న్యూఢిల్లీ: దేశం కోసం ఖాదీ కానీ జాతీయ జెండా కోసం చైనీస్ పాలిస్టర్ అని కాంగ్రెస్ నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎప్పటిలాగే ఆయన పనులుకు మాటలకు పొంతన ఉండదంటూ మోదీ పై మండిపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోదీ అహ్మదా బాద్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్ లో ఖాదీ ఉత్తవం సందర్భంగా ఖాదీ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ మోదీ పై ఈ విమర్శల దాడి చేశారు.
మోదీ ఆ ఉత్సవంలో అభివృద్ధి చెందిన స్వావలంబనతో కూడిన భారతదేశ కలను సాధించడానికి ఖాదీ ఒక ప్రేరణగా మారుతుందని అన్నారు. దీందో రాహుల్‌గాంధీ ఫ్లాగ్ కోడ్ విషయాన్ని ప్రస్తావిస్తూ ...కేంద్రం ఫ్లాగ్ కోడ్‌ని సవరించడాన్ని కూడా తప్పుపట్టారు. జాతీయ జెండాను చేతితో చేసే నూలు లేదా యంత్రంతో తయారు చేసిన పత్తి /పాలిస్టర్/ ఉన్ని/ పట్టు ఖాదీని వినియోగించవచ్చని కేంద్రం సవరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐతే గతంలో మిషన్‌తో చేసే పాలిస్టర్ జెండాలను ఉపయోగించేందుకు అనుమతించలేదనే విషయాన్ని గుర్తు చేశారు. పైగా మోదీ ఆ ఖాదీ ఉత్సవంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఖాదీ లేదా హోమ్‌స్పన్ నాసిరంకంగా ఉత్పత్తిగా పరిగణించారని చెప్పారు. అంతేకాదు రానున్న పండుగలో గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులైన ఖాదీ మాత్రమే బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు కూడా. దీంతో రాహుల్ గాంధీ మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
(చదవండి: స్వావలంబనకు స్ఫూర్తి ఖాదీ)
Comments
Please login to add a commentAdd a comment