sour
-
పుల్లటి పెరుగు ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారంటే..
భారతీయుల భోజనంలో పెరుగు ప్రధానమైనది. దీన్ని కూరల్లో కూడా జోడిస్తారు. రైతాగానూ, మజ్జిగగా పలు రకాలుగా తీసుకుంటారు. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది, చలువ చేస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అలాగే గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అంతేగాదు మొత్తం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది పెరుగు. అయితే పుల్లటి పెరుగు వినియోగించొచ్చా? ఇది ఆరోగ్యకరమైనదేనా? అని చాలామందిలో మెదిలే సందేహం. వేసవి కాలల్లో పెరుగు తొందరగా పులుసుపోతుంది. అలాంటప్పుడూ అది తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా అనే అనుమానం రావడం సహజం. అయితే నిపుణులు పుల్లటి పెరుగు కూడా ఆరోగ్యాని మంచిదేనని ధీమగా చెబుతున్నారు. ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా బేషుగ్గా తీసుకోమని చెబుతున్నారు. కానీ ఇక్కడ పెరుగుని ఎలా స్టోర్ చేస్తున్నామనేది కీలకం అని నొక్కి చెబుతున్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని తినొచ్చా లేదా అని నిర్థారించగలమని అంటున్నారు.పుల్లని పెరుగుని వినియోగించాలంటే తెలుసుకోవాల్సిన అంశాలు..నిల్వ చేసే విధానం: పుల్లని పెరుగుని చల్లటి ప్రదేశంలో గాలి చొరబడని శుభ్రమైన కంటైనర్‌లో ఉంచాలి. పెరుగును సరిగ్గా నిల్వ చేయకపోతే ప్రమాదకరమైన సూక్ష్మక్రీములు వృద్ధి చెందుతాయి.. తినడానికి అనారోగ్యకరంగా మారుతాయి. వాసన, స్వరూపం: పెరుగు కాస్త చిక్కబడి నురుగ వచ్చినట్లుగా ఉండి, పుల్లటి వాసన ఘాటుగా వస్తుంటే దాన్ని వినియోగించకపోవడమే మంచిది. లేదంలో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిల్వ సమయం: పెరుగు పుల్లడం అనేది సహజ ప్రక్రియ. ఎక్కువ కాలవ ఉండటం వల్ల పులయబడటానికి అనుమతిస్తుంది. ఇక్కడ ఎంతసేపు నుంచి పులియబడింది అనేదాన్ని పరిగణలోనికి తీసుకుని వినయోగించాలి. సరైన శీతలీకరణ: కిణ్వణ ప్రక్రియ మందగించేలా, చెడిపోకుండా ఉండేందుకు పెరుగును ఎల్లప్పుడూ స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద రిప్రిజిరేటర్లో ఉంచాలి. పరిశుభ్రత: శుభ్రమైన గిన్నెల్లో పెరుగును తయారు చేయడం వంటివి చేయాలి. ఒక్కసారి వినియోగించిన పెరుగు గిన్నెలోనే పాలు వేసి తోడిపెట్టడం వంటివి చెయ్యకూడదు. అలవాటు చేసుకోవాలి: పుల్లని పెరుగు తినే అలవాటు లేకుంటే నెమ్మదిగా అలవాటు చేసుకునే యత్నం చేస్తే జీర్ణవ్యవస్థ ఈ పెరుగుని స్వీకరించే ప్రయత్నం చేస్తుంది. ఇతర ఆహారాలతో జోడించడం: పుల్లని పెరుగు నుంచి మరిన్ని ప్రయోజనాలు పొందాలనుకుంటే..పండ్లు, తేనె లేదా తృణధాన్యాలు వంటి ఇతర ఆహారాలతో కలపవచ్చు. ఇది మరింత రుచికరంగా ఉండటమే కాకుండా భోజనానికి వివిధర రకాల పోషకాలను అందిస్తుంది. ఏ టైంలో తీసుకుంటే మంచిది: పుల్లటి పెరుగు రాత్రిపూట కంటే పగటి పూట తీసుకోవడమే మంచిది. ఎందుకంటే జీర్ణక్రియ సాధారణంగా పగటిపూట మరింత చురుకుగా ఉంటుంది. జీర్ణ సమస్యల సంభావ్యతను తగ్గిస్తుంది. శరీర స్పందన: పుల్లని పెరుగు మీ శరీరతత్వానకి సరిపోతుందో లేదో గమనించాలి. కడుపునొప్పి లేదా అసౌకర్యం వంటి ప్రతికూల ప్రభావాలు కనిపిస్తే తీసుకునే పరిమాణం తగ్గించడం లేదా నిలిపేయడం మంచిది. సరైన పద్ధతుల్లో పెరుగుని నిల్వ చేస్తే పుల్లటి పెరుగుని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని నిపుణుల చెబుతున్నారు. కానీ యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణక్రియ సమస్యలు ఉన్న వ్యక్తులు ఈ పుల్లటి పెరుగు తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు.(చదవండి: గ్లోయింగ్ స్కిన్ కోసం..నటి భాగ్యశ్రీ గ్రీన్ జ్యూస్ ట్రై చేయండి!) -
హెల్దీ సూప్
చికెన్ అండ్ హాట్ సోర్ సూప్ కావలసినవి: బోన్‌లెస్ చికెన్ – 85 గ్రా.; క్యాబేజి – 30 గ్రా. (సన్నగా తర గాలి); క్యారట్ – 30 గ్రా.లు (సన్నగా తరగాలి); మొక్కజొన్న పిండి – ఒకటిన్నర టీ స్పూన్; నూనె – 10 గ్రా; ఉప్పు – అర టీ స్పూన్; వెల్లుల్లి – 4 టీ స్పూన్లు (సన్నగా తర గాలి); కారం – అర టీ స్పూన్; పంచదార – 1 టీ స్పూన్; మిరియాలపొడి – అర టీ స్పూన్; ఉల్లిపాయ – ఒకటి (పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి); సోయసాస్ – అర టేబుల్ స్పూన్; వెనిగర్ – 1 టేబుల్ స్పూన్ తయారీ: చికెన్‌ని శుభ్రపరిచి మూడుకప్పుల మంచినీళ్లు పోసి, అందులో ఉల్లిపాయ ముక్కలు, రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి ఉడకబెట్టాలి. దీనిని చికెన్ స్టాక్ అంటారు. (ఈ చికెన్ స్టాక్‌ని వడకట్టుకుని ఫ్రిజ్‌లో వారం రోజుల వరకు నిల్వ ఉంచుకుని, కావల్సినప్పుడల్లా వాడుకోవచ్చు.) పాన్‌లో నూనె వేడయ్యాక వెల్లుల్లి, క్యాబేజి, క్యారట్ ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి. ముక్కలు ఎర్రబడకూడదు. దాంట్లో చికెన్ స్టాక్ ముక్కలతో సహా పోసి ఉడికించాలి. అందులో కారం, ఉప్పు, మిరియాల పొడి, పంచదార, వెనిగర్, సోయసాస్ వేసి కలిపి పది నిమిషాలు ఉంచాలి. చల్లని నీటిలో మొక్కజొన్న పిండిని కలిపి దాన్ని ఉడుకుతున్న మిశ్రమంలో పోస్తూ కలపాలి. దించి సర్వ్ చేసేముందు చిల్లీసాస్ చల్లితే రుచిగా ఉంటుంది. నోట్: చికెన్ తిననివారు కూరగాయ ముక్కల్ని ఉడికించి పైవిధంగానే వెజిటబుల్ సూప్‌ని తయారుచేసుకోవచ్చు. -
తింటే పులుపు... చూస్తే చుక్కలు!
సాధారణంగా ఎప్పుడూ చూసే పండ్లకు భిన్నంగా ‘స్టార్ ఫ్రూట్స్’ కొత్తగా అమ్మకానికి వచ్చాయి. మానుకోటకు చెందిన చిరువ్యాపారి ముత్యాల సంపత్‌కుమార్ సీజన్ల వారీగా వివిధ రకాల పండ్లను తీసుకువచ్చి అమ్ముతుంటారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల నుంచి స్టార్ ఫ్రూట్స్ అమ్ముతున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి ఖమ్మంకు, అక్కడి నుంచి మానుకోటకు ఈ పండ్లను తీసుకురాగా, రూ.200కు కేజీ చొప్పున అమ్ముతున్నారు. కేజీకి 20 పండ్లు వస్తున్నాయి. ఈ పండ్లు చూడడానికి నక్షత్రం ఆకారం, ఆకుపచ్చని రంగులో ఉండగా.. తింటే వగరు, పులుపుగా ఉంటాయని సంపత్ తెలిపారు. వెరైటీగా ఉండడంతో స్టార్ ఫ్రూట్స్ కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. - మహబూబాబాద్ రూరల్ -
పులుపు తగ్గిస్తే కానీ అల్సర్ తగ్గదా?
హోమియో కౌన్సెలింగ్ మా అబ్బాయి స్వభావసిద్ధంగా చురుగ్గా ఉంటాడు. ఆ చురుకుదనం వల్ల ఆటల్లో పరుగెడుతున్నాడు. కానీ త్వరగా ఆయాసపడుతున్నాడు. అలా ఆయాసం వస్తే అది ఆస్తమానేనా? పిల్లల్లో ఆస్తమాను గుర్తుపట్టడానికి మార్గాలు చెప్పండి. - శ్రీరేఖ, పెంచికల్‌దిన్నె పిల్లల్లో ఆస్తమా వచ్చినప్పుడు వారు శ్వాసతీసుకోడానికి ఇబ్బంది పడుతుంటారు. ఆయాసపడుతుంటారు. పడుకున్నప్పుడు పిల్లికూతలు వస్తాయి. రాత్రివేళ దగ్గు కూడా వస్తుంటుంది. పిల్లల స్వభావసిద్ధత వల్ల చాలా చురుగ్గా పరుగెడుతుంటారు. ఇక మాట్లాడినప్పుడు కూడా మాట పూర్తికావడానికి తగినంత దమ్ము అందుతుండదు. ఇలా జరిగినప్పుడు దాన్ని ఆస్తమాగా గుర్తుపట్టడానికి వీలవుతుంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి. సీబీపీ, ఈఎస్ఆర్, అబ్సల్యూట్ ఇజినోఫిల్ కౌంట్, ఛాతీ ఎక్స్‌రే, సీటీ స్కాన్, స్పైరోమెట్రీ, పల్మునరీ ఫంక్షన్ పరీక్షలు మొదలైనవాటిని వ్యాధి నిర్ధారణ కోసం డాక్టర్లు చేయిస్తుంటారు. పైన పేర్కొన్న పరీక్షల ద్వారా ఆస్తమానా లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర వ్యాధి ఏమైనా ఉందా అని వారు నిర్ధారణ చేస్తుంటారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... దుమ్ము, ధూళి నుంచి దూరంగా ఉండాలి శీతలపానీయాలు, ఐస్‌క్రీములు తినకూడదు పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉండాలి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే పార్థీనియం మొక్కలను తొలగించి, పుప్పొడికి దూరంగా ఉంచాలి కొన్ని జంతువుల విసర్జరకాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి పెయింట్ వంటి ఘాటైన వాసనలు, వివిధ రకాల స్ప్రేలు, దోమల నివారణకు ఉపయోగించే ఘాటైన వాసనలు వెలువరించే మస్కిటో రిపల్లెంట్స్ వంటివి పిల్లలకు సరిపడటం లేదని గుర్తిస్తే వాటిని వాడకూడదు. చికిత్స: హోమియో విధానంలో అలర్జీలకు సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమిలియం ద్వారా నయం చేయవచ్చు. ఈ ప్రక్రియలో రోగనిరోధకశక్తిని పెంపొందించపజేసి, ఎలాంటి అలర్జిక్ ప్రతిచర్యనైనా శరీరం తట్టుకునేలా ఇమ్యూనిటీని పెంచే మందులు ఇస్తారు. ఇలా ఇమ్యూన్ సిస్టమ్‌ను బూస్ట్ చేయడం వల్ల ప్రతికూల పరిస్థితల్లోనూ పిల్లలు ఆరోగ్యంతో ఉండేలా చూడటం హోమియో విధానం ప్రత్యేకత. -డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ జనరల్ కౌన్సెలింగ్ నాకు కొన్ని పులుపు పదార్థాలంటే చాలా ఇష్టం. ఉదాహరణకు పులుసు కూరలు, చింతకాయ పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి వంటివి ఇష్టంగా తింటాను. అవి తిన్న వెంటనే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంటుంది. చాలా మంది డాక్టర్లను కలిస్తే ఇది అల్సర్ వల్ల కావచ్చని అంటున్నారు. నేను ఎప్పటికీ నాకు ఇష్టమైన వాటిని తినలేనా? నాకు తగిన సలహా ఇవ్వండి. - ఉపేంద్రనాథ్, సిరిసిల్ల పుల్లటి పదార్థాలు తినడం అన్నది అసిడిటీని పెంచడం మాత్రమే కాదు... ఒకవేళ కడుపులో అల్సర్స్ ఉంటే అవి తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. మీరు నోట్లో నుంచి ఓరల్ ఎండోస్కోపీ చేయించుకుంటే... మీకు అల్సర్ ఉన్నా లేదా ఇతరత్రా ఏమైనా సమస్యలు ఉన్నా తెలుస్తుంది. మీరు మీ లేఖలో మీకు సరిపడని పదార్థాలు తింటే ఈ విధమైన సమస్యలు వస్తున్నాయో, మీకు కలుగుతున్న ఇబ్బంది ఏమిటో నిర్దిష్టంగా చెప్పలేదు. మీరు ముందుగా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు మీకు ఎండోస్కోపీ చేశాక... అల్సర్స్ ఉన్నట్లు నిర్ధారణ అయితే... పాంటాప్రొజోల్ లేదా ఒమెప్రొజోల్ మందులను సూచిస్తారు. నా వయసు 45 ఏళ్లు. నాకు కొద్ది రోజులుగా కుడి డొక్కలో నొప్పి వస్తోంది. కాసేపటి తర్వాత దానంతట అదే తగ్గుతోంది. ఆ తర్వాత నాకు ఎలాంటి సమస్యా ఉండదు. చాలాకాలం నుంచి ఈ సమస్య ఉంది. కొందరు ఇది తీవ్రమైన సమస్య కావచ్చని అంటుండటంతో ఆందోళనగా ఉంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - టి. రవికుమార్, ఒంగోలు మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు గాల్‌బ్లాడర్‌లో రాయి ఉండే అవకాశం ఉంది. చాలా మందిలో ఈ సమస్య ఉన్నప్పుడు బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ కొంత మందిలో మధ్యమధ్యలో నొప్పి కలగడం ద్వారా ఆ సమస్య బయటపడుతుంది. మీరు అల్ట్రా సౌండ్ అబ్డామిన్ స్కాన్ చేయించుకోవాలి. సీరమ్ అమిలేజ్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షల్లో రాయి ఉన్నట్లు నిర్ధారణ అయితే మీరు సర్జన్‌ను సంప్రదించాలి. రాయి పరిమాణాన్ని బట్టి నిపుణులు తగిన శస్త్రచికిత్స మార్గాన్ని సూచిస్తారు. డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కన్సల్టెంట్-ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటిస్, సెంచరీ హాస్పిటల్, బంజారాహిల్స్, హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. గృహిణిని. పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. ఇంకా పిల్లలు లేరు. నేను మందులు వాడినప్పుడే నాకు రుతుక్రమం వస్తోంది. లేడీడాక్టర్ కొన్ని పరీక్షలు చేయించారు. నా ఎఫ్ఎస్హెచ్ పాళ్లు 50 ఇంటర్నేషనల్ యూనిట్స్/ఎమ్ఎల్ అన్నారు. దాంతో పాటు ఏఎమ్‌హెచ్ కూడా చాలా తక్కువగా ఉందని చెప్పారు. నా అండాశయ సామర్థ్యం (ఒవేరియన్ కెపాసిటీ) చాలా తక్కువగా ఉందన్నారు. నా భర్త శుక్రకణాల సంఖ్య నార్మల్‌గానే ఉంది. ఇప్పుడు మేము ఏం చేయాలి? - ధనలక్ష్మి, విశాఖపట్నం మీ కండిషన్‌ను ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. సాధారణంగా ఇది శాశ్వతమైన సమస్య. అయితే కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా గర్భం రావచ్చు కూడా. ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్‌కు కారణాలూ పెద్దగా తెలియదు. కొన్నిసార్లు క్రోమోజోముల్లోని లోపాలు, తమ వ్యాధి నిరోధక శక్తి తమనే దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ సమస్యలు, గాలాక్టోసీమియా వంటివి కారణమవుతాయి. ఈ కండిషన్ ఉన్నవారి కుటుంబాలలో ఇది తరచూ కనిపిస్తుంటుంది. ఈ సమస్య ఉన్నవారికి ఆటోఇమ్యూన్ పరీక్షలూ, ఫ్రాజైల్ ఎక్స్ క్రోమోజోమ్ పరీక్షలూ, డెక్సాస్కాన్ వంటివి అవసరమవుతాయి. సాధారణంగా ఈ కండిషన్ ఉన్నవారిలో గర్భధారణ అవకాశాలు తక్కువ కాబట్టి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) చేయించుకోవాల్సిందిగా సూచిస్తాం. ఉన్న కొద్దిపాటి అండాలను సేకరించడం కష్టమైతే, అప్పుడు దాతల నుంచి సేకరించి, వాటితో మీ భర్త శుక్రకణాలతో ఫలదీకరణ చేయించి, పిండాన్ని రూపొందించి, దాన్ని మీ గర్భసంచిలోకి ప్రవేశపెడతాం. ఇలాంటి సమస్య ఉన్నవారు తమ సాధారణ ఆరోగ్యాన్నీ కాపాడుకోవాల్సి ఉంటుంది. మీరు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం (ఫిజికల్ ఫిట్నెస్) కోసం రోజూ వ్యాయామం చేయడం, క్యాల్షియమ్, విటమిన్-డి ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం అవసరం. మీకు ప్రిమెచ్యుర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ ఉన్నందుకు మీ డాక్టర్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని సూచిస్తారు. ఆ హార్మోన్లను సుమారు యాభై, యాభైయొక్కఒక్క ఏళ్లు వరకు వాడాల్సి ఉంటుంది. వేర్వేరు వైద్య విభాగాలకు చెందిన మల్టీడిసిప్లనరీ టీమ్‌తో మీరు సత్ఫలితాలను పొందవచ్చు. - డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నేడు ఉగాది పర్వదినం షడ్రుచుల సమ్మేళనం
ప్రాముఖ్యం చైత్ర శుద్ధపాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారం ధరించిన విష్ణుమూర్తి సోమకున్ని సంహరించి వేదాలను బ్రహ్మాకు అప్పగించిన సందర్భంగా ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. పూజ అన్ని పండుగల మాదిరిగానే ఉగాది రోజున ఉదయం 9గంటల లోపు తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఏదో ఒక దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అనంతరం ఏమీ తినక ముందే ఉగాది పచ్చడిని తింటారు. పచ్చడి ‘ఉగాది పచ్చడి’ ఈ పండుగకు మాత్రమే తినే ప్రత్యేక పదార్థం. షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటారు. ఏడాదిపాటు ఎదురయ్యే మంచిచెడులు, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. పచ్చడి తయారీకి మామిడి కాయలు, చింతపండు, ఉప్పు, కారం, బెల్లం, వేపపువ్వు వాడుతారు. బె ల్లం-ఆనందానికి, ఉప్పు-ఉత్సాహం, వేపపువ్వు-బాధ కలిగించే అనుభవాలు, పులుపు-నేర్పుగా వ్యవహారించాల్సిన పరిస్థితులు, మామిడి-కొత్త సవాళ్లు, కారం-సహనం బావానికి ప్రతీక. పంచాంగ శ్రవణం కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహ శాంతి వంటివి జరిపించుకుని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి, వ్యవసాయం ఎలా ఉంటుంది, అనే విషయాలను తెలుసుకోడానికి పంచాంగ శ్రవణం చేసేవారని చెబుతారు.