ఖాదీ, మోదీలకు లైక్ కొట్టేస్తున్న రాఖీ సావంత్ | Rakhi Sawant roots for Khadi, Narendra Modi | Sakshi
Sakshi News home page

ఖాదీ, మోదీలకు లైక్ కొట్టేస్తున్న రాఖీ సావంత్

Published Tue, Mar 11 2014 9:14 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

ఖాదీ, మోదీలకు లైక్ కొట్టేస్తున్న రాఖీ సావంత్ - Sakshi

ఖాదీ, మోదీలకు లైక్ కొట్టేస్తున్న రాఖీ సావంత్

ఖాదీకి కాలం చెల్లిపోయిందని అంతా అంటున్నారు. కానీ ఖాదీ మళ్లీ ఫేషనబుల్ అయిపోతోంది. ఎందుకంటే సంచలన ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ ఇప్పుడు ఖాదీ కట్టుకుంటోంది. తెల్లని ఖాదీ కుర్తా, ఖాదీ చుడీదార్, ఖాదీ ఓవర్ కోట్ వేసుకున్న రాఖీ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. రాజకీయనాయకులకు దీటుగా ట్వీట్ చేస్తోంది. తాజాగా తన అభిమానమంతా నరేంద్ర మోదీపై కురిపిస్తోంది రాఖీ. ట్విట్టర్ లో మోడీపై ఈగ కూడా వాలనీయడం లేదు. ఆమె ట్వీట్లన్నీ మోదీ పొగడ్తలతో నిండిపోతున్నాయి.


అంతటితో ఆగకుండా ఆమె ఫక్తు రాజకీయ నేతలా పోజులిస్తోంది. అంతే కాదు. మరో అడుగు ముందుకెళ్లి ఇంటింటికీ వెళ్లి చెత్త కుండీలను ఉచితంగా ఇస్తోంది. ముంబాయి మురికివాడల్లో తిరుగుతూ కుటుంబానికో చెత్త డబ్బా ఇస్తోంది. పారిశుధ్యం గురించి మచ్చ లేని తెల్ల ఖాదీలో వివరించేస్తోంది. "ఇదేదో పబ్లిసిటీ కోసం చేయడం లేదు. నేను నిజాయితీగానే పని చేస్తున్నాను" అంటోంది రాఖీ సావంత్. చెత్త రాజకీయాలకన్నా చెత్త కుండీ రాజకీయాలు ఎంతో మంచివని సెలవిస్తోంది.


మొత్తానికి అటు ఖాదీ, ఇటు మోదీలను సపోర్టు చేస్తూ రాఖీ సావంత్ వార్తలకెక్కుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement