Khadi
-
‘ఈ దుస్తులు కొనండి’.. ప్రధాని మోదీ
గ్రామాల్లో తయారుచేస్తున్న ఖాదీ వల్ల దేశవ్యాప్తంగా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం సాగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళల్లో పెరుగుతున్న ఆదరణ, ఉద్యోగాల కల్పన కారణంగా 400 శాతం ఖాదీ, చేనేత దుస్తుల అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. భారత పౌరులు ఖాదీ దుస్తులు కొనుగోలు చేయాలని మన్ కీ బాత్ ప్రసారంలో భాగంగా మోదీ పౌరులకు సూచించారు.ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా గ్రామాల్లో తయారుచేస్తున్న ఖాదీ వ్యాపారం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లకు చేరింది. గతంతో పోలిస్తే వీటి విక్రయాలు 400 శాతం పెరిగాయి. ఖాదీ, చేనేత విక్రయాలు పెరిగి పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ పరిశ్రమ పురోగతి వల్ల దీనిపై ఎక్కువగా ఆధారపడిన మహిళలకు ప్రయోజనం చేకూరుతోంది. ఇంతకుముందు ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించని చాలా మంది ప్రజలు ఇప్పుడు గర్వంగా వీటిని ధరిస్తున్నారు. ఇప్పటి వరకు ఖాదీ దుస్తులు కొనకపోతే వాటిని కొనడం ప్రారంభించండి’ అని మోదీ చెప్పారు.ఇదీ చదవండి: అప్పు చెల్లించని వైజాగ్ స్టీల్‌ప్లాంట్!ఇదిలాఉండగా, ప్రభుత్వం చేనేత, ఖాదీ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహకాలు అందించాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. కేంద్ర బడ్జెట్లో నేషనల్ హ్యాండ్యూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం రూ.200 కోట్లు కేటాయించారు. రానున్న బడ్జెట్లో ఆ నిధులను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ విధానాలతో గార్మెంట్ ఉత్పత్తులు తయారుచేస్తున్న కార్పొరేట్ కంపెనీలకు వెంటనే నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
రికార్డ్ సేల్స్: మోదీ పిలుపు, ఖాదీ గెలుపు
ఖాదీ ఉత్పత్తులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మరోసారి రికార్డ్ సేల్స్ నమోదు చేసింది. గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించాలంటూ ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. దీంతో రాజధాని అక్టోబరు 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ఖాదీ భవన్లో రూ. 1.52 కోట్ల విలువైన ఖాదీ, గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తుల అమ్మకాలు జరిగాయి. ఈ రికార్డు విక్రయాలపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా చేతితో నేసిన వస్త్రాన్ని కొనుగోలు చేయడం ప్రజల చిహ్నంగా ఎలా మారిందో తెలియ జేస్తోందన్నారు. ఖాదీపై ఉన్న ఈ ప్రేమ ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తుందని, ఇది కొత్త శక్తిని ఇస్తుందని తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. సెప్టెంబరు 24న తన "మన్ కీ బాత్" కార్యక్రమంలో గాంధీ జయంతి రోజున ఖాదీని కొనుగోలు చేయాలని ప్రధాని ప్రజలను కోరారు ఫలితంగా, ఖాదీ భవన్లో ఒక్క రోజులో రికార్డు స్థాయిలో రూ.1.52 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి. గత ఏడాది గాంధీ జయంతి రోజున రూ. 1.34 కోట్లు, 2021-22లో రూ. 1.01 కోట్ల అమ్మకాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్రాండ్ పవర్‌కు ఇది నిదర్శనని KVIC (ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్) చైర్మన్ మనోజ్ కుమార్ వ్యాఖ్యానించారు. అంతేకాదు అనేక సందర్బాల్లో అంతర్జాతీయ వేదికలపై మోదీ ఖాదీ ఉత్పతులను ప్రోత్సహించాలని కోరారని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా తొలి కస్టమర్‌గా మనోజ్ కుమార్ ఖాదీ దుస్తులను కొనుగోలు చేసి UPI ద్వారా డిజిటల్ చెల్లింపును చేశారు. -
Khadi Fabric: ఖాదీ ఎందుకంత స్పెషల్? జరీ అంత కాస్ట్లీ ఎందుకు?
ఎర్రకోట అనగానే ఎవరికై నా పతాకావిష్కరణ గుర్తుకొస్తుంది. వినువీధిలో త్రివర్ణ పతాక రెపరెపలు చూడగానే మనసు దేశభక్తితో ఉప్పొంగిపోతుంది. అటువంటి వేడుకలో ఖాదీకి కూడా చోటు లభిస్తే.. నేరుగా దేశ ప్రధాని మోదీతో ముచ్చటించే అవకాశం లభిస్తే.. మన ముఖం పొందూరు జరీ ఖాదీ పంచె అంచులా మెరిసిపోతుంది. ఉత్సాహం ఉప్పొంగి మనసే ఉత్సవ వేదికగా మారుతుంది. సరిగ్గా అటువంటి అపురూప అనుభవమే ఇద్దరు పొందూరు ఖాదీ కళాకారుల సొంతమైంది. స్వాతంత్య్రోద్యమంలో భాగస్వామి అయిన పొందూరు ఖాదీ ప్రతినిధులుగా దేశ రాజధాని ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని, ప్రధానితో మాట్లాడే అపురూప క్షణాలు జీవితంలో మర్చిపోలేనివని ఉత్సవాల్లో పాల్గొన్న నేతకారులు గర్వంగా చెబుతున్నారు. ఢిల్లీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వారినే ఎందుకు ఎంపిక చేశారు? వారి ప్రత్యేకత ఏమిటి? ఢిల్లీలో అనుభవాలు ఏమిటి? వారి నుంచే తెలుసుకుందాం. కాంతమ్మా.. కుశలమా.. ఈమె పేరు జల్లేపల్లి కాంతమ్మ. పొందూరు. వయసు 75. ఆరేళ్ల ప్రాయం నుంచి సంప్రదాయ ఖాదీ వస్త్రం తయారు చేస్తోంది. దేశంలోనే నూలును నాణ్యంగా వడికే నైపుణ్యం గల అతికొద్ది మంది వ్యక్తుల్లో కాంతమ్మ ఒకరు. ముగ్గురు కుమారులు బాగానే స్థిరపడినా.. ఖాదీ మీద మక్కువతో ఆమె పాత ఇంటిలోనే ఉంటూ రోజుకు 6 గంటలు ఇదే పనిలో నిమగ్నమవుతున్నారు. కేవలం రోజుకు రూ.200 మాత్రమే సంపాదిస్తున్నా.. కోట్ల రూపాయల విలువైన తృప్తి కోసమే తాను ఈ పని చేస్తున్నానని గర్వంగా చెబుతున్నారు ఆమె. తాను 75 ఏళ్ల వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నానని అంటే అది ఖాదీ పుణ్యమేనని.. చెబుతారు కాంతమ్మ. అసలు కాంతమ్మ ఎంచుకున్న సంప్రదాయ విధానం ఏమిటి? వాలుగు చేప ముల్లుతో పత్తిని శుభ్రపరచడం ఖాదీ వస్త్రం తయారీలో ఈ దశలు కీలకమైనవి.. నిడుచుటగా పిలిచే ప్రక్రియలో పత్తి గింజలను వేరు చేయడం పత్తిని మెత్తగా తయారు చేయడం చిలపలు పోయడం మరిచిపోలేని జ్ఞాపకం.. నేను చదువుకోలేదు. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసింది.. ఖాదీ తయారీలో భాగమవ్వడమే. నేను ఏ రోజూ కష్టపడుతున్నాననే భావన నాలో రానీయను. ఇష్టంగా పనిలో నిమగ్నమవుతా. నన్ను కలిసేందుకు చాలా మంది వస్తుంటారు. ఖాదీ తయారీలో ప్రక్రియల్ని ఓపికగా వివరిస్తా. వారికి అర్థమయ్యేంత వరకు విడిచిపెట్టను. ఖాదీ గొప్పతనాన్ని వారికి చెబుతా. ఢిల్లీ.. ఎర్రకోట ప్రధాన మంత్రి వంటి పదాలు వినడమే తప్ప.. నేను ఎప్పుడూ చూస్తానని కలలో కూడా ఊహించ లేదు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకు నాలాంటి సామాన్యురాలిని ఎర్రకోటకు పిలిచి స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాతో మాట్లాడడం నిజంగా నా అదృష్టం. చాలా గర్వంగా ఉంది. – జల్లేపల్లి కాంతమ్మ, పొందూరు. ఏకు చుట్టడం జరీ నేతలో మొనగాడు చిత్రంలో వీరిద్దరి పేర్లు భద్రయ్య, లక్ష్మి. భార్యభర్తలు. ఊరు పొందూరు. ఇద్దరూ నేతకారులే. జరీపంచె నేతలో ఒకే ఒక్కడు ఈ భ ద్రయ్య. మంచి నైపుణ్యం ఈయన సొంతం. ఏఎన్నార్ పేరుతో పిలిచే ఖాదీ పంచెకు బంగారం వర్ణంలో ఉండే అంచును అత్యంత అద్భుతంగా నేయడంలో ఈయనది అందెవేసిన చేయి. ఇంటర్ వరకు చదువుకున్న భద్రయ్య వృత్తిలో సంతృప్తి వెతుకునే వ్యక్తి త్వం ఉన్న మనిషి. రోజుకు కేవలం రూ.500 మాత్ర మే సంపాదించే ఈయన జరీనేతలో దేశవ్యాప్తంగా ఉన్న కొద్ది మంది నేతన్నలలో మొనగాడే. ఈ నేతకు ఇద్దరు వ్యక్తులు అవసరం కావడంతో భార్య సహకారంతో మనసుకు నచ్చిన పనిచేసి దేశప్రధాని మనసును గెలుచుకున్నాడు ఈ నేతన్న. ఏమిటీ జరీ నేత..ఖరీదు ఎందుకంత..! పంచెకు అంచు అందం. అంచు ఎంత ఎక్కువ తళుక్కుమంటే అంత ఖరీదైనదని అర్థం. శ్వేత, గోధుమ వర్ణంలో సున్నితంగా ఉండే ఖాదీ జరీపంచెలు కాస్త ఖరీదైన వ్యవహారం. మామూలు ఖాదీ పంచె రూ. 600 నుంచి రూ.800 మధ్యలో లభ్యమవుతుంది. ఒక్కో జరీ పంచె ఖరీదు రూ.11 వేల నుంచి రూ.13 వేల వరకు పలుకుతుందంటే దీని ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. జీవితాంతం గుర్తుండిపోయేలా.. ఉదయం లేవడం.. వృత్తిలో నిమగ్నమవ్వడం. నా కుటుంబం. ఇదే నా దినచర్య. ఢిల్లీకి బయల్దేరాలని ఖాదీ బోర్డు సభ్యులు చెబితే ఆశ్చర్యమేసింది. అదీ ఎర్రకోటలో జరిగే మువ్వన్నెల వేడుకకు.. ప్రధానిని కలిసేందుకు అంటే చాలా గర్వపడ్డాను. ప్రధానమంత్రిని దగ్గర నుంచి చూశా. ఓ నేతకారుడిగా నాకు దక్కిన ఈ గొప్పఅవకాశం.. ఆ అద్భుత క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. నాకు వృత్తిలో చేదోడు వాదోడుగా ఉండే నా భార్యతో సహా నేను ఢిల్లీకి వెళ్లడం జీవితంలో మరిచిలేనిది. – బళ్ల భద్రయ్య, పొందూరు -
వీడిన ఖాదీ వ్యాపారి హత్య మిస్టరీ!
హైదరాబాద్: గత ఏడాది జరిగిన ఖాదీ వ్యాపారి అనుమానాస్పద మృతి కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ కేసు దర్యాప్తును నారాయణగూడ నుంచి నల్లకుంట పోలీసులకు ఉన్నతాధికారులు అప్పగించారు. ఖాదీ వ్యాపారి ప్రకాష్ వీర్ మృతిపై పలు అనుమనాలు ఉండటమే ఇందుకు కారణం. కొద్ది రోజులుగా నల్లకుంట ఇన్స్పెక్టర్ రవి ముమ్మర విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో మృతుడి భార్య, ఇద్దరు కుమార్తెలపై పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అసలు ఏమైందంటే? గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ అర్ధరాత్రి హైదర్‌గూడలోని ‘భారత్ ఖాదీ’ స్టోరు యజమాని ప్రకాష్ వీర్ అవంతినగర్లోని తన నివాసంలో రక్తపు మడుగులో కనిపించారు. నారాయణగూడ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేశారు. అయితే అప్పుడు ఇతని మరణంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. అతని సోదరులు ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీ కార్యాలయానికి లేఖ రాశారు. తన సోదరుడి మృతికి కారకులైన వారిని శిక్షించాలని ఆ లేఖలో రాయడంతో దీనిపై అప్పుడు స్పెషల్ బ్రాంచ్ పూర్తి నివేదికను ఉన్నతాధికారుల ఎదుట ఉంచింది. పోలీసుల అదుపులో భార్య, కుమార్తెలు? కొద్దిరోజులుగా నల్లకుంట పోలీసులు వ్యాపారి హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించారు. రెండు, మూడు పర్యాయాలు మృతుడి భార్య, ఇద్దరు కుమార్తెలను విచారించిన సందర్భంలో పలు విషయాలు బయటకు వచి్చనట్లు తెలిసింది. దీంతో శనివారం వారిని నల్లకుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలో మరిన్ని విషయాలు, వ్యాపారి మృతిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
ఖాదీ వస్త్ర ప్రదర్శన ప్రారంభం
సనత్‌నగర్: ఖాదీని ప్రోత్సహించడమంటే మన సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడమేనని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో బేగంపేట బ్రాహ్మణవాడీలోని స్వామి రామానంద తీర్థలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఉంచిన ఖాదీ వ్రస్తాలను ఆయన తిలకించారు. అనంతరం వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ చైర్పర్సన్, ఎమ్మెల్సీ వాణీదేవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మధుసూదనాచారి మాట్లాడుతూ.. ప్రకృతికి అనుగుణంగా దుస్తులను తయారు చేయడం గొప్ప కళగా అభివర్ణించారు . చీరాంబరాలను అగ్గిపెట్టెల్లో ఎగుమతి చేసిన కళా నైపుణ్యం మన సొంతం అన్నారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మన బ్రాండ్లు అంతర్జాతీయ బ్రాండ్లుగా ఎదగాలని, అందుకోసం మరింతగా కళా నైపుణ్యం పెంపొందించుకోవడంతో పాటు ప్రభుత్వాలు సైతం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఖాదీ కళాకారులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందేలా చూస్తానన్నారు. భవిష్యత్తు తరాలకు భారతీయ ఖాదీ గొప్పతనాన్ని తెలియజేయాలని ఆయన సూచించారు. ఈ నెల 31 వరకు వస్త్ర ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, దయానంద్, స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ ఫౌండర్ చైర్మన్ పీవీ ప్రభాకర్‌రావు, వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Bharat Jodo Yatra: వల్లెవేయడం తేలికే..ఆచరణ కష్టం
మైసూరు: గాంధీజీ ఆశయాలను వల్లెవేయడం అధికారంలో ఉన్న వారికి తేలికే కానీ, వాటిని అనుసరించడం కష్టమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన ఆదివారం మైసూరు సమీపంలోని బదనవాలు గ్రామంలోని ఖాదీ గ్రామోద్యోగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రాన్ని గాంధీజీ 1927, 1932 సంవత్సరాల్లో సందర్శించడం విశేషం. ఈ సందర్భంగా జరిగిన గాంధీజీ జయంతి వేడుకల్లో రాహుల్ పాల్గొన్నారు. ఆ కేంద్రంలో చేనేత ఉత్పత్తులను పరిశీలించి, మహిళా కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. గాంధీజీని పొట్టనబెట్టుకున్న సిద్ధాంతంతోనే గడిచిన ఎనిమిదేళ్లుగా దేశంలో అసమానతలు, విభేదాలను వ్యాపింప జేస్తున్నారంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్లనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న హింస, అసత్య రాజకీయాలకు వ్యతిరేకంగా అహింస, స్వరాజ్య భావనను పెంచేందుకే జోడో యాత్ర చేపట్టామన్నారు. బదనవాలు గ్రామంలో వీరశైవ, దళితులతో కలిసి రాహుల్ భోజనం చేశారు. ప్రముఖ శ్రీ నంజుండేశ్వర (శ్రీకంఠేశ్వర) ఆలయంలో పూజలు చేశారు. తర్వాత పాదయాత్ర మైసూరు ప్యాలెస్ మైదానం ఎదురుగా ఉన్న వస్తు ప్రదర్శన ఆవరణకు చేరుకుంది. ఆరున యాత్రలో సోనియా కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో ఈనెల ఆరో తేదీన సోనియా గాంధీ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో యాత్ర 511 కిలోమీటర్ల పొడవునా 21 రోజులపాటు కొనసాగనుంది. వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్లి వచ్చిన సోనియా తొలిసారిగా యాత్రలో పాలుపంచుకోనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్తున్న కర్ణాటకగుండా ప్రస్తుతం యాత్ర కొనసాగుతుండటం గమనార్హం. బీజేపీపాలిత రాష్ట్రం గుండా యాత్ర కొనసాగడం ఇదే తొలిసారి. బదనవాలులో ఖాదీ గ్రామోద్యోగ్ కేంద్రంలో మగ్గాన్ని పరిశీలిస్తున్న రాహుల్ -
మునుగోడులో ఇదే ట్రెండూ! బీరువాలు తెరుస్తున్న కార్యకర్తలు
ఖద్దరు బట్టల దర్పమే వేరు.. ధగ ధగా మెరుస్తూ..నిలబడి ఉండే ఖద్దరంటే అందరూ మోజు చూపిస్తారు. అయితే రాజకీయ నాయకులకు ఖద్దరు అనేది బ్రాండ్‌గా మారింది. కొందరైతే పండుగప్పుడో... ఏదైనా ఫంక్షన్‌కో ఖద్దరు ధరిస్తారు. నాయకులైతే ఎక్కువగా ఖద్దరులోనే కనిపిస్తారు. అయితే ఖద్దరు ధరించేవారికి ఉన్న డిమాండ్, విలువ ఇతరులకు ఉండదనేది వాస్తవం. ఇప్పుడు మునుగోడులోని అన్ని పార్టీల కార్యకర్తలు బీరువాలో దాచిన ఖద్దరు దుస్తులు బయటకు తీస్తున్నారట. ఒక ఉప ఎన్నిక అనేక విచిత్రాలకు వేదికవుతోంది. అనేక రాజకీయ పరిణామాలకు దారి తీస్తోంది. భవిష్యత్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో రాజకీయ పార్టీలకు మునుగోడు ఉప ఎన్నిక ఓ పాఠంగా మారబోతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీల నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఆ నేతల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం కొందరు చోటామోటా నేతలు కూడా అదే స్థాయిలో కష్టాలు పడుతున్నారు. నేతల్ని ఆకట్టుకునేందుకు ఇన్నాళ్లు బీరువాల్లో దాచుకున్న తెల్లటి ఖద్దరు బట్టల్ని బయటకు తీస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు మునుగోడు రోడ్లపై ఎక్కడ చూసిన తెల్లటి ఖద్దరు ధగధగలే కనిపిస్తున్నాయి. మునుగోడులో ఖద్దరు మెరవడానికి కూడా ఓ కారణం ఉందంటున్నారు. తెల్లటి బట్టలు వేసుకుని వెళ్తేనే లీడర్లం అని చెప్పుకోవడానికి అనువుగా ఉంటుందనే కారణం ఒకటైతే... ప్రస్తుత ఉప ఎన్నిక నేపథ్యంలో దర్పం ప్రదర్శించి నా వెనుక ఇన్ని ఓట్లు ఉన్నాయని..నేతల్ని నమ్మించాలన్నా నాలుగు రూపాయలు సంపాదించాలన్నా ఖద్దరే ముద్దు అనే ఆలోచనతో చోటా నేతలంతా ఖద్దరు బాట పట్టారు. దీంతో మునుగోడులో ఎక్కడ చూసినా ఖద్దరు బట్టలు ధరించిన వారే కనిపిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని వస్త్ర దకాణాల్లో ఇప్పుడు తెల్లని ఖద్దరు వస్త్రాలకు గిరాకీ భారీగా పెరిగింది. మునుపెన్నడు లేని విధంగా ఖద్దరు కొనుగోళ్లు బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇక్కడ దొరక్కపోతే పక్క ఊళ్ళ నుంచి ఖద్దరు తెప్పించుకుంటున్నారట. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు కత్తి మీద సాములా మారింది. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎత్తులు, పై ఎత్తులతో నాయకులు సతమతమవుతుంటే.. చోటామోటా లీడర్లు మాత్రం తమకు పైసలు వచ్చే టైమొచ్చిందని సంబరపడుతున్నారు. -
ఆప్ నాయకులకు పరువు నష్టం నోటీసులు... భయపడేదే లేదంటూ ముక్కలు ముక్కలుగా చించేసి...
న్యూఢిల్లీ: మద్యంపాలసీకి సంబంధించిన స్కీంలో అవినీతి జరిగిందంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పై సీబీఐ దాడుల జరిపిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆప్ నాయకులు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాతో పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆప్ వర్సస్ ఎల్జీ(లెఫ్టినెంట్ గవర్నర్), స్కామ్ వర్సస్ స్కామ్ రాజకీయం అన్నట్లుగా ఇద్దరి మధ్య వాడి వేడిగా విమర్శలు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఖాదీ స్కాం విషయమై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పై ఆప్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ సక్కేనా ఆప్ నాయకులు సంజయ్ సింగ్, దుర్గేష్ పాఠక్, అతిషి, సౌరభ్ భరద్వాజ్‌ల తోపాటు జాస్మిన్ షాలకు పరువు నష్టానికి సంబంధించిన లీగల్ నోటీసులు పంపించారు. అంతేకాదు ఇలా పార్టీలోని సభ్యులందరూ ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగా దురుద్దేశపూర్వకంగా, నిరాధారమైన తప్పుడు ప్రకటనలతో తన పరువుకి భంగం కలిగేంచే వ్యాఖ్యలను వ్యాప్తి చేసే అలవాటును మానుకోవాలంటూ ఒక పత్రిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ మేరకు ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ..."భారత రాజ్యంగం నాకు మాట్లాడే హక్కును ఇచ్చింది. అలాగే రాజ్యసభ సభ్యునిగా నిజం మాట్లాడే హక్కు నాకు ఉంది. ఒక దొంగ, అవినీతిపరుడు పంపిన నోటీసులకు భయపడను అంటూ ముక్కలు ముక్కలుగా చించేశారు. అలాంటివి ఎన్ని నోటీసులు పంపించినా చించేయగలను, విసిరి పారేయగలను" అని ఆగ్రహించారు. లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు తమపై ఇలా రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆప్ పేర్కొంది. అంతేకాదు సక్కేనా 2015 నుంచి 2022 వరకు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీన్ కమిషన్(కేవీఐసీ) చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడూ అనేక అవకతవకలు జరిగాయని ఆప్ ఆరోపించింది. పైగా ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ అసెంబ్లీలో మాట్లాడుతూ...కేవీఐసీ ఉద్యోగులపై సుమారు రూ. 1400 కోట్ల విలువైన నోట్లను మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చారంటూ పలు ఆరోపణలు చేశారు. అంతేకాదు మంబైలోని ఖాదీ లాంచ్ ఇంటీరీయర్ డిజైనింగ్ కాంట్రాక్టును కూడా తన కుమార్తెకు ఇచ్చారంటూ ఆరోపణలు గుప్పించారు. తాము చేస్తున్న పోరాటంలో పలు ప్రశ్నలు ఉంటాయని వాటిని ఎదర్కునేందుకు సిద్ధంగా ఉండండి అని సవాలు ఆప్ నేత సంజయ్ సింగ్ సవాలు విసిరారు. సుప్రీం కోర్టు ఆప్ నేతలకు ఈ నోటీసులను బుధవారం పంపిచింది. ఈ కేసు విచారణను ధర్మాసనం అక్టోబర్ 11 వ తేదికి వాయిదా వేసింది. (చదవండి: 'బీజేపీలో ఉంటూనే ఆప్ కోసం పనిచేయండి'.. కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపు) -
దేశం కోసం ఖాదీ... జాతీయ జెండా కోసం చైనీస్ పాలిస్టర్
న్యూఢిల్లీ: దేశం కోసం ఖాదీ కానీ జాతీయ జెండా కోసం చైనీస్ పాలిస్టర్ అని కాంగ్రెస్ నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎప్పటిలాగే ఆయన పనులుకు మాటలకు పొంతన ఉండదంటూ మోదీ పై మండిపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోదీ అహ్మదా బాద్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్ లో ఖాదీ ఉత్తవం సందర్భంగా ఖాదీ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ మోదీ పై ఈ విమర్శల దాడి చేశారు. మోదీ ఆ ఉత్సవంలో అభివృద్ధి చెందిన స్వావలంబనతో కూడిన భారతదేశ కలను సాధించడానికి ఖాదీ ఒక ప్రేరణగా మారుతుందని అన్నారు. దీందో రాహుల్‌గాంధీ ఫ్లాగ్ కోడ్ విషయాన్ని ప్రస్తావిస్తూ ...కేంద్రం ఫ్లాగ్ కోడ్‌ని సవరించడాన్ని కూడా తప్పుపట్టారు. జాతీయ జెండాను చేతితో చేసే నూలు లేదా యంత్రంతో తయారు చేసిన పత్తి /పాలిస్టర్/ ఉన్ని/ పట్టు ఖాదీని వినియోగించవచ్చని కేంద్రం సవరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే గతంలో మిషన్‌తో చేసే పాలిస్టర్ జెండాలను ఉపయోగించేందుకు అనుమతించలేదనే విషయాన్ని గుర్తు చేశారు. పైగా మోదీ ఆ ఖాదీ ఉత్సవంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఖాదీ లేదా హోమ్‌స్పన్ నాసిరంకంగా ఉత్పత్తిగా పరిగణించారని చెప్పారు. అంతేకాదు రానున్న పండుగలో గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులైన ఖాదీ మాత్రమే బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు కూడా. దీంతో రాహుల్ గాంధీ మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. (చదవండి: స్వావలంబనకు స్ఫూర్తి ఖాదీ) -
స్వావలంబనకు స్ఫూర్తి ఖాదీ
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం గుజరాత్‌కు చేరుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్‌లోని సబర్మతీ రివర్‌ఫ్రంట్ వద్ద నిర్వహించిన ‘ఖాదీ ఉత్సవ్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి లక్ష్యాల సాధనకు, ఆత్మనిర్భర్ భారత్(స్వాలంబన)నకు ఖాదీ స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఒకప్పుడు మన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఖాదీని దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేశారని వాపోయారు. ఖాదీ ఉత్పత్తులను విస్తృతంగా వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే పండుగ సీజన్లో బంధుమిత్రులకు ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను బహుమతులుగా అందజేయాలని అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 7,500 మంది ఇక్కడ చరఖా తిప్పి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని మోదీ సైతం స్వయంగా చరఖా తిప్పారు. అహ్మదాబాద్‌లో నూతన ఖాదీ గ్రామోద్యోగ్ భవనాన్ని ప్రారంభించారు. సబర్మతీపై అటల్ బ్రిడ్జి ప్రారంభం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో సబర్మతీ నదిపై పాదచారులు, సైక్లిస్ట్ల సౌకర్యార్థం నిర్మించిన ‘అటల్ బ్రిడ్జి’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి స్థానికులు అర్పిస్తున్న నివాళి ఈ వారధి అని చెప్పారు. అటల్ బ్రిడ్జిపై మోదీతోపాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ కాసేపు సరదాగా నడిచారు. ప్రజలకు అభివాదం చేశారు. అటల్ బ్రిడ్జి సబర్మతీ నది రెండు ఒడ్డులను అనుసంధానించడమే కాదు, విశిష్టమైన, వినూత్నమైన డిజైన్‌తో ఆకట్టుకుంటోందని మోదీ అన్నారు. అటల్‌జీని గుజరాత్ ఎంతగానో ప్రేమించిందని చెప్పారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన గాంధీనగర్ నుంచి పోటీచేసి, రికార్డుస్థాయిలో ఓట్లు సాధించి, ఘన విజయం సాధించారని గుర్తుచేశారు. ► అటల్ బ్రిడ్జి పొడవు 300 మీటర్లు. మధ్యభాగంలో దీని వెడల్పు 14 మీటర్లు. ► పాదచారులు, సైకిల్ ప్రయాణికులు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ► విభిన్నమైన డిజైన్, ఎల్ఈడీ లైటింగ్‌తో చూపరులకు కనువిందు చేస్తోంది. ► సబర్మతీ రివర్‌ఫ్రంట్ పశ్చిమ భాగంలోని ఫ్లవర్ గార్డెన్‌ను, తూర్పు భాగంలో రాబోయే ఆర్ట్స్ అండ్ కల్చరల్ సెంటర్‌ను అనుసంధానిస్తుంది. ► 2,600 మెట్రిక్ టన్నుల స్టీల్ పైపులు ఉపయోగించి అటల్ బ్రిడ్జి నిర్మించారు. ► పైకప్పును రంగుల వస్త్రంతో అలంకరించారు. సబర్మతీ నదిపై అటల్ వంతెన (ఇన్సెట్లో) వంతెనను ప్రారంభిస్తున మోదీ -
ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ.. ఎక్కడంటే..
మహాత్మాగాంధీ 152 వ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఖద్దర్ జాతీయ పతాకాన్ని లడఖ్‌లోని లెహ్ టౌన్లో ఆవిష్కరించారు. కాగా లడఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆర్కే బథుర్ శనివారం ఉదయం ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ఆర్మీ ఛీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనె కూడా హాజరయ్యారు. 225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు కొలతతో ఖద్దర్ జాతీయ పతాకాన్ని రూపొందించారు. దాదాపుగా వెయ్యి కిలోల బరువున్న ఈ త్రివర్ణ పతాకాన్ని ఇండియన్ ఆర్మీకి చెందిన 57 మంది ఇంజనీర్ సైనిక దళం తయారుచేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. కొండపై ప్రదర్శనకు ఉంచిన జెండా, కొండ మీదుగా వెళ్తున్న హెలికాప్టర్లు ఈ వీడియోలో కనిపిస్తాయి. ‘గాంధీజయంతి సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జాతీయ పతాకాన్ని లడఖ్‌లో ఆవిష్కరించడం దేశానికే గర్వకారణం. బాపు జ్ఞాపకార్థానికి, హస్తకళలను ప్రోత్సహించడానికి, దేశ గౌరవానికి ఇదే నా వందనం. జై హింద్. జై భారత్!’ అని ట్విటర్ పోస్టులో పంచుకున్నారు. చదవండి: ఇవి తింటే బట్టతల ఖాయం..! గుడ్డు తెల్లసొన, చేప, చక్కెర.. It is a moment of great pride for 🇮🇳 that on Gandhi ji's Jayanti, the world's largest Khadi Tiranga is unveiled in Leh, Ladakh. I salute this gesture which commemorates Bapu's memory, promotes Indian artisans and also honours the nation. Jai Hind, Jai Bharat! pic.twitter.com/cUQTmnujE9 — Mansukh Mandaviya (@mansukhmandviya) October 2, 2021 -
ఖాదీ బ్రాండ్‌కు బలం, ఆ మూడు దేశాల్లో..
న్యూఢిల్లీ: ఖద్దరు మీద పూర్తి పేటెంట్ హక్కులు మన దేశానివే. అందుకే ‘ఖాదీ’ అనే బ్రాండ్‌ను పరిరక్షించే పనిని బాధ్యతగా తీసుకుంది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ). ఇతర దేశాల్లో ఖాదీ ఉత్పత్తుల అమ్మకానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా మూడు దేశాలు ఖాదీ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ పరిధిలోకి వచ్చాయి. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో కేవీఐసీ పూర్తి వివరాలను తెలిపింది. భూటాన్, యూఏఈ తోపాటు మెక్సికో దేశాలు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు పేర్కొంది. అంతేకాదు మరో నలభై దేశాల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. అమెరికాతో పాటు ఖతర్, శ్రీలంక, ఇటలీ, జపాన్, న్యూజిల్యాండ్, సింగపూర్, బ్రెజిల్ సహా మరికొన్ని దేశాలు ట్రేడ్‌మార్క్ కోసం ఎదురు చూస్తున్నాయని కేవీఐసీ చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా వెల్లడించారు. ఖాదీ గుర్తింపు, గ్లోబల్ పాపులారిటీని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేసింది కేవీఐసీ. ఇందులో భాగంగానే ఈ జూన్ 28న యూఏఈకి, జులై 9న భూటాన్‌లకు ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది. ఈ రెండుదేశాల కంటే ముందు పోయిన డిసెంబర్లోనే మెక్సికో ఖాదీ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్‌తో అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ లేకపోతే.. ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలకు అనుమతి లేనట్లే. ఇంతకు ముందు జర్మనీ, యూకే, చైనా, రష్యా, ఆస్ట్రేలియా, ఈయూ దేశాలకు అనుమతి దొరికాయి. తాజాగా మూడు దేశాల అనుమతులతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. దీంతో ఆయా దేశాలు ఖాదీ ఫ్యాబ్రిక్, ఖాదీ రెడిమేడ్ గార్మెంట్స్, ఖాదీ సోప్‌లు, ఖాదీ కాస్మటిక్స్, అగరవత్తులు ఖాదీ ఉత్పత్తుల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ దొరికినట్లయ్యింది. -
పొందూరు ఖాదీ కార్మికురాలికి జాతీయస్థాయి గుర్తింపు
పొందూరు: మండల కేంద్రాని కి చెందిన వడుకు కార్మికురాలు కాపల చిన్నమ్మడుకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. ఇటీవల ముంబైలో ఇండియన్ మర్చంట్ చాంబర్ ఆఫ్ బజాజ్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూలు తయారీలో ప్రతిభ కనబరిచింది. ఇందుకు సంస్థ తరుపున బజాజ్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేసి ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు. -
ఐదేళ్లలో 5 కోట్ల మందికి ఉపాధి
ఖాదీ ద్వారా కల్పిస్తాం: కేంద్ర మంత్రి గిరిరాజ్ ముంబై: ఖాదీ పరిశ్రమ ద్వారా రానున్న ఐదేళ్లలో ఐదు కోట్ల మందికి ఉపాధి కల్పించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రి గిరిరాజ్‌సింగ్ తెలిపారు. ‘‘ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్(కేవీఐసీ)లో సోలార్ ఆధారిత స్పిన్నింగ్ వీల్స్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికను రూపొందించాం. ఇది దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మందికి ఐదేళ్ల కాలంలో ఉపాధి కల్పించగలదు’’ అని మంత్రి వివరించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం వస్త్ర పరిశ్రమలో ఖాదీ ఉత్పత్తుల వాటా ఒక శాతంలోపే ఉందన్నారు. గత రెండేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన కృషితో ఖాదీ విక్రయాలు 2014లో రూ.35,000 కోట్లుగా ఉండగా... ప్రస్తుతం రూ.52,000 కోట్లకు పెరిగినట్టు వివరించారు. వడ్డీ రేట్లలో రాయితీలు, ఆర్థిక సాయం, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యాలు తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు గిరిరాజ్ చెప్పారు. ఖాదీ ఉత్పత్తుల వినియోగానికి ప్రాచుర్యం కల్పించేందుకు గాను అరవింద్, రేమండ్ తదితర కంపెనీలతో కేవీఐసీ భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. -
ఖాదీ ఉత్పత్తుల అభివృద్ధిపై శ్రద్ధ
నరసన్నపేట: విశాఖ డివిజన్ పరిధిలో ఖాదీ ఉత్పత్తులు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఖాదీ బోర్డు డైరెక్టర్ భూమయ్య అన్నారు. నరసన్నపేటకు సోమవారం వచ్చిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నరసన్నపేట కేంద్రానికి వంద చరకాలను, 12 మగ్గాలను ఇచ్చారు. తర్వాత ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఖాదీ ఉత్పత్తులు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నకిలీ ఖాదీ ఉత్పత్తులు కూడా వస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. విశాఖ డివిజన్లో మూడు కేంద్రాలు ఉండగా దీంట్లో నరసన్నపేట కేంద్రం పనితీరు బాగుందన్నారు. యువతకు ఖాదీ పట్ల ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికీ రూ. 5 లక్షలు చొప్పున్న విశాఖ డివిజన్ పరిధిలో 400 మందికి రుణాలు ఇస్తామన్నారు. దీంట్లో 30 శాతం మార్జిన్ మనీ ఉంటుందన్నారు. ఆయన వెంట ఖాదీ అధికారులతో పాటు స్థానిక ప్రతినిధులు జగదీష్, వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
అదే మహాత్మునికి మనమిచ్చే నివాళి:మోదీ
న్యూఢిల్లీ: గాంధీ జయంతి(అక్టోబర్2) ని పురస్కరించుకొని ప్రజలు ఖాధీ వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్ మాట్లాడుతూ.. పేదలు అత్యధికంగా ఉన్న ఖాదీ రంగంలో ఉన్నారని వారిని ప్రోత్సహించేందుకు స్వదీశీ వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. మహాత్మా గాంధీ 1920 లో ఖాదీ ఉద్యమాన్ని ప్రారంభించారని మోదీ గుర్తు చేశారు. గాంధీ జయంతి రోజున ఖాదీ వస్త్రాలను కొనడమే ఆయనకిచ్చే నివాళి కావాలని మోదీ పిలుపునిచ్చారు. -
'స్టార్టప్స్ అంటే ఐటీ పరిశ్రమలే కాదు'
న్యూఢిల్లీ: 'స్టార్టప్స్' అంటే ఐటీ పరిశ్రమలకు చెందినవేనన్న దురభిప్రాయాన్ని తాము దూరం చేశామని, తమ ప్రభుత్వం తీసుకొచ్చిన 'స్టార్టప్ ఇండియా' పథకంలో అన్ని రంగాల్లోనూ అంతులేని అవకాశాలు లభిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. 'మన్ కీ బాత్' 16 ఎడిషన్ రేడియో కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం దేశ ప్రజలతో ముచ్చటించారు. 'స్టార్టప్ ఇండియా' ద్వారా దేశ యువతలో కొత్త ఉత్సాహం, శక్తిని నింపామని ఆయన అన్నారు. దేశంలోని లక్షలాది మంది ప్రజలకు ఖాదీ పరిశ్రమ ఉపాధి కల్పిస్తుందని, దేశ ప్రయోజనాలు, యువత ఆకాంక్షలకు ఇది ప్రతీకగా నిలిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళిగా ప్రతి ఒక్కరూ ఒక జత ఖాదీ దుస్తులను కొనుగోలు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. 'మన్ కీ బాత్' కార్యక్రమం ప్రారంభంలో గాంధీజీకి నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా దేశ ప్రజలను మోదీ కోరారు. -
ఖాదీ, మోదీలకు లైక్ కొట్టేస్తున్న రాఖీ సావంత్
ఖాదీకి కాలం చెల్లిపోయిందని అంతా అంటున్నారు. కానీ ఖాదీ మళ్లీ ఫేషనబుల్ అయిపోతోంది. ఎందుకంటే సంచలన ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ ఇప్పుడు ఖాదీ కట్టుకుంటోంది. తెల్లని ఖాదీ కుర్తా, ఖాదీ చుడీదార్, ఖాదీ ఓవర్ కోట్ వేసుకున్న రాఖీ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. రాజకీయనాయకులకు దీటుగా ట్వీట్ చేస్తోంది. తాజాగా తన అభిమానమంతా నరేంద్ర మోదీపై కురిపిస్తోంది రాఖీ. ట్విట్టర్ లో మోడీపై ఈగ కూడా వాలనీయడం లేదు. ఆమె ట్వీట్లన్నీ మోదీ పొగడ్తలతో నిండిపోతున్నాయి. అంతటితో ఆగకుండా ఆమె ఫక్తు రాజకీయ నేతలా పోజులిస్తోంది. అంతే కాదు. మరో అడుగు ముందుకెళ్లి ఇంటింటికీ వెళ్లి చెత్త కుండీలను ఉచితంగా ఇస్తోంది. ముంబాయి మురికివాడల్లో తిరుగుతూ కుటుంబానికో చెత్త డబ్బా ఇస్తోంది. పారిశుధ్యం గురించి మచ్చ లేని తెల్ల ఖాదీలో వివరించేస్తోంది. "ఇదేదో పబ్లిసిటీ కోసం చేయడం లేదు. నేను నిజాయితీగానే పని చేస్తున్నాను" అంటోంది రాఖీ సావంత్. చెత్త రాజకీయాలకన్నా చెత్త కుండీ రాజకీయాలు ఎంతో మంచివని సెలవిస్తోంది. మొత్తానికి అటు ఖాదీ, ఇటు మోదీలను సపోర్టు చేస్తూ రాఖీ సావంత్ వార్తలకెక్కుతోంది.