సింక్, బాత్ టబ్‌లకు అంటుకున్న మొండి, జిడ్డు మరకలను తొలగించడానికి ద్రాక్ష పండు, నిమ్మకాయ, వెనిగర్‌లు ప్రభావవంతంగా పనిచేస్తాయి.
► ద్రాక్షపండును సగానికి ముక్కలు కోయాలి. బాత్‌టబ్ లేదా సింక్‌పై ఉప్పు చల్లాలి. వాటి మీద ద్రాక్ష పండు సగం ముక్కతో రుద్దాలి. తర్వాత నీటితో శుభ్రం చేయాలి.
► వెనిగర్‌ను సింక్ టాప్, బాత్ టబ్‌లపై చల్లి, గంట సేపు వదిలి, తర్వాత సోప్‌వాటర్‌ని ఉపయోగించి కడిగితే బాగా శ్రుభపడతాయి.
► కాఫీ ఫిల్టర్ శుభ్రపడాలంటే అందులో బ్లాటింగ్ పేపర్‌ని చిన్న చిన్న ఉండలుగా చేసి వేయాలి. అటూ ఇటూ పదే పదే తిప్పాలి.
(చదవండి: Health Tips: పాలమీగడలో ఏలకులను కలుపుకుని చప్పరిస్తే..)
► గోడలపైన వేలి ముద్రల మరకలు నూనె జిడ్డుగా కనిపిస్తుంటాయి. వీటిని వదిలించడానికి బ్రెడ్ స్లైస్‌ను తీసుకొని, మరకలపైన రబ్ చేసి, తుడవాలి. దీంతో నూనె మరకలు తగ్గిపోతాయి. అదే బ్రెడ్‌తో పగిలిన గ్లాసు ముక్కలను తీయడానికి కూడా ఉపయోగించవచ్చు.
► స్టౌ పై జిడ్డు మరకలు సాధారణంగా అవుతుంటాయి. నిమ్మరసం రాసి, బ్రెడ్ లేదా స్పాంజితో తుడవాలి.
(చదవండి: గలిజేరు ఆకును పప్పుతో కలిపి వండుకుని తింటున్నారా)
Comments
Please login to add a commentAdd a comment