వెన్ను నొప్పి అనేది అందరికి తెలుస్తుంది. ఇటీవల కాలంలో తరుచుగా వింటున్నాం కూడా. వెన్నునొప్పిగా అనిపిస్తే మూవ్ లేదా ఇతరత్రా రిలీఫ్ బామ్‌లు రాసుకుని రిలాక్స్ అవుతుంటాం. చాలా మంది దీన్ని సాధారణ సమస్యగానే భావిస్తారు. తట్టుకోలేనంత స్థితి ఎదురైతే గానీ వైద్యులు దగ్గరకు వెళ్లరు. ఔనా! కానీ ఆరోగ్య నిపుణులు అలా చేయొద్దు అంటున్నారు. కొన్ని రకాల క్యాన్సర్‌లు.. వెన్నునొప్పి సంకేతం చూపిస్తాయట. శరీరంలో ఏదైనా భాగం నుంచి క్యాన్సర్ కణాలు ఎముకల ద్వారా వెన్నుకి స్ప్రెడ్ అయితే వెన్ను నొప్పి ద్వారా ఇండికేట్ చేసే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.
అలా అని వెన్ను నొప్పి అనేది క్యాన్సర్‌కి సంబంధించిన లక్షణం కూడా కాదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం రోమ్ము, ఊపిరితిత్తులు, వృషణాలు, పెద్దప్రేగు, అనే నాలుగు సాధారణ క్యాన్సర్‌లు వెన్నునొప్పి ద్వారా సంకేతం చూపిస్తాయట. ఆయా భాగాలు అన్నీ శరీరీ నిర్మాణ పరంగా వెనుముకకు దగ్గరగా ఉన్నందున వెన్ను వరకు వ్యాపించే అవకాశం ఉంటుదని చెబుతున్నారు నిపుణులు.
అంతేగాదు ఊపిరితిత్తు క్యాన్సర్‌ని ఫేస్ చేస్తున్న 25 శాతం మంది రోగులు తమకు మొదట వెన్ను నొప్పి వచ్చిందని చెప్పినట్లు వెల్లడించారు. యూకే అధ్యయనంలో కూడా ఇది వెల్లడైంది. ఇలాంటి వెన్నునొప్పి..బరువు తగ్గిపోవడం, రాత్రిపూట చెమటలు, చలి జ్వరం వంటి లక్షణాలను ఫేస్‌చేస్తున్న క్యాన్సర్ పేషెంట్లలో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు.
ఇలాంటి క్యాన్సర్‌తో బాధపడుతున్న పేషెంట్లు వాళ్లు ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా బరువు తగ్గిపోతారట. వాళ్లలోని శక్తి తొందరగా బర్న్ అయిపోతుందట. పైగా ఇలా క్యాన్సర్ సంకేతంగా వచ్చే వెన్నునొప్పి అత్యంత అసౌకర్యంగా ఉంటుందని, చాలా పెయిన్‌తో కూడినదని చెబుతున్నారు. అందువల్ల దయచేసి వెన్నునొప్పి వస్తే సరైన భంగిమ వల్లన లేక మరేదైన కారణంతోనే గమనించండి. అవసరం అనుకుంటే వైద్యులని సంప్రదించండి. నిర్లక్షంతో జీవితాన్ని కోల్పోకండి.
(చదవండి: సెలూన్‌కి వెళ్లే పనిలేకుండా..మీ హెయిర్‌ని స్ట్రయిట్ చేసుకోండిలా..)
Comments
Please login to add a commentAdd a comment