Rakhi sawant
-
మూడో పెళ్లికి సిద్దమైన బాలీవుడ్ బ్యూటీ ..వరుడు ఎవరంటే..?
రాఖీ సావంత్(Rakhi Sawant).. బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి ఈమె సుపరిచితమే. అప్పట్లో ప్రత్యేక పాటలకు కేరాఫ్‌గా నిలిచింది. తనదైన అంద, అభినయంతో బాలీవుడ్‌లొ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న రాఖీ.. హిందీ బిగ్‌బాస్ రియాల్టీ షో(Bigg Boss Show)లోకి వెళ్లి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది. ఆమె ఏ పోస్ట్ పెట్టిన నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. సినిమాల కంటే కాంట్రవర్సీ పోస్టులతోనే ఆమెకు వార్తల్లో నిలుస్తోంది. పిచ్చి చేష్టలు..వివాదస్పద ప్రకటనలు చేస్తూ నెట్టింట ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రాఖీ సావంత్..తాజాగా తన మూడో పెళ్లి గురించి సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్‌కు చెందిన నటుడు,నిర్మాత డోడి ఖాన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏది ఏమైనా.. చివరకు నా జీవితంలో సరైన వ్యక్తి దొరికాడు’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. అంతేకాకుండా డోడి వీడియోను షేర్ చేసింది. అయితే వీరిద్దరి పెళ్లి పాకిస్థాన్‌లో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.రిసెప్షన్ మాత్రం ఇండియాలో ఉంటుందట. ఇక హనీమూన్ కోసం మూడో భర్తతో స్విట్జర్లాండ్ లేదా నెదర్లాండ్‌కు వెల్లనున్నట్లు ఆమె చెప్పింది. ప్రస్తుతం రాఖీ సావంత్ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసం చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు.ఇక రాఖీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ బాలీవుడ్ బ్యూటీ మొదట వ్యాపారవేత్త అయిన రితేష్ సింగ్ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కర్ణాటకకు చెందిన కార్త వ్యాపారి అదిల్ ఖాన్ దురానీని రహస్యంగా రెండోసారి పెళ్లి చేసుకుంది. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. కొన్ని రోజులకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు.ఆదిల్ తనను మోసం చేశాడంటూ రాఖీ పోలీసులను ఆశ్రయించింది. తనను హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. తన డబ్బును కూడా యథేచ్ఛగా వాడుకుంటున్నాడని ఆరోపించింది. దీంతో పోలీసులు ఆదిల్‌ను అరెస్ట్ చేశారు. ఐదు నెలల తర్వాత జైలునుంచి విడుదలైన ఆదిల్.. ఆ తర్వాత బిగ్ బాస్ 12 కంటెస్టెంట్ సోమి ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. -
గర్భశయాన్ని తొలగించారు.. తల్లిని కాలేను.. హీరోయిన్ ఎమోషనల్!
నటి రాఖీ సావంత్ గురించి బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే నెటిజన్స్‌కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో స్పెషల్ సాంగ్స్‌కి కేరాఫ్‌గా నిలిచింది. తనదైన అందం, అభినయంతో బాలీవుడ్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. అయితే కొన్నాళ్ల తర్వాత అవకాశాలు తగ్గడంతో రాఖీ పేరు అంతా మర్చిపోయారు. దీంతో కొంతకాలం పాటు సైలెంట్‌గా ఉండి.. హిందీ బిగ్‌బాస్ రియాల్టీ షోతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో రాఖీ చేసిన సందడి, కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. బయటకు వచ్చిన తర్వాత ఆమెకు నెట్టింట మంచి ఆదరణ లభించింది. ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అయింది. కాంట్రవర్సీ పోస్ట్‌లతో హల్చల్ చేసింది. (చదవండి: డూప్ అంటేనే ఒళ్లు మండుతుంది: మంచు లక్ష్మి)అయితే గత కొన్నాళ్లుగా మాత్రం రాఖీ కాస్త సైలెంట్ అయిపోయింది. దానికి కారణం ఆమె అనారోగ్యం బారిన పడడమే. ప్రస్తుతం ఈ బ్యూటీ దుబాయ్‌లో ఉంటూ చికిత్స పొందుతోంది. ఆ మధ్య శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ బ్యూటీ తన ఆరోగ్య విషయాలను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయింది. (చదవండి: రొమాంటిక్ ఫొటోలతో ప్రియుడ్ని పరిచయం చేసిన బ్యూటీ)‘నాకు శస్త్ర చికిత్స జరిగిన విషయం వాస్తవమే. ఓ సారి వైద్యులు చెక్ చేసి గుండె పోటు లక్షణాలు ఉన్నాయని చెప్పారు. వైద్య పరిక్షల అనంతరం నా గర్భాశయంలో 10 సెంటీ మీటర్ల కణితి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేయించుకోవాలని..లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని తెలిపారు. దీంతో నేను సర్జరీ చేయించుకున్నాను. కణితితో పాటు గర్భాశయాన్ని కూడా తొలగించారు. ఇక నేను తల్లిని కాలేనని వైద్యులు చెప్పడంతో ఏడ్చేశాను. నేను తల్లి అవ్వాలంటే.. సరోగసీ ద్వారా పిల్లలను పొందాల్సిందే’ అని రాఖీ సావంత్ ఎమోషనల్ అయింది. ఇక ఆస్పత్రిలో ఉన్నప్పుడు హీరో సల్మాన్ ఖాన్ అండగా నిలిచాడని, తన మెడికల్ బిల్లులు మొత్తం ఆయనే కట్టేశాడని చెప్పింది. -
బాలీవుడ్ నటికి సర్జరీ.. ఇప్పుడెలా ఉందంటే?
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇటీవలే సర్జరీ చేయించుకుంది. తన గర్భాశయంలో భారీ కణతి ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ఇది జరిగి 10 రోజులు అవుతుండగా ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోంది. తాజాగా రాఖీ వైద్య పరిస్థితిని తెలుపుతూ ఆమె మాజీ భర్త రితేశ్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఆమె మళ్లీ మనలో ఒకరిగా తిరగనుంది. తను నడవగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది అని రాసుకొచ్చాడు. బాధలో ఉంటే నవ్వులాటగా ఉందా?ఈ వీడియోలో రాఖీ అడుగు తీసి అడుగు వేయడానికి కూడా చాలా కష్టపడుతోంది. ఆ నొప్పిని భరించలేకపోతోంది. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా రాఖీ సర్జరీ చేయించుకోబోతుందన్నప్పుడు చాలామంది వెటకారంగా మాట్లాడారు. తనను దూషించారు. అలాంటివారిపై రితేశ్ తీవ్రంగా మండిపడ్డాడు. ఒకరు బాధలో ఉంటే చూసి నవ్వడానికి మనసెలా వస్తుందో.. ఈ సమయంలో కూడా తనమీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మీరసలు మనుషులు కాదుఅవతలివారి కష్టాన్ని అర్థం చేసుకోవడానికి బదులు ఎగతాళి చేస్తున్నవాళ్లు అసలు మనుషులే కాదు అని ఆగ్రహించాడు. రాఖీ పొట్టలో నుంచి తీసిన గడ్డను సైతం చూపిస్తూ.. ఇది ఎంత పెద్ద కణతో చూశారా? రాఖీకి మేమంతా ఉన్నాం అని చెప్పుకొచ్చాడు. అయితే రాఖీ రెండో మాజీ భర్త మాత్రం ఇదంతా డ్రామానే అని కొట్టిపారేశాడు. లీక్డ్ వీడియోల కేసులో నుంచి తప్పించుకోవడానికే ఆపరేషన్ అని డ్రామా ఆడుతోందని విమర్శించాడు. View this post on Instagram A post shared by Ritesh Kumar (@riteshsinghofficialbb15) చదవండి: సన్ ఫ్లవర్‌లా స్టార్ హీరోయిన్.. ఆ డ్రెస్సు ఎంతకు అమ్మిందంటే? -
ప్రముఖ నటికి సర్జరీ.. షాకయ్యానన్న మాజీ భర్త!
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇటీవల తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె సోదరుడు వెల్లడించారు. అయితే రాఖీసావంత్ గర్భాశయంలో భారీ కణతి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెకు సర్జరీ చేయాల్సి వచ్చిందని ఆమె మాజీ భర్త రితేశ్ సింగ్ తెలిపారు.ప్రస్తుతం రాఖీ సావంత్‌కు శస్త్రచికిత్స విజయవంతంగాపూర్తైనట్లు ఆమె మాజీ భర్త తెలిపారు. తాజాగా ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు దాదాపు 10 సెంటిమీటర్ల కణతిని తొలగించారని పేర్కొన్నారు. మే 18న శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారని వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతర ఆమె అపస్మారక స్థితిలో ఉందని మాజీ భర్త చెప్పారు. రాఖీ గర్భాశయంలో కణితి చాలా పెద్దదిగా ఉందని.. దాదాపు అరచేతి పరిమాణంలో ఉందని రితేశ్ తెలిపారు. మొదటిసారి అది చూసి తాను షాకయ్యానని చెప్పారు. ఆమెకు దాదాపు మూడు గంటల పాటు ఆపరేషన్ జరిగినట్లు వివరించారు. రాఖీ కోలుకోవాలంటూ ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఆమె తల్లి మరణం, భర్తతో వివాదం తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా రాఖీ సావంత్ తీవ్రమైన గుండె సమస్యతో ముంబయిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె బ్రదర్ రాకేశ్ వెల్లడించారు. తన సోదరి డిప్రెషన్లో ఉండడం వల్లే గుండె సమస్య వచ్చిందని ఆమె సోదరుడు రాకేష్ సావంత్ వెల్లడించారు.మా అమ్మ చనిపోయాక అందరూ రాఖీని పబ్లిసిటీ కోసం, డబ్బు కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా ఆమెను అందరూ వేధింపులకు గురి చేశారని అన్నారు. ఆదిల్ తన సోదరి వద్ద ఉన్న డబ్బునంతా కాజేసి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిల్‌పై ఇప్పటివరకు ఛార్జ్‌షీట్ వేయలేదని..డబ్బులతో అందరినీ మేనేజ్ చేస్తున్నాడని అన్నారు. తన సోదరి కోసం ప్రార్థించాలని ఆమె అభిమానులను కోరారు. అందరూ కలిసి రాఖీకి ద్రోహం చేయడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని రాకేశ్ పేర్కొన్నారు. రాఖీకి ఏదైనా జరిగితే ఆమె అభిమానులు తనను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టరని రాకేశ్ సావంత్ అన్నారు. ఆమెకు అపరేషన్ బాగా జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by Bollywood Khabar (@bollywoodkhabarofficial) -
ఆ నటితో నాకు సంతోషం లేదు.. అందుకే రెండో పెళ్లి!
అదిల్ దురానీ.. వివాదాస్పద నటి రాఖీ సావంత్‌తో నడిపిన ప్రేమాయణంతోనే ఇతడి పేరు అందరికీ తెలిసింది. అదిల్ కోసం, అతడి కుటుంబం కోసం పొట్టి బట్టలు వేసుకోవడం కూడా తగ్గించేసింది రాఖీ. సీక్రెట్‌గా అతడిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఆ గొడవలు ముదిరిపోవడంతో భర్తపై వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసులో గతేడాది జైలుకు కూడా వెళ్లొచ్చాడు అదిల్. తర్వాత ఇద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. రహస్యంగా నిఖా చేసుకోలేదు ఇటీవలే అదిల్ రెండో పెళ్లి చేసుకున్నాడు. నటి, బిగ్‌బాస్ ఫేమ్ సోమి ఖాన్‌ను పెళ్లాడాడు. ఈ రెండో పెళ్లి గురించి అతడు మాట్లాడుతూ.. 'చాలామంది నేను ఎలా మళ్లీ పెళ్లి చేసుకున్నానని అడుగుతున్నారు. నేనొక ముస్లింను.. కాబట్టి నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకునే అధికారం నాకుంది. నేనేమీ రహస్యంగా నిఖా చేసుకోలేదు. కుటుంబసభ్యుల అంగీకారంతో వారి సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాను. రిసెప్షన్ కూడా నిర్వహించాం. మంచి లైఫ్ కోరుకోవడం తప్పా? ఇప్పుడు నేను నా భార్యతోనే కలిసున్నాను. నాకంటూ మంచి జీవితం కోరుకోవడం తప్పు కాదే! రాఖీ(మాజీ భార్య) ఎప్పుడూ నెగెటివ్‌గానే ఉంటుంది. తను నాకు ఏనాడూ సంతోషాన్ని పంచలేదు. ఆమె ఎవరి జీవితంలో ప్రవేశించినా వారికి ఆనందమనేదే ఉండదు. కానీ నేను తనలా కాదు.. సంతోషాన్ని పంచుతాను. సోమి నా జీవితంలోకి వెలుగును తీసుకొచ్చింది. తనతో ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by SOMI KHAN (@somikhan_ks) చదవండి: ఓటీటీలో హారర్ సిరీస్.. తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్.. -
వివాదాస్పద నటితో పెళ్లి-విభేదాలు.. ఇప్పుడు రెండో షాదీ..
బిగ్‌బాస్ షోతో బాగా క్లిక్ అయింది రాఖీ సావంత్. అయితే ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూ ఉంటుందీ నటి. గతంలో ఈమె రితేశ్ సింగ్‌ను పెళ్లాడింది. ఆల్రెడీ అతడికి పెళ్లైన విషయం ఆలస్యంగా తెలియడంతో ఆమె మనసు ముక్కలైంది. అతడికి పెళ్లాంపిల్లలు ఉన్నందున తన పెళ్లి చెల్లదంటూ రితేశ్‌తో తెగదెంపులు చేసుకుంది. తర్వాత తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమలో పడింది. అతడిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆమె ఆ విషయాన్ని ఆలస్యంగా బయటపెట్టింది. కానీ వీరి బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. గొడవలు పీక్స్‌కు వెళ్లడంతో భర్తను జైల్లో పెట్టించింది. అతడితోనూ విడిపోయింది. ఆమధ్య మరోసారి ప్రేమలో పడ్డానంది కానీ దాని గురించి మళ్లీ మాట్లాడనేలేదు. మరోవైపు అదిల్ ఖాన్ రెండోసారి పెళ్లిపీటలెక్కాడు. హిందీ బిగ్‌బాస్(12వ సీజన్) కంటెస్టెంట్ సోమి ఖాన్‌ను నిఖా చేసుకున్నాడు. ఏడు నెలలుగా ఆమెతో ప్రేమలో ఉన్న అతడు చివరకు పెళ్లితో ఒక్కటైనట్లు తెలుస్తోంది. అయితే ఇది తనకు రెండో పెళ్లి కాదని, మొదటి పెళ్లని చెప్తున్నాడు. అదెలాగో తర్వాతి రోజుల్లో చెప్తానంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నామని, ముంబైకి రాగానే అన్ని విషయాలు వివరంగా వెల్లడిస్తానంటున్నాడు. అదిల్- సోమి ఖాన్ వివాహం మార్చి 3న జరిగింది. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫోటోలను అదిల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమను ఆశీర్వదించమని కోరాడు. ఇది చూసిన జనాలు.. రాఖీతో ఎంగేజ్మెంట్.. షాదీ.. బ్రేకప్ జరిగిపోయాయి. అంతలోనే మళ్లీ పెళ్లి చేసుకున్నావా? అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Adil Khan Durrani (@iamadilkhandurrani) చదవండి: ఎంతటి విషాదం.. క్యాన్సర్‌తో నటి కన్నుమూత.. ముందురోజే సోదరి మృతి -
అనంత్ అంబానీ బరువుపై అసభ్యకరమైన కామెంట్లు చేసిన హీరోయిన్
భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్ వేదికగా మార్చి 1-3 వరకు ఘనంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలను ‘హస్తాక్షర్ ’ కార్యక్రమంతో ముగించారు. దేశ, విదేశాల్లో పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో అంబానీ ఫంక్షన్‌పై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ స్పందించింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు తనను ఎందుకు పిలవలేదని ఆమె ప్రశ్నించింది. ఒకవేళ తనను పిలిచి ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయడం నుంచి వంట పాత్రలు కడగడం వరకు తానే స్వయంగా చేసేదానినంటూ ఆమె ఇలా పేర్కొంది. 'అంబానీ జీ నమస్తే. నన్ను పెళ్లికి ఎందుకు పిలవలేదు? మీరు ఇంకా నా డ్యాన్స్ చూడలేదనుకుంటా.. మీరు సింగర్ రిహానాతో పాటుగా ఖాన్, ఐఖాన్ అంటూ ఎందరినో పిలిచారు. మీ వేడకలో వారు చేసిన డ్యాన్స్ నా ముందు జుజూబీ.. మీరు నా డాన్స్ చూశారా? మున్నీ బద్నామ్ హుయ్ డార్లింగ్ తేరే లియే, తుక్ తుక్ దేఖే, పరదేశియా ఇలా చాలా పాటలు చేశాను. అవన్నీ మీరు చూడలేదు అనుకుంటా. మీరు కోట్లకు కోట్లు డబ్బు ఇచ్చినా రిహానా చిరిగిన బట్టలతో వచ్చింది. నాకు రూ. 10 కోట్లు ఇచ్చి వుంటే మీకు ఎన్నో ప్రయోజనాలు కలిగేవి. మీ అతిథులందరి గదులు శుభ్రం చేయడం నుంచి వంట పాత్రలు కడిగే వరకు అన్నీ నేనే చేసేదాన్ని. అంటూ కామెంట్ చేసింది. అనంత్ బరువుపై కామెంట్లు అనంత్ అంబానీ బరువుపై రాఖీ సావంత్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. ' డియర్ అంబానీ జీ.. అనంత్ అంబానీ బాగా బరువు పెరిగారు.. ఆయన్ను నా వద్దకు 5రోజుల పాటు పంపించండి. కట్టెపుల్లలా సన్నగా చేసి పంపుతాను. దీని కోసమైన కొంత డబ్బు ఇచ్చి నన్ను కొనుక్కోండి. ఆయనతో కసరత్తులు చేయించడమే కాకుండా.. తృప్తి చేసి పంపిస్తాను. అనంత అంబానీని జీరో సైజ్‌కు చేర్చి మీ వద్ద ఉంచే బాధ్యత నాది. ఆయన బరువు తగ్గితే మీతో పాటుగా మీ కోడలు కూడా చాలా సంతోషిస్తుంది. అసలే మీ కోడలు దానిమ్మ పండులా ఉంది. ఆయన సన్నగా అయితే ఆమెకే మంచిది.' అని అనంత్ అంబానీ బరువుపై రాఖీ సావంత్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. దీంతో రాఖీ సావంత్ తీరుపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బరువు పెరిగినట్లు స్వయంగా ఆయన చెబుతూ ప్రీవెడ్డింగ్ వేడుకలోనే ఎమోషనల్ అయ్యాడు. అలాంటి వ్యక్తి గురించి ఇలా వల్గర్‌గా మాట్లాడడానికి సిగ్గులేదా అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆయన అమ్మగారు అయిన నీతా అంబానీ కూడా అనంత్ ఆరోగ్య సమస్యల గురించి గతంలో వివరించారు. అనారోగ్య కారణాలతో కొన్ని రకాల స్టెరాయిడ్స్ వాడటం వల్ల అనంత్ బరువు పెరిగాడని ఆమె చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by TellyMasala (@tellymasala) -
'స్నానం చేస్తుండగా వీడియోలు తీసేవాడు'.. హీరోయిన్ తీవ్ర ఆరోపణలు!
బిగ్ బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి రాఖీసావంత్, ఆమె మాజీ భర్త ఆదిల్ దురానీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవలే జైలు నుంచి బయటకొచ్చిన ఆదిల్.. రాఖీసావంత్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి మోసం చేసిందని ఆరోపించాడు. అంతే కాకుండా నాకు తెలియకుండా అకౌంట్ నుంచి రూ.1.5 కోట్లు విత్ డ్రా చేసిందని ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలోనే రాఖీ సావంత్ సైతం ప్రెస్ మీట్ పెట్టి అంతేస్థాయిలో రివర్స్ కౌంటరిచ్చింది. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. డిప్రెషన్లో నటుడు.. 10 ఏళ్ల బంధానికి స్వస్తి!) మీడియాతో మాట్లాడుతూ ఆదిల్ దురానీపై సంచలన కామెంట్స్ చేసింది. ఆదిల్ తన ప్రియురాలైన ఇరానీ అమ్మాయిపై ఆరు నెలలపాటు అత్యాచారం చేశాడని ఆరోపించింది. అంతే కాకుండా తనను కొట్టి హింసించాడని వాపోయింది. అంతే కాకుండా లైంగిక వేధింపులకు గురిచేసి.. తన నగ్న వీడియోలను రికార్డ్ చేసి దుబాయ్‌లో విక్రయించాడని రాఖీసావంత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేసేవాడని.. అలాంటి వీడియోలు అతని వద్ద చాలా ఉన్నాయని రాఖీ పేర్కొంది. ఆ వీడియోలను దుబాయ్‌లో రూ. 47 లక్షల రూపాయలకు విక్రయించాడని రాఖీ సావంత్ ఆరోపిస్తోంది. ఆదిల్‌కు చాలామందితో వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయని.. మహిళలతో మాత్రమే కాకుండా పురుషులతో కూడా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ప్రత్యక్షంగా చూశానని రాఖీ తెలిపింది. ఆ వీడియోల వల్ల తనకు ఏం చేయాలో తెలియడం లేదని వాపోయింది. నాపై కూడా ఇంట్లోనే అత్యాచారం చేశాడని రాఖీ ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. నగ్న వీడియోలు వైరల్ అవుతాయని అనుక్షణం భయపడుతూ బతికానని చెప్పుకొచ్చింది. ఒక సెలబ్రిటీగా ప్రపంచానికి తన ముఖాన్ని ఎలా చూపించాలని ఆలోచిస్తూ కాలం వెళ్లదీశానని తెలిపింది. కాగా.. పరస్పరం ఆరోపణలు చేసుకున్న రాఖీ-ఆదిల్ 2022లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. (ఇది చదవండి: లగ్జరీ కారు కొనుగోలు చేసిన స్టార్ హీరోయిన్.. ఎన్ని కోట్లంటే? ) -
మాజీ భర్తపై రాఖీ సంచలన కామెంట్స్.. పురుషులతో కూడా అంటూ!
బాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న రాఖీ.. తన మాజీభర్త ఆదిల్ ఖాన్ దురానీపై సంచలన కామెంట్స్ చేసింది. ఇరాన్‌కు చెందిన తన ప్రియురాలిని అత్యాచారం చేసినందుకే ఆదిల్ జైలు జీవితం గడిపాడని తెలిపింది. అంతేకాకుండా ఐదు రోజుల పాటు తీవ్రంగా కొట్టి, హింసించాడని వాపోయింది. ఇటీవలే జైలు నుంచి బయటకొచ్చిన ఆదిల్.. రాఖీ సావంత్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనపై అత్యాచారం కేసు పెట్టేందుకు రాఖీ రూ.3 లక్షలు ఖర్చు చేసిందని ఆదిల్ ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడింది. (ఇది చదవండి: అతనితో డేటింగ్.. కాబోయే భర్త గురించి లైగర్ భామ ఆసక్తికర కామెంట్స్!) పురుషులతో కూడా... రాఖీ సావంత్ మాట్లాడుతూ..'ఆదిల్ తన ఇరానీ గర్ల్‌ఫ్రెండ్‌ను లైంగికంగా, మానసికంగా వేధించాడు. నన్ను కూడా కొట్టి.. తీవ్రంగా హింసించాడు. ఆదిల్ మహిళలతో పాటు పురుషులను కూడా లైంగికంగా వాడుకోవడం చూశా. దుబాయ్‌లో నన్ను చంపడానికి ప్రయత్నించాడు. దురానీ అత్యంత దుర్మార్గుడు. అతనిపై కేసు పెట్టేందుకు నేను ఎవరికీ రూ.3 లక్షలు ఇవ్వలేదు. తాను ఇరానీ గర్ల్ ఫ్రెండ్‌తో దాదాపు 5 ఏళ్లపాటు రిలేషన్లో ఉన్నాడు. ఆమెపై ఆరు నెలల పాటు అత్యాచారం చేశాడు. నన్ను పెళ్లి చేసుకున్న విషయం కూడా ఆమెకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. ఆమెకు, నాకు పచ్చి అబద్దాలు చెప్పి మోసం చేశాడు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు." అంటూ ఏడుస్తూ వాపోయింది. ఆదిల్ ఫేమస్ అవ్వాలని, ఏక్తా కపూర్ టీవీ షోలలో భాగం కావాలని ప్రయత్నించాడని రాఖీ చెప్పింది. మీడియా దృష్టిని ఆకర్షించడానికే తన పేరును ఉపయోగించుకున్నాడని ఆమె పేర్కొంది. కాగా.. గతంలో ఆదిల్‌తో రాఖీ వివాహ వివాదానికి దారితీసింది. మార్చి 2023లో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఆ తర్వాత ఆదిల్ తనను మభ్యపెట్టి రూ. 1.5 కోట్లు తీసుకున్నాడని ఆరోపించింది. అంతే కాకుండా అతనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. గతంలోఆదిల్ తన నగ్న వీడియోలను రికార్డు చేసి అపరిచితులకు అమ్మేకునేవాడని తెలిపింది. అయితే రాఖీ ఆరోపణలన్నింటినీ ఆదిల్ ఖండించాడు. (ఇది చదవండి: 'అశ్లీల వీడియోలు తీసి వేధించింది'.. హీరోయిన్‌పై సంచలన కామెంట్స్!) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Koimoi.com (@koimoi) -
'అశ్లీల వీడియోలు తీసి వేధించింది'.. హీరోయిన్‌పై సంచలన కామెంట్స్!
బాలీవుడ్ భామ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల సోషల్ మీడియాలో విచిత్రమైన రీల్స్ చేస్తూ సందడి చేస్తోంది. అయితే ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో తీవ్రమైన ఒత్తిడికి గురైన రాఖీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గతంలో ఆమె తన భర్త ఆదిల్ ఖాన్ దురానీ విడాకులు, ఆ తర్వాత అమ్మ మరణంతో ఆమె పరిస్థితి అయోమయంగా తయారైంది. రాఖీ సావంత్ తన మాజీ భర్త ఆదిల్‌పై కేసు పెట్టడంతో రిమాండ్‌కు వెళ్లి వచ్చారు. అయితే తాజాగా ఆదిల్.. ఆమె గురించి సంచలన కామెంట్స్ చేశారు. తనపై అన్యాయంగా అత్యాచారం కేసు పెట్టిందని వాపోయాడు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత ఆదిల్ మొదటిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన మాజీ భార్య రాఖీ సావంత్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఆమె చాలా ప్రమాదకరమైన మహిళ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాఖీ సావంత్‌కు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి తనను మోసం చేసిందని ఆరోపించాడు. రితేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోలేదని అన్నాడు. (ఇది చదవండి: నేను పెళ్లి చేసుకుంటానంటే పిల్లలు వద్దంటున్నారు: సుష్మితా సేన్) ఆదిల్ మాట్లాడుతూ.. 'ఆమెతో మాట్లాడటం కూడా చాలా ప్రమాదకరం. ఎందుకంటే మహిళలు ఏదైనా చేయగలరు. ఎందుకంటే 'రేప్' అని అరిచినా మమ్మల్ని అరెస్టు చేసే విధంగా మన రాజ్యాంగం మహిళలకు రక్షణ క ల్పిస్తోంది. అంతే కాకుండా రితేష్‌తో కలిసి రాఖీ నన్ను మోసం చేసింది. అతనితో పెళ్లైన విషయాన్ని రాఖీ దాచిపెట్టి.. విడాకులు తీసుకోకుండానే నాతో రిలేషన్ కొనసాగించింది. తనతో ఉంటూనే మాజీతో బంధాన్ని కొనసాగించింది. యూకే వర్క్ టూర్ గురించి సీక్రెట్‌గా రితేష్‌కి ఆమె మేసేజెస్ పంపింది. ' అంటూ ఘాటు విమర్శలు చేశారు. అంతే కాకుండా శారీరకంగా తనను హింసించిందని వాపోయారు. అతని శరీరంపై గాయాలను చూపిస్తూ ఒక వీడియో రికార్డింగ్‌ను ప్రదర్శించాడు. ఆమెను తాను వేధించినట్లు చెప్పిందంతా అబద్ధమని కొట్టిపారేశాడు. వయసులో ఆమె కంటే చిన్నవాడిని అయినప్పటికీ దుబాయ్‌లో ఆమె కోసం రూ.2.8 కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడించాడు. దుబాయ్‌లో ఓ ఫ్లాట్, బీఎండబ్లూ కారు, నగలతో పాటు ఖరీదైన బహుమతులు కొనిచ్చినట్లు తెలిపాడు. అంతే కాకుండా రాఖీ నాకు తెలియకుండానే అకౌంట్ నుంచి రూ1.5 కోట్లు విత్‌డ్రా చేసిందని ఆరోపించాడు. తనపై తప్పుడు కేసు తనపై తప్పుడు ఆరోపణలతో అత్యాచారం కేసులో పెట్టిందని ఆదిల్ వెల్లడించాడు. ఆమె వల్ల నా జీవితం గందరగోళంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాఖీకి వ్యతిరేకంగా నటి షెర్లిన్ చోప్రా చేసిన కామెంట్స్ నిజమేనన్నారు. ఆమె వలలోకి మరొక వ్యక్తి బలి కాకుండా ఉండాలనేదే తన సంకల్పం అన్నారు. అసభ్యకరమైన వీడియో తీసి.. రాఖీ సావంత్ తనకు డ్రగ్స్ అలవాటు చేసి.. న్యూడ్ వీడియో తీసిందని ఆదిల్ ఆరోపించాడు. అంతే కాకుండా తన తల్లికి క్యాన్సర్ పేరుతో ప్రజలను దోచుకుందని విమర్శలు చేశారు. తల్లికి ఆరోగ్యం బాలేదని ప్రతి నెలా ఒకటి నుంచి రెండు లక్షల రూపాయల వరకు విరాళాలు సేకరించేదని ఆదిల్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆదిల్ చేసిన కామెంట్స్ బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. (ఇది చదవండి: ఉన్నదంతా దానం చేసిన కమెడియన్.. చివరిరోజుల్లో తిండి లేక చనిపోయింది!) -
రెండుసార్లు పెళ్లి.. విడాకులు.. మరోసారి లవ్‌లో పడ్డ రాఖీ
బిగ్‌బాస్ షోతో బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది నటి రాఖీ సావంత్. షో ముగిసిన తర్వాత కూడా ఆ పాపులారిటీని అలాగే కాపాడుకుంది. తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తూ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. ఇటీవలే తన భర్తతో తెగదెంపులు చేసుకున్న ఆమె మరోసారి ప్రేమలో పడిందట! ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించింది. 'నాకు ఒకరు పరిచయం అయ్యారు. అతడు చాలా మంచి వ్యక్తి. కానీ అతడితో జీవితాన్ని పంచుకోవడానికి ఇప్పుడప్పుడే సిద్ధంగా లేను. పెళ్లి బంధం బీటలు వారండంతో డిప్రెషన్లోకి.. నా మొదటి పెళ్లితో ఎన్ని తంటాలు వచ్చాయో, ఎన్ని కష్టాలు పడ్డానో మీ అందరికీ తెలుసు. అందుకే పెళ్లంటేనే భయమేస్తోంది. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకే దుబాయ్ వెళ్లి వచ్చాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. జీవితంలో మనల్ని బాధపెట్టేవాళ్లు ఉంటారు. పుండు మీద కారం చల్లేవాళ్లు కూడా ఉంటారు. కానీ ఆ గాయాలకు ఆయింట్మెంట్ రాసేవారు కొందరే ఉంటారు. వారిని వదిలిపెట్టకుండా మనతోనే ఉంచేసుకుంటే మనకే మంచిది' అని చెప్పుకొచ్చింది రాఖీ సావంత్. తనకంటే చిన్నవాడితో ప్రేమ.. వివాహం.. విడాకులు! కాగా రాఖీ సావంత్ గతంలో రితేశ్ సింగ్‌ను పెళ్లాడింది. అయితే అతడు తనకు ఇదివరకే వివాహమైన విషయాన్ని దాచిపెట్టాడు. పైగా మొదటి భార్యకు విడాకులు కూడా ఇవ్వలేదు. రితేశ్‌కు భార్యాపిల్లలు ఉన్నారని, అతడితో తన పెళ్లి చెల్లదంటూ తెగదెంపులు చేసుకుంది నటి. గతేడాది ప్రేమికుల రోజున భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమలో పడింది. అతడిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆమె ఆ విషయాన్ని ఆలస్యంగా బయటపెట్టింది. కానీ కొంతకాలానికే వీరి మధ్య గొడవలు తలెత్తడంతో చివరకు భర్తను జైల్లో పెట్టించింది రాఖీ సావంత్. అతడితో విడిపోయినప్పటికీ విడాకులు మంజూరవడం కోసం ఎదురు చూస్తోంది. చదవండి: షారుక్ ఖాన్‌కు చేదు అనుభవం -
బాలీవుడ్ నటి సోదరుడు అరెస్ట్
బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్ ఈ ఏడాది ప్రారంభం నుంచి వార్తల్లో నిలుస్తూ ఉంది. మొదట్లో ఆమె తన బాయ్ండ్ అదిల్ దురానీని పెళ్లాడినట్లు చెప్పగా అతడు మాత్రం అలాంటిదేం లేదని అబద్ధమాడాడు. ఆ తర్వాత కొంతకాలానికే రాఖీతో ఏడాది క్రితమే పెళ్లి జరిగిందని అంగీకరించాడు. అంతలోనే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి కాస్తా తారాస్థాయికి చేరడంతో గృహహింస, చీటింగ్ కింద భర్తపై కేసు పెట్టింది నటి. తర్వాత అతడితో విడిపోతున్నట్లు ప్రకటించింది. తాజాగా రాఖీ సావంత్ సోదరుడు, దర్శకనిర్మాత, రచయిత రాకేశ్ సావంత్ అరెస్టయ్యాడు. చెక్ బౌన్స్ కేసులో పోలీసులు అతడిని మే 7న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచినట్లు తెలుస్తోంది. కాగా 2020లో ఓ వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేశ్‌పై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. అప్పుడు కూడా జైలుకు వెళ్లిన రాకేశ్ ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చి బెయిల్‌పై బయటకు వచ్చాడు. కానీ ఇంతవరకు ఆ డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో మరోసారి అతడు జైలుపాలయ్యాడు. చదవండి: ఆ హీరో మమ్మల్ని దారుణంగా మోసం చేశాడు: డైరెక్టర్ -
క్షమాపణలు చెప్పిన రాఖీ సావంత్.. హగ్గులు, కిస్సులతో రచ్చ
బాలీవుడ్ నటి రాఖీ సావంత్.. ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె వివాహ జీవితం ఇప్పుడు బీటౌన్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, రాఖీ, బాలీవుడ్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా మధ్య రాజుకున్న వివాదం సద్దుమణిగింది. ఇద్దరూ మునుపటిలా ఫ్రెండ్స్‌లా కలిసిపోయారు. మీడియా సాక్షిగా ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ముద్దులు, హగ్గులతో తమ ఫ్రెండ్షిప్ను చాటుకున్నారు. తాము ఎప్పటినుంచో ఫ్రెండ్స్ అని, కానీ చిన్న గొడవలతో తమమధ్య దూరం పెరిగిందని, ఇప్పుడు మళ్లీ ముందులా కలిసిపోయామన్నారు. కాగా మీటూ వివాదంలో బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్‌పై షెర్లిన్ చోప్రా లైంగిక ఆరోపణలు చేయగా, రాఖీ సావంత్ అతనికి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఇద్దరు స్నేహితులు బద్దశత్రువలయ్యారు..సోషల్ మీడియాలో తనపై అభ్యంతకర పదజాలాన్ని ఉపయోగించిందని షెర్లిన్ చేసిన ఫిర్యాదుతో రాఖీని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా షెర్లిన్, రాఖీ కలిసిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
కియారా- సిద్ధార్థ్ పెళ్లి.. వెక్కి వెక్కి ఏడ్చిన రాఖీ సావంత్
ఇటీవలే వివాహబంధంలోకి అడుపెట్టిన కియారా అద్వాని- సిద్ధార్థ్ మల్హోత్రా జంటకు బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అభినందనలు తెలిపింది. వారిద్దరి పెళ్లి చాలా అద్భుతంగా జరిగిందని కొనియాడింది. బాలీవుడ్ ప్రేమజంట వివాహా వేడుకను తలుచుకుంటూ కన్నీటి పర్యంతమైంది. ఎవరి పెళ్లి గురించి విన్నా నా గుండెల్లో బాధ మరింత ఎక్కువవుతోందని వాపోయింది. రాఖీ ఏడుస్తున్న వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. రాఖీ మాట్లాడుతూ..' కియారా- సిద్ధార్థ్ పెళ్లి చాలా పవిత్రంగా జరిగింది. కానీ నా జీవితం మాత్రం చాలా దారుణంగా తయారైంది అంటూ ఏడ్చేసింది రాఖీ. ఎవరిదైనా పెళ్లి వార్త వింటే సంతోషంగా అనిపిస్తుంది. కానీ నాకు పెళ్లి పేరు వింటేనే ఏడుపు వచ్చేస్తోంది. నా జీవితం ఎందుకు ఇలా జరుగుతోంది.' అంటూ రోదించింది. కాగా.. గతేడాది ఆదిల్ దురానీతో వివాహం చేసుకున్నట్లు ప్రకటించిన తర్వాత ఆమె జీవితం ఊహించని మలుపులు తిరిగింది. ఆమె భర్తకు మరొకరితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. అతనిపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవలే రాఖీ సావంత్ తల్లి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. వరుస సంఘటనలతో రాఖీ సావంత్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. View this post on Instagram A post shared by Filmymantra Media (@filmymantramedia) -
నాపై పలుమార్లు అత్యాచారం చేశాడు.. నటి భర్తపై ఫిర్యాదు
రాఖీ సావంత్ భర్త ఆదిల్ దురానీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే భర్త మోసం చేశాడంటూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది రాఖీ సావంత్. తాజాగా ఆదిల్‌పై మరో మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఇరాన్ మహిళ ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పెళ్లికి నిరాకరించాడని.. అలాగే చాలా మంది అమ్మాయిలతో ఇలాంటి సంబంధాలు కలిగి ఉన్నాడని ఆ మహిళ ఆరోపించింది. ఇరాన్ మహిళ ఫిర్యాదుతో రాఖీ సావంత్ భర్త ఆదిల్ దురానీపై మైసూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మైసూర్లో సహజీవనం చేసేటప్పుడు పెళ్లి పేరుతో ఆదిల్ తనపై అత్యాచారం చేశాడని ఇరాన్ మహిళ ఆరోపించింది. అయితే ప్రస్తుతం రాఖీ సావంత్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు ఆదిల్. ఐదు నెలల క్రితం తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయగా.. బెదిరించాడని ఇరానీ మహిళ పోలీసులకు తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని బెదిరించాడని పేర్కొంది. అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను లీక్ చేస్తానని చెప్పాడని వాపోయింది. ఈ వార్త విన్న రాఖీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆదిల్‌పై రాఖీ ఓషివారా పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదిల్ తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని రాఖీ కంప్లెంట్లో పేర్కొంది. ఆదిల్‌కు వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) -
నా ప్రైవేట్ వీడియోలు అమ్ముకున్నాడు.. భర్తపై నటి సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ ఫేం రాఖీ సావంత్ తన రెండో భర్త అదిల్ దురానీపై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. అదిల్ కట్నం గురించి తనను వేధించాడని, తన ఇమేజ్‌ని వాడుకొని స్టార్డమ్ పొందాడని ఆరోపించింది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘శృంగారం విషయంలో అదిల్ నన్ను చాలా రకాలుగా హింసించాడు. నా ప్రైవేట్ వీడియోలు కొంతమందికి అమ్ముకున్నాడు. ఆ కేసు ప్రస్తుతం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉంది. చందేల్ అనే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. త్వరలో ఆమెను పెళ్లి చేసుకుంటాడు’ అని రాఖీ సావంత్ ఆరోపించింది. అలాగే తన దగ్గర రూ.1.50 కోట్లు తీసుకొని ఇవ్వడం లేదంటూ.. అతను తీసుకున్నట్లు అంగీకరించిన ఓ పాత వీడియోని షేర్ చేసింది. కాగా, తన భర్త చిత్ర హింసలు పెడుతున్నాడని రాఖీ సావంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ముంబై పోలీసులు అదిల్ దురానీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
తనను హీరో చేయమని కొట్టేవాడు, జీవచ్ఛవంలా ఉన్నాను: నటి
బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్ వ్యవహారం కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది అదిల్ దురానీని పెళ్లాడిన ఆమె ఇటీవలే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కానీ అంతలోనే అతడు తనను వేధిస్తున్నాడని, అతడికి మరో అమ్మాయితో లవ్ ఎఫైర్ ఉందంటూ సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా అదిల్ తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూలో అదిల్పై మరోసారి ఆరోపణలు గుప్పించింది రాఖీ. 'అదిల్ నన్ను చిత్రహింసలు పెట్టేవాడు. తనను హీరో చేయమని కొట్టేవాడు. తనొక పెద్ద వ్యాపారవేత్త అని, నాకు కారు, బంగ్లా గిఫ్ట్‌గా ఇచ్చానని గొప్పలు చెప్పమనేవాడు. ఒకవేళ అలా చెప్పకపోతే నన్ను పెళ్లి చేసుకోనని, నాకు చుక్కలు చూపిస్తానని హెచ్చరించాడు. వేరే అమ్మాయిలతో బెడ్ షేర్ చేసుకుని, ఆ వీడియోలు నాకు పంపిస్తానన్నాడు. వాటిని చూసి నేను గుండెపోటుతో చావాలని కోరుకున్నాడు. అతడికి వ్యతిరేకంగా వెళ్తే ఎవరికైనా 50 వేలు ఇచ్చి నన్ను ట్రక్కుతో గుద్దిచ్చి చంపుతానన్నాడు. అదిల్‌కు ఆల్రెడీ పెళ్లయింది, విడాకులు కూడా అయ్యాయి. ఆ విషయం నా దగ్గర దాచిపెట్టి మోసం చేశాడు. అతడికి చాలామందితో ఎఫైర్లు ఉన్నాయి. అటు అమ్మ చనిపోయింది, ఇటు భర్త నన్ను దారుణంగా మోసం చేశాడు. జీవచ్ఛవంలా బతికున్నాను' అని విలపించింది రాఖీ సావంత్. చదవండి: లోకేశ్ కనకరాజ్‌తో గొడవలు.. లియో నుంచి సైడైన బ్యూటీ -
భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి..!
