
పండరీపూర్ వ్యవసాయ మార్కెట్‌లో ఒకేరోజు 17 టన్నుల విక్రయం
సోలాపూర్: పండరీపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో శనివారం రికార్డుస్థాయిలో 17 టన్నుల ఎండుద్రాక్ష విక్రయం జరిగింది. పండరీపురం తాలూకా నాణ్యమైన ఎండుద్రాక్ష ఉత్పత్తికి ప్రస్ధిద్ధి. అందుకే ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పుణే తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడి ఎండు ద్రాక్షను కొనేందుకు ఆసక్తిని చూపుతారు. ఈ నేపథ్యంలో పండరీపురం మార్కెట్‌లోని స్వప్నిల్ కొటాడియా దుకాణంలో పండరీపురం తాలూకా, భారడీ గ్రామానికి చెందిన రైతు ఆకాష్ వసెకర్‌కు చెందిన ఎండుద్రాక్ష పంటను కిలోకు రూ. 511 చొప్పున 17 టన్నుల మేర కొనుగోలు చేశారు. సాధారణంగా కిలోకు 200–500 మాత్రమే పలికే ఎండుద్రాక్షను అధిక ధరకు, పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు రైతు ఆకాష్ వసెకర్‌ను యూటోపియన్ కార్ఖానా చైర్మన్ ఉమేష్ పరిచారక్ మార్కెట్ కమిటీ చైర్మన్ హరీష్ గైక్వాడ్ సన్మానించారు.
ఎండు ద్రాక్షతోఉపయోగాలు : ఎండుద్రాక్షల వలన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, శక్తిని అందిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఎండుద్రాక్షలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ పుష్కలంగా ఉంటాయి కనుక తక్షణ శక్తిని అందిస్తాయి. ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలుపుష్కలంగా లభిస్తాయి.ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
ఎండుద్రాక్షలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది , మలబద్ధకాన్ని నివారిస్తుంది.
ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి.
చర్మంపై మొటిమలు, ముడతలు, వృద్ధాప్యం వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇనుము రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.
వీటిని నీటిలో నానబెట్టి తాగడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది.
ఎండుద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్లు నిద్రలేమికి ఉపశమనం కలిగిస్తుంది
ఎండుద్రాక్షలో ఇనుము ఉంటుంది, ఇదిచేయడానికి సహాయపడుతుంది.
ఎలా ఉపయోగించాలి?
మీరు ఎండుద్రాక్షను నేరుగా తినవచ్చు, ఎండుద్రాక్షను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తాగవచ్చు, ఎండుద్రాక్షను పాలలో కలిపి తాగవచ్చు, ఎండుద్రాక్షను వివిధ వంటకాలలో కూడా ఉపయోగించవచ్చు.
చదవండి: వైష్ణో దేవి ఆలయం వద్ద వెర్రి వేషాలా? అడ్డంగా బుక్కైన ‘ఓర్రీ’
60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్
గమనిక: ఎండుద్రాక్షను మితంగా మాత్రమే తినాలి. గర్భవతి అయితే, లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ఎండుద్రాక్షను తినే ముందు మీ డాక్టర్ని సంప్రదించాలని చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment