చికెన్ అండ్ హాట్ సోర్ సూప్
కావలసినవి: బోన్‌లెస్ చికెన్ – 85 గ్రా.; క్యాబేజి – 30 గ్రా. (సన్నగా తర గాలి); క్యారట్ – 30 గ్రా.లు (సన్నగా తరగాలి); మొక్కజొన్న పిండి – ఒకటిన్నర టీ స్పూన్; నూనె – 10 గ్రా; ఉప్పు – అర టీ స్పూన్; వెల్లుల్లి – 4 టీ స్పూన్లు (సన్నగా తర గాలి); కారం – అర టీ స్పూన్; పంచదార – 1 టీ స్పూన్; మిరియాలపొడి – అర టీ స్పూన్; ఉల్లిపాయ – ఒకటి (పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి); సోయసాస్ – అర టేబుల్ స్పూన్; వెనిగర్ – 1 టేబుల్ స్పూన్
తయారీ: చికెన్‌ని శుభ్రపరిచి మూడుకప్పుల మంచినీళ్లు పోసి, అందులో ఉల్లిపాయ ముక్కలు, రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి ఉడకబెట్టాలి. దీనిని చికెన్ స్టాక్ అంటారు. (ఈ చికెన్ స్టాక్‌ని వడకట్టుకుని ఫ్రిజ్‌లో వారం రోజుల వరకు నిల్వ ఉంచుకుని, కావల్సినప్పుడల్లా వాడుకోవచ్చు.) పాన్‌లో నూనె వేడయ్యాక వెల్లుల్లి, క్యాబేజి, క్యారట్ ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి. ముక్కలు ఎర్రబడకూడదు. దాంట్లో చికెన్ స్టాక్ ముక్కలతో సహా పోసి ఉడికించాలి. అందులో కారం, ఉప్పు, మిరియాల పొడి, పంచదార, వెనిగర్, సోయసాస్ వేసి కలిపి పది నిమిషాలు ఉంచాలి. చల్లని నీటిలో మొక్కజొన్న పిండిని కలిపి దాన్ని ఉడుకుతున్న మిశ్రమంలో పోస్తూ కలపాలి. దించి సర్వ్ చేసేముందు చిల్లీసాస్ చల్లితే రుచిగా ఉంటుంది.
నోట్: చికెన్ తిననివారు కూరగాయ ముక్కల్ని ఉడికించి పైవిధంగానే వెజిటబుల్ సూప్‌ని తయారుచేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment