స్పూన్ తయారు చేసే విధానం : మినప్పప్పు దోరగా వేయించుకోవాలి. చల్లారిన తరువాత పొడి చేసుకొని, అందులో వేడి చేసిన నెయ్యి పంచదారపొడి, మినప్పిండి, ఏలకుల పొడి కలిపి ఉండలుగా చేసుకోవాలి. అంతే సున్నండలు రెడీ. ఇవి రుచిగా ఉండటమే కాకుండా మంచి బలాన్నిస్తుంది. మీరూ ట్రై చేసి చూడండి. -
వినాయక చవితి స్పెషల్: స్వీట్ సందేశ్ చేసుకోండి ఇలా
స్వీట్ సందేష్ ఇలా చేసుకోండి కావలసినవి: ఉడికించిన చిలగడ దుంప – పెద్దది ఒకటి; పచ్చికొబ్బరి తురుము – ముప్పావు కప్పు; జీడిపప్పు పొడి – పావు కప్పు; కొబ్బరి పాలు – అరకప్పు; పంచదార – అరకప్పు; యాలకులపొడి – అరటీస్పూను; రోజ్ వాటర్ – టీస్పూను. తయారీ: చిలగడ దుంప తొక్క తీసి ఉండలు లేకుండా మెత్తగా చిదుముకోవాలి ∙చిదుముకున్న చిలగడ దుంప మిశ్రమంలో జీడిపప్పు పొడి వేసి కలపాలి. పంచదారలో కొద్దిగా నీళ్లుపోసి సుగర్ సిరప్‌ను తయారు చేసుకోవాలి ∙సిరప్ తయార య్యాక కొబ్బరి తురుము వేసి కలుపుతూ ఉండాలి. తీగ పాకం వచ్చినప్పుడు చిలగడదుంప మిశ్రమాన్ని వేసి కలపాలి ∙మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా కొబ్బరిపాలు వేయాలి ∙మధ్యలో కొబ్బరి పాలతో΄పాటు యాలకులపొడి, రోజ్‌వాటర్ వేసి కలుపుతూ మొత్తం కొబ్బరి పాలు అయిపోయేంత వరకు మగ్గనివ్వాలి ∙ దాదాపు ఇరవై నిమిషాల తరువాత ఈ మిశ్రమం దగ్గర పడుతుంది. అప్పుడు స్టవ్ ఆపేసేయాలి ∙ గోరువెచ్చగా ఉన్నప్పుడే మిశ్రమాన్ని చేతులతోగానీ, మౌల్డ్స్లోవేసి నచ్చిన ఆకారంలో వత్తుకుంటే స్వీట్ సందేష్ రెడీ. -
స్వాతంత్య్ర పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఐకానిక్ స్వీట్ ఏంటో తెలుసా!
యావత్తు దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో మునిగి తేలుతుంది. ఈ సెలవురోజును త్రివర్ణ రంగులతో కూడిని తీపి వంటకాలతో మరింత ఆనందంగా వేడుక చేసుకోండి. ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఓ ఐకానిక్ వంటకం గూర్చి తెలుసుకుందాం. దీన్ని వారణాసిలోని ఓ ప్రముఖ ఐకానిక్ షాప్ 1939లో తయారు చేసింది. ఆ షాపు వాళ్లు త్రివర్ణ రంగులతో కూడిన బర్ఫీ అనే స్వీట్‌ని దేశభక్తిని రగిల్చేందుకు తయారు చేశారు. అది బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో కీలక పాత్ర పోషించిందట. దీంతో ఈ స్వీట్ స్వాతంత్య్ర పోరాటంలో ప్రతికగా నిలిచిన ఐకానిక్ వంటకంగా పేరుతెచ్చుకుంది. ఏకంగా వంటకాలతో కూడా బ్రిటీషర్లను గడగలాడించిన ఘనత మన భారతీయులదే. స్వేచ్ఛ కోసం పరితపించిన అలానాటి త్యాగధనులను స్మరించుకుంటూ.. ఈ త్రివర్ణ బర్ఫీ స్వీట్ తయారీ ఎలాగో తెలుసుకుందామా!. తిరంగ్ బర్ఫీ తయారీ విధానం: కావల్సిన పదార్థాలు: పంచదార: వంద గ్రాములు పాలు: రెండు లీటర్లు యాలకుల పొడి - 5 గ్రా నెయ్యి - 50 గ్రా కుంకుమపువ్వు తగ్గింపు (కాషాయం రంగు కోసం) బచ్చలికూర పేస్ట్ (ఆకుపచ్చ రంగు కోసం) తయారీ విధానం: ఒక కడాయి తీసుకుని అందులో పాలు పంచాదార వేసి బాగా మరిగించాలి. సగం వరకు బాయిల్ అయ్యేలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి మిశ్రమం బాగా చిక్కబడుతుందనంగా యాలకుల పొడి వేయండి. ఆ తర్వత దించుకుని ఆ మిశ్రమాన్ని మూడు బాగాలుగా చేసుకుని ఒకదానిలో కుంకుమ పువ్వు రంగను మరొక దానిలో బచ్చలి కూర పేస్ట్‌ను వేయండి. ఇక మిగిలిన మూడో భాగం నెమ్మదిగా పరుచకుని దానిపై ఆ రెండు రంగుల భాగాలను పరుచుకోండి ఆ తర్వాత చక్కటి షేప్‌లో ముక్కలుగా కొయ్యండి. అంతే మదురమైన త్రివర్ణ బర్ఫీ రెడీ. (చదవండి: వెదురుతో వండే కూర గురించి విన్నారా? దాని టేస్టే వేరు..!) -
రంజాన్ స్పెషల్ షేర్ కుర్మా తయారీ!
-
ఈ పదార్థాలు ఉంటే చాలు.. షీర్ కుర్మా ఇంట్లో తయారు చేసుకోవచ్చు!
అమావాస్య వెళ్లిపోయింది... నెలవంక కోసం ఎదురు చూపు మొదలైంది. చంద్ర దర్శనం నేడు కావచ్చు... లేదా రేపు కావచ్చు. ‘ఈద్ ఉల్ ఫిత్ర్’ వేడుకకు ఇంటిని సిద్ధం చేద్దాం. పాకిస్థానీ షీర్ కుర్మా కావలసినవి: ►సన్న సేమ్యా – పావుకేజీ ►వెన్న తీయని పాలు – లీటరు ►చక్కెర – పావుకేజీ ►నెయ్యి – కప్పు ►జీడిపప్పు – అర కప్పు ►బాదం – అర కప్పు ►పిస్తా – పావు కప్పు ►గులాబీ రెక్కలు– గుప్పెడు ►యాలకులు – పది. తయారీ: ►ఏ జీడిపప్పు, బాదం, పిస్తాలను తరగాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి వీటన్నింటినీ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ►వేగిన తర్వాత గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ►మిగిలిన నెయ్యిలో సేమ్యా వేసి వేగిన తరవాత పాలు పోసి కలుపుతూ మరిగించాలి. ►యాలకులను నలగ్గొట్టి పాలలో వేయాలి. పదిహేను నిమిషాల పాటు మరిగిన తర్వాత చక్కెర వేసి అడుగు పట్టకుండా గరిటతో కలుపుతూ మరిగించాలి. ►ఖీర్ చిక్కబడిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గింజలను, పూలరెక్కలను వేసి కలిపి దించేయాలి. -
NMACC పార్టీలో టిష్యూ పేపర్ బదులుగా, రూ.500 నోటా? నిజమా?
సాక్షి, ముంబై: బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ‘నీతా ముఖేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC)’ ప్రారంభం వేడుకల్లో మరో విషయం ఆసక్తికరంగా మారింది. టిష్యూ పేపర్లలా రూ. 500నోట్లను ఉంచారన్న వార్త ఇంటర్నెట్లో తెగ వైరల్ అయింది. (NMACC: డాన్స్‌తో ఇరగదీసిన షారూక్, గౌరీ, ఇక ప్రియాంక చోప్రా డాన్స్‌కైతే ) బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు, ఇతర ప్రముఖులు సందడి చేసిన అంబానీల గ్రాండ్ పార్టీపై ఒక ట్విటర్ యూజర్ ఒక పోస్ట్ పెట్టారు. అంబానీ జీ కే పార్టీ మే టిష్యూ పేపర్ కీ జగహ్ 500 కే నోట్స్ హోతే హై (sic)’’ అని ట్వీట్ చేశాడు. దీంతో రుచి కరమైన వంటకాలతో పాటు కరెన్సీ నోట్లు వడ్డించారా అంటూ నెటిజన్ల కామెంట్లు వైరలయ్యాయి. (అమ్మ విషయంలో అది చాలా బాధగా ఉంటుంది: ఇన్ఫీ నారాయణమూర్తి ) నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ లాంచింగ్ సందర్భంగా వడ్డించిన తీపి పదార్థంపైనే ఈ చర్చ అన్నమాట. అతిథులకు వడ్డింయిన ఖరీదైన వంటకాలకు తోడు, ఈ స్వీటు, కరెన్సీ నోట్లతోపాటు ఉండటంతో ఈ ప్రత్యేక స్వీట్ ఫొటో హాట్ టాపిక్‌గా నిలిచింది. మీమ్స్‌తో నెటిజన్లు సందడి చేశారు. Ambani ji ke party mein tissue paper ki jagah 500 ke notes hote hain 😭 pic.twitter.com/3Zw7sKYOvC — R A T N I S H (@LoyalSachinFan) April 2, 2023 అయితే అసలు విషయం ఏమిటంటే.. ఈ స్వీట్ పేరు ‘దౌలత్ కి చాట్’ (daulat ki chaat) ఉత్తర భారతదేశంలో చాలా ఇష్టపడే వంటకం. ప్రత్యేకంగా శీతాకాలంలో ఎక్కువ సేవిస్తారట. బాగా మరిగించిన పాలను చల్లబరిచిన తర్వాత తయారు చేస్తారు. పిస్తా, కోవా,బాదం,చక్కెర తదితర రిచ్ ఇంగ్రీడియెంట్స్‌తో గార్నిష్ చేస్తారంటూ ఫుడ్ ఎక్స్పర్ట్స్, కొంతమంది నెటిజన్లు స్పందించారు. ఈ స్వీట్ ఢిల్లీలో కూడా చాలా పాపులర్ అని ఒకరు. ఇది చాలా రెస్టారెంట్లలో ఇది దొరుకుతుందని మరికొంతమంది వ్యాఖ్యానించారు. ఈ ఫుడ్ ఐటమ్ చుట్టూ పెట్టిన కరెన్సీ నోట్లు కూడా నకిలీవే అంటూ మరొకరు రిప్లై ఇచ్చారు. దీంతో అంబానీ పార్టీలో కరెన్సీ నోట్ల వడ్డన అనే ఊహాగానాలకు చెక్ పడింది. కాగా శుక్రవారం సాయంత్రం మొదలైన ఈ గ్రాండ్ ఈవెంట్ ఉత్సవాలు మూడురోజుల పాటుసాగాయి. నీతా అంబానీ స్వయంగా ప్రదర్శించిన నృత్యప్రదర్శనతోపాటు, బాలీవుడ్, హాలీవుడ్ తారల డ్యాన్స్‌లు, షారూక్, గౌరీ డాన్స్, ప్రియాంక చోప్రా, రణవీర్ స్టెప్పులు, టాలీవుడ్ ఆస్కార్ విన్నర్ సాంగ్ నాటునాటు పాటకు రష్మిక, అలియా నృత్యం, అలాగే శనివారం జరిగిన ఈవెంట్లో ఆస్కార్ విజేత ముంబైకి వచ్చి పింక్ కార్పెట్‌పై అలరించిన సంగతి తెలిసిందే. @Ruhaani77 pic.twitter.com/At1f4ZXr5Z — garima (@badanpesitaree) April 2, 2023 -
Sweet Recipe: మూడు రోజుల వరకు తాజాగా ఉండేలా ఫిర్ని తయారీ ఇలా!
ఈ హోలీ రోజు ఇంట్లో వాళ్లకు ఇలా ఫిర్ని చేసిపెట్టండి! ఫిర్ని తయారీకి కావలసినవి: ►బియ్యం – పావు కప్పు ►వెన్న తీయని పాలు – లీటరు ►చక్కెర – అర కప్పు ►బాదం పప్పు – 10 ►పిస్తా – 10 ►యాలకుల పొడి – అర టీ స్పూన్ ►కుంకుమ పువ్వు – 15 రేకలు ►పన్నీరు – 2 టీ స్పూన్లు (ఇష్టమైతేనే) ►కిస్మిస్: 20 ►జీడిపప్పు: 10. తయారీ: ►బియ్యం కడిగి దళసరి బట్ట మీద వేసి నీడలో ఆరబెట్టి, తేమ పోయిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేయాలి (మరీ మెత్తగా అక్కరలేదు). ►ఈ లోపు ఒక చిన్న పాత్రలో నీటిని వేడి చేసి అందులో బాదం, పిస్తా వేసి మూత పెట్టాలి. ►అరగంట తర్వాత నీటిని వడపోసి పొట్టు వలిచి, సన్నగా తరగాలి. ►వెడల్పుగా, మందంగా ఉన్న పాత్రలో పాలు మరిగించాలి. ►ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక గరిటెడు పాలను చిన్న పాత్రలోకి తీసుకుని కుంకుమ పువ్వు రేకలు వేసి నానబెట్టాలి. ►పాత్రలో పాలను మరో రెండు నిమిషాల సేపు మరిగించిన తర్వాత మంట తగ్గించి బియ్యప్పిండి, చక్కెర వేసి అడుగు పట్టకుండా, ఉండకట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి. ►చిక్కబడుతున్నప్పుడు యాలకుల పొడి వేయాలి. ►మిశ్రమం చిక్కబడిన తర్వాత కుంకుమపువ్వు కలిపిన పాలు, బాదం, పిస్తా సగం వేసి కలపాలి. ►ఇవన్నీ వేసిన తర్వాత మరో రెండు లేదా మూడు నిమిషాల సేపు మరగనిచ్చి పన్నీరు వేసి కలిపి స్టవ్ ఆపేయాలి. ఫిర్నీ రెడీ. ఈ ఫిర్నీని కప్పులో పోసిన తర్వాత మిగిలిన బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్తో అలంకరించాలి. ఈ ఫిర్నీని గోరువెచ్చగా తినవచ్చు లేదా చల్లబరిచి తినవచ్చు. ఫ్రిజ్‌లో రెండు– మూడు రోజులు తాజాగా ఉంటుంది. ఇవి కూడా ట్రై చేయండి: రస్మలై ఇష్టమా! ఈ పదార్థాలు ఉంటే చాలు ఇంట్లోనే ఇలా ఈజీగా.. హోలీకి రైస్ ఖీర్ తయారు చేసుకోండిలా! -
Recipe: శనగపప్పుతో రుచికరమైన పాయసం.. తయారీ ఇలా
ఎంత ఈజీ అయితే మాత్రం... ఎప్పుడూ సేమ్యా పాయసమేనా? ఈసారి... పండుగకు శనగపప్పు పాయసం చేద్దాం. శనగపప్పు పాయసం తయారీకి కావలసినవి: ►పచ్చి శనగపప్పు – 200 గ్రా ►కొబ్బరి పాలు లేదా గేదెపాలు– 100 మి. లీ ►బెల్లం తురుము – 150 గ్రా; ►నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు ►జీడిపప్పు – 20 ►కిస్మిస్ – టేబుల్ స్పూన్ ►ఏలకుల పొడి – అర టీ స్పూన్. తయారీ: ►శనగపప్పును కడిగి పది నిమిషాలు నానబెట్టిన తర్వాత రెండింతలు నీటిని పోసి ప్రెషర్ కుక్కర్లో నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ►పాలను మరిగించి పక్కన ఉంచాలి. ►కుక్కర్ వేడి తగ్గిన తర్వాత శనగపప్పును ఒక మోస్తరుగా మెదపాలి (మరీ మెత్తగా చేయరాదు). ►వెడల్పాటి బాణలి పెట్టి అందులో మెదిపిన శనగపప్పు వేసి పాలు పోసి కలుపుతూ మరిగించాలి. ►మిశ్రమంలో బుడగలు వచ్చేటప్పుడు బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి సన్న మంట మీద (పెద్ద మంట చేస్తే పాయసం అడుగు పడుతుంది) కలుపుతూ ఉడికించాలి. మరొక స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించాలి. ►వీటిని ఉడుకుతున్న పాయసంలో వేసి కలిపి దించేయాలి. గమనిక: వీగన్ డైట్‌ను అనుసరించేవాళ్లు యానిమల్ మిల్క్‌కి చదువుగా కొబ్బరిపాలతో, నెయ్యికి బదులుగా వంట కొబ్బరి నూనెతో చేసుకోవచ్చు. ఇవి కూడా ట్రై చేయండి: Capsicum Bajji Recipe: రుచికరమైన క్యాప్సికమ్ బజ్జీ తయారీ ఇలా.. Sankranti- Recipes: అరిశెలు మెత్తగా రావాలంటే ఇలా చేయండి! ఇక పూతరేకులు.. -
Recipe: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి
శీతాకాలం పగలు తక్కువ.. రాత్రి ఎక్కువ. రాత్రి వేళల్లో చలి ఎక్కువ. భోజనం బరువుగా ఉండకూడదు. అలాగని తక్కువ తింటే పోషకాలందవు. కొద్దిగా తిన్నా సరే... అది సమతులంగా ఉండాలి. ఆహారాన్ని దేహం వెచ్చగా ఒంటబట్టించుకోవాలి. అందుకే... ఇది ట్రై చేసి చూడండి. పాంజిరి కావలసినవి: ►సన్నగా తరిగిన బాదం – కప్పు ►యాలకుల పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు ►దోస గింజలు – పావు కప్పు ►తర్బూజ గింజలు – పావు కప్పు ►పిస్తా పప్పు – పావు కప్పు (తరగాలి) ►వాము – అర టీ స్పూన్ ►ఎండు కొబ్బరి తురుము – కప్పు ►అల్లం తరుగు లేదా శొంఠి పొడి– 2 టేబుల్ స్పూన్లు ►జీడిపప్పు– కప్పు (చిన్న పలుకులు) ►తామరగింజలు – కప్పు ►వాల్నట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు ►కిస్మిస్ – 3 టేబుల్ స్పూన్లు ►నెయ్యి– 3 టేబుల్ స్పూన్లు. ప్రధానమైన పదార్థాలు: ►సూజీ రవ్వ – కప్పు ►నెయ్యి – ఒకటిన్నర కప్పు ►గోధుమ పిండి – రెండున్నర కప్పులు ►బెల్లం పొడి – ఒకటిన్నర కప్పు. తయారీ: ►మందంగా ఉన్న బాణలిలో నెయ్యి వేడి చేసి తామర గింజలు (మఖానియా) వేయించాలి. ►వాటిని తీసి పక్కన పెట్టుకుని అదే బాణలిలో జీడిపప్పు, వాల్నట్, బాదం, తర్బూజ, దోసగింజలు, పిస్తా, కొబ్బరి తురుము, కిస్మిస్ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ►ఇందులో అల్లం తరుగు లేదా శొంఠి, వాము, యాలకుల పొడి కలిపి పక్కన ఉంచాలి. ►ఇప్పుడు ప్రధాన దినుసులను వేయించాలి. ►మరొక బాణలిలో నెయ్యి వేడి చేసి గోధుమ పిండి వేసి సన్నమంట మీద వేయించాలి. ►గోధుమ పిండి వేగి మంచి వాసన వస్తున్న సమయంలో సూజీ రవ్వ వేసి కలుపుతూ వేయించాలి. ►రవ్వ కూడా దోరగా వేగిన తర్వాత బెల్లం పొడి వేసి కలపాలి. ►ఇందులో ముందుగా వేయించి సిద్ధంగా ఉంచిన గింజల మిశ్రమాన్ని వేసి కలిపితే పాంజిరి రెడీ. ►దీనిని కప్పులో వేసుకుని పొడిగా స్పూన్‌తో తినవచ్చు. పాలిచ్చే తల్లులకు ప్రయోజనకరం ►పిల్లలు కింద పోసుకోకుండా మొత్తం తినాలంటే మరికొంత నెయ్యి వేసుకుని లడ్డు చేయాలి. ►ఇది ఉత్తరభారతదేశంలో బాలింతకు తప్పనిసరిగా పెట్టే స్వీట్. ►పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం. చదవండి: Kismis Doughnuts: మైదాపిండి, పంచదార.. కిస్మిస్ డోనట్స్ తయారు చేసుకోండిలా! Amla Candy: ఆరోగ్య లాభాలెన్నో.. ఇంట్లోనే ఇలా ఆమ్ల క్యాండీ తయారీ Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ ఇలా -
Guvvalacheruvu Palakova: గువ్వలచెరువు పాలకోవా అంటే ఫేమస్!
సాక్షి రాయచోటి: గువ్వలచెరువు పాలకోవా.. నోటి తీపికే కాదు.. ఊరూరా గుర్తింపు పొందింది. రాష్ట్రాలే కాదు.. ఖండాతరాలు దాటి వెళుతోంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని అనేక మంది ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. అక్కడ కూడా గువ్వలచెరువు పాలకోవాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వందల ఏళ్ల కాలం నుంచి ఇక్కడివారు పాలకోవా తయారు చేస్తూ రుచిలో శుచిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గువ్వల చెరువు మెయిన్‌రోడ్డు మీద ఉండే 60 షాపులే కాకుండా గ్రామంలో పాలకోవాను తయారు చేసే బట్టీలు 15 వరకు ఉన్నాయి. కోవా అనగానే గువ్వలచెరువు నుంచి తెచ్చారా? అనడం చూస్తే ఆ కోవాకు ఎంతటి గుర్తింపు ఉందో అర్థమవుతుంది. ప్రతిరోజు ఐదు వేల లీటర్ల వరకు పాలు వస్తుండగా... 2000 కిలోల వరకు పాలకోవాను తయారు చేసి విక్రయిస్తుంటారు. గువ్వల చెరువు గ్రామంలో సుమారు 1500 మంది జనాభా ఉంది. అధికభాగం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారితోపాటు నాయుళ్లు, వడ్డెర, గిరిజన కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. గ్రామంలో తరతరాల నుంచి అంటే దాదాపు వందేళ్లకు పైగా కోవా తయారు చేస్తూ వస్తున్నారు. ప్రతినిత్యం 100 కుటుంబాల వారు కోవా తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గువ్వలచెరువు పాలకోవా అంటే ఫేమస్ కావడంతో జీవనోపాధిని వదులుకోలేక కొనసాగిస్తున్నారు. తయారు చేసే సమయంలో కూడా అనేక రకాల కష్టాలు ఉన్నాయి. గోలాల్లో పాలు పోసి ఐదు గంటలపాటు వేడి చేసే సమయంలో విపరీలమైన వేడి పొగతో కళ్లు ఎర్రబారడం, నీళ్లు కారడం, మంటకు గురికావడం జరుగుతుంది. కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపైన గ్రామం ఉండడంతో నిత్యం వేలాది వాహనాలు గువ్వల చెరువు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి సమయంలో పదుల సంఖ్యలో లారీలో ఆగి ఉంటాయి. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, మహరాష్ట్ర, పంజాబ్, కేరళ తదితర ప్రాంతాలకు వెళ్లే లారీల వారు పాలకోవాను ఆర్డర్లపై తీసుకెళుతుంటారు. అంతేకాకుండా కువైట్, సౌదీ అరేబియా, మస్కట్, ఖత్తర్, దుబాయ్, బెహరీన్ తదితర దేశాలకు కూడా బంధువులు, స్నేహితుల ద్వారా పాల కోవాను ప్యాకింగ్ చేసి పంపిస్తుంటారు. పాలకోవా సుదీర్ఘకాలంపాటు నిల్వ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతర దేశానికి తరలిస్తుంటారు. దీని తయారీకి అవసరమైన పాలను తయారీదారులు ప్రత్యేకంగా ఆటోల ద్వారా పీలేరు, రాయచోటి, మదనపల్లె తదితర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. పాలకోవాను గ్రామంలో బట్టీల వద్ద తయారు చేసిన అనంతరం పెద్దపెద్ద పాత్రలలో రోడ్డుపై ఉన్న షాపులకు సరఫరా చేస్తున్నారు. గువ్వలచెరువు పాలకోవా రుచికరంగా మంచి గుర్తింపు ఉండడంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకెళుతుంటారు. అంతేకాకుండా ప్రతిరోజు 15 ఆటోల ద్వారా వివిధ జిల్లాలకు కూడా తీసుకెళ్లి విక్రయాలు సాగిస్తున్నారు. గతంలో ఈ మార్గంలో వెళుతున్న జాతీయ నేతలైన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతోపాటు ఆయన కుమార్తె ఇందిరాగాంధీ సైతం గువ్వుల చెరువు పాలకోవా రుచిచూసి మెచ్చుకున్నట్లు పలువురు గ్రామస్తులు తెలియజేశారు. తయారీ విధానం పాలకోవాను తయారీదారులు ముందుగా పాలను తీసుకొచ్చి పెద్ద గోలాల్లో వేసిసుమారు ఐదు గంటలపాటు మరగబెడతారు. ఒకవైపు గరిటెతో కలియబెడుతూ చిక్కదనం కోసం పొంగు రాకుండా చూసుకుంటారు. పాలు బాగా మరిగిన తర్వాత చక్కెర, ఇతర పదార్థాలు వేసి మరో అరగంట నుంచి గంటపాటు వేడి చేస్తారు. తద్వారా పాలకోవా రూపుదిద్దుకుంటుంది. అవసరమైన కట్టెలనుకూడా సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి తీసుకొస్తారు. గోలంలో పాలు ఉడికిస్తున్న ఇతని పేరు షేక్ జమాల్‌వలి. గువ్వలచెరువు గ్రామం. ఎన్నో ఏళ్ల నుంచి పాలకోవా తయారు చేస్తున్నారు. ఆర్డర్లను బట్టి పాలను ప్రత్యేకంగా ఆటోలో క్యాన్ల ద్వారా పీలేరు, మదనపల్లె, రాయచోటిలకు వెళ్లి తెచ్చుకుంటారు. ఈ ప్రాంతానికి చెందిన వారు అధికంగా ఇతర దేశాల్లో చాలా మంది ఉండడంతో అక్కడకి తీసుకెళ్లేందుకు ఆర్డర్లు ఇస్తుంటారు. ఇతర రాష్ట్రాలకు, ప్రొద్దుటూరు, కడప, మదనపల్లె, రాజంపేట, రాయచోటితోపాటు వివిధ ప్రాంతాల్లోని బేకరీలకు కూడా గువ్వలచెరువు నుంచే పాలకోవాను పంపిస్తుంటారు. (క్లిక్: వెయ్యేళ్ల చరిత్రకు పూర్వ వైభవం.. నాడు రాజుల నేతృత్వంలో.. నేడు సీఎం హోదాలో!) కల్తీ లేని కోవా కల్తీ లేకుండా నాణ్యమైన పాలకోవా అందిస్తాం. ఇక్కడి పాలకోవా మంచి రుచికరంగా ఉంటుంది. గ్రామంలో తయారు చేసి దుకాణాలకు ఆర్డర్లపై అందజేస్తారు. సుమారు 100 కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి సరుకు తీసుకెళుతుంటారు. – అబ్దుల్ మతిన్, పాలకోవా వ్యాపారి, గువ్వలచెరువు వ్యాపారం బాగుంది పాలకోవాను నమ్ముకుని వ్యాపారం చేస్తున్నాం. ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు ఇక్కడ ఆగుతాయి. కార్లలో ప్రత్యేకంగా వచ్చి కోవాను తీసుకెళుతుంటారు. ఇతర రాష్ట్రాలకు చెందిన లారీల డ్రైవర్లు, క్లీనర్లు కూడా తీసుకెళతారు. ప్రతిరోజు మా షాపులో రూ. 4 వేల వరకు వ్యాపారం జరుగుతుంది. పదిహేనేళ్ల నుంచి ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాం. – పఠాన్ అజీజ్‌ఖాన్, పాలకోవా వ్యాపారి, గువ్వలచెరువు -
Recipe: కోవా... పంచదార.. పచ్చి కొబ్బరి.. నోరూరించే స్వీట్!
ఉత్తరాఖండ్ స్పెషల్ స్వీట్ సింగోడి ఇలా ఇంట్లో సులువైన పద్ధతిలో తయారు చేసుకోండి. సింగోడి తయారీకి కావలసినవి ►కోవా – అరకేజీ ►పంచదార – అరకేజీ ►పచ్చికొబ్బరి తురుము – పావుకేజీ ►మోలు ఆకులు – ఇరవై(కోన్ ఆకారంలో మడుచుకోవాలి) ►గులాబీ రేకులు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానం... ►కోవాను మెత్తగా చిదుముకోవాలి. ►దీనిలో పంచదార వేసి సన్నని మంట మీద పదినిమిషాలపాటు వేడిచేయాలి. ►పంచదార కరిగిన తరువాత కొబ్బరి తురుము వేసి మరో పదిహేను నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి ►కోవా మిశ్రమం గోరువెచ్చగా మారాక చిన్నచిన్న ఉండలుగా చుట్టాలి. ►ఈ ఉండలను కోన్ ఆకారంలో ఉన్న మోలు ఆకుల్లోపెట్టాలి. ►గులాబి రేకులతో గార్నిష్ చేసి సర్వ్‌చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Pahadi Raita Recipe: పెరుగు, కీరా.. ఫహాడీ రైతా.. అరగంట ఫ్రిజ్‌లో సర్వ్ చేసుకుంటే! Recipe: ఉత్తరాఖండ్ వంటకం ఆలుకీ గుట్కే తయారీ ఇలా! -
తుని.. మూడు తరాలుగా మామిడికి ప్రసిద్ధి
సాక్షి, తుని: తింటే గారెలే తినాలి అంటారు కానీ.. ఆ కోవలో తుని మామిడి పండ్లు వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేని రుచి తుని ప్రాంతంలో పండే మామిడి పండ్లకు ఉంది. 1947కు ముందు నుంచీ మామిడికి తుని ప్రసిద్ధి. తుని పట్టణానికి ఏకంగా “మ్యాంగో సిటీ’ అనే పేరు కూడా ఉంది. తుని డిపో ఆర్టీసీ బస్సులపై ఈ డిపో పేరు రాసినప్పుడు పక్కనే మామిడికాయల బొమ్మలు కూడా ఉండేవంటే.. ఇక్కడి మామిడి ఎంత ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల తునిలో ప్రారంభమైన ఓ జ్యూయలరీ సంస్థ సైతం “మ్యాంగో సిటీ’గా ప్రచారం చేసుకోవడం విశేషం. ఇక్కడి రైతులు మూడు తరాలుగా ఇతర రాష్ట్రాలకు మామిడి పండ్లు ఎగుమతి చేస్తున్నారు. ఉద్యాన శాఖ ద్వారా రెండేళ్లుగా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 15,362 హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. తుని సబ్ డివిజన్లో మామిడి విస్తీర్ణం 1,700 హెక్టార్లుగా ఉంది. ఇక్కడ పండే బంగినపల్లి, చెరకు రసాలు, తోతాపురి, సువర్ణరేఖ, పంచదార కల్తీ, కొత్తపల్లి కొబ్బరి, పండూరి మామిడి పండ్లకు ఎంతో డిమాండ్. ఏటా తుని ప్రాంతం నుంచి 60 వేల టన్నుల పండ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం తుని కేంద్రంగా ఏటా రూ.20 కోట్ల మేర మామిడి వ్యాపారం జరుగుతోంది. రవాణా సౌకర్యాలు అంతగా అందుబాటులో లేని సమయంలో ఇక్కడి రైతులు, వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు రైళ్ల ద్వారా మామిడి ఎగుమతులు చేసేవారు. క్రమేపీ లారీ రవాణా అందుబాటులోకి రావడంతో ఉత్తరాది రాష్ట్రాలకు భారీ స్థాయిలో ఎగుమతులు చేస్తూ ఇక్కడి వ్యాపారులు ఆదాయం పెంచుకుంటున్నారు. ఇక ఉద్యాన శాఖ విదేశాలకు ఎగుమతి చేయడానికి 3,500 మంది రైతులతో ఒప్పందం చేసుకుంది. మూడు తరాలుగా ఎగుమతులు మా తాత, నాన్న పప్పు సూర్యారావు నుంచి 80 ఏళ్లుగా మామిడి ఎగుమతులు చేస్తున్నాం. రైతుల నుంచి తోటలు కొని పక్వానికి వచ్చిన పండ్లను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం. తొలి రోజుల్లో వెదురు బుట్టల్లో ప్యాకింగ్ చేసి రైళ్లలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశాం. గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో తుని మామిడికి ఎంతో డిమాండ్ ఉంది. వేసవి సీజన్లో ఎన్ని పనులున్నా మామిడి ఎగుమతులు ఆపలేదు. ఉద్యాన అధికారులు సహకరించడంతో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా కలిగింది. – పప్పు వెంకట రమణ, వ్యాపారి, వెంకటాపురం నేల స్వభావంతో మంచి రుచి తుని ప్రాంతంలో ఇసుక, గరప (గ్రావెల్) నేలలు కావడంతో ఇక్కడి మామిడి పండు రంగు ఎంతో బాగుంటుంది. రుచి కూడా చాలా మధురంగా ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు తుని మామిడి పండ్లు రుచి చూడాలని ప్రతి ఒక్కరూ పరితపిస్తారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడంతో మంచి రంగు ఉంటుంది. ప్రస్తుతం మేలు రకం పండ్ల ధర టన్నుకు రూ.75 వేలు పలుకుతోంది. విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశాం. – విజయలక్ష్మి, ఉద్యాన అధికారి, తుని -
Recipe: నోరూరించే అటుకుల కేసరి.. ఇంట్లో ఇలా సులువుగా..
Poha Kesari Recipe: రవ్వ కేసరి బోర్ కొడితే ఇలా అటుకుల కేసరి ట్రై చేయండి. ఘుమఘుమలాడే సువాసనను ఆస్వాదిస్తూ ఈ మిఠాయిని హాయిగా ఆరగించండి. అటుకుల కేసరి తయారీకి కావలసినవి: ►అటుకులు – 1 కప్పు (పాత్రలో దోరగా వేయించి ఫ్రై చేసుకోవాలి) ►నెయ్యి – 7 టేబుల్ స్పూన్లు ►జీడిపప్పు, కిస్మిస్ – కొన్ని (నేతిలో దోరగా వేయించి పెట్టుకోవాలి) ►నీళ్లు – 1 కప్పు ►చిక్కటి పాలు – 2 కప్పులు ►పంచదార – ముప్పావు కప్పు ►ఏలకుల పొడి – కొద్దిగా ►ఫుడ్ కలర్ – ఆరెంజ్ కలర్ అటుకుల కేసరి తయారీ విధానం: ►ముందుగా చిన్న మంట మీద పెట్టుకుని, కళాయిలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ►నెయ్యి కరిగిన తర్వాత, అటుకుల పొడి వేసుకుని.. గరిటెతో తిప్పుతూ ఉండాలి. ►అనంతరం నీళ్లు పోసుకుని దగ్గర పడే వరకూ తిప్పాలి. ►1 టేబుల్ స్పూన్ నెయ్యి, చిక్కటి పాలు వేసుకుని మళ్లీ తిప్పుతూ ఉండాలి. ►దగ్గర పడేలోపు మిగిలిన నెయ్యి, ఫుడ్ కలర్ వేసుకుని కలపాలి. ►చివరిగా ఏలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ►చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చదవండి👉🏾Egg Chapati Recipe In Telugu: ఘుమఘుమలాడే ఎగ్ చపాతీ తయారీ ఇలా! చదవండి👉🏾Recipes: తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. సింపుల్‌గా ఇలా ఆవకాయ పెట్టేయండి! -
రంగుల కేళీ హోలీ రోజున ఈ స్వీట్ రుచి చూడాల్సిందే..
రంగులు మనసులను ఉల్లాసపరిస్తే.. తియ్యని రుచులు మదిని ఆనందంతో నింపేస్తాయి. వర్ణాలన్నీ ఏకమయ్యే శుభ సమయాన అందరి నోళ్లను ఊరించే ఘుమఘుమలు పండగ వేడుకకు మరిన్ని వన్నెలద్దుతాయి. గుజియా కావల్సినవి: మైదా – 3 కప్పులు; నెయ్యి – ఒకటిన్నర కప్పు; నీళ్లు – పావు కప్పు; ఫిల్లింగ్‌కి.. పంచదార – కప్పు; కోవా – 200 గ్రాములు; బాదాములు – 5 (సన్నగా తరగి, నీళ్లలో నానబెట్టాలి); బొంబాయిరవ్వ – అర కప్పు; యాలకుల పొడి – అర టీ స్పూన్; తయారీ: ► పిండిలో తగినన్ని నీళ్లు పోసి, కలిపి, చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పిండి మెత్తగా కావడానికి ఒక తడి క్లాత్ కప్పి, పక్కనుంచాలి. ►స్టౌ పై పాన్ పెట్టి, కోవా, రవ్వ. బంగారు రంగు వచ్చేవరకు వేయించి, పంచదారకలిపి, మంట తీసేసి, చల్లారనివ్వాలి. ∙చల్లారిన కోవా మిశ్రమంలో ఏలకుల పొడి, బాదాంపప్పు తరుగు వేసి బాగా కలపాలి. ►కొద్దిగా నెయ్యిని వేళ్లతో అద్దుకొని, అరచేతిపైన రాసి, చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ఉండలుగా చేసి, అదిమి పక్కనుంచాలి. ►పిండిని మృదువుగా కలిపి, చిన్న చిన్న ఉండలు చేసి, పూరీలా వత్తాలి. ►∙గుజియా అచ్చుపైన పూరీ వేసి, మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి, అదిమి, చుట్టూతా నమూనా ప్రకారం రోల్ చేయాలి. ఇదే విధంగా అన్నీ తయారుచేసుకోవాలి. ►స్టౌ పైన బాణలి పెట్టి, నెయ్యి పోసి వేడిచేయాలి. నెయ్యి కాగుతున్నప్పుడు సిద్ధం చేసుకున్న గుజియాలను వేసి, రెండు వైపులా వేయించి, తీయాలి. ►ఇలా తయారుచేసుకున్న గుజియాలను ప్లేట్లో పెట్టి, తరిగిన బాదంపప్పును అలంకరించి, సర్వ్ చేయాలి. Kova Banana Halwa: నోరూరించే కోవా బనానా హల్వా తయారీ ఇలా! -
Pala Peni: ఆహా! ఆ రుచే వేరు
ఆహార ప్రియులు ఇష్టపడే సరికొత్త రుచి ఇది. ఈ పేరు చెబితే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, గోవా, ఒడిశా ప్రాంతాలకు చెందిన వారితో పాటు ఉత్తర భారతీయుల నోరూరుతుంది. మైదా, నెయ్యి లేదా డాల్డాతో తయారు చేసే ఈ పదార్థాన్ని పాలలో ముంచి తింటే ఆహా! ఆ రుచే వేరు. సామాన్యుడికి సైతం అందుబాటు ధరతో లభించే ఈ స్వీట్ తయారీకి గుంతకల్లు కేంద్రంగా మారింది. దేశవ్యాప్తంగా పేరు గాంచిన ప్రముఖ స్వీట్స్ విక్రయదారులు సైతం వీటిని తమ దుకాణాల్లో ఆకర్షణీయంగా ప్రదర్శించి విక్రయాలు సాగిస్తుండడం గమనార్హం. ఇంతకూ ఆ స్వీట్ ఏమిటో తెలుసుకోవాలని ఆత్రుత ఉంది కదూ? అయితే వెంటనే గుంతకల్లుకు వెళదాం రండి... గుంతకల్లు టౌన్(అనంతపురం జిల్లా): గుంతకల్లు రైల్వే స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్న మోదీనాబాద్ హంపయ్య కాలనీకి చేరుకోగానే పాలపేనీ తయారీలో నిమగ్నమైన కుటుంబాలు కనిపిస్తాయి. కాలనీలోని పలు కుటుంబాల వారు కుటీర పరిశ్రమను తలపించేలా పాలపేనీని తయారు చేస్తుంటారు. ఈ తయారీపై ఆధారపడి ప్రత్యక్షంగా సుమారు 150 కుటుంబాలు.. పరోక్షంగా వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఒక్కో తయారీ కేంద్రంలో రోజూ 10 మందికి తగ్గకుండా ఉపాధి పొందుతుంటారు. పేనీల తయారీలో ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చినా... గుంతకల్లు వాసులు చేతితో తయారు చేసిన పేనీల రుచి అమోఘమని ఆహారప్రియులు కొనియాడుతుంటారు. చేతితో పేనీలు చేస్తున్న గౌసియా నైపుణ్యం తప్పనిసరి.. సన్నటి దారపు పోగులను తలపించేలా కనిపించే పాల పేనీ తయారీ ఎంతో కళాత్మకంగా ఉంటుంది. ఇందుకు ఎంతో నైపుణ్యం అవసరం. ఉదయాన్నే స్వచ్ఛమైన మైదా పిండిని నీళ్లలో కొన్ని గంటల పాటు నానబెట్టి తర్వాత చేతితోనే గట్టిగా పిసికి ముద్దలుగా చేసుకుంటారు. వీటికి నెయ్యి లేదా డాల్డా పట్టిస్తూ రోల్ చేస్తూ నాలుగైదు పొరలుగా చేస్తారు. తర్వాత చేతి వేళ్లతో ఆడించి దారం మందంలో సేమియా (పేనీ) చుట్టలుగా మారుస్తారు. ఇలా మార్చిన పేనీలను నెయ్యి లేదా డాల్డాలో దోరగా వేయించి వెలికి తీస్తారు. గుంతకల్లు కేంద్రంగా రోజూ 2వేల కిలోల పాలపేనీ తయారవుతూ ఉంటుంది. చాలా మంది జిల్లాతో పాటు పొరుగునే ఉన్న కర్నూలు జిల్లా వీధి వ్యాపారులు, స్వీట్ స్టాల్ నిర్వాహకులు వీటిని కిలో రూ.120 చొప్పున (డాల్డాతో చేసినవి) కొనుగోలు చేసి, వారివారి ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. చాలా మంది గంపల్లో తీసుకెళ్లి రైళ్లలో ప్రయాణికులకు విక్రయించి జీవనం సాగిస్తున్నారు. పేనీలకు పాలు, చక్కెర కలిపి ఆరగిస్తే ఆ రుచిని ఎన్నటికీ మరువలేమని ఆహార ప్రియులు పేర్కొంటున్నారు. -
పంచదార చిలుకలు.. తియ్యటి వేడుక చేసుకుందాం..
కశింకోట (అనకాపల్లి)/విశాఖ జిల్లా: పంచదార చిలుకలు తీపిని పంచుతాయి. పిల్లలు మొదలుకొని పెద్దలను సైతం ఆకర్షిస్తాయి. ఆత్మీయత, అభిమానాన్ని పంచుతాయి. పంచదార చిలుకలు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి ఉత్సవాలు, తీర్థాలు జరగవనే చెప్పాలి. కొందరు వివాహాలు, ఉపనయనాలలో కూడా వీటిని సంప్రదాయంగా సారె గాను, బంధువర్గానికి పంపిణీకి వినియోగిస్తారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన పంచదార చిలుకల తయారీకి మండల కేంద్రం కశింకోట ప్రసిద్ధి. ఇక్కడి వడ్డి వీధిలో ఏళ్ల తరబడి పంచదార చిలుకల తయారీయే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. వందేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చిన వడ్డెర కులానికి చెందిన సుమారు 20 కుటుంబాలు పంచదార చిలుకలను తయారు చేసి జీవనం సాగించేవారు. అయితే ఆధునికంగా రంగుల స్వీట్లు ప్రవేశించడంతో వీటికి క్రమేపి ఆదరణ తగ్గింది. దీంతో కొంతమంది పత్యామ్నాయ పనులకు వెళ్లిపోయారు. ప్రస్తుతం నాలుగు కుటుంబాల వారు మాత్రమే వీటిని తయారు చేస్తున్నారు. తమ తాతల కాలం నుంచి కొనసాగిస్తున్న వృత్తిని మానుకోలేక, మరో పని చేతకాక ఇదే వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నామని తయారీదారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని బుచ్చియ్యపేట మండలం వడ్డాది, యలమంచిలి మండలం కొప్పాక, పాయకరావుపేట, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో కూడా వీటిని తయారు చేస్తారు. ప్రధానంగా సంక్రాంతి, ఉగాది ఉత్సవాలు, తీర్థాల్లో వీటికి గిరాకీ ఉంటుంది. దీంతో ఉత్సవాలకు ముందు వీటిని తయారు చేసి సిద్ధం చేసుకుంటారు. సంక్రాంతి, ఆ తర్వాత జిల్లాలో జరిగే తీర్థాలు, ఉత్సవాలకు తీసుకెళ్లి విక్రయిస్తారు. పంచదార చిలుకలను ఆకర్షణకు వివిధ రకాలుగా తయారు చేస్తారు. తాజ్‌మహాల్, పన్నీరు బుడ్డీ, ఆలయ గోపురాలు తదితర ఆకారాల్లో తయారు చేస్తారు. వీటిలో ఎక్కువగా రామచిలుకల ఆకారంలోనే తయారు చేస్తారు. రూ.10 నుంచి వంద రూపాయల వరకు వీటిని విక్రయిస్తారు. పంచదార చిలుకల తయారీలో నిమగ్నం చిలుకల తయారీ... చిలుకల తయారీకి ఎక్కువ సరుకులు అవసరం లేదు. పంచదార, ఆకర్షణకు రంగు ఉంటే చాలు. పంచదారను సరిపడిన నీరు పోసి పాకం వచ్చే వరకు మరిగించాలి. ఆకర్షణ కోసం రంగు వేసి పాకాన్ని ముందుగా చెక్కలతో తయారు చేసిన కావలసిన పరిమాణం, ఆకారంలో ఉన్న అచ్చుల్లో పోస్తారు. కొంతసేపు అచ్చుల్లోనే ఆరిన తర్వాత అచ్చుల నుంచి బయటకు తీసి అమ్మకానికి సిద్ధం చేస్తారు. కిలో చిలుకల తయారీకి రూ.85 ఖర్చు అవుతుంది. దీనిలో పంచదార, రంగు, కట్టెలు లేదా గ్యాస్ ఖర్చులు పోనూ రూ.40 వరకు మిగులుతుంది. పాకం సరిగా లేకపోతే చిలుకలు తయారు కావు. ముక్కలు అవుతాయి. దీంతో వాటిని మళ్లి మరిగించి పాకం సిద్ధం చేసి చిలుకలు తయారు చేయవలసి వస్తుంది. దీనివల్ల తరుగు ఏర్పడి పాకం తగ్గిపోయి నష్టం వస్తుంది. సంక్రాంతి స్పెషల్ చిలకలు సంక్రాంతి సంబరాలు, తీర్థాల రోజుల్లోనే పంచదార చిలుకలను తయారు చేస్తాం. కిలో చిలుకల తయారీకి రూ.85 అవుతుంది. జిల్లాలో జరిగే ఉత్సవాలు, తీర్థాలకు తీసుకెళ్లి విక్రయిస్తాం. ఖర్చులు పోనూ రూ.40 వరకు మిగులుతుంది. సంక్రాంతి రోజుల్లోనే తమకు ఆదాయం సమకూరుతుంది. మిగిలిన రోజుల్లో ప్రత్యామ్నాయం పనులు వెతుక్కొవలసి వస్తోంది. –శ్రీకాకుళపు కుమార్, పంచదార చిలుకల తయారీదారు, కశింకోట. -
కరోనా భయంతో స్వీట్ వద్దన్నాడు! కోపంతో నేలకేసికొట్టిన వధువు
కరోనా ప్రభావమో.. మరేమో కానీ.. ఈ మధ్య జరిగిన చాలా వివాహాలలో ఏదో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంటుంది. దీంతో ఈ పెళ్లిళ్లు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుక కూడా అలాంటి కోవకు చెందినదే. ఈ వివాహాంలో వరుడు, వధువు ఇద్దరు స్టేజీమీద నిల్చోని ఉన్నారు. ఈ క్రమంలో పెళ్లి కార్యక్రమం ప్రారంభమైంది. అయితే, ఈ వేడుకలో యువతి స్నేహితులు, ఒక ప్లేట్లో స్వీట్ బాక్స్ ఉంచి స్టేజీ మీదకు తీసుకొచ్చారు. ఆ తర్వాత స్వీట్ బాక్స్‌ను వధువుకు ఇచ్చి వరుడికి తినిపించాలని కోరారు. ఈ క్రమంలో, ఆ వధువు ఆ బాక్స్‌లోని ఒక స్వీట్‌ను తీసుకుని వరుడికి తినిపించేందుకు చేయి చాచింది. అయితే, పాపం.. ఆ వరుడు ఏ ఆలోచనలో ఉన్నాడో, లేక కరోనా వేళ స్వీట్ గోల ఏంటని గాబరా పడ్డాడో గానీ.. నోరు తెరవడానికి కాస్త ఆలస్యం చేశాడు. దీంతో ఆ వధువుకి చిర్రెత్తినట్టుంది. దీంతో వెంటనే తన చేతిలోని స్వీట్‌ను కోపంతో నేలపై పడేసింది. అయితే, ఈ అనుకోని సంఘటనతో, ఆ పెళ్లి కొడుకుకి ఏంచేయాలో అర్థంకాక.. బిత్తర ముఖం వేసుకొని అలాగే ఉండి పోయాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ఆ యువతికి పెళ్లి ఇష్టం లేదేమో..’, ‘ అందరి ముందు ఇంత కోపం పనికి రాదు..’, ‘నీ కోపంతో స్వీట్‌ను నేల పాలు చేశావ్ కదా.. ’ ‘ బాబీ.. కూల్.. చల్లబడండి..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, గతంలో జరిగిన ఒక వివాహ వేడుకలో సదరు వధువు.. వరుడి ముఖంపై పువ్వులను విసిరి కొట్టిన ఘటన వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. చదవండి: వరుడికి బంపరాఫర్.. స్టేజిమీదే ముద్దు పెట్టిన మరదలు -
పిచ్చి పీక్స్ అంటే ఇదే.. స్వీటు కోసం 200కి.మీ..
వాషింగ్టన్ : పుర్రెకో బుద్ధి.. జిహ్మకో రుచి అన్నట్లు! వ్యక్తికి వ్యక్తికి మధ్య ఆలోచనల్లో.. అభిరుచుల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ముఖ్యంగా తిండి విషయంలో.. కొంతమందికి హాట్ అంటే ఇష్టం ఉంటే.. మరికొంతమందికి స్వీట్లంటే ఇష్టం ఉంటుంది. ఇష్టమైన ఆహారాన్ని రోజులు, వారాలు తేడాలు లేకుండా లాగించేస్తుంటారు. ప్రతిరోజు తమకు ఇష్టమైన ఆహారం తినందే కొందరికి నిద్రపట్టదు. తమకిష్టమైన ఆహారాన్ని తినడానికి ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తారు. అచ్చంగా అమెరికాకు చెందిన వికీ గీ అనే యువతి లాగా.. కేంబ్రిడ్జ్కు చెందిన వికీ గీకి స్వీట్లంటే చాలా ఇష్టం. ప్రతీ రోజు స్వీట్ తినకపోతే ఉండలేదు. కొత్తకొత్త స్వీట్లు రుచి చూడటమే పనిగా మారిందామెకు. ఈ నేపథ్యంలో యార్క్ షేర్‌లోని బాన్స్లే ప్రాంతపు ఫేమస్ ఐటమ్ బిస్కాఫ్ పుడ్డింగ్ మీదకు ఆమె మనసు మళ్లింది. ఎలాగైనా దాన్ని రుచిచూడాలని భావించింది. ఇందుకోసం వందల కిలోమీటర్ల దూరాన్ని కూడా ఆమె లెక్కచేయలేదు. కేవలం డెసర్ట్(తినుబండారం) తినడానికి బాన్స్లేలోని డాలీస్ డెసర్ట్స్ షాపునకు చేరుకుంది. ఇష్టమైన పదార్థాన్ని రుచి చూసి మైమరచిపోయింది. వికీ గీ గురించి తెలుసుకున్న షాపు సిబ్బంది. ఆమె గురించి టిక్‌టాక్‌లో ఓ వీడియో తీసి పెట్టారు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఇది చాలా పిచ్చి పనిలా ఉంది. కానీ, దీన్ని తినడానికి మళ్లీ నేను వస్తా’’ నని అంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ పిచ్చిదానిలా ఉన్నావ్.. డెసర్ట్ కోసం 200కి.మీ ప్రయాణిస్తావా?..’’ ..‘‘పిచ్చి పీక్స్ అంటే ఇదే కాబోలు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి : వైరల్: ఓం కరోనా ఫట్,ఫట్,ఫట్ స్వాహా!.. -
జిలేబీ జర్నీ..! భారత్‌కు ఎలా వచ్చిందో తెలుసా..?
అలసి సొలసి ఇంటికి బయలుదేరుడుండగా... ఓ వీధి దుకాణంలో అప్పుడే తయారుచేసిన వేడి వేడిగా జిలేబీ మీ కంటికి ఎదురైతే.. ఇక మీ అడుగులు ఇంటికి బదులుగా ముందు జిలేబీ దగ్గరకే చేరుకుంటాయి. అంతేనా.. వెంటనే ఒక జిలేబి తీసుకొని తినేంతవరకూ మీ చేతులు కూడా ఊరుకోవు! మరి ఇంతలా మాయచేయగల ఆ తియ్యని జిలేబీ వెనుక ఒక పెద్ద చరిత్రనే ఉంది. చాలా మంది ఇది స్వదేశీ వంటకంగా పిలుస్తుంటారు. కానీ, జిలేబీ జర్నీ వేరే.... వాస్తవానికి, మధ్య– తూర్పు దేశాలైన జలాబియా, పెర్షియన్ నుంచి ’జుల్బియా’గా ఈ వంటకాన్ని దిగుమతి చేశారు. 10వ శతాబ్దాంలో ముహమ్మద్ బిన్ హసన్ అల్–బాగ్దాది రాసిన ’ కితాబ్ అల్ తబీఖ్’ పురాతన పెర్షియన్ వంటల పుస్తకంలో మొదటిగా దీని రెసిపీనీ ప్రస్తావించారు. దీని బట్టే ఇది పెర్షియన్ వంటకంగా పరిగణించొచ్చు. ఇండియాకు ఇలా వచ్చింది.. సాధారణంగా రంజాన్, ఇతర సంప్రదాయ పండుగ రోజుల్లో ప్రజలు సంతోషాన్ని పంచుకునే నేపథ్యంలో వారు తయారు చేసిన తీపి పదార్థాలను ఇచ్చిపుచ్చుకుంటుంటారు. అలా ఇబ్న్ సయ్యర్ అల్‌వార్రాక్ అనే అరబ్ షెఫ్ రాసుకున్న పుస్తకంలో ఈ వంటకం తనకు బహుమతిగా లభించినట్లు రాసుకున్నాడు. ఆ రుచిని మెచ్చిన ఆ వ్యక్తి తాను కూడా ఆ వంటకం నేర్చుకొని వివిధ దేశాల్లో విస్తరింపజేశారు. ఏది ఏమయినప్పటికీ, జుల్బియా భారతీయ జిలేబీకి భిన్నంగా ఉంటుంది. అక్కడ చక్కెర పాకానికి బదులుగా.. మిడిల్–ఈస్టర్న్ రెసిపీ, తేనె, రోజ్ వాటర్ సిరప్‌ను ఉపయోగించేవారు. ఈ రెసిపీనే పెర్షియన్ వ్యాపారులు భారత ఉపఖండానికి తీసుకువచ్చారు. ‘ప్రియామ్‌కార్న్‌పాకథా’ (క్రీ.శ 1450) – జైనసుర స్వరపరిచిన జైనవచనంలో జిలేబీ గురించి మన దేశంలో మొట్టమొదటగా ప్రస్తావించారు. అక్కడ అతను ఒక భారతీయ వ్యాపారి అందించే విందు మెనులో భాగంగా జిలేబీని పేర్కొన్నాడు. తర్వాత, క్రీ.శ. 1600 లో, సంస్తృత వచనం గుణ్యగుణబోధినిలోనూ ఉంది. అలా...మనోహరమైన జుల్బియా భారతీయ వంటకాల్లో స్వదేశీ ‘జలవల్లికా’ లేదా ‘కుండలికా’గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 15వ శతాబ్దం చివరి నాటికి, జిలేబీ దేశీయ ఉత్సవాల్లో భాగంగా మారింది, అలాగే వివాహాలు, ఇతర వేడుకలు వంటి వ్యక్తిగత సందర్భాలలో కూడా మారింది. దేవాలయాలలో ప్రసాదంగానూ మారింది. భిన్న రూపాలు.. జిలేబీకి చెందిన అనేక అవతారాలు ఇప్పుడు దేశంలోని ప్రధాన భూభాగంలో ప్రాచుర్యం పొందాయి – ఇండోర్ నైట్ మార్కెట్ల నుంచి హెవీవెయిట్ జిలేబాగా.., బెంగాల్ స్వీట్ మేకర్స్ వంటశాలల నుంచి చనార్ జిలిపిగా.., మధ్యప్రదేశ్ మావా జిలేబీ..., హైదరాబాద్ డోపెల్‌గేంజర్ ఖోవా జలేబీ... లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి జాంగ్రిగా ఇలా వివిధ పేర్లతో రకరకాలుగా జిలేబీ మన దేశంలో ఒక భాగంగా నిలిచిపోయింది. -
బంగారు స్వీట్.. ధర వేలల్లో..
సూరత్ : నగరానికి చెందిన ఓ స్వీట్ షాపు వినూత్న ప్రయోగం చేసింది. చాందీ పాద్వో పండుగను పురస్కరించుకుని బంగారం (24 కారెట్ల పైతొడుగు)తో స్వీటును తయారు చేసింది. దానికి ‘గోల్డ్ ఘారీ’ అని పేరు పెట్టింది. శరద్ పూర్ణిమ తర్వాతి రోజైన చాందీ పాద్వో రోజున సాంప్రదాయ వంటకం ‘ఘారీ’ తినటం అక్కడి ప్రజల ఆనవాయితీ. దీంతో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన రోహన్ అనే స్వీట్ షాపు యజమాని బంగారంతో స్వీటును తయారు చేశాడు. మామూలు ఘారీ కిలో ధర 660-900 రూపాయల వరకు ఉంటే.. కిలో ‘గోల్డ్ ఘారీ’ ధర 9000 రూపాయలు. ( సముద్రంలో మునిగిపోతున్న పక్షిని కాపాడి.. ) దీనిపై రోహన్ మాట్లాడుతూ.. ‘‘ మేము ఈ సంవత్సరమే ‘ గోల్డ్ ఘారీ’ని తయారు చేశాము. ఇది చాలా ఆరోగ్యకరం. బంగారం ఎంతో ఉపయోగకారని మన ఆయుర్వేదమే చెబుతోంది. ఈ స్వీటును మార్కెట్లోకి తెచ్చి మూడురోజులవుతోంది. మేము అనుకున్న దానికంటే తక్కువ డిమాండ్ ఉంది. రానున్న రోజుల్లో వ్యాపారం పుంజుకుంటుందని ఆశిస్తున్నా’’మన్నారు. -
కరోనా: మిఠాయి రాజాకు ఎదురుదెబ్బ
రాయచూరు : చిక్కని పాలు, చక్కెర, యాలకుల పొడి వీటికి తోడు ఎంతో నైపుణ్యం రంగరించి చేసే ధార్వాడ పేడా పేరు వింటే నోరూరని వారు ఉండరు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఆ తీయని రుచి స్వర్గాన్ని తలపిస్తుందంటారు పేడా ప్రియులు. కరోనా వైరస్ వల్ల అలాంటి పేడకు వ్యాపారాలు తగ్గాయి. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రా, తమిళనాడు ప్రజలు మక్కువ చూపుతారు. కరోనా వైరస్ భీతితో, రెండున్నర నెలల లాక్డౌన్ వల్ల ఈ మిఠాయి రాజాకు దెబ్బ తగిలింది. స్వీట్‌షాపులు మూతపడడం, కార్మికులు ఇళ్లకు వెళ్లిపోవడం తదితర కారణాలతో క్వింటాళ్ల కొద్దీ పేడా అమ్మకాలు నిలిచిపోయి లక్షల రూపాయల నష్టం సంభవించినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.(వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ పెట్టారు) పేడా వెనుక పెద్ద కథ ఉత్తర కర్ణాటక భాగంలోని హుబ్లీ, ధార్వాడకు ప్రత్యేక కథ వుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అవధ్ బీహరీ 1933లో ధార్వాడలో పేడా దుకాణాలను ప్రారంభించారు. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి నిత్యం పెద్దమొత్తంలో తయారు చేసేలా 1955లో పేడా ఫ్వాక్టరీని స్థాపించాడు. దాని బాధ్యతలను మోసుకున్న గణేష్మిశ్రా దీనిని హుబ్లీకి విస్తరింప చేశారు. మిశ్రా కుటుంబం మూడోతరం కుటుంబ సభ్యుల 87 ఏళ్ల క్రితం పారంభించిన పేడాను సంజయ్ మిశ్రా బిగ్ మిశ్రా పేడాగా పేరుమార్చారు. ప్రస్తుతం ఉత్తర కర్ణాటకతో పాటు అనేకచోట్ల పేడా దుకాణాలు వెలిశాయి. కానీ ధార్వాడలో తయారయ్యే పేడాకు ఏదీ సాటిరాదంటారు. ధార్వాడ తాలుకా క్యారకొప్పలో రూ.20 కోట్లతో పేడా ఉత్పాదన చేసే పరిశ్రమను నెలకొల్పారు. పరిశ్రమలో 450 మందికి పైబడి కార్మికులు పనిచేస్తుండగా ప్రతి రోజు 2000 కేజీల పేడా మిఠాయిని ఉత్పత్తి చేసి మూడు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. కరోనా వైరస్, లాక్డౌన్ సంభవించడంతో ఇప్పుడు వెయ్యికేజీలకు ఉత్పత్తి పడిపోయిందని తెలిపారు. కొనుగోళ్లు తగ్గినట్లు చెప్పారు. నాలుగు నెలల్లో తమకు ఒక్కరికే రూ.2 కోట్ల మేర నష్టం సంభవించిందని మరో ప్రముఖ వ్యాపారి సంజయ్ మిశ్రా తెలిపారు. అందరిపైనా ఎఫెక్టు మరోవైపు హుబ్లీ–ధార్వాడల్లో స్థానిక వ్యాపారులు సొంతంగా చేసి, లేదా హోల్‌సేల్‌గా కొని అమ్ముతూ ఉండేవారు. రెండున్నర నెలల పాటు షాప్‌లు మూతపడడం, ఇప్పుడిప్పుడే తెరిచినా కరోనా ప్రభావం వల్ల వ్యాపారాలు తగ్గినట్లు చెప్పారు. దీనివల్ల పాల రైతులు, పేడా తయారీ కార్మికులకు ఆదాయం పడిపోయింది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని వాపోయారు. మళ్లీ పుంజుకోవడానికి కొంతకాలం పడుతుందని అన్నారు. -
బాసుంది వికటించి ..
అమరావతి, తాడేపల్లి రూరల్: బాసుంది తిని ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన జిల్లాలో జరిగింది. మండలంలోని చిర్రావూరు గ్రామానికి చెందిన రమేష్ తన ఇద్దరు పిల్లలను తీసుకొని దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ఉన్న తన సోదరి ఇంటికి ఆదివారం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రమేష్ సోదరి తమ ఇంటి పక్కనే ఉన్న డెయిరీ పార్లర్ నుంచి బాసుంది 2 బాక్సులు కొని ఒకటిరమేష్‌కి ఇచ్చి, రెండోది తాను తీసుకెళ్లింది. రమేష్ సోదరి పిల్లలు, వారి ఇంటి పక్క పిల్లలు నలుగురు రాత్రి బాసుంది తినగా అరగంట వ్యవధిలో విరోచనాలు, వాంతులు అవ్వడంతో వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రమేష్ తన ఇద్దరు పిల్లలతో పాటు పక్క ఇంట్లో పిల్లలకు కూడా ఇవ్వగా, వారికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వెంటనే తన ఇద్దరు పిల్లలను, ఇంటి పక్క స్నేహితుడి పిల్లవాడిని తాడేపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చి, విషయాన్ని వివరించాడు. డాక్టర్ కిరణ్ ప్రథమ చికిత్స నిర్వహించి వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కోవా.. కావాలామ్మా!
ప్రకృతి అందాలకు నిలయం కోనసీమ. రుచికరమైన పాలకోవాకు కండ్రిగ పాలకోవా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. విదేశాల్లో స్థిరపడిన స్థానికులు, స్థానికేతరులు పనిగట్టుకుని కండ్రిగ వచ్చి పాలకోవాను తీసుకు వెళ్తుంటారు. కోవాలోని మాధుర్యాన్ని ఈ గ్రామం మొత్తం భారత దేశానికి పంచుతోంది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు సుమారు 5 కిలోమీటర్లు దూరంలో ఉంది కండ్రిగ గ్రామం. అక్కడ ఆదిలక్ష్మీస్వీట్ (పాలకోవా) స్టాల్, అటుగా వెళుతున్నవారిని తన దగ్గరకు తియ్యగా రప్పించుకుంటుంది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సుమారు 30 ఏళ్ల క్రితం సూరవరపు సుబ్బారావు.. కొత్తపేట – అమలాపురం రోడ్డు కండ్రిగ రేవు దగ్గర చిన్న కాఫీ హోటల్ ప్రారంభించారు. 20 ఏళ్ల క్రితం ఆయన కుమారుడు సూరవరపు వీరరాఘవులు హోటల్ని మరింత అభివృద్ధి చేయ టం కోసం పాలకోవా తయారీ ప్రారంభించారు. అంతే.. వీరి జీవితాలలో మాధుర్యం వచ్చి చేరింది. వ్యాపా రం పెరగటంతో, విశాలమైన స్థలంలో ఆదిలక్ష్మి స్వీట్స్ అండ్ టీ స్టాల్ ప్రారంభించిన కొద్దికాలానికే పాలకోవా వ్యాపారమూ చెందింది. పాలకోవా పాకం ఊక పొయ్యి మీదే... గ్యాస్ స్టౌ, స్టీమ్ విధానం ఉన్నా ఇక్కడ మాత్రం ఊక పొయ్యి మీదే పాలకోవా తయారుచేయటం ప్రారంభించారు. నాలుగు బట్టీలతో రెండు ఊక పొయ్యిలు పెట్టి, ఎంత వేగంగా పాలకోవా తయారుచేస్తున్నా, ఇలా ప్లేటులోకి తీస్తుండగానే, అలా ఎగరేసుకుపోతున్నారు పాలకోవా ప్రియులు. ప్రొప్రయిటర్ పెద్ద కాపు కుటుంబ సభ్యులు పదహారు మందితో పాటు మరో పది మంది కలిసి, రోజుకు సుమారు 100 కేజీల కోవా తయారుచేస్తున్నారు. పాలకోవా ముద్ద తయారీ... ఊక పొయ్యి మీద ఇత్తడి గంగా ళాలు పెట్టి, పాలు పోసి మీగడ కట్టకుండా గరిటె తిప్పుతూ, సుమారు గంట సేపు మరగకాగి ముద్దలా అవుతున్న సమయంలో పంచదార (20 లీటర్లు పాలకు, మూడు కేజీల పంచదార) వేసి, పాలు, పంచదార పాకాన్ని గరిటెతో విరామం లేకుండా, దగ్గర పడేవరకు కలిపి, నెయ్యి పూసిన పళ్లెంలో పోస్తారు. గట్టిపడేవరకు గరిటెతో బాగా కలుపుతారు. ఇలా గట్టి పడటం కోసం ప్రస్తుతం ఒకరకమైన గ్రైండర్ వాడుతున్నారు. గ్రైండర్లో వేసిన అరగంటకు ముద్దలా మారిపోతుంది. ఆ మిశ్రమాన్ని బిళ్లలుగా తయారుచేసి ప్యాకింగ్ చేస్తారు. ఇలా ఈ పాలు కోవాగా మారి కవర్లలోకి వెళ్లడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. అయితేనేం, కోవా తిన్నవారు ఇచ్చే తియ్యటి మాటలు వారి జీవితమంతా వారి మనసులో పదిలంగా నిలుస్తున్నాయి. – జగతా రాంబాబు, సాక్షి, కొత్తపేట,తూ.గో. జిల్లా నాణ్యమైన పాలతోనే కోవా చుట్టుపక్కల గ్రామాల్లోని రైతుల నుంచి గేదె పాలు సేకరిస్తాం. ఇందులో ఒక్క చుక్క కూడా నీరు కలపకుండా, కోవా కోసమే ఉపయోగిస్తాం. 500 లీటర్లు పాలకు సుమారు 100 కేజీలు కోవా తయారవుతుంది. గ్యాస్, స్టీమ్ పొయ్యిలు అందుబాటులోకి వచ్చినా వాటిపై కోవా వండితే ఇంత రుచి రాదు. ఊక పొయ్యి మీద వండితేనే ఘుమఘుమలాడుతూ ఇంత తియ్యగా వస్తుంది. అందుకే ఊక పొయ్యి బట్టీల మీదే కోవా తయారుచేస్తున్నాం. ఇలా వేడివేడిగా ఉండగానే, అలా చల్లగా కొనేస్తుంటారు. 25 గ్రాములు, 50 గ్రాములు చొప్పున కోవా బిళ్లలను తయారుచేస్తాం. – సూరవరపు సుబ్బారావు, నిర్వాహకుడు -
తాటి బెల్లంతో ఆరోగ్యానికి ఎంతో మేలు
కుత్బుల్లాపూర్: మనిషికి తీపి ఎంత జిహ్వ చాపల్యం కలిగిస్తుందో అంతగా చెడు చేస్తుందంటారు. అలాంటి తీపి పదార్థాల్లో శరీరానికి అత్యంత మేలు కలిగించేది ‘తాటి బెల్లం’. సాధారణ చెరుకు బెల్లంతో పోలిస్తే తాటి బెల్లం చేసే మేలు అనంతం. బిజీబిజీ యాంత్రిక జీవనంలో ఆరోగ్య శైలిలో మార్పులు తప్పనిసరి.గత దశాబ్దకాలంగా ప్రతీఒక్కరి ఆహార శైలిలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పటి పాత కాలం నాటి ఆహార పద్ధతులను ఇప్పుడు ఆచరిస్తున్నారు. అందులో భాగంగా చెరుకు బెల్లానికి ప్రత్యామ్నాయంగా తాటి బెల్లానికి డిమాండ్ బాగా పెరిగింది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో తాటిబెల్లం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తాటిబుట్టల్లో పెట్టి.. తాటి బెల్లానికి పెరుగుతున్న డిమాండ్ రీత్యా ఇçప్పుడు నగరంలోని పలు ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన వ్యాపారులు పెద్ద సంఖ్యలో దీనిని విక్రయిస్తున్నారు. దేశంలోని తీర ప్రాంత రాష్ట్రాల్లో తాటిబెల్లం ఉత్పత్తి అధికంగా జరుగుతోంది. వీటిలో తమిళనాడు తాటిబెల్లం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. ఈ క్రమంలో తుత్తుకూడి, తిరునల్వేరి, ఒడంకుడి, తిరుచందూర్, తిరువనలై తదితర ప్రాంతాలకు చెందిన తాటి బెల్లం తయారీ, అమ్మకందారులు నగరంలో విక్రయిస్తున్నారు. మౌలాలీ, సికింద్రాబాద్, మేడ్చల్, కొంపల్లి, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్.. ఇలా నగరంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్డు పక్కన తాటిబుట్టల్లో అమ్ముతున్నారు. తాటినీరా నుంచి తయారీ.. తాటిబెల్లం అత్యంత సహజసిద్ధంగా తయారు చేస్తామని విక్రయదారులు చెబుతున్నారు. తాటి చెట్లనుంచి సేకరించిన పులియని తాటి నీరాను బాగా వేడి చేయగా వచ్చేదే తాటి బెల్లమని, ఇందులో ఎలాంటి రంగు, ఇతర పదార్థాలను కలపమని తెలిపారు. తాటి బెల్లంతో పాటు మరో రకమైన ‘అల్లం బెల్లం’ ను కూడా తమిళ వ్యాపారులు విక్రయిస్తున్నారు. అయితే ఇందులో తాటి బెల్లం తయారీ సమయంలోనే అల్లం, ఇలాచీ, లవంగం, మిరియాలు వంటి పదార్థాలను కలిపి తయారు చేస్తారు. మామూలు తాటి బెల్లం కేజీ రూ.100 నుంచి రూ. 140 వరకు ఉండగా.. అల్లం బెల్లం కేజీ రూ.190 నుంచి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. హైటెక్ సిటీ వంటి ఐటీ హబ్‌ల ప్రాంతంలో మాత్రం మామూలు తాటి బెల్లాన్నే రూ.240కు విక్రయిస్తున్నట్లు సమాచారం. రుగ్మతలు దూరం.. పులియని తాటి నీరాతో తయారు చేసే తాటి బెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజ్ 76.86 శాతం, మాంసకృతులు 1.04, ఖనిజ లవణాలు 3.15 శాతం, ఇనుము సమృద్ధిగా ఉంటుంది. వంద లీటర్ల తాటి నీరా నుంచి దాదాపు 12 నుంచి 15 కిలోల తాటి బెల్లం ఉత్పత్తి అవుతుంది. రక్తహీనతకు చెక్ పెట్టడంతో పాటు శరీర పుష్టి, వీర్యవృద్ధి కలుగుతుంది. తక్కువ సోడియం ఎక్కువ పొటాషియం ఉండడం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత రుగ్మతలు దరిజేరకుండా ఉంచుతుంది. విక్రయాలు బాగానే ఉన్నాయి.. ఒకప్పుడు తాటి బెల్లాన్ని అంతగా ఇష్టపడే వారు కాదు. కాని ఇప్పుడు దీనికి మంచి గిరాకీ ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో తాటి బెల్లం విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయి. అందుకే నేను మావాళ్లు మొత్తం 16 మంది మధురై నుంచి నగరానికి వచ్చి తాటిబెల్లం విక్రయిస్తున్నాం.– కుంభయ్య, తాటిబెల్లం వ్యాపారి, మధురై -
చేత స్వీటు ముద్ద
‘అమ్మా! తమ్ముడు మన్ను తిన్నాడు’బలరాముడి కంప్లైట్. తల్లికి కోపం వచ్చింది. నోరు తెరవంది.‘ఆ..’ అని తెరిచాడు చిన్ని కృష్ణుడు.లోపల.. లోకాలు లోకాలే కనిపించాయి. అయినా.. ఏ పరమార్థమూ లేకుండా..వెన్నముద్దలు తినే కన్నయ్య.. మన్నుముద్దలు తింటాడా..?!శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తోంది..ఆయన ‘చేత’ ఎప్పుడూ ఉండే వెన్నముద్దకుకాస్త మీగడ కలిపి.. స్వీటు ముద్దలు చేసుకుని..‘ఏదీ.. నోరు తెరువ్’ అని.. మీ చిన్నారులతో అనండి. బాసుంది కావలసినవి: తియ్యటి కండెన్స్డ్ మిల్క్ – 400 గ్రా. (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); చిక్కటి పాలు – ఒకటిన్నర లీటర్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; జీడిపప్పు – 15 (చిన్నచిన్న ముక్కలు చేయాలి); పిస్తా పప్పులు – 15 (చిన్నచిన్న ముక్కలు చేయాలి); బాదం పప్పులు – 15 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కుంకుమ పువ్వు – ఏడెనిమిది రేకలు; జాజికాయ పొడి – చిటికెడు తయారీ: మందపాటి పాత్రలో పాలు, కండెన్స్డ్ మిల్స్ వేసి స్టౌ మీద ఉంచి కలుపుతుండాలి. పాలను మరీ మరిగించడకూడదు. పాలు కాగుతున్నంతసేపు కలుపుతూనే ఉండాలి. లేదంటే గోధుమరంగులోకి మారే అవకాశం ఉంది. చిక్కబడుతుంటే బాసుంది తయారవుతున్నట్లు. మీగడ వచ్చినప్పుడల్లా అంచుల నుంచి మీగడను వేరు చేసి పాలలోకి రానిచ్చి కలుపుతుండాలి. ఈ విధంగా మీగడ తరకలతో పాలు చిక్కబడ్డాక, జాజికాయ పొడి, తరిగి ఉంచుకున్న డ్రైఫ్రూట్స్, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలియబెట్టి దింపేయాలి. బాసుందిని వేడిగా గాని చల్లగా గాని తీసుకోవచ్చు. గ్లాసులలో అందించే ముందు కొద్దిగా కుంకుమపువ్వుతో అలంకరిస్తే కనువిందుగా ఉంటుంది. బాదాం కుల్ఫీ కావలసినవి: పాలు – 4 కప్పులు; ఏలకులు – 5; పంచదార – పావు కప్పు; కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూను; బాదం పప్పులు – 10; బ్రెడ్ – ఒక స్లైస్. తయారీ: ఏలకుల తొక్క తీసి పొడి చేసి వాడుకునే వరకు గాలిచొరని డబ్బాలో ఉంచాలి. బాదం పప్పులను చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి. (బాదం పప్పుల తొక్క తీయకుండా ఉంచితే, కుల్ఫీ తినేటప్పుడు రుచిగా ఉంటుంది. అలాగే కుల్ఫీ తయారయ్యాక చూడటానికి కూడా అందంగా ఉంటుంది). బ్రెడ్ స్లైస్ అంచులు వేరు చేసి, బ్రెడ్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు కుల్ఫీ తయారుచేయడం ప్రారంభించాలి. నాలుగు కప్పుల పాల నుంచి అర కప్పు పాలు వేరు చేసి పక్కన ఉంచాలి. మందంగా ఉన్న పాత్రను స్టౌ మీద ఉంచి, మిగిలిన మూడున్నర కప్పుల పాలు అందులో పోసి సన్నని మంట మీద పాలను మరిగించాలి. మూడున్నర కప్పుల పాలు ఒకటిన్నర కప్పుల పరిమాణంలోకి వచ్చేవరకు మరిగించాలి. పాలు మరీ చిక్కబడిపోతే రెండున్నర కప్పుల పరిమాణం వచ్చినా పరవాలేదు. మిక్సీ జార్లో బ్రెడ్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, అర కప్పు పాలు వేసి అన్నీ కలిసి మెత్తగా ముద్దలా అయ్యేవరకు సుమారు రెండు నిమిషాలపాటు మిక్సీ పట్టాలి. పాలు బాగా చిక్కబడిన తరవాత మిక్సీ పట్టిన పాల ముద్దను వేసి ఆపకుండా కలుపుతుండాలి. (లేదంటే అడుగు అంటి మాడు వాసన వస్తుంది). ఈ మిశ్రమం బాగా చిక్కబడ్డాక పంచదార జత చేసి మరోమారు కలియబెట్టాలి. పంచదార వేయగానే పాలు పల్చబడతాయి. అందువల్ల పాలు మళ్లీ గట్టిపడేవరకు కలుపుతూ ఉడికించాలి. బాగా గట్టిపడ్డాక స్టౌ మీద నుంచి దింపేయాలి. ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఏలకుల పొడి, డ్రైఫ్రూట్స్ తరుగు వేసి కలపాలి. బాగా చల్లబడ్డాక, కుల్ఫీ మౌల్డ్స్‌లోకి ఈ మిశ్రమం వేసి మూత పెట్టి, డీప్ ఫ్రీజర్‌లో ఆరు గంటలపాటు ఉంచి తీసేయాలి. మౌల్డ్‌లో నుంచి కుల్ఫీని జాగ్రత్తగా బయటకు తీసి చల్లగా అందించాలి. రబ్రీ రసమలై కావలసినవి: చిక్కటి పాలు – 4 కప్పులు; ఏలకుల పొడి – అర టీ స్పూను; కుంకుమ పువ్వు – నాలుగు రేకలు; పంచదార – పావు కప్పు; డ్రై ఫ్రూట్స్ తరుగు – 2 టేబుల్ స్పూన్లు; రసమలై మిల్క్ పౌడర్ కోసం... పాల పొడి – ఒక కప్పు; పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్లు; పాలు – పావు కప్పు; నెయ్యి – అర టీ స్పూను; తయారీ: ముందుగా రబ్రీని తయారుచేసుకోవడం కోసం నాలుగు కప్పుల పాలను మందంగా ఉండే పాత్రలో పోసి, స్టౌ మీద ఉంచి మరిగించాలి. అడుగు అంటకుండా ఉండటం కోసం మధ్యమధ్యలో కలుపుతుండాలి. పాలు బాగా మరిగిన తరవాత, అర టీ స్పూను ఏలకుల పొడి అందులో వేసి గరిటెతో బాగా కలియబెట్టాలి. ఇవి మరుగుతుండగానే, ఒక చిన్న కప్పులో ఒక టీ స్పూను నీళ్లు పోసి అందులో కుంకుమపువ్వు రేకలు వేసి కరిగించి, మరుగుతున్న పాలలో పోసి కలపాలి. ఇప్పుడు పావు కప్పు పంచదార వేసి కలిపి, తీపి సరిపడిందో లేదో రుచి చూసి, అవసరమనుకుంటే మరికాస్త పంచదార జత చేయాలి. మంట బాగా తగ్గించి, ఐదు నిమిషాలు కలపకుండా అలాగే వదిలేయాలి. మీగడ ఏర్పడి, అం చులకు చేరినప్పుడల్లా, గరిటెతో మీగడ కలుపుతుండాలి. ఇలా పాలు బాగా దగ్గరపడి చిక్కపడేవరకు కలుపుతూనే ఉండాలి. ఆ తరవాత రెండు టేబుల్ స్పూన్ల డ్రైఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం పప్పులు, పిస్తా పప్పులు) జత చేసి మరోమారు బాగా కలిపి మరో ఐదు నిమిషాలు స్టౌ మీదే ఉంచాలి. పాలు బాగా చిక్కబడితే రబ్రీ తయారైనట్లే. (తయారనై రబ్రీని పక్కన ఉంచాలి). రసమలై తయారీ: పెద్ద బాణలిలో ఒక కప్పు పాల పొడి వేసి, రెండు టేబుల్ స్పూన్ల పంచదార పొడి, పావు కప్పు పాలు జత చేయాలి. మంట బాగా తగ్గించి, పాలను ఆపకుండా కలుపుతుండాలి. ఉండలు లేకుండా, పాలు బాగా చిక్కగా తయారయ్యేవరకు కలుపుతుండాలి. బాగా చిక్కబడ్డాక, అర టీ స్పూ ను నెయ్యి జత చేసి మరోమారు కలపాలి. బాణ లి నుంచి విడివడేవరకు బాగా కలుపుతుండాలి. చేతికి నెయ్యి పూసుకుని, మిశ్రమా న్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసి ఒక పాత్రలో ఉంచాలి. చివరగా తయారుచేసి ఉంచుకున్న ర బ్రీని రసమలై మీద పోసి వెంటనే రసమలై అందించాలి. పనీర్ పాయసం కావలసినవి: చిక్కటి పాలు – 3 కప్పులు; పనీర్ తురుము – అర కప్పు; పంచదార – 6 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; బాదం పప్పులు – 15 (సన్నగా తరగాలి); పిస్తా పప్పులు – 15 (సన్నగా తరగాలి); జీడి పప్పులు – 15 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కుంకుమ పువ్వు – కొద్దిగా; రోజ్ వాటర్ – ఒకటిన్నర టీ స్పూన్లు; తయారీ: మందపాటి పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి సన్న మంట మీద పాలను మరిగించాలి. బాగా మరిగిన తరవాత పంచదార వేసి కలిపి ఐదు నిమిషాలుపాటు మరిగించాలి. డ్రైఫ్రూట్స్ తరుగులు వేసి బాగా కలిపాక, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి అన్నీ కలిసేలా బాగా కలియబెట్టాలి. ఆ తరవాత పనీర్ తురుము వేసి కలపాలి. పనీర్ బాగా ఉడికేవరకు కలుపుతుండాలి. బాగా ఉడికినట్లు అనిపించాక రోజ్ వాటర్ జత చేసి మరోమారు కలపాలి. కుంకుమ పువ్వు వల్ల మంచి రంగు, రోజ్ వాటర్ వల్ల సువాసన వస్తుంది. పనీర్ పాయసాన్ని వేడివేడిగా కాని, చల్లగా కాని తీసుకోవచ్చు. పనీర్ పాయసాన్ని సర్వ్ చేసే ముందు పాత్రలో చిటికెడు కుంకుమ పువ్వు లేదా డ్రై ఫ్రూట్స్ తరుగు లేదా గులాబీ రేకలు వేస్తే కంటికి ఇంపుగా ఉంటుంది. బెల్లం పాలకోవా కావలసినవి: చిక్కటి పాలు – ఒక లీటరు; బెల్లం పొడి – అర కప్పు; పంచదార – అర కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను తయారీ: మందపాటి పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి. ఏలకుల పొడి జత చేసి సుమారు గంటసేపు కలుపుతుండాలి. పాలు బాగా చిక్కగా అయ్యి, దగ్గర పడిన తరవాత బెల్లం పొడి వేసి కలియబెట్టాలి. పాలతో బెల్లం కలిసి ఉడుకుతున్నప్పుడు రంగు మారుతుంది. అలా రంగు మారిన అంటే సుమారు పావు గంట తరవాత పంచదార వేసి మరోమారు కలియబెట్టాలి. పాల పరిమాణం బాగా తగ్గటం గమనించాలి. నెయ్యి జత చేసి మరోమారు బాగా కలిపి స్టౌ మీద నుంచి దింపేయాలి. చల్లారుతుండగా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని కోవా మాదిరిగా ఒత్తాలి. గట్టిపడ్డాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. కాయం కావలసినవి: బెల్లం తరుగు – అర కప్పు;శొంఠి – చిన్న ముక్క;మిరియాలు – 4 గింజలు;వాము – ఒక టీ స్పూను;గసగసాలు – ఒక టేబుల్ స్పూను;దాల్చినచెక్క – చిన్న ముక్క; నెయ్యి – పావు కప్పు; తయారీ: స్టౌ మీద పెద్ద బాణలి ఉంచి వేడి చేయాలి. కొద్దిగా నెయ్యి వేసి కరిగాక శొంఠి వేసి దోరగా వేయించి, తీసి పక్కన ఉంచాలి. ఆ తరవాత గసగసాలను వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో వాము కూడా వేసి వేయించి పక్కన ఉంచాలి. వేయించి ఉంచుకున్న పదార్థాలన్నీ చల్లారనివ్వాలి. మిక్సీలో శొంఠి, మిరియాలు, గసగసాలు, వాము, దాల్చిన చెక్కలను ఒకదాని తరవాత ఒకటి వేస్తూ మెత్తగా చేయాలి. చివరగా బెల్లం తరుగు వేసి పదార్థాలన్నీ కలిసేలా మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి. చిన్న గిన్నెలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి, కరిగించి దింపేయాలి. సిద్ధంగా ఉన్న శొంఠి పొడి మిశ్రమంలో నెయ్యి వేసి ముద్దలా చేయాలి. చిన్న చిన్న ఉండలు చేసి ఒక పళ్లెంలో ఉంచి శ్రీకృష్ణుడికి నివేదన చేయాలి. ఇలా తయారుచేసిన ఉండలను కాయం ఉండలు అంటారు. వీటిని శ్రీకృష్ణుడు ఇష్టంగా తినేవాడని దక్షిణాది వారు భావిస్తారు. శ్రీఖండ్ కావలసినవి: పెరుగు – అర కిలో (పుల్లగా ఉండకూడదు); కుంకుమ పువ్వు – నాలుగు రేకలు; గోరువెచ్చటి పాలు – 2 టేబుల్ స్పూన్లు; పంచదార పొడి – పావు కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; పిస్తా తరుగు – పావు కప్పు; మిఠాయి రంగు – 2 చుక్కలు (పసుపు పచ్చ రంగు) తయారీ: పెద్ద పాత్రకు పల్చటి వస్త్రాన్ని కట్టి ముడి వేయాలి. అందులో పెరుగు వేసి ఆ పాత్రను ఫ్రిజ్‌లో మూడు గంటల సేపు ఉంచి, బయటకు తీయాలి. స్పూన్‌తో గట్టిగా అదిమి, పెరుగులో ఉన్న నీటిని పిండి తీసేయాలి. నీరు లేని గట్టి పెరుగును ఒక పాత్రలోకి తీసుకోవాలి. పంచదార పొడి వేసి బాగా కలపాఇ. గోరు వెచ్చని పాలలో కుంకుమపువ్వును పది నిమిషాల పాటు ఉంచి, ఆ పాలను గట్టి పెరుగులో వేసి కలపాలి. పంచదార, పిస్తా తరుగు, ఏలకుల పొడి జత చేసి మరోమారు బాగా కలియబెట్టాలి. మిఠాయిరంగును జత చేసి మరోమారు బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి సుమారు గంట తరవాత బయటకు తీసి చల్లగా అందించాలి. ధనియా పంజీరీ కావలసినవి: ధనియాల పొడి – ఒక కప్పు; పంచదార పొడి – ఒక కప్పు; మఖనీ – ఒక కప్పు (తామర గింజలు); ఉడికించిన కొబ్బరి తరుగు – అర కప్పు; నెయ్యి – పావు కప్పు; జీడి పప్పులు – 10; బాదం పప్పులు – 10; చిరోంజీ – 2 టేబుల్ స్పూన్లు; ఏలకులు – 4 (చిన్నవి). తయారీ: ముందుగా డ్రై ఫ్రూట్స్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మఖ్నీలనుని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడిచేయాలి. బాగా వేడిగా అయిన తరవాత మనం తీసుకున్న నేతిలో సగ భాగాన్ని బాణలిలో వేయాలి. నెయ్యి బాగా కరిగిన తరవాత మఖనీ ముక్కలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు కలపాలి. వాటిని వేరే పాత్రలోకి తీసుకోవాలి. ఆ తరవాత కొబ్బరి తురుము వేసి రంగుమారే వరకు వేయించి మరో పాత్రలోకి తీసుకోవాలి. ఆ తరవాత డ్రైఫ్రూట్స్ వేసి ఒక నిమిషం పాటు వేయించి మరో పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగతా నెయ్యి వేసి కరిగాక ధనియాల పొడి వేసి వేయించాలి. ఆపకుండా కలుపుతుండాలి. మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ధనియాల పొడి బదులు ధనియాలు కూడా వాడుకోవచ్చు. ధనియాల పొడిని మరో పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్దపాత్రలో ధనియాల పొడి, పంచదార పొడి, కొబ్బరి తురుము, డ్రైఫ్రూట్స్, ఏలకుల పొడి, చిరోంజీ వేసి కలపాలి. ఇది పొడిపొడిగా ఉంటుంది. మఖనీలను చేతితో మెత్తగా నలపాలి. ఆ పొడిని కూడా జతచేసి మరోమారు కలపాలి. మఖ్నీ బదులు పుచ్చకాయ గింజలు కూడా వేసుకోవచ్చు. ఇలా తయారైన ధనియా పంజీరీని ఉత్తరాది వారు శ్రీకృష్ణునికి నివేదన చేయడానికి ప్రసాదంగా తయారుచేస్తారు. నిర్వహణ వైజయంతి పురాణపండ -
స్వీట్ తింటారా?
త్వరలోనే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ కలసి స్వీట్ తినిపిస్తారట. అది కూడా గులాబ్ జామున్. ఏదైనా శుభవార్త చెప్పే ముందు స్వీట్ తినడం ఆనవాయితీ కదా. ఇంతకీ శుభవార్తేంటంటే.. ఈ ఇద్దరూ జంటగా ఓ సినిమాలో నటించనున్నారు. ఆల్రెడీ ఈ జంట ‘బంటీ అవుర్ బబ్లీ, గురు, రావణ్’ వంటి సినిమాల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే, తల్లయ్యాక ప్రారంభించిన సెకండ్ ఇన్నింగ్స్‌లో భర్తతో కలసి ఐశ్వర్యా రాయ్ నటించనున్న చిత్రం ఇది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సర్వేష్ మేవారా దర్శకత్వంలో అనురాగ్ కశ్యప్ నిర్మించనున్నారట. ఈ సినిమాకు ‘గులాబ్ జామున్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఐష్ ‘ఫ్యానీ ఖాన్’, అభిషేక్ ‘మన్ మర్జియా’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత వీరిద్దరూ కలసి నటించే సినిమాను ఆరంభిస్తారట. -
ఇంటి చిట్కాలు
తీపిని ఇష్టపడని పిల్లలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కొంతమంది పిల్లలకు చక్కెరతో చేసిన స్వీట్ తింటే వెంటనే జలుబు, దగ్గు సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు తేనె వాడడం మంచిది. చక్కెర చక్కటి ప్రత్యామ్నాయం తేనె. ఇది సహజమైనది కాబట్టి ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. త్వరగా శక్తినిస్తుంది కూడ. తేనె కొద్ది నెలలకు చిక్కబడుతుంది. అప్పుడు సీసాను పది నిమిషాల సేపు ఎండలో ఉంచితే తిరిగి పలచబడుతుంది. చిక్కబడకపోయినా సరే కనీసం ఏడాదిలో ఒకసారి అయినా అరగంట సేపు ఎండలో ఉంచాలి. బాటిల్ అడుగున ఉండిపోయిన తేనెను బయటకు తీయాలన్నా కూడా ఇదే పద్ధతి. తేనెను ఎప్పుడు కూడా మంట మీద వేడిచేయకూడదు. -
స్వీటాఫలం
చక్కెర్లో చెరకు రసం పోసినట్లుండదూ! బెల్లం పాకంలో తేనె కాచినట్లుండదూ! ఎగ్జాట్లీ!! సీతాఫలంతో స్వీటు చేస్తే ఇట్ విల్ బి సో.... స్వీట్! ఎంజాయ్.. స్వీటాఫలం. సీతాఫల్ సగ్గుబియ్యం పాయసం కావలసినవి: కొబ్బరి పాలు – 2 కప్పులు; సీతాఫలం గుజ్జు – 1 కప్పు; నానబెట్టిన సగ్గుబియ్యం – అరకప్పు; పంచదార – పావు కప్పు; నీళ్లు – అర కప్పు; యాలకుల పొడి – అర టీ స్పూన్, జీడిపప్పు – 10, కిస్మిస్ – 15. తయారి: స్టౌ పైన మందపాటి నాన్‌స్టిక్ పాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి ∙ఇదే పాన్‌లో నీరు పోసి నానబెట్టిన సగ్గుబియ్యం కలిపి ఉడకనివ్వాలి ∙సగ్గుబియ్యం మరీ మెత్తబడకుండా ఉడికిన తర్వాత కొబ్బరి పాలు పోసి పది నిమిషాలు ఉడికించుకోవాలి ∙సీతాఫలం గుజ్జు, పంచదార, యాలకుల కూడా జతచేసి మరొక పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ∙చల్లారిన ఈ మిశ్రమానికి జీడిప్పు, కిస్మిస్ జతచేసి అర గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లాగా సర్వ్ చేస్తే బాగుంటుంది. సీతాఫల్ ఫిర్నీ కావలసినవి: సీతాఫలం గుజ్జు – 1 కప్పు; నానబెట్టిన బియ్యం – అర కప్పు (2 గంటల సేపు నానబెట్టుకోవాలి); వెన్నతీయని పాలు – అర కప్పు; కాచి చల్లార్చిన వెన్నతీయని పాలు – మూడున్నర కప్పులు; పంచదార – 5 టేబుల్ స్పూన్స్, యాలకులు – 4. తయారి: ∙నానబెట్టుకున్న బియ్యానికి అరకప్పు చల్లని పాలు కలిపి మిక్సీ జార్లో వేసి కొంచెం (రఫ్‌గా) బరకగా ఉండేలా తీసుకోవాలి ∙స్టౌ వెలిగించి మందపాటి నాన్‌స్టిక్ గిన్నెలో మిగిలిన మూడున్నర కప్పుల పాలు, మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కలిపి, మీడియమ్ మంటపైన అయిదు నిమిషాలు కలుపుతూ ఉండాలి ∙సిమ్‌లో పెట్టి మరొక పది నిమిషాలు కలుపుతూ ఉండాలి ∙బియ్యం, పాల మిశ్రమం ఉడికేలా మధ్య మధ్యలో చూసుకుంటూ మరికాసేపు ఉంచాలి ∙పూర్తిగా ఉడికిన తర్వాత సీతాఫలం గుజ్జును కూడా వేసి బాగా కలపాలి ∙పూర్తిగా చల్లారిన తర్వాత రెండు గంటల సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి ∙ఫ్రిజ్‌లో తీసిన తర్వాత యాలకులను దంచి గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. సీతాఫల్ కలాకండ్ కావలసినవి:పాలు – 2 రెండు లీటర్లు; నిమ్మరసం– 2 టీ స్పూన్స్; పంచదార – అర కప్పు (పొడి చేసుకోవాలి); యాలకుల పొడి – 1 టీ స్పూన్, సీతాఫలం గుజ్జు – 1 కప్పు; నెయ్యి – 1 టీ స్పూన్, పిస్తా – 2 టేబుల్ స్పూన్స్; బాదం – 2 టేబుల్ స్పూన్స్. తయారి: మందపాటి గిన్నె తీసుకుని ఒక లీటరు పాలను అర లీటరు మిగిలేలా మరించాలి ∙మరొక గిన్నెలో లీటరు పాలను తీసుకుని మరుగుతుండగా స్టౌను సిమ్‌లో పెట్టుకోవాలి ∙ఈ పాలకు నిమ్మరసం కలిపి విరగనివ్వాలి ∙పలుచటి కాటన్ బట్టను తీసుకుని విరిగిన పాలను వడపోయాలి ∙ఇలా తయారైన పనీర్‌ను చల్లటి నీటిలో మరొకసారి కడిగి, ముందుగా మరిగించి పెట్టుకున్న పాలలో ఈ పనీర్‌ను కలిపి తిప్పుతూ ఉండాలి ∙పాలు పనీర్ మిశ్రమానికి పంచదారను కలిపి మరికాసేపు కలుపుతూ ఉండాలి ∙ఇప్పుడు సీతాఫలం గుజ్జును, యాలకుల పొడిని కూడా జతచేసి చిక్కబడేంత వరకు కలిపి స్టౌ ఆఫ్చేసుకోవాలి ∙ఒక ప్లేటుకు నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని సమానంగా పరుచుకోవాలి ∙పిస్తా, తరిగిన బాదం పైన వేసి కాసేపు చల్లారిన తర్వాత కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ∙సీతాఫల్ కలాకండ్ను ఎయిర్‌టైట్ కంటెయినర్లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే 5 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. సీతాఫల్ స్మూతీ కావలసినవి: సీతాఫలం గుజ్జు – 2 కప్పులు; అరటిపండు గుజ్జు – 1 కప్పు; తేనె – 1 టీ స్పూన్, వెనీలా కస్టర్డ్ పౌడర్ – పావు కప్పు; దాల్చినచెక్క పొడి – చిటికెడు; ఐస్ క్యూబ్స్ – 3 తయారి:సీతాఫలం గుజ్జు, అరటిపండు గుజ్జు, తేనె, కస్టర్డ్ పౌడర్ అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి అయిదు నిమిషాలు బ్లెండ్ చేయాలి ∙గ్లాసులోకి పోసి, దాల్చిన చెక్క పొడి, ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. సీతాఫల్ ఐస్‌క్రీమ్ కావలసినవి: సీతాఫలం గుజ్జు – 1 కప్పు; ఒకటిన్నర కప్పు – మిల్క్ క్రీమ్; కండెన్స్డ్ మిల్క్ – అర కప్పు; వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్ తయారి: ∙గిన్నెలో సీతాఫలం గుజ్జు, మిల్క్ క్రీమ్‌ను కలిపి బీట్ చేయాలి ∙కండెన్స్డ్ మిల్క్, వెనీలా ఎసెన్స్‌ను కూడా కలిపి బీట్ చేయాలి (మిక్సీ జార్లో కూడా వేసి బ్లెండ్ చేసుకోవచ్చు) ∙ప్లాస్టిక్ కంటెయినర్లోకి తీసుకుని 8 గంటలు లేదా ఒక రాత్రంతా డీఫ్రిజ్‌లో ఉంచాలి. (పిల్లలకు ఐస్‌లా ఇవ్వాలనుకుంటే ఐస్ మౌల్డ్‌లో ఈ మిశ్రమాన్ని పోసి రాత్రంతా ఉంచాలి) సర్వ్ చేయడానికి అయిదు నిమిషాలు ముందుగా ఫ్రిజ్ నుండి తీసి స్కూప్‌తో సర్వ్ చేసుకోవాలి. -
ఇంటిప్స్
చక్కెర డబ్బాకు, ఇతర స్వీట్లను ఎంత జాగ్రత్తగా, ఎత్తులో పెట్టినా... చీమలు కొత్త దారులు వెతుక్కుంటాయి. కిటికీలు, గోడల మీద నుంచి బాటలు వేసేస్తాయి. చీమల దారిలో దాల్చిన చెక్క లేదా లవంగం పెడితే ఇక ఆ దారిన చీమలు ప్రయాణించవు. ఇక అవి మరొక దారిని వెతుక్కునే దాకా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. అలాగే చక్కెర, స్వీట్ డబ్బాలో లవంగాలు లేదా దాల్చిన చెక్క పెడితే చీమలు దరిదాపులకు కూడా రావు. బుక్షెల్ఫ్ను శుభ్రం చేసి సర్దిన కొద్ది రోజులకే సన్నటి పురుగులు వస్తుంటాయి. వాటిని అలాగే వదిలేస్తే పుస్తకాలను తినేస్తాయి. షెల్ఫ్‌లో గంధపుచెక్కను ఉంచితే పురుగులు దరి చేరవు. మార్కెట్లో అసలైన గంధపు చెక్క దొరకడం కొంచె కష్టమే. గంధం పొడిలో కొద్దిగా నీటిని కలిపి గోళీలుగా చేసి ఆరిన తర్వాత పుస్తకాల మధ్య పెట్టవచ్చు. బట్టల బీరువా పాత వాసన రాకుండా ఉండాలన్నా కూడా ఇదే ఫార్ములా. ఆకుకూరలు వండేటప్పుడు ముదురుగా ఉన్న కాడలను తీసి పారేస్తుంటాం. అలాగే కొత్తిమీర కాడలు కూడా. ముదరు కాడలను చిన్న ముక్కలు చేసి లేదా మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి మొక్కలకు వేస్తే... చక్కటి ఎరువుగా పని చేసి మొక్కలు ఏపుగా పెరుగుతాయి. -
ఉప్పు తియ్యనౌతుంది.. నిప్పు నిల్వ ఉంటుంది!
సముద్రపు నీళ్లను తాగునీరుగా మార్చేందుకు, విద్యుత్తును భారీ స్ధాయిలో నిల్వ చేసేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం ఫలించింది! గ్రాఫీన్ పేరెప్పుడైనా విన్నారా? విని ఉండరుగానీ... ఇంట్లో పిల్లలు వాడే పెన్సిల్ మాత్రం మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో ఉండే గ్రాఫైట్‌ను ఒక పలుచటి పొరగా పరిస్తే దాన్ని గ్రాఫీన్ అంటారు. శాస్త్ర ప్రపంచంలో చాలాకాలంగా సూపర్ మెటీరియల్‌గా పేరు పొందింది ఈ మూలకం. పేరుకు తగ్గట్టుగానే ఇటీవలి కాలంలో ఈ అద్భుత మూలకం తాలూకూ ఉపయోగాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాతావరణ మార్పులు కానివ్వండి, ఇంకో కారణం కానివ్వండి.. ప్రపంచవ్యాప్తంగా తాగునీటికి కొరత ఏర్పడుతోందన్నది మాత్రం వాస్తవం. సముద్రంలోని నీటిని మంచినీటిగా మార్చుకుంటే ఈ కొరతను అధిగమించవచ్చుగానీ.. ఇది ఇప్పటికీ చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇక్కడే గ్రాఫీన్ గురించి చెప్పుకోవాలి. మామూలుగానైతే గ్రాఫీన్ ద్వారా లవణాలను వేరు చేయడం, చౌక, సులువు కూడా. అయితే గ్రాఫీన్‌ను పెద్ద ఎత్తున తయారు చేయడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మాంచెస్టర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రాహుల్ నాయర్ గ్రాఫీన్ స్థానంలో గ్రాఫీన్ ఆక్సైడ్‌ను పెద్ద ఎత్తున తయారు చేయడంలో విజయం సాధించారు. దీన్ని ఒక పూతగా వాడితే చాలు.. సముద్రపు ఉప్పునీటిలోని లవణాలు చాలా తేలికగా వేరుపడతాయి. ఈ పదార్థాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్లవణీకరణ యంత్రాల్లో ఉపయోగించి చూస్తామని, వచ్చే ఫలితాలను బట్టి మరింత అభివృద్ధి చేస్తామని రాహుల్ నాయర్ తెలిపారు. ఇక రెండో విషయానికి వద్దాం. తాగునీరు.. జీవితానికి ఎంత అవసరమో, కావాల్సినంత విద్యుత్తు మన జీవనశైలికి అంతే అవసరం. అయితే సూర్యుడి శక్తిని నిల్వ చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయం ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. గ్రాఫీన్‌తో తయారు చేసిన ఎలక్ట్రోడ్‌ను అభివృద్ధి చేయడం ద్వారా విద్యుత్తును బ్యాటరీల్లో నిల్వ చేసుకోగల సామర్థ్యం కొన్ని వందల రెట్లు ఎక్కువ కానుంది. అంతేకాదు, ఓ చెట్టు ఆకుల ఆకారాన్ని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రోడ్ ద్వారా శక్తిమంతమైన సూపర్ కెపాసిటర్లను తయారు చేయవచ్చునని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు అంటున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కలగూర దుంప
సూప్ చేసుకోవచ్చు... కూర చేసుకోవచ్చు... పులుసు చేసుకోవచ్చు... స్వీట్ చేసుకోవచ్చు... గంపెడు చిలగడ దుంపలు తెచ్చుకుంటే... ఘుమఘుమలాడే కూరల గంప చేయచ్చు. ద మోస్ట్ ఫేమస్ మల్టీపర్పస్ దుంప. కలగూర దుంప. సూప్ చైనీయులు చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఈ సూప్‌ను సేవిస్తారు. కావల్సినవి: చిలగడ దుంపలు – 2, అల్లం – చిన్న ముక్క (సన్నగా తరగాలి), నీళ్లు – 3 1/2 కప్పులు, ఎండు ఖర్జూరాలు – 8, బ్రౌన్‌షుగర్ – 60 గ్రాములు తయారీ: ∙చిలగడదుంపలను శుభ్రపరిచి, ముక్కలుగా తరిగి ఉడికించాలి. దీంట్లో అల్లం ముక్కలు, తరిగిన ఖర్జూరం వేసి సన్నని మంట మీద కనీసం 12–15 నిమిషాలు ఉడికించాలి. పైన షుగర్ వేసి కరిగేంతవరకు మరిగించి దించాలి. మంచి బంగారు రంగులో ఉండే ఈ సూప్ సేవిస్తే చాలా తేలికగా ఉంటుంది. త్వరగా జీర్ణమవుతుంది. గులాబ్ జామూన్ బెంగాలీల తీపి వంటకం. కావల్సినవి: చిలగడదుంపలు – 3 (400 గ్రాములు), కోవా – నిమ్మకాయ పరిమాణం లేదా 2 టేబుల్ స్పూన్లు, యాలకులు (పచ్చవి) – 6–8, మైదా – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – చిటికెడు, నూనె – వేయించడానికి తగినంత, పిస్తాపప్పు (తరిగినది) – టీ స్పూన్ పాకం కోసం : పంచదార – 2 కప్పులు, నీళ్లు – 2 కప్పులు తయారీ: ∙చిలగడ దుంపలను శుభ్రం చేసి, ఉడికించి, పై తొక్క తీసి గుజ్జు చేయాలి. ఈ మిశ్రమం 3 కప్పులు అవుతుంది. lమందపాటి గిన్నెలో పంచదార, నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద మరిగించాలి. పంచదార పాకం కొద్దిగా చిక్కబడేంతవరకు ఉంచాలి. ∙చిలగడదుంప ముద్దను నిమ్మకాయ పరిమాణంలో చిన్న చిన్న ముద్దలు చేయాలి. lఒక్కో చిలగడ దుంప ముద్దలో సమానంగా కోవా, యాలకుల పొడి, పిస్తాపప్పుతో స్టఫ్ చేయాలి. ∙మొత్తం బాల్లా చేతులతో రోల్ చేయాలి. ∙ఇలాగే అన్నీ సిద్ధం చేసుకోవాలి. మొత్తం 14 గులాబ్ జామూన్లు అవుతాయి. ∙కడాయిలో నూనె పోసి, కాగాక సిద్దం చేసుకున్న జామూన్లను వేసి బాగా వేయించాలి. ముదురు గోధుమరంగు వచ్చేంతవరకు వేయించిన గులాబ్జామూన్లను వేడి వేడి పంచదార పాకంలో వేయాలి. ∙పంచదార పాకంలో 20–30 నిమిషాల సేపు ఉంచి, సర్వ్ చేయాలి. నోట్: 5–6 గంటల కన్నా ఎక్కువసేపు గులాబ్జామూన్లను పాకంలో ఉంచకూడదు. అలా ఉంచితే జామూన్లు గుజ్జుగా అయిపోతాయి. తయారుచేసేటప్పుడు జామూన్లను ఆరిపోయేంతవరకు ఉంచకుండా ఒక్కోజామూన్ తయారీకి 20 సెకన్లు మాత్రమే టైమ్ తీసుకోవాలి. వేపుడు అస్సామీయుల వేపుడు. కావల్సినవి: చిలగడ దుంపలు – 4, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత తయారీ: ∙చిలగడ దుంపలను శుభ్రపరిచి సన్నని ముక్కలు(ఫింగర్ చిప్స్)గా కట్ చేయాలి. ఆవిరి మీద ఉడికించాలి. పొయ్యి మీద పెనం పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. సిద్ధం చేసుకున్న చిలగడ దుంప ముక్కలను పెనం మీద వేసి వేయించాలి. చిటికెడు ఉప్పు(తగినంత ఉప్పు చల్లుకోవచ్చు) పైన చల్లి, దించాలి. వేడి వేడిగా సర్వ్ చేయాలి. చిలగడ దుంపలను చక్రాలుగా కట్ చేసి, పై విధంగానే వేయిస్తారు. పులుసు కావల్సినవి: చిలగడదుంపలు – 2 (పెద్ద సైజు దుంపలు తీసుకొని శుభ్రం చేసి, చక్రాలుగా కట్ చేయాలి), ఉల్లిపాయలు – 2 (పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. లేదా సాంబారు, ఉల్లిపాయలు – 12 తీసుకోవాలి, టొమాటోలు – 2, పసుపు – పావు టీ స్పూన్, చింతపండు – నిమ్మకాయ పరిమాణం (కప్పు వేడినీళ్లలో నానబెట్టాలి), బెల్లం – అర టేబుల్ స్పూన్ లేదా పంచదార, ఉప్పు – తగినంత, కొత్తిమీర తరుగు – టీ స్పూన్, మసాలా పొడి – అర టీ స్పూన్ (దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు), ఎండుమిర్చి – 2, ధనియాల పొడి – 1 1/2 టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, శనగపప్పు – టీ స్పూన్, మినప్పప్పు – టీ స్పూన్, మెంతిపిండి – చిటికెడు, నవ్వుల పొడి – టీ స్పూన్ పోపు: నూనె – టేబుల్‌స్పూన్, ఆవాలు – 1/2 టీ స్పూన్, జీలకర్ర – 1/2 టీ స్పూన్, మినప్పప్పు – అర టీ స్పూన్, మెంతులు – చిటికెడు, ఇంగువ – చిటికెడు, ఎండుమిర్చి – 2 (ముక్కలు చేయాలి), కరివేపాకు – రెమ్మ తయారీ: ∙మందపాటి గిన్నెలో చిలగడదుంప ముక్కలు, ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి, పసుపు 4 కప్పుల నీళ్లు పోయాలి. దీనిని పొయ్యి మీద పెట్టి, కూరగాయ ముక్కలు సగం సగం ఉడికేదాక ఉంచాలి. దీంట్లో చింతపండు గుజ్జు, ఉప్పు, బెల్లం వేసి మరిగించాలి. మంట తగ్గించి మరో పది నిమిషాలు ఉడికాక మసాలా వేసి కలపాలి. ∙విడిగా మూకుడు పొయ్యి మీద పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి, ఈ పోపు మరుగుతున్న మిశ్రమంలో పోసి కలపాలి. చివరగా కరివేపాకు వేసి కలపాలి. ∙నిమిషం లేదా రెండు నిమిషాలు ఉంచి మంట తీసేయాలి. కొత్తిమీర వేసి మూత పెట్టి 10 నిమిషాల తర్వాత వేడి వేడి అన్నంలో అప్పడంతో పాటు వడ్డించాలి. నోట్: నువ్వుల పొడి లేదా వేయించిన నువ్వులు కలుపుకోవచ్చు. కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. హల్వా కావల్సినవి: చిలగడదుంప – 1 (పెద్దది), బెల్లం – కప్పు, నెయ్యి – టీ స్పూన్, జీడిపప్పు – 4, కిస్మిస్ – 4 తయారీ: ∙చిలగడ దుంపలను కడిగి, తొక్క తీసి, చివర్లను కట్ చేయాలి. తర్వాత తురమాలి. ఈ తురుము 1 1/2 కప్పు అవుతుంది. ∙ జీడిపప్పు, కిస్మిస్లను నెయ్యి వేసి వేయించాలి. lగిన్నెలో బెల్లం, కప్పు నీళ్లు పోసి కరిగించాలి. పాకం కాస్త చిక్కబడ్డాక చిలగడదుంప తురుము వేసి కలపాలి. మిగతా అన్ని పదార్థాలు∙వేసి 2 నిమిషాలు ఉంచాలి. తర్వాత మంట తీసేసి సర్వింగ్ బౌల్లో వేసి జీడిపప్పు, కిస్మిస్లు వేసి వేడిగానూ, చల్లగానూ సర్వ్ చేయాలి. టిక్కీ కావల్సినవి: చిలగడ దుంపలు – 4, అల్లం ముద్ద – అర టీ స్పూన్, పచ్చిమిర్చి ముద్ద – అర టీ స్పూన్, కార్న్‌ఫ్లోర్ – టేబుల్ స్పూన్, చాట్‌మసాలా – టీ స్నూప్, ఆమ్చూర్ పౌడర్ – అర టీ స్పూన్, నిమ్మరసం – టీ స్పూన్, జీలకర్ర (కచ్చాపచ్చాగా దంచాలి) – టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, నల్లుప్పు – తగినంత, నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙చిలగడదుంపలను శుభ్రపరిచి, కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి, ఉడికించి పక్కనుంచాలి. నీళ్లను ఒంపేయాలి. చల్లారిన తర్వాత పై తొక్క తీయాలి. ముద్ద చేయాలి. దీంట్లో నూనె మినహా పై పదార్థాలన్నీ వేసి కలపాలి. చిన్న చిన్న ముద్దలను చేసుకొని, అరచేత్తో అదిమి టిక్కీలను తయారు చేసుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి టీ స్పూన్‌తో నూనె వేసి, సిద్ధంగా ఉంచుకున్న టిక్కీలను రెండువైపులా వేయించాలి. కొత్తిమీర ఆకుతో అలంకరించి, సాస్ లేదా టొమాటో చట్నీతో వడ్డించాలి. -
స్వగృహ కేక్స్
-
మధురం.. సాయినామ స్మరణం
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి నామ స్మరణలో ఉన్న మాధుర్యాన్ని, మానవాళి శ్రేయస్సుకు బాబా పాటుపడిన వైనాన్ని చాటుతూ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు మంత్రముగ్ధులను చేశాయి. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన శ్రీకాకుళం సత్యసాయి భక్తులు ఆదివారం సాయంత్రం సాయికుల్వంత్ సభామందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత శ్రీకాకుళం జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు రమణయ్య జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సత్యసాయి సేవలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వివరించారు. పిదప చిన్నారులు ‘సత్యసాయి భక్త సామాజ్యం’ పేరుతో నృత్యరూపకం ప్రదర్శించారు. రావణ సంహారం చేసిన శ్రీరాముడు, గోవర్దన గిరిని ఎత్తిన శ్రీకృష్ణుడు, వరాహ, మశ్చ, వామన రూపంలో అవతరించిన దేవదేవుడు, సత్యసాయి ఒక్కరేనన్న సందేశాన్నిస్తూ చిన్నారులు నృత్యరూపకాన్ని కొనసాగించారు. మరో అద్భుత ప్రదర్శన ‘పాండవ విజయం’ ఘట్టంతో భక్తులు పరవశించిపోయారు. నృత్యరూపకం ముగింపులో దేశభక్తిని చాటుతూ ఆలపించిన ‘వందేమాతరం సుందర భారతం.. విశ్వానికి వెలుగుచూపు ప్రేమ మందిరం’ గీతం ఆద్యంతం ఆకట్టుకుంది. భక్తిప్రపత్తులతో తనను కొలిచే భక్తుల పాలిట పెన్నిధిగా సత్యసాయి అన్నివేâýæలా వెంట ఉండి అదుకుంటాడన్న సందేశంతో నృత్యరూపం ముగించారు. భక్తిశ్రద్ధలతో చిత్రావతి మంగళ హారతి శ్రీకాకుళం జిల్లా సత్యసాయి భక్తులు ఆదివారం వేకువజామునే ప్రశాంతి నిలయం నుంచి చిత్రావతి హారతి ఘాట్ వద్దకు చేరుకుని, అక్కడ సత్యసాయి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. వందలాది మంది భక్తులు హారతులు చేతబూని సత్యసాయికి మంగâýæహారతి ఇచ్చి, భక్తిగీతాలు ఆలపించారు. అనంతరం సత్యసాయి చిత్రపటంతో నగర సంకీర్తన నిర్వహించారు. ప్రశాంతి నిలయంలోని సాయిభక్త నివాస్‌లో వేదపండితులు మంత్రోచ్ఛారణ నడుమ సత్యసాయి సామూహిక వ్రతాలను భక్తిశ్రద్ధలతో పాటించారు. అనంతరం ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
పాపిడి.. ఉపాధి జడి
–పాలకొల్లు సోం పాపిడికి ఖండాంతర ఖ్యాతి –50 ఏళ్లుగా 20 కుటుంబాలు తయారీ –సంప్రదాయ పద్ధతిలోనేవంటకం పాపిడి పేరు చెప్పగానే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరి నోరూరుతుంది. వీధుల్లో పాపిడి బండి గంట శబ్ధం వినిపించగానే చిన్నారులు రుచి చూసేందుకు పరుగులు తీస్తుంటారు. కొని ఇవ్వకపోతే మారాం చేస్తుంటారు. ఇందులో పాలకొల్లు సోం పాపిడి రుచే వేరు. సంప్రదాయ పద్ధతిలో చేస్తున్న ఈ వంటకం ఖండాంతరాల్లో ఖ్యాతి గడించింది. పాలకొల్లు గుత్తులవారిపేటకు చెందిన సుమారు 20 కుటుంబాలు వంశపారంపర్యంగా 50 ఏళ్లుగా సోం పాపిడి తయారీతో ఉపాధి పొందుతున్నారు. – పాలకొల్లు టౌన్ పుల్లల పొయ్యిపై తయారీ పాలకొల్లు సోం పాపిడి దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు అమెరికా, కువైట్, దుబాయ్, ఐరోపా దేశాల్లో తెలుగువారి మనసు దోచుకుంది. పట్టణంలోని గుత్తులవారిపేటలో సుమారు 20 కుటుంబాలు 50 ఏళ్లు వంశపారంపర్యగా సనాతన పద్ధతులతో సోం పాపిడిని తయారుచేస్తూ జీవనం పొందుతున్నారు. ప్రస్తుతం 400 మంది మహిళల వరకు సోం పాపిడి తయారీలో ఉన్నారు. పుల్లల పొయ్యిపై పాపిడి తయారుచేయడం, నాణ్యత పాటించడంతో దీని మధురంగా ఉంటుందని తయారీదారులు అంటున్నారు. గ్యాస్ పొయ్యిపై పాపిడి తయారుచేస్తే ఇంత రుచి ఉండదని చెబుతున్నారు. తినరా మైమరచి.. సోం పాపిడి తయారీకి పంచదార, మైదా, డాల్డా వినియోగిస్తారు. కట్టెల పొయ్యిపై మొదటగా రెండు కిలోల పంచదారలో నీరు పోసి సమపాళ్లలో పాకం ముదిరేవరకు కట్టెలతో మండిస్తారు. దీంతోపాటు మైదా, డాల్డా కలిపి కట్టెల పొయ్యిపై కోవా తయారు చేసుకుని సిద్ధం చేసుకుంటారు. పాకాన్ని, కోవాను పాపిడి తయారు చేయడానికి అనువుగా ఉన్న నాపరాయిపై వేసి కర్ర పుల్లలతో కలుపుతూ ఉండటంతో కొంత సమయానికి సోం పాపిడి పీచు తయారు అవుతుంది. దీనిని మహిళలు కప్పుల్లో కొట్టి పీసులు సిద్ధం చేసి మైకా కవర్లలో ప్యాక్ చేసి అమ్మకానికి సిద్ధం చేస్తారు. రెండు కిలోల పంచదార, కిలో మైదా, 600 గ్రాముల డాల్డా మిశ్రమం ద్వారా మూడు కిలోలు సోం పాపిడి తయారవుతుందని తయారీదారులు చెబుతున్నారు. నేతి పాపిడికి యమ డిమాండ్ విదేశాలకు తీసుకువెళ్లే వారు ప్రత్యేకంగా నేతితో పాపిడిని తయారుచేయించుకుంటున్నారు. అమెరికా, కువైట్, దుబాయ్ పలు దేశాలతో పాటు, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న వారి బంధువులకు పాలకొల్లు సోం పాపిడిని ఇక్కడ తయారుచేయించి పంపిస్తుంటారు. డాల్డాతో చేసిన సోం పాపిడి కిలో రూ.110, నేతితో చేసిన సోం పాపిడి కిలో రూ.250కు విక్రయిస్తున్నాయి. అభివద్ధికి నోచుకోని కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా సోం పాపిడి తయారుచేస్తున్న ఈ కుటుంబాలు అభివద్ధికి నోచుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని, బ్యాంకు రుణాలు ఇప్పిస్తే పాపిడి తయారీని విస్తరించవచ్చని అంటున్నారు బ్యాంకు రుణాలు అందడం లేదు 50 ఏళ్లుగా తాతల కాలం నుంచి సోం పాపిడిని తయారు చేస్తున్నాం. మా తండ్రి చనిపోయాక వ్యాపారాన్ని నేను కొనసాగిస్తున్నా. నాతో పాటు 15 మంది పనిచేస్తున్నారు. ఇతర దేశాలకు మేం పాపిడిని పంపిస్తున్నాం. కట్టెల పొయ్యిపైనే తయారు చేయడం వల్లే ఈ రుచి వస్తుంది. బీసీ కార్పొరేషన్ రుణం కోసం రూ.2 లక్షలకు దరఖాస్తు చేశా. అయితే రూ.60 వేలు రుణం మంజూరయ్యింది. కానీ చేతికి సొమ్ములు అందలేదు. తక్కువ వడ్డీకి ప్రభుత్వం రుణ అందిస్తే వ్యాపారాన్ని మరింత విస్తరిస్తాం. –పెచ్చెట్టి లక్ష్మీ విమల, తయారీదారు, గుత్తులవారిపేట -
అఖండ జ్యోతి మన వెలుగు
నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా... అచ్చ తెనుగు వింటే జుంటి తేనెధారలు జుర్రుకున్నంత మధురంగా ఉంటుంది. తర తరాల మన సాంస్కృతిక ప్రగతికి పట్టుగొమ్మ తెలుగు మన అమ్మభాష. వేల ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు భాషకు ప్రాచీన హోదా గుర్తింపు ఒక లాంఛనమే. ఎందుకంటే ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా పేరుగాంచిన తెలుగు భాష ప్రపంచ మేధావులు మెచ్చిన అజంత భాష. ఏక వాక్యం మహా కావ్యం అన్న పద్ధతిలో బహుభాషా పండితుడు శ్రీ కష్ణదేవరాయలు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ఇచ్చిన కితాబు తెలుగు భాష ఔన్నత్యం భూదిగంతాలకు వ్యాపించేట్టు చేసింది. వ్యవహార భాషా ఉద్యమానికి ఆద్యుడు గిడుగు వెంకట రమణ మూర్తి జయంతి సందర్భంగా ఆగస్టు 29వ తేదీని ‘తెలుగు భాషా దినోత్సవం’గా ఆచరిస్తున్నాం. విశాఖ–కల్చరల్ : తొలి అడుగు గిడుగు ఇతిహాసాలు, పురాణాలు, ప్రామాణిక గ్రంథాలు కేవలం పండితులకు మాత్రమే అర్థమయ్యే దేవ భాష (దేవ నాగర లిపి)గా సంస్కృతానికి పెద్ద పీట వేసిన రోజుల్లో ఒక నిశ్శబ్ధ విప్లవం పుట్టింది. గ్రాంధికం స్థాయి నుంచి సామాన్యులకు సులభంగా అర్థమయ్యే విధంగా వ్యవహార భాషా ఉద్యమానికి భాషను నడిపించిన నాథుడు, ఉద్యమానికి ఆద్యుడు గిడుగు రామ్మూర్తి. తెలుగు వాడుక భాష ఉద్యమానికి పితామహుడు.పండితులకు అర్థమయ్యే గ్రాంధిక భాషలో ఉండే ప్రబంధ సాహిత్యమే సాహిత్యం అనుకునే రోజుల్ని ఆయన తిరగరాశారు. తెలుగు వచనాన్ని వాడుకభాషలోకి తీసుకొచ్చినlమహానీయుడయ్యాడు. గ్రాంధికం నుంచి వాడుక భాష వరకూ ... మనస్సులోని భావనను బహిర్గతపరచే సాధనం భాష. స్పష్టమైన ఉచ్ఛారణతో అభిప్రాయాన్ని ఎదుటివ్యక్తికి అర్థమయ్యేట్లు చెప్పగలగటమే భాషకు సార్ధకత. దాన్ని ప్రయోగాత్మకంగా రుజవు చేసి గిడుగు రామ్మూర్తి విజయం సాధించారు. భారత దేశం భిన్న సంస్కతులు, వేష, భాషలకు ఆలవాలమైనట్టే మన తెలుగు భాషకూ వేర్వేరు రూపాలున్నాయి. వ్యవహారిక భాషకు పట్టం గట్టిన రచనలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి భాషను సుసంపన్నం చేశాయి. ఆ క్రమం నుంచే మాండలికాలలో రచనలు, లిపి లేని అనుబంధ భాషా కవితోద్యమాలు తెలుగుదనాన్ని సమున్నత శిఖరాలవైపు పయనింపజేశాయి. సాహితీచరిత్రలో ఎందరో మహారధులు సాహితీ చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ‘కన్యాశుల్కం’ నాటకం రాసిన గురజాడ అప్పారావు మొదలు తెలుగు భాషకు సంబంధించిన నవీన పోకడలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. నవలా సాహిత్యం అగ్రతాంబూలం అందుకునే రోజుల్లో వాస్తవికతకు అద్దం పట్టే రచనలతో సమాజాన్ని కుదిపేసిన గుడిపాటి వెంకటా చలం (చలం) ఈ విశాఖ సాగర తీరం నుంచి పాఠక లోకానికి ‘ప్రేమలేఖలు’ రాసి మనసు గెలుచుకున్నాడు. గ్రాంధిక భాషాభిమానం తగ్గుముఖం పట్టాక వ్యవహార భాషోద్యమం ఊపందుకున్నాక తెలుగు సాహిత్యంలో పైరగాలి తెమ్మెరలా చెవుల్ని కమ్మేసే కమ్మటి లలిత సంగీతమై హత్తుకుంది. ఆ తరహా సాహిత్యానికి వెండితెర వేదికైంది. విప్లవ సాహిత్యం, ప్రేమ సాహిత్యం అన్న పరిధుల్ని చెరిపేసి సాహిత్యానికి అవధులు లేవని చాటి చెప్పిన మహా కవి శ్రీశ్రీ, ఆరుద్ర, అనువాద సాహిత్యానికి వన్నెలద్దిన మహనీయుడు ‘రాజశ్రీ’ ఈ ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. ఓ పక్క ఫక్తు సంగీతం, మరోపక్క అద్భుతమైన సాహిత్యం సమపాళ్లలో సృజించిన బాలాంత్రపు రజనీకాంతరావు తెలుగు భాషా వికాసానికి చేసిన కషి మరువలేనిది. వ్యవహార భాషలో కవిత్వాన్ని అరటి పండు ఒలిచిపెట్టినంత సులభంగా రచించిన అబ్బూరి వరద రాజేశ్వరరావు, ఆ వరసలోనే ఆయన తమ్ముడు గోపాలకష్ణ గణనీయమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఉత్తరాంధ్ర మాండలికానికి రాచఠీవి ఆపాదించిన మహా రచయిత ‘రావి శాస్త్రి’ తెలుగు నాట నాటక కళ ప్రయోగాలకు విశాఖపట్నం పెట్టింది పేరు. ఆధునిక నాటక రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్రలు పదిలపరచుకున్న గొల్లపూడి మారుతీరావు రచనలకు ప్రాకారం శ్రీకారం విశాఖ నగరమే. నాటకం, సినిమా అన్న తేడా లేకుండా తన కలం పాళీ నుంచి అద్భుతమైన సంభాషణలు, రసపట్టులో సాగే సమకాలీన కథలకు జీవం పోసిన కాశీ విశ్వనాథ్ తెలుగు భాషా వికాసానికి చేసిన సేవలు అనితర సాధ్యం. వ్యంగబాణాలు వేయడంలో అందెవేసిన చేయి పతంజలి. సంగీతం, సాహిత్యం రెంటినీ మేళవించి సంగీత నవావధానం ప్రక్రియతో భాషాభిమానులకు కొత్త ఇంధనం నింపే మీగడ రామలింగస్వామి ప్రయోగాలు తెలుగు జాతికి తరగని ఆస్తులు. తెలుగుకు తెగులెందుకంటే... ప్రాథమిక విద్యాస్థాయి బోధకులలో భాషాపండితులు ఉండడం లేదు. పరభాషా పదాలను విచ్చలవిడిగా వినియోగించడం, ప్రభుత్వ స్థాయిలోనే వివిధ పథకాలకు ఇంగ్లిష్‌లో పేర్లు పెట్టడం, తెలుగు భాషను పిల్లలకు చేరువ చేసేలా తెలుగులో కొత్త కృత్రిమ సచేతమైన వ్యక్తలు(యానమేషన్ చార్టర్)కార్యక్రమం నిర్వహించాలి. ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగుకి ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఈ స్థితిని చక్కదిద్దడానికి వ్యక్తులు, సంస్థలు కృషి మరింత పెరగాలి. తేటతెలుగు మాటల అల్లిక కరువైపోతుంది. స్వరమాధుర్యం కరువైపోతుంది. తెలుగు భాషలో మాట్లాడే వారే తక్కువైపోతున్నారు. ఆధునిక పోకడల పేరుతో మాతృభాష స్వరూప స్వభావాలను, రూపురేఖలను మార్చేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే వర్ణ, పద, వాక్య స్థాయిలలో పరభాషా పదాలు ఎక్కువై, వ్యాకరణం మాత్రమే తెలుగులో ఉండే స్థితి వచ్చింది. సారస్వత వేదికలకు కల్ప తరువు తెలుగు భాషకు పూర్వ వైభవం తేవాలన్న మొక్కవోని దీక్షతో ఆహర్నిశలూ శ్రమిస్తూ సాహితీ సజనకు అంకితమయ్యే సారస్వత వేదికలకు విశాఖ ఆది నుంచి కల్పతరువే. విశాఖ సాహితి, సహదయ సాహితి, మొజాయిక్, సాహిత్య సురభి, వంటి ఎన్నో సంస్థలు సాహితీ సజనకు గీటురాయి వంటి చర్చోపచర్చలు చేపట్టి నేటి తరాలకు వేగుచుక్కల్లా వ్యవహరిస్తున్నాయి. తెలుగు రచయితల వేదిక విశాఖ సాహితి, మొజాయిక్ సాహిత్య సంస్థలు తెలుగు రచయితల వేదికగా నిలుస్తున్నాయి. తెలుగు భాషా సాహిత్యాలు వికాసమే లక్ష్యంగా తెలుగు రచయితల వేదికగా నిలుస్తున్నాయి. కథారచన, కవితారచన, సాహిత్య విమర్శల జల్లుకు వేదికగా నిలుస్తోంది. ముఖ్యంగా మొజాయిక్ సాహిత్య సంస్థ రచయితల కల్పతరువుగాను, అనువాద సాహిత్యాల వేదికగా నిలుస్తోంది. తెలుగు భాష పరిరక్షణ చట్టాన్ని అమలు పరచాలి నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్ని శిలాఫలకాలు తెలుగులోనే ఉండాలి. తెలుగు భాష పరిరక్షణ చట్టాన్ని సంపూర్ణంగా అమలు పరచాలి. తెలుగు పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు పరచాలి. గత ఏడాది గిడుగు రామూర్తి పంతులుగారి పుట్టిన రోజు సందర్భంగా నాలుగో తరగతి నుంచి డిగ్రీ వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులో బోధిస్తామని చేసిన వాగ్దానాలు, చట్టాలు సంపూర్ణంగా అమలు చేయాలి. – డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సాహితీవేత్త తెలుగు భాష ఔన్నత్యం చాటాలి తెలుగు భాష జ్ఞానాన్ని, ఔన్నత్యాన్ని వెలుగెత్తి చాటాలి. వ్యవహారిక భాషకు ప్రాధాన్యం ఇవ్వాలి. తెలుగు వ్యవహారిక భాషోద్యమకారుడైన గిడుగు రామ్మూర్తి సేవలను గుర్తించాలి. వెయ్యేళ్ల సాహిత్యం ఉన్న భాషగా తెలుగును గుర్తించాలి. భవిష్యత్తు తరాలకు తెలుగుదనం బోధించే విధంగా విద్యామాధ్యమాల్లో తెలుగు ప్రాథమిక బోధన వాడాలి. ఒకటి నుంచి డిగ్రీ, సాంకేతిక విద్య, ఎంబీఏ వంటి పోస్టుగ్రాడ్యుయేట్ చదువుల వరకు తెలుగు భాషను కచ్చితంగా అమలు పరచాలి. భాషా అభివద్ధి, నైపుణ్యతకు ప్రభుత్వ చిత్తశుద్ధి వహించాలి. –రామతీర్ధ, మొజాయిక్ వ్యవస్థాపక కార్యదర్శి, సాహిత్య విమర్శకుడు ఆదివారం–తెలుగువారం ‘ఆదివారం–తెలుగువారం’అనే నినాదం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఆహార వ్యవహారాలన్నీ తెలుగులోనే నిర్వహించే ఒరవడికి శ్రీకారం చుట్టాలి. దీని కోసం మూడు రోజులపాటు ఒక నిర్దుష్ట లక్ష్యసాధన కోసం 29 నుంచి మూడు రోజుల పాటు తెలుగు దీక్ష పేరుతో యజ్ఞం చేస్తున్నాను. ‘తెలుగు దండు’పేరుతో లక్ష సంతకాలు సేకరిస్తున్నాం. భావ సారూప్యం కలిగిన భాషాభిమానులతో ఏర్పడిన తెలుగు దండులో భాషాభిమానులంతా సభ్యులుగా చేరి తెలుగు భాషాభివద్ధికి కషి చేయాలి. –పరవస్తు ఫణిశయన సూరి, పరవస్తు పద్యపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు భాషా పరిరక్షణలో భాగస్వాములు కావాలి ప్రపంచీకరణ మోజులో తెలుగు జాతి తన ఉనికి, అస్తిత్వం కోల్పోతుందేమోనన్న దిగులు తొలిచేస్తోంది. దాన్నుంచి మన తెలుగు జాతి త్వరగా బయటపడాలి. లేకపోతే మన మాతృభాష ‘మృత’భాషల జాబితాలో చేరిపోయే ప్రమాదం పొంచి ఉంది. యునెస్కో చేసిన పిడుగులాంటి హెచ్చరిక నిజం కాకూడదని త్రికరణ శుద్ధితో కోరుకొంటున్నా. ఆగస్టు 29న వ్యవహారిక భాషా ఉద్యమానికి ఆద్యుడైన గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా మాతృభాషాదినోత్సవం రోజున ఈ మహా క్రతువు చేపడుతున్నాం. ఒక వేలు పిడికిలి కాదు..ఒక చెట్టు వనం కాదు’ కాబట్టి తెలుగు వారందరూ ఇందులో భాగస్వాములు కావాలి. –సాహితీ రత్నాకర డాక్టర్ డి.వి.సూర్యారావు, సాహిత్య విమర్శకుడు -
స్నేహం ఓ మధురం
స్నేహం.. ఓ మధురానుభూతి. అది కలకాలం నిలిచిపోతుంది. దీనికి గుర్తుగా ఓ మంచి బహుమతి ఇవ్వాలని స్నేహితులు ఆరాటపడుతుంటారు. ఏటా ఆగస్టు తొలి ఆదివారం జరుపుకొనే ఫ్రెండ్‌షిప్‌డే కోసం చిన్నాపెద్దా ఎదురుచూస్తుంటారు. స్నేహానికి మధురస్మతిగా చక్కటి బహుమతితో ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందర్నీ ఆకర్షించే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, బహుమతులు విక్రయించే స్టాళ్లు నగరంలో ఎక్కడికక్కడ ఆకర్షిస్తున్నాయి. యూత్ అభిరుచి తగ్గట్టుగానే డార్లింగ్ పారడైజ్ వంటి గిఫ్ట్హౌసెస్లో 2016 లేటెస్ట్ బహుమతులు అందుబాటులో ఉన్నాయి. ఫ్రెండ్షిఫ్ ఫిల్లో, మెసేజ్బాటిల్, ఫొటోఫ్రేం, వాటర్ ఫౌంటైన్, బాస్కెట్ విత్ టెడ్డీబేర్, ఫ్రెండ్షిప్ చాక్లెట్, ల్యాంప్, ఫ్రెండ్షిప్ వాటర్ డూమ్, గ్రీటింగ్ కార్డ్సు, ఫ్రెండ్షిప్ కీచైన్లు, చాక్లెట్ విత్ బోకే టెడ్డీ తదితర బహుమతులు ఆకట్టుకుంటున్నాయి. – పెదవాల్తేరు -
‘ఆశ’లకు త్వరలో తీపి కబురు!
ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మం వైద్య విభాగం: ‘‘ఆశ వర్కర్లకు త్వరలోనే తీపి కబురు అందుతుంది’’ అని, అధికార పార్టీకి చెందిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. వైద్య విభాగంలో క్షేత్ర స్థాయిలో ఆశ వర్కర్లు అందిస్తున్న సేవలు మరువలేనివని ఆయన అన్నారు. ఆశ సమ్మేళన సభ గురువారం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగింది. ముఖ్య అతిథిగా అజయ్‌కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్య విభాగాలు బాగుంటే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుందన్నారు. గ్రామ స్థాయిలో పనిచేస్తున్న ఆశ వర్కర్లను ప్రోత్సహించేందుకు సమ్మేళనం నిర్వహించటం అభినందనీయమన్నారు. మాతాశిశు మరణాలను తగ్గించడంలో ఆశ వర్కర్లు అందిస్తున్న సేవలు అమోఘమని అన్నారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజు. ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఆయన నుంచి త్వరలోనే తీపి కబురు వింటారు’’ అని చెప్పారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఆశ వర్కర్లు ప్రోత్సాహకం పెంపుపై ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఉత్తమ సేవలందించిన ఆశ వర్కర్లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఎమ్మెల్యే అజయ్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర పాపాలాల్, పీఓ డీటీటీ అన్న ప్రసన్న, డెమో వెంకన్న, ఎస్పీహెచ్ఓ డాక్టర్ మాలతి, హెచ్ఈఓ ప్రసాద్, ఖమ్మం క్లస్టర్ పరిధిలోని 13 పీహెచ్‌సీలకు చెందిన ఆశలు పాల్గొన్నారు. -
పిల్లితో భారీ వ్యాపారం!
జపాన్ః వ్యాపారాభి వృద్ధికోసం ఒక్కొక్కరు ఒక్కో టెక్నిక్ ఉపయోగిస్తారు. ముఖ్యంగా జనాన్ని ఆకట్టుకోడానికి రకరకాల ఎత్తులు వేస్తుంటారు. కొందరు మాటలతోనే కొనుగోలుదారులను ఆకట్టుకోడానికి చూస్తే.. మరికొందరు డెకరేషన్లు,లైటింగ్ లు వంటి అనేక రకాల ఆకర్షణలను ఎర వేస్తుటారు. అయితే జపాన్ లో మాత్రం ఓ పిల్లి..తనదైన శైలిలో చిన్నారులను ఆకట్టుకుంటూ.. తన వ్యాపారాన్ని చలాకీగా సాగించేస్తోంది. పిల్లి వ్యాపారం చేయడమేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అమెరికాలో అందరూ ఇష్టపడే హాట్ డాగ్స్..., సింగపూర్ లో వేడినుంచీ ఉపశమనాన్నిచ్చే ఐస్ క్రీమ్స్ లాగానే... జపాన్ లో జనం యాకీ ఇమో (రోస్టెడ్ స్వీట్ పొటాటో) ను అమితంగా ఇష్టపడతారు. ముఖ్యంగా చలికాలంలో ఈ యాకీ ఇమో అమ్మకాలు భారీగా జరిపేందుకు టొట్టోరి ప్రిఫిక్చర్, కురాయోషి నగరంలో ఓ లెజెండరీ క్యాట్ రంగంలోకి దిగింది. జనం ఎంతో ఇష్టంగా తినే ఐటెమ్ అయినా వ్యాపారానికి మాత్రం పోటీ తప్పదు కదా. అందుకే ఇక్కడ యాకీ ఇమో వ్యాపారి తనదైన శైలిలో పిల్లలను ఆకట్టుకునేందుకు ఓ అందమైన పిల్లిని ఆయుధంగా చేసుకున్నాడు. పిల్లిలాటి కోటును ధరించి పిల్లలను ఆకట్టుకుంటూ చలాకీగా అమ్మకాలు జరిపేయడమే కాదు... వారితో కలసి సెల్ఫీలు, ఫోటోలు తీయించుకుంటూ హుషారుగా వ్యాపారం చేసేస్తున్నాడు. బొమ్మలంటే చిన్నారులు ఎంతో ఇష్టపడతారన్న ఉద్దేశ్యంతో తన వ్యాపారాభివృద్ధికి 'మికెనెకో యమాడా'.. ఈ కొత్త ప్రయోగాన్ని ప్రవేశ పెట్టాడు. దీంతో పిల్లలంతా యమాడా రోస్టింగ్ స్టాండ్ దగ్గరకు పరుగులు తీస్తున్నారు. యాకీ ఇమోలను తినడంకన్నా పిల్లి బొమ్మను ఇష్టంగా చూస్తూ షేక్ హ్యాండ్ లు, హాయ్.. బాయ్.. లు చెప్తున్నారు. ఇలా వినూత్న తరహాలో అమ్మకాలను పెంచుకుంటున్న మికెనెకో ఆధునిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగించుకొని తాను ఏరోజు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో ముందుగానే ట్వీట్ చేస్తున్నాడు. వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే జపాన్ వీధులు యాకీ ఇమోల వ్యాపారులతో కళకళ్ళాడుతాయి. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్న సమయంలో ఇండియాలో మిర్చి బజ్జీలు, నిప్పుల్లో కాల్చిన జొన్న కండెలు తిన్నట్లుగా అక్కడి జనం.. గులకరాళ్ళపై రోస్ట్ చేసే స్వీట్ పొటాటోలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే కొందరు ఈ యాకీ ఇమోలను రాలిన ఆకుల మంటతోనూ, బొగ్గులపైనా కూడా రోస్ట్ చేస్తుంటారు. వేగంగా పని అయిపోవాలనుకునే మరి కొందరు రోస్ట్ చేసేందుకు మైక్రోవేవ్ ను కూడా వినియోగిస్తారు. కానీ అన్నింటికంటే గులకరాళ్ళపై రోస్ట్ చేసే వాటినే జపాన్ జనం ఎక్కువగా ఇష్టపడతారు. మరి కొనుగోలుదారులను ఆకట్టుకొనేందుకు ఇతర దేశాలవారూ ఇలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చేమో చూడండి..! -
బుందేల్ టు బందర్
సో స్వీట్ ‘‘ష్ష్ష్ ... పెద్దగా అరవకండి. మా బందరమ్మాయి అంటే చాలు, ఇంకేం చెప్పక్కర్లేదు. లక్షణమైన పిల్ల అని అర్థమైపోతుంది. మీకు మరో సంగతి తెలుసా? మా బందరమ్మాయిలందరూ బందరులోనే పుడతారు’’ ... అంటూ మురిసిపోతూ నవ్వుతాడు కోట శ్రీనివాసరావు.. ‘ష్.. గప్‌చుప్’ సినిమాలో. ‘బందరులో పుట్టడం వల్లనే కదా బందరమ్మాయి అవుతుంది... ఇదో పెద్ద జోకు... హు...’ అనిపించినా సరే... కోట హావభావాలు నిజంగానే నవ్విస్తాయి. ఆ సినిమాలో ఆయన చాలా స్ట్రిక్టు పోలీస్ ఆఫీసర్. అయితే ఆయనకు బందరు బలహీనత ఎంతంటే... బందరు లడ్డు తియ్యదనమంత. మచిలీపట్నం వచ్చిన ప్రముఖులంతా తాతారావు స్వీట్ షాప్‌లో బందరు మిఠాయి రుచి చూడకుండా వెళ్లరనేది ప్రతీతి. అందుకు తగ్గట్లే ఆ షాపులో లడ్డు రుచి చూస్తున్న నీలం సంజీవరెడ్డి, పివి నరసింహారావు, ఎన్టీ రామారావు, వైఎస్ఆర్, రోశయ్య తదితరుల ఫొటోలున్నాయి. ఎవరు నేర్పారీ విద్యను! ఇదంతా బాగానే ఉంది... పూసను దంచి లడ్డు చేయడం అనే ప్రత్యేకమైన విధానం ఈ ఊరికి మాత్రమే ఎలా పరిమితమైంది? మచిలీపట్నంలోని వీధులను చూస్తూ ఈడేపల్లి సన్నని రోడ్డు వైపు మళ్లగానే... ఆ వరుసలో ఒక స్వీట్ షాపు. అధునాతనంగా కట్టిన ఆ దుకాణం ముందు వరండాలో ఓ తోపుడు బండి ఉంది, బండికి టైర్లు లేవు. దాని మీద ‘మల్లయ్య మిఠాయి బండి - 1958’ అని రాసి ఉంది. బండి మీద అద్దాల అరల్లో స్వీట్లు, చెగోడీలు, పకోడీలున్నాయి. బండి ముందు వెంకటేశ్వర్రావు. ‘రండి... రండి’ అంటూ పలకరించి, ‘ఇది మా నాన్న మల్లయ్య సొంతంగా మిఠాయి వ్యాపారం చేసినప్పటి బండి. ఆయన జ్ఞాపకంగా దీనినే కౌంటర్‌గా మార్చుకున్నాను’ అంటూ కిటికీలో ఉన్న ల్యామినేటెడ్ ఫొటో చూపించారు. అందులో ఇనుప బాణలిలో నుంచి బూందీ తీస్తున్న పెద్దాయన, ఇంకా మరికొంత మంది ఫొటోలు ఉన్నాయి. ‘‘ఈయనే మా నాన్న. బండి పెట్టక ముందు ఆయన వీరి స్వీట్ షాపుల్లో పని చేశారు. వీళ్లు ఆయనకు పని నేర్పిన గురువులు. వాళ్లకు పని నేర్పిన వాళ్లు బుందేల్ సింగులు. వాళ్లనే బొందిలీలు అంటారిక్కడ’’ అన్నారు వెంకటేశ్వర్రావు. హమ్మయ్య!! ఆధారం దొరికింది. ఇక వివరాలు తెలియాలి. రాజపుత్రుల రుచులు! మచిలీపట్నానికి ఈ లడ్డును పరిచయం చేసింది బుందేల్‌ఖండ్ రాజపుత్రులు. శత్రుదాడులతో రాజపుత్రుల రాజ్యాలు బలహీనమయ్యాయి. చిత్తోడ్‌లో ఉదయ్‌సింగ్ వంటి వారు అడవుల్లో తలదాచుకుని తిరిగి సైన్యాన్ని సమీకరించుకుని ముస్లిం పాలకుల మీద దాడి చేసి తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అది అందరికీ సాధ్యం కాలేదు. అలా రాజ్యాలు కోల్పోయి వచ్చిన వాళ్లే ఈ బుందేల్‌ఖండ్ రాజపుత్రులు కూడా. కుటుంబాలు, బంధుగణంతో ఉత్తరాది నుంచి పారిపోయి వింధ్య పర్వతాలు దాటి దక్కనులో స్థిరపడ్డారు. అలా ఒక్కొక్క సమూహం ఒక్కో చోట స్థిరపడిన క్రమంలో ఒక కుటుంబం బందరు చేరింది. వాళ్లు బుద్ధూసింగ్, నారాయణ్ సింగ్, నాథ్‌సింగ్, జగన్నాథ్ సింగ్, ఠాకూర్‌సింగ్... ఐదుగురు సోదరులు. కత్తి- డాలు అన్నం పెట్టాయి! వచ్చారు సరే... బతకడానికి ఏం చేయాలి? యుద్ధం చేయడం తప్ప సేద్యం చేయడం తెలియదు. సముద్రం మీదకెళ్లి చేపలు పట్టడమూ చేతరాదు. ఎక్కడ నివసించే వారికైనా సరే... తినడానికి తగినట్లు రుచిగా వండుకోవడం వచ్చి ఉంటుంది. అదే వారికి బతుకుతెరువైంది. అందరి దగ్గరా యుద్ధం చేసే కత్తి, డాలు ఉన్నాయి. వాటినే అన్నం పెట్టే సాధనాలుగా మార్చుకున్నారు. ఒక డాలును నెయ్యి కాచే బాణలిగా మార్చుకున్నారు. ఒక డాలుకు కత్తితో చిల్లులు పెట్టారు. శనగపిండిని జారుడుగా కలిపి ఆ డాలులో పోసి తిప్పితే పూస పడుతుంది. మరొక డాలుకు చిల్లులు పెట్టి పూస తీసే గిన్నె (గరిట)గా మార్చుకున్నారు. బెల్లం పాకంతో లడ్డు తయారు చేశారు. గోధుమపాల హల్వా, బెల్లం జిలేబి, మిఠాయి, గుల్ల పకోడి... అన్నీ వారి వంటకాలే. మరి మిఠాయిలకు పేరు! రాజపుత్రులు తమను ‘బుందేలులు’గా పరిచయం చేసుకున్నారు. అది బొందిలీలుగానూ, వారి లడ్డుకు బొందిలీల లడ్డు, బొందిలి మిఠాయిలు అనే పేరొచ్చింది. బయట ఊర్ల వాళ్లు మాత్రం బందరు లడ్డు అంటారు’’ అని చెప్పారు వెంకటేశ్వర్రావు. బందరు లడ్డు మిస్టరీ వీడింది. అన్నట్లు స్వీట్ల చరిత్రలో బందరు లడ్డుకు మరో విశేషం కూడా ఉంది. 1998లో బందరులడ్డు డాట్‌కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేశారు వెంకటేశ్వర్రావు. స్వీట్ల కోసమే కేటాయిచిన తొలి వెబ్సైట్ అది. కంప్యూటర్ ఇల్లిటరేట్ అయిన వెంకటేశ్వర్రావు ఇందుకోసం మద్రాసుకెళ్లి రెండు లక్షలు ఖర్చు పెట్టి వెబ్సైట్ తెరిచారు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (మచిలీపట్నం నుంచి) లడ్డు తయారీకి 12 గంటలు బందరు మిఠాయిలన్నీ బెల్లంతోనే చేస్తారు. చక్కెర వాడరు. లడ్డు కోసం... శనగపిండిని జారుడుగా కలిపి నేతిలో పూసను దోరగా కాల్చి చల్లార్చాలి. చల్లారిన పూసను రోట్లో వేసి దంచాలి. ఆ దంచిన పొడిని బెల్లం పాకంలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టి మళ్లీ దంచాలి. ఆ తర్వాత ఉండకట్టాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి పన్నెండు గంటలు పడుతుంది. పాళ్లు మాత్రం రహస్యం. - వెంకటేశ్వర్రావు, మల్లయ్య స్వీట్ షాప్, మచిలీపట్నం -
స్వీట్‌క్రాంతి
ఈ వంటలు మీరు వండితే మీకు ఎన్ని ప్రశంసలో... స్వీట్ వైఫ్ స్వీట్ మదర్ స్వీట్ సిస్టర్ స్వీట్ డాటర్ స్వీట్ డాటర్ ఇన్ లా స్వీట్ మదర్ ఇన్ లా మీవారు వండితే...స్వీటెస్ట్ హజ్బెండ్ మీవారితో వండించగలిగితే ఆహా.. ఓహో.. అప్పుడు స్వీట్ క్రాంతే!! నువ్వులు బెల్లం బొబ్బట్లు కావల్సినవి: తెల్ల నువ్వులు - 2 కప్పులు; బెల్లం తురుము - 2 కప్పులు; యాలకుల పొడి - ఒకటిన్నర టీ స్పూన్; మైదాపిండి- ఒకటిన్నర కప్పులు; నెయ్యి - వేయించ డానికి సరిపడా తయారి: మైదాపిండిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి కలపాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి, పూరీ పిండిలా కలిపి తడిబట్ట కప్పి ఉంచాలి. బాణలిలో నువ్వులు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. నువ్వులు చల్లారిన తర్వాత బెల్లం తురుము వేసి, రెండూ కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. లేదా రోట్లో దంచినా మంచిదే. దీంట్లో యాలకులపొడి వేసి క లిపి ఉంచాలి.మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకొని, పూరీలా వత్తి అందులో నువ్వుల మిశ్రమం పెట్టి బొబ్బట్టు మాదిరిగా వత్తాలి. దీనిని పెనం మీద నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చి, తీయాలి. పాల తాలికలు కావల్సినవి: పచ్చి బియ్యపుపిండి (బియ్యం నానబెట్టి, వడకట్టి, గ్రైండ్ చేయాలి) - 4 కప్పులు; నీళ్లు - 2 లీటర్లు; చిక్కగా మరిగించిన పాలు - లీటరు బెల్లం తురుము - కిలో; సగ్గుబియ్యం - 100 గ్రాములు జీడిపప్పు పలుకులు - 75 గ్రాములు (సగం పొడి చేసుకోవాలి) యాలకుల పొడి - టీ స్పూను బాదంపప్పులు, కిస్మిస్లు - ఒక్కో చెంచా (లేకపోయినా ఫర్వాలేదు) నెయ్యి - 100 గ్రాములు తయారి: గుప్పెడు బెల్లం తురుము విడిగా ఉంచి, మిగిలిన బెల్లంలో మూడువంతుల యాలకులపొడి వేసి, కొద్దిగా నీళ్లు పోసి, తీగపాకం పట్టి, పక్కన ఉంచాలి.బియ్యప్పిండిలో మిగిలిన యాలకుల పొడి, బెల్లం తురుము, సగం నెయ్యి, జీడిపప్పు పొడి, తగినన్ని పాలు పోసి బాగా కలిపి, గట్టి ముద్ద చేసి ఉంచాలి. జీడిపప్పును నేతిలో దోరగా వేయించి పక్కన ఉంచాలి.కుకర్‌లో నీళ్లు పోసి మరిగించాలి. మురుకుల గిద్దె(కుడక)లో బియ్యప్పిండి ముద్ద పెట్టి, మరుగుతున్న నీళ్లలో వత్తాలి. కడిగిన సగ్గుబియ్యం కూడా వేసి, మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.కుకర్ వేడి తగ్గాక మూత తీసి, బెల్లం పాకం పోసి, జీడిపప్పు, నెయ్యి వేసి కలపాలి.చివరగా పాలు పోసి మళ్లీ కలిపి, కొద్దిగా ఉడికించి దించేయాలి. కమ్మని పాల తాలికలు రెడీ. పాకం గారెలు కావల్సినవి: మినప్పప్పు -అర కిలో బెల్లం తురుము - అర కిలో నీళ్లు - తగినన్ని నూనె - వేయించేందుకు సరిపడా నెయ్యి - 50 గ్రాములు యాలకుల పొడి - 1 టీ స్పూన్ ఉప్పు - తగినంత తయారి: పొట్టు తీసిన మినప్పప్పును ముందురోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లన్నీ వంపేసి, గారె చేయడానికి అనువుగా పిండి గట్టిగా ఉండేలా రుబ్బుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు కలుపుకోవాలి.బెల్లం తురుములో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి, అందులో యాలకుల పొడి కలిపి పక్కన ఉంచాలి.గారెలు వత్తుకొని, నెయ్యి కలిపిన నూనెలో దోరగా వేయించి, వేడిగా ఉండగానే పాకంలో వేయాలి. వీటిని ఓ పూటంతా కదపకుండా ఉంచితే పాకంలో గారెలు బాగా నాని రుచిగా ఉంటాయి. గోధుమరవ్వ హల్వా కావల్సినవి: చిన్నగోధుమ రవ్వ - 1కప్పు పాలు - 2 కప్పులు; నీళ్లు - 1 కప్పు యాలకుల పొడి - చిటికెడు జీడిపప్పు పలుకులు - 10 కిస్మిస్ - 10 పంచదార - 2 కప్పులు నెయ్యి - 4 పెద్ద చెంచాలు కుంకుమపువ్వు - కొద్దిగా తయారి: మందపాటి గిన్నెలో నెయ్యి వేసి స్టౌ మీద పెట్టాలి. నెయ్యి కరిగాక జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే నెయ్యిలో రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. ఈ రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో పాలు, నీళ్లు కలిపి మరిగించాలి. దానిలో గోధుమరవ్వను కొద్ది కొద్దిగా పోస్తూ, ఉండలు లేకుండా కలుపుతూ ఉడకనివ్వాలి. రవ్వ బాగా ఉడికాక అందులో పంచదార, నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. పంచదార కరిగి, హల్వా కొద్దిగా దగ్గరకి వచ్చేవరకు కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. దీంట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, కుంకుమ పువ్వు వేసి మంట తీసేయాలి. ఘుమఘుమలాడే గోధుమరవ్వ హల్వా రెడీ. (కావాలనుకుంటే దీంట్లో చిటికెడు ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు. చెరకురసం పరమాన్నం కావల్సినవి: కొత్త బియ్యం - 1 గ్లాసు చెరకురసం - రెండు గ్లాసులు యాలకుల పొడి - చిటికెడు నెయ్యి - 4 పెద్ద చెంచాలు జీడిపప్పు పలుకులు - 15-20 కిస్మిస్ - 10 తయారి: జీడిపప్పును కొద్దిగా నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. బియ్యం కడిగి, రెండు గ్లాసుల నీళ్లు పోసి అరగంట నానబెట్టి, తర్వాత ఉడికించాలి. అన్నం పూర్తిగా అయ్యాక చెరకురసం పోసి, నీరంతా ఆవిరయ్యేవరకూ ఉడికించాలి. దీంట్లో యాలకులపొడి, నెయ్యి, వేయించిన జీడిపప్పు పలుకులు వేసి కలిపితే చెరకురసం పరమాన్నం సిద్ధం. (తీపిదనం ఎక్కువ కావాలనుకున్నవారు చెరకురసంతో పాటు బెల్లం కూడా కలిపి అన్నాన్ని ఉడికించవచ్చు.) కావాలనుకుంటే ఇంకా నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ కలుపుకోవచ్చు. పూర్ణం బూరెలు కావల్సినవి: పచ్చి శనగపప్పు - 2 కప్పులు మినప్పప్పు - కప్పు కొత్త బియ్యం - 2 కప్పులు బెల్లం తురుము - 2 కప్పులు నెయ్యి - అర కప్పు నూనె - వేయించడానికి సరిపడా తయారి: మినపప్పు, బియ్యం కడిగి సరిపడా నీళ్లు పోసి కనీసం నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.శనగపప్పులో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించి, అందులో తరిగిన బెల్లం వేసి మళ్లీ ఉడికించాలి. నీళ్లన్నీ ఆవిరై, పప్పు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి. చివరగా యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి. (ఉడికిన శనగపప్పులో నీళ్లు ఒంపేసి, బెల్లం, యాలకులపొడి, నెయ్యి వేసి, ఉడికించి, చల్లారాక రోట్లో మొత్తగా రుబ్బుకోవచ్చు) చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి. ఒక్కో ఉండనూ మెత్తగా రుబ్బిన పప్పు మిశ్రమంలో ముంచి నూనెలో వేసి, బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. నువ్వులన్నం (పులగం) కావల్సినవి: కొత్త బియ్యం - పావు కేజీ నల్ల నువ్వులు - పెద్ద చెంచాడు ఉప్పు - తగినంత; నీళ్లు - 3 గ్లాసులు తయారి: ముందురోజు రాత్రి నువ్వులను కొద్దిగా వేయించి, రోట్లో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో బియ్యం వేసి, కొద్దిగా దంచుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా బియ్యానికి నువ్వుల పొడి పట్టేంతవరకు దంచి, తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాతిరోజు ఉదయం గిన్నెలో నీళ్లు పోసి, మరిగాక, ఉప్పు వేయాలి. అందులో సిద్ధంగా ఉంచిన బియ్యం పోసి, కలిపి ఉడకనివ్వాలి. అన్నం పూర్తిగా అయ్యేంతవరకు ఉంచి, దించాలి. మరీ మెత్తగా కావాలనుకుంటే మరికొన్ని నీళ్లు పైన చల్లి, ఉడికించుకోవచ్చు.మరిగించిన పాలలో బెల్లం కలిపి, కరిగించాలి. నువ్వులన్నాన్ని బెల్లం ముక్క లేదా తయారు చేసుకున్న బెల్లం పాలు కాంబినేషన్‌తో వడ్డించాలి. నోట్: కొన్ని చోట్ల కొత్తబియ్యం, పెసరపప్పు కలిపి వండి... పైన కొబ్బరి తురుము, బెల్లం తురుము, నెయ్యి కాంబినేషన్‌తో వడ్డిస్తారు. -
స్వీట్ లైట్స్
మనవన్నీ తియ్యటి సంప్రదాయాలు. మనవన్నీ తియ్యటి అనుబంధాలు. మనవన్నీ తియ్యటి అతిథి మర్యాదలు ఈ తియ్యదాన్ని కొనసాగిద్దాం. ‘స్వీట్ లైట్స్’తో దీపావళిని వెలిగిద్దాం. ఆపిల్ గుజియా కావలసినవి: గోధుమపిండి - 2 కప్పులు, కరిగించిన నెయ్యి లేదా వెన్న - కప్పు, చన్నీళ్లు - కప్పు, ఉప్పు - కొద్దిగా ఆపిల్ కోయా కోసం: పచ్చి కోవా - కప్పు, ఆపిల్స్ - 4 (మీడియం సైజువి, సన్నగా తురమాలి), దాల్చిన చెక్క పొడి - అర టీ స్పూను, ఏలకుల పొడి - అర టీ స్పూను, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పుల తరుగు - 3 టేబుల్ స్పూన్లు, పంచదార - 3 టేబుల్ స్పూన్లు, నూనె-డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ఒక పెద్ద పాత్రలో గోధుమపిండి, పంచదార కలిపి జల్లించాలి కరిగించిన నెయ్యి జత చేసి, మిశ్రమం బాగా కలిసేవరకు కలపాలి చన్నీళ్లు పోస్తూ చపాతీపిండిలా క లిపి, పైన మూత ఉంచి సుమారు అరగంటసేపు నాననివ్వాలి స్వీట్ స్టఫింగ్ తయారీ బాణలి వేడి చేసి, పంచదార, ఆపిల్ తురుము వేసి బాగా కలిపి, సుమారు పది నిమిషాలు ఉడకనివ్వాలి దాల్చినచెక్క, ఏలకుల పొడులు జత చేయాలి ఐదు నిమిషాల తర్వాత కోవా మిశ్రమం వేసి బాగా కలపాలి కోవా కరుగుతుండగా బాగా కలుపుతుండాలి డ్రైఫ్రూట్స్ తరుగు జత చేసి, బాగా కలిపి దించి, చల్లారనివ్వాలి చపాతీ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, గుండ్రంగా పూరీలా మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఒత్తాలి తయారుచేసి ఉంచుకున్న ఆపిల్ మిశ్రమాన్ని కొద్దిగా ఇందులో ఉంచి అంచులు మూసేయాలి. (కొద్దిపాటి నీళ్లతో తడి చేస్తే బాగా అతుకుతుంది) ఇదేవిధంగా అన్నీ తయారుచేసుకుని పక్కన ఉంచుకోవాలి బాణలిలో నూనె వేడయ్యాక, తయారుచేసి ఉంచుకున ఘుజియాలను ఒక్కొక్కటిగా వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, పేపర్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి. తీపి చక్రాలు కావలసినవి: పెసలు - కప్పు, బియ్యం - 6 కప్పులు, ఉప్పు - కొద్దిగా, బెల్లం - 2 కప్పులు, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా పెసలను బాణలిలో నూనె లేకుండా వేయించాలి రోట్లో వేసి తేలికగా దంచి పప్పులా అయిన తర్వాత, చేటలో వేసి పొట్టు చెరగాలి పెసరపప్పు, బియ్యం కలిపి మర పట్టించాలి ఒక పెద్ద గిన్నెలో తగినన్ని నీళ్లు, ఉప్పు, నూనె వేసి నీళ్లు మరిగించాలి ఒక పెద్ద పాత్రలో పిండికి కాచిన నీళ్లు జతచేస్తూ జంతికల పిండి మాదిరిగా కలపాలి బాణలిలో నూనె కాగాక, ఈ పిండిని చిన్న చిన్న జంతికల్లా వేసి (బాగా సన్నటి రంధ్రాలు ఉన్న దాని నుంచి వీటిని తయారుచేయాలి) దోరగా వేగిన తర్వాత పళ్లెంలోకి తీసుకోవాలి ఒక పాత్రలో బెల్లం,తగినన్ని నీళ్లు వేసి తీగపాకం పట్టాలి తయారుచేసి ఉంచుకున్న చక్రాల మీద ఈ పాకం కొద్దికొద్దిగా పోసి ఆరనివ్వాలి బాగా చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. బాదాం పూరీ కావలసినవి: గోధుమపిండి - కప్పు, బాదం పప్పులు - పావు కిలో, పంచదార పొడి - అర్ధ పావు, కుంకుమ పువ్వు - కొద్దిగా, ఏలకుల పొడి - టేబుల్ స్పూను, కండెన్స్డ్ మిల్క్ - తగినంత తయారీ: బాదం పప్పుల మీద తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ఒక పాత్రలో బాదం పప్పుల పొడి, పంచదార పొడి, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, గోధుమ పిండి వేసి, కలపాలి. (అవసరమనుకుంటే తగినన్ని పాలు జత చేస్తూ చపాతీపిండిలా కలపాలి) చిన్న చిన్న ఉండలుగా చేసి, నూనె పూసిన బేకింగ్ ట్రే మీద ఉంచాలి 350 ఫారెన్‌హీట్ దగ్గర ప్రీ హీట్ చేసిన అవెన్‌లో ఉంచి పది నిమిషాలు బేక్ చేసి తీసేయాలి. మేథీ మటర్ మలై కావలసినవి: మెంతి ఆకులు - 2 కప్పులు, ఉడికించిన బఠాణీ - కప్పు, తాజా క్రీమ్ - కప్పు, నెయ్యి లేదా నూనె - 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు - అర కప్పుకి తక్కువగా, పంచదార - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత పేస్ట్ కోసం: ఉల్లి తరుగు - అర కప్పు, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 4, అల్లం తురుము - అర టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, జీడిపప్పులు - అర కప్పు, కొత్తిమీర తరుగు - కొద్దిగా తయారీ: మిక్సీలో ఉల్లి తరుగు, జీలకర్ర, వెల్లుల్లి రేకలు, అల్లం తురుము, పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పులు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జతచేయాలి బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న ఉల్లి ముద్ద వేసి ఆరేడు నిమిషాలు ఆపకుండా కలుపుతూ వేయించాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేయాలి మెంతి ఆకులు, పావు కప్పు నీళ్లు జత చేసి బాగా కలిపి, సుమారు పది నిమిషాలు సన్నని మంట మీద ఉంచాలి ఉడికించిన బఠాణీ, తాజా క్రీమ్ జత చేసి, సుమారు ఆరేడు నిమిషాలు సన్నని మంట మీద ఉంచాలి ఉప్పు, పంచదార జత చేసి మరోమారు బాగా కలిపి దించేయాలి కొత్తిమీరతో అలంకరించి, నాన్ లేదా పుల్కాలతో కలిపి వడ్డించాలి. (తీపి ఇష్టపడని వారు పంచదార లేకుండా తయారుచేసుకోవచ్చు) అరటిపండు బూరెలు కావలసినవి: గోధుమపిండి - కప్పు, బెల్లం పొడి - అర కప్పు, కొద్దిగా పండిన అరటిపండ్లు - 2 (అర కప్పు గుజ్జు), బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి - టీ స్పూను, బేకింగ్ సోడా - పావు టీ స్పూను, ఉప్పు - చిటికెడు, నూనె-డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ఒక పాత్రలో బెల్లం తరుగు, కొద్దిగా నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి కరిగించి, వడకట్టాలి అరటిపండును మెత్తగా గుజ్జు చేయాలి ఒక పాత్రలో గోధుమ పిండి, బియ్యప్పిండి, ఏలకుల పొడి, బేకింగ్ సోడా, ఉప్పు, అరటి పండు గుజ్జు వేసి బాగా కలపాలి బెల్లం పాకం జత చేసి మరోబమారు కలపాలి కొద్దిగా నీళ్లు జత చేస్తూ, గట్టిగా ఉండేలా కలపాలి బాణలిలో నూనె కాగాక, గరిటెడు పిండిని నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి వేడివేడిగా అందించాలి. -
తియ్యటి పండుగలు
వరలక్ష్మీ వ్రతం, రాఖీ... రెండు పర్వదినాలు ... ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఏతెంచేందుకు సిద్ధంగా, సన్నద్ధంగా ఉన్నాయి... అమ్మవారికి నైవేద్యం పెడదాం... అన్నదమ్ముల నోరు తీపిచేద్దాం... అమ్మవారి ఆశీర్వాదాలు... అన్నదమ్ముల ఆదరాభిమానాలు అందుకుందాం... ఇక ఆలస్యం దేనికి, వంటకాలకు కావలసిన పదార్థాలు సిద్ధం చేసుకోండి... ఈ మధురపదార్థాలు తయారుచేయండి... పండుగలను తియ్యగా ఆస్వాదించ ండి... రబ్రీ స్వీట్ కావలసినవి: చిక్కటి పాలు - లీటరు; పంచదార - పావు కప్పు; బాదం పప్పులు - 7; పిస్తా పప్పులు - 7; కుంకుమ పువ్వు - కొద్దిగా; ఏలకుల పొడి - చిటికెడు; రోజ్ ఎసెన్స్ - 4 చుక్కలు తయారీ: వెడల్పాటి బాణలిలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మధ్యస్థం మంట మీద మరిగించాలి మరగడం ప్రాంభం కాగానే మంట సిమ్‌లో ఉంచి, పాలు బాగా చిక్కబడి, పాలు నాలుగో వంతు వచ్చేవరకు కలుపుతుండాలి బాదం పప్పులు, పిస్తా పప్పులను చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి కుంకుమ పువ్వును చల్లటి పాలలో నానబెట్టాలి మరుగుతున్న పాలలో పంచదార, ఏలకుల పొడి వేసి ఆపకుండా కలపాలి నానబెట్టుకున్న కుంకుమపువ్వు పాలు జత చేయాలి బాదం పప్పులు, పిస్తా పప్పులను జత చేసి, బాగా కలిపి దించేయాలి చల్లారాక రోజ్ ఎసెన్స్ వేసి గిలక్కొట్టాలి ఫ్రిజ్‌లో సుమారు ఎనిమిది గంటలు ఉంచి తీశాక, డ్రైఫ్రూట్స్ తురుముతో అలంకరించి అందించాలి. అరటిపండు అప్పాలు కావలసినవి: బాగా పండిన అరటిపండు - 1; గోధుమ పిండి - కప్పు; బెల్లం తురుము - కప్పు; ఎండు కొబ్బరి తురుము - పావు కప్పు; నెయ్యి - టేబుల్ స్పూను; ఏలకుల పొడి - అర టీ స్పూను; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: అరటిపండును మెత్తగా గుజ్జు చేయాలి ఒకపాత్రలో గోధుమ పిండి, అరటిపండు గుజ్జు, ఎండు కొబ్బరి తురుము, ఏలకుల పొడి, బెల్లం తురుము, నెయ్యి వేసి చపాతీ పిండిలా కలపాలి చేతికి నెయ్యి కాని నూనె కాని రాసుకుని పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి బాణలిలో నూనె కాగాక ఈ ఉండలను చేతిలోకి తీసుకుని గుండ్రంగా అప్పాల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి. కొబ్బరి పాల పాయసం కావలసినవి: బియ్యం - అర కప్పు; బెల్లం తురుము - కప్పు; తాజా కొబ్బరి ముక్కలు - ముప్పావు కప్పు; పాలు - పావు కప్పు (మరిగించాలి); ఏలకుల పొడి - అర టీ స్పూను; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పులు - 10; కిస్మిస్ - టేబుల్ స్పూను; బేకింగ్ సోడా - చిటికెడు తయారీ: బియ్యం శుభ్రంగా కడిగి కప్పుడు నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి మూడు విజిల్స్ వచ్చాక దించేయాలి కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేయాలి ముప్పావు కప్పు గోరు వెచ్చని నీళ్లు జత చేసి, మరో మారు మిక్సీ తిప్పాలి పల్చటి వస్త్రంలో కొబ్బరి పాలను వడకట్టి, కొబ్బరిని మళ్లీ మిక్సీలో వేసి ముప్పావు కప్పు నీళ్లు జత చేసి మరో మారు మిక్సీ పట్టాలి మళ్లీ ఆ పాలను వడ కట్టాలి ఈ పాలకు బేకింగ్ సోడా జత చేసి పక్కన ఉంచాలి అన్నంలో బెల్లం తురుము, కొబ్బరి పాలు వేసి స్టౌ మీద ఉంచాలి పాలు, ఏలకుల పొడి జత చేసి బాగా కలిపి సన్న మంట మీద సుమారు పది నిమిషాలు ఉంచాలి మిశ్రమం చిక్కబడుతుండగా దింపేయాలి నెయ్యి కరిగించి, అందులో జీడిపప్పులు, కిస్మిస్ వరుసగా వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, తయారు చేసి ఉంచుకున్న పాయసంలో వేసి కలపాలి వేడివేడిగా అందించాలి. బాదం కోవా కావలసినవి: బాదం పప్పులు - కప్పు; పంచదార - ముప్పావు కప్పు; పాల పొడి - అర కప్పు; నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - చిటికెడు; ఫుడ్ కలర్ - చిటికెడు; తురిమిన పిస్తా, బాదం, జీడిపప్పులు - తగినన్ని తయారీ: బాదం పప్పులను నీళ్లలో సుమారు అరగంటసేపు నానబెట్టి, తొక్క తీసి, మిక్సీలో వేసి, కొద్దిగా పాలు జత చేసి మెత్తగా చేయాలి పంచదార, పాల పొడి జత చేసి మరోమారు బ్లెండ్ చేయాలి ఒక పాత్రలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి తయారుచేసి ఉంచుకున్న బాదం పేస్ట్ ఇందులో వేసి ఆపకుండా చిక్కబడేవరకు కలుపుతుండాలి ఏలకుల పొడి, ఫుడ్ కలర్ జత చేసి బాగా కలిపి, ఉడికిన తర్వాత దించేయాలి చెక్క గరిటెతో సుమారు ఐదు నిమిషాలు కలపాలి ముద్దగా అయిన తర్వాత కోవా ఆకారంలో తయారుచేసుకుని పైన పిస్తా, బాదం, జీడిపప్పు తురుముతో అలంకరించి కొద్దిగా గట్టిపడ్డాక అందించాలి. -
సమర మే చేద్దామిలా..
సూర్య@42.9 నిన్నా మొన్నటి దాకా కాస్త చూసీ చూడనట్టు ఉన్న సూరీడు.. ‘మే’ నెల, రోహిణీ కార్తె రోజుల్లో ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. కేవలం 4 రోజుల్లో అమాంతం పెరిగిన ఎండలు.. నగరవాసిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మండే ఎండలను ఎదుర్కోవడంలో మనకి తోడ్పడేందుకు వైద్యులు, ఫిట్నెస్ ట్రైనర్లు విలువైన సూచనలు అందిస్తున్నారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి గ్రీష్మ భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రెండు రోజులుగా నగరంపై విరుచుకు పడుతున్నాడు. ఉదయం నుంచే తన విశ్వరూపం చూపుతూ ప్రజలను ఠారెత్తిస్తున్నాడు. ఎండలు ఒక్కసారిగా పెరగడంతో సిటీజనులు అల్లాడుతున్నారు. నీడ లేకుండా క్షణం నిలవలేకపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఒకవేళ వెళ్లినా గొంతు తడుపుకొనే మార్గం కోసం వెదుకుతున్నారు. బుధవారం ఎండకు తట్టుకోలేక ప్రజలు పడే పాట్లు ఇలా ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. దాహమేస్తే ఇలా.. మూలు రోజులకన్నా ఈ సీజన్లో కనీసం 3 రెట్లు నీళ్లు అధికంగా తీసుకోవాలి. పళ్ల రసాలు, మజ్జిగ, రాగి మాల్ట్, నిమ్మరసం వంటివన్నీ ఉపయుక్తమైన ద్రవాహారాన్ని అందించేవే. ఫ్రిజ్ నీటిని తాగకుండా కుండలు, కూజాలే ఉత్తమం. విపరీతమైన దాహం వేసే వరకూ ఆగకుండా ఈ సీజన్లో తరచుగా నీరు, బార్లీ వంటి ద్రవాహారం తీసుకుంటుండాలి. సహజాహారమే సరైంది.. వేసవికాలం రుచికరమైన, ఆరోగ్యకరమైన సీజనల్ ఫ్రూట్స్‌కి విడిది. యాంటీ ఆక్సిడెంట్స్ నిండిన తాజా పండ్లు, కూరగాయలు దేహాన్ని చల్లబరచడంలో, విటమిన్లు, మినరల్స్‌ను అందించడంలో ఉపకరిస్తాయి. వీటిలో.. బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్, రాస్ బెర్రీస్, బొప్పాయి, పచ్చి మామిడి, చెర్రీస్, యాపిల్, పుచ్చకాయ, ఉసిరి.. వంటివి విరివిగా ఉపయోగించడం మంచిది. కూరగాయల్లో కాకరకాయ, క్యాబేజి, కాలిఫ్లవర్, బ్రాక్కొలి, దోస, గ్రీన్‌బీన్స్, ఆస్పారెగస్, అల్ఫా అల్ఫా, పెద్ద వంకాయ, ఐస్‌బర్గ్, పుదీనా... వంటివి నీటి పరిమాణాన్ని దేహంలో సమపాళ్లలో ఉంచేందుకు ఉపకరిస్తాయి. మాంసాహారం పరిమితం చేయాలి. చెమట కారణంగా కోల్పోయే శక్తిని సులభంగా పొందేందుకు ప్రోటీన్ షేక్స్ తీసుకోవచ్చు. ఓట్మీల్, బ్రౌన్ రైస్, తియ్యటి బంగాళ దుంపలు ఆహారంలో భాగం చేస్తే బెటర్. ఆహారంతో ఓ టేబుల్ స్పూన్ ఫ్లాక్స్‌సీడ్ ఆయిల్‌ను రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కలిపి తీసుకుంటే దేహానికి అవసరమైన ఫాటీ యాసిడ్స్ అందుతాయి. స్నానమే పరిష్కారం.. చమట పూర్తిగా ఆరాక మాత్రమే స్నానం చేయాలి. కనీసం రోజుకు 2 లేదా వీలైతే 3 సార్లు స్నానం, దీనికి వినియోగించే నీళ్లలో రోజ్ వాటర్, ఆల్మండ్ ఆయిల్ లాంటి మెడికేటెడ్ ఉత్పత్తులు కలపడం మేలు. ఉదయపు స్నానం వంట్లో బడలికను పోగొట్టి హుషారుగా చేసేందుకు సహకరిస్తే, రాత్రి వేళ స్నానం మలినాలను తొలగించి చక్కని నిద్ర కు తోడ్పడుతుంది. మంచి నిద్ర మజిల్ పునరుత్తేజానికి అవసరం. ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే చన్నీళ్ల స్నానం బెటర్ అంటున్నారు కేర్ క్లినిక్స్‌కు చెందిన ‘ఫిజియో’ శశిశేఖర్. మేలైన మార్గం యోగా వేసవిలో యోగా చాలా మంచిదని కపిలమహర్షి యోగా రీసోర్స్ సెంటర్‌కు చెందిన యోగా నిపుణులు సి.ఎస్.రావు చెబుతున్నారు. సూర్య నమస్కారం 12 భంగిమలు లెక్కిస్తూ చేయాలి. భంగిమకి 5 సెకన్లు చొప్పున కేటాయిస్తూ ఓ నిమిషం సమయంలో పూర్తి చేయాలి. వేసవి కాలానికి తగ్గట్టుగా నిదానంగా చేసే ఈ సూర్య నమస్కారాలను రోజులో 6 సార్లు ఆచరిస్తే వేసవి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఉష్ట్రాసనం, భద్రాసనం, ఏకన్ముక్తాసనం, శశాంకాసనం, అర్ధకోణాసనం, ప్రశాంతాసనం, యోగనిద్ర, షణ్ముఖి ముద్ర ఆసనాలు కూడా మంచివే. నేలపై కూర్చుని, పడుకుని చేస్తూ ఒక ఆసనం లోంచి మరో ఆసనంలోకి మారేటప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ రెండు శ్వాసల వ్యవధి ఉండేలా చూడాలి. శీతలి, ఉజ్జయి, చంద్రఖేధిని, నాడిశోధన చేయడం ద్వారా ఎండ వేడిమి వల్ల కలిగే శారీర క ఇబ్బందులన్నింటినీ అధిగమించవచ్చు. -
రూపాయి తీస్కో.. పండగ చేస్కో!
* జెండావందన వేడుకల నిర్వహణ అయోమయం * అరకొర నిధులతో ఉపాధ్యాయుల అవస్థలు * స్వీట్ కోసం ప్రతీ విద్యార్థికి ఒక్క రూపాయే.. * ఏళ్లనాటి పాత టారిఫ్‌లే అమలవుతున్న వైనం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఇంద రూపాయి తీసుకో.. నోరు తీపి చేసుకొని పండగ చేసుకో పో’.. అంటోంది ప్రభుత్వం. ‘ఏంటీ రూపాయికి ఏం వస్తుంది, పీచు మిఠాయి కూడా రాదు.. అనుకుంటున్నారా? అది నిజమే కానీ, ప్రభుత్వం ఇంతే ఇస్తుంది మరి. వివరాలలోకి వెళ్తే గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఆయా పాఠశాలల్లో, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులకు మిఠాయిలు పంచుతారు. హాస్టల్ విద్యార్థులకు ప్రతిరోజూ ఇచ్చే మెనూకు అదనంగా పండుగల రోజున మిఠాయి కూడా ఇస్తారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు అన్ని కలుపుకొని 168 వరకు ఉన్నాయి. వీటిలో 16 వేల మంది వరకు విద్యార్థులు అభ్యసిస్తున్నారు. హాస్టళ్లలో ఉన్న వారికి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఇచ్చేది మాత్రం కేవలం రూ.1 మాత్రమే. దాదాపు 35 ఏళ్ల కిందట, అంటే ఒక్క రూపాయికి పావుకిలో నెయ్యి, పావుకిలో చెక్కర, ఇతర పదార్ధాలు వచ్చే సమయంలో తీసుకున్న నిర్ణయం అన్న మాట. తరాలు మారినా ఈ టారిఫ్ మాత్రం మారలేదు. ఇప్పుడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోయింది. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటాయి. రూపాయి పెడితే బజార్లలో సైకిల్ మీద అమ్మే పీచు మిఠాయి కూడా రావడం లేదు. కనీసం 20 గ్రాముల స్వీటు, 5 గ్రాముల కార తీసుకోవాలన్నా కనీసం రూ.10 ఖర్చు అవుతున్నాయి. ఈ లెక్కన ప్రతీ హాస్టల్లో రూ.1,500 వరకు, పాఠశాలలో రూ.4 నుంచి 6.వేల వరకు ఖర్చు అవుతుంది. ఇక పాఠశాలల్లోనైతే మిఠాయిల కోసం ప్రత్యేకంగా ఆ.. ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. జిల్లాలో చిన్న, పెద్ద స్కూళ్లు కలుపుకుని దాదాపు 1,568 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3.23 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీళ్లకు కూడా జెండా వందనం రోజున స్వీట్ ఇస్తున్నారు, కానీ స్వీట్ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. దీంతో పాఠశాల గోడలకు సున్నం వేయడం కోసమో, రిపేర్ కోసమో ఇచ్చే స్కూల్ మెయింటనెన్స్ నుంచి గాని, స్టేషనరీ ఖర్చుల కోసం స్కూల్ గ్రాంటు నిధుల నుంచి గాని ఆయా పాఠశాలల హెచ్ఎంలు మిఠాయిల కోసం ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వమైనా బూజుపట్టిన పాత టారిఫ్‌ను తొలగించి.. కొత్త టారిఫ్‌ను అమల్లోకి తేవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
స్వీట్ సింగ్
‘హైదరాబాద్ స్కూల్ కొరల్ ఫెస్టివల్’ అలరించింది. బంజారాహిల్స్ హయత్ హోటల్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో వంద మంది విద్యార్థులు సూపర్బ్ మ్యూజిక్కు అదరహో అనిపించేలా పాటలు పాడారు. హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు పాడిన పాశ్చాత్య గీతాలు పరవశింపజేశాయి. హైదరాబాద్ స్కూల్ కొరల్ ఫెస్టివల్’ నిర్వహించడం ఇది రెండోసారి అని హైదరాబాద్ వెస్టర్న్ మ్యూజిక్ ఫౌండేషన్ డెరైక్టర్ జోయే కోస్టర్ అన్నారు. ఈ ఫెస్టివల్ కోసం వర్క్‌షాప్ నిర్వహించామన్న ఆయన...విద్యార్థుల్లో మ్యూజిక్ ద్వారా వ్యక్తిత్వ వికాసం పెంపొదించామన్నారు. విద్యార్థులందరినీ ఇలా ఒక చోట చేర్చడం వల్ల ఐక్యత, ఆరోగ్యకరమైన పోటీతత్వం పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. సాక్షి, సిటీప్లస్ -
అక్కడ వేప ఆకులు తీయగా ఉంటాయి
-
ఆర్గానిక్ స్వీట్స్
తీపి... శుభారంభానికి ప్రతీక. ఆ శుభారంభం ఆరోగ్యవంతమైనదిగా ఉండాలనుకుంటున్నారు హైదరాబాదీలు. ధర కొంచెం ఎక్కువైనా పర్లేదు.. రసాయనాలు, పురుగులమందుల అవశేషాలు లేని ప్యూర్ స్వీట్స్కే మా ప్రయారిటీ అంటున్నారు. అందుకే ఆర్గానిక్ స్వీట్స్‌కి డిమాండ్ పెరిగింది. ఇందుకు తగ్గట్టుగానే నగరంలో ఆర్గానిక్ స్వీట్ షాప్స్ వెలుస్తున్నాయి. - కోన సుధాకర్‌రెడ్డి కూరగాయలే కాదు... స్వీట్స్ కూడా ఆర్గానిక్ కావాలని కోరుకుంటున్నారు హైదరాబాదీలు. అందుకే ఇలాంటి స్వీట్స్ అందించేందుకు కొత్తగా పుట్టుకొస్తున్నాయి సరికొత్త షాపులు. 150కి పైగా.. 150 నుంచి 200 రకాల మిఠాయిలు ఆయా ఆర్గానిక్ స్వీట్ షాపుల్లో దొరుకుతాయి. గోందు కతేరం పానీయం, సబ్జ, మజ్జిగ, బాదంపాలు, మోతీచూర్ లడ్డు, కాజు కతిలి, వైట్ కలాకండ్, రస్మలైతో పాటు, బెల్లం, ఆర్గానిక్ నూనెలతో ప్రత్యేకంగా తయారు చేసిన స్వీట్స్ అందుబాటులో ఉన్నాయి. అన్నీ ప్రత్యేకమే... కతేరా గోందు చెట్టుకు సంబంధించిన బంకను వేడి నీటిలో మరిగిస్తే జెల్ వస్తుంది. మరిగించిన సుగంధపాల వేర్ల రసాన్ని ఇందులో కలిపితే గోందు కతేరం పానీయం తయారవుతుంది. ఇది శరీరంలో వేడి తగ్గిస్తుంది. ఇక ఒక రకమైన తులసి విత్తనాలు బెల్లం నీళ్లల్లో నానబెట్టి సబ్జ తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది. శెనగ పిండి , రసాయనాలు లేని బెల్లంతో మోతి చూర్ లడ్డూ చేస్తారు. బాదం ఉడికించి పొట్టు తీసి, వేడి పాలల్లో కలిపి బాదంపాలు చేస్తారు. నేచురల్ కలర్స్.. కెమికల్స్‌తో తయారు చేసిన పర్మినెంట్ కలర్స్‌కు చోటు లేదిక్కడ. కాశ్మీర్ నుంచి దిగుమతి అయ్యే కుంకుమ పువ్వుతో కేసరి కలర్ తయారు చేస్తుంటారు. అలాగే మిగతా రంగులు కూడా. మిఠాయిలపై ఉపయోగించే వెండి అద్దకం ఉండదు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగైన పిండి పదార్థాలనే స్వీట్లల్లో వినియోగిస్తారు. కాగితంతో తయారు చేసిన క్యారీ బ్యాగులు, ఆకు దొన్నె కవర్లు మాత్రమే వాడతారు. సుభాష్ పాలేకర్ పద్ధతిలో.. ప్రకృతి వ్యవసాయ సృష్టికర్త సుభాష్ పాలేకర్ సూచించిన పద్ధతిలో తయారు చేసిన బెల్లాన్ని మాత్రమే ఈ స్వీట్స్‌లో వాడతారు. గానుగ ద్వారా తీసిన పప్పు, నువ్వులు, కొబ్బరి నూనె తోనే స్వీట్స్ తయారు చేస్తారు. కనిపించేవన్నీ మంచివి కావు... కంటికి మంచిగా కనపడే స్వీట్స్ కొనే పద్ధతి నుంచి ప్రజలు బయటపడాలి. సిటీలో ఆర్గానిక్ స్వీట్ షాపులు చాలా ఉన్నాయి. అయితే అందరికంటే ముందే 1999లో మేము ఆర్గానిక్ స్వీట్ షాపు ప్రారంభించాము. 15 ఎకరాల్లో 60 దేశీయ ఆవులతో సౌభాగ్య గో సదన్ ఏర్పాటు చేశాం. మిఠాయిలకు అవసరమయ్యే పదార్థాలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అక్కడ పండిస్తాం. వినియోగదారుల అభిరుచిలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. భవిష్యత్‌లో ఆర్గానిక్ స్వీట్స్దే హవా! - విజయరాం, ఎమరాల్డ్ స్వీట్ షాప్ ఓనర్ -
నేడు ఉగాది పర్వదినం షడ్రుచుల సమ్మేళనం
ప్రాముఖ్యం చైత్ర శుద్ధపాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారం ధరించిన విష్ణుమూర్తి సోమకున్ని సంహరించి వేదాలను బ్రహ్మాకు అప్పగించిన సందర్భంగా ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. పూజ అన్ని పండుగల మాదిరిగానే ఉగాది రోజున ఉదయం 9గంటల లోపు తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఏదో ఒక దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అనంతరం ఏమీ తినక ముందే ఉగాది పచ్చడిని తింటారు. పచ్చడి ‘ఉగాది పచ్చడి’ ఈ పండుగకు మాత్రమే తినే ప్రత్యేక పదార్థం. షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటారు. ఏడాదిపాటు ఎదురయ్యే మంచిచెడులు, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. పచ్చడి తయారీకి మామిడి కాయలు, చింతపండు, ఉప్పు, కారం, బెల్లం, వేపపువ్వు వాడుతారు. బె ల్లం-ఆనందానికి, ఉప్పు-ఉత్సాహం, వేపపువ్వు-బాధ కలిగించే అనుభవాలు, పులుపు-నేర్పుగా వ్యవహారించాల్సిన పరిస్థితులు, మామిడి-కొత్త సవాళ్లు, కారం-సహనం బావానికి ప్రతీక. పంచాంగ శ్రవణం కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహ శాంతి వంటివి జరిపించుకుని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి, వ్యవసాయం ఎలా ఉంటుంది, అనే విషయాలను తెలుసుకోడానికి పంచాంగ శ్రవణం చేసేవారని చెబుతారు. -
‘స్వీట్’గా నయం చేస్తారు
అన్ని సౌకర్యాలూ ఉన్న ప్రదేశాల్లోనే జబ్బువస్తే నయం చేసుకోడానికి బోలెడు తిప్పలు పడాల్సి వస్తుంది. అలాంటిది ఆసుపత్రి అనే పదానికి అందనంత దూరంలో ఉండే మారుమూల కొండప్రాంతాల గిరిజనవాసులకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే పరిస్థితి ఏంటి? ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే మలేరియా జబ్బు గ్రామాలను పట్టిపీడిస్తుంటే వారిని ఎవరు రక్షిస్తారు? గత ఇరవైఏళ్లుగా గిరిజన గ్రామాల్లో ఆరోగ్యసేవలందిస్తున్న ఈశ్వరరావుని పలకరిస్తే అడవిబిడ్డలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం ఏంటో అర్థమవుతుంది మనకు. విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతంలో 49 గ్రామాల్లో గిరిజన ప్రజలు వర్షం పేరు చెబితే వణికిపోతారు. ఆ వణుకొచ్చేది వానతోపాటు వచ్చే చలివల్ల కాదు. వర్షం వచ్చినపుడు కొండప్రాంతాల నుంచి వచ్చే కలుషితనీటి వల్ల. గిరిజనవాడలంటేనే శుభ్రత అంతంతమాత్రం. దానికి తోడు ఇళ్ల ముందుండే పశువుల కొట్టాలు. కారణాలేవైతేనేం, చినుకు పడడంతోటే జ్వరాలు మొదలవుతాయి. వచ్చింది మలేరియా అని తెలిస్తే ఎలాగోలా ఆసుపత్రికెళ్లి వైద్యం చేయించుకుని బతికి బట్టకడతారు. కాని, తమకు వచ్చిన జబ్బేమిటనేది కూడా వారికి అవగాహన లేకపోతే ఏం చేస్తారు..! ఆ సమయంలో ఈశ్వరరావుకు ఒక ఆలోచన వచ్చింది. గిరిజన ప్రాంతాల్లోని మహిళలు, ఆరోగ్యం అనే అంశాలపై సేవ చేయాలనుకున్నారు. ‘స్వీట్’ (సొసైటీ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ అండ్ ట్రైనింగ్) పేరుతో స్వచ్ఛందకార్యకర్తల సాయంతో ఆ గ్రామాలకెళ్లి ‘మలేరియా’పై పోరాడుతున్నారు. అవగాహన, వైద్యం... ‘‘చైతన్య యువజన సేవాసంఘం పేరుతో 1991లో గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి, నాకు చేతనైనంత సేవ చేశాను. ఆ తర్వాత ఇక్కడ మారుమూల గ్రామాల్లో మలేరియా వల్ల గిరిజనులు బాగా ఇబ్బందిపడుతున్నారని తెలిసి వారికి అందుబాటులో ఉండాలనుకున్నాను. అందుకే 1997లో ‘స్వీట్’ ఆర్గనైజేషన్ స్థాపించాను. 49 గ్రామాల్లో... గ్రామానికి ఒకరు చొప్పున వాలంటీర్లను ఏర్పాటుచేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాను. వర్షం చినుకులు పడడంతోటే గ్రామాల్లోని ప్రజలకు వైద్యపరీక్షలు మొదలుపెట్టేస్తాం. మలేరియా వచ్చినవారికి దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తాం. వీటన్నిటికంటే ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యపరంగా అభివృద్ధి ఉన్న గ్రామాల్లో మార్పు తేవడం కొంతవరకూ సులువు. కాని ఇక్కడ గిరిజన గ్రామాల ప్రజల జీవనవిధానాల్లో మార్పులు తేవడం అంత తేలిక కాదు. ఇలా ఇరవై ఏళ్ల నుంచి ఇంటింటికీ తిరుగుతుంటే... ఎట్టకేలకు వారిలో కొద్దిపాటి మార్పు వచ్చింది’’ అని చెప్పారు ఈశ్వరరావు. ‘స్వీట్’ చేస్తున్న సేవాకార్యక్రమాలను గుర్తించి ‘వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థ మలేరియా నిర్మూలన ప్రాజెక్టును వీరికి అప్పగించింది. కుష్ఠు రోగులకు కూడా... సీజనల్‌గా వచ్చే మలేరియా వంటి జబ్బులొక్కటే కాకుండా కుష్ఠువ్యాధి బాధితులపైన కూడా ‘స్వీట్’ దృష్టి పెట్టింది. ‘గాంధీ మెమోరియల్ లెప్రసీ ఫౌండేషన్’ వారి సహకారంతో ఆ గ్రామాల్లో కుష్ఠువ్యాధి గ్రస్థులకు వైద్యం అందే ఏర్పాట్లు చేస్తున్నారు. విద్య, వైద్యసౌకర్యాలు అందుబాటులో లేనిచోట ఎన్నిరకాల జబ్బులైనా వస్తాయి. గ్రామాల్లో ఆ రెండింటినీ ఏర్పాటుచేస్తే తప్ప ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరకదు. మా సంస్థ లక్ష్యాల్లో మరొకటి మహిళా సంక్షేమం. వారికి ఉపాధి అవకాశాల్లో భాగంగా అరటినారతో బ్యాగుల్ని తయారుచేయడంలో శిక్షణ ఇప్పిస్తున్నాం’’ అని ముగించారు ఈశ్వరరావు. ‘స్వీట్’ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. - భువనేశ్వరి -
టపాసులు .. మిఠాయిలు ... డాన్సులు