బిగ్‌బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి రాఖీసావంత్ పెళ్లి అచ్చం సినిమాలాగే రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రియుడు ఆదిల్ దురానీతో పెళ్లయినట్లు ప్రకటించాక టన్నుల కొద్ది ట్విస్టులు బయటకొస్తున్నాయి. ఇటీవలే మరో అమ్మాయితో ఆమె ప్రియునికి సంబంధాలు ఉన్నాయని రాఖీ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా రాఖీ సావంత్ అతనిపై ముంబయి పోలీసులను ఆశ్రయించింది. ఓషివారా పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఆదిల్ తనను మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు చేసింది రాఖీ సావంత్. ఆదిల్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టును మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. అయితే రాఖీ సావంత్ మాత్రం ఆదిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని మీడియాకు తెలిపింది. రాఖీ సావంత్ మాట్లాడుతూ..'ఆదిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశా. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా నాటకం కాదు. అతను నా జీవితాన్ని నాశనం చేశాడు. అతను నన్ను కొట్టి నా వద్ద డబ్బు తీసుకున్నాడు. నిన్నెవరు నమ్ముతారని కొట్టేవాడు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయి. తన తల్లి మరణానికి కూడా ఆదిల్ కారణం.'అంటూ ఆరోపించింది. కాగా.. రాఖీ సావంత్, ఆదిల్ ఖాన్ ఈ ఏడాది జనవరిలో తన పెళ్లిని అఫీషియల్‌గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతేడాది జూలైలోనే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Telly Talk (@tellytalkindia) View this post on Instagram A post shared by Filmymantra Media (@filmymantramedia) -
నన్ను మానసికంగా చిత్రహింసలు పెట్టాడు: రాఖీ సావంత్
బిగ్‌బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి రాఖీసావంత్ వివాహం రోజుకో మలుపు తిరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే తన భర్త అదిల్ దురానీతో ఎలాంటి వివాదం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ ఈ జంట మధ్య సయోధ్యం కుదిరినట్లు భావించారు. కానీ కథ మరోసారి అడ్డం తిరిగింది. మొదట ఈ పెళ్లి ఫేక్ అని కొట్టి పారేసిన ఆమె ప్రియుడు ఆదిల్ మళ్లీ ప్లేట్ ఫిరాయించాడు. అతనికి మరొకరితో వివాహేతర సంబంధముందని ఆరోపించిన రాఖీ సావంత్ ఆమె పేరును సైతం మీడియాకు వెల్లడించింది. ఈ క్రమంలోనే కన్నీటి పర్యంతమైంది రాఖీ. ఆమె ఏడుస్తూ తన బాధలను మీడియాకు వివరించింది. ఆదిల్ ఆ అమ్మాయితోనే ఉండాలనుకుంటున్నాడని రాఖీ ఆరోపిస్తోంది. రాఖీ బోరున విలపిస్తూ మీడియా ముందు తన బాధను వ్యక్తం చేసింది. నా వద్ద వారిద్దరికీ సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయని తెలిపింది. నన్ను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయింది. ఈ సందర్భంగా ఆమె భర్త ఆదిల్.. తను అనే అమ్మాయితో వెళ్లాడని వివరించింది. రాఖీ సావంత్ మాట్లాడుతూ..'ఆదిల్.. తను అనే అమ్మాయితోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. బాలీవుడ్లో నా సొంత కష్టంతోనే ఎదిగాను. బాలీవుడ్ల సంపాదించిన నా డబ్బు అంతా ఆదిల్ తీసుకున్నాడు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా నన్ను టార్చర్ చేశాడు. పెళ్లి తర్వాత అతనిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసింది. ఆదిల్ తనను అత్యంత దారుణంగా హింసించాడు.' అంటూ రోదించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరికొందరు రాఖీ సావంత్‌కు అండగా ఉంటామని పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by India Forums (@indiaforums) View this post on Instagram A post shared by @varindertchawla . View this post on Instagram A post shared by @varindertchawla -
నేను మరో సుశాంత్ కావాలనుకోవడం లేదు: రాఖీ సావంత్ భర్త
బాలీవుడ్ నటి రాఖీ సావంత్- ఆదిల్ దురానీ ఎపిసోడ్ ఎన్నో మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆదిల్‌కు మరో అమ్మాయితో సంబంధముందని రాఖీ ఆరోపించారు. అయితే రాఖీ చేసిన ఆరోపణలపై ఆదిల్ ఖాన్ దురానీ స్పందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇటీవల తన భర్త ఆదిల్ ఖాన్ దురానీకి వివాహేతర సంబంధం ఉందని రాఖీ ఆరోపించింది. ఆదిల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేను మరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కావాలనుకోవడం లేదు. నేను స్త్రీల గురించి మాట్లాడకపోతే తప్పుగా అర్థం కాదు. నేను నా మతాన్ని గౌరవిస్తాను. అలాగే స్త్రీలను గౌరవించడం నేర్చుకున్నా. నేను అలా చేసినట్లు ఆమె చెప్పే విధానం నేను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా ఉండటానికి ఇష్టపడను.' అని అన్నారు. కాగా.. అంతలోనే రాఖీ మరో సమావేశంలో తనకు, ఆదిల్ మధ్య ఇప్పుడు అంతా బాగానే ఉందని తెలిపింది. -
నా భర్తకు మరొకరితో ఎఫైర్.. నన్ను వాడుకున్నాడంటూ ఏడ్చేసిన నటి
బిగ్‌బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్ వైవాహిక జీవితం చిక్కుల్లో పడింది. ఇప్పటికే తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రాఖీకి తన ప్రవర్తనతో తలనొప్పిలా తయారయ్యాడు ఆమె భర్త అదిల్ దురానీ. అదిల్ తనను కాదని మరో అమ్మాయితో తిరుగుతున్నాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది నటి. జిమ్ నుంచి బయటకు వస్తూ అక్కడున్న మీడియాతో తన గోడు వెల్లబోసుకుంది రాఖీ సావంత్. 'నా పెళ్లి ప్రమాదంలో పడింది. అదిల్ మరో అమ్మాయికి దగ్గరవుతున్నాడు. ఖురాన్ మీద ఒట్టేసి మరీ ఆ అమ్మాయి నెంబర్ బ్లాక్ చేసి తనను మర్చిపోతానన్నాడు. కానీ అతడు మాట తప్పాడు. అదిల్ పెద్ద మోసగాడు. ఆ అమ్మాయి దగ్గర కొన్ని డర్టీ ప్రూఫ్స్ ఉండటంతో నా భర్తను బ్లాక్మెయిల్ చేస్తోంది. దయచేసి ఎవరూ అదిల్‌ను ఇంటర్వ్యూ చేయకండి. ఎందుకంటే అతడు నన్ను వాడుకుని ఇండస్ట్రీకి వద్దామనుకున్నాడు. జిమ్‌కు నాకోసం వచ్చేవాడు కాదు. నా ద్వారా ఇంటర్వ్యూలతో ఫేమస్ అవుదామనుకున్నాడు. కాబట్టి ఎవరూ అతడిని స్టార్‌ను చేయొద్దు. అదిల్‌ను పెళ్లి చేసుకుంటే నాకంటూ మంచి కుటుంబం ఉంటుందనుకున్నా. అతడితో కలిసి బిడ్డను కనాలనుకున్నా. అంతలోనే ఇన్ని శిక్షలు.. ఎందుకు మా ఇద్దరి మధ్యలో దూరి నన్ను టార్చర్ పెడుతున్నారు..' అంటూ బోరుమని విలపించింది రాఖీ. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా రికార్డ్ స్టార్ హీరో నన్ను కాల్ గర్ల్‌లా వాడుకున్నాడు: నటి -
రాఖీ సావంత్ ఇంట్లో తీవ్ర విషాదం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్‌లో బాధపడుతున్న ఆమె తల్లి జయ కన్నుమూశారు. రాఖీ సావంత్ తల్లి చనిపోయిందని నటి భర్త ఆదిల్ దురానీ ధృవీకరించారు. కాగా.. ఆమె కొద్ది రోజులుగా ఆస్పత్రిలో బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడుతోంది. చికత్స పొందుతూ ముంబయిలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తన తల్లి మరణ వార్తను రాఖీ సావంత్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. తల్లి ఆసుపత్రిలో ఉన్న వీడియోను పోస్ట్ చేసిన రాఖీ ఎమోషనల్ నోట్ రాసింది. ‘ఇకపై నన్ను ఆశీర్వదించే మా అమ్మ చేయి నా తలపై ఉండదు. ఇంకా నేను కోల్పోవడానికేమీ లేదు. అమ్మా.. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. మిస్ యూ అమ్మా' అని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు, నటీనటులు ధైర్యం చెబుతున్నారు. ఇటీవలే రాఖీ సావంత్‌ను సమస్యలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. తల్లి మరణంతో మరింత విషాదంలో మునిగిపోయింది నటి. తల్లి మరణాన్ని తట్టుకోలేక బోరున ఏడ్చేసింది రాఖీ సావంత్. View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) -
సీక్రెట్ నిఖా.. తల్లి కాబోతున్న రాఖీ సావంత్?
బిగ్‌బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్ గతేడాది గుట్టుచప్పుడు కాకుండా నిఖా చేసుకుంది. కానీ ఆ విషయాన్ని చాలా ఆలస్యంగా ఇటీవలే బయటపెట్టింది. మొదట్లో అలాంటిదేం లేదన్న ప్రియుడు అదిల్.. తర్వాత మాత్రం అవును పెళ్లి జరిగిందని తలూపాడు. ఇక అప్పటినుంచి కొత్త పెళ్లికూతురిలా ఫీలవుతోంది రాఖీ. తన దగ్గరకు ఎవరైనా అభిమానులు వచ్చినా సరే డోంట్ టచ్ మీ.. అంటూ కొత్తగా ప్రవర్తిస్తోంది. ఇకపోతే రాఖీ సావంత్ తల్లి కాబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే విషయమై రాఖీని అడగ్గా ఆమె అవునని కానీ కాదని కానీ ఎలాంటి సమాధానమివ్వలేదు. నో కామెంట్స్ అంటూ సైలెంట్‌గా వెళ్లిపోయింది. అయితే రాఖీ గర్భం దాల్చిన మాట వాస్తవమేనట. బిగ్‌బాస్ మరాఠీ షోలో ఈ విషయాన్ని రాఖీ వెల్లడించినట్లు తెలుస్తోంది. కానీ ఎవరూ దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే ఆ సంతోషం తనకు ఎంతోకాలం నిలవలేదు. తనకు గర్భస్రావం అవడంతో తీవ్ర మనోవేదనకు గురైందట రాఖీ. ఇకపోతే తన పెళ్లి గురించి ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'గతేడాది జూలైలోనే మా వివాహం జరిగింది. కానీ అదిల్‌కు మా పెళ్లి విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం ఇష్టం లేదు. అందుకే నేను గమ్మునుండిపోయా. నన్ను పెళ్లి చేసుకున్నానని అందరికీ తెలిస్తే తన చెల్లికి పెళ్లవుతుందో లేదోనని భయపడ్డాడు. కానీ సల్మాన్ భాయ్ అతడికి నచ్చజెప్పడంతో చివరకు పెళ్లి జరిగిందని అంగీకరించాడు' అని చెప్పుకొచ్చింది. చదవండి: ఇంకెన్నిసార్లు ఇదే సినిమా వేస్తార్రా బాబూ.. ఇక చాలు -
హలో బ్రదర్.. కాస్త దూరంగా ఉండు.. ఫ్యాన్ పై రాఖీ సావంత్ ఫైర్
-
ఏయ్.. డోంట్ టచ్ మీ.. నాకు పెళ్లైపోయింది: నటి
బిగ్‌బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి రాఖీ సావంత్ గతేడాది జూలైలో ప్రియుడిని సీక్రెట్‌గా పెళ్లాడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇటీవలే సోషల్ మీడియాలో లీక్ కావడంతో నిజంగానే తమ పెళ్లి జరిగిపోయిందని స్పష్టం చేసింది. కానీ ఆమె ప్రియుడు అదిల్ ఖాన్ మాత్రం రాఖీని పెళ్లి చేసుకోలేదని వాదించాడు. ఆ తర్వాత మాత్రం కొన్ని పరిస్థితుల వల్ల నిజాన్ని దాయాల్సి వచ్చిందని చెప్తూ వివాహం చేసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. దీంతో వీరి పెళ్లి గోల ముగిసిపోయింది. అయితే రాఖీకి అదిల్ మొదటి నుంచే కొన్ని కండీషన్లు పెట్టాడు. పొట్టి, కురచ దుస్తులు ధరించడానికి వీల్లేదని, కాస్త పద్ధతిగా తయారవ్వాలని నిబంధనలు విధించాడు. ఇష్టమొచ్చిన డ్రెస్సులు వేస్తే తన కుటుంబానికి నచ్చదని చెప్పాడు. దీంతో ప్రియుడి కోసం అతడి కుటుంబం కోసం తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చింది రాఖీ. అదిల్ సెలక్ట్ చేసిన దుస్తులే వేసుకునేది. ఇకపోతే అతడిని పెళ్లాడిన విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాక సంతోషంతో గాల్లో తేలియాడుతుందామె. ఈ క్రమంలో తాజాగా ఓ అభిమానితో ఆమె ప్రవర్తించిన తీరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఓ అభిమాని రాఖీతో సెల్ఫీ దిగేందుకు కాస్త దగ్గరగా జరిగాడు. దీంతో రాఖీ.. 'హలో బ్రదర్.. కాస్త దూరంగా ఉండు.. ఇప్పుడు నాకు పెళ్లైంది' అని చెప్పింది. అందుకు ఆ వ్యక్తి సరేనని తలూపుతూనే సెల్ఫీ దిగాడు. 'ఇంతకుముందంటే వేరు, కానీ ఇప్పుడు మీరు నన్ను ముట్టుకోవడానికి కూడా వీల్లేదు, అర్థమైందా?' అని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాఖీ మాటలు విన్న నెటిజన్లు పడీపడీ నవ్వుతున్నారు. 'పోయిన ఏడాది వివాహం చేసుకుని ఇప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్నట్లు బిల్డప్ ఇస్తుందేంటి?', 'అబ్బో, టచ్ చేయొద్దా.. భలే కామెడీగా మాట్లాడుతుందే..' అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: మూడేళ్ల తర్వాత సుశాంత్‌ను చేరుకున్న పెంపుడు కుక్క రవితేజ ఖాకీ డ్రెస్ వేస్తే సినిమా బ్లాక్‌బస్టరే! -
రాఖీ సావంత్ పెళ్లి.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ప్రియుడు..!
బిగ్‌బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి రాఖీసావంత్ వివాహం కీలక మలుపు తిరిగింది. మొదట ఈ పెళ్లి ఫేక్ అని కొట్టి పారేసిన ఆమె ప్రియుడు ఆదిల్ ప్లేట్ ఫిరాయించాడు. ఆమెతో వివాహం జరిగిన మాట వాస్తవమేనని తాజాగా అంగీకరించారు. తన ప్రియుడు ఆదిల్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. కానీ ఈ పెళ్లి ఫేక్ అంటూ ఆదిల్ ప్రకటన చేయడంపై రాఖీ బోరున విలపిస్తూ మీడియా ముందు తన బాధను వ్యక్తం చేసింది. (ఇది చదవండి: 'పది రోజుల్లో నా పరువు తిరిగొస్తుందా'.. బోరున ఏడ్చేసిన నటి) ఆదిల్ ఖాన్ దురానీ జులై 2022లోనే పెళ్లి చేసుకున్నట్లు రాఖీ సావంత్ ఇటీవల మీడియాతో వెల్లడించింది. ఆదిల్ ఫేక్ అంటూ చేసిన ప్రకటనపై కన్నీటి పర్యంతమైంది. రాఖీ జీవితంలో ఈ షాకింగ్ ట్విస్ట్‌ల తర్వాత.. ఆమె భర్త ఆదిల్ ఖాన్ ఎట్టకేలకు వివాహం చేసుకున్నట్లు ధృవీకరించారు. ఈ విషయాన్ని ఆదిల్ తన ఇన్,స్టా ద్వారా వెల్లడించారు. ఆదిల్ తన ఇన్స్టాగ్రామ్ రాఖీతో తన పెళ్లికి సంబంధించిన ఫోటోను పంచుకున్నారు. ఆమెతో వివాహం చేసుకోనని తాను ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నాడు. రాఖీని తాను ముద్దుపేరుతో కూడా పిలుస్తానని తెలిపారు. ఆదిల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' చివరగా ఇవాళ ప్రకటన వచ్చింది. నేను వివాహం చేసుకోనని రాఖీతో ఎప్పుడూ చెప్పలేదు. కేవలం కొన్ని విషయాలను చర్చించాల్సి వచ్చింది. అందుకే నిశ్శబ్దంగా ఉండవలసి వచ్చింది. మనకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రాఖీ (పప్పుడి).' అంటూ పోస్ట్ చేశారు. ఈ చూసిన వెంటనే రాఖీ స్పందిస్తూ "ధన్యవాదాలు జాన్" అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి మరో నటి దేవోలీనా భట్టాచార్జీ కూడా వీరి పెళ్లికి శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Adil Khan Durrani (@iamadilkhandurrani) -
నాకే ఎందుకు ఇన్ని కష్టాలు.. బోరున ఏడ్చేసిన నటి రాఖీ సావంత్
-
'పది రోజుల్లో నా పరువు తిరిగొస్తుందా'.. బోరున ఏడ్చేసిన నటి
బిగ్‌బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి రాఖీసావంత్ ఇటీవలే ప్రియుడు అదిల్ ఖాన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రాఖీ- అదిల్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో లవ్ బర్డ్స్ ఇద్దరూ దండలు మార్చుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుండగా.. వారి చేతిలో మ్యారేజ్ సర్టిఫికెట్ పట్టుకుని కనిపించారు. కానీ ఈ పెళ్లి ఫేక్ అంటూ ఆదిల్ ప్రకటన చేయడంపై రాఖీ స్పందించింది. బోరున విలపిస్తూ మీడియా ముందు తన బాధను వ్యక్తం చేసింది. రాఖీ సావంత్ మాట్లాడుతూ.. 'పది రోజుల్లో పోయినా నా పరువు తిరిగొస్తుందా? పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కావాలంటే మీరు కోర్టుకు వెళ్లి చెక్ చేయండి. ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరు. ఒక మహిళ పెళ్లి చేసుకునేది ఇంటికి రావడానికే కదా. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు. నా విషయంలో సల్మాన్ జీ ఏం చేస్తారు? నేను ఆయనను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. ఆదిల్ చేస్తే ఏదైనా చేయాలి. మా అమ్మ ఇప్పడిప్పుడే నడుస్తోంది.' అంటూ కన్నీటి పర్యంతమైంది రాఖీ సావంత్. కాగా రాఖీ సావంత్ గతేడాది భర్త రితేశ్‌తో విడిపోగా, అతడి నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసింది. అనంతరం మైసూర్‌కు చెందిన బిజినెస్మెన్ అదిల్‌తో ప్రేమలో పడ్డ ఆమె అతడిని ప్రియుడిగా మీడియాకు పరిచయం చేసింది. ఇటీవలే బిగ్‌బాస్ మరాఠీ నాలుగో సీజన్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది రాఖీ. ఇకపోతే ప్రస్తుతం రాఖీ తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. తన తల్లి బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడుతోందని, తను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండని అభిమానులను కోరింది రాఖీ సావంత్. -
ప్రియుడిని సీక్రెట్‌గా పెళ్లాడిన రాఖీ సావంత్, ఫోటో వైరల్
బిగ్‌బాస్ కంటెస్టెంట్ రాఖీసావంత్ ప్రియుడు అదిల్ ఖాన్‌ను సీక్రెట్‌గా పెళ్లాడింది. రాఖీ- అదిల్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో లవ్ బర్డ్స్ ఇద్దరూ దండలు మార్చుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుండగా.. వారి చేతిలో మ్యారేజ్ సర్టిఫికెట్ ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఫోటోలో రాఖీ కొన్ని పత్రాలపై సంతకం చేస్తున్నట్లుగా ఉంది. ఇకపోతే నెట్టింట వైరల్ అవుతున్న పెళ్లి సర్టిఫికెట్ ఆధారంగా వారు గతేడాదే పెళ్లి చేసుకున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ విషయాన్ని ఎందుకు గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టారనేది తెలియాల్సి ఉంది. కాగా రాఖీ సావంత్ గతేడాది భర్త రితేశ్‌తో విడిపోగా, అతడి నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసింది. అనంతరం మైసూర్‌కు చెందిన బిజినెస్మెన్ అదిల్‌తో ప్రేమలో పడ్డ ఆమె అతడిని ప్రియుడిగా మీడియాకు పరిచయం చేసింది. ఇటీవలే బిగ్‌బాస్ మరాఠీ నాలుగో సీజన్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది రాఖీ. ఇకపోతే ప్రస్తుతం రాఖీ తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. తన తల్లి బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడుతోందని, తను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండని అభిమానులను కోరింది రాఖీ సావంత్. View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) చదవండి: సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న బుల్లితెర బ్యూటీ ధమాకా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే? -
ఈ ఏడాది విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే..
సినీ ఇండస్ట్రీలో ప్రేమ- విడాకులు చాలా కామన్ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడాకులు తీసుకున్న సెలబ్రిటీల లిస్ట్ అంతకంతకూ ఎక్కువైపోయింది. ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న దంపతులు సైతం తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టేశారు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకొని చివరికి కోర్టు మెట్లు ఎక్కారు. 2022 ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. త్వరలోనే 2023లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరెవరో ఓసారి చూసేద్దామా.. ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ తమిళ స్టార్ హీరో ధనుష్- రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభంలోనే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. తమిళ నాట స్టార్ కపుల్‌గా గుర్తింపు పొందిన ఈ జంట 2004 నవంబర్ 18న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యుల నిర్ణయంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి నాటికి ధనుష్ వయసు 21 ఏళ్లు, ఐశ్వర్య వయసు 23 ఏళ్లు. ఈ దంపతులకు యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. సాఫీగా సాగిపోతుందనుకున్న వీరి వైవాహిక బంధంలో మనస్పర్థలు ఏర్పడి ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. యోయో హనీసింగ్- షాలినీ తల్వార్ బాలీవుడ్ ర్యాపర్, మ్యూజిక్ కంపోజర్ యో యో హనీసింగ్ తన పదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. సుమారు పదేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన హనీసింగ్-షాలినీలు 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. కానీ మనస్పర్థలు రావడంతో సెప్టెంబర్ 8న విడాకులు తీసుకున్నారు. ఇక హనీసింగ్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఇతర మహిళలతో వివాహేతర సంబంధంపెట్టుకున్నాడని ఆరోపిస్తూ షాలిని కోర్టును ఆశ్రయించడంతో వివాదం రచ్చకెక్కింది. ఇదిలా ఉంటే షాలినీతో విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే హనీసింగ్ తన గర్ల్‌ఫ్రెండ్ టీనా తడానితో చెట్టాపట్టాలేసుకొని తిరగడం మీడియా కంట పడింది. రాజీవ్ సేన్- చారు అసోపా మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకులు వ్యవహరం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. టీవీ నటి చారు అసోపా- రాజీవ్ సేన్లు 2019 జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న కూతురు జియానా ఉంది. అయితే పెళ్లయిన ఏడాదిన్నరగే విడిపోతున్నట్లు ప్రకటించి అందిరికి షాక్ ఇచ్చిన ఈ దంపతులు తమ కూతురి కోసం కలిసి ఉండాలనుకుంటున్నామంటూ ఇటీవల తమ విడాకులను రద్దు చేసుకున్నారు. కానీ మళ్లీ ఏమైందో ఏమో కానీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం భార్యభర్తలుగా విడిపోతున్నామని, కేవలం కూతురు జియానుకు తల్లిదండ్రులుగా ఉంటున్నామని తెలిపారు. రాఖీ సావంత్- రితేష్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నానుతూ ఉంటుంది రాఖీ సావంత్. బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయిన ఆమె ఈ ఏడాది వాలంటైన్స్ డే రోజు తన భర్త రితేశ్ సింగ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది.రితేశ్‌కు ఆల్రెడీ పెళ్లైన విషయాన్ని తన దగ్గర దాచిపెట్టాడని, వారు విడాకులు తీసుకోలేదు కాబట్టి చట్టబద్ధంగా తమ వివాహం చెల్లదండూ అతడితో తెగదెంపులు చేసుకుంది. మాజీ భర్త జ్ఞాపకాలను సైతం వదిలించుకుంది. ఇక ప్రస్తుతం తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమలో మునిగితేలుతుంది. సుస్మితా సేన్-లలిత్ మోదీ మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్ ప్రేమ వ్యవహారం మీడియాలో ఎంత హాట్‌టాపిక్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు తనకంటే 15 ఏళ్ల చిన్నవాడైన మోడల్ ప్రముఖ మోడల్ రోహ్మన్తో ప్రేమాయణం నడిపిన సుస్మితా తాజాగా మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీతో సహజీవనం చేస్తుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు మాల్దీవుల్లో షికార్లు చేసిన ఫొటోలు, లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా పిక్స్‌ను స్వయంగా లలిత్ మోదీ షేర్ చేశాడు. ఈ సందర్భంగా సుస్మితాను తన బెటర్ హాఫ్(భార్య) అంటూ పరిచయం చేశాడు మోదీ. ఆ తర్వాత ప్రస్తుతం తాము డేటింగ్లో ఉన్నామనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహరం మీడియాలో, సోషల్ మీడియాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ లలిత్ మోదీకి గుడ్‌బై చెప్పి ప్రస్తుతం రోహ్మన్తోనే సుస్మితా కలిసి ఉంటున్నట్లు తెలుస్తుంది. సోహైల్ ఖాన్-సీమా సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి పెళ్లిళ్లు అచ్చొచ్చినట్లు కనిపించడం లేదు. ఇప్పటికే అర్బాజ్ ఖాన్ విడాకులు తీసుకోగా, ఇప్పుడు సల్మాన్ మరో తమ్ముడు సోహైల్ ఖాన్ కూడా భార్య నుంచి విడిపోయాడు. ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న సోహైల్- సీమా ఖాన్లు 24 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ప్రేమించి, పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న సోహైల్-సీమా ఖాన్లు విడాకులు తీసుకోవడం బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే వీరి విడాకుల వెనుక ఓ హీరోయిన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీతో సొహైల్ ఖాన్ కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి. కారణం ఏదైనా తమ వివాహ బంధానికి ముగింపు పలికారు ఈ బ్యూటిఫుల్ కపుల్. -
ముదిరిన బాలీవుడ్ భామల వివాదం.. రాఖీ సావంత్‌పై షెర్లిన్ చోప్రా ఫిర్యాదు
బాలీవుడ్ హీరోయిన్స్ రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మీటు వివాదంలో బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్‌పై షెర్లిన్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో రాఖీ సావంత్ సాజిద్ ఖాన్‌కు మద్దతుగా మాట్లాడడంతో వివాదం నడుస్తోంది. దీంతో ఒకరిపై ఒకరు పోలీసులకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంబోలి, ఓషివారా పోలీస్ స్టేషన్లలో రాఖీపై ఫిర్యాదు చేసినట్లు షెర్లిన్ చోప్రా ట్వీట్ ద్వారా వెల్లడించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన షెర్లిన్ చోప్రా అనంతరం మీడియాతో మాట్లాడింది. కెమెరాల ముందు ఓ వీడియోను ప్రదర్శిస్తూ రాఖీ సావంత్‌పై విరుచుకుపడింది. నా గురించి కాదు బయట మాట్లాడాల్సింది.. మొదట మీ సోదరుడు రాజ్ కుంద్రా గురించి బహిర్గతం చేయి అంటూ సవాల్ విసిరింది. సాజిద్ ఖాన్‌పై మీటూ ఆరోపణలు చేసినవారు చెప్పిందంతా అబద్ధమేనా అంటూ రాఖీ సావంత్‌పై షెర్లిన్ చోప్రా ఫైరయ్యారు. రాఖీ సావంత్, ఆమె లాయర్ సైతం ఆధారాలతో సహా షెర్లిన్ చోప్రాపై కేసు పెట్టినట్లు తెలిపారు.షెర్లిన్ డబ్బు కోసం శక్తివంతమైన వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేస్తుందని రాఖీ సావంత్ ఆరోపించింది. 2018లో సాజిద్ ఖాన్‌పై మీటూ ఆరోపణలు రావడంతో పలువురు నటీమణులు లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. షెర్లిన్‌తో పాటు సలోని చోప్రా, అహానా కుమ్రా, మందన కరిమి సహా అతనిపై ఆరోపణలు చేశారు. नौटंकीबाज़ राखी सावंत तैयार हो जाए गिरफ़्तार होने के लिए। IPC 354 IPC 354A IPC 499 IPC 500 IPC 509 IPC 503 IT ACT 67A (Sec 4 of Indecent Representation Act 1999) P.S. कांउटर कंप्लेंट करने से अपराध कम नहीं होने वाले 😊@mieknathshinde @Dev_Fadnavis @CPMumbaiPolice @MumbaiPolice pic.twitter.com/czz9lfakyj — Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) November 6, 2022 -
ఇంత ద్వేషమా? అతడు సూసైడ్ చేసుకుంటాడు: ఏడ్చేసిన నటి
మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న దర్శకుడు సాజిద్ ఖాన్‌ను వెంటనే బిగ్‌బాస్ షో నుంచి తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే! పలువురు తారలు అతడి వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెడుతూ సాజిద్‌ను షోలో కొనసాగించవద్దని కోరుతున్నారు. ఈ క్రమంలో అతడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది నటి రాఖీ సావంత్. సాజిద్‌ను బతకనివ్వండంటూ మీడియా ముందు ఏడ్చేసింది. ఇంకా రాఖీ మాట్లాడుతూ.. 'నిజం చెప్పాలంటే, సాజిద్ నాలుగేళ్లుగా శిక్ష అనుభవించాడు. అప్పుడెందుకు ఎవరూ నోరు మెదపలేదు. హో.. ఇప్పుడు అతడు బిగ్‌బాస్‌కు వెళ్లాడు, ఈ సమయంలో అతడి గురించి మాట్లాడితే మీరు హైలైట్ అయి జనాల కంట్లో పడతారనా..! అతడు అమాయకుడా? నిందితుడా? అనేది నాకు తెలియదు. కానీ నాలుగేళ్ల నుంచి సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్నాడు. ఇంత శిక్ష అనుభవించాక కూడా ఇంకా అతడిని దోషిగానే చూస్తారా? ఇన్నేళ్ల తర్వాత బిగ్‌బాస్ ఆఫర్ వస్తే ఇప్పుడు పనిగట్టుకుని పబ్లిసిటీ స్టంట్ కోసం అతడి మీద రాళ్లు రువ్వుతున్నారు. ఇందుకు మీరు కాస్తైనా సిగ్గుపడాలి. తను కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు మీరెందుకు అడ్డుపడుతున్నారు. సాజిద్ నాకు చుట్టమో, స్నేహితుడో కాదు. కానీ మానవత్వం ఉన్న మనిషిగా అతడి పరిస్థితిని అర్థం చేసుకోగలను. అందరూ అతడిమీద ఇలాగే ద్వేషాన్ని చూపిస్తే అది తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నా చేసుకుంటాడు' అంటూ ఏడ్చేసింది రాఖీ సావంత్. ఒకవేళ తనకు బిగ్‌బాస్ షోలోకి వెళ్లే అవకాశం వస్తే అతడి మీద వచ్చిన ఆరోపణలు నిజమా? కాదా? అని సాజిద్నే నిలదీసి నిజం బయటపెడతానని చెప్పింది బిగ్‌బాస్ బ్యూటీ. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: నాగచైతన్య మూవీలో ఆ హీరోయిన్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పిన సమంత -
నటి రాఖీ సావంత్‌కు శస్త్రచికిత్స.. 4గంటలపాటు సర్జరీ
బాలీవుడ్లో ఐటం సాంగ్స్‌తో పేరు సంపాదించుకున్న అందాల భామ రాఖీ సావంత్. బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయిన రాఖీ బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక తరుచూ వార్తల్లో నిలుస్తోంది. భర్త రితేశ్ సింగ్‌తో బ్రేకప్, అంతలోనే బిజినెస్‌మెన్‌తో లవ్, ఎంగేజ్మెంట్.. ఇలా నిత్యం సెన్సేషన్ అవుతోందీ నటి. తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమాయణం సాగిస్తూ ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకొని తిరుగుగుంది ఈ బ్యూటీ. అయితే తాజాగా రాఖీ సావంత్‌కు సంబంధించిన ఓ వార్త ఆమె ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తుంది. ఇటీవలె మేజర్ సర్జరీ చేయించుకున్న రాఖీ తన పరిస్థితిని అభిమానులతో షేర్ చేసుకుంది. గర్భాశయంలో కణతి వల్ల తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. దీంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ముంబైలోని క్రిటికేర్ హాస్పిటల్ జుహులో సుమారు 4గంటలపాటు శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ తర్వాత చాలా బలహీనంగా అనిపించింది అంటూ రాఖీ తెలిపింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఆమె ఫ్యాన్స్ సహా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
కిస్, అత్యాచార సీన్లు మాత్రమే చేయమంటున్నారు: నటి
ప్రియుడు అదిల్ దురానీతో లవ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది బాలీవుడ్ నటి రాఖీ సావంత్. అయితే సోషల్ మీడియాలో తనను తరచూ ట్రోల్ చేస్తున్నారని, కానీ అది ఒకింత మంచిదే అంటోందీ బ్యూటీ. తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'జనాలు ట్రోల్ చేయకపోతే మేము స్టార్స్ ఎలా అవుతాం? వాళ్ల పని వాళ్లను చేయనివ్వండి. మహా అయితే తిడతారు, కానీ చంపరు కదా! అందరూ మన గురించి స్వీట్‌గా మాట్లాడితే డయాబెటిక్స్ వస్తుంది. కాబట్టి జీవితంలో కొంత చేదు కూడా ఉండాలి. ఇలాంటి ట్రోలింగ్ వల్ల మనిషి ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది. కాకపోతే నా విషయంలో అలా జరగదులెండి. మీరు నన్నెంత మార్చాలనుకున్నా నేను నాకు నచ్చినట్లుగానే ఉంటాను. నేనేం ఎవరినీ హింసించట్లేదు, నిజాయితీగా మసులుకుంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నా. ఎక్స్పోజింగ్ ఆపి వెళ్లి ఇంట్లో కూర్చో అనేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ నేను బాలీవుడ్లో ఎక్కువరోజులు ఉండటానికే అలా రెడీ అవుతాను. పొట్టి బట్టలు, చర్మం కనిపించేలా దుస్తులు ధరించడం వల్లే నాకంటూ కొంత గుర్తింపు వచ్చింది. దానికితోడు బాగా కష్టపడ్డాను కాబట్టే ఇండస్ట్రీలో ఉంటున్నాను. నేను సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తున్నాను. కానీ నా ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని నాకు కేవలం అత్యాచార సన్నివేశాలు ఇస్తున్నారు. నాకది నిజంగా నచ్చడం లేదు. కేవలం ముద్దు సీన్లు, రేప్ సీన్లలో మాత్రమే నేను ఎందుకు నటించాలి? నేను మంచి డ్యాన్సర్‌ను. ఇంతకుముందు ఐటం సాంగ్స్ కూడా చేశాను. అలాగే మంచి నటిని కూడా! నా నటనను నిరూపించుకునేందుకు ఒక్క మంచి ఛాన్స్ ఇవ్వండి. అలాంటి ఆఫర్ రాకపోవడం వల్లే ఇలా మీడియా ముందు నటించాల్సి వస్తోంది. అందరికీ మంచి పాత్రలు ఇచ్చినట్లే నాకూ ఇచ్చి చూడండి' అని విజ్ఞప్తి చేసింది బిగ్‌బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్. చదవండి: అమ్మ బాబోయ్, ఒంటి మీద నూలుపోగు లేకుండా హీరో పోజులు! మేమిద్దరం ఒకే గదిలో ఉంటే.. ఇక అంతే: సామ్ షాకింగ్ రియాక్షన్ -
నటికి షాకిచ్చిన కొత్త బాయ్‌ఫ్రెండ్, 2 గంటల పాటు ఎయిర్ పోర్టులోనే..
బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక నటి రాఖీ సావంత్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. భర్త రితేశ్ సింగ్‌తో బ్రేకప్, ఆ వెంటనే బిజినెస్‌మెన్‌తో లవ్, ఎంగేజ్మెంట్.. ఇలా నిత్యం సెన్సేషన్ అవుతోందీ రాఖీ. తనకంటే ఆరేళ్ల చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమలో పడింది. అతడితో కొత్త జీవితం ప్రారంభించాలని ఆశగా ఎదురు చూస్తోన్న ఆమెకు తాజాగా అతడు షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎక్కడ చూసిన ఆదిల్‌తో జంటగా దర్శనమిస్తున్న ఆమె బుధవారం ముంబై ఎయిర్‌పోర్టులో ఒంటరిగా కనిపించింది. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను చూడానికి మీడియా పర్సన్స్ తమ కెమెరాలకు పని చెప్పారు. చదవండి: ఆయన కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ ఈ సందర్భంగా రాఖీతో వారు మాట్లాడుతున్న వీడియోను ప్రముఖ బాలీవుడ్ రిపోర్టర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం ఇది వైరల్‌గా మారింది. ఇందులో రాఖీ మాట్లాడుతూ.. బాయ్‌ఫ్రెండ్ ఆదిల్ కలిసేందుకు ఢిల్లీ వెళ్లానని, కానీ అతడు తనన కలవలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఆదిల్ కోసమే ఇలా రెడీ అయ్యానని, ఫ్లయిట్లో రెండు గంటల పాటు ఏడవడంతో తన కాజల్ చెరిగిపోయిందంటూ. నేను నిన్న ఢిల్లీకి వెళ్లి, ఈ రోజు ముంబైకి వచ్చానని మీకు తెలుసా? అతడు నన్ను కలుసుకునేందుకు కూడా రాలేదు. మేము ఇద్దరం కలిసి ముంబైకి రావాల్సి ఉంది. కానీ నేను ఒక్కదాన్నే వచ్చాను. నేను ఎంతో బాధలో ఉన్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆదిల్ కాల్ చేయండి, వీడియో కాల్ మాట్లాడండి అని ఓ మీడియా వ్యక్తి రాఖీకి సూచించాడు. చదవండి: పెళ్లి వార్తలపై స్పందించిన నిత్యా మీనన్ దీంతో ఆమె తాను అతడికి ఫోన్ చేసే ప్రసక్తే లేదని చెప్పింది. తనకు ఆత్మగౌరవం ఉందని, వెనక్కి తగ్గేదే లేదు అని వ్యాఖ్యానించింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెకు సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ‘నీ మాజీ భర్త రితేష్ లాగే ఇతను కూడా నిన్ను వదిలించుకున్నాడు’ కాగా రాఖీ ఇప్పటికే పలువురితో సహాజీవనం, పెళ్లి, విడాకులతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. 2009లో ‘రాఖీ కా స్వయంవర్’ రియాలిటీ షో ద్వారా పరిచయమైన ఎలేష్ పురుంజన్ వాలాను భాగస్వామిగా ఎంపిక చేసుకుంది. అతడితో కొన్ని నెలల డేటింగ్ అనంతరం విడిపోయింది. ఆ తర్వాత 2019లో ఎన్ఆర్ఐ రితేష్‌ను వివాహం చేసుకుని 2022 ప్రారంభంలో విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ వెంటనే ఆదిల్ దుర్రానీతో ప్రేమలో పడింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నన్ను పెళ్లాడితే నా ప్రియుడి చెల్లికి పెళ్లి కాకుండా పోతుందా?
బాలీవుడ్ బ్యూటీ, బిగ్‌బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్, వ్యాపారవేత్త అదిల్ ఖాన్ కొద్ది నెలలుగా డేటింగ్లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే! అయితే రాఖీ డ్రెస్సింగ్ స్టైల్‌పై అదిల్, అతడి కుటుంబం కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది. పద్ధతి మార్చుకోవాలని సెలవిచ్చింది. దీంతో కాబోయే అత్తమామల మాటలను తు.చ తప్పకుండా పాటించింది రాఖీ. మరీ బోల్డ్‌గా ఉండే డ్రెస్సులు వేసుకోవడం మానేసింది. పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లినా కూడా అదిల్ సెలక్ట్ చేసిన దుస్తులనే ధరిస్తోంది. అయినప్పటికీ రాఖీని పెళ్లి చేసుకునేందుకు అదిల్ రెడీ అవడాన్ని పలువురు తప్పుపట్టారు. తాజాగా ఈ విషయంపై రాఖీ సావంత్ మాట్లాడుతూ ఎమోషనలైంది. 'బాలీవుడ్లో ఎందరో ముస్లింలు ఉన్నారు. వాళ్లకు పెళ్లిళ్లు కావడం లేదా? ఆ అమ్మాయిలు ఎక్స్పోజ్ చేయడం లేదా? ఐటం సాంగ్స్‌లో ఆడిపాడటం లేదా? నేను అదిల్‌ను పెళ్లి చేసుకున్నా అది అతడి కుటుంబంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపించదు. కానీ కొందరు అనవసరంగా ఏదేదో వాగుతున్నారు. అదిల్ నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే అతడి చెల్లిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అని కామెంట్ చేస్తున్నారు. ఏంటీ చెత్తవాగుడు? నేనేమైనా ఉగ్రవాదినా? నేను పెళ్లి చేసుకోకూడదా? నా వల్ల ఆమెకు సంబంధాలు ఎందుకు చెడిపోతాయి? ఏదేమైనా పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయిస్తారన్న మాట గుర్తుపెట్టుకుంటే మంచిది' అని చెప్పుకొచ్చింది. చదవండి: తన లవ్ మ్యారేజ్ గురించి ఓపెన్ అయిన ఇంద్రజ రూ. 1000 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన హీరో? -
నా మాజీ భర్త చేసిన పనికి చావే నయమనుకున్నా: నటి
బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ బ్యూటీ రాఖీ సావంత్ కొద్ది నెలల క్రితం రితేశ్ సింగ్‌తో విడిపోయిన విషయం తెలిసిందే! మొదట్లో తనను బాగానే చూసుకున్న అతడు రానురానూ తనను, తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడని వాపోయింది రాఖీ. ప్రస్తుతం వ్యాపారవేత్త అదిల్ దురానీతో ప్రేమలో ఉన్న ఆమె ఒకానొక సమయంలో తన మాజీ భర్త చేసిన పనికి ఉరేసుకోవాలనిపించిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ బీటౌన్‌లో వైరల్‌గా మారింది. అందులో రాఖీ మాట్లాడుతూ.. తాను బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తన తల్లి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉంటే రితేశ్ కనీసం ఆమెను పట్టించుకోలేదని, హాస్పిటల్ బిల్లులు కూడా కట్టలేదని చెప్పుకొచ్చింది. అతడి ప్రవర్తనతో ఆ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లిపోయానని ఉరేసుకుని చనిపోదామనిపించిందని తెలిపింది. తన చావుకు కారణం మాజీ భర్త రితేశ్ కారణం అని చావుకు ముందు సెల్ఫీ వీడియో తీసుకోవాలనుకున్నానని పేర్కొంది. తన మనసును ఎంతగానో గాయపర్చిన అతడిని ఎప్పటికీ క్షమించబోనని అంటోంది రాఖీ సావంత్. చదవండి: మావాడికి నేను ఎక్స్పోజింగ్ చేస్తే నచ్చట్లే, అందుకే ఇలా.. -
నా ప్రియుడికి నచ్చట్లే, అందుకే ఎక్స్పోజింగ్ మానేశా: నటి
బిగ్‌బాస్ షోతో బాగా పాపులర్ అయింది రాఖీ సావంత్. కానీ ఎప్పుడైతే షో నుంచి బయటకు వచ్చిందో అప్పటినుంచి ఆమెను కష్టాలు వెంటాడాయి. తను ఎంతగానో ప్రేమించి పెళ్లాడిన వ్యక్తికి ఇదివరకే వివాహమైందని తెలియడంతో ఆమె గుండె పగిలేలా ఏడ్చింది. భార్యాబిడ్డలున్న వ్యక్తితో తాను జీవితం పంచుకుని వారికి మోసం చేయలేనంటూ అతడికి విడాకులిచ్చేసింది. అయితే కొంతకాలానే వ్యాపారవేత్త అదిల్ దురానీతో ప్రేమలో పడింది. రాఖీనే సర్వస్వం అనుకున్న అతడు ఆమెతో పెళ్లికి ముందే ప్రియురాలి కోసం ఖరీదైన కారు, బంగ్లా కొనిపెట్టాడు. అయితే రాఖీకి ఓ షరతు పెట్టాడు. ఎక్స్పోజింగ్ ఉండే బట్టలు వేసుకోవద్దని సూచించాడు. మొదట్లో రాఖీ ఆ మాటలను పెద్దగా లక్ష్య పెట్టలేదు. కానీ అదిల్ కుటుంబానికి కూడా తన డ్రెస్సింగ్ సెన్స్ నచ్చకపోవడంతో చివరకు తనే మనసు మార్చుకుంది. శరీరాన్ని వీలైనంతవరకు కప్పి ఉంచే బట్టలనే ధరిస్తోంది. తాజాగా ఈ విషయంపై రాఖీ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో ఉండాలంటే స్కిన్ షో చేయడం తప్పనిసరి. సల్వార్ డ్రెస్‌తో కెరీర్ ఆరంభించినా తర్వాతి సినిమాలో బికినీ వేసుకోక తప్పదు. ఎందుకంటే ఇండస్ట్రీలో నాకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరు. స్వయంకృషితోనే ఆఫర్లు తెచ్చుకోవాలి. కానీ అదిల్‌కు నేను ఎక్స్పోజింగ్ చేసేలా డ్రెస్సులు వేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అవార్డుల ఫంక్షన్‌కు నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో అదిలే నిర్ణయిస్తాడు. అతడు ఎంపిక చేసినవాటినే నేను ధరిస్తున్నాను. అటు ఇండస్ట్రీని, ఇటు అదిల్ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని ఓ లిమిట్లో ఉండాలనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా రాఖీ సావంత్ హిందీ బిగ్‌బాస్ మొదటి సీజన్‌తో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బిగ్‌బాస్ 14వ సీజన్లోనూ హౌస్‌లో అడుగుపెట్టి హల్చల్ చేసింది. చదవండి: ప్రియుడితో సీరియల్ నటి పెళ్లి, ఫొటోలు చూశారా? ఏడువారాల నగలు కొనిచ్చిన కార్తీకదీపం నటుడు -
మాజీ భర్త నిలువుదోపిడీ చేశాడు, ఛీ అతడికి సిగ్గనేదే లేదు
ఈ ఏడాది ప్రేమికుల రోజే భర్తతో తెగదెంపులు చేసుకుంది రాఖీ సావంత్. అతడు తనకిదివరకే పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి మోసం చేశాడంటూ సోషల్ మీడియాలో బోరుమంది. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నవాడితో కలిసి ఉండేదే లేదంటూ బ్రేకప్ చెప్పేసింది. కొంతకాలానికే రాఖీ అదిల్ దురానీ అనే బిజినెస్‌మెన్‌తో ప్రేమలో పడింది. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందనుకుంటున్న క్రమంలో మాజీ భర్త రితేశ్ వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది రాఖీ. అన్ని రకాలుగా తనను నిలువు దోపిడీ చేసిన రితేశ్ సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి ఆ డబ్బును వాడుకుంటున్నాడని ఆరోపించింది. ఈ క్రమంలో మాజీ భర్త గురించి ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పుకొచ్చింది. 'రితేశ్ నాకు కారు గిఫ్టిచ్చిన మాట వాస్తవమే. కానీ అది నేనెప్పుడో అతడికి తిరిగిచ్చేశాను. అతడి జ్ఞాపకాలు ఏవీ నాకు అవసరం లేదు. నా కోసం కోట్లు ఖర్చు చేశాడని చెప్పుకు తిరుగుతున్నాడు, అది పూర్తిగా అవాస్తవం. నాకు ఇచ్చిన నగలు కూడా నకిలీవే. ఓసారి మా అమ్మకు ఆరోగ్యం బాగోలేనప్పుడు నా నగలు అమ్ముదామని దుకాణానికి వెళ్తే అవి నకిలీవని తెలిశాయి. ఇలా చేయడానికి నీకు సిగ్గనిపించడం లేదా? అని అతడికి మెసేజ్ చేశాను. దానికతడు స్పందిస్తూ నీకదే ఎక్కువ అని రిప్లై ఇచ్చాడు. చదువుసంధ్య లేనిదాన్నని ఎప్పుడూ తిడుతుండేవాడు. నా అకౌంట్స్ హ్యాక్ అయిన విషయం వార్తల్లోకెక్కడంతో అతడు వాటిని తిరిగిచ్చేశాడు. ఇప్పుడు నేను అన్నింటి పాస్వర్డ్స్ మార్చేశాను. పోలీసులకు చేసిన ఫిర్యాదు కూడా వెనక్కు తీసుకుంటాను. నిజంగా ప్రేమించేవారు కేసులు పెట్టరు. రితేశ్‌ను నేను ప్రేమించి, పెళ్లి చేసుకుంది నిజం. కానీ అతడు ప్లేటులో భోజనం పెట్టి విసిరేసేవాడు. కొట్టేవాడు. అయినా సరే నేనతడి కాళ్లు పట్టుకుని నాతో ఉండమని బతిమాలేదాన్ని. ఆ తర్వాత తనకు పెళ్లై, పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టాడని తెలిసింది. నిలువునా మోసపోయాను. మా అమ్మను ఆస్పత్రిలో చేర్పించాక ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. అప్పుడు సల్మాన్ ఖాన్ నన్ను ఆదుకున్నాడు. ఇప్పుడు నా ప్రియుడితో కొత్త జీవితం మొదలుపెడదామంటే కూడా అడ్డుపడుతున్నాడు' అని చెప్పుకొచ్చింది రాఖీ సావంత్. చదవండి: సబ్స్క్రిప్షన్లు ఎక్కువైపోయాయా? ఈ ఓటీటీల్లో ఫ్రీగా చూసేయొచ్చు -
ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్! ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ వార్నింగ్
బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక నటి రాఖీ సావంత్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. భర్త రితేశ్ సింగ్‌తో బ్రేకప్, అంతలోనే బిజినెస్‌మెన్‌తో లవ్, ఎంగేజ్మెంట్.. ఇలా నిత్యం సెన్సేషన్ అవుతోందీ నటి. ఇటీవలే తన ప్రియుడిని సైతం పరిచయం చేసింది. తనకంటే ఆరేళ్ల చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమలో ఉన్నట్లు మీడియాకు వెల్లడించింది. అలా లవ్‌లో పడిందో లేదో అప్పుడే ప్రియుడి నుంచి బీఎమ్‌డబ్ల్యూ కారు సైతం కానుకగా అందుకుంది. ఈ మధ్య ఓ ఫంక్షన్లో ఆమె వేలికి డైమండ్ రింగ్ కనిపించడంతో వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగిపోయిందని అందరూ ఫిక్సైపోయారు. ఇక నచ్చినవాడితో ఏడడుగులు వేద్దామనుకుంటున్న తరుణంలో రాఖీ సావంత్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది మరెవరో కాదు అదిల్ మాజీ ప్రేయసి రోషిన దెలవరి. అదిల్ తనవాడని, అతడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని వార్నింగ్ ఇచ్చిందట! అదిల్‌తో నాలుగేళ్లు రిలేషన్లో ఉన్నానని, అతడు ఎప్పటికీ తన సొంతమనే చెప్పిందట. ఈ మాటలు విని షాకైన రాఖీ వెంటనే ప్రియుడిని నిలదీయగా.. అతడు ఆమెతో ప్రేమలో పడ్డ విషయాన్ని అంగీకరించాడట. కాకపోతే అది గతమని, ఆమెతో ఎప్పుడో బ్రేకప్ అయిందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాఖీ ఓ ఇంటర్వ్యూలోనూ స్పష్టం చేస్తూ రోషిని అదిల్ ఎక్స్‌గర్ల్‌ఫ్రెండ్ మాత్రమేనని తెలిపింది. ఏదేమైనా త్వరలో అతడిని పెళ్లాడబోతున్నానని చెప్పుకొచ్చింది. చదవండి: నా సినిమాను చంపేశారు: శేఖర్ నిర్మాత ఆవేదన విజయ్, సామ్‌కు గాయాలు.. నిజమా ? ఇదిగో క్లారిటీ.. -
మాజీ భర్త గుర్తులను వదిలించుకున్న బ్యూటీ
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తన భర్త రితేశ్ సింగ్‌తో విడిపోయిన విషయం తెలిసిందే. రితేశ్‌కు ఆల్రెడీ పెళ్లైన విషయాన్ని తన దగ్గర దాచిపెట్టాడని, వారు విడాకులు తీసుకోలేదు కాబట్టి చట్టబద్ధంగా తమ వివాహం చెల్లదని బాధపడింది. అటు రితేశ్ కూడా మొదటి భార్యతో ఉండేందుకే సిద్ధపడి రాఖీని నిర్లక్ష్యం చేయడంతో వాలంటైన్స్‌డే రోజు అతడితో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది రాఖీ సావంత్. మాజీ భర్త జ్ఞాపకాలను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్న రాఖీ తాజాగా తన ఒంటిపై ఉన్న రితేశ్ అనే టాటూను కూడా తీసేయించుకుంది. పచ్చబొట్టును తీసేటప్పుడు నొప్పి పెడుతున్నా దాన్ని పంటికింద భరించింది. 'మూడేళ్ల జర్నీ.. రితేష్, నువ్వు నా జిందగీలో నుంచే కాదు, నా శరరీంలో నుంచి కూడా శాశ్వతంగా వెళ్లిపోయినట్లే.. మీరు పీకల్లోతు ప్రేమలో మునిగితే ఇలా పచ్చబొట్టు వేయించుకోకండి.. ఎందుకంటే దాన్ని తీసేయడం చాలా కష్టం' అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) చదవండి: యాంకర్ సుమతో నటించడం నా అదృష్టం -
అవకాశాల కోసం 15ఏళ్లకే ఆ సర్జరీ చేయించుకున్నా : నటి
బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ బిగ్‌బాస్‌లో పొల్గొని మరింత పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇది వరకు కేవలం కాంట్రవర్సీ క్వీన్‌గానే గుర్తింపు పొందిన రాఖీ బిగ్‌బాస్ అనంతరం మోస్ట్ ఎంటర్టైనర్గా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది. అయితే ఈ ప్రయాణం అంత సులవైంది కాదని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో పాట్లు పడ్డాను. 15-16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్నాను. అది నన్ను ఎంతో భయపెట్టింది. బాలీవుడ్లో చోటు సంపాదించాలని కలలు కన్నాను. ఆ సమయంలో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్‌లు సైతం సర్జరీలు చేయించుకుంటున్నారు. బాలీవుడ్లో అవకాశాలు రావాలంటే ముఖం, శరీరం చక్కని ఆకృతిలో ఉండాలని చెప్పారు. ఈ సమయంలో నేను సరైన రీతిలో లేను. దీంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది అని రాఖీ చెప్పుకొచ్చింది. కాగా రాఖీ బ్రెస్ట్ ఇంప్లాంట్‌తో పాటు లైపో సక్షన్ వంటి ప్రయత్నాలు చేసి హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. -
ఒక్కసారి కూడా ముద్దు పెట్టకపోతే సిగ్గనుకున్నా.. కానీ!
వాలంటైన్స్ డే రోజే భర్త రితేశ్ సింగ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది నటి రాఖీ సావంత్. రితేశ్ తన దగ్గర ఎన్నో విషయాలు దాచిపెట్టాడని, తనకు తెలియకుండా చాలా సంఘటనలు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా విడాకుల విషయాన్ని ప్రకటించింది బిగ్‌బాస్ కంటెస్టెంట్. ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో విడాకులకు గల కారణాన్ని విపులంగా వివరించింది రాఖీ. 'బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక చాలా విషయాలు తెలుసుకున్నాను. రితేశ్‌కు ఇదివరకే పెళ్లైందని, వారికి ఓ బాబు ఉన్నాడని తెలిసి నా గుండె పగిలిపోయింది. అతడు తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు కాబట్టి మా వివాహం చట్టబద్ధంగా చెల్లదు. నిజానికి మేము ఈ ఏడాది పిల్లలను కనాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ అంతలోనే ఇలా జరిగింది. మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా నేనే అతడిని ముద్దు పెట్టుకున్నాను, కానీ రితేశ్ మాత్రం కనీసం నన్ను తాకనైనా తాకలేదు. సిగ్గుపడుతున్నాడేమో అనుకున్నాను, కానీ ఇలాంటివాడనుకోలేదు. నేను ఎంతగానో ప్రేమించిన అతడు నన్ను వదిలేయడానికే సిద్ధపడ్డాడు. నన్ను ఒంటరిగా వదిలేయొద్దని అతడి కాళ్లు పట్టుకుని బతిమాలినా వినిపించుకోకుండా నా జీవితంలో నుంచి వెళ్లిపోయాడు. ఒకవేళ అతడు నాతో మళ్లీ కలిసి ఉండాలనుకుంటే మాత్రం మంచి ఇల్లు, కారు కొన్న తర్వాతే తన దగ్గరకు రావాలి' అని కండీషన్ పెట్టింది రాఖీ సావంత్. View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) చదవండి: Rakhi Sawant Divorce: వాలంటైన్స్‌డే రోజు బాలీవుడ్ జంట విడాకులు! -
చాలా బాధగా ఉంది.. హాట్ బ్యూటీ విడాకులు
వాలంటైన్స్ డే.. ప్రేమను అభివ్యక్తీకరించే రోజు.. రెండు మనసులు ఒక్కటయ్యే వేడుక.. ఆల్రెడీ లవ్‌లో ఉన్నవాళ్లు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకునే స్పెషల్ డే. ఇలాంటి ప్రేమికుల రోజున విడిపోతున్నామని ప్రకటించిందో బాలీవుడ్ జంట. వివాదాస్పద నటి రాఖీ సావంత్ తన భర్త రితేష్ సింగ్‌తో విడిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. 'రితేష్, నేను విడిపోవాలని నిశ్చయించుకున్నాం. బిగ్‌బాస్ షో తర్వాత నాకు తెలియకుండా చాలా జరిగాయి. వాటిలో కొన్నింటిని నేను నియంత్రించలేకపోయాను. మేము మా మధ్య ఉన్న మనస్పర్థలను, గొడవలను పరిష్కరించుకునే ప్రయత్నం చేశాం. కానీ చివరాఖరకు ఇద్దరం విడివిడిగా ముందుకు సాగితేనే మంచిదని తెలుసుకున్నాం. వాలంటైన్స్‌డేకు ఒకరోజు ముందే ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. హృదయం ముక్కలైనట్లుగా అనిపిస్తోంది. విడాకుల తర్వాత రితేష్ మంచి జీవితం గడపాలని కోరుకుంటున్నా. నేను నా జీవితంపై, కెరీర్‌పై ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఎల్లప్పుడూ నన్ను నేను సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటున్నాను. మా నిర్ణయాన్ని గౌరవించి, నాకు అండగా నిలబడే ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు..' అని రాఖీ సావంత్ రాసుకొచ్చింది. కాగా రితేష్‌కు గతంలో స్నిగ్ధప్రియతో వివాహం జరగగా వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ పెళ్లి విషయాన్ని దాచిపెట్టి రితేష్ రాఖీ సావంత్‌కు దగ్గరయ్యాడని ఆమధ్య స్నిగ్ధప్రియ ఆరోపించిన విషయం తెలిసిందే. కట్టుకున్న భార్యను తానుండగా రాఖీతో అతడి బంధం చెల్లదని సైతం పేర్కొంది. View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) -
నా భర్త నాకు వివాహేతర సంబంధం అంటగట్టాడు,
హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన రితేష్ సింగ్ తన భార్య స్నిగ్ధప్రియపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె ఓ వ్యక్తితో పారిపోవడానికి ప్రయత్నించిందని, తన కొడుకును కనీసం చూడటానికి కూడా అనుమతించలేదని ఆరోపించాడు. తాజాగా ఈ ఆరోపణలపై స్నిగ్ధప్రియ తీవ్రంగా స్పందించింది. 'అతడి ఇంటర్వ్యూల్లో నా మేనల్లుడితో నాకు సంబంధం అంటగట్టడం సహించలేకున్నాను. త్వరలోనే ఫిర్యాదు చేసి ఆయనకు బుద్ధి చెప్తాను. నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకోవట్లేదు. అందుకే అతడి నుంచి నా బిడ్డను దూరంగా ఉంచుతున్నాను' అని చెప్పుకొచ్చింది. మరో ఇంటర్వ్యూలో రితేష్ రాఖీ సావంత్‌ను మోసం చేస్తున్నాడని పేర్కొంది. బిగ్‌బాస్ హౌస్‌లో రితేష్, రాఖీ సావంత్‌తో ప్రవర్తించిన తీరు నన్ను తీవ్రంగా బాధించింది చెప్పుకొచ్చింది. ఆరేళ్ల కొడుకుతోపాటు అధికారిక భార్యగా తానుండగా ఈ విషయాన్ని దాచిపెట్టి అతడు రాఖీసావంత్‌కు దగ్గరయ్యాడని విమర్శించింది. రాఖీతో అతడి బంధం చెల్లదని కుండ బద్ధలు కొట్టింది. వివాదం కారణంగా అతడు తమకు దూరంగా ఉంటున్నాడని వెల్లడించింది. అందరికీ చెప్పుకుంటున్నట్లుగా రితేష్ ఎన్ఆర్ఐ కాదని, అతడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రమేనని స్పష్టం చేసింది. -
బిగ్‌బాస్: వాళ్లవి నిద్రమొహాలు, ఆమె ఎందుకూ పనికిరాదు!
బిగ్‌బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్. బుల్లితెర ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఈ రియాలిటీ షోను ఎప్పటికప్పుడు గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుంటారు నిర్వాహకులు. గత సీజన్లను మించిపోయేలా రెట్టింపు వినోదాన్ని అందించాలని ఉవ్విళ్లూరుతుంటారు. బిగ్‌బాస్ హౌస్ డిజైన్ దగ్గర నుంచి కంటెస్టెంట్ల ఎంపిక వరకు ప్రతీది చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ మధ్యే హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్ వైభవంగా ప్రారంభమైంది. ఈసారి సల్మాన్ ఖాన్ స్థానంలో కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ఓటీటీ ప్లాట్‌ఫామ్ వూట్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి కంటెస్టెంట్లు పరమ బోర్ తెప్పిస్తున్నారంటోంది బాలీవుడ్ నటి రాఖీ సావంత్. కేవలం నిద్రపోవడానికే కొందరు బిగ్‌బాస్ షోకు వెళ్లారని పెదవి విరుస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలామంది కంటెస్టెంట్లు అది చేస్తాం, ఇది చేస్తాం అని బీరాలు పలుకుతూ హౌస్‌లోకి వెళతారు. కానీ అక్కడికి వెళ్లాక అందరూ బొక్క బోర్లా పడతారు. ఈసారి హౌస్‌లో అడుగు పెట్టిన సింగర్ నేహా భాసిన్ అయితే షోలో ఎందుకూ పనికి రాకుండా పోయిందని విమర్శించింది. మరో ఇద్దరు కంటెస్టెంట్లు మిలింద్, రాకేశ్ నిద్ర పోవడానికే షోకి వచ్చినట్లుందని, కరోనా వల్ల ఈ రెండేళ్లు నిద్రపోలేదా అన్నట్లు ప్రవర్తిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వారు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి గేమ్ ఆడితే బాగుంటుందని చురకలంటించింది. ఈ ఇద్దరూ వేరేవాళ్ల గొడవలో తలదూర్చరని, పోనీ వాళ్లైనా గొడవపడతారా? అంటే అదీ లేదని.. అసలు వీళ్లు ప్రేక్షకులకు ఏమాత్రం వినోదం అందించట్లేదని పెదవి విరిచింది. -
హీరోయిన్ డ్రెస్ చూసి వెంటపడ్డ కుక్క
-
బిగ్‌బాస్ హౌస్‌లోకి నటి ఎంట్రీ.. వెంటబడ్డ కుక్కలు
సాక్షి, ముంబై : వివాదాస్పద నటి రాఖీ సావంత్ బిగ్‌బాస్‌లో పాల్గొని యమ క్రేజ్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది వరకు కేవలం కాంట్రవర్సీ క్వీన్‌గానే గుర్తింపు పొందిన రాఖీ బిగ్‌బాస్ సీజన్14 అనంతరం మోస్ట్ ఎంటర్టైనర్గా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది. అయితే ఇటీవలె తనను మరోసారి బిగ్‌బాస్ సీజన్-15 ఓటీటీలోకి సైతం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. స్పైడర్ ఉమెన్ గెటప్ వేసి, ముంబై వీధుల్లో తిరుగుతూ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్మడి డిమాండ్‌కి బిగ్‌బాస్ సైతం దిగొచ్చింది. దీంతో ఈ సీజన్ ఓటీటీలోనూ రాఖీకి అవకాశం కల్పించారు. దీంతో మామూలు కంటే కాస్త ఎక్కువగానే ముస్తాబైన రాఖీ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా ఆమెను కుక్కలు వెంబడించాయి. భారీ డ్రెస్‌తో కారు దిగి సెట్లోకి అడుగుపెడుతుండగా అక్కడే ఉన్న కుక్కులు ఆమెను వెంబడించాయి. దీనికి సంబంధించిన వీడియోను రాఖీ సావంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. అయితే అదృష్టవశాత్తూ అవి కరవలేదు. లేదంటే హౌస్ కంటే ముందు ఆమె హాస్పిటల్‌కి వెళ్లాల్సి వచ్చేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా హిందీ బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఒకసారి పాల్గొన్న కంటెస్టెంట్లకు మరో సీజన్లోనూ పాల్గొనే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ సీజన్ వూట్ జరుగుతుండగా.. కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. చదవండి : మెగా అభిమానం : క్యూబ్స్‌తో 6.5 ఫీట్ల చిరు ఫోటో సీక్రెట్‌గా హీరో కార్తికేయ ఎంగేజ్మెంట్.. ఫోటో వైరల్ Bigg Boss: షాకింగ్.. ‘బిగ్‌బాస్’ కోసం నడి రోడ్డుపై నటి హల్చల్ View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) -
‘బిగ్‌బాస్’లోకి తీసుకోవాలంటూ నడిరోడ్డుపై నటి హల్చల్
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాష ఏదైనా సరే.. బిగ్‌బాస్ షో మొదలైందంటే చాలు.. టీఆర్పీ రేటింగ్స్ ఓ రేంజ్లో పెరిగిపోతాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. అందుకే ఈ బిగ్ రియాల్టీ షోకి భారత్‌లో ఎనలేని క్రేజ్ఉంది. హీరో, హీరోయిన్ల నుంచి మొదలు.. సోషల్ మీడియా సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారు. తాజాగా వివాదాస్పద నటి రాఖీ సావంత్ తనను బిగ్ బాస్ 15 ఓటీటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. మంగళవారం ఉదయం స్పెడర్ ఉమెన్ గెటప్ వేసి, ముంబై వీధుల్లో తిరుగుతూ హల్ చల్ చేసింది. అభిమానులతో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. తాను రాఖీని కాదని.. స్పైడర్-ఉమెన్ అని అంటూ వినోదాత్మక చేష్టలతో అభిమానులను అలరించింది. తనకు బిగ్‌బాస్ షో అంటే చాలా ఇష్టమని చెబుతూ.. ఓటీటీ సీజన్లోకి తనను ఆహ్వానించకపోవడం బాధగా ఉందంటూ ఓ వీడియోని షేర్ చేసింది. సిద్ధార్థ్ శుక్లా.. షెహ్నాజ్ గిల్ లను ఆహ్వానించి.. తనను ఎందుకు ఆహ్వానించలేదని ఆమె ప్రశ్నించింది. ప్రస్తుతం రాఖీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ సీజన్ వోట్ జరుగుతుండగా.. కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
'టౌటే'తో బాల్కనీ పైకప్పు కూలిపోయింది: నటి
ముంబై : ఓ వైపు కరోనా సెకండ్‌వేవ్‌తో ప్రజలు అల్లాడుతుంటే టౌటే తుఫాన్ మరింత కష్టాలు తెచ్చిపెట్టింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ప్రారంభమైన టౌటే తుపాను ధాటికి ముంబై సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. మే నెలలో అత్యధికంగా 24 గంటల వ్యవధిలో 230 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి.. వీధులు నీటితో నిండిపోయాయి. తుపాను ప్రభావంతో అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో ముంబైలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాలా ఇళ్లల్లో టీవీలు, ఇంటర్నెట్ కనెక్షన్లు పనిచేయడం లేదు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇంటి నుంచి పనిచేసే (వర్క్ ఫ్రం హోమ్) ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక టౌటే తుపాను తనకు కూడా ఎంతో నష్టం కలిగించిందని నటి రాఖీ సావంత్ తెలిపారు. ముంబైలో కురిసిన భారీ వర్షాలకు తన ఇంటి బాల్కనీ పైకప్పు కుప్పకూలిపోయిందని వెల్లడించారు. ఇది చూసి తానెంతో బాధపడుతున్నానని, నిన్నటి నుంచి పైకప్పు నుంచి పడుతున్న వర్షపు నీటిని బకెట్‌తో బయట పారబోశానని తెలిపింది. అంతేకాకుండా తుపాను ధాటికి చెట్లు విరిగిపోవడం గురించి స్పందిస్తూ.. ఇప్పటికే ప్రజలు ఆక్సిజన్ సిలిండర్లు లేక ప్రాణాలు కోల్పోతుంటే ఇలా చెట్లు విరిగిపోతే మనకు ప్రాణవాయువు ఎక్కడినుంచి వస్తుంది? ఇంకా దేవుడు ఏమేం చేయాలనుకుంటున్నాడో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టౌటే తుపాను మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించింది. తుపాను ప్రభావంతో ఇప్పటికి 100 మంది వరకు గల్లంతయినట్టు సమాచారం. ప్రస్తుతం అతి తీవ్ర తుపానుగా ఉన్న టౌటే మరికొద్ది గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. చదవండి : ఐటెం గర్ల్ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్ Amitabh Bachchan: ఆఫీసును ముంచెత్తిన వరద -
ఐటెం గర్ల్ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్
ముంబై : రాఖీ సావంత్.. బిగ్‌బాస్ సీజన్ 14లో మోస్ట్ ఎంటర్టైనర్గా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. బోల్డ్నెస్తో పాటు కాంట్రవర్సీ క్వీన్‌గానూ పేరొందిన రాఖీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్లో తనకు ఐటెం గర్ల్ అన్న గుర్తింపు రావడం పట్ల ఎలాంటి రిగ్రెట్స్ లేవని, అయినా తనకు హీరోయిన్ పాత్ర పోషించేంత టాలెంట్ కూడా లేదని తెలిపింది. 'బాలీవుడ్లో ప్రతీ ఒక్కరూ హీరోయిన్ కాలేరు. కొందరికి ఐటెమ్ గర్ల్లాగా ఛాన్సులొస్తే.. మరికొందరికేమో తల్లి, చెల్లి, ఫ్రెండ్, నెగిటివ్ రోల్స్ లేదా చిన్న చిన్న పాత్రలు వస్తాయి. అయినా కెరీర్లో ఐటెం సాంగ్స్ చేయడం పట్ల నేనేమీ బాధపడటం లేదు. ఎందుకంటే అలా సంపాదిచిన డబ్బుతోనే నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. అంతేకాకుండా ఐటెం గర్ల్‌గా బాలీవుడ్లో నాకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని కల్పించినందుకు ఎంతో గర్వపడుతున్నాను' అని వెల్లడించింది. మొహబత్ హై మిర్చి, దేక్తా హై తు క్యా వంటి స్పెషల్ సాంగ్స్‌లో కనిపించిన రాఖీ తన దూకుడుతో మరింత గుర్తింపు సంపాదించుకుంది. నాచ్ బలియే, పతి పత్ని జౌర్ వో, బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోస్‌తో పాపులారిటీ దక్కించుకుంది. చదవండి : అత్యాచారం చేయబోయారు: బిగ్‌బాస్ కంటెస్టెంట్ పిల్లల్ని కనాలని ఉంది: బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
పీపీఈ కిట్ ధరించి.. కూరగాయలు కొనడానికి వచ్చిన నటి
కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉంది. కేసుల సంఖ్య ప్రతి రోజు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలంతా మాస్క్ ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటి రాఖీ సావంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. రాజకీయ నాయకులకంటే మీరు వంద రేట్లు మేలు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. రాఖీపై ఇంతలా ప్రశంసలు కురవడానికి కారణం ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. తాజాగా రాఖీ సావంత్ కూరగాయలు కొనడానికి సమీప మార్కెట్‌కి వెళ్లారు. అసలే కరోనా విజృంభిస్తోంది. పైగా సెలబ్రిటీ బయట కనిపించింది అంటే చాలు.. జనాలు ఎలా గుమిగూడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాఖీ సావంత్ ఓ వినూత్న ఆలోచన చేశారు. జనాలు తనను గుర్తు పట్టకుండా ఉండటం కోసమే కాక.. కరోనా నుంచి కాపాడుకోవడం కోసం పీపీఈ కిట్ ధరించి మార్కెట్ వెళ్లారు రాఖీ సావంత్. చేతులకు గ్లౌవుజులు.. ఒంటి మీద పీపీఈ కిట్ ధరించిన రాఖీ సావంత్.. ఓ కూరగాయల బండి దగ్గరకు వెళ్లి బేరమాడి.. మంచి ధర చెల్లించి మరి కూరగాయలు కొన్నారు. ఈ సమయంలో సదరు కూరగాయలమ్మే వ్యక్తిని మాస్క్ సరిగా ధరించమని సూచించారు. ఇక ఆమె షాపింగ్ అయిపోయిన తర్వాత రాఖీ ఒక్కసారిగా అరిచారు. ‘‘ఇన్ని కూరగాయలకు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమేనా.. నా జీవితంలో ఇన్ని ఎక్కువ ఐట్సెం ఇంత తక్కువ ధరకు ఎప్పుడు కొనలేదు’’ అంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు రాఖీ సావంత్. అంతేకాక బయటకు వెళ్లినప్పడు పీపీఈ కిట్ ధరించి వెళ్లడం చాలా మంచిది అంటూ అభిమానులకు సూచించారు. ఈ వీడియో ప్రసుత్తం తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు మాటలు చెప్పే రాజకీయ నాయకుల కన్నా మీరు చాలా బెటర్.. మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చూపించారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: నిన్ను నువ్వే పెళ్లి చేసుకుంటున్నావా? View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) -
బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు!
