కిలో స్వీట్‌ రూ.21,000.. ఇదే ప్రత్యేకత.. | Swarna Mudra Sweets Are Being Sold At Rs 21000 Per Kg In Ahmedabad, Know What Special In This - Sakshi
Sakshi News home page

Ahmedabad Swarna Mudra Sweet: కిలో స్వీట్‌ రూ.21,000.. ఇదే ప్రత్యేకత..

Published Wed, Nov 8 2023 1:50 PM | Last Updated on Wed, Nov 8 2023 3:11 PM

Swarna Mudra Sweet Rs 21000 Per Kg - Sakshi

దీపావళి సమీపిస్తున్న తరుణంలో మార్కెట్‌లో వివిధ రకాల స్వీట్‌లు ఆదరణ పొందుతున్నాయి. వాటిలో అహ్మదాబాద్‌లోని గ్వాలియాలో విక్రయిస్తున్న 'స్వర్ణ ముద్ర' అనే స్వీట్ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఏకంగా ఆ స్వీట్‌ ఖరీదు కేజీ రూ.21వేలు. స్వర్ణ ముద్ర ఒక్క ముక్క రూ.1,400 రూపాయలు. ఒక కిలో స్వీట్‌లో దాదాపు 15 ముక్కలు ఉంటాయి. ఇంతకీ దాని ప్రత్యేకత ఎంటో తెలుసుకుందాం. 

ఆ స్వీట్‌ తయారీలో 24 క్యారెట్ల బంగారు పొరను ఉపయోగిస్తారు. దీన్ని బ్లూబెర్రీస్, బాదం, పిస్తా, క్రాన్‌బెర్రీస్ వంటి వాటితో తయారుచేస్తారు. పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని చాలామంది ఆర్డర్‌ చేసి మరీ ఈ స్వీట్‌ను తీసుకుంటారని నిర్వాహకులు చెబుతున్నారు. పండగలులేని సమయంలో పెళ్లివేడుకలు, ఇతర ప్రత్యేక కార్యక్ర​మాల్లో బహుమతులు ఇవ్వడానికి ఈ స్వర్ణముద్రను ఉపయోగిస్తారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement