Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా | Health Benefits Of Raisin Water | Sakshi
Sakshi News home page

Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా

Published Thu, May 23 2024 12:52 PM | Last Updated on Thu, May 23 2024 1:06 PM

Health Benefits Of Raisin Water

ప్రస్తుత ఆహార అలవాట్లు, జీవన శైలి మార్పులు కారణంగా చాలామంది  చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో అధిక బరువు. అధిక బరువు అనేక ఆరోగ్యసమస్యలకు మూలం. అందుకే  బరువు తగ్గించుకునేందుకు   చేస్తున్న  ప్రయత్నాలు అన్నీ ఇవ్నీ కావు. ఆరోగ్యకరమైన ఆహారం,  వ్యాయామం చేస్తున్నారు.  వీటితోపాటు కొన్ని రకాల సింపుల్ చిట్కాలతో వెయిట్ లాస్ కావచ్చు అని నిపుణులు అంటున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి. ఎండు ద్రాక్ష నీరు ఎంతో మేలు చేస్తుంది. ఈ వాటర్‌ తాగడం వల్ల  ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.


ఎండు ద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని, ద్రాక్షతోకలిపి తీసుకోవడంతో వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నమ్ముతారు.  ప్రధానంగా ఎండుద్రాక్షలో ఉండే పోషకాలు , యాంటీఆక్సిడెంట్లు అందుతాయి.

ఎండు ద్రాక్ష వాటర్‌, ప్రయోజనాలు 

శరీరంలోని మలినాలు బయటకు వెళ్తాయి. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. శరీరం ఫ్రీ రాడికల్సతో పోరాడే శక్తినిస్తుంది. బరువు పెరగడం, నిద్రలేమి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

మెరుగైన జీర్ణక్రియ: ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికలను మెరుగుపర్చి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. తద్వారా  జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది. 

రోగనిరోధక శ‍క్తి:  విటమిన్ సీ,  బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఫినాలిక్ సమ్మేళనాలు  రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. 

రక్తపోటు,గుండెపోటు: బీపీ,  హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎండుద్రాక్షలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది సోడియం స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే డైటరీ ఫైబర్ పాలీఫెనాల్స్‌ను కూడా  ఇందులో లభిస్తాయి.

చర్మ,నోటి సమస్యలు : ఐరన్‌ ఎక్కువగా లభిస్తుంది. రక్తహీనతకు  ఇది చాలామంది. ఎండుద్రాక్షలో కాల్షియం, బోరాన్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చర్మ ఆరోగ్యానికి కీలకమైన విటమమిన్ ఏ, ఈ ఇందులో లభిస్తాయి. 

రెగ్యులర్‌గా వీటిని తీసుకుంటే ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. వృద్ధాప్య ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్  కావిటీస్ , చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే నోటి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి.

ఈ ఎండు ద్రాక్ష నీటిలో పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఉన్న ద్రవాల స్థాయిలను అందుపులో ఉంచుతాయి. ముఖ్యంగా ఈ వేసవిలో చెమట కారణంగా కోల్పోయిన  శక్తి తిరిగి  లభిస్తుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement