ఖాదీ ఉత్పత్తులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మరోసారి రికార్డ్ సేల్స్ నమోదు చేసింది. గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించాలంటూ ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. దీంతో రాజధాని అక్టోబరు 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ఖాదీ భవన్‌లో రూ. 1.52 కోట్ల విలువైన ఖాదీ, గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తుల అమ్మకాలు జరిగాయి.
ఈ రికార్డు విక్రయాలపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా చేతితో నేసిన వస్త్రాన్ని కొనుగోలు చేయడం ప్రజల చిహ్నంగా ఎలా మారిందో తెలియ జేస్తోందన్నారు. ఖాదీపై ఉన్న ఈ ప్రేమ ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తుందని, ఇది కొత్త శక్తిని ఇస్తుందని తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. సెప్టెంబరు 24న తన "మన్ కీ బాత్" కార్యక్రమంలో గాంధీ జయంతి రోజున ఖాదీని కొనుగోలు చేయాలని ప్రధాని ప్రజలను కోరారు ఫలితంగా, ఖాదీ భవన్‌లో ఒక్క రోజులో రికార్డు స్థాయిలో రూ.1.52 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి. గత ఏడాది గాంధీ జయంతి రోజున రూ. 1.34 కోట్లు, 2021-22లో రూ. 1.01 కోట్ల అమ్మకాలు జరిగాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్రాండ్ పవర్‌కు ఇది నిదర్శనని KVIC (ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్) చైర్మన్ మనోజ్ కుమార్ వ్యాఖ్యానించారు. అంతేకాదు అనేక సందర్బాల్లో అంతర్జాతీయ వేదికలపై మోదీ ఖాదీ ఉత్పతులను ప్రోత్సహించాలని కోరారని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా తొలి కస్టమర్‌గా మనోజ్ కుమార్ ఖాదీ దుస్తులను కొనుగోలు చేసి UPI ద్వారా డిజిటల్ చెల్లింపును చేశారు.
Comments
Please login to add a commentAdd a comment