Experts
-
ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ రిపీట్ అంటూ తెగ చూసేస్తున్నారా?
పొద్దున్న లేచింది మొదలు రాత్రినిద్రపోయేంతవరకు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు జనం. బస్సుల్లో, బస్‌స్టాప్‌లో, రైళ్లలో, పార్క్‌ల్లో, ఇలా ఎక్కడ చూసినా ఇదే తంతు. పెద్దలు చెప్పినట్టు లేవగానే దేవుడి ముఖం చూస్తారో లేదో తెలియదు గానీ స్మార్ట్ ఫోన్ (Smart Phone) చూడని వారుమాత్రం ఉండరంటే అతిశయోక్తికాదు. అలా మారిపోయింది నేటి డిజిటల్ యుగం. కొంచెం టైం దొరికితే చాలు.. ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ (Reels), యూట్యూబ్ షార్ట్ వీడియోలు... అక్కడితో అయిపోదు.. టైం వేస్ట్ అవుతోందని తెలిసినా..మళ్లీ ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది గంటల తరబడి. ఇలా రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తున్నవారికి ఒక హెచ్చరిక. ఈ అలవాటు అనేక మానసిక, శారీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలుసా? స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల అనర్థాలపై ఇప్పటికే చాలా అధ్యయనాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. పడుకునే సమయంలో షార్ట్ వీడియోలు లేదా రీల్స్ చూడటానికి గడిపే స్క్రీన్ సమయానికి , యువకులు మధ్య వయస్కులలో అధిక రక్తపోటుకు మధ్య పరస్పర సంబంధం ఉందని ఒక అధ్యయనం గుర్తించింది. తాజాగా ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ (APAO) 2025 కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ లలిత్ వర్మ ' సెలెండ్ ఎపిడమిక్ ఆఫ్ డిజిటల్ ఐ' అంటూ ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు హెచ్చరించారు. "రీల్స్ తక్కువగా ఉండవచ్చు, కానీ కంటి ఆరోగ్యంపై వాటి ప్రభావం జీవితాంతం ఉంటుంది" అని డాక్టర్ లాల్ హెచ్చరించారు.మితిమీరిన స్క్రీన్‌టైమ్‌తో మనుషులు అనేక సమస్యలు కొని తెచ్చుకోవడమేననీ, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్బుక్ ,యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రీల్స్‌ను అతిగా చూడటం వల్ల అన్ని వయసుల వారిలో, ముఖ్యంగా పిల్లలు , యువకుల్లో తీవ్రమైన కంటి సమస్యలు పెరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ విపరీతంగా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని యశోభూమి- ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్లో మంగళవారం (ఏప్రిల్ 1) జరిగిన ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తామాలజీ, ఆల్ ఇండియా ఆప్తామాలాజికల్ సొసైటీ సంయుక్త సమావేశంలో ఇందుకు సంబంధించి పలు కీలక అంశాలను వెల్లడించారు. బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల పెద్దల్లో కూడాతరచుగా తలనొప్పి, మైగ్రేన్లు , నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 50శాతం కన్నా ఎక్కువ మంది నయంకాని అంధత్వానికి అత్యంత సాధారణ కారణమైన మయోపిక్‌తో బాధపడే అవకాశం ఉంటుందని అంచనా.చదవండి: నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!అధిక వేగం, దృశ్యపరంగా ఉత్తేజపరిచే కంటెంట్‌కు ఎక్కువ కాలం గురికావడం వల్ల డిజిటల్ కంటి ఒత్తిడి, మెల్లకన్ను,కంటి చూపు క్షీణించడం వంటి సమస్యలతో ముఖ్యంగా విద్యార్థులు ,పని చేసే నిపుణులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక స్క్రీన్ సమయం వల్ల సామాజికంగా ఒంటరితనం, మానసిక అలసట,మతిమరపు లాంటి సామాజిక , మానసిక నష్టాన్ని కూడా వారు నొక్కి వక్కాణిస్తున్నారు.చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఏం చేయాలి. 20.20.20 రూల్నియంత్రణలేని రీల్స్ వీక్షణంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయని, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు సోషల్ మీడియా వినియోగదారులు తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు 20-20-20 రూల్‌ను పాటించాలని నేత్ర వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకోసారి 20 సెకన్ల విరామం తీసుకోవాలి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై దృష్టిని కేంద్రీకరించాలి. లేదా గంటకు 5 నిమిషాల పాటు కళ్లకు తగినంత విశ్రాంతినివ్వాలి. అలాగే ఐ బ్లింక్ రేటు పెంచడం, స్క్రీన్లను చూస్తున్నప్పుడు తరచుగా బ్లింక్ చేయడానికి ప్రయత్నం చేయడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం,క్రమం తప్పకుండా స్క్రీన్ బ్రేక్‌లు వంటి డిజిటల్ డిటాక్స్ తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుందంటున్నారు కంటివైద్య నిపుణులు.చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు! -
Betting Apps Case: ఇన్ఫ్లూయన్సర్లు.. జర జాగ్రత్త..!
క్లాసులూ, స్నేహితులతో ఊసులు తప్ప వేరే విషయాలు తెలియని ఓ కళాశాల విద్యార్థి ఓవర్‌నైట్ సోషల్ మీడియా స్టార్ అయిపోతాడు.. గడప దాటడం ఎరుగని ఓ గృహిణి కిచెన్‌లో గరిటె తిప్పుతూ లక్షల సంఖ్యలో ఫాలోయర్లను కూడగట్టుకుంటున్నారు. పల్లెటూరి నుంచి వచ్చిన అవ్వ మొదలు పట్నం ముఖం చూడని తాత వరకూ.. ఎందరో స్టార్లు.. పుట్టుకొచ్చేస్తున్న కాలమిది. కారెవరూ సెలబ్రిటీ స్టేటస్‌కు అనర్హం అన్నట్లు.. నేమ్.., ఫేమ్‌తో పాటు ఇన్కమ్ అంతా ఓకే. కానీ వీరి పాపులారిటీని సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆయా వ్యాపారులే సోషల్ స్టార్స్‌కు చిక్కులు తెచ్చిపెడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోదాదాపు నాలుగు నెలల క్రితం ఔటర్ రింగ్‌రోడ్డుపై కరెన్సీ నోట్లను వెదజల్లి మనీ హంట్ నిర్వహించిన బాలానగర్ నివాసి యాంకర్ చందు అలియాస్ భాను చందర్, అదే విధంగా నోట్లను కూకట్‌పల్లిలో నడిరోడ్డు మీద విసిరేసిన కూరపాటి వంశీ అనే ఇన్ఫ్లూయన్సర్లను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నగర ఇన్ఫ్లూయన్సర్లలో లోపించిన చట్టపరమైన అవగాహనకు ఈ తరహా ఉదంతాలెన్నో అద్దం పడతాయి. ఇదొక్కటే కాదు గతంలో ఓ కంపెనీ అధిక వడ్డీ ఆశ చూపి నగరవ్యాప్తంగా 18వేల మందిని ముంచేసిన ఉదంతంలో ఆ కంపెనీని ప్రమోట్ చేసిన పాపం కూడా సోషల్ మీడియా స్టార్లకే చుట్టుకుంది. అడపాదడపా జరుగుతున్న ఇలాంటివి ఒకెత్తయితే తాజాగా గేమింగ్ యాప్స్‌కు సంబంధించి పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతుండడం సిటీ ఇన్‌ఫ్లూయన్సర్స్ కమ్యూనిటీని అప్రమత్తం చేస్తున్నాయి. స్టార్లందు సూపర్స్టార్లు వేరయా.. సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్ బుక్, బ్లాగ్స్, వ్లాగ్స్.. వగైరాల ద్వారా వేలు, లక్షల సంఖ్యలో ఫాలోయర్లను పొందుతున్నవారినే ఇన్‌ఫ్లూయన్సర్లుగా పేర్కొంటున్నారు. అలాంటి వారు నగరంలోనూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో 10 వేల నుంచి లక్ష మంది ఫాలోయర్ల లోపు ఉన్నవారిని మైక్రోఇన్ఫ్లూయన్సర్లుగా అలాగే లక్ష నుంచి 5లక్షల లోపు ఉన్నవారిని మిడ్–టైర్ ఇన్ఫ్లుయెన్సర్లు, 5లక్షల నుంచి 10లక్షల మంది ఉన్నవారిని మ్యాక్రో ఇన్ఫ్లూయన్సర్లు, 10లక్షలు ఆ పైన ఉంటే టాప్ క్రియేటర్స్‌గా పేర్కొంటారు. వీళ్లు మాత్రమే కాకుండా ప్రతి పోస్టుకూ లక్షల సంఖ్యలో స్పందన అందుకునే వారిని సెలబ్రిటీ ఇన్‌ఫ్లూయన్సర్లుగా పిలుస్తారు. సాధారణంగా సినిమా తారలు, క్రికెటర్లు.. ఈ విభాగంలోకి వస్తారు. అనుసరణ.. అనుకరణే ఆదాయంఈ ఇన్ఫ్లూయన్సర్లకు ఆదాయం వారిని అనుసరించే ఫాలోయర్ల సంఖ్యను బట్టఆధారపడి ఉంటుంది. మైక్రో కిందకి వచ్చేవారికి పోస్టుకు రూ.5వేల నుంచి రూ.50వేల వరకూ, అలాగే లిమిడ్ టైర్ విభాగంలో ఉన్నవారికి రూ.50వేల నుంచి రూ.2లక్షలు, మ్యాక్రో స్టార్స్‌కి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకూ, టాప్ క్రియేటర్స్‌కు రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకూ క్లయింట్స్ చెల్లిస్తున్నారు. ఇక సెలబ్రిటీ ఇన్ఫ్లూయన్సర్లకు ఆదాయం కొన్ని సార్లు రూ. కోట్లలో కూడా ఉంటుంది. సాధారణంగా ఫాలోయర్ల సంఖ్యను బట్టే పేమెంట్ ఉంటుంది. అయితే లైక్స్, కామెంట్స్, షేర్స్ కూడా కొన్ని సార్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఫ్యాషన్, బ్యూటీ, టెక్నాలజీ.. రంగాలకు సంబంధించిన ప్రమోషన్లకు అధిక మొత్తాలు లభిస్తాయి. నగరంలో వేగంగాఇన్ఫ్లూయన్సర్ల సంఖ్యను పెంచుకోవడంలో నగరం దూసుకుపోతోంది. ప్రస్తుతం నగరంలో పేరొందిన ఇన్‌స్టా ఇన్ఫ్లూయన్సర్లు 761 మంది వరకూ ఉన్నట్లు మోదాష్ అనే ఆన్లైన్ సంస్థ అంచనా వేసింది. నగరం ఇటీవల ఫ్యాషన్, ఫుడ్, ఫిట్నెస్, టెక్నాలజీ హబ్‌గా మారుతున్న నేపథ్యంలో ప్రముఖ బ్రాండ్స్ లోకల్ స్టార్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకోడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇవి నగరానికి చెందిన ఇన్ఫ్లూయన్సర్లకు కాసుల పంట పండిస్తున్నాయి. వీరిని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకోవాలంటే.. వారి ఇన్‌స్టా ఖాతాల్లోకి వెళ్లడం, తమ బ్రాండ్ గురించి క్లుప్తంగా చెప్పడం, ఎన్ని రోజులు, ఎలాంటి ప్రచారం కావాలి? తదితర వివరాలు మెసేజ్ చేస్తే.. సరిపోతుంది. ఆన్లైన్, చాట్స్ ద్వారానే కుదిరిపోయే డీల్స్ కోకొల్లలు. అందువల్లే చట్ట వ్యతిరేక, చట్ట పరిధిలో లేని గేమింగ్ యాప్స్ లాంటి వాటిని ప్రమోట్ చేస్తూ.. కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇదీ చదవండి:సునీతా విలియమ్స్ మీద సింపతీలేదు : యూఎస్ ఖగోళ శాస్త్రవేత్త ఇన్ఫ్లూయన్లర్లు, జర జాగ్రత్త..ఈ నేపథ్యంలో ఎడా పెడా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఇన్ఫ్లూయన్సర్లు ఒక్కసారిగా అప్రమత్తమై.. తాము ప్రమోట్ చేస్తున్న బ్రాండ్స్ గురించి మరోసారి సమీక్షించుకోవాలని అడ్వర్టయిజింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. అలాగే వాణిజ్య సంబంధిత ప్రచారాలకు సంబంధించి చట్ట పరమైన నియమ నిబంధనలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయ కోవిదులు సూచిస్తున్నారు. -
జాగ్రత్త పడకుంటే విడాకులే..!
అమెరికాలో విడాకుల లాయర్‌గా పేరుబడిన జేమ్స్ శాక్స్ట్టన్. విడాకులు పెరగడానికి కారణం ‘స్లిప్పేజ్ అన్నాడు. పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు పట్టించుకోక చూపే లెక్కలేనితనాలే ఒకనాటికి ‘విడాకులు’గా మారుతున్నాయని హెచ్చరించాడు. ‘నా ఉద్యోగం, పిల్లలు, సంపాదన...వీటన్నింటి కన్నా ముందు నువ్వే నాకు ముఖ్యం’ అని భార్య/భర్త ఒకరికొకరు తరచూ చెప్పుకోకపోతే చర్యలతో చూపకపోతే విడాకులకు దగ్గరపడ్డట్టే అంటున్నాడు. స్లిప్పేజ్ లక్షణాలు మీలో ఉన్నాయా..?ఒకరోజు ఉదయాన్నే మీరు బట్టలు ధరిస్తుంటే అవి బిగుతుగా కనబడతాయి. వేసుకోవడానికి పనికి రానట్టుగా ఉంటాయి. ఏమిటి... ఇంత లావై΄ోయానా అనుకుంటారు. ఈ లావు రాత్రికి రాత్రి వచ్చిందా? కాదు. సంవత్సరాలుగా మీరు నిర్లక్ష్యంగా తిన్నది, వ్యాయామాన్ని పట్టించుకోనిది పేరుకుని ఇప్పుడు ఇలా బయటపడింది. మీ జీవన భాగస్వామి ఒక ఉదయాన వచ్చి మనం విడాకులు తీసుకుందాం అనంటే అది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎన్నో సంవత్సరాల నిర్లక్ష్యాల ఫలితం’ అంటున్నాడు జేమ్స్ శాక్స్టన్. అమెరికాలో విడాకుల లాయర్‌గా పేరుగడించిన ఈయన ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ‘స్లిప్పేజ్’ అనే మాట వాడాడు. పెళ్లయ్యాక ఏది ముఖ్యమో, ఏది అక్కడ అవసరమో అది వయసు గడిచేకొద్దీ ‘స్లిప్’ చేసుకుంటూ వెళితే ఎదురయ్యేది విడాకులే అంటాడతను. ఇతని మాటల ఆధారంగా వివిధ మ్యారేజ్ కౌన్సిలర్లు తమ వ్యాఖ్యానం వినిపిస్తున్నారు.మీ పెళ్లయ్యాక ఇలా చేస్తున్నారా?అతడు/ఆమె ఇష్టాఇష్టాలను ‘ఏం పర్లేదులే’ అనే ధోరణిలో ఖాతరు చేయకపోవడం.చిన్న చిన్న కోరికలు పట్టించుకోకపోవడంతగిన సమయం ఇవ్వకపోవడంసంభాషించకపోవడంమాటల్లేని రోజులను పొడిగించడంఅసంతృప్తులను బయటకు చెప్పకుండా కప్పెట్టి రోజులు వెళ్లబుచ్చడం..ఇలాంటివి జరుగుతుంటే త్వరలోనే వివాహ బంధం బ్రేక్ కానుందని అర్థం.ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?మీరు కేవలం రోజువారి పైపై మాటలే మాట్లాడుకుంటున్నారా?లోతైన, ఆత్మీయమైన సంభాషణలే చేసుకోవడం లేదా?సన్నిహితమైన సమయాలే ఉండటం లేదా?సమస్యాత్మక విషయాలను చర్చకు పెట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారా?ఇలా ఉన్నా మీ వివాహం ప్రమాదంలో ఉన్నట్టే అంటున్నారు నిపుణులు.మంచి తల్లిదండ్రులైతే సరిపోదుచాలామంది దంపతులు తాము మంచి తల్లిదండ్రులుగా ఉండటం ముఖ్యమనే దశకు వెళతారు. పిల్లలతో అనుబంధం గట్టిగా ఉంటే భార్యాభర్తల బంధం కూడా గట్టిగా ఉంటుందని అనుకుంటారు. అయితే ఇలా ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. ‘నేను, నా ఉద్యోగం, నా పిల్లలు, నా సంపాదన ఆ తర్వాతే జీవిత భాగస్వామి అనుకుంటారు చాలామంది. వాస్తవానికి జీవిత భాగస్వామి ముందు ఉండాలి. మనం చేస్తున్నదంతా భార్య/భర్త కోసమే అనుకుని నిర్లక్ష్యం వహిస్తే భార్య/భర్త దూరమవుతారు. పిల్లలు, కెరీర్ కంటే ముందు భార్యాభర్తలుగా మన బంధం ముఖ్యం అని ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకోవాలి... ఆ విధంగా రిలేషన్‌ను కాపాడుకోవాలి’ అంటున్నారు నిపుణులు.ఇలా చేయండి..మీ జీవిత భాగస్వామి పట్ల అక్కరగా ఉండండి.తరచూ ఎక్కువగా మాట్లాడండి. మంచి సమయాన్ని గడపండి.ఆర్థిక విషయాలు దాచకుండా చర్చిస్తూ ఇష్టాఇష్టాలు గమనించండి.మీ భార్య/భర్త ఒక గట్టి పాయింట్ లేవదీసి మిమ్మల్ని నిలదీస్తే తప్పించుకోకుండా దానిపై ఇవ్వాల్సిన వివరణ ఇచ్చి ముగించండి. లేకుంటే అది పెరుగుతూనే ఉంటుంది.మీరు భార్య లేదా భర్త. అంటే వివాహ బంధంలో మీవంటూ కొన్ని బాధ్యతలు తప్పనిసరిగా ఉంటాయి. ఆ బాధ్యతలను మీరు నిర్లక్ష్యం చేస్తే ఆ బంధం గట్టిగా ఉంటుందని భావించండంలో లాజిక్ లేదు.పెళ్లి తనకు తానుగా నిలబడదు. కాని మీరు నిర్లక్ష్యం చేస్తే తనకు తానుగా విఫలమవుతుంది. కాబట్టి చెక్ చేసుకోండి. (చదవండి: ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!) -
భారత్‌కు ఏఐ నిపుణులు కావలెను
సాక్షి, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్ ఇదే. అయితే ప్రపంచ ఏఐ నిపుణులకు కేంద్రంగా మారడానికి భారత్‌కు అవకాశాలు ఉన్నప్పటికీ.. ఈ రంగంలో నిపుణుల కొరతను దేశం ఎదుర్కొనబోతోందని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ తన తాజా నివేదికలో వెల్లడించింది. పెరుగుతున్న నైపుణ్య అంతరం ఈ రంగంలో దేశ పురోగతికి ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని తెలిపింది. 2027 నాటికి భారత ఏఐ రంగంలో 10 లక్షలకుపైగా నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత తప్పదని జోస్యం చెప్పింది. అందుబాటులో ఉన్న నిపుణులతో పోలిస్తే 1.5–2 రెట్ల డిమాండ్ ఉంటుందని అంచనాగా వెల్లడించింది. సమస్య నుంచి గట్టెక్కాలంటే కంపెనీలు సంప్రదాయ నియామక విధానాలకు మించి ముందుకు సాగాలి. నిరంతర నైపుణ్యాల పెంపుదలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆవిష్కరణ–ఆధారిత పర్యావరణ వ్యవస్థను పెంపొందించాలి అని వివరించింది. రీస్కిల్–అప్‌స్కిల్.. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భారత్‌లో శ్రామిక శక్తి నైపుణ్యం తిరిగి మెరుగుపరచడం, నైపుణ్యాలను పెంచడం అత్యవసరమని నివేదిక స్పష్టం చేసింది. ‘అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సాధనాలు, నైపుణ్యాలపై ప్రస్తుత నిపుణుల్లో ఎక్కువ మందిలో తిరిగి నైపుణ్యం మెరుగుపర్చడం, పెంచడంలో సవాళ్లతోపాటు అవకాశాలూ ఉన్నాయి’ అని బెయిన్ అండ్ కంపెనీ ఏఐ, ఇన్సైట్స్, సొల్యూషన్స్ ప్రాక్టీస్ పార్ట్నర్, లీడర్ సైకత్ బెనర్జీ తెలిపారు. ‘ప్రతిభ కొరతను పరిష్కరించడానికి బహుముఖ విధానం అవసరం. కంపెనీలు సంప్రదాయ నియామక పద్ధతులకు మించి అంతర్గత ప్రతిభను పెంపొందించడానికి నిరంతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిభ కొరత ఒక ముఖ్యమైన సవాల్. కానీ అధిగమించలేనిది కాదు. దీనిని పరిష్కరించడానికి వ్యాపార సంస్థలు ఏఐ ప్రతిభను ఆకర్షించడం, అభివృద్ధి చేయడం, నిలుపుకోవడంలో ప్రాథమిక మార్పు అవసరం’ అని నివేదిక వివరించింది. ఏఐ స్వీకరణలో వెనుకంజ.. ఆకర్షణీయంగా జీతాలు పెరిగినప్పటికీ అర్హత కలిగిన ఏఐ నిపుణుల సరఫరా డిమాండ్ వేగాన్ని అందుకోలేదు. ప్రతిభ అంతరం పెరగడం వల్ల పరిశ్రమల్లో ఏఐ స్వీకరణ మందగించే ప్రమాదం ఉందని నివేదిక వివరించింది. ఉత్పాదక ఏఐ సాంకేతికతలను అమలు చేయడానికి అంతర్గత ఏఐ నైపుణ్యం లేకపోవడం ఒక ప్రధాన అడ్డంకి అని ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాలుపంచుకున్న కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. ఈ కొరత కనీసం 2027 వరకు కొనసాగుతుందని, అంతర్జాతీయ మార్కెట్లలో వివిధ స్థాయిల్లో ప్రభావం ఉంటుందని అంచనాగా చెప్పారు. దేశంలో 2019 నుండి ఏఐ సంబంధిత ఉద్యోగ నియామకాలు ఏటా 21 శాతం దూసుకెళ్లాయి. అయితే వేతనాలు ప్రతి సంవత్సరం 11 శాతం పెరిగాయి. ఏఐ అవకాశాలు: 2027 నాటికి 23 లక్షలకుపైమాటే. అంటే అందుబాటులో ఉన్న నిపుణులతో పోలిస్తే 1.5–2 రెట్లు అధిక డిమాండ్. మూడేళ్లలో వనరులు: సుమారు 12 లక్షల మందికి చేరిక నిపుణుల కొరత : 10 లక్షల మందికిపైగా డిమాండ్ తీర్చాలంటే: మానవ వనరుల నైపుణ్యం తిరిగి మెరుగుపరచడం (రీస్కిల్), నైపుణ్యాలను పెంచడం (అప్‌స్కిల్) అత్యవసరం. -
ఈ ఏడాదికి పెట్టుబడి అస్త్రాలు!
‘ఈ రోజు గడిస్తే చాలులే.. రేపటి రోజు గురించి ఇప్పుడు ఎందుకు?’.. ఈ తరహా ధోరణి ఆర్థిక విజయాలకు పెద్ద అడ్డంకి. ఆర్థిక స్వేచ్ఛ కోరుకునే ప్రతి ఒక్కరూ రేపటి రోజు కోసం కచ్చితమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఎందుకంటే పిల్లల విద్య, వివాహాలు, రిటైర్మెంట్, సొంతిల్లు లక్ష్యాలు ఒక నెల సంపాదనతో సాధించేవి కావు. వీటి కోసం దీర్ఘకాలం పాటు పొదుపు, మదుపు చేయాల్సిందే. ఎంత సంపాదించామన్నది కాకుండా, ఎంత పొదుపు చేశామన్నది కీలకం. పొదుపును మెరుగైన సాధనంలో పెట్టుబడిగా మార్చి, క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లిన వారే ఆకాంక్షలను నెరవేర్చుకోగలరు. వివిధ సాధనాల మధ్య చక్కని పెట్టుబడుల కేటాయింపులతో ముందుకు వెళ్లడం ద్వారా జీవిత లక్ష్యాలను త్వరగా సాకారం చేసుకోవచ్చు. ఈ ఏడాది పెట్టుబడుల కోసం ఏ సాధనాలను ఎంపిక చేసుకోవచ్చు? వాటి పనితీరు ఎలా ఉంటుందన్న దానిపై నిపుణుల సూచనలను ఓ సారి పరిశీలిద్దాం. రూ.5 వేలతో కోటి.. గతంతో పోల్చితే నేడు ఆదాయ స్థాయిల్లో ఎంతో మార్పు వచ్చింది. నెలకు రూ.5 వేలు పొదుపు చేయడం చాలా మందికి సాధ్యమే. రూ.5 వేలను ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా 15 శాతం రాబడులను ఇచ్చే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో 25 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పుడు రూ.1,64,20,369 సమకూరుతుంది. ఇందులో పెట్టుబడి రూ.15 లక్షలే. మిగిలిన రూ.కోటిన్నర కాంపౌండింగ్ మాయతో సమకూరిన సంపద. ఒకవేళ రాబడి ఇంకాస్త అధికంగా ఏటా 18 శాతం వచ్చిందని అనుకుంటే సమకూరే సంపద రూ.2.91 కోట్లు. అందుకే ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఖర్చులు ఎదురైనా పెట్టుబడిని విస్మరించకూడదు. అలాగే, మొత్తం పెట్టుబడిని ఈక్విటీల్లో పెట్టేయకూడదు. వివిధ సాధనాల మధ్య పెట్టుబడిని వైవిధ్యం చేసుకోవడం ద్వారా రిస్‌్కను అధిగమించొచ్చు. పెట్టుబడిని కాపాడుకోవచ్చు. రాబడులను పెంచుకోవచ్చు. ఈక్విటీలతోపాటు డెట్ సెక్యూరిటీలు, బంగారం, రియల్ ఎస్టేట్ సాధనాలను పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవాలి. ఈక్విటీలు అధిక రాబడులను ఇస్తాయి. కానీ అస్థిరతలు ఎక్కువ. డెట్‌లో అస్థిరతలు తక్కువ, రాబడులూ తక్కువే. బంగారం, రియల్ ఎస్టేట్‌లో అస్థిరతలు తక్కువగా, రాబడులు మోస్తరుగా ఉంటాయి. ఈక్విటీలు..ఈక్విటీల విలువలు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. ముఖ్యంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగంలో, ఇటీవలి దిద్దుబాటు తర్వాత కూడా షేర్ల ధరలు కొంత అధికంగా ఉన్నాయి. కనుక ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి అనుసరించాలని, రాబడుల అంచనాలు తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది లార్జ్‌క్యాప్ స్టాక్స్ మెరుగైన పనితీరు చూపిస్తాయన్నది విశ్లేషకుల అంచనా. నాణ్యమైన, పటిష్ట వృద్ధి అవకాశాలతో, సహేతుక విలువల వద్దనున్న స్టాక్స్‌ను పరిశీలించొచ్చు. టాప్–50 కంపెనీల విలువ మొత్తం మార్కెట్ విలువలో ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిల వద్ద ఉండడాన్ని గమనించొచ్చు. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ ఐదేళ్ల కాలానికి మెరుగైన రాబడులను ఇస్తాయని, వీటి నుంచి ఏటా సగటున 20 శాతం రాబడిని ఆశించొచ్చని అవెండస్ వెల్త్ మేనేజ్మెంట్ ఎండీ, సీఐవో సౌరభ్ రుంగ్తా సూచించారు. ‘‘2025 లార్జ్‌క్యాప్ స్టాక్స్ వంతు. ప్రైవేటు బ్యాంక్‌లు, టెలికం, ఎఫ్ఎంసీజీ మెరుగైన పనితీరు చూపించొచ్చు. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ కూడా రాబడులను ఇస్తాయి. కానీ అంచనాలు తగ్గించుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారు ఫ్లెక్సీక్యాప్ వైపు చూడొచ్చు’’ అని నువమా వెల్త్ ప్రెసిడెంట్ రాహుల్‌జైన్ వివరించారు. ‘‘పెట్టుబడులను వివిధ అసెట్ క్లాస్‌ల మధ్య విస్తరించుకోవడం చక్కని అవకాశాలను సొంతం చేసుకోవడానికి ఉన్న మెరుగైన మార్గం’’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఐవో శంకరన్ నరేన్ సూచించారు. హైబ్రిడ్ ఫండ్స్, మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ఇటీవలి మార్కెట్ కరెక్షన్తో లార్జ్‌క్యాప్‌లో విలువలు దిగొచ్చాయి. కానీ, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విలువలు చారిత్రక సగటు కంటే ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. కనుక సమీప కాలానికి లార్జ్‌క్యాప్ స్టాక్స్‌పై అధిక వేయిటేజీ ఇవ్వొచ్చు. మిడ్, స్మాల్‌క్యాప్‌లో ఎంపిక ఆచితూచి ఉండాలి’’ అని మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ సూచించింది. నేరుగా స్టాక్స్ కంటే నిపుణుల ఆధ్వర్యంలో నడిచే మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. నిఫ్టీ 2024లో 9 శాతం లాభాలతో ముగిసింది. 2025లో 28,800 వరకు ర్యాలీ చేయొచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా వేస్తోంది. రియల్టీ / ఏఐఎఫ్లుపట్టణీకరణ విస్తరిస్తూ ఉంది. మెరుగైన ఉపాధి కల్పనతో ఆదాయ స్థాయిల్లో మార్పు వస్తోంది. ఆఫీస్ స్పేస్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. కనుక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్చేసుకోవాలని నిపుణుల సూచన. కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయిస్తోంది. వికసిత్ భారత్ లక్ష్యానికి మౌలిక వసతులు కీలకం. కనుక ఇన్వెస్టర్లు రీట్లతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)ల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చని ఐసీఐసీఐ ఏఎంసీ సూచిస్తోంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేసే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఆర్ఈ ఏఐఎఫ్‌లు) కూడా ఉన్నాయి. ‘‘ప్రత్యేకమైన ఆర్ఈ ఏఐఎఫ్‌లు అత్యున్నత గ్రేడ్ కమర్షియల్ ఆఫీస్, లగ్జరీ నివాస గృహాల పోర్ట్‌ఫోలియోల్లో పెట్టుబడుల అవకాశాలను కలి్పస్తాయి. వీటిపై అధిక రాబడులకుతోడు, మెచ్యూరిటీ సమయంలో మూలధన లాభాలను సైతం పొందొచ్చు’’అని అవెండస్ వెల్త్ మేనేజ్మెంట్ ఎండీ, సీఐవో సౌరభ్ రుంగ్తా సూచించారు. రియల్ ఎస్టేట్‌లో ఒకరు విడిగా ఇన్వెస్ట్ చేయాలంటే పెద్ద మొత్తం అవసరం పడుతుంది. రీట్లు, ఏఐఎఫ్‌ల ద్వారా అయితే రూ.100–500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. భౌతిక ప్రాపరీ్టకి బదులు వీటిల్లో పెట్టుబడులు కలిగి ఉంటే, అవసరం వచ్చినప్పుడు వేగంగా వెనక్కి తీసుకోవచ్చు. వీటిల్లో అస్థిరతలు తక్కువ.ఎఫ్‌అండ్‌వో/ క్రిప్టోలుఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో), క్రిప్టో ట్రేడింగ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎఫ్‌అండ్‌వోలో ట్రేడ్ చేసే 1.13 కోట్ల మందిలో 92.8 శాతం మంది 2021–22 నుంచి 2023–24 మధ్య ఒక్కొక్కరు సగటున రూ.2 లక్షలు నష్టపోయినట్టు సెబీ డేటా తెలియజేస్తోంది. అంతా కలిపి పోగొట్టుకున్న మొత్తం ఈ కాలంలో రూ.1.81 లక్షల కోట్లు. టాప్ 3.5 శాతం ట్రేడర్లు అయితే విడిగా ఒక్కొక్కరు రూ.28 లక్షల చొప్పున నష్టపోయారు. ‘‘ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ మీ లాభాలను రెట్టింపు చేయడమే కాదు, నష్టాలను రెట్టింపు చేస్తుంది. దాంతో ఏళ్లపాటు చేసిన పొదుపు అంతా తుడిచిపెట్టుకుపోతుంది’’ అని ఈక్విరస్ వెల్త్ ఎండీ, సీఈవో అభిజిత్ భవే హెచ్చరించారు. క్రిప్టో అసెట్స్ కూడా ఒకరి నియంత్రణలో నడిచేవి కావు. ఫండమెంటల్స్‌తో సంబంధం లేకుండా.. డిమాండ్–సరఫరా, స్పెక్యులేషన్ ఆధారంగా వీటి విలువలు భారీ అస్థిరతలకు లోనవుతుంటాయి. దీంతో వీటిల్లో పెట్టుబడికి రక్షణ తక్కువ. కనుక రిస్క్ తీసుకునే వారు క్రిప్టోల కంటే పటిష్టమైన నియంత్రణల మధ్య నడిచే స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. భారీ లాభాల కంటే పెట్టుబడిని కాపాడుకోవడం ముఖ్యమని 5నాన్స్ ఫౌండర్ దినేష్ రోహిరా సూచించారుబంగారమాయే..అనిశి్చత పరిస్థితుల్లో, ఈక్విటీ తదితర సాధనాల్లో ప్రతికూలతలు నెలకొన్నప్పుడు పోర్ట్‌ఫోలియోకి బంగారం కొంత స్థిరత్వాన్ని తెస్తుంది. బంగారం 2024లో 24–26 శాతం మేర రాబడులు కురిపించింది. సామాన్యుడి నుంచి సెంట్రల్ బ్యాంకుల వరకు అందరికీ బంగారం ఆకర్షణీయంగా మారిపోయింది. పసిడికి డిమాండ్ ఈ ఏడాది కూడా కొనసాగొచ్చన్నది అంచనా. డాలర్‌కు బదులు సెంట్రల్ బ్యాంక్‌లు బంగారం రూపంలో నిల్వలకు ప్రాధాన్యం ఇవ్వడం డిమాండ్‌కు ప్రేరణనిస్తోంది. రూపాయి విలువ క్షీణత రూపంలోనూ బంగారం పెట్టుబడులపై అదనపు ప్రయోజనం లభిస్తుంది. కనీసం 18–24 నెలల కాలానికి బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన. ఒకరు తమ మొత్తం పెట్టుబడుల్లో 5–10 శాతం బంగారానికి కేటాయించుకోవచ్చు. ‘‘2025లో ఈక్విటీలు తదితర రిస్కీ అసెట్స్‌లో అస్థిరతలు కొనసాగితే, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఉంటే, సురక్షిత సాధనమైన బంగారంలో పనితీరు ఇతర సాధనాలతో పోల్చితే స్థిరంగా ఉండొచ్చు’’అని నిప్పన్ ఇండియా ఏఎంసీ కమోడిటీస్ హెడ్ విక్రమ్ ధావన్ అభిప్రాయపడ్డారు. బంగారంలో రాబడులు ఈ ఏడాది మోస్తరుగా ఉండొచ్చని ఆనంద్‌రాఠి కమోడిటీస్, కరెన్సీస్ డైరెక్టర్ నవీన్ మాధుర్ తెలిపారు. పన్ను ప్రయోజనాల దృష్ట్యా గోల్డ్ ఈటీఎఫ్‌లు మెరుగైన ఎంపికగా పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో తులం బంగారం ధర రూ.86,000కు చేరుకోవచ్చని, తగ్గినప్పుడు కొనుగోలు చేయడమనే విధానాన్ని అనుసరించొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ అనలిస్టులు సూచిస్తున్నారు. బంగారం ఈ ఏడాది రూ.82,000–85,000 శ్రేణిలో ట్రేడ్ కావొచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది అంచనా. వెండి సైతం రూ.1.1 లక్షల నుంచి రూ.1.25 లక్షల వరకు ర్యాలీ చేయొచ్చని అంచనా వ్యక్తీకరించారు. మిరే అసెట్ షేర్‌ఖాన్‌కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ సింగ్ మాత్రం ఈ ఏడాది చివరికి బంగారం 10 గ్రాములు రూ.90,000–93,000కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. డెట్‌లో అవకాశాలు..స్థిరాదాయ (డెట్) సాధనాల్లో రాబడులు వడ్డీ రేట్ల గమనంపై ఆధారపడి ఉంటాయి. ఈక్విటీ పెట్టుబడులకు స్టాక్స్ విలువలను ఎలా అయితే పరిశీలిస్తామో.. డెట్‌లో పెట్టుబడులకు సమీప కాలంలో వడ్డీ రేట్ల తీరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. యూఎస్ ఫెడ్ ఇప్పటికే రెండు విడతలుగా వడ్డీ రేట్ల కోత నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఏడాదికి రెండు కోతలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఆర్బీఐ వేచి చూసే ధోరణితో ఉంది. వచ్చే ఫిబ్రవరి, ఏప్రిల్‌లో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపును చేపట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిల్లోనే ఉన్నందున ఈ దశలో లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయన్నది నిపుణుల సూచన. ‘‘రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రిత బ్యాండ్‌లోనే ఉంది. వృద్ధి నిదానించింది. వడ్డీ రేట్లు గరిష్టాలకు చేరాయని మేము భావిస్తున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు), ఎన్సీడీలు, బాండ్లలో ఇన్వెస్ట్ చేసే వారు తమ పెట్టుబడులను అధిక రాబడుల (రేట్లు) వద్ద లాకిన్ చేసుకోవాలి. సంప్రదాయ సాధనాలకు వెలుపల క్రెడిట్ ఫండ్స్, వెంచర్ డెట్ ఫండ్స్, స్పెషల్ సిచ్యుయేషన్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ ఫండ్స్ రిస్క్‌ను మించి రాబడులను ఇస్తాయి. దీంతో మొత్తం మీద డెట్ పోర్ట్‌ఫోలియో రాబడులను పెంచుకోవచ్చు’’అని నువమా వెల్త్ ఎండీ రాహుల్‌జైన్ సూచించారు. సైబర్ రక్షణ2023–24లో సైబర్ మోసాలు 300 శాతం (2,92,800 ఘటనలు) పెరిగాయి. 2024లో మొదటి తొమ్మిది నెలల్లోనే 11,333 కోట్ల నష్టం వాటిల్లింది. ‘‘మన దేశ వాసులు ఒక్కొక్కరు సగటున ఒక రోజులో 194 నిమిషాలు సోషల్ మీడియాపై గడుపుతున్నారు. టీనేజర్లు సైతం 3–6 గంటలు వెచ్చిస్తున్నారు. ఫిషింగ్, గుర్తింపు చోరీతోపాటు సైబర్ దాడులు పెరిగాయి’’అని టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నజీమ్ బిల్గ్రామి తెలిపారు. నేడు చాలా మంది స్మార్ట్ ఫోన్ నుంచే స్టాక్స్, ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. చెల్లింపులు, నగదు బదిలీ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అదే స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా బ్రౌజింగ్ చేస్తున్నారు. ఇలాంటి వారు సైబర్ దాడుల రూపంలో పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. కనుక సైబర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ‘‘సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ అన్నది ఆన్లైన్ మోసాలు, అనధికారిక లావాదేవీలు, డేటా లీకేజీ రూపంలో వ్యక్తులకు కలిగే ఆర్థిక నష్టం, చట్టబద్ధమైన బాధ్యతల నుంచి రక్షణనిస్తుంది’’ అని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఎస్.బ్రహ్మజోస్యుల వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ రూ.10,000 నుంచి రూ.కోటి వరకు తీసుకోవచ్చు. వ్యక్తులు, కుటుంబ సభ్యులకూ కలిపి తీసుకునే వెసులుబాటు ఉంది. సైబర్ ఇన్సూరెన్స్‌తోపాటు, ఎవరూ ఊహించని విధంగా పాస్వర్డ్లు, మొబైల్లో సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఉండేలా చూసుకోవాలి. ఓటీపీ, వ్యక్తిగత బ్యాంక్ ఖాతా, ఆధార్, చిరునామా వివరాలను ఎవరితోనూ పంచుకోరాదు.ఏవి.. ఎందుకు..? ఈక్విటీ ఫండ్స్: అధిక వృద్ధి అవకాశాలతో దీర్ఘకాల లక్ష్యాలకు అనుకూలం. డెట్ ఫండ్స్: స్థిరమైన, ఊహించదగిన రాబడులు ఇచ్చేవి.హైబ్రిడ్ ఫండ్స్: ఈక్విటీ, డెట్ కలసినవి. పెట్టుబడుల వృద్ధి, రిస్‌్కను సమతుల్యం చేసేవి. ఈఎల్ఎస్ఎస్: ఈక్విటీ పెట్టుబడికి అదనంగా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు ఆఫర్ చేసేవి. ఎన్పీఎస్: చాలా చౌక చార్జీలకే ఈక్విటీ, డెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతూ, రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకునేందుకు ఉద్దేశించిన మెరుగైన సాధనం. పన్ను ప్రయోజనాలతో కూడినది.రీట్లు/ఇన్విట్లు: కార్యకలాపాలు నిర్వహించే ఆఫీస్, రిటైల్ ప్రాపర్టీలు.. ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో యూనిట్ల రూపంలో పెట్టుబడికి వీలు కలి్పంచేవి.గోల్డ్ ఈటీఎఫ్: స్టాక్ ఎక్సే్ఛంజ్ ద్వారా బంగారంలో పెట్టుబడులకు వీలు కల్పించే ఎలక్ట్రానిక్ సాధనం. -
వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్‌లో 4000 ఉద్యోగాలు..
న్యూఢిల్లీ: అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ సపోర్ట్, సర్వీసుల సంస్థ వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ (Vertex Global Services) తాజాగా భారత్‌లో గణనీయంగా నియామకాలు (Jobs) చేపట్టనుంది. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వచ్చే 3–5 ఏళ్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 4,000 మంది పైగా లాంగ్వేజ్ నిపుణులను నియమించుకోనున్నట్లు (recruit) సంస్థ వెల్లడించింది.చిన్న నగరాల్లో ఉద్యోగాల లభ్యతకు సంబంధించిన సవాళ్లను యువత అధిగమించడంలో తోడ్పాటు అందించే దిశగా రిక్రూట్మెంట్ తలపెట్టినట్లుగా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో గగన్ ఆరోరా తెలిపారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, కొరియన్ తదితర అంతర్జాతీయ భాషలతో పాటు కన్నడ, బెంగాలీ, గుజరాతీ తదితర ప్రాంతీయ భాషల్లోనూ సర్వీసులను అందిస్తున్నట్లు వివరించారు.వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ భారత్‌తో పాటు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, నైజీరియా, నేపాల్, ఫిలిప్పీన్స్, యూఏఈలలో కార్యకలాపాలను కలిగి ఉంది. బిజినెస్ వర్టికల్స్‌లో వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్, వెర్టెక్స్ నెక్స్ట్, ఐఎల్సీ సొల్యూషన్స్, వెర్టెక్స్ లెర్నింగ్, వెర్టెక్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. -
గట్ హెల్త్‌పై దృష్టి పెడదాం..ఆరోగ్యంగా ఉందాం..!
ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ మహిళల గట్ హెల్త్ కోసం పిలుపునిచ్చింది. అందుకోసం సెలియక్ సొసైటీ ఆఫ్ ఇండియా హాబిటాట్ సెంటర్లోని అపోలో హాస్పిటల్స్ సహకారంతో వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ నిపుణులతో ఇల్నెస్ టు వెల్నెస్ అనే ప్రోగ్రామ్ నిర్వహిచింది. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులచే గట్ హెల్త్‌పై అవగాహన కల్పించేలా 'గట్ మ్యాటర్స్- ఉమెన్స్ హెల్త్ అండ్ గట్ మైక్రోబయోమ్' అంశంపై సెమినార్ని నిర్వహించింది. ఆరోగ్య సమస్యలకు మూలం..ఆ సమావేశంలో హర్మోన్ల అసమతుల్యత, సంతానోత్పత్తి, పీసీఓఎస్ వంటి దీర్ఘకాలిక పరిస్థితులుపై గట్ మైక్రోబయోమ్ ప్రభావం గురించి చర్చించారు. అలాగే మహిళ తరుచుగా ఎదుర్కొన్నే ఆరోగ్య సమస్యలపై కూడా దృష్టిసారించారు. ఈ సెమినార్లో పాల్గొన్న క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఇషి ఖోస్లా, డాక్టర్ అర్జున్ డాంగ్, డాక్టర్ డాంగ్స్, డాక్టర్ హర్ష్ మహాజన్, ఇండియన్ కోయలిషన్ ఫర్ కంట్రోల్ ఆఫ్ అయోడిన్ డెఫిషియెన్సీ డిజార్డర్ (ICCIDD) అధ్యక్షుడు, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ చంద్రకాంత్ పాండవ తదితరాలు మహిళల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే గట్ హెల్త్ సంరక్షణ గురించి నొక్కి చెప్పారు. అంతేగాదు సమాజంలో ముఖ్యపాత్ర పోషించే మహిళల ఆరోగ్యంపై దృష్టిసారించాల్సిన ప్రాముఖ్యతను గురించి కూడా హైలెట్ చేశారు. అలాగే మహిళల ఆరోగ్యంలో గట్ హెల్త్ అత్యంత కీలకమైనదని అన్నారురు. ఇది హర్మోన్లు, సంతానోత్పత్తి, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు. మహిళలకు సంబంధించిన ప్రశూతి ఆస్పత్రులు లేదా ఆరోగ్య క్లినిక్స్‌లో దీనిపై అవగాహన కల్పించాలన్నారు. ఈ గట్ ఆరోగ్యం అనేది వైద్యపరమైన సమస్య కాదని మొత్తం కుటుంబాన్నే ప్రభావితం చేసే సమస్యగా పేర్కొన్నారు. సెలియక్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఇల్నెస్ టు వెల్నెస్ ప్రోగ్రామ్‌లో తాను పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు ఆస్కామ్ నేషనల్ సీఎస్ఆర్ ఛైర్పర్సన్అనిల్ రాజ్‌పుత్. ఆరోగ్యకరమైన సమాజాన్నినిర్మించేందుకు ఇలాంటి ఆరోగ్య పరిజ్ఞానానికి సంబందించిన సెమినార్లు అవసరమన్నారు. ఇక ఆ సెమినార్లో డాక్టర్ అర్జున్ డాంగ్ మహిళల్లో పేగు ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేసే అలర్జీలు, సరిపడని ఆహారాలు గురించి కూడా చర్చించారు. అలాగే అభివృద్ధి చెందుతునన్న రోగ నిర్థారణ సాధానాల ప్రాముఖ్యత తోపాటు అందుబాటులో ఉన్న సమర్థవంతమైన చికిత్సపై రోగులకు సమగ్రమైన అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గురించి నొక్కిచెప్పారు. మిల్లెట్ల పాత్ర..పోషకాహారం తీసుకునేలా మిల్లెట్లను మహిళల డైట్లో భాగమయ్యేలా చూడాలని వాదించారు. దీనివల్ల మొటిమలు, నెలసరి సమస్యలు, అధిక బరవు తదితర సమస్యలు అదుపులో ఉంటాయని ఉదహరించి మరి చెప్పారు. అంతేగాదు సెమినార్‌లోని నిపుణులు 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన భారతదేశ మిషన్ మిల్లెట్స్ గురించి లేవనెత్తడమే గాక దానిపై మళ్లీ ఫోకస్ పెట్టాలన్నారు. గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మిల్లెట్ ఆధారిత ఆహారాలను ప్రోత్సహించాలన్నారు.అంతేగాదు పెరుగుతున్న ఆటిజం కేసులు, తల్లిబిడ్డల ఆరోగ్యంతో సహా మహిళల ప్రేగు ఆరోగ్యం ఎలా ప్రభావితం చేస్తుందన్నది సెమినార్లో నొక్కి చెప్పారు. వీటన్నింటిని నిర్వహించడంలో ఆహారం, మైక్రోబయోమ్ బ్యాలెన్స్‌ల పాత్రపై మరింతగా పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు కూడా వెల్లడించారు. చివరగా ఈ సెమినార్లో ప్రజారోగ్య విధానాల్లో గట్ హెల్త్ ప్రాముఖ్యత, మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా బడ్జెట్ కేటాయింపుల చర్చలతో ముగిసింది. కాగా, సెలియక్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రజారోగ్య కార్యక్రమాలలో గట్ హెల్త్ పై అవగాహన పెంచడమే గాక ఇలాంటి సెమినార్లో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేలా ప్రోత్సహిస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది.(చదవండి: ఇండియా నన్ను స్వీకరిస్తే చాలు..!: జాక్వెలిన్ ఫెర్నాండేజ్) -
పురాతన నిధిలో గ్రహాంతర పదార్థాలు..!
గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా, లేరా? అనేది నేటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే, వారి ఉనికికి ఊతమిచ్చేలా మరో అంశం తెరపైకి వచ్చింది. కాంస్యయుగం నాటి పురాతన నిధిలో గ్రహాంతర పదార్థాలు ఉన్నాయని పరిశోధకుల పరీక్షల్లో తేలింది. 1963లో ఐబీరియన్ ద్వీపకల్పంలో కాంస్యయుగం నాటి నిధి బయటపడింది. దీనిని ‘ట్రెజర్ ఆఫ్ విల్లెనా’ అని పిలిచేవారు. ఇందులో ఎంతో విలువైన రాతి యుగం నాటి కంకణాలు, గిన్నెలు, సీసాలు, వివిధ ఆభరణాలు వంటి 66 వస్తువులు ఉన్నాయి. ఇటీవల ఒక కొత్త పరిశోధన బృందం ఈ వస్తువులపై పరీక్షలు జరిపింది. ఈ పురాతన నిధిలోని ఒక కళాఖండం అంతరిక్ష పదార్థాలతో తయారు చేసినట్లు ఈ బృందంలోని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మిగిలిన వస్తువులు చాలా వరకు బంగారం, వెండితో తయారు చేశారని, వీటిలోని కేవలం ఓ కళాఖండంలోని పదార్థం మాత్రం భూమ్మీద ఎక్కడా లభించదని, ఇది ఇతర గ్రహాల్లో లభించే అవకాశం ఉందని తెలిపారు. కొంతమంది పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ నిధి కాంస్యయుగం తర్వాతి కాలానికి చెందినదని చెబుతున్నారు. మరికొందరు నిపుణులు ఈ వస్తువులలోని ఇనుము ఉల్కల నుంచి వచ్చినదని చెబుతున్నారు. ఈ లోహానికి గ్రహాంతర మూలాలను నిగ్గుతేల్చడానికి మరిన్ని పరీక్షలు అవసరమని అంటున్నారు. (చదవండి: సీట్బెల్ట్తో కిడ్నీలకూ రక్షణ!) -
12th ఫెయిల్ హీరో షాకింగ్ నిర్ణయం.. సరైనదే అంటున్న నిపుణులు!
స్టార్డమ్ కోసం నటులు పడే కష్టం అంతా.. ఇంతా కాదు. అయితే బుల్లి తెర నుంచి బాలీవుడ్ వెండితెరపైకి చేరి కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నాడు విక్రాంత్ మాస్సే. పైగా ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన అతని ప్రయాణం స్ఫూర్తిదాకయం కూడా.. అలాంటి వ్యక్తి కెరీర్ మంచి పీక్‌లో ఉండగా.. ఊహకందని నిర్ణయంతో అందర్నీ విస్తుపోయేలా చేశాడు. ఏంటిది అర్థాంతరంగా కెరీర్‌కి బ్రేక్ చెప్పడమనేది సరైనదా..! అనే కదా డౌటు. ఆ నిర్ణయం లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే..నచ్చినట్లుగా బతకడం అంటే ఇదే అంటూ విక్రాంత్ అనూహ్య నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు మానసిక నిపుణులు. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో హీరోగా ఉండే యత్నం చేశాడని అంటున్నారు. అది ఎందుకనో తెలుసుకుందాం.. 👉ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తన చుట్టూ ఉన్న వాళ్లతో ప్రభావితమవ్వుతూనే నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతలా నా లైఫ్ నాది అన్నట్లుగా ఉంటున్నట్లు నటించినా..చాలావరకు తన వాళ్లు, బంధువులు ఏమనుకుంటారో అనే భయంతోనే ఇష్టంలేని నిర్ణయాలను తీసుకునే యత్నం చేస్తారు. అలానే జీవిస్తారు కూడా. కొద్ది మందే వ్యక్తిగతానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. వాళ్ల నిర్ణయాలు ఇలా ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. 👉కెరీర్ ఎంతో ముఖ్యమో.. జీవితం అంతే ముఖ్యం. కొన్ని కెరీర్లు వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయేలా చేస్తాయి. దానికున్న ప్రాముఖ్యత అలాంటిది. దీని కారణంగా మన స్నేహితులు, మనపై ఆధారపడినవాళ్లు చెప్పుకోలేని బాధకు, అభద్రతాభావానికి గురవ్వుతారు. 👉చాలామంది ఇటు కెరీర్‌ని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేక ఒక విధమైన ఒత్తిడికి గురవ్వుతుంటారు కూడా. అలాంటప్పుడూ వాళ్లు తీసుకునే సరైన నిర్ణయాలే వారి జీవితాన్ని ఆనందమయంగా చేస్తాయి. 👉ఇక్కడొక వ్యక్తి ఎదుటి వారి ప్రమేయానికి లోను కాకుండా తనకు నచ్చినట్లుగా ఉండాలనుకున్నప్పుడే..ఇలా అద్భుతంగా ఆలోచించడం సాధ్యమవుతుంది. ఇక్కడ విక్రాంత్ కూడా అదే పనిచేశారు. 👉చెప్పాలంటే విక్రాంత్‌గా హీరో మంచిగా నిలదొక్కుకోవాల్సిన కీలక టైం. అలాగే ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఓ భర్తగా, తండ్రిగా సరికొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన కీలకమైన సమయం. కుటుంబానికి తన అవసరం ఎంతో ఉంది. 👉కానీ ఇక్కడ విక్రాంత్ తన వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యత ఇస్తూ కెరీర్‌కు స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించి అందర్నీ విస్తుపోయేలా చేశాడు. అందరూ ఇది కరెక్ట్ కాదని వ్యతిరేకించినా..తనకు నచ్చిన విధంగా అన్ని రకాలుగా తన లైఫ్‌ని ఫుల్‌ఫిల్ చేసి హాయిగా ఉండాలనుకున్నాడు. అందుకే ఇలాంటి షాకింగ్‌కి గురిచేసే డేరింగ్ నిర్ణయాన్నితీసుకున్నాడు. 👉ఇది చాలా పెద్ద త్యాగంగా అభివర్ణిస్తారు గానీ, ఇది అలాంటిది కాదు తన బాధ్యతలకు, కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యతే అలాంటి నిర్ణయానికి దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. 👉ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకోవడానికి, నచ్చినట్లుగా లైఫ్‌ని లీడ్ చేయడానికి ఎంతో గట్స్ ఉండాలి. అలాంటి వాళ్లే అసలైన హీరోలుగా అందరి మనసులలోనూ నిలిచిపోతారని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తన వ్యక్తిగత జీవితం కోసం లేదా సరికొత్తగా కెరీర్లో దూసుకుపోవడానికి అప్పడప్పుడూ ఇలాంటి బ్రేక్ కూడా అవసరమేనని అంటున్నారు నిపుణులు. 👉కొందరికీ వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేయగలిగే సామర్థ్యం ఉండొచ్చు. అలా అందరికీ సాధ్యం కాదనేది గమనించదగ్గ విషయం. అయితే హీరో విక్రాంత్ త్వరలో తన నిర్ణయం వెనక్కు తీసుకుని మళ్లీ కెరీర్లో దూసుకుపోయే అవకాశం ఉందనేది అంతరంగీక వర్గాల సమాచారం. (చదవండి: జుట్టుకి గుడ్లు, పెరుగు అప్లై చేయడం మంచిదేనా..?) -
ఔరా! అంజీరా! ఇది మాంసాహారమా?
సాధారణంగా ఎవరైనా పండ్లను చూపించి.. ‘ఇవి శాకాహారమా? మాంసాహారమా?’ అని అడిగితే చిత్రంగా అనిపిస్తుంది. ‘ఏమిటా పిచ్చి ప్రశ్న.. పండ్లలో ఎక్కడైనా మాంసం ఉంటుందా?’ అంటూ కోపం తన్నుకొస్తుంది. అయితే చాలామంది ‘అంజీరా పండ్లు శాకాహారమా? మాంసాహారమా?’ అనే ప్రశ్నే వేస్తున్నారు. ఎందుకంటే ‘పండులందు అంజీరా పండు వేరయా’ అంటున్నారు నిపుణులు. సైంటిఫిక్ రీజన్స్ చూపిస్తూ ‘ఈ పండు ముమ్మాటికీ మాంసాహారమే!’ అని తేల్చేస్తున్నారు.అసలెందుకు అంజీరాను మాంసాహారం అంటున్నారంటే.. ఆ పండులో జరిగే పరాగ సంపర్క క్రియనే దానికి ప్రధాన కారణమని వివరిస్తున్నారు. పరాగ సంపర్కం కోసం కందిరీగలు.. అంజీర్ పండ్లను ఆశ్రయిస్తుంటాయి. ఆ పండ్ల సూక్ష్మ రంధ్రాల్లోనికి వెళ్లిన కందిరీగలు పరాగ సంపర్కం చేస్తాయి, అనంతరం బయటకి రాలేక కొన్ని అందులోనే చనిపోతాయి. దాంతో వాటి అవశేషాలు అంజీర్ పండులోనే విలీనమవుతాయి. అందువల్ల అది పరోక్షంగా మాంసాహారమవుతుంది కాబట్టి అంజీర్ పండ్లు మాంసాహారమే నంటున్నారు నిపుణులు. (శీతాకాలంలో కీళ్ల నొప్పులు : నువ్వులను ఇలా తింటే..!)అలాగని శాకాహారులు అంజీరాని తినడం మానేస్తే చాలా నష్టపోతారు. ఎందుకంటే అంజీరాతో ఎన్నో ఆరోగ్య ఫలితాలు అందుతాయి. వీటిలో విటమిన్లు, ఐరన్, ఫైబర్, ప్రొటీన్లు ఇలా అన్నీ పుష్కలంగా లభిస్తాయి. రోజూ తింటే శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. వీటిని రాత్రిపూట నీళ్లలో నానబెట్టుకుని, ఉదయం నిద్ర లేచిన వెంటనే తింటే చాలా మంచిది. మలబద్ధకం, మూలశంక వంటి సమస్యలను ఈ పండ్లు నయం చేస్తాయి. చెడు కొవ్వును వేగంగా కరిగిస్తాయి. బరువు, హైబీపీ, షుగర్ వంటి సమస్యలను అదుపులోకి తెస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు, నెలసరి సమస్యలున్నవారు, కిడ్నీ సమస్యలున్నవారు వీటిని తింటే మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యానిచ్చే ఈ పండును శాకాహారులూ నిరభ్యంతరంగా తినచ్చు. (కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి!) -
హైదరాబాద్‌లో ఇండియన్ వెయిన్ కాంగ్రెస్
సాక్షి,హైదరాబాద్ : మన దేశంలో దాదాపు 25 శాతం మంది ప్రజలు వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారని, వీళ్లలో చాలామందికి శస్త్రచికిత్సలు అవసరం లేకుండానే నయం చేయొచ్చని జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులు తెలిపారు. ప్రస్తుతం అనేక అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని అందిపుచ్చుకుని దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా అద్భుతమైన చికిత్సలు చేయొచ్చని వివరించారు. నగరంలోని అవిస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల డిస్ట్రిక్ట్ 150 కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ స్థాయిలో ఇండియన్ వెయిన్ కాంగ్రెస్ 2024ను శుక్రవారం నిర్వహించారు. దీనికి అవిస్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు, ప్రముఖ వాస్క్యులర్ ఇంటర్వెన్షనల్ నిపుణుడు డాక్టర్ రాజా వి. కొప్పాల నేతృత్వం వహించారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 100 మంది వరకు వైద్య నిపుణులు దీనికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. బ్రెజిల్ నుంచి కొందరు నిపుణులు ఆన్లైన్లో హాజరై తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్నారు.ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ సమస్యను శస్త్రచికిత్సలు అవసరం లేకుండా లేజర్ల ద్వారా, ఇతర మార్గాల్లో నయం చేయడం ఎలాగన్న అంశంపై ఇందులో విస్తృతంగా చర్చించారు. అవిస్ ఆస్పత్రిలో గత ఎనిమిదేళ్లుగా ఇప్పటికి దాదాపు 40 వేల మందికి పైగా రోగులకు శస్త్రచికిత్స అవసరం లేకుండా నయం చేశామని, ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ రాజా వి. కొప్పాల అన్నారు.అంతర్జాతీయంగా పేరున్న డాక్టర్ రోడ్రిగో గోమ్స్ డీ ఒలీవియెరా, డాక్టర్ రాజేష్ వాసు, డాక్టర్ ఫెర్రనాండో ట్రెస్ సిల్వెరియా లాంటి వాస్క్యులర్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ నిపుణులు ఈ సదస్సుకు హాజరై.. అంతర్జాతీయంగా ఈ రంగంలో వస్తున్న పలు మార్పులు, చికిత్సా విధానాలు, ఎదురవుతున్న సవాళ్ల గురించి చర్చించారు. వీరితో పాటు వాస్క్యులర్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ నిపుణులు కూడా పాల్గొన్నారు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సలు అవసరం లేదని, అయితే కొన్నిసార్లు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు.వెరికోస్ వెయిన్స్ విషయంలో అద్భుతమైన పరిశోధనలు జరుగుతున్నాయని, వాటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా విజ్ఞాన సముపార్జన చేయాలని నిపుణులు సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై డాక్టర్ రాజా వి. కొప్పాల సంతోషం ప్రకటించారు. -
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం వారికే ఎక్కువ..!
ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషులందరిలోనూ వైకల్యాలు తెచ్చిపెట్టడంలో లేదా మరణానికి దారితీసే అంశాల్లో పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) ప్రధానమైంది. అయితే అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ లెక్కల ప్రకారం పురుషులతో పోలిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు మహిళల్లోనే ఎక్కువ. దీనికి గల అనేక కారణాలను నిపుణులు వివరిస్తున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల హార్మోన్లలో మార్పులు రావడం చాలా సాధారణంగా జరుగుతుంటుంది. దీనికి అనేక అంశాలు కారణమవుతుంటాయి. అవి... మహిళల్లో తరచూ హార్మోన్లలో మార్పులు రావడం మామూలే. దీంతోపాటు నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రల వల్ల కూడా వాళ్లలో తరచూ హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి. ఈ హార్మోన్ల మార్పులే పురుషులతో పోలిస్తే మహిళల్లో పక్షవాతం ఎక్కువగా వచ్చేందుకు కారణమవుతుంటాయి. ఇటీవల మానవులందరిలోనూ ఆయుఃప్రమాణాలు బాగా పెరిగాయి. ఇలా చాలాకాలం జీవిçస్తున్న క్రమంలో హైబీపీ, దాంతోపాటు అనేక రకాల గుండె జబ్బుల (ఉదాహరణకు గుండె స్పందనలు దెబ్బతినడం వల్ల వచ్చే గుండెదడ, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే గుండె పైగదుల స్పందనల్లో వేగం పెరగడం వల్ల అక్కడ రక్తం గడ్డకట్టి అవి ప్రధాన ధమనుల ద్వారా మెదడుకు చేరడం) వంటి కారణాలు బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీస్తుంటాయి. గర్భనివారణ మాత్రలు వాడేవాళ్లలో పొగతాగే అలవాటు ఉండటం స్ట్రోక్ ముప్పును మరింత పెంచుతుంది. ఇక మహిళల్లో గర్భధారణ సమయంలో రక్తపోటు బాగా పెరిగి΄ోయే ప్రీ–ఎక్లాంప్సియా అనే కండిషన్ కూడా బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును పెంచుతుంది. పురుషులతో పోలిస్తే పక్షవాతం వచ్చినప్పుడు లేదా రాబోయే ముందు కనిపించే సాధారణ లక్షణాలైన తీవ్రమైన అలసట, అయోమయం, వికారం లేదా వాంతుల వంటి లక్షణాలు మహిళల్లో అంత ప్రస్ఫుటంగా కనిపించవు. దాంతో సమస్యను గుర్తించడం, సమయానికి చికిత్స అందించడం వంటివి ఆలస్యమయ్యేందుకు అవకాశాలెక్కువ. ఇక పక్షవాతంలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలైన... మాటలు ముద్దముద్దగా రావడం, ముఖంలో ఒకవైపు కిందికి జారినట్లుగా అయిపోవడం వంటివి స్త్రీ, పురుషులిద్దరిలోనూ కనిపించినప్పటికీ మహిళలల్లో ఈ లక్షణాలన్నీ తలతిరిగినట్లు ఉండటం, తీవ్రమైన అలసట, ఎక్కిళ్ల వంటి మాటున అంత స్పష్టంగా కనిపించవు. అయితే ఇలా తల తిరిగినట్లుగా ఉండటం, తీవ్రమైన అలసట, నీరసం వంటివి మహిళల్లో అప్పుడప్పుడూ కనిపించేవే కావడంతో ఈ లక్షణాల మాటున పక్షవాతం దాగుండిపోయినట్లుగా అవుతుంది. దాంతో మహిళల్లో చాలాసేపటికి గాని పక్షవాతాన్ని గుర్తించడం సాధ్యపడకపోవడంతో అసలు విషయం బయటపడేసరికి ఆలస్యమయ్యే ప్రమాదం ఎక్కువ.మహిళల చికిత్స విషయంలో మరింత ప్రాధాన్యం అవసరం.. పక్షవాతం (స్ట్రోక్) విషయంలో పురుషులకూ, మహిళలకూ ఇచ్చే చికిత్స అన్నివిధాలా సమానమే. అయితే కోలుకున్న తర్వాత వారి పనులు వారే చేసుకునే విధంగా ఇచ్చే రిహ్యాబిలిటేషన్ ్ర΄ోగ్రామ్ విషయంలో మాత్రం మహిళలపై మరింత శ్రద్ధ చూ΄ాల్సిన అవసరముంటుంది. ఎందుకంటే వారి రీ–హ్యాబ్, వారిలో తరచూ పునరావృతమయ్యే డిప్రెషన్, నైపుణ్యాలు నేర్చుకునే (కాగ్నిటివ్ స్కిల్స్) ప్రక్రియలు ఆలస్యం కావడం, మానసిక ఆరోగ్యం అన్ని విధాలా బాగుపడేలా చేయడం వంటి అంశాలన్నీ... మహిళలకు రీ–హ్యాబ్ సేవలు మరింత ఎక్కువకాలం అవసరమయ్యేలా చేస్తాయంటున్నారు నిపుణులు.నివారణ మార్గాలు అనుసరించండి... హైబీపీని అదుపులో పెట్టుకునేందుకు క్రమం తప్పకుండా మందులు వాడటం, ఆహారంలో కొవ్వులు తక్కువగా తీసుకోవడం, ఒకవేళ రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే వాటిని అదుపు చేసే మందులు వాడటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం తోపాటు సంతాన నిరోధక మాత్రలు వాడే మహిళలు, గర్భధారణ సమయంలో ప్రీ–ఎక్లాంప్సియా వచ్చిన వారు ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యం విషయంలో క్రమం తప్పకుండా డాక్టర్ ఫాలో అప్‌లో ఉండటం, అవసరాన్ని బట్టి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) వంటి చర్యలతో నివారణ మార్గాలు అనుసరిస్తుంటే అది స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందంటున్నారు వైద్య నిపుణులు.(చదవండి: మెల్ల ఉందని తెలుసుకోవడమెలా? ఎలా సరిదిద్దాలి..?) -
అలాంటి పెర్ఫ్యూమ్స్ కొంటున్నారా..?
చవకైన పెర్ఫ్యూమ్స్ / సెంట్స్ వల్ల అలర్జీలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయనీ, వీటివల్ల కొన్ని రకాల అలర్జీలు, కాంటాక్ట్ డర్మటైటిస్, ఎగ్జిమా అనే చర్మ వ్యాధులు, మైగ్రేన్ వంటి తలనొప్పులు పెరుగుతున్నాయని ఇంగ్లాండ్‌లోని క్యాంటర్బరీ కెంట్ ఛాసర్ హాస్పిటల్‌కు చెందిన చర్మవైద్య నిపుణులు డాక్టర్ సుసానా బ్యారన్ హెచ్చరిస్తున్నారు. వాసనల వల్ల అలర్జీలతో పాటు అవి చర్మానికి తగలడం వల్ల కూడా అనేక రకాల చర్మవ్యాధులూ వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. కొంతకాలం కిందట యూరోపియన్ యూనియన్ సైంటిఫిక్ కమిటీ ఒక సర్వే చేసి, తక్షణం అలర్జీకి కారణమయ్యే అలర్జెన్ల జాబితాను రూపొందించే కార్యక్రమానికి పూనుకుంటుంది. ఈ క్రమంలో రకరకాల సబ్బులు, షాంపూలు, సెంట్లు సైతం అలర్జీలకు కారణమవుతున్నట్లు ఆ సర్వేలో తేలింది.చవక రకం సెంట్ల వాసనలతో మైగ్రేన్ వంటి తలనొప్పుల కేసులూ విపరీతంగా పెరుగుతున్నాయంటూ యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ విన్సెంట్ మార్టిన్ అనే న్యూరాలజిస్ట్ సైతం పేర్కొంటున్నారు. వాటితో చాలా అప్రమత్తంగా ఉండాలంటూ డెర్మటాలజిస్టులు, న్యూరాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్స్ జాగ్రత్తలు చెబుతున్నారు. (చదవండి: పాదాల వాపుకి గుండె జబ్బులకు సంబంధం ఏమిటీ..?) -
గుండె జబ్బులు వచ్చేది ఆ బ్లడ్ గ్రూప్ వాళ్లకే..!
రక్తంలో పలు రకాల గ్రూప్‌లు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఇలా మొత్తం ఎనిమిది రకాల బ్లడ్ గ్రూప్‌లు ఉంటాయి. దాన్ని అనుసరించే ఎవరికైన రక్తదానం చేయడం వంటివి చేస్తాం . అయితే బ్లడ్ గ్రూప్‌ని బట్టి వచ్చే అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. మరీ బ్లడ్ గ్రూప్‌ని బట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో సవివరంగా చూద్దామా..!గుండె సమస్యలు వచ్చే ప్రమాదం..ఈ రోజుల్లో చాలా మందికి గుండెజబ్బుల బారినపడుతున్నారు. అయితే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లకి గుండెపోటు వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయట. మిగతా బ్లడ్ గ్రూప్‌లు ఏ, బీ, ఏబీ వాళ్లకి కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువని చెబుతున్నారు నిపుణులు. అయితే ఓ బ్లడ్ గ్రూప్ వాళ్లకి ఎక్కువగా కొలెస్ట్రాల్, కడుపు సంబంధిత సమస్యలు ఉంటాయని తెలిపారు.పెప్టిక్ అల్సర్..ఆప్టికల్చర్ అంటే కడుపులో లేదా పేగు లైనింగ్ దగ్గర వచ్చే చిన్న పుండు. అయితే ఇది ఎక్కువగా ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లకి వస్తుంది.కేన్సర్కేన్సర్ ఎక్కువగా ఏ,బీ, ఏమీ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకి వస్తుంది. ముఖ్యంగా ఫైలోరీ ఇన్ఫెక్షన్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పెద్దపెద్ద కేన్సర్లు, ప్యాంక్రియాటిక్ కేన్సర్లు వచ్చే ప్రమాదం ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి ఎక్కువగా ఉంటుందట.ఒత్తిడిసాధారణంగా సమస్యలు వస్తే ఒత్తిడికి గురవుతారు. సమస్యను బట్టి కొందరు తీవ్రంగా ఒత్తిడికి గురవుతుంటారు. అయితే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురవుతారు.వెయిన్స్ త్రాంబోఎంబోలిజంకొంతమందికి కాళ్ల వేయిన్స్ లో రక్తం గడ్డ కడుతుంది. దీనినే వెయిన్స్ త్రాంబోఎంబోలిజం అంటారు. అయితే ఇది ఎక్కువగా ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకి వస్తుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఊపిరితిత్తులకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మధుమేహ వ్యాధి..ప్రస్తుతం చాలా మందికి మధుమేహం వస్తోంది. అయితే డయాబెటిస్ ఎక్కువగా ఏ, బీ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకి వస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చిన కథనం మాత్రమే. పూర్తి వివరాలను కూలంకషంగా తెలుసుకుని వైద్యలు లేదా వ్యక్తిగత నిపుణుల సలహాల మేరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. (చదవండి: రైతాలో ఉల్లిపాయలు జోడించి తీసుకుంటున్నారా..!) -
రైతాలో ఉల్లిపాయలు జోడించి తీసుకుంటున్నారా..!
బిర్యానీ, ఫ్రైడ్ రైస్‌ల పక్కన రైతా ఉండాల్సిందే. అది లేకుండా బిర్యానీ తినడం పూర్తి కాదు అన్నంతగా ఆహారప్రియులు ఇష్టంగా ఆస్వాదిస్తారు. అలా కాకపోయినా పెరుగులో ఉల్లిపాయ నొంచుకుని తింటుంటారు చాలమంది. పెరుగులో లేదా మజ్జిగలో ఉల్లిపాయ పెట్టుకుని తింటే ఉంటది ఆ రుచి..నా సామిరంగా అంటూ ఆనందంగా లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. కడుపు కూడా హాయిగా చల్లగా ఉంటుంది. అలాంటి రైతా గురించి షాకింగ్ విషయాలు చెబుతున్నారు నిపుణులు. రైతాలో ఉల్లిపాయలు ఎట్టి పరిస్థిత్తుల్లోనూ జోడించొద్దని హెచ్చరిస్తున్నారు. ఎందుకని ఇలా చెబుతున్నారంటే..భారతీయలు ఎక్కువగా ఉల్లిపాయను మజ్జిగ/పెరుగులో లేదా రైతా రూపంలో తీసుకుంటుంటారు. అయితే ఇలా పెరుగుకి ఉల్లిపాయను జోడించొద్దని చెబుతున్నారు. ఈ కలయిక నాలుకకు మంచి రుచిని ఇచ్చినప్పటికీ..ఆరోగ్యానికి ఇలాంటి కాంబినేషన్ అస్సలు మంచిది కాదని వారిస్తున్నారు. పెరుగు కేవలం తరిగిన పండ్లు, కూరగాయలు, సుగంధద్రవ్యాలతో మంచి ప్రయోజనాలను ఇస్తుంది. అంతేగాదు జీర్ణక్రియను మెరుగుపరచడం, బరువు నిర్వహణకు, ఎముకలను బలోపేతం చేయడం వంటి ఎన్నో ప్రయోజనాలు అందించినప్పటికీ..ఇలా ఉల్లిపాయతో కలగలిసిన రైతా మాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం..పెరుగు, ఉల్లిపాయలు వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటుంది. పెరుగు శీతలీకరణ స్వభావం, ఉల్లిపాయ ఉత్పత్తిచేసే అధికవేడి శరీరంలో టాక్సిన్ స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. ఫలితంగా శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అందువల్ల ఉల్లిపాయను పెరుగుతో జోడించడాన్ని విరుధమైన అన్నంగా పరగణించటం జరుగుతుంది. ఇది అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం, వంటి సమస్యలనే పెంచుతుంది. ఒక్కోసారి ఇది తీవ్రమై ఫుడ్ పాయిజన్కి దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ ఉల్లిపాయను పచ్చిగా తీసుకోవడం వల్ల వేడి అనుభూతి కలుగుతుంది. దీని వేడి, ఆక్సీకరణకు సున్నితంగా ఉంటుంది. అందువల్ల అధికంగా రియాక్షన్ చెంది పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అన్నారు. అలాగే శరీరంలో వాత పిత్తా కఫాలాల తోసహా అమసతుల్యతను సృష్టిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఉల్లిపాయను పెరుగులో తినడం చాలా ఇష్టమనుకుంటే..పచ్చిగా కాకుండా పెరుగు చట్నీ మాదిరిగా కాస్త ఆయిల్లో ఉల్లిపాయాలు వేయించి తాలింపు మాదిరిగా పెట్టుకుని తింటే దానిలో సల్ఫర్ శక్తి, రియాక్షన్ చెందడం తగ్గుతుంది. పైగా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: కూరగాయల షాపింగ్ గైడ్!) -
ద్రవ్యోల్బణం నిజంగానే తగ్గిందా?
గతేడాది రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ పాయింట్లు అధికంగా ఉన్నందునే తాజాగా విడుదలైన ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గినట్లు నమైదయ్యాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2023 జులై, ఆగస్టుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ వరుసగా 7.44 శాతం, 6.83 శాతంగా నమోదైంది. దాంతో పోలిస్తే ఇటీవల ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు కనిపిస్తుందని చెబుతున్నారు.2024 జులై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) నమోదయ్యాయి. కానీ ఇటీవల ఆర్బీఐ గవర్నర్ మాత్రం అందుకు అనుగుణంగా కీలక వడ్డీరేట్లను తగ్గింపుపై మొగ్గు చూపించడం లేదని తెలుస్తుంది. రేట్ల తగ్గింపు అంశంపై ఇటీవల స్పందించిన గవర్నర్ శక్తికాంతదాస్ రేటుకట్లపై తొందరపడబోమన్నారు. ఈ వ్యాఖ్యలు విశ్లేషకుల అంచనాలను సమర్థించినట్లయింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఆర్బీఐ కీలక ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధానానికి ఈ సూచీనే ప్రాతిపదికగా ఉండనుంది.ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్ ఆరోపణలురిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే రుణ రేటు– రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్లను జారీ చేసే ప్రతిపాదనను ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్షా సమావేశం జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది. -
పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివేనా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివనే చాలామంది భావిస్తారు. అంతెందుకు పూర్వకాలం మన పెద్దవాళ్లు అప్పుడే పితికిన పాలనే నేరుగా తాగేవారు కూడా. ఇలా తాగితే మంచి పోషకాలు అందుతాయని విశ్వసించేవారు. అయితే శాస్త్రవేత్తుల ఇలా అస్సలు తాగకూడాదని చెబుతున్నారు. దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తయాని చెబుతున్నారు. పచ్చిపాలు తాగడం మంచిదనే భావన కేవలం అపోహే అనే కొట్టిపారేస్తున్నారు. అంతేగాదు పాశ్చరైజ్డ్ పాలను మాత్రమే తాగాలని పిలుపునిస్తున్నారు. అసలు పచ్చిపాలు ఆరోగ్యానికి ఎందుకు ప్రమాదకరం? శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఏం వెల్లడయ్యిందంటే..పాశ్చరైజ్ చేసిన పాల కంటే పచ్చిపాలే రుచిగా ఉంటాయని చాలామంది ప్రగాఢంగా నమ్ముతారు. దీని వల్ల లాక్టోస్ అసహనం ఉండదని, అలెర్జీలకు చికిత్స చేయగలదని చెబుతుంటారు. ముఖ్యంగా గట్ ఆరోగ్యానికి తోడ్పడుతుందని వాదనలు వినిపిస్తునన్నాయి. కానీ శాస్తవేత్తల పరిశోధనల్లో ఇవన్ని నిజం కాదని తేలింది. అంతేగాదు పాశ్చరైజ్డ్ పాలతో పోలిస్తే పచ్చి పాలు తాగడం లేదా సంబంధిత ఉత్పత్తులను తీసుకోవడం చాలా ప్రమాదమని అధ్యయనంలో వెల్లడయ్యింది. అలాగే ఆరోగ్యానికి సురక్షితం కాదని తేలింది. అదే పాశ్చరైజేషన్ పాల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం చాలా తక్కువని తెలిపారు. ఎందుకు ఆరోగ్యానికి ప్రమాదకరం అంటే..పచ్చిపాలల్లో సూక్ష్మక్రిములు ఎక్రువగా ఉంటాయి. ఇవి ఆహార విషాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల ఉదర తిమ్మిరి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తయని చెబుతున్నారు. పచ్చిపాలల్లో సాల్మొనెల్లా, ఇ. కోలి, లిస్టేరియా, క్యాంపిలోబాక్టర్ వంటి సూక్ష్మక్రిములు ఉంటాయిని, ఇవి అనారోగ్యానికి కారణమవుతాయని చెప్పారు. పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తుల వల్ల 840 రెట్లు అనారోగ్య ప్రమాదం, 45 రెట్లు ఆస్పత్రిలో చేరే అవకాశం ఉంటుందని అన్నారు. పచ్చిపాలు తాగే అలవాటు ఉన్నవాళ్లు ఎవరైనా దీర్ఘకాలంలో కచ్చితంగా అనారోగ్యానికి గురవ్వుతారని వైద్యలు హెచ్చరించారుముఖ్యంగా చిన్నారులు, యువకులు, గర్భిణీస్త్రీలు, వృద్ధులు, కేన్సర్, మధుమేహం లేదా హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ వంటి పరిస్థితులు ఉన్నవారికి ఈ పాలు మరింత ప్రమాదకరమని చెప్పారు. అంతేగాదు అమెరికాలో పచ్చిపాలను విక్రయించడం చట్టవిరుద్ధం. కొన్ని రాష్ట్రాల్లో ఈ పాల విక్రయానికి షరతులతో కూడిన అనుమతి ఉంది. కేవలం రైతు నేరుగా పచ్చిపాలను విక్రయిస్తేనే అక్కడ ప్రజలు వినియోగించవచ్చు. అదీగాక ఇటీవల కాలంలో బర్డ్ ఫ్లూ కలకలం పచ్చిపాల వినియోగాన్ని మరింతగా పరిమితం చేసింది. పక్షులు నుంచి పౌల్ట్రీ అలా యూఎస్‌లోని ఆవులకు సైతం ఈ వైరస్ వ్యాప్తి చెందడం జరిగింది. దీని కారంణంగా నలుగురు వ్యక్తులు మరణించారు కూడా. ఈ నేపథ్యంలో పచ్చిపాల వినియోగంపై మరింత ఆందోళనలు వెల్లువెత్తాయి. పాశ్చరైజేషన్ అంటే..? ఇది పాలను సురక్షితంగా చేస్తుందా..?పాల భద్రతకు పాశ్చరైజేషన్ ముఖ్యం. పాలను 145 డిగ్రీల ఫారెన్ హీట్‌కు గురిచేయడం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే జెర్మ్స్, సూక్ష్మజీవులు చనిపోతాయి. అలాగే ఈ ప్రక్రియలో పాలు త్వరతిగతిన చల్లబడిపోతాయి కూడా. పశ్చిపాలల్లో ఉండే పోషలకాలే పాశ్చరైజేషన్ పాలల్లో కూడా ఉండటమే కాకుండా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. (చదవండి: కివీ కర్రీ..శ్రీలంక ఫేమస్ రెసిపీ..!) -
నడుం ఆకృతి మార్చే మత్స్యాసనం!
బాడీ ఫిట్నెస్ కోసం వివిధ రకాల డైట్లు, వ్యాయామాలు చేస్తుంటారు. ముఖ్యంగా యోగాసనలు శరీరాకృతిని మంచిగా ఉంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతాయి. అందుకే చాలమంది యోగాసనాలు వేసేందుకే ఆసక్తి చూపిస్తారు. అందులో మత్స్యాసనం ది బెస్ట్ ఆసనంగా పేరు. ముఖ్యంగా నడుం ఆకృతిని మంచిగా ఉంచడంలో కీలకంగా ఉంటుంది. దీన్నీ చేపల భంగిమ లేదా చేప ఆకృతి వ్యాయామం అని అంటారు. ఈ వ్యాయమం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి నిపుణులు సైతం చెబుతున్నారు. ఏమంటున్నారంటే..కిగాంగ్ నిపుణుడు బామా కిమ్ ఈ వ్యాయమం వెన్నుముక అమరికను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుందని అన్నారు. ఈ వ్యాయామం బరువు తగ్గడానికే కాకుండా నడుము ఆకృతిని నాజుగ్గా మారుస్తుందని చెప్పారు. ఈ మత్స్యాసనం శరీరానికి చాల ప్రయోజనాలని అందిస్తుందని అన్నారు. ఇది భారీ బరువుతో కూడిన ఆసనం కాదు కాబట్టి నడుమపై పరిమిత వ్యవధిలోనే బరువుని ప్రభావితం చేస్తుంది. అందులనూ ఈ భంగిమలో కాళ్లను బాగా విస్తరించి చేతులు, తలపై బరువును బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆసనంలో ఎక్కవ భారాన్ని తలపై మోపకుండా చేతులపై బ్యాలెన్స్ అయ్యేలా చూసుకోవాలి. కలిగే ప్రయోజనాలు..జీర్ణ ఆరోగ్యం: ఇది ఉదర అవయవాలను ప్రేరేపించి జీర్ణక్రియ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. వెన్నెముక అమరిక: ఇది వెన్నెముక మెరుగ్గా ఉండేలా చేస్తుంది. నడుమ వద్ద కొవ్వు పేరుకోకుండా చూస్తుంది. నరాల పనితీరు: మెడ,వెనుక భాగాన్ని సాగదీయడం ద్వారా, ఇది నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.రక్త ప్రసరణ: ఇది గుండె,ఊపిరితిత్తులకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.జాయింట్ పెయిన్ రిలీఫ్: ఇది కీళ్ల చుట్టూ ఉన్న కండరాలను సాగదీయడం, సడలించడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్యల నుంచి మంచి ఉపశమనం అందిస్తుంది.సురక్షితమేనా?"చేపల భంగిమ సాధారణంగా ప్రారంభకులకు సురక్షితం.కానీ వారు అదనపు మద్దతు కోసం కుషన్ వంటి ఆధారాలను ఉపయోగించాలి. ఐతే మెడ సమస్యలు, తీవ్రమైన వెన్ను సమస్యలు లేదా గుండె సమస్యలు ఉన్నవారు దీనిని ప్రయత్నించే ముందు వ్యక్తిగత వైద్యుల సలహాలు, సూచనల మేరుకు ప్రయత్నించాలి.గర్భిణీ స్త్రీలు లేదా వెన్నెముక గాయాలు ఉన్నవారు ఈ భంగిమను నివారించాలి ఈ ఆసనంలో తలపై ఎక్కువ బరువు పడకుండా చూసుకోవాలి. అలాగే లోతుగా శ్వాస తీసుకుని కొద్దిసేపు అలానే ఉండాలి. ఈ క్రమంలో అసౌకర్యం లేదా నొప్పి వస్తే తక్షణమే వ్యాయామం ఆపేసి ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: అలియా-రణబీర్ ఇష్టపడే వంటకాలివే..!) -
ఇదే జరిగితే.. ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు తగ్గుతాయి
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 కేంద్ర బడ్జెట్లో 'ఫేమ్' (FAME) స్కీమ్ గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. అయితే కేంద్ర బడ్జెట్‌కు ముందు, భారీ పరిశ్రమల మంత్రి హెచ్డీ కుమారస్వామి ఫేమ్ 3 పథకం ప్రణాళికలు చివరి దశలో ఉన్నాయని, వాటిని అమలు చేస్తామని వెల్లడించారు.ఫేమ్ 3 ప్రారంభించే ప్రణాళికల గురించి భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ వివరిస్తూ.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి అమలులో ఉన్న వివిధ పథకాలను ప్రస్తావించారు. కానీ ఫేమ్ 3 గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే దీనిని త్వరలోనే అమలు చేసే అవకాశం ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు.ఫేమ్ 3 కింద ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల నుంచి రూ. 20 వేల కోట్ల వ్యయాన్ని పరిగణించాలని మొబిలిటీ మేనేజింగ్ పార్టనర్ ఆర్యమాన్ టాండన్ అన్నారు.2024-25 బడ్జెట్లో ఫేమ్-3 స్కీమ్ ప్రస్తావన లేకపోవడం పరిశ్రమలోని చాలా మంది వాటాదారులకు నిరాశ కలిగించింది. కానీ ప్రభుత్వం ప్రోత్సాహాలను అందిస్తే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయని డెలాయిట్ ఇండియా కన్సల్టింగ్ భాగస్వామి రజత్ మహాజన్ అన్నారు.ప్రభుత్వ ప్రోత్సాహకాల ఆధారంగా ఈవీల విక్రయాలు ఉంటాయి. అంతే కాకుండా దేశంలో మరిన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని, అప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఫేమ్ 3 కింద బెనిఫీట్స్ అందిస్తాయనే విషయం తెలియాల్సి ఉంది. -
ఇదే మంచి అవకాశం!.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఇటీవల ప్రవేశపెట్టిన మోదీ 3.0 బడ్జెట్లో బంగారం మీద ట్యాక్స్ 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించినట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన తరువాత పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. జులై 23 నుంచి ఇప్పటి వరకు తులం గోల్డ్ రేటు గరిష్టంగా ఐదువేల రూపాయలు తగ్గింది. గణనీయంగా తగ్గిన ధరలు మళ్ళీ పెరుగుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి తగ్గుతున్న బంగారం ధరలు మరికొన్ని రోజుల్లో భారీగా పెరిగే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే బంగారం కొనుగులు చేయడానికి సన్నద్ధమవ్వాలని, రాబోయే రోజులు ఇది మంచి లాభాలను తెచ్చిపెడుతుందని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు జతీన్ త్రివేది అన్నారు.24 క్యారెట్ల బంగారం 7500 రూపాయల నుంచి 6900 రూపాయలకు చేరింది. అంటే ఒక వారం రోజుల్లోనే ఒక గ్రామ్ గోల్డ్ రేటు 600 రూపాయలు తగ్గింది. ధరల తగ్గుదల అందరినీ ఆకర్షిస్తుంది. దీంతో తప్పకుండా రాబోయే రోజుల్లో పసిడి ధరలు పెరుగుతాయని గ్లోబల్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ & పరిశోధకులు సర్వేంద్ర శ్రీవాస్తవ అన్నారు.ఈ రోజు బంగారం ధరల విషయానికి వస్తే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పసిడి ధరలు ఉలుకు పలుకు లేకుండా అన్నట్లు స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబద్, విజయవాడలో గోల్డ్ రేటు రూ. 69000 (24 క్యారెట్స్ 10 గ్రా), రూ. 63250 (22 క్యారెట్ 10 గ్రా) వద్ద ఉంది. వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. దీంతో కేజీ వెండి రూ. 84500 వద్ద ఉంది. -
పుల్లటి పెరుగు ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారంటే..
భారతీయుల భోజనంలో పెరుగు ప్రధానమైనది. దీన్ని కూరల్లో కూడా జోడిస్తారు. రైతాగానూ, మజ్జిగగా పలు రకాలుగా తీసుకుంటారు. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది, చలువ చేస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అలాగే గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అంతేగాదు మొత్తం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది పెరుగు. అయితే పుల్లటి పెరుగు వినియోగించొచ్చా? ఇది ఆరోగ్యకరమైనదేనా? అని చాలామందిలో మెదిలే సందేహం. వేసవి కాలల్లో పెరుగు తొందరగా పులుసుపోతుంది. అలాంటప్పుడూ అది తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా అనే అనుమానం రావడం సహజం. అయితే నిపుణులు పుల్లటి పెరుగు కూడా ఆరోగ్యాని మంచిదేనని ధీమగా చెబుతున్నారు. ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా బేషుగ్గా తీసుకోమని చెబుతున్నారు. కానీ ఇక్కడ పెరుగుని ఎలా స్టోర్ చేస్తున్నామనేది కీలకం అని నొక్కి చెబుతున్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని తినొచ్చా లేదా అని నిర్థారించగలమని అంటున్నారు.పుల్లని పెరుగుని వినియోగించాలంటే తెలుసుకోవాల్సిన అంశాలు..నిల్వ చేసే విధానం: పుల్లని పెరుగుని చల్లటి ప్రదేశంలో గాలి చొరబడని శుభ్రమైన కంటైనర్‌లో ఉంచాలి. పెరుగును సరిగ్గా నిల్వ చేయకపోతే ప్రమాదకరమైన సూక్ష్మక్రీములు వృద్ధి చెందుతాయి.. తినడానికి అనారోగ్యకరంగా మారుతాయి. వాసన, స్వరూపం: పెరుగు కాస్త చిక్కబడి నురుగ వచ్చినట్లుగా ఉండి, పుల్లటి వాసన ఘాటుగా వస్తుంటే దాన్ని వినియోగించకపోవడమే మంచిది. లేదంలో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిల్వ సమయం: పెరుగు పుల్లడం అనేది సహజ ప్రక్రియ. ఎక్కువ కాలవ ఉండటం వల్ల పులయబడటానికి అనుమతిస్తుంది. ఇక్కడ ఎంతసేపు నుంచి పులియబడింది అనేదాన్ని పరిగణలోనికి తీసుకుని వినయోగించాలి. సరైన శీతలీకరణ: కిణ్వణ ప్రక్రియ మందగించేలా, చెడిపోకుండా ఉండేందుకు పెరుగును ఎల్లప్పుడూ స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద రిప్రిజిరేటర్లో ఉంచాలి. పరిశుభ్రత: శుభ్రమైన గిన్నెల్లో పెరుగును తయారు చేయడం వంటివి చేయాలి. ఒక్కసారి వినియోగించిన పెరుగు గిన్నెలోనే పాలు వేసి తోడిపెట్టడం వంటివి చెయ్యకూడదు. అలవాటు చేసుకోవాలి: పుల్లని పెరుగు తినే అలవాటు లేకుంటే నెమ్మదిగా అలవాటు చేసుకునే యత్నం చేస్తే జీర్ణవ్యవస్థ ఈ పెరుగుని స్వీకరించే ప్రయత్నం చేస్తుంది. ఇతర ఆహారాలతో జోడించడం: పుల్లని పెరుగు నుంచి మరిన్ని ప్రయోజనాలు పొందాలనుకుంటే..పండ్లు, తేనె లేదా తృణధాన్యాలు వంటి ఇతర ఆహారాలతో కలపవచ్చు. ఇది మరింత రుచికరంగా ఉండటమే కాకుండా భోజనానికి వివిధర రకాల పోషకాలను అందిస్తుంది. ఏ టైంలో తీసుకుంటే మంచిది: పుల్లటి పెరుగు రాత్రిపూట కంటే పగటి పూట తీసుకోవడమే మంచిది. ఎందుకంటే జీర్ణక్రియ సాధారణంగా పగటిపూట మరింత చురుకుగా ఉంటుంది. జీర్ణ సమస్యల సంభావ్యతను తగ్గిస్తుంది. శరీర స్పందన: పుల్లని పెరుగు మీ శరీరతత్వానకి సరిపోతుందో లేదో గమనించాలి. కడుపునొప్పి లేదా అసౌకర్యం వంటి ప్రతికూల ప్రభావాలు కనిపిస్తే తీసుకునే పరిమాణం తగ్గించడం లేదా నిలిపేయడం మంచిది. సరైన పద్ధతుల్లో పెరుగుని నిల్వ చేస్తే పుల్లటి పెరుగుని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని నిపుణుల చెబుతున్నారు. కానీ యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణక్రియ సమస్యలు ఉన్న వ్యక్తులు ఈ పుల్లటి పెరుగు తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు.(చదవండి: గ్లోయింగ్ స్కిన్ కోసం..నటి భాగ్యశ్రీ గ్రీన్ జ్యూస్ ట్రై చేయండి!) -
అత్యుత్తమమైన డైట్ ఇదే! నిర్థారించిన వైద్యులు!
ఇంతవరకు ఎన్నో రకాల డైట్లు చూశాం. ఎవరికి వారు శారీరక సమస్యలు దృష్ట్యా తమకు నచ్చిన డైట్ ఫాలో అవ్వుతారు. చెప్పాలంటే కీటో డైట్, జోన్ డైట్, పాలియా డైట్, వంటి ఎన్నో రకాల డైట్ల ఫాలో అవుతున్నారు. అయితే వైద్యులు మాత్రం ఈ డైటే అత్యుత్తమైనది అంటూ సిఫార్సు చేస్తున్నారు. పైగా ఇది చిత్త వైకల్యం, కేన్సర్, గుండె జబ్బులు వంటి సమస్యలను దరి చేరనివ్వదని చెబుతున్నారు. ఇంతకీ ఆ డైట్ ఏంటి? దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..!ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలకపాత్ర పోషించేది ఆహారమే. మనం తీసుకునే సమతుల్య ఆహారంతోనే అనారోగ్య సమస్య ప్రమాదాన్ని నివారించగలుగుతాం. మనం తినే ఆహారంలో చక్కెర శాతం, సోడియం కంటెంట్ ఎంత మేర తక్కువగా ఉంటే అంత మంచిది. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారినపడకూడదంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన డైట్‌ని అనుసరించాలని చెబుతున్నారు. అంతేగాదు తమ పరిశోధనలో అన్నిటికంటే మెడిటేరియన్ డైట్ అత్యుత్తమమైనదని తేలిందని చెబుతున్నారు. ఇది గుండె జబ్బులు, కేన్సర్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలదని వెల్లడించారు. చాలా వరకు మరణాలకు కారణం.. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడమేనని చెబుతున్నారు. మెడిటేరియన్ డైట్ లేదా మధ్యధరా ఆహారంలో పుష్కలంగా గింజలు, చేపలు అదనపు వెర్షన్ ఆలివ్ ఆయిల్లు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ అధ్యయనం న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. యూకేలో నంబర్ 1 కిల్లర్‌గా ఉన్న డిమెన్షియా(చిత్త వైకల్యం) నివారించగలదని చెబుతున్నారు. దీన్ని చాలామంది పెద్ద సమస్యగా భావించారు. కానీ నిశ్శబ్ద కిల్లర్ అని చెప్పొచ్చు. ఇక మరో మహమ్మారి కేన్సర్ చాలావరకు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణంగా వస్తుందని, దీన్ని ఈ డైట్‌తో సమర్ధవంతంగా నియంత్రించగలమని చెప్పారు. అంతేగాదు 30% గుండె ప్రమాదాలను కూడా నివారించగలదని చెబుతున్నారు. వ్యాధులను నివారించడంలో అత్యంత శక్తివంతమైన వైద్య సాధానంగా ఆహారమే కీలకపాత్ర పోషిస్తుందని నొక్కిచెబుతున్నారు. మెడిటేరియన్ డైట్/మధ్యధరా ఆహారం అంటే..ఈ పోషక సమతుల్య ఆహారంలో మొక్కల ఆధారిత ఆహారాలు, పండ్లు, కూరగాయలు ఉంటాయి. ధాన్యాలు, బీన్స్, గింజలు, సీఫుడ్, వర్జిన్ నూనెలను ఉపయోగిస్తారు. గ్రీస్, ఇటలీ, లెబనాన్, క్రొయేషియా, టర్కీ, మొనాకోతో సహా మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న 21 దేశాల్లో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇది ఈ దేశాల సంప్రదాయ ఆహారం.మెడిటేరియన్ డైట్ ప్రయోజనాలు..గుండె ఆరోగ్యం: ఈ ఆహారం ఆలివ్ ఆయిల్,నట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులపై దృష్టి పెడుతుంది, ఇది చెడు కొలెస్ట్రాల్,రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, స్ట్రోక్,ఇతర హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బరువు నిర్వహణ: ఈ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా,సంతృప్తిగా ఉంచడంలో సహాయపడతాయి. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యాధుల ప్రమాదం తగ్గింది: టైప్ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్,కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి మధ్యధరా ఆహారం సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.కాగ్నిటివ్ హెల్త్: మెడిటరేనియన్ డైట్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే గాక మెదడు పనితీరులో క్షీణతను తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబతున్నాయి. (చదవండి: -
Budget 2024: వ్యవసాయ పరిశోధనకు ఊతం ఇవ్వాలి
న్యూఢిల్లీ: సాగు రంగం బలోపేతానికి తీసుకోవాల్సిన పలు చర్యలను నిపుణులు, వ్యవసాయ రంగ మండళ్లు కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లాయి. 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్‌కు ముందు ఆరి్థక మంత్రి వివిధ రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు చేపట్టారు. వ్యవసాయ పరిశోధనపై పెట్టుబడులు మరింతగా పెంచాలని, ఎరువుల సబ్సిడీలను హేతుబదీ్ధకరికంచాలని ఈ సందర్భంగా ఆయా రంగాల ప్రతినిధులు సూచించారు. ఆరి్థక వ్యవస్థలో వినియోగం పుంజుకోవడానికి వీలుగా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలని, తక్కువ రేటుకు వర్తకులకు రుణాలు అందించాలని రిటైల్ వర్తకుల సమాఖ్య ఆరి్థక మంత్రిని కోరింది. వర్తకులకు జీఎస్టీ విషయంలో పలు వెసులుబాట్లు కలి్పంచాలని జీటీఆర్ఐ సూచించింది.జీఎస్టీ భారం దించాలి..1.46 కోట్ల రిజి్రస్టేషన్లతో ప్రపంచంలోనే అతి పెద్ద పరోక్ష పన్నుల వ్యవస్థ అయిన జీఎస్టీకి సంబంధించి చేపట్టాల్సిన కీలక సంస్కరణలను గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఆరి్థక మంత్రి దృష్టికి తీసుకొచి్చంది. జీఎస్టీ మినహాయింపు పరిమితిని రూ.1.5 కోట్ల వార్షిక టర్నోవర్‌కు పెంచాలని కోరింది. ప్రస్తుతం వార్షిక టర్నోవర్ రూ.40 లక్షల వరకు ఉన్న సంస్థలకే జీఎస్టీ రిజిస్ట్రేషన్ మినహాయింపు అమల్లో ఉంది. జీఎస్టీలో ప్రస్తుతమున్న శ్లాబులను తగ్గించాలని, రాష్ట్రం వారీగా జీఎస్టీ రిజి్రస్టేషన్‌ను పరిహరించాలని.. దీనివల్ల జీఎస్టీ మరింత సమర్థవంతంగా, వ్యాపార అనుకూలంగా మారుతుందని పేర్కొంది. రూ.1.5 కోట్లలోపు టర్నోవర్ ఉన్న సంస్థలు మొత్తం రిజి్రస్టేషన్లలో 80 శాతంగా ఉంటాయని, మొత్తం పన్ను వసూళ్లలో వీటి ద్వారా వస్తున్నది 7 శాతమేనని గుర్తు చేసింది. ‘‘ఏటా రూ.1.5 కోట్లు అంటే నెలవారీ టర్నోవర్ రూ.12–13 లక్షలు. 10 శాతం మార్జిన్ ఆధారంగా వచ్చే లాభం రూ.1.2 లక్షలే. వీరికి మినహాయింపు కల్పిస్తే మొత్తం పన్ను చెల్లింపుదారుల సంఖ్య 23 లక్షలకు దిగొస్తుంది. జీఎస్టీ వ్యవస్థపై ఇది భారం తగ్గిస్తుంది’’అని వివరించింది. పన్ను వసూళ్లను పెంచడం ద్వారా 7 శాతం పన్ను నష్టాన్ని అధిగమించొచ్చని సూచించింది. ఈ ఒక్క చర్యతో ఎంఎస్ఎంఈలో వృద్ధి, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించినట్టు అవుతుందని పేర్కొంది. రాష్ట్రాల మధ్య వాణిజ్యం ప్రోత్సాహానికి వీలుగా జీఎస్టీ నిబంధనలను సులభతరం చేయాలని కూడా కోరింది. వాతావరణ మార్పులు, టెక్నాలజీ, వాణిజ్యంపై పరిశోధనకు జీటీఆర్ఐ కృషి చేస్తుంటుంది.పన్ను తగ్గిస్తే వినియోగానికి ఊతం..అఖిల భారత రిటైల్ వర్తకుల సమాఖ్య ప్రతినిధులు ఆర్థిక మంత్రికి ఇచి్చన వినతిపత్రంలో పలు కీలక సూచనలు చేశారు. రిటైల్ రంగం వృద్ధి చెందేందుకు వీలుగా డిమాండ్ ను పెంచడం, వినియోగానికి ఊతమివ్వడం కోసం 2024–25 బడ్జెట్లో తక్కువ పన్ను రేట్ల రూపంలో ప్రయోజనాలు లేదా రాయితీలు కలి్పంచాలని కోరింది. ‘‘పన్ను రేట్లు తగ్గిస్తే, నెలవారీ ఖర్చు చేసే ఆదాయంపెరుగుతుంది. అది అంతిమంగా వినియోగానికి ప్రేరణనిస్తుంది. రిటైల్ రంగానికీ మేలు చేస్తుంది’’ అని పేర్కొంది. రిటైలర్లకు తక్కువ వడ్డీపై రుణాలు అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన చేయాలని కోరింది. ఫుడ్ అండ్ బెవరేజెస్‌ను అత్యవసర సేవగా గుర్తించాలని, భూముల రేట్లు, విద్యుత్‌పై సబ్సిడీలు, ఇతర ప్రయోజనాల కల్పించాలని కోరింది. వ్యాపార సులభతర నిర్వహణకు వీలుగా జాతీయ రిటైల్ విధానాన్ని వేగంగా రూపొందించి, అమలు చేయాలని కోరింది. ఎంఎస్ఎంఈల ప్రయోజనాలకు రిటైలర్లను అర్హులుగా ప్రకటించాలని కూడా విజ్ఞప్తి చేసింది. వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధిక మందికి ఉపాధి కలి్పస్తూ, జీడీపీలో 10 శాతం వాటాను రిటైల్ రంగం సమకూరుస్తుండడం గమనార్హం. వ్యవసాయ రంగం పటిష్టత కోసం.. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకుని నిలబడేందుకు వీలుగా సాగు రంగంలో మౌలిక వసతులను బలోపేతం చేయాలని నిపుణులు సూచించారు. వ్యవసాయ రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ)కి పెద్ద పీట వేయాల్సిన అవసరాన్ని ఇండియన్ చాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ) చైర్మన్ ఎంజే ఖాన్ ప్రస్తావించారు. దీనివల్ల సాగు రంగం మరింత వృద్ధి పథాన సాగుతుందని, రైతుల ఆదాయం మెరుగుపడుతుందని చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)కు బడ్జెట్లో నిధుల కేటాయింపులు రూ.9,500 కోట్ల నుంచి రూ.20,000 కోట్లకు పెంచాలని సూచించారు. ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో (డీబీటీ) ఇచ్చే అన్ని రకాల వ్యవసాయ సంబంధిత సబ్సిడీలను హేతుబదీ్ధకరించాలని, 2018 నుంచి ఎలాంటి మార్పుల్లేని యూరియా రిటైల్ ధరలను పెంచాలని, సబ్సిడీల ద్వారా బయో ఫరి్టలైజర్స్, ఫోలియర్ ఫరి్టలైజర్స్ను ప్రోత్సాహించాలన్న సూచనలు ఆరి్థక మంత్రి దృష్టికి వచ్చాయి. ఇతర పెట్టుబడులతో పోల్చి చూస్తే వ్యవసాయ పరిశోధన పెట్టుబడులపై వచ్చే ఆరి్థక ప్రయోజనాలు పది రెట్లు అధికంగా ఉన్నప్పటికీ.. గడిచిన రెండు దశాబ్దాల కాలంలో బడ్జెట్ కేటాయింపులు ద్రవ్యోల్బణం కంటే తక్కువ ఉండడాన్ని భారత్ కిసాన్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జఖార్ గుర్తు చేశారు. ఎంఎస్పీ కమిటీని వేరు చేయాలని, నూతన వ్యయసాయ రంగ విధానాన్ని తీసుకురావాలన్న సూచనలు కూడా వచ్చాయి. వ్యవసాయ ఎగుమతులకు ఊతమిచ్చేందుకు వీలుగా అపెడాకు కేటాయింపులను రూ.80 కోట్ల నుంచి రూ.800 కోట్లకు పెంచాలని జిల్లా స్థాయిలో ఎగుమతుల కేంద్రాలు తెరవాలని పలువురు సూచించారు. -
హెయిర్ పెర్ఫ్యూమ్లు ఎక్కువగా ఉయోగిస్తున్నారా?
ఇటీవల మార్కెట్లోకి ఇబ్బడి ముబ్బడిగా వెరైటీ బ్యూటీ ప్రొడక్ట్‌లు వస్తున్నాయి. ఎలాంటి సమస్య అయినా చిటికెలో చెక్‌పెట్టేలా కళ్లు చెదిరిపోయే ధరల్లో మనముందుకు వస్తున్నాయి సౌందర్య ఉత్పత్తులు. ముఖ్యంగా యువత వీటిని ఎక్కువ ఉపయోగిస్తుంది. వాటిల్లో ప్రముఖంగా ఉపయోగించేది హెయిర్ పెర్ఫ్యూమ్నే. ఇది మనం జస్ట్ అలా ఎంట్రీ ఇవ్వంగానే అందరి ముక్కులను ఘామాళించేలా మంచి సువాసన వచ్చేస్తుంది. అందరిలో ప్రత్యేకంగా సువాసనభరితంగా అనిపించేలా కనిపించడం కోసం కొందరూ ఈ హెయిర్ ఫెర్ఫ్యూమ్స్ని తెగ వాడేస్తుంటారు. అయితే ఇలా ఉపయోగించటం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. దీని వల్ల రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అవేంటో సవివరంగా చూద్దామా..!పరిమిళాలు వెదజల్లే ఈ హెయిర్ పెర్ఫ్యూమ్లు మంచి తాజాదనాన్ని ఆహ్లాదమైన అనుభూతిని కలిగించినప్పటికీ అవి మీకు హానిని కలుగజేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిల్లో ఇథైల్ ఆల్కహాల్, భారీ సింథటిక్ సువాసనలు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని దీర్ఘకాలం ఉపయోగిస్తే..స్కాల్ప్ డ్యామేజ్ అవ్వడం లేదా పొడిబారినట్లుగా మారుతుంది. ఇవి జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా హెయిర్ పెర్ఫ్యూమ్‌లోని ఆల్కాహాల్లు జుట్టులోని సహజ నూనెలను తొలగించి.. పొడిగా, పెళుసుగా అయిపోతాయి. ఎక్కువగా జుట్టు చివర్లు చిట్లిపోవడం, నిస్తేజంగా అయిపోవడం జరుగుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు మెయింటెయిన్ చేయాలనుకుంటే వీటిని మితంగా లేదా దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో ఈ హెయిర్ ఫెర్ఫ్యూమ్లు ఓ ట్రెండ్‌గా మారినప్పటికీ.. అవి ఆరోగ్యానికి హానికరమే గానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. అంతగా అలాంటి సువాసనభరితమైన ఫీల్ కావాలనుకుంటే సహజ పదార్థాలతో కూడా ఇలాంటి అనుభూతిని పొందొచ్చని చెబుతున్నారు. సంరక్షణ పద్ధతులు..తేలికపాటి మెత్తపాటి జుట్టు ఉన్నవాళ్లు పొగమంచులాంటి లైట్ ఫెర్ఫ్యూమ్లు ఒత్తు జుట్టు ఉన్నవారు మంచి గాఢతగలవి వినియోగించొచ్చని చెబతున్నారు నిపుణులు. ఈ పెర్ఫ్యూమ్లను మితంగా వాడితే జుట్టు నష్టాన్ని నివారించి ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారని చెబుతున్నారు. తేలికపాటి స్ప్రేలు సరిపోతాయని, వాటిని నేరుగా తలపై కాకుండా చివర్ల లేదా జుట్టు మధ్యలో స్ప్రే చేయడం ఉత్తమం అని సూచిస్తున్నారు. సహజ ప్రత్యామ్నాయాలు..హెయిర్ ఫెర్ఫ్యూమ్కు సహజమైన ప్రత్యామ్నాయాలు ఏంటంటే..లావెండర్, రోజ్మేరీ లేదా చమోమిలే వంటి ఎసెన్షియల్ ఆయిల్స్‌ని నీటిలో కలిపి హెయిర్‌పై స్ప్రేగా ఉపయోగించొచ్చు. ఇవి శిరోజాలకు సహజమైన నూనెలను అందించడమే కాకుండా ఆహ్లాదభరితమైన సువాసనను కూడా ఇస్తాయి. ముఖ్యంగా రోజ్ వాటర్ చక్కటి రిఫ్రెష్‌ని కలిగించే సువాసనను అందిస్తుంది. అలాగే నారింజ లేదా నిమ్మ వంటి సిట్రస్ తొక్కలతో తయారు చేసిన నీటిని కూడా ఉపయోగించొచ్చు. ఇవి జుట్టు స్కాల్ప్‌ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఎలాంటి ఫెర్ఫ్యూమ్ అయినా ఎక్కువ మోతాదులో స్ప్రే చేయకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు.(చదవండి: వెర్సాస్ గౌనులో యువరాణిలా శ్లోకా మెహతా లుక్ అదుర్స్..!) -
ట్రెడ్మిల్ వర్సెస్ వాకింగ్: ఏది బెటర్?
వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ట్రెడ్మిల్ కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. సమతుల్య వ్యాయామ నియమావళిలో భాగంలో ఏ వ్యాయామం బెటర్‌గా ఉంటుందనే ప్రశ్న అందరికి వచ్చే కామన్ సందేహం. ఈ విషయంలో ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే.నడక అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వ్యాయామానికి సంబంధించిన అత్యంత సులభమైన వర్కౌట్. ఇది అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా గుండెజబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, టైప్2 డయాబెటిస్ వంటి వివిధ సమస్యలను ఎదుర్కొనడంలో సహాయపడుతుంది. శారీరక ప్రయోజనాలే కాకుండా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతేగాదు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మరి ఇలాంటి ప్రయోజనాలు ట్రెడ్‌మిల్‌పై నడిచినా లభిస్తున్నాయి కదా మరీ రెండింటిలో ఏది బెటర్ అనే సందేహం అందిరిలో మెదిలే ప్రశ్న. రెండు కూడా శరీరానికి మంచి ప్రయోజనాలే అందిస్తాయి. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటే బెస్ట్ అంటే..ట్రెడ్‌మిల్‌పై నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు..ట్రెడ్‌మిల్‌పై నడవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వైద్యులు ఏమంటున్నారంటే..నియంత్రిత వాతావరణంలో ట్రెడ్‌మిల్‌పై నడవడం జరుగుతుంది. వర్షం, మంచు లేదా వేడి వాతావరణాల్లో బయటకు రానివాళ్లకు, లేదా పడనివాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. అదీగాక ఆధునిక ట్రెడ్మిల్లు వివిధ సెట్టింగులతో వస్తున్నాయి. ఇవన్నీ మంచి వర్కౌట్లకు అనుగుణంగా ఉన్నాయి. శరీరానికి తగిన వ్యాయామం లభించినట్లు అవుతోంది కూడా. ట్రెడ్మిల్లు కుషన్డ్ ఉపరితలాలు కలిగి ఉంటాయి. అందువల్ల బహిరంగ ఉపరితలాలపై నడవడం కంటే దీనిపై నడవడం వల్ల కీళ్లకు మేలు చేస్తాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్లకు లేదా ఆర్థోపెడిక్ సర్జరీల నుంచి కోలుకుంటున్న వారికి ఈ ఫీచర్ కీలకం.ముఖ్యంగా భద్రత ఉంటుంది. ఇంటిలోపలే ట్రెడ్‌మిల్‌పై నడవడం వల్ల ట్రాఫిక్ వంటి సమస్యలు ఎదురవ్వవు. ఎలాంటి ప్రమాదాలు ఎదురుకావు. ఆరుబయట నడవడం వల్ల కలిగే లాభాలు..ఆరుబటయ నడవడం వల్ల సహజమైన వాతావరణ వైవిధ్యం లభిస్తుంది. శరీరానికి ఆహ్లాదం తోపాటు చక్కటి వ్యాయామం లభిస్తుంది. తాజాగాలి, సూర్యకాంతి, ప్రకృతికి బహిర్గతం అవుతాం. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పచ్చటి ప్రదేశాల్లో నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మానసిక స్థితి మెరుగుపడుతుంది. మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బహిరంగంగా నడవడం వల్ల మన చుట్టు ఉన్నవాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి. చక్కటి సామాజిక సంబంధాలు మానసిక ఉత్సాహాన్ని అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే బయట నడవడం వల్ల ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఏది మంచిదంటే..ట్రెడ్మిల్ లేదా ఆరుబయట నడవడం అనేది వ్యక్తిగత పరిస్థితులు, ప్రాధాన్యత ఆధారంగా ఇది నిర్ణయించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భద్రతా సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ట్రెడ్మిల్ మంచిదని, ప్రకృతితో సాన్నిత్యం కోరుకునేవారికి, మానసిక ఆరోగ్యం కోసం అయితే బహిరంగంగా వాకింగ్ చేయడం సరియైనదని నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: రక్తదానం చేయడం మంచిదేనా? ఏడాదికి ఎన్నిసార్లు చెయ్యొచ్చు..) -
కూర్చొని వర్సెస్ నిలబడి: ఎలా తింటే బెటర్?
చక్కగా కూర్చొని ఆహారం తింటుంటే హాయిగా ఉంటుంది. ఇప్పుడూ ఈ ఉరుకులు పరుగులు జీవన విధానంలో చాలామంది నిలబడి గబగబ తినేసి భోజనం కానిచ్చాం అన్నట్లుగా తింటున్నారు. అంతెందుకు పెళ్లిళ్లలో కూడా బఫే పేరుతో నిలబడి తినడమే. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లలోనూ ఇదే తీరు. ఇంతకీ ఇలా తినడం మంచిదేనా? అంటే..ముమ్మాటికి కాదనే చెబుతున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఈ విషయమై పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.నిలబడి తింటే..నిలబడి తినడం వల్ల వేగంగా జీర్ణమయ్యి, కొవ్వు తగ్గడం జరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఇది ఒక్కోసారి పొట్ట ఉబ్బరాన్ని కలిగించి ఆకలిని పెంచుతుందని చెబుతున్నారు. అంతేగాదు ఇటీవల చాలామంది టైం ఆదా అవుతుందనే ఉద్దేశ్యంతో నిలబడి ఏదో కానిచ్చాం అన్నట్లు భోజనం చేస్తుంటారు. ఇది జీర్ణక్రియకు హానికరం అని, అతిగా తినేందుకు దారితీస్తుందని నొక్కి చెబుతున్నారు పరిశోధకులు. గురత్వాకర్షణ కారణం కడుపులోని ఆహరం వేగంగా ప్రేగుల్లో కదులి, త్వరగా జీర్ణమయ్యిపోతుంది. ఫలితంగా అతి ఆకలికి దారితీస్తుందని తెలిపారు.చాలామంది నిలబడి తినడం వల్ల బరువు తగొచ్చని భావిస్తుంటారు. కానీ దీని వల్ల బరువు తగ్గడం అటుంచి శరీరానికి అవసరమయ్యే కొవ్వుల, నష్టం, పోషకాల నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు ఇలా నిలబడి తింటే ఆహారం టేస్టీగా అనిపించదట. అదీగాక వాళ్లు కూడా ఆటోమేటిగ్గా రచి తక్కువ ఉన్న ఆహారపదార్థాలను ఇష్టపడతారని చెబుతున్నారు. ఎందుకంటే నిలబడి తింటున్నప్పుడూ నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ ముడుచుకుపోతాయని తెలిపారు. ఇందుకోసం సుమారు 30 మంది వ్యక్తులను తీసుకుని అధ్యయనం చేయగా నిలబడి తిన్న వాళ్లలో బరువు కోల్పోడమే గాక టేస్టీగా ఉన్న ఆహారాన్ని తినకపోవడాన్ని గుర్తించామని చెప్పారు. కూర్చొని తినడం..మీరు తినేటప్పుడు అనుసరించే భంగిమ మీ ఆహారాన్ని జీర్ణం చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఒక వ్యక్తి కూర్చొన్నప్పుడు కడుపులోని ఆహారం నెమ్మదిగా ఖాళీ అవుతుందని అన్నారు. నిలబడి భోజనం చేసిన దానికంటే నెమ్మదిగా జీర్ణం అవుతుందని అన్నారు. అలాగే శరీరం ప్రోటీన్లు గ్రహించేలా మంచిగా జీర్ణం అవుతుంది. అంతేగాక రక్తానికి అవసరమయ్యే అమైనో ఆమ్లాల లభ్యత కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ఇక కూర్చొని తినడం వల్ల టేస్టీగా ఉన్న ఆహారాన్నే తీసుకుంటారు. పైగా నిలబడి తిన్నప్పటి కంటే కూర్చొని భోజనం చేసినప్పుడూ ఆహారం టేస్టీగా అనిపిస్తుందట కూడా. తక్కువ ఆకలి ఉంటుంది. నిండుగా ఉన్న ఫీల్ కలుగుతుందని చెబుతున్నారు పరిశోధుకులు. అధ్యయనంలో పాల్గొన్న సగం మందిలో.. కూర్చొన తిన్న వారిలో జీర్ణ సంబధ సమస్యలు లేకపోవడమే గాక బరువు అదుపులో ఉన్నట్లు తెలిపారు. పైగా నిలబడిన వారితో పోలిస్తే టేస్టీగా ఉండే భోజనాన్నే ఇష్టపడినట్లు గుర్తించామని అన్నారు. ఏదీ బెటర్ అంటే..కూర్చొని తినే భంగిమే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. కూర్చొవడం అంటే..డైనింగ్ టేబుల్స్ మీద కాదు. నేల మీద నిటారుగా కూర్చొని భోజనం చేస్తేనే సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే గూని లేకుండా నిటారుగా కూర్చొని తినడం వల్ల కడుపులోంచి ఆహరం ప్రేగుల్లోకి నెట్టడానికి అనుమతిస్తుంది. అలాగే ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం తగ్గుతుందని చెప్పారు. నిజానికి ఇది భారతీయ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న భోజన సాంప్రదాయం కూడా ఇదే.ఇక నిలబడినప్పుడు త్వరితగతిన ఆహారం విచ్ఛిన్న అయ్యి కాలక్రమేణ కొవ్వులు నష్టానికి దారితీస్తుందని పరిశోధనలో తేలిందన్నారు పరిశోధకులు. అలాగే టేస్టీగా తినాలనుకుంటే కూర్చొని హాయిగా భోజనాన్ని ఆస్వాదిస్తూ తినడం మంచిదని వెల్లడించారు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా శాస్త్రవేత్తల బృందం. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ కంజ్యూమర్ రీసెర్చ్‌లో ప్రచురితమయ్యింది.(చదవండి: నటి విద్యాబాలన్ ఫాలో అయ్యే "నో రా డైట్" అంటే..!) -
Anti tobacco day: దున్నపోతు మాట దేవుడెరుగు.. పోతావుపైకి!
‘పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్’ అని అప్పుడెప్పుడో గిరీశం సెలవిచ్చాడు కానీ... అదెంత అబద్ధమో... పొగ ఆరోగ్యానికి ఎంత హానికరమో ఇప్పుడు ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకవైపు పొగాకు వినియోగంపై అవగాహన పెరుగుతున్నా... ఇంకా అజ్ఞానంలో ఉన్నవారూ కొనసాగుతున్నారు. ఒకరకంగా చూస్తే పెరిగిపోతున్నారు. ఇలాంటి వారిలోనూ ధూమపానం వ్యతిరేక ప్రభావాలపై అవగాహన పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగమే ఈ నాటి పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ లక్ష్యాన్ని సాధించామనుకోండి... ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం 80 లక్షలుగా ఉన్న పొగాకు సంబంధిత మరణాలను గణనీయంగా తగ్గించవచ్చున్నమాట!ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే..1987లో, డబ్యూహెచ్ఓలోని సభ్య దేశాలు ఏప్రిల్ 7ని ప్రపంచ ధూమపాన నిరోధక దినోత్సవంగా గుర్తించాయి. అయితే పొగాకు సంబంధిత సమస్యలన్నింటిపై అవగాహన పెంపొందించే ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పాటించాలని 1988లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి డబ్యూహెచ్ఓ దాని సభ్య దేశాలు ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.పొగాకు వినియోగ గణాంకాలు:వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం ఏటా పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా దాదాపు 8 మిలియన్లకు పైగా ప్రజలు మరణిస్తున్నట్లు పేర్కొంది. అలాగే దాదాపు 1.3 మిలియన్ల మంది ధూమపానం చేయనివారు సెకండ్‌హ్యాండ్ స్మోక్‌కి గురయ్యి, అనారోగ్యాల బారిన పడుతున్నట్లు తెలిపింది. అంతేగాదు ప్రపంచంలోని దాదాపు 1.3 మిలియన్ల పోగాకు వినియోగదారుల్లో సుమారు 80% మంది మధ్య ఆదాయ దేశాల్లో నివశిస్తున్నారు. కేవలం 2020లో ప్రపంచ జనాభాలో 22.3% మంది పొగాకును ఉపయోగించినట్లు అంచనా. వారిలో 36.7% మంది పురుషులు, 7.8% మంది మహిళా వినియోగదారులు ఉన్నాట్లు వెల్లడయ్యింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 37 మిలియన్ల మంది యువకులు ధూమాపానాన్ని సేవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది థీమ్:ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం 2024 థీమ్ “పొగాకు పరిశ్రమ జోక్యం నుంచి పిల్లలను రక్షించడం”. ఈ థీమ్‌ని ఇతివృత్తంగా చేసుకుని పొగాకు వాడకం వల్ల కలిగే హానికరమైన ఆరోగ్య ప్రభావాల గురించి అవగాహన పెంచడం, ధూమపానం దూరంగా ఉండేలా ప్రజలను ప్రోత్సహించేలా చేయడం వంటివి చేస్తారు అధికారులు. అంతేగాదు ఈ పొగాకు అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి వంటి అవగాహన కార్యక్రమాలను కూడా చేపడతారు. ఈ పొగాకులో దాదాపు ఐదు వేల నుంచి ఏడు వేల రసాయనాలు ఉంటాయి. అవి సుమారు 50 నుంచి 60 రకాల కేన్సర్ కారకాలని నిపుణులు చెబుతున్నారు. పొగాకులో ఉండే నికోటిన్ అనే రసాయనం డోపమైన్, అసిటైల్కోలిన్, నోర్పైన్ఫ్రైన్, సెరోటోనిన్ వంటి ఆనందకరమైన హార్మోన్లను విడుదల చేసి వ్యసపరుడిగా మారుస్తుంది. ఇది క్రమేణ అధిక రక్తపోటు, పక్షవాతం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, జీర్ణ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగాకు అడిక్షన్ నుంచి బయటపడాలంటే..మన వంటింటిలో ఉపయోగించే వాటితోనే పొగాకు అడిక్షన్‌కు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..ధూమపానం సేవించాలనే కోరిక గలిగనప్పుడూ ప్రత్నామ్నాయ మార్గాలను ఎంచుకోండి. ఆ కోరికను అదుపులో పెట్టుకోలేనట్లు అనిపించనప్పుడూ ఈ క్రింది ఆహార పదార్థాలను పత్యామ్నాయంగా ఉపయోగించండని చెబుతున్నారు నిపుణులు.పుదీనా ఆకులు నమలడం, లేదా పుదీనా నీళ్లు తాగడం. పండ్లు, పచ్చి కూరగాయలు తినడంనీళ్లు ఎక్కువగా తాగడందాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు వంటివి నమలడంగోరు వెచ్చని పాలు తాగడంనిమ్మకాయ నీళ్లు వంటివి తాగాలిపైవాటిలో మీకు నచ్చినవి తాగేందుకు ప్రయత్నిస్తూ ఆ కోరికను నియంత్రించడం వంటివి చేస్తే సులభంగా పొగాకు అడిక్షన్ నుంచి బయటపడతారు. మొదట్లో ఇబ్బందిగా అనిపించినా.. రాను మీకు తెలియకుండానే మంచి ఆహారపు అలవాట్లకు అలవాటు పడతారు. దీంతో పాటు చక్కటి వ్యాయమం లేదా ఏదైనా వర్కౌట్లతో మైండ్‌ని డైవర్ట్ చేస్తూ.. ఉంటే శారీకంగానూ, మానిసకంగానూ స్ట్రాంగ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: అంతరిక్ష వ్యర్థాలకు చెక్ పెట్టేలా 'చెక్క ఉపగ్రహం'..ప్రపంచంలోనే..!) -
భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగేస్తున్నారా?
నీళ్లు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎంత ఎక్కువగా నీళ్లు తాగితే అంతమంచిదని అంటారు. అలా అని ఎప్పుడుపడితే అలా తాగడం మంచిది కాదని కూడా చెబతున్నారు నిపుణులు. ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగాలని..ఇలా చేస్తే మలబద్దక సమస్య ఉండదని అంటారు. ఆ తర్వాత వీలు కుదిరినప్పుడైన నీళ్లు తాగే యత్నం చేయండని అంటారు. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే బోజనం అయ్యిన వెంటనే లేదా భోజనం మధ్యమధ్యలో అదేపనిగా తాగుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదంట. ఇలా చేయడం వల్ల తలెత్తే సమస్యలు గురించి సవివరంగా చెప్పుకొచ్చారు నిపుణులు. అవేంటంటే..నీళ్లు ఆరోగ్యానికి చాలా అవసరం. దాహార్తిని తీర్చడమే కాకుండా ఆహారాన్ని చక్కగా విచ్ఛిన్నం చేసి సులభంగా జీర్ణమవ్వడంలో సహాయపడుతాయి. తద్వారా శరీరం త్వరిగతగతిన పోషకాలను సులభంగా గ్రహించగలుగుతుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం..భోజనం అయ్యిన వెంటనే నీళ్లు తాగకూడదు. దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేంటంటే..జీర్ణ సమస్యలు..తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఎందుకంటే ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించి గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. గ్యాస్టిక్ రసాలు, జీర్ణ ఎంజైమ్‌లను పలుచన చేసి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుందని చెబతున్నారు. దీని వల్ల పోషకాల సహజ శోషణపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. కడుపులో ఉన్న ఆహారం నీళ్లు తాగిన వెంటనే శీతలీకరణం అయిపోతుంది. దీంతో సాధారణంగా జీర్ణం అయ్యే వ్యవధిలో మార్పులు వచ్చి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. బరువు పెరగడం..తిన్న వెంటనే నీళ్లు తాగడంతో తొందరగా ఆహారం విచ్చిన్నమయ్యి వేగంగా జీర్ణ మయ్యిపోతుంది. దీంతో వెంటనే ఆకలిగా అనిపించి..అతిగా తినడానికి దారితీస్తుంది. ఫలితంగా బరువు పెరగడం, ఓబెసిటీ వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. గుండెల్లో మంట..భోజనం చేసిన వెంటనే తాగిన నీరు జీర్ణ ఎంజైమ్‌లను పలుచన చేసి ఆమ్లత్వానికి దారితీసి గుండెల్లో మంటకు కారణమవుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ రసాయనాలు, డైజిస్టివ్ ఎంజైమ్‌లు అదనపు నీటితో కరిగించబడి ఆమ్లత్వానికి దారితీస్తుంది. దీంతో గుండెల్లో మంట వంటివి కలుగుతాయి. ఇన్సులిన్ పెరుగుదలకు..ఇలా నీళ్లు తాగడం వల్ల కొంత ఆహారం జీర్ణం కాకుండా ఉండిపోయే అవకాశం ఉంది. ఇది కాస్త కొవ్వుగా మారి శరీరంలో నిల్వ చేయడబడి ఇన్సులిన్ పెరుగుదలకు దారితీస్తుంది. దీంతో మధుమేహానికి దారితీసి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడానికి కారణమవుతుంది. ఎలా తాగడం మంచిదంటే..భోజనానికి అరగంట ముందు లేదా తర్వాత నీరు తాగడానికి సరైన సమయం అని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ భోజనం చేస్తున్నప్పుడూ ఎక్కిళ్లు వచ్చి నీళ్లు తాగక తప్పడం లేదు అనుకుంటే..తింటున్నప్పుడూ మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నీటిని సిప్ చేయండి. ఇలా చేస్తే కాస్త గొంతులో ఆహారం సాఫీగా దిగడమే కాకుండా ఆహారం మృదువుగా అయ్యి సులభంగా జీర్ణమవుతుంది. అలాగే బాగా చల్లగా ఉన్న నీటిని అస్సలు తాగొద్దు. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేసి జీర్ణమయ్యే వ్యవధిని మందగించేలా చేస్తుంది. పైగా యాసిడ్ రిఫ్లక్స్‌కి దారితీసి, టాక్సిన్ సేకరణకు దారితీస్తుంది. అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ తినేటప్పుడూ ఎరేటెడ్ డ్రింక్స్, కెఫిన్ వంటి పానీయాలను తీసుకోకండి అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: పుణే ఘటన! ఎవరిది ఈ పాపం? ఇది పేరెంటింగ్ వైఫల్యమేనా..?) -
ఆ వ్యక్తుల హెల్త్ సీక్రెట్స్‌తో యూస్ ఉండదట!
మంచి ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండే వారిని అడిగి మరీ హెల్త్ సీక్రెట్స్ తెలుసుకుంటాం. మనం కూడా వాటిని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తాం. సర్వసాధారణం. ఇలానే వందేళ్లకు పైగా జీవించిన వృద్ధుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య సలహలు తీసుకునే యత్నం చేస్తాం. ఇలా అస్సలు చేయడదట. ఎందుకంటే అందుకు చాలా కారణాలు ఉంటాయని, అందరికీ ఒకేలాంటి పరిస్థితులు ఎదరవ్వవని నిపుణులు అంటున్నారు. పైగా అర్థరహితమైన ప్రశ్నగా కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే..?సుదీర్ఘకాలం ఎలా జీవించారో తెలుసుకుని వారి నుంచి ఆరోగ్య సలహాలు తీసుకోవడం వంటి చేయకూడదు. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణుల చెబుతున్నారు. పైగా దీన్ని సర్వైవర్‌షిప్ బయాస్‌గా చెబుతున్నారు. ఏంటీ సర్వైవర్‌షిప్ బయాస్ అంటే..రెండో ప్రపంచయుద్ధంలో మిత్రరాజ్యల నిపుణులు యుద్ధ నష్టాన్ని అంచనా వేసేందుకు తిరిగొచ్చిన యుద్ధ విమానాలను లెక్కించేది. మరీ తిరిగి రానీ విమానాల సంగతేంటన్నది ఆలోచించేవారు కాదు. ఈ డ్యామేజ్ అయిన విమానాకు రక్షణ కవచాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపేవారు. ఇది సరైయనది కాదని, తప్పుదారి పట్టించే గణన అని చెబతున్నారు. దీన్నే సర్వైవర్‌షిప్ బయాస్ అని పిలుస్తారు. కేవలం చుట్టూ ఉన్నవాటినే లెక్కించి, మనుగడ లేని వాటిని విస్మరించడాన్ని సర్వైవర్‌షిప్ బయాస్ అంటారు. అలాగే ఓ వందమంది సముహం తీసుకుందాం. వారంతా జీవితమంతా పొగతాగితే..వారిలో కొందరు ఊపిరితిత్తుల వ్యాధి లేదా గుండె జబ్బులతో ముందుగానే చనిపోతారు. ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వాటన్నింటిని తప్పించుకుని సుదీర్ఘకాలం జీవిస్తారు. వారిని ఇంటర్యూస్తే..అతడు రోజు ఒక ప్యాకెట్ దమ్ము పీల్చడం అంటే అంగీస్తారా?. నిజానికి ఇది అందరి విషయంలోనే సరైయినది కాదు కదా. కష్టాలు ఎదురై విజయం సాధించిన నటులు లేదా వ్యాపారవేత్త విజయగాథలే వింటాం. అందుకోలేకపోయిన వాళ్ల సంగతి గురించి ఆలోచించం. ఎన్నడూ ప్రయత్నం చేయని వాళ్ల గురించి కూడా విని ఉండం. అందువల్ల ఓన్లీ విజయ పరంపరనే లెక్కలోకి తీసుకుని సక్సెస్ అనొద్దు మీగతా వాళ్లు కూడా అంతే కష్టపడవచ్చు అందుకోలేకపోవడానికి ఏదో కచ్చితమైన కారణాలు కూడా ఉంటాయి. అలాగే కొందరూ వృద్ధులు మంచి వ్యాయామాలతో 60లో కూడా మంచి ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటారు. మరికొందరూ భయానక వ్యాధుల బారిన పడినా కూడా సేఫ్‌గా బయటపడతారు. వీళ్లు కూడా సుదీర్ఘకాలం జీవించినా..ఆయా వ్యక్తుల్లా వృధాప్యంలో చురుకుగా ఉండకపోవచ్చు. ఇక్కడ వ్యక్తి మంచి ఆరోగ్యం వ్యాయామంతో ముడిపడి ఉన్నా..కొంరిలో అందుకు మరో కారణం కూడా ఉంటుందని అంటున్నారు నిపుణులు. దీనిపై ఇప్పటి వరకు సరైన స్పష్టత లేదని అంటున్నారు. మాములుగా సుదీర్ఘకాల జీవనానికి మంచి అలవాట్ల జాబితా చాలా ఉన్పప్పటికీ.. దీంతోపాటు సానుకూల దృక్పథం, మంచి సంబంధబాంధవ్యాలు వంటివి కూడా ఉంటాయని అంటున్నారు నిపుణులు.(చదవండి: మథర్స్ డే వెనకాల మనసును కథలించే కథ!) -
వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
ఐదో దశ నామినేషన్ల చివరి రోజు వరకు యూపీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే ఉత్కంఠను ఆ పార్టీ కొనసాగించింది. అయితే చివరికి ఆయన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ మరో సస్పెన్స్‌కు తెరలేపింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒకవేళ రాహుల్ అటు కేరళలోని వయనాడ్, ఇటు యూపీలోని రాయ్‌బరేలీలలో గెలిస్తే ఏ సీటును వదులుకుంటారనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది.గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి మే 3న రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్‌కు ముందు ఆయన తల్లి సోనియా గాంధీ ఈ స్థానానికి వరుసగా 20 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలు. ఇదిలా ఉండగా వయనాడ్, రాయ్‌బరేలీలలో గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు? అనే ప్రశ్నకు లక్నో యూనివర్శిటీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సంజయ్ గుప్తా విశ్లేషణ చేశారు.తల్లి రాజకీయ వారసత్వం కోసం రాహుల్ గాంధీ అమేథీని వదిలి, రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నిర్ణయం ద్వారా రాహుల్ గాంధీ సురక్షితమైన పందెం ఆడారు. మొదటిది బీజేపీ మహిళా నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పోటీపడితే గతంలో మాదిరిగా పరాభవం ఎదురుకాకుండా చూసుకున్నారు. మరోవైపు తన తల్లి గతంలో పోటీ చేసి, విజయం సాధించిన రాయ్‌బరేలీ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేశారు.ఇక వయనాడ్ విషయానికొస్తే ముస్లిం, క్రైస్తవ ఓటర్లు అధికంగా ఉన్న ఈ లోక్‌సభ స్థానం సురక్షితమని రాహుల్ గాంధీ భావించారు. అలాగే అమేథీలో కన్నా రాయ్‌బరేలీలో పోటీ చేయడమే సరైనదని రాహుల్ నిర్ణయించుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌లో రాహుల్‌కు 7 లక్షల 6,000 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థికి కేవలం రెండు లక్షల నాలుగు వేల ఓట్లు మాత్రమే దక్కాయి.అయితే ఈసారి వయనాడ్‌లో పరిస్థితులు మారాయి. రాష్ట్రంలోని అధికార వామపక్ష కూటమి ఈసారి అభ్యర్థిని మార్చింది. ఈసారి బీజేపీ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య అన్నే రాజాపై రాహుల్ ఎన్నికల బరిలోకి దిగారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రాహుల్‌కు ఇండియన్ ముస్లిం లీగ్ మద్దతు ఉంది. అయితే ఇక్కడ బీజేపీ కూడా తన సత్తాను చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఒకవేళ రాహుల్ అటు వయనాడ్, ఇటు రాయ్‌బరేలీ రెండింటిలో గెలిస్తే రాయ్‌బరేలీని వదులుకుని, వయనాడ్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాలున్నాయని ప్రొఫెసర్ సంజయ్ గుప్తా అన్నారు. అయితే అటువంటి సందర్భం ఏర్పడినప్పుడు రాయ్‌బరేలీకి జరిగే ఉప ఎన్నికలో రాహుల్ సోదరి ప్రియాంక పోటీ చేసి, గాంధీ కుటుంబపు కంచుకోటకు కాపాడే ప్రయత్నిం చేస్తారని ఆయన తన అభిప్రాయం తెలిపారు. -
సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
ఎండలు చుర్రుమంటున్నాయి. ఒక్కటే దాహం, దాహం అన్నంతగా భగభగమంటోంది వాతావరణం. దీంతో శరీరం హైడ్రేట్‌గా ఉంచేందుకు చల్లటి పానీయాలు, పళ్ల రసాలు వెంట పరిగెడతారు అందరూ. ఐతే చాలామంది కొబ్బరినీళ్లు మంచివని. వాటికే ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ కొబ్బరి నీళ్లు రుచిగా ఉండటమేగాక తక్షణ శక్తిని అందిస్తాయి. అందువల్ల కొబ్బరి బోండాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే వేసవిలో కొబ్బరి బోండాలను కొనగానే నేరుగా తాగేస్తాం. అలా అస్సలు చేయకూడాదట. నేరుగా కొబ్బరి బొండం నుంచి నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణలు. అదేంటీ..?నిజానికి ఎండ వేడిలో వస్తూ రోడ్డుపై కొబ్బరి బోండాలు కనిపించగానే హమ్మయ్యా అనుకుని వెంటనే కొబ్బరి బోండాలు కొని నేరుగా తాగేస్తాం. అలా అస్సలు చేయకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బయటి వాతావరణం వేడిగా ఉంది. ఇక ఈ బోండాలు కూడా ఎంతసేపు ఈ వేడిలోనే ఉన్నాయన్నది తెలియదు. అందువల్ల అలా అస్సలు చెయ్యొద్దని చెబుతున్నారు. ఎందుకంటే వాటిని కుప్పలుగా వేసి విక్రయిస్తుంటారు. అలా చాలా రోజుల నుంచి లేదా చాల సేపటి నుంచి ఎండలో ఉండిపోవడంతో దానిలో ఒక రకమైన ఆకుపచ్చని ఫంగస్ వస్తుందట. అందువల్ల కొబ్బరి బోండాన్ని కొన్న వెంటనే నేరుగా స్ట్రా వేసుకుని తాగేయ్యకుండా..ఓ పారదర్శకమైన గాజు గ్లాస్లో వేయించుకుని తాగాలని అంటున్నారు. అందులో నీరు స్పష్టంగా, ఎలాంటి చెడు వాసన లేదని నిర్థారించుకుని తాగడం అనేది ముఖ్యం అంది. ఎందుకంటే ఈ ఎండల ధాటికి ఎలాంటివైనా తొందరగా పాడైపోతాయి. నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. అందువల్ల దాహం అంటూ ఆత్రతగా కొబ్బరి నీళ్లు తాగేయొద్దని సూచిస్తున్నారు. ఈ ఫంగస్ ఎలా వ్యాపిస్తుందంటే..ఆకు పచ్చని ఫంగస్ ఆహార పదార్థాల ఉపరితలాలపై వస్తుంది. అది ఆహార పదార్థాన్ని కుళ్లిపోయేలా చేయడం ద్వారా పోషకాలు పొందుతుంది. ఇది ఎగురుతూ ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. చాలా కఠినమైన వాతావరణంలో చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. తగినంత నీరు, సేంద్రియ పదార్థాలలో ఉన్న పదార్థాలపై ఇది పెరగడం ప్రారంభించి, నెమ్మదిగా మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..తీవ్రమైన అలెర్జీ, తుమ్ములు, ఎరుపు లేదా నీటి కళ్లు, చర్మంపై దద్దుర్లు, ముక్కులో దురద, కళ్ల నుంచి నీళ్లు రావడం. దగ్గు, శ్వాస ఆడకపోవడం, తదితర లక్షణాలు ఉంటాయి. ఈ ఫంగస్‌లో హానికరమైన మైకోటాక్సిన్‌లతో నిండి ఉంటాయి. ఇది తీవ్రమైన విషాన్ని కలిగిస్తుంది. కడుపు, మూత్రపిండం, కాలేయం వంటి వాటిల్లో అనేక సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి క్యాన్సర్ ప్రమాదానికి దారితీస్తుంది. నివారణ..ఆహార పదార్థాలను సరైన విధంగా నిల్వ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చు. తాజా పండ్లు, కూరగాయాలను మాత్రమే తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చుచెడిపోయే వస్తువులను ఫ్రిజ్‌లో అస్సలు ఉంచకండిగాలి చొరబడని కంటైనర్లలో ఆహార పదార్థాల్ని నిల్వ చేయాలి.కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎంత కాలం సురక్షితంగా ఉంటాయో తెలుసుకుని నిల్వ ఉంచడానికి యత్నించాలి.(చదవండి: నటుడు శ్రేయాస్ తల్పాడేకి గుండెపోటు..ఆ వ్యాక్సినే కారణమా..?) -
బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!
మన భారతదేశంలో బియ్యమే ప్రధాన ఆహారం. ఎన్ని వెరైటీ టిఫిన్లు తిన్నా.. నాలుగు మెతుకులు కడిపులో పడితేనే హాయిగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకు మంచి శక్తినిచ్చి ఎక్కువ సేపు పనిచేయగలిగే సామర్థ్యాన్ని అందించేది బియ్యం మాత్రమే. అలాంటి బియ్యాన్ని వండటానికి ముందు తప్పనిసరిగా కడగాల్సిందేనా? మరి నిపుణులు ఏమంటున్నారు..? ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన మంచి ఆహారం. కార్బోహైడ్రైట్లకు మూలం. పైగా శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పౌష్టికమైన ఆహారం కూడా. మనల్ని శక్తిమంతంగా ఉండేలా చేసేది, చక్కగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించి కసరత్తులు చేయడానికి తోడ్పడేది అయిన బియ్యంలో మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్, ఫైబర్, బీ విటమిన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాంటి బియ్యాన్ని వండడానికి ముందు కడగడం అవసరమా అంటే..? ఎందుకు కడగాలంటే.. నిపుణులు తప్పనిసరిగా బియ్యాన్ని వండటానికి ముందు కడగాల్సిందేనని చెబుతున్నారు. ఆర్సెనిక్ వంటి విష పదార్థాలు ఉంటాయని, అందువల్ల కడగాలని తెలిపారు. నానాబెట్టి కడగడం ఇంకా మంచిదని, దీనివల్ల ఆ బియ్యంలో ఉన్న ఆర్సెనిక్, మట్టి వంటివి నీటిలో కరిగి సులభంగా కరిగి బయటకి వెళ్లిపోతాయని అన్నారు. ఇలా చేస్తే ఆరోగ్యానికి హాని కలిగించే ధూళి, గులకరాళ్లు, మిగిలిపోయిన శిథిలాలు వంటి అవాంఛనీయ పదార్థాలు ఏమైనా ఉన్నా కడగడం వల్ల నీళ్ల ద్వారా బయటకు వెళ్లిపోయి బియ్యం చక్కగా క్లీన్ అవుతాయని పేర్కొన్నారు. ఇలా కడిగితే ఆ బియ్యంపై ఉండే పిండిలాంటి పదార్థం బయటకు పోయి అన్నం చక్కగా అతుక్కోకుండా పొడిపొడిగా ఉటుందని చెప్పారు. అలాగే ఇలా వాష్ చేస్తే మైక్రో ప్లాస్టిక్‌లను ఈజీగా తొలగించగలమని అన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక వ్యర్థాలు, మైనింగ్ కార్యకలాపాలు, బొగ్గును కాల్చడం వంటి వాటివల్ల భూగర్భజలాల్లోకి ఆర్సెనిక్ సులభంగా ప్రవేశిస్తుంది. పలితంగా భారీగా నీటి కాలుష్యం ఏర్పడుతుంది. అక్కడ నుంచి ఆ నీరు కాస్త పంట నీటి పారుదలకు, వంట కోసం ఉపయోగించే వాటిలోకి సరఫరా అవుతుంది. అందులోనూ వరి మరీ ఎక్కువగా ఆర్సెనిక్ కలుషితానికి గురవ్వుతుంది. ఎందుకంటే..? వరిపోలాలకు నీటి అవసరం ఎక్కువ, పైగా వరదల టైంలో ముంపునకు గురవ్వుతాయి కూడా. అలా.. ఈ ఆర్సెనిక్ వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఆర్సెనిక్ వల్ల వచ్చే సమస్యలు ఎరుపు లేదా వాపు చర్మం కొత్త మొటిమలు లేదా గాయాలు పొత్తికడుపు నొప్పి వికారం, వాంతులు అతిసారం అసాధారణ గుండె లయ కండరాల తిమ్మిరి వేళ్లు, కాలి జలదరింపు చర్మం నల్లబడటం గొంతు నొప్పి నిరంతర జీర్ణ సమస్యలు మొదలైనవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, దీర్ఘకాలిక లక్షణాలు మొదట చర్మంపై కనిపిస్తాయి. ఆ తర్వాత ఇలా బహిర్గతం అయిన ఐదు ఏళ్లలోపు అందుకు సంబంధించిన కేసులు, మరణాలు నమోదవ్వుతాయి. అందువల్ల ఆరోగ్యకరమైన, రుచికరమైన అన్నం తినాలనుకుంటే బియ్యాన్ని తప్పనిసరిగా శభ్రంగా కడగాలని నిపుణులు చెబుతున్నారు. గుర్తుంచుకోవలసిన విషయాలు.. ఆరోగ్యకరమైన, రుచికరమైన అన్నం తయారీకి గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు వంటి వారు గ్లూకోజ్ కంటెంట్ తక్కువగా ఉండాలనుకుంటే.. నానాబెట్టి చక్కగా కడిగి వండుకోవాలని సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునేవారు బ్రౌన్ రైస్ వంటి వాటిని తినండి. బ్రౌన్‌రైస్ వైట్‌రైస్ కంటే ఎక్కువ ఫైబర్, ప్రోటీన్లను కలిగి ఉంటుంది. (చదవండి: జైల్లో బరువు తగ్గిన కేజ్రీవాల్:మధుమేహం కారణమా?) -
ఏకంగా 26 కిలోల బరువు తగ్గి షాకిచ్చిన ‘మిస్టర్ పెర్ఫెక్ట్’!
నటించే పాత్రకు తగ్గట్టు పరకాయ ప్రవేశం చేయడం నటుల ప్రాథమిక లక్షణం. కట్టూ బొట్టు, ఆహార్యం ఇలా అన్నింటిలోనూ ఆ పాత్రకు న్యాయం చేసేందుకు నటీనటులు చాలా కష్టపడతారు. ప్రేక్షకులని అలరించేందుకు ఎంతో రిస్క్ చేసి మరీ తమ బాడీని మలచుకుంటారు. అలాంటి వారిలో తాజాగా రణదీప్ హుడా మరోసారి ప్రత్యేకంగా నిలిచాడు. 'స్వతంత్ర వీర్ సావర్కర్' బయోపిక్ కోసం విపరీతంగా బరువు తగ్గి తన లుక్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. పాత్రకు తగ్గట్టు శరీరాన్ని, ఆహార్యాన్నిమార్చుకోవడంలో రణదీప్ ప్రత్యేకతే వేరు.అందుకే రణదీప్ హుడాను హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ బాలేతో పోల్చుతారు. 2016లో సరబ్జిత్ సినిమా కోసం 20 కిలోలు, అదే ఏడాది దో లఫ్జోన్ కి కహానీ సినిమా కోసం తన బరువును 77 కిలోల నుంచి 94 కిలోలకు చేరేలా కష్టపడ్డాడు. విలక్షణ శైలితో విమర్శకుల ప్రశంసలు పొందిన నటుడాయన. 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' నుంచి సరబ్జిత్ సింగ్, ఇపుడు వీర సావర్కర్ దాకా పాత్రల్లో జీవించే ప్రతిభావంతుడైన నటుడు. సోదరి డా. అంజలి సాయం తాజాగా స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రంలో వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్రను పోషించాడు. ఈ పాత్రకోసం రణదీప్ ఏకంగా 26 కిలోల బరువు తగ్గాడు. సెల్యులార్ జైల్లో ఉన్నప్పుడు 'కాలా పానీ' పాత్ర సజీవంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నాడు. రణదీప్ హుడా సోదరి, డాక్టర్ అంజలి సాయం తీసుకున్నాడట. ఆమె రూపొందించిన పాలియో డైట్‌తో బక్క చిక్కిన దేహంతో ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేశాడు. నిపుణుల సమక్షంలో పాలియో డైట్ సోదరి డాక్టర్ అంజలి హుడా వృత్తిరీత్యా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అని,తన కోసం పాలియో డైట్‌ను రూపొందించిందని స్వయంగా రణదీప్ హుడా వెల్లడించాడు. వివిధ దశలలో గుడ్లు, నట్స్, ఖర్జూరాలు , డార్క్ చాక్లెట్లు డైట్ చేర్చుకున్నానని తెలిపాడు. దీంతోపాటు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా ఐదు రోజుల వ్యవధిలో 6-7 కిలోల బరువు తగ్గాననీ, ఈ జర్నీలో విటమిన్ సప్లిమెంట్లను కూడా తీసుకున్నానని చెప్పాడు. నిపుణుల పర్యవేక్షణలోనే ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు. పెర్ఫెక్ట్గా ఉండటమే తనకిష్టమని తెలిపాడు. ఖర్జూరం, పాలుతో బరువు తగ్గుతారు అనేది ఫేక్ న్యూస్ అని కూడా చెప్పాడు. అంతేకాదు ఈ సినిమాకు దర్శకుడిగా రణదీప్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. మార్చి 22 న ఈ మూవీ విడుదలైంది. -
వాటర్ బాటిల్లోని నీరు ఎన్నాళ్లకు పాడవుతుంది?
నదిలో పారేనీరు నిత్యం శుభ్రంగా ఉంటుందని అంటారు. అయితే క్లోజ్డ్ బాటిల్లోని నీటికి గడువు తేదీ ఉంటుందా? అయితే ఆ నీరు ఎప్పుడు చెడిపోతుంది? దాని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎప్పుడో ఒకప్పుడు వాటిర్ బాటిల్‌పై గడువు తేదీని చూసేవుంటాం. ఒక నివేదిక ప్రకారం వాటిర్ బాటిల్లోని నీటిని దాని ప్యాకింగ్ తేదీ నుంచి రెండేళ్లపాటు వినియోగించవ్చు. బాటిల్లోని ప్లాస్టిక్ నెమ్మదిగా నీటిలో కరగడం ప్రారంభిస్తుందని, అందుకే రెండేళ్ల తర్వాత ఆ నీరు తాగడానికి పనికిరాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవానికి వాటర్ బాటిల్ గడువు తేదీ దానిలోని నీటికి సంబంధించినది కాదు. బాటిల్ గడువు తేదీ అని దాని అర్థం. వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం పంపు నీటిని ఆరు నెలల పాటు నిల్వ చేయవచ్చు. ఆ నీటిని ఉపయోగించవచ్చు. అయితే కార్బోనేటేడ్ పంపు నీరు రుచి క్రమంగా మారుతుంది. ఎందుకంటే దానిలో నుంచి గ్యాస్ నెమ్మదిగా బయటకు వస్తుంది. గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ నీటిలో కలిసిన తర్వాత, అది కొద్దిగా ఆమ్లంగా మారుతుంది. అయితే కంటైనర్లను ఆరు నెలల పాటు చల్లని, పొడి, చీకటి ప్రదేశంలో ఉంచినట్లయితే ఆ నీటి రుచి ఎప్పటికీ మారదు. కంటైనర్లలో నీటిని నింపేటప్పుడు పైపులను నేరుగా ఉపయోగించకూడదని నిపుణులు చెబుతుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా ఫిల్టర్‌ను వాడాలని సూచిస్తుంటారు. ఆ నీటికి గాలి తగలకుండా ఉండేందుకు ఒక మూతను ఉంచాలి. నీటిని నిల్వ చేయడానికి మరొక మార్గం కూడా ఉంది. నీటిని సుమారు 15 నిమిషాలు మరిగించి, ఆ తరువాత చల్లబరిచి నిల్వ చేయవచ్చు. -
టోపీ, హెల్మెట్లు వల్ల బట్టతల వస్తోందా? నిపుణులు ఏమంటున్నారంటే..
చాలామంది తలకు టోపీ ధరిస్తారు. కొందరూ యువకులు ఫ్యాషన్‌గా ధరించగా మరికొందరూ ఎండ నుంచి రక్షణ కోసం పెట్టుకుంటారు. ఇక హెల్మెట్లంటారా బండి డ్రైవ్ చేయాలంటే తప్పదు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం హెల్మట్ తప్పనసరిగా ధరించాల్సిందే. వెనుక కూర్చొన్నవాళ్లు కూడా పెట్టుకోవాల్సిందే. అయితే ఇవి తలకు పెట్టడం వల్లే జుట్టు ఊడిపోతోందని చాలా మంది అనుకుంటారు. అవి పెట్టడం వల్ల తలలో చెమట పట్టి త్వరితగతిన జుట్టు రాలి బట్టతల వస్తుందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఇది ఎంతవకు నిజం?. నిజంగానే టోపీ, హెల్మెట్లు ధరిస్తే బట్టతల వస్తుందా? అయితే వైద్యుల మాత్రం అదంతా అపోహ అని తేల్చి చెబుతున్నారు. టోపీలు పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోదని వైద్యులు చెబుతున్నారు. బట్టతల రావడానికి అనేక కారణాలు ఉంటాయని దానికి, ఈ టోపీలకు ఎలాంటి సంబంధం లేదని వివరిస్తున్నారు. టోపీలు పెట్టుకోవడం వల్ల జుట్టుకు రక్షణ లభిస్తుందే తప్ప ఎలాంటి సమస్యలు ఉండవని అన్నారు. అలాగే ఆరుబయట ఎండలోకి వెళ్ళినప్పుడు... ఆ ఎండకి మాడు వేడెక్కిపోతుంది. అలా వేడెక్కకుండా ఉండడం కోసమే టోపీని ధరిస్తూ ఉంటారు. అంతే తప్ప టోపీ వల్ల జుట్టు రాలిపోవడం జరగదు. అలా అని మరీ బిగుతుగా ఉండే టోపీలు వాడకపోవడమే మంచిది. కాస్త జుట్టుకు గాలి తగులుతూ ఉండడం చాలా అవసరం. జుట్టు తీవ్రంగా రాలిపోవడానికి, బట్టతల రావడానికి టోపీ ఏనాటికే కారణం కాదని అన్నారు నిపుణులు. ఇక హెల్మట్లు కూడా మన రక్షణ కోసం ట్రాఫిక్ నిబంధనల ప్రకారం తప్పనసరిగా ధరించాల్సిందే. అయితే దీనికి జుట్టు రాలడానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు. తలకు సరిపడ హెల్మట్ ధరించండి, దీంతోపాటు అదే పనిగా తలపై హెల్మెట్ ధరించకండి అంటే మధ్య మధ్యలో తీస్తు కాస్త తలకు భారం తగ్గించమంటున్నారు. అలాగే లాంగ్ డ్రైవ్ చేసేవాళ్లు కూడా విరామం తీసుకుంటూ వెళ్లండని సూచిస్తున్నారు నిపుణులు ఎందుకు రాలిపోతుందంటే.. హఠాత్తుగా జుట్టు రాలిపోతే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఒక్కొసారి కొన్ని వ్యాధులకు ఇది సంకేతం కూడా కావొచ్చు. దీంతోపాటు మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లను ఉంటే వాటిని మానేసేందుకు ప్రయత్నించాలి. అలాగే తండ్రికి బట్టతల ఉన్నా... భవిష్యత్తులో కొడుకులకు, మనవళ్లకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాగే హార్మోన్లలో హఠాత్తుగా విపరీతమైన మార్పులు వచ్చినా కూడా జుట్టు రాలిపోతుంది. ఇవిగాక గర్భ నిరోధక మాత్రలు వాడే మహిళల్లో హార్మోన్ల మార్పులు అధికంగా వస్తాయి. ఇలాంటి వారికి కూడా వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. అంతేగాక వాతావరణ కాలుష్యం వల్ల కూడా జుట్లు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడే మహిళలు, పురుషల్లో జుట్టు ఎక్కువగా ఊడిపోయే అవకాశం ఉంది. జుట్టు చక్కగా పెరగాలంటే.. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. సమయానికి నిద్రపోవడం, సమయానికి తినడం చాలా ముఖ్యం. మీ జీవన శైలి ఎంత ఆరోగ్యకరంగా ఉంటే జుట్టు కూడా అంతే బలంగా పెరుగుతుంది. వ్యాయామం చేయడం వల్ల తలకు రక్తప్రసరణ జరిగి జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి. తత్ఫలితంగా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు రాలుతున్నప్పుడే వైద్యులను సంప్రదిస్తే సమస్యను అధిగమించొచ్చు. చాలా జుట్టు కోల్పోక ముందే వైద్యలను సంప్రదించడం మంచిది. అంతేగాక జుట్టు మురికి పట్టకుండా వారానికి మూడుసార్లు తల స్నానం చేయాలి. ఎప్పటికప్పుడూ నూనెలతో మర్దనా చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. అందంగా ఉంటుంది. (చదవండి: పెదవులు గులాబీ రేకుల్లా మెరవాలంటే ఇలా చేయండి!) -
AI: త్వరలోనే ‘ఏఐ’తో ఆ ముప్పు!
కాలిఫోర్నియా: కీడెంచి మేలు ఎంచాలంటారు పెద్దలు. కానీ జనరేటివ్ ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విషయంపై అందరూ చేస్తోంది దాంతో వచ్చే మేళ్ల గురించిన చర్చే. ఈ అత్యాధునిక టెక్నాలజీతో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై ఎవరూ ఆలోచించడం లేదు. అయితే మెషిన్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఎలిజర్ యడ్కోవ్‌స్కీ మాత్రం ఈ కోణంలో ఆలోచించి మానవాళికి ఏఐతో ఏ రేంజ్లో ముప్పు పొంచి ఉందో చెబుతున్నాడు. గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐకి సంబంధించి యడ్కోవ్‌స్కీ ఒక సంచలన విషయం వెల్లడించాడు. మరో రెండేళ్లు లేదంటే ఐదేళ్లు, మరీ అడిగితే ఓ పదేళ్లు మాత్రమే మానవాళికి మిగిలి ఉన్న గడువని చెప్పాడు. మిగిలిన గడువు అని యడ్కోస్కీ వాడిన పదానికి ఆయనను ఇంటర్వ్యూ చేసిన టామ్ లామంట్ అర్థం చెప్పే ప్రయత్నం చేశాడు. టర్మినేటర్, మ్యాట్రిక్స్ సినిమాల్లో చూపించినట్లు మెషీన్లతోనే అంతం అని లామంట్ వివరించాడు. భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోతాయని చాలా మంది ఏఐని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే యడ్కోవ్‌స్కీ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఏఐతో ఏకంగా మానవాళికే ముప్పు అని అతని స్టైల్లో హెచ్చరించాడు. గతంలోనూ డేటా సెంటర్ల విషయంలో బాంబింగ్ డేటా సెంటర్లనే పదాన్ని ఈయన వాడాడు. అయితే దీని విషయంలో కొద్దిగా పునరాలోచనలో పడ్డానని కూడా అతడే తర్వాత చెప్పడం గమనార్హం. ఇదీ చదవండి.. సొంత దేశంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు -
ఆ విగ్రహం శ్రీవెంకటేశ్వరుడిది కావచ్చు: డా. పద్మజ దేశాయ్
రాయచూరు-తెలంగాణ సరిహద్దులోని శక్తి నగర్ సమీపంలో కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా జరిగిన తవ్వకాల్లో కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. ముఖ్యంగా శివ లింగం శ్రీకృష్ణుని దశావతార విగ్రహాలను సురక్షితంగా బయటకు తీసిన సంగతి తెలిసిందే. అయతే రాయచూర్ యూనివర్శిటీలోని చరిత్ర, పురావస్తు శాఖ అధ్యాపకులు డాక్టర్ పద్మజ దేశాయి ఏమంటున్నారంటే..! "రాయచూరు, హంపి పరిసరాల్లోని 30 గ్రామాల్లో ప్రాచీన దేవాలయాలపై పీహెచ్డీ చేశాను నేను. కృష్ణ నదీ తీరంలో బయటపడ్డ ఈ విష్ణుమూర్తి విగ్రహం 11వ శతాబ్ధానికి చెందినది కావచ్చునని, కళ్యాణ చాళుక్యుల కాలంలో తయారైందని ప్రాథమిక అంచనా ఉంది. కచ్చితమైన కాలావధి కావాలంటే కార్బన్ డేటింగ్ వంటివి నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో తాము పలు విగ్రహాలు చూశామని గ్రామస్తులు పలుమార్లు చెప్పేవారు. తాజాగా నదిలో నీటిమట్టం తక్కువగా ఉండటం వల్ల కొన్ని విగ్రహాలు అందరికీ కనిపించాయి. పైగా అయోధ్య రామ మందిరం గురించి దేశవ్యాప్తంగా ప్రచారం కావడం, అక్కడి రామ్ లల్లా విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి యోగిరాజ్ చెక్కడం వంటి నేపథ్యంలో రాయచూరుకు సమీపంలో బయటపడ్డ విగ్రహాన్ని చాలామంది రామ్ లల్లా విగ్రహంతో పోల్చి చూశారు. అయితే నా అంచనా ప్రకారం ఈ విగ్రహం వెంకటేశ్వరుడిది అయ్యేందుకు అవకాశముంది. ఎందుకంటే విగ్రహం దొరికిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు కావడం.. ఈ ప్రాంతంలో వెంకటేశ్వరుడి ఆరాధన ఎక్కువగా ఉండటం. అంతేకాదు.. విగ్రహ లక్షణాలను గమనిస్తే దీనిపై శంఖు, చక్రాలు అన్నాయి. తిరుపతి వెంకటేశ్వరుడి మాదిరిగానే అభయ, వరద హస్తాలు ఉన్నాయి. కళ్యాణ చాళుక్యుల కాలంలో అటు శైవారాధనతోపాటు వైష్ణవారాధన కూడా జరిగేది. ఇందుకు తగ్గట్టుగా ఈ విష్ణుమూర్తి విగ్రహం బయటపడ్డ ప్రాంతంలోనే శివలింగమూ లభించింది. ఇంకో విషయం.. ఈ విగ్రహాలు బయటపడ్డ చోట ఆలయం లాంటివి ఏమీ లేవు.’’ - డాక్టర్ పద్మజ దేశాయి, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ లెక్చరర్,రాయచూర్ యూనివర్శిటీ. -
ఎగ్స్‌ని ప్రిజర్వ్ చేసుకుని ఐదారేళ్ల తర్వాత పిల్లల్ని కనొచ్చా?
నాకిప్పుడు 32 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లవుతోంది. నా కెరీర్ వల్ల పిల్లలను ప్లాన్ చేసుకోవడం లేట్ అవుతోంది. ఒకవేళ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్‌కి వెళితే.. ఇప్పటికిప్పుడు నా ఎగ్స్‌ని ప్రిజర్వ్ చేసుకుని ఒక అయిదారేళ్ల తర్వాత పిల్లల్ని కనాలనుకుంటే సాధ్యమేనా? అప్పటికీ ఎగ్స్ ఇంతే క్వాలిటీతో ఉంటాయా? ప్రెగ్నెన్సీ క్యారీ చేయడంలో అయిదారేళ్ల తర్వాత నా ఏజ్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే చాన్సెస్ ఉన్నాయా? నా డౌట్స్ క్లియర్ చేయగలరు. మీ ఆన్సర్స్ మీదే నేను పిల్లలను ప్లాన్ చేసుకోవడం డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే నా హజ్సెండ్ సహా మా ఇంట్లో వాళ్లంతా ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ని ఒప్పుకోవట్లేదు. పేరు, ఊరు రాయలేదు. ఎగ్ ఫ్రీజింగ్ని oocyte cryopreservation అంటారు. ఈ ప్రొసీజర్‌లో అండాశయాల నుంచి అండాలను తీసి ఫ్రీజ్ చేసి అన్ఫర్టిలైజ్డ్ స్టేట్‌లో ఉంచుతారు. భవిష్యత్‌లో గర్భందాల్చాలి అనుకున్నప్పుడు ఆ ఎగ్స్‌ని ఫర్టిలైజేషన్కి ఉపయోగించి.. ఐవీఎఫ్ ద్వారా గర్భందాల్చేలా చేస్తారు. ఇంతకుముందు 38–40 ఏళ్ల స్త్రీలు ఈ ప్రక్రియను ఎక్కువగా ఉపయోగించుకునేవాళ్లు. కానీ ఇప్పుడు జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల చాలామంది అమ్మాయిల్లో oocyte క్వాలిటీ చాలా త్వరగా తగ్గిపోతోంది. ఇప్పుడు 30–35 ఏళ్లక్కూడా ప్రెగ్నెన్సీ వద్దు అనుకునేవాళ్లు ఈ ప్రక్రియ ద్వారా ఆరోగ్యకరమైన అండాలను ఫ్రీజ్ చేసుకునే సౌకర్యాన్ని చాలా ఆసుపత్రులు కల్పిస్తున్నాయి. ఇలా ఫ్రీజ్ చేసిన అండాలను పదేళ్ల వరకు ఉపయోగించుకోవచ్చు. అయితే 35 ఏళ్లు దాటితే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ పెరుగుతాయి. కాబట్టి దీన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకాదు ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలోనూ కొన్ని రిస్క్స్ ఉన్నాయి. ఫ్రోజెన్ ఎగ్స్ cryo freezing ప్రాసెస్‌లో కొన్నిసార్లు డామేజ్ కావచ్చు. కంటామినేషన్ రిస్క్ కూడా ఉంటుంది. అండాశయాల నుంచి అండాలను తీసే సమయంలో ఆ ప్రక్రియకు సంబంధించి అంటే బవెల్ గాయపడడం, రక్తనాళాలు గాయపడడం వంటి రిస్క్స్ కూడా ఉండొచ్చు. ఎక్కువ అండాలను తీయడానికి ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్స్కి కొంతమందికి పొట్టలో నొప్పి, ఛాతీ నొప్పి రావచ్చు. వీటిని మందులతో తగ్గించవచ్చు. ఇలాంటి కాంప్లికేషన్స్ 5 శాతం కేసెస్‌లో కనపడతాయి. 0.1 శాతం కేసెస్‌లో బ్లడ్ క్లాట్స్, చెస్ట్ ఇన్ఫెక్షన్ వంటివాటితో కాంప్లికేషన్స్ తీవ్రంగా ఉంటాయి. బిడ్డకు బర్త్ డిఫెక్ట్స్ విషయానికి వస్తే.. నేచురల్ ప్రెగ్నెన్సీలో ఎంత శాతం రిస్క్ ఉంటుందో ఫ్రోజెన్ ఎగ్స్‌తో వచ్చే ప్రెగ్నెన్సీలోనూ అంతే రిస్క్ ఉంటుంది. అదనంగా ఏమీ ఉండవని అధ్యయనాల్లో ప్రూవ్ అయింది. ఫ్రోజెన్ ఎగ్స్‌తో ప్రెగ్నెన్సీ 30 – 60 శాతం వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా ఎగ్ ఫ్రీజింగ్ సమయంలోని మీ వయసు మీద ఆధారపడి ఉంటుంది. --డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: 'ర్యాట్ బ్రేక్ ఫాస్ట్'! ఈ పద్ధతిలో తింటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు!) -
బిడ్డ పుట్టినట్టు, ఏడుస్తున్నట్టు కల వస్తే.. అపశకునమా!
నిద్రలో కలలు అందరికీ వస్తుంటాయి. రకరకాల కలలు. కొన్ని అస్పష్టంగా, అల్లిబిల్లిగా అల్లుకుంటాయి. మరి కొన్ని కళ్లముందే జరిగినట్టు చాలా స్పష్టంగా గుర్తు ఉంటాయి. సాధారణంగా వాటిని చాలావరకు మరచిపోతాం. ఒక్కోసారి అస్సలు పట్టించుకోం. డ్రీమ్ సైన్స్ ప్రకారం మన మనసులోని భావాలకు, మన జీవితంలోని అంశాలకు కలలు ప్రతిరూపాలట. కొన్ని కలలు మర్చిపోనీయకుండా వెంటాడుతుంటాయి. ఎవరితోనో పెళ్లి జరిగిపోతున్నట్టు, ఏదో కొండలోయల్లోకి జారిపోతున్నట్టు, ఎంత పరిగెత్తాలన్నా పరిగెత్తలేక నిస్సత్తువగా ఉన్నట్టు కల వస్తూ ఉంటాయి. ఉలక్కి పడి లేచి ..హమయ్య కలే కదా అనుకుంటాం. కానీ కొన్ని మాత్రం మనల్ని కుదురుగా ఉండనీయవు. అలా ఎలా? అనుకుంటూ ఉంటాం. నిజానికి మన జీవితంలో మనం చేసేది, చేయలేనిది మన కలలో మాత్రమే కనిపిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో బిడ్డకు జన్మనిస్తే, దాని అర్థం ఏమిటి? అనే దాన్ని పరిశీలిస్తే.. కలలో బిడ్డ పుట్టడం, ఏడ్వటం ప్రొఫెషనల్ డ్రీమ్ అనలిస్ట్ , రచయిత లారీ క్విన్ లోవెన్‌బర్గ్ ప్రకారం, శిశువు కలలో కనిపిస్తే కొత్త ప్రారంభానికి సూచిక. చేస్తున్న పనిలో పెరుగుదల లేదా అభివృద్ధిని సూచించే సానుకూల సంకేతమని లోవెన్‌బర్గ్ చెప్పారు. ఒకవేళ బిడ్డ ఏడుస్తున్నట్టు, అలా వదిలేసినట్టు కల వస్తే.. చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు. పాప ఏడుపు ఆపకుండా, డ్రీమ్ బేబీ అసహనంగా ఏడుస్తుంటే జీవితంలో కొత్త విషయం లేదా కొంత అంశం మీ దృష్టి అవసరమనేదానికి సూచన అని లోవెన్‌బర్గ్ వివరించాడు. స్వప్న శాస్త్రం ప్రకారం మీరు కలలో పుట్టిన బిడ్డను చూసినట్లయితే అది శుభసూచకమట. మన జీవితంలో కొత్త అదృష్టం ప్రకాశించబోతోంది అని అర్థమట. జీవితంలో చాలా ఆనందం ,సంపద వస్తాయని భావిస్తారు. వెల్.. చెడు అంటే భయపడాలిగానీ, కొత్త సంతోషంగా వస్తోంది అంటే ఆనందమేగా! నిజానికి శతాబ్దాలుగా కలలపై పరిశోధనలు జరుగుతున్నాయి. నాగరితక ఆరంభంలో భూలోక ప్రపంచం , దేవతల మధ్య కలలను ఒక మాధ్యమంగా భావించేవారు. వాస్తవానికి, కలలకు కొన్ని ప్రవచనాత్మక శక్తులు ఉన్నాయని గ్రీకులు , రోమన్లు విశ్వసించేవారు. పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకు సిగ్మండ్ ఫ్రాయిడ్ , కార్ల్ జంగ్ కలలు కనడం గురించి విస్తృతంగా తెలిసిన కొన్ని ఆధునిక సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు. తీరని కోరికలు ప్రతిరూపం కలలని ఫ్రాయిడ్ అంటే, కలలకు మానసిక ప్రాముఖ్యత ఉందంటాడు కార్ల్ జంగ్ అంటాడు. కానీ వాటి అర్థం గురించి భిన్నమైన సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. న్యూరోబయోలాజికల్ సిద్ధాంతంప్రకారం అసలు కలలకు అర్థం లేద. అవి మన జ్ఞాపకాల నుండి యాదృచ్ఛిక ఆలోచనలు ఎలక్ట్రికల్ బ్రెయిన్ ఇంపల్షన్స్ మాత్రమే. ఏ కల అయినా శుభమా? లేదా అశుభమా? అనేదాన్ని పక్కన పెట్టి.. ఆ కలల్ని మన జీవితంతో అన్వయం చేసుకొని సమీక్షించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు.అర్థం పర్థంలేని కలల గురించి ఊరికే టెన్షన్ పడి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం కంటే అలా వదిలేయడమే బెటర్. -
బంగాళదుంప Vs చిలగడ దుంప: డయాబెటీస్ పేషెంట్లకు ఏదీ మంచిది?
మారుతున్న జీవనశైలి కారణంగా మనదేశంలో డయాబెటీస్ రోగులు అంతకంతకు పెరిగిపోతున్నారు. ఇది ఒక దీర్ఘకాలికి సైలంట్ కిల్లర్ వ్యాధి. నెమ్మదిగా శరీర భాగాల పనితీరుని దెబ్బతీస్తుంది. అప్రమత్తతతో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం డేంజర్లో ఉన్నట్లే. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉండే ఆహారం తీసుకోవడమే మంచిది. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదా కాదా అన్న సందేహం వస్తుంది. ముఖ్యంగా దుంప జాతికి సంబంధించిన చిలగడ దుంపలు, బంగాళ దుంపల విషయంలో చాలామందికి ఈ డౌటు వస్తుంది. అయితే ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే.. ముఖ్యంగా ఈ రెండిటీ విషయంలోనే ఎందుకూ అందరూ తినొచ్చా? వద్దా? అన్న డౌటు పడుతున్నారంటే.. ప్రధాన కారణం రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటమే. ఇవి రెండు భూమిలోనే పెరుగుతాయి. ఇక చిలగ దుంప తియ్యగా కూడా ఉంటుంది. దీంతో బాబోయ్! అని వాటి జోలికి కూడా పోరు షుగర్ పేషెంట్లు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం చిలగడ దుంపలను బేషుగ్గా తినండి అని చెబుతున్నారు. ఎందుకంటే? గ్లైసెమిక్ ఇండెక్స్ బంగాళదుంపలోనూ చిలగడదుంపల్లోనూ వేర్వురుగా ఉంటుందట. అందులో బంగాళదుంపలకు సంబంధించిన కొన్ని జాతుల్లో మరీ వ్యత్యాసం ఉంటుందట. అయితే చిలగడదుంపల్లో ఫైబర్‌తో కూడి ఉంటాయి. పైగా గ్లైసెమిక్ కంటెంట్ కూడా చాలా తక్కువే. ఇందులో ముఖ్యంగా అధిక ఫైబర్ తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ ఉంటాయని అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు చిలగడ దుంపలు తీసుకోవడమే మేలని సూచిస్తున్నారు. బంగాళ దుంపలను వండుకుని తీనే తీరుని బట్టి డయాబెటీస్ రోగులకు మంచి షోషకాహారంగా ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే? ఉడకబెట్టిన బంగాళదుంపలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉంటుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. అదే వాటిని డీప్ ఫ్రై లేదా ఇతరత్ర విధానంలో ఫ్రై వంటి కూరల్లా చేసుకుంటే మాత్రం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. అలాగే చిలగ దుండపలను చక్కగా ఉడకబెట్టుకుని ఏదైనా ప్రోటీన్ మూలంతో తినడం మంచిదని అంటున్నారు. అమ్మో అవి స్వీట్‌గా ఉంటాయన్న భయం ఉంటే..కనీసం ఆ స్వీట్ పొటాటోని ఉకడబెట్టి వాటిపై దాల్చిన పొడి జల్లుకుని తీసుకున్న మీ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయని చెబుతున్నారు. అలాగే బంగాళదుంపల్లో పోటాషియం అధికంగా ఉండటమే గాక కొన్నిరకాల బీ కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ రెండిటిని మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. అంతేగాదు ఈ దుంపలు కార్బోహైడ్రేట్ వర్గంలోకి వస్తాయి కూరగాయాల కిందకి రావని అర్థం చేసుకోండని హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి తినేటప్పుడూ చీజ్, ఆయిల్ వంటి ఇతరత్ర కొలస్ట్రాల్‌తో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక్కడ కార్బోహైడ్రేట్ అనేది శక్తి వనరుగా శరీరానికి అత్యంత అవసరమైనదని గుర్తించుకోవాలి. దాన్ని సమతుల్యంగా తీసుకుంటే ఎలాంటి సమ్య ఉండదని చెబుతున్నారు నిపుణులు గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే ఇస్తున్నాం. పాటించే మందు మీ ఆరోగ్య స్థితిని దృష్టిలో ఉంచుకుని మీ వ్యక్తిగత వైద్యులు లేదా డైటీషియన్లన సలహాలు సూచనలతో ఫాలో అవ్వడం మంచిది. (చదవండి: కృష్ణఫలం గురించి విన్నారా? తింటే బొలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
జనరేటివ్ ఏఐతో కొత్త ఉద్యోగాలు
న్యూఢిల్లీ: జనరేటివ్ ఏఐ (కృత్రిమ మేథ)పై ప్రభుత్వ పెట్టుబడులు, ప్రోత్సాహకాలు, ఓపెన్‌సోర్స్ కంటెంట్ అన్నవి దేశంలో ఉపాధి కల్పనను మరింత పెంచుతాయని, అసమానతలను తగ్గిస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘‘జనరేటివ్ ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది. పరిమిత నైపుణ్యాలున్న వారు సైతం ఉన్నత శ్రేణి ఉద్యోగాలను నిర్వహించేందుకు సాయపడుతుంది. ఇది ఆర్థిక అసమానతలను తగ్గిస్తుంది’’అని ఐఎంటీ ఘజియాబాద్ డైరెక్టర్ విశాల్ తల్వార్ అభిప్రాయపడ్డారు. ఇందుకు బలమైన మౌలిక వసతుల కల్పన అవసరమంటూ.. రానున్న బడ్జెట్లో ఇందుకు ప్రత్యే కేటాయింపులు చేయాలని జెనరేటివ్ ఏఐపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో తల్వార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, వ్యాపార విద్య రూపాంతరంపై కీలకంగా చర్చించారు. భారత్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఏఐ కార్యక్రమాలు, ఏఐ మిషన్‌తో ఏఐ ఆధారిత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన విషయంలో దేశం గణనీయమైన పురోగతికి సిద్ధంగా ఉందని తల్వార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. టెక్నాలజీ పరంగా మరింత ముందుకు వెళ్లడమే కాకుండా, వేగంగా మారిపోతున్న ఉద్యోగ ముఖ చిత్రంలో వ్యక్తుల నైపుణ్యాలకు సాధికారతను జనరేటివ్ ఏఐ తీసుకొస్తుందన్నారు. భారత కంపెనీలు ఇప్పటికే రూపొందించిన టూల్స్, ప్లాట్‌ఫామ్‌ల సాయంతో జనరేటివ్ ఏఐ విభాగంలో కీలక పాత్ర పోషించగలవని ఇదే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెషర్ మోహాంబిర్ సావ్నే పేర్కొన్నారు. -
క్యాన్సర్ కాదని తేలిగ్గా కొట్టిపడేసే సీరియస్ సంకేతాలేంటంటే..?
గుండె జబ్బులు తర్వాత అత్యంత ప్రమాదకరమైన వ్యాధులో క్యాన్సర్ ఒకటి. దీని కారణంగా 2020లో దాదాపు 10 మిలయన్ల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు, ప్రోస్టేట్ తదితర క్యాన్సర్లతో మరణించిన వారి సంఖ్యే ఎక్కువ. చాలా వరకు ఈ వ్యాధులను నిర్థారించడంలో రోగి జాప్యం ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు వైద్యులు. క్యాన్సర్ లక్షణాలు కొన్నిసార్లు అంత తేలిగ్గా బయటపడవు. మరికొన్ని సార్లు మనమే ఏదో సమస్య ఉంది అనిపిస్తున్నా సాధారణమైనదిగా భావించి కొట్టిపరేస్తాం. అలా నిర్ల్యంగా కొట్టిపరేసే క్యాన్సర్‌కి సంబంధించిన సీరియస్ సంకేతాలు ఏంటంటే.. అమెరికన్ సోసైటీ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ శరీరంపై శ్రద్ధ వహిచక తప్పదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని లక్షణాలు మిస్ అయినప్పటికీ మరికొన్ని ప్రతి ఒక్కరికి తెలుస్తాయని అన్నారు. అవేంటంటే.. ఎముకల్లో నొప్పి, వాచిన.. ముఖ్యంగా అదే పనిగా ఎముకలు నొప్పిగా లేదా కదపలేనట్లు అనిపించినప్పుడు. భరించలేని నొప్పి ఉండి ఆ ప్రాంతంలో వాచినా అది ఎముకల క్యాన్సర్‌కి సంకేతం. ఇంకొకవ విషయం ఏంటంటే క్రమేణ నొప్పి తీవ్రమై రాత్రి వరకు కొనసాగుతుంది. ఇలా ఉంటే తక్షణమే చెకప్ చేయించుకోవాలి. మింగడంలో ఇబ్బంది.. ఇక ఆహారం మింగడంలో ఇబ్బంది ఉన్నా, కడుపు నిండిన అనుభూతి కలిగిన తేలిగ్గా తీసుకోవద్దు. వేగంగా తిన్నప్పుడు మింగడంలో వచ్చే ఇబ్బంది వేరు తరుచుగా మింగడంలో ఇబ్బంది రావడం వేరని నిపుణులు అంటున్నారు. తగినంతగా నమలకపోవడం వల్లే వచ్చే సమస్య కూడా వేరుగా ఉంటుంది. అసధారణ రీతీలో మింగడంలో వచ్చే నొప్పి ఎసోఫాగియల్ క్యాన్సర్‌కి సంకేతం అని చెబుతున్నారు. మొదటి స్టేజ్‌లో గుర్తిస్తే సాధారణ క్యాన్సర్‌లా నయం చేయొచ్చే లేదంటే ప్రమాదమేనని తెలిపారు. దద్దర్లు లేదా ఎలర్జీ.. శరీరంపై దద్దర్లు వచ్చిన నిర్లక్ష్యం చేయొద్దు. అలెర్జీలు, ర్యాష్‌లు అనేకరకాల వ్యాధులకు సంకేతమట. లుకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఇలానే కనిపిస్తాయట. అంతేగాదు అసాధారణ రక్త కణాలు ప్లేట్లెట్ల ఉత్పత్తికి అంతరాయం కలిగి చర్మంలోకి లీక్ అవ్వకుండా కేశనాళికలని నిరోధించడంతో పగిలిపోతాయి. దీంతో చర్మంపై ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలను చూస్తారు. కళ్ల నొప్పి.. కళ్లల్లో నొప్పిని కూడా అంతగా పట్టించుకోం. ఏ ఐడ్రాప్స్ వాడేసి తగ్గిపోయిందనుకుంటాం. కంటి క్యాన్సర్ ఎక్కువగా ఐబాల్‌లోని కణాలు, కనురెప్పలు, కన్నీటి నాళాల సమీపంలో ప్రారంభమువతుంది. సాధార నొప్పితో ప్రారంభమవ్వడంతో దీన్ని అంత సులభంగా గుర్తిచలేమని వైద్యులు చెబుతున్నారు గుండెల్లో మంట.. గుండెల్లో లేదా ఛాతీలో మంటని గ్యాస్ నొప్పిగా తీసిపారేస్తాం. చిన్నగా వస్తుంది ఈ నొప్పి. దీంతో కాసేపటికి సర్దుకుంటుందని పట్టించుకోం. ఇలా వచ్చి ఎక్కిళ్లు వచ్చి ఇబ్బంది పడినా అది అన్నవాహిక లేదా కడుపు క్యాన్సర్‌కి సంకేతమని చెబుతున్నారు. వృషణాలు వాచిన.. ఇక గజ్జల్లో నొప్పి, వాపులు లేదా గడ్డలు వచ్చినా..వృషణ క్యాన్సర్‌కి సంకేతం. కొందరిలో ఆ భాగం బరువుగా ఉండటం లేదా వృషణం తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే గజ్జల్లో నిస్తేజంగా నొప్పి వస్తుండటం జరుగుతుంది. గురక.. గురక కూడా క్యాన్సర్‌కి సంకేతమనని అంటున్నారు. ఒక విధమైన గురక వచ్చి ఊపిరి పీల్చుకోవడంలో సమస్య ప్రారంభమవుతుంది. ఇది ఊపిరితిత్తులు లేదా థైరాయిడ్ క్యాన్సర్‌కి దారితీస్తుందని చెబుతున్నారు. సాధారణ గురకలా కాక చాలా పెద్దగా వస్తూ ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలొస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. గమనిక: ఇవి అధ్యయనంలో వెల్లడైన విషయాలు మాత్రమే. ఇది కేవలం అవగాహన కోసం ఇచ్చిందే. ఆయా క్యాన్సర్ల గురించి పూర్తి విశ్లేషణాత్మకంగా వైద్యులను సంప్రదించి తెలుసుకోవాల్సిందే. (చదవండి: ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న ఐదు భారతీయ నగరాలు ఇవే!) -
కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి!..మరో బూస్టర్ షాట్ అవసరమా..?
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రజలను మాములుగా హడలెత్తించలేదు. అది పెట్టిన భయం అంత ఇంత కాదు. అప్పటికే ఆల్ఫా, డెల్టా అంటూ పలు రకాల వేరియంట్లుగా కరోనా వైరస్ మార్పు చెందుతూ ప్రభావం చూపించింది. తగ్గుముఖం పడుతుందనే లోపు మరో వేరియంట్ ఓమిక్రాన్ రూపంలో సెకండ్ కరోనా వేవ్‌తో ఎంతలా భయబ్రాంతులకు గురించేసిందో తెలిసిందే. ఎటూ చూసిన ఆస్పత్రులన్నీ మరణ మృదంగంతో మారు మ్రోగిపోయాయి. క్రమేణ ప్రజలు ఈ మహమ్మారికి అలవాటు పడిపోయి పట్టించుకోవడం వదిలేశారు. ఆ తర్వాత ఆ మహమ్మారి కూడా కనిపించనంత స్థాయిలో మాయం అయ్యింది కూడా. హమ్మాయా! అనుకునేలోపే మళ్లీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉపరకం జేఎన్.1 హడలెత్తిస్తోంది. ఒకటో రెండో కేసులే కదా అనకుంటే పెరుగుతున్న కేసుల ఉధృతి మళ్లీ ఇది వరకటి పరిస్థితికే చేరుకుంటామా? అని గుబులు తెప్పించేస్తుంది. ఇప్పటికే నిపుణుల భయపడొద్దని సూచిస్తూ మరోవూపు మాస్క్‌లు సామాజిక దూరం అని చెబుతుంటే మళ్లీ టెన్షన్.. టెన్షనే..అని భయాందోళనకు గురవ్వుతున్నారు. దీని గురించి మరో బూస్టర్ తీసుకోవాలా అని ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఐతే వైద్యులు ఏమంటున్నారంటే.. ఈ కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు పర్యాటక రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే గత నాలుగు రోజుల నుంచి అనూహ్యంగా కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే భారత్‌లో విజయవంతంగా వ్యాక్సినేషన్లు వేశారు. 95% మంది తొలి రెండు షాట్ల వ్యాక్సిన్ తీసుకోగా, సుమారు 25% మంది బూస్టర్ డోస్‌లను కూడా వేయించుకున్నారు. మరీ ఇప్పుడూ ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మళ్లీ బూస్టర్ డోస్లాంటిది ఏదైనా వేయించుకుంటే మంచిదా? అని పలువురిని వేధిస్తున్న సందేహం. అయితే నిపుణులు 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, మధుమేహం, రక్తపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి ఉన్నవారు వైద్యులను సంప్రదించి గానీ మరో బూస్టర్ తీసుకోవద్దదని సూచిస్తున్నారు. అంటువ్యాధులు ఉన్న ప్రాంత్లాల్లో ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తలు పాటించమని చెబుతున్నారు. అలాగే వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే హోం ఐసోలేషన్‌లో ఉండటం వంటివి చేయాలని సూచించారు. మళ్లీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనా..? ఐతే గతంలో వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా వచ్చిన వారుఉన్నారని అన్నారు నిపుణులు. అలాగే రెండు సార్లు కరోనాని ఫేస్ చేసిన వారకు కూడా ఉన్నారు. అయితే వారంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు కాబట్టి ప్రమాదం అంత తీవ్రంగా లేదు, పైగా సులభంగా బయటపడగలిగారు. ఈ కొత్త వేరియంట్ జేఎన్.1 దగ్గరకొచ్చేటప్పటికీ.. రోగుల్లో న్యూమోనియా వంటి లక్షణాలతో కొద్దిపాటి శ్వాసకోస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అవికూడా తేలికపాటి లక్షణాలే అని ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు నిపుణులు. జస్ట్ నాలుగైదు రోజుల్లో నయం అయిపోతుంది. అలా అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు. అప్రమత్తంగా ఉండండి, లక్షణాలు కనిపిస్తే ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించండి, వ్యాప్తి చెందకుండా చూసుకోండి అని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది కాస్త ప్రమాదకారి కావొచ్చు కాబట్టి వ్యాధినిరోధకతను పెంచుకునేలా మంచి ఆహారం తీసుకుని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించండి. ఇప్పటి వరకు సరిగా వ్యాక్సిన్ వేసుకోకపోయినా లేదా ఒక్కటే వ్యాక్సిన్ తీసుకున్నా..అలాంటి వారు మాత్రమే వీలైతే బూస్టర్‌డోస్ లేదు రెండు వ్యాక్సిన్ షాట్లను తీసుకోమని సూచిస్తున్నారు వైద్యులు. ఐతే కొద్దిమంది ఆరోగ నిపుణులు మాత్రం ఈ దశలో అదనపు వ్యాక్సిన్ డోస్‌లను సిఫార్సు చేయాల్సిన అవసరం ఉండదని అభిప్రాయ పడుతున్నారు. మళ్లీ వేయించుకుంటే మంచిదేనా..? అసలు మళ్లీ బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిదా కాదా అనే దిశగా పరిశోధన చేయడం కూడా మంచిదేనని అభిప్రాయపడ్డారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్లు వ్యాధినిరోధక శక్తిని పెంచి ఆ కొత్త వేరియంట్‌ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలం. కొత్త వేరియంట్లకు తగ్గట్టుగా ఏదైనా బూస్టర్ డోస్ ఇవ్వడం మంచిదా? కాదనే దానిపై పరిశోధన చేయడం అవసరమని అంగీకరించారు పరిశోధకులు. ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న రోగులకు ఈ పరిశోధన బాగా ఉపయోగపడే అవకాశం ఉందన్నారు. (చదవండి: ఢిల్లీ సీఎం ప్రతి ఏడాది చేసే విపాసన ధ్యానం అంటే ఏంటీ..? ఎందుకు చేస్తారు?) -
యూకేలో కలవరపెడుతున్న 'వందరోజుల దగ్గు'! అధికారులు వార్నింగ్
యూకేలో వంద రోజుల దగ్గు(100-దగ్గు) వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో దగ్గి..దగ్గి గొంతులో పుండ్లు, మధ్య చెవిలో ఇన్ఫెక్షన్లు, ఆపుకోలేని మూత్ర విసర్జన తదితర సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులు యూకే అంతట వేగంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు ఆరోగ్య నిపుణులు. ఇది మూడు నెలలు వరకు సాగే సుదీర్ఘమైన తీవ్ర దగ్గుగా పేర్కొన్నారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం.. గతనెల జూలై నుంచి నవంబర్ మధ్య కాలంలోనే దాదాపు 716కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు అధికారులు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన బ్యాక్టీరియా సంక్రమణం అని చెబుతున్నారు. ఇది గతేడాది 2022లో కాలంలోనే మూడు రెట్లు అధికంగా ఉండేదని, అదికాస్తా ఇప్పుడు మరింత తీవ్రమయ్యిందని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో లాక్డౌన్, సామాజిక దూరం వంటి ఆంక్షలు కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి తక్కువుగా ఉండేదని, ఇప్పుడూ మాత్రం కేసులు మళ్లీ వేగంగా పెరుతున్నాయని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఇది కోరింత దగ్గు రకానికి చెందిన సుదీర్ఘ దగ్గే ఈ వంద రోజుల దగ్గు. ఇంతకీ అసలు కోరింత దగ్గు అంటే.. కోరింత దగ్గు అంటే.. ఇది బోర్టెటెల్లా పెర్టుస్సిస్ బ్యాక్టీరియా వల్ల ఊపిరితిత్తుల వాయుమార్గాల ఇన్ఫెక్షన్ అయ్యి అదేపనిగా దగ్గు వస్తుంది. కనీసం ఏం తినలేక దగ్గి.. దగ్గి.. శరీరం అంతా పులపరంగా ఉండి నీరసించిపోతారు. ఇది శిశువుల్లో, వృద్దుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే 1950లలో టీకా రావడంతో ఆ సమస్య నెమ్మదించింది. అంతేగాదు 1960లలో ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి ఈ అంటు వ్యాధులు ప్రబలేవని, టీకాలు వేయడంతో నియంత్రణలోకి వచ్చేదని బ్రిటన్‌కి చెంది బ్రిస్ట్ విశ్వవిద్యాలయ పీడియాట్రిక్స్ చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన ముఖ్యంగా శిశువులు, వృద్ధులే పడతారని చెబుతున్నారు. ఎదురయ్యే సమస్యలు.. జలుబుని పోలీ ఉండే లక్షణాలు ఉత్పన్నమవుతాయి. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. తీవ్రమైన దగ్గు ఒక్కోసారి వాంతులు లేదా పక్కటెముకలు విరగడం, గొంతు నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. నివారణ శిశువుల్లో, వృద్ధుల్లో వచ్చే ఈ కోరింత దగ్గుని తగ్గించొచ్చు. దీనికి అందుబాటులో టీకా కూడా ఉందని ఎన్హెచ్ఎస్ పేర్కొంది. చదవండి: భారత్‌లో 'వాకింగ్ న్యూమోనియా' కేసుల కలకలం! ఎవరికీ ఎక్కువ ప్రమాదం అంటే..? -
చపాతీలు మిగిలిపోతే పడేస్తున్నారా?.. అయ్యయ్యో వద్దమ్మా!
ఇంట్లో చపాతీలు మిగిలిపోతే పారేస్తున్నారా?. ఐతే ఇక నుంచి పడేయొద్దు. అవే దివ్య ఔషధం అని బోలెడన్ని ఆరోగ్యా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు మంచిదని చెబుతున్నారు. చాలామంది నిల్వ అయిన చపాతీలు తినేందుకు ఇష్టపడరు. కానీ ఆరోగ్య నిపుణులు అవే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటూ పలు షాకింగ్ విషయాలు చెప్పారు. అవేంటంటే..? తాజాగా అప్పటి కప్పుడు చేసుకున్న గోధుమ చపాతీలనే ఇష్టంగా తింటా. ఒకవేళ మిగిలపోతే కుక్కలకు పెట్టడం లేదా బయటపడేయడం జరుగుతుంది. కానీ ఆరోగ్యనిపుణులు ఇది అనారోగ్యం కాదని నొక్కి చెబుతున్నారు. ఇందులో ఫైబర్ ఎక్కువుగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువుగా ఉంటుంది. పైగా సోడియం కూడా తక్కువుగా ఉంటుంది. కాబట్టి దీన్ని మంచి చిరుతిండిగా కూడా పేర్కొనవచ్చు అని అన్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్నీ కావు. ముఖ్యంగా జీర్ణక్రియకు.. రాత్రి పూట అంతా నిల్వ ఉండి లేదా చపాతీలు చేసిన 12 నుంచి 15 గంటల తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట. అలా నిల్వ ఉండటం వల్ల అదులో చేరిన బ్యాక్టీరియా ప్రేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా గ్యాస్, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు. మంచి శక్తిని అందిస్తాయి.. అల్పాహారంలో బాసి రోటీ(నిల్వ అయిన చపాతీ! బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం వల్ల రోజంతా శక్తిమంతంగానూ బలంగా ఉంటుంది. ఎక్కువ తిన్న ఫీల్ కలుగుతుంది. ఇందులో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సరళమైన రూపాల్లోకి విచ్ఛిన్న చేసేందుక చాలా టైం పడుతుంది. అందువల్ల త్వరితగతిన ఆకలవ్వదు. పైగా పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. 30 రోజుల్లో బరువు తగ్గడానికి.. మిగిలిపోయిన చపాతీల్లో కేలరీలు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గడానికి (30 రోజుల్లో బరువు తగ్గడానికి) సహాయకరంగా ఉంటుంది. నిజానికి, ఉదయాన్నే పాత చపాతీ(నిల్వ చపాతీ) తిన్నప్పుడు పొంట నిండుగా ఉన్నట్లు అనిపించి, త్వరితగతిన ఆకలివేయదు. తద్వారా మీరు అతిగా తినకుండా ఉండగలుగుతారు. దీంతో సులభంగా బరువు తగ్గుతారు. బీపీ, షుగర్ నియంత్రణలో.. డయాబెటిక్ రోగులకు పాత చపాతీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. దీంతో వీటిని తినడం వల్ల రోజంతా వచ్చే షుగర్ స్పైక్‌ల నుండి ఉపశమనం లభిస్తుంది. అదే సమయంలో, పాత చపాతీల్లో సోడియం పరిమాణం తక్కువగా ఉంటుంది, దీని కారణంగా రక్తపోటును నియంత్రించడంలో ఇది చాలా సహాయపడుతుంది. సరైన పద్ధతిలో నిల్వ చేయడం అనేది ముఖ్యం..! రోటీ లేదా పాత చపాతీ సరైన విధంగా 12 గంటల పాటు నిల్వ ఉంచినప్పుడూ..వాటి రుచి, ఆకృతి స్టార్చ్ కూర్పులు మార్పులకు లోనవ్వుతాయి. ఇది మన ఆరోగ్యానికి ఉపయోగాపడే ఫైబర్ లాగా రెసిస్టెంట్ స్టార్చ్లా మారుతుంది. ఫలితంగా తేలికగా గ్లూకోజ్‌గా విడిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ తాజా లేదా పాత చపాతీల మధ్య గ్లైసెమిక్ ఇండెక్స్‌లో వ్యత్యాసం ఉంటుంది. తాజా చపాతీలు రక్తంలోని చక్కెర నియంత్రణను గణనీయంగా ప్రభావితం చేయవు కానీ నిల్వ చపాతీలు చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రిస్తుంది. ఇక్కడ చపాతీలు బూజు పట్టకుండా మంచి పద్ధతిలో నిల్వ చేయడం అనేది అత్యం ముఖ్యం అని గుర్తించుకోవాలి. తాజా చపాతీ రుచిగా ఉంటే ..నిల్వ ఉన్న చపాతీలను చాలా నెమ్మదిగా తినాలి, రుచి తక్కువుగా ఉన్నా ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ తెలుసుకోవాల్సింది.. నిల్వ ఉండటం వల్ల గోధుమ పులుస్తుంది దీన్నే కిణ్వనప్రక్రియ అంటాం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే మంచి పోషకాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే..? చిన్నారులకే ఎందుకొస్తోంది?) -
ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు
ఉత్తరకాశీ: నిర్మాణంలో ఉన్న సొరంగం కాస్తా కుప్పకూలడంతో అందులో తొమ్మిది రోజులుగా చిక్కుకుపోయిన కూలీలను రక్షించేందుకు ఇప్పుడు అంతర్జాతీయ బృందం ఒకటి సిద్ధమైంది. ఉత్తరకాశీలోని ఈ సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరిని సురక్షితంగా బయటకు తీసేందుకు ఇప్పటివరకూ జరిగిన అనేకానేక ప్రయత్నాలు విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందం రంగంలోకి దిగింది. కూలీల వెలికితీతకు జరుగుతున్న ప్రయత్నాలను పర్యవేక్షించేందుకు ఇంటర్నేషనల్ టన్నెలింగ్, అండర్‌గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ సొరంగం ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. చిక్కుకుపోయినవారిని బయటకు తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue operation | International Tunneling Expert, Arnold Dix says "We are going to get those men out. Great work is being done here. Our whole team is here and we are going to find a solution and get them out. A lot of work is being done… https://t.co/ta5cXfBRyv pic.twitter.com/Mfwkxu5UbJ — ANI (@ANI) November 20, 2023 'చిక్కుకుపోయినవారిని బయటకు తీసుకొస్తాం. పనులు బాగా జరుగుతున్నాయి. మా బృందం మొత్తం ఇక్కడే ఉంది. సమస్యకు ఏదో ఒక పరిష్కారం కచ్చితంగా కనుక్కుంటాం. ప్రస్తుతం ఇక్కడ చాలా పనులు జరుగుతున్నాయి. క్రమపద్ధతిలో పని చేసుకుపోతున్నారు. బాధితులకు ఆహారం, మందులు సరియైన విధంగా అందిస్తున్నారు' అని ఆర్నాల్డ్ డిక్స్ చెప్పారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడిసిఎల్) ఆధ్వర్యంలో ఈ సొరంగం నిర్మాణం జరుగుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చార్ ధామ్ ఆల్-వెదర్ రోడ్ ప్రాజెక్ట్‌లో భాగం. ఈ సొరంగం ఉత్తరకాశీలోని యమునోత్రి జాతీయ రహదారిపై ఉంది. అయితే.. నవంబర్ 12 అర్ధరాత్రి సమయంలో సొరంగంలో కొంతభాగం కూలిపోయింది. దీంతో 41 మంది లోపలే చిక్కుకుపోయారు. ఇదీ చదవండి: Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ సొరంగంలో డ్రిల్లింగ్ నిలిపివేత -
జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు - నిపుణుల చర్చలు
హైదరాబాద్: 2023 ఆల్ ఇండియా స్పైసెస్ ఎక్స్‌పోర్టర్స్ ఫోరం (AISEF) వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ (WSO), 2వ ఎడిషన్ నేషనల్ స్పైసెస్ కాన్ఫరెన్స్ 2023 మొదటి రోజును విజయవంతంగా ముగించింది. ఈ సదస్సులో నిపుణులు, పరిశ్రమ నాయకులు సుగంధ ద్రవ్యాల భద్రత, స్థిరత్వానికి సంబంధించిన కీలకమైన సమస్యలపై చర్చించారు. ఈ సదస్సులో పాల్గొనేవారికి ఆత్మీయ స్వాగతం పలికిన వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ 'రామ్‌కుమార్ మీనన్' మాట్లాడుతూ.. సుగంధ ద్రవ్య పరిశ్రమ భద్రత దాని స్థిరత్వాన్ని నిర్ధారించడంలో సామూహిక ప్రయత్నాల ప్రాముఖ్యతను గురించి వ్యాఖ్యానించారు. సుగంధ ద్రవ్యాల భద్రత కేవలం బాధ్యత మాత్రమే కాదు, స్థిరమైన భవిష్యత్తును నిర్మించటానికి చూపాల్సిన నిబద్ధత అని వెల్లడించారు. ఈ పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ మంచి స్థిరమైన ఆదాయానికి అవకాశాలు వున్నాయని చెప్పారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ అఫ్ అరేకనట్ అండ్ స్పైస్ డెవలప్మెంట్ (DASD) డైరెక్టర్ డాక్టర్ హోమి చెరియన్, మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధికి సుగంధ ద్రవ్యాలు ఉత్తమమైన మార్గం, స్థిరమైన వృద్ధి, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తోందన్నారు. డాక్టర్ ఎబి రీమాశ్రీ, డైరెక్టర్ - రీసెర్చ్, స్పైసెస్ బోర్డ్ మాట్లాడుతూ.. మసాలా సాగును ప్రోత్సహించడానికి అవసరమైన పరిజ్ఞానం గురించి వివరిస్తూ.. ఆహార భద్రత పరంగా సుగంధ ద్రవ్యాల పరిశ్రమలో రాజీ పడటం జరగదు, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సురక్షితమైన, అధిక నాణ్యత గల సుగంధ ద్రవ్యాలను అందించడానికి మనం వ్యూహాలు ఖచ్చితంగా ప్రతిబింబించాలని వెల్లడించారు. NSC 2023 వ్యాపార కమిటీ చైర్మన్ చెరియన్ జేవియర్ మాట్లాడుతూ.. 'ఫుడ్ సేఫ్ స్పైసస్ - ది వే ఫార్వార్డ్ టూ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇన్కమ్' సదస్సు కేవలం ఒక సదస్సు మాత్రమే కాదు, మన భవిష్యత్తును బాధ్యతాయుతంగా, స్థిరంగా పరిశ్రమ తీర్చిదిద్దటానికి ఇది పిలుపు అని అన్నారు. సెషన్ రెండవ రోజు మెరుగైన ఇన్పుట్ నిర్వహణ, ఉత్పాదకత, వినూత్న ప్రక్రియలు, మార్కెట్ పోకడలు, సుగంధ ద్రవ్యాల వినూత్న ప్యాకేజింగ్ సవాళ్లు, అవకాశాలు వంటి అంశాలపై మరింత పరిజ్ఞానం ప్రదర్శిస్తుంది. ఈ సదస్సులో పాల్గొనేవారు ఆహార సురక్షిత పద్ధతులు, సుగంధ ద్రవ్యాలు రైతులకు స్థిరమైన, నిలకడతో కూడిన ఆదాయానికి దారితీసే భవిష్యత్తు కోసం ఆకర్షణీయమైన చర్చలు, నిపుణుల సూచనలు, క్రియాత్మక వ్యూహాలను ఆశించవచ్చు. నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ 2023 పరిశ్రమ నాయకులు, నిపుణులు, వాటాదారులకు చర్చలలో పాల్గొనడానికి, మొత్తం సుగంధ ద్రవ్యాల రంగాన్ని పెంచే లక్ష్యంతో వ్యూహాలను అమలు చేయడానికి ఒక వేదికను అందిస్తుంది. ఈ కార్యక్రమానికి వివిధ ఎఫ్పిఓలు, ఎన్జిఓలు హాజరయ్యారు. -
బలహీనంగానే సెంటిమెంట్
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ బలహీనంగానే కదలాడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పరిమిత శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయాలు, ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధ పరిణామాలు, దేశీయ కార్పొరేట్ క్యూ2 ఆరి్థక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి ట్రేడింగ్, క్రూడాయిల్ ధరల కదిలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చంటున్నారు. పశి్చమాసియా ఉద్రిక్తతలు, బాండ్లపై రాబడులు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, మిశ్రమ కార్పొరేట్ ఆరి్థక ఫలితాల వెల్లడి తదితర పరిణామాల నేపథ్యంలో క్రితం వారం సూచీలు రెండున్నరశాతం నష్టపోయాయి. ట్రేడింగ్ నాలుగురోజులు జరిగిన గతవారంలో సెన్సెక్స్ 1,615 పాయింట్లు, నిఫ్టీ 495 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ‘‘వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ఆస్థిరత కొనసాగవచ్చు. ఈ పరిణామం దేశీయ ఈక్విటీ రికవరీని ఆలస్యం చేయోచ్చు. ఇటీవల వరుస విక్రయాలతో నెలకొన్న ఓవర్‌సోల్డ్ ట్రెండ్‌తో నిఫ్టీ పతనం తాత్కాలికంగా ఆగింది. నిఫ్టీకి సాంకేతికంగా కీలకమైన మద్దతు 19,250 స్థాయి కోల్పోయింది. తిరిగి ఈ స్థాయిపైకి చేరుకుంటేనే ముందుకు వెళ్లే అవకాశం ఉంది’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణుడు రూపక్ తెలిపారు. క్యూ2 కార్పొరేట్ ఫలితాలు గత వారాంతంలో ఎన్టీపీసీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యూపీఎల్‌లు వెల్లడించిన ఆరి్థక ఫలితాలకు స్టాక్ మార్కెట్ ముందుగా స్పందించాల్సి ఉంటుంది. ఇక నిఫ్టీ సూచీలో లిస్టైన టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్, టైటాన్, యూపీఎల్, టాటా కన్జూమర్ ప్రొడెక్టŠస్, అదానీ ఎంటర్ప్రైజెస్, బ్రిటానియాతో పాటు ఇరు ఎక్సే్చంజీల్లో దాదాపు 700 కంపెనీలు వచ్చే వారం తమ క్యూ2 ఆరి్థక ఫలితాలను వెల్లడించనున్నాయి. గెయిల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా, మనోజ్ వైభవ్ జెమ్స్, యధార్థ్ హాస్పిటల్స్, గ్లాండ్ ఫార్మా, ఐఓసీ, అంజుజా సిమెంట్స్, టీవీఎస్, ఇండిగో, జొమోటో, డెల్హవరీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీఎల్ఎఫ్ తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్యం వెల్లడించే అవుట్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం సెపె్టంబర్ ద్రవ్యలోటు, ఎనిమిది కీలక రంగాల వృద్ధి డేటా మంగళవారం(అక్టోబర్ 31న), అక్టోబర్ తయారీ రంగ పీఎంఐ, ఇదే నెల ఆటో అమ్మకాలు బుధవారం, సేవా రంగ పీఎంఐ డేటా, పారెక్స్ నిల్వలు శుక్రవారం విడుదల అవుతాయి. అమెరికా తయారీ, సేవా రంగ పీఎంఐ, ఉద్యోగ గణాంకాలు, యూరోజోన్ ఎకానామిక్ కాని్ఫడెన్స్, కన్జూమర్ కాని్ఫడెన్స్, సీపీఐ, జీడీపీ, తయారీ రంగ గణాంకాలు ఇదే వారంలో విడుదల కానున్నాయి. చైనా తయారీ, నాన్ మాన్యూఫ్యాక్చరింగ్, సేవారంగ పీఎంఐ డేటా ఈ వారంలోనే వెల్లడి కానున్నాయి. ఆయా దేశాల ఆరి్థక స్థితిగతులను ప్రతిబింబింజేసే కీలక స్థూల ఆరి్థక గణాంకాల వెల్లడికి ముందు మార్కెట్లలో అప్రమత్తత చోటు చేసుకోనే వీలుంది. అక్టోబర్‌లో రూ.20 వేల కోట్లు వెనక్కి ► విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్‌లో రూ.20,300 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్– హమాస్ వంటి భౌగోళిక రాజకీయ అనిశి్చతులు ఇందుకు కారణమయ్యాయి. ఇదే కాలంలో డెట్ మార్కెట్లో రూ.6,080 కోట్ల పెట్టుబడులు పెట్టడం విశేషం. ఫెడ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి తర్వాత భారత మార్కెట్‌పై విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి ఏమిటనేది స్పష్టమవుతుంది. కాగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు భారత ఈక్విటీల్లో రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. క్యాపిటల్ గూడ్స్ ఆటోమొబైల్స్ రంగాల్లో కొనుగోళ్లను కొనసాగించారు. రేపు ఎఫ్ఓఎంసీ సమావేశం ప్రారంభం ► ద్రవ్య విధాన నిర్ణయాలు, వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మంగళ, బుధవారాల్లో సమావేశం కానుంది. ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 5.25 – 5.50% వద్ద యథాతథంగా ఉంచొచ్చని ఆరి్థకవేత్తల అంచనా. ద్రవ్య పాలసీ వెల్లడి సందర్భంగా చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలను ఈక్విటీ మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. ఇదే మంగళ, బుధవారాల్లో బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లు సైతం ద్రవ్య సమీక్ష నిర్వహించనున్నాయి. -
‘మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు’
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంపై కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో భేటీ అయింది. ఆనకట్ట కుంగిన వ్యవహారంపై ఇంజినీర్లతో కేంద్ర బృందం చర్చించింది. ఆనకట్టకు సంబంధించిన సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించింది. భేటీ అనంతరం తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మాట్లాడుతూ.. ‘‘మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు. లోపాలు ఉంటే మూడు సీజన్లు తట్టుకునేది కాదు కదా!. ఏడో బ్లాక్‌లో సమస్య వల్ల సెంటర్ పియర్ కుంగింది. ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. ఇసుక కారణంగా సమస్య వచ్చిందని భావిస్తున్నాం. బ్యారేజీకి సంబంధించి క్వాలిటీ ఆఫ్ శాండ్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనుమతులు ఉన్నాయి. కాపర్ డ్యామ్‌కు వరద తగ్గాక నవంబర్ చివరలో ఘటనపై సమగ్ర పరిశీలన చేస్తాం’’ అని ఈఎన్సీ పేర్కొన్నారు. ఈ భేటీలో తెలంగాణ ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశపాండే, ఎల్ అండ్ టీ ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్ద శబ్దంతో కుంగుబాటు.. కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిదైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ శనివారం రాత్రి భారీ శబ్దంతో కుంగిపోయింది. మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోవడం ఆందోళన రేకెత్తించింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. 7వ బ్లాక్‌లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. దీంతో బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన గేట్లు ఎత్తి.. జలాశంయలోని నీటిని దిగువకు విడుదల చేశారు. ఆపై కేంద్రం తరపున నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగుబాటును మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మేడిగడ్డ ఆనకట్ట, కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి ఇంజనీర్ల ద్వారా వివరాలు తీసుకున్నారు. -
కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీపై కేంద్రం ఆందోళన.. ఆరుగురు నిపుణులతో కమిటీ
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీ పై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం హైదరాబాద్‌లోని రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులతో నిపుణుల కమిటీ సమావేశం కానున్నారు. రేపు(మంగళవారం) కాళేశ్వరం డ్యామ్‌ను కేంద్ర బృందం సందర్శించనుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి అధికారుల బృందం నివేదిక సమర్పించనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ మరికాస్త కుంగింది. శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి, 7వ బ్లాక్‌లోని 20వ పియర్ వద్ద దిగువన పగుళ్లు ఏర్పడ్డాయి. దీనితో బ్యారేజీపై ఉన్న వంతెన కుంగి ప్రమాదకరంగా మారింది. వంతెనపై సైడ్ బర్మ్ గోడ, ప్లాట్‌ఫారంతోపాటు రోడ్డు సుమారు 2, 3 ఫీట్ల మేర కుంగిపోయాయి. దీనితో బ్యారేజీ గేట్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని అంచనా. చదవండి: సీఎం కేసీఆర్ ధైర్యం అదేనా? -
స్పైసీ ఫుడ్స్‌తో నిమ్మరసాన్ని జత చేస్తున్నారా?
విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మకాయతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. రోజూ నిమ్మరసాన్ని సేవిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే నిమ్మకాయను కొన్ని పదార్థాలతో కలిపి సేవించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పనీర్ తయారు చేసేటప్పుడు మరిగే పాలలో నిమ్మరసం పిండుతారు. అయితే ఇందులో ఉండే యాసిడ్ ప్రోటీన్లను దెబ్బతీస్తుంది. ఫలితంగా యాసిడ్ రిఫ్లెక్షన్ ఏర్పడి గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకే పనీర్‌లో నిమ్మరసం కలపడం మంచిది కాదు. చాలామంది సలాడ్‌లో ఎక్కువగా నిమ్మరసం ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని రకాల పండ్లతో నిమ్మరసం కలవడం రియాక్షన్ ఇస్తుంది. ముఖ్యంగా బొప్పాయిని నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లతో కలిపితే నష్టం వాటిల్లుతుంది. యాసిడ్ రిఫ్లెక్షన్ ఏర్పడి ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడవచ్చు. అదేవిధంగా చాలామంది... ముఖ్యంగా మద్యపాన ప్రియులు కాక్టెయిల్స్, బీర్లతో నిమ్మకాయను ఉపయోగిస్తారు. కానీ నిమ్మ, రెడ్ వైన్ కాంబినేషన్ ఏ మాత్రం మంచిది కాదు. నిమ్మలోని ఎసిడిటీ రెడ్వైన్లోని టానిన్లను ప్రభావితం చేయడం వల్ల వైన్ చేదెక్కడంతోపాటు దుష్ఫ్రభావాలూ కలుగుతాయి. నిమ్మలో ఉండే ఎసిడిటీ స్వభావం వల్ల స్పైసీ ఫుడ్స్‌తో కలిపి తిన్నప్పుడు శరీరంలో వేడి పెరగడమే కాకుండా జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి. అందుకే స్పైసీ ఫుడ్స్‌లో నిమ్మ వినియోగం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేడి వేడి ఆహారంలో నిమ్మరసం అసలు కలపకూడదు. అలా కలపడం వల్ల నిమ్మలోని విటమిన్ సి దూరమవుతుంది. (చదవండి: డయాబెటిస్ పేషెంట్లకు ఈ పండ్లు..కూరగాయాలతో మేలు!) -
మన టెక్నాలజీని అమెరికా కావాలంది
రామేశ్వరం: చంద్రయాన్–3 మిషన్ విజయవంతం కావడంతో అమెరికా నిపుణులు సైతం మన అంతరిక్ష టెక్నాలజీని కోరుతున్నారని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు. సంక్లిష్టమైన రాకెట్ మిషన్లను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైన అమెరికాలో నిపుణులు, చంద్రయాన్–3 మిషన్‌ను చూశాక, భారత్ తమతో అంతరిక్ష సాంకేతికతను పంచుకోవాలని కోరుకుంటున్నారన్నారు. రోజులు మారాయని, అత్యుత్తమైన పరికరాలను, రాకెట్లను నిర్మించగల సత్తా భారత్ సొంతం చేసుకుందని ఆయన చెప్పారు. అందుకే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు ద్వారాలు తెరిచారని ఆయన అన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 92వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి సోమనాథ్ మాట్లాడారు. ‘మనది చాలా శక్తిమంతమైన దేశం. ప్రపంచంలోనే అత్యుత్తమమైన విజ్ఞానం, మేధస్సు కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. చంద్రయాన్–3 వాహకనౌకను మనమే డిజైన్ చేసి, అభివృద్ధి పరిచాం. ప్రయోగం చేపట్టడానికి కొన్ని రోజులు ముందు ఈ మిషన్‌ను తిలకించేందుకు నాసా నిపుణులను ఆహ్వానించాం. వారు ఇస్రో ప్రధాన కార్యాలయానికి రాగా చంద్రయాన్–3 మిషన్ గురించి వివరించాం. వారంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు. మనం చాలా తక్కువ ఖర్చుతో పరికరాలు, సామగ్రిని రూపొందించడం చూసి, ఆశ్చర్యపోయారు. తమ దేశానికి ఈ పరిజ్ఞానాన్ని విక్రయించాలని అడిగారు’అని ఆయన వివరించారు. రాకెట్లు, శాటిలైట్ల నిర్మాణంలో పాల్గొని, అంతరిక్ష రంగంలో మన దేశాన్ని మరింత శక్తివంతమైందిగా మార్చాలని కోరుతున్నాను. ఇక్కడున్న కొందరికి ఆ నైపుణ్యం ఉంది. చంద్రుణ్ని చేరుకునే రాకెట్‌ను డిజైన్ చేయగలరు’అని ఆయన పిలుపునిచ్చారు. ‘భారత మహిళా వ్యోమగామి చంద్రయాన్–10 మిషన్‌లో చంద్రుడిపై అడుగుపెడుతుంది. ఆ మిషన్‌లో మీలో ఒకరు, ముఖ్యంగా ఓ బాలిక సైతం ఉండి ఉండొచ్చు’అని ఆయన అన్నారు. -
నవరాత్రుల టైంలో చేసే ఆరోగ్య తాండవం!
నవరాత్రి సందర్భంగా దాండియా ఆడటం సంప్రదాయం. చేతిలో కోలాటం కర్రలతో ఆడటమే ‘దాండియా’. కాని కర్రలు లేకుండా చేసే నృత్యం కూడా గుజరాత్ తోపాటు ఉత్తర భారతంలో అంతే ప్రముఖమైనది. దాని పేరు ‘గర్బ’. నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు చేసే ఈ నృత్యం కేవలం పారవశ్య తాండవమే కాదు ఆరోగ్య తాండవం అని కూడా అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ‘గర్బ’ అనే మాట ‘గర్భ’ నుంచి వచ్చింది. స్త్రీ శక్తికి చిహ్నం గర్భధారణం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జీవశక్తికి ప్రాణం పోసే స్త్రీ శక్తిని సూచించేందుకు గుజరాత్ అంతా ‘గర్బ’ నృత్యం చేస్తారు. దాండియా అంత విస్తృతంగానే గర్బ కూడా ఆడతారు. అందులో కర్రలు ఉంటాయి. ఇందులో ఉండవు. కాని గర్బ నృత్యం శరీరానికి చాలా మేలు చేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా 9 రోజుల పాటు స్త్రీలు ఈ నృత్యం చేయడం వల్ల వారి ఆరోగ్యం మెరుగవుతుంది అంటున్నారు. కేలరీల ఖర్చు గంటసేపు గర్బ డాన్స్ చేయడం వల్ల 300 నుంచి 500 కేలరీలు ఖర్చవుతాయి. అంతే కాదు, శరీరాంగాలకు ఇందులో గొప్ప వ్యాయామం లభిస్తుంది. ఈ నృత్య భంగిమల వల్ల భుజాలు, మెడ, వీపు, మోకాళ్లు బాగా కదిలి కండరాలన్నీ చైతన్యంలోకి వస్తాయి. సునీల్ బఫ్నా అనే ఆరోగ్య నిపుణుడి ప్రకారం గంట సేపు గర్బ చేస్తే మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి ఒక ప్రశాంత స్థితి వస్తుంది. గర్బ చేసే సమయంలో శరీరం ఎండార్ఫిన్స్‌ను విడుదల చేయడమే ఇందుకు కారణం. అదీగాక ఇది బృందంతో చేసే నృత్యం కాబట్టి మనతో పాటు ఒక సమూహం ఉంది అనే భరోసా మనసుకు లభించి మంచి అనుభూతి కలుగుతుంది. అందుకే నవరాత్రుల సమయంలోనే కాదు సంవత్సరం పొడగునా గర్బా డ్యాన్స్ చేయమని ఫిట్నెస్ నిపుణులు కూడా చెబుతున్నారు. గుండెకు మంచిది గర్బలో ఆధ్యాత్మికత ఉంది. నృత్యం ద్వారా చేసే ఆరాధన కనుక దీనిని చేయడం వల్ల శరీరానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇందులో చప్పట్లతో, సంగీతానికి తగినట్టుగా లయ కలిగిన కదలికలు ఉంటాయి కనుక అవన్నీ గుండెకు, నృత్య సందర్భంగా ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగం పెరుగుతుంది కనుక ఊపిరితిత్తులకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గర్బ ఆధ్యాత్మిక, ఆరోగ్య తాండవం. (చదవండి: అందగాడు, ఆయుష్మంతుడు కన్నా గుణవంతుడే అన్ని విధాల..) -
షుగర్ ఉంటే పెడిక్యూర్ చేయించుకోవచ్చా? లేదంటే..
షుగర్ ఉన్నవాళ్లు కళ్లు దగ్గర నుంచి కాళ్ల వరకు ప్రతి అవయవాన్ని కాపాడుకోవాల్సిందే. మధుమేహం అందరికీ కామన్ వ్యాధిలా అనిపించినా అదొక సైలెంట్ కిల్లర్. నెమ్మదిగా అవయవాలన్నింటిని బలహీనం చేసి చావు అంచులదాక తీసుకువెళ్లే భయానక వ్యాధి. సకాలంలో మందులు వేసుకుంటూ జాగురుకతతో వ్యవహరించకపోతే అంతే సంగతి. ఇప్పుడూ షుగర్ వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తోంది. ఇలా మధుమేహంతో బాధపడేవాళ్లు పార్లర్‌కి వెళ్లి పాదాలకు పెడిక్యూర్ వంటివి చేయించుకోవద్దని స్ట్రాంగ్‌గా హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మధుమేహగ్రస్తులు ప్రతి అవయవాన్ని చాలా సున్నితంగా చూసుకోవాల్సిందే. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు సమంగా ఉండాలి. కళ్లు, మూత్రపిండాలు, గుండె మీద ఎలాంటి ప్రభావం పడకుండా ఎప్పటికప్పుడూ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధిగ్రస్తుల పాదాల్లో నరాలు సున్నితంగా ఉంటాయి. ముఖ్యంగా పాదాలకు ఎలాంటి గాయాలు కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పైగా చాలామందికి పాదాల్లో తిమ్మిర్లు, స్పర్శ లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి వీళ్లు పార్లర్‌కి వెళ్లి పాదాలకు సంబంధించిన పెడిక్యూర్ వంటివి చేయించుకోకూడదు. ఎందుకంటే? వాళ్లు పాదాలల్లో ఉన్న డెడ్ స్కిన్‌ని తొలగించడం వంటివి చేస్తారు. ఇది మరింత ప్రమాదం. వాళ్లు చేసే మసాజ్ కారణంగా నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మాములు వ్యక్తులకు ఏం కాదు. కానీ ఘుగర్ ఉన్నవాళ్లకి అరికాళ్ల వద్ద చర్మ పలుచబడిపోతుంది. కాబట్టి పార్లర్ లేదా సెలూన్లో పాదాలకు సంబందించిన మసాజ్‌లు కాస్త ప్రమాదమే. ఎందుకు పెడక్యూర్ వద్దు..? డయాబెటిస్ స్టేజ్‌ల రీత్యా వారు ఈ పెడిక్యూర్ చేయించుకుంటే అరికాళ్లలోని స్కిన్‌ని తొలగించడం కారణంగా గాయాలుగా మారే అవకాశం ఉంటుంది. అదే ఒక వేళ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే గాయం అయినా కూడా తెలియదు. మరింత పెద్దిగా మారి ప్రాణాంతకంగా మారవచ్చు. నిజానికి మసాజ్ చేసినప్పుడూ రక్తప్రసరణ జరిగి చేయించుకన్న అనుభూతి, రిలీఫ్ ఉంటాయి. మధుమేహం ఎక్కువగా ఉంటే ఏం చేసినా అంతగా తెలియదు. పెడిక్యూర్‌లో భాగంగా గోళ్లు కత్తిరంచడం లేదా క్లీన్ చేయడం జరుగుతుంది. ఒకరికి ఉపయోగించిన సాధనాలను అపరిశుభ్రంగా వాడితే అది ఇన్ఫెక్షన్లకు దారితీయొచ్చు. మధుమేహగ్రస్తులు పాదాలకు సంబంధించిన చికిత్సలు ఆర్థోపెడిస్ట్ నిపుణుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఇలా సెలూన్ లేదా బ్యూటీపార్లర్‌లో చేయించుకుంటే మాత్రం ఇన్ఫెక్షన్ల బారిన పడటమే కాకుండా మరింతగ ఆయా ప్రాంతాల్లో స్పర్శ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. (చదవండి: మానసిక అనారోగ్యమే అని లైట్ తీసుకోవద్దు! బీ కేర్ ఫుల్! లేదంటే..) -
దేశీయ స్టాక్ సూచీలు ఈ వారం ఇలా ఉండబోతున్నాయి..
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు ఈ వారంలోనూ బలహీనంగా ట్రేడవుతూ.., పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరి, స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడి నేపథ్యంలో ఒడిదుడుకులు ఉండొచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి కదలికలు, ప్రపంచ మార్కెట్ల పనితీరు, క్రూడాయిల్ ధరల కదిలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చంటున్నారు. గాంధీ జయంతి సందర్భంగా నేడు ఎక్స్చేంజీలకు సెలవు కావడంతో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. బాండ్లపై దిగుబడులు, క్రూడాయిల్ ధరల పెరుగుదల ఆందోళనలతో గతవారం మొత్తంగా సెన్సెక్స్ 181 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయాయి. ‘‘చారిత్రాత్మకంగా పరిశీలిస్తే అమెరికా, భారత మార్కెట్లు అక్టోబర్‌లో ర్యాలీ చేసాయి. ఈసారి అదే ట్రెండ్ పునరావృతమయ్యే అవకాశం ఉంది. అందుకు సంకేతంగా ఇటీవల ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్ దెబ్బతీస్తున్న బాండ్ల ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్ ధరల పెరుగుదల ఆందోళనలు క్రమంగా తగ్గుతున్నాయి. సాంకేతికంగా నిఫ్టీ ఎగువున 19,800 వద్ద కీలక నిరోధం ఉంది. దిగువ స్థాయిలో 19,600 – 19,500 పరిధిలో తక్షణ మద్దతు లభిస్తుంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ఆర్బీఐ ద్రవ్య పాలసీ నిర్ణయం కీలకం రిజర్వ్ బ్యాంక్ తన పరపతి ద్రవ్య సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించనుంది. ఆర్బీఐ చైర్మన్ శక్తికాంత దాస్ శుక్రవారం పాలసీ కమిటి నిర్ణయాలు వెల్లడించనున్నారు. వరసగా నాలుగోసారి వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపునకే ఆర్బీఐ మొగ్గుచూపొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణ గరిష్ట స్థాయిలో ఉండటం, ఫెడ్ రిజర్వ్ కఠిన ద్రవ్య పాలసీ వైఖరిని కొనసాగించడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు ఆటో కంపెనీలు విడుదల చేసిన సెప్టెంబర్ వాహన విక్రయ గణాంకాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇదే వారంలో అక్టోబర్ 3న తయారీ రంగ పీఎంఐ, సెప్టెంబర్ 5న సేవారంగ డేటా విడుదల కానుంది. అమెరికా యూఎస్ తయారీ, సేవా రంగ డేటాతో పాటు వాణిజ్య, ఉద్యోగ కల్పన డేటా ఇదే వారంలో వెల్లడి కానుంది. బ్రిటన్ తయారీ, సేవా రంగ సీఐపీఎస్ డేటా గణాంకాలు విడుదల కానున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ కీలక స్థూల ఆర్థిక గణంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ప్రాథమిక మార్కెట్‌పై కన్ను మనోజ్ వైభవ్ జెమ్స్ ‘ఎన్’ జ్యువెలరీŠస్ స్టాక్ లిస్టింగ్ మంగళవారం ఉంది. అదే రోజున వాలియంట్ ల్యాబొరేటరీస్ ఐపీఓ ముగిస్తుంది. జేఎస్‌డబ్ల్యూ లిస్టింగ్ సెప్టెంబర్ 4న ఉంది. ఈ మరుసటి రోజు గురవారం ప్లాజా వైర్స్ పబ్లిక్ ఇష్యూ ముగుస్తుంది. ఆరు నెలల తర్వాత అమ్మకాలు ఆరు నెలల వరుస కొనుగోళ్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌లో నికర అమ్మకందారులుగా నిలిచారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. ఈ సెప్టెంబర్‌లో ఎఫ్‌పీఐలు రూ. 14,767 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. డెట్ మార్కెట్లో రూ. 938 కోట్ల పెట్టుబడులు పెట్టారు. కాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్స్ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. దేశ ఆర్థికవ్యవస్థ, ఆర్బీఐ అక్టోబర్ ఎంపీసీ సమావేశం, సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఎఫ్‌పీఐల ధోరణి అనిశ్చితిగా ఉండొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. -
ఆత్మహత్య ధోరణి జన్యుపరంగా సంక్రమిస్తుందా?
ఆత్మహత్య ధోరణి కొంతవరకు జన్యు పరంగా వస్తుందంటున్నారు ఆయుర్వే నిపుణులు నీవీన్ నడిమింటి. నేడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది పిల్లలు ఇదే మానసిక స్థితిలో ఉంటున్నారు. తమిళనటుడు సినీ హిరో విజయ్ ఆంటోనీ కుటుంబంలో అతడి చిన్నతనంలోనే తండ్రి ఆత్మహత్య చేసుకొన్నారు. ఇప్పుడు అతని 16 ఏళ్ళ కూతురు కూడా అలానే... దీన్ని బట్టి చూస్తే ఆత్మహత్య ధోరణి అనేది కొంతవరకు జన్యుపరంగా వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వచ్చాక పిల్లల్లో ఆ ధోరణి మరింత ఎక్కువైంది. చాలా మంది తల్లిందండ్రులు పిల్లల చేత ఫోన్లు ఎలా మానిపించాలని మొత్తుకుంటున్నారు. ముఖ్యంగా వారిని ఈ ఆత్మహత్యధోరణి దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉండేలా ఫోన్ అడిక్షన్ మానిపించాలంటే ఏం చేయాలో ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో చూద్దాం!. చీకటి గదుల్లో పిల్లలను ఉంచొద్దు.. సెల్‌ఫోన్‌కు ( టీన్ ఏజ్ పిల్లల్లో ) అడిక్ట్ అయిపోతే డిప్రెషన్ ( మానసిక కుంగుబాటు ) అగ్రేషన్ ( కోపం చిరాకు హింసాత్మక ధోరణి ) వచ్చేస్తాయి. రెండేళ్ల పిల్లలు కూడా సెల్ ఫోన్ చేతికి ఇవ్వకపోతే అన్నం తినరు. అరిచి గోల చేస్తారు “ - నేడు తల్లితండ్రుల నోట తరచూ వినిపించే మాట కూడా ఇదే! పిల్లలు ఆరుబయట ఎంత ఆడుకుంటారో అంత పాజిటివ్ వ్యక్తిత్వం అలవడుతుంది... పిల్లలతో పేరెంట్స్ క్వాలిటి టైం మెయింటేన్ చేయాలి. ఇంకోటి చీకటి గదుల్లో ఎక్కువగా పిల్లలను ఉంచొద్దు పిల్లల ముందు ఎప్పుడు గాసిప్స్ మాట్లాడొద్దు. సెల్‌ఫోన్ లేకుండా పిల్లలు ఫుడ్ తినాలంటే.. పిల్లల పెరుగుదలలో అతి కీలకమైన వయసు ఏడాది నుంచి 5 ఏళ్లు. అంటే ప్రీ స్కూలు పిల్లల్లో పెరుగుదల అన్నది వారు తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. మా బాబు ఏదీ తినడు ఆకలవడానికి ఏదైనా మంచి టానిక్ రాసివ్వండి. లేదా మా పిల్లవానికి పెరుగు వాసన గిట్టదండి, పెరుగన్నం తినకపోతే వేడి చేస్తుంది కదా అని చాలామంది తల్లిదండ్రులు అడుగుతుంటారు. ఏడాది నిండేటప్పటికి పిల్లలకు దాదాపు నడక వచ్చేస్తుంది. అక్కడి నుండి తనంతట తానుగా తిరుగుతూ, ఎక్కడేమేమి ఉన్నా చక్కబెడుతూ, ఆటలలో మునిగిపోయే పిల్లలు తిండి విషయంలో పేచీ పెట్టడం సహజమే. ఓ పట్టాన దేనికీ లొంగరు. మూడేళ్ల వయసులో పిల్లల్లో ప్రీస్కూల్లో చేర్చడంతో అక్కడ తోటి పిల్లల అలవాట్లను అనుకరించడం, వాళ్లు తినేవి బాగున్నట్లు, తనకి పెట్టినవి బాగోలేదని అనిపించడం ప్రారంభమవుతుంది. ఇవన్నీ ఏయే ఏడాదికి ఆ ఏడాది మారే అలవాట్లే. కాబట్టి దీని గురించి అంతగా చెందనక్కరలేదు. ఇక కొన్ని రుచులు, వాసనలు పడకపోవడమన్నది పిల్లలకైనా, పెద్దవారికైనా అది సహజం అని గుర్తించాలి. అవి, ఇవి తినేలా ఒత్తిడి చేసే బదులు వారు ఇష్టపడే రీతిలో అదే సమయంలో పోషకాలు కూడా అందేలా ఆహారాన్ని తయారు చేసి పెట్టాలి. తినిపిస్తే ఎక్కువ తింటాడని, బిడ్డ తింటానని మొరాయిస్తున్నా బలవంతంగా నోటిలో కుక్కే ప్రయత్నం అస్సలు చేయరాదు. కొంత ఆహారం వేస్ట్ అయినా వాళ్లంతట వాళ్లు తింటామంటే ప్రోత్సహించాలి. అలాంటప్పుడే కొత్త కొత్తవి రకరకాల ఆహార పదార్థాలను పెట్టి తినమంటే వాళ్లు ఓ ఆటలాగా తింటారు. తినే ఆహారంలో శక్తినిచ్చే పదార్థాలు తగినంతగా లేకపోతే పెరుగుదల సరిగా వుండదు. పిల్లలు అంత చలాకీగా ఉండరు. పిల్లలకు పాలు, పండ్ల రసాలు చాలా ఎక్కువగా ఇస్తూ, ఘనాహారాన్ని చాలా పరిమితంగా పెట్టాలి. వివిధ రకాల ఆహార పదార్థాలు లేకుండా ఒకే మూసలో ఉండే ఆహారం పెట్టడం వల్ల పిల్లలకు ఎ విటమిన్, ఐరన్, డి విటమిన్, బి- కాంప్లెక్స్ విటమిన్ లోపాలు ఏర్పడతాయి. వాళ్లు బయటికి వెళ్లి ఆటలాడుకుంటారు. పైగా ఇది మంచిది, మంచిది కాదు అని తెలియదు దీంతో వారు తరుచుగా తరచుగా జబ్బు పడుతుంటారు. తేలికగా అంటువ్యాధులు సోకుతుంటాయి. అందువల్ల పరిశుభ్రమైన రకరకాల ఆహార పదార్థాలను పిల్లలకు పెట్టాలి. ఇవీ మార్గదర్శకాలు.. ప్రీ స్కూల్ పిల్లలకు తిండి కూడా ఓ ఆట వస్తువులానే వుంటుంది. అలాగే ఊహ తెలియకపోయినా ఇష్టం, అయిష్టం ఉంటాయని గుర్తించాలి. వయస్సుకు ఉండాల్సిన ఎత్తు (సెం.మీలలో) ఉండవలసిన బరువు (కిలోల్లో) వారిగా వివరాలు.. పుట్టినప్పుడు 50 - 3 ఏడాదికి 74 - 8.5 రెండేళ్లకు 81.5 - 10 మూడేళ్లకు 89 - 12 నాలుగేళ్లకు 96 - 13.5 అయిదేళ్లకు 102 - 15 అమ్మాయిలు వయస్సు ఉండాల్సిన ఎత్తు (సెం.మీలలో) ఉండవలసిన బరువు (కిలోల్లో) పుట్టినప్పుడు 50 - 3 ఏడాదికి 72.5 - 8 రెండేళ్లకు 80 - 9.5 మూడేళ్లకు 87 - 11 నాలుగేళ్లకు 94.5 - 13 అయిదేళ్లకు 101 - 14.5 కేలరీలు: ఏడాది వయసులో బిడ్డ బరువు కిలోకు వంద కిలో క్యాలరీలు అవసరం కాగా ఐదేళ్ల వయసులో 80 కిలో క్యాలరీలు కావాలి. ఏడాది వయసు వచ్చేటప్పటికి బిడ్డ రోజుకు మూడు పూట్ల భోజనంతో పాటు ఉదయం పూట అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ తినేలా చూడాలి. ఆ వయసులో తల్లి పాలు కానీ పోత పాలు కానీ వారికి అవసరమైన శక్తిలో పావు వంతు మాత్రమే అందించగలవు. అంటే అంత వరకు అనుబంధ ఆహారంగా ఉన్నది ఇక ముఖ్య ఆహారం కావాలి. పాలు, పండ్లు కూరగాయలు, చిక్కుడు జాతి గింజలు, గుడ్లు, మాంసం, చేపలు తదితరాలు తగు మొత్తాలతో ఉన్న సమతులాహారం బిడ్డకు అందేలా చూడాలి. పిల్లలకు ఏమాత్రం ఖాళీ దొరికినా సెల్ ఫోన్ కే పరిమితమైపోతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో గేములు, వీడియోలుకే బయట పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. స్నేహితులు కంటే ఫోనునే అంతలా ఇష్టపడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఫోనుకు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫోను నిత్యవసరమైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఫోనేను వాడడం మానుకోలేక, పిల్లలు అంతలా ఇష్టపడే ఫోను కేవలం పిల్లల మనో వికాసానికి అవసరమైన సలహాలు, ఆటలు ఆడేలా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిదిగా ఉంటే ఎంతబావుంటుందో కదా..! ముఖ్యంగా పిల్లలు టీనేజ్ వయసు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల వారితో ఏదో రకంగా సమయాన్ని కేటాయించాలి. అది వారికి అమూల్యమైన సమయంగా ఫీలయ్యేలా మీరు గనుక మీకున్న బిజీ షెడ్యూల్లో కనీసం ఓ అరగంట అయినా కేటాయించే యత్నం చేస్తే.. పిల్లలు సెల్ఫోన్లు లాంటి విష సంస్కృతికి అడిక్ట్ కారు. డిప్రెషన్‌కి గురయ్యి ఆత్మహత్య ధోరణి దరిదాపుల్లోకి వెళ్లరు. తల్లిదండ్రల గురించి ఆలోచించాలనే బాధ్యతయుతమైన వ్యక్తితత్వం తల్లిదండ్రుల సాన్నిహిత్యం ద్వారానే సాధ్యం. పిల్లలు బాగుపడాలన్నా, భవిష్యత్తు బాగుండాలన్ని అది తల్లిదండ్రల చేతుల్లోనే ఉందనేది గ్రహించండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి. పిల్లలకు తల్లిదండ్రలు మించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉండరు. తల్లిదండ్రలంటే భయం కాదు.. ప్రేమ, గౌరవం పిల్లల్లో కలిగేలా చేయాల్సింది తల్లిదండ్రులే కాబట్టి ముందు మీరే మారండి. --ఆయుర్వేద నిపుణులు, నవీన్ నడిమింటి (చదవండి: నాకిప్పుడు మూడోనెల, ఆ రిస్క్ ఉండకూడదంటే ఏం చేయాలి?) -
అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. క్రూడాయిల్ ధరల పెరుగుదల, యూఎస్ డాలర్ ఇండెక్స్ బలపడటం, బాండ్లపై అధిక దిగుబడులతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచవచ్చంటున్నారు. ఫ్యూచర్ ఆప్షన్ డెరివేటివ్‌ల ముగింపు గురువారం కావడంతో ఒడుదుడుకులు కొనసాగొచ్చు. ఎఫ్అండ్ఓ ముగింపు మినహా దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేనందున ప్రపంచ మార్కెట్ల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదిలికలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలింవచ్చంటున్నారు. ‘‘అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మరింత కాలం గరిష్ట స్థాయిలో కొనసాగించే అవకాశం ఉన్నందున ఈక్విటీలపై రిస్క్ తీసుకొనే సామర్ధ్యం తగ్గింది. మార్కెట్లో బలహీనతలున్నందున, ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాలు, లార్జ్ క్యాప్ షేర్లలో పెట్టుబడులు ఉత్తమం. నిఫ్టీ గతవారం కీలక మద్దతు 19,850–19,900 శ్రేణిని కోల్పోయి, 19,674 స్థాయి వద్ద స్థిరపడింది. తదుపరి మద్దతు 19,500–19,400 పాయింట్ల పరిధిలో ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ఫెడ్ రిజర్వ్ కఠిన ద్రవ్య విధాన వైఖరి అమలు వ్యాఖ్యలు, ఎఫ్ఐఐల నిరంతర విక్రయాలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర అధిక వెయిటేజీ షేర్లలో దిద్దుబాటు, బలహీన ప్రపంచ సంకేతాల పరిణామాల నేపథ్యంలో గతవారం స్టాక్ సూచీలు దాదాపు 3% క్షీణించాయి. సెన్సెక్స్ 1830 పాయింట్లు, నిఫ్టీ 518 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ప్రపంచ పరిణామాలు అమెరికా గృహ అమ్మకాల డేటా మంగళవారం విడుదల కానున్నాయి. యూరోజోన్ ఈసీబీ పాలసీ మినిట్స్ బుధవారం, అదే రోజున చైనా పారిశ్రామికోత్పత్తి, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య పాలసీ సమావేశం జరగనుంది. అమెరికా రెండో త్రైమాసిక వృద్ధి గణాంకాలు, ఈసీజీ సర్వసభ్య సమావేశం, చైనా కరెంట్ ఖాతా గురువారం వెల్లడి కానున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం ఫెడ్ చైర్మన్ పావెల్ ప్రసంగం ఉంది. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం సెపె్టంబర్ సీరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్(ఎఫ్అండ్ఓ) డెరివేటివ్‌ల ముగింపు జరగనుంది. ఒకవేళ నిఫ్టీ ఈ సిరీస్‌ను నష్టాలతో ముగిస్తే వరుసగా రెండో వారమూ నష్టాల ముగింపు అవుతుంది. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో ఎఫ్ఐఐల లాంగ్ ఎక్స్పోజర్ 47% తగ్గింది. పుట్–కాల్ రేషియో 0.93 ఓవర్‌సోల్డ్ జోన్ వైపు కదలుతోంది. మూడు వారాల్లో రూ.10 వేల కోట్లు వెనక్కి భారత ఈక్విటీలను విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. మన మార్కెట్ల నుంచి ఈ సెప్టెంబర్ తొలి మూడు వారాల్లో ఎఫ్ఐఐలు రూ. 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అమెరికాలో ఈసారి వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలు, మాంద్యం భయాలు, దేశీయంగా కంపెనీల షేర్లు ప్రీమియంలో ఉండటం వంటి అంశాలు అమ్మకాలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా బాండ్లపై అధిక దిగుబడులు, డాలర్ ఇండెక్స్ బలపడటంతో రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల కొనసాగొచ్చంటున్నారు. గడిచిన ఆరు నెలల్లో మార్చి నుంచి ఆగష్టు మధ్య ఎఫ్‌పీఐలు వరుసగా కొనుగోళ్లను కొనసాగించారు. ఈ మధ్యకాలంలో మొత్తం రూ. 1.74 లక్షల కోట్లను విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు. ‘‘భారత ఆర్థిక వృద్ధిలో అవకాశాలు, షేర్లు ఆకర్షణీయంగా ఉండటం, ప్రభుత్వ సంస్కరణలు విదేశీ పెట్టుబడులకు మద్దతిస్తున్నాయి. ఇటీవల కొంత అమ్మకాల ధోరణి కనిపించినప్పటికీ వచ్చే నెలలో విదేశీ పెట్టుబడులు తిరిగి ఈక్విటీల్లోకి వస్తాయి’’ క్రేవింగ్ ఆల్ఫా మేనేజర్ మయాంక్ మెహ్రా విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వారంలో మూడు ఐపీఓలు సెకండరీ మార్కెట్ అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న తరుణంలో ప్రాథమిక స్ట్రీట్ జోరు కనబరుస్తుంది. జేఎస్‌డబ్ల్యూ ఇ్రన్ఫాస్ట్రక్చర్, అప్డేటర్ సరీ్వసెస్ ఐపీఓలు ఈ నెల 25–27 తేదీల మధ్య జరగనున్నాయి. వాలియంట్ ల్యాబొరేటరీస్ పబ్లిక్ ఇష్యూ సెపె్టంబర్ 27న మొదలవుతుంది. కాగా గతవారంలో ప్రారంభమైన వైభవ్ జువెలర్స్ సెప్టెంబర్ 26న ముగిస్తుంది. వీటితో పాటు మరో 13 చిన్న, మధ్య తరహా కంపెనీలు మొత్తం రూ.4,000 కోట్లు సమీకరించనున్నాయి. -
AP: వచ్చే నెల వర్షాలే వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వచ్చే నెల ఆరంభం నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేయడంతో ఈ సీజన్లో కొద్దిరోజులుగా కానరాని వర్షాలు నాలుగైదు రోజుల్లో తిరిగి ప్రారంభమవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. నైరుతి రుతుపవనాల సీజను ఆరంభమైన జూన్‌లో మోస్తరుగా, జూలైలో విస్తారంగా వానలు కురిశాయి. ⛈️ ఆగస్టులో వర్షాల జాడ లేదు. ఈనెల ఆరంభం నుంచే రుతుపవన ద్రోణి (మాన్సూన్ ట్రఫ్) హిమాలయాల వైపు వెళ్లిపోయింది. వారం పది రోజుల తర్వాత తిరిగి ఇది దక్షిణాది వైపు రావడం సహజంగా జరిగే ప్రక్రియ. హిమాలయాల నుంచి కదిలి మధ్యప్రదేశ్‌పై కొన్నాళ్లు స్థిరంగా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురవడానికి దోహదపడుతుంది. ఆ మధ్య సమయంలోనే కొద్దిరోజుల పాటు బ్రేక్ మాన్సూన్ (వర్షాలకు విరామం) ఏర్పడి వానలకు అడ్డుకట్ట వేస్తుంది. ⛈️ అయితే ఈసారి అందుకు భిన్నంగా మూడు వారాలకు పైగా హిమాలయాల వద్దే రుతుపవన ద్రోణి తిష్ట వేసింది. ఫలితంగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిపించి వరదలకు కారణమైంది. రుతు పవన ద్రోణి దక్షిణాది వైపు కదలకపోవడంతో నైరుతి రుతుపవనాలు బలహీనమైపోయి ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు నెలలో అప్పుడప్పుడు అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలు కురిశాయి తప్ప సాధారణ వర్షాలు లేవు. ⛈️ ఈ ద్రోణి వచ్చే నెల ఒకటో తేదీ వరకు హిమాలయాల వద్దే కొనసాగి, ఆ తర్వాత దక్షిణాదికి మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. ఆ ప్రక్రియ మొదలైన నాలుగైదు రోజులకు రాష్ట్రంలో వర్షాలు మళ్లీ మొదలవుతాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ⛈️ రుతుపవన ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి సెప్టెంబర్ మొదటి వారం నుంచి వానలు సమృద్ధిగా కురిసేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం లేదా అంతకు మించి ఒకింత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ కూడా అంచనా వేసింది. జాడలేని అల్పపీడనాలు.. అరేబియా సముద్రం, బంగాళాఖాతం శాఖల నుంచి వేర్వేరుగా పయనించే రుతుపవనాల ప్రభావంతో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి, వర్షాలు కురుస్తాయి. కానీ ఈ సీజన్లో ఇప్పటిదాకా చెప్పుకోదగిన స్థాయిలో అల్పపీడనాలు ఏర్పడలేదు. ఈ ఏడాది ‘నైరుతి’ సీజను ఆరంభమైన కొన్నాళ్లకు రుతుపవనాలు చైనా, జపాన్ వైపు వెళ్లిపోయాయి. రుతుపవన ద్రోణి దిగువకు (దక్షిణం వైపునకు) రాకపోవడం, ఎల్‌నినో ప్రభావం వెరసి ఆగస్టులో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులేర్పడ్డాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. -
గ్లోబల్ ట్రెండ్, ఎఫ్‌పీఐలే కీలకం.. ఈ వారం మార్కెట్ దిశపై నిపుణుల అంచనాలు
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని తెలియజేశారు. ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఎఫ్‌పీఐ పెట్టుబడులకూ ప్రాధాన్యమున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసిక(ఏప్రిల్–జూన్) ఫలితాల సీజన్ ముగింపునకు చేరడంతో ఇకపై ఇన్వెస్టర్లు ఇతర అంశాలపై దృష్టి సారించనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ వివరించారు. జియో ఫైనాన్స్ లిస్టింగ్ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో నేడు(సోమవారం) లిస్ట్‌కానుంది. దేశీ ఎన్బీఎఫ్సీలలో రెండో పెద్ద కంపెనీగా ఆవిర్భవించిన సంస్థపై పలువురు కన్నేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. వెరసి ఈ కౌంటర్లో భారీ ట్రేడింగ్ యాక్టివిటీకి వీలున్నట్లు అంచనా వేశారు. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టేందుకు కారణంకానున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్ధ్ ఖేమ్కా పేర్కొన్నారు. మార్కెట్ల ట్రెండ్‌లోని ఇన్వెస్టర్ల దృష్టి కొన్ని రంగాల నుంచి మరికొన్ని రంగాలవైపు మళ్లడం సహజమన్నారు. విదేశీ పరిస్థితులు: యూఎస్‌లో గృహ విక్రయాలు, ఉపాధి గణాంకాలకు మార్కెట్లు స్పందించనున్నట్లు మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అర్విందర్ సింగ్ నందా పేర్కొన్నారు. అంతేకాకుండా యూరోజోన్, ఎస్అండ్పీ గ్లోబల్ కాంపోజిట్ పీఎంఐ గణాంకాలూ ప్రభావం చూపనున్నట్లు విశ్లేషించారు. ఈ వారం గ్లోబల్ గణాంకాలకుతోడు యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగానికి సైతం ప్రాధాన్యత ఉన్నట్లు ప్రస్తావించారు. ఇక దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ గత పాలసీ వివరాలు(మినిట్స్) వెలువడనున్నట్లు ప్రస్తావించారు. ఇతర అంశాలపైనా కన్ను అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, రుతుపవన పురోగతి సైతం దేశీ మార్కెట్ల ట్రెండ్‌కు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇటీవల యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ దూ కుడు చూపుతుండటంతో ఇకపై విదేశీ పెట్టుబడులు పరిమితంకావచ్చని, ఇది మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే వీలున్నదని జియోజిత్ ఫైనా న్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ అభిప్రాయపడ్డారు. గత వారం పారిశ్రామికోత్పత్తి, టో కు ధరల ద్రవ్యోల్బణం వెనకడుగు, ఇదే సమయంలో రిటైల్ ధరల వేడి వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు పేర్కొన్నారు. కాగా.. యూస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలకుతోడు పటిష్ట రిటైల్ అమ్మకాలు, చైనా కేంద్ర బ్యాంకు అనూహ్య రేట్ల కోత వంటి అంశాలతో గత వారం సెంటిమెంటు బలహీనపడింది. దీంతో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య స్వల్ప నష్టాలతో ముగిశాయి. చైనా మందగమనం, అభివృద్ధి చెందిన దేశాల వడ్డీ రేట్ల పెంపు అంచనాలు ఇందుకు కారణమయ్యా యి. సెన్సెక్స్ నికరంగా 374 పాయింట్లు(0.6 %) క్షీణించి 64,949 వద్ద స్థిరపడింది. వెరసి 65,000 స్థాయి దిగువకు చేరగా.. నిఫ్టీ 118 పాయింట్లు(0.6 శాతం) నీరసించి 19,310 వద్ద నిలిచింది. -
ఫోన్ కవర్లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా?.. ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే?
మన దేశంలో చాలామంది తమ స్మార్ట్ ఫోన్ కవర్ లోపలివైపు 10, 20, 50, 100, 500 నోట్లు పెడుతుంటారు. రూపాయి నోట్లను ఫోన్ కవర్లో పెడితే అత్యవసర సమయంలో పనికి వస్తుందని భావిస్తుంటారు. అయితే ఇలా చేయడం ఎంతవరకూ ప్రమాదకరంగా పరిణమిస్తుందో చాలామందికి తెలియదు. కరెన్సీ నోట్లను ఇలా పెట్టడంవలన ఆ ఫోను కలిగినవారి ప్రాణాలు గాలిలో కలసిపోయే అవకాశం ఉంది. ఫోన్ కవర్లో రూపాయినోట్లను ఉంచడం ఎందుకు ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం. వేడిని బయటకు విడుదల కానివ్వదు ఫోన్‌ను నిరంతరం ఉపయోగిస్తున్నప్పుడు అది వేడిగా మారడాన్ని గమనించే ఉంటాం. ఫోన్ వేడెక్కిన వెంటనే ఫోన్ వెనుక భాగంలో దాని ప్రభావం కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఫోన్ కవర్లో కరెన్సీ నోటు ఉన్నట్లయితే, అప్పుడు ఫోన్ నుంచి వేడి బయటకు విడుదల కాదు. దీంతో ఆ ఫోను పేలిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఫోన్‌కు బిగుతుగా ఉండే కవర్‌ను ఉపయోగించకూడదని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే అది ఫోన్ పేలిపోయేలా చేస్తుందని అంటుంటారు. నోట్ల రసాయనాలు ప్రాణాంతకం కరెన్సీ నోట్లను కాగితంతో తయారు చేస్తారు. అలాగే అనేక రకాల రసాయనాలను కూడా ఉపయోగిస్తారు. ఫోన్ వేడెక్కిన సందర్భంలో.. అది బయటకు వెలువడకుండా రసాయినాలతో కూడిన కరెన్సీ నోటు అడ్డు పడితే ఆ పోన్ పేలిపోయేందుకు అవకాశం ఏర్పుడుతుంది. అందుకే పొరపాటున కూడా ఫోన్ కవర్లో ఎలాంటి కరెన్సీ నోటును ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫోన్ కవర్ బిగుతుగా ఉన్నా, అది పేలిపోయే అవకాశం ఉందని, అందుకే ఫోన్ కవర్ ఎంపికలో జగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక.. -
బంగారం ఎలా ఉన్నా బంగారమే
బంగారం అంటే ఆభరణాల రూపంలో కొనుగోలు చేయడమే ఎక్కువ మందికి తెలిసిన విషయం. కానీ, నేడు డిజిటల్ రూపంలోనూ ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నాయి. సార్వభౌమ బాండ్లు, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌లు గురించి తెలిసింది తక్కువ మందికి. ఇటీవలి కాలంలో ప్రచారం కారణంగా డిజిటల్ బంగారం సాధనాల పట్ల అవగాహన పెరుగుతోంది. భౌతిక రూపంలో కంటే డిజిటల్ రూపంలో కొనుగోలు చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. అలా అని బంగారం ఆభరణాలు, కాయిన్లు కొనడానికి దూరంగా ఉండాలని కాదు. డిజిటల్ సాధనాలు వచి్చనప్పటికీ బంగారం ఆభరణాల రూపంలో పెద్ద మొత్తంలో విక్రయం అవుతూనే ఉంది. నిజానికి డిజిటల్‌గానూ, భౌతికంగానూ ఏ రూపంలో ఉన్నప్పటికీ పసిడికి ఉన్న డిమాండ్ ఎంతో ప్రత్యేకం. భౌతిక బంగారంతోనూ కొన్ని అనుకూలతలు ఉన్నాయి. అవేంటో తెలియజేసే కథనమే ఇది. బంగారం ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేసినప్పుడు తయారీ చార్జీలు, తరుగు విధిస్తుంటారు. తయారీలో వృథాగా పోయే మొత్తాన్ని కస్టమర్ నుంచే వర్తకులు రాబడుతుంటారు. కనుక పెట్టుబడి కోసం చూసేవారు, భవిష్యత్తులో ఆభరణాల కోసమని కొంచెం, కొంచెం సమకూర్చుకునేవారు డిజిటల్ బంగారానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తుంటారు. డిజిటల్‌గా ఉంటే బంగారం భద్రంగా దాచుకునేందుకు లాకర్ల అవసరం ఉండదని చెబుతుంటారు. బంగారం తీసుకెళ్లి బ్యాంక్ లాకర్లలో పెట్టడం ద్వారా రక్షణ పొందొచ్చు. కానీ ఏటా లాకర్ నిర్వహణ చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. డిజిటల్ రూపంలో ఉంటే కనిపించే ప్రయోజనాలు ఇవి. అలా అని భౌతిక బంగారం అవసరం లేదా? బంగారాన్ని భౌతిక రూపంలో కలిగి ఉంటే ప్రయోజనం లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అన్ని అంశాలను సమగ్రంగా తెలుసుకోవాల్సిందే. వినియోగ డిమాండ్ చారిత్రకంగా చూస్తే.. ఆభరణాల కోసం విస్తృతంగా వినియోగించడం వల్లే బంగారానికి ఈ స్థాయి విలువ సమకూరింది. అందుకే బంగారం ధరలను వినియోగం ప్రభావితం చేస్తుంటుంది. కాలక్రమేణా ఇన్వెస్టర్లు తమ సంపద విలువను కాపాడుకునే సాధనంగానూ ఇది మారిపోయింది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కాచుకునే హెడ్జింగ్ సాధనంగా అవతరించింది. పెట్టుబడుల పరంగా డిజిటల్ బంగారాన్ని ఎంతో ప్రోత్సహించినప్పటికీ, అదే సమయంలో భౌతిక రూపంలో బంగారానికి అంతకంటే డిమాండ్ ఎక్కువేనని చెప్పుకోవాలి. అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ మారకం నిల్వల్లో కొంత మొత్తాన్ని భౌతిక బంగారం రూపంలోనే నిర్వహిస్తుంటాయి. ఆరి్థక అనిశి్చతుల్లో దీన్ని రక్షణ సాధనంగా పరిగణిస్తుంటారు. అందుకే దశాబ్దాలు గడిచినా బంగారం డిమాండ్ పెరుగుతోంది. లిక్విడిటీ సాధనం పెట్టుబడి సాధనం ఏదైనా కానీయండి, అందులో లిక్విడిటీకి ప్రాధాన్యం ఇవ్వడం అన్నింటికంటే ముఖ్యమైన అంశం అవుతుంది. బంగారం విషయంలో లిక్విడిటీకి (కావాల్సినప్పుడు వెంటనే నగదుగా మార్చుకోవడం) ఢోకా ఉండదు. ఆభరణాల వర్తకుడి వద్దకు వెళ్లి సులభంగా విక్రయించుకోవచ్చు. బంగారం డిజిటల్, భౌతికం ఏ రూపంలో ఉన్నా లిక్విడిటీకి ఇబ్బంది దాదాపుగా ఉండదు. ‘‘బంగారం ఆభరణాలపై బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తుంటాయి. అవే బ్యాంకులు వజ్రాలపై రుణాలను ఇవ్వవు’’ అని ఇండియా బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ సురేంద్ర మెహతా తెలిపారు. భౌతిక బంగారం అయితే గంటలోపే దాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. లేదంటే పనిదినాల్లో అయితే బ్యాంక్‌కు వెళ్లి గంట, రెండు గంటల్లోనే రుణాన్ని పొందొచ్చు. కానీ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో విక్రయించిన తర్వాత సొమ్ము చేతికి అందాలంటే రెండు రోజులు పడుతుంది. సావరీన్ గోల్డ్ బాండ్లో పెట్టుబడుల కాలవ్యవధి ఎనిమిదేళ్లు. కానీ, ఐదేళ్ల తర్వాతే విక్రయించుకోవచ్చు. సెకండరీ మార్కెట్లో ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు కానీ లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని బ్యాంకులు సావరీన్ గోల్డ్బాండ్పైనా రుణం ఇస్తున్నాయి. విలువ పరంగానే కాదు, భౌతిక బంగారంతో భావోద్వేగమైన బంధం కూడా ఉంటుందన్నది నిజం. ఒకవైపు పెట్టుబడికి, మరోవైపు ఆడంబర సాధనంగా వినియోగించే ఏకైక కమోడిటీ బంగారమే. భౌతిక రూపంలో బంగారా న్ని తమ గౌరవ చి హ్నంగానూ భావిస్తుంటారు. డిజిటల్ గోల్డ్‌తో ఇది రాదు. ఆదుకునే సాధనం ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు బంగారం ఆదుకునే సాధనంగా పూర్వ కాలం నుంచి గుర్తింపు ఉంది. కరోనా వంటి విపత్తులు ఎదురైనప్పుడు చాలా మందిని ఈ బంగారమే ఆదుకుందని మెహతా పేర్కొన్నారు. బంగారాన్ని బులియన్ రూపంలో (ఆభరణం కాకుండా) కలిగి ఉంటే అప్పుడు తయారీ చార్జీల రూపంలో నష్టపోయేదేమీ ఉండదు. అవసరమైనప్పుడు బులియన్ గోల్డ్‌ను ఆభరణాలుగా మార్చుకోవచ్చు. అలా సమకూర్చుకున్న బులియన్ గోల్డ్, బంగారం కాయిన్లను భవిష్యత్తులో వివాహ సమయాల్లో ఆభరణాల కోసం వినియోగించుకోవచ్చు. భౌతిక బంగారానికి ఉన్న ఒకే ఒక రిస్క్ భద్రత. అందుకని భద్రత కోసం బ్యాంక్ లాకర్‌ను ఆశ్రయించొచ్చు. లేదంటే ఇంట్లోనే ఆభరణాలను ఉంచుకునేట్టు అయితే, హోమ్ ఇన్సూరెన్స్ తీసుకుని వాటికి రక్షణ కలి్పంచుకోవాలి. బ్యాంక్ లాకర్‌కు వార్షిక నిర్వహణ చార్జీలు, హోమ్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం రూపంలో కొంత వ్యయం చేయాల్సి వస్తుంది. కాకపోతే ఈ చార్జీలు మరీ అంత ఎక్కువా? అన్నది ఒక్కసారి సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఇతర రూపాల్లోని బంగారంలోనూ కొంత వ్యయాలు ఉంటుంటాయి. ‘‘డిజిటల్ గోల్డ్ రూపంలోనూ చార్జీలు ఉంటాయి. కనుక ఇక్కడ చార్జీలనేవి ప్రధాన అంశం కాబోదు. కాకపోతే, భౌతిక రూపంలోని బంగారాన్ని నిల్వ చేసుకోవడంలోనే సమస్యలు. కానీ, చాలా మందికి భౌతిక బంగారం సౌకర్యాన్నిస్తుంది. ఇది డిజిటల్ గోల్డ్ వల్ల రాదు’’అని మై వెల్త్ గ్రోత్ సంస్థ వ్యవస్థాపకుడు హర్షద్ చేతన్‌వాలా పేర్కొన్నారు. అన్ని ముఖ్య వేడుకలు, శుభ కార్యక్రమాలకు బంగారం ఆభరణాలను ధరించడాన్ని చాలా మంది గొప్పగా భావిస్తుంటారు. ప్రియమైన వారిని సంతోష పెట్టేందుకు బంగారం మించిన సాధనం లేదన్నది మెహతా అభిప్రాయం. డిజిటల్, వర్చువల్ రూపంలోని బంగారంతో అంత సంతోషం రాదు. కనుక బ్యాంక్ లాకర్ లేదా బీమా ప్రీమి యం అనేది పెద్ద అంశం కాబోదని చేతన్ వాలా అభిప్రాయపడ్డారు. ‘‘అత్యవసర పరిస్థితులు ఏర్పడితే భౌతిక రూపంలోని బంగారాన్ని వెంటనే విక్రయించుకోవచ్చు. కాయిన్ లేదా ఆభరణం ఏ రూపంలో ఉందన్నది కీలకం అవుతుంది. ఆభరణాల రూపంలో అయితే జ్యుయలర్ కొంత మొత్తాన్ని చార్జీల రూపంలో మినహాయించుకోవచ్చు. డిజిటల్ గోల్డ్‌ను సైతం వెంటనే మానిటైజ్ (నగదుగా మార్చుకోవడం) చేసుకోవచ్చు. ఎక్సే్ఛంజ్‌లో విక్రయించినప్పుడు ఆ మొత్తం బ్యాంక్ ఖాతాకు వచ్చి జమ అవుతుంది’’అని చేతన్ వాలా వివరించారు. ఎంత.. ఏ రూపంలో..? డిజిటల్, భౌతిక బంగారం రెండింటిలోనూ అనుకూలతలు, ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. ఆభరణాలు, కాయిన్లు, అలాగే డిజిటల్ గోల్డ్ సాధనాల రూపంలో పెట్టుబడులు కలిగి ఉండాలన్నది కొందరు నిపుణుల ఇచ్చే సూచన. ఒక వ్యక్తి తన మొత్తం పెట్టుబడుల్లో 5–15 శాతం మధ్య పసిడికి కేటాయించుకోవచ్చు. ఉదాహరణకు పోర్ట్‌ఫోలియోలో 10 శాతాన్ని బంగారానికి కేటాయించారని అనుకుందాం. ఇప్పుడు ఈ 10 శాతంలో కొంత డిజిటల్ గోల్డ్, కొంత భౌతిక బంగారం రూపంలో ఉండాలి. భౌతికంగా అంటే ఆభరణాలా లేక కాయిన్లా? అన్నది తమ వ్యక్తిగత అవసరాలు, అభిరుచుల ఆధారంగానే నిర్ణయించుకోవాలి. ఆభరణాల రూపంలో అయితే అవసరమైన వాటికే పరిమితం కావాలి. మిగిలినది కాయిన్లు, బార్ల రూపంలో కలిగి ఉండాలి. దీనివల్ల తయారీ, తరుగు చార్జీలను ఆదా చేసుకోవచ్చు. భవిష్యత్తులో పిల్లల వివాహాల కోసం భౌతిక రూపంలోనే పసిడిని పోగేసుకునే వారు ఆభరణాలకు బదులు కాయిన్లు కొనుగోలు చేసుకోవడం నయం. ఎందుకంటే ఆభరణాల రూపంలో కొనుగోలు చేసినా, భవిష్యత్తులో వాటిని మళ్లీ కొత్త ఆభరణాల కోసం మార్చుకోవాల్సి వస్తుంది. కనుక భవిష్యత్తులో అదే రూపంలో వినియోగించనప్పుడు ఆభరణాలు తీసుకోవడం సరికాదు. అంతేకాదు భవిష్యత్తు కోసం లేదంటే అత్యవసరాల్లో ఆదుకుంటుందన్న ఉద్దేశంతో బంగారాన్ని సమకూర్చుకునే వారు ఆభరణాల రూపంలో కాకుండా వేరే మార్గాన్ని పరిశీలించాలి. ఎందుకంటే అవసరం వచి్చనప్పుడు విక్రయించేట్టు అయితే వర్తకులు ఆ ఆభరణాల నుంచి కొంత మొత్తాన్ని చార్జీల పేరుతో మినహాయించుకుంటారు. రోజువారీ ధరించేవి, పెళ్లిళ్లు, ముఖ్య వేడుకల సందర్భంగా ధరించేవి, ఇతరులకు బహుమానంగా ఇచ్చేవి మినహా మిగిలినదంతా డిజిటల్ సాధనాల రూపంలో తీసుకోవడాన్ని పరిశీలించాలి. పెట్టుబడి దృష్ట్యా డిజిటల్ సాధనాలు మెరుగైనవి. ఎందుకంటే వీటి క్రయ, విక్రయాలు చాలా సులభంగా, వేగంగా చేసుకోవచ్చు. డిజిటల్ గోల్డ్‌ను సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో ప్రతీ నెలా కొనుగోలు చేసుకుంటూ, అలా సమకూరిన పసడిని అవసరమైనప్పుడు ఆభరణాలుగా మార్చుకోవచ్చు. కొందరు అయితే ప్రతీ నెలా తమకు తోచినంత కాయిన్ల రూపంలో సమకూర్చుకుని, అవసరమైనప్పుడు వాటిని ఆభరణాలుగా మార్చుకుంటుంటారు. కనుక ప్రతి ఒక్కరూ తమ పోర్ట్‌ఫోలియోలో డిజిటల్, భౌతిక బంగారానికి చోటు కలి్పంచుకోవడం సరైనదేనన్నది నిపుణుల సూచన. డిజిటల్ సాధనాల్లో సావరీన్ గోల్డ్ బాండ్లో ఎలాంటి వ్యయాలు, ఖర్చులు ఉండవు. పైగా బంగారం పెట్టుబడి విలువపై ఎనిదేళ్ల పాటు ఏటా 2.5 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. డిజిటల్‌గా ఇది మెరుగైన సాధనం. -
వెన్నునొప్పి..క్యాన్సర్‌కి సంకేతమా?..!
వెన్ను నొప్పి అనేది అందరికి తెలుస్తుంది. ఇటీవల కాలంలో తరుచుగా వింటున్నాం కూడా. వెన్నునొప్పిగా అనిపిస్తే మూవ్ లేదా ఇతరత్రా రిలీఫ్ బామ్‌లు రాసుకుని రిలాక్స్ అవుతుంటాం. చాలా మంది దీన్ని సాధారణ సమస్యగానే భావిస్తారు. తట్టుకోలేనంత స్థితి ఎదురైతే గానీ వైద్యులు దగ్గరకు వెళ్లరు. ఔనా! కానీ ఆరోగ్య నిపుణులు అలా చేయొద్దు అంటున్నారు. కొన్ని రకాల క్యాన్సర్లు.. వెన్నునొప్పి సంకేతం చూపిస్తాయట. శరీరంలో ఏదైనా భాగం నుంచి క్యాన్సర్ కణాలు ఎముకల ద్వారా వెన్నుకి స్ప్రెడ్ అయితే వెన్ను నొప్పి ద్వారా ఇండికేట్ చేసే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అలా అని వెన్ను నొప్పి అనేది క్యాన్సర్‌కి సంబంధించిన లక్షణం కూడా కాదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం రోమ్ము, ఊపిరితిత్తులు, వృషణాలు, పెద్దప్రేగు, అనే నాలుగు సాధారణ క్యాన్సర్లు వెన్నునొప్పి ద్వారా సంకేతం చూపిస్తాయట. ఆయా భాగాలు అన్నీ శరీరీ నిర్మాణ పరంగా వెనుముకకు దగ్గరగా ఉన్నందున వెన్ను వరకు వ్యాపించే అవకాశం ఉంటుదని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఊపిరితిత్తు క్యాన్సర్‌ని ఫేస్ చేస్తున్న 25 శాతం మంది రోగులు తమకు మొదట వెన్ను నొప్పి వచ్చిందని చెప్పినట్లు వెల్లడించారు. యూకే అధ్యయనంలో కూడా ఇది వెల్లడైంది. ఇలాంటి వెన్నునొప్పి..బరువు తగ్గిపోవడం, రాత్రిపూట చెమటలు, చలి జ్వరం వంటి లక్షణాలను ఫేస్చేస్తున్న క్యాన్సర్ పేషెంట్లలో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. ఇలాంటి క్యాన్సర్‌తో బాధపడుతున్న పేషెంట్లు వాళ్లు ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా బరువు తగ్గిపోతారట. వాళ్లలోని శక్తి తొందరగా బర్న్ అయిపోతుందట. పైగా ఇలా క్యాన్సర్ సంకేతంగా వచ్చే వెన్నునొప్పి అత్యంత అసౌకర్యంగా ఉంటుందని, చాలా పెయిన్‌తో కూడినదని చెబుతున్నారు. అందువల్ల దయచేసి వెన్నునొప్పి వస్తే సరైన భంగిమ వల్లన లేక మరేదైన కారణంతోనే గమనించండి. అవసరం అనుకుంటే వైద్యులని సంప్రదించండి. నిర్లక్షంతో జీవితాన్ని కోల్పోకండి. (చదవండి: సెలూన్‌కి వెళ్లే పనిలేకుండా..మీ హెయిర్‌ని స్ట్రయిట్ చేసుకోండిలా..) -
'ఒబెసిటీ'కి సరికొత్త పేరు..ఇక అలా పిలవొద్దని సూచన!
అధిక బరువు ఉంటే ఒబిసిటీ అని పిలిచేవారు కదా. ఇక నుంచి అలా పిలవకూడదట. ఎందకంటే ఆ పదమే పేషెంట్ సమస్యకు మరింత కారణమవుతుందని, అందువల్ల దానికి పేరు మార్చాలని ఆరోగ్య నిపుణులు నిర్ణయించారు. అధిక బరువు ఉన్నవాళ్లని సమాజం ఎలా చూస్తుందో అందరికీ తెలిసిందే. పలువురుతో జరిపిన విస్తృత చర్చల అనంతరం అధికం బరువు సమస్యకు కొత్త పేరు పెట్టాలనే వాదన వినిపించింది. లావుగా ఉన్నవారికి వారు అలా ఉన్నదాని కంటే ఆ పేరే వారిని ఇబ్బందుల పాలు చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే అధిక బరువు సమస్యను మరోక పేరు పెట్టాని నిపుణలు భావించారు. పేరు మార్చాల్సినంత నీడ్.. 1950లలో స్వలింగ సంపర్కాన్ని సామాజిక వ్యక్తిత్వ భంగంగా భావించారు. ఆ తర్వాత అనేక నిరసనలు, వ్యతిరేకతలు గట్టిగా రావడంతో దాన్ని అపకీర్తిగా భావించడం మానేశారు. అదోక మానసిక రుగ్మతకు సంబంధించినదని అంగీకరించారు. అలానే ఫ్యాటీ లివర్ వ్యాధి విషయంలో కూడా ఇదే సమస్య ఎదురైంది. నిజాని నాన్ ఆల్కహాలిక్లకు కూడా ఈ ఫ్యాటీ లివర్ అని పేరు మార్చాలనే వాదన తెరపైకి వచ్చింది. దీంతో ఆ తర్వాత ఆ వ్యాధికి మెటబాలిక్ డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్" అని పేరు పెట్టారు.ఈ నేపథ్యంలోనే ఒబెసిటీ అనే పదం మార్చడం తప్పనిసరైంది. అదీగాక ఆయా పేషంట్లు ఆ పేరు కారణంగానే సమాజంలోనూ, కుటుంబ పరంగాను వివక్షకు గురవ్వుతున్నారు. కొత్తపేరు బీఎంఐకి మించి ఉండాలి అధిక బరువును బీఎంఐల ద్వారా నిర్ణయిస్తారు. బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు ఇది కూడా సరిపోదు. ఇది కండర ద్రవ్యరాశిని లెక్కించదు, శరీర బరువు లేదా కొవ్వు కణజాలం (శరీర కొవ్వు) గురించి సరైన సమాచారం ఇవ్వదు. నిపుణులు సూచించిన కొత్తపేరు ఈ ఒబెసిటీని “అడిపోసిటీ ఆధారిత దీర్ఘకాలిక వ్యాధి” అని పిలవాలని సూచించారు ఆరోగ్య నిపుణులు. దీని పేరులోనే ఆ వ్యాధి ఏంటో అవగతమవుతుంది. జీవక్రియలు పనిచేయకపోవడమే ఈ వ్యాధి లక్షణం అని తెలుస్తుంది. ఈ పేరు కారణంగా సమాజ దృక్పథం మారి చులకనగా చూసే అవకాశం తగ్గుతుంది. అధిక బరవు సమస్య అనేది వ్యాధేనా.. అధిక బరవు అనేది శారీరక లేదా మానసిక వ్యవస్థలు సరిగా పనిచేయక పోవడం వల్ల ఎదురయ్యే సమస్య దీన్నిబట్టి ఆ సమస్యను వ్యాధిగా పరిగణించలేం. మొదట్లో అధిక బరువు హానికరం కాకపోవచ్చు. కొందరూ లావుగా ఉన్నా.. వారికి ఎలాంటి హెల్త్ సమస్యలు ఉత్పన్నం కావు. కొందరికి క్రమేణ అధిక బరువు వివిధ శారీరక సమస్యలకు దారితీస్తుంది. ఈ పేరు మార్పు కారణంగా ప్రజలకు ఆయా వ్యకుల పట్ల చులకన భావం, హేయభావం తగ్గి వారి సమస్యను అర్థం చేసుకునే యత్నం చేయగలుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: కార్యాలయాల్లో ఓన్లీ 'వై' బ్రైక్!ఏంటంటే ఇది!) -
మీ బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే.. ఇలా చేయండి..
సాధారణంగా యంగ్‌గా ఉన్నప్పుడు ఉన్నంత జ్ఞాపకశక్తి కాస్తా.. ఉండగా, ఉండగా..అంటే వృద్ధాప్యంకి చేరవయ్యేటప్పటికీ తగ్గిపోతుంది. అలా ఎందువల్ల జరగుతుందని, శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనాలు చేస్తూ వచ్చారు. ఆ దిశలో ఎంతవరకు పురోగతి సాధించారో తెలియదు గానీ ..వారి అధ్యయనంలో అలా బ్రెయిన్ చురుకుదనం తగ్గిపోకుండా మునుపటిలా షార్ప్‌గా ఉండేలా ఏం చేయాలో కనుగొన్నారు. దీంతో వృద్ధాప్యంలో ఎదురయ్యే బ్రెయిన్‌కి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అంటున్నారు. అందుకు కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే చాలు మంచి జ్ఞాపకశక్తి మీ సొంతం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు వారు 70ల వయసు ఉన్న కొందరూ వృద్ధులపై పరిశోధనలు జరిపారు. వారందరికి ఒకేసారి వారికి ఇష్టమైన రంగాల్లో నైపుణ్యం సంపాదించేలా ట్రైనింగ్ ఇచ్చారు. వారంతా వారానికి 15 గంటలు హోంవర్క్ చేయడం, తరగతి గదుల్లో కూర్చోవడం వంటివి చేశారు. వారు కొత్తభాషలు, ఫోటోగ్రఫీ, వంటి ఇతరత్రా సృజనాత్మక కోర్సులను అభ్యసించడం వంటివి చేశారు. ఆ క్రమంలో వారికి తెలయకుండానే వారి మొదడు 30ల వయసులో ఉండే వారి బ్రెయిన్ మాదిరిగా షార్ప్‌గా ఉండటం గమనించారు. వారి చిన్నప్పటి జ్ఞాపకాలతో సహాఅన్ని చెబుతుండటం. ఠక్కున దేని గురించి అయినా చెప్పేయడం వంటివి జరిగాయి. దీంతో వారు మెదడును ఖాళీగా ఉంచకుండా మంచి వ్యాపకాలతోనే మనకి ఇష్టమైన అభిరుచిలతో బిజీగా ఉండేలా చేయడం చేస్తే.. మన మెదడులో పిచ్చిపిచ్చి ఆలోచనల ప్రవాహం తగ్గి చురుగ్గా ఉండటం ప్రారంభిస్తుందని అన్నారు. అలాగే ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారించడం అనేది మీ మెదడుకు ఓ వ్యాయామంలా ఉండటమేగాక మీలో దాగున్న స్కిల్స్ బయటకు వస్తాయి. పైగా మీ బ్రెయిన్ కూడా ఆరోగ్యంగా ఉండి యువకుల్లో ఉండే మాదిరిగా చురుగ్గా బ్రెయిన్ ఉంటుందన్నారు. (చదవండి: అంతుతేలని ఇద్దరి యువతుల మిస్టరీ గాథ..చంపేశారా? మరణించారా!..) -
తెలుసా! గోళ్ల ఆకారాన్ని బట్టి మీరెలాంటి వారో చెప్పేయొచ్చు!
