record sales
-
ఏసీ కంపెనీలకు కలిసొచ్చిన వేసవి
ముంబై: వేసవిలో ఠారెత్తించిన ఎండలు ఏసీ తయారీ కంపెనీలకు కాసుల వర్షం కురిపించాయి. ఎండ తీవ్రతతో ఉక్కపోత, వేడిమి తట్టుకోలేక ప్రజలు భారీగా ఏసీలను కొనుగోలు చేశారు. ఏప్రిల్ – జూన్ క్వార్టర్లో రికార్డు స్థాయి విక్రయాలు జరగడంతో వోల్టాస్, బ్లూ స్టార్, వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా, జాన్సన్ హిటాచి, హావెల్స్ కంపెనీల ఆదాయాలు రెండింతలు పెరిగాయి. నికరలాభాలు రెండురెట్ల వృద్ధి నమోదు చేశాయి. రూం ఏసీల వార్షిక విక్రయాలు 14 మిలియన్లకు చేరొచ్చని కన్జూమర్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్స్ మానుఫ్యాక్చరర్స్(సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ సునీల్ వచానీ తెలిపారు. → టాటా గ్రూప్ వోల్టాస్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 10 లక్షల ఏసీలను విక్రయించింది. మొత్తం ఆదాయం రూ.5 వేల కోట్లు సాధించింది. ఇదే క్యూ1లో నికరలాభం రెండు రెట్లు పెరిగి రూ.335 కోట్లుగా, నిర్వహణ ఆదాయం 46% ఎగసి రూ.4,921 కోట్లుగా నమోదైంది. మొత్తం ఏసీ మార్కెట్లో ఈ సంస్థ 21.2 శాతం వాటాతో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. → తొలి క్వార్టర్లో బ్లూ స్టార్ నికర లాభం రెండురెట్లు పెరిగి రూ.168.76 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. నిర్వహణ ఆదాయం 28.72 శాతం ఎగసి రూ.2,865 కోట్లుగా నమోదైంది. దేశవాప్తంగా ఎండల తీవ్రత నేపథ్యంలో ఏసీల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత ఏడాదితో పోలి్చతే ఈ వేసవిలో ఏసీల అమ్మకాలు రెట్టింపు అయ్యాయని బ్లూ స్టార్ అధికారి ఒకరు తెలిపారు. → వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా నికరలాభం 89.4 శాతం పెరిగి రూ.145.3 కోట్లకు చేరింది. నిర్వహణ అదాయం 22.5% ఎగసి రూ.2,496.9 కోట్లకు చేరింది. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజరేటర్లకు డిమాండ్ భారీగా పెరగడంతో పరిశ్రమతో పోలిస్తే తమ కంపెనీ ఆదాయ వృద్ధి అధికంగా ఉందని కంపెనీ తెలిపింది. → లాయిడ్స్ బ్రాండ్ ఏసీ విక్రయాల ద్వారా రూ.67.39 కోట్ల నికరలాభాన్ని ఆర్జించినట్లు హావెల్స్ ప్రకటించింది. ఈ క్యూ1లో లాయిడ్ బ్రాండ్ విక్రయాలు రూ. 1,929 కోట్లకు చేరా యి. కంపెనీ మొత్తం ఆదాయంలో ఏసీల విక్రయ వ్యాపారం ద్వారా అధిక భాగం సమకూరిందని త్రైమాసిక ఫలితాల సందర్భంగా హావెల్స్ యాజమాన్యం చెప్పుకొచి్చంది. → హిటాచి బ్రాండ్లతో గృహ వినియోగ ఏసీల విక్రయించే జాన్సన్ కంట్రోల్స్ జూన్ క్వార్టర్ ఆదాయం 76% పెరిగి రూ.982 కోట్లకు చేరింది. వాణిజ్య విభాగంలోనూ చెప్పుకొదగిన అమ్మకాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది. -
‘రియల్’ రికార్డ్!! ఒక్క రోజులోనే 2,000 ఇళ్లు సేల్..
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇళ్ల అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది. బెంగళూరులో ప్రాజెక్ట్ ప్రారంభించిన మొదటి రోజే 2,000 పైగా ఇళ్లను విక్రయించింది. దీంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ షేర్లు రికార్డు లాభాలను అందుకున్నాయి.ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్-బుడిగెరె క్రాస్‌లోని గోద్రేజ్ వుడ్స్కేప్స్లో రూ. 3,150 కోట్ల విలువైన ఇళ్లను విక్రయించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ తెలిపింది. గోద్రెజ్ వుడ్‌స్కేప్స్ అనేది విలువ, అమ్మకాల వాల్యూమ్ల పరంగా తమ "అత్యంత విజయవంతమైన" లాంచ్ అని గోద్రెజ్ ప్రాపర్టీస్ ఫైలింగ్ తెలిపింది. గత నాలుగు త్రైమాసికాలలో ప్రారంభంలోనే రూ. 2,000 కోట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసిన కంపెనీ ఆరో ప్రాజెక్ట్ ఇది.బెంగళూరులో గోద్రెజ్ వుడ్‌స్కేప్స్ విజయంతో విక్రయాలలో ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే ఈ త్రైమాసికంలో 500% పైగా వృద్ధిని సాధించింది. సుమారు రూ. 3,000 కోట్ల ఆదాయ అంచనాతో పుణె, బెంగళూరులో ల్యాండ్ పార్సెల్‌లను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ చేసిన ప్రకటన తర్వాత సోమవారం గోద్రెజ్ ప్రాపర్టీస్ స్టాక్స్ కొత్త గరిష్టాలకు ఎగిశాయి. 3.23% లాభాన్ని నమోదు చేశాయి. -
మెర్సిడెస్ బెంజ్ రికార్డు విక్రయాలు..
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ, త్రైమాసికాలవారీ, పూర్తి సంవత్సరంవారీగా రికార్డు అమ్మకాలు నమోదు చేసింది. జనవరి–మార్చి త్రైమాసికంలో అత్యధికంగా 5,412 వాహనాలను విక్రయించింది. గత మార్చి త్రైమాసికంలో నమోదైన 4,697 యూనిట్లతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. ఇక ఆర్థిక సంవత్సరం వారీగా అమ్మకాలు 10 శాతం పెరిగి 16,497 యూనిట్ల నుంచి 18,123 యూనిట్లకు చేరాయి. నెలవారీ అమ్మకాలకు సంబంధించి మార్చిలో అత్యధిక స్థాయిలో విక్రయించినట్లు సంస్థ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. 30 ఏళ్ల క్రితం భారత్‌లో తాము కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇవి అత్యుత్తమ గణాంకాలని వివరించారు. 2024లో 9 కొత్త వాహనాలను ఆవిష్కరిస్తున్నట్లు, వీటిలో 3 బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు చెప్పారు. -
ఇళ్ల అమ్మకాలు పెరిగాయ్
ముంబై: బలమైన డిమాండ్ కొనసాగడంతో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఇళ్ల అమ్మకాలు 14% పెరిగినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్ అనరాక్ గణాంకాలు తెలిపాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జనవరి–మార్చి మధ్య మొత్తం 1,30,170 యూనిట్లు అమ్ముడవగా., గతేడాది ఇదే కాలంలో 1,13,775 యూనిట్ల విక్రయాల జరిగాయి. ఇదే త్రైమాసికానికి సగటున ఇళ్ల ధరలు 10–32 % పెరిగాయి. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం(ఎంఎంఆర్), పూణే, బెంగళూరు, హైదరాబాద్‌లో అమ్మకాలు పెరిగాయి. ఢిల్లీ–ఎన్సీఆర్, చెన్నై, కోల్కత్తా నగరాల్లో క్షీణించాయి. ► ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇళ్ల అమ్మకాలు 24% పెరిగి 42,920 యూనిట్లు అమ్ముడయ్యాయి. పూణేలో 15% పెరిగి 22,990 యూనిట్లు, హైదరాబాద్‌లో 38% వృద్ధితో 19,660 యూనిట్లు, బెంగుళూరులో 14% అధికంగా 17,790 ఇళ్లు అమ్ముడయ్యాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్లో విక్రయాలు 9% క్షీణించి 15,650 యూనిట్లు, కోల్‌కత్తాలో అమ్మకాలు 9% తగ్గి 5,650 యూనిట్లు, చెన్నైలో ఆరుశాతం తక్కువగా 5,510 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. ‘‘ముఖ్యంగా రూ.1.5 కోట్ల; అంతకు మించి పైగా ధరలు కలిగిన ఇళ్లకు అత్యధిక డిమాండ్ కారణంగా గత పదేళ్లలో రికార్డు విక్రయాలు ఈ జనవరి–మార్చి మధ్య నమోదయ్యాయి. వినియోగదారులు, ఇన్వెస్టర్ల నుంచి బలమైన డిమాండ్‌తో అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. పెరిగిన ఇళ్ల స్థలాలు ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలను సూచిస్తున్నాయి’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. -
ఫిబ్రవరిలోనూ ‘రయ్ రయ్’
ముంబై: స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)కు ఆదరణ పెరగడంతో ఫిబ్రవరిలోనూ రికార్డు స్థాయిలో వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రాఅండ్‌మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్ కంపెనీల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. మొత్తం 3.73 లక్షల ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాలు జరిగాయి. తద్వారా పరిశ్రమ చరిత్రలో అత్యధిక పీవీలు అమ్ముడైన మూడో నెలగా ఫిబ్రవరి ఆవిర్భవించింది. ద్విచక్ర వాహనాలకూ డిమాండ్ కొనసాగింది. కాగా ట్రాక్టర్స్ అమ్మకాల వృద్ధిలో క్షీణత జరిగింది. -
దీపావళి ధమాకా!
న్యూఢిల్లీ: దేశీయంగా పండుగ సీజన్ సందర్భంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు రూ. 3.75 లక్షల కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు అఖిల భారతీయ ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) వెల్లడించింది. రాబోయే గోవర్ధన పూజ, భాయ్ దూజ్, ఛత్ పూజ వంటి పర్వదినాల సందర్భంగా మరో రూ. 50,000 కోట్ల మేర వ్యాపారం జరగవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ఈసారి దీపావళికి ఎక్కువగా దేశీయంగా తయారైన ఉత్పత్తులే అమ్ముడైనట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. చైనా ఉత్పత్తులకు రూ. 1 లక్ష కోట్ల మేర వ్యాపారం తగ్గిపోయిందని పేర్కొన్నారు. ‘గతంలో దీపావళి పండుగ సందర్భంగా అమ్మకాల్లో చైనా ఉత్పత్తుల వాటా దాదాపు 70 శాతం ఉండేది. కానీ ఈసారి దేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు ఇటు వ్యాపారవర్గాలు, అటు వినియోగదారుల నుంచి భారీగా స్పందన లభించింది‘ అని ఆయన వివరించారు. ఇలా ఖర్చు చేశారు.. కస్టమర్లు ఈ దీపావళికి ఫుడ్, గ్రాసరీపై 13 శాతం వెచ్చించారు. వస్త్రాలు, దుస్తులపై 12 శాతం, ఆభరణాలకు 9 శాతం, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్‌పై 8 శాతం, బహుమతులకు 8 శాతం, కాస్మెటిక్స్‌కు 6 శాతం ఖర్చు చేశారు. డ్రైప్రూట్స్, స్వీట్స్, నమ్కీన్ 4 శాతం, ఫర్నీషింగ్, ఫర్నీచర్ 4 శాతం, గృహాలంకరణ 3 శాతం, పూజా సామగ్రి 3, పాత్రలు, వంటింటి ఉపకరణాలు 3 శాతం, కన్ఫెక్షనరీ, బేకరీ 2 శాతం కైవసం చేసుకున్నాయి. ఆటోమొబైల్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, బొమ్మలు, ఇతర వస్తువులకు 20 శాతం వెచి్చంచారని సీఏఐటీ తెలిపింది. అన్ని విభాగాల్లోనూ జోష్.. రిటైల్‌లో అన్ని విభాగాలు మెరుగ్గా పనితీరు కనబరిచాయి. అమ్మకాల పరంగా ఆన్‌లైన్‌కు, ఆఫ్‌లైన్‌కు వ్యత్యాసం లేదని రిటైల్ రంగ నిపుణుడు కళిశెట్టి పి.బి.నాయుడు తెలిపారు. మొత్తం రిటైల్ వ్యాపారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 16 శాతం ఉందన్నారు. తెలుగు రాష్ట్రా ల్లో గతేడాదితో పోలిస్తే ఈ దీపావళికి డైమండ్ జువెల్లరీ విక్రయాలు 15–20 శాతం, బంగారు ఆభరణాలు 35 శాతం దూసుకెళ్లాయని హీరావాలా జెమ్స్, జువెల్లర్స్ ఎండీ గౌతమ్ చవాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 19,000 కోట్లపైనే.. ఇక, దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.19,000 కోట్లపైన వ్యాపార అమ్మకాలు జరిగినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా దుస్తులు, నిత్యావసర వస్తువులు, టపాసులు, గృహోపకరణాలు జరిగినట్లు తెలిపాయి. దీపావళి అంటే టపాసులతో పాటు స్వీట్లకు అత్యధిక ప్రాధాన్యత ఉండటంతో వీటికోసమే రూ.3,800 కోట్ల వరకు వ్యయం చేసినట్లు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా సగటున ప్రతి ఒక్కరు దీపావళి పర్వదినం సందర్భంగా రూ.3,500 వరకు ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయని, ఆ లెక్కన చూస్తే రాష్ట్రంలో దీపావళి సందర్భంగా రూ.19,000 కోట్లపైన మార్కెట్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
రికార్డ్ సేల్స్: మోదీ పిలుపు, ఖాదీ గెలుపు
ఖాదీ ఉత్పత్తులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మరోసారి రికార్డ్ సేల్స్ నమోదు చేసింది. గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించాలంటూ ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. దీంతో రాజధాని అక్టోబరు 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ఖాదీ భవన్లో రూ. 1.52 కోట్ల విలువైన ఖాదీ, గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తుల అమ్మకాలు జరిగాయి. ఈ రికార్డు విక్రయాలపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా చేతితో నేసిన వస్త్రాన్ని కొనుగోలు చేయడం ప్రజల చిహ్నంగా ఎలా మారిందో తెలియ జేస్తోందన్నారు. ఖాదీపై ఉన్న ఈ ప్రేమ ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తుందని, ఇది కొత్త శక్తిని ఇస్తుందని తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. సెప్టెంబరు 24న తన "మన్ కీ బాత్" కార్యక్రమంలో గాంధీ జయంతి రోజున ఖాదీని కొనుగోలు చేయాలని ప్రధాని ప్రజలను కోరారు ఫలితంగా, ఖాదీ భవన్లో ఒక్క రోజులో రికార్డు స్థాయిలో రూ.1.52 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి. గత ఏడాది గాంధీ జయంతి రోజున రూ. 1.34 కోట్లు, 2021-22లో రూ. 1.01 కోట్ల అమ్మకాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్రాండ్ పవర్‌కు ఇది నిదర్శనని KVIC (ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్) చైర్మన్ మనోజ్ కుమార్ వ్యాఖ్యానించారు. అంతేకాదు అనేక సందర్బాల్లో అంతర్జాతీయ వేదికలపై మోదీ ఖాదీ ఉత్పతులను ప్రోత్సహించాలని కోరారని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా తొలి కస్టమర్‌గా మనోజ్ కుమార్ ఖాదీ దుస్తులను కొనుగోలు చేసి UPI ద్వారా డిజిటల్ చెల్లింపును చేశారు. -
ఫిబ్రవరిలో 3.35 లక్షల వాహన అమ్మకాలు
న్యూఢిల్లీ: వ్యక్తిగత రవాణాకు బలమైన డిమాండ్ కొనసాగడంతో ఫిబ్రవరిలో 3.35 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెల విక్రయాలతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఆటో మొబైల్ రంగంలో ఇప్పటి వరకు ఫిబ్రవరిలో నమోదైన అత్యధిక టోకు అమ్మకాలు రికార్డు ఇవే కావడం విశేషం. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ ఎంఅండ్ఎం, కియా మోటార్స్, టయోటో కిర్లోస్కర్ కంపెనీలు చెప్పుకోదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. ఇదే నెలలో ద్విచక్ర విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాలు పెరిగాయి. బజాజ్ ఆటో, హోండా మోటోసైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) టీవీఎస్ మోటార్ అమ్మకాలు నిరాశపరిచాయి. వాణిజ్య వాహనాలకు గిరాకీ లభించింది. -
ఈకో 10 లక్షల యూనిట్ల మార్కు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఈకో వ్యాన్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. తాజాగా 10 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. 2010లో భారత మార్కెట్లోకి ఈకో ప్రవేశించింది. 5, 7 సీట్లు, కార్గో, టూర్, అంబులెన్స్ వంటి 13 వేరియంట్లలో ఇది లభిస్తుంది. వ్యాన్స్ విభాగంలో 94 శాతం వాటా ఈకో కైవసం చేసుకుందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. తొలి 5 లక్షల యూనిట్లకు ఎనమిదేళ్లు పట్టింది. మిగిలిన 5 లక్షల యూనిట్ల విక్రయాలు అయిదేళ్లలోపే పూర్తి చేశామన్నారు. 1.2 లీటర్ అడ్వాన్స్డ్ కె–సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజన్‌తో ఈకో రూపుదిద్దుకుంది. మైలేజీ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.2 కిలోమీటర్లు, ఎస్–సీఎన్జీ వేరియంట్ కేజీకి 27.05 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ తెలిపింది. -
భారత్‌లో లంబోర్గీని రికార్డ్ సేల్స్; వచ్చే ఏడాదికి భారీ టార్గెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూపర్ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న ఇటలీ సంస్థ ఆటోమొబైలి లంబోర్గీని 2022లో భారత్‌లో 92 యూనిట్లు విక్రయించింది. దేశంలో ఇప్పటి వరకు కంపెనీకి ఇవే అత్యధిక అమ్మకాలు కావడం విశేషం. 2021తో పోలిస్తే 33 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా కంపెనీ నుంచి అత్యధికంగా 9,233 యూనిట్లు రోడ్డెక్కాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 10 శాతం అధికం. మార్కెట్ సానుకూలంగా ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ తెలిపింది. అత్యుత్తమ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచిందని వెల్లడించింది. 2021తో పోలిస్తే గతేడాది ఆసియా దేశాలు 14 శాతం వృద్ధి సాధించాయి. విక్రయాల పరంగా తొలి స్థానంలో ఉన్న యూఎస్ మార్కెట్ 10 శాతం అధికంగా 2,721 యూనిట్లు నమోదు చేసింది. భారత్‌లో లంబోర్గీని కార్ల ధరలు రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం. అంతేకాదు 2023 సంవత్సరానికి గాను భారీ టార్గెట్ పెట్టకున్నట్టు కంపెనీ కంట్రీ హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. 2023లో మూడు అంకెల మార్కును ఎలా సాధించి సెంచరీ కొట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. -
Enumamula: ఎనుమాముల ఎండు మిర్చి సెన్సేషన్
సాక్షి, వరంగల్ జిల్లా : మార్కెట్లో ఎండు మిర్చికి ఫుల్ గిరాకీ నడుస్తోంది. దిగుమతి తక్కువ కావడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధర అమాంతం పెరిగిపోతోంది. తాజాగా క్వింటాల్ మిర్చి ధర రూ.80 వేలకు పలికి రికార్డు నెలకొల్పింది. ఎర్రబంగారం ఎండు మిర్చి రికార్డు స్థాయి రేటు రాబట్టింది. తాజాగా ఆసియా ఫేమస్ అయిన వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో దేశీ మిర్చి అధిక రేటు పలికింది. క్వింటాల్‌కు ఏకంగా రూ. 80,100 ధర పలికింది. గంటన్నరలోనే 3వేల బస్తాలను వ్యాపారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా మార్కెట్ చరిత్రలోనే కాదు.. రికార్డ్ ధరతో, అమ్మకాలతో దేశీయంగా రికార్డు నెలకొల్పిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక గత సెప్టెంబర్‌లోనే ఎండు మిర్చి క్వింటాల్ రూ. 90వేల రేటు పలకడం గమనార్హం. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్. ఇక్కడ పత్తి తర్వాత భారీగా వచ్చే పంట మిర్చి. దేశీ కొత్త మిర్చి రకానికి ఫుల్ గిరాకీ ఉంటోంది. -
సోనాలిక ట్రాక్టర్స్ బంపర్ సేల్స్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో మొత్తం లక్ష ట్రాకర్లను అమ్మినట్లు సోనాలిక ట్రాక్టర్స్ ప్రకటించింది. అంతక్రితం ఇదే కాలంలో జరిగిన విక్రయాలతో పోలిస్తే 11.2 శాతం వృద్ధిని సాధించినట్లు తెలిపింది. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) కాగా, ఇదే కాలంలో పరిశ్రమ కేవలం 8.8 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2017-18 నుంచి ప్రతీ ఏడాది ఒక లక్ష పైగా ట్రాక్టర్లను విక్రయిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ అత్యంత వేగంగా లక్ష ట్రాక్టర్ల అమ్మకాలను 8 నెలల్లోనే నమోదు చేయడం పట్ల కంపెనీ జాయింట్ ఎండీ రమణ్ మిట్టల్ హర్షం వ్యక్తం చేశారు. (టెక్ మహీంద్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్) -
మీషో మెగా బ్లాక్‌బస్టర్ సేల్: ఒక్కరోజులోనే....
సాక్షి,ముంబై:పండుగ సీజన్సేల్లో ఫ్యాషన్ రీటైలర్ ‘మీషో’ భారీ అమ్మకాలను నమోదు చేసింది. మొదటి రోజే 88 లక్షల ఆర్డర్లను సాధించింది. దీంతో మీషో అమ్మకాలు 80 శాతం పెరిగాయి.ఒక రోజులో కంపెనీ సాధించిన రికార్డ్ సేల్ అని మీషో తెలిపింది. సాఫ్ట్‌బ్యాంక్ నిధులఅందించే ఆన్లైన్ రిటైలర్మీషో తన ఐదు రోజుల హాలిడే సేల్‌లో మొదటి రోజు దాదాపు 87.6 లక్షల ఆర్డర్లు వచ్చాయని, అమ్మకాలు 80శాతం పెరిగాయని శనివారం వెల్లడించింది. ముఖ్యంగా టైర్ 2, 3 , 4 నగరాల్లో మొదటి రోజు దాదాపు 85శాతం ఆర్డర్లు లభించాయని మీషో ఒక ప్రకటనలో నివేదించింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపడం సంతోషంగా ఉందని తెలిపింది. చీరల నుండి అనలాగ్ వాచ్‌లు, జ్యువెలరీ సెట్లు, మొబైల్ కేసులు, కవర్లు, బ్లూటూత్ హెడ్ఫోన్లు, ఛాపర్లు, పీలర్లను రికార్డ్ వాల్యూమ్లలో కొనుగోలు చేశారని కంపెనీ తెలిపింది. ఫ్యాషన్, బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ, కిచెన్,ఎలక్ట్రానిక్ ఉపకరణాలు లాంటివి తొలి రోజు అత్యధికంగా అమ్ముడైన కేటగిరీలుగా ఉన్నాయట. -
117 ఏళ్ల చరిత్ర.. ఒక్క ఏడాదిలోనే తిరగరాసిన కార్ల కంపెనీ
లగ్జరీ కార్ల బ్రాండ్ రోల్స్ రాయిస్ చరిత్ర తిరగరాసుకుంది. కరోనా కాలంలో 117 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టింది. 2021లో రికార్డు స్థాయి అమ్మకాలతో సంచలనం సృష్టించినట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బ్రిటన్‌కు చెందిన కాస్ట్లీ బ్రాండ్ ‘రోల్స్ రాయిస్ మోటార్ కార్స్’.. తన అమ్మకాల్ని గణనీయంగా పెంచుకుంది. అమెరికా ఖండాలు, ఆసియా-పసిఫిక్, గ్రేటర్ చైనా రీజియన్లలతో పాటు ఇతర దేశాల్లో కలిపి మొత్తం 5, 586 కార్లు అమ్ముడుపోయాయి. ఈ పెరుగుదల గతంతో పోలిస్తే 50 శాతం నమోదు అయ్యింది. 117 ఏళ్ల రోల్స్ రాయిస్ చరిత్రలో ఈ రేంజ్లో కార్లు అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. ఆటోమేకర్స్ అంతా గత ఏడాది కాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే కరోనా.. అందునా సెమీకండక్టర్ షార్టేజ్ కొనసాగుతున్న టైంలో రోల్స్ రాయిస్ రికార్డు అమ్మకాలు ఆశ్చర్యం కలిగించే అంశమే!. 2020తో పోలిస్తే.. 2021లో 48 శాతం అమ్మకాలు పెరగడం మరో రికార్డు. Rolls-Royce ‘ఘోస్ట్’, Cullinan ఎస్యూవీ అమ్మకాలకు డిమాండ్ పెరిగినందువల్లే ఈ ఫీట్ సాధ్యమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. పన్నెండేళ్ల క్రితం రోల్స్ రాయిస్ కార్ల ఓనర్ సగటు వయసు 54 సంవత్సరాలుగా ఉండేది. ఇప్పుడు ఆ వయసు 43 ఏళ్లుగా ఉండడం విశేషం. ఇదిలా ఉంటే రోల్స్ రాయిస్.. మొట్టమొదటి ఈవీ కారు ‘స్పెక్టర్’ను తయారు చేసే పనిలో బిజీగా ఉంది. రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ అనేది BMW గ్రూప్(జర్మనీ ఆటో దిగ్గజం) అనుబంధ సంస్థగా 1998 నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి- భారత నేవీకి ఎలక్ట్రిక్ యుద్ధ నౌకలు అందిస్తాం:: రోల్స్‌రాయిస్ -
CAIT Diwali sales: దేశీ తడాఖా.. చైనాకు రూ.50 వేల కోట్ల నష్టం!
సరిహద్దు వివాదాలు చైనాకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఆశించినంత వేగంగా కాకపోయినా క్రమంగా చైనా ఉత్పత్తుల పట్ల వ్యతిరేకత మొదలవుతోంది. దీపావళి సందర్భంగా జరిగిన అమ్మకాలే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పదేళ్ల రికార్డు బ్రేక్ దీపావళి పండగ వెలుగులు పంచింది. వ్యాపారుల గల్లా పెట్టెని గలగలమనిపించింది. పదేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ సారి వ్యాపారం పుంజుకుంది. ది కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (కైట్) జారీ చేసిన గణాంకాల ప్రకారం దీపావళి పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా 1.25 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. గడిచిన పదేళ్లలో ఈ స్థాయిలో బిజినెస్ ఎన్నడూ జరగలేదు. రిఫ్రెష్ అయ్యారు ఏడాదిన్నర కాలంగా కరోనా భయం వెంటాడుతుండటంతో ప్రజలంతా ఎక్కువగా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం కరోనా భయాలు తొలగిపోతుండటం, త్వరలోనే పెళ్లిల సీజన్ మొదలవుతుండటంతో జనం షాపింగ్‌కు మొగ్గు చూపారు ఫలితంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. కరోనా ఒత్తిడి నుంచి జనాలు రిఫ్రెష్మెంట్ కోరుకున్నారని, దాని ఫలితమే ఈ స్థాయి అమ్మకాలు అని కైట్ అంటోంది. Wow - a very happy #Diwali indeed! #Retail Diwali sales notched a record Rs1.25L crore - a 10 yr high per #CAIT. Shoppers gorged on sweets, dry fruits besides buying diyas, candles, watches, toys, clothing, home decor & of course Gold jewelry. Even #online sales were up ~24% YoY. pic.twitter.com/uRzeKnamJj — Sachchidanand Shukla (@shuklasach) November 6, 2021 ఢిల్లీలోనే రూ. 25 వేల కోట్లు దీపావళికి జరిగిన అమ్మకాల్లో ఆన్లైన్ ద్వారా సుమారు 32 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఇక బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించి రూ. 9,000 కోట్ల రూపాయల బిజినెస్ కంప్లీట్ అయ్యింది. దీపావళి బిజినెస్‌కి సంబంధించి ఒక్క ఢిల్లీలోనే ఏకంగా రూ 25,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. దీపావళి అమ్మకాలకు సంబంధించి డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, హోం డెకార్, ఫుట్‌వేర్, టాయ్స్, వాచెస్‌ల విభాగంలో భారీగా అమ్మకాలు జరిగాయని కైట్ అంటోంది. చైనాకు షాక్ ది కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (కైట్) దేశంలో 7 కోట్ల మంది వర్తకులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. కైట్ జాతీయ అధ్యక్షుడిగా భార్తీయా, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్ వాల్లు కొనసాగుతున్నారను. వీరిద్దరు చెప్పిన వివరాల ప్రకారం.. ఈసారి దీపావళి సందర్భంగా మట్టి ప్రమిదలను, పేపర్ వస్తువులను కొనేందుకు జనం ఎక్కువ ఆసక్తి చూపించారు. చైనా వస్తువులు కొనడం కంటే దేశీయంగా స్థానికులు తయారు చేసిన వస్తువులు కొనేందుకే మొగ్గు చూపారు. ఫలితంగా చైనా మేడ్ దీపాలు, ఎలక్ట్రిక్ లైట్లకు గిరాకీ పడిపోయింది. ఇక బాణాసంచా విషయంలోనూ ఈ తేడా కనిపించింది. మొత్తంగా దీపావళి వ్యాపారానికి సంబంధించి రూ. 50 వేల కోట్ల వరకు చైనా ఉత్పత్తులకు నష్టం వాటిల్లింది. చైనా వస్తువులు దేశంలోని దిగుమతి చేసుకున్న వ్యాపారులకు ఈసారి నష్టాలు తప్పేలా లేవు. -
ఐఫోన్-13 ప్రీ-బుకింగ్స్‌లో దుమ్మురేపిన ఇండియన్స్..!
ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఈ నెల 14న ఆపిల్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను సెప్టెంబర్ 17 నుంచి ప్రీ-బుకింగ్ ఆర్డర్స్ జరుగుతాయని ఆపిల్ ప్రకటించింది. తాజాగా జరిగిన ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ ప్రీ-బుకింగ్స్‌లో ఇండియన్స్ దుమ్మురేపారు. విశ్వసనీయ రిటైల్ ట్రేడ్ వర్గాల ప్రకారం.. గత ఏడాది లాగానే రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా ఐఫోన్-13 స్మార్ట్ఫోన్లపై అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రేండ్ ప్రకారం గత త్రైమాసికంలో ఐఫోన్-12 సిరీస్ స్మార్ట్ఫోన్ల అమ్మకాల తరహాలో ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. చదవండి: Vodafone Idea Offers On IPhone 13: ఐఫోన్-13 కొనుగోలుపై వోడాఫోన్-ఐడియా బంపర్ ఆఫర్...! ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలతో ఈ త్రైమాసికంలో ఆపిల్ గణనీయమైన వృద్దిని సాధిస్తుందని వ్యాపార నిపుణులు అంచనా వేశారు. వరుసగా వస్తోన్న పండుగల సీజన్‌తో భారత్‌లో ఆపిల్ భారీ వృద్దిని నమోదుచేస్తోందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరక్టర్ తరుణ్ పాఠక్ పేర్కొన్నారు. అందుకు ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్ల ప్రీ-బుకింగ్స్ ఆర్డర్సే స్పష్టంచేస్తుందని తెలిపారు. ఐడిసి ఇండియా, దక్షిణాసియా రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ మాట్లాడుతూ, రాబోయే పండుగ సీజన్లో ఐఫోన్-12 సిరీస్, పాక్షికంగా ఐఫోన్-13, 13 ప్రో స్మార్ట్‌ఫోన్స్ ద్వారా యాపిల్ మంచి ఊపందుకుంటుందని చెప్పారు. సెప్టెంబర్ 24 నుంచి ఈ నాలుగు కొత్త ఐఫోన్ -13 స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ రూ. 69,900 నుంచి ప్రారంభించి ప్రో మాక్స్ రూ .1,29,900 వరకు అందుబాటులో ఉన్నాయి. చదవండి: ఐఫోన్-13ను ఎగతాళి చేసిన గూగుల్ నెక్సస్..! -
ఈ బైక్ చాలా హాట్ గురూ! క్షణాల్లో సోల్డ్ అవుట్!
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్స్ తయారి కంపెనీ రివోల్ట్ మోటార్స్ ఇటీవల ఆవిష్కరించిన ఆర్వీ 400 ఎలక్ట్రిక్ బైక్స్ అమ్మకాల్లో దూసుకుపోయింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన రెండోసారి కూడా క్షణాల్లో రికార్డు అమ్మకాలను సాధించిందని కంపెనీ ప్రకటించింది. తొలి బుకింగ్స్‌లోనే రికార్డు అమ్మకాలను సాధించిన ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 బుకింగ్‌లను తిరిగి ప్రారంభించిన నిమిషాల్లోనే ఔట్ ఆఫ్ స్టాక్‌గా నిలిచిందని కంపెనీ వెల్లడించింది. తమ బైక్స్ వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతం నాలుగు నెలలు అని, అయితే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, తద్వారా వెయిటింగ్ టైంను తగ్గించడానికి కంపెనీ తీవ్రంగా కృషి చేస్తున్నట్టు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై,అహ్మదాబాద్,హైదరాబాద్నగరాల్లో కంపెనీ బుకింగ్ ప్రారంభించింది. అయితే గత నెలలో బుకింగ్స్ ఆరంభించిన రెండు గంటల్లోనే రూ. 50 కోట్ల విలువైన రివోల్ట్ ఆర్వీ 400 ఎలక్ట్రిక్ బైక్స్ విక్రయించినట్టు కంపెనీ తెలిపింది. ఇటీవల రివోల్ట్ ఆర్వీ 300, ఆర్వీ 400 పేరుతో రెండు ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. రివోల్ట్ ఆర్వీ 400 3కిలోవాట్స్ (మిడ్ డ్రైవ్) మోటారుతో లభ్యం. ఇది 72వీ, 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ బైక్స్‌కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ మై రివోల్ట్ యాప్ ద్వారా సాంకేతిక సమస్యలను తెలుసుకోవచ్చు. అంతేకాదు బ్యాటరీ స్టేటస్, రైడ్స్ డేటా, ఎన్ని కిలోమీటర్లు పూర్తయ్యాయి లాంటి వివరాలను కూడా అందిస్తుంది. దీంతోపాటు రీచార్జ్ నిమిత్తం సమీప రివోల్ట్ స్విచ్ స్టేషన్‌ను కూడా ఈ యాప్‌ద్వారా గుర్తించవచ్చు. -
బైక్ ఎగుమతుల్లో రికార్డు సృష్టించిన భారత్..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహనాల ఎగుమతుల్లో మే నెలలో కొత్త రికార్డు నమోదైంది. గత నెలలో భారత్ నుంచి 3,58,756 టూ వీలర్లు పలు దేశాలకు సరఫరా అయ్యాయి. దేశవ్యాప్తంగా 3,52,717 యూనిట్ల విక్రయాలు జరిగాయి. భారత చరిత్రలో తొలిసారిగా దేశీయంగా అమ్ముడైన ద్విచక్ర వాహనాలతో పోలిస్తే ఎగుమతులదే పైచేయి కావడం విశేషం. మే నెలలో భారత్‌లో 2,95,257 యూనిట్ల మోటార్ సైకిల్స్ అమ్ముడైతే.. 3,30,164 యూనిట్లు విదేశాలకు ఎగుమతి చేశారు. భారత్‌లో గత నెలలో ఉత్పత్తి అయిన టూ వీలర్లలో ఎగుమతుల వాటా అత్యధికంగా 57 శాతానికి చేరడం గమనార్హం. 2019 మే నెలతో పోలిస్తే పరిమాణం 22 శాతం ఎక్కువ. 2020 మే నెలలో పూర్తి లాక్డౌన్ ఉన్న సంగతి తెలిసిందే. కంపెనీల వారీగా ఇలా.. 2021 మే నెల ఎగుమతుల్లో 83 శాతం వాటా టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ కంపెనీలు చేజిక్కించుకున్నాయి. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీలైతే వాటి ఉత్పత్తిలో సగానికిపైగా ఎక్స్పోర్ట్ చేశాయి. మహమ్మారి నేపథ్యంలో సొంత వాహనం ఉంటే సురక్షితం అన్న భావన ప్రజల్లో ఉండడం వల్లే వాహనాలకు డిమాండ్ పెరుగుతోందన్నది తయారీ సంస్థల మాట. మధ్యప్రాచ్య దేశాల నుంచి డిమాండ్ అధికమైంది. దక్షిణాసియా, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా వర్కెట్లు రికవరీ కావడం ఈ స్థాయి అమ్మకాలకు కారణమైంది. ఎగుమతుల స్థిర డిమాండ్‌తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిమాణం పెరిగేందుకు దోహదం చేస్తుందని పరిశ్రమ భావిస్తోంది. 2020–21లో దేశం నుంచి 32,77,724 యూనిట్ల టూ వీలర్లు పలు దేశాలకు సరఫరా అయ్యాయి. చదవండి: తగ్గిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు..మోడల్ని బట్టి డిస్కౌంట్ -
దుమ్ము రేపిన స్మార్ట్‌ఫోన్ విక్రయాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్మార్ట్ఫోన్ల జోరు నడుస్తోంది. 2020 జూలై-డిసెంబరులో 10 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. ఒక ఆరు నెలల కాలంలో ఈ స్థాయి అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి. మొత్తం మొబైల్స్ మార్కెట్లో 19శాతం వాటాతో సామ్సంగ్ లీడర్‌గా నిలిచిందని సైబర్ మీడియా రిసర్చ్ (సీఎంఆర్) తన నివేదికలో వెల్లడించింది. చైనా కంపెనీ షావొమీ అక్టోబరు-డిసెంబరులో 27 శాతం వాటాతో తొలి స్థానంలో ఉందని తెలిపింది. గతేడాది తొలి అర్దభాగంలో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు తగ్గాయి. దీంతో మార్కెట్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు కంపెనీలు బలంగా రంగంలోకి దిగాయి. అయితే ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకోవడంతో మొబైల్స్ డిమాండ్ అధికమైంది. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలోనూ మొబైల్స్ పరిశ్రమ 2020లో నిలదొక్కుకోవడం గుర్తిండిపోయే అంశం. వృద్ధి 10 శాతం ఉండొచ్చు.. ప్రస్తుత ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 10 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని సీఎంఆర్ అంచనా వేస్తోంది. 5జీ మోడళ్ల విక్రయాలు 10 రెట్లు అధికమై 3 కోట్ల యూనిట్లకు ఎగుస్తుందని తెలిపింది. బేసిక్ ఫోన్ యూజర్లు స్మార్ట్ఫోన్ల వైపు పెద్ద ఎత్తున మళ్లుతున్నారు. అన్ని ధరల్లోనూ ఆకట్టుకునే ఫీచర్లతో వస్తున్న మోడళ్లు.. రూ.20 వేల లోపు ధరలోనూ 5జీ మోడళ్ల రాక..వెరశి ఈ ఏడాది మార్కెట్ కొత్త పుంతలు తొక్కనుంది. 2020లో స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర రూ.13,000 నమోదైంది. ప్రస్తుతం ఇది రూ.14,000 లకు చేరిందని బిగ్-సి మొబైల్స్ ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. ట్రెండ్‌ను చూస్తుంటే ఈ ఏడాదే స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర రూ.15,000లను తాకుతుందని అన్నారు. ఒకదానికి ఒకటి పోటీగా.. దేశంలో 5జీ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ విభాగంలో 58% వాటాతో వన్‌ప్లస్ ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న యాపిల్‌కు 20% వాటా ఉంది. దేశంలో టాప్-10 బ్రాండ్స్‌లో యాపిల్ ఆరవ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2020 అక్టోబరు-డిసెంబరులో సామ్సంగ్ 20% వాటా పొందింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాల్లో 35% వృద్ధి సాధించింది. వివో 14%, రియల్మీ 11, ఒప్పో 10% వాటాను చేజిక్కించుకున్నాయి. క్యూ 4లో వివో సేల్స్ 25% తగ్గగా, రియల్మీ 50%, ఒప్పో 14% అమ్మకాలను పెంచుకున్నాయి. ఫీచర్ ఫోన్ల విభాగంలో 20% వాటాతో తొలి స్థానంలో ఉన్న ఐటెల్ అమ్మకాలు క్యూ 4లో 2% తగ్గాయి. -
రికార్డు సృష్టిస్తున్న ఒబామా పుస్తకం
న్యూయార్క్ : యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రచించిన ‘‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’’పుస్తకం రికార్డులు సృష్టిస్తోంది. రిలీజైన తొలి 24 గంటల్లో ఈ బుక్ 8.9 లక్షల కాపీలు అమ్ముడైంది. ఆధునిక అమెరికా చరిత్రలో బెస్ట్ సెల్లింగ్ ప్రెసిడెన్షియల్ రచనగా నిలవనుంది. పెంగ్విన్ రాండమ్ హౌస్ విడుదల చేసిన ఈ పుస్తకం అమ్మకాలకు దగ్గరలోకి వచ్చే పుస్తకం ఒబామా భార్య మిషెల్ రచించిన ‘‘బికమింగ్’’ కావడం విశేషం. బుధవారానికి అమెజాన్, బారన్స్ అండ్ నోబుల్ డాట్‌కామ్ సైట్లలో ఒబామా బుక్ నంబర్ 1 స్థానంలో ఉంది. పది రోజుల్లో అమ్మకాలు మరిన్ని రికార్డులు సృష్టించవచ్చని అంచనాలున్నాయి. గతంలో బిల్ క్లింటన్ రచన ‘‘మైలైఫ్’’4 లక్షల కాపీలు, బుష్ రచన ‘‘డెసిషన్ పాయింట్స్’’2.2 లక్షల కాపీల మేర తొలిరోజు అమ్ముడయ్యాయి. ఒబామా పుస్తకం విడుదలైన సమయంలో దేశంలో అనిశ్చితి, సంక్షోభం(ఎన్నికలు, కరోనా తదితరాలు) నెలకొని ఉన్నా పుస్తక ప్రియులు మాత్రం విశేషంగా స్పందించారు. పుస్తకం ఆరంభించిన సమయంలో ఎన్నికల ఫలితాల నాటికి విడుదల చేయాలని తాను అనుకోలేదని ఒబామా చెప్పారు. గతంలో ఒబామా రచించిన ‘‘డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్’’, ‘‘ద ఆడిసిటీ ఆఫ్ హోప్’’ పుస్తకాలు సైతం విశేష ఆదరణ పొందాయి. పలువురు రివ్యూ రచయితలు తాజా పుస్తకాన్ని ప్రశంసించారు. -
ఆపిల్ రికార్డు సేల్స్ : 8 లక్షల ఐఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో తన తొలి ఆన్లైన్ స్టోర్ ప్రారంభించిన టెక్ దిగ్గజం ఆపిల్ కు బాగా కలిసి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు క్షీణించినా, దేశీయంగా గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది. భారతీయ స్మార్ట్ ఫోన్ విభాగంలో ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసిక అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. అమెరికా, యూరప్ ఆసియా పసిఫిక్ దేశాలతోపాటు ఇండియాలో ఈ త్రైమాసికంలో రికార్డు అమ్మకాలను సాధించామని ఫలితాల వెల్లడి సందర్భంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. భారతదేశంలో సెప్టెంబర్ 23న తమ ఆన్లైన్ స్టోర్ ప్రారంభించిన నేపథ్యంలో మంచి ఆదరణ లభించిందని ప్రకటించారు. ఇందుకు యూజర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (యాపిల్ ఆన్లైన్ స్టోర్ వచ్చేసింది : విశేషాలు) (ఐఫోన్ 12, 12 ప్రో సేల్ షురూ, డిస్కౌంట్స్) నిన్న (అక్టోబరు 29) క్యూ4 ఫలితాలను ఆపిల్ ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం స్వల్పంగా పుంజుకుని 64.7 బిలియన్ డాలర్లుగా ఉంది. లాభం 7 శాతం తగ్గి 12.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఐఫోన్ గ్లోబల్ అమ్మకాలు 20 శాతం క్షీణించాయి. మార్కెట్ పరిశోధన సంస్థ కెనాలిస్ జూలై-సెప్టెంబర్ కాలంలో ఇండియాకు ఆపిల్ 8 లక్షలకు పైగా ఐఫోన్లను రవాణా చేసింది. తద్వారా రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని నివేదించింది. ధరల పరంగా మార్కెట్‌ను ఆపిల్ పూర్తిగా అర్థం చేసుకుంటోందనీ, ఐఫోన్ ఎస్ఈ 2020, ఐఫోన్ 11వంటి హాట్-సెల్లింగ్ ఫోన్లు, ఆకర్షణీయమైన ఆఫర్లతో భారతీయ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో నెమ్మదిగా, స్థిరంగా ప్రవేశిస్తోందని కౌంటర్ పాయింట్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాథక్ వ్యాఖ్యానించారు. ఐఫోన్12తో రాబోయే త్రైమాసికంలో తన స్థానాన్ని ఆపిల్ మరింత పటిష్టం చేసుకుంటుందన్నారు. (ఐఫోన్స్ ప్రీబుకింగ్‌పై ‘సంగీత’ భారీ ఆఫర్లు) ఆపిల్ తన కొత్త ఆన్లైన్ స్టోర్‌తో ఉత్సాహాన్ని పుంజుకుందనీ, ప్రీ-ఆర్డర్ల పరంగా ఐఫోన్ 12 సిరీస్‌కు మంచి ఆదరణ లభించిందని సీఎంఆర్ హెడ్ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజి) ప్రభు రామ్ తెలిపారు. మరోవైపు అక్టోబర్ 23 న ప్రారంభించిన కొత్త ఐఫోన్లకు మంచి ఆదరణ లభిస్తోందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఐఫోన్ 12, 12 ప్రోలకు అద్భుతమైన ప్రీ-ఆర్డర్లను స్వీకరిస్తున్నామంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
లాక్డౌన్ ఎఫెక్ట్ : రికార్డు అమ్మకాలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా, లాక్డౌన్ సమయంలో వ్యాపారాలు లేక, ఆదాయాలు క్షీణించి పలు కంపెనీలు ఇబ్బందుల్లో పడిపోతే ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ పార్లే జీ మాత్రం గణనీయమైన వృద్ధిని తన ఖాతాలో వేసుకుంది. లాక్డౌన్ మూడు నెలల సమయంలో దేశంలో పార్లే-జి బిస్కెట్ల అమ్మకాలు రికార్డు సృష్టించాయి. 1938లో ఈ కంపెనీ స్థాపించిన నాటి నుంచి లేనంతగా ఈ మూడు నెలల స్థాయిలో గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది. మాతృ సంస్థ, పార్లే ప్రొడక్ట్స్ ఈ నిర్దిష్ట గణాంకాలను వివరించడానికి నిరాకరించి నప్పటికీ, మార్చి- మే నెల మధ్య కాలంలో భారీ అమ్మకాలు జరిగాయని పేర్కొంది. దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పార్లే జీ బిస్కెట్లను పెద్ద మొత్తాల్లో కొని పంపిణీ చేశాయని దీంతో రికార్డు స్థాయిలో సాగాయని కంపెనీ వెల్లడించింది. దేశంలోని 120 ఫ్యాక్టరీల్లో మార్చి 25వ తేదీనుంచే బిస్కెట్ల ఉత్పత్తి ప్రారంభించామని తెలిపింది. కిలో వందరూపాయల లోపు ధరలోనే పార్లే -జి బిస్కెట్లు లభిస్తున్నందున వీటికి మార్కెట్ లో డిమాండు బాగా పెరిగిందని కంపెనీ వివరించింది. (పెట్రో షాక్ : నాలుగో రోజూ) మొత్తం విక్రయాల్లో ఇవి 50 శాతానికి పై మాటేనని, మొత్తం ఆదాయంలో మూడింట ఒక వంతు ఆదాయాన్ని ఆర్జించిందని కంపెనీ సీనియర్ ప్రతినిధి మయాంక్ షా తెలిపారు. ఒక్క పార్లే జీ మాత్రమే కాకుండా తమ ఇతర బిస్కట్ ఉత్పత్తులకు కూడా డిమాండ్ ఊపందుకుందన్నారు. దీంతో మిగతా అన్ని బిస్కెట్ కంపెనీలతో పోలిస్తే అత్యధిక వృద్ధి రేటు సాధించామన్నారు. అలాగే సునామీ భూకంపాలు వంటి ఇతర సంక్షోభాల సమయంలో కూడా పార్లే-జి బిస్కెట్ల అమ్మకాలు పెరిగాయన్నారు. ఈ అసాధారణమైన అమ్మకాలతో పార్లే మార్కెట్ వాటా 4.5 నుండి 5 శాతానికి పెరిగిందన్నారు. గత 30-40 సంవత్సరాలలో, ఈ ఇంతటి వృధ్దిని చూడలేదన్నారు. బ్రాండ్‌పై ప్రజలకున్న నమ్మకానికి తోడు పార్లే జీ బిస్కట్లు ఎక్కువ కాలం నిల్వ ఉండటం ఇంతటి ప్రాధాన్యతకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మూడు కోట్ల పార్లేజీ బిస్కెట్లను విరాళంగా ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. (మాల్యా అప్పగింత : మరో ఎత్తుగడ) -
ఫెస్టివ్ సేల్ : దుమ్ము లేపిన అమ్మకాలు
సాక్షి, ముంబై : పండుగ సీజన్లో భారతీయ వినియోగదారులు స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లలో దుమ్ము లేపారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ సీజన్ మొదటి రోజు రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించినట్టు తెలుస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. 750 కోట్ల విలువైన ప్రీమియం స్మార్ట్ఫోన్లను విక్రయించినట్టు తెలిపింది. కేవలం 36 గంటల్లో ఈ రికార్డ్ సేల్‌ను నమోదు చేసినట్టు ప్రకటించింది. అమెజాన్: బిగ్ బిలియన్ డేస్ అమ్మకం మొదటి రోజున రెండు రెట్లు వృద్ధిని సాధించినట్లు వాల్‌మార్ట్ సొంతమైన ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్రీమియం బ్రాండ్లైన వన్‌ప్లస్, శాంసంగ్, యాపిల్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలతో 36 గంటల్లో 750 కోట్ల రూపాయలకు మించి సాధించినట్టు తెలిపింది. తమకు ఇదే అతిపెద్ద ప్రారంభ రోజు అమ్మకాలని అమెజాన్ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. బ్యూటీ అండ్ ఫ్యాషన్ రంగంలో 5 రెట్ల వృద్ధినీ, గ్రాసరీస్ అమ్మకాల్లో ఏకంగా 7 రెట్ల వృద్ధిని సాధించినట్టు వెల్లడించారు. ప్రధానంగా తమకొత్త కస్టమర్లలో 91శాతం, టైర్ 2, 3 పట్టణాలదేనని పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్: ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు ఇదే స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రెండురెట్ల ఎక్కువ అమ్మకాలను సాధించింది. ఫ్యాషన్, బ్యూటీ, ఫర్నిచర్ సంబంధిత విక్రయాలు బాగా వున్నాయని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ కృష్ణమూర్తి తెలిపారు. మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు రెండో రోజు పుంజుకోనున్నాయని చెప్పారు. ఇది ఇలా వుంటే ఈ ఫెస్టివ్ సీజన్ అమ్మకాల్లో మొత్తం మీద రెండు సంస్థలు 5 బిలియన్ డాలర్లకుమించి ఆదాయాన్ని ఆర్జించే అవకాశం వుందని తాజా రిపోర్టుల అంచనా. స్నాప్‌డీల్, క్లబ్ ఫ్యాక్టరీ లాంటి సంస్థలు కూడా ఇదే జోష్‌ను కొనసాగిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ అమ్మకాలు అక్టోబర్ 4 న ముగియనున్నాయి. కాగా ఈ కామర్స్ సంస్థ పండుగ అమ్మకాల సమయంలో వాస్తవ మార్కెట్ ధరపై కాకుండా రాయితీ ధర అమ్మకాలతో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి భారీగా నష్టాన్ని కలిగిస్తున్నాయని ట్రేడర్స్ బాడీ సీఐఐటీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. -
రెండున్నర రోజుల్లో 25 లక్షల డివైజ్‌లు అమ్మకం
చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమి రికార్డులు బ్రేక్ చేసింది. కేవలం రెండున్నర రోజుల్లో 25 లక్షలకు పైగా ఎంఐ డివైజ్‌లను విక్రయించింది. ఈ డివైజ్‌ల్లో ఎంఐ ఎల్ఈడీ టీవీలు, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ పవర్ బ్యాంక్‌లు, ఎంఐ ఇయర్ఫోన్లు, ఎంఐ రూటర్లు, ఎంఐ ఎకో సిస్టమ్ డివైజ్‌లు, యాక్ససరీ ప్రొడక్ట్‌లు ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఎంఐ సూపర్ సేల్ల్లో భాగంగా షావోమి ఈ రికార్డులను బ్రేక్ చేసింది. ఫెస్టివల్ కానుకగా నిర్వహిస్తున్న ఈ మూడు సేల్స్‌లో అమేజింగ్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నాయి. షావోమి ఈ రికార్డును అక్టోబర్ 9వ తేదీ రాత్రి 12 గంటల నుంచి అక్టోబర్ 11వ తేదీ రాత్రి 7 గంటల మధ్యలో సాధించినట్టు షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ వీపీ మను కుమార్ జైన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ అనూహ్యమైన స్పందనకు, ప్రేమకు ఎంఐ అభిమానులందరికీ మను కుమార్ జైన్ కృతజ్ఞతలు తెలిపారు. ఫెస్టివల్ సేల్స్‌లో భాగంగా షావోమి ప్రొడక్ట్‌లపై అందిస్తున్న ఆఫర్లు.... రెడ్మి నోట్ 5 ప్రొ రూ.2000 డిస్కౌంట్లో లభ్యమవుతుంది. హెచ్డీఎఫ్సీ కార్డులపై 10 శాతం తగ్గింపు లభిస్తోంది. దీంతో మొత్తంగా ఈ ఫోన్ రూ.11,699కే అందుబాటులోకి వస్తోంది. రెడ్మి వై2(3జీబీ+32జీబీ) ఫోన్, రెడ్మి వై2(4జీబీ+64జీబీ) స్టోరేజ్ ఫోన్ రూ.1000, రూ.2000 డిస్కౌంట్లో విక్రయానికి వచ్చింది. ఎంఐ మిక్స్ 2 ధర రూ.7000 తగ్గింది. దీంతో ఇది రూ.22,999కే లభ్యమవుతుంది. ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(32), ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(43) ధరలు రూ.500, రూ.2000 మేర తగ్గాయి. డిస్కౌంట్ అనంతరం ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(32), ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(43)లు రూ.13,499కు, రూ.20,999కు విక్రయానికి వచ్చాయి. 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ 2ఐ రూ.699కే విక్రయిస్తున్నాయి. 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ 2ఐ రూ.1399కు లభ్యమవుతోంది. -
లిక్కర్ ‘కిక్’.. రికార్డు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్ : లిక్కర్ కిక్.. రికార్డులు బ్రేక్ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచీ ప్రతి నెలా మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకు రూ.6,231 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ గణాంకాలు చెపుతున్నాయి. దీని ప్రకారం గత ఆరు నెలల్లో రూ.4,376.76 కోట్ల లిక్కర్, రూ.1,855.03 కోట్ల విలువైన బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు రూ.900 కోట్లు ఎక్కువ. ఈ ఏడాది అమ్మకాలు గత పదేళ్లలోనే రికార్డు అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ఏర్పాటు అనం తరం తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలతో పాటు కల్తీలను నియంత్రించడంలో సఫలీకృతమైనందునే ఈ మేరకు విక్రయాలు పెరిగాయంటున్నారు. 90 లక్షల లిక్కర్ కేసులు గత ఆరు నెలల్లో 90 లక్షలకుపైగా లిక్కర్ కేసులు అమ్ముడుపోయాయని, తద్వారా రూ.4,376 కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు చెపుతున్నాయి. బీర్లు కూడా జోరుగా అమ్ముడవుతున్నాయి. ఇప్పటివరకు 1.8 కోట్ల కేసుల బీర్లు అమ్మడం ద్వారా టీపీబీసీఎల్కు రూ.1,855 కోట్లు సమకూరాయి. డిపోలవారీగా చూస్తే మహబూబ్‌నగర్(రూ.497.13 కోట్లు), నల్లగొండ (రూ.481.50 కోట్లు), మేడ్చల్–2(రూ.479.57 కోట్లు) డిపోల్లో మద్యం విక్రయాలు జరిగాయి. ఈ మూడు డిపోల నుంచే రూ.1,430 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు రూ.900 కోట్లకుపైగా ఎక్కువ అమ్మకాలు జరిగాయి. గత ఏడాది ఇదే సమయానికి రూ.3,787.14 కోట్ల విలువైన లిక్కర్, రూ.1,539 కోట్ల విలువైన బీర్లు ఐఎంఎల్ఎప్ డిపోల నుంచి అమ్ముడయ్యాయి. మూడు ముఖ్య కారణాలు మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగేందుకు మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గుడుంబా విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది. దాదాపు అన్ని జిల్లాలనూ గుడుంబారహిత జిల్లాలుగా ప్రకటించింది. గుడుంబా అమ్మకందారులకు పునరావాస ప్యాకేజీని కూడా పకడ్బందీగా అమలు చేసింది. దీంతో రాష్ట్రంలోని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో గుడుంబా విక్రయాలు పూర్తిగా ఆగిపోయాయి. మత్తు కల్లును నియంత్రించడంలోనూ ఎక్సైజ్ శాఖ కృషి ఫలించింది. దీంతో గుడుంబా, మత్తు కల్లు అలవాటున్న వారంతా మద్యంవైపు వెళ్లాల్సిన పరిస్థితులను కల్పించింది. కల్తీ మద్యం అరికట్టడంలోనూ ఎక్సైజ్ శాఖ మంచి పనితీరు కనబరుస్తోంది. మద్యం తయారీ నుంచి సరఫరా, విక్రయాల వరకూ మూడు దశల్లో ఎక్కడా కల్తీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని నివారించడంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ సఫలీకృతమయింది. గతంలో డిస్టిలరీల నుంచి నేరుగా కల్తీ మద్యం బయటకు వెళ్లేది. హాలోగ్రామ్ విధానం తెచ్చిన ఈ నాలుగేళ్లలో మద్యం విక్రయాలు పెరిగాయని, ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకు మేలు జరుగుతోందని రెవెన్యూ శాఖ ప్రభుత్వానికిచ్చిన నివేదికలో పేర్కొంది. కల్తీలను అరికట్టడం, కచ్చితమైన విధానాలను అమల్లోకి తేవడం, ఎన్ఫోర్స్మెంట్ చురుకుగా ఉండటం లాంటి అంశాలు రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగేందుకు కారణమని ఎక్సైజ్ శాఖ అధికారులు చెపుతున్నారు.