విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మకాయతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. రోజూ నిమ్మరసాన్ని సేవిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే నిమ్మకాయను కొన్ని పదార్థాలతో కలిపి సేవించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా పనీర్ తయారు చేసేటప్పుడు మరిగే పాలలో నిమ్మరసం పిండుతారు. అయితే ఇందులో ఉండే యాసిడ్ ప్రోటీన్లను దెబ్బతీస్తుంది. ఫలితంగా యాసిడ్ రిఫ్లెక్షన్ ఏర్పడి గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకే పనీర్‌లో నిమ్మరసం కలపడం మంచిది కాదు.
చాలామంది సలాడ్‌లో ఎక్కువగా నిమ్మరసం ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని రకాల పండ్లతో నిమ్మరసం కలవడం రియాక్షన్ ఇస్తుంది. ముఖ్యంగా బొప్పాయిని నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లతో కలిపితే నష్టం వాటిల్లుతుంది. యాసిడ్ రిఫ్లెక్షన్ ఏర్పడి ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడవచ్చు.
అదేవిధంగా చాలామంది... ముఖ్యంగా మద్యపాన ప్రియులు కాక్టెయిల్స్, బీర్లతో నిమ్మకాయను ఉపయోగిస్తారు. కానీ నిమ్మ, రెడ్ వైన్ కాంబినేషన్ ఏ మాత్రం మంచిది కాదు. నిమ్మలోని ఎసిడిటీ రెడ్‌వైన్‌లోని టానిన్‌లను ప్రభావితం చేయడం వల్ల వైన్ చేదెక్కడంతోపాటు దుష్ఫ్రభావాలూ కలుగుతాయి. నిమ్మలో ఉండే ఎసిడిటీ స్వభావం వల్ల స్పైసీ ఫుడ్స్‌తో కలిపి తిన్నప్పుడు శరీరంలో వేడి పెరగడమే కాకుండా జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి. అందుకే స్పైసీ ఫుడ్స్‌లో నిమ్మ వినియోగం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేడి వేడి ఆహారంలో నిమ్మరసం అసలు కలపకూడదు. అలా కలపడం వల్ల నిమ్మలోని విటమిన్ సి దూరమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment