
పచ్చి మామిడికాయతో ఒక్క ఆవకాయేనా? ఇంకా చాలా చేయవచ్చు. పచ్చిమామిడితో వంటకాలే కాదు... పుల్లని మామిడితో తియ్యటి మిఠాయిలూ సృష్టించొచ్చు. షర్బత్‌లూ తాగించొచ్చు.
కావలసినవి: పచ్చి మామిడికాయ–1 (మరీ పుల్లగా ఉన్నది కాకుండా కొంచె తీపి, పులుపు కలిపి ఉన్నది తీసుకోవాలి), మైదా–అరకప్పు, పంచదార–1 కప్పు, నీర –1 కప్పు, నెయ్యి– 2 చెంచాలు.
తయారీ: మామిడికాయను పచ్చని భాగం పోయేవరకూ చెక్కు తీసి, ముక్కలుగా కోసుకోవాలి; స్టౌ మీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక మామిడి ముక్కలు వేసి మెత్తబడేవరకూ మగ్గనివ్వాలి; తర్వాత చల్లారబెట్టి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి;
ఈ పేస్ట్‌లో మైదా వేసి బాగా కలుపుకుని, మృదువుగా అయ్యాక ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి; గిన్నెలో నీరు, పంచదార వేసి స్టౌమీద పెట్టాలి; లేతపాకం తయారయ్యాక... జామూన్లను నూనెలో వేయించి పాకంలో వేయాలి; ఉండలు పాకాన్ని బాగా పీల్చుకున్నాక తరిగిన డ్రైఫ్రూట్స్‌తో అలంకరించి వడ్డించాలి. ఇవి చూడ్డానికి మామూలు జామూన్లలానే ఉంటాయి కానీ తింటే తీపితో పాటు కొద్ది పులుపుగా ఉండి ఓ కొత్త రుచిని పరిచయం చేస్తాయి.
పచ్చి మామిడి హల్వా
కావలసినవి: పచ్చి మామిడికాయ – 1, వెర్మిసెల్లీ – 1 కప్పు, పంచదార – 2 కప్పులు, నీళ్లు – 2 కప్పులు, నెయ్యి పావుకప్పు, జీడిపప్పు పొడి – 2 చెంచాలు, యాలకుల పొడి – 2 చెంచాలు
తయారీ: మామిడికాయను మెత్తని గుజ్జులా చేసి పెట్టుకోవాలి (గుజ్జు 1 కప్పు ఉండాలి); స్టౌమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక సేమ్యా వేసి వేయించాలి; రంగు మారాక నీళ్లు పోయాలి; సేమ్యా కాస్త మెత్తబడ్డాక మామిడి గుజ్జును వేయాలి; రెండు నిమిషాలు ఉడికాక పంచదార కూడా వేయాలి; అడుగంటకుండా కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి; మిశ్రమం బాగా చిక్కబడ్డాక నెయ్యి, జీడిపప్పు పొడి, యాలకుల పొడి వేసి కలపాలి; హల్వా దగ్గరపడి నెయ్యి గిన్నె అంచులువదులుతున్నప్పుడు దించేసుకోవాలి.
మ్యాంగో బనానా షర్బత్
కావలసినవి: పచ్చి మామిడికాయలు – 2, పంచదార – 1 కప్పు, అరటిపండు – 1, జీలకర్ర పొడి – 1 చెంచా, మిరియాల పొడి – చిటికెడు, ఉప్పు – తగినంత
తయారీ: అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి; మామిడికాయల్ని చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి; ఈ ముక్కలు, పంచదార కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి; తర్వాత నీరు ΄ోసి పల్చని జ్యూస్‌లా బ్లెండ్ చేయాలి; దీన్ని గ్లాసులోకి వడ΄ోసుకుని అరటిపండు ముక్కలు వేయాలి; ఆపైన జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయాలి. వేసవిలో ఈ షర్బత్ శరీరాన్ని చల్లబరుస్తుంది.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment