భారతీయుల భోజనంలో పెరుగు ప్రధానమైనది. దీన్ని కూరల్లో కూడా జోడిస్తారు. రైతాగానూ, మజ్జిగగా పలు రకాలుగా తీసుకుంటారు. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది, చలువ చేస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అలాగే గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అంతేగాదు మొత్తం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది పెరుగు. అయితే పుల్లటి పెరుగు వినియోగించొచ్చా? ఇది ఆరోగ్యకరమైనదేనా? అని చాలామందిలో మెదిలే సందేహం.
వేసవి కాలల్లో పెరుగు తొందరగా పులుసుపోతుంది. అలాంటప్పుడూ అది తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా అనే అనుమానం రావడం సహజం. అయితే నిపుణులు పుల్లటి పెరుగు కూడా ఆరోగ్యాని మంచిదేనని ధీమగా చెబుతున్నారు. ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా బేషుగ్గా తీసుకోమని చెబుతున్నారు. కానీ ఇక్కడ పెరుగుని ఎలా స్టోర్ చేస్తున్నామనేది కీలకం అని నొక్కి చెబుతున్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని తినొచ్చా లేదా అని నిర్థారించగలమని అంటున్నారు.
పుల్లని పెరుగుని వినియోగించాలంటే తెలుసుకోవాల్సిన అంశాలు..
నిల్వ చేసే విధానం: పుల్లని పెరుగుని చల్లటి ప్రదేశంలో గాలి చొరబడని శుభ్రమైన కంటైనర్‌లో ఉంచాలి. పెరుగును సరిగ్గా నిల్వ చేయకపోతే ప్రమాదకరమైన సూక్ష్మక్రీములు వృద్ధి చెందుతాయి.. తినడానికి అనారోగ్యకరంగా మారుతాయి.
వాసన, స్వరూపం: పెరుగు కాస్త చిక్కబడి నురుగ వచ్చినట్లుగా ఉండి, పుల్లటి వాసన ఘాటుగా వస్తుంటే దాన్ని వినియోగించకపోవడమే మంచిది. లేదంలో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
నిల్వ సమయం: పెరుగు పుల్లడం అనేది సహజ ప్రక్రియ. ఎక్కువ కాలవ ఉండటం వల్ల పులయబడటానికి అనుమతిస్తుంది. ఇక్కడ ఎంతసేపు నుంచి పులియబడింది అనేదాన్ని పరిగణలోనికి తీసుకుని వినయోగించాలి.
సరైన శీతలీకరణ: కిణ్వణ ప్రక్రియ మందగించేలా, చెడిపోకుండా ఉండేందుకు పెరుగును ఎల్లప్పుడూ స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద రిప్రిజిరేటర్‌లో ఉంచాలి.
పరిశుభ్రత: శుభ్రమైన గిన్నెల్లో పెరుగును తయారు చేయడం వంటివి చేయాలి. ఒక్కసారి వినియోగించిన పెరుగు గిన్నెలోనే పాలు వేసి తోడిపెట్టడం వంటివి చెయ్యకూడదు.
అలవాటు చేసుకోవాలి: పుల్లని పెరుగు తినే అలవాటు లేకుంటే నెమ్మదిగా అలవాటు చేసుకునే యత్నం చేస్తే జీర్ణవ్యవస్థ ఈ పెరుగుని స్వీకరించే ప్రయత్నం చేస్తుంది.
ఇతర ఆహారాలతో జోడించడం: పుల్లని పెరుగు నుంచి మరిన్ని ప్రయోజనాలు పొందాలనుకుంటే..పండ్లు, తేనె లేదా తృణధాన్యాలు వంటి ఇతర ఆహారాలతో కలపవచ్చు. ఇది మరింత రుచికరంగా ఉండటమే కాకుండా భోజనానికి వివిధర రకాల పోషకాలను అందిస్తుంది.
ఏ టైంలో తీసుకుంటే మంచిది: పుల్లటి పెరుగు రాత్రిపూట కంటే పగటి పూట తీసుకోవడమే మంచిది. ఎందుకంటే జీర్ణక్రియ సాధారణంగా పగటిపూట మరింత చురుకుగా ఉంటుంది. జీర్ణ సమస్యల సంభావ్యతను తగ్గిస్తుంది.
శరీర స్పందన: పుల్లని పెరుగు మీ శరీరతత్వానకి సరిపోతుందో లేదో గమనించాలి. కడుపునొప్పి లేదా అసౌకర్యం వంటి ప్రతికూల ప్రభావాలు కనిపిస్తే తీసుకునే పరిమాణం తగ్గించడం లేదా నిలిపేయడం మంచిది.
సరైన పద్ధతుల్లో పెరుగుని నిల్వ చేస్తే పుల్లటి పెరుగుని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని నిపుణుల చెబుతున్నారు. కానీ యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణక్రియ సమస్యలు ఉన్న వ్యక్తులు ఈ పుల్లటి పెరుగు తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు.
(చదవండి: గ్లోయింగ్ స్కిన్ కోసం..నటి భాగ్యశ్రీ గ్రీన్ జ్యూస్ ట్రై చేయండి!)
Comments
Please login to add a commentAdd a comment