మీ గోళ్ల ఆకృతి మీ గురించి, మీ వ్యక్తిత్వ లక్షణాలను వెల్లడిస్తుందని తెలుసా!. ఔను అనే చెబుతున్నారు నిపుణులు. గోళ్ల ఆకృతి ద్వారా వారి వ్యక్తిత్వాన్ని ఈజీగా అంచనా వేయొచ్చు అంటున్నారు నిపుణులు. వారు జరిపిన అధ్యయనాల ప్రకారం..నాలుగు రకాల గోళ్ల ఆకృతిపై జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీన్ని 'నెయిల్ షేప్ పర్సనాలిటీ టెస్ట్‌గా' పేర్కొన్నారు. ఈ గోళ్ల ఆకారం బట్టి మీ నిర్ణయాలు మంచివేనా, మీరు ఎలాంటి మనస్తతత్వం కలవారో చెప్పొచ్చని చెబుతున్నారు నిపుణులు. అయితే ఆలస్యం ఎందుకు? మీ గోళ్లు ఏ ఆకారంలో ఉన్నాయో చెక్‌చేసుకుని మీ వ్యక్తితత్వం అలానే ఉందా లేదో తెలుసుకునేందుకు సిద్ధంకండి! వ్యక్తిత్వాన్ని అంచనావేసే గోళ్ల ఆకారాలను నాలగు రకాలుగా విభజించారు నిపుణులు అవి పొడవాటి గోర్లు, గుండ్రటి గోర్లు, చతురస్రం, దీర్ఘచతురస్ర ఆకార గోర్లుగా విభజించారు. నిలువుగా పొడవాటి గోర్లు ఉన్నట్లయితే.. ఇలాంటి గోర్లు ఉన్నవాళ్లు సృజనాత్మకంగా ఉంటారు. సూక్ష్మ బుద్ధికలవారై ఉంటారు. వీరికి అవసరాన్ని బట్టి హేతుబద్ధంగా, తార్కికంగా కూడా ఆలోచిస్తారు. తమ సృజనాత్మక ధోరణితో సమస్యలను ఈజీగా పరిష్కరించగలుగుతారు. చాలా సున్నితంగా ఉంటారు. ఎక్కువగా నిరుత్సాహానికి గురవ్వుతుంటారు. దీంతో అక్కడే చతికిలపడిపోతారు. తిరిగి నూతనోత్సాహాంతో యథాస్థితికి రావటానికి ఎక్కువ సమయమే పడుతుంది. ఊహించని సవాళ్లను ఎదుర్కొనే సమయంలో నిరుత్సాహపడిపోతుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో భావోద్వేగాలను ప్రదర్శించకుండా స్వీయ నియంత్రణలో ఉండేదుకు యత్నించి.. నిరుత్సాహన్ని అధిగమించే యత్నం చేస్తే సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు అంటున్నారు నిపుణులు. దీర్ఘచతురస్రాకార గోర్లు.. వీరు ఓపెన్‌మైండెడ్‌గా ఉంటారు. మంచి నమ్మకస్తులుగా కూడా ఉంటారు. భాధ్యతాయుతంగా పనిచేస్తారు. వీరికి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. వీరు అవతలి వాళ్ల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నపటికీ.. తన మనసులో మాటను చెప్పడానికి భయపడరు. గొప్ప సంభాషణ చతురత వీరికి మంచి ప్లస్ పాయింట్‌గా ఉంటుంది. ఇతరులను ప్రభావితం చేయడంలో కూడా గొప్ప నైపుణ్యం ఉన్నవారై ఉంటారు. అందరితోనూ మంచి సంబంధాలను నెరపగల నేర్పరి కూడా. కట్టుబాట్లను అనుసరించడానికే ఇష్టపడతారు. ఈజీగా భావోద్వేగాలను వ్యక్తపరిచినప్పటికీ పరిస్థితిని బ్టటి ..తనను తాను నియంత్రించికుని సానుకూలంగా స్పందించగల సామర్థ్యం వీరి సొంతం. గుండ్రటి గోళ్లు కల వ్యక్తి లక్షణాలు ఈ ఆకృతి గల వ్యక్తి అంత తేలికగా కంగారుపడరు. ఒత్తిడికి గురికారు కూడా. ప్రతి విషయాన్ని చాలా తెలివిగా పరిష్కరిస్తారు. పరిశోధనాత్మకంగా ఉంటారు. ప్రశ్నించే గుణం ఎక్కువ. కొత్త సమాచారం కోసం వెతుకుతుంటారు. గొప్ప అభ్యాసకులుగా ఉంటారు. ఎదురు దెబ్బల తట్టుకుని పుంజుకుని నిలబడగల సామర్థ్యంతో ఉంటారు. వీరు చాలా ఆశావాదులు. ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. వీరికి సెంటిమెంట్లు కూడా ఎక్కువే. అందర్నీ ఆదరించే స్వభావం కారణంగా ఇతరుల భావాలను సులభంగా అర్థంచేసుకోగలరు త్వరితగతిన స్నేహితులను సంపాదించుకోగలరు. విభేధాలను పరిష్కరించడంలో దిట్ట. చతురస్రాకార గోళ్లు ఉంటే.. వీరు చాలా స్వతంత్రంగా ఉంటారు., ఇతరులు ఏమి చేయాలో చెప్పడం వీరికి ఇష్టం ఉండదు. స్వంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. వినూత్న మార్గంలో పనిచేయడానకి ఇష్టపడతుంటారు. రిస్క్ తీసుకోవడానికి భయపడరు. సాహసం అంటే ఇష్టపడే వీరు ఎల్లప్పుడూ కొత్తవాటి కోసం అన్వేషిస్తూ..కొత్త కొత్త ప్రదేశాలను తరుచుగా సందర్శిస్తుంటారు. లక్ష్యం కోసం ఎంత శ్రమననై ఓర్చకుని పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. సవాళ్లను ఎదుర్కొవడంలో దృఢంగా ఉంటారు. గొప్ప నాయకుడిగా ఉంటారు. అవతలి వాళ్లు ఏమనుకుంటున్నారో అనే దానికి ప్రాధాన్యత ఇవ్వరు, కేవలం వారు చెప్పాలనుకున్నది చెప్పేందుకే ఇష్టపడుతుంటారు. అలాగే కుటుంబం, స్నేహితులకు ప్రాముఖ్యత ఇవ్వడమే గాక మంచి శ్రేయోభిలాషిగా ఉంటారు కూడా. (చదవండి: ఆ కుక్క చనిపోయి వందేళ్లు..కానీ ఇంకా బతికే ఉంది ఎలాగో తెలుసా!) -
దిద్దుబాటు కొనసాగొచ్చు.. మార్కెట్ గమనంపై నిపుణుల అంచనాలు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ దిద్దుబాటు (కరెక్షన్) కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కరెక్షన్ పరిమితంగా ఉంటూ.., తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉందంటున్నారు. బక్రిద్ సందర్భంగా బుధవారం సెలవు కావడంతో నాలుగురోజులే ట్రేడింగ్ జరుగుతుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డెరివేటివ్‌ల గడువు ముగింపు గురువారం ఉంది. గతవారం(జూన్ 22న) మొదలైన విప్రో రూ.12,000 బైబ్యాక్ ఇష్యూ గురువారమే ముగియనుంది. ఇదే వారంలో చిన్న, మధ్య తరహా కంపెనీలతో మొత్తం ఏడు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. అంతర్జాతీయంగా రష్యాలో అంతర్యుద్ధ పరిణామాలు, ఈసీబీ ఫోరమ్ నిర్వహించే సమావేశంలో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించవచ్చు. వీటితో పాటు రుతుపవనాల వార్తలు, ఎఫ్ఐఐల పెట్టుబడులు, రూపాయి విలువ కీలకం కానున్నాయి. ‘‘మార్కెట్ స్థిరీకరణలో భాగంగా అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చు. దేశీయంగా బలమైన స్థూల ఆర్థిక డేటా నమోదు, కమోడిటీ ధరలు దిగిరావడం తదితర సానుకూలాంశాల ప్రభావంతో దిద్దుబాటు పెద్దగా ఉండకపోవచ్చు. దిద్దుబాటు కొనసాగితే నిఫ్టీకి దిగువున 18,600–18,650 శ్రేణిలో తక్షణ మద్దతు స్థాయి కలిగి ఉంది. కొనుగోళ్లు నెలకొంటే ఎగువున 18,750 స్థాయిని చేధించాల్సి ఉంటుంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్రితం వారం సెన్సెక్స్ 405 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ప్రపంచ పరిణామాలు... రష్యాలో తిరుగుబాటు పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పోర్చుగల్‌లోని సింట్రాలో కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థ(2023)పై ఈసీబీ ఫోరం నిర్వహించే పాలసీ చర్చలో పాల్గొనున్నారు. అమెరికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ1 జీడీపీ గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. అదే రోజున మే జపాన్ రిటైల్, వినిమయ విశ్వాస డేటా వెల్లడికానున్నాయి. ఈ వారంలో 7 ఐపీఓలు.. ఈ వారంలో ఏడు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. ఇడియాఫోర్జ్, సియెంట్ డీఎల్ఎమ్, పీకేహెచ్ వెంచర్స్‌తో మరో నాలుగు చిన్న, మధ్య తరహా కంపెనీలు మొత్తం రూ.1600 కోట్లు సమీకరించనున్నాయి. ఐడియాఫోర్జ్ టెక్నాలజీ ఐపీఓ సోమవారం(నేడు) ప్రారంభమై జూన్ 29(గురువారం) ముగుయనుంది. ధరల శ్రేణిని రూ.632–672గా ఉంది. మొత్తం రూ.576 కోట్లు సమీకరించనుంది. సైయంట్ డీఎల్ఎం ఐపీఓ మంగవారం(రేపు) ప్రారంభం కానుంది. శుక్రవారం(జూన్ 30న) ముగుస్తుంది. చిన్న, మధ్య తరహా కంపెనీలైన కన్వేయర్ బెల్ట్ తయారీ సంస్థ పెంటగాన్ రబ్బర్(జూన్ 26 – 30), సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్ సంస్థ(జూన్ 30 – జూలై 5), త్రివిద్య టెక్, సినోఫిట్స్ టెక్నాలజీ ఐపీఓలు రెండూ జూన్ 30న మొదలై.., జూలై అయిదున ముగియనున్నాయి. మూడు వారాల్లో రూ.30,600 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐటు) భారత ఈక్విటీల్లో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. ఈ జూన్‌లో ఇప్పటివరకు వారు రూ. 36,600 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత ఆర్థికవ్యవస్థ ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటం, కార్పొరేట్ రంగం ఆదాయం పటిష్టంగా ఉండటమే దీనికి కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ‘‘ఎఫ్ఐఐల పెట్టుడబడులు రానున్న రోజుల్లో నెమ్మదించవచ్చు. అమెరికా ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం కంటే దిగువకు చేర్చేందుకు మరింత వడ్డీ పెంపు అవసరమని భావిస్తుంది. ఇటీవలే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌పీఐలు అప్రమత్తంగా వహించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్(రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. -
గణాంకాల్లో మన ఘన వారసత్వం
భారత్‌కు గొప్ప గణాంక శాస్త్ర సంప్రదాయం ఉంది. గణాంక శాస్త్ర ప్రపంచంపై ఆధిపత్యం చలాయించగల నిపుణులు భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా గణాంక శాస్త్ర అభివృద్ధి కోసం భారత్ అసాధారణ ప్రేరణనిచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఐక్యరాజ్యసమితి గణాంక కమిషన్ (స్టాట్‌కమ్)కు భారత్ ఎన్నిక కావడం మనం సంతోషించాల్సిన విషయం. విధాన నిర్ణయం, పర్యవేక్షక పాత్రలో మన దేశం ఉంటుంది. సుసంపన్నమైన భారత్ గణాంక వారసత్వం, భారత ‘ప్రణాళికా పురుషుడి’గా సుపరిచితమైన ప్రొఫెసర్ పీసీ మహలనోబిస్‌కు ఎంతగానో రుణపడి ఉంటుంది. ఆయన దేశంలో గణాంక శాస్త్రానికి మార్గదర్శి మాత్రమే కాకుండా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ)ని స్థాపించారు. భారత గణాంక సమాజం సంతోషించ డానికి కనీసం రెండు కారణాలు ఉన్నాయి. గణాంక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ బహుమతిని ఇండియన్–అమెరికన్ గణాంక శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఆర్ రావుకు బహూకరించారు(ఈయన తెలుగువాడు). సైన్సును, టెక్నాలజీని, మానవ సంక్షేమాన్ని పురోగమింపజేయడానికి గణాంక శాస్త్రాన్ని ఉపయోగించి కీలక విజయాలను సాధించినందుకు ప్రతి రెండేళ్ల కోసారి ఒక వ్యక్తికి లేదా బృందానికి ఈ అవార్డును అందజేస్తారు. గణాంక శాస్త్ర సిద్ధాంతాలకు దశాబ్దాలుగా సీఆర్ రావు అందించిన తోడ్పాటుకు ఇది నిస్సందేహంగా సరైన గుర్తింపు అని చెప్పాలి. మరొక విజయం, ఐక్యరాజ్యసమితి గణాంక కమిషన్ (స్టాట్‌కమ్)కు భారత్ ఎన్నిక కావడమే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విధాన నిర్ణయం, పర్యవేక్షక పాత్రలో మన దేశం ఐక్యరాజ్యసమితి సంస్థలో తిరిగి చేరింది. 1947లో స్థాపితమైన స్టాట్‌కమ్... ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక కౌన్సిల్ (ఎకోసాక్)కు చెందిన కార్యాచరణ కమిషన్. ఇది ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం (యూఎన్ఎస్డీ) పనిని పర్యవేక్షి స్తుంది. అలాగే ప్రభుత్వ విధానాలకు, ప్రైవేట్ కార్యాచరణకు తోడ్ప డేలా గణాంక సమాచార అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యం వైపుగా కృషి చేయడానికి ప్రపంచవ్యాప్త గణాంక శాస్త్రజ్ఞులను ఒక చోటికి తెస్తుంది. స్టాటిస్టికల్ కమిషన్, నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్, ఐక్యరాజ్య సమితి హెచ్ఐవీ/ఎయిడ్స్ జాయింట్ ప్రోగ్రామ్... వీటన్నింటికీ భారత్ ‘ఎకోసాక్’ ద్వారా ఎన్నికైంది. స్టాట్‌కమ్ వ్యస్థాపక పితామహుడు అమెరికన్ సామాజిక శాస్త్ర వేత్త, గణాంక శాస్త్రవేత్త అయిన స్టూవర్ట్ అర్థర్ రైస్. 1946 మేలో న్యూయార్క్‌లోని హంటర్ కాలేజీలో ‘న్యూక్లియర్ సెషన్’కు రైస్ అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్య సమితి పరిధిలో గణాంకాల కోసం ఒక శాశ్వత కమిషన్ ఏర్పాటు, దానికి అవసరమైన నిబంధనలను ఆనాటి సెషన్ సిఫార్సు చేసింది. స్టాట్‌కమ్ తొలి మూడు సెషన్లకు 1947–48 కాలంలో కెనడియన్ హెర్బర్ట్ మార్షల్ అధ్యక్షత వహించారు. ప్రపంచ గణాంక వ్యవస్థ రూపకల్పనను వేగవంతం చేయడం ద్వారా శాంతి కోసం ప్రపంచాన్ని కూడగట్టే ఐక్యరాజ్య సమితి ప్రయత్నాలకు తోడ్పడటం అనే లక్ష్యాన్ని మూడో సెషన్ (1948) నివేదిక ప్రకటించింది. అంతర్జాతీయ గణాంకపరమైన కార్యకలాపాల కోసం ఏర్పడిన అత్యున్నత నిర్ణాయక విభాగమైన స్టాట్‌కమ్... గణాంకపరమైన ప్రమాణాలను రూపొందించడం; జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వాటిని అమలు చేయడంతో సహా భావనలు, విధానాల అభివృద్ధి విషయంలో బాధ్యత తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా సభ్య దేశాల్లోని – మొత్తంగా 24 – కీలక గణాంక శాస్త్రవేత్తలను ఇది ఒకటి చేసింది. గత 76 సంవత్సరాల కాలంలో, కమిషన్ ప్రపంచమంతటి నుంచి ఒక చీఫ్ స్టాటిస్టీషియన్ నేతృత్వంలో నడుస్తూ వచ్చింది. గణాంకాలు, వైవిధ్యత, జనాభా రంగంలో భారతీయ నైపుణ్యమే ఐక్యరాజ్యసమితి స్టాటిస్టికల్ కమిషన్‌లో భారత్‌కు స్థానం సాధించి పెట్టిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవలే ట్వీట్ చేశారు. సుసంపన్నమైన భారత్ గణాంక వారసత్వం, భారత ‘ప్రణాళికా పురు షుడి’గా సుపరిచితమైన ప్రొఫెసర్ పీసీ మహలనోబిస్‌కు ఎంతగానో రుణపడి ఉంటుంది. ఆయన దేశంలో గణాంక శాస్త్రానికి మార్గదర్శి మాత్రమే కాకుండా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ)ని స్థాపించారు. ఆధునిక భారత గణాంక వ్యవస్థలో అత్యంత విశిష్ట వ్యక్తి అయిన మహలనోబిస్ భారత రెండో పంచవర్ష ప్రణాళిక రూపశిల్పి కూడా. అలాగే జాతీయ శాంపిల్ సర్వే సంస్థతో పాటు కేంద్ర గణాంక సంస్థ స్థాపనలో కూడా కీలకపాత్ర వహించారు. స్టాట్కమ్లో భారత్ మునుపటి పాదముద్రకు ప్రధానంగా మహ లనోబిస్ కారణం. కమిషన్ ప్రారంభ సమయంలో ఆయన శిఖర స్థాయిలో ఉండేవారు. 1946లో ప్రారంభ సెషన్ నుంచి 1970లో సంస్థ 16వ సెషన్ వరకు తన జీవితకాలంలో అన్ని సెషన్లకు హాజరైన అద్వితీయ రికార్డు ఆయన సొంతం. సభ్యుడిగా, రాపోర్టర్‌గా, వైస్ ఛైర్మన్‌గా అనేక పాత్రలను పోషించిన మహలనోబిస్ 1954 నుంచి 1956 వరకు 8వ, 9వ సెషన్లకు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ఆ కాలంలో ఆయన సంస్థకు అద్వితీయ తోడ్పాటును అందించారు. నమూనా సేకరణ కోసం ఐక్యరాజ్యసమితి సబ్ కమిషన్ ఏర్పాటు చేస్తే ‘‘ప్రత్యేకించి వెనుకబడిన ప్రాంతాల్లో గణాంక శాస్త్రం మెరుగుదలను ప్రోత్సహించడంలో గొప్ప సహాయం చేస్తుంది’’ అని సూచిస్తూ మహలనోబిస్ 1946 ఏప్రిల్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి ఉత్తరం రాశారు. దానికనుగుణంగానే ఒక సబ్ కమిషన్ ఏర్పాటైంది. తర్వాత ఈ ఉప కమిషన్‌కు ఆయన అధ్యక్షత వహించారు. ఈ ఉపకమిషన్ నమూనా సర్వే నివేదిక (1947) సన్నాహకాల కోసం సిఫార్సులు చేసింది. వివిధ రంగాల్లో అధికారిక గణాంకాలకు సంబంధించిన నమూనా సర్వేల అన్వయానికి ఈ సిఫార్సులు మార్గాన్ని సుగమం చేశాయి. ‘శిక్షణ పొందిన మానవ వనరులను కలిగి ఉండని దేశాల్లో’ గణాంక శాస్త్రంలో విద్య కోసం అంతర్జాతీయ కార్యక్రమాలను ప్రోత్స హించడంలో మహలనోబిస్, రైస్ కీలక పాత్ర పోషించారని ఇండి యన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ టీజే రావు ఒక పరి శోధనా వ్యాసంలో పేర్కొన్నారు. అలాంటి సంస్థను ఆసియా దేశాల కోసం లేదా ఇండియా, దాని పొరుగు దేశాల కోసం ఏర్పర్చాలని మహలనోబిస్ సూచించారు. 1950లో కలకత్తాలో స్థాపించిన ‘ది ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఎడ్యుకేషన్ సెంటర్’ (ఐఎస్ఈసీ)ను ఇప్పుడు ఐఎస్ఐ, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మహలనోబిస్ 1972లో చనిపోయారు. ఆ సంవత్సరం తన 17వ సెషన్లో చేసిన ఒక తీర్మానంలో కమిషన్ ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసింది. ‘‘సామాజిక గణాంక శాస్త్రం తరపున ఆయన సాగించిన మార్గదర్శక ప్రయత్నాలను స్మరించుకుంటున్నాము. అభివృద్ధి చెందుతున్న దేశాల గణాంక అవసరాల కోసం నిలబడిన ఛాంపి యన్‌గా›ఆయన్ని స్మరించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా గణాంక శాస్త్ర అభివృద్ధి కోసం ఆయన ఇచ్చిన అసాధారణ ప్రేరణను మేము స్మరించుకుంటున్నాము’’ అని పేర్కొంది. ‘‘కమిషన్ సభ్యుల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలను పరిష్కరించడంలో ఆయన అసాధా రణ సామర్థ్యాన్ని’’ కూడా కమిషన్ ఆ సందర్భంగా గుర్తుచేసుకుంది. సీఆర్ రావు క్లాస్మేట్, ఎలెక్ట్రానిక్ డేటా ప్రొసెసింగ్‌లో పథగామి వక్కలంక ఆర్.రావు (ఈయనా తెలుగువాడే) 1976లో స్టాట్‌కమ్ 19వ సెషన్‌కు అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి డ్యూటీ స్టేషన్ వెలుపల స్టాట్‌కమ్ నిర్వహించిన ఏకైక సమావేశం ఇదే. ఇది న్యూఢి ల్లీలో జరిగింది. స్టాట్‌కమ్ 70వ వార్షిక సంబరాల కోసం రూపొందించిన బుక్లెట్ బ్యాక్ కవర్ పేజీపై, 1976 సెషన్ కోసం హాజరైనవారు తాజ్‌మహల్ ముందు నిల్చున్న చిత్రాన్ని పొందుపర్చారు. భారత్‌కు ఉజ్వలమైన గణాంక శాస్త్రపు గతం ఉంది. మన దేశం స్టాట్కమ్కు గణనీయ స్థాయిలో తోడ్పాటును అందించింది. అంత ర్జాతీయ గణాంక రంగంలో భారత్ తన స్థానాన్ని తిరిగి పొందినట్ల యితే, అది ప్రశంసార్హమవుతుంది. భారత్‌కు గొప్ప గణాంక శాస్త్ర సంప్రదాయం ఉంది. దీనికి మహలనోబిస్ గొప్ప ప్రయత్నం కారణం. అంతేకాకుండా గణాంక శాస్త్ర ప్రపంచంపై ఆధిపత్యం చలా యించగల నిపుణులు భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. ఐక్య రాజ్యసమితి గణాంక కార్యకలాపాల ప్రధాన స్రవంతి వైపు భారత్ తిరిగి వెళ్లడం సరైన దిశగా వేసే ముందడుగు అవుతుంది. అతనూ బిశ్వాస్ వ్యాసకర్త ప్రొఫెసర్, ఐఎస్ఐ, కోల్‌కతా (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Heart Attack: టీకాల వల్లే యువత గుండెకు ముప్పు!
సాక్షి, హైదరాబాద్: ‘కోవిడ్ టీకాలు ప్రజలకు మేలు కన్నా ఎక్కువగా కీడు చేస్తున్నాయి. టీకాలు తీసుకున్న యువతలో సైతం, రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా గుండెపోట్లతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రాణహాని కూడా కలుగుతోంది’’ అని పలువురు అల్లోపతి, హోమియో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను విధిగా కోవిడ్ టీకాలు తీసుకోవాల్సిందే అని ఎప్పుడూ చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు గతంలోనే తేల్చి చెప్పిన నేపథ్యంలో.. ఇక మీదటైనా టీకాలు తీసుకోవాలా లేదా అనేది వ్యక్తిగతంగా ఎవరికి వారు నిర్ణయించుకోవాలని వారు సూచించారు. ఇప్పటికే వ్యాక్సిన్లు వేసుకున్న వారు తమ దేహాలను సులభమైన హోమియో, ప్రకృతి చికిత్సల ద్వారా డీటాక్స్ చేసుకుంటే మంచిదని పిలుపునిచ్చారు. అవేకన్ ఇండియా మూవ్మెంట్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్‌లో శనివారం ‘యువతలో ఆకస్మిక గుండెపోట్లు’ అంశంపై జరిగిన చర్చాగోష్టిలో అల్లోపతి, హోమియో వైద్య నిపుణులు, స్వచ్ఛంద కార్యకర్తలు ప్రసంగించారు. చర్చాగోష్టికి అధ్యక్షత వహించిన స్వచ్ఛంద సేవకురాలు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కవుల సరస్వతి మాట్లాడుతూ కోవిడ్‌ను విటమిన్ సి, డి, మెలటోనిన్, యాంటి ఫంగల్ చికిత్సల ద్వారా సులువుగా నయం చేయవచ్చని అల్లోపతి, హోమియోపతి, ప్రకృతి, యునానీ వైద్యులు నిరూపించారని గుర్తు చేశారు. వ్యాక్సిన్లు వేయించుకున్న వారు రోగనిరోధక శక్తి కోసం.. ప్రసిద్ధ హోమియో వైద్యులు డా.అంబటి సురేంద్ర రాజు ప్రసంగిస్తూ.. వ్యాక్సిన్లు వేయించుకున్న వారు రోగనిరోధక శక్తిని కాపాడుకోవడం కోసం తుజ–30, వాక్సినీనమ్–30, మలాండ్రినమ్–30 అనే హోమియో మందులు వాడుకోవచ్చని సూచించారు. ఈ గుళికలను ఒక్కొక్క రకాన్ని రోజుకు ఒకసారి 6 గుళికల చొప్పున 3 రోజుల పాటు మొత్తం 9 రోజుల పాటు చప్పరించాలన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ సక్సేనా, డాక్టర్ సునీల్ డేవిడ్ విధాన విశ్లేషకుడు డా. దొంతి నరసింహారెడ్డి, తమిళనాడుకు చెందిన స్వచ్ఛంద కార్యకర్త శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: కరోనా కొత్త రూపం దాల్చింది.. జాగ్రత్త సుమా! -
ఈవీల్లోకి మారండి.. ఇంధన ఖర్చులు తగ్గించుకోండి!
ఇంధన ఖర్చులు అగ్రరాజ్యాన్ని వణికిస్తున్నాయి. దాన్ని భరించటం అక్కడి వారికీ కష్టంగా ఉంటోంది. విద్యుత్ వాహనాలను (ఎలక్ట్రిక్ వెహికల్స్ ..ఈవీ) ఉపయోగించండి. ఖర్చులు తగ్గించుకోండి అన్న ప్రచారం ఊపందుకుంటోంది. ప్రభుత్వం నుంచి ఇతోధికంగా ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నారు. నిపుణుల అధ్యయనాలు కూడా దీనికి తోడవుతున్నాయి. ఈవీలను ఉపయోగిస్తే, అమెరికాలోని 90శాతం మంది గృహయజమానులు ఇంధన ఖర్చుల నుంచి బయటపడొచ్చని యూనివర్సిటీ ఆఫ్ మిచ్ గాన్ అధ్యయనం చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లోనయితే, వార్షిక ఇంధన ఖర్చులు సగటున 600 డాలర్లకు తగ్గించుకోవచ్చని పేర్కొంది. తక్కువ ఆదాయం గలవారికి ఇబ్బందే ఈవీలోకి మారినా తక్కువ ఆదాయంగల ఇళ్లవారికి ట్రాన్స్ పోర్టేషన్ ఖర్చయినా అధికంగానేఉంటుందని అధ్యయనం స్పష్టం చేసింది. తక్కువ ఆదాయం గల వారిలో సగానికిపైగా అంటే 8.3మిలియన్ల హౌస్ హోల్డ్స్ ఈ భారాన్ని మోయవలసి వస్తుందని పేర్కొంది. యూఎస్ వాసులు సగటున 10,961 డాలర్లు ఖర్చు చేస్తున్నారని రవాణాశాఖ అంచనాలుచెబుతున్నాయి. సంపన్నులతో పోలిస్తే తక్కువ ఆదాయం గల వేతన జీవులకు ట్రాన్స్ పోర్టేషన్భారం ఎక్కువగా ఉంది. పన్ను చెల్లించిన తర్వాత లభించే వేతనంలో 10.4 శాతం ధనవంతులు వెచ్చిస్తే, పేదలకు అది 27.4 శాతంగా ఉంది. ఈవీల్లో పొదుపుకు దోహదం చేసే అంశాలు బ్యాటరీ పనితీరుపైన ప్రభావం చూపే శీతల వాతావరణం, శిలాజ ఇంధనాలతో పనిచేసే విద్యుత్, గ్రిడ్లు, విద్యుత్ ఛార్జీలు వంటివి ఈవీల ద్వారా ధర తగ్గించుకోవటానికి దోహదం చేస్తాయి. భవిష్యత్తులో గ్రిడ్ డీకార్బనైజేషన్, ఇంధన ధరలు, ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులోకి రావటం వంటి అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఈవీలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అధ్యయనంలో విద్యుత్ వాహనాల కొనుగోలు అంశాన్ని చేర్చలేదు. ఈవీలు సాధారణమైన గ్యాసొలీన్ తో నడిచే వాహనాల కంటే ఖరీదయినవి. ప్రస్తుతం అమెరికన్ కాంగ్రెస్ 7,500 డాలర్ల ఈవీ టాక్స్ క్రెడిట్ ను, అలాగే ఉపయోగించిన కార్లకు 4వేల డాలర్ల ఈవీ టాక్స్ క్రెడిట్ ను ఇచ్చేందుకు ఆమోదించింది. దానితో పాటు కొన్ని నిబంధనలను కూడా విధించింది. దీనిపై యూఎస్ ఎనర్జీ సెక్రటరీ జెన్నిఫర్ గ్రాన్ హ్లోమ్ మాట్లాడుతూ, బైడన్ ప్రభుత్వం ఇంధన ఖర్చులు తగ్గించటానికి తన వంతు ప్రయత్నం చేస్తోందని చెప్పారు. సాంప్రదాయబద్దంగా గ్యాస్ ట్యాక్ నింపటంతో పోలిస్తే, ఈవీల రీఛార్జి చేసేందుకు సగటున 35 డాలర్లు పొదుపు చేయగలుగుతున్నారని తెలిపారు. 7,500 డాలర్ల టాక్స్ క్రెడిట్ ఇస్తున్నప్పుడు, 26,500 డాలర్ల ఖరీదు చేసే జనరల్ మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయటం పెద్ద కష్టమేమీ కాదని ఆమె చెబుతున్నారు. -
ఫాస్ట్‌ఫుడ్.. హెల్త్బ్యాడ్! తెల్లగా మారితే.. ఆరెంజ్ కలర్ వేసి మరీ.. వామ్మో!
రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పద్నాలుగేళ్ల బాలుడు రాకేశ్ ఏడాదిగా అత్యధిక రోజులు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో తింటున్నాడు. పొట్టలో విపరీతమైన నొప్పి రావడంతో వైద్యుని వద్దకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు గ్యాస్ట్రిక్ సమస్య ఏర్పడిందని ఫాస్ట్‌ఫుడ్ మానేయాలని సూచించాడు. గంభీరావుపేటకు చెందిన ఓ రైతు పది హేను రోజుల క్రితం పని నిమిత్తం సిరిసిల్లకు వచ్చి మధ్యాహ్నం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో నోటికి రుచికరమైన పదార్థాలు ఆరగించాడు. సాయంత్రం ఇంటికెళ్లేసరికి వాంతులు, విరేచనాలు కావడంతో వైద్యుడి వద్దకు వెళ్లాడు. ఫుడ్ పాయిజన్ అయిందన్నారు. దీనికి కారణం వెతకగా..ఫాస్ట్‌ఫుడ్‌గా తేల్చారు. సాక్షి, సిరిసిల్లటౌన్: జిల్లాలో ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ వెర్రితలలు వేస్తోంది. నాణ్యత లేని పదార్థాలతో చేస్తున్న వంటలు ప్రజలను ఆస్పత్రుల పాలుచేస్తుంది. జంక్‌ఫుడ్‌గా పిలిచే ఫాస్ట్‌ఫుడ్ అలవాటుగా చేసుకుంటే ప్రాణాల మీదికొచ్చే అవకాశం ఉన్నా జనాలు పట్టించుకోవడం లేదు. ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతున్నా నియంత్రించాల్సిన అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా జిల్లాలో ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న నాసిరకం, నిబంధనలు పాటించకుండా తయారు చేసే ఫాస్ట్‌ఫుడ్‌పై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం.. రూ.కోట్లలో వ్యాపారం ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ ఒకప్పుడు నగరాల్లోనే ఉండేది. ఇప్పుడది ప్రతీ పల్లెకు విస్తరించింది. చిన్నపాటి గ్రామంలో సైతం ఫాస్ట్‌ఫుడ్‌ను జనాలు ఇష్టపడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యాన్ని పాడుచేసేదే అయినా అధిక లాభాలు వస్తుండడంతో వ్యాపారులు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాలు, ప్రధాన పల్లెలు, హైవేపై ఉండే గ్రామాల్లో సైతం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నిర్వర్తిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 200 పైగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నడుస్తున్నాయి. వీటిలో రోజుకు తక్కువలో తక్కువగా రూ.10లక్షల వరకు దందా సాగుతోంది. నెలకు రూ.3కోట్లలో ఫాస్ట్‌ఫుడ్ దందా జరుగుతుంది. నిబంధనలు బేఖాతర్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. నాణ్యమైన ఆహార పదార్థాలు, నూనెలు వినియోగించాల్సి ఉండగా.. ఎక్కువ ఫాస్ట్సెంటర్లలో నాసిరకం వాడుతున్నట్లు సమాచారం. నాణ్యమైనవి, బ్రాండెడ్ వాడాలంటే.. ఖరీదు కాబట్టి.. తక్కువ రేటుకు దొరికే పదార్థాలు, నూనెలు వాడుతున్నారు. రుచి కోసం ఆహారంలో నిశేధిత రంగులు, రసాయనాలు కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నాణ్యమైనవి వాడుతున్నామని ఫాస్ట్‌సెంటర్ నిర్వాహకులు చెబుతున్నా..ఏళ్ల తరబడిగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వహణపై తనిఖీలు చేపట్టే అధికారం ఉన్న శాఖలు ‘మామూలు’గా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవీ ప్రభావాలు.. చికెన్ ఫ్రైడ్‌రైస్ చేసేటప్పుడు తెల్లగా మారిన చికెన్‌ను ఆరెంజ్ రంగు వేసి కనిపించకుండా చేస్తారు. ఈ కలర్ ప్రభావం ఒకసారి మన చేతికి అంటితే వారం రోజుల వరకు రంగు పోదు. సోయాసాస్ రేటు ఎక్కువ కాబట్టి దానిలో నీరు లేదా కొన్ని రోజులుగా కాగిన నూనెను వాడుతున్నట్లు సమాచారం. ఖరీదు తక్కువ..ఆరోగ్యాన్ని దెబ్బతీసే పామాయిల్ వాడుతున్నట్లు తెలుస్తుంది. ఫ్రైస్ వంటి వంటకాలకు చేతికి దొరికిన పిండిని కలిపేస్తున్నారు. దానిలో పురుగులు ఉంటున్నాయి. టమాట సాస్ ఎక్కువ మోతాదులో ఒకేసారి కొని పెడతారు. కొన్ని సందర్భాలలో పాడైన వాటిని పడేయకుండా వాడతారు. చిల్లీసాస్ వాసన చూస్తే వాంతులు రావడం ఖాయంగా ఉంటోంది. దీని వాడకంతో డబ్బులు బాగానే సంపాదిస్తారు. కానీ ఆరోగ్యంపై పట్టింపు ఉండకుండా దందా సాగిస్తారు. నిబంధనలు పాటించకుంటే కేసులు ప్రజా ఆరోగ్యం దెబ్బతీసే పదార్థాలు వాడొద్దు. వంటశాలలు, హోటల్స్ పరిశుభ్రంగా ఉంచాలి. కస్టమర్లకు తాగునీరు ఇవ్వాలి. మాంసాహారం, సూప్‌లు నిలువ ఉంచినవి వాడొద్దు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, హోటల్స్ నిర్వాహకులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. లేకుంటే కేసులు నమోదు చేస్తాం. – వెల్దండి సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్ (చదవండి: గోదావరిఖని.. ఇక పర్యాటక గని!) -
ఆటోమొబైల్ రంగంపై పన్ను తగ్గించాలి
ఆటోమొబైల్ రంగంపై పన్నులను వచ్చే పదేళ్ల కాలంలో దశలవారీగా సగానికి తగ్గించాలని ఈ రంగంలో నిపుణులు కోరుతున్నారు.. అప్పుడు భారత ఆటోమొబైల్ రంగం అంతర్జాతీయంగా మరింత పోటీ పడగలదని, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనతో ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుందన్నది వారి అభిప్రాయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ పన్ను రేటును ఒకేసారి గణనీయంగా తగ్గించడాన్ని సర్దుబాటు చేసుకోలేదన్న వాస్తవాన్ని అంగీకరిస్తూ నిపుణులు ఈ సూచన చేశారు. దేశ జీడీపీలో ఆటోమొబైల్ రంగం వాటాను పరిగణనలోకి తీసుకుని, దశలవారీగా సెస్సును తగ్గించే కార్యాచరణ ప్రణాళిక అవసరమని వారు పేర్కొంటున్నారు. ‘‘ఆటో పరిశ్రమపై పన్నుల భారం అధికంగా ఉంది. కారు తయారీ నుంచి విక్రయించే ధర మధ్య చూస్తే.. చాలా సందర్భాల్లో ఇది ఎక్స్‌షోరూమ్ ధరపై 30–50 శాతం మధ్య (జీఎస్టీ, ఇతర పన్నులు కూడా కలుపుకుని) అధికంగా ఉంటోంది. తయారీ వ్యయం, నాణ్యత పరంగా భారత ఆటోమొబైల్ పరిశ్రమ పోటీనిచ్చే సత్తా కలిగి ఉంది. అందుకునే నిర్ణీత కాలంలో పన్నులు తగ్గించే ప్రణాళిక అవసరం’’అని ఒక పారిశ్రామిక వేత్త పేర్కొన్నారు. కార్ల తయారీలో భాగంగా ఉండే.. స్టీల్, క్యాస్ట్ ఐరన్ తయారీ నుంచి ముడి సరుకులు, డీలర్‌షిప్‌ల వరకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం వాహనాలపై 28 శాతం జీఎస్టీ రేటు అమలవుతోంది. వాహనాన్ని బట్టి 1–22 శాతం మధ్య అదనంగా సెస్సు కూడా పడుతోంది. ఇక పూర్తిగా విదేశాల్లో తయారై దిగుమతి అయ్యే కార్లపై 60–100 శాతం మేర సుంకం అమల్లో ఉంది. చదవండి: బంపర్ ఆఫర్..ఆ క్రెడిట్ కార్డ్ ఉంటే 68 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఫ్రీ! -
బంగారమా?భూమా? పెట్టుబడికి ఏది బెటర్? ఈ విషయాలు తెలుసుకోండి!
సాక్షి, హైదరాబాద్: బంగారం, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ ఇలా పెట్టుబడి సాధనాలు చాలానే ఉన్నాయి. అయితే వీటిల్లో ఏది లాభదాయకంగా ఉంటుందనేదే చర్చ. కరోనా తర్వాతి నుంచి ఈక్విటీ మార్కెట్ ఎంత నష్టపోయాయో మనకు తెలిసిందే. ఫస్ట్ వేవ్ (2020, డిసెంబర్-మార్చి, 2021)లో బంగారం విలువ 4 శాతం మేర పెరిగినప్పటికీ.. ఆశించిన స్థాయిలో వృద్ధి చెందలేదు. ఇక, స్థిరాస్తి ధరలైతే కరోనా తొలి దశలో స్థిరంగా ఉండి.. ఆ తర్వాత 7 శాతం మేర పెరిగాయి. ఫస్ట్ వేవ్‌లో.. : ద్రవ్యత, సౌలభ్యం కారణంగా భారతీయ కుటుంబాలకు ఇష్టమైన పెట్టుబడి సాధనం బంగారం. 2019 ముగింపు నాటికి కరోనా మహమ్మారి విజృంభించింది. ఈ దశలో బంగారం ధర 4 శాతం మేర పెరిగింది. అస్థిరమైన పెట్టుబడి ఈక్విటీలు. వీటిపై సామాజిక, రాజకీయ, ఆర్థ్ధిక ప్రతికూలతలు ఎక్కువ ప్రభావం చూపిస్తుంటాయి. కోవిడ్ ఫస్ట్ వేవ్‌లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన మన దేశంలో 2019, డిసెంబర్ నుంచి 2020 మార్చి మధ్య కాలంలో బీఎస్ఈ సెన్సెక్స్ 29 శాతం మేర క్షీణించింది. రియల్ ఎస్టేట్ దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా పరిగణిస్తారు. భౌతికంగా ఉండటం, సులభతరం విక్రయం, తక్కువ కాలంలో ఎక్కువ రాబడి వంటివి రియల్టీ పెట్టుబడులకు అదనపు బలాలు. అయితే ఫస్ట్ వేవ్‌లో ప్రాజెక్ట్‌ల అమలు, అభివృద్ధి, విక్రయాలలో అనిశ్చిత కారణంగా గృహ సముదాయాల విపణి మాత్రం స్థిరంగా ఉంది. సెకండ్ వేవ్‌లో.. : ఇక కోవిడ్ రెండో దశ మరింత కఠినంగా మారింది. ప్రయాణ ఆంక్షలు, లాక్డౌన్ కొనసాగింపులు ఒకవైపు.. లక్షలాది మంది ప్రాణ నష్టం మరో వైపు నేపథ్యంలో పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడింది. అయితే ఫస్ట్ వేవ్ పాఠాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు చురుకుగా వ్యవహరించడంతో క్రితం నెలతో పోలిస్తే గతేడాది ఏప్రిల్‌లో సెన్సెక్స్ 1 శాతం మేర వృద్ధి చెందింది. బంగారం మునుపటి గరిష్ట స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పటికీ... రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మళ్లీ స్థిరంగానే ఉంది. థర్డ్ వేవ్‌లో.. : కరోనా ప్రభావం తగ్గిన థర్డ్ వేవ్‌లో ఈ ఏడాది ప్రారంభంలో సెన్సెక్స్ రికార్డు స్థాయికి చేరింది. ఇదే సమయంలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం, భౌగోళిక రాజకీయ ప్రతికూలతలు, సరఫరాలో సమస్యల కారణంగా బంగారం పెట్టుబడులు మళ్లీ క్షీణించాయి. కరోనా కాలంలో గృహ సముదాయ విపణి స్థిరంగా ఉండి, ప్రస్తుతం వృద్ధి బాటలో పయనిస్తుందని అనరాక్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో సగటు ధర పెరిగిందని చెప్పారు. మహమ్మారి సమయంలో సరఫరాకు మించి విక్రయాలు జరిగాయని పేర్కొన్నారు. అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో.. అన్ని పెట్టుబడి విభాగాలు కరోనా కంటే ముందు స్థాయిని మించిపోయాయి. 2019 సెప్టెంబర్‌తో పోలిస్తే సెన్సెక్స్‌లో 52 శాతం, బంగారం ధరలో 34 శాతం, గృహ సముదాయ ధరలు 9 శాతం మేర పెరిగాయి. అయితే ప్రపంచ అనిశ్చితులు, ద్రవ్యోల్భణ వృద్ధి వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఆయా పెట్టుబడి విభాగాలు బలంగానే ఉండే సూచనలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా గృహ అవసరాన్ని పెంచింది. కోవిడ్‌తో ఇళ్లు కేవలం వసతి మాత్రంగానే కాకుండా ఎన్నో అవసరాలను తీర్చింది. ఆర్థిక అస్థిరత సమయంలో భద్రతను ఇస్తుందని ప్రశాంత్ ఠాకూర్ వివరించారు. బంగారం, స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉండటంతో పాటు నష్టాలకు లోబడి ఉంటాయి. ప్రస్తుతం స్థిరాస్తి సరఫరా, డిమాండ్ కార్యకలాపాలు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి. 2019 హెచ్2తో పోలిస్తే 2022 హెచ్1లో గృహ ప్రాజెక్ట్‌ల లాంచింగ్‌లు 76 శాతం, విక్రయాలు 61% మేర పెరిగాయి. రానున్న పండుగ సీజన్లో హౌసింగ్ మార్కెట్లో లావాదేవీలు పెరుగుతాయని, దీంతో ధరలూ వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. -
Omicron BF.7: ముంచుకొస్తున్న నాలుగో వేవ్?!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి నుంచి పూర్తిస్థాయిలో విముక్తికి మరికొంత కాలం వేచిచూడక తప్పేట్లు లేదు. తాజాగా గుజరాత్, మహారాష్ట్రలలో ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ బీఎఫ్.7 కేసుల వ్యాప్తితో కరోనా జాగ్రత్తలతో పాటు, కేసుల పర్యవేక్షణ, ‘జీనోమిక్ సర్వెలెన్స్’పెంచాలని అధికారులను కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. దీపావళి వేడుకలు ఘనంగా జరుపునేందుకు దేశప్రజలు సిద్ధం కావడం, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలతో పాటు, కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో అపమ్రత్తంగానే ఉండాలని సూచించింది. బీఎఫ్.7 వేరియెంట్‌కు అత్యంత వేగంగా వ్యాప్తి చెందే స్వభావంతో పాటు గతంలో కరోనా సోకడం వల్ల, వ్యాక్సిన్లతో ఏర్పడిన యాంటీబాడీస్‌ను తప్పించుకునే గుణం ఉండడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీని కారణంగా భారత్‌లో నాలుగో వేవ్ ఏర్పడుతుందా అన్న ఆందోళన వైద్య పరిశోధకులు, నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ‘‘కొత్త వేరియెంట్ పట్ల వచ్చే రెండువారాలు అప్రమత్తంగా ఉండాలి. ఇతర దేశాల్లో కేసుల్లో పెరుగుతున్నందున మనపైనా ప్రభావం ఉంటుంది’అని నేషనల్ టెక్నికల్ అడ్వెయిజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్మునైజేషన్ చైర్మన్ డా.ఎన్కే అరోరా స్పష్టంచేశారు. గత రెండున్నరేళ్లుగా కరోనా పేషెంట్లకు చికిత్సతో పాటు దానిలో మార్పులను గమనిస్తున్న చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డా.హరికిషన్, క్రిటికల్‌కేర్ నిపుణులు డా. కిరణ్ మాదల తాజా పరిస్థితులపై ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు... వారి మాటల్లోనే.. మరో వేవ్‌గా మారే అవకాశాలు తక్కువే కానీ... ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలుస్తోంది. ఐతే ఒమిక్రాన్ సోకాక, వ్యాక్సినేషన్ లేదా సహజసిద్ధంగా ఏర్పడిన రోగనిరోధకశక్తితో ప్రపంచంలోని 60 శాతానికి పైగా ప్రజల్లో రక్షణలు ఏర్పడ్డాయి. దేశంలో ఒమిక్రాన్ వేవ్ వచ్చి 7,8 నెలలు దాటినా కొత్త వేరియెంట్ ఏదీ రాలేదు. వ్యాక్సినేషన్ సగటుశాతం పెరగడమే దానికి కారణం కావొచ్చు. అందువల్ల కొత్త వేరియెంట్‌ను ఒమిక్రాన్ ఉపవర్గంగానే చూడాలి. వైరస్‌కు ఏర్పడే మ్యుటేషన్ల ప్రభావం చూపొచ్చునని అంటున్నారు. కానీ మనదగ్గర కోవిడ్ మూడుదశలు ముగిసినందున, ప్రజల ఇమ్యూనిటీ లెవల్స్‌ను బట్టి చూస్తే అది మరో వేవ్‌గా మారే అవకాశాలు తక్కువే. కరోనా ఉపద్రవంలో ఒమిక్రానే చివరి వేరియెంట్ కావొచ్చుననే ఆశాభావంతో పరిశోధకులున్నారు. ఐతే 70 ఏళ్లకు పైబడిన వారు వివిధ దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. – డా. కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఒమిక్రాన్ సబ్వేరియెంట్గా గుర్తించారు. దీని తీవ్రత ఏమిటనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీని వేగవంతమైన వ్యాప్తి అనేది బెల్జియం, యూఎస్ కేసుల ఆధారంగా తెలుస్తోంది. జ్వరం, దగ్గు, గాలిపీల్చడంలో ఇబ్బంది, ఒళ్లు నొప్పులు, జలుబు, తలనొప్పి, గొంతునొప్పి, రుచి కోల్పోవడం వంటివి దీని లక్షణాలు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తే ఆక్సిజన్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. తీవ్రమైన లక్షణాలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. గుండె, శ్వాసకోశాలు, మూత్రపిండాలు, కాలేయం, డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. – డా.హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద -
మూలధన లాభాలు బేసిక్ లిమిట్ దాటకుంటే
ప్రశ్న: నేను రిటైర్ అయ్యాను.పెన్షన్ లేదు. కానీ ఇతర ఆదాయాలు నికరంగా రూ. 5,50,000. మా ఆవిడకు ఎటువంటి ఆదాయంలేదు. ఇద్దరికి చెరొక ప్లాటు .. అంటే జాగా ఉంది. ఇద్దరం ఒకేసారి ఒకే ధరకి అమ్ముతున్నాం. మిత్రులు లెక్కలు వేసి ఇద్దరికి మూలధన లాభాలు చెరొక రూ. 3,00,000 వస్తాయని తేల్చారు. మా ఆవిడ విషయంలో పన్ను భారం ఉండదు, కానీ నేను మాత్రం పన్ను కట్టాలి అంటున్నారు. దీనిలో అంతరార్థం ఏమిటి? మీ శ్రీమతి వయస్సు 60 సంవత్సరాలు దాటి ఉంటుంది అనుకుంటున్నాం. మీ మిత్రులు వేసిన లెక్కలు .. చెప్పిన మాటలు కరెక్టే. నిజానికి మీ ప్రశ్నలోనే జవాబు ఉంది. ముందుగా మీ విషయం తీసుకుందాం. మూలధన లాభాలతో నిమిత్తంలేకుండా మీ నికర ఆదాయం రూ. 5,50,000 అంటున్నారు. సేవింగ్స్, డిడక్షన్లు పోనూ రూ.5,50,000 ఉంటే మీరు పన్ను పరిధిలో ఉన్నట్లే. పన్ను చెల్లించాలి. టీడీఎస్ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోండి .. లేదా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి లేదా సెల్ఫ్ అసెస్మెంట్ చలాన్ ద్వారా చెల్లించి రిటర్న్ వేయండి. మీకు కూడా 60 సంవత్సరాలు దాటిందనే అనుకుంటున్నాం. 60 సంవత్సరాలు దాటిన వారికి బేసిక్ లిమిట్ రూ. 3,00,000. మీ నికర ఆదాయం లెక్కింపులో బేసిక్ లిమిట్ దాటిన మొత్తానికి పన్ను లెక్కిస్తారు. మీరు ఇప్పటికి బేసిక్ లిమిట్‌ని వినియోగించుకున్నట్లే. ఒక వ్యక్తికి ప్రతి శీర్షిక కింద బేసిక్ లిమిట్ ఉండదు. జీతం, ఇంటద్దె, వ్యాపారం మీద ఆదాయం, మూలధన లాభాలు.. ఇతర ఆదాయం ఈ ఐదింటిని కలిపిన తర్వాత ఒకసారే బేసిక్ లిమిట్‌ని వినియోగించుకోవాలి. మీ విషయంలో బేసిక్ లిమిట్ వినియోగించుకున్నారు కాబట్టి ఇక మూలధన లాభాల మీద ఇవ్వరు. ఇక మీ శ్రీమతి గారి విషయం. ఆవిడకు ఎటువంటి ఆదాయం లేదు. అంటే జీరో ఇన్‌కం. కాబట్టి ఆవిడకు బేసిక్ లిమిట్ దాకా పన్ను భారం లేకుండా అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మూలధన లాభాలు రూ. 3,00,000 దాటకపోతే బేసిక్ లిమిట్ కంపల్సరీగా అమలుపర్చాలి కాబట్టిఆ సదుపాయం లేదా బేసిక్ లిమిట్ ఇస్తారు. మూలధన లాభాలు ఇద్దరివి ఒకే మొత్తం, సమానం అయినప్పటికీ ఇతర విషయాల్లో ఎంతో తేడా ఉంది. ► మీకు ఇదివరకే ఇతర ఆదాయాల మీద పన్ను భారం ఉంది. ► మీ శ్రీమతి గారికి పన్నుకి గురయ్యే ఆదాయం జీరో. ► బేసిక్ లిమిట్ మీకు మూలధన లాభాల మీద వర్తించదు. ► మేడంగారికి మూలధన ఆదాయం ఒక్కటే ఉన్నా ఇతరత్రా ఏ ఆదాయం లేదు కాబట్టి బేసిక్ లిమిట్ వర్తిస్తుంది. కాబట్టి పన్ను భారం లేదు.ఇదే దీనిలోని అంతరార్థం. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
కోరలు లేని ఫైర్ సర్వీసెస్ యాక్ట్.. హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్ యజమాని నిర్లక్ష్యం ఎనిమిది మంది ప్రాణాలు బలిగొంది. కేవలం ఈ ఒక్క భవనమే కాదు సరిగ్గా వెతికితే నగరంలోని ప్రతి వీధికి కనీసం మూడు ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి నిర్మాణాలు చేపట్టిన యజమానులపై చర్యలు తీసుకోవడానికి అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏపీ ఫైర్ సర్వీసెస్ యాక్ట్. 1999లో రూపొందించిన ఈ కోరలు లేని చట్టాన్నే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. వాణిజ్య భవనాలు, సముదాయాల యజమానులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడటానికి ఇదీ ఓ కారణమే అన్నది నిపుణుల మాట. సమరీ ట్రయల్‌కు మాత్రమే అవకాశం... ఏదైనా నేరానికి సంబంధించి పోలీసు విభాగం ఐపీసీ కింద కేసు నమోదు చేస్తుంటుంది. నేరం, నేరగాడి తీరుతెన్నుల్ని బట్టి అరెస్టుపై నిర్ణయం తీసుకుంటుంది. ఆపై జైలు, బెయిలు, కోర్టులో కేసు విచారణ తదితరాలు ఉంటాయి. అదే ఫైర్ సర్వీసెస్ యాక్ట్ వద్దకు వచ్చేసరికి ఆ చట్టం, అగ్నిమాపక శాఖకు ఉన్న అధికారాలు వేరు. వీళ్లు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలకు సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ నోటీసుల జారీ మినహా అరెస్టుకు ఆస్కారం లేదు. ఈ కేసు కోర్టు వరకు వెళ్లినా సాధారణ కేసుల్లా విచారణ ఉండదు. అదే ఎందరి ప్రాణాలు తీసిన ఉదంతం, ఎంత తీవ్రమైన ఉల్లంఘన అయినప్పటికీ ఇదే పరిస్థితి. ఈ కేసుల విచారణ సివిల్ కోర్టుల్లో సమరీ ట్రయల్ విధానంలో జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై నమోదైన కేసుల మాదిరిగానే ఉంటుంది. గరిష్ట శిక్ష మూడు నెలలు మాత్రమే... ఈ చట్టంలోని అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ శిక్షలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 90 శాతం ఉల్లంఘనలకు జరిమానా మాత్రమే విధించే ఆస్కారం ఉంది. మిగిలిన వాటిలోనూ గరిష్ట శిక్ష కేవలం 3 నెలలు మాత్రమే. ఈ సెక్షన్లకు సంబంధించిన ఉల్లంఘనల్లోనూ పెనాల్టీ విధించే ఆస్కారం ఉంది. రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు 2014 నుంచి ఇప్పటి వరకు 689 కేసులు నమోదు చేశారు. వీటిలో కనీసం ఒక్క కేసులోనూ ఉల్లంఘనులకు జైలు శిక్ష పడలేదు. 83 కేసులు జరిమానాలతో ముగిసిపోగా... మరో 60 ఆ విభాగమే ఉపసంహరించుకుంది. మిగిలిన వాటిలో 257 కేసులను న్యాయస్థానం రిటర్న్ చేసి మార్పు చేర్పులు సూచించింది. ఇంకో 270 కేసులు ఇప్పటికీ వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని 665 నిర్మాణాలకు నోటీసులు, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన మరో 636 మంది యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోనే అత్యధికంగా కేసులు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అగ్నిమాపక శాఖ నమోదు చేసిన కేసుల్లో అత్యధిక హైదరాబాద్‌కు సంబంధించివనే. మొత్తం 689 కేసులకు నగరానికి సంబంధించినవి 325, రంగారెడ్డి 154, వరంగల్ 70, నల్లగొండ 56, ఖమ్మం 36 కేసులు ఉన్నాయి. గతంలో అగ్నిమాపక శాఖకు సొంతంగా ప్రాసిక్యూషన్ సర్వీస్ కూడా ఉండేది కాదు. పంజగుట్టలోని మీన జ్యువెలర్స్‌లో 2006లో జరిగిన అగ్నిప్రమాదం ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఆ కేసు నుంచి అగ్నిమాపక శాఖ ప్రాసిక్యూషన్ మొదలెట్టింది. అగ్నిమాపక శాఖలో పదవీ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘2000 సంవత్సరం తర్వాత అభివృద్ధి వేగం పుంజుకుంది. దీంతో అనేక భారీ నిర్మాణాలు, భవనాలు వచ్చాయి. వాణిజ్య కార్యకలాపాలూ పెరగడంతో ఉల్లంఘనలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఫైర్ సర్వీసెస్ యాక్ట్‌ను మార్చాలి. కఠినమైన నిబంధనలతో పాటు శిక్షలు అమలులోకి తీసుకువస్తేనే అగ్ని ప్రమాదాల్లో అమాయకులు బలికాకుండా ఉంటారు. మీన జ్యువెలర్స్ కేసులో ఆ భవన యాజమాన్యానికి పడిన జరిమానా కేవలం రూ.15 వేలే’ అని అన్నారు. (క్లిక్ చేయండి: హైదరాబాద్ మెట్రో రైలు.. తప్పని తిప్పలు) -
ప్రపంచ పరిణామాలు, విదేశీ పెట్టుబడులు కీలకం
ముంబై: దేశీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం ప్రపంచ పరిణా మాలు, విదేశీ పెట్టుబడుల సరళీ స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. డాలర్ మారకంలో రూపాయి క్రూడాయిల్ ధరలు కదలికలపై మార్కెట్ వర్గాలు కన్నేయోచ్చంటున్నా రు. ‘‘దేశీయంగా పండుగ సీజన్ సందర్భంగా డిమాండ్, మార్జిన్లపై యాజమాన్యపు వ్యాఖ్యలు, ప్రభుత్వ మూల ధన వ్యయం, గ్రామీణ వృద్ధి తది తర అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల కదలికలు, ఆర్థిక వృద్ధి, సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య విధాన నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌పై ప్రభావం చేయవచ్చు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 17,450 వద్ద తొలి మద్దతు, ఈ స్థాయిని కోల్పోయితే 17,250–17, 150 శ్రేణిలో మరో తక్షణ మద్దతు స్థాయి లభించొచ్చు. ఎగువ స్థాయిలో 17,700 వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ మార్కెట్ హెడ్ అపూర్వ సేథ్ తెలిపారు. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు మరోసారి తెరపైకి రావడంతో పాటు దేశీయ జూన్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోవడంతో గతవారం సూచీలు స్వల్ప నష్టంతో ముగిశాయి. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 31 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్లను కోల్పోయాయి. ప్రపంచ పరిణామాలు యూరోజోన్‌తో పాటు చైనా, జపాన్ దేశాల ఎస్అండ్పీ గ్లోబల్ సర్వీసెస్ కాంపోసైట్ పీఎంఐ డేటా నేడు(సోమవారం) విడుదల అవుతుంది. అమెరికా సర్వీసెస్ పీఎంఐ గణాంకాలను మంగళవారం వెల్లడించనుంది. యూరోజోన్ జూన్ క్వార్టర్ జీడీపీ, చైనా వాణిజ్య గణాంకాలు బుధవారం వెలువడుతాయి. అదేరోజున ఈసీబీ వడ్డీరేట్ల ప్రకటన, ఫ్రాన్స్ ట్రేడ్ డేటా, జపాన్ జీడీపీ గణాంకాలు, అమెరికా నిరుద్యోగ గణాంకాలు గురువారం విడుదల అవుతాయి. చైనా ద్రవ్యోల్బణ డేటాను శుక్రవారం ప్రకటించనుంది. కీలకమైన ఈ స్థూల ఆర్థిక గణాంకాల నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. 20 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరగడం, క్రూడాయిల్ ధరల స్థిరీకరణల ప్రభావంతో ఆగస్టులో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) భారత ఈక్విటీల్లో రూ. 51,200 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇది 20 నెలల్లోనే అత్యధికమని డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. 2020, డిసెంబర్లో వచ్చిన రూ. 62,016 కోట్ల పెట్టుబడుల తర్వాత ఇదే అత్యధికం. అంతకుముందు జూలైలో ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 5,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గతేడాది (2021) అక్టోబర్ నుంచి తొమ్మిది నెలల పాటు ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 2.46 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో భారత మార్కెట్లపై విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తిగా ఉన్నారు. ‘‘యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు కొనసాగుతుందనే స్పష్టత వచ్చింది. ఆగస్టుతో పోలిస్తే పెట్టుబడుల వేగం తగ్గినప్పటికీ ప్రస్తుత నెల(సెప్టెంబర్)లోనూ ఎఫ్‌పీఐ నిధుల రాక కొనసాగవచ్చు. అధిక ద్రవ్యోల్బణం, డాలర్ మారకం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు ఎఫ్‌పీఐలను ప్రభావితం చేస్తాయి’’ అని ట్రేడ్‌స్మార్ట్ చైర్మన్ విజయ్ సింఘానియా తెలిపారు. నేటి నుంచి తమిళ్ మెర్కంటైల్ బ్యాంక్ ఐపీవో తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభం కానుంది. మూడురోజుల పాటు జరిగే ఈ ఐపీఓ సెప్టెంబర్ 7న ముగుస్తుంది. ధరల శ్రేణి రూ. 500 – 525గా ఉంది. గతవారాంతాన యాంకర్ ఇన్వెస్టర్లకు రూ.363 కోట్ల విలువైన షేర్లను జారీ చేసింది. ఇష్యూలో భాగంగా 1.58 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 832 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. -
ఒకసారి కేసు నమోదైతే మాఫీ ఉండదు!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసానికి సంబంధించి ఒకసారి కేసు నమోదైతే, ఇక ఉపసంహరణ ప్రక్రియ ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తీవ్రమైన రైల్వే యాక్ట్‌లోని సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో నేరం నిరూపణ అయితే గరిష్టంగా మరణశిక్ష విధించే ఆస్కారమూ ఉంది. సికింద్రాబాద్ ఘటనలో కొందరే విధ్వంసానికి పాల్పడినప్పటికీ ఆ సమయంలో అక్కడున్న అందరూ నిందితులుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఐపీసీ, రైల్వే యాక్ట్, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం(పీడీపీపీఏ)లోని సెక్షన్లలో నమోదైన ఈ కేసు కారణంగా నిందితులకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావు. హత్యాయత్నం, విధ్వంసం, దాడులుసహా మూడు చట్టాల్లోని 15 సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఏపీలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం తదితరాల్లోనూ విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ, ప్రభుత్వం మారిన తర్వాత ఏపీలోనూ ఆ కేసులను ఉపసంహరించారు. దీన్నే విత్డ్రాల్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా పిలుస్తారు. అయితే రైల్వే యాక్ట్ కింద నమోదైన కేసుల్లో ఈ వెసులుబాటు ఉండదు. వీటి విచారణ సైతం ప్రత్యేక రైల్వే కోర్టులో జరుగుతుంది. ఈ కారణంగానే ఇదివరకు రైల్‌రోకో చేసిన రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇంకా ఆ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కోర్టులో కేసు వీగినా ఇదే పరిస్థితి ఉంటుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క మల్టీ నేషనల్ కంపెనీల సహా అనేక ప్రైవేట్ సంస్థలు సైతం ఇటీవల ఉద్యోగం ఇచ్చే ముందు పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ కచ్చితంగా అడుగుతున్నాయి. ఈ కేసు నేపథ్యంలో నిందితులుగా ఉన్న ఆందోళనకారులకు పోలీసు విభాగం క్లియరెన్స్ సర్టిఫకెట్లు జారీ చేయదని, పాస్‌పోర్టులు జారీ కావని, కొన్ని దేశాలకు ప్రత్యేక వీసాలు కూడా పొందడం కష్టసాధ్యమే అని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాంటి సందర్భంలోనూ ఈ కేసు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఈ కేసులోని సెక్షన్లు, ఆరోపణలు, నిరూపణ అయితే గరిష్ట శిక్షలు ఇలా ► ఐపీసీలోని 143: చట్ట విరుద్ధంగా ఓ ప్రాంతంలో గుమిగూడటం, ఆరు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 147: అల్లర్లు చేయడం, రెండేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 324: మారణాయుధాలతో గాయపరచడం, మూడేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 307: హత్యాయత్నం, పదేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 435: అగ్ని లేదా పేలుడు పదార్థం విని యోగించి విధ్వంసం సృష్టించడం, ఏ డేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 427: రూ.50 అంతకంటే ఎక్కువ విలువైన వస్తువును ధ్వంసం చేయడం, రెండేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 448: అనుమతి లేకుండా ఓ ప్రాంతంలోకి ప్రవేశించడం, ఏడాది జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 336: ఎదుటి వారికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న పని చేయడం, మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 332: విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకుని గాయపరచడం, మూడేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 341: నిర్భంధించడం, నెల రోజుల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 149: గుంపుగా ఆందోళన చేసినప్పుడు అందులోని ప్రతి ఒక్కరూ నేరానికి బాధ్యులే ఇండియన్ రైల్వే యాక్ట్ ►సెక్షన్ 150: తాము చేస్తున్న పని వల్ల ఎదుటి వారి ప్రాణాలకు హాని ఉందని తెలిసీ చేయడం, మరణ శిక్ష లేదా జీవిత ఖైదు ►151: రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం, ఐదేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ►152: రైళ్లపై రాళ్లు విసరడం, కర్రలతో దాడి చేయడం, పదేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు పీడీపీపీ యాక్ట్: ► సెక్షన్ 3: ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, 6 నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు లేదా జరిమానా లేదా రెండూ -
ప్రశ్నల ట్రెండ్ మారొచ్చు
సాక్షి, హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జూన్ 5న నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఈసారి భిన్నంగా ఉండే అవకాశం ఉం దని నిపుణులు అంచనా వేస్తున్నారు. మునుపెన్నడూ లేనట్లు ఈసారి అంతర్జాతీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని, ప్రధాని మోదీ వ్యూహాత్మక అంతర్జాతీయ సంబంధాలు పరీక్షలో కీలకపాత్ర పోషించే వీలుందని భావిస్తున్నారు. రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గమనం, వ్యాక్సినేషన్, పరిశోధనలపై ప్రశ్నలకు ఎక్కువ చాన్స్ ఉంటుందని అంచనా. టెక్నా లజీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలూ ప్రశ్నావళిలో కనిపిస్తాయని చెబుతున్నారు. ప్రిలిమ్స్‌కు ప్రణాళికాబద్ధంగా చదవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. వీటిపై దృష్టి పెట్టాలి మోదీ డెన్మార్క్ పర్యటన, నార్డిక్ దేశాల సంబంధాలపై ప్రిలిమ్స్‌లో అడిగే అవకాశముంది. నార్డిక్ దేశాలేవనే ప్రశ్న వచ్చే అవకాశం కన్పిస్తోంది. నాటో దేశాల గురించి తెలుసుంటే మంచిది. రష్యా–ఉక్రెయిన్ దాడిలో నల్ల సముద్రానికి కీలకపాత్ర. ఇందులోంచి ప్రశ్నలు రావచ్చు. గవర్నర్, రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలకు తేడా పై చర్చ జరుగుతోంది. పార్లమెంట్ పదజాలం, విధివిధానాలు, పార్టీ ఫిరాయింపుల చట్టం, స్పీకర్ అధికారాలను పరిశీలించాలి. శాస్త్రసాంకేతిక విజ్ఞానంలో బయోటె క్నాలజీ, జెనిటిక్ ఇంజనీరింగ్ ప్రధానాంశాలు కావచ్చు. ఇస్రో,నాసా,ప్రైవేటు స్పేస్ ఏజెన్సీల నుంచి ప్రశ్నలు ఎక్కువ వస్తున్నా యి. ఈసారి ఈ సంస్థల సరికొత్త ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలి. నానో టెక్నాలజీ, రోబో టిక్స్‌పై ప్రశ్నలు ఉంటాయని భావిస్తున్నారు. కరోనా తర్వాతి మైక్రో బేస్డ్ అధ్యయనాలు ప్రిలిమ్స్‌లో అడిగే వీలుంది. ముఖ్యంగా వైరస్ రూపాంతరం, వాటి చరిత్ర, వ్యాక్సిన్, పరిశోధనలు లోతుగా అడగొచ్చు. టార్గెటెడ్ డ్రగ్ డెలివరీపై ప్రత్యేక అధ్యయనం అవసరం. నేషనల్ పార్కులు, మ్యాప్స్, పర్యావరణ విధానాలు, చట్టాలు, సంస్థలు, గ్రాఫీన్ అనే సబ్జెక్ట్ (ఒక విధమైన కార్బన్) ఈసారి రావచ్చు. ఫిజిక్స్‌లో బేసిక్స్ తప్పకుండా చూడాలి. నెల రోజులు ప్రణాళికతో సిద్ధమవ్వాలి ప్రిలిమ్స్‌కు ప్రణాళికాబద్ధంగా, అంశాల వారీగా ప్రిపేర్ కావాలి. రెండుమూడు రోజులకో సబ్జెక్టు రివిజన్ చేసుకోవాలి. ప్రిలిమ్స్‌లో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ మూలస్తంభాలు. సైన్స్ అండ్ టె క్నాలజీ, ఎన్విరాన్మెంట్, అంతర్జాతీయ, ప్రాం తీయ సంబంధాలు రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలి. ఈమధ్య ఆర్ట్ అండ్ కల్చర్ కొత్తగా వచ్చింది. – బాలలత (సీబీఎస్, ఐఏఎస్ అకాడమీ, హైదరాబాద్) -
పోలవరం ప్రధాన డ్యామ్ డిజైన్లపై రేపు భేటీ
సాక్షి, అమరావతి : పోలవరం ప్రధాన డ్యామ్ డిజైన్లపై చర్చించేందుకు శుక్రవారం(25న) రిటైర్డ్ ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలోని నిపుణుల కమిటీ భేటీ కానుంది. వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురై ఏర్పడిన గొయ్యిలను ఎలా పూడ్చాలి? గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యామ్‌ను ఎలా నిర్మించాలనే అంశాలపై చర్చిస్తారు. పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ సూచనల మేరకు ప్రధాన డ్యామ్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఢిల్లీ–ఐఐటీలో డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ వీఎస్ రాజు, జర్మనీకి చెందిన బావర్ సంస్థ ప్రతినిధులు, కేంద్ర జలసంఘం, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సభ్యులకు పంపారు. ఈ వివరాల ఆధారంగా ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గొయ్యిలను పూడ్చే విధానం, గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యామ్ నిర్మాణంపై అధ్యయనం చేయనున్నారు. ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలపై 25న నిర్వహించే వర్చువల్ సమావేశంలో చర్చించి, డిజైన్లను కొలిక్కి తేనున్నారు. కొలిక్కి తెచ్చిన ఈ డిజైన్లపై ఈ నెల 28 లేదా 29న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వీఎస్ రాజు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. నిపుణుల కమిటీ రూపొందించిన విధానాల్లో మెరుగైన పద్ధతిని ఖరారు చేసి.. దాని ప్రకారం గొయ్యిలను పూడ్చటం, ప్రధాన డ్యామ్‌ను నిర్మించడంపై నిర్ణయం తీసుకోనున్నారు. -
పరిశోధనా? ఉపరితల శోధనా?
కార్యకారణాలేమైనా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇన్నాళ్ళకు కళ్ళు తెరిచినట్టుంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పేందుకు ఆయా రంగాల నిపుణులను వినియోగించుకోవాలని నిర్ణయించడం మంచిదే. ఎంత అనుభవం, నైపుణ్యం ఉన్నా – పీహెచ్డీ పట్టా కానీ, జాతీయ అర్హతా పరీక్ష (నెట్)లో కృతార్థులై కానీ ఉంటే తప్ప అధ్యాపకులుగా పనిచేయడానికి వీలు లేదన్న షరతుకు వెసులుబాటు లభించింది. సివిల్ సర్వీసులలో లాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ ఆచార్య పదవుల్లోకి లేటరల్ ఎంట్రీ వచ్చినట్టయింది. ఈ కొత్త విధానంతో పాటు, కొంతకాలంగా ఉద్యోగానికీ – పీహెచ్‌డీకీ ముడిపెట్టిన ప్రహసనంపై ఇప్పుడు చర్చ రేగింది. నిజానికి డాక్టోరల్ థీసిస్ (పీహెచ్డీ) అనేది నిర్ణీత అంశాన్ని లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తితో, మనసు పెట్టి చేయాల్సిన పని. ఉద్యోగార్హత కోసం చేసే మొక్కుబడి వ్యవహారం కాదు. అలాగే, నాణ్యమైన బోధన చేయాలంటే పీహెచ్డీ చేసి తీరాలని అనుకోవడం బోడిగుండుకూ, మోకాలికీ ముడిపెట్టడమే! అద్భుతంగా పాఠం చెప్పగలిగినవాళ్ళందరూ పరిశోధకులై ఉంటారనుకున్నా, ఉత్తమ పరిశోధకులైనంత మాత్రాన అర్థమయ్యేలా పాఠం చెప్పే నేర్పు ఉంటుందనుకున్నా పొరపాటు. విధాన నిర్ణేతలు ఈ చిన్న తర్కం మర్చిపోయారు. పీహెచ్డీ చేయకున్నా, దాదాపు 40 గౌరవ డాక్టరేట్లొచ్చిన అబ్దుల్ కలామ్ ఎంత అద్భుత బోధకులో గుర్తు చేసుకోవాలి. అధ్యాపకులుగా ఎంపిక కావాలన్నా, ఇప్పటికే అధ్యాపక వృత్తిలో ఉన్నవారు ఆ పనిలోనే కొనసాగాలన్నా పీహెచ్డీ చేసి తీరాల్సిందే అని కొన్నేళ్ళ క్రితం పెట్టిన నిబంధన నిర్హేతుకమనేది అందుకే! ఒకప్పుడు ఉద్యోగానికి పీహెచ్డీ తప్పనిసరి కాదు. 2021 జూలై నుంచి యూనివర్సిటీ బోధనకు పీహెచ్డీ తప్పనిసరి చేసింది యూజీసీ. కరోనాతో తేదీని 2023 వరకు పొడిగించారు. కానీ, ఉన్నత విద్యాబోధనలో ఉండాలంటే పీహెచ్డీ సాధించాల్సిందేనని మెడ మీద కత్తి పెడితే ప్రయోజనం ఉంటుందా? ఒకప్పుడు డాక్టరేట్ అంటే అదో విశిష్ట సాధన. గౌరవ డాక్టరేట్లు, కష్టపడి పరిశోధన చేసి పీహెచ్డీ పట్టాతో పేరు ముందు వచ్చే డాక్టర్ అనే మూడక్షరాలు సమాజంలో విశేష గౌరవం. ఆ మోజు పెరిగేసరికి పేరు లేని విదేశీ సంస్థల మొదలు ప్రైవేట్ విద్యా లయాల దాకా అనేకుల గౌరవ డాక్టరేట్లు ఇవాళ అంగడి సరుకయ్యాయి. గౌరవ డాక్టరేట్లను పేరు ముందు ఇంటి పేరులా వాడరాదన్నది విస్మరించిన వేళ అసలు డాక్టరేట్కే గౌరవం లేకుండా పోయే ప్రమాదం వచ్చింది. 1920లలో మన దగ్గర కొన్ని డజన్ల మందే పీహెచ్డీ స్కాలర్లుండేవారు. ఇవాళ అమెరికాలో ఏటా 64 వేలకు పైగా డాక్టరేట్లు వస్తుంటే, 24 వేల మంది పీహెచ్డీ స్కాలర్లతో మనం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నాం. 2010తో పోలిస్తే 2017లో పీహెచ్‌డీలో చేరేవారి సంఖ్య రెట్టింపు దాటింది. 2000 నాటికి దేశంలో డాక్టరేట్ ప్రదానం చేసే సంస్థలు 326. కానీ, 2017 కల్లా వాటి సంఖ్య 912 అయిందంటే పీహెచ్డీ ఎంత వేలంవెర్రిగా మారిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి, నిరంతర అధ్యయనం, క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రొఫెసర్ల మార్గదర్శనం, విశ్వవిద్యాలయాల్లో పరిశోధన పత్రాల సమర్పణ – అంతా ఒక సీరియస్ జ్ఞానార్జన. కానీ, ఇవాళ పరిశోధకులకే కాదు... వారికి దిశా నిర్దేశ విధుల్లో ఉన్న చాలామందిలోనూ విషయ పరిజ్ఞానం హుళక్కి. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయ శాఖలు పీహెచ్డీ స్కాలర్లను టోకున బయటకు పంపే కర్మాగారాలయ్యాయి. అనేకచోట్ల అజ్ఞాత రచయితల సహకారం, గ్రంథ చౌర్యం, నాసిరకం పరిశోధనాంశాలు, పత్రాలతో ప్రమాణాలు నానాటికీ తీసికట్టు అయ్యాయి. నాలుగు వాక్యాలు రాయలేనివాళ్ళు, నాలుగు మాటలు సదస్సులో మాట్లాడలేనివాళ్ళూ నేడు పీహెచ్డీ పట్టాదారుల్లో ఉంటున్నారన్నది నిష్ఠురమైన నిజం. ఉద్యోగానికీ, ఉద్యమంగా చేయాల్సిన పరిశోధనకూ లింకు పెట్టడం మన విధాన నిర్ణేతల ఘోర తప్పిదం. దానివల్లే పీహెచ్డీ ప్రవేశాలు 50 శాతం పెరిగాయి. ప్రమాణాలు పాతాళానికి చేరాయి. కనీసం మూడు నుంచి అయిదేళ్ళ కఠోర శ్రమతో తపించి చేయాల్సిన పరిశోధనపై తపన లేనివాళ్ళు కూడా ఉద్యోగం కోసం వట్టి ఉపరితల శోధకులవుతున్న దౌర్భాగ్యం. ఆర్ట్స్ మొదలు సైన్స్ దాకా అనేకచోట్ల ఇదే పరిస్థితి. ఏటా 60 లక్షల మంది గ్రాడ్యుయేట్లు, 15 లక్షల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు వస్తున్న దేశంలో నిఖార్సయిన పరిశోధక విద్యార్థుల శాతం ప్రశ్నార్థకమే. విశ్లేషణాత్మక శోధన, వర్తమాన ప్రాసంగికత లోపించి, పునరుక్తులతో, సర్వే ఆధారిత సిద్ధాంతాలుగా తూతూ మంత్రపు ఉపరిశోధనలు పెరిగిపోయాయని తాజా నివేదికల మాట. వెరసి, జ్ఞానార్జనలో సరికొత్త అంశాలు వెలికి తీయాల్సిన పరిశోధన మౌలిక లక్ష్యం, లక్షణం నిర్వీర్యమైపోతున్నాయి. మౌలిక పరిశోధన మృగ్యమై, ఎంతసేపటికీ చూచిరాతలు, ఎత్తిపోతలతోనే వివిధ శాఖల్లో పీహెచ్డీ సిద్ధాంత గ్రంథాలు సిద్ధమవుతున్నట్టు ఆరోపణ. గ్రంథ చౌర్యాన్ని కనిపెట్టే సాఫ్ట్‌వేర్‌ను కొన్నేళ్ళ క్రితం ప్రవేశపెట్టారు. కానీ, ఆ ఒక్క పనితో పీహెచ్‌డీల నాణ్యత పెరుగుతుందా? చిత్తశుద్ధి లేని పీహెచ్‌డీతో నిర్ణీత విద్యాశాఖకు కలిగే ప్రయోజనం ఏమిటి? అలాంటి వారు బోధకులైతే విద్యా ర్థులకు వచ్చిపడే విజ్ఞానం ఏముంటుంది? ఇప్పటికైనా నిష్ప్రయోజనమైన ఈ డిగ్రీల తంతును వదిలించుకొని, నిఖార్సయిన పరిశోధనలను యూజీసీ, మానవ వనరుల అభివృద్ధిశాఖ ప్రోత్సహిస్తే మేలు. ప్రహసనప్రాయంగా మారిన ‘నెట్’ లాంటి వాటి పైనా పునఃసమీక్ష అవసరం. పీహెచ్డీ లేకున్నా, అనుభవజ్ఞులైన వారి సేవలు తీసుకోవాలన్న తాజా నిర్ణయం అందుకే స్వాగతనీయం. -
ఉక్రెయిన్ ఉక్కు వీరులు!.. ఒట్టి చేతులు.. వాటర్ బాటిల్‌తో బాంబులు నిర్వీర్యం
Disabling Bomb Their bare hands and just a bottle of water: ఉక్రెయిన్ రష్యా మధ్య పోరు నిరవధికంగా కొనసాగుతూనే ఉంది. ఒక వైపు రష్యా విదేశీయుల తరలింపు నిమిత్తం కాల్పుల విరమణ ప్రకటిస్తూనే మరోవైపు నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఉక్కెయిన్ చాలా ఘోరంగా అతలాకుతలమైపోతోంది. అయినప్పటికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తమ దేశాన్ని తమ ప్రజలను రక్షించుకుంటామంటూ తమ దేశ భక్తిని చాటుతున్నారు. మరోవైపు సైనికులు కూడా తమవంతుగా ప్రాణాలను లెక్కచేయకుండా రష్యా బలగాలకు ఎదురు నిలిచి మరీ పోరాడుతున్నారు. అత్యంత ధైర్య సాహసాలతో రష్యా సైన్యాన్ని నిలవరించడమే కాక రష్యా దాడులను తిప్పికొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందులో భాగంగా ఉక్రేనియన్ పేలుడు ఆర్డినెన్స్ డిస్పోజల్ స్పెషలిస్ట్‌ల బృందం తమ దేశంలో పేలకుండా పడి ఉన్న బాంబులను కేవలం ఉత్తి చేతులతో వాటిని నేరుగా తీసి, వాటర్ బాటిల్‌తో నిర్విర్యం చేస్తున్నారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తమ దేశ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆ బాంబులను నిర్విర్యం చేస్తున్న తీరుని చూస్తే మనసు చలించుపోతుందంటూ వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అంతేకాదు ఉక్రెయిన్ వాసులు సైతం రష్య యుద్ధ ట్యాంకులకు ఎదురుగా నిలబడి మా దేశంలోకి రావద్దంటూ నినాదాలు చేసి మరీ అందర్నీ ఆశ్చర్యపరిచారు. This #Russia-dropped bomb would flatten a building — and yet these #Ukraine EODs defuse it with 2 hands and a bottle of water, while shells audibly land nearby. Mind boggling bravery.pic.twitter.com/KvCZeOxRyz — Charles Lister (@Charles_Lister) March 9, 2022 (చదవండి: చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించగలవట! ఎలాగో తెలుసా!) -
Coronavirus: అధిక సీరో పాజిటివిటీ కాపాడుతోంది!
Expert Says Maintaining High Seropositivity Rate: భారత జనాభాలోని అధిక సీరోపాజిటివిటీ రేటు దేశాన్ని కరోనా బారి నుంచి కాపాడుతోందని సీసీఎంబీ మాజీ డైరెక్టర్, ప్రస్తుత జీఐజీఎస్ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. అయితే ఒమిక్రాన్ వ్యాప్తిని చూపే గణాంకాలు పెరుగుతున్నందున తగు జాగ్రత్తతో ఉండాలన్నారు. టీకా కవరేజ్‌ను మరింత పెంచడం, కోవిడ్ నిబంధనలను కచ్ఛితంగా పాటించడం చేయాలని సూచించారు. భారత్‌లో 70–80 శాతం సీరోపాజిటివిటీ రేటుందని, పెద్ద నగరాల్లో దాదాపు 90 శాతం జనాభాలో యాంటీబాడీలున్నాయని రాకేశ్ చెప్పారు. (చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!) అయితే ఒమిక్రాన్ నేపథ్యంలో అజాగ్రత్త కూడదన్నారు. ఒమిక్రాన్ లేకుండానే యూరప్‌లో వేవ్స్ వస్తున్నాయని గుర్తు చేశారు. భారత్‌లో సెకండ్ వేవ్ కాలంలో భారీగా ఇన్ఫెక్షన్ వ్యాపించిందని, దీనివల్ల ఎక్కువమందిలో సీరోపాజిటివిటీ పెరిగిందని వివరించారు. భవిష్యత్‌లో కేసులు పెరిగినా ఆస్పత్రుల పాలవడం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేశారు. రక్షణ నిబంధల్ని పాటించకుంటే స్వల్పపాటి థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. (చదవండి: ఒంటెల అందాల పోటీలు.. రూ. 500 కోట్ల ప్రైజ్‌మనీ!!) -
కరోనా రీ–ఇన్ఫెక్షన్ గనుక వస్తే..పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే!
మీకు ఇప్పటికే ఓసారి కరోనా సోకిందా? తొలిసారి అనుభవంతో మళ్లీ మరోసారి ఇన్ఫెక్షన్ గనక వస్తే... అది తీవ్రంగా బాధిస్తుందనీ లేదా ప్రాణాంతకమవుతుందేమోనని ఆందోళన పడుతున్నారా? రీ–ఇన్ఫెక్షన్ కేసుల్లో అస్సలు అలాంటి భయమే అవసరం లేదని భరోసా ఇస్తున్నారు అధ్యయనవేత్తలు. రెండోసారి గనక కరోనా ఇన్ఫెక్షన్ సోకితే దాదాపు 90 శాతం మందిలో అది తీవ్రమైన లేదా క్రిటికల్ లేదా మరణం వంటి వాటికి దారితీయదు. అంతేకాదు... మొదటిసారి ఇన్ఫెక్ట్ అయిన వారిలో చాలా సీరియస్ అయ్యే అవకాశాలు 2.5 శాతం కాగా... రీ–ఇన్ఫెక్ట్ అయిన వాళ్లలో ఆ అవకాశాలు కేవలం 0.3 శాతం మాత్రమేనని, ఇక క్రిటికల్ అయ్యే పరిస్థితి తొలిసారి ఇన్ఫెక్ట్ అయిన వారిలో 0.40% కాగా... రెండోసారి ఇన్ఫెక్ట్ అయిన వారిలో ఇది సున్నా శాతం (0%) అనీ, మరణానికి దారి తీయడం అనే అంశంలోనూ తొలిసారి సోకిన వారు 0.1% కాగా... రెండోసారి ఇన్ఫెక్ట్ అయిన వారిలోనూ అది సున్నా శాతం (0%) అంటూ భరోసా ఇస్తున్నారు. కాబట్టి రెండోసారి ఇన్ఫెక్ట్ అయిన వారిలో కొంతవరకు హాస్పిటలైజ్ అయితే అవ్వొచ్చుగానీ... క్రిటికల్, మరణానికి దారితీసే ప్రమాదమే ఉండదన్నది ఖతర్ పరిశోధకులు తేల్చిన అంశం. ఖతర్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌తో పాటు వీల్ కార్నెల్ మెడిసిన్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఓ సంయుక్త అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ బృందం రెండోసారి ఇన్ఫెక్షన్కు గురైన దాదాపు 1,300 మందికిపైగా వ్యక్తులపై ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ వివరాలన్నీ ‘ద న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ అనే ప్రముఖ మెడికల్ జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి. అయితే ఈ పరిశోధనపై కొన్ని విమర్శలూ వినిపిస్తున్నాయి. ఖతర్‌లో అంత తీవ్రంగా కరోనా లేదనీ, అందువల్ల బాగా చల్లగా ఉండే పాశ్చాత్యదేశాల్లోని వాతావరణం కారణంగా... ఇదే అధ్యయనం పాశ్చాత్యులకు అంతే కచ్చితంగా వర్తించకపోవచ్చంటూ కొన్ని దేశాలూ, సంస్థలూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే... ఫిబ్రవరి 28, 2020 నుంచి ఏప్రిల్ 28, 2021 మధ్యకాలంలో తొలిసారి ఇన్ఫెక్ట్ అయిన 3,53,000 మందిపైనా... వారిలోనే మళ్లీ రీ–ఇన్ఫెక్ట్ అయిన 1,300 మందిపైనా నిర్వహించినందున ఈ అధ్యయనానికి ఎంపిక చేసిన శాంపుల్ పెద్దదిగానే భావించాలనీ, ఇది కొంతమేరకు ఊరటనిచ్చే అంశమేనని మరికొందరు నిపుణులు భరోసా ఇస్తున్నారు. -
వైజాగ్ @ సేఫ్ జోన్
సాక్షి, విశాఖపట్నం: ఆదివారం ఉదయం.. రాత్రంతా కురిసిన భారీ వర్షంతో భారంగా నిద్రలేస్తున్న వేళ.. ఒక్కసారిగా అలజడి... సరిగ్గా ఉదయం 7.13 గంటలకు భారీ శబ్దం వినిపించింది. ఉలిక్కిపడిన ప్రజలు.. 5 సెకన్ల పాటు భూ ప్రకంపనలు రావడంతో భయాందోళనలతో బయటికి వచ్చారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాలి కంటే వేగంగా.. వైజాగ్‌లో భూకంపం అనే వార్త దావానలంలా వ్యాపించింది. అయితే.. విశాఖలో భూకంపాల వచ్చే తీవ్రత అత్యంత స్వల్పమని.. ప్రజలెవ్వరూ ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదవండి: ఒక్క రోజులో.. అదిరిపోయే టూర్లు! రిక్టర్ స్కేలుపై 6 దాటితేనే ప్రభావం భూమి లోపల 12 కఠినమైన పొరలతో పాటు చిన్న పొరలు కూడా ఉంటాయి. అవి ఒకదానికొకటి కదులుతూ ఉంటాయి. ఈ కదలిక కారణంగానే నష్టం వాటిల్లుతుంది. భూ అంతర్భాగంలో అధిక ఉష్ణోగ్రతలకు ఈ శిలాఫలకాలలోని కొన్ని భాగాలలో సమస్యలు ఏర్పటంతో ఒకదానికొకటి నెట్టుకుంటాయి. దాని వల్ల ఆ శిలాఫలకాలలో పగుళ్లు ఏర్పడి భూకంపాలు ఏర్పడతాయి. శిలాఫలకాలలో ఏర్పడే పగుళ్ల స్థాయిని బట్టి ఈ భూకంపాలు సంభవిస్తాయి. భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6 దాటితేనే ప్రభావం అధికంగా ఉంటుంది. జోన్–2లో విశాఖ జిల్లా.. భూకంపాల తీవ్రత ఉన్న ప్రాంతాలను జోన్లలో విభజిస్తారు. జోన్–1 అంటే చిన్న స్థాయి ప్రకంపనలు కూడా వచ్చే శాతం అతి స్వల్పంగా ఉంటుందనీ.. జోన్–2లో స్వల్ప ప్రకంపనలు వస్తాయని.. జోన్–3లో భూకంప తీవ్రత స్వల్పంగా ఉంటుందనీ.. జోన్–4లో భారీగా ప్రమాదం ఉంటుందని విభజించారు. విశాఖ జిల్లా భూకంపాల విషయంలో జోన్–2 (లో రిస్క్ ఏరియా)లో ఉంది. కాబట్టి ఎలాంటి ఆందోళనకు గురికావల్సిన అవసరం లేదని వాతావరణ నిపుణులు, భూగర్భ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మన రాష్ట్రంలో 1967 మార్చి 27న ఒంగోలులో నమోదైన 5.4 తీవ్రత ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. అది కూడా రిక్టర్ స్కేలుపై 6 దాటలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 26 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. 200 ఏళ్లలో ఐదు సార్లు మాత్రమే.. విశాఖలో ప్రకంపనలు రావడం అత్యంత అరుదుగా చరిత్ర చెబుతోంది. గత 200 ఏళ్ల కాలంలో కేవలం 7 సార్లు మాత్రమే భూ ప్రకంపనలు విశాఖలో వచ్చాయని రికార్డులు చెబుతున్నాయి. ఇందులో అత్యధికం 4.3 కాగా.. అత్యల్పం ఆదివారం వచ్చిన 1.8 కావడం గమనార్హం. భూ ప్రకంపనలు చివరిసారిగా 1984లో వచ్చినట్లు వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. విశాఖలో ప్రకంపనలు ఎందుకు..? విశాఖపట్నం ప్రాంతంలో ప్రీ కేంబ్రియన్ అనే కాలానికి చెందిన రాళ్లు ఉన్నాయి. ఇవి 300 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినవి. భూ అంతర్భాగంలో ఉన్న రాళ్లు చోర్నకైట్ అనే శిలలు ఒక పగులు ద్వారా వ్యాపించాయి. మధురవాడ, మద్దిలపాలెం, సిరిపురం, గవర్నరు బంగ్లా, ఆర్టీసీ కాంప్లెక్స్, నీలమ్మ వేపచెట్టు, జ్ఞానాపురం, ఎన్ఏడీ, ఎయిర్‌పోర్టు, గాజువాక, కూర్మనపాలెం, అనకాపల్లి వరకు ఈ శిలలు వ్యాపించాయి. సముద్రంలోకి కొంత భాగం కూడా చోర్నకైట్ శిలలున్నాయి. ఈ శిలలు అప్పటికే ఉన్న ఖోండలైట్ శిలల్లోకి చొచ్చుకొని వచ్చి రూపాంతరం చెందాయి. ఈ విధంగా చొచ్చుకొని రావడం వల్ల టెక్టానికల్లీ వీక్ జోన్(సున్నితమైన ప్రాంతం)గా భౌగోళికంగా చెబుతారు. ఈ చోర్నకైట్ శిలలకు, దాన్ని ఆనుకొని ఉన్న ఖోండలైట్ శిలలకు మధ్య జరిగిన సర్దుబాటు వల్ల ఈ ప్రకంపనలు వచ్చాయి. భూకంపాల గురించి భయపడొద్దు.. విశాఖ జిల్లా చాలా సురక్షిత ప్రాంతం. జోన్–2 పరిధిలో ఉన్నందువల్ల ఇక్కడ భూకంపాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. విశాఖ భూ అంతర్భాగంలో అతి పెద్ద రాక్ బ్యారియర్ ఉంది. చోర్నకైట్, ఖోండలైట్ శిలల మధ్య జరిగిన పునఃసర్దుబాటు కారణంగా భారీ శబ్దం ఏర్పడి ప్రకంపనలు వచ్చాయి. పురాతన కాలంలో ఏర్పడడడం వల్ల ప్రస్తుతం ఈ రాక్ జోన్ అంత యాక్టివ్ జోన్ కాదు. విశాఖపట్నంలో ప్రకంపనల వరకే పరిమితం తప్ప భారీగా ఇళ్లు కూలిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి భారీ నష్టం వంటి పరిస్థితులు దాదాపు శూన్యం. ప్రజలెవ్వరూ ఈ విషయంలో ఎలాంటి భయాందోళనలకు గురికావల్సిన అవసరం లేదు. – ప్రొ.ఎం.జనార్దనరావు, ఏయూ జియాలజీ విభాగం గౌరవ ప్రొఫెసర్, నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి -
పులిచింతల: శరవేగంగా స్టాప్ లాక్ గేటు పనులు
సాక్షి, గుంటూరు: పులిచింతల స్టాప్ లాక్ గేటు ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయని ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు. సాయంత్రానికి స్టాప్ లాక్ గేటు ఏర్పాటు పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. స్టాప్ లాక్ గేటు పూర్తికాగానే రిజర్వాయర్ నింపుతామన్నారు. పులిచింతల ఘటనపై అధ్యయనానికి నిపుణుల కమిటీ నియమించామని, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఈఎన్సీ పేర్కొన్నారు. -
డెల్టా వేరియంట్ ఎంత డేంజరో తెలుసా?
లండన్: భారత్‌లో గుర్తించిన కరోనా డెల్టా వేరియంట్(బీ1. 617.2) ఇతర వేరియంట్లతో పోలిస్తే 60 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సిన్ల ప్రభావాన్ని సైతం గణనీయంగా తగ్గిస్తుందని యూకే హెల్త్ నిపుణుల నివేదిక వెల్లడించింది. యూకేలో ఈ వేరియంట్ వేగంగా పెరుగుతోందని, ఇతర వేరియంట్ల కన్నా తొందరగా వ్యాపిస్తోందని తెలిపింది.ఢి ల్లీలో కేసులు ఉధృతికి ఈ వేరియంటే కారణంగా వీరి అధ్యయనం తేల్చింది. ఇమ్యూనిటే ఎలివేషన్ లక్షణాలతో ఉన్న ఈ డెల్టా వేరియంట్ ఏప్రిల్‌లో 60 శాతం కేసులకు కారణమైందని తెలిపింది. డెల్టా వేరియంట్ అమెరికా,యూకెతో సహా కనీసం 60 దేశాలలో ఉందని కోవిడ్ -19 జెనోమిక్స్ యుకే కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్ షరోన్ పీకాక్ ది వాల్ స్ట్రీట్ జర్నల్ టెక్ హెల్త్ ఈవెంట్లో పేర్కొన్నారు. ఆల్ఫా వేరియంట్, బీ1.117 కంటే 50 శాతం ఇది ఎక్కువ వ్యాప్తిచెందుతుందని గుర్తించామని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, సీఎస్ఐఆర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ నిపుణులు వెల్లడించారు. ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ ప్రభావాన్ని బాగా తగ్గిస్తున్నదని, ముఖ్యంగా ఒక డోసు తర్వాత ఇది ఎక్కువగా కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. రెండు డోసుల తర్వాత డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్ ప్రభావం బాగానే ఉంటోందని, కానీ కాలానుగుణంగా ప్రభావం తగ్గుదల ఆల్ఫా కన్నా ఎక్కువగా ఉందని వివరించింది. ప్రస్తుతం యూకేలో కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణమని తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ వల్ల కరోనా ఉధృతి చాలా వరకు అదుపులో ఉందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషనే ఉత్తమమార్గమని యూకే హెల్త్ ఏజెన్సీ పేర్కొంది. చదవండి : టీకా తీసుకున్న 45 నిమిషాలకే మృతి American Embassy: టీకా తప్పనిసరి కాదు -
YS Jagan అద్భుతాలు చేస్తున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత విద్యాభివృద్ధి కార్యక్రమాల ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, అనేక విప్లవాత్మక మార్పులకు ఇవి నాంది పలుకుతున్నాయని పలువురు విద్యారంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యం సీఎంకు రెండు కళ్లు అని వారు అభివర్ణించారు. స్వచ్ఛంద సంస్థ ‘ఓపెన్ మైండ్స్’ ఆధ్వర్యంలో శుక్రవారం ‘ముఖ్యమంత్రి జగన్ రెండేళ్ల పాలన–విద్యారంగంలో వినూత్న మార్పులు’ అంశంపై పలువురు విద్యారంగ నిపుణులతో వర్చువల్ సమావేశం జరిగింది. వక్తలు ఏమన్నారంటే.. నిధుల కేటాయింపు ఇంగ్లండ్ కన్నా ఇక్కడే ఎక్కువ విద్యారంగానికి వైఎస్ జగన్ 17 శాతానికి పైగా నిధులు కేటాయిస్తున్నారు. ఇంగ్లండ్‌లో కన్నా ఈ కేటాయింపులు అధికం. విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. ఉన్నత, పాఠశాల విద్యకు వేర్వేరుగా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్లను ఏర్పాటుచేశారు. వీటన్నింటి ఫలితాలు రావడం మొదలు పెడితే ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. – జస్టిస్ ఈశ్వరయ్య, ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ సీఎం చాలా అద్భుతాలు చేస్తున్నారు వైఎస్ జగన్ పథకాలన్నీ ఎంతో మేలు చేసేవి. అమ్మఒడిని ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేస్తే అవి మరింత బలోపేతమవుతాయి. నాడు–నేడుతో స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ఏర్పడి చూడముచ్చటగా మారాయి. పాఠశాల టీచర్ల వ్యవస్థ బాగుంది. వర్సిటీ అధ్యాపకులపై ఏటా అసెస్మెంటు జరగాలి. సీఎం జగన్ చాలా అద్భుతాలు చేస్తున్నారు. – ప్రొ. వెంకట్రామిరెడ్డి, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ అమ్మఒడితో హాజరు శాతం పెరిగింది అమ్మఒడితో డ్రాప్ అవుట్లు బాగా తగ్గాయి. గతంలో 70 శాతం హాజరుండగా ఇప్పుడు 90 శాతానికి పెరిగింది. ప్రభుత్వ స్కూళ్లలో 6 లక్షల మంది చేరికలు పెరిగాయి. – డాక్టర్ బి.ఈశ్వరయ్య, పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యుడు ‘నాడు–నేడు’అత్యుత్తమ పథకం నాడు–నేడు ప్రపంచంలోనే అత్యుత్తమ పథకం. జగనన్న గోరుముద్ద, విద్యాకానుకతో విద్యార్థుల్లో ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం, చదువులపై ఆసక్తి పెరిగింది. హ్యూమన్ కేపిటల్‌గా రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. – ప్రొ. నారాయణరెడ్డి, విక్రమ సింహపురి వర్సిటీ ఫౌండర్ రిజిస్ట్రార్ 16 ప్రభుత్వ వైద్య కాలేజీల ఏర్పాటు గొప్ప విషయం విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేవు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు పెట్టడానికి నిర్ణయించి నిధులు కేటాయించడం గొప్ప విషయం. – జి. శాంతారావు, మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ 45వేల స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ రాష్ట్రంలో స్టేట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటుచేయడం సంతోషించదగ్గ విషయం. 45 వేల పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమలుచేయించడం గొప్ప విషయం. ఏయూ, ఎస్వీయూ, నాగార్జున వర్సిటీలు మరింత ప్రమాణాలతో ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్సులోకి వస్తాయని ఆశిస్తున్నాం. – ప్రొ.నారాయణరావు, ఎస్ఆర్ఎం వర్సిటీ -
కరోనా మూలాలు కనుక్కోండి: లేదంటే మరిన్ని మహమ్మారులు
న్యూయార్క్: కరోనా వైరస్ మహమ్మారి మూలాలపై ఎడతెగని చర్చ కొనసాగుతున్న క్రమంలో అమెరికాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు మరో కీలక విషయాన్ని ప్రకటించారు. కోవిడ్-19 మూలాలు పూర్తిగా అర్థం చేసుకోకపోతే కోవిడ్-26, కోవిడ్-32 కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. మహమ్మారి ఎలా ప్రారంభమైందో తెలియకపోవడం వల్ల భవిష్యత్తులలో వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సెంటర్ ఫర్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోడైరెక్టర్ పీటర్ హోటెజ్ తెలిపారు. కోవిడ్-19 ఆనవాళ్లు కనుక్కోలేకపోతే విలయాలు తప్పవని అమెరికా శాస్త్రవేత్త , అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) కమిషనర్‌గా ఉన్న స్కాట్ గాట్లిబ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరిన్ని విలయాలను నివారించేందుకు చైనా ప్రభుత్వ సహకారం అవసరమని ఆయ పేర్కొన్నారు. సార్స్ సీవోవీ2 వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే లీకైనట్లు ఆధారాలు బలపడుతున్నాయని, ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలకు చైనా సహకారం కావాలని, భవిష్యత్తు మహమ్మారులను అడ్డుకోవాలంటే ఈ చర్యలు తప్పవని స్కాట్ తెలిపారు. చైనాలో సుదీర్ఘ కాలం విచారణ చేపట్టేందుకు శాస్త్రవేత్తలను అనుమతించాలన్నారు. అలాగే అక్కడి మనుషులు, జంతువుల నుంచి రక్త నమూనాలు సేకరించేందుకు శాస్త్రవేత్తలను అనుమతించాలని హోటెజ్ తెలిపారు. సైంటిస్టులు, ఎపిడమాలజిస్ట్‌లు, వైరాలజిస్టులు, బ్యాట్ ఎకాలజిస్ట్ పరిశోధకులు హుబే ప్రావిన్సులో సుమారు ఆరు నెలలు ఉండాలని హోటెజ్ పేర్కొన్నారు. అంతేకాదు ఆంక్షలు, బెదిరింపులతో సహా, చైనాపై అమెరికా ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి మూలాలు చైనాలోనే ఉన్నాయనే, నిజాలు చెప్పకుండా ప్రపంచాన్ని మోసం చేసిందని ట్రంప్ మొదటినుంచి చైనాపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. అయితే వుహాన్‌లో చేపల మార్కెట్లో తొలుత వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. జంతువుల నుంచి మనుషులకు ఆ వైరస్ సోకి ఉండి ఉంటుందని చాలామంది వైరాలజిస్టులు అంచనా వేశారు. దీనిపై బిన్న వాదనల మధ్య కొనసాగుతున్న ఈ చర్చ దాదాపు ఏడాదిన్నర తరువాత మే 23న వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికతో మరింత రాజుకుంది. వుహాన్‌లో పనిచేసే ముగ్గురు పరిశోధకులకు 2019 నవంబర్ కన్నా ముందే వైరస్ సోకినట్లు పేర్కొనడంతో కరోనా ఆనవాళ్లపై అంతర్జాతీయంగా చర్చ తిరిగి మొదలైంది. మరోవైపు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుండే లీక్ అయ్యిందా అనే దానిపై తమ నిఘా విభాగం కీలక అంచనాలు తమ వద్ద ఉన్నాయనీ, దీనిపై లోతైన దర్యాప్తు చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఆదేశించారు. దీనిపై 90 రోజుల్లో తనకు నివేదించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. చదవండి : వ్యాక్సిన్: మందుబాబులకు పరేషాన్! కరోనా కల్లోలం: గూడు చెదిరిన గువ్వలు -
కరోనా వ్యాక్సినేషన్: నిపుణుల ప్యానల్ కీలక సిఫార్సులు
సాక్షి, ఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌పై నిపుణుల ప్యానల్ కీలక సిఫార్సులు చేసింది. కరోనా నుంచి కోలుకున్నవారికి 9 నెలల తర్వాత టీకా తీసుకుంటే మంచిందని ఎన్టీఏజీఐ సూచించింది. ఈ వ్యవధిని గతంలో ఆరు నెలలుగా సూచించిన ఎన్టీఏజీఐ.. ఇప్పుడు తొమ్మిది నెలలకు పెంచింది. ప్రస్తుతం 9 నెలల వ్యత్యాసం ఉండాలని సూచించింది. ఈ ప్రతిపాదనలను ఎన్టీఏజీఐ.. కేంద్రానికి పంపింది. కరోనా బారినపడి కోలుకున్నవారు తొలి డోసు టీకాకు ఎక్కువ కాలం గ్యాప్ ఉంటే మంచిందని ప్యానెల్ తెలిపింది. తొమ్మిది నెలల అనంతరం టీకా తీసుకోవడం ద్వారా శరీరంలో అధిక మొత్తంలో యాంటీబాడీలు వృద్ధి చెందేందుకు దోహదపడుతుందని పేర్కొంది. చదవండి: భారత్: తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు సింగపూర్ వేరియంట్ థర్ఢ్‌వేవ్ కు కారణం కావచ్చు: కేజ్రీవాల్ -
భారత్‌కు మరో సవాల్: కరోనా మూడో అవతారం
న్యూఢిల్లీ: ఒకటి కాదు..రెండు కాదు... ఏకంగా ట్రిపుల్ మ్యూటెంట్ దేశానికి సరికొత్త సవాల్ విసురుతోంది. రోజుకి 3 లక్షలకి చేరువలో కేసులు నమోదై కరోనా ప్రళయ భీకర గర్జన చేస్తున్న వేళ ఈ మూడో అవతారం వెలుగులోకి వచ్చింది. డబుల్ మ్యూటెంట్ అంతర్జాతీయంగా దడ పుట్టిస్తూ ఉంటే ఈ ట్రిపుల్ మ్యూటెంట్ ఎంత విధ్వంసం సృష్టిస్తుందా అన్న భయాందోళనలున్నాయి. ట్రిపుల్ మ్యూటెంట్ అంటే వైరస్ మూడుసార్లు జన్యు మార్పిడికి లోనవడం. మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మూడుసార్లు జన్యు క్రమాన్ని మార్చుకున్న కరోనా కేసులు బయటపడ్డాయి. మొదట ఈ వైరస్ బెంగాల్లో గుర్తించినట్టుగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ శాస్త్రవేత్త వినోద్ స్కారియా తెలిపారు. ‘‘ట్రిపుల్ వేరియెంట్ వాయువేగంతో వ్యాప్తి చెందుతుంది. అత్యధిక మంది దీని బారిన పడతారు’’అని మెక్‌గిల్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మధుకర్ పాయ్ చెప్పారు. ట్రిపుల్ మ్యూటెంట్ కేసుల్ని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే తప్ప ఎంత హానికరమో చెప్పలేమని నిపుణులు అంటున్నారు. చదవండి: (డబుల్ మ్యూటెంట్.. పేరు వింటేనే దడపుట్టేస్తోంది!) -
వూహాన్ మార్కెట్లో డబ్ల్యూహెచ్ఓ బృందం
బీజింగ్/వూహాన్: కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందన్న విషయాన్ని నిర్ధారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల నిపుణుల బృందం ఆదివారం చైనాలోని వూహాన్లో ఉన్న హూనన్ సీఫుడ్ మార్కెట్‌ను పటిష్టమైన భద్రత మధ్య సందర్శించింది. 2019లో కరోనా వైరస్ ఇక్కడే తొలిసారిగా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందన్న విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ మార్కెట్లో సముద్ర ఉత్పత్తులతోపాటు రకరకాల జంతువుల మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇక్కడ విక్రయించే గబ్బిలాలు/పాంగోలిన్స్ నుంచే కరోనా వైరస్ పుట్టిందన్న వాదన ఉంది. అయితే, దీన్ని చైనా ప్రభుత్వం అంగీకరించడం లేదు. తాము ఈరోజు ముఖ్యమైన ప్రాంతాన్ని సందర్శించామని నిపుణుల బృందం తెలియజేసింది. కరోనా వ్యాప్తిని గుర్తించడానికి ఈ పర్యటన తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. 2019 డిసెంబర్లో వూహాన్లో కరోనా కేసులు బయటపడిన తర్వాత ఈ మార్కెట్‌ను మూసివేసి, శుభ్రం చేశారు. -
కొంపముంచిన అత్యవసర స్విచ్!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి కారణాలు, ఆస్తి నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. సోమవారం ఎట్టకేలకు ప్రమాద స్థలానికి నిపుణుల బృందం చేరుకోగలిగింది. 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 6 యూనిట్లు ఉండగా, మంగళవారం వీటికి సంబంధించిన టర్బయిన్లను తెరిచి చూసే అవకాశం ఉంది. అప్పుడే నష్టంపై పూర్తి అంచనా రానుందని జెన్కో ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. టర్బయిన్ల పైన ఉండే జనరేటర్లు, వైన్డింగ్ కాయిల్స్ కాలిపోతే మాత్రం నష్టం రూ.వందల కోట్లలో ఉండే అవకాశం ఉంది. ఆరు యూనిట్లలో తొలి రెండింటి టర్బయిన్లు బాగానే ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్విచ్ పని చేయకపోవడంతోనే.. ఆరో యూనిట్‌కు సంబంధించిన ఎక్సైలేషన్ ప్యానెల్లో నిప్పురవ్వలు వచ్చిన వెంటనే.. దీనికి డీసీ కరెంట్ సరఫరా ఆటోమేటిక్‌గా ట్రిప్ కావాల్సి ఉంది. అలా జరిగి ఉంటే మంటలు ఆగిపోయి అగ్ని ప్రమాదం జరిగి ఉండకపోయేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక వేళ ఆటోమేటిక్‌గా పవర్ ట్రిప్ కాకున్నా, స్విచ్ ద్వారా నిలుపుదల చేసే ఏర్పాటు సైతం ఉంటుంది. ఈ స్విచ్ సైతం ఆ కీలక సమయంలో పని చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అంచనాకు వస్తున్నారు. టర్బయిన్లలో ఉండే జనరేటర్లలోని వైన్డింగ్ కాయిల్స్ పరిధిలో అయస్కాంత క్షేత్రం ఏర్పాటు చేయడానికి ఎక్సైలేషన్ ప్యానెల్స్ ద్వారా డీసీ విద్యుత్‌ను వాటికి సరఫరా చేస్తారు. దీనితో జనరేటర్ రోటర్లు తిరిగి విద్యుదుత్పత్తి జరుగుతుంది. ప్రారంభంలో డీసీ విద్యుత్‌ను బ్యాటరీల ద్వారా ఎౖMð్సలేషన్ ప్యానెల్‌కు అక్కడి నుంచి వైన్డింగ్ కాయిల్స్‌కు పంపుతారు. పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరపడానికి బ్యాటరీలతో సరఫరా చేసే విద్యుత్ సరిపోదు. జనరేటర్ల నుంచి ఉత్పత్తి అయిన హైడెల్ పవర్‌నే ఏసీ విద్యుత్‌గా మార్చి మళ్లీ జనరేటర్లకు పంపిస్తే పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుంది. ఇలా పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేటప్పుడే ఎౖMð్సలేషన్ ప్యానెల్లో స్పార్క్స్ వచ్చాయి. అప్పటికప్పుడు ఎక్సైలేషన్ ప్యానెల్‌కు పెద్ద మొత్తంలో డీసీ విద్యుత్ సరఫరాను నిలుపుదల చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండకపోయేదని చెబుతున్నారు. కీలక సమయంలో డీసీ విద్యుత్ సరఫరాను నిలుపుదల చేసే స్విచ్ పని చేయలేదని నిపుణులు అంటున్నారు. చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో బ్యాటరీలు పని చేయకపోవడంతోనే స్విచ్ పని చేయలేదని తెలుస్తోంది. పునరుద్ధరణ పాక్షికమే! శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. మూడు రోజుల తర్వాత పవర్‌హౌస్‌లో పొగలు అదుపులోకి వచ్చినా పునరుద్ధరణ పనులు ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేలా లేవు. అతికష్టం మీద కేబుల్ పునరుద్ధరణ పనులు చేపట్టడంతో పవర్‌హౌస్‌లోని కొన్ని విద్యుత్ లైట్లు, ఎగ్జిట్స్ ఫ్యాన్లు పనిచేస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు ఉధృతి అధికంగా ఉండటం వల్ల ఇప్పటికే భూగర్భ పవర్‌హౌస్‌లోకి నీరు వచ్చి చేరుతున్నట్టు భాస్తున్నారు. దీంతో ఒకటి, రెండు యూనిట్లలో ఉత్పత్తి చేపట్టేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నాలుగో యూనిట్‌లోని ట్రాన్స్ఫార్మర్ పేలడంతోనే 9 మంది మృతి చెందారని భావిస్తున్నారు. -
కరోనా: రికవరీ తర్వాత అవే లక్షణాలు!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్నా వైరస్ బారినపడి 6 లక్షల మంది కోలుకోవడం ఊరట కలిగిస్తోంది. పెద్దసంఖ్యలో రోగులు కోవిడ్-19 నుంచి కోలుకోవడం సానుకూల పరిణామమే అయినా వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడం అంత సులభం కాదు. కోవిడ్-19 నుంచి కోలుకునే ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగుతుందని, ఇది సంక్లిష్టతతో కూడినదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాధి నిరోధక శక్తిని నిర్వీర్యం చేస్తుందని, రికవరీ తర్వాత సైతం రోగుల్లో శారీరక, నరాల సంబంధిత లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. వీరిలో విపరీతమైన నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నిస్సత్తువ వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు తెలిపారు. రికవరీ తర్వాత రోగులు సాధారణ స్ధితికి వచ్చేందుకు నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుందని మాక్స్ హెల్త్‌కేర్‌కు చెందిన డాక్టర్ సందీప్ తెలిపారు. శ్వాస ఇబ్బందులతో పాటు నరాల బలహీనత వంటి సమస్యలూ వీరిలో కనిపించాయని కోవిడ్-19 రోగులకు చికిత్స అందించిన వివిధ ఆస్పత్రులకు చెందిన వైద్యులు గుర్తించారు. అరుదుగా కొందరు రోగుల్లో వైరస్ మెదడుపైనా ప్రభావం చూపిందని చెప్పారు. కోవిడ్-19 రోగులు కొందరిలో కుంగుబాటు లక్షణాలు కనిపిస్తున్నాయని, భయం కారణంగా వారు ఉద్వేగాలకు లోనవుతున్నారని సర్ గంగారాం ఆస్పత్రి కన్సల్టెంట్ డాక్టర్ ధీరెన్ గుప్తా తెలిపారు. గతంలో వైరస్ కేవలం ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని భావించగా, తాజాగా గుండె, మెదడు, జీర్ణాశయం, మూత్రపిండాలపైనా ఇది ప్రభావం చూపుతుందని గుర్తించామని ఆయన చెప్పారు. కొందరు కోవిడ్-19 రోగుల్లో రక్తం గడ్డకట్టడంతో గుండె పోట్లు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పలువురు రోగుల్లో తీవ్ర తలనొప్పి లక్షణాలను గుర్తించామని అన్నారు. ఎక్కువ మంది రోగులు ఎలాంటి సమస్యలూ లేకుండా కోలుకుంటున్నా కొద్దిమందిలో పలు లక్షణాలు రికవరీ ప్రక్రియలోనూ కొనసాగుతున్నాయని ఎయిమ్స్ హెడ్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ నవీత్ విగ్ వెల్లడించారు. ఎక్కువ రోజులు ఆస్పత్రిలో, ఐసీయూలో చికిత్స పొందిన వారిలో రికవరీ ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగుతుందని అన్నారు. చదవండి : కరోనా బాధితుడికి 1.5 కోట్ల బిల్లు మాఫీ! -
ఐఏఎస్.. ఐపీఎస్.. ఇప్పుడు ఐఎంఎస్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో వైద్యరంగం ప్రాధాన్యం అందరికీ తెలిసివచ్చింది. ఈ రంగానికి విలువ, గౌరవం కూడా పెరిగాయి. యావత్ ప్రపంచానికి సవాల్ విసిరిన ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు, కనీసం కాపాడుకు నేందుకు ఇంకా ఎలాంటి ఔషధాలు, సాధనాలు లేకపోవడం సమస్య తీవ్రతను తెలియ జేస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాలతో పాటు మన దేశంలో, దాని పరిధిలోని రాష్ట్రాల్లో మరింత మెరుగైన, సమర్థవంతమైన ప్రజారోగ్య వ్యవస్థ ఆవశ్యకత ఏర్పడింది. ఇలాంటి ప్రతికూల, అతిపెద్ద సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ కరోనా కాటును కాచుకుంటూనే డాక్టర్లు, వైద్యసిబ్బంది బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సంక్షోభాన్ని భారత్ బాగానే ఎదుర్కోగలిగినా భవిష్యత్ సవాళ్లను మరింత దృఢంగా ఎదుర్కొనేందుకు, మంచి ఫలితాల సాధనకు అడుగులు పడాలనే అభిప్రాయం వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. దేశ సరిహద్దుల రక్షణ ప్రణాళికల విషయంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎలాంటి పాత్ర పోషిస్తుందో అలాగే ప్రజారోగ్య రంగాన్ని కూడా పూర్తిగా సంస్కరించి ఒక వ్యవస్థను నిర్మించాలని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. (24 గంటల్లో 14,821 కొత్త కేసులు) గతంలో రద్దయిన ‘కేడర్’ ఐఏఎస్/ఐఆర్ఎస్/ఐపీఎస్ అంటి అఖిల భారత సర్వీసుల మాదిరిగానే ఆల్ ఇండియా మెడికల్ సర్వీసెస్ కేడర్‌ను పునఃప్రవేశపెట్టాలనే అంశం కరోనా నేపథ్యంలో చర్చనీయాంశమైంది. దేశానికి స్వాతంత్య్రం రావడానికి కొన్నేళ్ల ముందే ఇండియన్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్) సెంట్రల్ కేడర్ ఉండేది. దేశంలోని కీలకమైన పరిపాలన బాధ్యతలు, ప్రత్యేక పోస్టులను ఐఎంఎస్లే నిర్వహించే వారు. కొన్ని అంశాల్లో కేంద్ర–రాష్ట్రాల మధ్య వీరే సమన్వయం చేసేవారు. అయితే 1947 ఆగస్టులో దీనిని రద్దుచేశారు. మొదలియార్ కమిటీగా ప్రసిద్ధిచెందిన ‘ద హెల్త్ సర్వే అండ్ ప్లానింగ్ కమిటీ’ 1961లో సమర్పించిన నివేదికలో.. కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖల్లో సీనియర్ పోస్టులతో ‘సెంట్రల్ హెల్త్ కేడర్’ను ఏర్పాటు చేయాలని సూచించింది. 2005 నాటి ‘నేషనల్ కమిషన్ ఆన్ మైక్రో ఎకనామిక్స్ అండ్ హెల్త్’ నివేదికలోనూ ఐఏఎస్/ఐపీఎస్‌ల మాదిరిగా ఆల్ ఇండియా కేడర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ కేడర్ ఏర్పాటుపై గట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మూడేళ్ల క్రితం ఎన్డీఏ ప్రభుత్వం కూడా కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో వైద్యరంగ నిర్వహణ, సాంకేతిక అంశాల్లో నైపుణ్యాల మెరుగు వంటి అంశాల్లో ప్రస్తుతం నెలకొన్న అంతరాలను దూరం చేసేందుకు ‘ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్’ కల్పన ఆవశ్యకత ఏర్పడిందని, దీనిపై తమ అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శిసీకే మిశ్రా లేఖ రాశారు. దీనిపై 2018 డిసెంబర్ కల్లా కేవలం ఆరు రాష్ట్రాలే అభిప్రాయాలను తెలిపాయి. ప్రధానంగా వైద్య, ఆరోగ్యరంగమనేది రాష్ట్రాల జాబితాలో ఉండడం వల్ల ఈ విషయంలో కేంద్రం పెత్తనం లేదా ఆజమాయిషీకి అవకాశం లేకపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐఎంఎస్ ఏర్పాటు ఆవశ్యకతపై వైద్య ప్రముఖులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. (టాప్‌లో బ్రెజిల్.. మూడో స్థానంలో భారత్) వైద్య విద్య మారాలి ప్రపంచంలో మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. కానీ, వైద్యవిద్యలో మేం చదువుకున్నపుడు ఉన్న సిలబస్, కరిక్యులమే ఇప్పటికీ ఉన్నాయి. వైద్యరంగం లేదా ఆసుపత్రుల అడ్మినిస్ట్రేషన్, నిర్వహణ, బృందానికి నాయకత్వం వహించడం వంటి వాటిలో వైద్యవర్గాలకు తగిన శిక్షణ, అవగాహన అవసరం. వైద్యసేవల రంగంలో ఇప్పుడు ‘టీం వర్క్’కు ప్రాధాన్యత ఏర్పడింది. ఏ విషయంలోనైనా మెరుగైన ఫలితాలకు ప్రజా భాగస్వామ్యంతో పాటు సమష్టి భాగస్వామ్యం అవసరం. –డాక్టర్ సోమరాజు, వైద్య ప్రముఖుడు ఉమ్మడి జాబితాలోకి మార్చాలి దేశంలోని వైద్య, ఆరోగ్యరంగంలో రాష్ట్రాల మధ్య అంతరాలున్నాయి. భారతీయ వైద్యం ఇండియనైజ్ కావాలి. నీట్ పరీక్షను జాతీయస్థాయిలో నిర్వహించడం ద్వారా తొలి అడుగుపడింది. ఐఎంఎస్ కేడర్ ఏర్పాటైతే అది మలి అడుగవుతుంది. వైద్య, ఆరోగ్య రంగాన్ని కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోకి తెస్తేనే ఐఎంఎస్ పునః ప్రారంభానికి, వైద్యరంగంలో కీలక మార్పునకు బీజం పడుతుంది. – డాక్టర్ కిరణ్ మాదల, గవర్నమెంట్ మెడికల్ కళాశాల, నిజామాబాద్ ‘వైద్యా’నికి గౌరవం ఈ ప్రతిపాదన ఆసక్తి కలిగిస్తోంది. ఐఏఎస్/ఐపీఎస్ మాదిరి ఐఎంఎస్ ఏర్పాటు చేస్తే వైద్య రంగంలో మంచి ఫలితాలొస్తాయి. కేంద్ర కేడర్ కావడం వల్ల ఈ రంగానికి గౌరవం, హోదా, హుందాతనం పెరగడంతో పాటు ఒక వ్యవస్థ నిర్మితమవుతుంది. అయితే వైద్యమనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి రాష్ట్రాలు ఏ మేరకు దీనిపై సానుకూలంగా స్పందిస్తాయో చూడాలి. – డాక్టర్ ఏవీ గురవారెడ్డి, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు కేడర్ ఉంటే మంచిదే.. ఆల్ ఇండియా మెడికల్ సర్వీసెస్‌తో వైద్యరంగానికి ఎంతో ప్రయోజనం. ఈ రంగంలోని సమస్యలపై అవగాహన ఉండడం వల్ల ఎక్కడెక్కడ ఏయే చర్యలు తీసుకుంటే మంచిదనే దానిపై ఈ కేడర్ అధికారులు నిర్ణయించగలుగుతారు. వైద్యవిద్య నిర్వహణ, పర్యవేక్షణ విషయం లోనూ ఆయా స్థాయిలు, పరిధుల్లో వైద్యరంగం నుంచి వచ్చిన వారికే సారథ్య బాధ్యతలు అప్పగించాలి. – డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, ప్రముఖ కార్డియో థోరసిక్ వైద్యుడు -
సమయమిదే.. సరైన ఆలోచన చేయండి!
సాక్షి, హైదరాబాద్: ‘ప్రకృతి, పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణకు కీలక సమయం ఆసన్న మైంది. కోవిడ్–19 మహమ్మారి కోరలు చాచిన నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. జీవ వైవిధ్యంలో ముఖ్యభాగమైన వన్య ప్రాణులు, జంతువుల పరిరక్షణకు నడుం బిగించాలి. వివిధ రకాల వన్యప్రాణులు, జంతువులు, పక్షుల నుంచే 80 వరకూ వ్యాధులకు చెందిన వైరస్లు వ్యాప్తి చెందుతున్నందున, వీటి పట్ల విచక్షణతోపాటు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుత విపత్కర పరిస్థితులను అంచనా వేసు కుని భవిష్యత్తులో మరింత భయం కరమైన పరిస్థితులు వ్యాధుల రూపంలో దండెత్తకుండా కట్టుదిట్టమైన కార్యాచరణ రూపొందించుకుని అమలు చేసేందుకు ఇదే సరైన సమయం’అని వివిధరంగాలకు చెందిన పర్యావరణవేత్తలు, నిపుణులు అభిప్రాయ పడ్డారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ‘సెలబ్రేట్ బయో డైవర్సిటీ’ పేరిట ప్రపంచ పర్యావరణ దినో త్సవాన్ని జరుపుకున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరిం చుకున్న అంశాలపై వారు ‘సాక్షి’కి వెల్లడించిన అభిప్రాయాలు వారి మాటల్లోనే. వచ్చేవి పెనుసవాళ్లతో కూడుకున్న రోజులే.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేనిపక్షంలో భారత్ నుంచి మరో మహమ్మారి ప్రబలే అవకాశాలు పొంచి ఉన్నాయి. వన్యప్రాణులు, జంతువుల ఆవాసాలు కుంచించుకు పోవడం, జీవవైవిధ్యానికి నష్టం చేసే చర్యలు పెరిగిపోతున్నాయి. లాక్డౌన్ కారణంగా పర్యావరణం, అడవులు మెరుగైనట్టు పైకి కనిపిస్తున్నా, స్వల్పకాలంలోనే మళ్లీ కాలుష్యం పుంజుకుని పాతస్థితికి చేరుకుంటుంది. ఎనభై వరకు వ్యాధులు ప్రకృతి విధ్వంసంతో పాటు జంతువుల నుంచి సోకే వైరస్‌తోనే వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తోంది. ఎబోలా, సార్స్, స్వైన్‌ఫ్లూతో పాటు వివిధ జబ్బులు కోతులు, పక్షులు,పందులు, ఇతర జంతువుల నుంచి వ్యాప్తి చెందినట్టు వెల్లడైంది. కొన్ని జంతువుల, పక్షుల భక్షణ వల్ల కొత్తవ్యాధులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్‌లో వచ్చే కొత్త వ్యాధులతో ప్రజలకు ఎలాంటి తీవ్రమైన ఉపద్రవం ముంచుకొస్తుందా అనేది ఊహకు కూడా అందడం లేదు. అందువల్ల రాబోయే రోజులు పెనుసవాళ్లతో కూడుకున్నవే. – ఇమ్రాన్ సిద్దిఖీ, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఆత్మవిమర్శకు ఇదే సమయం లాక్డౌన్ కాలంలో వన్యప్రాణులు, జంతువులు జనావాసాలకు వచ్చాయంటే అడవులు, ఆ చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అర్థం చేసుకోవచ్చు, మనుషులు,జంతువుల మధ్య సంఘర్షణను అధిగమించేందుకు కచ్చితమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. కోతులు, ఎలుగుగొడ్లు వంటివి గ్రామాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి నిజమే. కానీ అవి జనావాసాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇందుకు గల కారణం ఎవరన్నది మనం ఇప్పుడు ఆలోచించాలి. ప్రకృతి, పర్యావరణం, జీవవైవిధ్యానికి జరిగే నష్టంలో మనం పోషించే పాత్రపై తక్షణమే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఫరీదా తంపాల్, స్టేట్ డైరెక్టర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్– ఇండియా ప్రస్తుత పరిణామాలు మనకొక గుణపాఠం ‘కోవిడ్–19’ పరిస్థితుల్లో మనం గుణపాఠం నేర్చుకున్నాం. వన్యప్రాణులపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిసొచ్చింది. వాటికి చెందిన ఆవాసాల్లోకి, ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లకుండా, వాటి జీవనశైలిని అస్థిర పరచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు మానవ హక్కులు ఎంత ముఖ్యమో జంతువుల హక్కులను సైతం రక్షించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో అవగాహన అవసరం. ప్రకృతి, పర్యావరణంలో ప్రతీ జీవి లేదా వాటి జాతుల ప్రాణాలు అనేవి ఎంతో ముఖ్యం. ప్రతీ జీవి తన ›ప్రత్యేక పాత్ర పోషించాల్సి ఉంటుంది. జీవరాశుల్లో భాగమైన జంతువులు, వన్యప్రాణులు, పక్షులు ఇలా అన్ని రకాల జీవులు, ప్రాణులను స్వేచ్ఛగా బతకనివ్వాలి. వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ ఎ.శంకరన్ -
'మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా'
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతి బాగోతంపై దర్యాప్తును ఈడీకి అప్పగించాలని చేయాలని ఐటీ ఎక్స్పర్ట్ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా ఐటీ శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్లో స్పష్టంగా పేర్కొంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఐటీ శాఖ పంచనామాలోని ఒక పేజిలోని రెండు లైన్లను తీసుకొని, తామేమి తప్పు చేయలేదన్నట్లుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వేణుగోపాల్ అన్నారు. ఐటీ దాడులపై ఆయన మాట్లాడుతూ.. 'ప్రజలను తప్పుదారి పట్టించేందుకే టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ నివాసంలో నగదు, బంగారం సీజ్ చేసిన సమయంలో ప్రోటోకాల్ ప్రకారం ప్రకారం ఐటీ అధికారులు పంచనామా ఇచ్చి, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఐపీ అడ్రస్‌లన్నీ ఒకే చోట ఉన్నాయి. కంపెనీ అడ్రస్‌లన్నీ ఫేక్ అని తేలాయి. బోగస్ ఇన్వాయిస్లను సృష్టించి డబ్బును తరలించారు. మనీలాండరింగ్ జరిగిందని ఐటీ అధికారులు స్పష్టం చేశారు. ఓవర్ ఇన్వాయిస్, బోగస్ ఇన్వాయిస్లను ఐటీ శాఖ గుర్తించింది. చట్టం ముందు ఎవరూ అతీతులు కాదు. మీరు జరిపినవి బినామీ ట్రాన్సాక్షన్లు అయితే శిక్ష అనుభవించాల్సిందే. వ్యవహారంపై ఐటీ దాడులతో పాటు ఈడీతో విచారణ చేయించాలి. స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత ఐటీ శాఖ అందరికీ నోటీసులు ఇస్తుంది. వారు నోటీసులకు సమాధానం ఇవ్వకుంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తుంది. ఈ విచారణ మొత్తం రాష్ట్ర పరిధిలోనిది అయితే రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయవచ్చని' ఆయన పేర్కొన్నారు. చదవండి: ఐటీ దాడులపై ఆయన నోరు మెదపరేం..? కార్పోరేట్ న్యాయనిపుణులు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. 'ఈ వ్యవహారంపై ఐటీ దాడులతో పాటు సీబీఐ, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐఓలతో విచారణ చేయించాలి. అక్రమాలకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు.. బ్యాంక్ అకౌంట్లని సీజ్ చేసి ఇన్వెస్టిగేషన్‌ని వేగవంతం చేయాలి. ఎల్లో మీడియా అన్ని ఆధారాలు చూపించకుండా కేవలం ఒక పేజీని మాత్రమే చూపిస్తూ విషయాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తోంది. త్వరలోనే దొంగలందరూ బయటపడతారు. ఈ స్కామ్ రూ.2వేల కోట్ల నుంచి రూ. 2లక్షల కోట్ల వరకూ వెళ్లే అవకాశం ఉంది. శ్రీనివాస్ నివాసంలో ఐటీ దాడులపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా చంద్రబాబు ఈ దాడులపై స్పందించాలని' డిమాండ్ చేశారు. చదవండి: ఐటీ ఉచ్చులో అవినీతి చక్రవర్తి చంద్రబాబు పీఏ శ్రీనివాస్ నివాసంలో ఐటీ దాడులపై హైకోర్టు న్యాయవాది జనార్ధన్ మాట్లాడుతూ.. 'ఇండియా చరిత్రలోనే ఇది ఒక పెద్ద స్కామ్. ఐటీ శాఖ ఆరు రోజులు సోదాలు జరిపితే రెండు పేజీల రిపోర్టు మాత్రమే రాస్తారా..!. ఈ స్కామ్‌లో చంద్రబాబు అండ్ కో తప్పించుకునే సమస్య లేదు. అమరావతి నిర్మాణం పేరుతో వేలకొట్లు దోచుకున్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తుంటారు. వాస్తవాలన్నీ త్వరలోనే బయటపడతాయి. దోషులు మౌనంగా ఉంటున్నారంటే నేరాన్ని అంగీకరించినట్లేని' ఆయన తెలిపారు. మరో న్యాయవాది వెంకటేశ్ శర్మ మాట్లాడుతూ.. 'ఐటీ దాడులపై మాట్లాడేందుకు టీడీపీ నేతలు జంకుతున్నారు. ఒక వ్యక్తిని బలిపశువును చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. దొరికిన ఒక్క కాగితంతోనే శ్రీనివాస్ మంచివాడని చూపించే ప్రయత్నాల్లో ఎల్లో మీడియా ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో నాపై ఐటీ దాడలు జరగకూడదు అంటే తనని గెలిపించాలని ప్రచారం చేశారంటేనే చంద్రబాబు బాగోతం అర్థమవుతుందన్నారు. అవినీతి చేశారు కాబట్టే చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారని' ఆయన పేర్కొన్నారు. -
అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
-
ఎంత సమయం కేటాయిస్తున్నారు?
తీరికలేని పనులు ఎన్ని ఉన్నా పిల్లలతో తల్లిదండ్రులు రోజులో కొంత క్వాలిటీ టైమ్ గడపాలని నిపుణులు చెబుతుంటారు. పిల్లలు చాలాసార్లు చిరాకు పెట్టిస్తుంటారని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో వారిని తిట్టి చెప్పడానికి బదులు తల్లిదండ్రులుగా మొదట పిల్లల ప్రవర్తనకు గల కారణాన్ని గుర్తించాలి. పిల్లలు కోరుకునేది తమ పట్ల పెద్దలు కొంత శ్రద్ధ చూపడాన్నే. అది కరువైనప్పుడు పిల్లలు నిరాశకు లోనై తమ ప్రతికూల వైఖరి ద్వారా కోపాన్ని వ్యక్తం చేస్తారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపాలని పెద్దలు, నిపుణులు పదే పదే చెబుతుంటారు. మీకు ఎన్ని పనులున్నప్పటికీ పిల్లలతో రోజులో కనీసం 30 నిమిషాలు కేటాయించడం వల్ల వారి నుంచి మంచి ఫలితాలను రాబట్టవచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి తల్లిదండ్రులు ఎంచుకోదగిన విషయాలు ఇవి... 1. రోజులో పిల్లలతో గడపడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించండి. రాత్రి భోజనానికి ముందు లేదా నిద్రపోయే సమయంలో మీ షెడ్యూల్‌ను వారికోసం కేటాయించవచ్చు. ఈ సమయంలో పిల్లలతో కలిసి పుస్తక పఠనం.. వంటి ఆసక్తి కలిగించే పనుల్లో మీరూ పాల్గొనండి. 2. ఏదైనా సరే మీరు పిల్లలతో గడిపే సమయం ప్రత్యేకంగా ఉండాలి. పిల్లలతో కలిసి ఒకే గదిలో కబుర్లు చెబుతూ ఉండటం కావచ్చు లేదా బయట ఏదైన ఫంక్షన్‌కు వారితో కలిసి హాజరు కావచ్చు. మీరు మీ బిడ్డతో గడిపే ఆ 30 నిమిషాల్లో వారి దృష్టి కేంద్రంగా మీరు ఉండాలి. 3. మీ బిడ్డకు కూడా సమయం కేటాయించడం విషయంలో ఒక స్పష్టత ఇవ్వండి. మీ పిల్లల కోసం ఈ సమయాన్ని వినియోగిస్తున్నామని తెలియజేయండి. 4. ఎంచుకున్న క్వాలిటీ సమయంలో పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పమనండి. దానికి మీరు ఓకే అనేస్తే పిల్లలు తమ మాటకు పెద్దలు విలువ ఇస్తున్నారని గమనిస్తారు. అంతేకాదు తాము చెప్పాలనుకున్న సృజనాత్మక విషయాల్లో ఆసక్తిని చూపుతారు. 5. పిల్లలకోసం కేటాయించిన సమయంలో ఇతర సమస్యలపై దృష్టి పెట్టకండి. మీరు పిల్లలతో కూర్చున్నప్పుడు మీ స్వంత పనులు లేదా వృత్తిపరమైన కట్టుబాట్లు ఇతర విధుల గురించి మాట్లాడకుండా ఉండటం మంచిది. -
మనీ ప్లాంట్
అది ఒక పంపుసెట్ల తయారీ ప్లాంట్. ఇళ్లల్లో వినియోగించే సుమారు 14 రకాల పంపుసెట్లను ఆ మహిళలు అలవోకగా తయారు చేస్తున్నారు. టన్నుల కొద్దీ బరువైనయంత్రాలు. అత్యధిక విద్యుత్ వినియోగం. అడుగడుగునా పొంచి ఉండే ప్రమాదం.మూడు విభాగాలు. 200 మంది మహిళలు. ఏ విభాగంలో ఎక్కడ ఏ కొంచెం ఆదమరిచినా ముప్పే. అలాంటి ప్లాంట్‌లో ఆ మహిళల సునిశితమైన చూపులు, సన్నటి వేలి కొసలు కోట్లాది రూపాయల విలువైన సంపదను సృష్టిస్తున్నాయి. గొప్ప విద్యావంతులు కాదు. ఎలాంటి డిగ్రీలు చదవలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సముపార్జించలేదు. ఇంజనీరింగ్ నిపుణులు కాదు. కానీ ప్రపంచమే అబ్బురపడే విధంగా ఆ మహిళలు అద్భుతాలను సాధిస్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. తాము చదివిన కొద్దిపాటి చదువులకు మరికొంత నైపుణ్యాన్ని జోడించి ఏటా వందల కోట్ల రూపాయల సంపదను సృష్టిస్తున్నారు. ఆ మహిళల ప్రతిభాపాటవాలు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ అభినందనలు పొందాయి. క్వాలిటీ సెంట్రల్ ఫోరమ్ అవార్డులను అందుకున్నాయి. తమిళనాడులోని కోయంబతూర్ కిర్లోస్కర్ బ్రదర్స్ మహిళా ప్లాంట్‌లో పని చేసే రెండు వందల మంది మహిళల విజయగాధ ఇది. నిమిషానికి మూడు పంపుసెట్ల చొప్పున తయారు చేస్తూ తమ శ్రమశక్తిని, సృజనాత్మకతను, మెకానిక్ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుకుంటున్నారు. కాలంతో పరుగులు కోయంబత్తూరు నుంచి సేలం వెళ్లే రహదారిలో ఉంటుంది కనియూ గ్రామం. దానితో పాటు చుట్టుపక్కల ఉన్న సూలూర్, అరసూర్, కర్మత్తంబట్టి, సోమనూరు, వాగరాయక పాలియం తదితర పల్లెల్లో ప్రజలు ఎక్కువ శాతం శ్రమశక్తిని నమ్ముకొని బతుకుతున్నారు. అంతా పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన వాళ్లే. అలాంటి పేదకుటుంబాల్లో పుట్టి పెరిగిన ఎంతోమంది అమ్మాయిలు పై చదువులు చదివే ఆర్ధిక స్తోమత లేకపోవడంతో మధ్యలోనే చదువు ఆపేసి పనులకు వెళ్తున్నారు. వాళ్ల సంపాదనే కుటుంబాలకు ప్రధాన ఆధారం. అలాంటి అమ్మాయిలకు 2010లో కన్యూ గ్రామంలో ఏర్పాటు చేసిన కిర్లోస్కర్ బ్రదర్స్ మహిళా ప్లాంట్ మంచి ఉపాధి మార్గంగా నిలిచింది. విద్యార్హతలతో నిమిత్తం లేని ఉద్యోగావకాశాలను కల్పించింది. అంతేకాదు. తమ శ్రమ శక్తికి తోడు సాంకేతిక నైపుణ్యాన్ని, సృజనాత్మకతను జోడించే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ ప్లాంట్‌లో ఎంతోమంది మహిళలు శిక్షణ పొందారు. కుటుంబాలకు ఆధారంగా నిలిచారు.‘‘ఎన్నో కష్టాలు, బాధల నడుమ ఈ ప్లాంట్‌లో చేరాను. మొదట్లో పంపుసెట్లు తయారు చేయగలనా అనిపించింది. అదంతా మెకానిక్‌లు చేసే పని కదా అనుకున్నాను. శిక్షణ తీసుకున్న తరువాత క్రమంగా నైపుణ్యం పెంచుకున్నాను. ఇప్పుడు మా టీమ్ అంతా కలిసి నిమిషానికి 3 పంపుసెట్లను ఎంతో తేలిగ్గా తయారుచేసి ఇవ్వగలుగుతున్నాం’’ అని చెప్పారు రాజీ. ఆమె కోయంబత్తూరుకు సమీపంలోని కేరళ రాష్ట్రం పాలక్కాడ్ నుంచి వస్తున్నారు. భర్త తాగుబోతు. పేదరికం కారణంగా కొడుకు చదువు ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. అప్పటివరకు ఇంటిదగ్గరే ఉన్న రాజీ తన శక్తిసామర్ధ్యాలను పరీక్షించుకోవాలనుకుంది. ఒక్క రాజీయే కాదు. ప్లాంట్‌లో పని చేస్తున్న వలార్మతి, సుధారాణి, తమిల్‌సెల్వి వంటి ఎంతోమంది మహిళలు ‘తామేం చేయగలం అనే స్థితి నుంచి తాము మాత్రమే చేయగలం’ అని నిరూపించుకున్నారు. మహిళా సాధికారతకు పట్టం పూనే కేంద్రంగా గత వందేళ్లుగా పంపుసెట్లను తయారు చేసి అందజేస్తున్న కిర్లోస్కర్ బ్రదర్స్ కంపెనీ మహిళా సాధికారతకు చేయూతనిచ్చింది. ‘‘1976 నుంచి ఈ సంస్థలో మహిళల శక్తిని గుర్తించి ప్రోత్సహించారు. ఆ రోజుల్లోనే ‘స్త్రీ’ అనే ఒక మ్యాగజీన్ నడిపించారు. సంస్థలో పని చేసే మహిళలకు సముచితమైన సహాయ సహకారాలను అందజేశారు. ఒక సాధారణ ఉద్యోగిగా పనిలో చేరిన వారు ఉన్నతమైన పదవులను పొందారు. ఈ క్రమంలోనే కోయంబత్తూరు మహిళా ప్లాంట్‌కు బీజం పడింది’’ అని చెప్పారు జనరల్ మేనేజర్ లక్ష్మి. ఒక సాధారణ వర్కర్‌గా చేరిన ఆమె తన ప్రతిభాపాటవాలతో ఇప్పుడు మొత్తం ప్లాంట్ బాధ్యతలను భుజాన వేసుకొని నడిపిస్తున్నారు. ‘‘వర్కర్లు, మేనేజర్లు అనే తేడాలేం లేవు. అందరం ఒక కుటుంబంలా కలిసి పని చేస్తున్నాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కలిసి పంచుకుంటున్నాం. ఈ యూనిట్లో పని చేస్తున్నవాళ్లంతా పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన మహిళలే. చాలామంది ఏదో రకమైన గృహహింసను ఎదుర్కొన్నవాళ్లే. చదువుకోలేక బడి మానేసిన వాళ్లు ఉన్నారు. ఈ ప్లాంట్‌ను పంపుసెట్లు తయారు చేసే యూనిట్‌గా మాత్రమే చూడొద్దు. íఫీనిక్స్ పక్షిలా ఎదుగుతున్న మహిళల శక్తిని ఈ ప్లాంట్‌లో చూడండి’’ అని అన్నారామె. పగిడిపాల ఆంజనేయులు, సాక్షి, హైదరాబాద్ ‘లక్ష’ లక్ష్యంగా..! కోయంబత్తూరు కిర్లోస్కర్ మహిళా ప్లాంట్‌లో మూడు విభాగాలు ఉన్నాయి. వివిధ రకాల పంపుసెట్లకు అవసరమైన ముడిసరుకు ఉంటుంది. ఇది కీలకమైన విభాగం. మొదట పంపుసెట్లను తయారు చేసేందుకు అవసరమైన ముడిసరుకును ఎంపిక చేస్తారు. ఆ తరువాత వివిధ విడిభాగాలను ఒకచోట చేర్చి పంపుసెట్లను తయారు చేసే విభాగం. భారీ యంత్రాల నడుమ అలవోకగా పనిచేసుకుంటూ వెళ్తారు. తయారైన పంపుసెట్లను ప్యాకింగ్ చేసి దేశవ్యాప్తంగా మార్కెట్‌కు ఎగుమతి చేసేది మూడో విభాగం. ‘‘ మా ప్లాంట్‌లో ప్రతి 17 సెకన్లకు ఒక పంప్‌సెట్ తయారు చేస్తున్నాం. ప్రతి నెలా 60 వేల నుంచి 70 వేల పంపుసెట్లు తయారవుతున్నాయి. ఈ ఏడాది దీనిని లక్షకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎలాంటి పని ఒత్తిడి లేదు. ప్రతి మహిళ తన ఎనిమిది గంటల పనిలోనే ఎన్ని పంపుసెట్లు తయారు చేయగలిగితే అన్ని చేస్తుంది...’’ అంటారు లక్ష్మి. ప్రస్తుతం రూ.132 కోట్ల టర్నోవర్‌తో నడుస్తున్న కిర్లోస్కర్ బ్రదర్స్ కంపెనీలో ఆరు శాతం ఆదాయం కోయంబత్తూరు మహిళా ప్లాంట్ నుంచే వస్తుంది. ‘‘మూడేళ్ల క్రితం ఈ ప్లాంట్‌లో చేరాను. ఇక్కడికి వచ్చిన తరువాత ఎంతో పెద్ద కుటుంబంలో కలిసి పోయాను. పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడ్డాను. ఒంటరిననే భావన పోయింది. ఏదైనా సాధించగలననే ధైర్యం వచ్చింది..’’ అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది వలార్ మతి. -
తాటి చెట్టుకు పది వేలు!
చెరకు పంచదార, బెల్లంకు బదులుగా తాటి బెల్లాన్ని వినియోగించడం అత్యంత ఆరోగ్యదాయకమని నిపుణులు చెబుతుండటంతో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తాటి బెల్లం వాడకంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. శ్రీలంక వంటి దేశాలు తాటి బెల్లం, తాటి చక్కెరను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడంతోపాటు విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాయి. తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం తాటి ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ ద్వారా ప్రతి జిల్లాలో తాటి బెల్లం ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆహార శుద్ధి నిపుణులు, తూర్పు గోదావరి జిల్లా పందిరిమామిడిలోని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన పందిరిమామిడి తాటి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త పి సి వెంగయ్యతో ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు ఇటీవల ముచ్చటించారు. ఎదిగిన ప్రతి తాటి చెట్టు నుంచి తాటి బెల్లం ఉత్పత్తి ద్వారా సంవత్సరానికి రూ. పది వేల ఆదాయాన్ని పొందేందుకు వీలుందని, గ్రామస్థాయిలో ఉపాధి అవకాశాలను పెంపొందించవచ్చని, కేవలం రూ. 20 వేల మూల పెట్టుబడితో గ్రామస్థాయిలో తాటి బెల్లం ఉత్పత్తిని ప్రారంభించవచ్చని ఆయన చెబుతున్నారు. తాటి బెల్లం ప్రయోజనాలు? తాటి బెల్లం చెరకు పంచదార, బెల్లం కన్నా ఆరోగ్యదాయకమైనది. ఇందులో ఫ్రక్టోజు (76.86 శాతం) ఎక్కువగా, గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్(జి.ఐ.) 40 లోపే. నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. చెరకు పంచదార జి.ఐ. 100. తిన్న వెంటనే గ్లూకోజ్ రక్తంలోకి చేరుతుంది. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి మాక్రో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజుకు ప్రతి ఒక్కరూ 10 గ్రా. తీసుకుంటే మంచిది. చక్కెర బెల్లం, పంచదారకు బదులు ఇంట్లో తాటి బెల్లం వాడుకుంటే చాలు. తెలుగు రాష్ట్రాల్లో తాటి బెల్లం ఉత్పత్తికి ఉన్న అవకాశాలేమిటి? రైతులకు /గీత కార్మికులకు ఆదాయం వచ్చే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనీసం 6 కోట్ల తాటి చెట్లు ఉంటాయని అంచనా. వీటిలో కొన్నిటి నుంచి కల్లు తీస్తున్నారు. మొత్తంగా చూస్తే ఒక్క శాతం చెట్లను కూడా మనం ఉపయోగించుకోవడం లేదు. 99% చెట్లు వృథాగా ఉండిపోతున్నాయి. చెట్టుకు రోజుకు కనిష్టం 4 (గరిష్టం 8)లీటర్ల చొప్పున వంద రోజుల పాటు నీరాను సేకరించవచ్చు. ఏటా సగటున చెట్టుకు 40 కిలోల తాటి బెల్లం తయారు చేయవచ్చు. ప్రతి చెట్టు నుంచి నెలకు కనీసం రూ. వెయ్యి ఆదాయం పొందవచ్చు. ఏటా కనీసం రూ. 10 నుంచి 12 వేల వరకు ఆదాయం పొందే మార్గాలున్నాయి. 1969 నీరా రూల్స్ ప్రకారం ఎక్సైజ్ శాఖ అనుమతి పొంది గ్రామ స్థాయిలోనే చాలా సులువుగా తాటి బెల్లం తయారు చేయటం ప్రారంభించవచ్చు. వాల్యూ చెయిన్‌ను ప్లాన్ చేస్తే ఏడాది పొడవునా తాటి బెల్లం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది, రైతులకు, గీత కార్మికులకూ స్థిరమైన ఆదాయం వస్తుంది. పీచు, తేగల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. తేగల పొడిని మైదాకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యదాయక బేకరీ ఉత్పత్తుల్లో వినియోగించవచ్చు. చిన్న యూనిట్‌కు ఎంత ఖర్చవుతుంది? తాటి చెట్ల నుంచి పరిశుద్ధమైన పద్ధతిలో సున్నం వాడకుండానే నీరాను సేకరించే కూలింగ్ బాక్స్‌ను మేం రూపొందించాం. సాధారణంగా కుండల్లో కొంచెం సున్నం వేసి చెట్టుకు కడతారు. నీరా త్వరగా పులిసిపోకుండా ఉండటానికి ఇలా చేస్తారు. అయితే, సున్నం వేయకుండానే ఈ కూలింగ్ బాక్సుల ద్వారా నీరాను సేకరించే పద్ధతిని మేం కనుగొన్నాం. సేకరించిన నీరాను బాండీల్లో పోసి ఉడకబెడితే రెండు గంటల్లో తాటి బెల్లం తయారవుతుంది. ఇందుకు ఇనుప బాండీల కన్నా స్టెయిన్లెస్ స్టీల్(ఎస్.ఎస్.) బాండీలను వాడితే మంచిది. వంద లీటర్ల ఎస్.ఎస్. బాండీ, కూలింగ్ బాక్సులు ఇతర పరికరాలు కలిపి మొత్తం రూ. 20,000 ఖర్చవుతాయి. బ్యాచ్‌కు పది కిలోల తాటి బెల్లం తయారవుతుంది. ఈ మాత్రం పెట్టుబడితో ప్రతి గ్రామంలోనూ కట్టెలు లేదా గ్యాస్ పొయ్యిలపై తాటి బెల్లం వండుకోవచ్చు. కొంత అధిక పెట్టుబడితో పరిశ్రమ నెలకొల్పితే స్టీమ్ ద్వారా నడిచే 300 లీటర్ల ఎస్. ఎస్. బాండీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. నీరా సీజన్ ఎన్నాళ్లు? నవంబర్ నుంచే మగ చెట్ల(పోత్తాళ్ల) నుంచి నీరా తీయొచ్చు. ఆడ చెట్ల (పలుపు తాళ్ల) నుంచి ఫిబ్రవరి నుంచి, పండు తాళ్ల నుంచి జూన్–ఆగస్టు నెలల వరకు నీరా తీస్తూనే ఉండొచ్చు. మెలకువలు పాటిస్తే ఏడాది పొడవునా నీరాను పొందే పద్ధతులను మేం రూపొందించాం. అంటే.. ప్రతి గ్రామంలో స్వల్ప పెట్టుబడితోనే ఆరోగ్యదాయకమైన తాటి బెల్లం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు చోట్ల తప్ప తాటి బెల్లం మరెక్కడా తయారు చేయటం లేదు. ఎన్నాళ్లు నిల్వ ఉంటుంది? నీరుగారిపోతుందని అంటున్నారు? తాటి చెట్లకు మట్టి కుండలు కట్టి నీరా సేకరించే పద్ధతిలో నీరా పులిసిపోకుండా ఉండేందుకు లీటరుకు 3–4 గ్రాముల సున్నం వేస్తుంటారు. సున్నం ఎక్కువైతే నీరా ఉదజని సూచిక(పి.హెచ్) పెరుగుతుంది. పి.హెచ్. 7–8 ఉంటే మంచిది. అంతకన్నా పెరిగితే నీరాలో నిమ్మరసం పిండి, ఉడకబెడుతుంటే సున్నం తెట్టులాగా పైకి తేలుతుంది. దాన్ని తీసేస్తే సరిపోతుంది. నీరా పి.హెచ్. హెచ్చుతగ్గులను సరిగ్గా చూసుకోకపోతే నిల్వ సామర్థ్యం దెబ్బతింటుంది. అయితే, జాగ్రత్తలు పాటించి తయారు చేసిన నాణ్యమైన తాటి బెల్లాన్ని ఎండలో 2–3 గంటలు ఆరబెట్టాలి. తర్వాత గాలి ఎక్కువగా లేకుండా ప్యాకింగ్ చెయ్యాలి. ఇలా చేస్తే ఏడాది వరకు నిల్వ ఉంటుంది. వాక్యూమ్ ప్యాకింగ్ చేస్తే మూడేళ్ల వరకు నిల్వ ఉంటుంది. తాటి బెల్లానికి గాలిలో తేమను చప్పున గ్రహించే స్వభావం ఉంటుంది. బెల్లం వండటంలో మెలకువలేమిటి? నీరాలో 80% నీరే ఉంటుంది. అరిసెల పాకం వచ్చే వరకు మరగకాచి.. అచ్చుల్లో పోసుకొని, అచ్చులను ఎండబెట్టి ప్యాకింగ్ చేసుకోవాలి. వంద లీటర్ల నీరాకు పది కిలోల బెల్లం వస్తుంది. అరిసెల పాకం వచ్చిన తర్వాత కూడా 10–15 నిమిషాలు బాండీలోనే ఉంచి తిప్పుతూ ఉంటే.. తాటి బెల్లం పొడి తయారవుతుంది. బెల్లంలో తేమ 7% కన్నా తక్కువ ఉంటే సంవత్సరం నిల్వచేసుకోవచ్చు. ఈత, జీలుగ బెల్లం కూడా మంచిదే కదా.. అవును. తాటి చెట్ల నుంచి నాటిన 14 ఏళ్లు, ఈత చెట్టు 6–7 ఏళ్లు, జీలుగ చెట్లు 6వ ఏట నుంచి నీరాను ఇవ్వడం ప్రారంభిస్తాయి. రోజుకు తాటి చెట్టు నుంచి 1–8 లీటర్లు, ఈత చెట్టు నుంచి 1–3 లీటర్లు, జీలుగ చెట్ల నుంచి 50 లీటర్ల వరకు నీరా ఉత్పత్తి అవుతుంది. వీటిలో ఏ నీరాతో బెల్లం అయినా ఆరోగ్యదాయకమైనదే. చెట్లు ఎక్కే వాళ్లే కరువయ్యారు కదా.. నిజమే. తాటి బెల్లానికి గిరాకీ పెరిగింది. కిలో రూ. 300 పలుకుతోంది. కాబట్టి ఆదాయమూ బాగా వస్తుంది. అయితే, చెట్లు ఒకే చోట వరుసగా ఉంటాయి కాబట్టి ఒక చోటున్న చెట్లకు కలిపి మంచె కట్టుకోవచ్చు. ఈ చివర చెట్టు దగ్గర మంచె ఎక్కితే, ఆ చివర చెట్టు దగ్గర కిందికి దిగొచ్చు. మా తాటి పరిశోధనా స్థానంలో ఇలాగే చేస్తున్నాం. అప్పుడు చెట్టెక్కే నిపుణులు కాని వారు కూడా సులువుగా నీరా సేకరించుకోవచ్చు. చెట్టుకు ఏటా రూ. 10 వేల నుంచి 12 వేలకు పర్మినెంట్ ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంది. తమిళనాడులో మాదిరిగా మనమూ దృష్టి పెట్టాలి. (తూ.గో. జిల్లా పందిరిమామిడి తాటి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వెంగయ్యను 94931 28932 నంబరులో సంప్రదించవచ్చు). -
గన్నవవరం ఎయిర్ పోర్టు భూ నిర్వాసితుల ఆందోళన
-
రెండో సీసా
అస్తి హత్యలు చేయిస్తుంది. ఒక్కోసారి అపరాధులు ఎవరో నిరపరాధులు ఎవరో తెలియని కన్ఫ్యూజన్లో కూడా పడేస్తుంది.మహబూబాబాద్ జిల్లా. తొర్రూర్.2014, అక్టోబరు 4. రాత్రి 8 గంటలు.నిజానికి అందరూ భోజనాలు ముగించి నిద్రకు ఉపక్రమించే టైమ్ అది. కానీ ఊరు కంగాళీగా ఉంది. సగం ఊరు ఆ ఇంటి ముందు భోజనం సంగతి మరిచి గుమికూడి ఉంది. ఆ ఇంటి ముందున్న కరెంట్ పోల్కి లైట్ వెలుగుతూ ఆరుతూ చికాకు పెడుతోంది.పడీ పడని వెలుతురులో ఆ ఇంటి వసారాలో పడి ఉన్న రెండు మృతదేహాలు భయం గొలిపేలా ఉన్నాయి. రెండూ పురుషులవి. కాసేపటి క్రితం ప్రాణాలతో ఉండి ఇప్పుడు చలనం లేని దేహాలు.ఇంటామె అప్పుడే షాక్ నుంచి బయట పడ్డట్టుంది... జరిగిన దారుణానికి కడుపు తరుక్కుపోయే లా శోకాలు పెడుతోంది. ‘ఓరి నా మొగుడో... అయ్యో నా తమ్ముడో’కాని గుంపుకు జాలి కలగడం లేదు.జవాబుగా గుంపు గుసగుసలు పోతూ ఉంది.‘చేసిందంతా చేసి ఎలా ఏడుస్తోందో చూడు.’‘కొడుకుతో కలిసే ఈ పని చేసి ఉంటుంది’ ‘ఎన్నాళ్ల నుంచి చూస్తున్నాం ఈ గొడవలు..’‘అంత మాత్రానికే ఇంత పని చేస్తారా?!’సడన్‌గా గ్రామస్తులకు కోపం పెరిగింది. ‘వీళ్లకు తగిన శాస్తి చేస్తే గాని బుద్ధి రాదు...’ముందుకు కదిలారు నలుగురు వ్యక్తులు ఆమె జుట్టు పట్టుకోవడానికి. తోడు ఇంకొందరు కదిలారు. ఇది గమనించిన ఇంటామె అక్కడే చేష్టలిడిగి నిలుచుని ఉన్న ఆమె కొడుకుతో పరిగెత్తుకెళ్లి తలుపులేసుకుంది. ఆ తలుపులు విరిగిపడతాయేమో అన్నంతగా ‘దఢేల్ దఢేల్..’మని కొడుతున్నారు గుంపులోని వాళ్లు. పోలీసులు అడ్డురాకపోతే ఆ ఊరి వాళ్ల కోపానికి ఆ ఇంటి సభ్యుల ప్రాణాలు గాల్లో కలిసేవే! కాస్తలో తప్పింది. ఆ ఇద్దరి మీద ఆ ఊరివాళ్లకు ఎందుకంత కోపం వచ్చింది? ఆ కింద పడి ఉన్న ఆ ఇద్దరిని ఎందుకు చంపి ఉంటారు?ఎవరూ చెప్పడం లేదు. ఊరి జనాన్ని కంట్రోల్ చేసే పనిలో పడ్డారు పోలీసులు.అంబులెన్స్ సిబ్బంది కిందపడి ఉన్న ఇద్దరు వ్యక్తులను పరీక్షించి ‘వారు చనిపోయారు సార్’ అన్నారు ఎస్సైతో. శవాలను ఆసుపత్రికి తరలించారు. ఇంటి దగ్గర విచారణ కష్టంగా అనిపించడంతో ముందుగా ఆ ఇంట్లో వాళ్లను అక్కణ్ణుంచి తీసుకెళ్లి పంచాయితీ హాల్లో కూర్చోబెట్టారు. ఊళ్లో నలుగరు పెద్దవాళ్లను అక్కడ ఉంచి, మిగతావారిని ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోవాలని హెచ్చరించారు. పోలీసుల ప్రతాపానికి జyì సిన జనం పలచబడ్డారు. కానీ, కాసేపటికి పంచాయితీ హాల్ వద్దకూ జనం మెల్లగా పోగవుతున్నారు. పంచాయితీ హాల్‌కి వచ్చిన ఎస్సై ...‘ఏం జరిగింది?’ అడిగాడు ఆ ఇంటి పెద్దావిడను. ఆమె పేరు సుభద్రమ్మ (పేరు మార్చాం). వయసు అరవై పైనే ఉంటుంది.‘ఏముంది సార్! ఆస్తుల గొడవ! ఈళ్ల పనే ఇది’ అన్నాడు అక్కడే ఉన్న ఓ గ్రామస్తుడు.అతని వైపు కోపంగా చూసిన ఎస్సై అతన్ని బయటకు పంపించాడు.ఆమె ఏడుస్తూనే ‘సార్.. నేను చంపలేదు! ఊరి నుంచి మా తమ్ముడొచ్చాడు. మా ఆయనా మా తమ్ముడూ మాట్లాడుకుంట చాలా సేపు కూసున్నరు. ఇద్దర్నీ భోజనానికి రమ్మన్నాను. అప్పుడే వద్దని మా ఆయన మందుబాటిల్ తెచ్చి కూర్చున్నాడు. ఇద్దరూ మందు తాగారు. అరగంటసేపు బాగానే ఉన్నారయ్యా. తర్వాత ఏమైందో ఏమో! నురగలు కక్కుకంటూ నేలమీద పడిపోయారు. చూస్తుండగానే శవాలయ్యారు’ గట్టి గట్టిగా ఏడుస్తూనే ఉంది ఆమె. సుభద్రమ్మ కొడుకు ప్రతాప్ వైపు చూశాడు ఎస్సై. అతను హడలిపోయాడు.‘సార్! నేను టౌన్‌కు పోయి ఇందాకనే ఇంటికి వచ్చాను. అమ్మ ఏడుపు విని పరిగెత్తుకువచ్చాను. చూస్తే ఇద్దరూ పడిపోయున్నారు’ అన్నాడు ప్రతాప్.విషయం అంతా పోలీసులు నోట్ చేసుకుంటున్నారు. సుభద్రమ్మ భర్త పేరు వెంకటయ్య. డెభ్బై ఏళ్లుంటాయి. ప్రతాప్‌కి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా! తండ్రికి కొడుక్కి నాలుగేళ్లుగా ఆస్తి విషయమై పడటం లేదు. ఉన్న నాలుగెకరాల భూమిలో తన వాటా తనకు పంచమంటాడు కొడుకు. అది నా కష్టార్జితం. సెంటు భూమి కూడా ఇవ్వ అంటాడు తండ్రి. ఒక్కింటి వాళ్లయినా ఇంటికి మధ్యలో గోడ కట్టుకొని ఎవరి వంట వాళ్లు వండుకుంటున్నారు. సుభద్రమ్మ కూడా ఆ భూమిని కొడుకు పేర రాసిమ్మని గొడవ పెడుతోంది. కానీ, వెంకటయ్య వినిపించుకోవట్లేదు. ‘అది నేను సంపాదించిన భూమి. ఎవరూ లేనో ళ్లకైనా ఇస్తా కానీ, వీడికి (ప్రతాప్) ఇవ్వ. ఈ ఇంట్లో నుంచి కూడా వెళ్లిపొమ్మను’ అని గొడవ పెట్టుకుంటున్నాడు. ‘ఉన్నది ఒక్కడే కొడుకు కదా! వాడికి కాకపోతే ఎవరికిస్తవ్! ఇచ్చేయరాదు’ అని నచ్చజెప్పారు ఊళ్లో కొంతమంది. అయినా వెంకటయ్య వినిపించుకోలేదు. తన పేరన ఆస్తి రాసివ్వడం లేదని కన్నతండ్రినే చంపేశాడు ప్రతాప్, అతని తల్లి సుభద్రమ్మ అని ఊళ్లో వాళ్లు కోపంతో ఊగిపోతున్నారు. ఇలాంటోళ్లను చంపేయక ఇంకా ఎందుకు సార్ ఈ మాటలు అంటున్నారు బయట నుంచి. ‘మాకేం పాపం తెలియదు సార్! ఊళ్లో వాళ్లు చెప్పేది నిజమే అయ్యుంటే నా తమ్ముడిని ఎందుకు చంపుకుంటాను...’ తమ్ముడి కోసం ఏడుస్తూనే చెప్పింది సుభద్రమ్మ. ‘ప్రతాప్ ఊళ్లో కూడా లేడు. వీళ్లు గిల గిల కొట్టుకుంటున్నప్పుడే అరిచాను మా ప్రతాప్‌ని పిలుస్తూ. నా ఏడుపు విని వాడు పరిగెత్తుకొచ్చాడు. అప్పటికే ఏం చేయాలో కాలూ చేయి ఆడలేదు. చూస్తుండగానే తన్నుకులాడటం ఆగిపోయింది సార్!’ చెప్పిన విషయమే మళ్ళీ మళ్లీ చెబుతోంది సుభద్రమ్మ. పోలీసులు ఆలోచనలో పడ్డారు. సుభద్రమ్మ చెప్పిందాన్నిబట్టి చూస్తే వాళ్లు అంతకుముందు మందు తాగారు. ఆ మందు సీసాను స్వాధీనం చేసుకుని పరీక్షించారు. ప్రాబ్లమ్ ఏమీ లేదని నిపుణులు చెప్పారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చేవరకు టైమ్ పడుతుంది. ‘ఊళ్లో వాళ్లు చెప్పినట్టు వీళ్లే చంపారా? అలా అయితే, ఈమె తమ్ముణ్ణి కూడా ఎందుకు చంపుకుంటుంది?’ ఆలోచనలో పడ్డారు పోలీసులు.‘ఇంకా ఏంటి సార్ ఆలోచిస్తారు. ఈ ముసల్దే చంపేసి ఈ నాటకం ఆడుతోంది. నాలుగు తగిలిస్తే నిజం కక్కుతుంది’ అన్నాడు ఊరి పెద్ద. ‘అవునవును’ అన్నారు మిగతా వాళ్లు. భర్త, తమ్ముడు పోయిన దుఃఖం నుంచి సుభద్రమ్మలో భయం గూడు కట్టుకుంది తననేం చేస్తారో అని. పోలీసులు మళ్ళీ విచారణ మొదలుపెట్టారు. ‘సుభద్రమ్మా! మందు ఎక్కడి నుంచి తెచ్చాడు మీ ఆయన?’ అడిగారు పోలీసులు. ‘ఇంట్లనే ఓ బాటిల్ ఉందయ్యా! అదే తాగారు. ఆ... అది సరిపోలేదని మా కొడుకు ఇంటికి వెళ్లి ఇంకో బాటిల్ తెచ్చాడయ్యా’ గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పింది సుభద్రమ్మ!పోలీసులు ముఖముఖాలు చూసుకున్నారు. ‘నీ కొడుకు, కోడలు టౌన్కెళ్లారుగా! ఇంటికి తాళం వేసి ఉంటే ఇతనెలా వెళ్లాడు’ గద్దించాడు ఎస్సై.‘నిజమే సార్! వాళ్లు ఎక్కడికైనా వెళితే తాళం చేతులు మా ఇంట్లనే కొయ్యకు తగిలించి వెళతారు. అది మా ఆయనకు తెలుసు. తాళం తీసే వెళ్లి తెచ్చుకున్నాడు..’సుభద్రమ్మ బలంగా చెబుతుండగా ఎస్సై ప్రతాప్ వైపు చూశాడు. అయోమయంగా చూశాడు ప్రతాప్ ఏమీ అర్థంకానట్టు. ‘వాళ్లిద్దరూ పడున్న చోట ఒకటే ఖాళీ బాటిల్ పడి ఉంది. రెండో బాటిల్ ఏమైంది?’ సుభద్రమ్మను అడిగాడు ఎస్సై‘మందు చేదుగా ఉందని తాగిన మా తమ్ముడు అన్నడు సర్! నీకు మందెక్కువై ఆ మాట అంటున్నావ్రా అని మా ఆయనా ఆ మందు తాగాడు! నిజమేన్రోయ్ ఈ మందు మహా చేదుగా ఉంది... దిక్కుమాలినోడు చేదు మందు తెచ్చిపెట్టిండు అని ప్రతాప్‌ను తిట్టుకొని దాన్ని బయటకు విసిరేశాడు’ అంది.ఎస్సై ఆలోచిస్తూనే తన సిబ్బందిని పురమాయించాడు. ఆ బాటిల్‌ను వెతకమని. పోలీసులు ఆ ఇంటి పరిసరాలను అణువణువూ గాలించారు.గుమ్మానికి ఎడమవైపున ప్రతాప్ ఇంటి ముందు కరివేపాకు చెట్టు పొదల్లో ఓ వైన్ బాటిల్ దొరికింది. దానిని వాసన చూసిన పోలీసుల కనుబొమ్మలు ముడిపడ్డాయి. అది పురుగుల మందు వాసన వస్తోంది. ‘క్లూ దొరికింది. ఈ మందుబాటిలే వాళ్లని చంపింది. అయితే, ఈ వైన్ బాటిల్లోకి పురుగుల మందు ఎలా వచ్చింది? ఎవరు కలిపారు? తేలాలి.’ ‘ఏంటిది?’ అడిగాడు ఎస్సై ప్రతాప్‌కి దగ్గరగా చూపుతూ. ప్రతాప్ ఆ మందుబాటిల్ను, దాని వాసన చూడగానే ‘సార్! ఒక్క నిమిషం. ఒక్కసారి ఇంట్లకెళ్లి చూసొస్తా. నాతో రండి’ అన్నాడు.అతనితో పాటు పోలీసు సిబ్బంది పంచాయతీ హాల్ నుంచి బయటకొచ్చారు. ప్రతాప్ ఇంట్లోకి వెళ్లి తన గదిలోని షెల్ఫ్‌లో ఓ మూలకు వెతుకుతున్నాడు. ‘దేనికోసం వెతుకుతున్నావ్’ గద్ధించాడు ఎస్సై.‘వారం క్రితం పొలానికి మందు కొట్టాలని మా నాయన్ని డబ్బులడిగిన. నా భూమిలో పొలం వేసుడే కాకుండా నన్నే డబ్బులు అడుగతావ్రా.. పురుగు పడితే పట్టనీయ్, నాశనం కానీయ్.. అన్నడు.మందెయ్యకపోతే పంట చేతికి రాదు. మా పొలం పక్కన ఉన్న రాములయ్యను అడిగితే ఒకటే డబ్బా ఉందని తన పొలానికి కొట్టాలని చెప్పాడు. పైసలొచ్చినంక ఇస్త.. సగం మందు ఇవ్వమని అడిగా. రాములయ్య సరే అని ఆ రోజు సాయంకాలం ఇంటికే తీసుకొచ్చాడు మందు డబ్బా! మందు పోయడానికి సీసా కోసం వెతికితే ఖాళీ వైన్‌బాటిల్ కనిపించింది. సగం పురుగుల మందు వైన్ బాటిల్లో పోసి, ఈ మూలన ఎవరికంటా పడకుండా జాగ్త్రతగా పెట్టా. మా ఆవిడ పిల్లలతో కలిసి పుట్టింటికి బయల్దేరితే వాళ్లను ఆ ఊళ్లో దిగబెట్టడానికి నేనూ వెళ్లా. ఊర్నొంచి వచ్చినంక పొలానికి మందు కొడదాంలే అనుకున్న. మా అత్తగారి ఇంటి నుంచి టౌన్లో పనుంటే చూసుకుని ఇంటికి వచ్చేసరికి రెండ్రోజులయ్యింది. ఇప్పుడే చూశాను సార్! ఆ బాటిల్ లేదు. మా నాయిన నా దగ్గర మందుబాటిల్ ఉందని వెతికి ఉంటాడు. ఇది దొరికింది. తీసుకెళ్లాడు!’ ఏడుస్తున్నాడు ప్రతాప్. నిజం తేలడంతో ఊరివాళ్లు శాంతించారు. లేకుంటే వారి ఆవేశం వల్ల మరో రెండు ప్రాణాలు బలి అయ్యేవి. చేయని తప్పుకు శిక్షను అనుభవించాల్సి వస్తుందేమో అని భయపడిన వాళ్లకు పోలీసులు నిజ నిర్ధారణ చేసి నేరస్తులు కాదని ఊరటనిచ్చారు. – నిర్మలారెడ్డి -
యూజీసీ ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను (యూజీసీ) కొనసాగిస్తూనే దాని బలోపేతానికి చర్యలు చేపట్టాలని నిపుణులు, వైస్చాన్స్లర్లు అభిప్రాయపడ్డారు. యూజీసీని రద్దు చేసి ఆ స్థానంలో ప్రతిపాదిత హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెకీ) ఏర్పాటును వ్యతిరేకించారు. యూజీసీ స్థానంలో హెకీ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఇందులో భాగంగా సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో హెకీపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి తల్లిదండ్రులు, విద్యావేత్తలు, పారిశ్రామికవర్గాలు, వీసీలు, రిటైర్డ్ వీసీలతో సమావేశం నిర్వహించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, కె.కేశవరావు, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ పాల్గొన్నారు. ఈ భేటీ లో హెకీ ముసాయిదా బిల్లులోని పలు అంశాలపై చర్చించారు. ఆయా అంశాలతో నివేదికను రూపొం దించి ఈ నెల 20లోగా కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. ప్రస్తుతం హెకీ అవసరమే లేదని, అయి నా కేంద్రం హెకీని అమల్లోకి తేవాలనుకుంటే పలు సవరణలు చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సంస్కరణలు సామాన్యులకు విద్య అందించేలా ఉండాలి: కడియం కేంద్రం తీసుకొచ్చే సంస్కరణలు సామాన్యులకు నాణ్యమైన విద్యనందించేలా, పేదల జీవన ప్రమాణాలు పెంచేలా ఉండాలని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రతిపాదిత హెకీ విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందన్నారు. వర్సిటీలకు నిధుల పెంపుతోపాటు, నేరుగా వర్సిటీలకు అవి వచ్చేలా, ఇన్సెంటివ్‌లు ఇచ్చేలా సవరణలు చేయాలన్నారు. డ్రాఫ్ట్ బిల్లుపై అభిప్రాయాలు చెప్పేందుకు మూడు వారాలే ఇవ్వడం సరికాదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ కమిషన్ ఏర్పాటు వల్ల ఫీజులు పెరుగుతాయని, గ్రాంట్స్ తగ్గుతాయన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ కేకే మాట్లాడుతూ ఈ ముసాయిదా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాల్సి వస్తుందేమోనన్నారు. -
కేంద్ర విద్యా స్కీమ్‌ల విలీనమే ఓ స్కీమ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న మూడు కేంద్ర పథకాలను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలిమెంటరీ విద్య (ఒకటి నుంచి ఎనిమిదివ తరగతి)కు సంబంధించిన సర్వశిక్షా అభియాన్, సెకండరీ స్కూల్ (9,10 తరగతులు)కు వర్తించే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, టీచర్ల విద్యను పునర్ వ్యవస్థీకరించి పునర్నిర్మాణానికి దోహదపడే సీఎస్‌ఎస్‌ఆర్‌ఆర్‌టీఈ పథకాన్ని విలీనం చే యాలని నిర్ణయించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంగళవారం నాడు ఈ అంశాలపై రాష్ట్రాలను ఓ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఈ మూడు స్కీమ్‌లను విలీనం చేసి పాఠశాల విద్యాభివృద్ధికి సమగ్ర పథకం (ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్) తీసుకరావాలని నిర్ణయించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఓ దక్పథ పత్రాన్ని జనవరి 22వ తేదీనే రాష్ట్రాలకు పంపించింది. నాణ్యత ప్రమాణాలను పట్టించుకోకుండా నిర్వహణా ఖర్చులను భారీగా తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త స్కీమ్‌ను తీసుకొస్తున్నారని ఈ స్కీమ్‌కు రూపకల్పన చేసిన ‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ’లో పదవీ విరమణ చేసిన అధికారి చెప్పారు. నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు కొత్త స్కీమ్‌లో ఎలాంటి నిబంధనలు లేవని ‘సెంటర్ ఫర్ పాలసీ రీసర్చ్’లో విద్యా పాలన గురించి అధ్యయనం చేసిన కిరణ్ భట్టీ వ్యాఖ్యానించారు. నిర్బంధ విద్యా హక్కును అమలు చేస్తున్న ఏకైకా కేంద్ర పథకం సర్వ శిక్షా అభియాన్‌ను విలీనం చేసినట్టయితే ఎలిమెంటరీ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే అవుతుందని ‘రైట్ టు ఎడ్యుకేషన్ ఫోరమ్’కు చెందిన అంబరీష్ రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మూడు విద్యా స్కీమ్‌లకు వేర్వేరుగా బడ్జెట్ కేటాయింపులు జరపకుండా ఒకే స్కీమ్ కింద బడ్జెట్ కేటాయింపులు జరపాలని కేంద్రం నిర్ణయించడమే కేంద్రం ఉద్దేశం అర్థం అవుతుందని, పాలనాపరమైన, మానవ వనరుల విషయంలో భారీగా ఖర్చును తగ్గించాలని కేంద్రం చూస్తోందని విద్యా నిపుణులు వాదిస్తున్నారు. అయితే నిరర్థక ఖర్చులను మాత్రమే తగ్గించాలని చూస్తున్నామని కేంద్రం చెబుతోంది. నిరర్థక ఖర్చుల పేరిట దేశంలో విద్యను నిరర్థకం చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
త్వరలో సెల్ఫీ ఎక్స్‌పర్ట్‌లు!
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కి కొత్త సమస్య వచ్చి పడింది! కొత్తది సరే. పాతది ఏంటో? తాజ్‌మహల్‌ను చూడ్డానికి వచ్చేవాళ్ల సంఖ్య పెరిగిపోతోందట! దాని వల్ల నష్టం ఏంటి? చేతులతో టచ్ చెయ్యడం వల్ల అరిగిపోతోందట. అరిగిపోయి, అసలు రూపం ‘డిమ్’ అయిపోతోందట! పౌర్ణమి నాడు కూడా తాజ్‌లో బ్రైట్నెస్ కనిపించడం లేదట. ఇక కొత్త సమస్య ఏంటి? సెల్ఫీలు! తాజ్ దగ్గరికి వచ్చేవాళ్లెవరూ తాజ్ మహల్‌ను చూడ్డానికి రావడం లేదనీ, తాజ్‌తో కలిసి సెల్ఫీలు తీసుకోడానికి మాత్రమే వస్తున్నారని ఏఎస్ఐ వాపోతోంది. సెల్ఫీలు తీసుకుంటే వాళ్లకేమిటి నష్టం? తాజ్ అరిగేం పోదు కదా! ‘పోదు నిజమే కానీ, సెల్ఫీలీ తీసుకున్నవాళ్లు ఊరికే ఉంటున్నారా? వాటిని ఎఫ్‌బీల్లో, ట్వీటర్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. చేతయ్యీ చేతకాక తీసిన ఫొటోలలో తాజ్ మహల్ వంకర టింకరగా, ఒక ప్రపోర్షన్ లేకుండా పోవడంతో ఇంటర్నేషనల్‌గా తాజ్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతోంది. తాజ్ ఇమేజ్‌కి డ్యామేజ్ జరుగుతోంది’’ అని ఏఎస్ఐ హెడ్డు ఫీలవుతున్నారు. ఏమిటి దీనికి సొల్యూషన్. ఏఎస్ఐ వాళ్లే కొంతమంది సెల్ఫీ ఎక్స్‌పర్ట్‌లను పెట్టి వచ్చినవాళ్లందరికీ ఫొటోలు తీయించడమే. అప్పుడు ప్రతి ఫొటోలోనూ, తాజ్‌తో పాటు సెల్ఫీ ఎక్స్పర్ట్ కూడా ఉంటాడేమో! -
నిదురపోరా తమ్ముడా..
► మారుతున్న నిద్ర వేళలు ► అర్ధరాత్రి వరకూ మేల్కొనే ఉంటున్న యువత ► ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న వైద్యులు సూర్యోదయానికి గంటన్నర ముందు సమయాన్నే బ్రహ్మ ముహూర్తమని అంటారు. కచ్చితంగా చెప్పాలంటే.. ఒక గంటా 36 నిమిషాలు.. అంటే 96 నిమిషాలకు ముందు సమయం. ఈ సమయంలో మెలకువ వచ్చిందంటే.. ఆ వ్యక్తి ఆరోగ్యానికి దగ్గరగా ఉన్నట్టే. ఆ సమయంలో శక్తివంతమైన ఎలక్ట్రో మేగ్నటిక్, ఆధ్యాత్మిక వలయాలు వాయువ్య దిశలో పయనిస్తుంటాయని, వాటికి వ్యతిరేక దిశలో కూర్చుని యోగాలాంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని యోగులు, ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. ప్రస్తుతం ఈ సమయంలో నిద్ర లేచేవారు మనలో ఎంతమందున్నారో ఆలోచించండి. ఫోన్‌తో చేటు ఉద్యోగ ఒత్తిడి, వ్యాపారం నిర్వహణ కష్టాలు, ఆర్థిక సమస్యలు, చదువులో విపరీతమైన పోటీ వల్ల సాధారణంగా నిద్రలేమి సమస్యలు వస్తుంటాయి. ప్రస్తుతం యువతరాన్ని బానిసలుగా మార్చేస్తున్న అతి పెద్ద సమస్య అంతర్జాల వినియోగం, స్మార్ట్ ఫోన్ ఫీవర్. వీటి కోసం నిద్రను మానుకుని ఫోన్‌తోనే అర్ధరాత్రి వరకూ గడిపేస్తున్నారు. నిద్రపోయే సమయాన్ని అలా.. అలా... రాత్రి 10.. 11... 12.. ఒంటి గంట ఇలా పెంచుకుంటూ పోతున్నారు. నిద్రలేమితో త్వరగా మరణం ఎయిమ్స్ విడుదల చేసిన ఓ సర్వే ప్రకారం.. ఢిల్లీలో ఏకంగా 70 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇందులో యువత సైతం ఎక్కువగానే ఉన్నారు. రోజుకు 7 గంటలు నిద్రపోయిన వారిలో మరణశాతం రేటు తక్కువగా ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అలాగే 6 గంటల కంటే తక్కువ 8 గంటల కంటే ఎక్కువ పడుకున్నా.. 15 శాతం మరణరేటు పెరుగుతోందని గుర్తించారు. నిద్రమేల్కొంటే..? ► నిద్రను ఆపుకుని మరీ ఐఫోన్లలో రాత్రంతా గడిపే యువత మరుసటి రోజు మందకొడిగా మారిపోతారు. వారు సరిగ్గా గంట నిలబడలేరు.. కూర్చోలేరు.. తరగతి గదిలో ఓ గంట పాఠం వినడమే గగనమే. ► తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. జ్ఙాపకశక్తి తగ్గిపోతుంది. వీరికి తలనొప్పి, ఒంటినొప్పులు నిత్యకృత్యం. వీటిని తగ్గించుకునేందుకు నొప్పి నివారణ మాత్రలు వేసుకుంటారు. ఇది కడుపులో మంటకు దారితీస్తుంది. దానిని తగ్గించుకునేందుకు ఏదైనా తినేస్తుంటారు. ఇది ఒబిసిటికి దారి తీస్తుంది. ► ప్రధానంగా నిద్రలేమి వల్ల శరీర కాలచక్రం గతి తప్పుతుంది. దీనివల్ల ఏ సమయానికి చేయాల్సిన పనులు.. ఆ వేళకు జరగవు. ఏకాగ్రత లోపిస్తుంది. కళ్లు ఎర్రబడతాయి. కళ్లు లోపలికి పోయి.. దురదలు వస్తాయి. నీరు కారుతుంటాయి. నిద్రలేమి వల్ల వినికిడి శక్తి సైతం తగ్గిపోతుంది. ఉత్సాహం తగ్గిపోతుంది. ఆకలి కూడా తగ్గిపోతుంది. సరైన సమయానికి మలమూత్ర విసర్జన సైతం జరగదు. అందుకే నిద్ర అన్నింటికీ ప్రధానమని గుర్తించాలి. శారీరక చక్రానికి నిద్రే ప్రధానం నిద్రతోనే విశ్రాంతి దొరుకుతుంది. బాగా నిద్రపోతేనే శరీరంలోని గ్లూకోజ్‌ను అన్ని కణాలూ సమానంగా తీసుకుంటాయి. అప్పుడే శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. – డాక్టర్ నరసింహులు, కంటి వైద్య నిపుణులు, ధర్మవరం -
ఇన్ఫీ వ్యవస్థాపకులు వాటాలను అమ్మేస్తే..పరిస్థితేమిటి?
వేతన ప్యాకేజీ విషయంలో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ లో గతకొంతకాలంగా సాగిన అలజడి తెలిసిందే. ఈ అలజడి కొంత సద్దుమణిగింది అనగానే, మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. బోర్డు సభ్యులతో పొంతన కుదరని కంపెనీ వ్యవస్థాపకులు, పూర్తిగా ఇన్ఫోసిస్ తో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయిస్తున్నారని, వారి 28వేల కోట్ల విలువైన 12.75 శాతం స్టేక్ ను అమ్మేస్తున్నారని వార్తలొచ్చాయి. ప్రస్తుతానికైతే ఆ వార్తలను ఇరువైపుల నుంచి అంటే ఇన్ఫోసిస్ కంపెనీ, వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి తీవ్రంగా ఖండించారు. కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే పరిస్థితేమిటి? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వ్యవస్థాపకులు స్టేక్ ను అమ్మేయబోతున్నారని తెలియగానే కంపెనీ షేర్లు ఢమాల్ మన్నాయి. నిన్న ప్రారంభ ట్రేడింగ్ లో 3.5 శాతం మేర పడిపోయిన షేర్లు, అనంతరం కొంత కోలుకున్నాయి. 1 శాతం నష్టంలో 948.65 వద్ద ముగిశాయి. కంపెనీ పరంగా చూసుకుంటే ఈ రూమర్లు అత్యంత కష్టకాలంలో వచ్చినట్టే తెలిసింది. అసలకే ఐటీ రంగం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. ఓ వైపు నుంచి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, మరోవైపు నుంచి ఆటోమేషన్ వంటి ప్రభావాలతో ఐటీ రంగ షేర్లు గత కొంత కాలంగా అస్థిరంగా ట్రేడవుతున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, ఈ కంపెనీ షేరు ధర మరింత పడిపోయేదని అంబిట్ కాపిటల్ అనాలిస్ట్ సాగర్ రస్తోగి చెప్పారు. ఎంతో గౌరవప్రదయమైన వ్యక్తులు, వినమ్రతతో నడుచుకునే ఫౌండర్లు ఈ నిర్ణయం తీసుకుంటే షేర్ హోల్డర్స్ సెంటిమెంట్ ను తీవ్రంగా దెబ్బతీసేదని అనాలిస్టులంటున్నారు. అయితే దీర్ఘకాలంగా కొంత ప్రయోజనం కూడా చేకూరనుందట. గతకొంతకాలంగా కంపెనీ యాజమాన్యానికి, వ్యవస్థాపకులకు మధ్య సాగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పడేదని పలువురంటున్నారు. వ్యవస్థాపకుల నిర్ణయంతో మేనేజ్ మెంట్ ఎక్కువగా కంపెనీపై దృష్టిసారించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే వ్యవస్థాపకులు వాటాను అమ్మేయనున్నట్టు వచ్చిన వార్తలు తమల్ని తీవ్రంగా బాధించాయని ఇన్ఫోసిస్ తెలిపింది. మరోవైపు నుంచి వ్యవస్థాపకులు షేరును అమ్మాలనుకోవడం మరి అంత చెత్త నిర్ణయమేమి కాదని మరో ప్రముఖ ఇన్వెస్టర్ చెబుతున్నారు. అయితే ఇది దేశీయ రెండో అతిపెద్ద సర్వీసు ప్రొవైడర్ లో కీలకమైన క్షణంగా పరిగణించారు. ఐటీ ఇండస్ట్రి ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులతో ఒక్క ఇన్ఫోసిస్ లో మాత్రమే కాక, విప్రో కంపెనీపైనా ఇదే తరహాలో రూమర్లు వచ్చాయి. విప్రోలో అయితే ఏకంగా ప్రమోటర్లు కంపెనీనే అమ్మేయాలని చూస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ వార్తలను విప్రో సైతం కొట్టిపారేసింది. -
వాన్నా క్రై షాకింగ్: బ్యాంకింగ్ వ్యవస్థపై దాడి
న్యూఢిల్లీ: 'వానా క్రై రాన్సమ్వేర్' ప్రకంకపనలు త్వరలోనే భారత బ్యాంకింగ్ వ్యవస్థను తాకనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాన్సమ్ వేర్ సైబర్ ఎటాక్ ప్రభావం తగ్గుముఖం పడుతున్నప్పటికీ దీని బారిన పడుతున్న సంఖ్య మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని ఐటీ నిపుణులు వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. ఆ సంస్థల సంఖ్య వేగంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో వివిధ సంస్థలు, బ్యాంకులకు సైబర్ నిపుణులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. వానా క్రై ప్రభావం చాలా రాష్ట్రాలపై పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్కడ దాడి జరిగింది అనేది చెక్ చేయడంలేదని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు శుభ మంగళ ఏఎన్ఐ కి చెప్పారు. దాడుల తరువాతి ప్రకంకపనలు బ్యాంకింగ్ రంగంలో ప్రారంభంకానున్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. మరో కొన్నిగంటల్లోనే బ్యాంకులు ప్రభావితమవుతాయని చెబుతున్నారు. ఈ మేరకు బ్యాంకులకు సమాచారం అందించామన్నారు. ఎందుకంటే వానాక్రై బారిన పడుతున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టంతోనే ఏటీఏం నిర్వహరణ జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే సంస్థలు, వ్యాపారాలు మరియు ఇతర రంగాల వారికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి, వ్యవస్థలను నవీకరించడానికి హెచ్చరించినట్టు తెలిపారు. మరోవైపు ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఏం ట్రాన్సాక్షన్స్ చేయొద్దంటూ ఇప్పటికే సోషల్‌మీడియాలో హెచ్చరికలు, వార్తలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఏటీఎంలు మూతపడే అవకాశం ఉందన్నఅంచనాలు భారీగా నెలకొన్నాయి. కాగా 'వానా క్రై రాన్సమ్వేర్' ద్వారా కంప్యూటర్లను హ్యాక్ చేసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 150కిపైగా దేశాల్లో వేల సైబర్ దాడులు జరిగినట్లు కాస్పర్‌స్కై ల్యాబ్ తన బ్లాగ్‌లో పేర్కొంది. ముఖ్యంగా మన దేశంలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ లాంటి రాష్ట్రాలు ప్రభావితమయ్యాయి. అయితే ద్చరిత్రలోనే అతిపెద్దదిగా భావిస్తున్న ఈ సైబర్ దాడిలో నేరగాళ్లు ద్రవ్య ప్రయోజనాలను పొందలేదని ఐబీ నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. -
నిపుణుల అధ్యయనం
తిరుమల:తిరుమల శ్రీవారి ఆలయ క్యూలలో మార్పులు, చేర్పులపై గురువారం నిపుణులు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారు. టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖరరెడ్డి వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి ఆలయానికి అనుసంధానమైన ∙కదిలే వంతెనను పరిశీలించారు. ఆలయంలో వెండి వాకిలి వద్ద అన్నప్రసాదాల వితరణ కోసం క్యూలను పరిశీలించారు. నిపుణుల సూచనలను అమలు చేస్తాం అలిపిరి మార్గం నుంచి తిరుమలకు వచ్చే కాలిబాట అన్నమయ్య మార్గంతోపాటు ఆలయంలో క్యూల నిర్వహణపై ఐఐటీ నిపుణుల సూచనలను అమలు చేస్తామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తెలిపారు. భక్తుల భద్రత, క్యూలైన్ల నిర్వహణ లక్ష్యంతోనే పనులు కొనసాగిస్తామన్నారు. అధ్యయనం చేసి నివేదిక ఇస్తాం పురాతన అన్నమయ్య మార్గంతోపాటు శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూల ఆ«ధునికీకరణపై అధ్యయనంచేసి నివేదిక ఇస్తామని ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఉన్నవాటిలో మార్పులు చేర్పులు చేయాలా? కొత్తవి నిర్మించాలా? అన్నవాటిపై సమగ్రంగా సూచనలిస్తామన్నారు. -
థియేటర్లలో జాతీయగీతంపై ఏమంటున్నారు?
న్యూఢిల్లీ: ఇక నుంచి ప్రతి సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని ప్రదర్శించాలని, ఆ సమయంలో ప్రతి ఒక్కరూ నిలబడాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పలువురు నిపుణుల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. ఇది న్యాయవ్యవస్థ మితిమీరిన జోక్యం అని కొందరు అంటుండగా.. తాజా ఆదేశాల ద్వారా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని, మంచి ఫలితాన్నే ఇస్తుందని మరొకరు అంటున్నారు. ముఖ్యంగా మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ ఈ విషయంపై స్పందిస్తూ కోర్టులు ప్రజలు నిల్చోవాలని, ఏదో చేయాలని చెప్పకూడదని అన్నారు. కావాలంటే కార్యనిర్వాహక వర్గాన్ని మాత్రం చట్టంలో సవరణలు చేయండని ఆదేశించవచ్చని చెప్పారు. మరోపక్క, తనకు సంబంధించినది కానీ అంశాల వరకు న్యాయవ్యవస్థ వెళ్లకూడదని ప్రముఖ సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి అన్నారు. ఇక ఢిల్లీ నియోజవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ, న్యాయవాది మీనాక్షి మాత్రం సానూకూలంగా స్పందించారు. జాతీయ గీతాన్ని ఇప్పటికే పలు పాఠశాలల్లో.. బహిరంగంగా జరిగే వేడుకల్లో, తదితర చోట్లలో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారని, ఇప్పుడొక కొత్త వేదికపై పాడితే తప్పేముందని, ఎలాంటి నష్టం జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. జాతీయ గీతం వచ్చే సమయంలో లేచి నిల్చుంటే కలిగే నష్టమేమి లేదన్నారు. అయితే, థియేటర్లో ప్రతి ఒక్కరు నిల్చొనేలా చేయడం యాజమాన్యాలకు కష్టంగా ఉంటుందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, వికలాంగులతో ఈ సమస్య ఉంటుందని అన్నారు. -
నల్లధనమే ఆ సంక్షోభం నుంచి బయటపడేసింది!
పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ.. అభినందిస్తూ పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తుండగా.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం వివాదాస్పదమైన కామెంట్లు చేశారు. ప్రపంచ ఆర్థికసంక్షోభం సమయంలో భారత ఆర్థికవ్యవస్థను బ్లాక్మనీనే రక్షించిందని నిపుణులు అభిప్రాయం పడ్డారని ఆయన మంగళవారం పేర్కొన్నారు. "నల్లధనం ఉత్పత్తి చేయరాదు. ఈ విషయంలో నేను చాలా క్లారిటీగా ఉన్నా. కానీ ప్రపంచమంతా ఆర్థికసంక్షోభంలో కూరుకున్నప్పుడు భారత్ ఆ పరిస్థితుల నుంచి బయటపడేసింది మాత్రం నల్లధనమే. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి సమాంతరంగా భారత్‌లో బ్లాక్‌మనీ ఉండటమే అని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు'' అని అఖిలేష్ పేర్కొన్నారు. తాను బ్లాక్‌మనీని వ్యతిరేకిస్తున్నానని, తనకు అసలు ఆ డబ్బే వద్దని వాఖ్యానించారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆకస్మాత్తు నిర్ణయంపై స్పందించిన ఆయన ఈ కామెంట్లు చేశారు. బ్లాక్‌మనీని బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలు బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద భారీ క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సాధారణ ప్రజానీకానికి ప్రభుత్వం చాలా కష్టాలను విధిస్తుందని విమర్శించారు. బ్లాక్‌మనీని చెక్ చేయడానికి ఈ నోట్ల రద్దు ఏమీ ప్రయోజనం కలిగించదని వ్యాఖ్యానించారు. అవినీతిని చెక్ చేయడానికి మాత్రం ఇది ఓ మంచి చర్యఅని, అవినీతికి పాల్పడకూడదనే విషయంపై చాలామంది ప్రజలు అవగాహన పొందుతారని పేర్కొన్నారు. కానీ ఎవరైతే నల్లధనాన్ని రూ.500, రూ.1000 నోట్లలో దాచిపెట్టుకుని ఉంటారో, వారు మాత్రం ప్రస్తుతం రూ.2,000 నోట్ల కోసం వేచిచూస్తున్నారని అఖిలేష్ తెలిపారు. -
'టక్కు'టమారం
పరమ స్టైలిష్‌గా కనిపించడానికి ప్రత్యేకంగా చొక్కాను ప్యాంటులోకి దోపే ట్రెండును టక్కు అంటారన్నది తెలిసిందే. ఈ టక్కుటమార విద్యను ప్రధానంగా అమ్మాయిలను ఆకర్షించడం కోసమే అంటారు అనుభవజ్ఞులు. అందుకే టక్కరులు ప్రదర్శించే ఫ్యాషను కాబట్టి దీనికి టక్కు అని పేరొచ్చిందని వ్యుత్పత్తిని బట్టి భాషావేత్తలు చెబుతుంటారు. టక్కులు పెక్కురకాలు. హృదయటక్కు. మీడియం టక్కు. లోబ్యాక్ టక్కు. బెల్‌బాటమ్స్ టైమ్‌లో గుండెకు ఇంచుమించు దగ్గరగా ఉండేది టక్కు. దీన్ని హృదయటక్కు అని పిలుచుకునేవారు. సాధన మీద ధ్యానం మూలాధారం నుంచి పైకి ప్రవహించినట్లే... ఏ సాధనా లేకుండానే టక్కు కిందికి జారింది. హృదయ టక్కు కొన్నాళ్లకు పొట్ట చేరి... ఇప్పుడు క్రమంగా నడుముకు జారింది. నడుము టక్కు లేదా లోబ్యాక్ టక్కు అన్నది ప్యాంటు నడుము కిందికి చాలా లోతుల్లోకి జారిపోతూ ఎక్కడో పాతాళంలో వేసినట్టుంది. అంతకంటే మరి కిందికి జారనివ్వవద్దని ఫ్యాషనేతరులు ఫ్యాషన్ ప్రియులను కోరుతున్నారు. బిక్కుబిక్కుమంటూ లో-వెయిస్టు టక్కరులను కోరుతున్నారు. అంతకు ముందు స్కూలు యూనీఫామ్ రూపంలో వేసే టక్కు కంటే టీనేజీలోకి వచ్చాక ఈ వయసులో టక్కుకు ఉండే ప్రాధాన్యం వేరు. ఆ దృష్టి వేరు. అందుకే ఇలాంటి బీటరులైన (బీటు కొట్టేవారైన) టక్కిస్టులు ప్రదర్శించే ట్రిక్కుటమార ఫ్యాషను కాబట్టి దీన్ని అనుసరించే వారిని టక్కరి అని పిలవవచ్చా అనేది ఒక హేతుబద్ధమైన సందేహం. నిజజీవితంలో అలాంటివారిని మనం ఎప్పుడూ చూడం గానీ... పాత సినిమాల్లో లెక్కలు చూసే గుమస్తాలు... ఒకనాటి మూవీలలోని ప్లీడర్లు చక్కగా పంచెకట్టుకుని మరీ టక్కువేసి... ఆ పంచె మీద బెల్టు కట్టేవారు. అంతకు ముందు అలవాటు లేకుండా కొత్తగా టక్కు మొదలు పెట్టినవారు కాస్త ఇబ్బంది ఇబ్బందిగా కదుల్తుంటారు. అస్తమానం టక్కు సర్దుకుంటుంటారు. ఇక టక్కుకు పునాదిలాంటి పొట్ట మరీ లోతుకుపోయినా కష్టమే. ముందుకు పొడుచుకువచ్చినా కష్టమే. కాబట్టి టక్కు అందరూ అనుకుంటున్నంత వీజీ కాదని విజ్ఞులు గ్రహించాలి. అయినా మితిమీరి మెక్కడం టక్కుకు చేటు తీసుకొస్తుందని ఫ్యాషనేతరులూ తెలుసుకోవాలి. వివాహానికి ముందు వేసిన టక్కును పెళ్లి తర్వాత కూడా కొనసాగించక తప్పదు. ఎందుకంటే ఇంతి లేని ఇల్లు... ఇన్‌షర్టు లేని డ్రస్సు చూడటానికి అంత బాగుండవని సామెత. కొందరు ఎప్పుడూ టక్కుతోనే కనిపిస్తారు. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్లుగా వీళ్లసలు టక్కుతోనే పుట్టారేమోనని డౌటొచ్చేలా ఉంటారు. వీళ్లను టక్కు లేకుండా గుర్తుపట్టలేం. వాళ్లు కూడా మనం గుర్తు పట్టేందుకు వీలుగా మన సౌలభ్యం కోసమే టక్ చేస్తారు. వీళ్లను నిత్యటక్కరులని అనుకోవచ్చు. టక్కు నాగరకతకు సూచన. కానీ మేధావులకు టక్కు నుంచి మినహాయింపు ఉంటుంది. వాళ్లు మాత్రం టక్కు వేయరు. ఈ టక్కు నిరసనకారులు కేవలం జీన్స్ మాత్రం తొడిగి దానిపై పొడవుగా, కాస్తంత ముతగ్గా ఉండే లాల్చీ వేస్తారు. లాల్చీ ముతకదనం అతడి మేధావి తనానికి అనులోమానుపాతంగా ఉంటుంది. అనగా... లాల్చి ఎంత ముతకదైతే అంత మేధావి అన్నమాట. ఇప్పుడంటే ఒకింత తగ్గిందిగానీ... గతంలో ఒక చేతి సంచీ కూడా ఈ అవతారానికి తోడయ్యేది. వీళ్లు టక్కును ఆహార్యపరంగా నిరసిస్తారు. టక్కు వేసిన వారి కంటే ఇలాంటి వారిని ‘టక్కు’న గుర్తుపట్టవచ్చు. టక్ టక్ మని తలుపు కొట్టి మాత్రమే లోపలికి ప్రవేశించాలన్నది జంటిల్మేన్ రూల్. కాబట్టి టక్ వేసుకోవడం కూడా జంటిల్మేన్ రూల్స్‌లో ఒకటిగా మారింది. టక్కుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్యాంటులోపలికి దోపుతాం కాబట్టి... అలా లోపలికి పోయే షర్టు భాగంలో ఎక్కడైనా రంధ్రం ఉన్నా, ఒకట్రెండు చిరుగులు ఉన్నా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. షర్టు కింది అంచు కుట్లు ఊడిపోయినా ఆ చొక్కాను ఉపయోగంలోకి తేవచ్చు. ఇది టక్కుకు ఉన్న సౌలభ్యం. కాకపోతే మనమైనా... ఇతరులైనా టక్కు పీకేయకుండా జాగ్రత్త పడాలి. అయితే టక్కుకు కొన్ని పరిమితులున్నాయి. కొన్ని జనరల్ రూల్స్ ఉన్నాయి. బనియన్‌కు టక్కు తప్పదు. లుంగీ మీద టక్కు నప్పదు. టక్కుకు షూ ఉండటం మేలు. చెప్పులైనా పర్లేదు. మనలో మన మాట చెప్పుల మీద టక్కు అంత ప్రభావపూర్వకంగా ఉండదు. అందుకే కొందరు షూ లేకపోవడం అనే కారణంగా టక్కు వేసుకోరు. ఇక టీ షర్టుకు, మామూలు ప్యాంటుకు టక్కు ఎంతమాత్రమూ కుదరదు. బెల్టుకూ ఇంచుమించూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇవన్నీ ఎవరూ రాయని జనరల్ రూల్స్. కానీ ఎవరికి వారు అర్థం చేసుకొని అందరూ పాటిస్తూ ఉంటారు. ఏది ఏమైనా టక్కు అంటే బంగారపు ఉంగరంలో పొదిగిన వజ్రంలాంటి ప్రెషియస్ స్టోన్ లాంటిది. వజ్రసంకల్పంతో టక్కు వేసేవారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదీ... పడిశెం పట్టే ముక్కు ఉన్నంత కాలం ఫ్యాషన్‌లో టక్కు ఉంటుంది. - యాసీన్ -
హే గాంధీ!
సాక్షి, సిటీబ్యూరో/బన్సీలాల్‌పేట్: గాంధీ జనరల్ ఆస్పత్రికి సుస్తీ చేసింది. నయం చేయాల్సిన ప్రభుత్వం తమకేమీపట్టనట్లుగా వ్యవహరిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో అత్యవసర విభాగానికి చేరుకున్నా... సకాలంలో వైద్యం అందక ... వ్యాధి నిర్ధారణ యంత్రాలు పని చేయక... ఎంతో మంది క్షతగాత్రులు మృత్యువాత పడుతున్నారు. 1255 పడకల సామ«ర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి ఔట్ పేషెంట్ విభాగానికి నిత్యం 2500–3000 మంది వస్తుండగా.. ఇన్‌పేషెంట్ విభాగంలో 1500 మందికిపైగా చికిత్స పొందుతుంటారు. అత్యవసర విభాగానికి రోజుకు సగటున 200 మంది వస్తే... వీరిలో 80 శాతం రక్తమోడుతున్న వారే. వీరిలో చాలా మందికి సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. నిపుణులు అందుబాటులో లేక కొంతమంది... సీటీ, ఎంఆర్ఐ వంటి సేవలు అందక మరికొంతమంది చనిపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పని చేయని సీటీస్కాన్ ఆస్పత్రిలోని సీటీస్కాన్ యంత్రం ఐదు రోజులుగా పని చేయడం లేదు. దీనికి మరమ్మతులు చేయాలంటే జర్మనీ నుంచి ప్రత్యేక నిపుణులు రావాల్సిందే. సకాలంలో నిర్వహణ ఖర్చులు చెల్లించక పోవడంతో సదరు సంస్థ ప్రతినిధులు మరమ్మతులకు ముందుకు రావడం లేదు. దీంతో రోగులను వైద్యులు ఉస్మానియాకు సిఫారసు చేస్తున్నారు. తీరా అక్కడి సీటీస్కాన్‌కు 15 రోజులు... ఎంఆర్ఐకి రెండు నుంచి మూడు నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. ఇలా గాంధీలోనే ప్రస్తుతం 400 మందికిపైగా ఎంఆర్ఐ కోసం ఎదురు చూస్తున్నారు. -
గర్భిణులూ వ్యాయామం చేయొచ్చు!
లండన్ః క్రీడాకారులు ప్రతిరోజూ వ్యాయామం చేసి శరీరాన్ని ధృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి వస్తుంది. అయితే గర్భం దాల్చిన సమయంలో మహిళలు అటువంటి వ్యాయామాలు చేసేందుకు, పరుగు పెట్టేందుకు అనుమానిస్తారు. ప్రసవం అయ్యే వరకూ పరుగు వంటి వాటి జోలికి పోకుండా ఉండిపోతారు. అటువంటి మహిళలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు పరిశోధకులు. గర్భంతో ఉన్న మహిళలు సైతం పరిగెట్టవచ్చని, వ్యాయామం చేయొచ్చునని చెప్తున్నారు. గర్భిణులుగా ఉన్నపుడు క్రీడాకారిణులు వ్యాయామం చేయడం వల్ల ఎటువంటి పత్రికూల ప్రభావం ఉండదని ఇంగ్లాండ్ కు చెందిన అధ్యయనకారులు చెప్తున్నారు. అథ్లెటిక్ అయిన మహిళల్లో ఎటువంటి రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు ఉండవని, వీరు వ్యాయామం చేయడంవల్ల గర్భిణికి గాని, లోపల పెరిగే బిడ్డకు గాని సమస్య ఉండదని నార్వైన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్సెస్ ప్రొఫెసర్ కరి బో వెల్లడించారు. అంతేకాదు వీరు ఎక్సర్ సైజ్ చేయడంవల్ల రక్త ప్రసరణ మెరుగవ్వడంతోపాటు, గర్భంలోని పిండం, ప్లాసింటా ధృఢంగానూ, ఆరోగ్యంగాను తయారౌతాయని తెలిపారు. అయితే గర్భిణులు చేసే వ్యాయామం కాస్త తేలిగ్గా ఉండాలని, ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం తెలుస్తోంది. గర్భిణిలు తేలికపాటి వ్యాయామం, ఏరోబిక్స్ వంటివి చేయడంవల్ల మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గడంతోపాటు, మానసిక స్థైర్యాన్ని కూడ కలుగజేస్తుందని చెప్తున్నారు. అయితే వ్యాయామం చేసేప్పుడు ఏమాత్రం కష్టంగా అనిపించినా చేయకుండా ఉండటం మంచిదని హెచ్చరిస్తున్నారు. కడుపులోని పిల్లలకు ఇబ్బందిగా ఉంటుందేమోనని చాలామంది గర్భిణులు వ్యాయామం చేయడం మానేస్తుంటారని, అయితే వ్యాయామం చేసేప్పుడు బయటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా లేకుండా చల్లబాటున చేయడం ఉత్తమమని ప్రొఫెసర్ బో చెప్తున్నారు. అంతేకాక సరైన వ్యాయామం చేయడంవల్ల కడుపులోని పిల్లలు ఆరోగ్యంగా ఉండటమే కాక, ప్రసవం కూడ సులభం అవుతుందని చెప్తున్నారు. -
కీలెరిగిన పాదం
పూర్వీకులు అందించిన ఆయురారోగ్యశాస్త్రం యోగా. దేహంలోని ప్రతి అవయవాన్నీ చైతన్యవంతం చేసే ఏకైక సాధనం ఇది. శరీర భాగాలను ఆధారం చేసుకుని యోగాసనాలు సాధన చేసే క్రమంలో శరీరాన్ని ముందుకు కదిలించే పాదం సజీవ చైతన్యాన్ని సైతం ముందడుగు వేయిస్తోంది. ఆసనాలకు ఆసరాగా అమరిపోతూ ఆరోగ్య భాగ్యం అందిస్తోంది. అద్భుతమైన ఫలాలను అందించే ఆసనాలకు వందనం. వాటిని మనకు చేరువ చేస్తున్న యోగా నిపుణులకు పాదాభివందనం. పాదాలను ఆధారం చేసుకుని చేసే ఆసనాలు ఈ వారం... ఉభయ పాదాంగుష్టాసన సమస్థితిలో కూర్చుని కాళ్లు ముందుకు చేతులు రెండూ పైకి స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుతూ తలనూ శరీరాన్ని ముందుకు శ్వాస తీసుకుంటూ చేతులు కాళ్లు రెండూ వీలైనంత వరకూ కలిపి ఉంచుతూ వెనుకకు రోల్ అవుతూ నావాసన సాధన చేసిన తరువాత మెడ వెన్నెముక బాగా రిలాక్స్ అవుతుంది. ఐదారుసార్లు వెనక్కు, ముందుకు బాగా రోల్ అయిన తర్వాత సీటు భాగం నేల మీద సపోర్ట్‌గా ఉంచి కాళ్లను పైకి లేపి కాలి బొటన వేళ్లను గాని పాదాలను గాని రెండు చేతుల్తో పట్టుకుని శ్వాస వదులుతూ కాళ్లు రెండూ శరీరానికి వీలైనంత దగ్గరగా తీసుకొస్తూ మోకాళ్లను స్ట్రెయిట్‌గా ఉంచేందుకు ప్రయత్నించాలి. ప్రారంభదశలో ఉన్న సాధకులు పాదాలను చేత్తో పట్టుకోవడం వీలుకాకపోతే ఏదైనా తాడును కాని చిన్న టవల్‌ను కాని ఉపయోగించవచ్చు. సీటు మీద బ్యాలెన్స్ చేయలేని వారు ముందు ఒక గోడకు వీపును ఆనించి కాళ్లు రెండూ పైకి లేపి చేత్తో పట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఉపయోగాలు పొట్టలో భాగాలన్నింటికీ టోనింగ్ జరుగుతుంది. జీర్ణశక్తి బాగా మెరుగవుతుంది. లివర్, పాంక్రియాస్ ఉత్తేజితమవుతాయి. అధిక వెన్నెముక సమస్య, హెర్నియా నివారణకు మేలు. బ్యాలెన్సింగ్ వలన ఏకాగ్రత మెరుగవుతుంది. ప్రసారిత ఏక పాదాంగుష్టాసన ఉభయ పాదాంగుష్టాసనం తర్వాత శరీరం బాగా వార్మప్ అయి ఉంటుంది. అందువలన సాధారణ స్థితికి వచ్చాక, ఎడమకాలుని ఎడమవైపునకు స్ట్రెచ్ చేసి కుడికాలుని కుడి భుజం మీదకు తీసుకువచ్చి కుడి పాదం తలకు దగ్గరగా (ఏకపాద శిరాసనం) తీసుకురావాలి. కుడి అరచేతిని నేల మీదకు సపోర్ట్‌గా ఉంచి కుడి భుజంతో కుడి తొడ లోపలి భాగాన్ని లోపలకు నొక్కుతూ కుడి కాలి పాదాన్ని ఎడమచేతితో పట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ ఆసనం లోనికి వెళ్లాక 3 లేదా 5 సాధారణ శ్వాసలు తీసుకున్న అనంతరం శ్వాస తీసుకుని, వదులుతూ కుడి చేతిని ముందుకు రెండు కాళ్లను ముందుకు తీసుకురావాలి. ఇదే విధంగా రెండోవైపు కూడా సాధన చేయాలి. ఉపయోగాలు తొడ కీలు భాగం, సయాటికా సమస్యల నుంచి విముక్తి. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
రుతుపవనాలు, బ్లూచిప్ కంపెనీల ఫలితాలే కీలకం
న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లాంటి బ్లూచిప్ కంపెనీల రాబడులు, రుతుపవనాల పురోగతి ఈ వారం స్టాక్ మార్కెట్లకు కీలక అంశాలుగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపుతూ మార్కెట్లను ఒడిదుడుకులకు లోను చేసే అవకాశాలున్నట్టు పేర్కొంటున్నారు. రుతుపవనాల పురోగతి వివరాలు, ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్స్, స్థూల ఆర్థిక డేటా, 2016 ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసిక ఫలితాలు ఈ వారం దేశీయ సూచీలను నిర్దేశిస్తాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్ లైన్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ విజయ్ సింగానియా తెలిపారు. బీపీసీఎల్, టాటా పవర్, సిప్లా, టెక్ మహింద్రా, బజాజ్ ఆటో, గెయిల్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్, ఎస్ బీఐ, కోల్ ఇండియాలు ఈ వారంలో మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆశించిన ఫలితాలను విడుదలచేయలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగానికి అతిపెద్ద బ్యాంకుగా ఉన్న ఎస్ బీఐ ఫలితాలపై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టిసారించనున్నారని రిలయన్స్ సెక్యురిటీస్ తెలిపింది. కొన్ని వారాల వరకూ మార్కెట్లకి, ఆర్థిక వ్యవస్థకు రుతుపవనాలే కీలక అంశంగా ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గతవారం రెండు దేశీయ సూచీలు సెన్సెక్స్, నిప్టీలు నష్టాలు పాలయ్యాయి. సెన్సెక్స్ 187.67 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 65.20 పాయింట్లు నష్టపోయింది. -
కంప్యూటర్ పాఠం.. భవితకు సోపానం
విద్యార్థులతో కిటకిటలాడుతున్న శిక్షణ కేంద్రాలు సెలవులను సద్వినియోగం చేసుకుంటున్న చిన్నారులు పోచమ్మమైదాన్ : ఇది కంప్యూటర్ యుగం. ఉద్యోగం, వ్యాపారం ఇలా ప్రతిచోటా కంప్యూటర్లను వినియోగిస్తుండటాన్ని మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కంప్యూటర్ అక్షరాస్యత ఎంతో అవసరమని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. అందుకే వేసవి సెలవుల్లో తమ పిల్లల్ని షార్ట్ టర్మ్ కంప్యూటర్ కోర్సులు నేర్చుకునేందుకు పంపిస్తున్నారు. విద్యార్థులు సైతం రోజూ ఎంతో ఉత్సాహంగా శిక్షణ కేంద్రాలకు వెళ్లి, నిపుణుల పర్యవేక్షణలో సాంకేతిక అంశాల్ని నేర్చుకుంటున్నారు. ఫలితంగా వరంగల్, హన్మకొండ, కాజీపేటలతో పాటు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఉన్న కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు విద్యార్థులతో కిటకిటలాడుతున్నారుు. దీంతోపాటు టైప్ రైటింగ్ కోర్సులను నేర్చుకునేందుకూ ఆసక్తి కనబరుస్తున్నారు. శిక్షణ కేంద్రాల్లో తొలుత కంప్యూటర్ బేసిక్స్ నేర్పిస్తున్నారు. వాటిపై పట్టుసాధించిన విద్యార్థులకు డీసీఏ వంటి సాధారణ స్థారుు కోర్సుల్లో చేర్చుకుంటున్నారు. పాఠశాల దశలోనే కంప్యూటర్ పరిజ్ఞానాన్ని సంపాదించడం వల్ల భవిష్యత్తులో సాంకేతిక విద్యాపరమైన అంశాల్లో వారు ప్రతిభ కనబర్చే అవకాశాలు ఉంటాయని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. పాఠశాలల్లో నిర్వహించే కంప్యూటర్ క్లాస్‌లలో విద్యార్థులు మరింత రాణించడానికి ఈ షార్ట్ టర్మ్ ట్రెరుునింగ్ దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. శిక్షణ కేంద్రాల్లో డీసీఏ, పీజీడీసీఏ, డీటీపీ, మల్టీమీడియూ, సీ ల్యాంగ్వేజ్, జావా, సీపీపీ, డాట్నెట్, ఒరాకిల్, హార్డ్‌వేర్ అండ్ నెట్వర్కింగ్, 2డీ యూనిమేషన్, 3డీ యూనిమేషన్, మాయూ, అకౌంటింగ్ కోర్సులు నేర్పిస్తున్నారు. బీటెక్ విద్యార్థులకు ప్రత్యేకంగా.. బీటెక్ విద్యార్థులు, ఇంటర్ పూర్తి చేసుకొని ఇంజినీరింగ్‌లో చేరాలనుకునే వారి కోసం కంప్యూటర్ ట్రెరుునింగ్ ఇన్స్టిట్యూట్లు ప్రత్యేక కోర్సులను అందిస్తున్నారుు. ఆయూ విద్యార్థుల భవిష్యత్ అవసరాలకు దోహదపడేలా ఈ కోర్సులను రూపొందించారు. హన్మకొండ, వరంగల్ల పరిధిలోని కొన్ని శిక్షణ కేంద్రాల్లో బీటెక్ విద్యార్థులకు రాబోయే సెమిస్టర్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలపై ముందస్తుగా కోర్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఫీజుల విషయూనికొస్తే ఒక్కో లాంగ్వేజీని బట్టి దాదాపు రూ.1000 నుంచి రూ.5వేల దాకా తీసుకుంటున్నారు. -
మార్కెట్ ట్రెండ్ కి గణాంకాలు,ఫలితాలే కీలకం
న్యూఢిల్లీ: బ్లూ చిప్ కంపెనీ లుపిన్, ఐటీసీ త్రైమాసిక ఫలితాలు, టోకు ధరల ద్రవ్యోల్బణ డేటా, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ వారం మార్కెట్లకు కీలక అంశాలుగా మారనున్నాయని పై విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రుతుపవనాల సెంటిమెంట్లు మార్కెట్లకు పాజిటివ్ ట్రెండ్ చూపిస్తున్నా... వారంలో విడుదలయ్యే గణాంకాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నట్టు తెలుస్తోంది. 2016 ఏప్రిల్ నెలకు సంబంధించిన టోకుధరల ఇండెక్స్ సోమవారం విడుదల కానుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్ లైన్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ విజయ్ సింగానియా తెలిపారు. మరోవైపు అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయొచ్చని ఆయన చెప్పారు. అదేవిధంగా లుపిన్, ఐటీసీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు నాలుగో త్రైమాసిక ఫలితాలు ఈ వారంలోనే విడుదల కానున్నాయి. ఓ వైపు త్రైమాసిక ఫలితాలు, టోకు ధరల ఇండెక్స్ ఫలితాలు, మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ ఈ వారం కూడా స్థిరంగా ఉండదని, ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశముందని మోతిలాల్ ఓస్వల్ సెక్యురిటీస్ విశ్లేషకుడు రవి శెనోయ్ తెలిపారు. త్రైమాసిక ఫలితాలు, రుతుపవనాల సంకేతాలు, అంతర్జాతీయ అంశాలు మార్కెట్ సెంటిమెంట్ ను ఖరారు చేస్తాయని కొటక్ సెక్యురిటీస్ ప్రైవేట్ క్లెయింట్ గ్రూప్ రీసెర్చర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెండ్ దిపెన్ షా పేర్కొన్నారు. నత్తనడకన సాగిన పారిశ్రామిక ఉత్పత్తి డేటా, ఏప్రిల్ నెల వినియోగదారుల ద్రవ్యోల్బణం పెరగడం గతవారం మార్కెట్ ను కొంత ప్రభావితం చేశాయి. ఆఖరికి 261 పాయింట్లు పెరిగి, 25,489.57 వద్ద సెన్సెక్స్ ముగిసింది. -
విజయ్ మాల్యాను వెనక్కి రప్పిస్తాం
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టిన విజయ మాల్యాను స్వదేశానికి రప్పించే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) స్పందించింది. అతడిని విచారణ నిమిత్తం భారత్ కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తొమ్మిదివేల కోట్ల బ్యాంకు రుణ కుంభకోణం కేసుకు సంబంధించి మాల్యాపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిపింది. తన విదేశీ ఆస్తుల వివరాలను అడిగే అధికారం బ్యాంకులకు లేదని, తన భార్యా, పిల్లలు ఎన్నారైలు కావడంతో తన ఆస్తుల వివరాలను వెల్లడించక్కర లేదని మాల్యా ఇప్పటికే సుప్రీం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్యా కేసుపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఈడీ సంప్రదించింది. దీంతో మాల్యా తమ న్యాయవాదులకు అందుబాటులో ఉన్నారని, అతడిని వెనక్కి తీసుకు వచ్చేందుకు (డిపోర్టేషన్) తదుపరి చర్యలకు అనుమతి కోరుతూ ఈడీ ఇచ్చిన అభ్యర్థన తమ శాఖకు అందిందని, ఆయా విషయాలపై తాము న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. మాల్యాను స్వదేశానికి రప్పించే డిపోర్టేషన్ ప్రక్రియ ప్రారంభించాలంటూ విదేశీ వ్యవహారాల శాఖను ఈడీ గురువారం ఆశ్రయించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సీఎన్) వచ్చేలా సీబీఐ కి త్వరలోనే ఈడీ లేఖ రాయనుంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు తీసుకున్న రుణంలో మాల్యా 430 కోట్ల రూపాయల వరకూ విదేశాలకు మళ్ళించారన్నది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదన. ఇదే కేసుపై విచారించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతవారం మాల్యా దౌత్య పాస్ పోర్ట్ ను సస్పెండ్ చేసింది. అయితే సదరు వ్యాపారవేత్త డబ్బు లావాదేవీల్లో చట్టాన్ని ఉల్లంఘించారని, కేసు విచారణకు సరిగా సహకరించడంలేదని ఈ నేపథ్యంలో మాల్యా పాస్ పోర్టు ఎందుకు రద్దు చేయకూడదంటూ ఈడీ ప్రశ్నిస్తోంది. -
ఆపరేషన్లకూ యూట్యూబే ఆధారం!
ఏదైనా కొత్త వంట గురించి తెలుసుకోవాలంటే గృహిణులు వెంటనే చూసేది.. యూట్యూబ్. కానీ ఇప్పుడు ఈ ఆన్లైన్ మాయాజాలం వైద్యరంగాన్ని కూడా వదలడం లేదు. నిపుణులు సైతం ఆపరేషన్లలో సరికొత్త పద్ధతులు తెలుసుకోడానికి యూట్యూబ్ లాంటి ఆన్లైన్ మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారట. ఆమెరికన్ అకాడమీ ఆఫ్ ఫేషియల్ ప్లాస్టిక్ అండ్ రీ కనస్ట్రక్టివ్ సర్జరీ (ఏఏఎఫ్పీఆర్ఎస్)కి చెందిన బృందం జరిపిన సర్వేలు యూట్యూబ్ వాడకంపై కొత్త విషయాలను వెల్లడించాయి. ప్లాస్టిక్ సర్జరీల విషయంలో వస్తున్న కొత్త పద్ధతుల గురించి యూట్యూబ్‌లో చూడటంతో పాటు.. వాటిని ఆచరణలో కూడా పెడుతున్నట్లు భారత సంతతికి చెందిన అనిత్ సెత్నా బృందం చేసిన అధ్యయనాల్లో కనుగొన్నారు. ఏఏఎఫ్పీఆర్ఎస్ సభ్యులు కొందరితో సర్వే చేయగా.. మొత్తం 202 మంది దానికి స్పందించారు. సాంకేతిక, సాంకేతికేతర విషయాలు తెలుసుకోడానికి ప్రధానంగా సమావేశాల్లో పాల్గొనడం, జర్నల్స్ చదవడం, సహోద్యోగులతో చర్చించడం లాంటివి ఉపయోగపడుతున్నాయి. అయితే.. సర్వేలో పాల్గొన్నవారిలో 64.1 శాతం మంది మాత్రం.. రైనో ప్లాస్టీ, సూదులతో చేసే చికిత్సా విధానాలను, అందులోని కొత్త పద్ధతులను తెలుసుకునేందుకు కనీసం ఒక్కసారైనా తాము యూట్యూబ్ వీడియోలు చూసినట్లు చెప్పారు. వాళ్లలో 83.1 శాతం మంది ఏకంగా తాము అలా చూసిన పద్ధతులను ఆచరణలో కూడా పెడుతున్నట్లు చెబుతున్నారు. అనుభవం ఉన్న వాళ్ల కంటే.. అంతగా అనుభవం లేనివాళ్లు ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారట. ఇంటర్నెట్ ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడం వరకు బాగానే ఉంది గానీ, ఆయా ఆపరేషన్ల నాణ్యత విషయంలోనే ఆందోళన వ్యక్తమవుతోందని సెత్నా బృందం తెలిపింది. వీరి పరిశోధన వ్యాసం జామా ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ జర్నల్‌లో ప్రచురితమైంది. -
నిద్ర ప్రియులకు హెచ్చరిక
న్యూయార్క్: నిద్ర ప్రియులకు హెచ్చరిక. అతి నిద్ర ఏమాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఎనిమిది గంటలు మించి నిద్రపోతూ ఉంటే వారు ఏక్షణమైనా సమస్యల వలయంలో చిక్కుకోవచ్చని హెచ్చరిస్తున్నారు. వీరికి గుండెపోటు వచ్చేందుకు 146శాతం అధికంగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏడు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే నిద్రపోయి తప్పనిసరిగా వ్యాయామం చేసేవారు మాత్రం జీవితాంతం ఎలాంటి ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కోకుండా హాయిగా బతికేయొచ్చని కూడా వారు సెలవిస్తున్నారు. ఇప్పటి వరకు అత్యంత ప్రాణాలు హరించే వాటిల్లో తొలి రెండు స్థానాల్లో గుండెపోటు, క్యాన్సర్ ఉండగా దాని అనంతరం కూడా అతి నిద్ర వల్ల వచ్చే గుండె పోటేనని చెప్తున్నారు. ప్రతి ఏడాది బ్రిటన్‌లో దాదాపు లక్షమంది గుండెపోటుకు గురవుతుండగా వీరిలో సగానికిపైగా అతి నిద్రకు అలవాటైన వారే ఉన్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధనను అమెరికాకు చెందిన న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన అధ్యయనకారులు చేశారు. ఎంతలేదన్నా కనీసం రోజుకు 30 నుంచి 60 నిమిషాలపాటు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి సురక్షితం అని చెప్పారు. -
కంటినిండా నిద్రతో పక్షవాతం దూరం!
పరిపరి శోధన కంటినిండా నిద్రపోవాలి. లేకపోతే ఒక్కోసారి అది పక్షవాతానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కంటినిండా నిద్రించకపోతే అది మెదడును చురుగ్గా పనిచేయేనివ్వదని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఆ అధ్యయనం వివరాలివి... వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర వ్యవధి తగ్గుతుంటుంది. నిద్రపట్టే వ్యవధి తగ్గుతున్న కొద్దీ మెదడులోని కణాలకు పుష్కలంగా ఆక్సిజన్ అందడమూ తగ్గుతుంది. దాంతో మెదడులో అప్పటికే మనం నేర్చుకున్న పరిజ్ఞానాల విషయంలోనూ లోపం ఏర్పడుతుందంటున్నారు కెనడాకు పరిశోధకులు. ఇది మన నైపుణ్యాలనే కాకుండా మన జ్ఞాపకశక్తినీ దెబ్బతీస్తుందని పేర్కొంటున్నారు. సీనియర్ సిటిజెన్లలు కొందరిపై నిర్వహించిన ఈపరిశోధనల్లో సరిగా నిద్రపోలేని వారిలో మెదడుకు మంచి రక్తం అందించే రక్తనాళాలు తమ మృదుత్వాన్ని కోల్పోయి కాస్త గట్టిబారినట్లు కూడా గుర్తించారు. దాంతో ఒక్కోసారి పక్షవాతమూ రావచ్చు అని అధ్యయనవేత్తలు తెలుపుతున్నారు ఈ వివరాలన్నీ కెనడా చెందిన ‘స్ట్రోక్’ అనే మెడికల్ జర్నలో ప్రచురించారు. ‘పెద్ద వయసు వారిలో నిద్రపోయే సమయం తగ్గినా, నిద్ర నాణ్యత బాగుండేలా, ఆ వయసుకు తగిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం అవసరమని పరిశోధకులు సూచన. -
గ్రీనరీలకన్నా సీనరీలే ఆరోగ్యం!
అందమైన నగరాల్లో నివసించడం గ్రామజీవనం కన్నా ఆరోగ్యకరం అంటున్నారు అధ్యయనకారులు. నగరాల్లో ఉండే ఓ మంచి సీనరీ... గ్రామాలు, పట్టణాల్లోని గ్రీనరీ (పచ్చదనం) కన్నా సానుకూల వాతావరణాన్ని సృష్టించడంతోపాటు... మానసిక, శారీరక శ్రేయస్సును మెరుగు పరిచేందుకు, ఉపయోగపడుతుందని చెప్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని నదులు, పచ్చదనం కన్నా... నగరాల్లో అత్యంత సుందరమైన సీనరీల్లో ఉండే గోధుమ, బూడిద, నీలం రంగులు...వ్యక్తి భావాలను ఆకట్టుకుంటాయని అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి. థేమ్స్ నదిలో రవాణా జరిపే కార్గో ఓడలు, సెంయింట్ పాల్ కేథడ్రాల్ వ్యూ వంటివి... కొండలు, విస్తారమైన అడవుల్లో నడవటం కన్నా.. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. వార్విక్ బిజినెస్ స్కూల్ విద్యావేత్తల సర్వేలో భాగంగా బ్రిటన్ కు చెందిన 212,000 చిత్రాలను చూపించి వాటిపై ప్రజలను రేటింగ్ చేయమని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా ప్రాంతాల్లో నివసించే 1.5 మిలియన్ల జనాభా వారి ఆరోగ్యం గురించి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీన్నిబట్టి పరిశోధకులు అత్యంత సుందరమైన, అభివృద్ధి చెందిన నగరాలతో పోలిస్తే పచ్చని గ్రామాల్లో ఆరోగ్యం, అనందం అంతగా లేవని తేల్చారు. కేవలం ఓ పచ్చని ప్రాంతం.. సీనరీల్లో ఉండే మంచి అనుభూతిని, ఆనందాన్ని ప్రేరేపించడం లేదని తమ సర్వే ద్వారా తెలిసినట్లు బిజినెస్ స్కూల్ పీహెచ్ డి విద్యార్థి ఛనూకి తెలిపారు. వాతావరణంలోని అందాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. కేవలం పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంవల్ల ఉపయోగం ఉండదన్నారు. స్థానికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పట్టణాల్లో ప్రణాళికా బద్ధంగా పార్కులు, హౌసింగ్, రహదారులు వంటి నిర్మాణాలు చేపట్టాలని... పర్యావరణాన్ని అందంగా తీర్చి దిద్దడంవల్ల ఆరోగ్యంగా ఉండగల్గుతారని సర్వేలు సూచిస్తున్నట్లు తెలిపారు. తాము జరిపిన సర్వే ద్వారా సీనరీలు ఆరోగ్యం మధ్య చూసిన సంబంధం, ప్రయోజనకర ప్రభావాలు... హరిత ప్రదేశాల్లో కనిపించడం లేదని బిజినెస్ స్కూల్ కు చెందిన బిహావియరల్ సైన్స్ ల్యాబ్ సహదర్శకుడు, అసోసియేట్ ప్రొఫెసర్ సూజీ మాట్ వెల్లడించారు. గతంలో మనం నమ్మే పచ్చదనం ఆరోగ్యానికి శ్రేయస్కరం అన్న నమ్మకాన్ని వదిలి... దైనందిన జీవితంలో పర్యావరణ ప్రాముఖ్యతకే ప్రాధాన్యతను ఇవ్వవచ్చని తమ సర్వే ఫలితాలద్వారా తెలుస్తోందంటున్నారు. -
ఆడపిల్లకు ఎన్ని శోకాలో
ఆడపిల్ల పుడితే ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్లేనంటారు.. కానీ నేడు ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే పిండదశలోనే తుంచేస్తున్న దుస్థితి నెలకొంది. మరికొందరు ఆడపిల్ల పుట్టిందంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నెలల వయస్సులోనే మృత్యువాత పడుతుండగా, మరికొందరు కన్నపేగు బంధాన్ని తెంచుకుంటూ చెత్తకుప్పలపాలు చేస్తున్నారు. జిల్లాలో కొనసాగుతున్న భ్రూణహత్యలపై కథనం.. - గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు - గూడూరులో వెలుగుచూసిన తాజా ఉదంతం - వైద్యాధికారుల విచారణ చిట్టితల్లుల్ని చిదిమేస్తున్నారు. పసిమొగ్గల్ని పిండదశలోనే పిండేస్తున్నారు. పురిటి నొప్పులు భరించి.. చావుకు దగ్గరగా వెళ్లి తనకు జన్మనిచ్చే అమ్మ.. జీవితాంతం కలిసి ఉండే భార్య కూడా ఆడవారేనని మరిచిపోతున్న మగాడు తన కూతురు విషయం వచ్చేసరికి అన్నీ మరిచి మృగాడవుతున్నాడు. తాజాగా మచిలీపట్నంలో చోటుచేసుకున్న ఉదంతం జిల్లాలో భ్రూణ హత్యలపై భయాందోళనను రెట్టింపు చేస్తోంది. లబ్బీపేట : జిల్లాలో బాలబాలికల నిష్పత్తి తగ్గిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరేళ్ల వయస్సులోపు పిల్లల్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా జిల్లాలో ప్రతి వెయ్యిమంది బాలురకు 934 మంది మాత్రమే బాలికలు ఉన్నట్లు నివేదికలు చెపుతున్నాయి. ఈ పరిస్థితి మారకపోతే రానున్న కాలంలో బాల, బాలికల మధ్య నిష్పత్తి మరింత ప్రమాదకరస్థాయికి దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చర్యలు తీసుకుంటున్నా, అధిక ఫీజులకు ఆశపడి అత్యాసతో కొందరు వైద్యులు పరీక్షలు చేస్తూనే వున్నారు. అందుకు మచిలీపట్నంలో చోటుచేసుకున్న ఘటనే నిదర్శనంగా నిలుస్తుంది. అసలేం జరిగిందంటే... గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన పేరం నాగబాబుకు పమిడిముక్కల మండలం సోరగుడికి చెందిన దుర్గాదేవితో ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఐదేళ్లు, రెండేళ్లు వయస్సుగల ఇద్దరు ఆడపిల్లలు వున్నారు. మళ్లీ గర్భం దాల్చడంతో ఓ ఆర్ఎంపీ వైద్యుని సూచనతో మచిలీపట్నంలోని ప్రసూతి ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యురాలు పరీక్షలు చేసి స్కానింగ్ రాయడంతో, దుర్గాదేవి భర్త నాగబాబు, అత్త నీలావతి లింగనిర్ధారణ పరీక్షకు పూనుకున్నారు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. చివరికి అబార్షన్ వికటించడంతో తల్లి ప్రాణాపాయస్థితికి చేరుకుంది. నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే.. గర్భస్రావం భార్యాభర్తల ఇష్టపూర్వకంగానే చేయాల్సి వుంది. గర్భం దాల్చిన 12 వారాల లోపు గర్భస్రావం చేయడం సురక్షితమని నిపుణులు చెపుతున్నారు. అ తర్వాత 12 నుంచి 18 వారాలమధ్య నిపుణులైన వైద్యులు గర్భస్రావం చేయాల్సి వుంది. అనంతరం గర్భస్రావం చేయడం తప్పనిసరైతే ఇద్దరు గైనకాలజిస్టుల పర్యవేక్షణలోనే చేయాలి. కానీ ఆరోనెల గర్భం సమయంలో దుర్గాదేవికి నిర్లక్ష్యంగా గర్భస్రావం చేయడం వల్లనే ప్రాణాపాయస్థితికి చేరుకున్నట్లు చెపుతున్నారు. నాపై ఒత్తిడి తెచ్చారు..దుర్గాదేవి గర్భస్రావం చేయించుకోవాలంటూ తనపై భర్త నాగబాబు, అత్త నీలావతి ఒత్తిడి చేసినట్లు వైద్య సిబ్బందికి దుర్గాదేవి చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా రూ.10 వేలు ఇచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించినట్లు ఆమె సోదరుడు శివనాగరాజు చెపుతున్నారు. గర్భస్రావమైన తర్వాత కూడా పూర్తిస్థాయి చికిత్స చేయించకుండా ఇంటికి తీసుకెళ్లడం వలనే ఇన్ఫెక్షన్ సోకి, పరిస్థితి విషమించినట్లు వైద్యులు చెపుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ త్రిపురసుందరీదేవి ‘సాక్షి’కి తెలిపారు. గుట్టు చప్పుడు కాకుండా లింగనిర్ధారణ.. జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు దుర్గాదేవి ఘటన బట్టి తెలుస్తోంది. ఏడాదిన్నర కిందట గుంటూరుకు చెందిన మహిళకు నగరంలో లింగనిర్ధారణ పరీక్ష లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం దుర్గాదేవి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెలుగు చూసింది. వైద్య ఆరోగ్యశాఖాధికారుల విచారణ.. దుర్గాదేవి ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఆర్ నాగమల్లేశ్వరి విచారణ చేపట్టినట్లు ‘సాక్షి’కి తెలిపారు. గర్భస్రావం చేసిన ఆస్పత్రికి వెళ్లి విచారణ జరపడంతో పాటు, ఆమెను ఆస్పత్రికి ఎవరు తీసుకు వచ్చారు.. ఎప్పుడు గర్భస్రావం చేసారనే విషయాలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. స్కానింగ్ ఎక్కడచేయించారనే విషయం తెలియాల్సి ఉందన్నారు. -
బీట్రూట్ రసంతో బీపీ దూరం..
బీట్రూట్ తరచుగా వాడే కూరగాయల్లో ఒకటి. దీనిని వండి తినడం కంటే, నేరుగా తినడమే మేలని నిపుణులు చెబుతున్నారు. పచ్చిముక్కలను తినడం కష్టమనుకుంటే, చక్కగా జ్యూస్ తయారు చేసుకొని తాగొచ్చు. బీట్రూట్ రసం తాగడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఎనిమిది ఔన్సుల చొప్పున బీట్రూట్ రసం తాగిన వారిలో రక్తపోటు గణనీయంగా అదుపులోకి వచ్చినట్లు ‘హైపర్ టెన్షన్’ జర్నల్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. బీట్రూట్లో ఉండే నైట్రేట్లు రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయని, వాటి ఫలితంగానే రక్తపోటు క్రమంగా అదుపులోకి వస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. -
నేడే ఎంసెట్.. సర్వం సిద్ధం
-
నేడే ఎంసెట్.. సర్వం సిద్ధం
ఖమ్మం: ఎంసెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నెలరోజులుగా ఈ పరీక్ష కోసం యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఖమ్మం, కొత్తగూడెం పట్టణాల్లో గురువారం జరిగే పరీక్షలకు 42 కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో 21,543 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 4 వేల పై చిలుకు విద్యార్థులు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిరాసే వారు కావడం గమనార్హం. ఖమ్మంలో 20 కేంద్రాలలో 10,182 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, 14 కేంద్రాలల్లో 7,058 మంది అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులు ఉండగా... కొత్తగూడెంలోని 5 కేంద్రాల్లో 2,915 మంది ఇంజినీరింగ్, మూడు కేంద్రాల్లో 1,388 మంది అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వాహణ, ఇతర ఏర్పాట్ల కోసం జిల్లా కలెక్టర్ ఇలంబరితి, అదనపు కలెక్టర్ బాబురావు, జేఎన్టీయూ వైస్ చాన్సలర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు పలుమార్లు సమీక్షించారు. పర్యవేక్షణ కట్టుదిట్టం ఈ పరీక్షల నిర్వహణ కోసం 42 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 42 మంది చీఫ్ అబ్జర్వర్స్‌తో పాటు 898 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు మెడికల్, అగ్రికల్చర్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని జిల్లా కో-ఆర్డినేటర్ పుష్పలత చెప్పారు. విద్యార్థులు పరీక్ష సమయూనికి గంట ముందుగా రావాలన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. జేఎన్టీయూ నుంచి ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాలు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను నియమించారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్, పోలీస్, మున్సిపాలిటీ అధికారుల సేవలు వినియోగించుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల కోసం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఇతర కూడళ్ల వద్ద హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు చేర్చేందుకు ఇంజినీరింగ్ కళాశాలలు బస్సు సౌకర్యాన్ని కల్పించాయి. మాస్ కాపీయింగ్ నియంత్రణకు.. మాస్ కాపీయింగ్ నియంత్రణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఖమ్మం, కొత్తగూడెం కన్వీనర్లు మాలోజి పుష్పలత, శ్రీనివాస్ తెలిపారు. చేతి గడియారాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చి, సెల్ఫోన్లు, ఇతర పరికరాలతో మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చారుు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు కూడా చేతిగడియారాలు పెట్టుకొని రావడం, సెల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడాన్ని నిషేధించారు. ప్రతి పరీక్ష హాల్లో గోడగడియూరం ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు కళాశాల యూజమాన్యాలు అటువైపు రావద్దని ఆదేశించారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నా చీఫ్ సూపరింటెండెంట్, చీఫ్ అబ్జర్వర్స్దే బాధ్యతని పేర్కొన్నారు. ఏపీ నుంచి 4వేల మంది.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 4వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఎంసెట్‌లో 15 శాతం నాన్‌లోకల్ కోటా ఉండటం, ఏపీలో ఈ పరీక్షలు ఇప్పటికే జరగడంతో నాన్‌లోకల్ అభ్యర్థులు జిల్లాలో భారీ సంఖ్యలో పరీక్ష రాస్తున్నారు. ఏపీ సరిహద్దులో జిల్లా ఉండటంతో ఎక్కువ మంది దీన్ని ఎంచుకున్నారు. -
కొంచెం కష్టం... ఫలితం అధికం
ఇంటర్... భవిష్యత్ నిర్దేశించే కీలక సమయం. మూడు రోజుల్లోనే ఫైనల్ పరీక్షలు... ఆ వెంటనే ఐఐటీ- జేఈఈ, ఎంసెట్ తరుముకుంటూ వచ్చేస్తున్నాయి. ఏడాది పొడవునా కష్టపడినా కాస్తంత మెలకువలు పాటించకుంటే ఆ కష్టమంతా వృథా అయిపోతుంది. చిన్నపాటి సూచనలు పాటిస్తే మంచి మార్కులు సాధించవచ్చంటున్నారు నిపుణులు. ఇంకెందుకాలస్యం... ఆచరించండి.. మంచి ఫలితాలు సాధించండి. ఆల్ ది బెస్ట్. - గుంటూరు ఎడ్యుకేషన్ మరో మూడు రోజుల్లో ఇంటర్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఉన్నత భవితను వెతుక్కుంటూ ఏడాది పొడవునా శ్రమించిన విద్యార్థులు చదివిన అంశాలను పేపర్‌పై పెట్టే సమయం వచ్చేసింది. దీంతో పాటు ఐఐటీ-జేఈఈఈ, ఎయిమ్స్, ఎంసెట్ వంటి జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు పోటీ పరీక్షలకు సింహద్వారం వంటి ఇంటర్ దశలో తడబడకుండా ముందుడుగు వేయాలి. ఐఐటీ-జేఈఈఈ, ఎంసెట్ పరీక్షల్లో ఇంటర్మీడియేట్ మార్కులకు ఉన్న వెయిటేజీ దృష్ట్యా విద్యార్థులు అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతో అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇందుకు పాఠ్యాంశాల పునశ్చరణ, ప్రాధమిక సూత్రాలను పాటించడం ద్వారా నూరు శాతం మార్కులు సాధించవచ్చంటున్నారు సబ్జెక్టు నిపుణులు. ఈ నెల 11వ తేదీన ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో 98,090 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అత్యధిక విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్‌పైనే దృష్టిసారిస్తున్నారు. తరువాతి స్థానిలో చార్టెడ్ అకౌంటెంట్స్ కావాలన్న యోచనతో కామర్స్ ఎంచుకుంటున్నారు. సూత్రాల అధ్యయనంతో గణితంలో విజయం గణితం పేపర్-1లో అధిక మార్కులు సాధించేందుకు ప్రధమ సంవత్సర విద్యార్థులు సలభమైన సూత్రాలను పాటించాలి. కొత్త అంశాల జోలికి వెళ్ళకుండా చదివినవే రివిజన్ చేసుకోవాలి. సమస్యాత్మకమైన ప్రశ్నలను ముందు గా పరిష్కరించేందుకు ప్రయత్నించడం వల్ల సమయం వృధా అవుతుంది. ఫంక్షన్స్, ధీరమ్స్, డొమైన్, రేంజ్, హైపర్ బోలిక్ ఫంక్షన్స్, వెక్టార్స్ విభాగాలను గుర్తుంచుకోవాలి. ఇన్వర్ట్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఉన్న ఎత్తులు, దూరాలు, పరిష్కార మార్గాలు, మ్యాట్రిస్లో డిఫనేషన్స్ ఉదాహరణలు, లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఫార్ములా బేస్డ్, ప్రాధమిక సూత్రాలను అధ్యయనం చేయాలి. తప్పులు, అంచనాలు, రోల్స్, లెగ్రైండ్, ధీరమ్స్, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ ఫంక్షన్స్, త్రీడీలో డిసీజ్, డీఆర్సీ, ప్లేన్స్‌లో రెండు మార్కుల లెక్కలకు సమాధానాలను సిద్ధం చేసుకోవాలి. గరిష్ట మార్కుల సాధన పునశ్చరణపైనే ఆధారపడి ఉంటుంది. పి. అంకినీడు ప్రసాద్, గణిత శాస్త్ర అధ్యాపకుడు సీనియర్ ఇంటర్ విద్యార్థులు శ్రమించాల్సిందే పోటీ పరీక్షలకు హాజరయ్యే సీనియర్ ఇంటర్ విద్యార్థులు గణితంపై కొద్దిగా శ్రమిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. మిగతా సబ్జెక్టుల కంటే గణితంలో నూటికి నూరు మార్కులు సాధనకు ఎక్కువ అవకాశాలున్నాయి. కాంప్లెక్స్ నంబర్స్, డీమోవర్స్, థీరంలో పోలార్ ఫామ్, లోకస్ గుర్తుంచుకోవాలి. కోడ్రాడిక్ ఈక్వేషన్స్‌లో రెసిప్రోకల్ ఈక్వేషన్స్, రేంజ్ ప్రాబ్లమ్స్, బైనామియల్ ధీరమ్లో కో-ఎఫిషియెంట్, న్యూమర్రీకల్లీ గ్రేటెస్ట్, ఇన్ ఫైనిట్ సిరీస్‌కు సంబంధించిన అంశాలు ముఖ్యమైనవి. ప్రీబబుల్టీ అండ్ రాండమ్ వేరియబుల్‌లో నిర్వచనాలు, స్టాటిస్టిక్స్‌లో ఫార్ములాలు, కాలిక్యులేషన్స్ ఎక్కువగా చేయాలి. క్రానిక్స్ విభాగంలో థీరమ్స్, ఫార్ములా, ఏరియాస్‌లో డయాగ్రమ్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్లు, అర్డర్ అండ్ డిగ్రీ, మోడల్ ప్రాబ్లమ్స్, ఇంటిగ్రేషన్స్లో అన్ని ఫార్ములాలు చేయాలి. వి.వెంకట్రావు, గణిత శాస్త్ర అధ్యాపకుడు కాస్తంత కష్టపడితే బోటనీలో అధిక మార్కులు పటాలను గీయడం ద్వారా బోటనీలో అధిక మార్కులు సాధించవచ్చు. స్వల్ప సమాధాన ప్రశ్నలను పునశ్చరణ చేసుకోవాలి. పటాలు గీసేటప్పుడు భాగాలను తప్పనిసరిగా గుర్తించాలి. జూనియర్, సీనియర్ విద్యార్థులు వేరు, కాండ రూపాంతరాలు, అనిశ్చిత పుష్ప విన్యాసం, ఫలదీకరణ, పిండాకార నిర్మాణం, వేరు, కాండం, పత్ర అంతర్నిర్మాణాలను పటాలతో సహా నేర్చుకోవాలి. ఆవరణ శాస్త్రం నుంచి ఆరు మార్కులకు రానుండటంతో అధికంగా పునశ్చరణ చేసుకోవడం మేలు. కణజాలు, ప్రధమ దశ-1లో ఉప దశలు, క్రోమోజోముల వర్గీకరణ, సమవిభజన, అసమ విభజన, మద్యభేదాలను అధ్యయనం చేయాలి. సీనియర్ ఇంటర్ విద్యార్థులు వృక్ష శరీర ధర్మ శాస్త్రం నుంచి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను దీర్ఘ సమాధాన ప్రశ్నలను అధ్యయనం చేయాలి. కెల్విన్ వలయం, గ్లెకాలసిస్, క్రెబ్స్ వలయం, డీఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానం, కణజాల వర్ణనం తదితర అంశాలను క్షుణ్ణంగా చదవాలి. కణజాల వర్ణనంలో ఫ్లో చార్ట్ గీయడం ద్వారా అధిక మార్కులు సాధించవచ్చు. డీఎన్ఏ, ఆర్ఎన్ఏ మద్య భేదాలు కనుగొనడంపై దృష్టి సారించాలి. ఏ చాప్టర్ నుంచి 8 మార్కుల ప్రశ్నలు వస్తాయో గుర్తించి, చదివిన అంశాలనే ఎక్కువగా పునశ్చరణ చేసుకోవాలి. చిత్రపటాలు, ఫ్లో చార్టులు గుర్తుంచుకోవాలి. - ఎం. రాజేంద్రప్రసాద్, బోటనీ అధ్యాపకుడు జీవశాస్త్రంలో ప్రతిభ చూపవచ్చు జూనియర్ ఇంటర్లో 4, 7, 8 యూనిట్ల నుంచి ఎనిమిది మార్కుల ప్రశ్నలకు ఆయా యూనిట్లలో దీర్ఘరూప సమాధాన ప్రశ్నలను పటాలతో సహా అధ్యయనం చేయాలి. యూనిట్-4లో బొద్దింక గురించి ఒక పటం తప్పనిసరిగా అడుగుతారు. ప్రతి పాఠ్యాశం వెనుక ఇచ్చిన ప్రశ్నలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. 4, 8 మార్కుల ప్రశ్నలకు అనుబంధంగా పటాలు ఉంటే తప్పకుండా గీయాలి. రెండు మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు ఒకటి నుంచి 10 వరకూ అదే వరుస క్రమంలో ఒకే చోట రాయాలి. జవాబు రాసేటప్పుడు సమయపాలన ముఖ్యం. 4 మార్కుల ప్రశ్నలకు 60 నుంచి 70 నిమిషాలు, మిగిలిన సమయాన్ని 8 మార్కుల ప్రశ్నలకు కేటాయించుకోవాలి. సీనియర్ ఇంటర్లో మానవ అంతర్నిర్మాణం నుంచి దీర్ఘరూప సమాధాన ప్రశ్నలు, జన్యుశాస్త్రం అధ్యయనం చేయాలి. దంతం నిలువుకోత, మూత్ర పిండం నిలువుకోత, నెఫ్రాన్ నిర్మాణం, కశస్త్రమ దండం అడ్డుకోత పటాలను ప్రాక్టీస్ చేయాలి. జన్యుశాస్త్రంలో క్రిస్-క్రాస్ అను వంశిక, బహుళ యుగ్య వికలక్షణాలు, రక్త వర్గాలు, డ్రాసోఫిలాలో లింగ నిర్ధారణ చదవాలి. జీవ పరిణామశాస్త్రంలో లామార్కిజం, డిర్వినిజం, మానవ పరిణామం గురించి అధ్యయనం చేయాలి. - ఎ. ప్రసాద్‌బాబు, జీవశాస్త్ర అధ్యాపకుడు మెలకువలతో ఫిజిక్స్‌లో మంచి ఫలితాలు ఎక్కువ మంది విద్యార్థులు కష్టమని భావించే భౌతికశాస్త్రంలో మెలకువలు పాటించడం ద్వారా అధిక మార్కులు సాధించే వీలుంది. ప్రధమ సంవత్సర విద్యార్థులు సమతలంలో చలనం, గమన నియమాలు, కణాల వ్యవస్థలు, భ్రమ గమనం, గురుత్వాకర్షణ, ఘన పదార్థాల యాంత్రిక ధర్మాలు, పదార్ధ ఉష్ణ ధర్మాలు, అణుచలన సిద్ధాంతం, గమన నియమాలు, పని, సామర్ధ్యం శక్తి, డోలనాలు, ఉష్ణ గణితశాస్త్రం పాఠ్యాంశాలు చదవాలి. ద్వితీయ సంవత్సర విద్యార్థులు దృశాశాస్త్రం, తరంగ శాస్త్రం, విద్యుదావేశాలు, క్షేత్రాలు, స్థిర విద్యుత్ పొటెన్షియల్, కెపాసిటర్స్, విద్యుత్ ప్రవాహం, అయస్కాంతత్వం, పదార్ధం, వికిరణాల ద్వంద్వ స్వభావం, పదార్ధం, ఏకముఖ విద్యుత్, అర్థవాహక పరికరాలు పాఠ్యాంశాల్లోని 4 మార్కుల ప్రశ్నలను బాగా ప్రాక్టీసు చేయాలి. తరంగాలు, ఆవేశాల చలనం, అయస్కాంతత్వం, పరమాణువులు, కేంద్రకాలు, చాప్టర్ల నుంచి 8 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు కోసం శ్రమించాలి. - ఎస్. మస్తాన్ సాహెబ్, భౌతికశాస్త్ర అధ్యాపకుడు మౌలిక భావనలతోనే కెమిస్ట్రీ ఈజీ రసాయన శాస్త్రంలో మౌలిక భావనలపై దృష్టి సారించాలి. ప్రథమ సంవత్సరంలో పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక నుంచి 8 మార్కుల ప్రశ్నలు వస్తాయి. రసాయన బంధం, కర్బన రసాయ శాస్త్రంలో నామకరణం, ఒక పదార్థం నుంచి వేరొక దానిని రాబట్టటంపై దృష్టి సారించాలి. స్టాకియోమెట్రిలో మొలారిటీ నార్మాలిటీ, అను భావిక, అణుఫార్మలాతో వాయు స్థితిలో అణుమేఘాలకు సంబంధించిన సమస్యలు సాధన చేయాలి. ద్వితీయ సంవత్సరంలో రసాయన గణితశాస్త్రం, విద్యుత్ రసాయనశాస్త్రం, కర్బన రసాయన శాస్త్రంపై అధిక దృష్టి సారించాలి. లఘు ప్రశ్నలకు దైనందిన జీవితంలో రసాయన శాస్త్రం, పరివర్తన మూలకాలు, లోహ సంగ్రహణం, జీవాణువులు, కర్బన రసాయన శాస్త్రంలో నామకరణ చర్యలపై అధిక దృష్టి సారించాలి. సమస్యలపై ద్రావణాలు, విద్యుత్ రసాయన శాస్త్రం, ఘన స్థితిపై దృష్టి నిలపాలి. - ఫ్రాన్సిస్ జేవియర్, రసాయనశాస్త్ర అధ్యాపకుడు -
నిపుణులను నియమించుకోండి
సాక్షి, హైదరాబాద్: వాటర్ గ్రిడ్ తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టు అని, దీని పనుల కోసం జాతీయస్థాయిలో ప్రకటనలు ఇచ్చి నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి తారకరామారావు అధికారులకు సూచించారు. అవసరమైతే ప్రైవేటు సెక్టార్ నుంచి సిబ్బందిని తీసుకోవాలన్నారు. మంగళవారం ఆయన గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్ పనులను వేగవంతం చేసేందుకు ఈ విభాగంలో ఖాళీగా ఉన్న 592 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. ప్రాజెక్టులో పనిచేయనున్న అధికారులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న సిబ్బందికి శిక్షణనిచ్చి, ప్రాజెక్టు ప్రాధాన్యతపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. వాటర్‌గ్రిడ్ లైన్ సర్వే వివరాలు త్వరలోనే అందనున్నాయని, ప్రాజెక్టు నిమిత్తం అవసైరమెన ప్రాంతాల్లో భూసేకరణ వివరాలను ఒకట్రెండు రోజుల్లో అందజేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు స్థితిగతులపై తనతో పాటు ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తారని మంత్రి తెలిపారు. డిసెంబర్లో పైలాన్ ఆవిష్కరణ మొదటి దశలో చేపట్టనున్న ఆరు గ్రిడ్ల కోసం జనవరి 30నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని, ఫిబ్రవరి 10 నుంచి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు. డిసెంబర్లో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పైలాన్‌ను మునుగోడులో సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి, అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఈలు పాల్గొన్నారు. -
దరఖాస్తుల గడువు 20వరకు పొడిగింపు
-
పకడ్బందీగా దరఖాస్తుల విచారణ
మహబూబ్‌నగర్ టౌన్: ఆహారభద్రత, పింఛన్లకు వచ్చిన దరఖాస్తులపై విచారణ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శిని అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చిన ప్రతి దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి, సమగ్ర సమాచారంతో విచారణకు వెళ్లాలన్నారు. దరఖాస్తు చేసుకొన్న వారు చెప్పే సమాచారాన్ని సమగ్ర సమాచారంతో తనిఖీ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 15తో గడువు ముగియనున్నందున, 16నుంచి ఇంటింటి తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాల్సినందున విచారణ బృందం అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి మండలానికో బృందాన్ని నియమించామని వారికి బుధవారం ఆర్డీఓలు నియామక ఉత్తర్వులను అందజేయూలన్నారు. నిబంధనల ప్రకారమే లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అర్హులను ఎంపిక చేయూలన్నారు. ఈవిషయంలో ఎవ్వరైనా నిబంధనలను పక్కన పెట్టి అనర్హులను ఎంపికచేసినట్లు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రుణాల అందజేత కార్యక్రమాన్ని వేగవంతం చేసి రెండురోజుల్లో లక్ష్యాన్ని అధిగమించాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో జేసి ఎల్.శర్మన్, ఏజేసి రాజారాం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తగా సేకరించాలి క్లాక్‌టవర్ (మహబూబ్‌నగర్): ఆహారభద్రత, పింఛన్లకు వచ్చే ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా సేకరించాలని జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శిని సిబ్బందికి సూచించారు. మంగళవారం స్థానిక మోనప్పగుట్ట, మోడల్ బేసిక్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి వార్డులో ఏర్పాటు చేసిన కౌంటర్లకు వచ్చే వారందరి నుంచి దరఖాస్తులు స్వీకరిం చి, రికార్డులో నమోదు చెయ్యాలన్నారు. ఏ దరఖాస్తు మిస్‌కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అం దించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. కౌంటర్లలో లబ్దిదారులు ఎక్కువగా ఉన్నట్లరుుతే సాయంత్రం కొంత అలస్యమైనా అందరి దరఖాస్తులు స్వీకరించిన తర్వాతే కౌంటర్‌ను మూసి వేయూలన్నారు. ఆధార్‌కార్డులు లేని దరఖాస్తు దారులకు ఆధార్ కార్డులను జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వికలాంగులు సదరం సర్టిఫికెట్లను జతపరిచి పింఛన్లకోసం దరఖాస్తు చేయలని, సర్టిఫికెట్లు లేనివారు జిల్లా ఆసుపత్రికి వెళ్లి తీసుకోవాలని సూచించారు. విచారణకు సిద్ధం చేయూలి ఇప్పటివరకు సేకరించిన దరఖాస్తులపై విచారణ చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయూలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఏరోజుకు సంబంధించిన దరఖాస్తులు ఆరోజు జాగ్రత్తగా కార్యాలయూనికి చేర్చాలన్నా రు. అనంతరం దరఖాస్తుల స్వీకరణ, ఇతర సమస్యలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ వెంకన్న, ఏసీపీ ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు. -
20లలో పొదుపు ఎందుకు చేయాలంటే..
సాధ్యమైనంత వరకూ కెరియర్ ప్రారంభించిన తొలినాళ్లలో.. అంటే ఇరవైల నుంచీ పొదుపు చేయాలి.. ఖర్చులు తగ్గించుకోవాలి అంటూ పెద్దలు, ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. చాలా మంది ఈ సలహాలను ఇలా విని అలా వదిలేస్తుంటారు. అయితే, ముందు నుంచే పొదుపు, ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఏమవుతుంది అని ఓ మోస్తరు జీతాన్ని అందుకుంటూ, లగ్జరీలపై ఖర్చు పెడుతున్న ఇరవై రెండేళ్ల కుర్రాడికి సందేహం వచ్చింది. ఇదే కొశ్చన్‌ని ఆన్లైన్లో అడిగితే అనేక మంది దగ్గర్నుంచి ఆసక్తికరమైన సమాధానాలు వచ్చాయి.. అందులో కొన్ని.. 1. చక్రవడ్డీ ప్రయోజనం తగ్గుతుంది .. కెరియర్ తొలినాళ్ల నుంచీ పొదుపు చేయడం వల్ల చక్రవడ్డీల ప్రభావంతో రిటైర్మెంట్ నాటికి అధిక మొత్తాన్ని పోగు చేసుకోవచ్చు. అదే కెరియర్ చివర్లో మొదలుపెడితే.. ఈ ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుంది. 2. ఉద్యోగం ఊడితే అంతే .. మంచి జీతం వచ్చే ఉద్యోగం ఉన్నట్లుండీ పోతే.. అప్పటిదాకా పొదుపు చేసుకున్న మొత్తాలే ఆదుకుంటాయి. లేకపోతే అప్పులపాలవ్వాల్సి వస్తుంది. మరో ఉద్యోగం దొరకబుచ్చుకుని వాటిని తీర్చేదాకా జీవితం దుర్భరమవుతుంది. 3. తిరోగమనం తప్పదు .. ఎప్పుడూ కూడా లైఫ్‌లో పురోగమించడానికే ప్రయత్నించాలి తప్ప తిరోగమించొద్దు. మితిమీరిన ఖర్చులతో పొదుపు ప్రాధాన్యాన్ని విస్మరిస్తే భవిష్యత్‌లో చిన్న చిన్న అవసరాల కోసం కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. ఇంటికెళ్లాలంటే భయమేస్తుంది. ఇలాంటి పరిస్థితి రావొద్దంటే కచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ ఉండాల్సిందే. 4. తర్వాత చూసుకుందాంలే అంటే కష్టమే.. నలభై ఏళ్ల తర్వాత కూడబెట్టుకోవచ్చులే అనుకుంటే.. ఆదాయం ఆర్జించేందుకు ఇప్పుడున్న సత్తా అప్పుడు ఉండదు. ఖర్చులు పెరిగిపోతాయి.. ఆర్జన తగ్గిపోతుంది. అందుకే.. అప్పుడు కూడా తినడానికి కాస్త ఆహారం, ఉండటానికి ఒక చిన్న గూడు, కట్టుకోవడానికి దుస్తులకు ఢోకా ఉండకూడదంటే ఇప్పట్నుంచీ పొదుపు చేయాలి. 5. ఇష్టం లేని ఉద్యోగాన్ని భరించక తప్పదు.. వచ్చే ప్రతీ పైసాను ఖర్చు పెట్టేస్తుంటే .. రేపటికంటూ ఏమీ మిగలదు. ఫలితంగా ప్రతి నెలా జీతంరాళ్ల కోసం ఎదురుచూస్తూనే ఉండాలి. మరో చోట అవకాశం లేనప్పుడు.. ఆఫీసులో పరిస్థితి నరకప్రాయంగా మారినా ధైర్యం చేసి మనెయ్యలేక.. నచ్చని ఉద్యోగంలో తప్పనిసరిగా కొనసాగాల్సి వస్తుంది. 6. భవిష్యత్ లక్ష్యాలు సాధించలేం.. సొంత ఇల్లు, మంచి కారు కొనుక్కోవడం .. భార్యా, పిల్లలు కుటుంబంతో కలిసి టూర్లు తిరిగేయడం లాం టి ఆలోచనలు ఈ ప్రాయంలో రాకపోయినా.. ఏదో ఒక రోజు వస్తాయి. ఇలాంటివన్నీ తీరాలంటే చాలా డబ్బు కావాలి. అందుకే ఇప్పట్నుంచే దాచిపె ట్టాలి. 7. వెనక్కి తిరిగి చూసుకుంటే.. మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడం.. అంటే భవిష్యత్‌లో ఉపయోగపడే నైపుణ్యాలను అలవర్చుకోవడం, అందుకోసం పెట్టుబడి పెట్టడం ఈ దశలోనే కాస్త ఎక్కువగా సాధ్యపడుతుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇవే ఉపయోగపడతాయి. అలా కాకుండా కంటికి కనిపించినవన్నీ కొనేయడం..ఎడా పెడా విలాసాలంటూ ఖర్చు చేసుకుంటూ పోతే వెనక్కి తిరిగి చూసుకుంటే విచారించడం తప్ప ఏమీ ఉండదు. -
జరిమానాల షాక్
దొంగల్ని చేస్తున్నారంటున్న వినియోగదారులు అదనపు విద్యుత్ భారానికే చార్జీలు వేస్తున్నామంటున్న అధికారులు గుడ్లవల్లేరు : గత కాంగ్రెస్ ప్రభుత్వం సర్‌చార్జీల పేరుతో వాతలు పెడితే.. ప్రభుత్వ చంద్రబాబు ప్రభుత్వం అదనంగా కరెంట్ వాడారంటూ జరిమానాల్ని విధించి, రశీదుల్ని చేతిలో పెడుతోంది. గుడ్లవల్లేరు మండలంలో ఇటీవల అదనపు విద్యుత్ లోడులకు సంబంధించి రూ.2,50,800లను అధికారులు జరిమానాగా విధించారు. మండలంలో 14,500 సర్వీసులున్నాయి. ఇందులో 2,758లను ఆకస్మిక తనిఖీ చేసి అధిక లోడుల పేరుతో వినియోగదారులకు జరిమానాలు వడ్డించారు. అభివృద్ధి పేరిట నెత్తిన భారం ప్రభుత్వం తమను దొంగలుగా చిత్రీకరించి, జరిమానాలు వేయడం దారుణమని బాధిత వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాడుకున్న యూనిట్లకు అనుగుణంగా బిల్లులు చెల్లిస్తున్నా జరిమానాలు వేయడం దారుణమని ఖండిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద ట్రాన్స్‌కో ఉన్నతాధికారుల్ని వివరణ కోరనున్నట్లు బాధిత వినియోగదారులు తెలిపారు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ పేర్ని రవికుమార్‌ను వివరణ కోరగా అదనంగా విద్యుత్‌ను వాడటం వల్ల డెవలప్మెంట్ చార్జీల కింద సొమ్ము చెల్లించాలని రశీదులు ఇచ్చామని తెలిపారు. ట్రాన్సకో చర్య దారుణం ఏదో కరెంట్ చోరీ చేసినట్లుగా ఇళ్లపై ట్రాన్స్‌కో సిబ్బం ది తనిఖీలు నిర్వహించారు. రూ.2వేల కరెంట్ బిల్లు నెలకు తూచా తప్పకుండా చెల్లిస్తాం. కాని మేమేదో ఎక్కువ కరెంట్ వాడుతున్నామంటూ రూ.6,125 చెల్లించాలంటూ రశీదు చేతిలో పెట్టారు. -కె.రామ్మోహనరావు, కౌతవరం పీఏసీఎస్ అధ్యక్షుడు ఇవేం వసూళ్లు ? ట్రాన్స్‌కో పోకడ అర్థం కావడం లేదు. అధికంగా కరెంటు వాడుతున్నామంటూ జరిమానా వేసి రూ.3,250లకు రశీదుని చేతిలో పెట్టారు. వారంలో చెల్లించకపోతే కరెంట్ తొలగిస్తామని చెబుతున్నారు. ఇదేమి అన్యాయమంటే ట్రాన్స్‌కో అభివృద్ధి అంటున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఇదేంటో తేల్చుకుంటాం. - కానూరి రాజేంద్రప్రసాద్, కౌతవరం బడ్డీ కొట్టుకు రూ.2,550 జరిమానానా? మా కొట్టుకు రూ.1,600 కరెంట్ బిల్లు వచ్చేది. మొన్న ఆకస్మిక తనిఖీల్లో రూ.2,550 కట్టాలంటూ రశీదు ఇచ్చారు. అది చెల్లించాలంటే నాకు అంత వ్యాపారం లేదు. కాని వారంలో చెల్లింకపోతే ఫీజులు పీకేస్తామని అంటున్నారు. ఏం చేయాలో దిక్కు తోచటం లేదు. - కె.శ్రీశైలం, దుకాణదారుడు -
వేవిళ్లు ఎక్కువగా ఉంటే!
అపోహ-వాస్తవం అపోహ : గర్భిణికి వేవిళ్లు ఎక్కువగా ఉంటే కడుపులో ఆడశిశువు ఉన్నట్లు ! వాస్తవం : ఈ అభిప్రాయం ఏ రకంగానూ ఆమోదయోగ్యం కాదంటారు వైద్య రంగ నిపుణులు. గర్భధారణ జరిగాక మొదటి మూడు నెలల సమయంలో ఉదయం నిద్రలేవగానే తల తిరగడం, వాంతులు, విపరీతమైన నిద్ర వంటి ఇబ్బందులు వేధిస్తాయి. అయితే ఒక్కొక్కరిలో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటే, కొందరికి తక్కువగా ఉంటుంది. వేవిళ్లు తీవ్రంగా ఉంటే అమ్మాయి, తక్కువగా ఉంటే అబ్బాయి పుడతారని అని నిర్ధారించడం ఏ రకంగానూ సాధ్యం కాదు. ఇలాంటి అభిప్రాయం కలగడాన్ని ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు... ఒక స్త్రీకి మొదటి కాన్పులో అమ్మాయి, రెండవ కాన్పులో అబ్బాయి పుట్టినట్లయితే అమ్మాయిని గర్భంతో ఉన్నప్పుడు వేవిళ్లు తీవ్రంగా ఉండవచ్చు. సాధారణంగా... వేవిళ్లు తొలి కాన్పులో ఉన్నంత తీవ్రంగా రెండవ కాన్పులో ఉండవు. అంతేతప్ప ఆ ఒక్క అంశాన్ని చూసి, పుట్టబోయేది ఆడపిల్ల అయితే వేవిళ్లు ఎక్కువగా ఉంటాయనుకోవడం తప్పు. -
'ఇలాంటి సైబర్ నేరగాళ్లను వదలిపెట్టొద్దు'
-
రూపాయి ర్యాలీ ముగిసిందా?
ఇకపై ఒక మోస్తరు లాభాలే ఎకానమీ ఇంకా పుంజుకోకపోవడమే కారణం కరెన్సీ నిపుణుల అంచనా బెంగళూరు: ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి నుంచి బలపడుతూ వచ్చిన రూపాయి ర్యాలీ ఇక ముగిసినట్లేనా? దాదాపుగా అయిపోయిందనే అంటున్నారు నిపుణులు. రాబోయే పన్నెండు నెలల కాలంలో రూపాయి ఒక మోస్తరు లాభాలు మాత్రమే నమోదు చేయొచ్చని లెక్కలు కడుతున్నారు. ఎకానమీ బలహీనంగా ఉండటమే ఇందుకు కారణమని వారు విశ్లేషిస్తున్నారు. కొత్త ప్రభుత్వం, కరెంటు అకౌంటు లోటు దిగి వస్తుండటం వంటి సానుకూలాంశాల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని చెబుతున్నారు. గతేడాది ఆల్‌టైమ్ కనిష్టమైన 68 స్థాయికి పడిపోయిన రూపాయి.. ఈ ఏడాది మాత్రం వర్ధమాన దేశాల కరెన్సీల్లో అత్యుత్తమ పనితీరు కనపర్చిన వాటిల్లో ఒకటిగా కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే జనవరి నుంచి సుమారు 4 శాతం మేర బలపడింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే గెలుపు తర్వాత మే 22న ఏడాది గరిష్టమైన 58.25 స్థాయిని కూడా తాకింది. గత నెలలో ఏకంగా రూ. 33,700 కోట్ల మేర విదేశీ నిధులు.. దేశీ స్టాక్‌మార్కెట్లు, బాండ్లలోకి ప్రవహించాయి. స్టాక్ మార్కెట్లు రికార్డు గరిష్టాలకు ఎగిశాయి. ఎన్నికల తర్వాత పరిస్థితులపై ఆశావహ ధోరణి కారణంగా ఈక్విటీలు, బాండ్లలోకి మే లో నిధులు వెల్లువెత్తడం రూపాయి బలపడటానికి దోహదపడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లోకి కనీసం 49 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడంపై సమాలోచనలతో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటిదాకా అన్నీ సానుకూల సంకేతాలు పంపారని వారు పేర్కొన్నారు. రక్షణ సహా వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడుల పరిమితులను పెంచడం, ఇతరత్రా కీలక ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం వంటి విషయాల్లో కేంద్రం వేగవంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని అంచనాలు నెలకొన్నాయి. కొత్త ప్రభుత్వ విధానాలు ఎలా ఉండబోతున్నాయనేది వచ్చే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టే బడ్జెట్ ద్వారా ఒక అవగాహన రావొచ్చు. రూపాయి పాలిట కొన్ని ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయి. వృద్ధి ఇంకా పుంజుకోకపోవడం ఇందులో ఒకటి. జనవరి-మార్చి త్రైమాసికంలో ఎకానమీ వృద్ధి 4.6 శాతం మాత్రమే నమోదైంది. ఇక ఈ ఏడాది ఆఖరు నాటికి ఆర్థిక ప్యాకేజీల ఉపసంహరణ పూర్తి చేసే దిశగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వేస్తున్న అడుగులు కూడా రూపాయిని వెనక్కి లాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 2-5 మధ్య జరిపిన సర్వే ప్రకారం రూపాయి విలువ 3 నెలల వ్యవధిలో 59.20 స్థాయిలో, ఏడాది వ్యవధిలో 60.16 స్థాయిలో ఉండగలదని పేర్కొన్నారు. దేశీ కరెన్సీ 16 పైసలు అప్..: ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 16 పైసలు ఎగిసింది. 59.17 వద్ద ముగిసింది. పక్షం రోజుల్లో ఇది అత్యధిక పెరుగుదల. దేశీ ఈక్విటీ మార్కెట్లు దూసుకెడుతుండటం, భారీగా పెట్టుబడులు వస్తుండటం రూపాయి పెరుగుదలకు తోడ్పడ్డాయి. -
నదుల కలయిక కలే
విభజిస్తే గోదావరి నీరు కృష్ణా బేసిన్‌కు తరలింపు కష్టమే! ఇక దుమ్ముగూడెం ప్రాజెక్టును కూడా వురచిపోవాల్సిందే ఇప్పటికే పక్కన పెట్టారు.. విభజిస్తే పూర్తిగా రద్దయ్యే ప్రమాదం పోలవరానికి ఇప్పటికే కష్టాలు.. వుుంపు ప్రాంతం తెలంగాణలో... పోలవరం నుంచి కృష్ణాకు 80 టీఎంసీల తరలింపూ సులువు కాదు ఇన్నాళ్లూ ఒక స్వప్నంలాగే ఉండిపోరుున నదుల అనుసంధానం ఇక దక్షిణ భారతాన అసలు సాధ్యమే కాని పరిస్థితులు ఏర్పడతాయూ!? గోదావరి నుంచి కృష్ణా తదితర దిగువ బేసిన్ల అవసరాలకు జలాల తరలింపు ఇక ప్రణాళికలకే పరిమితం కానుందా!? దువుు్మగూడెం వురచిపోవల్సిందేనా!? పోలవరం ఓ సుదీర్ఘ స్వప్నం కానుందా!? ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక, వుహారాష్ట్రలతో ఇప్పటికే జలవివాదాలు తీరని నష్టాలు తీసుకొస్తున్న నేపథ్యంలో... రాష్ట్ర విభజన తరువాత వురిన్ని తగాదాలు, నీటికష్టాలూ తప్పవనేది తాజాగా ఇంజనీర్ల మనోగతం!! సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నదులను అనుసంధానించడం వల్ల సవుుద్రంలో వృథాగా కలిసే ప్రవూదాన్ని తగ్గిస్తూనే, వరదలు- కరువు కష్టాలకు తెరవేయూలనేది ఎంతోకాలంగా ఉన్న ఆలోచన. నీరు పుష్కలంగా ఉన్న గోదావరి నుంచి నీటికొరత పీడిస్తున్న కృష్ణాకు అనుసంధానించడం కూడా అందులో ఒకటి. రాష్ట్రంలో దువుు్మగూడెం, పోలవరం ఆ దిశలో ఉపయుుక్త ప్రాజెక్టులు. ఏ కోణం నుంచి చూసినా రాష్ట్రాన్ని విభజిస్తే ఆ రెండూ కలలుగానే మిగిలిపోతాయునేది ప్రస్తుతం అందరినీ కలవరపరుస్తున్న అంశం! దువుు్మగూడెం- నాగార్జునసాగర్ టెరుుల్పాండ్ ప్రాజెక్టు నిర్మాణానికి 2007-08లోనే టెండర్లు ఖరారు అయ్యూరుు. రూ.20 వేల కోట్ల అంచనా వ్యయుంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా వరదలు వచ్చిన 80 రోజుల్లో దువుు్మగూడెం నుంచి 165 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించి నాగార్జునసాగర్ టెరుుల్ పాండ్‌లోకి తీసుకురావాల్సి ఉంది. ఈ నీటిని కృష్ణా ఆయుకట్టుకు వాడుకోవాలని భావించారు. తద్వారా కృష్ణా ఎగువన మిగిలే నీటితో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎవ్మూర్పీలతో పాటు రాయులసీవు, నెల్లూరు, ప్రకాశం లాంటి జిల్లాలకు ప్రయోజనం కలిగే గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ లాంటి ప్రాజెక్టుల అవసరాలు తీరే వీలు ఏర్పడేది. కృష్ణా బేసిన్లో సరైన వర్షాలు కురియుక నీటి కొరత ఏర్పడితే సాగర్ ఆయుకట్టుతో పాటు, డెల్టా రైతులను ఆదుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పటికే రూ. 547 కోట్లను ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టు పనులు 2014-15కి పూర్తి కావాలి. టెండర్లు ఖరారు చేసిన వెంటనే ఎన్నికలు రావడం, తర్వాత వైఎస్ వుృతి చెందడంతో దీనికి కష్టాలు మొదలయ్యూరుు. రోశయ్యు సీఎంగా ఉన్నప్పుడు కొందరు తెలంగాణ ప్రజా ప్రతినిధులు ప్రాజెక్టు పనుల్ని నిలిపివేయూలని డివూండ్ చేశారు. దాంతో అప్పటి నుంచి పనుల్ని చేయుడం లేదు. విభజన అనంతరం దీన్ని పూర్తిగా రద్దు చేయుడంగానీ లేదంటే కేవలం తెలంగాణకు ఉపయుుక్తవుయ్యేలా డిజైన్లు వూర్చి చేపట్టే అవకాశాలే ఉంటారుు. ప్రస్తుత అంచనాలను బట్టి దీనికి రూ.30 వేల కోట్లు కావాలి. అంత ఖర్చు భరించి తెలంగాణ ప్రభుత్వం కోస్తాకు నీటిని ఇవ్వడవునేది ఊహకందని విషయుం. ఒకవేళ చేపట్టినా తెలంగాణ ప్రాంత అవసరాలకు వూర్చుకుంటావుని తెలంగాణవాదులు బహిరంగంగానే చెబుతున్నారు. 50 ఏళ్లలో కేంద్రం నిర్మించిన ప్రాజెక్టే లేదు: పోలవరం ప్రాజెక్టును కేంద్ర పరిధిలోనే చేపడుతామని టీ బిల్లులో పేర్కొన్నారు. అయితే సాగునీరు అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం. పైగా గత 50 సంవత్సరాలుగా దేశంలో ఒక్క ప్రాజెక్టును కూడా కేంద్రం నిర్మించలేదని నిపుణులు చెబుతున్నారు. 1952లో ఒరిస్సాలోని మహానదిపై హీరాకుడ్ డ్యాం నిర్మాణం తప్ప, ఆ తర్వాత కేంద్ర జల సంఘం ఎలాంటి ప్రాజెక్టును చేపట్టలేదు. పైగా ఈ ప్రాజెక్టు వుుంపు బాధితులు ఆదివాసులు, తెలంగాణ ప్రాంతం వారు. దాంతో వారు కోల్పోయే భూములకు సమాన భూములను ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో కేటాయించాల్సి ఉంది. అయితే... పోలవరం ఆయకట్టు ప్రాంతంలోని 80 వేల నుంచి లక్ష ఎకరాల ఆయకట్టును.. తెలంగాణ ప్రాంత ముంపు బాధితులకు పంచడానికి ఎన్ని ఇబ్బందులో ఊహించుకోవాల్సిందే. అందుకే పోలవరం డిజైన్లు వూర్చాలనే డివూండ్ను తెలంగాణవాదులు వదులుకునే అవకాశాలూ లేవు. ఒకవేళ నిర్మించినా పోలవరం కుడికాలువ నుంచి అవసరమైతే కృష్ణా డెల్టా అవసరాలకు 80 టీఎంసీలను త రలించవచ్చు గానీ అంతకు మించి ఇతర బేసిన్లకు తరలించడం సాధ్యం కాదు! పాలమూరుకు ఇక్కట్లు: ఈ ప్రాజెక్టుల నుంచి కృష్ణాకు నీటి తరలింపు నిలిచిపోతే... పాలవుూరుపైనా తీవ్ర ప్రభావం ఉంటుంది. కల్వకుర్తి (25 టీఎంసీలు), నెట్టెంపాడు (22 టీఎంసీలు) ప్రాజెక్టులు వరద జలాలపై ఆధారపడ్డారుు. కృష్ణాలో భారీగా వరదలు వచ్చిన సవుయుంలోనే ఈ ప్రాజెక్టులకు నీరు అందనుంది. ఎప్పుడో కానీ ఇలాంటి పరిస్థితి రాదు. అరుుతే దువుు్మగూడెం, పోలవరం నీరు కృష్ణా బేసిన్‌కు వస్తే ఈ ప్రాజెక్టులకు నీటి వాడకానికి వెసులుబాటు కలగనుంది. ఇదే జిల్లాలో రాజీవ్ బీవూ (20 టీఎంసీలు) ప్రాజెక్టుకు కూడా కష్టాలే. కృష్ణా డెల్టా ఆధునీకరణ ద్వారా ఆదా అయ్యే నీటిని ఈ ప్రాజెక్టుకు కేటారుుంచారు. అరుుతే ప్రస్తుతం ఆధునీకరణ పనులు పూర్తి కాలేదు. దాంతో నీటి ఆదా లేదు. వురో పక్క బీవూ ప్రాజెక్టు పూర్తి దశకు చేరుకుంది. దీని నీటిని ఉపయోగించుకోవడం ప్రారంభిస్తే కృష్ణా డెల్టాకు నీటి కొరత ఏర్పడనుంది. దాంతో రెండు ప్రాంతాల వుధ్య నీటి వివాదానికి తెరలేవనుంది. రెండు ప్రభుత్వాల ఏకాభిప్రాయంతోనే సాధ్యం రాష్ట్రం విడిపోతే.. రెండు ప్రభుత్వాలు పరస్పరం ఏకాభిప్రాయానికి వస్తేనే నదుల అనుసంధానం సాధ్యం. పోలవరంపై ఇప్పటికే ముంపు సమస్య ఉంది. విభజనతో అభ్యంతరాల జాబితాలో మరో రాష్ర్టం చేరనుంది. అలాగే దుమ్ముగూడెం-సాగర్ టెయిల్ పాండ్ సాధ్యం కావాలంటే... తెలంగాణ రాష్ర్టమే చేపట్టాల్సి ఉంటుంది. - టి. హన్మంతరావు, సాగునీటి రంగ నిపుణుడు -
15 రోజుల్లో జన్‌లోక్‌పాల్ కష్టమే!
కేంద్రం అనుమతి తప్పనిసరి; నిపుణుల అభిప్రాయం సాక్షి, న్యూఢిల్లీ: అధికారంలోకి వస్తే డిసెంబర్ 29న రామ్‌లీలా మైదాన్‌లో ప్రత్యేకంగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటుచేసి జన్ లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే, ఆ హామీని నెరవేర్చడం కష్టమేనని ఆప్ ఇప్పుడు భావిస్తోంది. అందుకు చట్ట సంబంధ సమస్యలున్నాయని బుధవారం ఆ పార్టీ నేత కేజ్రీవాల్ స్వయంగా చెప్పారు. లోక్‌పాల్ బిల్లు, ఢిల్లీకి రాష్ట్రహోదా విషయానికి వస్తే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రప్రభుత్వానికి ఈ విషయాలపై ఉత్తర్వులు జారీచేసే వీలున్నా, చట్టం చేయాలంటే మాత్రం కేంద్రం అనుమతిని తప్పనిసరి చేస్తూ కేంద్రం చట్టం చేసిందని ఆయన వివరించారు. అయితే, ఈ విషయం కేజ్రీవాల్‌కు ముందే తెలిసి ఉండాల్సిందని రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఉమేశ్ సెహగల్ అభిప్రాయపడ్డారు. కేంద్రం అనుమతి లేకుండా ఢిల్లీ ప్రభుత్వం ఏ చట్టాన్నీ ఆమోదించలేదన్న విషయం తనకు ఇప్పుడే తెలిసినట్లుగా కేజ్రీవాల్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కొత్త చట్టాన్ని రూపొందించడానికి ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం అనుమతి పొందవలసిన అవసరం లేదని, కానీ ఇదివరకే చట్టం ఉన్న దానిపై కొత్త చట్టం చేయాలనుకున్నట్లయితే కేంద్రం అనుమతి తప్పక తీసుకోవలసి ఉంటుందని వివరించారు. కేంద్రం ఇటీవలే లోక్‌పాల్ బిల్లు ఆమోదించింది కాబట్టి ఢిల్లీలో మరో లోక్‌పాల్ చట్టాన్ని తేలేరని, ఢిల్లీలో లోకాయుక్త చట్టం ఇదివరకే ఉండడం వల్ల కొత్తగా లోకాయుక్త చట్టం చేయడానికి మొదట కేంద్రం అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా లేనందువల్ల కేంద్రపాలిత ప్రాంతానికి వర్తించే చట్టాలే వర్తిస్తాయి. అందువల్ల ఆప్ ప్రభుత్వం లోకాయుక్త చట్టం కొత్తగా రూపొందించి, దానిని కేబినెట్ ఆమోదించిన తరువాత లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం అనుమతి కోసం పంపాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోదించాక ఆ బిల్లు తగిన సవరణలతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి తిరిగివస్తుంది. అప్పుడు దానిని ఢిల్లీ విధానసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందగలుగుతారు. ఈ ప్రక్రియకు కొన్ని నెలలు పట్టే అవకాశముంది. -
బ్యాంకింగ్ లెసైన్స్ దరఖాస్తులకు కమిటీ
న్యూఢిల్లీ: కొత్త బ్యాంకులకు లెసైన్స్‌ల జారీ ప్రక్రియ మొదలవనుంది. దరఖాస్తుల పరిశీలన కోసం త్వరలో ఉన్నతస్థాయి సలహా కమిటీ(హెచ్‌ఎల్‌ఏసీ)ని ఆర్బీఐ నియమించనుంది. బ్యాంకింగ్ లెసైన్స్‌ల కోసం 26 కార్పొరేట్, ప్రభుత్వ రంగ కంపెనీలు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, కమిటీలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగానికి చెందిన ప్రముఖ విశ్లేషకులు, నిపుణులు ఉంటారని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఆర్బీఐ నుంచి సభ్యులెవరూ దీనిలో ఉండరని సమాచారం. ప్రభుత్వం తరఫునుంచి కూడా కొందరు ఉన్నతాధికారులకు కమిటీలో స్థానం కల్పించే అవకాశం ఉంది. వచ్చే మార్చిలోగా లెసైన్స్‌ల జారీకి అవకాశం ఉందని ఆర్బీఐ, ప్రభుత్వం చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే.