lemon
-
Harsh Goenka: తేనె-నిమ్మకాయ నీటితో బరువు తగ్గరు..!
బరువు తగ్గించే అద్భుతమైన డ్రింక్స్‌కి సంబంధించి చాల రకలా పానీయాల గురించి విన్నాం. అదీగాక ఇటీవల రోజుకో కొత్తరకం పానీయం గురించి సమాచారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది కొవ్వుని కాల్చేస్తుంది. దెబ్బకు బరువు మాయం అంటూ ఊదరగొట్టేలా చెప్పేస్తున్నారు కొందరూ. వాటిలో వాస్తవికత ఎంత అనేదాంట్లో స్పష్టత మాత్రం ఉండదు. అచ్చం అలాంటి వాటికి సంబంధించిన ఏళ్లనాటి రెమిడీనే తేనె నిమ్మకాయ నీరు. అమ్మమ్మల కాలం నుంచి ఇది బరువుని మాయం చేసే అద్భుతమైన డ్రింక్ అని చెబుతుండటం విన్నాం. అయితే ఈ డ్రింక్‌పై తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇది బరువు తగ్గడంలో ఏమాత్రం సహాయపడదంటూ మండిపడ్డారు. ఆయన చెప్పినట్లుగా నిజంగానే ఇది బరువుని అదుపులో ఉంచలేదా..?. మరి నిపుణులు ఏం చెబుతున్నారు తదితరాల గురించి తెలుసుకుందాం..!.వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా(Harsh Goenka) సోషల్ మీడియా ఎక్స్‌లో ఈ నిమ్మకాయ తేనె పానీయం(honey-lemon water) వల్ల బరువు తగ్గరంటూ తన అనుభవాన్ని వెల్లడించారు. తాను రెండు నెలలపాటు పరగడుపునే తేనె నిమ్మరసంతో కూడిన గోరువెచ్చని నీటిని తాగేవాడినని. ఇది బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడంతో క్రమతప్పకుండా ఇలా తాగాననని అన్నారు. అయితే అలా ఇప్పటి వరకు రెండు కిలోలు నిమ్మకాయలు, మూడు కిలోలు తేనె తీసుకున్నాను కానీ తన బరువులో ఎట్టి మార్పు కనిపించలేదని వాపోయారు. బహుశా ఈ పదార్థాలన్నీ బరువుని పెంచేవే కాబోలు అంటూ పోస్ట్‌లో వ్యగ్యంగా రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు... అయితే ఇది మార్కెట్ ట్రిక్ అని ఒకరు, ఇది కేవలం శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందే కానీ బరువుని కాదు అని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. చెప్పాలంటే పారిశ్రామిక వేత్త లేవెనెత్తిన ప్రశ్న సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. మరి దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే..ప్రముఖ డైటీషియన్, సర్టిఫైడ్ డయాబెటిస్ కనిక్క మల్హోత్రా(Kanikka Malhotra) మాత్రం పరగడుపునే దీన్ని తీసుకుంటే బరువు తగ్గుతారని చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియకు సహాయపడుతుందని, హైడ్రేషన్‌ని ప్రోత్సహిస్తుందని చెప్పారు. అధిక కేలరీల పానీయాలకు బదులుగా ఇలా తేనె-నిమ్మకాయ నీటితో భర్తీ చేయడం వల్ల మొత్తం కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గేందుకు దారితీస్తుంది. అలాగే నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగ్గా ఉండి, కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఫలితంగా ఇది పౌండ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నిమ్మకాయలోని విటమిన్ సీ, తేనెలోని యాంటీఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అంతేగాదు ఇది ఆరోగ్యకరమైన జీవక్రియకు మద్దతిస్తుంది. నిమ్మరసం జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. తేనె ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ప్రేగు పనితీరుకి మద్దతిస్తుంది. అదీగాక మలబద్ధకాన్ని నివారించి పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో అందరూ ఉపయోగించే సాధారణ పద్ధతి, పైగా పరగడుపునే ఇలా తీసుకోవడం అనేది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అని చెప్పారు. ఇది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచి, శక్తి స్థాయిలను పెంచేందుకు ఉపయోగపడుతుంది. నిజానికి బరువు తగ్గడానికి అద్భుత పరిష్కారం కాన్పటికీ ఇది సమతుల్య ఆహారంలా ఉపయోగపడుతుంది. వ్యాయామ దినచర్య లేనివారికి అద్భతమైన డ్రింక్‌లా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ బరువు తగ్గడం అనేది మొత్తం ఆహారం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుందనేది గుర్తెరగాలని అన్నారు. ఇందులో ఉపయోగించే తేనె రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి అధిక బరువుని నియంత్రిస్తుంది. అలాగే ఉపవాస సమయంలో దీన్ని తీసుకుంటే శరీర బరువు తోపాటు శరీరం బీఎంఐని కూడా తగ్గిస్తుందని మల్హోత్రా నొక్కి చెప్పారు. అలాగే బరువు తగ్గడం అనేది శక్తి సమతుల్యతకు సంబంధించినది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు ఈ పానీయాలపై ఆధారపడటానికి బదులు తీసుకునే డైట్‌పై ఫోకస్ పెట్టండి అప్పుడే ఈ డ్రింక్ బరువు తగ్గించడంలో హెల్ఫ్ అవుతుందని చెప్పారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తూ..హైడ్రేటెడ్‌గా ఉండే యత్నం చేస్తే చక్కటి ఫలితం పొందగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: అమ్మ 'చక్కెర' బిడ్డకూ చేదు..!) -
బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, ఆయిల్‌పాం.. ఉత్పాదకతలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వృద్ధిలో ఉద్యానపంటలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఏపీ ఉద్యానపంటల హబ్‌గా మారుతోంది. బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, ఆయిల్‌పాం ఉత్పాదకతలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, మిరప, మామిడి, స్వీట్ ఆరెంజ్, పసుపు ఉత్పాదకతలో రెండోస్థానంలో ఉందని 2023–24 సామాజిక ఆర్థికసర్వే వెల్లడించింది. 2023–24లో కొత్తగా 1,43,329 ఎకరాల్లో ఉద్యానపంటల సాగు చేపట్టినట్లు తెలిపింది.ఉద్యానపంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, ప్రధానంగా రాయలసీమ ప్రాంతం ఉద్యాన హబ్‌గా తయారవుతోందని పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 45.58 లక్షల ఎకరాల్లో ఉద్యానపంటలు సాగవుతుండగా.. అందులో 43 శాతం (19.50 లక్షల ఎకరాల్లో) రాయలసీమలోనే సాగవుతున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఉద్యానపంటల ఉత్పత్తి 366.53 లక్షల మెట్రిక్ టన్నులుండగా.. అందులో 52 శాతం (189.69 లక్షల మెట్రిక్ టన్నులు) రాయలసీమలోనే ఉత్పత్తి అవుతున్నట్లు వివరించింది. మెట్ట ప్రాంతాల్లో తక్కువ ఆదాయం వచ్చే పంటలకు బదులు ఎక్కువ లాభదాయకమైన ఉద్యానపంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపింది. ఉద్యానపంటల ఉత్పాదకత, నాణ్యత పెంపుదల కోసం ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల ద్వారా తోటబడి పేరుతో సలహాలు, సూచనలు ఇస్తోందని, అలాగే విపత్తుల్లో దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుందని తెలిపింది. 2023–24లో ఉద్యానపంటలు దెబ్బతిన్న 1.31 లక్షల మంది రైతులకు రూ.139.31 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లించినట్లు వెల్లడించింది. ఏపీ ఉద్యానపంటల అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించిందని సర్వే తెలిపింది. ఇప్పటివరకు 1,62,071 మెట్రిక్ టన్నులను వివిధ దేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపింది. రాయలసీమలో సేకరణ కేంద్రాలను, ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించింది. -
ఈ వంటలను ఎప్పుడైనా వండి చూశారా..!?
పొటాటో–లెమెన్ పోహా..కావలసినవి:బంగాళదుంపలు– 2 (ఉడికించి, చల్లారాక తొక్క తీసి, చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి),జీలకర్ర, ఆవాలు– పావు టీ స్పూన్ చొప్పున,కరివేపాకు,ఎండుమిర్చి– కొద్దికొద్దిగావేరుశనగలు– 2 టేబుల్ స్పూన్లు (దోరగా వేయించి పెట్టుకోవాలి)అల్లం తరుగు– కొద్దిగా, వెల్లుల్లి ముక్కలు– పావు టీ స్పూన్నూనె– సరిపడా,ఉప్పు– రుచికి తగ్గట్టుగాపసుపు, కారం– అర టీ స్పూన్ చొప్పుననిమ్మరసం– 1 టేబుల్ స్పూన్ (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు)కొత్తిమీర తురుము– 4 టేబుల్ స్పూన్లు, అటుకులు– ఒకటిన్నర కప్పులుతయారీ..– ముందుగా అటుకులను జల్లెడ తొట్టెలో వేసుకుని మంచినీళ్లు పోసి, 2 సార్లు కడిగి పెట్టుకోవాలి.– ఆపై ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తిప్పుతూ, అల్లం తరుగు, వెల్లుల్లి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి.– అందులో పసుపు, కారం, తగినంత ఉప్పు, బంగాళదుంప ముక్కలు వేసుకుని, 2 నిమిషాలు మూత పెట్టి చిన్నమంట మీద ఉడకనివ్వాలి.– అనంతరం కొత్తిమీర తురుము, అటుకులు, నిమ్మరసం వేసుకుని బాగా కలిపి, మూతపెట్టుకుని 2 నిమిషాలు ఉడికించాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది ఈ పోహా.డ్రైఫ్రూట్స్ చాక్లెట్స్..కావలసినవి:కోకో పౌడర్,పంచదార పొడి,కొబ్బరి నూనె (స్వచ్ఛమైనది) – ముప్పావు కప్పు చొప్పున,మిల్క్ పౌడర్ – 5 టేబుల్ స్పూన్లు,పిస్తా, బాదం, జీడిపప్పు, వేరుశనగలు(దోరగా వేయించి, తొక్క తీసేసినవి) – 2 టేబుల్ స్పూన్ల చొప్పునతయారీ:– ముందుగా పిస్తా, జీడిపప్పు, బాదం, వేరుశనగలను కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.– అనంతరం అదే మిక్సీ బౌల్‌ని కాసిన్ని నీళ్లతో క్లీన్ చేసుకుని, దానిలో కోకో పౌడర్, పంచదార పొడి, స్వచ్ఛమైన కొబ్బరి నూనె, మిల్క్ పౌడర్ ఒకదాని తరవాత ఒకటి వేసుకుని క్రీమీగా మారేలా మిక్సీ పట్టుకోవాలి.– అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని, దానిలో డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి.– అనంతరం నచ్చిన షేప్‌లో ఉన్న ఐస్ క్యూబ్స్ ట్రేని తీసుకుని, వాటికి అడుగున నెయ్యి రాసి, కొద్దికొద్దిగా ఈ మిశ్రమం వేసుకుని, మూడు నుంచి 5 గంటల పాటు ఆ ట్రేను ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం వాటిని ట్రే నుంచి వేరు చేసుకోవచ్చు.ఎల్లో ఎగ్ – కీమా లాలీపాప్స్..కావలసినవి:గుడ్లు– 6 లేదా 7 (పసుపు సొన మాత్రమే, ఉడికించి చల్లారాక పొడిపొడిగా చేసుకోవాలి)మటన్ కీమా– పావుకిలో (మసాలా, ఉప్పు, కారం వేసుకుని కుకర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి)బ్రెడ్ పౌడర్– అర కప్పుఓట్స్ పౌడర్– పావు కప్పు,అల్లం–వెల్లుల్లి పేస్ట్– కొద్దిగాపచ్చిమిర్చి ముక్కలు– ఒకటిన్నర టీ స్పూన్లు,మిరియాల పొడి, జీలకర్ర పొడి– పావు టీ స్పూన్ చొప్పున,ఆమ్చూర్ పౌడర్– 2 టీ స్పూన్లుఉప్పు– తగినంత,గడ్డ పెరుగు– తగినంతనీళ్లు– కొన్ని (అభిరుచిని బట్టి),టమాటో సాస్,కొత్తిమీర తురుము– గార్నిష్‌కి సరిపడా,నూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ:– ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్ల పసుపు సొన, ఉడికిన మటన్ కీమా, ఓట్స్ పౌడర్, బ్రెడ్ పౌడర్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.– అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా గడ్డ పెరుగు వేసుకుని ముద్దగా చేసుకోవాలి.– ముద్దలా చేసుకోవడానికి పెరుగు చాలకుంటే నీళ్లు కూడా వాడుకోవచ్చు. – ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న బాల్స్‌లా లేదా చిత్రంలో చూపిన విధంగా చేసుకుని, ప్రతి లాలీపాప్‌కు ఒక పుల్లను గుచ్చి పక్కన పెట్టుకోవాలి.– అనంతరం వాటిని మరుగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.– వెంటనే టమాటో సాస్‌లో వాటిని ముంచి, కొత్తిమీర తురుము జల్లుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
ఈ కిచెన్వేర్స్ని నిమ్మకాయతో అస్సలు క్లీన్ చేయకూడదు !
వంటగదిలో క్లీన్ చేయడానికి లేదా శుభ్రంగా ఉంచడానికి మొట్టమొదటగా ఉపయోగించేది నిమ్మకాయలనే. దీనిలోని ఆమ్లత్వం, తాజా సువాసన కారణంగా వీటిని మిరాకిల్ క్లీనర్‌గా పిలుస్తుంటారు. చెప్పాలంటే ఏదైనా చెడు వాసన పోగొట్టేందుకు, క్రిమిసంహారక క్లీనర్‌గానూ నిమ్మకాయాలు బెస్ట్. ఈ నిమ్మకాయలు క్లీనింగ్‌కి, సువాసన కోసం ఉపయోగించినప్పటికీ కిచెన్‌లోని ఈ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయలతో క్లీన్ చేయకూడదు. నిమ్మకాయలకు దూరంగా ఉంచాల్సిన వంటగది వస్తువులు ఏవంటే..మార్బుల్, గ్రానైట్ కౌంటర్‌టాప్‌లు: ఇళ్లలోని ఫ్లోర్ ఎక్కువగా మార్బుల్ లేదా గ్రానైట్ రాయిని వినియోగిస్తున్నారు. వీటిని క్లీన్ చేసేందుకు నిమ్మకాయలను ఉపయోగించకూడదు. దీనిలోని అధిక ఆమ్లత్వం కారణంగా నష్టం వాటిల్లుతుందే తప్ప అవి క్లీన్ అవ్వవు. పైగా వాటికి ఉండే సహజ మెరిసే గుణం పోతుంది. వీటిని క్లీన్ చేసేందుకు పీహెచ్ తటస్థ క్లీనర్లను ఎంపిక చేసుకుంటే అవి మెరుస్తుంటాయి. కాస్ట్ ఐరన్ పాన్లు: తొందరగా వేడేక్కే బెస్ట్ పాన్లు. వీటిని కూడా నిమ్మకాయలతో క్లీన్ చేయకూడదు. ఎందుకంటే దీనిలోని ఆమ్లత్వం తుప్పు పట్టేలా చేస్తుంది. పైగా పాన్లపై నూనెకు సంబంధించిన జిగటను నిరోధించే రక్షిత పొరకు నష్టం వాటిల్లేలా చేస్తుంది. వీటిని శుభ్రం చేసేందుకు బ్రష్, వేడి నీటిని ఉపయోగించండి. కత్తులు వంటి వాటికి..కత్తులు వంటి పదునైన వస్తువులను క్లీన్ చేసేందుకు నిమ్మకాయను అస్సలు వాడకూడదు. ఇది రియాక్షన్ చెంది ఆక్సీకరణం చేయడంతో కత్తులు తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇది క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ వీటిని శుభ్రపరిచేందుకు ఉపయోగించకపోవడమే మంచిది. ఇలాంటి పదునైన వస్తువులను క్లీన్ చేసేందుకు డిష్ సబ్బును ఉపయోగించండి, క్లీన్ చేసిన వెంటనే తడి లేకుండా ఆరనివ్వాలి. ఇలా చేస్తే వాటి పదును పోదు, ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. చెక్క పాత్రలు, చెక్క కట్టింగ్ బోర్డులు..చెక్ పాత్రలు, చెక్ కట్టింగ్ బోర్డులు నిమ్మకాయతో క్లీన్ చేస్తే గనుక..దీనిలోని ఆమ్లత్వం పొడిగా అయిపోయి పగళ్లు తెప్పిస్తుంది. పైగా బ్యాక్టీరియాను ఆశ్రయించేలా చేస్తుంది. వీటిని క్లీన్ చేసేందుకు తేలికపాటి సబ్బును ఉపయోగించండి. మంచిగా ఉండేందుకు నూనె అప్లై చేయండి.అల్యూమినియం పాత్రలు..అల్యూమినియం పాత్రలను నిమ్మకాయలతో శుభం చేయడం హానికరం. ఎసిడిటీ వల్ల రంగు మారడం, మెరుపు కోల్పోవడం జరుగుతుంది. అంతేగాదు ఆ పాత్ర ఉపరితలంపై చిన్న రంధ్రాలను కూడా ఏర్పరుస్తుంది. వీటిని క్లీన్ చేసేందుకు డిస్ సోప్ వినియోగించండి. కొత్తగా కనిపించేలా చేసేందుకు స్పాంజ్‌తో క్లీన్ చేయండి. (చదవండి: ఎర్ర బచ్చలికూరతో అధిక బరువుకి చెక్!) -
లెమన్‌గ్రాస్ టీతో ఎన్ని లాభాలో తెలుసా..!
మనం ఎన్నో రకాల టీల గురించి విన్నాం. వాటిలో కొన్ని ఆరోగ్యకరమైన గ్రీన్ టీ వంటి పలు పానీయాలు గురించి కూడా విన్నారు. అలాంటి కోవకు చెందిన నిమ్మగడ్డి టీ గురించి విన్నారా. దీని వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబతున్నారు నిపుణులు. జీర్ణక్రియ దగ్గర నుంచి బరువు తగ్గడం, రోగ నిరోధక శక్తి వరకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదు ఈ టీ. అలాంటి ఈ లెమన్‌గ్రాస్ టీని ఎలా తయారు చేస్తారు? దీని వల్ల కలిగే లాభలేంటో సవివరంగా తెలుసుకుందామా..!లెమన్ గ్రాస్ టీ తయారీ విధానం..కావాల్సినవి:నీళ్లు: నాలుగు కప్పులు, నిమ్మగడ్డి: మూడు కాడలు (పచ్చివి), తేనె: మూడు చెంచాలు (బెల్లం కూడా వేసుకోవచ్చు)తయారీ: ముందుగా గిన్నెలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి బాగా మరిగించుకోవాలి. అందులో నిమ్మగడ్డి వేసి మరో పది నిమిషాలు మరిగించి, ఆవిరి బయటికి రాకుండా మూతపెట్టేయాలి. కప్పులో తేనె వేసుకొని, తేనీటిని అందులోకి వడకట్టుకోవాలి. చక్కటి పరిమళంతో పసందైన నిమ్మగడ్డి టీ రెడీ!. మధుమేగ్రస్తులు బెల్లం ఉపయోగించొచ్చు లేదా వేయకుండా తీసుకోవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలు..దీనిలో ఉండే సిట్రల్ జెరేనియల్ గుండె జబ్బులు, స్ట్రోక్‌లు వంటివి రాకుండా కాపాడుతుంది. యాంటీ కేన్సర్ సామర్థ్యాలను కలిగి ఉంది. లెమన్ గ్రాస్‌లో ఉండే ఔషధ గుణాలు కేన్సర్‌తో పోరాడటంలో సహాయపడతాయి. సెల్ డెత్‌కు కారణమయ్యే వాటిని నివారించేలా రోగ నిరోధక శక్తిని పెంచి కేన్సర్‌తో పోరాడగలిగే శక్తిని ఇస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుంది. రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేగాదు ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల నిమ్మరసం మూత్ర ఉత్పత్తిని పెంచి రక్తపోటును తగ్గిస్తుంది.కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుందిబరువు తగ్గడంలో సహాయపడుతుంది జీవక్రియను నియంత్రిస్తుంది. శరీరం నుంచి అదనపు వ్యర్థాలను తొలగించి జీవక్రియను వేగవంతం చేస్తుంది. రుతుక్రమంలో ఎదురయ్యే అధిక రక్తస్రావం వంటి అసౌకర్యాలను తగ్గిస్తుంది. ఇది ఎంత సురక్షితమైనదైనప్పటికీ అతిగా తాగితే దుష్ప్రభావాలను ఎదుర్కొనక తప్పదు. అవేంటంటే..తల తిరగడంఆకలి పెరగటంనోరు పొడిబారడంతరుచుగా మూత్రవిసర్జన అలసటదద్దుర్లు, దురద, శ్వాస ఆడకపోవడం, వేగవంతమైన హృదయ స్పందన వంటి అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ గర్భవతిగా ఉన్నట్లయితే, వాళ్లలో తక్కువ హృదయ స్పందన రేటు లేదా తక్కువ పొటాషియం స్థాయిని కలిగి ఉంటే ఎట్టిపరిస్థితుల్లో లెమన్‌గ్రాస్ టీని తాగకూడదు.(చదవండి: హెయిర్ పెర్ఫ్యూమ్లు ఎక్కువగా ఉయోగిస్తున్నారా? నిపుణులు వార్నింగ్) -
నిమ్మ.. ‘ధర’హాసం
తెనాలి: నిమ్మ ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఆ రైతుల మోముల్లో ‘ధర’ హాసం కనిపిస్తోంది. దిగుబడి కొంతమేర తగ్గినప్పటికీ, మార్కెట్లో గరిష్ట ధరలకు క్రయ, విక్రయాలు సాగడంతో రైతులు దిల్ఖుష్ గా ఉన్నారు. నిమ్మకాయల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఏడు రాష్ట్రాల్లో ఆంధప్రదేశ్ ఒకటి. రాష్ట్రంలో గూడూరు, ఏలూరు మార్కెట్ల తర్వాత నిమ్మకాయలకు ప్రసిద్ధి తెనాలి మార్కెట్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆరు వేల ఎకరాలకుపైగా నిమ్మతోటలు సాగులో ఉంటే అందులో అత్యధిక విస్తీర్ణం తెనాలి డివిజనులోనే ఉంది. కృష్ణా జిల్లాలో తిరువూరు ప్రాంతంలో 800 ఎకరాల్లో నిమ్మతోటలున్నాయి. ఆ జిల్లా రైతులు దగ్గర్లోని ఏలూరు మార్కెట్‌కు వెళుతుంటారు. తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలోని నిమ్మ మార్కెట్లో ప్రతిరోజూ లావాదేవీలు జరుగుతుంటాయి. ఇక్కడ్నుంచి ఉత్తర భారతదేశంలోని కాశీ, కోల్‌కతా, ఢిల్లీ, కాన్పూర్‌కు ఎగుమతి చేస్తున్నారు. సీజనులో 12 లారీలకుపైగా అన్ సీజనులో నాలుగైదు లారీల సరుకు ఎగుమతి అవుతుంటుంది. నికరమైన ఆదాయం నిమ్మతోటలు ఏటా జూలై, డిసెంబరు, మే నెలల్లో మూడు కాపులనిస్తాయి. ఒక కాపు మూడేసి నెలలు దిగుబడి నిస్తుంటాయి. ప్రతి కాపునకు సుమారు 200 టిక్కీల వరకు కాయ దిగుబడి వస్తుంది. కాయ సైజు ఆధారంగా ఒక్కో టిక్కీకి 55 కిలోలు వస్తాయి. కొన్నేళ్లుగా నిమ్మతోటల రైతులకు నికరమైన ఆదాయం వస్తున్నందున, కౌలు ధరలు పెరిగాయి. ఎకరా కౌలు రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు చేరిన సందర్భాలున్నాయి. ఎరువులు, పురుగు మందులు, నీటితడులకు కలిపి ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఖర్చు చేయాల్సివస్తుంది. అయినా సరే నిమ్మసాగు లాభిస్తున్నందున మెట్ట ప్రాంతం నుంచి డెల్టా, మాగాణి భూములకు విస్తరించింది. ఈ ఏడాది భేషుగ్గా... గతంకన్నా ఈ ఏడాది నిమ్మ సాగు రైతులకు సంతృప్తినిచ్చింది. తెనాలి నిమ్మ మార్కెట్లో కిలో రూ.50 నుంచి రూ.70 మధ్య విక్రయాలు జరుగుతూ వచ్చాయి. గత ఏప్రిల్‌లో కనిష్ట ధర రూ.68, గరిష్టంగా రూ.80కి పైగా కొనుగోళ్లు జరిగాయి. ఏప్రిల్ 24న కిలో రూ.90లకు అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్ 28 నుంచి కిలో రూ.65లపైన మార్కెట్ లావాదేవీలు కొనసాగుతూ వచ్చాయి. మే ఒకటో తేదీన గరిష్ట ధర రూ.78 పలికింది. ఫుల్ జోష్‌లో ఉన్న రైతులకు, సీజను ముగింపు దశలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత ధరల్లో తగ్గుదల కొంత నిరాశపరిచింది. ఎన్నికల కోసం నాలుగు రోజులు సెలవులివ్వటం, తర్వాత వర్షాలు పడటంతో వ్యాపారులు రేటు తగ్గించినట్టు చెబుతున్నారు. అయినప్పటికీ కిలో రూ.30కిపైగా కొనుగోళ్లు జరుగుతుండటం ఒకింత ఊరట. ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు కౌలుకు తీసుకున్న రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జూన్‌లో వచ్చే ఏరువాక పౌర్ణమికి నిమ్మ తోటలకు రైతులు మళ్లీ కౌలు ఒప్పందాలు చేసుకుంటారు. గతంలో తీవ్ర నష్టాలు లాభదాయకమైన నిమ్మతోటల సాగు 2017, 2018 సంవత్సరాల్లో రైతులకు చేదు అనుభవాలను మిగిల్చింది. 2017 ఏప్రిల్‌లో కిలో రూ.20–30 మధ్య పలికిన ధర, మరో నెలకు రూ.12–20 మధ్యకు దిగజారింది. జూన్‌లో మరింతగా పతనమై రూ.5 నుంచి రూ.10లకు పడిపోయింది. జులైలో రూ.7లకు మించలేదు. మళ్లీ 2018లోనూ అదే పరిస్థితి ఎదురైంది. కిలో ఆరేడు రూపాయలకు మించటం లేదని రైతులు గొల్లుమన్నారు. కోత కూలీ కూడా దక్కదన్న భావనతో కాపు కోయకుండా వదిలేసిన సందర్భాలున్నాయి. ఖర్చులు లెక్కేసుకుంటే ఒక్కో నిమ్మకాయకు రైతుకు మిగిలేది కేవలం 10 పైసలు మాత్రమే. అప్పట్లో ఈ పరిణామాలు నిమ్మ తోటల కౌలు ఒప్పందాలపైనా నష్టాల ప్రభావం చూపాయి. ఎకరా కౌలు రూ.65 నుంచి రూ.70 వేలకు మించలేదు.కరోనాలో ఆదుకున్న ప్రభుత్వం కరోనా మహమ్మారి నిమ్మతోటల కౌలుదార్లను బెంబేలెత్తించింది. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా అమ్మకాలకు బ్రేక్ పడింది. తర్వాత కూడా ఇతర రాష్ట్రాల్నుంచి ఆర్డర్లు లేకుండాపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ చొరవ తీసుకుని వారానికి మూడు రోజులు కొనుగోళ్లు చేసి, ఆదుకోవడంతో కొంతలో కొంత కోలుకోగలిగాం. అప్పట్లో కేవలం నెల రోజుల్లో 850 టన్నులను రైతుల్నుంచి కొనుగోలు చేసి ఎగుమతి చేసింది. లారీల సమ్మె రోజుల్లోనూ నిమ్మ రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నిలకడగా మంచి ధర లభిస్తుండటంతో ఫర్వాలేదని చెబుతున్నారు.మిగులు గ్రాములు లెక్కిస్తే మేలు నిమ్మ కాపు కాస్త తగ్గినప్పటికీ నిమ్మకాయ ధరలు ఈ ఏడాది సంతృప్తికరంగా ఉన్నాయి. మార్కెట్ యార్డులో మిగులు గ్రాములు లెక్కలోకి తీసుకోవటం లేదు. 10 కిలోల 500 గ్రాములు తూకం వస్తే 10 కిలోలకే లెక్కిస్తున్నారు. దీనివల్ల రైతులకు నష్టం. గ్రాములను కూడా పరిగణనలోకి తీసుకుంటే మాకు మేలు జరుగుతుంది. – కొత్త రమేష్ బాబు, నిమ్మ రైతు, సంగంజాగర్లమూడి -
ఒక్క నిమ్మకాయ ఖరీదు రూ.50 వేలు, స్పెషల్ ఏంటంటే?
అసలే ఎండాకాలం నిమ్మకాయలకు మంచి డిమాండ్ ఉంది. మార్కెట్లో కూడా నిమ్మకాయల ధరలు వేడిగానే ఉన్నాయి. ఒక నిమ్మకాయ పది రూపాయలంటేనే కొనుగోలుదారుడు ఓ అడుగు వెనక్కి వేస్తాడు. కానీ తమిళనాడులో మాత్రం తొమ్మిది నిమ్మకాయలు ఏకంగా రూ.2.36 లక్షలకు అమ్ముడయ్యాయి. ఇంత ధరకు అమ్ముడు పోవడానికి కారణం ఏంటనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మురుగన్ (సుబ్రమణ్య స్వామి) దేవాలయ నిర్వాహకులు ఉతిరమ్ పండుగ సందర్భంగా నిమ్మకాయలను వేలం వేస్తారు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న జంటలు ఈ పండుగ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి వేలంలో నిమ్మకాయలను కొనుగోలు చేస్తారు. ఇందులో తొమ్మిది నిమ్మకాయలు రూ.2.36 లక్షలకు అమ్ముడయ్యాయి. తొమ్మిది రోజుల పండుగలో మొదటి రోజున బల్లెముపై ఉన్న నిమ్మకాయ అన్నింటికంటే శక్తివంతమైనదని భక్తులు విశ్వసిస్తారు. ఈ నిమ్మకాయను ఈ సంవత్సరం ఒక జంట రూ.50,500 కి కొనుగోలు చేశారు. ఆ తరువాత కూడా ఆయాల ఉత్సవాల్లో ప్రతి రోజు పూజారులు దేవుడి బల్లెంపై ఒక నిమ్మకాయను ఉంచి పూజిస్తారు. కేవలం బిడ్డలను కనాలని చూస్తున్న వారికే మాత్రమే కాదు, వ్యాపారవేత్తలు కూడా ఈ నిమ్మకాయల కోసం పోటీ పడతారని స్థానిక చెబుతున్నారు. దేవాలయాల్లోని నిమ్మకాలయలను భారీ ధరకు వేలంలో విక్రయించడం ఇదేమీ కొత్త కాదు. 2018లో కూడా తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో టెంపుల్ ఫెస్ట్‌లో భాగంగా ఒక నిమ్మకాయను 7600 రూపాయలకు విక్రయించారు. -
ఒక్క నిమ్మకాయ రూ.35వేలు!
తమిళనాడులోని ఓ ఆలయంలో నిర్వహించిన వేలంలో ఒక్క నిమ్మకాయ రూ.35,000 పలికింది. శివరాత్రి సందర్భంగా ఆ మహా శివుడికి సమర్పించిన నిమ్మకాయను ఆలయ అధికారులు వేలం వేయగా ఓ భక్తుడు అత్యధిక మొత్తానికి దక్కించుకున్నారు. తమిళనాడులోని ఈరోడ్‌కి 35 కిలోమీటర్ల దూరంలోని శివగిరి గ్రామ సమీపంలోని పాతపూసయ్య ఆలయంలో శుక్రవారం రాత్రి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శివుడికి సమర్పించిన నిమ్మకాయ, పండ్లతోపాటు ఇతర వస్తువులను ఆచారం ప్రకారం వేలం వేశారు. ఈ వేలంలో 15 మంది భక్తులు పాల్గొనగా, ఈరోడ్‌కు చెందిన ఒక భక్తుడు రూ. 35,000కు నిమ్మకాయను దక్కించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేలం వేసిన నిమ్మకాయను ఆలయ పూజారి స్వామివారి ముందు ఉంచి పూజ చేసి వందలాది మంది భక్తుల సమక్షంలో వేలం దక్కించుకున్న భక్తుడికి అందజేశారు. స్వామివారికి సమర్పించిన నిమ్మకాయను పొందడం అదృష్టంగా భక్తులు భావిస్తారు. తమకు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయని నమ్ముతారు. -
నిమ్మచెక్కతో వంటిటి సమస్యలకు ఇలా చెక్‌పెట్టండి!
వంటిట్లో పనిచేస్తున్నప్పుడూ కొన్ని సమస్యలు తరుచుగా ఎదురవ్వుతుంటాయి. ఓ పట్టాన వాటిని వదిలించుకోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా చేపలు, వెల్లుల్లి వంటి వాటిని బాగు చేస్తున్నప్పడూ చేతుల వాసన ఓ పట్టాన వదలదు. ఎంతలా సబుతో రుద్ది కడిగినా వదలదు. అలాగే కూరగాయాలు తరిగే చెక్క, కుళాయిలపై ఉండే మరకలు కూడా అస్సలు వదలవు. అలాంటి సమస్యలకు జస్ట్ నిమ్మకాయతో చెక్పెట్టేయొచ్చట. పైగా క్రిములు చేరవు ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..\ చేపలూ, ఉల్లిపాయ, వెల్లుల్లి.. వంటివి తరిగినప్పుడు వాటి వాసన చేతులకు అంటుకుంటుంది. అప్పుడు టీపొడిని కొద్దిగా రాసుకుని ఐదు నిమిషాలయ్యాక సబ్బుతో కడిగేస్తే చాలు. కాయగూరలు తరిగే చెక్కని నిమ్మచెక్కతో రుద్ది కాసేపయ్యాక కడిగేయండి. మరకలు పోతాయి. ఎప్పుడైనా దానిపై మాంసం కోసినా.. నిమ్మచెక్కతో రుద్దితే క్రిములు వృద్ధి చెందకుండా ఉంటాయి నిమ్మచెక్కలని సన్నగా తరిగి కాసిని నీళ్లలో వేసి ఆ పాత్రని మైక్రో ఓవెన్లో కొన్ని నిమిషాలు ఉంచి తీసేయండి. అలా చేస్తే దుర్వాసనలు తొలగిపోవడంతో పాటూ లోపల పడి ఉన్న పదార్థాలని శుభ్రం చేయడం కూడా తేలికవుతుంది. ఫ్రిజ్‌లో ఓ మూలగా నిమ్మచెక్కని పెట్టి చూడండి. అందులోంచి వచ్చే దుర్వాసనలు పోతాయి. స్టీలు కుళాయిలపై నీటిమరకలు పడుతుంటాయి. అవి తెల్లగా మారాలంటే వాటిని నిమ్మచెక్కతో రుద్ది కడిగితే చాలు. వేపుడు కూరలనగానే నూనె గుర్తొచ్చి భయం వేస్తుంది. కానీ ఇలా చేస్తే నూనె తక్కువగా రుచికరమైన వేపుడు కూరలను ఆస్వాదించవచ్చు. బెండకాయ వేపుడులో నూనె తగ్గిస్తే జిగురు అడుగున నల్లగా పట్టేస్తుంటుంది. కాబట్టి అడుగు పట్టకుండా వేగడానికి నూనె ఎక్కువ వేయాల్సి వస్తుంది. బెండకాయ ముక్కల్లో ఒక స్పూన్ పెరుగు లేదా మజ్జిగ లేదా పాలు వేస్తే జిగురు విరిగిపోయి ముక్కలు అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి, తక్కువ నూనెతో చక్కగా వేగుతాయి. దొండకాయ వేపుడు చేసేటప్పుడు ధనియాల పొడి వేస్తే నూనె ఎక్కువ వేయాల్సిన పని ఉండదు. (చదవండి: స్కూల్లో ఏఐ పంతులమ్మ పాఠాలు! అచ్చం ఉపాధ్యాయుడి మాదిరిగా..) -
నిమ్మ రసం తాగుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి!
#LemonWater Side Effects వేసవి కాలం వచ్చిందంటే నిమ్మకాయలకు గిరాకీ పెరుగుతుంది. సమ్మర్ సీజన్లో నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వేసవిలో శరీరానికి కావల్సిన నీరు అందించడంతోపాటు, జీర్ణ సమస్యలను తొలగించడం, బరువు నియంత్రణలో కూడా సాయం చేస్తుంది. కానీ నిమ్మ నీరు ఎక్కువగా తాగితే దుష్ప్రభావాలు ఉంటాయని మీకు తెలుసా? నిజానికి నిమ్మలో ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, పొటాషియం వంటి ఖనిజాలు , ఫోలేట్ వంటి పోషకాలతో తోపాటు సీ విటమిన్ అధికంగా లభిస్తుంది. నీటికి రుచిని ఇవ్వడంతో పాటు, నిమ్మ రసం చర్మానికి మెరుపు నిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ మోతాదు మించి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిమ్మరసం- సైడ్ ఎఫెక్ట్స్ ♦ గుండెల్లో మంట వస్తుంది. మోతాదు మించితే పెప్టిక్ అల్సర్ వచ్చే ప్రమాదం, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) ఉన్నవారు నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. అలాగే సిట్రస్ పండ్లు తరచుగా తీసుకొంటే మైగ్రేన్, తలనొప్పి పెరుగుతాయి. ♦ డీహైడ్రేషన్ తలెత్తే ప్రమాదం ఎక్కువే. ఎందుకంటే లెమన్ వాటరతో మూత్రం అధికమై, శరీరంలోని నీరు బయటకు పోతుంది. దీంతో ఎలక్ట్రోలైట్లు , సోడియం వంటి మూలకాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి. అతిగా సేవిస్తే పొటాషియం లోపం ఏర్పడుతుంది. ♦ విటమిన్ సీ మోతాదు ఎక్కువై, రక్తంలో ఐరన్ లెవల్స్ పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని సిట్రిక్ యాసిడ్, ఆక్సలేట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం. ♦ఎసిడిటీ వస్తుంది. ♦ ఎముకలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ♦ టాన్సిల్ సమస్య ఉన్నవారు నిమ్మరసానికి దూరంగా ఉండాలని, ఇది గొంతునొప్పి దారితీస్తుందని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది ♦ నిమ్మలోని సిట్రస్ వల్ల పళ్ల ఎనామిల్‌కు నష్టం. దంత సమస్యలు కూడా వస్తాయి -
ఇవి నిజంగానే 'గజ' నిమ్మకాయలు!
సాధారణంగా నిమ్మకాయలు ఏ సైజులో ఉంటాయో అందరికీ తెలిసిందే. మహా అయితే బాగా పెరిగితే కోడిగుడ్డు సైజుకి దగ్గరగా ఉండొచ్చు అంతేగానీ బాహుబలి రేంజ్లో నిమ్మకాయలు పెరగడం అనేది జరగదు. దబ్బకాయలాంటి నిమ్మజాతి పండ్లు పెద్దగా ఉంటాయి. అవి కూడా మోస్తారుగా ఓ బత్తాకాయ సైజులో ఉంటాయి అంతే!. కానీ ఈ నిమ్మకాయి మాత్రం అన్నింటిని తలదన్నేలా భారీ సైజులో ఉంది. ఎక్కడంటే..? కర్ణాటకలో కొడుగు జిల్లాలోని పలిబెట్ట ప్రాంతానికి చెందిన విజు సుబ్రమణి ఈ భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం క్యూ కడుతుండటం విశేషం. ఇవి అరుదుగా ఐరోపా వంటి దేశాల్లోనే కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఊరగాయాలు, శీతల పానీయాల తయారీకి ఉపయోగిస్తారని వెల్లడయ్యింది. ఈ మొక్కలు ఆ రైతు వద్దకు ఎలా వచ్చాయంటే..? విజు సుబ్రమణి నాలుగేళ్ల క్రితం మైసూర్ వెళ్లినప్పుడు అక్కడ ఒక మార్కెట్లో ఈ విత్తనాలను కొనుగోలు చేశానని తెలిపారు. ఆ తర్వాత వాటిని తన ఇంటి సమీపంలో ఉన్న గార్డెన్లో పెంచానని అన్నారు. అయితే పెరిగిన మొక్కలను తీసి కాఫీ తోటలో సాగు చేసినట్లు చెప్పుకొచ్చారు. మూడేళ్లకు ఈ నిమ్మచెట్లు పెరిగి పెద్దవయ్యాయని తెలిపారు. అయితే ఆ చెట్లకు నిమ్మ పువ్వులు, కాయలు గానీ రాలేదు. దీంతో ఇది నిమ్మ చెట్టేనా..! అనే అనుమానం వచ్చింది. ఈలోగా కొద్దిరోజులకే పంట రావడం మొదలైంది. చూస్తుండగానే నిమ్మకాయలు పెద్దగా భారీ పరిమాణంలో కాసాయని చెప్పారు రైలు సుబ్రమణి. సాధారణంగా నిమ్మకాయ 60 గ్రాముల బరువు ఉండి, రెండు నుంచి మూడు అంగుళాల పొడవే ఉంటాయి. ఈ నిమ్మకాయ మాత్రం ఒక్కొక్కటి ఏకంగా 5 కిలోల బరువు ఉండి.. ఆరడగులు వరకు పెద్దగా పెరగడం విశేషం. ఇక్కడ కర్ణాటక రైతు ఆ నిమ్మకాయలను ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నట్లు తెలిపారు. ఈ భారీ నిమ్మకాయల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల తోపాటు ఔషధ ఉపయోగాలున్నాయని చెబతున్నారు నిపుణులు. (చదవండి: మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పది సేఫ్టీ యాప్‌లు ఇవే..!) -
స్పైసీ ఫుడ్స్‌తో నిమ్మరసాన్ని జత చేస్తున్నారా?
విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మకాయతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. రోజూ నిమ్మరసాన్ని సేవిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే నిమ్మకాయను కొన్ని పదార్థాలతో కలిపి సేవించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పనీర్ తయారు చేసేటప్పుడు మరిగే పాలలో నిమ్మరసం పిండుతారు. అయితే ఇందులో ఉండే యాసిడ్ ప్రోటీన్లను దెబ్బతీస్తుంది. ఫలితంగా యాసిడ్ రిఫ్లెక్షన్ ఏర్పడి గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకే పనీర్‌లో నిమ్మరసం కలపడం మంచిది కాదు. చాలామంది సలాడ్‌లో ఎక్కువగా నిమ్మరసం ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని రకాల పండ్లతో నిమ్మరసం కలవడం రియాక్షన్ ఇస్తుంది. ముఖ్యంగా బొప్పాయిని నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లతో కలిపితే నష్టం వాటిల్లుతుంది. యాసిడ్ రిఫ్లెక్షన్ ఏర్పడి ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడవచ్చు. అదేవిధంగా చాలామంది... ముఖ్యంగా మద్యపాన ప్రియులు కాక్టెయిల్స్, బీర్లతో నిమ్మకాయను ఉపయోగిస్తారు. కానీ నిమ్మ, రెడ్ వైన్ కాంబినేషన్ ఏ మాత్రం మంచిది కాదు. నిమ్మలోని ఎసిడిటీ రెడ్వైన్లోని టానిన్లను ప్రభావితం చేయడం వల్ల వైన్ చేదెక్కడంతోపాటు దుష్ఫ్రభావాలూ కలుగుతాయి. నిమ్మలో ఉండే ఎసిడిటీ స్వభావం వల్ల స్పైసీ ఫుడ్స్‌తో కలిపి తిన్నప్పుడు శరీరంలో వేడి పెరగడమే కాకుండా జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి. అందుకే స్పైసీ ఫుడ్స్‌లో నిమ్మ వినియోగం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేడి వేడి ఆహారంలో నిమ్మరసం అసలు కలపకూడదు. అలా కలపడం వల్ల నిమ్మలోని విటమిన్ సి దూరమవుతుంది. (చదవండి: డయాబెటిస్ పేషెంట్లకు ఈ పండ్లు..కూరగాయాలతో మేలు!) -
నిమ్మచెక్కలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఏం అవుతుందంటే..
కిచెన్ టిప్స్ : ►నిమ్మచెక్కతో మరకలు ఈజీగా పోతాయి కాయగూరలు తరిగే చెక్కని నిమ్మచెక్కతో రుద్ది కాసేపయ్యాక కడిగేయండి. మరకలు పోతాయి. ఎప్పుడైనా దానిపై మాంసం కోసినా.. నిమ్మచెక్కతో రుద్దాలి. క్రిములు వృద్ధి చెందకుండా ఉంటాయి. ► నిమ్మచెక్కలని సన్నగా తరిగి కాసిని నీళ్లలో వేసి ఆ పాత్రని మైక్రో ఓవెన్ లో కొన్ని నిమిషాలు ఉంచి తీసేయండి. అలా చేస్తే దుర్వాసనలు తొలగిపోవడంతో పాటూ లోపల పడి ఉన్న పదార్థాలని శుభ్రం చేయడం కూడా తేలికవుతుంది. ► ఫ్రిజ్‌లో ఓ మూలగా నిమ్మచెక్కని పెట్టి చూడండి. అందులోంచి వచ్చే దుర్వాసనలు పోతాయి. ► స్టీలు కుళాయిలపై నీటిమరకలు పడుతుంటాయి. అవి తెల్లగా మారాలంటే వాటిని నిమ్మచెక్కతో రుద్ది కడిగితే చాలు. -
టిఫిన్స్‌లోకి నిమ్మకాయ ఇన్స్టంట్ పచ్చడి.. ఇలా చేసుకోండి
ఉల్లి, పల్లి, కొబ్బరి, వెల్లుల్లి, పుట్నాల పచ్చళ్లు తినితిని చప్పగా మారిన నాలుకకు ఊరించే చట్నీలు కనిపిస్తే ప్రాణం లేచివస్తుంది. అందుకే చూడగానే నోరూరించే చట్నీలతో ఈ వారం వంటిల్లు మీకోసం... నిమ్మకాయ ఇన్స్టంట్ పచ్చడి తయారికి కావల్సినవి: నిమ్మకాయలు – పది; బెల్లం – అరకప్పు; జీలకర్ర – నాలుగు టీస్పూన్లు; ఎండు మిర్చి – ఇరవై; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►నిమ్మకాయలను నాలుగు ముక్కలుగా కట్ చేయాలి.ముక్కల్లో ఉన్న గింజలన్నింటినీ తీసేయాలి (గింజలు ఉంటే పచ్చడి చేదుగా వస్తుంది). ► నిమ్మకాయ ముక్కలు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా పేస్టుచేయాలి ► ఎండు మిర్చి, బెల్లంను కలిపి పొడిచేయాలి ∙ఇప్పుడు నిమ్మకాయ పేస్టులో ఎండుమిర్చి పొడి, రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి. ► తాలింపు కావాలంటే వేసుకోవచ్చు. తాలింపు లేకపోయినా బావుంటుంది. ► ఈ చట్నీని వెంటనే కూడా తినవచ్చు. కానీ రెండుమూడు రోజులు మాగాక మరింత రుచిగా ఉంటుంది. ► ఇడ్లీ,దోశ, పరాటా, చపాతీ, అన్నంలోకి ఈ చట్నీ చాలా బావుంటుంది. -
ఉదయాన్నే నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటున్నారా? వేసవిలో ఇలా చేస్తే..
ఎండాకాలం కాసేపు బయటికి వెళితే చాలు ముఖచర్మం కమిలిపోతుంది. విపరీతంగా చెమటలు పోస్తాయి. నీరసం, నిస్త్రాణ కలుగుతాయి. కాసేపు పని చేస్తే చాలు శరీరం అలసిపోయి, సొమ్మసిల్లినట్లు అవుతుంది. బయటికి వెళ్లేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే ఎండల్లోనూ అందంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అవేమిటో చూద్దాం... పుదీనా, నిమ్మరసం- తేనెతో ►మంచి నీటిని మించిన ఔషధం లేదు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడేది మంచినీరు మాత్రమే. కాబట్టి ఇప్పటినుంచీ దాహం వేసినా వేయకపోయినా వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగడం అలవాటుగా మార్చుకోండి. ►గుప్పెడు పుదీనా ఆకులను తాగే నీటిలో వేసుకుంటే... శరీరం చల్లగా ఉంటుంది. ఈ కాలంలో పుదీనా టీని ఎంచుకుంటే మరీ మంచిది. ఎండ ప్రభావాన్ని కొంతవరకూ తట్టుకోగలుగుతారు. ►నిమ్మరసం వేసవికి ఔషధం లాంటిది. ఉదయాన్నే గ్లాసు నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. పెరుగు తీసుకుంటే ఉప్పు, కొద్దిగా మసాలాలు జోడించి పెరుగు చిలికి చేసే మజ్జిగ శరీరంలో వేడిని చల్లారుస్తుంది. డీహైడ్రేషన్ ను నివారిస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్ల భరితం. వేసవి తాపంతో పోరాడటానికి మజ్జిగ ఒక మంచి ఆప్షన్. దీనిలో క్యాలరీలు తక్కువ. కాల్షియం, పొటాషియంతో పాటు ప్రొటీన్ కూడా దీని నుంచి దొరుకుతుంది. అసిడిటీని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా పెరుగు తీసుకోవడం కూడా మంచిదే. కొత్తిమీర రసంతో ►గసగసాలను ఎక్కువగా ఆహారపదార్థాల్లో వాడాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు, వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ►కొత్తిమీరను ఆహారంలో అధికంగా తీసుకోవాలి. కొత్తిమీర రసం లేదా వంటకాల్లో దీన్ని వాడినా... శరీరంలోని అధిక ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. సీజనల్ పండ్లు తినడం వల్ల ►వేసవిలో ఆయిల్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఇంటి వంటలలో కూడా నూనె వాడకం తగ్గించాలి. ►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా కూరలు తగ్గించాలి. ►అల్పాహారంగా ఆవిరి కుడుములు, ఇడ్లీ వంటివి తీసుకుంటే మేలు. ►కర్బూజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజలు వంటి సీజనల్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ►వేసవిలో రోజుకోసారి రాగిజావ తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతోపాటు మరెన్నో లాభాలు ఉన్నాయి. ►రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. చర్మ సంరక్షణ ముఖ్యం ►వేసవిలో సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవడం వల్ల చర్మానికి సమస్యలు తగ్గుతాయి. ఈ సన్ స్క్రీన్ లోషన్‌ని బయటికి వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకోండి. సన్ స్క్రీన్ లోషన్ వాడటం వల్ల చర్మ సమస్యలు ఉండవు. అలాగే చర్మానికి రక్షణ ఉంటుంది. ►ఎండల్లో బయటకు వెళ్ళినప్పుడు చర్మాన్ని కవర్ చేసుకోవడం అవసరం. కాబట్టి మీరు బయటకు వెళ్లేటప్పుడు గొడుగుని తీసుకువెళ్లడం మర్చిపోకండి. అలానే ఎండాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్‌ని ధరించడం, తలకు పెద్ద టోపీ పెట్టుకోవడం పైగా ఎలాంటి సమస్యలూ రావు. చదవండి: ఇరవై మందార పూలు.. మెంతులు.. పచ్చకర్పూరం! ఇలా చేస్తే ఒత్తైన కురులు -
నోరూరించే రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పలుచగా ఉంటేనే..
Holi Recipes 2023: రంగుల పండుగ వస్తోంది. రంగరంగ వైభవంగా వస్తోంది. తీపి జ్ఞాపకాలను తెస్తోంది. రుచులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ ఏటి హోలీ ఇచ్చిన తీపి రుచిని... రాబోయే హోలీ వరకు మర్చిపోదు మది. రసగుల్ల తయారీ విధానం ఇలా: కావలసినవి: ►పాలు – లీటరు (వెన్న తీయనివి) ►నిమ్మరసం– 3 టేబుల్ స్పూన్లు ►చక్కెర – 2 కప్పులు ►నీరు – లీటరు ►పాలు – టేబుల్ స్పూన్ ►ఉప్మారవ్వ– టీ స్పూన్ ►పిస్తాపలుకులు : 20 తయారీ: ►పాలను మందపాటి పాత్రలో పోసి స్టవ్ మీద పెట్టాలి. ►బాగా మరిగిన తర్వాత మంట తగ్గించి నిమ్మరసం వేసి కలపాలి. ►ముందు సగం నిమ్మరసం వేసి కలిపి చూసి, పాలు బాగా విరిగితే మిగిలిన రసాన్ని ఆపేయాలి. ►పాలు సరిగ్గా విరగకపోతే మొత్తం రసాన్ని వేసి కలపాలి (పాశ్చరైజేషన్ జరగని పాలకు ఒక స్పూన్ నిమ్మరసం సరిపోతుంది). ►విరిగిన పాలను పలుచని వస్త్రంలో పోసి మూట కట్టి ఏదైనా కొక్కేనికి వేలాడదీయాలి. ►ఓ అరగంట తర్వాత నీరు పోయేలా చేత్తో గట్టిగా నొక్కాలి. ►ఆ తర్వాత పైన బరువు పెట్టాలి. ఇలా చేయడం వల్ల నీరంతా కారిపోతుంది. ►పాల విరుగు మాత్రం మూటలో మిగులుతుంది. ►పాలవిరుగులో రవ్వ వేసి వేళ్లతో నలుపుతూ కలపాలి. ఇలా చేస్తూ ఉంటే ముందుగా పాల విరుగు పొడిగా మారుతుంది. ►మరికొంత సేపటికి ముద్దగా అవుతుంది. ►ఇప్పుడు ఆ ముద్దను చిన్న చిన్న గోళీలుగా చేయాలి. ►వెడల్పుగా, లోతుగా ఉన్న కడాయిలో చక్కెర, నీరు పోసి వేడి చేయాలి. ►చక్కెర కరిగిన తరవాత అందులో టేబుల్ స్పూన్ పాలు వేయాలి. ►రెండు నిమిషాలకు చక్కెర ద్రవం శుభ్ర పడి అందులోని మలినాలు నల్లగా పైకి తేలుతాయి. ►స్పూన్‌తో కానీ చిల్లుల గరిటెతో తీసేయాలి లేదా పలుచని వస్త్రంలో వడపోయడం మంచిది. ►వడపోసిన ద్రవాన్ని మళ్లీ కడాయిలో పోసి మరిగించాలి. ►ఇప్పుడు చక్కెర ద్రవంలో పాల విరుగుతో చేసిన గోళీలను వేసి నాలుగైదు నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికించాలి (పెద్ద మంట మీద ఉడికిస్తే రసగుల్లాలు విరిగిపోతాయి). ►చిన్న గోళీలుగా వేసిన రసగుల్లాలు చక్కెర పాకాన్ని పీల్చుకుని పెద్దవవుతాయి. ►అప్పుడు స్టవ్ ఆపేయాలి. ►వేడి తగ్గిన తరవాత కప్పులో రసగుల్లాతోపాటు ఒక టేబుల్ స్పూన్ సిరప్, పిస్తా వేసి సర్వ్ చేయాలి. గమనిక: రసగుల్లాలకు చేసే చక్కెర ద్రవం పలుచగా ఉండాలి. పాకం రాకూడదు. ఇవి కూడా ట్రై చేయండి: వంకాయ బోండా.. భలే రుచి.. ఇలా తయారు చేసుకోండి! బనానా, ఓట్స్‌తో కజ్జికాయలు తయారు చేసుకోండిలా! -
కొబ్బరి పాలతో స్క్రబ్.. వేపాకులు వేసిన నీటితో స్నానం చేస్తే..
చర్మ యవ్వనంగా కనిపించాలని.. మేని మెరిసిపోవాలని కోరుకునే వారు ఈ చిట్కాలు ట్రై చేస్తే సరి. కొబ్బరి పాలతో.. ►కొబ్బరి పాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనివల్ల ఎక్కువ కాలం చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ►కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖానికి, మెడకు రుద్దుకోవాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ►ఇలా యాంటీ ఏజింగ్ ప్యాక్స్‌ను వారానికి రెండు నుంచి మూడు సార్లు వేసుకోవడం ద్వారా చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు. మేనికాంతికి ఉసిరి.. నిమ్మ... నారింజ తేమను తరచూ మన ముఖానికి రాసుకుంటూ ఉంటే, ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు తగ్గుముఖం పడతాయి. తేనెతో పెదవులకు మసాజ్ చేస్తే మృదువుగా, అందంగా కనిపిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మెరిపించడంలో విటమిన్ సి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందువల్ల విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరిని అది దొరికినంతకాలం విరివిగా తీసుకోవాలి. నిమ్మకాయ, నారింజలోనూ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉసిరి దొరకనప్పుడు వీటిని తరచూ తీసుకోవడం వల్ల కూడా అందంగా మారవచ్చు. అలాగే, వేపాకులు వేసిన నీటితో స్నానం చేయడం, తరచు ముఖాన్ని కడుక్కోవడం, ద్రవపదార్థాలు సమృద్ధిగా తీసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు లేకుండా మేని చర్మం మెరుపులీనుతూ ఉంటుంది. చదవండి: Beauty: అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే డివైజ్! ధర ఎంతంటే! -
బ్యూటిప్స్
ఏ కాలంలోనైనా జిడ్డు చర్మం బాగా ఇబ్బంది పెడుతుంటుంది. జిడ్డుపోగొట్టి ముఖం ఫ్రెష్‌గా ఉండడానికి ఎగ్, లెమన్ఫేస్మాస్క్ బాగాపనిచేస్తుంది. ఒక గుడ్డును తీసుకుని దానిలోని తెల్లసొనను ఒక గిన్నెలో వేసి దానికి స్పూను తాజా నిమ్మరసం చేర్చి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. ఫేస్‌మాస్క్ ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల ముఖం మీద జిడ్డు, మొటిమలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డును తొలగించి, ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది ఈ ప్యాక్. -
అమాంతంగా పెరిగిన నిమ్మ ధర.. రేటు ఎంతంటే..?
హనుమంతునిపాడు/కనిగిరి రూరల్: నిమ్మ రైతు పంట పండింది. నిన్న మొన్నటి వరకూ సరైన ధరల్లేక దిగాలుగా ఉన్న రైతుకు మార్కెట్ ధరలు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. వారం రోజుల కిందట వరకూ కిలో రూ.10 నుంచి రూ.15 పలికింది. నేడు మార్కెట్లో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం రూ.25 నుంచి రూ.30 వరకూ పలుకుతున్నాయి. నాణ్యత పెరగడంతో పాటు ఉత్పత్తి తగ్గడంతో నిమ్మకు డిమాండ్ పెరిగింది. రానున్న రోజుల్లో రేటు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలోనే అత్యధికంగా నిమ్మతోటల సాగు కనిగిరి నియోజకవర్గంలోనే జరుగుతోంది. వ్యాపారులు, రైతుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాల వరకు నిమ్మ సాగవుతోంది. ఒక్క కనిగిరి నియోజకవర్గంలోనే సుమారు 32 వేల ఎకరాల వరకు సాగు ఉన్నట్లు అంచనా. అందులో హెచ్ఎం పాడు మండలంలో 20 వేల ఎకరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత సీఎస్ పురం, వెలిగండ్ల మండలాల్లో దాదాపు 12 వేల ఎకరాల వరకు సాగవుతోంది. యర్రగొండపాలెం, చీమకుర్తి, దర్శి, చినారికట్ల, కొణిజేడు తదితర ప్రాంతాల్లో నిమ్మ సాగు చేస్తున్నట్టు సమాచారం. టీడీపీ హాయంలో వర్షాలు లేక చాలా వరకు నిమ్మ తోటలను రైతులు నరికేశారు. వర్షాలు పడక, బోర్ల కింద సాగుచేసిన పంటలకు పెట్టుబడులు పెరిగి వాటికి గిట్టుబాటు ధరల్లేక అల్లాడారు. చాలా మంది తోటలపైనే కాయలు వదిలేశారు. అయినప్పటికీ జిల్లాలో హెచ్ఎం పాడులోనే అత్యధికంగా నిమ్మ సాగు ఉంది. ఈ మండలంలోని ఎర్రనేలలో పండే నిమ్మకు ఎక్కువ శాతం గిరాకీ ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కలిసి వచ్చిన కాలం... ప్రస్తుత కాలంలో వర్షాలు పడి భూగర్భ జలాలు పెరగడంతో రైతులు మళ్లీ నిమ్మతోటల సాగుకు ముందుకొచ్చారు. ఫలితంగా లేత తోటలు అధికంగా ఉండి ముదురు తోటలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత సీజన్లో దిగుబడి రోజుకు నాలుగు, ఐదు లారీలు రావాల్సి ఉండగా, ప్రస్తుతం రెండు లారీల లోడు మాత్రమే మార్కెట్‌కు వస్తోంది. దీంతో సీజన్ ప్రారంభం కావడం, డిమాండ్‌కు తగిన సరుకు అందుబాటులో లేకపోవడంతో ఒక్కసారిగా రూ.10 నుంచి రూ.15 వరకు ధర పెరిగింది. గతంలో ఆటోలు, కూలీల ఖర్చులకుపోను నామ్‌కే వాస్తే ఆదాయంతో దిగాలు చెందుతున్న రైతన్నకు ఒక్కసారి ధరలు పెరగడంతో వారి మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో నిమ్మ ధర రూ.25 నుంచి రూ.30 మధ్య పలుకుతోంది. రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వేసవిలో రూ.50కి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. కనిగిరి టూ ఢిల్లీ, ముంబై, బెంగళూరు... కనిగిరి పట్టణంలో సుమారు 6 వరకు హోల్‌సేల్ వ్యాపార దుకాణాలున్నాయి. సీజన్లో రోజుకు సుమారు 5 నుంచి 6 లారీలు 50 వేల టన్నుల నిమ్మకాయలను చెన్నై, హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ఎక్కువగా చెన్నై, బెంగళూరు మార్కెట్‌కు వెళ్తాయి. అయితే ప్రస్తుతం 2 లారీల నిమ్మకాయలు మాత్రమే మార్కెట్‌కు వస్తున్నాయి. ప్రస్తుతం కేజీ రూ.30 వరకు తీసుకుంటున్నాం వారం రోజుల వరకు కూడా పండు కాయ కేజీ రూ.10కి, పచ్చి కాయ రూ.15కి కొనేవాళ్లం. ప్రస్తుతం కాయ ఎగుమతికి డిమాండ్ రావడం, సరుకు దిగుబడి, ఉత్పత్తి తగ్గడంతో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం పండు కాయ రూ.15కు, పచ్చికాయ రూ.28 నుంచి రూ.30 వరకూ కొనుగోలు చేస్తున్నాం. ఈ ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. మార్చి నెలాఖరునాటికి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. – నర్సయ్య, హోల్ సేల్ వ్యాపారి -
Natural Beauty Tips: నిమ్మరసం, కీరా జ్యూస్, ఆలివ్ ఆయిల్‌తో ఇలా చేస్తే..
►తాజా నిమ్మరసం చర్మం రంగును మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఒక టీ స్పూను తాజా నిమ్మరసం, రెండు టీ స్పూన్లు కీరా జ్యూస్, ఆలివ్ ఆయిల్ మూడు టీ స్పూన్లు తీసుకుని మూడింటినీ కలుపుకోవాలి. ముందుగా నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. వేళ్ళతో నెమ్మదిగా రబ్ చేయాలి. ఆ తర్వాత సబ్బుతో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికే కాకుండా శరీరమంతా కూడా అప్లై చేసుకోవచ్చు. స్నానానికి వెళ్ళే ముందు ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజూ స్నానానికి ముందు చేయడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. అర టీస్పూన్ గంధపు పొడిలో తగినంత రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా మూడు రోజులకోసారి చేస్తూ వుంటే ముడతలు తగ్గడంతో ΄ాటు ముఖ కాంతి మెరుగుపడుతుంది. నల్లమచ్చల నివారణకు... ► నాలుగు తులసి ఆకులు, పావు టీస్పూన్ పసుపు కలిపి పేస్ట్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి15 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ► అరచేతిలో టీ స్పూన్ తేనె తీసుకుని రెండు రేకల కుంకుమ పువ్వుని వేసి రంగరించాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే క్రమంగా నల్ల మచ్చలు తగ్గుముఖం పడతాయి. -
Kitchen Tips: కిచెన్‌లో దుర్వాసనా? యాలకులు, లవంగాలు నీటిలో వేసి వేడి చేసి
కొన్ని రకాల వంటకాలు చేసినపుడు వంట గదిలో వాసనలు అలాగే ఉండిపోతాయి. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి సులువైన చిట్కాలు మీకోసం.. చేపల వాసన పోవాలంటే కిచెన్‌లో చేపల వాసనను పోగట్టడానికి నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుంది. గిన్నెలో వేడి నీరు తీసుకుని.. దానిలో నిమ్మరసం పిండండి. మీగిలిన తొక్కలను కూడా నీటిలోనే వేయండి. దీన్ని ఒక స్ప్రే డబ్బాలో పోసి వంటగదిలో స్ప్రే చేస్తే వాసన పోతుంది. నిమ్మకాయతో ఇలా మీ వంట గదిలో ఏదైనా ఘాటైన వాసన వస్తుంటే. నీటిలో నిమ్మకాయను సగం కట్ చేసి వేయండి. దీన్ని పది నిమిషాలు మరగనివ్వండి. తర్వతా గ్యాస్ కట్టేసి అలా వదిలేయండి. ఇలా చేస్తే మీ వంట గదిలోని ఘాటైన వాసన నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. దానిలో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. సుగంధ ద్రవ్యాలతో.. యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క.. లాంటి సువాసన వెదజల్లే మసాలా దినుసులను తీసుకొని వాటిని నీటిలో వేసి బాగా వేడిచేయాలి. ఇవి నీటిలో వేసి వేడి చేస్తే వంటగదిలో సువాసనలు వ్యాపిస్తాయి. వంటగదిలోని దుర్వాసన పోతుంది. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో వేసి మీ ఇంట్లో స్ప్రే చేస్తే మంచి వాసన వస్తుంది. ఇది రూమ్ ఫ్రెష్నర్గా కూడా పనికొస్తుంది. వెనిగర్ ►ఇంట్లో నాన్‌వెజ్ వండినప్పుడు వచ్చే నీచు వాసనను వెనిగర్ ఈజీగా పొగొడుతుంది. ►దీనికోసం మూడు గిన్నెల్లో వెనిగర్‌ని పోసి కిచెన్‌లో మూడు చోట్ల ఉంచాలి. ►10 నుంచి 15 నిమిషాల్లో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ►అయితే ఈ వాసన మరీ ఎక్కువగా ఉంటే.. వెడల్పాటి గిన్నెలో నీరు, వెనిగర్ తీసుకుని, దానిలో నిమ్మతొక్కలు వేయాలి. ►తర్వాత ఈ నీటిని గ్యాస్ ఉంచి సువాసనలు వెదజల్లేంత వరకు సిమ్‌లో పెట్టి వేడి చేయాలి. ►తర్వాత స్టౌ ఆఫ్ చేసి అలా ఉంచేస్తే కాసేపటికి కిచెన్‌లో దుర్వాసన పోతుంది. కమలా తొక్కలతో.. ►డస్ట్బిన్లోని చెత్త కారణంగా కొన్ని సార్లు వంటగదిలో దుర్వాసన వస్తుంది. ►ఈ సమయంలో ఒక గిన్నెలో నీరు పోసి దానిలో కాస్త దాల్చినచెక్క, కొన్ని కమలా తొక్కలు వేసి సన్నని సెగపై ఐదు నిమిషాలు మరిగించండి. ►గిన్నెను అలాగే ఉంచేస్తే.. దుర్వాసన పోయి.. సువాసన వస్తుంది. ►ఇక మీ వంటగదిలో కూర మాడిన వాసనలు పోగొట్టుకోవాలంటే... వంట గది తలుపులు, కిటికీలు తెరిచి ఉంచితే సరి! చదవండి: Psychology: అక్కలకు ఇంకా పెళ్లి కాలేదు! కుటుంబం ఇలా.. ఒత్తిడిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. పరిష్కారం? మెదడులో కలవరం.. ఫిట్స్‌తో తస్మాత్ జాగ్రత్త -
సరికొత్తగా.. తైవాన్ నిమ్మ
తైవాన్ జామ.. దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం పల్లెల్లో ప్రాచుర్యంలోకి వచ్చి రైతులు సాగు చేస్తున్నారు. మంచి దిగుబడి సాధించి లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే తైవాన్ నిమ్మ సాగు గురించి ఎవరికీ పెద్దగా తెలిసి ఉండదు. రైతులు ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుని సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు సాగుకు శ్రీకారం చుట్టగా మరికొందరు మొక్కలను తీసుకొచ్చి నాటే పనిలో ఉన్నారు. పొదలకూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో సైదాపురం, పొదలకూరు, వెంకటగిరి, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో తైవాన్ నిమ్మ సాగు తక్కువ విస్తీర్ణంలో జరుగుతోంది. సాధారణ నిమ్మతోటల్లో రెండు నెలలు కాపు కాస్తే మరో రెండు నెలలు ఉండదు. తైవాన్ రకం సాగు చేస్తే ఏడాది పొడవునా దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. చెట్టుకు ఓ వైపు కాయలు ఉంటే మరో వైపు పూత ఉంటుంది. గుత్తులుగా కాపు ఉంటే కోసేందుకు కూలీలకు సులువుగా ఉంటుంది. సాధారణ నిమ్మతోటల్లో మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత దిగుబడి వస్తే తైవాన్ రకం నిమ్మకు సంబంధించి ఏడాది పూర్తయిన వెంటనే దిగుబడి ప్రారంభమవుతుంది. సాధారణ రకం ఎకరానికి 100 మొక్కలు పడితే తైవాన్ రకంలో 300 మొక్కలు నాటుకునేందుకు అవకాశం ఉంది. ఫలితంగా చిన్నా సన్నకారు రైతు కూడా దిగుబడిని పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం కడియం, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నుంచి రైతులు తైవాన్ నిమ్మ మొక్కను రూ.100 వెచ్చించి తీసుకొస్తున్నారు. గుర్తింపు లేదు తైవాన్ సాగుకు సంబంధించి రైతులకు ఉద్యాన శాఖ అధికారులు, నిమ్మ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు ఇవ్వడంలేదు. ప్రభుత్వ పరంగా గుర్తింపు లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించిన తర్వాతే ఈ నిమ్మ సాగుపై స్పష్టత వస్తుంది. పొదలకూరు మండలం పార్లపల్లిలో రెండెకరాల్లో ఓ రైతు తైవాన్ నిమ్మ సాగు చేస్తున్నారు. అలాగే పులికల్లు, వావింటపర్తి, ప్రభగిరిపట్నం, కనుపర్తి గ్రామాల్లో సాగు చేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. మార్కెటింగ్ ఎలా? తైవాన్ నిమ్మ దిగుబడి వస్తే మార్కెటింగ్ చేసుకునే విషయంలో సమస్యలు ఎదురవుతాయని రైతులు భావిస్తున్నారు. పొదలకూరు ప్రభుత్వ నిమ్మ మార్కెట్ యార్డుకు ఎగుమతుల్లో రాష్ట్రస్థాయిలో పేరుంది. ఇక్కడి నుంచి ప్రతినిత్యం పదుల సంఖ్యలో లారీల్లో ఢిల్లీ మార్కెట్‌కు ఎగుమతులు జరుగుతుంటాయి. అక్కడి వ్యాపారులు తైవాన్ నిమ్మను స్వీకరిస్తారా? లేదా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాగు చేసేందుకు సమాయత్తమవుతున్న రైతులు వ్యాపారులతో చర్చిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆసక్తి ఉంది సాధారణ రకం నిమ్మ సాగు కంటే తైవాన్ నిమ్మ సాగుపై ఆసక్తి పెరిగింది. పార్లపల్లికి వెళ్లి తోటను పరిశీలించాను. సాగుకు అనుకూలంగానే ఉండడంతోపాటు యాజమాన్య పద్ధతుల ఖర్చు తక్కువగా ఉంది. ప్రస్తుతం ఒక ఎకరాలో సాగు చేసి దిగుబడి, మార్కెటింగ్ సమస్యలు లేకుంటే విస్తీర్ణం పెంచుతాను. – సీహెచ్ రమేష్, రైతు, నావూరుపల్లి అవగాహన లేదు తైవాన్ నిమ్మకాయలు ఇప్పటి వరకు మార్కెట్‌కు రాలేదు. పూర్తిగా అవగాహన కూడా లేదు. నిమ్మ మార్కెట్‌ను శాసించే ఢిల్లీ మార్కెట్ వ్యాపారులు ఈ రకాన్ని తీసుకుంటారో లేదో తెలియదు. మార్కెట్‌కు వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. – ఎం.బాలకృష్ణారెడ్డి, నిమ్మమార్కెట్ వ్యాపారి, పొదలకూరు స్వల్పంగా సాగు చేస్తున్నారు తైవాన్ నిమ్మ రకం సాగు స్వల్పంగా ఉంది. పార్లపల్లిలో రెండెకర్లో సాగు చేస్తుండగా, మరో ఐదారు గ్రామాల రైతులు మొక్కలు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. వాటి చీడపీడలపై అవగాహన కోసం నిమ్మ శాస్త్రవేత్తలతో మాట్లాడాం. వారు పరిశోధనలు చేస్తున్నామని ఇప్పటికిప్పుడు సాగు చేసుకోవచ్చని చెప్పలేమన్నారు. సాధారణ నిమ్మ సాగులా తైవాన్ రకం కూడా ఎలాంటి నేలల్లోనైనా వస్తుంది. కాయ సైజు కూడా సాధారణ రకం కంటే పెద్దదిగా ఉంటుంది. – ఈ.ఆనంద్, ఉద్యానాధికారి, పొదలకూరు -
క్యారెట్, నిమ్మకాయ, ఆలుగడ్డ.. మచ్చలు మటుమాయం!
Home Remedies for Black Spots on Face: క్యారెట్, నిమ్మకాయ, బంగాళ దుంప ఒక్కోటి తీసుకుని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి. తరువాత ఈ మూడింటిని తొక్క తీయకుండా సన్నగా తురుముకోవాలి. వీటన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి 24 గంటలపాటు మూతపెట్టి ఉంచాలి. తరువాత గిన్నెలో ఉన్న తురుమును వడగట్టి నీటిని వేరు చేసి ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, వడగట్టి పెట్టుకున్న రసం మూడు టీస్పూన్లు వేసి, కొద్దిగా బాదం నూనెవేసి పేస్టులా కలుపుకోవాలి. చివరిగా ఈ విటమిన్ క్యాప్యూల్స్ ఒకటి వేసి కలిపితే క్రీం రెడీ అయినట్లే. దీనిని గాజు సీసాలో స్టోర్ చేసుకుని రోజూముఖానికి రాసుకుంటే నల్లని మచ్చలు తగ్గి ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. రోజూ రెండుసార్లు ముఖానికి రాసుకుంటూ ఉంటే మంచి ఫలితం త్వరగా వస్తుంది. చదవండి: Hair Fall Control Tips: జుట్టు రాలకుండా ఉండాలంటే..? -
Fish Haleem: ఇంట్లోనే ఫిష్ హలీమ్ తయారీ ఇలా!
Recipes In Telugu- బలవర్థక ఆహారంలో హలీమ్ కూడా ఒకటి. అనేక పోషకాలతో నిండిన హలీమ్‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మరి మసాలా ఘాటు, ఢ్రై ఫ్రూట్స్‌తో ఘుమఘులాడే ఫిష్ హలీమ్‌ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం! ఫిష్ హలీమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బోన్‌లెస్ చేప ముక్కలు – అరకేజీ, గోధుమ రవ్వ – కప్పు(రాత్రంతా నానబెట్టుకోవాలి), పచ్చిశనగపప్పు – పావు కప్పు (మూడుగంటలపాటు నానబెట్టుకోవాలి), పెసరపప్పు – పావు కప్పు (దోరగా వేయించి మూడు గంటలపాటు నానబెట్టుకోవాలి), మినపప్పు – పావు కప్పు (మూడు గంటపాటు నానబెట్టుకోవాలి), అల్లం పేస్టు – టేబుల్ స్పూను, వెల్లుల్లి పేస్టు – ముప్పావు టేబుల్ స్పూను, పచ్చిమిర్చి – రెండు, బిర్యానీ ఆకు – ఒకటి, ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరుక్కోవాలి) పెరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి – అరటేబుల్ స్పూను, గరం మసాలా – టేబుల్ స్పూను, మిరియాలపొడి – టేబుల్ స్పూను, వేయించిన జీలకర్ర పొడి – పావు టేబుల్ స్పూను, యాలకులు – రెండు, లవంగాలు – రెండు, దాల్చిన చెక్క – ఒకటి, ఉప్పు – రుచికి సరిపడా, నెయ్యి – అరకప్పు, నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు, సన్నని నిమ్మచెక్కలు – రెండు మూడు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, పుదీనా తరుగు – పావు కప్పు, వేయించిన జీడిపప్పు – టేబుల్ స్పూను. తయారీ: ►చేప ముక్కలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, అరటేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టులు, కారం వేసి కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి ∙నానబెట్టిన చేపల్లో ముక్కలు మునిగేన్ని నీళ్లు పోసి ఉడికించి దించేయాలి ∙ఉడికిన చేపముక్కలను ఖీమాలా రుబ్బుకోవాలి. ►పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాలను పేస్టుచేసుకోవాలి. ►కుకర్‌లో పప్పులన్నింటిని వేసి మెత్తగా ఉడికించి, రుబ్బుకోవాలి. ►ఇప్పుడు కుకర్ గిన్నెలో రాత్రంతా నానబెట్టుకున్న గోధుమరవ్వ, రబ్బుకున్న పప్పు మిశ్రమం, పెరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్టు, మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్టు, ►మిరియాలపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలాలో వేసి కలుపుకోవాలి. ►ఇప్పుడు మెత్తగా చేసి పెట్టుకున్న చేపమిశ్రమాన్నివేసి రెండు కప్పుల నీళ్లు పోసి అరగంటపాటు సన్నని మంటమీద ఉడికించాలి. ►మందపాటి పాత్రను స్టమీద పెట్టుకుని నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయను సన్నగా తరిగి వేయాలి. ►ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక తీసి, ఉడికిన చేప మిశ్రమంలో వేయాలి. నిమ్మరసం, కొత్తిమీర తరుగు, నెయ్యి, నిమ్మ చెక్కల, జీడిపప్పుతో గార్నిష్ చేస్తే ఫిష్ హలీమ్ రెడీ. చదవండి👉🏾Haleem Recipe In Telugu: రంజాన్ స్పెషల్.. ఎవరైనా సింపుల్‌గా చేసుకోగలిగే మటన్ హలీమ్ -
ఆకాశాన్నంటిన నిమ్మ ధరలు.. కిలో రూ.80 నుంచి రూ.140
తెనాలిటౌన్(పల్నాడు): నిమ్మ మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో తమ ఆశలు ఫలించనున్నాయనే ఆనందం రైతుల్లో వ్యక్తమవుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం కిలో రూ.80 నుంచి రూ.140 వరకు ధర పలుకుతోంది. గతంలో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల పూత రాలిపోయి దిగుబడి తగ్గింది. దీనికితోడు వేసవితోపాటు, తోటల్లో తగినంత కాపు లేకపోవడం వల్ల డిమాండ్ పెరిగింది. మార్కెట్లో 50కిలోల టిక్కి రూ.6,000 నుంచి రూ.8,000 వరకు పలుకుతోంది. దీనివల్ల ప్రస్తుతం తోటల్లో కాపు ఉన్న రైతులకు వరంగా మారింది. తెనాలి ప్రసిద్ధి రాష్ట్రంలో గూడూరు, ఏలూరు మార్కెట్ల తర్వాత నిమ్మకాయలకు తెనాలి ప్రసిద్ధి. జిల్లాలో 6,000 ఎకరాల నిమ్మ తోటలు ఉంటే అందులో అత్యధిక విస్తీర్ణం తెనాలి డివిజన్‌లోనే ఉంది. ఏటా జూలై, డిసెంబరు, మే నెలల్లో కాపు ఆరంభమైన ప్రతిసారీ మూడునెలలు దిగుబడినిస్తుంది. నిమ్మతోటల సాగుతో ఎంతోకొంత నికరాదాయం వస్తుండటంతో రైతుల్లో మోజు పెరిగింది. మాగాణి భూముల్లోనూ నిమ్మతోటలు నాటుతున్న రైతులు ఉన్నారు. లాభదాయకంగా లేని సపోటా తోటల్లో సింహభాగాన్ని నిమ్మ ఆక్రమించింది. దీంతో తోటల కౌలు ధరలు భారీగా పెరిగాయి. ఎకరా కౌలు ధర రూ.70 నుంచి రూ.80వేల వరకు ఉంది. ఖర్చు రూ.30 వేల నుంచి రూ.40వేల వరకు అవుతోంది. ధరలు ఇలాగే కొనసాగితే ఎకరానికి రూ.50వేలు లాభం చేకూరే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. రోజుకు వెయ్యి బస్తాల సరుకు ప్రస్తుతం ఈ ప్రాంతంలో పంట అంతగా లేకపోవడంతో ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి నిమ్మకాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. రోజుకు వెయ్యి బస్తాల సరుకు దిగుమతి అవుతోంది. ఇక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి జె.వి.సుబ్బారావు తెలిపారు. తెనాలి ప్రాంతం నుంచి గతంలో రోజుకు నాలుగు లారీల సరుకు వచ్చేదని, ప్రస్తుతం రెండు లారీలు మాత్రమే వస్తోందని తెలిపారు. విపరీతంగా పెరిగిన ధరలు మార్కెట్లో నిమ్మ ధరలు రైతులకు ఆశాజనకంగా ఉన్నాయి. డిసెంబర్, జనవరి నెలల్లో వర్షాలు కురవడంతో పంట పూత రాలిపోయింది. అందువల్ల దిగుబడి తగ్గింది. డిమాండ్ పెరిగింది. వేసవికాలం కావడంతో ఉత్తరాది ప్రాంతాలకు సరుకు ఎక్కువగా వెళ్తుంది. దీనివల్ల ధరలు విపరీతంగా పెరిగాయి. – జె.వి.సుబ్బారావు, మార్కెట్ కమిటీ కార్యదర్శి, తెనాలి -
చరిత్రను తిరగరాసిన నిమ్మ ధరలు... కిలో నిమ్మ రూ.180
సాక్షి, గూడూరు (తిరుపతి జిల్లా): నిమ్మ ధర రోజు రోజుకూ పెరుగుతూ చరిత్రను తిరగరాస్తోంది. సోమవారం కిలో నిమ్మకాయల ధర రికార్డు స్థాయిలో రూ.180 పలికింది. లూజు బస్తా కనిష్ట ధర రూ.12 వేలు.. గరిష్ట ధర రూ.14 వేల వరకు పలుకుతోంది. నిమ్మ పండ్లు కూడా ఎన్నడూ లేనివిధంగా కిలో కనిష్టంగా రూ.110.. గరిష్టంగా రూ.130 వరకు ధర పలుకుతుండటంతో నిమ్మ రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నార్త్ టు సౌత్ డిమాండ్‌తో.. గూడూరు నిమ్మ మార్కెట్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి లారీల కొద్దీ నిమ్మకాయలు ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం అక్కడ «నిమ్మకాయలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ఇక్కడి నిమ్మ మార్కెట్‌కు ఊపొచ్చింది. ఎండల తీవ్రత అధికంగా ఉన్నా.. నార్త్ ఢిల్లీ నుంచి ఇటు సౌత్ చెన్నై, బెంగళూరు వరకూ రెండు రోజులుగా నిమ్మకాయలకు డిమాండ్ పెరగడంతో ధర పరుగులు తీస్తోంది. కాపు తగ్గడంతో.. ఒక రోజులోనే ఢిల్లీ మార్కెట్‌కు కాయల్ని తరలించగలిగేంత దూరంలో ఉన్న భావానగర్, మహారాష్ట్రలోని బీజాపూర్‌లో నిమ్మ దిగుబడి ఆశించిన స్థాయిలో లేదు. రాష్ట్రంలోని తెనాలి, ఏలూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లోనూ కాపు తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో గూడూరు మార్కెట్లో నిమ్మకాయలకు ధర భారీగా పెరిగింది. ఈ ధర కొన్నాళ్లుంటే కోటీశ్వరులే నిమ్మ ధర ఇప్పటివరకూ ఇంత పలికిందే లేదు. వారం..పది రోజులుగా నిలబడిందీ లేదు. ఈ ధరలు కొన్నాళ్లు నిలకడగా ఉంటే నిమ్మ రైతులంతా కోటీశ్వరులవుతారు. – పంట నాగిరెడ్డి, మిటాత్మకూరు, గూడూరు మండలం (చదవండి: హైదరాబాద్ నుంచి ఢాకా, బాగ్దాద్ నగరాలకు విమానాలు!) -
Lemon Prices: జనాల జేబుల్ని పిండేస్తున్న నిమ్మ!
దేశంలో నిమ్మకాయ జనాల జేబుల్నిపిండేస్తోంది. ఎండకాలం కావడంతో ధర పైపైకి ఎగబాకుతోంది. మొన్నటిదాకా 50-60 రూపాయలకు కేజీ పలికిన నిమ్మ.. ఇప్పుడు ఏకంగా నాలుగు రెట్లు అధికంగా పలుకుతోంది. పట్టణాల్లో, నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మార్కెట్లో నిమ్మకాయల రేట్లు వాయించేస్తున్నాయి. ప్రధానంగా కొన్ని నగరాలు, పట్టణాల్లో కిలో నిమ్మకాయల ధర రూ. 200 కనిష్టంగా పలుకుతుండడం విశేషం. ఖుల్లా విషయానికొస్తే.. కాయకో రేటు, పండుకో రేటు లాగా అమ్ముతున్నారు. విడిగా ఒక్కో కాయను ఏడు నుంచి పది రూపాయలకు అమ్ముకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పెరుగుదల.. కిందటి ఏడాది ఇదే సీజన్ (మార్చి) పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికం. ఇప్పుడు ఇలా ఉంటే.. ఏప్రిల్-మే నెలలో పరిస్థితి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. సామాన్యుడి ‘కిచెన్ బడ్జెట్’లో నిమ్మ చిచ్చు పెడుతోంది. ఎండకాలం కావడంతో డైట్ తప్పనిసరి లిస్ట్‌లో కనిపించే నిమ్మ.. బడ్జెట్ పరిధిని దాటించేస్తోంది. ధరలు ఎప్పుడు దిగుతాయో అని ఎదురు చూడడం వినియోగదారుల వంతు అవుతోంది. మార్కెట్లో దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. అయితే నిమ్మ ధరలు Lemon Prices ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటోంది. ఇంతకు ముందులా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయలేకపోతున్నారు కొందరు. నాణ్యతను కూడా పట్టించుకోకుండా కొనేస్తున్నారు ఇంకొందరు. నిమ్మను గుత్తగా అమ్మేవ్యాపారులే కాదు.. రోడ్ల మీద తోపుడు బండ్లపై రసాలు, నిమ్మసోడా అమ్మేవాళ్ల మీదా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆఖరికి టీ పాయింట్లలో లెమన్ టీ కొరత పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉత్పత్తి తగ్గిపోవడం వల్లే.. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా నిమ్మకాయల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ముందస్తుగానే.. ఉత్పత్తిని గణనీయంగా తగ్గించేస్తున్నారు. అయినా కూడా ధరలను లెక్కచేయకుండా జనాలు సైతం కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో.. బల్క్ మార్కెట్లో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. పెరిగిన ధరల కారణంగా తక్కువ పరిమాణంలో నిమ్మకాయల్ని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లే అధిక ధరలకు అమ్మేసుకుంటున్నారు. ఉత్పత్తి పెరిగితేనే.. ధరలు దిగొచ్చేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
సింపుల్ క్లీనింగ్ టిప్స్: జిడ్డు మరకలా? ద్రాక్ష, నిమ్మకాయ, ఇంకా బ్రెడ్‌తో..
సింక్, బాత్ టబ్‌లకు అంటుకున్న మొండి, జిడ్డు మరకలను తొలగించడానికి ద్రాక్ష పండు, నిమ్మకాయ, వెనిగర్లు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ► ద్రాక్షపండును సగానికి ముక్కలు కోయాలి. బాత్‌టబ్ లేదా సింక్‌పై ఉప్పు చల్లాలి. వాటి మీద ద్రాక్ష పండు సగం ముక్కతో రుద్దాలి. తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ► వెనిగర్‌ను సింక్ టాప్, బాత్ టబ్లపై చల్లి, గంట సేపు వదిలి, తర్వాత సోప్వాటర్ని ఉపయోగించి కడిగితే బాగా శ్రుభపడతాయి. ► కాఫీ ఫిల్టర్ శుభ్రపడాలంటే అందులో బ్లాటింగ్ పేపర్ని చిన్న చిన్న ఉండలుగా చేసి వేయాలి. అటూ ఇటూ పదే పదే తిప్పాలి. (చదవండి: Health Tips: పాలమీగడలో ఏలకులను కలుపుకుని చప్పరిస్తే..) ► గోడలపైన వేలి ముద్రల మరకలు నూనె జిడ్డుగా కనిపిస్తుంటాయి. వీటిని వదిలించడానికి బ్రెడ్ స్లైస్‌ను తీసుకొని, మరకలపైన రబ్ చేసి, తుడవాలి. దీంతో నూనె మరకలు తగ్గిపోతాయి. అదే బ్రెడ్‌తో పగిలిన గ్లాసు ముక్కలను తీయడానికి కూడా ఉపయోగించవచ్చు. ► స్టౌ పై జిడ్డు మరకలు సాధారణంగా అవుతుంటాయి. నిమ్మరసం రాసి, బ్రెడ్ లేదా స్పాంజితో తుడవాలి. (చదవండి: గలిజేరు ఆకును పప్పుతో కలిపి వండుకుని తింటున్నారా) -
టీ గారూ.. తమరు సూపరు!
చలి వేయి కత్తులతో వస్తుంది. ఒక్క కప్పు టీ అడ్డు నిలుస్తుంది. చలి మంచు వల విసురుతుంది. తేయాకు గుడగుడ ఉడికి దానిని తెంపుతుంది. చలి పళ్లు టకటకలాడించాలని చూస్తుంది. టీ గ్లాసులు టింగుటంగుమని మోగి న్యూట్రల్ గేర్ వేస్తాయి. జనులు చలికాలంలో అవస్థ పడతారని ప్రకృతి టీ కాచింది. టీ అంటే ఉత్త తేయాకు, పాలు, చక్కెర కాదు. దానితో కలగలిసిన మనుషులు కూడా. ‘టీ పోసిన మనుషులను’ తలుచుకునే కాలం ఇది. కిరోసిన్ స్టవ్ నీలిమంట చాలా అందంగా ఉంటుందా మలి చీకటిలో. ‘బజ్జ్’మని దాని సౌండ్. మీద పాల దబర. పూర్తిగా మూసి ఉన్న మూతను కొంచెం నెడితే మెలి తిరుగుతూ పైకి లేస్తున్న పొగలు కనిపిస్తాయి ఆ చలి చీకటిలో. జంటగా ఉన్న స్టౌ మీద సత్తు జగ్గులో తేయాకు నీళ్లు కుతకుతలాడుతుంటాయి చలి మీద కాలు దువ్వుతూ. తెల్లవారుజాము ఐదు గంటలంటే చలి తన ఆఖరు దళాన్ని ఆయుధాలతో మొహరించి ఉంటుంది. ఆరున్నర ఏడు దాకా ఆ దళాల కవాతు సాగుతుంది. మఫ్లర్లు? వాటికి లోకువ. ఉన్ని టోపీలను? లెక్క చేయవు. స్వెటర్లను అగోచరంగా చీల్చి పారేస్తాయి. అర చేతులను నిస్సహాయంగా రుద్దుకోక తప్పదు. అప్పుడొక హీరో కావాలి. ‘రక్షించండి’ అని పొలికేక వేయకముందే నిలువు గీతల గాజు గ్లాసులో పొగలు గక్కుతూ ప్రత్యక్షం కావాలి. ఎస్. స్ట్రాంగ్ టీ. చలి విలన్ భరతం పట్టే హీరో. ముఖానికి దగ్గరగా పెట్టుకుంటే వెచ్చదనం. గొంతులోకి దిగితే ఇంధనం. చలికాలంలో సంజీవని. జేగురు రంగు దివ్య రక్షణ. టీ. చలిపులి పై చర్నాకోల. ఈ టీ గారు లేకుంటే ఈ కాలం ఎలా గడవను? ఐకమత్యం టీ టీలు రెండు రకాలు. ‘విడి టీలు’. ‘ఐకమత్యం టీలు’. విడి టీ అంటే టీపొడి విడిగా, పాలు విడిగా, చక్కెర విడిగా... ఇలా విడివిడిగా ఉంటూ ఆఖరు నిమిషంలో కలుస్తాయి. ఐకమత్యం టీ అంటే హంస ముక్కు ఉన్న సత్తు కెటిల్లో టీ పొడి, పాలు, చక్కెర కలగలిసి ఒకేసారి ఉడుకుతాయి. విడి టీలో చాయిస్ ఉంటుంది. లైట్, స్ట్రాంగ్, మీడియం... కాని హంసముక్కు ఐకమత్యం టీలో లోపల ఏది తయారైతే అది. ఎలా తయారైతే అది. కెటిల్ హ్యాండిల్‌కు దళసరిగా కట్టిన గుడ్డ టీ మాస్టర్ పట్టగా పట్టగా నలుపెక్కి చేయి కాలనంతగా రాటు దేలి ఉంటుంది. లోపల టీ బాగా ఉడికిన మరు నిమిషం మాస్టర్ వరుసగా గ్లాసులు పేర్చి హ్యాండిల్ పట్టుకుని హంస ముక్కును వొంచుతాడు. దుముకుతూ టీ. ధారగా టీ. రుచి రంగులో టీ. అందరికీ ఒకేలాంటి టీ. అందరికీ ఒకే లాంటి శుభోదయమూ. టీ కోసమే నిదుర లేవాలి చలికాలంలో నిదుర లేవాలంటే తాయిలం ఏమిటి? టీయే. చలికాలంలో పనులు మొదలవ్వాలంటే ఒంటికి ఏం పడాలి? టీయే. ఇంట్లో పిల్లలు నిదుర పోతుంటారు. పెద్దవారు ముసుగుతన్ని ఉంటారు. ఇంటామె, ఇంటాయన మార్నింగ్ వాక్కు బయలుదేరే ముందు ఆ వెలుతురు రాని చీకటిలో కిచెన్‌లో లైటు వేసి చిన్న చిన్న కబుర్లు చెప్పుకుంటూ టీ కాచుకుంటూ ఫిల్టర్‌తో కప్పుల్లో ఒంచుకుంటూ ఒకరికి ఒకరు ఇచ్చుకుంటూ ఉంటే... తక్కిన కాలాల్లో ఏమో కాని చలికాలంలో ఆ దృశ్యం సుందరంగా ఉంటుంది. స్త్రీకి పురుషుడు... పురుషుడికి స్త్రీ తోడుగా ఉండాల్సింది ఇందుకే అనిపిస్తుంది. మీ చేతుల్లో టీ కప్పులు పట్టుకోండి... మీరు సంపూర్ణం అవుతారు అంటుంది టీ. అల్లం బంధువు... యాలకులు స్నేహితులు పాలకూ టీ పొడికి జోడి కుదిరింది. బంధువులు లేకపోతే ఎట్లా? నన్ను రెండు చిన్ని తుంటలు చేసి మీతో కలుపుకోండి.. బాగుంటాను అని అల్లం వచ్చిందట. నా నెత్తిన నాలుగు మొత్తి మీ తోడు చేసుకోండి ఆహ్లాదం పెంచుతాను అని యాలకులు అన్నాయట. అదిగో ఆనాటి నుంచి అల్లం బంధువు.. యాలకులు స్నేహితులు అయ్యాయి. చలికాలంలో మామూలు టీ. గొప్ప. అల్లం టీ. ఓకే. యాలకుల టీ. సరే. కాని ఈ కాలంలో తెల్లవారు జామున లెమన్ టీ తాగాలనుకునేవారికి టీ శాస్త్రంలో మన్నన లేదు. లెమన్ టీ మరే కాలంలో అయినా సరే. చలికాలంలో మాత్రం కాదు. అరె.. పాల ప్యాకెట్ కట్ చేసి గిన్నెలో పోసే సన్నివేశం ఆ ఒణికే చలిలో ఎంత బాగుంటుంది. టీ మనుషులు టీతో పాటు మనుషులు గుర్తుంటాయి. సందర్భాలు కూడా. చలిలో కారు ప్రయాణం. తెల్లవారుజామున రోడ్డెక్కితే ఎక్కడో ఒకచోట వేడి వేడి టీ దుకాణం. ‘సార్ టీ’ అంటూ అద్భుతంగా టీ చేసి ఇచ్చిన ఆ మనిషి గుర్తుంటాడు. వీధి చివర రోజూ టీ అమ్మే మాస్టర్. మనం ఇంత దూరం ఉండగానే చక్కెర తక్కువ అడగకనే అలవాటును గుర్తు పెట్టుకుని రెడీ చేస్తాడు. గుర్తుంటాడు. బంధువులు ఎందరో ఉంటారు. కాని ఒక్కరే టీ భలే పెడతారు. గుర్తుంటారు. కేరళ టూరుకు వెళ్లి తేయాకు కానుకగా తెస్తారు ఒకరు. గుర్తుంటారు. అస్సాం టీ పౌడర్ వాడుతున్నాం అంటారు. గుర్తుంటారు. లంసా టీ రుచే వేరే. అది ఇచ్చిన ఇల్లు గుర్తుంటుంంది. పాలు విరిగాయి. అయినా మేనేజ్ చేశా అని ఒక అక్క అంటుంది. గుర్తుంటుంది. చక్కెర లేదు బెల్లం ముక్క వేశా అని పిన్ని అంటుంది. గుర్తుంటుంది. కొంచెం టీ పౌడర్ అంటూ తప్పక అప్పు చేసే ఇరుగామె ఉంటుంది. గుర్తుంటుంది. భుజాల మీద చేతులు వేసుకుని పంచెలు పైకి కట్టి నవ్వుకుంటూ వెళ్లి టీ తాగిన సందర్భాలు?... ఆ స్నేహితులందరికీ గుర్తుంటాయి. వేసవిలో మల్లెల్ని శ్లాఘించాలి. నిజమే. చలికాలంలో టీ కాకుండా ఎవరికి కిరీటం పెడతాం? చెప్పండి. -
గంధం పొడి, రోజ్ వాటర్, నిమ్మరసం.. నేచురల్ బ్లీచ్ తయారీ ఇలా!
Natural Face Bleaching Home Remedies: ముఖ చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, ముఖవర్చస్సుని మరింతగా మెరిపించడంలో ఫేషియల్ బ్లీచ్ బాగా పనిచేస్తుంది. కానీ రసాయనాలతో తయారైన బ్లీచ్ల వల్ల కొన్నిరకాల అలెర్జీలు, దద్దుర్లు వంటివి వచ్చి ముఖం పాడైపోతుంటుంది. ఇలాంటి సమస్యలేవి ఎదురుకాకుండా ఇంట్లోనే సులభంగా బ్లీచ్‌ను తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం... ►టీస్పూను పసుపు, టీస్పూను రోజ్ వాటర్, అర టీస్పూను నిమ్మరసం, పావు టీస్పూను గంధం పొడి ఒక గిన్నెలో తీసుకుని కలపాలి. ►ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు నానబెట్టుకోవాలి. ►ముఖాన్ని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి. నానబెట్టిన మిశ్రమాన్ని బ్రష్ తో ముఖానికి అప్లై చేసి పదినిమిషాలపాటు ఆరనివ్వాలి. ►పది నిమిషాల తరువాత టొమాటో లేదా నిమ్మ చెక్కతో ముఖాన్ని గుండ్రంగా ఏడు నిమిషాలపాటు మర్దన చేసి చల్లని నీటితో కడిగేయాలి. ►తడిలేకుండా తుడిచి, ముఖానికి అలొవెరా జెల్‌ను అప్లై చేయాలి. పదిహేనురోజులకొకసారి ఇలా చేయడం వల్ల ముఖం మెరుపుని సంతరించుకుంటుంది. చదవండి: ‘రక్తపిశాచ’ జబ్బు.. దీని గురించి మీకు తెలుసా! -
నిండా ముంచిన నిమ్మ
సాక్షి, టి.నరసాపురం(పశ్చిమగోదావరి): ఒకప్పుడు కాసుల వర్షం కురిపించిన నిమ్మ ఇప్పుడు రైతుకు కన్నీళ్లు తెప్పిస్తోంది. మూడేళ్లుగా నిమ్మ రైతులు నష్టాలతో విలవిలలాడుతున్నారు. ఒకప్పుడు ఎకరానికి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఆదాయం పొందిన నిమ్మ రైతుకు నేడు సాగుఖర్చులు కూడా రాని పరిస్థితి.. కోత ఖర్చులు కూడా రావడం లేదని నిమ్మ రైతు వాపోతున్నాడు. కిలో కనీసం రూ. 25 ఉంటేనే లాభం కరోనా దెబ్బతో మూడేళ్లుగా నిమ్మ రైతుకు మార్కెట్లో సరైన ధర లభించడం లేదు. కిలో నిమ్మ ధర రూ. 4 నుంచి రూ. 5 ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సగటున కిలో రూ. 25 నుంచి రూ. 30 ఉంటేనే రైతుకు లాభం. ఈ నేపథ్యంలో నిమ్మ పంటను కొనసాగించాలా.. తొలగించాలా అన్నది తేల్చుకోలేని సందిగ్ధంలో రైతులున్నారు. నిమ్మపై విసుగెత్తిన రైతు పామాయిల్ వైపు మొగ్గుతున్నాడు. నిమ్మ సేద్యానికి ఎకరానికి ఎరువులు, తీత, పాదులు చేయడం, ఎరువుల ఖర్చు, నీటి తడులు, కూలీల ఖర్చు వంటివి కలిపి ఎకరానికి రూ.50 వేల వరకు ఖర్చవుతోంది. నాటురకం నిమ్మ, బాలాజీ నిమ్మ, పెట్లూరి నిమ్మలు సేద్యంలో ఉన్నాయి. ఎకరానికి రూ.40 వేల నుంచి రూ. 50 వేలకు కౌలు చెల్లించాలి. ఈ పరిస్థితుల్లో నిమ్మకు ధరలేక కౌలు చెల్లించలేక మధ్యలోనే వదిలేస్తున్నారు. చదవండి: (పరమ పవిత్రం మల్లన్న దివ్య పరిమళ ‘విభూది’) ఏటా 1.93 లక్షల టన్నుల పంట పశ్చిమ గోదావరి జిల్లాలో 9 వేల హెక్టార్లలో నిమ్మ పంట సాగుచేస్తున్నారు. ఏటా 1.93 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తవుతోంది. ఈ పంటంతా జిల్లాలోని ఏలూరు, గోపన్నపాలెం, జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల, యాదవోలులోని నిమ్మ మార్కెట్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతోంది. నిమ్మకు ధరలేకపోతే చెట్టుకు కాయను అలాగే వదిలేసే పరిస్థితిలేదు. కాయ కోయకపోయినా రైతు నష్టపోతాడు. దీంతో విధిగా కాయను బయటకు చేర్చాల్సి వస్తోంది. నిమ్మపండును కోయకుండా వదిలేస్తే చెట్ల కిందే రాలి నిమ్మ అక్కడే కుళ్లిపోతుంది. అందులోని సిట్రిక్ యాసిడ్ ప్రభావంతో చెట్టు చనిపోతుంది. దాంతో చెట్టును కాపాడుకోవడానికి నిమ్మకాను కూలీలతో ఏరించి బయట పారబోయాల్సి వస్తోంది. నిమ్మ కిలో రూ. 7 నుంచి రూ. 10 ఉంటే కనీసం కాయ కోసిన ఖర్చు, ఎగుమతి, దిగుమతి ఖర్చు, రవాణా ఖర్చులు వస్తాయి. నిమ్మకు ఏటా రెండు నుంచి మూడు నెలలే డిమాండ్ ఉంటుంది. కరోనా దెబ్బకు ఆ డిమాండ్ కూడా పడిపోయింది. సాగు ఖర్చులు రావడం లేదు గత మూడు సంవత్సరాలుగా నిమ్మ సాగు చేస్తున్న రైతులందరూ ధర లేక నష్టపోతున్నాం. సేద్యం ఖర్చులు కూడా రావడం లేదు. ఏడాదిలో ఎక్కువ కాలం కిలో నిమ్మ రూ.10 లోపే ఉంటోంది. రెండు రోజుల క్రితం నిమ్మ కిలో రూ.4 నుంచి రూ. 5 ధర పలికింది. 50 కిలోల బస్తా కోతకు, రవాణాకు, ఎగుమతి, దిగుమతులకు రూ.350 ఖర్చు అవుతోంది. ఎక్కువసార్లు ఆ ధర కూడా రావడం లేదు. – కాల్నీడి సత్యనారాయణ, నిమ్మరైతు, శ్రీరామవరం కూలీలతో పారబోయిస్తున్నాం నిమ్మకు మార్కెట్ ధర సరిగా లేకపోవడంతో ఏటా నష్టపోతున్నాం. ఎకరానికి రూ. 50 వేల వరకు పెట్టుబడి అవుతోంది. పెట్టుబడి, కోత ఖర్చులు కూడా తిరిగి రావడం లేదు. నిమ్మను చెట్ల కింద వదిలేస్తే చెట్లు చనిపోతాయని కూలీలతో ఏరించి బయట పారబోయాల్సి వస్తోంది. – జబ్బా నాగరాజు, నిమ్మ రైతు, శ్రీరామవరం అనుబంధ పరిశ్రమలతో డిమాండ్ పెంచొచ్చు నిమ్మ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా డిమాండ్ పెంచుకోవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఎంఎన్సీ కంపెనీలకు సరఫరా చేయడం ద్వారా లాభాలు పొందవచ్చు. – ఎ.దుర్గేష్, ఏడీ, ఉద్యాన శాఖ -
Weight Loss: ఈ జ్యూస్ తాగారంటే మీ బరువు అమాంతంగా ...
బరువు తగ్గేందుకు ఎంతో ప్రయాస, కృషి అవసరమనే విషయం మనందరికీ తెలిసిందే. రోజువారీ ఎక్సర్సైజులు, తక్కువ క్యాలరీలుండే ఆహారం తీసుకోవడం.. ఇతర పద్ధతులు అనుసరిస్తాం. ఇవే కాకుండా బరువుతగ్గడానికి డిటాక్స్ డ్రింక్స్ కూడా ఎంతో తోడ్పడతాయని మీకు తెలుసా! మన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడంలో డిటాక్స్ డ్రింక్స్ ఎంతో ఉపయోగపడతాయి. అలాగే శరీర బరువును నియంత్రించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. కేవలం వంటింట్లో దొరికే పదార్ధాలతోనే ఈ డ్రింక్స్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. బరువు నియంత్రించడానికి జీరా వాటర్ లాంటివి ప్రయత్నించినట్లే, బెల్లం-నిమ్మరసంతో తయారు చేసిన ఈ స్పెషల్ డ్రింక్‌ను కూడా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లం-నిమ్మతో ఆరోగ్య లాభాలు నిమ్మ రసం బరువుతగ్గించడంలో కీలప పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలుసు. అయితే దీనికి కొత్తగా బెల్లం జోడిస్తే చేకూరే లాభాలు మాత్రం చాలా మందికి తెలియదు. నిమ్మలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో నీటి శాతాన్ని, చర్మ స్వభావాన్ని, జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. అలాగే గుండె పనీతీరును క్రమబద్ధీకరించి, హృదయ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా బరువును నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే స్వీట్స్ తయారీలో విరివిగా ఉపయోగించే బెల్లం కూడా బరువు తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. బెల్లం చేకూర్చే లాభాలు అన్నీఇన్నీకాదండోయ్! ఇమ్యునిటీని పెంచడానికి, శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి మాత్రమేకాకుండా బరువును నియంత్రించడంలోనూ బెల్లం బెస్టే!! కాబట్టి బరువును అదుపులో ఉంచడంలో బెల్లం, నిమ్మ రెండూ ఉపయోగపడతాయన్నమాట. బెల్లం - నిమ్మ వాటర్ ఏ విధంగా తయారు చేయాలంటే.. మొదటిగా ఒక గిన్నెలో గ్లాస్ నీళ్లుపోసి చిన్న బెల్లం ముక్కను వేసి, బెల్లం కరిగిపోయేంతవరకూ మరిగించాలి. చల్లబడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకుంటే బెల్లం - నిమ్మ వాటర్ రెడీ అయిపోయినట్టే. ప్రతి ఉదయం క్రమంతప్పకుండా ఈ డ్రింక్ తాగితే మీ బరువు నిస్సందేహంగా తరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. చదవండి : Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే... -
త్వరలో రెండు కొత్త నిమ్మ రకాలు
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ద్వారా రెండు కొత్త నిమ్మ రకాలను విడుదల చేయనున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ టి.జానకీరాం తెలిపారు. తిరుపతిలోని చీనీ, నిమ్మ పరిశోధన స్థానాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఇక్కడ అభివృద్ధి చేస్తున్న చీనీ, నిమ్మ మొక్కల నర్సరీని పరిశీలించారు. రైతులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఏఎల్–94–14, టీఏఎల్–94–13 అనే రెండు కొత్త నిమ్మ రకాలను రూపొందించామన్నారు. త్వరలోనే వీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఇందులో టీఏఎల్–94–14 రకం ఊరగాయ తయారీకి ఉపయోగకరమన్నారు. సీఎస్ఐఆర్ సంస్థ నుంచి పరిశోధన ప్రాజెక్ట్ లభించిందని, తిరుపతి పరిశోధన స్థానంలో ఈ ప్రాజెక్ట్ చేపడతామని చెప్పారు. వర్సిటీ ఈ ఏడాదిని చీనీ, నిమ్మ సంవత్సరంగా గుర్తించి ఈ పంటల సాగు విస్తీర్ణం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ఏడాది కాలంలో 1.5 లక్షల చీనీ, నిమ్మ మొక్కలను రైతులకు అందించినట్టు చెప్పారు. గుంటూరు లాం ఫామ్‌లో మిరప, అనంతరాజు పేట పరిశోధన స్థానంలో కనకాంబరం పూలపై పరిశోధనల కోసం రెండు సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ పరిశోధన సంచాలకులు ఆర్వీఎస్కే రెడ్డి, విస్తరణ సంచాలకులు బి.శ్రీనివాసులు, తిరుపతి చీనీ, నిమ్మ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఆర్.నాగరాజు పాల్గొన్నారు. -
చిన్న పరికరంతో వెక్కిళ్లు మటుమాయం
వెక్కిళ్లు వస్తే చాలా మంది నీళ్లు తాగుతారు. ఆగకుంటే.. నిమ్మకాయ, అల్లం ముక్క నమలడం వంటì చిట్కాలను పాటిస్తారు. అప్పుడు కూడా వెక్కిళ్లు తగ్గకుంటే ..? వెంటనే ఈ ఎల్ షేప్ స్ట్రాతో నీళ్లను సిప్ చేయండి. చిటికలోనే వెక్కిళ్లన్నీ మాయం. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరికరాన్ని రూపొందించారు. పేరు ‘ద ఫోర్స్డ్ ఇన్‌స్పిరేటరీ సక్షన్ అండ్ స్వాలో టూల్’. చూడ్డానికి ఓ చిన్నపాటి గొట్టంలా కనిపిస్తుంది. ఓ వైపు మౌత్ పీస్, మరో వైపు ప్రెషర్ వాల్వ్‌తో ఉండే దీనిని సుమారు 249 మందిపై ప్రయోగించారు. దీంతో నీటిని సిప్ చే స్తే దాదాపు 92 శాతం వెక్కిళ్లను నివారిస్తుందని వారి అధ్యయనంలో తేలింది. ఈ పరికరాన్ని ఇప్పుడు మార్కెట్లోకి అనుమతించింది ప్రభుత్వం. ప్రస్తుతం వివిధ కంపెనీల వారు, నీలం, ఆకుపచ్చ, బూడిద రంగుల్లో వీటిని తయారు చేస్తున్నారు. అయితే ధర రూ. వెయ్యి నుంచి రెండు వేలకు పైగా ఉంటుంది. ఆన్లైన్ మార్కెట్లోనూ లభ్యం. -
అమాంతం పెరిగిన నిమ్మకాయల ధర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిమ్మకాయల ధర అమాంతం పెరిగింది. గతంలో రిటైల్ మార్కెట్లలో రెండు రూపాయలకు ఒకటి చొప్పున లభించగా ప్రస్తుతం ఒక్కో నిమ్మకాయ ఏకంగా 7 రూపాయల ధర పలుకుతోంది. వేసవికితోడు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిమ్మకాయల వాడకం అనూహ్యంగా పెరగ్గా డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా జరగట్లేదు. దీంతో నిమ్మ ధరలు పెరిగాయి. కరోనాతో పెరిగిన వాడకం... సీ విటమిన్ అధికంగా ఉండే నిమ్మకాయ వాడకం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, కరోనా బారిన పడకుండా ఉండేందుకు దోహదపడుతుందని వైద్యులు పేర్కొనడంతో ప్రజలు నిమ్మకాయలకు విరివిగా వినియోగిస్తున్నారు. నిత్యం నీటిలో కలిపిన నిమ్మరసం తాగడం లేదా తేనె, పసుపుతో కలిపి నిమ్మరసం తాగుతున్నారు. దీంతో గతేడాది నుంచి నిమ్మకాయల వినియోగం పెరిగింది. అయితే ఈ నెలలోనే నిమ్మ ధర దాదాపు రూ.7 పలుకుతుండగా రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులంటున్నారు. మేలో వేసవి తీవ్రత పెరగనుండటం, వివాహాల వంటి శుభకార్యాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో నిమ్మకాయల ధరలు మరింత పెరగొచ్చని వారు చెబుతున్నారు. ఇక్కడ చదవండి: 3 ఏళ్లుగా చెరువులో చేపలు మాయం.. కారణమేమిటంటే చెర్రీ చిల్లి: ఈ మిర్చి చాలా హాట్ గురూ..! -
అమ్మో నిమ్మ! ఒక కాయ ధర ఎంతో తెలుసా?
సాక్షి, ఆదిలాబాద్: మార్కెట్లో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగింది. ఎండలు ముదరడంతోపాటు కరోనా ప్రభావంతో నిమ్మకాయల వాడకం పెరిగింది. వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు వేసవికాలంలో ప్రతిఒక్కరూ నిమ్మకాయలను వినియోగిస్తారు. అంతేకాకుండా నిమ్మకాయలలో “సి’ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు, రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు వివిధ రకాల కషాయాలను సేవిస్తున్నారు. నిమ్మ, తేనె, పసుపు కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందనే నమ్మకంతో గతేడాది నుంచి నిమ్మకాయల వినియోగం పెరిగింది. మార్కెట్లో గతంలో ఒక్క నిమ్మకాయ రూ.2 ఉండగా ప్రస్తుతం ఒక్కో నిమ్మకాయ రూ.5 పలుకుతోంది. ధరలు పెరిగినా నిమ్మకాయలు మార్కెట్లో దొరకడం లేదని వినియోగదారులంటున్నారు. జిల్లాలో నిమ్మతోటల విస్తీర్ణం చాలా తక్కువ జిల్లాలో నిమ్మతోట విస్తీర్ణం అంతంత మాత్రంగా ఉంది. చెప్పుకునే విధంగా నిమ్మతోటల పెంపకం లేదని ఉద్యానవన శాఖ అధికారులంటున్నారు. నిమ్మకాయలు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి దిగుమతి అవుతున్నాయి. వినియోగదారుల డిమాండ్‌కు సరిపడా నిమ్మకాయలు దిగుమతి కాకపోవడంతో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఏప్రిల్ మాసంలోనే నిమ్మకాయ రూ.5 ఉంటే రానున్న రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులంటున్నారు. మే నెలలో వివాహాలు ఎక్కువగా ఉండడంతో నిమ్మకాయల ధరలు రెండింతలు పెరిగే అవకాశం లేకపోలేదని కొందరు వ్యాపారులు తెలిపారు. -
గుడ్డుకు జై నిమ్మకు సై
వేసవి కాలంలో నిమ్మకాయ ధరలుపెరగడం, కోడిగుడ్ల ధరలు తగ్గడంసాధారణమే. కానీ ప్రస్తుతం గ్రేటర్లోవీటి వినియోగం భారీగా ఉన్నప్పటికీ ధరలు అందుబాటులోనే ఉండటంగమనార్హం. కారణం నిమ్మకాయలవినియోగం వేసవిలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది వేసవిలో, వేసవిముగిసిన అనంతరంనిమ్మకాయల ధరలుపెరగలేదు. సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల రోజువారీ మెనూలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. కోవిడ్ ఉపద్రవం ముంచుకొచ్చిన ప్రస్తుతతరుణంలో సరికొత్త ఆరోగ్య సూత్రాలకు ప్రాధాన్యం పెరిగింది. కరోనా మహమ్మారి బారిన పడకుండా గట్టి జాగ్రత్తలు అవసరమని సిటీజనులు భావిస్తున్నారు. రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దినసరి ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు, నిమ్మకాయ వచ్చి చేరాయి. నెల రోజులుగా గ్రేటర్ పరిధిలో నిమ్మకాయలు, కోడిగుడ్లవినియోగం విపరీతంగా పెరగడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గతంలోవారానికి ఒకటి రెండు రోజులునిమ్మకాయ, కోడిగుడ్లు వినియోగించేవారు ప్రస్తుతం వీటిని ప్రతిరోజూ వాడుతున్నారు. కోడిగుడ్లను ఉడకబెట్టి తింటున్నారు. నిమ్మకాయలను జ్యూస్ చేసుకుని తాగుతున్నారు.కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు, వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు ఇదే సరైన విధానమని భావిస్తున్నారు. దీంతో నిమ్మ, కోడిగుడ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. వేసవి కాలంలో నిమ్మకాయ ధరలు పెరగడం, కోడిగుడ్ల ధరలు తగ్గడం సాధారణమే. కానీ ప్రస్తుతం గ్రేటర్లో వీటి వినియోగం భారీగా ఉన్నప్పటికీ ధరలు అందుబాటులోనే ఉండటం గమనార్హం. కారణం నిమ్మకాయల వినియోగం వేసవిలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది వేసవిలో, వేసవి ముగిసిన అనంతరం నిమ్మకాయల ధరలు పెరగలేదు. వేసవి తర్వాత మామూలుగా వర్షాలు ప్రారంభమైతే జనం నిమ్మకాయల వినియోగం తగ్గిస్తారు. కానీ కరోనా విరుగుడుకు చాలా మంది నిమ్మకాయను వినియోగిస్తున్నారు. అయినా ధరలు మాత్రం అంతగా పెరగలేదు. రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు ‘సి’ విటమిన్ ఎక్కువగా తీసువాలని జనం నిత్యం నిమ్మకాయలను వినియోగిస్తున్నారు. వర్షాకాలంలోనూ నిమ్మకు డిమాండ్ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ రోగ నిరోధకశక్తి పెంచుకునేందుకు ‘సి’ విటమిన్ బాగా లభించే నిమ్మకాయ వినియోగం పెంచారు గ్రేటర్‌వాసులు. అయినా ధరలు మాత్రం అంతగా పెరగలేదు. గ్రేటర్ పరిధిలో మార్కెట్లు, రైతు బజార్లతో పాటు దారుషిపా, చాదర్‌ఘాట్‌లోని మార్కెట్లకు ఎక్కువ మోతాదులో నిమ్మకాయలు దిగుమతి అవుతున్నాయి. దీంతో గ్రేటర్ డిమాండ్‌కు సరిపడా ఇవి అందుబాటులో ఉండడంతో ధరలు పెరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే సీజన్లో నిమ్మకాయల బస్తా ఒకటి రూ.600 నుంచి రూ.800 ఉందని, ప్రస్తుతం బస్తా రూ.250 నుంచి రూ. 350 వరకు ఉందని వ్యాపారులు అంటున్నారు. ఒక బస్తాలో దాదాపు 300 నుంచి 400 నిమ్మకాయలు ఉంటాయి. కోడిగుడ్లు సైతం భారీగా వినియోగం వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవడానికి గ్రేటర్ ప్రజలు తమ రోజువారీ మెనూలో పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కోడ్ల వినియోగం పెరిగింది. కొన్ని రోజుల నుంచి గుడ్ల వినియోగం పెరిగిందని, ప్రస్తుతం జంట నగరాల్లో కోటి కోడిగుడ్ల మేరకు వినియోగమవుతున్నట్టు ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ (నెక్) అధికారులు అంటున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కోడిగుడ్ల ఉత్పత్తులు బాగానే ఉన్నాయని నెక్ వర్గాలు చెబుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో దాదాపు 80 వరకు ఉన్న పౌల్ట్రీఫారాలు చికెన్‌తోపాటు కోడిగుడ్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ప్రస్తుతం చికెన్ వినియోగం కొంత తగ్గినా, గుడ్ల వినియోగం మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నట్టు పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ధరలు అందుబాటులోనే.. వేసవిలో తగ్గిన గుడ్ల ధరలు ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో కోడిగుడ్డు ధర రూ. 3.60 పైసలు ఉండగా రిటేల్ మార్కెట్లో రూ. 4.50 పైసల వరకు ఉంది. గత వారం రోజులుగా గుడ్ల వినియోగం పెరిగిన ధరలు అంతగా పెరగలేదు. ప్రస్తుతం వర్షాకాలంలో గుడ్ల వినియోగం ఎక్కువగా ఉండదని భావించినా.. కరోనా ప్రభావంతో గుడ్లకు గతంలో ఎప్పుడూ లేనంతగా డిమాండ్ ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తి బాగానే ఉందని నెక్ అధికారులు అంటున్నారు. ♦ గత ఏడాది బస్తా నిమ్మకాయల ధర రూ.600– రూ.800 ♦ ప్రస్తుతం రూ.250– రూ.350 ♦ ఒక బస్తాలో 300– 400 నిమ్మకాయలు ♦ హోల్‌సేల్‌లో కోడిగుడ్డు రూ.3.60 పైసలు ♦ రిటైల్ మార్కెట్లో రూ.4.50 పైసలు ♦ నగరంలో రోజుకు కోటి కోడిగుడ్ల వినియోగం -
ఆవనూనె, నిమ్మరసంతో కరోనాకు చెక్
కోల్‌కతా : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కేవలం చికిత్సలో ఉపయోగించే ఔషధాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న పోలీసులు సైతం అధిక సంఖ్యలో ఈ వైరస్ బారిన పడతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా బెంగాల్ పోలీసులు కొత్త పద్దతులను కనుగొన్నారు. ఆవనూనె, నిమ్మకాయ కలిపిన వేడినీళ్లు తీసుకోవడం వల్ల కోవిడ్ నుంచి త్వరగా కోలుకుంటామని ఉత్తర బెంగాల్‌లోని సిలిగురి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇది ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చిందని అన్నారు. మిగతా అధికారులు, సిబ్బంది కూడా ఈ విధానాన్ని ఆచరించాలని పేర్కొంటూ ఓ సర్క్యులర్ విడుదల చేశారు. కమిషనరేట్‌లోని డిప్యూటీ పోలీస్ కమిషనర్ బంధువు, ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ కరోనా బారినపడగా వాళ్లు ఈ పద్ధతులను అనుసరించి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. (రాందేవ్ బాబాకు మహా వార్నింగ్ ) అందరికి అందుబాటులో ఇంట్లోనే దొరికే ఆవనూనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుందనడానికి ఇలాంటివి ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు. గతవారం రోజుల క్రితమే డార్జిలింగ్ జంక్షన్ సమీపంలో ఉన్న పోలీసుకు, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారు ఈ చిట్కాలనే పాటించారు. దీంతో రెండురోజుల్లోనే వారి ఆరోగ్యం మెరుగయ్యిందని పోలీస్ కమిషనర్ త్రిపురారీ ఆర్ధవ్ పేర్కొన్నారు. 'మేం డాక్టర్లు కాకపోయినా చిన్నప్పటి నుంచి మన పెద్ద వాళ్లు అనుసరించేవి చూస్తూ పెరిగినవాళ్లం. మన మూలాలను ఎప్పటికీ మరవద్దు. కరోనా నియంత్రణలో ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కాబట్టి మా ఉద్యోగులు, ఇతర సిబ్బందికి ఈ జాగ్రత్తలు పాటించమని సెర్య్యులర్ విడుదల చేశాం. వీటిని పాటించి కరోనాను ధీటుగా ఎదుర్కొన్న వారి అనుభవాలను కూడా జోడించాం 'అని ఆర్థద్ తెలిపారు. (ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక రైల్వే స్టేషన్ ) -
నిమ్మకాయ.. కొనరాయె!
సాక్షి, అమరావతి : నీరసాన్ని పోగొట్టే నిమ్మకాయలను సాగు చేసే రైతన్నలు ధరల పతనంతో విలవిలలాడుతున్నారు. తోటలు కాయలతో కళకళలాడుతున్నా కొనే నాథుడు లేక గిరాకీ తగ్గిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అన్ సీజన్ కావడం, వాడకం తగ్గడం, చలి పెరగడంతో నిమ్మతోటలు నేలచూపు చూస్తున్నాయి. రెండు మూడు నెలల క్రితం కిలో రూ.100 – రూ.120 పలికిన నిమ్మకాయల ధర ప్రస్తుతం రూ.5 – 6 మాత్రమే ఉండటం ధరల పతనానికి నిదర్శనం. నిమ్మకాయల విక్రయానికి రాష్ట్రంలో ప్రధాన మార్కెట్లైన గూడూరు, తెనాలి, ఏలూరు, రాజమండ్రిలో ఇదే పరిస్థితి నెలకొంది. 36,180 హెక్టార్లలో సాగు అరటి, మామిడి తర్వాత ఉద్యాన పంటల్లో నిమ్మ అత్యధికంగా సాగవుతోంది. రాష్ట్రంలో సుమారు 36,180 హెక్టార్లలో నిమ్మ తోటలున్నాయి. 17,742 హెక్టార్లతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అగ్రస్థానంలో ఉండగా 6,090 హెక్టార్లతో పశ్చిమ గోదావరి, 3173 హెక్టార్లతో ప్రకాశం, 2756 హెక్టార్లతో గుంటూరు, 2,234 హెక్టార్లతో వైఎస్సార్ జిల్లాలు తదుపరి స్థానాల్లో నిలిచాయి. నిమ్మ ఎకరానికి 100 – 150 టిక్కీల (టిక్కీ అంటే 50 కిలోలు) వరకు దిగుబడి వస్తుంది. రాష్ట్రం నుంచి వారణాసి, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా తదితర ప్రాంతాలకు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. సీజన్లో మార్చి నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు ఒక్కో మార్కెట్‌కు 60 – 100కిపైగా లారీల కాయలు వస్తుండగా ప్రస్తుతం పట్టుమని పది లారీలు కూడా రావడం లేదు. ధర ఎందుకు తగ్గిందంటే? ఉత్తరాది రాష్ట్రాల్లో దీపావళి తర్వాత సెంటిమెంట్‌పై నమ్మకంతో నిమ్మకాయలపై కత్తి గాటు పడనివ్వరు. ఈ సీజన్లో వీటిని కోయడాన్ని అపశకునంగా భావిస్తారు. దీనికితోడు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక పులుపు వాడకాన్ని తగ్గిస్తారు. శీతకాలంలో నిమ్మకాయలు వినియోగిస్తే జలుబు చేస్తుందని కొంతమంది భావిస్తారు. దక్షిణాది నగరాలకే ఎగుమతి గతంలో నిత్యం వందకుపైగా నిమ్మకాయల లోడ్ లారీలు ఢిల్లీ పరిసర ప్రాంతాలకు ఎగుమతి అవుతుండగా ఇప్పుడా సంఖ్య పదికి లోపే ఉందని గూడూరుకు చెందిన వ్యాపారి కె.శ్రీనివాసులురెడ్డి చెప్పారు. సెప్టెంబర్‌లో ఇక్కడ కిలో గరిష్టంగా రూ.150 పలికితే ఇప్పుడు రూ.5 నుంచి రూ.6 మాత్రమే ఉంది. మేలిరకం కాయలైతే కిలో గరిష్టంగా రూ.8 పలుకుతున్నాయి. ప్రస్తుతం గూడూరు మార్కెట్ నుంచి బెంగళూరు, చెన్నై, మధురై, సేలం వంటి దక్షిణాది రాష్ట్రాలలోని ముఖ్య నగరాలకు మాత్రమే రోజూ పది లారీల లోపు తరలిస్తున్నారు. ఏలూరు మార్కెట్‌కు ఆగస్టు, సెప్టెంబర్‌లో రోజుకు 70 – 100 లారీల సరుకు రాగా ఇప్పుడది 10 – 11కే పరిమితమైంది. బుధవారం ఇక్కడ కిలో కాయలు గరిష్టంగా రూ.9 పలికాయి. తెనాలి నుంచి మంగళవారం 11 లారీల సరకును ఇతర రాష్ట్రాలకు తరలించగా రాజమండ్రికి వచ్చే కాయలు స్థానిక మార్కెట్‌కే పరిమితమయ్యాయి. కూలి కూడా గిట్టుబాటు కావట్లేదు ‘ఒక టిక్కీ నిమ్మకాయలు కోయడానికి కూలి రూ.200 అవుతుంది. బస్తా రవాణా చార్జీ రూ.40, యార్డులో పది శాతం కమిషన్, దింపుడు కూలి రూ.15, పురికొస, గోతం కింద బస్తా కాయలకు మరో రూ.15 ఖర్చవుతుంది. ఒక టిక్కీకి గరిష్టంగా రూ.350 వస్తే అందులో రూ.305 ఖర్చవుతుంది. కాయలను కోయకుండా వదిలేస్తే పండిపోయి నేల రాలిపోతాయి. ఎలాగోలా అమ్ముదామంటే చేతి చమురు వదులుతోంది’ – కొత్త రమేష్‌బాబు (నిమ్మ రైతు, సంగంజాగర్లమూడి) జనవరి దాకా ఇదే పరిస్థితి.. ‘ప్రస్తుతం అన్ సీజన్ కావడంతో నిమ్మకి గిరాకీ లేదు. మార్కెట్లకు గతంలో 60 నుంచి వంద లారీల సరకు వస్తే ఇప్పుడు పదికి లోపే వస్తున్నాయి. ఇప్పుడు కాపు కూడా తక్కువే అయినా ధర లేకుండా పోయింది. జనవరి దాకా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులను ఇక్కడకు రప్పించి కొనుగోలు కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాం’ – ఏ.రాము (నిమ్మ మార్కెట్ కమిటీ కార్యదర్శి, ఏలూరు) -
ఆశావహ సేద్యం!
రసాయనిక వ్యవసాయానికి పెట్టింది పేరైన హర్యానా రాష్ట్రంలో ఆశా వంటి ప్రకృతి వ్యవసాయదారులు అరుదుగా కనిపిస్తారు. ఆశ తన కుటుంబ సభ్యులు, కూలీల సహకారంతో గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పండ్ల తోటలు, పంటలు సాగు చేస్తానంటే వాళ్ల ఇంట్లో వాళ్లే ఎగతాళి చేశారు. అయినా, ఆశా వెనకంజ వెయ్యలేదు. జిల్లా కేంద్రం చర్కి–దద్రి జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో పిచొంప కలన్ గ్రామం ఆమెది. 3,200 గడప ఉంటుంది. ఆశా, ఆమె కోడలు జ్యోతితోపాటు ఆ ఊళ్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు చాలా కొద్దిమంది మాత్రమే. వాళ్లకు మూడెకరాల భూమి ఉంది. అందులో నారింజ, నిమ్మ, బత్తాయి చెట్లతో కూడిన పండ్ల తోటను సాగు చేస్తున్నారు. పరస్పరం పోటీ పడని సీజనల్ పంటలను అంతర పంటలుగా సాగు చేయడం ప్రకృతి వ్యవసాయంలో ఓ ముఖ్య సూత్రం. ఆశా ఆ సూత్రాన్ని పాటిస్తున్నారు. పాలకూర, మెంతికూర, శనగలు, సజ్జలు, గోధుమలను కూడా అంతరపంటలుగా సాగు చేస్తూ ఉత్తమ రైతుగా ఆశా పేరు గడించారు. అదే తోటలో సీతాఫలం మొక్కలను కూడా నాటాలని ఆమె అనుకుంటున్నారు. తొలుత రెండేళ్ల పాటు సాధారణ దిగుబడితో పోల్చితే 40 శాతం మేరకే దిగుబడి వచ్చిందని, అయినా మక్కువతో ప్రారంభించిన ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించి, ఇప్పుడు మంచి దిగుబడులు పొందుతున్నానని ఆశా తెలిపారు. ఏ రోజైనా ఇంటిపనులు చేసుకున్న తర్వాత ఉదయం, సాయంత్రం తోటలోకి వెళ్లి పనులు స్వయంగా చేసుకోవడం ఆశాకు, ఆమె కోడలికి అలవాటు. ప్రతిరోజూ శ్రద్ధగా తోటను గమనించుకుంటూ.. ఎక్కడైనా చీడపీడల జాడ కనిపిస్తే వెంటనే కషాయాలు, ద్రావణాలు పిచికారీ చేసి అదుపు చేయడం ముఖ్యమైన సంగతి అని ఆశ అంటున్నారు. గొయ్యిలో పాతిపెట్టిన మట్టి పాత్రలో పుల్లమజ్జిగ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. చీడపీడలకు దాన్ని నీటిలో కలిపి పిచికారీ చేస్తారు. ఔషధ చెట్ల నుంచి సేకరించిన జిగురుకు నిప్పు అంటించి తోటలో పొగబెట్టడం ద్వారా చీడపీడలను సంప్రదాయ పద్ధతిలో ఆశా పారదోలుతున్నారు. ‘పంటలు పూత దశలో మా బామ్మ ఇలాగే చేసేది’ అంటున్నారామె. ప్రతి రెండు నెలలకోసారి ద్రవ జీవామృతాన్ని తోటకు అందిస్తూ భూసారాన్ని పెంపొందిస్తున్నారు. వర్మీకంపోస్టును సైతం తయారు చేసి పంటలకు వాడుతున్నారు. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ఎరువులు, పురుగుమందులను తయారు చేసుకుంటున్నారు. బయట ఏవీ కొనడం లేదు. బోరు నీటిని స్ప్రింక్లర్లు, డ్రిప్ ద్వారా పంటలకు అందిస్తున్నారు. ‘ఈ తరహా ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి చాలా తక్కువే. అయితే, కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది’ అంటున్నారు ఆశా కోడలు జ్యోతి. సతత్ సంపద అనే స్వచ్ఛందసంస్థ హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులను పరిచయం చేస్తూ ఉంటుంది. ఆశకు ఈ సంస్థ తోడ్పాటునందించింది. సతత్ సంపద డైరెక్టర్ జ్యోతి అవస్థి ఇలా అంటున్నారు.. ‘భూమిలో డీఏపీ, యూరియా వెయ్యకుండా పంటలు ఎలా పండుతాయి? అని రైతులు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. భూమిలో సారం పెరగడానికి రెండేళ్లు పడుతుంది. అందుకే ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టిన తొలి రెండేళ్లలో దిగుబడి తక్కువగా ఉంటుంది. ఎంతో మక్కువతో ప్రారంభించిన ఆశ వంటి రైతులు తట్టుకొని నిలబడగలరు. కానీ, మరీ చిన్న రైతులు దీనికి తట్టుకోలేరు. అందుకే మేం ఈ రైతులతో పనిచేస్తున్నాం. మార్పు నెమ్మదిగా వస్తుంది..’. -
బ్యూటిప్స్
చర్మం మీద చేరే జిడ్డు తొలగి చర్మం తాజాగా నిగనిగలాడాలంటే ఇంట్లోనే ఇలా చేసి చూడండి. ►బ్యూటిప్స్ నిమ్మకాయ ముక్కతో ఇరవై నిమిషాల పాటు ముఖమంతా మర్దనా చేసి, చల్లటి నీటితో కడగాలి. (పొడి చర్మానికి ఈ చికిత్స పనికిరాదు). ►పలుచని ఆపిల్ ముక్కతో ముఖం, మెడ, చేతులు రుద్దుకుంటే చర్మగ్రంధుల నుంచి వెలువడే అదనపు నూనె తొలగిపోతుంది. ►అరటిపండు గుజ్జులో రెండు చుక్కల తేనె, రెండు చుక్కల గ్లిజరిన్, అర స్పూన్ నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది. ►శనగపిండి కాని, పెసర పిండి కాని పాలతో కలుపుకుని స్నానానికి సబ్బుకు బదులుగా ఉపయోగించవచ్చు. ►మెంతులలో పాలు వేసి గ్రైండ్ చేసి ముఖానికి ప్యాక్ వేసి, ఆరిన తర్వాత వేడి నీటితో కడగాలి. -
అసెంబ్లీలోకి నిమ్మకాయ నిషిద్ధం
యశవంతపుర (బెంగళూరు): సాధారణంగా సిగరెట్లు, గుట్కా, మద్యం వంటివాటిని చట్టసభల ఆవరణలోకి అనుమతించరు. కానీ అసెంబ్లీ భవనం విధానసౌధలోకి నిమ్మకాలను తీసుకెళ్లడం కూడా నిషిద్ధమే. గురువారం కొందరు వ్యక్తులు నిమ్మకాయలను తీసుకెళ్తుండగా గేట్ల వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా టిఫిన్, లంచ్ క్యారియర్లు, జేబుల్లో నిమ్మకాయలు దొరికితే వెంటనే తీసుకుని చెత్త కుండీలో పడేస్తున్నారు. ఆరోగ్యం సరిగాలేదని, మధ్య మధ్యలో నిమ్మరసం తాగాలని ఉద్యోగులు, సందర్శకులు చెబుతున్నా భద్రతా సిబ్బంది ససేమిరా అంటున్నారు. చేతబడి భయమా దీనికంతటికీ కారణం మూఢనమ్మకాలే. సందర్శకులు, కాంట్రాక్టర్లు మంత్రించిన నిమ్మకాలను తీసుకెళ్లి అధికారులను ప్రభావితం చేసి పనులు చేయించుకుంటారని భద్రత సిబ్బంది అనుమానిస్తున్నారు. దీంతో పాటు చేతబడి చేసిన నిమ్మకాయలను తీసుకెళ్లి మంత్రుల చాంబర్లలో వేస్తారనే భయాలూ ఉన్నాయి. ఇకపై విధానసౌధకు నిమ్మకాయలను తేవడాన్ని నిషేధించినట్లు అధికారులు తెలిపారు. గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీటిపై అనేక చర్చలు జరిగాయి. ఇది ఎలా ఉన్నా, సీఎం కుమారస్వామి అన్న, ప్రజాపనుల మంత్రి హెచ్డీ రేవణ్ణ నిత్యం చేతిలో నిమ్మకాయను పట్టుకుని ఉంటారు. ఈ నిషేధం ఆయనకు వర్తిస్తుందా? అని సౌధ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. -
ఇంటిప్స్
►పప్పు తొందరగా ఉడకాలంటే ఉడికించేటప్పుడు కొద్దిగా డాల్టా లేదా నూనె వేయాలి. ►నిమ్మకాయ తొక్కలను పిండిన తర్వాత వాటిని కుకర్ అడుగున వేసి రుద్దితే నలుపు తగ్గుతుంది. దుర్వాసన దూరం అవుతుంది. ►పచ్చిమిరపకాయల తొడిమలను తీసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే అవి త్వరగా పాడవవు. ►నూనె ఒలికితే ఆ ప్రాంతంలో కొద్దిగా మైదాపిండి చల్లాలి. పిండి నూనెను త్వరగా పీల్చేస్తుంది. ►క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయాలి. ►కత్తిపీటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది. ►కందిపప్పు డబ్బాలో ఎండుకొబ్బరి చిప్ప వేసి నిల్వ ఉంచితే పప్పు త్వరగా పాడవదు. ►మిక్సీ, అవెన్, ఫ్రిజ్.. వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై భాగం జిడ్డుగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు 4 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో టేబుల్ స్పూన్ వెచ్చని నీళ్లు కలిపి స్పాంజ్‌తో ముంచి, పిండి తుడవాలి. మురికి సులువుగా వదిలిపోతుంది. ►షూస్, స్నీకర్స్ లోపలి వైపు దుర్వాసన వస్తుంటుంది. కొద్దిగా బేకింగ్ సోడా లోపలి వైపు చల్లి, తడి క్లాత్‌తో తుడిస్తే దుర్వాసన రాదు. ►చెక్క ఫర్నీచర్ మీద మరకలు తొలగించాలంటే టూత్‌పేస్ట్ రాసి తర్వాత తడి క్లాత్‌తో తుడవాలి. ►పిల్లలు కలర్ పెన్సిళ్లతో గోడల మీద బొమ్మలు వేస్తుంటారు. ఈ మరకలు తొలగించాలంటే బేకింగ్ సోడా చల్లి, తడి స్పాంజ్‌తో తుడవాలి. ►నీళ్లలో కప్పు అమ్మోనియా కలిపి మెత్తని టర్కీ టవల్స్‌ను నానబెట్టాలి. అరగంట తర్వాత ఉతికితే మురికిపోతుంది. ►వేడి నీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం, చెంచా వంటసోడా, చిటికెడు ఉప్పు వేసి వాటర్ బాటిల్స్‌ను రెండు రోజుల కొకసారి శుభ్రపరిస్తే బాక్టీరియా దరిచేరదు. -
దాచిపెట్టుకుందామన్నా... దాచిపెట్టుకోలేరు...
అంత రుచిగా ఉంటేఎవరైనా దాచిపెట్టుకుంటారా! కంచం నాకేస్తారు. పంచినంత పంచేస్తారు. నిలవ పచ్చళ్లు కావు కదా మరి! ఇలా చేసుకోండి. ఒక వారం అలా లాగించేయండి. వారం వరకు మిగిల్తే కదా! అంతే మరి! అంత రుచిగా ఉంటే వారం వరకు మిగుల్తాయా! అందుకే దాచుకోవడం కష్టమే కదా! అల్లంపచ్చడి కావలసినవి అల్లం – 100 గ్రా.; ఉప్పు – తగినంత; నిమ్మరసం – 3 టీ స్పూన్లు; మిరపకారం: టేబుల్ స్పూను; తరిగిన పచ్చిమిర్చి – 4. తయారీ: ►అల్లం శుభ్రంగా కడిగి, తడిపోయేవరకు ఆరబెట్టాలి ►తొక్క తీసి సన్నగా పొడవుగా ముక్కలు చేయాలి ►ఒక పాత్రలో అల్లం ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి, పదినిమిషాల తరవాత, తరిగిన పచ్చిమిర్చి, కారం, నిమ్మరసం వేసి కలియబెట్టాలి ►గాజు సీసాలోకి తీసుకుని మూతపెట్టి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచాలి ►పరాఠాలోకి రుచిగా ఉంటుంది. టొమాటోఆవకాయ కావలసినవి: టొమాటోలు – 2 కిలోలు; నువ్వుల నూనె – పావు కేజీ; ఇంగువ – అర టీ స్పూను; ఆవ పిండి – ఒక టేబుల్ స్పూను; మెంతి పిండి – అర టీ స్పూను; మిరప కారం – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత. పోపు కోసం: నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 10 (ముక్కలు చేయాలి). తయారీ: ∙ ►టొమాటోలను శుభ్రంగా కడిగి, నీడలో ఆరబోయాలి ►పూర్తిగా తడి పోయాక చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక టొమాటో ముక్కలు, ఉప్పు వేయాలి ►టొమాటో ముక్కలలో తడి పోయి బాగా చిక్కగా అయ్యేవరకు సన్నటి మంట మీద ఉంచాలి ►బాగా చిక్కగా అయ్యాక మిరప కారం, ఆవ పిండి, మెంతి పిండి, ఇంగువ వేసి కలియబెట్టి దింపేయాలి ►స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి చిటపటలాడే వరకు వేయించి తీసేసి, సిద్ధంగా ఉన్న టొమాటో ఆవకాయలో వేసి కలపాలి ►చల్లారాక గాలిచొరని సీసాలోకి తీసుకోవాలి ∙నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుంది. ముక్కలపచ్చడి కావలసినవి: మామిడికాయలు – 3; మెంతులు – పావు టీ స్పూను; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; వెల్లుల్లి రేకలు – 12 (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); పసుపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – పావు కప్పు. పోపు కోసం: నూనె – 4 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఇంగువ – కొద్దిగా; వెల్లుల్లి రేకలు – 3; కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ►మామిడికాయలను నీళ్లలో వేసి పావు గంట తరవాత శుభ్రంగా కడిగి బయటకు తీయాలి ►పొడి వస్త్రంతో తుడవాలి ►మధ్యకు రెండుగా తరిగి, చిన్నచిన్న ముక్కలుగా చేయాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక మెంతులు వేసి దోరగా వేయించాలి ►ఆవాలు జత చేసి రెండూ కలిపి వేయించి దింపి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►ఒక పాత్రలో తరిగిన మామిడికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, మిరప కారం, ఆవ + మెంతి పొడి వేసి కలపాలి ►వెల్లుల్లి ముద్ద జత చేసి మరోమారు కలియబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి చిటపటలాడేవరకు వేయించాక, ఇంగువ వేసి కలియబెట్టాక, ముక్కల పచ్చడి మీద వేసి కలపాలి. ద్రాక్ష ఆవకాయ కావలసినవి: పుల్లటి ద్రాక్ష – కిలో; ఆవపిండి∙– టేబుల్ స్పూను; మిరప కారం – 4 టీ స్పూన్లు; ఉప్పు – 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి రేకలు – 10; నూనె – తగినంత; ఇంగువ – తగినంత తయారీ: ►ద్రాక్షలను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి ►నిలువుగా రెండు ముక్కలుగా కట్ చేయాలి ►ఒక గిన్నెలో ఆవపొడి, మిరప కారం, ఉప్పు, జీలకర్ర పొడి, వెల్లుల్లి రేకలను వేసి కలపాలి ►ఈ మిశ్రమంలో ద్రాక్షముక్కలను వేసి కలియబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కొద్దిగా కాగాక ఇంగువ వేసి కలిపి దింపేయాలి ►ద్రాక్ష ఆవకాయలో నూనె పోసి కలియబెట్టి, మరుసటి రోజు వాడుకోవాలి ►ఇది రెండు మూడు రోజుల కంటె నిల్వ ఉండదు. నిమ్మకాయ పచ్చడి కావలసినవి : నిమ్మకాయలు – 6; మిరప కారం – 50 గ్రా.; ఆవపిండి ∙– రెండు టీ స్పూన్లు; మెంతిపిండి – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను. పోపు కోసం : ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండుమిర్చి – 4 (ముక్కలు చేయాలి). తయారీ: ►నిమ్మకాయలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద నీడలో ఆరబోయాలి ►నిమ్మకాయలను చిన్నచిన్న ముక్కలుగా తరగాలి ►ఒక గాజు సీసా లేదా జాడీలో నిమ్మకాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి రెండు రోజులు ఉంచేయాలి ►మూడోరోజు సీసా మూత తీసి నిమ్మకాయ ముక్కలను పై నుంచి కిందికి ఒకసారి బాగా కలపాలి ►ఆవపిండి, మెంతిపిండి, మిరప కారం జత చేయాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక ఇంగువ వేసి కలపాలి ►ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి కలిపి చిటపటలాడాక దింపేయాలి ►నిమ్మకాయ ముక్కలకు జత చేయాలి ►ఈ పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి కావలసినవి: మామిడి కాయ ముక్కలు – రెండు కప్పులు; క్యారట్ ముక్కలు – అర కప్పు; బీన్స్ ముక్కలు – అర కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను. పేస్ట్ కోసం: వెల్లుల్లి రేకలు – 20; అల్లం – చిన్న ముక్క; మిరియాలు – ఒక టేబుల్ స్పూను; గసగసాలు – 2 టేబుల్ స్పూన్లు; జీడి పప్పులు – 50 గ్రా.; కొత్తిమీర తరుగు – అర కప్పు; పుదీనా తరుగు – పావు కపు; నిమ్మరసం – ఒక టేబుల్ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 20; పసుపు – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను ; ఉప్పు – తగినంత. తయారీ: ►మిక్సీలో వెల్లుల్లి రేకలు, అల్లం, మిరియాలు, గసగసాలు, జీడి పప్పులు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, తరిగిన పచ్చి మిర్చి, పసుపు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి ►ఒక పాత్రలో కూరగాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి ►నిమ్మరసం జత చేసి మరోమారు కలపాలి ►తయారుచేసుకున్న పేస్ట్, ఇంగువ జత చేసి మరోమారు కలపాలి ►రెండు గంటల తరవాత ఉపయోగించుకోవాలి ►ఈ పచ్చడి పెరుగన్నంలోకి రుచిగా ఉంటుంది. దబ్బకాయ పచ్చడి కావలసినవి: దబ్బకాయలు – 2; పచ్చి మిర్చి – 100 గ్రా.; మెంతులు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మెంతి పొడి – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను. పోపు కోసం: ఎండు మిర్చి – 20; ఇంగువ – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నూనె – 3 టేబుల్ స్పూన్లు. తయారీ: ►దబ్బకాయల తొక్కలు తీసి, తొనలను చిన్నచిన్న ముక్కలుగా చేసి ఒక గిన్నెలో వేయాలి ►పచ్చి మిర్చిని శుభ్రంగా కడగాలి ►తొడిమలు తీసి, మధ్యకు చీల్చి, దబ్బకాయ తొనలకు జత చేయాలి ►తగినంత ఉప్పు, పసుపు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి దింపేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఇంగువ, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దింపి, ఉడికించిన దబ్బకాయ పచ్చడిలో వేసి కలపాలి ►మెంతి పొడి జత చేసి కలియబెట్టాలి ►చల్లారాక గాలిచొరని సీసాలోకి తీసుకోవాలి ►వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది (మరిన్ని రోజులు కావాలనుకుంటే ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు) నారింజ పచ్చడి కావలసినవి: నారింజ కాయలు – 4; మిరప కారం – టేబుల్ స్పూను; మెంతి పొడి – అర టీ స్పూను; ఆవపిండి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఇంగువ – అర టీ స్పూను. పోపు కోసం: నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 10 (ముక్కలు చేయాలి). తయారీ: ►నారింజ కాయ తొక్క తీసి తొనలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి మధ్యకు చీల్చాలి (తొడిమలు తీసేయాలి) ►నారింజ తొనలకు పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ►తగినంత ఉప్పు, పసుపు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి దింపేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఇంగువ, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దింపి, ఉడికించిన నారింజకాయ పచ్చడిలో వేసి కలపాలి ►మెంతి పొడి జత చేసి కలియబెట్టాలి ►చల్లారాక గాలిచొరని సీసాలోకి తీసుకోవాలి ►వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది (మరిన్ని రోజులు కావాలనుకుంటే ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు) జామకాయ పచ్చడి కావలసినవి: జామకాయలు – పావు కిలో; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఆవ పొడి – ఒక కప్పు; వెల్లుల్లి రెబ్బలు – పావు కప్పు; జీలకర్ర పొడి – పావు కప్పు; ఉప్పు – తగినంత; మిరప కారం – తగినంత; కరివేపాకు – రెండు Æðమ్మలు; ఎండు మిర్చి – 4; నూనె – ఒక కప్పు తయారీ: ►జామకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►ఒక పాత్రలో జామకాయ ముక్కలు, ఆవపిండి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి ►ఉప్పు, మిరప కారం జత చేసి మరోమారు కలపాలి ►స్టౌ మీద బాణలిలో ఒక కప్పు నూనె వేసి కాగాక, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి ►కరివేపాకు వేసి మరోమారు వేయించి దింపేసి, జామ కాయ పచ్చడిలో వేసి కలపాలి ►చల్లారాక గాలిచొరని సీసాలోకి తీసుకుని నిల్వ చేయాలి ►ఈ పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది దోస ఆవకాయ కావలసినవి: దోస కాయలు – కిలో; ఆవ పొడి – ఒక టేబుల్ స్పూను; మెంతి పొడి – అర టీ స్పూను; మిరప కారం – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►దోస కాయలను శుభ్రంగా కడిగి తడిపోయేవరకు ఆరబెట్టాలి ►దోస కాయను మధ్యకు తరిగి, గింజలను తీసేయాలి ►దోస కాయలను చిన్నచిన్న ముక్కలుగా తరగాలి (తొక్క తీయకూడదు) ►ఒక పాత్రలో దోస కాయ ముక్కలు, ఆవ పొడి, మెంతి పొడి, మిరప కారం, ఉప్పు వేసి కలియబెట్టాలి ►నూనె పోసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ►మూడో రోజున మరోసారి కలిపి వేడివేడి అన్నంలో తింటే రుచిగా ఉంటుంది ►దోస ఆవకాయ వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. క్యారట్ పచ్చడి కావలసినవి: క్యారట్ స్లయిసెస్ – ఒక కప్పు; ఆవ నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఇంగువ – పావు టీ స్పూను; సోంపు పొడి – అర టీ స్పూను; మెంతులు – రెండు టీ స్పూన్లు; ఆవ పొడి – 2 టీ స్పూన్లు; మిరప కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత. తయారీ: ►ఒక పాత్రలో సోంపు పొడి, మెంతులు, ఆవ పొడి, మిరప కారం, ఉప్పు వేసి బాగా కలపాలి ►క్యారట్ స్లయిసెస్ జత చేసి మరోమారు కలపాలి ►స్టౌ మీద బాణలిలో ఆవ నూనె వేసి కొద్దిగా కాగాక ఇంగువ వేసి, కలిపి, వెంటనే దింపేసి, క్యారట్ పచ్చడి మీద వేసి కలపాలి ►ఈ పచ్చడి అన్నం, పరాఠా, పూరీ, పుల్కాలలోకి రుచిగా ఉంటుంది. (తయారు చేసిన వెంటనే ఫ్రిజ్‌లో ఉంచాలి. లేదంటే పాడైపోతుంది) పెసర ఆవకాయ కావలసినవి : మామిడి కాయలు – 2; పెసర పప్పు – 100 గ్రా.; మిరప కారం – 50 గ్రా.; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్లు. తయారీ: ►మామిడికాయలను శుభ్రంగా కడిగి తడిపోయేవరకు ఆరబెట్టాలి ►చిన్నచిన్న ముక్కలుగా తరగాలి ►స్టౌ మీద బాణలిలో పెసర పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►ఒక పాత్రలో మామిడి కాయ ముక్కలు, మిరప కారం, పెసర పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి ►నువ్వుల నూనె వేసి మరోమారు కలియబెట్టి, మూడు రోజుల తర్వాత వాడుకోవాలి ►వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ►ఈ ఆవకాయ పది రోజుల కంటె నిల్వ ఉండదు. -
నిమ్మకాయలతో గుప్త నిధులట!
రోడ్లల్లో ఎక్కడైనా కట్ చేసి, కుంకుమ పెట్టి పడేసిన నిమ్మకాయలను చూస్తే జనాలకు ఒకింత భయమే. తమకు కీడు జరుగుందనే భయంతో వాటిని దాటేందుకు కూడా సాహసించక, పక్కగుండా వెళ్లిపోతుంటారు. సరిగ్గా ఈ పాయింటే పట్టుకుని ‘మంత్రించిన నిమ్మకాయలు..మహిమ గల నిమ్మకాయలు ’ పేరిట ప్రజల జేబులకు చిల్లు పెట్టారు. చివరకు పోలీసులు వారికి చెక్ పెట్టారు. చిత్తూరు, శాంతిపురం: మహిమలు గల నిమ్మకాయల పేరిట అమాయక జనం రసం పిండిన అంతర్రాష్ట్ర ముఠాను రాళ్లబూదుగూరు పోలీసులు పట్టుకున్నారు. కుప్పం సీఐ కృష్ణమోహన్, రాళ్లబూదుగూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపిన వివరాలు.. గురువారం తెల్లవారుజామున నంజంపేట శివార్లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ చేస్తే మహిమ గల నిమ్మకాయలంటూ ప్రజలకు అంటగట్టి, మోసగిస్తున్నట్టు తేలింది. ఈ నిమ్మకాయల్లోకి ఇనుప వస్తువులు గుచ్చితే అవి వంగిపోతాయని ప్రయోగపూర్వకంగా చూపి జనాన్ని ఆకర్షిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో నిందితులు వెల్లడించారు. అంతేకాకుండా ఈ నిమ్మకాయను కలిగి ఉన్న వారికి గుప్తనిధులు దొరుకుతాయని ప్రచారం చేస్తూ జనాన్ని బోల్తా కొట్టించారు. సిబ్బందికి రివార్డు అందజేస్తున్న సీఐ కృష్ణమోహన్ వీళ్ల మాయమాటలు నమ్మి నిమ్మకాయలు పుచ్చుకుని పలువురు డబ్బులు భారీ మొత్తంలో ఇచ్చి మోసపోయారు. అయితే, తీరా నిమ్మకాయల్లో రసం తప్పితే మహిమలేమీ లేవని జ్ఞానోదయమయ్యేసరికి ఇక పరువు పోతుందని కిమ్మనకుండా ఉండిపోయారు. నిమ్మకాయల ముఠా సమాచారం పోలీసుల చెవిన పడడంతో ఎట్టకేలకు ఏడుగురిని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో బెంగళూరుకు చెందిన బాషా, బంగారుపేట ప్రాంతానికి చెందిన రమేష్, మూర్తితో పాటు కుప్పం మండలానికి చెందిన మునిరత్నం, శాంతిపురం మండలానికి చెందిన జయరాం, హరీష్‌కుమార్, రవీంద్ర అని తేలింది. వారి నుంచి నిమ్మకాయలూ స్వాధీనం చేసుకున్నారు. వాళ్ల రసం పిండారు. ఈ కేసుకు సంబంధించి వీరిని శాంతిపురం తహసీల్దారు ఎదుట హాజరు పరచి బైండోవర్ చేశారు. నిమ్మకాయల ముఠా బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే విచారణ చేసి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసు అధికారులు భరోసా ఇచ్చారు. నిమ్మకాయల ముఠా భరతం పట్టిన సిబ్బందికి రివార్డును అందజేశారు. -
బ్యూటిప్స్
ఆపిల్స్ – 2 తేనె – ఒక టేబుల్ స్పూన్‌ఆపిల్స్‌ని చెక్కు తీసి, గ్రైండ్ చేసుకోవాలి. తేనెలో గ్రైండ్ చేసిపెట్టుకున్న ఆపిల్ పేస్ట్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత కడిగేయాలి. లెమన్ మాస్క్ నిమ్మకాయ – 1 ఓట్మీల్ – అర కప్పు, కోడిగుడ్డు – 1(తెల్లసొన)ఒక పాత్రలో పై పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. -
బ్యూటిప్స్
యాంటీ ఏజింగ్ ఫేషియల్ మాస్క్ పెరిగే వయసును అద్దంలా ప్రతిబింబింపజేసేది చర్మం. అందులోనూ చలికాలంలో మరీ ఎక్కువ ముడతలు పడుతుంది. అందుకే ఈ కాలంలో వార్ధక్య లక్షణాలకు చెక్‌పెట్టే హోమ్మేడ్ ఫేషియల్ మాస్క్ఒక నిమ్మకాయను తీసుకుని, గింజలు వేరుచేసి, అందులో ఒక స్పూను మీగడ వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పలుచటి పొరలా ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత తీసేసి ముఖానికి ఫేషియల్ క్రీమ్ రాసి మర్దన చేయాలి. ముడతలు పడిన చర్మానికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. -
నెరవేరిన రైతుల కల
నకిరేకల్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బత్తాయి, నిమ్మ మార్కెట్ల ప్రారంభ కల నెరవేరనుంది. తెలంగాణ ప్రభుత్వం నల్లగొండలోని గంధంవారిగూడెంలో బత్తాయి, నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్‌ను ఏర్పాటు చేసింది. వీటిని ఆదివారం మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి ప్రారంభించనున్నారు. కొన్ని దశాబ్దాలుగా నిమ్మకు సరైన మద్దతు ధర లేకపోవడం, దళారుల ప్రమేయంతో సంబంధిత రైతులు తీవ్ర నష్టాన్ని సవిచూస్తున్నారు. ఇకపై ఆ సమస్యల చెక్ పడనుంది. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి నిమ్మ మార్కెట్ జిల్లాలోని నకిరేకల్‌లో ఏర్పాటు చేశారు. రూ.3.07 కోట్లతో నిమ్మ మార్కెట్‌ను సర్వాంగ సుందరంగా నిర్మించారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఎన్నికల ముందు ప్రజ లకు ఇచ్చిన హామీలో భాగంగా మార్కెట్‌ను మం జూరు చేయించారు. çనకిరేకల్‌లోని చీమలగడ్డ శివారులో అన్ని సౌకర్యాలతో ఆ మార్కెట్‌ను నిర్మించారు. దీనిని ఆదివారం ఉదయం 10 గం టలకు మంత్రులు ప్రారంభించనున్నారు. ఏటా రూ.750 కోట్ల వ్యాపారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏటా రూ.750 కోట్ల నిమ్మ వ్యాపారం సాగుతుంది. ఇప్పటి వరకు ఈ వ్యాపారం అంతా అనధికారికంగా దళారులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే నిమ్మకాయల వ్యాపారానికి ప్రసిద్ధిగాంచిన నకిరేకల్ ప్రాంత రైతులు నిమ్మ మార్కెట్ లేకపోవడంతో దళారులను ఆశ్రయిస్తూ నిండా మునుగుతున్నారు. దాంతో 2016 ఆగస్టు 3న మార్కెట్ నిర్మాణానికి రూ.3.07 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 అక్టోబర్ 24వ తేదీన నకిరేకల్ పెద్ద చెరువు వద్ద నిమ్మ మార్కెట్, మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం కోసం రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి శిలాపలకాలను ఆవిష్కరించారు. 2017 మే 15న స్థల సేకరణ సమస్య పరిష్కారమైంది. తిప్పర్తిరోడ్డులోని చీమలగడ్డ సర్వే నంబర్ 459లో 9.39 ఎకరాల స్థలాన్ని మార్కెట్ నిర్మాణం కోసం ఎంపిక చేశారు. ఈ స్థలంలోని 10 మంది భూ నిర్వాసితులకు రూ.39.90 లక్షల పరిహారం మంజూరు చేసింది. 2017 జూన్ 6న చీమలగడ్డలో ఎమ్మెల్యే వేముల వీరేశం భూమి పూజ చేశారు. రూ. కోటితో 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో జర్మనీ దేశం నుంచి తెప్పించిన మెటీరియల్‌తో గ్రేడింగ్ కవర్డ్ ఫ్లాట్ఫారమ్ను నిర్మించారు. రూ.75లక్షలతో వ్యాపారుల కోసం 25 దుకాణ సముదాయం, రూ.17లక్షలతో నిమ్మ మార్కెట్ కార్యాలయ భవనం నిర్మించారు. రైతులకు మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కూడా కల్పిస్తున్నారు. యార్డులో అంతర్గత సీసీ రహదారి నిర్మాణం కూడ కొంత మేర పూర్తయింది. ఉమ్మడి జిల్లాలో నిమ్మసాగు ఇలా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 30 వేల హెక్టార్లకు పైగా నిమ్మ తోటలు సాగవుతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే హెక్టార్‌కు 10టన్నుల దిగుబడి వస్తుంది. నిమ్మకు మంచి ధర ఉంటే క్వింటాకు సరాసరి రూ. 2వేల ధర పలుకుతుంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో ఏటా రూ. 750 కోట్ల నిమ్మ వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారం అంతా అణధికారికంగా గత మూడు దశాబ్దాల నుంచి కొనసాగుతుంది. నూతనంగా నిర్మించబోయే ఈ నిమ్మ మార్కెట్ ప్రారంభమైతే మా ర్కెట్ ఫీజుల రూపంలో ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతుంది. నేడు బత్తాయి మార్కెట్ ప్రారంభం సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని బత్తాయి రైతుల ఎన్నో ఏళ్ల కల సాకారం కానుంది. జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెంలో రూ.1.80 కోట్ల వ్యయంతో గత ఏడాది నిర్మాణ పనులు మొదలైన బత్తాయి మార్కెట్ పూర్తయింది. బత్తాయి మార్కెట్ నిర్మాణ పనులకు గతేడాది రాష్ట్ర సాగునీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. కాగా, ఏడాది వ్యవధిలోనే మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేయించి తానే మార్కెట్‌ను ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌రావు నాడు ప్రకటించారు. ఆ విధంగానే ఆదివారం సాయంత్రం 3 గంటలకు బత్తాయి మార్కెట్‌ను ప్రారంభించనున్నారు. రైతులకు ఎంతో వెసులుబాటు జిల్లాలోని బత్తాయి రైతులు తమ పంటను విక్రయించుకోవడానికి పూర్తిగా దళారులపైనే ఆధారపడుతున్నారు. కర్నూలు తదితర జిల్లాల నుంచి వచ్చే దళారులు తోటలపైనే బత్తాయికి రేటు మాట్లాడుకుని అరకొరగా రైతులకు చెల్లించి వారు లాభాలు పొందుతున్నారు. ఒక వేళ ఎవరైనా రైతు స్వయంగా మార్కెట్లో బత్తాయి అమ్ముకోవడానికి వెళితే హైదరాబాద్ కొత్తపేట మార్కెట్లో దళారుల చేతుల్లో పడి నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు స్థానికంగానే బత్తాయి మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని బలంగా డిమాండ్ చేశారు. కాగా మార్కెట్ మంజూరుకావడం , ఏడాదిలోగా నిర్మాణం పనులు పూర్తయి అందుబాటులోకి వస్తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మార్కెట్లో ఎనిమిది మంది కమీషన్ ఏజెంట్లు, నలుగురు ట్రేడర్స్ లైపెన్స్ పొందారు. ఆదివారం నుంచి బత్తాయిలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అధికార పార్టీ ఏర్పాట్లు మరో వైపు మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రి హరీశ్‌రావు మార్కెట్‌ను ప్రారంభించనుండగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నల్లగొండ ఇన్చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. బత్తాయి మార్కెట్‌ను ప్రారంభించాక గంధంవారి గూడెం నుంచి బైకు ర్యాలీ ద్వారా మంత్రిని స్థానిక బీట్ మార్కెట్‌కు తీసుకువస్తారు. అనంతరం మార్కెట్లోనే బహిరంగ సభను ఏర్పాటు చేశారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. శనివారం నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కరీంపాష , డైరెక్టర్ గార్లపాటి శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి మధు బత్తాయి మార్కెట్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. -
సమ్మర్‌కే కాదు నిమ్మ
శరీరానికి రోగనిరోధక శక్తిని సమకూర్చేది విటమిన్–సి అని అందరికీ తెలిసిందే. అది నిమ్మలో పుష్కలం. అంటే.. నిమ్మ అనేది రోగనిరోధక శక్తికి పర్యాయపదమని అనుకోవచ్చు. వేసవిలోనే నిమ్మ అవసరం ఎక్కువ అనుకుంటాం. కానీ కాదు. ప్రతి సీజన్‌కూ అవసరమే. నిమ్మలో కేవలం విటమిన్–సి మాత్రమే కాకుండా.. విటమిన్ ఏ, ఈ లతో పాటు ఫోలేట్, నియాసిన్, థయామిన్, రైబోఫ్లేవిన్ కూడా ఉంటాయి. వీటన్నింటి సమాహారం కావడంతోనే నిమ్మలో వ్యాధినిరోధక శక్తి కలగజేసే అన్ని అంశాలూ ఉన్నాయి. ఆరోగ్యానికి నిమ్మతో ఒనగూరే ప్రయోజనాల్లో కొన్నివి. ♦ నిమ్మ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే మంచి జీర్ణశక్తి కోరుకునేవారు ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలుపుకొని, కాస్తంత తేనె లేదా ఉప్పుతో తాగుతుంటారు. ఈ విధానం బరువు నియంత్రణకూ దోహదపడుతుంది. ♦ నిమ్మనీరు తాగాక నోరంతా ఫ్రెష్ అయినట్లుగా ఒక తాజా భావన కలుగుతుంది. నిమ్మ కొన్ని పంటినొప్పుల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, చిగుర్ల వ్యాధులనూ నివారిస్తుంది. ♦ జుట్టు పెరుగుదలకు నిమ్మ బాగా తోడ్పడుతుంది. నిమ్మతో వెంట్రుకలకు స్వాభావికమైన మెరుపు వస్తుంది. ♦ మేని నిగారింపునకూ నిమ్మ బాగా దోహదం చేస్తుంది. ఇందులోని విటమిన్–సి కారణంగా ఏజింగ్ ప్రక్రియ ఆలస్యంగా జరగడంతో పాటు చర్మానికి మంచి బిగుతూ, మెరుపూ సమకూరుతాయి. మొటిమలు, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలనూ నిమ్మ నివారిస్తుంది. ♦ నిమ్మలోని యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి. అందువల్ల గాయాలు త్వరగా తగ్గుతాయి. ♦ నిమ్మలోని రక్తాన్ని పలచబార్చకుండా ఉండే గుణం కారణంగా అది అంతర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదాలను నివారిస్తుంది. ఈ గుణం కారణంగానే.. ముక్కు నుంచి రక్తస్రావం అయ్యే వారికి నిమ్మకాయ వాసన చూపిస్తారు. ♦ ఆస్తమా మొదలుకొని అనేక శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది. శ్వాసవ్యవస్థలోని ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. -
‘లెమన్ ఫేస్ ఛాలెంజ్’
-
ఇంటర్నెట్లో మరో ఛాలెంజ్ వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు ఇంటర్నెట్లో సంచలనం సృష్టించిన ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ లాగా ఇప్పుడు ‘లెమన్ ఫేస్ ఛాలెంజ్’ సంచలనం సష్టిస్తోంది. ఇందులో చేయాల్సిందల్లా సగం కోసిన నిమ్మకాయ ముక్కను తీసుకొని పళ్లతో కొరికి కొంత రసాన్ని మింగాలి. అప్పుడు ముఖంలో కలిగే హావభావాలను వీడియోలో రికార్డు చేసి ఇంటర్నెట్లో పోస్ట్ చేయాలి. ఇతరులను పోటీకీ ఛాలెంజ్ చేయాలి. ఈ ఛాలెంజ్‌ను ఒంటరిగానైనా స్వీకరించవచ్చు. ఇంటిల్లిపాది స్వీకరించవచ్చు. లేదా మిత్ర బందంతో కలిసి ఛాలెంజ్ చేయవచ్చు. డీఐపీజీగా వ్యవహరించే ఒకరకమైన ప్రాణాంతక బ్రెయిన్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ‘అబ్రైగ్ ఆర్మీ’ ఈ ఛాలెంజ్‌ను సృష్టించిందని అమెరికా నుంచి వెలువడుతున్న ‘ది అమెరికా పోస్ట్’ పత్రిక వెల్లడించింది. గుడ్‌మార్నింగ్ బ్రిటన్స్ రిపోర్టర్ అరెక్స్ బెరెస్ఫోర్డ్ కూడా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన తన రియాక్షన్‌ను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఛాలెంజ్ స్వీకరించడం మరి ఇంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే ఛాలెంజ్ చేసిన వాళ్లు ఎంతోకొంత కరెన్సీ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆర్మీకి విరాళంగా ఇవ్వాలి. -
బత్తాయి భారం
► నిమ్మ సాగుపై అనాసక్తి ► రాయితీలకు స్వస్తి పలికిన ఉద్యానశాఖ ► సాగుకు దూరమవుతున్న రైతులు ► పంట కాపాడుకునేందుకు ఏటా రైతుల భగీరథ ప్రయత్నం ► 250 అడుగుల లోతుకు బోర్లు వేసినా కనిపించని నీటి చెమ్మ ► రానున్న కాలంలో పంట కనుమరుగయ్యే ప్రమాదం ఒంగోలు టూటౌన్ : జిల్లాలో ఒకప్పుడు సిరులు కురిపించిన బత్తాయి, నిమ్మ తోటలు ఆదరణ కోల్పోతున్నాయి. రైతులు ఈ పండ్ల తోటల పట్ల ఆసక్తి చూపడం మానేస్తున్నారు. గత నాలుగేళ్ళుగా జిల్లాలో వర్షాలు లేకపోవడం.. వాతావరణ పరిస్థితులు సక్రమంగా ఉండకపోవడం.. పంట కోతల సమయంలో మార్కెట్లో ధరలు పతనమవడం.. వంటి కారణాలు రైతులను వెం టాడుతున్నాయి. దీనికి తోడు భూగర్భజలాలు అడుగంటి.. బోర్లలో నీళ్ళు రాకపోవడం కూడా ప్రధాన కారణంగా రైతులు ఈ పండ్ల తోటలను వదిలేయాల్సిన పరిస్థితి వస్తోంది. గత రెండేళ్ళలో చాలా తోటలు ఎండిపోవడంతో రైతులు వాటిని కొట్టేయాల్సిన దుస్థితి వచ్చింది. దీంతో గత పదేళ్ళ క్రితం కనిగిరి ప్రాంతంలో విస్తారంగా కనిపి ంచే బత్తాయి, నిమ్మ తోటలు ఆదరణ కోల్పోతున్నాయి. రానురాను తోటల కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో బత్తాయి, నిమ్మ తోటలు 2,782 హెక్టార్లకు పైగా సాగవుతాయి. గత పదేళ్లకు ముందు ఈ పండ్ల తోటలు విస్తీర్ణం పెరిగేది. ఎక్కువగా ఈ తోటలు మార్కాపురం, కనిగిరి ప్రాంతంలో విస్తారంగా కనిపించేవి. కొనకనమిట్ల మండలంలోని చినారికట్లలో ప్రధాన సాగు నిమ్మతోటలే. 1200 ఎకరాలలో రైతులు సాగు చేస్తారు. ముఖ్యంగా నిమ్మతోటలకు కనిగిరి ప్రసిద్ధి. ఎకరాకు ఎరువులు, పురుగుమందులు, ఇతర ఖర్చులతో కలిపి మొత్తం రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు పెట్టుబడి అయ్యేది. అలాంటిది గత నాలుగేళ్లుగా జిల్లాను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. నైరుతి, ఈశాన్య రుతుపవనలు సకాలంలో రావడంలేదు. వర్షాలు కురవడం గగనమయింది. దీంతో భూగర్భజలాలు దారుణంగా పడిపోతున్నాయి. పంట రాగానే ధరల పతనం.. పశ్చిమప్రాంతంలో 200 నుంచి 250 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీటి చెమ్మ కనిపించని స్థితికి భూగర్భజలాలు పడిపోయాయి. దీంతో వేసవి కాలంతో పాటు వర్షాకాలంలో కూడా పండ్ల తోటలను కాపాడుకోవడానికి ఏటా రైతులు భగీరథ ప్రయత్నం చేయాల్సి వస్తోంది. గత యేడాది కరువు విలయతాండవం చేయడంతో వందల ఎకరాల్లో పండ్లతోటలను రైతులు వదిలేశారు. కొన్ని ప్రాంతాలలో అష్టకష్టాలు పడి తోటలను కాపాడుకున్నారు. ఈ పరిస్థితిలలో పంట దిగుబడి మార్కెట్లో రాగానే నిమ్మ ధరలు పతనమయ్యాయి. సాధారణంగా ఎకరాకు 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ప్రతికూల వాతావరణం వల్ల సగానికి దిగుబడి పడిపోయింది. అయినా.. కనిగిరి మార్కెట్ నుంచి ఆయా సీజన్లలో రోజుకి 70 నుంచి 85 టన్నుల వరకు కాయలు ఎగుమతి అయ్యేవి. అలాంటి పరిస్థితి నుంచి రానురాను నిమ్మ రైతులు నష్టాలతో పాటు కష్టాలను ఎదుర్కొనే దుస్థితి వచ్చింది. గత డిసెంబర్లో ప్రారంభంలో కిలో నిమ్మకాయలు రూ.5 నుంచి రూ.10 వరకు పలికింది. తరువాత కిలో రూపాయికి చేరింది. ఒక దశలో అర్ధరూపాయికి కూడా పడిపోయింది. మార్కెట్‌కు 50 కిలోల బస్తా తెస్తే కేవలం రూ.20 నుంచి రూ.30 మిగిలాయి. ఈ పరిస్థితులలో కోతకు వచ్చిన కాయలను కూడా చెట్లకే రైతులు వదిలేశారు. ఈ పరిస్థితులలో జిల్లాను ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించింది. పండ్లతోటలు ఎక్కువ విస్తీర్ణంలో ఎండిపోయాయి. రాయితీ నిలిపివేత.. జిల్లాలోని పరిస్థితిని గమనించిన జిల్లా ఉద్యానశాఖ అధికారులు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పండ్లతోటలపై సమీక్షించారు. ఈ ఏడాది నుంచి బత్తాయి, నిమ్మ తోటల సాగును ప్రోత్సాహించవద్దని ఆదేశించారు. ఆ పండ్ల తోటలకు ఇచ్చే 50 శాతం రాయితీని నిలిపివేయాలని సూచించారు. వాటి స్థానంలో విషయాన్ని యాపిల్‌బెర్, దానిమ్మ, నేరెడు, జామ తోటలను ప్రోత్సాహించాలని ఆదేశించారు. వీటికి రాయితీలను ప్రోత్సాహించి ఉద్యాన రైతులను అటువైపు మళ్లించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. దీంతో పాటు ప్రతి ఐదెకరాలకి ఒక ఫాంపాండ్ (నీటికుంట)ను ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు రాయితీ ఇవ్వాలని ఉద్యాన అధికారులకు తెలిపారు. ముఖ్యంగా ఉద్యాన పంటలకు కూడా 100 శాతం డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు జిల్లాను వెంటాడుతున్న ప్రతికూల వాతావరణం కూడా తోడవడంతో రానున్న కాలంలో జిల్లాలో బత్తాయి, నిమ్మ తోటల సాగుకు రైతులు దూరమయ్యే అవకాశం ఉంది. తోటలు కూడా దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి రాబోతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు వీటిపై ఆధారపడిన వ్యవసాయ కూలీలు ఇతర మార్గాలను ఎంచుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలవైపు వెళుతున్నారు. -
ధరలేక దిగాలు
నల్లజర్ల : మార్చి నెల ముగుస్తున్నా నిమ్మ ధరలు పెరగకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఇదే సమయానికి కిలో రూ.40కి పైగా ఉండగా ప్రస్తుతం కిలో రూ.28 నుంచి రూ.32 మాత్రమే పలుకుతున్నాయి. నిమ్మకాయలకు వేసవి కాలమే ప్రధాన సీజన్ మిగిలిన కాలంలో పెద్దగా ధర రాదు. ఆ సమయంలో పంట పెట్టుబడులకు సరిపోతుంది. వేసవిలో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో అమ్మకాలపైనే రైతులకు లాభాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది మార్చి నెల ముగింపు దశకు వచ్చినా ధరలో పెద్దగా మార్పు లేకపోవడంతో నష్టపోతున్నట్టు రైతులు గగ్గోలు పెడుతున్నారు. వచ్చే నెల నాటికి ధర పెరగకపోతే ఈ ఏడాది తీవ్రంగా నష్టపోతామని చెబుతున్నారు. నల్లజర్ల నిమ్మ మార్కెట్ నుంచి నిత్యం 200 బస్తాల వరకు ఇతర రాష్ట్రాలకు నిమ్మకాయలు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడి నుంచి గయ, వారణాసి తదతర ప్రాంతాలకు ఎగుమతులు బాగానే జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలోనై ధరలు పెరుగుతాయని రైతులు ఆశాభావంతో ఉన్నట్టు మార్కెట్ నిర్వాహకుడు పాతూరి చిన్నబ్బాయి తెలిపారు. -
ఇంటిప్స్
నిమ్మకాయలను పది నిమిషాల సేపు గోరువెచ్చని నీటిలో వేస్తే రసం మొత్తం సులువుగా వస్తుంది. ఉడికించిన నూడుల్స్ అతుక్కో కుండా పొడిగా రావాలంటే వేడి నీళ్లు వంచేసి, చన్నీళ్లు పోసి కాస్త నూనె కలిపితే సరి. -
సీఎంను ఇబ్బంది పెడుతున్న నిమ్మకాయ
-
సీఎం చేతిలో మంత్రించిన నిమ్మకాయ !
మైసూరు: తన రాజకీయ ప్రస్థానంలో మూఢనమ్మకాలను నమ్మని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం నగరంలోని రామకృష్ణనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేతిలో నిమ్మకాయతో దర్శనమివ్వడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన పెద్ద కుమారుడు రాకేశ్ సిద్ధరామయ్య మృతితో పుత్రశోకం నుంచి బయటపడడానికి ఆయన కుటుంబంతో కలసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోమవారం నగరంలోని టీ.కే.లేఔట్లో తన స్వగృహంలో బస చేసిన సద్ధరామయ్య మంగళవారం మంత్రించిన నిమ్మకాయతో మీడియా సమావేశానికి హాజరుకాడంతో అందరిలోను ఆశ్చర్యం నెలకొంది. -
నిమ్మ రైతులకు శుభవార్త
త్వరలో పొదలకూరు యార్డులో ఈ – మార్కెట్ ఏర్పాటు దేశ మార్కెట్‌ను అనుసరించి ధరల ప్రదర్శన నిమ్మ రైతులు నష్టపోకుండా కేంద్రం చర్యలు పొదలకూరు: స్థానిక ప్రభుత్వ నిమ్మ మార్కెట్ యార్డులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ–మార్కెట్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు యార్డులో బయ్యర్లు, సేల్స్ అనే రెండు విధాల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. బయ్యర్లకు రైతులు నేరుగా కాయలను తోలితే వారు ఢిల్లీ మార్కెట్‌ను అనుసరించి ధరలను అందజేస్తుంటారు. అలాగే సేల్స్ వ్యాపారులు రైతుల పంపించే కాయలను వేలంపాట ద్వారా బయ్యర్లకు అమ్ముతుంటారు. ఇందుగాను రైతుల నుంచి కమిషన్ వసూలు చేస్తారు. ఈ వ్యవహారం రైతు, వ్యాపారుల మధ్య ఉన్న సత్సంబంధాలు, నమ్మకంపై జరిగిపోతుంది. కాయలను మార్కెట్‌కు తోలే రైతులు దుకాణానికి రాకుండానే వ్యాపారులు ధరలను నిర్ణయిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రభుత్వ మార్కెట్లలో రైతులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు ధరల విషయంలో నష్టపోకుండా చూసేందుకు ఈ–మార్కెటింగ్‌ను తీసుకువచ్చింది. దేశంలోని 21 మార్కెట్ యార్డ్‌లలో ఈ–మార్కెటింగ్ విధానాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేసింది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో రాష్ట్రాలతో సంప్రదించి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రెండో విడతగా దేశంలోని 200 మార్కెట్ యార్డ్‌లలో ఈ–మార్కెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో ఈ–మార్కెట్ సౌకర్యాన్ని ప్రవేశపెడుతుండగా అందులో పొదలకూరు నిమ్మమార్కెట్ యార్డు ఉండడం విశేషం. ఇందుకోసం యార్డును అసిస్టెంట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అడ్వైయిజర్(కేంద్ర ప్రభుత్వ అధికారి) ఎం జవహర్ పరిశీలించారు. సెప్టంబరు చివరి నాటికి యార్డులో ఈ–ట్రేడింగ్ ద్వారా నిమ్మకాయలను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు. ఈ–మార్కెట్ సౌకర్యాలు ఈ–మార్కెట్ విధానంలో రైతు తన మొబైల్ నుంచే కాయల ధరలను పరిశీలించేందుకు వీలుకలుగుతుంది. దేశ మార్కెట్‌ను అనుసరించి యార్డ్‌లో నిత్యం ధరలను ప్రదర్శిస్తారు. యార్డుకు వచ్చే కాయల వివరాలను ముందుగా వ్యాపారులు ఆన్లైన్లో ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత కాయల ధరలను నిర్ణయిస్తారు. బయటి మార్కెట్, స్థానిక మార్కెట్ ధరలను తెలుసుకునేందుకు వీలుకలుగుతుంది. వ్యాపారులు నిర్ణయించిన ధరలతో పనిలేకుండా ఆన్లైన్లో ధరలను చూసుకుని రైతులు తమ కాయలకు ధర నిర్ణయించుకోవచ్చు. ఈ–మార్కెట్ ప్రయోజనం: ఎం.శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ కార్యదర్శి ఈ–మార్కెట్‌తో రైతులకు ప్రయోజనం. పొదలకూరు యార్డులోని రైతుల విశ్రాంతి గదిలో రూ.30లక్షలతో ఈ–మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. రైతుల విశ్రాంతి గదులను ఈ–మార్కెట్ పైన నిర్మిస్తాం. -
కరువు కరాళ నృత్యం
-
రసాన్ని లాగేస్తుంది
మాంసాహారులకైనా.. శాకాహారులకైనా.. నిమ్మకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. పులిహోరలోకైనా, బిర్యానీలోకైనా నిమ్మకాయ లేకుంటే ఎలా..? అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఉదయాన్నే కావలసిన నిమ్మరసంలోకి నిమ్మకాయే లేకపోతే ఎలా..? ఒకటా? రెండా? నిమ్మకాయ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమై పోయింది. దీనివల్ల కలిగే మేలు ఎంతున్నా.. ఓ సమస్య కూడా ఉంది. అదేనండీ.. దాన్ని పిండి, రసం తీయాలంటే మాత్రం కాస్త కష్టమే. మార్కెట్లోకి రసం తీసే ఎన్ని పరికరాలొచ్చినా... కాస్తో కూస్తో రసం అందులో ఉండిపోక తప్పదు. అందుకే ఈసారి నుంచి ‘సిట్రస్ స్ప్రేయర్’ను వాడండి. ముందుగా నిమ్మకాయ తొడిమను తీసి, ఈ స్ప్రేయర్‌ను దాంట్లోకి గుచ్చి, పైనున్న బటన్‌ను ప్రెస్ చేస్తే సరి. నిమ్మరసం కాయలోంచి డెరైక్ట్‌గా మీ సలాడ్లోకే వచ్చేస్తుంది. ఇవి వివిధ రంగుల్లో దొరుకుతున్నాయి. ఈ స్ప్రేయర్‌తో ఒక్క నిమ్మరసాన్నే కాదు.. బత్తాయిలాంటి పండ్లరసాలనూ ఏమాత్రం వృథా కాకుండా లాగేయవచ్చు. -
‘గజ’నిమ్మకాయ
తిక్క లెక్క తేలికగా గుప్పిట్లో ఇమిడిపోయేలా ఉండదూ! ఈ ఫొటోలో కనిపిస్తున్న నిమ్మకాయను చూస్తే నోరెళ్లబెట్టక మానరు. ప్రపంచంలోనే అతి భారీ నిమ్మకాయ ఇది. ఇజ్రాయెల్‌లో ఆహ్రామ్ శామ్యూల్ అనే ఆసామీ తోటలో 2003లో పండింది ఇది. మామూలు నిమ్మకాయల బరువు వంద గ్రాములకు ఇటూ అటుగా ఉంటే, ఈ నిమ్మకాయ మాత్రం ఏకంగా 5.265 కిలోల బరువు తూగి గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కింది. ఇప్పటి వరకు ఈ రికార్డు చెక్కుచెదరకపోవడం విశేషం. -
మన జాతీయాలు
చేతి చమురు భాగవతం! పూర్వపు రోజుల్లో వీధుల్లో భాగవతం ఆడేవారు. అందులోని వివిధ ఘట్టాలు ప్రేక్షకులను కట్టిపడేసేవి. పోను పోను ఏ నాటకం ఆడినా ‘వీధి భాగవతం ఆడుతున్నారు’ అనడం పరిపాటయింది. ఈ సంగతి ఎలా ఉన్నా... ఆ కాలంలో ఇప్పటిలా సౌకర్యాలేం లేవు కాబట్టి, స్టేజీ వేయడం నుంచి పెద్ద పెద్ద దీపాలు వెలిగించడం వరకు చాలానే కష్టపడాల్సి వచ్చేది. నాటకం జరుగున్నంత సేపూ దీపాలు వెలిగించడానికి అయ్యే చమురు ఖర్చు కూడా ఎక్కువగానే ఉండేది. అయితే నాటకానికి మంచి స్పందన వచ్చినప్పుడు... నటులకు చదివింపులు ఘనంగా ఉండేవి. నటులను సంతోష పెట్టడానికి ఊరివాళ్లు పోటీ పడి రకరకాల కానుకలు సమర్పించే వాళ్లు. అలా అని అన్ని సందర్భాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉండేది కాదు. కొన్నిసార్లు నాటకం ప్రేక్షకులకు నచ్చేది కాదు. ఒకవేళ నచ్చినా ఆ నచ్చడం అనేది ప్రశంసలకు మాత్రమే పరిమితమయ్యేది. మరికొన్నిసార్లు భారీ వర్షం వచ్చి నాటకం మధ్యలోనే ఆగిపోవడం లాంటివి జరిగేవి. దీంతో నిర్వాహకులు, నటులు ‘చమురుకు పెట్టిన డబ్బులు కూడా రాలేదు’ అని నిరాశ పడేవారు. పెట్టిన ఖర్చును చూసి బాధపడేవారు. అప్పటి నుంచి... వృథా ఖర్చు చేసి నష్టపోయిన సందర్భాల్లో ‘చేతి చమురు భాగవతం’ అనడం మామూలు అయిపోయింది. నిమ్మకాయ వాటం! అర చేతిలో గుమ్మడికాయ పడుతుందా? పట్టదు గాక పట్టదు. మరి నిమ్మకాయ? చాలా ఈజీగా పట్టేస్తుంది. పనుల్లో కూడా చేయదగినవి, చేయలేనివి, కష్టమైనవి, సులువైనవి ఉంటాయి. ఎవరి గురించైనా చెప్పేటప్పుడు ‘‘వాడికా పని కష్టమేం కాదు... నిమ్మకాయ వాటం’’ అంటారు. అంటే నిమ్మకాయ చేతిలో పట్టినంత తేలిగ్గా అతడు ఆ పని చేసి పారేస్తాడు అని. అలాగే ఆత్మవిశ్వాసం గురించి చెప్పేటప్పుడు... ‘‘చేయలేను అనడం వాడికి చేతకాదు. వాడిదంతా నిమ్మకాయ వాటం’’ అంటుంటారు. ఉమ్మాయ్ జగ్గాయ్! ‘‘వారి ప్రాణస్నేహాన్ని చూస్తే చూడముచ్చటగా ఉందనుకో’’ అంటాడో వ్యక్తి. ‘‘ప్రాణస్నేహమా పాడా! వాళ్లది ఉమ్మాయ్ జగ్గాయ్ స్నేహం’’ అంటాడు రెండో వ్యక్తి. అంటే అర్థం ఏమిటి? స్నేహం అంటే కలకాలం కలిసి ఉండడం, ఒకరి కోసం మరొకరు ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడడం. కొన్ని స్నేహాలు అలాగే కనిపిస్తాయి. తీరా లోతుల్లోకి వెళితే... అది ‘కాలపరిమితి’తో కూడిన స్నేహం అని అర్థమవుతుంది. కొందరు ఏదైనా నిర్దిష్టమైన పని కోసం స్నేహితులవుతారు. ఆ సమయంలో వారిని చూస్తే- ‘ఆహా! ఎంత బాగా కలిసిపోయారో!’ అనిపిస్తుంది. కానీ వాళ్లు పని పూర్తయ్యాక ఎవరి దారి వారు చూసుకుంటారు. అలాంటి వారిని ఉద్దేశించి వాడేదే ఈ జాతీయం! ఉమామహేశ్వరుడు, జగన్నాథుడు పేర్ల నుంచి ‘ఉమ్మాయ్’, ‘జగ్గాయ్’ పుట్టుకొచ్చాయి. పురాణాల్లో శివుడు, విష్ణువు... రాక్షసుల పని పట్టడానికి ఏకమవుతారు. పని పూర్తయ్యాక ఎవరి పనిలో వారి పడిపోతారు. అందుకే వారి పేర్ల నుంచి ఈ జాతీయం పుట్టిందంటారు. ఇప్ప పూల వాసన! కొన్ని విషయాలు రహస్యంగా ఉండిపోవు. పైగా కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ప్రతిభ కూడా అంతే. దాచాలని ప్రయత్నించినా, అడ్డుకోవాలనుకున్నా అది ఆగదు. పూల వాసన దాస్తే దాగేది కాదు. ఇప్ప పూల వాసననైతే అస్సలు ఆపలేం. ఆ పూల నుంచి ఘాటైన, మత్తయిన వాసన వస్తుంది. అది చాలా మేరకు విస్తరిస్తుంది. దానినెలాగైతే ఆపలేమో... ఒక వ్యక్తిలో ఉన్న ప్రతిభను కూడా వెలికి రాకుండా ఆపలేం అని చెప్పడమే ఈ జాతీయం ఉద్దేశం. కేవలం ప్రతిభ అనే కాదు... దాగని రహస్యం విషయంలోనూ ఈ ‘ఇప్ప పూల వాసన’ జాతీయాన్ని వాడుతుంటారు. ‘ఈ రహస్యాన్ని ఎక్కువ కాలం దాచలేం, అది ఇప్ప పూల వాసనలాంటిది’ అంటారు. -
కోర్టుహాలులో ఎర్రచుక్కల నిమ్మకాయ
బెంగళూరు : రాష్ర్ట అత్యున్నత న్యాయస్థానంలో ఓ నిమ్మకాయ కలకలం సృష్టించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో జస్టీస్ సి.ఆర్ కుమారస్వామితో కూడిన ప్రత్యేక న్యాయ పీఠ విభాగం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు విచారణ జరుపుతున్న హాలులో జయలలితకు విరుద్ధంగా వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ భవానీసింగ్ కుర్చీ కింద ఒక నిమ్మకాయ కనిపించింది. దానిపై రెండు ఎర్రటి రంగు గల చుక్కలు కూడా ఉన్నాయి. దీంతో అక్కడ ఉన్న ప్రజలతో పాటు న్యాయవాదులు కూడా ఆ నిమ్మకాయ గురించి, భవానీసింగ్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. కర్ణాటకలో దైవ పూజలతోపాటు కొన్ని రకాల క్షుద్ర పూజలు కూడా ఎక్కువగా నిర్వహిస్తారనే ప్రచారం ఉంది. విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకునే లోపే కోర్టు సిబ్బంది అక్కడి నుంచి నిమ్మకాయను తీసివేశారు. తుది దశకు కేసు విచారణ... జయలలిత ఆస్తుల కేసుకు సంబంధించి కేసు విచారణ తుది దశకు చేరుకుంది. కేసుకు సంబంధించిన వాదనల్లో భాగంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ భవానిసింగ్ తన తుది వాదనలను కోర్టుకు శుక్రవారం వినిపించారు. ఇప్పటికే ఆస్తుల కేసుకు సంబంధించి జయలలితకు కింది కోర్టులో శిక్ష ఖరారు అయినట్లు ఈ సందర్భంగా న్యాయమూర్తికి ఆయన గుర్తుచేశారు. కాగా, జయలలిత తరుఫున వాదిస్తున్న నాగేశ్వర్రావు కూడా సంక్షిప్తంగా తన వాదనలను లిఖిత పూర్వకంగా న్యాయమూర్తికి అందజేశారు. అనంతరం న్యాయమూర్తి కుమారస్వామి మాట్లాడుతూ... జయలలిత అక్రమ ఆస్తులకు సంబంధించి మొదటిసారిగా కేసు దాఖలు చేసిన సుబ్రహ్మణ్యం లిఖిత పూర్వక వాదనలను ఈనెల 9న (సోమవారం) కోర్టుకు సమర్పిస్తున్నారని ఇరువురి న్యాయవాదులకు తెలియజేశారు. అదేవిధంగా తుది వాదనలు కూడా లిఖిత పూర్వకంగా కోర్టుకు రానున్న సోమవారం సమర్పించాలని నాగేశ్వరరావుకు ఈ సందర్భంగా న్యాయమూర్తి సూచించారు. తాను కూడా అదే రోజున కేసు తీర్పును రిజర్వ్ చేస్తానని పేర్కొన్నారు. -
మీసాల మాసం
మీసము పస మగమూతికి అని ఓ శతకకారుడు శతాబ్దాల కిందటే సెలవిచ్చాడు. మీసాల ముచ్చట్లు చాలానే ఉన్నాయి. మీసాలపై నిమ్మకాయలను నిలబెట్టే పురుష పుంగవుల గురించి జనాలు అబ్బురంగా కథలు చెప్పుకోవడం కద్దు. అప్పటికీ ఇప్పటికీ మీసమే మగటిమికి గుర్తింపు చిహ్నం. బాలీవుడ్ నటుల్లో మీసాలతో కనిపించే నటులు బహు కొద్దిమంది మాత్రమే. అలాంటి నటులు కూడా పాత్రౌచిత్యాన్ని కాపాడటానికి మీసాలతో మెరిసిన సందర్భాలూ లేకపోలేదు. మన తెలుగు నటుల్లో మీసాలు లేని నటులు దాదాపు లేరనే చెప్పాలి. బ్లాక్ అండ్ వైట్ జమానాలో మన తెలుగు హీరోలు ఒద్దికగా పెన్సిల్‌కట్ మీసాలతో కనిపించేవారు. వెండితెరపై రంగుల ప్రపంచం వచ్చే సరికి జమానా బదల్ గయా! మీసాలు కాస్త బొద్దుదేరాయి. ఇంతకీ ఈ మీసాల సంగతెందుకంటారా..? నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. అంతేకాదు, ఇది మీసాల మాసం. ఇదీ నేపథ్యం.. ఆవు పాలలో ఉండే ప్రొటీన్ కొందరికి అలర్జీ కలిగిస్తుంది. కొందరిలో ఇది తీవ్రస్థాయి ఆరోగ్య సమస్యలకూ కారణమవుతోంది. పురుషులలో వచ్చే ప్రొస్టేట్ కేన్సర్‌తో పాటు పలు రకాల కేన్సర్‌కు కూడా ఆవు పాలలో ఉండే ప్రొటీనే కారణమని వైద్య పరిశోధనల్లో తేలింది. దీనిపై అవగాహ పెంపొందించేందుకు నవంబర్ నెలను ‘మూవంబర్’గా పాటించడం మొదలైంది. ‘కౌస్ మిల్క్ ప్రొటీన్ అలెర్జీ’పై (సీఎంపీఏ) అవగాహన కల్పించడంలో భాగంగా ఈ నెలంతా పురుష పుంగవులు మీసాలు పెంచుతారు. దక్షిణ ఆస్ట్రేలియాలోని ఆడిలాయిడ్లో 1999 నుంచి ‘మూవంబర్’ పాటించే ఆచారం మొదలైంది. మీసాలకూ ఓ ఇన్స్టిట్యూట్.. మీసం ఉన్నవాళ్లను కొన్ని ప్రాంతాల్లో పెద్దమనుషులుగా పరిగణించరు. ఇలాంటి వివక్షను పోగొట్టేందుకు, మీసాలపై సానుకూలత పెంచేందుకు అమెరికాలో ఏకంగా ఒక ఇన్స్టిట్యూటే ప్రారంభమైంది. పిట్స్‌బర్గ్‌లో 1965లోనే ప్రారంభమైన అమెరికన్ మౌస్టేక్ ఇన్స్టిట్యూట్ మీసాల కోసం గణనీయమైన కృషి కొనసాగిస్తోంది. రికార్డు మీసం.. మీసాల్లో తిరుగులేని ఘనత మన భారతీయులదే. అందుకు రాజస్థానీ మీసాలరాయుడు రామ్‌సింగ్ చౌహాన్ ప్రత్యక్ష నిదర్శనం. ఆయన మీసాల పొడవు ఏకంగా 4.29 మీటర్లు (14 అడుగులు). ఈ మీసాలతో ఆయన ఏకంగా గిన్నిస్ రికార్డునే సాధించాడు. -
ఆన్లైన్లో నిమ్మ వేలానికి చర్యలు
- కలెక్టర్ శ్రీకాంత్ గూడూరు టౌన్/రూరల్: నిమ్మకాయల వేలం పాటలను ఆన్లైన్లో నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర అందేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామని వెల్లడిం చారు. గూడూరులోని బాలాజీ లెమన్ మార్కెట్‌తో పాటు, కటకరాజావీధిలో ని లెమన్ మార్కెట్‌ను గురువారం ఆ యన పరిశీలించారు. నిమ్మకాయల్లోని రకాలు, దిగుబడి, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులతో చర్చించారు. పం టకు వ్యాపించే తెగుళ్లు, రైతులకు గిట్టుబాటు ధర లభించడంపై ఆరా తీశారు. ఇటీవల కాలంలో దిగుబడి తగ్గిపోయేం దుకు కారణాలను పరిశీలించి నివేదిక పంపాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పెట్లూరు నిమ్మ పరిశోధన కేం ద్రంలో త యారయ్యే విత్తనాల రకాలపైనా నివేదిక సమర్పించాలని సూచిం చారు. తో టలు తెగుళ్ల బారిన పడినప్పుడు వ్యవసాయ అధికారులు కచ్చితంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులకు సూచనలివ్వాల్సిందేనన్నారు. వేలం పాటల పరిశీలన ఆయా మార్కెట్లలో నిమ్మ వేలం పా టల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ దుకాణాల వివరాలు, గ్రేడింగ్, కూలీల కు లభిస్తున్న ఉపాధి తదితర అంశాల పై ఆరా తీశారు. చెన్నై, బెంగళూరు, ముంబయి, ఢిల్లీ, మధురై, బీజాపూర్ తదితర ప్రాంతాల్లోని మార్కెట్లలోని డి మాండ్ ఆధారంగా ఇక్కడ ధరలు నిర్ణయిస్తామని కలెక్టర్‌కు వ్యాపారులు వివరించారు. కాయలు కొనుగోలు చేసే స మయంలోనే తాము ధర నిర్ణయిస్తామ ని, రవాణా సమయంలో ఏవైనా అ వాంతరాలు ఎదురైతే నష్టాలు తప్పవన్నారు. ఏలూరు, విజయవాడ ప్రాం తాల నుంచి గూడూరు మార్కెట్‌కు రై తులు కాయలు తెస్తున్నారని చెప్పారు. ఈ మార్కెటింగ్‌తో ప్రయోజనాలు ఈ-మార్కెటింగ్ ద్వారా ఆన్లైన్లో ని మ్మకాయల వేలం నిర్వహిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని కలెక్టర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా దేశంలోని అన్ని మార్కెట్ల ధరలను స్థానికంగా ప్రతి దుకాణంలో డిజిటల్ బోర్డుల ద్వారా రైతులకు తెలి యజేయవచ్చన్నారు. తద్వారా వారు గిట్టుబాటు ధరకు అమ్ముకునే అవకా శం లభిస్తుందన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రవీందర్, తహశీల్దార్ వెంకట నారాయణమ్మ, ఎంపీడీఓ నిర్మలాదేవి, ఏపీఓ వరలక్ష్మి, ఉద్యాన శాఖ ఏడీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
మొండి తెగుళ్లకు ‘జీవ’ చికిత్స!
పండ్ల తోటల్లో యాంటీ బయోటి క్స్‌కు లొంగని మొండి తెగుళ్లను సమర్థవంతంగా నిలువరిస్తున్న ప్రోబయోటిక్స్ దానిమ్మ, బత్తాయి, నిమ్మ, మామిడి.. అంతా బాగుంటే రైతుకు అధికాదాయాన్నిచ్చే ఉద్యాన పంటలు. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులపై అతిగా ఆధారపడి ఈ పంటలను సాగు చేసే రైతుల ఆశలు వమ్ము అవుతున్న సందర్భాలు తరచూ తారసపడుతున్నాయి. మందులకు తట్టుకునే శక్తిని పెంచుకుంటూ మొండికేస్తున్న బ్యాక్టీరియా, శిలీంద్రపు తెగుళ్లే ఈ దుస్థితికి కారణం. ఈ తెగుళ్ల నివారణకు వాడుతున్న శిలీంద్ర నాశక మందు మోతాదు పెంచుతున్న కొద్దీ తెగుళ్ల తీవ్రత పెరుగుతోంది తప్ప ఫలితం ఉండడం లేదు. విసిగిపోయిన రైతులు కొందరు తోటలు తీసేయాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. రైతుల ఆశలను కూలదోస్తున్న ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఉంది! యాంటీ బయోటిక్ రసాయనానికి బదులుగా.. జీవామృతం, పంచగవ్య వంటి ప్రోబయోటిక్స్ వాడి, తక్కువ ఖర్చుతో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చని ప్రొ. శ్యాం సుందర్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అసాధారణ వాతావరణ పరిస్థితులుంటే తప్ప జీవామృతంతో ఈ తెగుళ్లు పత్తాలేకుండా పోతాయంటున్నారు. దానిమ్మ దిగుబడిని ఆంత్రాక్నోస్, బ్యాక్టీరియా మచ్చ తెగులు 50-100% వరకు దెబ్బతీస్తున్నది. ఆకులపై మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోవడం, కాయలపై కూడా మచ్చలు ఏర్పడడంతో సమస్య జటిలంగా మారింది. నెలకోసారి, తెగులు ఉధృతిని బట్టి వారానికోసారి కూడా దీన్ని పిచికారీ చేస్తున్నారు. ఎకరానికి ఏడాదికి రూ. 30 వేల నుంచి 50 వేల వరకు ఖర్చు పెట్టినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. దానిమ్మ సాగులో అపారమైన అనుభవం కలిగిన, వనరులకు కొరత లేని రైతులకు తప్ప సాధారణ రైతులు, కొత్తగా సాగు ప్రారంభించిన వారికి ఆంత్రాక్నోస్, బ్యాక్టీరియా మచ్చ తెగుళ్లు శాపంగా మారి.. తోటలు తీసేయాల్సిన పరిస్థితి వస్తోంది. బత్తాయి/ నిమ్మ తోటల్లో గజ్జి తెగులు బత్తాయి, నిమ్మ తోటల్లో గజ్జి తెగులు సమస్యగా ఉంది. దీన్ని అరికట్టడానికి యాంటీబయోటిక్ మందును 3-5 సార్లు పిచికారీ చేస్తున్నారు. యాంటీబయోటిక్ వాడకం వల్ల నష్టాలు: యాంటీబయోటిక్స్, శిలీంద్రనాశకాలను చెట్లపై చల్లడం వల్ల తెలుగు కారక సూక్ష్మజీవులతోపాటు, ఆకుల ఉపరితలంపై ఉండి రక్షణ కల్పించే మేలు చేసే సూక్ష్మజీవులు సైతం చనిపోతాయి. ఈ మందు చల్లినప్పుడు, వర్షం పడినప్పుడు ఆకుల మీద నుంచి కారి భూమి మీద పడినప్పుడు నేలలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. బ్యాక్టీరియాలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి.. తెగులు విజృంభిస్తుంది. ఇవీ ప్రోబయోటిక్స్: జీవామృతం, పంచగవ్య(2-5% అంటే.. వంద లీటర్ల నీటిలో 2 నుంచి 5 లీటర్ల పంచగవ్య కలిపి పిచికారీ చేయాలి), కునప జలం(2-5% పిచికారీ చేయాలి). ఇవన్నీ చీడపీడలను అరికట్టడంతోపాటు పంటలకు పోషకాలను అందించే ప్రోబయోటిక్సే. జీవామృతం ఎలా వాడాలి? పంటలపై జీవామృతాన్ని 10,15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. జీవామృతాన్ని 1:4 మోతాదులో నీటిలో కలిపి చెట్టు పూర్తిగా తడిచి నీరు కారేంత వరకు పిచికారీ చేయాలి. ముందు నుంచే పిచికారీ చేస్తే ఆకుమచ్చ, శిలీంద్రపు తెగుళ్లు పంటల దరిచేరవు. ఈ తెగుళ్లు సోకిన చెట్లపై జీవామృతాన్ని వడకట్టి పిచికారీ చేస్తే సమర్థవంతంగా అదుపులోకి వస్తాయి. ఆకులపై ఏర్పడిన మచ్చలు పోతాయి. దానిమ్మ, మామిడి, పసుపు వంటి పంటలకు ఆశించే ఆంత్రాక్నోస్ అనే శిలీంద్రపు తెగులు వల్ల మచ్చలు ఏర్పడిన ఆకులు, కాయలు కుళ్లిపోతాయి. జీవామృతాన్ని పిచికారీ చేస్తే ఇది కూడా పోతుంది. జీవామృతం తయారీ ఇలా.. 200 లీటర్ల నీరు + 10 కిలోల నాటు ఆవు పేడ + 10 లీటర్ల నాటు ఆవు మూత్రం + కిలో బెల్లం + కిలో ఏవైనా పప్పుల పిండి + గట్టు మట్టి గుప్పెడు.. వీటిని డ్రమ్ము/ తొట్టిలో పోసి కుడి వైపునకు (గడియారపు ముల్లు తిరిగే విధంగా) తిప్పాలి. డ్రమ్మును ఎండ తగలకుండా నీడన ఉంచాలి. ఉదయం, సాయంత్రం ఒక నిమిషం పాటు కర్రతో కుడి వైపునకు కలియ తిప్పుతూ ఉండాలి. కలిపిన 48 గంటలకు జీవామృతం వాడకానికి సిద్ధం అవుతుంది. అప్పటి నుంచి 7 రోజుల్లోగా వాడేయాలి. జీవామృతంలో నేలకు, చెట్లకు మేలు చేసే కోటానుకోట్ల సూక్ష్మజీవుల సముదాయం, సూక్ష్మపోషకాలు, అమైనో ఆమ్లాలుంటాయి. దీన్ని పిచికారీ చేసినా, నేలపైన పోసినా చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. సేంద్రియ ఎరువులూ వాడాలి జీవామృతం ద్వారా 100% ఫలితాలను పొందాలంటే.. భూమిలో సేంద్రియ కర్బనం బాగుండాలి. ఇందుకోసం సేంద్రియ ఎరువులు కూడా విధిగా వాడాలి. ఎకరానికి 10-20 టన్నుల చివికిన పశువుల ఎరువు లేదా 2-5 టన్నుల వర్మీ కంపోస్టు లేదా టన్ను మేరకు కానుగ / ఆముదం / వేప పిండి వేయాలి. రసాయనిక నత్రజని ఎరువులు అతిగా వాడితే బ్యాక్టీరియా, శిలీంద్రపు తెగుళ్ల ఉధృతి పెరుగుతుందే గానీ తగ్గదు. ఒకవేళ రసాయనిక ఎరువులు అనివార్యంగా వాడాల్సి వస్తే.. అతితక్కువ మోతాదులో, విడతల వారీగా వాడుకోవాలి. 10 రోజులకోసారి కిలో వాడేకన్నా.. రోజుకో వంద గ్రాములు వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మల్చింగ్‌తో సాగునీటి ఆదా, కలుపు సమస్యకు చెక్! జీవామృతం, సేంద్రియ ఎరువులతోపాటు గడ్డిని, రొట్టను నేలపై ఆచ్ఛాదన(మల్చింగ్)గా వేయడం వల్ల చెట్లకు మేలు కలిగించే సూక్ష్మజీవులు భూమిలో వృద్ధి చెందడానికి అనుకూలమైన సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుంది. మల్చింగ్ వల్ల సాగునీరు ఆదా కావడమే కాకుండా కలుపును కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. నేలపై వేసిన గడ్డి కుళ్లి, మంచి ఎరువుగా మారి నేలను సారవంతం చేస్తుంది. వరి గడ్డి, వరి పొట్టు, జంబుగడ్డి, చెరకు ఆకు, కొబ్బరి పీచు, అడవి చెట్ల నుంచి సేకరించిన ఆకులు.. తదితరాలను మల్చింగ్గా ఉపయోగించవచ్చు. అధిక మోతాదులో మల్చింగ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు రైతులు ఎవరికివారు తమ పొలంలోని 10-20% విస్తీర్ణంలో జనుము, జీలుగ, మొక్కజొన్న, అలసంద వంటి పచ్చిరొట్ట పైర్లను విత్తుకొని.. ప్రతి 45 రోజులకోసారి కోసి మల్చింగ్ కోసం వాడుకోవచ్చు. జనుము 65 రోజులు పెరిగిన తర్వాత కోసి.. మల్చింగ్గా వాడుకోవడం మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ మామిడిపై బ్యాక్టీరియా ఆకుమచ్చ బనేషాన్ మామిడి చెట్ల ఆకులపై బ్యాక్టీరియా మచ్చలు ఏర్పడుతున్నాయి. ఆకులు పండుబారి రాలిపోతాయి. ఆకులు తక్కువ ఉండడం వల్ల కాయలు సరిగ్గా పెరగవు. ఎండ నేరుగా పడడం వల్ల కాయలు పసుపు పచ్చగా మారుతుంటాయి. దీన్ని ఎవరూ అంతగా గుర్తించడం లేదు. దానిమ్మ పూత, పిందె దశలో జీవామృతం పిచికారీ చేయొద్దు! దానిమ్మ తోట పూత, పిందె దశలో ఉన్నప్పుడు జీవామృతం పిచికారీ చేయరాదని, అలా చేస్తే పూత, చిన్న పిందెలు రాలిపోతున్నట్లు తమ పరిశీలనలో తేలిందని ప్రొ. శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. పూత, పిందె ఏర్పడుతున్న ఆ నెల రోజులపాటు జీవామృతాన్ని పిచికారీ చేయరాదని, నీటిలో కలిపి నేల మీద పోయవచ్చు. తోట లేతగా ఉన్నప్పుడు, కాపు వద్దను కున్నప్పుడు పూత, పిందెలను తీసెయ్యడానికి జీవామృతం పిచికారీ చేయొచ్చు. జీవామృతంతో నీటిని 1:1 నుంచి 1:4 పాళ్లలో కలిపి పిచికారీ చేస్తే వాటంతట అవే రాలిపోతాయన్నారు. రైతుకు కూలీల ఖర్చు తగ్గడమే కాకుండా.. రాలినవి త్వరగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారతాయన్నారు. జీవామృతంతో అద్భుత ఫలితాలు! ఉద్యాన పంటల్లో జీవామృతం, పంచగవ్య, కుణపజలం, ఉపయుక్త సూ క్ష్మజీవులు(ఈఎంలు), స్థానిక ఉపయుక్త సూక్ష్మజీవులు (ఐఎంవోలు), బయోడైన మిక్ ద్రావణాలు, పులిసిన కల్లు, పులిసిన మజ్జిగ.. చేప, కోడిగుడ్ల అమైనో ఆమ్లాలు తదితర ప్రోబయోటిక్స్‌తో ఐఐఐటీ(హైదరాబాద్)లో, రైతుల తోటల్లో విస్తృత ప్రయోగాలు చేస్తున్నాం. జీవామృతం అందరూ సులభంగా, తక్కువ సమయంలో తయారుచేసుకోగలిగినది. ఆకులపై ఆశించే బ్యాక్టీరియా, శిలీంద్రపు తెగుళ్లను ఇది ఎంతో సమర్థ వంతంగా అరికట్టగలుగుతున్నది. జీవామృతం వాడు తున్న తోటల్లో సూక్ష్మపోషక లోపాలు కనిపించడం చాలా అరుదు. పంచగవ్య కూడా ఆకుమచ్చ తెగుళ్ల నివారణలో అద్భుత ఫలితాలనిస్తున్నది. - ప్రొఫెసర్ జి. శ్యాంసుందర్‌రెడ్డి, రైతు, సస్య వైద్యుడుః ఐఐఐటీ - హైదరాబాద్, మొబైల్: 99082 24649. shyamiiit@gmail.com -
చినుకు పడదే..!
సాక్షి, నెల్లూరు: వాన కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు. జూన్ ముగుస్తున్నా ఎండలు మండిపోతున్నాయి. చినుకు రాలక మేఘాలు చాటేస్తున్నాయి. చెరువులు ఎండాయి. జలాశయాల్లో నీటి మట్టం తగ్గింది. మెట్ట ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో తాగునీరు అందక జనం నానా అవస్థ పడుతున్నారు. జూన్‌లో 56 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 5.6 మి.మీ. మాత్రమే నమోదైంది. దీంతో సోమశిల పరిధిలో లేట్ ఖరీఫ్ సైతం ఆశించిన స్థాయిలో సాగుకు నోచుకోలేదు. మరోవైపు జిల్లావాసులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. పదును వాన కురిస్తే జిల్లా వ్యాప్తంగా వేలాది హెక్టార్లలో జీలుగ, జనుము, పిల్లిపెసర, కంది, పెసర తదితర పంటలు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు వ్యవసాయాధికారులు 50 శాతం సబ్సిడీతో విత్తనాలను సిద్ధం చేసి ఉంచారు. ఎరువులను కూడా తగిన మోతాదులో సిద్ధంగా ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు. వర్షాలు కురిస్తే జిల్లా వ్యాప్తంగా 65 వేల హెక్టార్లలో పంటలు సాగుకానున్నాయి. 30 వేల హెక్టార్లలో జీలుగ, జనుము, పిల్లిపెసర, 1500 హెక్టార్లలో కంది, 900 హెక్టార్లలో సజ్జ, 170 హెక్టార్లలో మొక్కజొన్న, 5 వేల హెక్టార్లలో పత్తి తదితర పంటలు సాగుకానున్నాయి. ఇప్పటికే 12 వేల క్వింటాళ్లు జీలుగ, 3,500 క్వింటాళ్లు జనుము, 5 వేల క్వింటాళ్లు పిల్లిపెసర, 200 క్వింటాళ్లు కంది ,150 క్వింటాళ్లు పెసర విత్తనాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ నెల 6న వింజమూరు, దుత్తలూరు, ఆత్మకూరు, డక్కిలి, బాలాయిపల్లి ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లులు కురిశాయి. గత కొద్దిరోజులుగా ఆకాశంలో మబ్బులు వస్తున్నా చినుకు మాత్రం రాలడంలేదు. ఈ నెల చివరి నాటికైనా మంచి వర్షం కురవకపోతు రైతులకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 1800 చెరువులు ఎండిపోయాయి. శ్రీశైలం, కండలేరు జలాశయాల్లో నీటిమట్టం తగ్గుతోంది. ఈ పరిస్థితిలో సకాలంలో వర్షాలు కురవకపోతే జిల్లాలో పూర్తిస్థాయిలో పంటలు సాగయ్యే అవకాశంలేదు. ఇక జిల్లాలో డెల్టాప్రాంతాన్ని పక్కన బెడితే మెట్టప్రాంతాల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి తదితర ప్రాంతాల రైతులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే ఇక్కడ భూగర్భజలాలు అడుగంటాయి. బావులు ఎప్పుడో ఎండిపోయాయి. వర్షం సకాలంలో కురవక పోతే ఖరీఫ్సాగు సంగతి దేవుడెరుగు తాగునీటికి ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే జిల్లాలో వెంకటగిరి, ఉదయగిరి, కావలి, గూడూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో సాగులో ఉన్న అరటి, నిమ్మ, మామిడి, సజ్జ, పత్తి తదితర పంటలు వర్షంలేక ఎండుతున్నాయి. ఈ పరిస్థితిలో అన్నదాతలు వానల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు జిల్లా రైతాంగంలో ఆందోళన నెలకొంది. ఎన్నికల ముందు రుణమాఫీ అన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మెలికపెట్టి రుణమాఫీ అమలును తుంగలో తొక్కే ప్రయత్నానికి దిగాడు. ఈ నేపథ్యంలో రైతులకు ఖరీఫ్ రుణాలు సకాలంలో కాదుకదా అసలు అందేలా కనిపించడంలేదు. పాతరుణాలు చెల్లిం చందే బ్యాంకులు తిరిగి రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. మరోవైపు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకులు రైతులపై ఒత్తిళ్లు పెంచుతున్నాయి. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఈ సారి వ్యవసాయం సక్రమంగా సాగుతుందా అన్న అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. -
నిమిషంలో నిమ్మరసం!
నిమ్మకాయను రెండు బద్దలుగా కోసి, గింజలు తీసి, బద్దను గట్టిగా పిండి రసం తీయడం అందరికీ బాగా తెలిసిన, అలవాటైన పద్ధతి. ఆ తర్వాత రసం తీసుకోవడానికి కొన్ని యంత్రాలు వచ్చాయి. వాటిలో నిమ్మబద్దను పెట్టి గట్టిగా నొక్కితే రసం వస్తుంది. అయితే ఈ పద్ధతిలో చేతికి రసం అంటుతుంది. కొన్నిసార్లు తొక్కలోని చేదు రసంలో కలిసిపోతుంది. కానీ సిట్రస్ స్ప్రిట్జర్తో మాత్రం ఇలాంటి సమస్యలేమీ ఉండవు. నిమ్మకాయ మొదలును కొంచెం కోసి, స్ప్రిట్జర్ను కాయలోకి గుచ్చాలి. తర్వాత దీన్ని గట్టిగా నొక్కితే... స్ప్రే మాదిరిగా రసం బయటకు వస్తుంది. డెరైక్ట్‌గా వంటకంలో గానీ, సలాడ్ మీద గానీ చల్లేసుకోవచ్చు. చేతికి జిడ్డు, వాసన అంటవు. తొక్కలోని చేదు కాస్త కూడా రసంలో కలవదు. సులువుగా, శుభ్రంగా నిమిషంలో పనైపోతుంది. దీని వెల 150 రూపాయలు. ఈ ఫొటోలో ఉన్నది కాక మరో రెండు రకాలున్నాయి. వాటి ధర కూడా దాదాపుగా అంతే! -
తేనియ రుచుల పానీయాలు!
వేసవి వేడితో జీవితం రసహీనమవుతుంటే దాన్ని మళ్లీ రసభరితం చేసేవే పానీయాలు. నిమ్మకాయ మొజిటోతో వదులుతుంది నీరసం. క్రమం తప్పక తాగితే ఊరుతుంది జఠర రసం. అప్పటివరకూ తోటకూర కాడల్లా సోలిపోయినా... ఆ తర్వాత మాత్రం ఒళ్లంతా చురుకు నిండిన పాదరసం. అందుకే ఈ మొజిటోను గెజిట్‌లో చేర్చాలనిపించకపోతే మీలో ‘రస’హృదయం అంతగా లేదనుకోవాల్సిందే. ఇక ఎండల వేడికి, మంటల గాడ్పుకు మీరు డస్సిపోతేసేద దీర్చే పానీయమవుతుంది పంజాబీ లస్సీ! మహా ఫ్రూట్‌పంచ్ మహత్యం అంతా ఇంతా కాదు... నిస్తేజాలకూ, నిరుత్సాహాలకూ అది ఇంచుకు ఒకటి చొప్పున ఇస్తుందో పంచ్. వెరసి... పానీయాలంటే మరేమిటో కాదు... స్వరూపం మార్చుకున్న తేనియలు. మొజిటో కావలసినవి: నిమ్మకాయ - 1 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి) పుదీనా ఆకులు - 20 (రసం చేయడానికి, గార్నిషింగ్‌కి) పంచదార - 2 టేబుల్ స్పూన్లు ఐస్ - కొద్దిగా సోడా - 100 మి.లీ. పంచదార - 2 టీ స్పూన్లు తయారీ: ఒక గిన్నెలో పుదీనా ఆకులు, చిన్నగా కట్ చేసిన నిమ్మకాయ ముక్కలు, పంచదార వేయాలి. కవ్వం లాంటి దానితో వాటి మీద గట్టిగా ఒత్తి, కవ్వం తీసేసి, ఐస్ ముక్కలు జత చేయాలి. సోడా పోసి బాగా కలపాలి. పుదీనా ఆకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. పార్టీ ఫ్రూట్ పంచ్ కావలసినవి: ఆపిల్ - 2 పుచ్చకాయ ముక్కలు - రెండు కప్పులు ద్రాక్షపళ్లు - 10 పైనాపిల్- ఒక ముక్క కమలాపండు తొనలు - 2 పుదీనా ఆకులు - 6 తయారీ: ఆపిల్ తొక్కు తీసి ముక్కలు చేసుకోవాలి పుచ్చకాయ ముక్కలలో గింజలు వేరు చేయాలి కమలాపండు తొనలు బాగు చేసి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి అన్ని పండ్ల ముక్కలు ఒకదాని తరవాత ఒకటి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ద్రాక్షపళ్లు జత చేసి మెత్తగా చేసి రసం వేరు చేయాలి పైనాపిల్ ముక్కలు, కమలా తొనలు, పుదీనా ఆకులను చిన్నచిన్న ముక్కలుగా చేసి, గ్లాసులలో వేయాలి తయారుచేసి ఉంచుకున్న జ్యూస్‌ను గ్లాసులలో పోసి సర్వ్ చేయాలి. స్వీట్ పంజాబీ లస్సీ కావలసినవి: పెరుగు - 5 కప్పులు పంచదార - 10 టేబుల్ స్పూన్లు ఏలకుల పొడి - అర టీ స్పూను రోజ్ వాటర్ - టీ స్పూను చల్లటి పాలు - అర కప్పు కుంకుమపువ్వు - చిటికెడు బాదం పప్పులు - 7 (సన్నగా తురుముకోవాలి) ఐస్ ముక్కలు - తగినన్ని తయారీ: ఒక పాత్రలో పెరుగు, పంచదార, ఏలకుల పొడి, నీళ్లు, వేసి అన్ని పదార్థాలు కలిసే వరకు గిలక్కొట్టి, గ్లాసులలో పోయాలి రోజ్‌వాటర్ జత చేయాలి గిన్నెలో చల్లటి పాలు, కుంకుమపువ్వు వేసి కలిపి, గ్లాసులో ఉన్న పెరుగు మిశ్రమానికి జత చేయాలి ఐస్ ముక్కలు వేసి కలపాలి బాదం తురుము జత చేసి సర్వ్ చేయాలి. ఇండియన్ సమ్మర్ కావలసినవి: పంచదార - టేబుల్ స్పూను నీళ్లు - 3 టేబుల్ స్పూన్లు నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు చింతపండు రసం - టీ స్పూను (చిక్కగా ఉండాలి) ఐస్ - అర కప్పు (మెత్తగా పొడి చేయాలి) కమలాపండు తొనలు - 2 పైనాపిల్ ముక్కలు - 2 తయారీ: ఒక పాత్రలో... పంచదార, నీళ్లు, నిమ్మరసం, చింతపండు రసం, ఐస్ వేసి అన్నీ కలిసే వరకు కలపాలి. గ్లాసులలో కమలాపండు ముక్కలు, పైనాపిల్ ముక్కలు వేయాలి. తయారుచేసి ఉంచుకున్న రసం పోసి చల్లగా సర్వ్ చేయాలి. ఫలూదా... కావలసినవి: పాలు - 2 కప్పులు ఫలూదా సేవ్ - 1 ప్యాకెట్ (సూపర్ మార్కెట్లో లభిస్తుంది) రోజ్ వాటర్ - 2 టీ స్పూన్లు నానబెట్టిన సబ్జా గింజలు - అర టీ స్పూను వెనిలా ఐస్ క్రీమ్ - కొద్దిగా తయారీ: ఒక పాత్రలో తగినన్ని నీళ్లు, ఫలూదా సేవ్ వేసి సుమారు 20 నిమిషాలు ఉడికించి, ఎక్కువగా ఉన్న నీటిని ఒంపేయాలి గోరువెచ్చగా ఉన్న పాలలో ఫలూదా సేవ్ వేసి సన్న మంట మీద సుమారు 15 నిమిషాలు ఉంచాలి ఉడికించుకున్న సేవ్ చల్లబడటానికి ఐస్ జత చేయాలి సేవ్ను గ్లాసులలో వేసి, రోజ్ వాటర్ జత చేయాలి నానబెట్టుకున్న సబ్జా గింజలు వేయాలి పాలు జత చేయాలి వెనిలా ఐస్‌క్రీమ్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. మామిడి-పుచ్చకాయ రసం కావలసినవి: మామిడిపండు - 1 (బాగా పండినది) పుచ్చకాయ ముక్కలు - కప్పు నీళ్లు - 2 కప్పులు ఐస్ - అర కప్పు (మెత్తగా పొడి చేయాలి) పంచదార - 4 టీ స్పూన్లు స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్ - 2 స్కూపులు తయారీ: మామిడిపండు తొక్క తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పుచ్చకాయ ముక్కలు చేసి గింజలు వేరు చేయాలి మిక్సీలో మామిడిపండు ముక్కలు, 2 టీ స్పూన్ల పంచదార, కప్పు నీళ్లు పోసి మెత్తగా చేసి పాత్రలోకి తీసుకోవాలి. పుచ్చకాయ ముక్కలు, కప్పు నీళ్లు, 2 టీ స్పూన్ల పంచదార, ఐస్ మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక గ్లాసులో ముందుగా పుచ్చకాయ పల్ప్ వేసి, ఆ పైన మామిడిపండు గుజ్జు వేయాలి స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి -
నిమ్మకాయ మింగి చిన్నారి మృతి
కశింకోట, దిష్టి తగలకుండా మంచంపై ఉంచిన నిమ్మకాయ చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. గుండెలు పిండేసే ఈ సంఘటన విశాఖ జిల్లా కశింకోటలో సోమవారం జరిగింది. విశాఖలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన శీల కనకేశ్వరరావుకు, కశింకోటకు చెందిన గోవాడ కొండమ్మ కుమార్తె వరలక్ష్మి దంపతులకు రోహన్‌సాయి (10నెలలు) కొడుకు. కనకేశ్వరరావు సైన్యంలో పనిచేస్తూ జమ్మూకాశ్మీర్‌లో ఉంటున్నాడు. వరలక్ష్మి అత్తవారింట ఉంటోంది. చిన్నారికి నలతగా ఉండడంతో వరలక్ష్మి పుట్టింటి వారు ఆదివారం సాయంత్రం ఆమెను, బాబును కశింకోట తీసుకువ చ్చారు. రోహన్ పడుకునే మంచంపై నిమ్మకాయను దిష్టిగా ఉంచారు. బాలుడు దానితో ఆడుతూ నోట్లో పెట్టుకుని మింగేశాడు. ఊపిరాడక బాధపడుతున్న చిన్నారిని వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ హఠాత్పరిణామంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ప్యాక్‌ల కన్నా జ్యూస్‌లు మేలు...
చర్మసౌందర్యాన్ని పెంచే ప్యాక్‌లు రెండు రకాలు. ఒకటి- మిశ్రమాన్ని ముఖంపైన పూయడం. రెండు- రకరకాల పండ్లను మరికొన్ని పండ్లతో కలిపి తినడం. ప్రూట్ ప్యాక్ వేసుకుంటే ముఖసౌందర్యం పెరుగుతుందో లేదో గాని పోషకవిలువలు సమృద్ధిగా ఉన్న సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలు తినడం వల్ల మాత్రం నూటికి నూరు శాతం చర్మకాంతి పెరుగుతుంది. అవేంటో చూద్దాం... బొప్పాయి చాలావరకు బొప్పాయిని ఫేసియల్ స్క్రబ్‌గా ఉపయోగిస్తుంటారు. కాని తింటున్నారా?! బొప్పాయిలో విటమిన్-ఎ, సి ఉంటుంది. ఇది చర్మంలోని మలినాలను తొలగించడానికి సహాయపడతుంది. చర్మాన్ని కాంతిమంతంగా, బిగుతుగా మారుస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. చర్మంపై దద్దుర్లు, ఎరుపుదనం వంటివి తగ్గిస్తుంది. ఇలా చేయండి: బొప్పాయిగుజ్జులో బాదంపాలు, తేనె కలిపి తినాలి. లేదా బొప్పాయి ముక్కలు, క్యారట్ ముక్కలు, చేప ముక్కలను కలిపి సలాడ్‌లా తీసుకోవచ్చు. కొబ్బరి కెఫిర్ కొబ్బరినీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటామన్న విషయం తెలుసు. హార్మోన్లలో హెచ్చుతగ్గులను నివారించి, చర్మకాంతిని పెంచే గుణాలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇలా చేయండి: లేత కొబ్బరినీళ్లు, కెఫిర్ (పెరుగులా ఉంటుంది. మార్కెట్లో లభిస్తుంది) ను కలిపి తయారుచేసిన పానీయాన్ని రోజూ పరగడుపున తాగితే చర్మకాంతి రెట్టింపు అవుతుంది. బీట్రూట్ చర్మంలోని మలినాలను తొలగించడంలో బీట్రూట్ బాగా పనిచేస్తుంది. అంతేకాదు మనం తీసుకునే ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. 400 శాతం రక్తవృద్ధి కలుగుతుంది. ఫలితంగా చర్మకాంతి పెరుగుతుంది. ఇలా చేయండి: 16 ఔన్సుల బీట్రూట్ జ్యూస్ తాగితే 12 గంటల్లో చర్మకాంతి పెరుగుతుంది. పచ్చి బీట్రూట్ను పాలకూర సలాడ్‌తో కలిపి తీసుకోవచ్చు. నిమ్మ నిమ్మరసం తాగడం వల్ల చర్మంలోని టాక్సిన్లు విడుదలవుతాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. చర్మం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. నోటిలోని బ్యాక్టీరియాను నివారిస్తుంది. యాక్నె సమస్యను పోగొడుతుంది. సౌందర్య ప్రపంచంలో దీనిని మించిన బ్యూటీ టిప్ లేదు. ఇలా చేయండి: ఉదయం అర చెక్క నిమ్మకాయ జ్యూస్‌ను, గ్లాసుడు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. నిమ్మరసం, ఆలివ్ ఆయిల్‌తో డ్రెస్సింగ్ చేసిన సలాడ్స్ తీసుకుంటే మరీ మంచిది. రెడ్ క్యాబేజీ దీనిలో ఉండే ఫెటో న్యూట్రియంట్లు చర్మంపై ముడతలను నివారిస్తాయి. పిగ్మెంటేషన్, దద్దుర్లను నివారించే గుణాలు రెడ్ క్యాబేజీలో పుష్కలంగా ఉన్నాయి. ఇలా చేయండి: ప్రతి రోజూ రెడ్ క్యాబేజీ తరుగు, క్యారట్ తరుగు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి సలాడ్ చేసి, తినాలి. ఇలా 21 రోజుల పాటు తింటే పదేళ్ల వయసు తగ్గినట్టు, యవ్వనంగా కనిపిస్తారు. టొమాటో జ్యూస్ రోజును తాజా టొమాటో రసంతో ప్రారంభించండి. టొమాటోలో ఉండే లైకోపిన్ సూర్యరశ్మి నుంచి వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాల వల్ల చర్మానికి కలిగే హానిని నివారిస్తుంది. రోజూ గ్లాస్ టొమాటో జ్యూస్ తాగడం వల్ల నిస్తేజంగా మారిన చర్మానికి జీవం కలిగిస్తుంది. ఇలా చేయండి: రసాయన మందులు వాడకుండా సహజమైన పద్ధతులో పండించిన టొమాటోతో తయారుచేసుకున్న జ్యూస్‌ను సేవించడం మేలు. పుచ్చకాయ టొమాటో జ్యూస్‌లలో సన్ ప్రొటెక్షన్ సుగుణాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి వీటిలో ఏ జ్యూస్ అయినా సేవించవచ్చు.