Grapes
-
నిగనిగలాడే జుట్టునుంచి గుండె దాకా, నల్ల ద్రాక్షతో ఎన్ని ప్రయోజనాలో !
చూడటానికి చిన్నగా ఉన్నా నల్ల ద్రాక్షతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నల్లగా నిగనిగలాడుతూ తీయని రుచితో నోరూరిస్తూ ఉంటాయి నల్ల ద్రాక్ష పండ్లు. నల్ల ద్రాక్షలో సీ, ఏ విటమిన్లు, బీ6, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. ఇంకా గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వంటి అనేక పోషక గుణాలు మనల్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. అయితే తెల్ల ద్రాక్ష మంచిదా? నల్ల ద్రాక్ష మంచిదా అని ఆలోచిస్తే రెండింటిలోనూ కాస్త రుచిలో తప్ప ప్రయోజనాల్లో పెద్దగా లేదనే చెప్పాలి. నల్ల ద్రాక్షతో కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.నల్ల ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని ‘రెస్వెరాట్రాల్’ యాంటీ ఏజింగ్ ఎలిమెంట్‌గా పనిచేస్తుంది. గుండె జబ్బులు కేన్సర్‌తో సహా అన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచికాపాడుతుంది. నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని నివారించడంలో సహాయపడటమే కాకుండా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు.గుండె ఆరోగ్యానికి : నల్ల ద్రాక్ష అద్భుతమైన ప్రయోజనాల్లో ఒకటి గుండె ఆరోగ్యానికి తోడ్పడే సామర్థ్యం. నల్ల ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డకట్టడాన్నినివారిస్తుంది. రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది: నల్ల ద్రాక్షలో కనిపించే పాలీఫెనాల్స్‌లో అభిజ్ఞా సామర్థ్యాలు , జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి నరాల కణాలు లేదా న్యూరాన్లను రక్షించడంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నరాల సంబంధిత అనారోగ్యాల సంభావ్యతను తగ్గిస్తుంది.రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది: నల్ల ద్రాక్షలో కనిపించే విటమిన్ సీ, కే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.బరువు తగ్గడంలోనూ సాయపడుతుంది : బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ద్రాక్ష మంచి ఎంపిక. అతితక్కువ క్యాలరీలు ,ఫైబర్ అధిక మొత్తంలో నీరు ఉంటుంది. భోజనం మధ్య చిరు తిండిగా తినవచ్చు. ఇంకా, నల్ల ద్రాక్షలో సహజ చక్కెరలు ఉండటం వల్ల షుగర్ వ్యాధి పీడితులకు మంచి పండుగా చెప్పవచ్చు.జీర్ణ ఆరోగ్యానికి: నల్ల ద్రాక్ష జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని తొలగించడంలో,గట్ బ్యాక్టీరియా అభివృద్ధికి తోడ్పడుతుంది. మెరిసే చర్మం కోసం : నల్ల ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు , విటమిన్లు ఆరోగ్యకరమైన , ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తాయి. మొటిమలు, వివిధ చర్మ వ్యాధుల చికిత్సకు సహాయపడుతుంది. ఎముకలను బలపరుస్తుంది : నల్ల ద్రాక్షలో కాల్షియం, మెగ్నీషియం ,పొటాషియం వంటి ఖనిజాలు ఎముకలకు బలాన్నిస్తాయి. బోలు ఎముకల వ్యాధి , పగుళ్లు వంటి ఇతర ఎముక సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలను తగ్గిస్తుంది. నల్ల ద్రాక్ష ప్రయోజనాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఇందులో లభించే అధిక శాతం నీరు బాడీని హైడ్రేడెటెడ్గా ఉంచుతుంది. అన్ని వయసుల వారికీ మంచిది.బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నియంత్రిస్తుంది : మధుమేహ నిర్వహణలో ఇది మంచి ఫలితాలనిస్తుంది. ఇందులోని ఫైబర్, రక్తప్రవాహంలోకి సుగర్ స్థాయిలను త్వరగా వెళ్లకుండా నిరోధిస్తుంది.యాంటీఆక్సిడెంట్ ఫినాల్స్ సమ్మేళనాలు ఇన్సులిన్ నియంత్రణలో సహాయపడతాయి.వాపులను తగ్గిస్తుంది : దీర్ఘకాలం వాపు వల్ల ఆర్థరైటిస్ , గుండె జబ్బులు వంటి అనేక వ్యాధులు వస్తాయి. నల్ల ద్రాక్షలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మానవ శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. నల్ల ద్రాక్ష మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. మెరిసే జుట్టు: ఇందులోని విటమిన్ ఈ జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.చుండ్రు, జుట్టు రాలడం లేదా తెల్లగా మారడం వంటి జుట్టు సమస్యలను దూరం చేస్తుంది. జుట్టు మందంగా, మృదువుగా, బలంగా చేస్తుంది. వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. పండురూపంలో తీసుకుంటే ఫైబర్ ఎక్కువ అందుతుంది. జ్యూస్‌లా తీసుకున్నా కూడా మంచిదే. -
ప్రూట్ పూల్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నగరాన్ని ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలో పండ్ల తోటల సాగు క్రమేపీ పెరుగుతోంది. అన్ని రకాల పండ్లతోటలు సాగు చేసి రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. భౌగోళిక, వాతావరణ పరిస్థితు లు భిన్నంగా ఉన్నా..వివిధ రకాల పండ్ల తోటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తూ యువరైతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. డ్రాగన్ ప్రూట్, కర్జూర, అవకాడో, యాపిల్ ఇలా వివిధ పండ్ల తోటలు జిల్లాలో సాగవుతున్నాయి. పులిమామిడిలో ‘యాపిల్’ ⇒ యాపిల్ అనగానే హిమాచల్‌ప్రదేశ్, కశీ్మర్ మాత్రమే గుర్తొస్తాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోనూ యాపిల్ తోటలు ఉన్నాయి. కందుకూరు మండలం పులిమామిడి పరిధిలోని శ్రీనిఖిల్ చేతనాకేంద్రం ఆశ్రమ నిర్వాహకులు 2021 డిసెంబర్లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి హరిమన్–99 రకానికి చెందిన 170 మొక్కలు తెప్పించి, 30 గుంటల్లో నాటారు. మరో నాలుగు అన్నారకం మొక్క లు కూడా నాటారు. ప్రస్తుతం ఒక్కో మొక్క నుంచి వంద నుంచి రెండు వందల పండ్ల వరకు దిగుబడి వచ్చింది. సాధారణంగా మంచు, చలి ఎక్కువగా ఉండే ప్రదేశంలోనే ఈ యాపిల్ పంట పండుతుంది. కానీ జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని దిగుబడి వస్తుండటం విశేషం. దెబ్బగూడలో ‘అవకాడో’ ⇒ సాధారణంగా 25 డిగ్రీల వాతావరణంలో మాత్రమే పెరిగే అవకాడో 40 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని నిలబడింది. కందుకూరు మండలం దెబ్బ గూడకు చెందిన రమావత్ జైపాల్ జిల్లాలోనే తొలిసారిగా అవకాడో పండ్ల తోట సాగుచేశారు. ఆయన మూడేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా ఎకరం పది గుంటల్లో 220 అవ కాడో మొక్కలు నాటారు. మొక్క నాటే సమయంలో గుంతలో యాప పిండి, గులికల మందు వాడాడు. ఆ తర్వాత డ్రిప్ సాయంతో మొక్కలకు నీరు అందించాడు. చీడపీడల సమస్యే కాదు పెట్టుబడికి పైసా ఖర్చు కూడా లేకపోవడం ఆ యువరైతుకు కలిసి వచి్చంది. ప్రస్తుతం ఆ మొక్కలు ఏపుగా పెరిగి కాపు కొచ్చాయి. ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 200 కాయలు దిగుబడి వచి్చంది.తుక్కుగూడలో ద్రాక్ష సాగు..⇒ నిజాం నవాబుల బ్యాక్‌యార్డ్(ఇంటి వెనుక గార్డెన్)ల్లో ద్రాక్షతోటలు సాగయ్యేవి. ధనవంతుల పెరట్లో మాత్రమే ఈ తోటలు కనిపిస్తుండటంతో వీటికి ‘రిచ్మెన్ క్రాప్’గా పేరొచి్చంది. ఆ తర్వాత టోలిచౌకిలో గద్దె రామకోటేశ్వరరావు తొలిసారి ద్రాక్షపంటను సాగు చేశారు. అప్పట్లో ఎకరానికి ఆరు నుంచి ఏడు టన్నుల దిగుబడి వచి్చంది. సాధారణంగా సమ శీతోష్ణ మండలంలో పండే పంటను హైదరాబాద్ పరిసరాల్లో పండించి చరిత్ర సృష్టించారు. 1991లో హైదరాబాద్ వేదికగా గ్రేప్స్ పంటపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. నగరం గ్రేప్స్ రాజధానిగా గుర్తింపు పొందింది. ఇక్కడి రైతులను ఆదర్శంగా తీసుకొని మహారాష్ట్రలో కూడా సాగు ప్రారంభించారు. పంట భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తుండటంతో 2005 నుంచి ద్రాక్ష పంట క్రమంగా కనుమరుగవుతూ వస్తోంది. ప్రస్తుతం ఒక్క తుక్కుగూడ వేదికగా మాత్రమే ద్రాక్ష సాగవుతోంది.ఈ ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు.. జిల్లాలోని యాచారం, కందుకూరు, అబ్దుల్లాపూర్ మెట్, శంషాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి తదితర ప్రాంతాల్లో ‘డ్రాగన్ ఫ్రూట్’ సాగవుతోంది.15 ఏళ్లుగా ద్రాక్ష సాగు చేస్తున్నా పదిహేను ఏళ్లుగా ద్రాక్ష పంటను సాగు చేస్తున్నా. ఒక్కసారి మొక్క నాటితే 20 ఏళ్లపాటు దిగుమతి వస్తుంది. మొదట్లో ’థాంసన్’ వెరైటీ సాగు చేశాను. తాజాగా ’మాణిక్ చమాన్’ వెరైటీ ఎంచుకున్నా. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటాను. మొక్కల ఎంపిక సహా సస్యరక్షణలో చిన్నచిన్న మెళకువలు పాటించి నాటిన రెండేళ్లకే అనూహ్యంగా దిగుబడిని సాధించాను. ప్రస్తుతం ఒక్కో చెట్టు నుంచి 25 కేజీల వరకు దిగుమతి వస్తుంది. ఎకరా పంటకు కనీసం ఆరు లక్షల ఆదాయం వస్తుంది. ఖర్చుపోను రూ.3 లక్షలు మిగులుతుంది. – కొమ్మిరెడ్డి అంజిరెడ్డి, తుక్కుగూడవిదేశాల నుంచి తిరిగొచ్చి.. మేం ముగ్గురం అన్నదమ్ములం. మాకు 47 ఎకరాల భూమి ఉంది. మాది మొదటి నుంచి వ్యవసాయ ఆధారిత కుటుంబం. నేను బీటెక్ పూర్తి చేసి, ఎంబీఏ కోసం పదేళ్ల క్రితం లండన్ వెళ్లాను. అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేక మళ్లీ వెనక్కి తిరిగొచ్చా. అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అవకాడో సాగు చేయాలనుకున్నా. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగం చేసుకోకుండా..వ్యవసాయం చేస్తున్నాడేంటి? అని అంతా నవ్వుకున్నారు.ఏదో ఒక పండ్లతోట సాగు చేయాలని భావించి మొక్కల కొనుగోలుకు జడ్చర్ల నర్సరీకి వెళ్లాను. అక్కడ అవకాడో మొక్కలు చూశా. అప్పటికే ఆ పండు గురించి తెలుసు కాబట్టి..ఆ పంటను సాగుచేశా. మొక్క నాటిన తర్వాత పైసా ఖర్చు చేయలేదు. ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి వచి్చంది. ఆన్లైన్లో చూసి, స్వయంగా తోట వద్దకే వచ్చి పండ్లు కొనుగోలు చేశారు. – రమావత్ జైపాల్, యువరైతు -
Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
ప్రస్తుత ఆహార అలవాట్లు, జీవన శైలి మార్పులు కారణంగా చాలామంది చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో అధిక బరువు. అధిక బరువు అనేక ఆరోగ్యసమస్యలకు మూలం. అందుకే బరువు తగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇవ్నీ కావు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేస్తున్నారు. వీటితోపాటు కొన్ని రకాల సింపుల్ చిట్కాలతో వెయిట్ లాస్ కావచ్చు అని నిపుణులు అంటున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి. ఎండు ద్రాక్ష నీరు ఎంతో మేలు చేస్తుంది. ఈ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఎండు ద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని, ద్రాక్షతోకలిపి తీసుకోవడంతో వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నమ్ముతారు. ప్రధానంగా ఎండుద్రాక్షలో ఉండే పోషకాలు , యాంటీఆక్సిడెంట్లు అందుతాయి.ఎండు ద్రాక్ష వాటర్, ప్రయోజనాలు శరీరంలోని మలినాలు బయటకు వెళ్తాయి. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. శరీరం ఫ్రీ రాడికల్సతో పోరాడే శక్తినిస్తుంది. బరువు పెరగడం, నిద్రలేమి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.మెరుగైన జీర్ణక్రియ: ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికలను మెరుగుపర్చి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. తద్వారా జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి: విటమిన్ సీ, బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఫినాలిక్ సమ్మేళనాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. రక్తపోటు,గుండెపోటు: బీపీ, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎండుద్రాక్షలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది సోడియం స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే డైటరీ ఫైబర్ పాలీఫెనాల్స్‌ను కూడా ఇందులో లభిస్తాయి.చర్మ,నోటి సమస్యలు : ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. రక్తహీనతకు ఇది చాలామంది. ఎండుద్రాక్షలో కాల్షియం, బోరాన్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చర్మ ఆరోగ్యానికి కీలకమైన విటమమిన్ ఏ, ఈ ఇందులో లభిస్తాయి. రెగ్యులర్‌గా వీటిని తీసుకుంటే ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. వృద్ధాప్య ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ కావిటీస్ , చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే నోటి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి.ఈ ఎండు ద్రాక్ష నీటిలో పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఉన్న ద్రవాల స్థాయిలను అందుపులో ఉంచుతాయి. ముఖ్యంగా ఈ వేసవిలో చెమట కారణంగా కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుంది. -
సంప్రదాయ ద్రాక్షను పోలిన రెడ్ గ్లోబల్ గ్రేప్స్
-
నల్ల ద్రాక్షతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ఏమవుతుందో తెలుసా?
జిడ్డుతత్వం ఉన్న చర్మానికి గ్రేప్స్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ వేసుకుంటే అధికంగా ఉన్న జిడ్డు పోతుంది. పది నల్ల ద్రాక్షపండ్లను పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టులో టేబుల్ స్పూను ముల్తాని మట్టి, టీస్పూను రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. కొన్ని నల్ల ద్రాక్షపళ్లను బాగా స్మాష్ చేసిగుజ్జు తీయాలి. దానికి చెంచా పంచదార, చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి సున్నితంగా మర్దన చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేస్తే ముఖంపై మృత కణాలన్నీ తొలగిపోతాయి. 5 వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే ముఖం కాంతిమంతంగా.. యంగ్లుక్తో కనిపిస్తుంది. ఒక కప్పు ద్రాక్ష పళ్లు తీసుకుని చేతులతో పిసికి గుజ్జులా చేయాలి. వాటిలో రెండు చెంచాల పాలు, చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ఉండే మొటిమలు తాలూకు మచ్చలు పోయి చర్మం మృదువుగా మెరుపులీనుతుంటుంది. చిన్న టొమాటో తీసుకుని ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలకు ఆరు ద్రాక్షపండ్లను జోడించి మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులు, కళ్లకు అంటకుండా ముఖానికి, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. -
పాంటింగ్‌పై ద్రాక్ష పండ్లతో దాడి.. 'వాళ్లను ఊరికే వదలను'
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్‌కు ఇంగ్లండ్ అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ జరిగిన తీరు గురించి పాంటింగ్ మాట్లాడుతున్న సమయంలో స్టాండ్స్‌లో ఉన్న అభిమానుల్లో ఒక ఆకతాయి పాంటింగ్వైపు ద్రాక్షా పండ్లను విసిరారు. అవి నేరుగా పాంటింగ్ షూ వద్ద పడగా.. కొన్ని అతని మొహాన్ని తాకాయి. దీంతో అభిమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాంటింగ్.. తనపైకి ద్రాక్ష పండ్లు విసిరిన వ్యక్తిని పట్టుకోవాలని అక్కడి సెక్యూరిటీ అధికారులకు తెలిపాడు. ''నాపై ద్రాక్ష పండ్లతో దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని కనిపెట్టాల్సిందే.. వాళ్లు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు'' అంటూ పేర్కొన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలిరోజు ఆట ముగిసిన అనంతరం షో హోస్ట్ ఇయాన్ వార్డ్, రికీ పాంటింగ్‌లు స్పిన్నర్ టాడ్ మర్ఫీని ఇంటర్య్వూ చేశారు. ఇది ముగిసిన అనంతరం తొలిరోజు ఆట ఎలా జరిగిందన్న విషయాన్ని పాంటింగ్ వివరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలిరోజే ఆసక్తికరంగా సాగింది. ఇంగ్లండ్‌ను తొలిరోజే ఆలౌట్ చేయడంలో సక్సెస్ అయిన ఆస్ట్రేలియా ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ నిలకడను ప్రదర్శించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌలర్ల దాటికి బ్రూక్ మినహా పెద్దగా ఎవరు రాణించలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 26, లబుషేన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ మరో 222 పరుగులు వెనుకబడి ఉంది. Hi @piersmorgan & @TheBarmyArmy Is this within the spirit of the game? Pelting grapes at Ponting who’s just a commentator. I know you’ve lost the Ashes and all talk about Sour grapes pic.twitter.com/xkewu1h8v3 — FIFA Womens World Cup Stan account ⚽️ (@MetalcoreMagpie) July 28, 2023 చదవండి: టీ20 వరల్డ్ కప్ 2024కు అర్హత సాధించిన ఐర్లాండ్.. Novak Djokovic: జొకోవిచ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. ఆందోళనలో అభిమానులు -
Beauty Tips: ద్రాక్షపండ్లలో ఉండే ఆంథోసైయనిన్ వల్ల..
ప్రస్తుతం మార్కెట్లో పుష్కలంగా దొరుకుతున్న ద్రాక్షపండ్లలో విటమిన్ ఎ, సి, బీ 6, ఫోలేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మానికి పోషణ అందించేవి. గ్రేప్స్‌ను ఆహారంగా లేదా ఫేస్ ప్యాక్ రూపంలో తీసుకోవడం వల్ల చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. వీటిలోని ఆంథోసైయనిన్(నీటిలో కరిగే కలర్ పిగ్మెంట్), యాంటీ ఆక్సిడెంట్లు ముఖం మీద మొటిమలు, వాటి తాలుకూ మచ్చలను తొగిస్తాయి. యాంటీ ఏజింగ్ మూలకంగా కూడా గ్రేప్స్ బాగా పనిచేస్తాయి. ఇన్ని పోషకాలు ఉన్న ద్రాక్షతో ఇంట్లోనే సులభంగా ఫేస్‌ప్యాక్‌లు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.... చిన్న టొమాటో తీసుకుని ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలకు ఆరు ద్రాక్షపండ్లను జోడించి మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులు, కళ్లకు అంటకుండా ముఖానికి, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఆయిలీ స్కిన్.. జిడ్డుతత్వం ఉన్న చర్మానికి కూడా గ్రేప్స్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ వేసుకుంటే అధికంగా ఉన్న జిడ్డుపోతుంది. పది నల్ల ద్రాక్షపండ్లను పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టులో టేబుల్ స్పూను ముల్తాని మట్టి, టీస్పూను రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంటపాటు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పొడి చర్మానికి.. మూడు స్ట్రాబెర్రీలు, ఐదు ద్రాక్షపండ్లను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని దూదితో తీసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖచర్మానికి ఇన్స్టంట్ మాయిశ్చర్‌ని అందించడంతోపాటు మృదువుగా మారుస్తుంది. చర్మతత్వాన్ని బట్టి వీటిలో ఏ ప్యాక్‌ను అయినా వారానికి రెండుసార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది. చదవండి: Groundnuts Health Benefits: ఉడకబెట్టిన పల్లీలు తినడం ఇష్టమా? ఇవి విడుదల చేసే సెరోటోనిన్ వల్ల.. -
ఫలించిన ప్రయోగం
శింగనమల: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయానికి, ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో రైతులు సైతం పంటల సాగులో నూతన పంథాను అవలంభిస్తున్నారు. కొత్త రకం పంటల సాగుపై దృష్టి సారించిన అనంతపురం రైతులు జిల్లాలోనే కాక పొరుగు రాష్ట్రాల్లోనూ ఆ తరహా పంటలపై అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే శింగనమల మండలం గుమ్మేపల్లికి చెందిన రైతు చంద్రప్రకాష్‌రెడ్డి (బాబు) సరికొత్త ద్రాక్ష రకాన్ని ఎంపిక చేసుకుని ప్రయోగదశలోనే ఆశించిన ఫలితాన్ని సాధించారు. ఆస్ట్రేలియా రకం రెడ్ గ్లోబ్ ఇప్పటి వరకూ ఆస్ట్రేలియాకే పరిమితమైన రెడ్ గ్లోబ్ రకం ద్రాక్షకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ద్రాక్ష రకాన్ని సాగు చేస్తే ఎలా ఉంటుందని రైతు చంద్రప్రకాష్‌రెడ్డి భావించారు. అనుకున్నదే తడవుగా రెడ్ గ్లోబ్ సాగు చేస్తున్న రైతుల గురించి ఆరా తీస్తూ కర్ణాటకలోని చిక్కబళ్లాపురానికి వెళ్లారు. అక్కడ ఓ రైతు సాగు చేస్తున్న రెడ్ గ్లోబ్ ద్రాక్షను పరిశీలించారు. 2019లో రూట్స్ తీసుకొచ్చి నాటారు. 2020లో రెడ్‌గ్లోబ్ అంటు కట్టించారు. ఒక్కొక్క అంటుకు రూ.150 చొప్పున ఖర్చు పెట్టారు. మొత్తం ఆరు ఎకరాల్లో ఆరు వేల అంటు మొక్కలు నాటారు. పందిరి, ఇతర ఖర్చులు అన్నీ కలిపి ఎకరాకు రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లోనే పండే ఈ రకం పంట జిల్లా వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందో.. లేదోననే అనుమానాలు ఉండేవి. అయితే అనూహ్యంగా పంట ఏపుగా పెరిగి ప్రస్తుతం కోత దశకు వచ్చింది. ఓ ప్రయోగం చేద్దామనుకున్నా.. రెడ్ గ్లోబ్ ద్రాక్ష రకం గురించి తెలియగానే ఎలాగైనా ఈ పంట సాగు చేయాలని అనుకున్నా. చిక్కబళ్లాపురంలో ఈ పంట సాగు చేస్తున్నట్లు తెలుసుకుని అక్కడికెళ్లి చూశాను. ఎర్ర నేలలు అనుకూలమని తెలిసింది. దీంతో నాకున్న 50 ఎకరాల్లో ఓ ఐదు ఎకరాల్లో ప్రయోగం చేద్దామని అనుకున్నా. అంటు మొక్కలు తీసుకొచ్చి ఆరు ఎకరాల్లో నాటాను. పశువుల పేడ ఎరువు వాడాను. దిగుబడి ఆశించిన దాని కన్నా ఎక్కువగానే ఉంది. ఎకరాకు 10 నుంచి 15 టన్నుల వరకూ దిగుబడి వస్తుందని అనుకుంటున్నా. ఈ లెక్కన తొలి కోతలో పెట్టుబడులు చేతికి వస్తే.. ఆ తర్వాత వరుస లాభాలు ఉంటాయి. ఆరు నెలల పాటు పంట కోతలు ఉంటాయి. సాధారణంగా మార్కెట్లో రెడ్ గ్లోబ్ ద్రాక్ష కిలో రూ.300 నుంచి రూ.500 వరకు ధర పలుకుతోంది. అయితే జిల్లాలో సరైన మార్కెటింగ్ వసతి లేకపోవడంతో ముంబయి, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోని మార్కెట్‌కు తరలిస్తున్నా, కిలో రూ.180 నుంచి అమ్ముడుబోతోంది. – చంద్రప్రకాష్‌రెడ్డి, రైతు, గుమ్మేపల్లి, శింగనమల మం‘‘ -
సింపుల్ క్లీనింగ్ టిప్స్: జిడ్డు మరకలా? ద్రాక్ష, నిమ్మకాయ, ఇంకా బ్రెడ్‌తో..
సింక్, బాత్ టబ్‌లకు అంటుకున్న మొండి, జిడ్డు మరకలను తొలగించడానికి ద్రాక్ష పండు, నిమ్మకాయ, వెనిగర్లు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ► ద్రాక్షపండును సగానికి ముక్కలు కోయాలి. బాత్‌టబ్ లేదా సింక్‌పై ఉప్పు చల్లాలి. వాటి మీద ద్రాక్ష పండు సగం ముక్కతో రుద్దాలి. తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ► వెనిగర్‌ను సింక్ టాప్, బాత్ టబ్లపై చల్లి, గంట సేపు వదిలి, తర్వాత సోప్వాటర్ని ఉపయోగించి కడిగితే బాగా శ్రుభపడతాయి. ► కాఫీ ఫిల్టర్ శుభ్రపడాలంటే అందులో బ్లాటింగ్ పేపర్ని చిన్న చిన్న ఉండలుగా చేసి వేయాలి. అటూ ఇటూ పదే పదే తిప్పాలి. (చదవండి: Health Tips: పాలమీగడలో ఏలకులను కలుపుకుని చప్పరిస్తే..) ► గోడలపైన వేలి ముద్రల మరకలు నూనె జిడ్డుగా కనిపిస్తుంటాయి. వీటిని వదిలించడానికి బ్రెడ్ స్లైస్‌ను తీసుకొని, మరకలపైన రబ్ చేసి, తుడవాలి. దీంతో నూనె మరకలు తగ్గిపోతాయి. అదే బ్రెడ్‌తో పగిలిన గ్లాసు ముక్కలను తీయడానికి కూడా ఉపయోగించవచ్చు. ► స్టౌ పై జిడ్డు మరకలు సాధారణంగా అవుతుంటాయి. నిమ్మరసం రాసి, బ్రెడ్ లేదా స్పాంజితో తుడవాలి. (చదవండి: గలిజేరు ఆకును పప్పుతో కలిపి వండుకుని తింటున్నారా) -
ఈ ద్రాక్ష పండ్ల గుత్తి రూ.లక్షల్లో.. ఒక్క పండు రూ.33 వేలంట..
టోక్యో: ఆరోగ్యంగా ఉండేందుకు కూరగాయలతో పాటు పండ్లు తినాలి. అయితే పండ్లు కేవలం అనారోగ్యం వచ్చినప్పుడే తినాలనే అపవాదుతో ప్రజలు ఉంటారు. అది చాలా తప్పు. పండ్లు తింటే అసలు అనారోగ్యానికి గురి కారు. ఈ విషయాన్ని జనాల తేలికగా తీసుకుంటారు. అయితే పండ్లల్లో ద్రాక్షకు ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా రెండు రకాల ద్రాక్షలు చూసి ఉంటారు. కానీ ద్రాక్షలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటి ధర పండ సీజన్లో అయితే రూ.వంద పైన సాధారణ రోజుల్లో 40-80 మధ్య ఉంటుంది. అయితే ఒక ద్రాక్ష పండు రకం ధర మాత్రం ఏకంగా రూ.లక్షల్లో ఉంటుంది. ఒక్క పండు ధరనే రూ.30 వేలు ఉంటుంది. ఆ పండు ఏ రకమో.. ఆ పండు ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి. రూబీ రోమన్ ద్రాక్షగా పిలిచే ఈ పండ్లు అత్యధిక ధర కలిగి ఉంటుంది. ఈ పండ్లు జపాన్‌లో లభిస్తుంటాయి. ఈ పండ్లు ఎంతో ప్రత్యేకం కేవలం జపాన్‌లో మాత్రమే లభిస్తాయి. ఆ దేశంలోని ఇషికావా అనే ప్రాంతంలో మాత్రమే లభించే ఈ రూబీ రోమన్ పండ్లు మార్కెట్లో భారీ ఉంటుంది. ఒక బంచ్ (గుత్తి) ద్రాక్ష ధర రూ.లక్షల్లో ఉంటుంది. ఈ పండు ప్రత్యేకతలు ఇవే.. ఒకే రంగు, ఒకే సైజ్‌లో ఈ పండ్లు ఉంటాయి. ఎరుపులో ఉంటాయి. రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మరచిపోరు. సాధారణ ద్రాక్ష కంటే 18 శాతం అధికంగా తీపి కలిగి ఉంటుంది. ఈ పండ్ల విక్రయానికి అనేక నిబంధనలు ఉన్నాయి. ఇషికావా అధికారులు నిబంధనలకు అనుగుణంగా రూబీ రోమన్ ద్రాక్షపండ్లు విక్రయించాలి. ఈ పండ్ల నాణ్యత తనిఖీ చేసి ముద్ర వేసినవి మాత్రమే కొనుగోలు చేయాలి. ఏడాదిలో ఒకసారి మాత్రమే పండుతుంది. ఈ పండ్లను 2020లో వేలం పాటి నిర్వహిస్తే ఏకంగా రూ.12 వేల డాలర్ల (దాదాపు రూ.8.86 లక్షలు)కు దక్కించుకున్నారు. అంటే ఒక్కో ద్రాక్ష పండు రూ.30 వేలకు పైగా ఉంటుంది. These luxury Japanese grapes are over four times the size of standard grapes pic.twitter.com/sQ3kfa6TpW — Business Insider (@BusinessInsider) September 20, 2021 -
ప్రపంచంలోనే ఖరీదైన ద్రాక్ష, ఒక్కోటి రూ.35వేలు
సాక్షి, న్యూఢిల్లీ: మొన్న ఖరీదైన మామిడి పళ్లు గురించి విన్నాం.ఇపుడిక ప్రపంచంలోనే అతి ఖరీదైన, అరుదైన ద్రాక్ష పండ్లు గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో అనేక రకాల ద్రాక్షలు కనిపిస్తాయి. కానీ చక్కటి రంగు,రుచితో పింగ్‌పాంగ్ బంతి సైజులో ఉండే ‘రూబీ రోమన్ ద్రాక్ష’ ప్రత్యేకతే వేరు. ఈ రకానికి చెందిన ప్రతి ద్రాక్ష బరువు 20 గ్రాముల కంటే ఎక్కువే. రుచిలో కూడా రాయల్‌గా ఉంటాయి. అయితే వీటిని కొనాలంటే మాత్రం జేబుకు భారీ చిల్లు తప్పదు. ఐఫోన్, తులం బంగారం కంటే కంటే ఎక్కువ పెట్టాల్సిందే. ఇంతకీ ఏంటబ్బా అంత స్పెషాలీటీ! రూబీ రోమన్ ద్రాక్ష అని పిలిచే ఈ ద్రాక్ష తక్కువ పుల్లగా, ఎక్కువ తీపిగా, జ్యూసీగా జ్యూసీగా ఉంటుంది. అందుకే అంత పాపులర్. ఈ ద్రాక్ష కిలో ధర 11 వేల డాలర్లు. అంటే అక్షరాలా రూ.7.5 లక్షలు. షాకవ్వకండి..ఇది నిజం. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా ఖ్యాతి దక్కించుకుంది. రూబీ రోమన్ ద్రాక్ష జపాన్‌లో 2019లో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఫైల్ ఫోటో జపాన్‌లోని ఇషికావా దీవిలో పరిమిత సంఖ్యలో రుబీ రోమన్ ద్రాక్ష పండ్లను పండిస్తారు. 2008 నుంచి పండించడం మొదలుపెట్టారు. జపనీస్ లగ్జరీ ఫ్రూట్ మార్కెట్లో వీటికి చాలా డిమాండ్. ఈ ద్రాక్షనుమొదట మార్కెట్లో విక్రయించరు. వేలంలో అధిక ధర చెల్లించిన వారికి మాత్రమే సొంతం. అందుకే దీన్ని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు క్యూ కడతారు. ప్రతీ ఏడాది రికార్డు ధరను సొంతం చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 2019లో ఈ ద్రాక్షను కనజవాలో వేలానికి పెట్టగా, జపాన్‌కు చెందిన హయాకురాకుసో అనే సంస్థ ఈ ద్రాక్ష గుత్తిని వేలంలో గెలుచుకుంది. మొత్తం 24 ద్రాక్ష పండ్ల గుత్తిని 12 లక్షల యెన్లకు సొంతం చేసుకుంది. అంటే ఒక ద్రాక్ష ధర సుమారు రూ.35 వేలన్న మాట. మార్కెట్లో ప్రవేశపెట్టిన గత 11 ఏళ్లలో ఎన్నడూ ఇంత ధర పలకలేదని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్ వెల్లడించింది. కాగా సాధారణ రోజుల్లో ఈ ద్రాక్ష గుత్తి ధర 460 డాలర్లు (రూ.31,537) వరకు ఉంటుందని స్థానిక రైతులు చెప్పారు. అలాగే వీటిని ఎక్కువగా ఇతరులకు బహుమతిగా ఇచ్చేందుకు కొనుగోలు చేస్తారనీ, వీఐపీ గెస్టులకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కొన్ని విలాసవంతమైన హోటల్స్ కొనుగోలు చేస్తుంటాయని తెలిపారు. కాగా మధ్యప్రదేశ్‌లోని ఒక జంట జపనీస్ మియాజాకి మామిడి పండ్లను పండించి ఇటీవల వార్తల్లోకె క్కిన సంగతి తెలిసిందే.కిలోకు రూ.2.70 లక్షలతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిగా రికార్డు కొట్టేసిన వీటి రక్షణకు నలుగురు భద్రతా సిబ్బందిని, ఆరుకుక్కలను ఏర్పాటు చేసుకోవడం విశేషంగా నిలిచింది. -
మట్టిలో ద్రాక్ష తియ్యన
ఫ్రూట్స్ ఏవైనా పండిన తరువాత ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. త్వరగా పాడైపోతాయి. ఈ విషయంలో ద్రాక్షపండ్లకు(గ్రేప్స్) ఏమి మినహాయింపులేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్‌లో మాత్రం గ్రేప్స్‌ను నెలలపాటు నిల్వచేస్తూ..మార్కెట్లో మంచి ధర పలికినప్పుడు అమ్ముకుని లాభాలు పొందుతున్నారు అక్కడి వ్యాపారులు. ‘గంగినా’ అనే పురాతన సంప్రదాయ పద్దతిలో వీరు గ్రేప్స్ పాడవకుండా ఆరునెలలపాటు నిల్వచేస్తున్నారు. గంగినా అనేది ఫ్రూట్స్ నిల్వచేసే పురాతనమైన పద్దతి. ఈ పద్దతిలో ముందుగా తడిమట్టితో సాసర్ వంటి నిర్మాణం కలిగిన పాత్రలను తయారు చేసి ఎండలో ఆరబెడతారు. తరువాత నిల్వ చేయాలనుకున్న ద్రాక్షపళ్లను గ్రేడింగ్ చేస్తారు. గ్రేడింగ్‌లో మంచిగా ఉన్న వాటిని పాడైన,పుచ్చులు ఉన్న గ్రేప్స్ నుంచి వేరు చేస్తారు. ఇలా చేయకపోతే ఆల్రేడి పాడైన గ్రేప్స్ మంచి వాటిని కూడా పాడయ్యేలా చేస్తాయి. నిల్వచేసే ద్రాక్షపండ్లలో ఒకటి పాడై ఉన్నా కంటైనర్‌లో ఉన్న మిగతా పండ్లు కూడా చెడిపోతాయి. అందువల్ల తప్పనిసరిగా గ్రేడింగ్ చేస్తారు. మంచిగా ఉన్న ద్రాక్షపండ్లను రెండు సాసర్ల మధ్యలో ఉంచి సాసర్ను తడిమట్టితో సీల్ చేస్తారు. ఆ తరువాత దానిని ఎండలో పెట్టి ఆరనిచ్చిన తరువాత...ఎండవేడి, గాలి తగలని చల్లని చీకటి ప్రదేశంలో వాటిని భద్రపరుస్తారు. ఒక్కో కంటైనర్‌లో ఒక కేజీ ద్రాక్షపండ్లను నిల్వచేయవచ్చు. ఆరు నెలలపాటు ఇవి తాజాగా ఉంటాయి. గంగినా పద్దతిలో నిల్వచేసిన పళ్లను మార్కెట్లో మంచి ధర పలికినప్పుడు అమ్మి మంచి లాభాలు పొందుతామని అక్కడి రైతులు చెబుతున్నారు. గంగినా పద్దతిలో నిల్వచేసిన గ్రేప్స్ చాలా తాజా ఉంటాయని, వీటికి మంచి రేటుకూడా వస్తుందని వారు అంటున్నారు. -
52 రకాల విదేశీ ద్రాక్షలు ఒకేచోట..
సాక్షి, రాజేంద్రనగర్: ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 52 రకాల దేశ, విదేశాలలో పండే ద్రాక్షలు. నేరుగా పంట చేనులోకే వెళ్లి మనకు కావాల్సిన ద్రాక్షలను తెంపుకోవచ్చు. ఈ పంటలన్నీ పూర్తిగా సేంద్రీయ పద్ధతులో పండించినవే. ఇది ఎక్కడో కాదు మన రాజేంద్రనగర్‌లోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపుజీ హార్టికల్చర్ ద్రాక్ష పరిశోధన కేంద్రంలోనే. ఈ నెల 13వ తేదీ నుంచి ద్రాక్షప్రియులకు ఈ సౌకర్యాన్ని పరిశోధన కేంద్రం కల్పిస్తోంది. రాజేంద్రనగర్‌లోని ద్రాక్ష పరిశోధన కేంద్రాన్ని 5 ఎకరాల్లో ఏర్పాటుచేశారు. వీటిలో ద్రాక్షలపై పరిశోధనలు చేయడంతో పాటు వివిధ రకాల ద్రాక్ష పంటలను పండిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండే ద్రాక్షలతో పాటు కొత్త రకాల ద్రాక్షలను ఇక్కడ పండించి రైతులకు చేరవేస్తున్నారు.. అవగాహన కల్పిస్తున్నారు. విదేశాల్లోనే లభించే రెడ్ గ్లోబ్, రిజమత్, కట్ట కుర్గన్, ఫ్లెమ్ సీడ్లెస్, ఫెంటాసి సీడ్లెస్, బెంగళూరు బ్లూ, సాద్ సీడ్లెస్ తదితర అనేక రకాల ద్రాక్షలను పండిస్తున్నారు. ప్రస్తుతం 52 రకాల ద్రాక్షలు ఈ కేంద్రంలో లభిస్తున్నాయి. నేరుగా పంట చేనులోనే కావాల్సిన ద్రాక్షలను తీసుకోవచ్చు. రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల ఎదురుగా ఉన్న ఈ ద్రాక్ష తోటలో ప్రతి సంవత్సరం నెలపాటు అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి విక్రయానికి సిద్ధం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం 96185 37654, 79818 99114లలో ద్రాక్షప్రియులు సంప్రదించవచ్చు. -
ప్రారంభంకానున్న ద్రాక్ష ఫెస్టివల్
-
కీర్తనల్లో...ద్రాక్ష, అరటి, కొబ్బరి
దక్షిణాదిన ఒక నానుడి ఉంది. త్యాగరాజ కీర్తనలు ద్రాక్షపళ్ళలాంటివి...నోట్లో వేసుకుని చిదిమితే చాలు, పులకించిపోతాం. శ్యామశాస్త్రి గారి కీర్తనలు కదళీఫలం లాంటివి. కొంచెం కొంచెంగా తొక్క ఒలుచుకుని తింటుంటేనే అరటి పండును ఆసాంతం సంతృప్తిగా ఆస్వాదించగలం. ముత్తుస్వామి దీక్షితులు గారి కీర్తనలు నారికేళ పాకం లాంటివి. కొబ్బరి బోండాం తెచ్చి, పీచు తీసి, పగుల కొట్టి, కొబ్బరి తీసి, తురిమి, పాకం పట్టించి తింటే తప్ప ఆ ఆనందం తెలియదు. దంతసిరి కూడా ఉండాలి. లేకపోతే పళ్ళమధ్య ఇరుక్కుపోతున్నవాటిని సభా గౌరవం కూడా పాటించకుండా పుల్లలతో గుచ్చుకుంటుండాలి. అంటే ముగ్గురివి అటువంటి స్థాయి కలిగిన కీర్తనలు. శ్యామశాస్త్రి గారికి శ్రీవిద్యా సంప్రదాయం అంటే కరతలామలకం. సాక్షాత్ అమ్మవారిని ఉద్దేశించి చేసిన కీర్తనలో ఎన్ని రహస్యాలు దాచారో.. అదొక అద్భుత కీర్తన...‘‘హేమాద్రిసుతే పాహిమాం వరదే పరదేవతే/సుమేరు మధ్య వాసినీ అంబ శ్రీకామాక్షి/శ్యామకృష్ణ సోదరీ గౌరీ పరమేశ్వరీ గిరిజా/అలమేలవేణీకీరవాణీ శ్రీలలితే.....’’ పాహిమాం వరదే పరదేవతే అని చిట్టచివరి చరణంలోకి వెళ్ళేటప్పటికి శ్రీలలితే అని చేసారు. ఆయన అమ్మవారిని పిలుస్తున్నారు. రాజగోపురంలో కూర్చుని ఒళ్ళు మరిచి సంకీర్తన చేస్తుంటే... అమ్మవారు చిన్నపిల్ల రూపంలో ఒంటినిండా నగలు ధరించి చేత్తో పాలు పట్టుకొచ్చి..‘అన్నయ్యా! అన్నయ్యా!!!’ అని పిలిచి ఇచ్చేది. అవి తాగేవారు ఆయన. ఇంటికొచ్చి వారి అమ్మనడిగేవారు..‘‘చెల్లిని ఎందుకు పంపావు ?’’ అని.‘నీ చెల్లీ రాలేదు, నేనూ పంపలేదు’ అని ఆమె అనేవారట. అందుకే ఎక్కువగా ఆయన కీర్తనలలో చివర ‘శ్యామకృష్ణ సహోదరీ’ అని చేర్చారు. ఒక అర్థంలో కామాక్షీదేవిని వాళ్ళ ఇంటి ఆడపడుచు–అని, మరొక అర్థంలో విష్ణు సహోదరి అయిన అమ్మవారు– అని అర్థం వచ్చేలా ఉంటుంది. త్యాగరాజుగారు ‘త్యాగరాజనుత’ అని వేసుకున్నట్లుగానే, శ్యామశాస్త్రిగారు ‘శ్యామకృష్ణ సహోదరి’ అనీ, ‘శ్యామకృష్ణ పూజిత’ అని వేసుకున్నారు.అనేకమంది మహర్షులకు నిలయం హిమవత్ పర్వతం. ఎందరో అక్కడ ధ్యానం చేస్తుంటారు. అటువంటి హిమవత్ పర్వత రాజయిన హిమవంతుడి భార్య మేనక. దక్షప్రజాపతి కుమార్తె దాక్షాయణిగా ఉండి హిమాలయాల్లో సంచరిస్తుండగా ఆమెను చూసిన మేనక –‘నాకు ఇటువంటి కుమార్తె ఉంటే బాగుండును’ అనుకున్న కారణంగా ఆమె హైమవతి గా జన్మించింది. ప్రపంచంలోని పర్వతాలన్నింటిలోకి శ్రేష్టమయినదిగా పిలవబడే హిమవత్పర్వతం... దానికి రాజయిన హిమవంతుడికి కుమార్తె అయిన దానా... వరదే.. అంటే వరములిచ్చేది... ఇక్కడ ఆ తల్లిని అడుగుతున్నది మామూలు వరాలు కాదట. ఏ ఆనందాన్ని అనుభవించడం చేత అటువంటి సుఖం కలుగుతుందో అటువంటి ఆనందం కేవలం పరమేశ్వరుని పాదాలనుంచి స్రవించే అమృతంలో తప్ప మరొక దానిలో లేదు. అటువంటి పాదసేవ కోర్కెను తీర్చగలిగే తల్లి కనుక ‘వరదే’ అన్నారు. అంటే లౌకికమైన స్థితినుంచి అలౌకికమైన స్థితిని పెంచడానికి అవకాశమున్న భక్తి సామ్రాజ్యానికి పట్టాభిషిక్తునిగా చేయగలిగిన దానివి. అందుకని .. వరదే.. అన్నారు. ఆ తల్లిని అడుగుతున్నది మామూలు వరం కాదు. ఆ వరానికి ‘కాదంబరి’ అన్న నామంతో సంబంధం ఉంది. ఈ కీర్తన గొప్పతనం ఎంతంటే.. .అది ప్రతిరోజూ విన్నంత మాత్రం చేత అద్భుతమైన వాక్శక్తినీ, వాఙ్మయ ధారను అమ్మవారు కటాక్షించ గలుగుతుంది. -
రాజేంద్రనగర్‌లో ద్రాక్ష ఫెస్టివల్
-
కిడ్నీ సమస్యలకు బీన్స్, తులసి, ద్రాక్ష
ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడాలేకుండా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. ఆహార అలవాట్లు, జీవన విధానంలో మార్పుతో ఈ సమస్య సాధారణంగా మారింది. ఈ సమస్య రాకుండా, అప్పటికే సమస్య ఉంటే అది పెద్దది కాకుండా చూసుకోవాలంటే అది మన చేతిలో పనే. కిడ్నీ బీన్స్(రాజ్మా): ఈ బీన్స్ మన నాలుకకు ఎంత రుచిని ఇస్తాయో, ఆరోగ్యానికి అంతకన్నా ఎక్కువ మేలు చేస్తాయి. నాలుగు లీటర్ల నీటిలో మధ్యకు చీల్చిన అరవై గ్రాముల బీన్స్ గింజలను వేయాలి. ఈ నీటిని నాలుగు గంటలపాటు సన్నటి మంట మీద ఉంచి మరగనివ్వాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని సుమారు 8 గంటల పాటు చల్లబరచాలి. చల్లారిన మిశ్రమాన్ని మళ్లీ వడకట్టుకోవాలి. రోజులో రెండు గంటలకోసారి ఈ డికాషన్‌ను గ్లాసు చొప్పున తీసుకోవాలి. ఇలా వారంలో కొన్నిసార్లు తీసుకోవాలి. డికాషన్ తయారయిన 24 గంటలలోపే అది ఔషధంగా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్‌లో సమస్యలు, ఏ ఇతర సమస్యలున్నా ఇది మంచి చిట్కా. తులసి ఆకులు: తులసి ఆకులకు ఒక టీస్పూన్ తేనె కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్‌ని ఆరునెలల పాటు ప్రతి రోజు తీసుకోవాలి. ఇలా చేస్తే కిడ్నీలోని రాళ్ల పరిమాణం తగ్గి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. ద్రాక్ష: ద్రాక్షలో అధిక శాతం నీరు, పొటాషియం, సాల్ట్ ఉంటాయి. ఇవి మూత్రపిండ సమస్యను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే పుచ్చకాయ తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్య తలెత్తదు. ఇది చాలా సురక్షితమైనది కూడా. -
క్యాన్సర్లను నివారించే ఎండుద్రాక్ష!
కిస్మిస్ లేదా ఎండుద్రాక్ష అని పిలిచే ఈ డ్రైఫ్రూట్స్ రుచికరమే కాదు... ఆరోగ్యకరం కూడా. 100 గ్రాముల ఎండుద్రాక్షలో 249 క్యాలరీలతో పాటు పీచుపదార్థాలు, ఎన్నో రకాల లవణాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఎండుద్రాక్షతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని... ►ఎండుద్రాక్షలో (ద్రాక్షలో మాదిరిగానే) రెస్వెరట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. నొప్పి, మంటను తగ్గించడంతో పాటు క్యాన్సర్లను నివారించే శక్తి దీనికి ఉంటుంది. ముఖ్యంగా అది మెలనోమా, పెద్దపేగు, ప్రోస్టేట్ క్యాన్సర్లను నివారిస్తుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది ∙ఎండుద్రాక్ష అనేక రకాల ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ►కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించడంతో పాటు గుండెజబ్బులను (కరోనరీ ఆర్టరీ డిసీజ్‌ను) రాకుండా కాపాడుతుంది ∙రక్తనాళాలను సన్నబార్చే ఏంజియోటెన్సిన్ అనే హార్మోన్‌ను స్రావాలను తగ్గించి పక్షవాతాన్ని నివారిస్తుంది. అంతేకాదు... ఇలా ఏంటియోటెన్సిన్ను తగ్గించడం వల్ల హైబీపీ కూడా నివారితమవుతుంది. ∙రక్తనాళాలను విప్పారేలా చేసే నైట్రిక్ ఆక్సైడ్ పాళ్లను పెరిగేలా చేయడం వల్ల రక్తనాళాలు సన్నబారవు. దాంతో గుండెజబ్బులతోపాటు పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. ►ఎండుద్రాక్షలో క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, జింక్ వంటి ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. ఐరన్ పాళ్లు కూడా పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత (అనీమియా) ఉన్నవారికి రక్తవృద్ధి చేస్తుంది ∙100 గ్రాముల ఎండుద్రాక్షలో 749 మి.గ్రా. పొటాషియం ఉంటుంది. ఇది హైబీపీని నివారించడంతో పాటు గుండెజబ్బులను, పెరిఫెరల్ వాస్కులార్ డిసీజ్‌ను నివారించడానికీ తోడ్పడుతుంది ∙థయామిన్, పైరిడాక్సిన్, రైబోఫ్లేవిన్, పాంటథోనిక్ యాసిడ్ వంటి బి–కాంప్లెక్స్‌కు సంబంధించిన విటమిన్ అంశాలు ఉండటం వల్ల అవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. -
ద్రాక్ష... గుండెకు రక్ష!
గుడ్ ఫుడ్ పండ్లలో మామిడిని ‘రారాజు’గా చెబుతారు. ‘ద్రాక్ష పండు’ను రాణిగా అభివర్ణిస్తారు. ద్రాక్ష రుచిలోనే కాదు... ఆరోగ్యాన్నివ్వడంలో తనకు తానే సాటి. గుండె జబ్బులను అరికట్టడంలో మేటి. 100 గ్రాముల ద్రాక్షపండ్లలో 69 క్యాలరీల శక్తి ఉంటుంది. 191 మైక్రోగ్రాముల పొటాషియమ్ దొరుకుతుంది. సూక్ష్మపోషకాలైన కాపర్, ఐరన్, మ్యాంగనీస్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు. ద్రాక్షలోని ‘రెస్వెరట్రాల్’ శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్. రక్తనాళాల్లో పూడికను నివారించి గుండెజబ్బులను అరికట్టగలదు. అలై్జమర్స్ డిసీజ్, డయాబెటిస్, క్యాన్సర్లనూ నివారిస్తుంది. రక్తనాళాలను సన్నబర్చే యాంజియోటెన్సిన్ అనే హార్మన్ ఉత్పత్తిని తగ్గించి... గుండెజబ్బులను నివారిస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్‌ను వెలువరచి రక్తనాళాలను విప్పార్చి ఉండేలా చేస్తుంది. రక్త ప్రవాహం సాఫీగా జరపడం ద్వారా గుండెజబ్బులను దరిచేరకుండా చూస్తుంది. అందుకే ద్రాక్ష అంటే గుండెకు మేలు చేసేదన్న విషయం గుర్తుంచుకోవాలి. -
ఆ విషాలను కడుగుదాం రండి!!
జీవఫలం – చేదు విషం! ఒకప్పుడు చందమామ కథల్లో కొన్ని పండ్లు చాలా ఆకర్షణీయంగా కనిపించేవి. కానీ అవి తినగానే చనిపోవడమో లేదా కురూపులైపోవడమో జరుగుతుందని అరణ్యంలో మారువేషాల్లో సంచరించే రాజులనూ, రాకుమారులనూ హెచ్చరించేది పేదరాసి పెద్దమ్మ. ఇప్పుడు అడవుల్లోకి పోయి... ఆకర్షణీయమైన వింతపండ్లను వెతకనక్కర్లేదూ... పేదరాసి పెద్దమ్మతో చెప్పించుకోనవసరం లేదు. మన మార్కెట్లోకి వచ్చే ద్రాక్ష పండ్లను చూస్తే చాలు. దూరం నుంచి చూసినా పండుపై ఏదో మందులు చిమ్మిన పొరలు కనిపిస్తాయి. ముట్టుకొని చూస్తే పండు జిడ్డు జిడ్డుగా చేతికి తగులుతూ ఉంటుంది. ఆ చేతిని ఎప్పుడెప్పుడు కడుక్కుందామా అని ఫీలింగ్‌తో చేతులు కడుక్కునేవరకూ అంతా అస్థిమితంగా ఉంటుంది. గుత్తి నుంచి అప్పుడో, ఇప్పుడో ఒకటో రెండో పండ్లను తీసుకొని తినాలన్న ఇచ్ఛ ఇగిరిపోతుంది. మనసు చచ్చిపోతుంది. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ద్రాక్షల్లో నల్లద్రాక్ష, పచ్చద్రాక్ష, క్యాప్సూల్ ద్రాక్ష వంటి గుత్తులు వినియోగదారులను ఆకర్షిస్తున్నా... వాటిపై పేరుకుపోయి కనిపిస్తున్న రసాయన మందులు, క్రిమిసంహార మందులతో వెంటనే వాటి నుంచి దృష్టి మళ్లుతోంది. అత్యాధిక మోతాదులో వాడే ఎండోసల్ఫాన్ వంటి మందులు... పండ్లు తినేవారి ఆరోగ్యంపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలకు కారణమవుతున్నాయి. అంతేకాదు... గతంలోలా ఒకసారో, రెండోసార్లో ద్రాక్షపండ్లను కడిగినా ఇప్పుడు ప్రయోజనం లేదు. క్రిమిసంహారకమందుల అవశేషాలు అన్నో, ఇన్నో పండ్లపై మిగిలిపోతున్నాయి. ఈ విషయాన్ని ఆహారం, మందుల భద్రతపై అత్యున్నత సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)తో పాటు మన దేశానికి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) వేర్వేరుగా పేర్కొంటున్నాయి. ఇటీవలే సీఎస్ఈ సమర్పించిన నివేదిక ప్రకారం... ద్రాక్షను కడిగాక కూడా వాటిపై మిగిలిపోతున్న క్రిమిసంహారక మందుల అవశేషాలు (కెమికల్ రెసిడ్యూస్) వల్ల క్యాన్సర్, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసేలా నరాలకు సంబంధించిన వ్యాధులు, పిల్లల్లో పుట్టుకతో వచ్చే వ్యాధులు కనిపిస్తున్నాయని పేర్కొంది. అంతేకాదు. ఇలాంటి పండ్ల వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా దెబ్బతింటోందని చెబుతోంది సీఎస్ఈ. సాంప్రదాయిక పద్ధతుల్లో ఇప్పటివరకూ మనం ఒక లీటర్ నీళ్లలో రెండు చెంచాల ఉప్పు కలిపి, రెండుసార్లు కడిగినా రసాయన మందుల అవశేషాలు పూర్తిగా పోవడం లేదని సీఎస్ఈ పేర్కొంది. అందుకే ద్రాక్ష, ఆపిల్స్, జామ, రేగుపండ్లు, మామిడి , పీచ్, పియర్ వంటి పండ్లనూ, వాటితో పాటు కొన్ని కూరగాయలను కడిగే విధానాన్ని అది సూచిస్తోంది. పండ్లను ఆరోగ్యకరంగా కడగటం ఎలాగంటే... నీళ్లు 90 శాతం, తెల్ల వెనిగర్ 10 శాతం తీసుకుని, అందులో మనం తినదలచుకున్న పండ్లను కాసేపు ఉంచి, ఆ తర్వాత నల్లానుంచి జారుతూ ఉన్న ఫ్రెష్ వాటర్ ప్రవాహంలో వాటిని కడగడం వల్ల చాలావరకు రసాయనాలు శుభ్రం అవుతాయని పేర్కొంటోంది సీఎస్ఈ. అంతేకాదు... ఇలా నల్లా నుంచి జారే నీటి వల్ల (అంటే రన్నింగ్ వాటర్ కింద) పండ్లను కడిగే సమయంలో పండుపై ఏదైనా గుంటలు, ఇరుకు చారల వంటి ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన రసాయనాలూ, కడుక్కుపోయి, కొట్టుకుపోతాయని పేర్కొంటోంది ఆ సంస్థ. మరో మార్గం ఇలా... ఒక బౌల్లో నాలుగు వంతుల నీరు, ఒక వంతు వెనిగర్ తీసుకొని అప్పటికే కచ్చాపచ్చాగా కడిగిన పండ్లను, కూరగాయలను అందులో ఉంచాలి. మనం తినాలనుకున్న పండ్లను అందులో దాదాపు 30 – 60 నిమిషాల పాటు ఉంచి మళ్లీ వాటిని రుద్దుతూ (రిన్సింగ్ చేస్తూ) కడగాలి. ఆ తర్వాత జర్రున జారుతున్న నీటి ప్రవాహంలో మళ్లీ కడగడం సురక్షితం అంటున్నారు నిపుణులు. కొన్ని పెద్దసైజు పండ్ల మీద మరి ఎక్కువ రసాయన అవశేషాలు ఉన్నాయని అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్సోడాలను ఒక కప్పు నీళ్లలో కలిపి... ఆ మిశ్రమాన్ని పండుపై వేసి రుద్దుతూ శుభ్రం చేయాలి. అలా రుద్దిన ఆ పండును నీటి ప్రవాహం కింద ఉంచి, పండుపై పేరుకున్న లెమన్‌జ్యూస్, బేకింగ్‌సోడాల జడ్డిమిశ్రమం కొట్టుకుపోయే వరకు కడగాలి. ఇలా చేయడం వల్ల పండుపై ఉన్న రసాయనాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. మొత్తం ఒకే కట్టగా ఉపయోగించే వాటిని కడగడం ఇలా... కొత్తిమీర, కర్వేపాకులను సాధారణంగా మొత్తం కట్టకట్టనంతా ఒకేసారి కడుగుతుంటారు. ఇలా కడిగే వాటిని నీరు నిండి ఉన్న బౌల్లో రెండు మూడుసార్లు తిప్పుతూ కడగాలి. ఆ తర్వాత పేపర్ టవల్‌తో తుడవాలి. కొలరాడో స్టేట్ యూనివర్సిటీ వారి అధ్యయనం ప్రకారం ఇలాంటి వాటిని కడగడానికి ఉపయోగించే నీటిలో కాస్తంత నిమ్మరసం, కొంత వెనిగర్ వేయడం వల్ల కట్ట మీది బ్యాక్టీరియా, ఈ–కొలై శుభ్రంగా కడుక్కుపోవడంతో పాటు కట్టకు కాస్తంత కొత్త రుచి కూడా వస్తుంది. ఇక నేరేడు, బెర్రీపండ్ల వంటి వాటిని వెనిగర్ సొల్యూషన్‌లో కడగాలి. మనం షాపింగ్ చేస్తున్నప్పుడే పండుపై దెబ్బలేని వాటిని ఎంపిక చేయాలి. గిన్నెలను కడగడం ఎలా? మనం ఆహారపదార్థాలు, కూరగాయలు, ఆకుకూరలను పెట్టుకునే గిన్నెలు, బౌల్స్‌ను వేడినీళ్లతోనూ, డిటెర్జెంట్తోనూ మొదట కడగాలి. ఆ డిటర్జెంట్ తాలూకు సబ్బు పూర్తిగా కడుక్కుపోయేలా మళ్లీ మంచినీళ్లతో ఈసారి చల్లటి నీళ్లతో కడగాలి. ఆ తర్వాతే మనం శుభ్రం చేసుకున్న కూరగాయలను ఆ గిన్నెలలో పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు గిన్నెలు లోహంతో చేసినవి కాకుండా, పింగాణీవి అయితే అవీ శుభ్రంగా ఉంటాయి. శుభ్రపరచిన, కోసిన కూరగాయలూ మళ్లీ అపరిశుభ్రమయ్యే అవకాశాలు తక్కువ. మట్టి కింద ఉండే దుంపల్ని శుభ్రం చేయడమిలా... ∙మట్టి కింద ఉండే బంగాళదుంప (ఆలుగడ్డ), క్యారట్ వంటి వాటని వెంటనే శుభ్రపరచకుండా కొద్దినిమిషాల పాటు నీళ్లలో నాననివ్వాలి. వాటిని ఎలాగూ చెక్కుతీసి వాడినప్పటికీ, నాననిచ్చిన తర్వాత కోసే ముందుగా ధారగా పడే నీళ్లలో కడగాలి. ∙కాలిఫ్లవర్, బ్రకోలీ లాగా ముడుతలు ముడుతలుగా ఉండి, ఆ ముడుతల్లో మట్టి చేరే అవకాశమున్న పువ్వుకూరలను కాసేపు నీళ్లలో నాననివ్వాలి. ఆ తర్వాత నీళ్లు కారిపోయేలా రంధ్రాలుండే పాత్ర (కొలాండర్)లోకి వాటిని తీసుకోవాలి. ∙కాయగూరల పైపొర చెక్కు తీసేలా ఉండే పొట్లకాయ, బీరకాయ, సొరకాయ వంటివాటిని పైనుంచి ధారగా పడుతున్న నీటిలో ఒకటికి రెండుసార్లు కడిగిన తర్వాతే కోయాలి. ∙ఇటీవల పుట్టగొడుగులను కూరగాయలుగా వాడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. వీళ్లకోసం మష్రూమ్ బ్రష్ అనే ఉపకరణం అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని చల్లటి నీటిలో కడగాలి. ఆ తర్వాత పేపర్ టవల్‌తో శుభ్రం చేయాలి. ∙కూరగాయలలో వంకాయలను కోసే పద్ధతి కాస్త వేరుగా ఉంటుంది. ముందుగా వంకాయలను ధారగా పడుతున్న నీటిలో కలగాలి. ఆ తర్వాత కాస్తంత వాటిని కాస్తంత నిమ్మనీరు, కాస్తంత ( 2 శాతం) చింతపండు నానేసిన నీరు, కాస్తంత ఉప్పు, 4 శాతం అసిటిక్ ఆసిడ్ ద్రవాలను ఒక పెద్ద పాత్రలోని నీళ్లలో కలిపి, ఆ ద్రవంలో ఒక్కొక్క వంకాయను విడివిడిగా కడగాలి. దీనివల్ల వంకాయల మీద చల్లి ఉన్న క్రిమిసంహారకాలు కడుక్కుపోతాయి లేదా నిర్వీర్యమవుతాయి. ∙పుచ్చకాయ, కర్బూజకాయ లాంటి వాటిని ధారగా పడుతున్న నీటికింద కడుగుతూ మెత్తటి కుచ్చులున్న వెజిటబుల్ బ్రష్‌తో శుభ్రంగా కడిగాకే, ముక్కలుగా కోయాలి. మరికొన్ని పండ్లు/కూరగాయలు.... వాటిని శుభ్రపరిచే విధానాలు వేర్వేరు వెజిటబుల్స్ శుభ్రపరిచే పద్ధతులివి... ∙చిన్న కాడకు అంటి ఉండే పండ్లను బాగా శుభ్రం చేశాక... మురికి పేరుకునే అవకాశాలు ఎక్కువగా కాడ వద్ద ఉంటాయి. కాబట్టి ఇలా కాడ ఉన్న పండ్లను శుభ్రం చేశాక అటు కాడ, ఇటు కాడకు రెండోవైపున చెక్కు తీసినట్లుగా కత్తితో కోయడం మేలు. ఈ నియమం ఆపిల్, పియర్ పండు, పీచ్ పండ్లకు వర్తిస్తుంది. ∙మందంగా ఉండే తోలు ఉన్న పండ్లు (ఉదాహరణకు నారింజ, కమలాలు) తినబోయే ముందు, మనం ఎలాగూ పండు తోలును తినకపోయినా.. ఒక్కసారి తేలిగ్గా కడగడం మేలు. ∙ఇక పాలకూర, లెట్యూజ్, కొత్తిమీర, కరివేపాకు, క్యాబేజీ లాంటి వాటిని శుభ్రం చేసే ముందర వాటిని నల్లా/కొళాయి కింద ప్రవహించే నీళ్ల కింద కాసేపు ఉంచి, శుభ్రం చేయడం మంచిది. క్యాబేజీ లాంటివి శుభ్రం చేసే సమయంలో వాటి పైన ఉన్న ఆకులు ఒకటి రెండు పొరలను తీసేయడం వల్ల మిగతాదంతా శుభ్రంగా ఉంటుంది. ∙ఆకుకూరల్ని శుభ్రంగా కడిగాక వాటిపై నీళ్లు ఆరేలా కాసేపు ఆగాలి. ఆ తర్వాత శుభ్రమైన టీ టవల్‌తో వాటిని తుడవాలి. అప్పుడే వాటిని కోయాలి. అంతేగానీ ఆకుకూరల్ని కోశాక వాటిని కడగడం సరికాదు. అలా చేయడంవల్ల పోషకాలు కోల్పోతాం. సలాడ్స్‌గా చేయదలచిన ఆకుకూరలను, కాయగూరలను ఇంటికి తెచ్చిన వెంటనే కడిగి సలాడ్స్‌గా కోసుకోవాలి. – సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్ -
ద్రాక్ష పండ్లు, మంచి నిద్రతో మాతృత్వం
సంతానానికి నోచుకోని మహిళలకు ఇదో శుభవార్త. కంటినిండా నిద్రపోవడం, వీలైనంత ఎక్కువగా ద్రాక్ష పండ్లు తినడం ద్వారా కడుపు పండేందుకు అవకాశాలు మెరుగవుతాయని అంటున్నారు సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. మహిళలను బాధించే ఎండోమెట్రి యోసిస్కు సంబంధించిన అవగాహనలో మార్పు ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామంటున్నారు. విపరీతమైన కడుపునొప్పి, నెలసరి సక్రమంగా లేకపోవడం ఎండోమెట్రియోసిస్ లక్షణాల్లో కొన్ని. గర్భం ధరించాలంటే పక్వదశలో ఉన్న అండాలను విడుదల చేయాల్సి ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ కారణంగా అండాలు పక్వదశకు చేరకుండానే విడుదలవుతున్నట్లు తాజా పరిశోధనలో తెలిసింది. ఫాలికల్స్‌లో ఉండే ద్రవాల కారణంగా అండాలు దెబ్బతింటున్నట్లు వీరు గుర్తించారు. ఈ ద్రవాల కారణంగా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ (ఆర్వోఎస్) రసాయనాల ఉత్పత్తి జరుగుతుందని, ఇవి అండాల్లోని డీఎన్ఏను దెబ్బతీస్తాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న పరిశోధకుడు డాక్టర్ సైమన్లేన్ తెలిపారు. ద్రాక్ష పండ్లతోపాటు బ్లూబెర్రీలు, వేరుశనగలోనూ ఉండే యాంటీ యాక్సిడెంట్ రిస్వెరట్రాల్, మంచి నిద్రతో శరీరానికి చేరే మెలటోనిన్ల ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చునని తాము ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా తెలుసుకున్నామని వివరించారు. -
సామాన్యులకు 'అందని ద్రాక్ష'..!
జపాన్ః మనకు అందని ఎత్తులో ఉన్న ఏ విషయానికైనా 'అందని ద్రాక్ష' సామెతను ఉదహరిస్తుంటాం. కానీ జపాన్ లోని ఓ దుకాణందారుడు నిజంగా సామాన్యులకు అందని ద్రాక్షనే తన దుకాణంలో ప్రదర్శనకు పెట్టాడు. ఓ అరుదైన జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని ఏకంగా లక్షల రూపాయలు వెచ్చించి వేలంలో దక్కించుకోవడమే కాదు... వాటిని తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి వచ్చినవారికి రుచి చూపించి ఇప్పుడు జపాన్ లోనే వార్తల్లో వ్యక్తిగా మారాడు. పాశ్చాత్య ప్రపంచంలో అరుదైన వైన్ కు ఎటువంటి గుర్తింపు ఉంటుందో అలాగే జపాన్ లో అరుదైన, ప్రత్యేకత కలిగిన పళ్ళను కొనుగోలు చేయడం, వినియోగించడం వారి హోదాకు గుర్తుగా భావిస్తారు. అదే నేపథ్యంలో జపాన్ లోని ఓ కిరాణా దుకాణం యజమాని రూబీ రోమన్ జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని సుమారు 8 లక్షల రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు. అది తనకు గౌరవంగా భావించడమే కాదు... అలా లక్షలు పోసి కొన్న ద్రాక్షను ప్రదర్శనకు పెట్టి, అందరికీ ఉచితంగా రుచి చూపించాడు. ఆస్పత్రులను సందర్శించేప్పుడు, వివాహాలు, వేడుకల సందర్భాల్లో నాణ్యత కలిగిన, అరుదైన, రుచికరమైన పళ్ళను అందించడం జపాన్ సంప్రదాయాల్లో ఒక భాగమే కాక, హోదాగా కూడా భావిస్తారు. అందుకే అక్కడ అటువంటి ఖరీదైన పళ్ళను అమ్మేందుకు ప్రత్యేక దుకాణాలు కూడ ఉంటాయి. ప్రత్యేక పద్ధతుల్లో పండించిన, ఉత్పత్తి చేసిన పళ్ళ జాతులను ఆ యా దుకాణాల్లో అందుబాటులో ఉంచుతారు. అటువంటి పళ్ళను కొని, ఇతరులకు బహుమతిగా ఇవ్వడం కొనుగోలుదారులు సైతం హోదాగా భావిస్తారు. ఈ సీజన్ లో ప్రత్యేకంగా పండించిన రూబీ రోమన్ జాతికి చెందిన 30 ద్రాక్ష పళ్ళను కొన్నవాళ్ళలో జపాన్ లోనే తకమారూ కొనీషీ మొదటివాడు. పింగ్ పాంగ్ బంతుల సైజులో ఉన్న ఆ ద్రాక్ష.. నిజంగా రూబీ రోమన్ రత్నాల్లా ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నాడు. అందుకే తాను సుమారు 8 లక్షల రూపాయలను వెచ్చించానని, తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి, అందరికీ రుచి చూపిస్తున్నానని గర్వంగా చెప్తున్నాడు. జపాన్ సముద్ర తీరంలోని ఇషికవ ప్రాంతంలో ఈ రూబీ రోమన్ జాతిని ఫిజిమోరీ వెరైటీ విత్తనాలతో మొదటిసారి 1992 లో పండించారు. ఈ ద్రాక్ష ఒక్కోటి కనీస బరువు 20 గ్రాములు ఉండటంతోపాటు, రసంలో 18 శాతం చక్కెర పాళ్ళు కలిగి ఉంటుంది. ఈ అరుదైన జాతి ద్రాక్షను మొదటిసారి 2008 లో జపాన్ పండ్ల మార్కెట్లో వేలానికి పెట్టారు. అయితే అప్పట్లో నిజంగానే అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా దాని ధర కూడ ప్రపంచంలోని ద్రాక్ష పళ్ళ మార్కెట్లలోనే అత్యధిక ధర పలికింది. అంతేకాదు అత్యంత అరుదైన, ఖరీదైన ద్రాక్షగా కొత్త రికార్డు సృష్టించింది. అయితే వేలంలో రూబీ రోమన్ ద్రాక్షను పొందటం నాకెంతో ఆనందంగా ఉందని, ప్రత్యేక గౌరవం లభించినట్లుగా ఉందని కొనిషీ చెప్తున్నాడు. తన దుకాణానికి వచ్చిన కొనుగోలుదారులు రుచి చూడటంతోపాటు, కొందరు ఇతర వ్యాపారులు శాంపిల్ గా కూడ ఈ ద్రాక్షను తీసుకెళ్ళారని చెప్తున్నాడు. ఒక్కోటి సుమారు 25 వేల రూపాయల ఖరీదు చేసే ఆ పళ్ళను కొనిషీ జనానికి ఎలా ఉచితంగా ఇచ్చాడో తెలియదు కానీ, అతడి దుకాణం దగ్గర శాంపిల్స్ కోసం, రుచికోసం జనం క్యూ కట్టడం మాత్రం పెద్ద ఈవెంట్ గా మారిపోయింది. పత్రికలు, మీడియా లో ప్రత్యేక వార్తా కథనం అయిపోయింది. కాగా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన అరుదైన జాతి ద్రాక్షను అందరికీ పరిచయం చేసి, తన అమ్మకాలను పెంచుకొనేందుకు సదరు వ్యాపారి ఆ మార్గం ఎంచుకొన్నాడా అన్న అనుమానం కూడా కలుగుతోంది. -
పండ్లతో క్లెన్సింగ్...
- రెండు ద్రాక్ష పండ్లను తీసుకొని సగానికి కోయాలి. ఆ ముక్కలతో ముఖం, మెడ, భుజాలను రబ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇది మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఎండవేడి నుంచి ఉపశమనం లభించడమే కాదు, రక్తప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా చర్మకాంతి పెరుగుతుంది. - పుచ్చకాయ ముక్కలు కప్పు, రెండు టేబుల్ స్పూన్ల నీరు కలిపి బ్లెండ్ చేయాలి. తర్వాత వడకట్టుకోవాలి. దూదిని ఈ రసంలో ముంచి ముఖమంతా రాసుకొని ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. మేకప్ చేసుకోవడానికి ముందు పుచ్చకాయ రసం రాసుకుంటే చర్మానికి మంచి క్లెన్సింగ్‌లా ఉపయోపడుతుంది. ముఖం ఎక్కువ సేపు తాజాగా కనిపిస్తుంది. - కివీ(సూపర్మార్కెట్లో లభిస్తుంది) పండు గుజ్జులో టేబుల్ స్పూన్ పెరుగు, టీ స్పూన్ బాదం నూనె, టీ స్పూన్ తేనె, రెండు చుక్కల ఆరెంజ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ మలినాలను తొలగిస్తుంది. చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. - పసుపులో ఆరెంజ్ జ్యూస్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని మృదువుగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. మృతకణాలు, మురికి తొలగిపోయి చర్మకాంతి పెరుగుతుంది. మొటిమలు, మచ్చల నివారణకు కూడా ఇది మేలైన ప్యాక్. -
వర్ణం: గేమ్ ‘స్పిరిట్’
స్పెయిన్‌లో స్వతంత్ర ప్రతిపత్తిగల ‘ల రియోజా’ ప్రాంతంలోని దృశ్యం ఇది. అక్కడి నేలలో ద్రాక్షలు విరివిగా పండుతాయి. అందుకే వైన్ తయారీకి ప్రసిద్ధి గాంచింది. ‘పంట’ చేతికొచ్చాక ‘లా బ్యాటలా డెల్ వినో డె హరో’ జరుగుతుంది. ‘వైన్ యుద్ధం’గా పిలిచే ఈ వేడుకలో స్థానికులు, యాత్రికులు సంబరంగా పాల్గొంటారు. బొమ్మ తుపాకులతో లీటర్లకొద్దీ వైన్‌ను దేహపుపాలు చేస్తారు. అదొక రకం మజా! తోపుడు బైక్ నిత్య రణరంగంగా ఉండే దేశం కాంగోలో రవాణాకు ఉపయోగిస్తున్న కర్ర వాహనం ఇది! దీన్ని షుకుడు అని పిలుస్తున్నారు. కిలోలకొద్దీ కూరగాయలు, నేలబొగ్గు లాంటివాటిని మోసుకెళ్లడానికి తరుణోపాయంగా ఇది రూపొందింది. అక్కడి గోమా నగరంలోని దృశ్యం ఇది. కీలెరిగి... ఒక మనిషిని చాలా పద్ధతిగా కాల్చుతున్నట్టు లేదూ! ఇది చైనాలో చేసే ఫైర్ థెరపీలో భాగం. వైద్యుడు రోగి ఒంటిమీద మద్యాన్ని పోసి ‘అంటిస్తాడు’. అది శరీరం లోపలి ‘చలి’ని తొలగిస్తుందట. కొన్ని రకాల రుగ్మతలకు ఈ ప్రాచీన మంట వైద్యం చక్కగా పనిచేస్తుందని చెబుతారు. అందుకే చైనాలో ఇది కోట్లాది రూపాయల వ్యాపారం కూడా! -
మామిడి మధురం.. చేదు నిజం..!
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : మామిడి, అరటి, బొప్పాయి, సపోట, ద్రాక్ష, దానిమ్మ ఇలా అనేక రకాల పండ్లు కాలాలకు అనుగుణంగా ఆరగిస్తే ఆరోగ్యానికి మంచిది. శరీర ఎదుగుదలకు, పరిపుష్టికి దోహదపడుతాయి. అన్ని కాలాలలో దొరికేది అరటి. వేసవి కాలంలో దొరికేది మాత్రం మామిడి. అయితే పండ్ల వ్యాపారులు కాసులకు కక్కుర్తి పడి చెట్టుమీద కాయలు పండకుండానే కోసి మాగపెడుతున్నారు. తొందరగా పండటం కోసం కాల్షియం కార్భైట్, పొగబెట్టి మాగబెట్టడం వంటి చర్యలతో కాయలను పండ్లుగా మారుస్తున్నారు. అనంతరం బహిరంగ మర్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ సిద్ధంగా పండిన పండ్లలో ప్రక్టోజ్, గ్లూకోజ్, కొవ్వు, ప్రొటీన్లు ఉంటాయి. శరీరం నీరసించిపోయినప్పుడు ఇవి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మలబద్ధకం, ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడుతాయి. కృత్రిమంగా మాగబెట్టిన పండ్లలో ఇవి ఉండవు. కాగా, ఆరోగ్యానికి హానికరం. జిల్లాలో ప్రధానంగా మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, చెన్నూర్, కాగజ్‌నగర్ ప్రాంతాల్లో మామిడి వ్యాపారం జరుగుతాయి. ఏటా రూ.11 కోట్ల మామడి పండ్ల వ్యాపారం జరుగుతుంది. మామిడిని ఎలా మాగ పెడతారంటే.. మామిడి పండ్లను కొనుగోలు చేయడం వ్యాపారులకు ఆర్థికంగా పెట్టుబడి ఎక్కువ కావడంతో కాయలను ఎంచుకుంటున్నారు. మామిడి తోటల్లో కాయలు, గాలి దుమారంకు కింద పడిన కాయలను తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాములకు తరలిస్తారు. గ్యాస్ వెల్డింగ్‌కు వినియోగించే కాల్షియం కార్బైట్‌ను కొనుగోలు చేస్తారు. ఈ రసాయనాన్ని పొట్లాలుగా మారుస్తారు. 20 కిలోల మామిడి కాయల బాక్స్‌లలో, నేలపై రాశులుగా వేసిన కాయల మధ్య ఐదు నుంచి 50 వరకు కార్బైట్ పొట్లాలను మధ్య మధ్యన పెడతారు. ఆ కార్బైట్ గుళికలు పౌడర్‌గా మారి వేడి పుట్టిస్తుంది. ఆ రసాయనాల ప్రతిచర్యతో ఉష్ణోగ్రత పెరిగి కాయలు పండ్లుగా మారుతాయి. నాలుగు రోజులపాటు బాక్స్‌లలో, నేల మీద రాశులుగా ఉన్న మామిడికాయలు పండ్లుగా మారతాయి. పూర్తి పచ్చదనంలోకి వచ్చి మామిడి ప్రియుల నోర్లు ఊరించేలాగా మారుతాయి. అలా తయారైన మామిడి పండ్లను మార్కెట్లోకి రిటైల్ అమ్మకం దారులకు విక్రయిస్తారు. అలా చేతులు మారిన మామిడి పండ్లు మామిడి ప్రియుల చేతికి చేరి కడుపులోకి వెళ్లి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. గ్యాస్ ద్వారా పండ్లుగా మార్చడం మరో పద్ధతి గ్యాస్ ద్వారా కూడా మామిడి కాయలను పండ్లుగా మార్చడం కొత్త పద్ధతి. గతేడాది మంచిర్యాలలో ప్రారంభమైంది. కాల్షియం కార్బైట్ తక్కువ ఖర్చుతో పండ్లుగా మార్చే వీలున్నప్పటికి పెద్ద మొత్తంలో పండ్లుగా మారడం సాధ్యం కాదు. దాంతో కూలింగ్ స్టోర్ విధానం ద్వారా కాయలను పండ్లుగా మారుస్తున్నారు. ఒకేసారి 8 వేల కిలోల వరకు కాయలను పండ్లుగా మార్చే సౌలభ్యం కూలింగ్ స్టోర్‌లో ఉంటుంది. ఇథిలేన్ అనే గ్యాస్‌ని కూలింగ్ స్టోరేజ్‌లోకి పంపుతారు. పగలంతా కూలింగ్, రాత్రి వేళ మాత్రమే గ్యాస్‌ను స్టోర్‌లోకి విడుదల చేస్తారు. అలా రసాయనాల ప్రభావంతో నాలుగు రోజుల్లోనే కాయలు పండ్లుగా మారతాయి. ఒక మామిడిపండే కాకుండా అరటికాయలను కూడా పండ్లుగా మారుస్తున్నారు. పండ్లను మాగ పెట్టడానికి కూలింగ్ స్టోరేజ్‌లు పెట్టడానికి రూ.25 లక్షల నుంచి రూ.30 వరకు వ్యయం చేస్తున్నారంటే లాభాలు ఎలా ఉన్నాయో తేట తెల్లం అవుతుంది. అమలు కాని నిషేధం బహిరంగ మార్కెట్లో కార్బైట్ విచ్చలవిడిగా దొరుకుతోంది. కిలో విలువ రూ.80 ఉంటుంది. దీనిని స్టీలు రంగు మార్చేందుకు, వెల్డింగ్ కోసం ఉపయోగిస్తారు. పండ్లపై వీటి వాడకాన్ని నిషేధించిన అమలుకావడం లేదు. వ్యాపారులు గోదాముల్లో కార్బైన్‌ను వినియోగించి మాగబెడుతున్నా పట్టించుకోవడం లేదు. వీటి వాడకాన్ని తగ్గిస్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వారు అవుతారు. అధికారుల నిర్లిప్తతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఏటా రూ.కోట్ల వ్యాపారం చేస్తున్నారు.