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి రాఖీ సావంత్ వివాదంలో ఇరుక్కుంది. డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాఖీ సావంత్‌తో పాటు, ఆమె సోదరుడు రాకేశ్, రాజ్ ఖత్రి అనే మరో వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డారని ఢిల్లీలోని వికాస్పురి పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నవ భారత్ టైమ్స్ పేర్కొన్న వివరాల ప్రకారం.. శైలేష్ శ్రీవాత్సవ అనే రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ తన స్నేహితుడు రాజ్ ద్వారా రాఖీ సావంత్ సోదరుడు రాకేశ్‌ను కలిశాడు. వీళ్లిద్దరూ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ జీవితం ఆధారంగా ఓ సినిమా నిర్మించాలనుకున్నారు. అలాగే వికాస్పురిలో ఓ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ సైతం ప్రారంభించాలని భావించారు. అయితే ఈ ఇన్స్టిట్యూట్ బాధ్యతలు రాఖీ సావంత్ చూసుకుంటుందని చెప్పి రాకేశ్, రాజ్ ఇద్దరూ శైలేష్ దగ్గర నుంచి ఆరు లక్షలు తీసుకున్నారు. తర్వాత వాళ్లు తీసుకున్న మొత్తానికి మరో లక్ష కలిపి మొత్తంగా ఏడు లక్షల రూపాయల పోస్ట్ డేటెడ్ చెక్ రాసిచ్చారు. కానీ తప్పుడు సంతకాలు ఉండటంతో ఈ చెక్ బౌన్స్ అయింది. దీంతో శైలేష్ పోలీసులను ఆశ్రయించాడు. 2017 నుంచే ఈ కేసు నడుస్తున్నప్పటికీ తాజాగా మరోసారి ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం గురించి నటి సోదరుడు రాకేశ్ స్పందిస్తూ తను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నాడు. "రాజ్ ఖత్రితో కలిసి ఢిల్లీలో యాక్షింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించినప్పుడు అమ్మ అనారోగ్యం పాలైంది. అప్పుడు నెల రోజుల పాటు నేను ముంబైలో ఉన్నాను. తర్వాత ఢిల్లీకి వెళ్లగా అక్కడ నా చెక్‌బుక్ సహా ఇతర ముఖ్య వస్తువులన్నీ కనిపించకుండా పోయాయి. నా పార్టనర్ నన్ను మోసం చేశాడని అర్థమైంది. ఈ విషయంలో ఢిల్లీ, ముంబై పోలీసులకు ఇదివరకే ఫిర్యాదు చేశాను. ఈ కేసులో రాఖీకి ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా ఆమెను ఇందులోకి కావాలని లాగుతున్నారు. ఈ కేసులో చట్టపరంగా ముందుకు వెళ్తాం" అని పేర్కొన్నాడు. ప్రస్తుతం రాఖీ సావంత్ క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న తల్లి బాధ్యతలు చూసుకుంటోంది. చదవండి: అమ్మ కోసం ప్రార్థించండి: రాఖీ సావంత్ కరీనా కపూర్ ఇంటి గోడెక్కిన ఫొటోగ్రాఫర్ -
అమ్మకు క్యాన్సర్.. తనకోసం ప్రార్థించండి: నటి
ముంబై: సంచలన నటి రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన కామెంట్లు, వింతైన చేష్టలతో ఎల్లప్పుడూ వార్తల్లో నిలవడం ఆమెకు అలవాటు. అదే ఆమెకు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో స్థానం కల్పిచింది. హిందీ బిగ్‌బాస్ తొలి సీజన్లో భాగంగా బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన రాఖీ.. ఫిబ్రవరి 21న ముగిసిన మలి సీజన్-14లోనూ పాల్గొంది. వైల్డ్‌కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా టాప్-5 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది. బిగ్‌బాస్ ఇచ్చిన క్యాష్ ప్రైజ్ తీసుకునేందుకు సమ్మతించి రూ. 14 లక్షలతో హౌజ్‌ను వీడింది ఈ హాట్‌భామ. ఇక ఇంటికి చేరుకున్న అనంతరం తన తల్లిని చూసి ఉద్వేగానికి గురైన రాఖీ సావంత్, ఆమె ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించాల్సిందిగా అభిమానులను కోరింది. కాగా రాఖీ తల్లి జయా సావంత్ క్యాన్సర్ బారిన పడ్డారు. మహమ్మారికి చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం తల్లి ఫొటోలు షేర్ చేసిన రాఖీ... ‘‘అమ్మ కోసం ప్రార్థించండి’’ అని విజ్ఞప్తి చేశారు. ఇక బిగ్‌బాస్ షో నుంచి నిష్క్రమించిన తర్వాత మీడియాతో మాట్లాడిన రాఖీ, తన తల్లిని కాపాడుకునేందుకు ఎంత కష్టాన్నైన్నా భరిస్తానంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక షో ద్వారా వచ్చిన డబ్బుతో తనకు చికిత్స చేయిస్తానని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. షో వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్‌తో దిగిన ఫొటోలు షేర్ చేసిన ఆమె.. ‘‘దేవుడిచ్చిన అన్నయ్య.. రాజులకు రాజు.. రారాజు.. సల్మాన్ ఖాన్. ఆయనకు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సంతోషాలు దక్కాలి’’అని ఆకాంక్షించారు. ఇక హిందీ బిగ్‌బాస్ సీజన్-14 విన్నర్‌గా నిలిచిన రుబీనా దిలైక్ ట్రోఫితోపాటు, 36 లక్షల ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: విడాకులు తీసుకుందామనుకున్నాం.. బిగ్‌బాస్ మళ్లీ కలిపింది -
పుట్టుకతోనే ఎవరూ వేశ్య కాదు
కూటి కోసం కోటి తిప్పలు అన్న నానుడి ఊరికే రాలేదు. కడుపులో నాలుగు ముద్దలు పడాలంటే బండెడు కష్టం చేయాల్సిందే. దీనికోసం ఎవరికి తోచిన పనులు వాళ్లు చేస్తారు. చాలామంది కాయకష్టాన్ని నమ్ముకోగా కొందరు మాత్రమే శరీరాన్ని అమ్ముకుంటారు. వాళ్లే వేశ్యలు. ఈ పదాన్ని ఈసడించుకునేవాళ్లు ఎంతోమంది. కానీ వారి జీవితాలు అంతకన్నా హీనంగా ఉంటాయంటున్నారు బాలీవుడ్ నటి రాఖీ సావంత్. (నిన్ను నువ్వే పెళ్లి చేసుకుంటున్నావా?) "వేశ్య అన్న పదం వినగానే మనుషుల ముఖాల్లో హావభావాలు చిత్రవిచిత్రంగా ఎందుకు మారతాయో నాకర్థం కాదు. కానీ వాళ్ల దగ్గర నుంచి పన్ను వసూలు చేస్తున్నప్పుడు వాళ్లకు రక్షణగా ఉండేందుకు బలమైన చట్టాలను ఎందుకు చేయడం లేదు? వాళ్ల పిల్లలకు స్కూల్లో ఎందుకు అడ్మిషన్ దొరకడం లేదు? అని ప్రశ్నించారు. ఈ సెక్స్ వర్కర్ల వల్లే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయనుకుంటారు. కానీ వారు కుటుంబాలను కలుపుతారు. పుట్టుకతోనే ఎవరూ వేశ్య కాదన్న విషషయంతో పాటు సెక్స్ వర్కర్ల దీనస్థితిని మా వెబ్ సిరీస్ ద్వారా చూపించబోతున్నాం" అని రాఖీ సావంత్ చెప్పుకొచ్చారు. కాగా బాలీవుడ్లో పలువురు నటీనటులు వేశ్యగా నటించారు. దేవదాస్‌లో మాధురీ దీక్షిత్, తవైఫ్లో రాతి అగ్రిహోత్రి, ఉమ్రావ్ జాన్, ముఖద్దర్ కా సికిందర్లో రేఖా, ఉమ్రావ్ జాన్‌లో ఐశ్వర్యా రాయ్, పాకీజాలో మీనా కుమారి వేశ్యలుగా నటించి మెప్పించారు. (‘అంతిమ్’ ఫస్ట్‌లుక్.. సరికొత్త గెటప్‌లో సల్మాన్) -
సుశాంత్ నా బిడ్డగా పుట్టబోతున్నాడు: నటి
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి వారం దాటుతున్న ఇంకా ఎవరు ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య బాలీవుడ్ వర్గాలలో కలకలం రేపింది. సుశాంత్ మరణించినప్పటి నుంచి బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు. స్టార్ కిడ్స్‌పై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. బాలీవుడ్లో బంధుప్రీతి ఎక్కువగా ఉందని, టాలెంట్ ఉన్నవారిని తొక్కేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్‌ఫాలో స్టార్ కిడ్స్ అంటూ క్యాంపెయిన్ కూడా నిర్శహిస్తున్నారు. అభిమానులే కాకుండా బాలీవుడ్ స్టార్లు కూడా సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్లో నెపోటిజం ఎక్కువగా ఉందంటూ తమకు ఎదురైన చేదు అనుభవనాలను బయటపడుతున్నారు. (‘అక్షయ్‌ని కాదని సుశాంత్‌ను తీసుకున్నాను’) కరణ్ జోహార్, సల్మాన్ సహా చాలా మంది బంధుప్రీతి చూపిస్తున్నారంటూ అభిమానులు ఏకిపారేస్తున్నారు. దీనిపై స్పందించిన సల్మాన్ ఖాన్.. ఈ విషయంలో తన అభిమానులు .. సుశాంత్ అభిమానులకు తోడుగా ఉండాలని పిలుపు నిచ్చాడు. తాజాగా ప్రముఖ హీరోయిన్ రాఖీ సావంత్ సైతం సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై స్పందించారు. దీనికి సంబంధించి రాఖీ సావంత్ ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో సుశాంత్ తన కలలో కనిపించి బాలీవుడ్ తనని వెలివేసిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. అంతేగాక త్వరలోనే సుశాంత్ తనకు బిడ్డగా జన్మించబోతున్నాడని ఈ సందర్భంగా రాఖీ వెల్లడించారు. దీంతో పాటు పూర్తి కానీ తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉంటే చేయాలని కోరినట్టు ఈ వీడియోలో రాఖీ సావంత్ తెలిపింది. (‘సుశాంత్ నెలసరి ఖర్చు రూ. 10 లక్షలు’) View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on Jun 21, 2020 at 1:17am PDT -
నిన్ను నువ్వే పెళ్లి చేసుకుంటున్నావా?
బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాను మాత్రమే కనిపించేలా షేర్ చేసిన తన పెళ్లి ఫొటోలను చూసిన నెటిజన్లు ఏంటి నిన్ను నువ్వే పెళ్లి చేసుకుంటున్నావా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. పెళ్లి కూతురి దుస్తుల్లో తన భర్తతో కలిసి పూజ చేస్తున్న ఫొటోలను శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందులో తన భర్తను కనిపించకుండా ఫొటోను క్రాప్ చేసి ‘మిస్టరీ హస్బెండ్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ‘పూర్తి ఫొటోను చూపించండి మేడమ్’ ‘మీరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు’ ‘మీకు మీరే పెళ్లి చేసుకున్నారా’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (‘అవును నేను పెళ్లి చేసుకున్నాను’) View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on Apr 16, 2020 at 9:10am PDT ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రాఖీసావంత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు రాగా వాటిని కొట్టిపారేస్తు వచ్చిన రాఖీ.. చివరకు ఓ ఎన్నారైని పెళ్లి చేసుకున్నానని గతేడాది స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా 2006లో బిగ్‌బాస్ రీయాలిటీ షోతో ఫేమస్ అయిన రాఖీ సావంత్ ‘మస్తీ’, ‘చూరా లీయా హై తుమ్నే’, ‘దిల్ బోలే హడిప్పా’ వంటి సినిమాలలో నటించారు. -
'కరోనాను అంతమొందించాకే ఊపిరి పీల్చుకుంటా'
ప్రపంచమంతా కరోనా వైరస్ పేరు వింటే భయపడుతుంటే.. ఓ బాలీవుడ్ నటి మాత్రం కరోనా అంతు చూసివస్తానంటూ చైనాకు బయల్దేరింది. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వివాదాల రాణిగా పేరొందిన రాఖీ సావంత్ తన విచిత్రమైన యాక్టివిటీస్‌తో ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తుంటుంది. అయితే తాజాగా.. తాను చైనాకు వెళ్తున్నానని, కరోనా అంతు చూసి వస్తానంటూ విమానంలో తీసుకున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె చెప్పిన ఈ మాటలు విడ్డూరంగా ఉండటంతో ఇది వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు. (కరోనా: సరిహద్దుల్ని దాటి ప్రాణాల్ని హరించేస్తోంది) ఆ వీడియోలో.. కరోనా వైరస్‌కు ఏమాత్రం భయపడేది లేదని తెలిపింది. పైగా తాను చైనాకు వెళ్తున్నట్లు తీసిన వీడియోను పోస్ట్ చేసింది. అంతేగాక.. కరోనా వైరస్‌ను అంతమొందించాకే ఊపిరి పీల్చుకుంటా అంటోంది. ఇంతటితో ఆగని ఆ బాలీవుడ్ ముద్దుగుమ్మ అమెరికాలోని నాసాను సంప్రదించి వైరస్‌ను అంతమొందించేందుకు ఏవైనా ఔషదాలను అందించాలని కూడా కోరతానంటూ రాఖీ స్పష్టం చేసింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (సీఏఏ కష్టాలకు రాఖీ సొల్యూషన్ ఇదే..) -
సీఏఏ పై రాఖీ సావంత్ సలహా!
-
సీఏఏ కష్టాలకు రాఖీ సొల్యూషన్ ఇదే..
ముంబై : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీలపై అనవసరంగా ఆందోళన చెందవద్దని వీటికి తాను సరైన పరిష్కారంతో ముందుకొచ్చానని బాలీవుడ్ భామ రాఖీ సావంత్ చెప్పుకొచ్చారు. తన సలహా పాటిస్తే సీఏఏ, ఎన్ఆర్సీ కష్టాలను ఇట్టే అధిగమించవచ్చన్నారు. తన సూచన దేశానికీ లాభదాయకమని ఆమె పేర్కొన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలతో చిన్నబుచ్చుకుని తమ తాతలు తమకు బర్త్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదని ఉసూరుమనేవారికి తన సలహా దివ్యౌషధంలా పనిచేస్తుందని మరీ రాఖీ చెబుతున్నారు. మీ బాధలను పోగొట్టేందుకు తానున్నానంటూ..మీరు ఈ దేశాన్ని విడిచి వెళ్లకుండా ఉండాలని అనుకుంటే భారీ మొత్తంలో బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని, బ్యాంకు అప్పుడు మీరు భారత పౌరులేనని నిరూపిస్తుందని ఇక మీరు దేని గురించీ బాధపడాల్సిన పనిలేదని ఉచిత సలహా ఇచ్చారు. ఇది చాలా సులభమని..ఇప్పుడే బ్యాంకుకు వెళ్లి రుణం తీసుకోండని ఆమె చెప్పుకొచ్చారు. చదవండి : మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడిన రాఖీసావంత్ -
‘అవును నేను పెళ్లి చేసుకున్నాను’
ముంబై: గత కొంతకాలంగా రాఖీసావంత్ పెళ్లిపై వస్తున్న ఊహగానాలు నిజమని తేలాయి. నిజాన్ని ఎన్ని రోజులని దాచగలమని భావించిందో ఏమో.. తన వివాహం ఓ ఎన్నారైతో జరిగిపోయిందని స్పష్టం చేసింది ఈ హాట్ బ్యూటీ రాఖీ సావంత్. ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రాఖీసావంత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ కొంతకాలంగా సోషల్ మీడియా కోడై కూసిన సంగతి తెలిసిందే. పైగా ఎప్పటికప్పడు వెడ్డింగ్ డ్రెస్, నిండైన పెళ్లికూతురు గెటప్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. కేవలం ఫొటోషూట్ కోసమేనంటూ ముందు బుకాయించినప్పటికీ అసలు విషయాన్ని చెప్పక తప్పలేదు. బ్రిటన్‌కు చెందిన బిజినెస్‌మాన్ రితేశ్‌ను పెళ్లి చేసుకున్నానంటూ ఓ టీవీ ఇంటర్వ్యూలో రాఖీ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ‘రితేశ్ నా వీరాభిమాని, ఓ ఇంటర్వ్యూలో తను నన్ను మొదటిసారిగా చూశాడు. తర్వాత మెసేజ్‌లు, కాల్స్‌తో దగ్గరయ్యాడు. ఇద్దరం మంచి మిత్రులయ్యాం. క్రమేణా మా బంధం మరింత బలపడి ప్రస్తుతం పెళ్లితో ఒక్కటయ్యాం. నేను జీవితాంతం తనతోనే ఉండిపోతాను. కానీ నాకింకా వీసా రాలేదు. వీసా రాగనే తనతోపాటు వెళ్లిపోతాను’ అని చెప్పుకొచ్చింది. అలాగే టీవీ షోలో నటించాలన్న తన కోరికను నెరవేర్చుకుంటానని తెలిపింది ఈ హాట్ బ్యూటీ. కాగా వీరిద్దరూ పెళ్లికి ముందే ఏడాదిన్నరపాటు డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. వీరి మధ్య ప్రేమ బలపడటంతో ముంబైలోని ఓ హోటల్లో రాఖీసావంత్, రితేశ్‌లు సీక్రెట్‌గా వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను బయటికి వదలడంతో అభిమానులు పెళ్లయిపోయిందంటూ ప్రచారం చేయగా.. ఎట్టకేలకు.. ‘అవును నేను పెళ్లి చేసుకున్నాను’ అంటూ రాఖీ సావంత్ అసలు నిజాన్ని బయటపెట్టింది. ఇక ఫ్యామిలీ ప్లానింగ్‌ను కూడా అప్పుడే నిర్ణయించేసుకున్నట్లు.. 2020లో పిల్లల్ని కనాలి అనుకుంటున్నానని రాఖీ చెప్పుకొచ్చింది. -
‘నాకింకా పెళ్లి కాలేదు’
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా రాఖీ పెళ్లి కూతురిలా ముస్తాబైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రాఖీ సావంత్, ఓ ఎన్నారైని సీక్రెట్ గా వివాహం చేసుకున్నారని, ఈ నెల 28న వీరి పెళ్లి వేడుక అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిందంటూ వార్తలు వచ్చాయి. అయితే రూమర్స్‌పై స్పందించిన రాఖీ సావంత్.. తానింకి సింగిల్‌గానే ఉన్నానని చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం తాను ఎవరితో రిలేషన్లో కూడా లేనని వెల్లడించారు. ఓ ఫైవ్ స్టార్ హోటల్ ప్రమోషన్ కోసం తాను చేసిన బ్రైడల్ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయని క్లారిటీ ఇచ్చారు. View this post on Instagram bridel shooting A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on Jul 29, 2019 at 2:23am PDT -
‘నీకు పాకిస్తాన్ పౌరసత్వమే కరెక్ట్’
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ మరో సారి వార్తల్లోకెక్కారు. పాక్ జెండా పట్టుకుని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రాఖీ సావంత్. దాంతో నెటిజన్లు ఓ రేంజ్లో రాఖీని ట్రోల్ చేస్తున్నారు. ‘నీకు పాకిస్తాన్ పౌరసత్వమే కరెక్ట్, మీస్ రాఖీ పాకిస్తాన్ సావంత్’ అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాక ఇలాంటి పనులు చేస్తే నిన్ను ఫాలో అవ్వం అని హెచ్చరిస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు రాఖీ సావంత్. ‘ధార 370’ చిత్రంలో తాను పాకిస్తాన్ అమ్మాయి పాత్ర పోషిస్తున్నాని.. దాని కోసమే పాక్ జెండాను పట్టుకున్నానని వివరణ ఇచ్చారు రాఖీ. అంతేకాక పాకిస్తాన్ ప్రజలంతా చెడ్డవారు కాదని.. ఎవరో కొందరు మాత్రమే జిహాద్ పేరుతో మానవబాంబులు ప్రయోగిస్తారని చెప్పుకొచ్చారు. అంతేకాక పాకిస్తాన్ అన్నా.. ఆ దేశ ప్రజలన్నా తనకు ఎంతో గౌరవమన్నారు రాఖీ. View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on May 8, 2019 at 9:43am PDT -
రాఖీ సావంత్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్
-
వైరల్: రాఖీ సావంత్‌ను ఎత్తి పడేసింది
ఎప్పుడూ ఎదో వివాదంతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ మరోసారి హాట్ టాపిక్‌గా వార్తల్లో నిలిచారు. వివాదస్పద సినిమాలతోనో, మాటలతోనో, డ్రెస్స్‌లతోనో వార్తల్లో నిలిచే రాఖీ తాజాగా తన చేష్టలతో వార్తల్లో నిలిచారు. పంజాబ్‌కు చెందిన ఓ మహిళా రెజ్లర్ సవాల్ విసరగా.. రాఖీ స్వీకరించారు. రింగ్‌లో ఇద్దరూ తలపడే ముందు తనతో సమానంగా నృత్యం చేయాలని రాఖీ ప్రతి సవాల్ విసిరారు. దీనికి అంగీకరించిన రెజ్లర్ రాఖీతో సమానంగా నృత్యం చేసింది. అనంతరం రాఖీ సావంత్‌ను మహిళా రెజ్లర్ తన భుజాలమీదకు ఎత్తుకుని అమాంతం కింద పడేసింది. దీంతో సుమారు 8 నిమిషాల పాటు రాఖీ బాధతో విలవిలలాడిపోయారు. వెంటనే నిర్వాహకులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని పంచకులలో ద గ్రేట్ ఖలీ నిర్వహిస్తున్న సీడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ రెజ్లింగ్ పోటీల్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం రాఖీ సావంత్ రెజ్లింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. (నష్టాల్లో ఉన్నా అందుకే 25 పైసలు) వివాదాలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా.. నటి రాఖీ సావంత్ మాత్రం తనుశ్రీపై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లుగా మౌనం వహించిన తనుశ్రీ ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతోందని విమర్శలు గుప్పించారు. ‘తనుశ్రీ పదేళ్ల నుంచి కోమాలో ఉంది.. ఆమెకి పిచ్చి పట్టిందం’టూ రాఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా తనుశ్రీ డ్రగ్స్ తీసుకుంటుందని, రేవ్ పార్టీకి తీసుకెళ్లి పలుమార్లు తనపై అత్యాచారం చేసిందని.. తనుశ్రీ ఓ లెస్బియన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన తనుశ్రీ, రాఖీపై రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఇక రాఖీ కూడా అసత్య ఆరోపణలతో తనుశ్రీ తన పరువుకు భంగం కలిగించారంటూ 25 పైసల నష్టపరిహారం కోరిన విషయం తెలిసిందే. (‘నేను లెస్బియన్‌ని కాదు’) -
నష్టాల్లో ఉన్నా అందుకే 25 పైసలు
మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తుండగా.. బాలీవుడ్ నటీమణులు తనుశ్రీ దత్తా రాఖీ సావంత్‌ల మధ్య వివాదం రోజురోజుగా రాజుకుంటోంది. ‘తనుశ్రీ దత్తా డ్రగ్స్ బానిస, ఆమె ఒక లెస్బియన్’ అంటూ వ్యాఖ్యలు చేసిన రాఖీపై తనుశ్రీ ఇప్పటికే రూ.10 కోట్లకు దావా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాఖీ కూడా పరువు నష్టం దావా వేశారు. అసత్య ఆరోపణలతో తనుశ్రీ తన పరువుకు భంగం కలిగించారంటూ 25 పైసల నష్టపరిహారం కోరారు. (తనుశ్రీకి పిచ్చి పట్టింది) ‘ఆర్థికంగా భారీ నష్టాల్లో ఉన్నాను. భారీగా నష్టపరిహారం కోరి మరింత కష్టాల్లో పడలేను. కానీ, ఎన్నో ఏళ్లుగా కాపాడుకున్న నా పరువూ, మర్యాదలను తనుశ్రీ నాశనం చేయాలని చూస్తోంది. ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకే ఈ దావా వేశాను’ అని రాఖీసావంత్ చెప్పుకొచ్చారు. కాగా, డబ్బు సంపాదన కోసం రాఖీ ఎంతకైనా దిగజారుతుందనీ, ఎలాంటి నీచమైన పనులైనా చేస్తుందని తనుశ్రీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వివాదం మొదలైందిలా.. బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో భారత్‌లో మీటూ ఉద్యమానికి బీజం పడిన సంగతి తెలిసిందే. అయితే, మీటూ ఆరోపణలపై బాలీవుడ్ నటీమణులు కొందరు తనుశ్రీకి మద్దతు తెలపగా నటి రాఖీ సావంత్ మాత్రం తీవ్ర విమర్శలు చేసింది. పదేళ్లుగా మౌనం వహించిన తనుశ్రీ ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతోందని విమర్శలు గుప్పించింది. ‘తనుశ్రీ పదేళ్ల నుంచి కోమాలో ఉంది.. ఆమెకి పిచ్చి పట్టిందం’టూ రాఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. (‘నేను లెస్బియన్‌ని కాదు’) అంతటితో ఆగకుండా ఈ మధ్య జరిగిన ఓ మీడియా సమావేశంలో రాఖీ మాట్లాడుతూ.. తనుశ్రీ డ్రగ్స్ తీసుకుంటుందని, రేవ్ పార్టీకి తీసుకెళ్లి పలుమార్లు తనపై అత్యాచారం చేసిందని.. తనుశ్రీ ఓ లెస్బియన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాగా, తనుశ్రీ వేసిన దావాపై రాఖీ స్పందించకపోతే ఆమెకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఆమె తరపు న్యాయవాది నితిన్ మీడియాతో వెల్లడించారు. -
‘నేను లెస్బియన్‌ని కాదు’
నటుడు నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమానికి బీజం వేశారు తనుశ్రీ దత్తా. ఈ వివాదంలో సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్లు తనుశ్రీ దత్తాకి మద్దతు తెలపగా.. రాఖీ సావంత్ మాత్రం తనుశ్రీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘తనుశ్రీ పదేళ్ల నుంచి కోమాలో ఉంది.. ఆమెకి పిచ్చి పట్టిందం’టూ రాఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంతటితో ఊరకోక ఈ మధ్య జరిగిన ఓ మీడియా సమావేశంలో రాఖీ మాట్లాడుతూ.. తనుశ్రీ డ్రగ్స్ తీసుకుంటుందని, రేవ్ పార్టీకి తీసుకెళ్లి పలుమార్లు తనపై అత్యాచారం చేసిందని.. తనుశ్రీ ఓ లెస్బియన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే రాఖీ సావంత్ మీద 10 కోట్లకు పరువు నష్టం దావా వేసిన తనుశ్రీ దత్తా ఈ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించారు. తనను లెస్బియన్ అంటూ చేసిన ఆరోపణ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తనుశ్రీ స్పందిస్తూ.. ‘రాఖీ సావంత్ చేసే ఆరోపణలకు నేను భయపడను. నాపై కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. నేను డ్రగ్స్ తీసుకోను. నాకు డ్రింక్ చేసే అలవాటు లేదు. కనీసం స్మోకింగ్ అలవాటు కూడా లేదు. నేను లెస్బియన్‌ని కానే కాదు. మహిళలకు మంచి జరిగే ఉద్యమాన్ని నీరుగార్చేందుకు రాఖీ సావంత్ ఇలాంటి నీతి మాలిన వ్యాఖ్యలు చేస్తోంది. ఆమె వేసే జోకర్ వేషాలకు.. ఆమె నవ్వుల పాలవ్వడమే కాక చివరకు ఆమె బలవుతుంద’ని మండిపడ్డారు. -
రాఖీ సావంత్ షాకింగ్ నిర్ణయం
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటి రాఖీ సావంత్.. షాకింగ్ కామెంట్స్‌తో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తన వక్షోజాలను దానం చేస్తానని రాఖీ సావంత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో.. ‘కళ్లను దానం చేస్తానని బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ ప్రమాణం చేశారు. ఇలా చాలా మంది తమ శరీరంలోని అవయవాలను దానం చేస్తూ మంచి పని చేస్తున్నారు. నేను కూడా ఎదో ఒకటి డొనేట్ చేయలనుకుంటున్నాను. నా వక్షోజాలు దానం చేయాలని నిర్ణయించుకున్నాను.’ అని చివర్లో తన వక్షోజాలను ఎవరు దక్కించుకుంటారో చూద్దాం అని పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా స్టన్ అయ్యారు. ఇదేం నిర్ణయం అంటూ రాఖీపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. View this post on Instagram #aishwaryaraibachchan #aishwaryarai A post shared by Rakhi Sawant Official (@rakhisawant2511) on Sep 21, 2018 at 12:42pm PDT ఈ విషయంపై మీడియా ఆరాతీయగా.. ‘మీకు తెలియదు చాలా మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ సమయంలో వారి వక్షోజాలు తీసేస్తారు. అందుకే నేను నా వక్షోజాలు దానం చేయాలనుకున్నాను. ఈ విషయం ఇంత గందగోళం సృష్టిస్తుందని నేను ఊహించలేదు’ అని రాఖీ తన చర్యలను సమర్ధించుకున్నారు. -
‘మోదీకి అల్లుడు.. సోనియాకు కోడలు దొరికారు’
సాంకేతిక అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు కూడా ప్రచారం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నాయి. అధికార ప్రతినిధులు, బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు సైతం ఇతర పార్టీలపై బురద జల్లేందుకు సోషల్ మీడియాలో చౌకబారు విమర్శలకు దిగడం సర్వసాధారణమైపోయింది. తాజాగా కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్ కమ్యూనికేషన్స్ చీఫ్ దివ్యా స్పందన, ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తేజీందర్ పాల్ సింగ్ బగ్గాలు పరస్పరం టార్గెట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టుల ద్వారా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు. బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌కు సంబంధించిన పాత వీడియోను పోస్ట్ చేసిన దివ్యా స్పందన... ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి...‘మోదీజీ... మీకు అల్లుడు దొరికాడు’ అంటూ ట్వీట్ చేశారు. దివ్య ట్వీట్‌కు కౌంటర్‌గా తేజీందర్ పాల్ సింగ్... అలహాబాద్‌కు చెందిన ఒక గుర్తు తెలియని మహిళ వీడియోను పోస్ట్ చేసి.. ‘ సోనియా గాంధీ గారు మీ కోడలు దొరికారు’ అంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియోల్లో ఏముందంటే... న్యూయార్క్ ట్రిప్‌లో ఉన్నరాఖీ సావంత్ తనకు కాబోయే భర్త దొరికాడంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘ఫ్రెండ్స్.. నాకు కాబోయే భర్త ఎవరా అంటూ అడుగుతూ ఉంటారు కదా. ఇదిగో ఇతడిని కలవండి. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. అతడితో పాటు న్యూయార్క్‌లో విహరిస్తున్నాను. నా ఈ వీడియోను ప్రధాని మోదీతో సహా భారతీయులంతా చూస్తూ ఉంటారు. బాలీవుడ్ నటిని అయిన కారణంగా మోదీ నాకు పెద్ద అభిమాని. ఇదిగోండి ఈయనే మీ అల్లుడు’ అంటూ రాఖీ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను జూలై 9న దివ్యా స్పందన తన ట్విటర్లో పోస్ట్ చేశారు. తేజీందర్ సింగ్ పోస్ట్ చేసిన వీడియోలో... అలహాబాద్‌కు చెందిన ఒక మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన భర్త అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పెళ్లి చేసుకుని భార్య హోదా కల్పిస్తానని రాహుల్ చెప్పారంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయన రోజూ తన కలలోకి వచ్చి ఎన్నో వాగ్దానాలు చేస్తారని, కానీ వాటిని నిలబెట్టుకోకుండా తనను మోసం చేశారంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. దళితులంటే ఎంతో ప్రేమ కలిగి ఉండే రాహుల్ ఓబీసీ మహిళనైన తనను పెళ్లి చేసుకుంటే బాగుంటుందంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా రాహుల్ గాంధీపై పలు సంచలన ఆరోపణలు చేశారు. “मोदी जी आपका दामाद मिल गया है” @narendramodi @rakhisawant7 pic.twitter.com/RhSRLSxpIR — Divya Spandana/Ramya (@divyaspandana) July 9, 2018 “सोनिया जी आपकी बहु मिल गई है” @RahulGandhi pic.twitter.com/DDKhmrm9RY — Tajinder Pal Singh Bagga (@TajinderBagga) July 9, 2018 -
కండోమ్ బ్యాన్.. ఎయిడ్స్‌తో పోతావ్!
నటీమణుల మధ్య సరదాగా మొదలైన సంభాషణ కాస్త.. దుర్భాషలాడుకునే దాకా వెళ్లింది. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటి రాఖీ సావంత్.. మరోసారి నోటిదురుసును ప్రదర్శించారు. ఎలాంటి విషయాన్ని అయినా సరే ఓపెన్‌గా మాట్లాడే రాఖీకి ఓ సీరియల్ నటి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో రాఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో బండబూతులు తిడుతూ వరుస పోస్టులు చేశారు. మహారాష్ట్రలో ప్లాస్టిక్ బ్యాన్‌ను ఉద్దేశిస్తూ సీరియల్ నటి మహికా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ముందుగా సరదాగా ఓ పోస్ట్ చేసిన ఆమె తర్వాత అసలు వ్యవహారం మొదలుపెట్టారు. ‘సోదరి.. ప్లాస్టిక్ బ్యాన్ గురించి కాస్త పరిజ్ఞానం నాకు పంచుతావా? కండోమ్‌లు కూడా బ్యాన్ అయ్యాయా?’ అంటూ ఓ సందేశం ఉంచారు. అంతే అది చూసిన రాఖీకి ఎక్కడో కాలింది. వెంటనే పచ్చి బూతులు తిడుతూ (వీడియో సందేశాలు కూడా) వరుసగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు రాఖీ ఉంచారు. ‘కండోమ్‌ల గురించి నాకు అవగాహన ఉంది. అవి రబ్బర్‌తో కాకుండా ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తారు. ఒకవేళ కండోమ్‌లు బ్యాన్ చేస్తే మాత్రం మహికా లాంటి వాళ్లు ఎయిడ్స్ వచ్చి పోతారు’ అంటూ పోస్టులు చేశారు. ఆవెంటనే మహికా దానికి ఘాటుగానే సమాధానిమిచ్చారు. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నటి రాఖీ సావంత్ -
సన్నీ లియోన్‌కు క్షమాపణలు
సాక్షి, ముంబై: మాజీ శృంగార తార, బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు నటి రాఖీ సావంత్ క్షమాపణలు చెప్పారు. గతంలో సన్నీని టార్గెట్ చేసి రాఖీ తీవ్రంగా దూషించిన విషయం తెలిసిందే. సన్నీ రాకతో భారతీయ చిత్ర పరిశ్రమ భ్రష్టుపట్టే అవకాశం ఉందని ఓ ఆల్బమ్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాఖీ మండిపడ్డారు. బూతు సినిమాలు చేసుకునే సన్నీ తక్షణమే బాలీవుడ్‌ను, ఇండియాను విడిచిపోవాలంటూ రాఖీ అల్టిమేటం జారీ చేశారు కూడా. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలో కూడా సన్నీపై విచిత్రమైన ఆరోపణలు చేస్తూ వస్తున్న రాఖీ.. ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. ‘సన్నీ గురించి నాకు ఏం తెలుసని నేను అలా మాట్లాడానో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది ముమ్మాటికీ నా పొరపాటే. ఆమె గతం, జీవన ప్రయాణం నాకు అవసరం లేని విషయాలు. ప్రస్తుతం ఆమె ఏంటన్నది ముఖ్యం. పిల్లలను దత్తత తీసుకోవటం, సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సన్నీ చాలా గొప్పది. ఆమెను చూస్తుంటే గర్వంగా ఉంది. ఆమెపై అనవసరంగా తప్పుడు వ్యాఖ్యలు చేశా. ఆమె జీవితాన్ని నిర్ణయించడానికి అసలు నేనెవర్ని? ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి ఆమెకు అందరి ముందు క్షమాపణలు చెబుతున్నా’ అని రాఖీ సావంత్ తెలిపారు. అంతకుముందు ఓ ప్రముఖ ఛానెల్ చిట్‌ఛాట్ షోలో మోడల్ అర్షి ఖాన్‌తోపాటు పాల్గొన్న రాఖీ సన్నీపై చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చెప్పారు. మరోవైపు అర్షి ఖాన్ కూడా ఇదే షోలో అఫ్రిదీపై చేసిన వివాదాస్పద ట్వీట్‌పై తప్పు ఒప్పుకున్న విషయం విదితమే. (‘శృంగారం’ ట్వీట్.. నా పొరపాటే!) -
క్యాస్టింగ్ కౌచ్: రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై బాలీవుడ్ బ్యూటీ, వివాదాస్పద నటి రాఖీ సావంత్ స్పందించారు. చలన చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఆమె తన అభిప్రాయాలను వెలిబుచ్చుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు తానుకూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినని చెబుతూనే...ప్రస్తుత పరిస్థితుల్లో యువతులు అవకాశాల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు... ఇందుకు ప్రొడ్యూసర్లను ఎందుకు తప్పుపడతారని ప్రశ్నించింది. మరోవైపు చిత్ర పరిశ్రమలో ఎవ్వరూ అత్యాచారం చేయరనీ, స్వచ్ఛందంగా పరస్పర అంగీకారంతోనే ఇది ముడిపడి ఉంటుందని తెలిపింది. అంతేకాదు ఈ విషయంలో బాలీవుడ్ ప్రముఖ కొరియో గ్రాఫర్ సరోజ్‌ఖాన్ ఇటీవలి వ్యాఖ్యలకు వత్తాసు పలికింది. బాలీవుడ్‌ను అగౌరవ పర్చడం తన ఉద్దేశం కాదనీ, సరోజ్‌ఖాన్‌కు మద్దతుగానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని స్పష్టం చేసింది. ఏమైనా చేయండి.. కానీ తమకు అవకాశాలు ఇవ్వండి అనే ధోరణిలో నేటి తరం యువతులు వున్నారంటూ రాఖీ వ్యాఖ్యానించింది. హీరోయిన్స్ కావాలని పరిశ్రమకు వచ్చిన చాలామంది అమ్మాయిలు మరేదో అవుతున్నారని పేర్కొంది. అమ్మాయిలు కెరియర్ కోసం రాజీ పడుతున్నారని తెలిపింది. ఈ సందర్భంగా పనిలో పనిగా బాలీవుడ్ జనాలపై విమర్శలు గుప్పించింది. తమ కళ్లముందే లైంగిక వేధింపులు జరుగుతున్నా బయటి ప్రపంచానికి నిజాలను వెల్లడించరని పేర్కొంది. ఈ విషయంలో నిర్భయంగా మనసులోమాట చెప్పి ప్రపంచానికి సత్యాన్ని తెలియచేసిన సరోజ్ ఖాన్ అభిప్రాయంతో తాను పూర్తిగా ఏకీ భవిస్తున్నానని చెప్పింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకునే సమయంలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాననీ, కానీ ప్రతి నిర్మాత, దర్శకుడు తన పట్ల అలా ప్రవర్తించ లేదని పేర్కొంది. చిత్ర పరిశ్రమలో లైంగిక అవినీతి ఉంది. ఇది ఆందోళన కలిగించింది. అయితే ఇది మొదట్లోనే. ఆ తరువాత ప్రతిభతో వీటన్నింటిని అధిగమించానని చెప్పుకొచ్చింది. మరోవైపు ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో లైంగిక రాజీలకు సంబంధించి యువకులకు ఎలాంటి మినహాయింపు లేదని పేర్కొంది. అయితే సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా ప్రతిభతో రాణించి సూపర్‌స్టార్‌గా అవతరించారు. విజయానికి ఎలాంటి ష్టార్కట్లు వుండవంటూ హితవు పలికింది. అవకాశాలకోసం రాజీ పడకండి.. టాలెంట్ నమ్ముకోండి..ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగొద్దంటూ బాధితులకు ఈ సందర్భంగా సలహా ఇవ్వడం విశేషం. -
ఆసారాంకు బతికే హక్కు లేదు; నటి
సాక్షి, ముంబై: అత్యాచార కేసులో ఆసారాం బాపుకు జీవితఖైదు శిక్షపై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ హర్షం వ్యక్తం చేశారు. అయితే మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ప్రాణాలతో ఉంచటం సరైందని కాదని ఆమె అంటున్నారు. అసారాం లాంటి వారికి ఉరిశిక్షే సరైందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2013లో 16 ఏళ్ల బాలికపై ఆసారాం అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేరం రుజువు కావటంతో ఈ ఏప్రిల్ 25న కోర్టు ఆసారాంకు జీవిత ఖైదు విధించింది. దీనిపై రాఖీ సావంత్ స్పందిస్తూ... ‘ఆసారాంకు శిక్ష పడ్డందుకు నాకు సంతోషంగా ఉంది. రేపిస్టులకు ఇదొక హెచ్చరిక. అయితే అతనికి ఉరి శిక్ష ఎందుకు వేయలేదు? బాధితురాలు మైనర్. పైగా మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించాలని ప్రభుత్వం అంటోంది. ఆ లెక్కన్న ఆసారాంకు కూడా మరణ శిక్ష వేయటమే సబబు. మైనర్లను చిదిమేసే రాక్షసులను వదలకూడదు’ అని రాఖీ సావంత్ వ్యాఖ్యానించారు. పోక్సో చట్టం సవరణ ద్వారా కేంద్రం తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం.. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధిస్తారు. 12 నుంచి 16 ఏళ్ల లోపు అమ్మాయిలపై లైంగిక దాడి చేస్తే జీవిత ఖైదు, లేదా కనీసం 20ఏళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేయనున్నారు. దీంతో పాటు చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన కేసులు విచారణ త్వరితగతిన పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర కూడా వేశారు. -
సన్నీ లియోన్‌పై విచిత్ర ఆరోపణలు
ముంబై : ఇప్పటివరకు నేరుగా ఎదురుపడకున్నా నటీమణులు రాఖీ సావంత్-సన్నీ లియోన్లు నిత్యం కలహించుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా సన్నీపై విచిత్రమైన ఆరోపణలతో విరుచుకుపడింది రాఖీ. అడల్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తనకు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, మొబైల్ నంబర్‌ను ఇచ్చింది కూడా సన్నీనే అని ఆరోపిస్తోంది. ‘బిజినెస్ టైమ్స్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావంత్ ఈ మేరకు సంచలన విషయాలు చెప్పుకొచ్చింది. ‘‘ఇటీవల పోర్న్ ఇండస్ట్రీకి చెందిన కొందరు నాకు ఫోన్లు చేసి, నటించమని అడిగారు. నేను షాకయ్యాను. అసలు మీకు నా నంబర్ మీకు ఎలా వచ్చిందని అడిగా, వాళ్లు సన్నీ లియోన్ పేరు చెప్పారు. మళ్లీ షాక్. కొద్ది సెకన్లకు తేరుకుని.. నేను భారతీయురాలిని కాబట్టి అలాంటి సినిమాల్లో నటించలేనని స్పష్టం చేశా’’ అని రాఖీ తెలిపారు. ఒకప్పుడు అడల్ట్ ఫిలిమ్స్ చేసిన సన్నీ.. బాలీవుడ్‌లోకి ఎంటరై, వరుస విజయాలు సాధించడం, దేశంలో అత్యధికులు ‘సెర్చ్ చేసే పేరు’గా ఖ్యాతికెక్కడం తెలిసిందే. ‘ సన్నీ రాకతో అవకాశాలు కోల్పోయారని అసూయగా ఉందా?’ అన్న హోస్ట్ ప్రశ్నకు రాఖీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ‘‘బాలీవుడ్లో నాకంటూ ఒక పేరుంది. ఎవరో సన్నీ లియోన్‌పై ఈర్ష్య పడాల్సిన అవసరంలేదునాకు. అయినా, కుటుంబమంతా కలిసి చూడగలిగే సినిమాలు చేసిన నాకు, ఆమెకు పోలికేలేదు. నేను అచ్చమైన భారతవనితను కాబట్టే, ఎక్కువ డబ్బు ఇస్తామని ఆఫర్లొచ్చినా, ఆ సినిమాలకు దూరంగా ఉంటున్నా’’ అని రాఖీ సావంత్ చెప్పారు. కాగా, ఈ రాఖీ కామెంట్లపై సన్నీగానీ ఆమె భర్త డానియెల్గానీ ఇంకా స్పందిచలేదు. -
నాకూ బతకాలని లేదు..!
-
శ్రీదేవి లేదు.. నాకు బతకాలని లేదు: నటి
శ్రీదేవి అకాల మరణాన్నిఆమె అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణం అందరిపైనా తీవ్ర ప్రభావం చూపింది. దేశం యావత్తూ శోకసంద్రంలో మునిగిపోయింది. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కూడా శ్రీదేవికి అభిమాని. అతిలోక సుందరి అంత్యక్రియలకు హాజరై తుది వీడ్కోలు పలికింది. అనంతరం శ్రీదేవి మరణం తనును ఎంతో కలిచివేసిందని ఇన్‌స్టాగ్రాంలో ఓ పోస్టు పెట్టింది. 'శ్రీదేవి జీ! మీరు వెళ్లిపోయారు. చాలా బాధగా ఉంది. ఐ లవ్ యూ సో మచ్. ఏమైంది మీకు? ఎందుకు వెళ్లిపోయారు? మీలా ఎవరూ నటించలేరు, డాన్స్ చేయలేరు. మీరు చాలా మంచి వారు. మీరు లేకపోవడంతో నాకూ బతకాలని లేదు.. లవ్ యూ ’ అంటూ బాధతో వీడియో పోస్టు పెట్టింది. అయితే రాఖీ సావంత్ పోస్టులకు నెటిజన్లు వినూత్నంగా స్పందించారు. 'ఇదంతా పబ్లిసిటీ స్టంట్, టీఆర్పీ కోసం చేస్తున్నావ్.., రాఖీ, కామెడీ చేయకు.., వీడియోలో నువ్వు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నావ్.., టూ ఫన్సీ.. అంటూ కామెంట్లు పెట్టారు. శ్రీదేవి మరణం తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌ను శ్రీదేవి ఫొటోలతో నింపిన రాఖీ.. తాజాగా శ్రీదేవి పోలికలతో ఉన్న ఓ చిన్నారి పాత వీడియోని పోస్ట్ చేసింది. శ్రీదేవి మళ్లీ పుట్టారని పేర్కొంటూ అందరికీ శుభాకాంక్షలు చెప్పింది. -
సావంత్‌కు ‘సవతి’ షాక్!
రోహ్తక్ : డేరా బాబా గుర్మీత్ రామ్‌రహీమ్ సింగ్ దత్తపుత్రిక, పంచకుల అల్లర్ల కేసులో ప్రధాన నిందితురాలు అయిన హనీప్రీత్ ఇన్సాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. డేరా బాబా-హనీప్రీత్‌ల అనుబంధంపై ‘సవతి’ వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి రాఖీ సావంత్‌పై పరువునష్టం దావా దాఖలైంది. హనీప్రీత్ తల్లి ఆశా తనేజా ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదయినట్లు రోహ్తక్ పోలీసులు తెలిపారు. రాఖీ ప్రధాన పాత్రలో గుర్మీత్-హనీలపై రూపుదిద్దుకున్న సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో తాజా వివాదం చర్చనీయాంశమైంది. రూ.5కోట్లు డిమాండ్ : ‘‘నటి రాఖీ సావంత్ అడ్డగోలుగా మాట్లాడి నా కూతురి(హనీప్రీత్) పరువుతీసింది. తప్పును ఒప్పుకుని 30 రోజుల్లోగా క్షమాపణలు చెప్పిందా సరేసరి. లేదంటూ రూ.5 కోట్లు చెల్లించాలి’’ అని ఆశా తనేజా డిమాండ్ చేశారు. అసలు రాఖీ ఏమంది? : గత ఆగస్టులో గుర్మీత్, హనీప్రీత్‌లు అరెస్టయిన సందర్భంలో రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడుతూ వారి అనుబంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక దశలో నేను(రాఖీ) డేరా బాబాకు చాలా దగ్గరయ్యాను. మా ఇద్దరిదీ పవిత్రబంధం. ఎందుకోగానీ హనీప్రీత్‌కు ఇది నచ్చేదికాదు. బాబాకు నాకు మధ్య సాన్నిహిత్యాన్ని ఆమె(హనీ) జీర్ణించుకోలేకపోయేది. ఆయనను పెళ్లి చేసుకుంటే ఎక్కడ సవతిని అవుతానోనని హనీ భయపడేది’’ అంటూ రాఖీ బాంబు పేల్చారు. తద్వారా గుర్మీత్-హనీప్రీత్లది తండ్రీకూతుళ్ల బంధం కాదని బయటపెట్టేయత్నం చేశారు. జైలులోని గుర్మీత్, హనీప్రీత్ : లైంగికదాడి కేసులో 20 ఏళ్ల శిక్ష పడటంతో డేరా బాబా గుర్మీత్ జైలుకు వెళ్లారు. ఆయనకు శిక్ష ఖరారు సమయంలో పంచకుల, రోహ్తక్ సహా హరియాణాలోని పలు పట్టణాలు, పంజాబ్‌లోని ఒకన్ని చోట్ల డేరా అనుచరులు హింసకు పాల్పడ్డారు. నాటి అల్లర్లలో 20మందికిపైగా చనిపోయారు. ఆయా కేసులకు సంబంధించి ప్రధాన నిందితురాలిగా ఉన్న హనీప్రీత్.. అనంతరకాలంలో అరెస్టయ్యారు. గుర్మీత్ నేరాలలోనూ ఆమెకు సంబంధాలున్నట్లు పోలీసు ద్యాప్తులో వెల్లడైంది. -
బాబా రాందేవ్ కండోమ్‌లు తేవాలి..
కండోమ్ ప్రకటనల ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ప్రముఖ నటి, మోడల్ రాఖీ సావంత్ తప్పుపట్టింది. దేశంలో ప్రజలకు ఎయిడ్స్ ప్రబలేలా చేయడానికే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఒకప్పుడు దేశలో ప్రతి వైన్‌షాప్ దగ్గర కండోమ్ ప్యాకెట్లను పంచిపెట్టారని, సినీ తారలు, క్రీడాకారులతో ప్రకటనలు చేసి కండోమ్‌లపై అవగాహన పెంచిన ప్రభుత్వాలు, ఇప్పుడు మాత్రం ఎందుకు ప్రసారాలను అడ్డుకుంటున్నాయంటూ విమర్శలు ఎక్కుపెట్టింది.. గతంలో వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో, మైదానంలోకి దిగేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అంటూ ప్రముఖ క్రికెటర్‌తో కేంద్ర సమాచార శాఖ ప్రకటనలు చేసిందని, కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఎందుకు తప్పుపడుతోందంటూ ప్రశ్నించారు. సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తున్న బాబా రాందేవ్, కండోమ్‌లను కూడా తీసుకురావాలంటూ వ్యాఖ్యానించింది. రాఖీ సావంత్ ఓ కండోమ్ కంపెనీకి ప్రచార కర్తగా పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా కండోమ్ ప్రకటనలపై ఆంక్షలు విధించింది. పగటి వేళల్లో నిషేధం విధించింది. కుటుంబ సభ్యలతో కలిసి చిన్న పిల్లలు చూసే అవకాశం ఉందంటూ వాటిపై ఆంక్షలు విధించింది. రాత్రి 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకు మాత్రమే ప్రసారం చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. -
మోదీజీ ఇదిగో మీ అల్లుడితో కలువండి
-
మోదీగారు మీ అల్లుడు ఇతనే!
ఆ మధ్య రాఖీ సావంత్ ప్రధాని నరేంద్రమోదీ బొమ్మలు ముద్రించిన బ్లాక్ డ్రెస్‌ను వేసుకొని హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. పాపులారిటీ కోసం తెగ తాపత్రయపడే రాఖీ అప్పట్లో ప్రధాని మోదీ తన ‘డ్రీమ్ మ్యాన్’ (కలల రాజు) అని, ఆయనను ఆకట్టుకునేందుకు ఈ డ్రెస్ వేసుకున్నానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మారిన పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీని తన తండ్రితో పోలుస్తూ తాజాగా ఈ అమ్మడు ఓ పోస్టు పెట్టింది. ఇతనే నా వరుడు అంటూ గతవారం రాఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో వైరల్ మారింది. అందులో ఏమన్నదంటే.. ‘నేను చేసుకోబోయే వరుణ్ణి ఎప్పుడూ చూపిస్తావంటూ స్నేహితులందరూ ఒకటే అడుగుతున్నారు. ఇతనే ఆ వరుడు. ప్రస్తుతం నేను న్యూయార్క్‌లో ఉన్నాను. వరుణ్ణి కనుగొన్నాను. ఇతనే నా వరుడు. ప్రియుడు’ అంటూ రాఖీ చెప్పుకొచ్చింది. ‘ప్రధాని మోదీ సహా భారతీయులందరూ ఇప్పుడు నన్ను చూస్తున్నారు. మోదీజీ నాకు అతిపెద్ద అభిమాని. మోదీజీ ఇదిగో మీ అల్లుడితో కలువండి’ అంటూ ఈ హాట్ భామ పేర్కొంది. అన్నట్టు 2009లో స్వయవరం పేరిట ఓ టీవీషోలో పాల్గొని.. ఎలెష్ పురంజన్వాలా అనే యువకుడితో రాఖీ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిశ్చితార్థం చేసుకున్న రాఖీ.. డబ్బు కోసమే ఈ స్వయంవరం షోలో పాల్గొన్నట్టు వెల్లడించింది. ఇక సినిమాల విషయానికొస్తే వివాదాస్పద బాబా గుర్మీత్ రాంరహీంసింగ్ జీవిథకథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో హనీప్రీత్ సింగ్ పాత్రలో ఈ భామ నటిస్తోంది. -
డేరా బాబా మామూలోడు కాదు
న్యూఢిల్లీ: అత్యాచార కేసులో జైలుశిక్ష అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్ గురించి బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'ఎ డైలాగ్ విత్ జేసీ' అనే టీవీ షోలో ఆమె మాట్లాడుతూ.. తాను చాలాసార్లు గుర్మీత్‌ను కలిసినట్టు తెలిపింది. తనను రాజకీయాల్లోకి చేరమని చెప్పిన వారిలో బాబా ఉన్నాడని చెప్పింది. గుర్మీత్ ఆడవారి జీవితాలతో ఆడుకుంటాడని, మగవారిని నపుంసకుల్ని చేస్తాడని ఊహించలేదని పేర్కొంది. గుర్మీత్‌ను కలవడానికి హనీప్రీత్ ఒప్పుకునేది కాదని చెప్పింది. ఎక్కడ బాబాను పెళ్లి చేసుకుంటానోనని తనను దూరంగా పెట్టేదని వెల్లడించింది. ‘గుర్మీత్‌ను నేను కలవడం హనీప్రీత్‌కు నచ్చేది కాదు. ఆమెకు సవతిని అవుతానేమోనని భయపడేది. హనీప్రీత్ చాలా అందంగా ఉండేది. నేను తనకంటే అందంగా ఉంటానని ఆమె అనుకునేది. గుర్మీత్ తనను తాను కృష్ణుడి అవతారంగా, ఆయన చుట్టూ యువతులను గోపికలుగా భావించేవాడు. ఒకసారి ఆయనను కలిసేందుకు హోటల్‌కు వెళ్లాను. బాబా చుట్టూ ఉన్న యువతులు పొట్టి దుస్తులు వేసుకోవడం చూసి ఆశ్చర్యపోయాను. గుర్మీత్ ఆశ్రమంలో పురుషుల కంటే యువతులు, మహిళలు ఎక్కువగా ఉన్నార’ని రాఖీ సావంత్ తెలిపింది. గుర్మీత్, హనీప్రీత్ జీవితాలు ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా డిసెంబర్ లేదా జనవరి నాటికి పూర్తవుతుందని చెప్పింది. బాబా జైలు జీవితం గడుపుతుండగా, హనీప్రీత్ మరణించినట్టు తమ సినిమాలో చూపించబోతున్నట్టు వెల్లడించింది. ఈ చిత్రంలో రాఖీ సావంత్ హనీప్రీత్ పాత్రలో నటిస్తోంది. -
డేరా బాబా మామూలోడు కాదు
-
డేరా వెనక బాబా కథ!
జైల్లో ఊచలు లెక్కపెడుతున్న డేరా బాబాకు వాతలు పెట్టే ఓ సిన్మా మొదలైంది. టైటిల్... ‘అబ్ ఇన్సాఫ్ హోగా’. బీటౌన్ ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్ ఈ సిన్మాకు కర్త, కర్మ, క్రియ. ఇందులో ఆమె హనీప్రీత్ పాత్రలో నటిస్తుండగా, ఆమె తమ్ముడు రాకేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ హనీప్రీత్, బాబాలపై ఓ ఐటమ్ సాంగ్ తీశారు. డేరాలో బాబా రంగులు, హనీప్రీత్‌తో అతడి శృంగార లీలలన్నీ నాకు ముందే తెలుసంటున్నారు రాఖీ. ఓసారి డేరాలోకి వెళ్లినప్పుడు వయాగ్రా పొట్లాలు చూశారట! అప్పుడే ఏదో ఒక రోజు వీడి చీకటి చరిత్రను ప్రజలకు తానే చెప్పాలని నిర్ణయించుకున్నారట. బాబా జైలుకి వెళ్లిన తర్వాత సినిమా స్టార్ట్ చేశానంటున్నారు. జైల్లోని బాబా తన ఫ్లాష్‌బ్యాక్ చెప్పడంతో సినిమా మొదలవుతుందట. -
హనీప్రీత్ ఎక్కడుందో నాకు తెలుసు: నటి
డేరా స్వచ్ఛసౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్‌సింగ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది పోలీసులకు అంతుచిక్కని మిస్టరీగా మారింది. డేరా బాబా గుర్మీత్ కు శిక్ష పడిన అనంతరం చెలరేగిన అలర్ల వెనుక హనీప్రీత్ హస్తముందని పోలీసులు భావిస్తున్నారు. గుర్మీత్‌పై నమోదైన పలు కేసులలోనూ ఆమె ప్రమేయమున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గుర్మీత్‌కు శిక్ష పడి.. జైలుకు వెళ్లిననాటి నుంచి ఆమె కనిపించడం లేదు. ఆమె నేపాల్‌లో ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, ఆమె పేరుకే గుర్మీత్ దత్తపుత్రిక అని, కానీ, చాటుగా గుర్మీత్ రాసలీలలు సాగించేదని, వారు ఏకాంతంగా గడిపేవారని పలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో హనీప్రీత్ సింగ్‌పై బాలీవుడ్ హాట్ భామ రాఖీ సావంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనీప్రీత్ గురించి తనకు ఏడెనిమిదేళ్లుగా తెలుసునని రాఖీ తెలిపింది. డేరా బాబా గుర్మీత్‌పై తాను ఒక బయోపిక్ చిత్రాన్ని తీయబోతున్నామని, ఈ సినిమాలో డేరా బాబా ప్రియురాలు హనీప్రీత్ సింగ్‌గా తాను నటిస్తానని ఆమె పేర్కొంది. అంతేకాదు ప్రస్తుతం పరారీలో ఉన్న హనీప్రీత్ సింగ్ ఎక్కడో ఉందో తనకు తెలుసునని, ఆమె నేపాల్‌లో లేదని, లండన్‌లో ప్రస్తుతం ఉందని రాఖీ తెలిపింది. తన సోదరుడు రాకేశ్ సావంత్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నానని, 'అబ్ హోగా ఇన్సాఫ్' పేరిట తెరకెక్కనున్న ఈ సినిమాలో డేరా బాబాగా రజా మురద్ నటిస్తారని పేర్కొంది. -
దాచాలంటే దాగదులే!
నీ జీవితం నీది కాదు. ఒకరు చూస్తున్నారు. నువ్వేం చేస్తున్నా కనిపిస్తుంది. ఇద్దరు చూస్తున్నారు. దాగలేవు. దాచలేవు. ముగ్గురు చూస్తున్నారు. తిట్టినా తెలుస్తుంది. కొట్టినా తెలుస్తుంది. నలుగురు చూస్తున్నారు. నీ నిద్ర, నీ మెలకువ, నీ కసి, నీ మసి ఐదుగురు చూస్తున్నారు. నాలుగు గోడల సెట్లో బతుకు. ఆరుగురు చూస్తున్నారు. కెమెరా ఆకాశం కింద మనుగడ. ఏడుగురు చూస్తున్నారు. నీ అనుక్షణం నీ ప్రతి క్షణం నిఘా నీడలోనే. బిగ్ బాస్.. రెండు రాష్ట్రాల కోట్లాది ప్రజలు చూడబోతున్నారు. ఇంద్రుడికి ఒళ్లంతా కళ్లే. అందుకే అతణ్ణి సహస్రాక్షుడు అన్నారు. అతడు చూడవద్దన్నది కూడా చూడగలదు. చూడలేనివి కూడా చూడగలడు. మనిషి జీవితానికి మించిన కుతూహలం మరో మనిషికి లేదు. ప్రతి మనిషికి ఇంకో మనిషి జీవితంలోకి తొంగి చూడాలని ఉంటుంది. అది పబ్లిక్ లైఫ్ కానివ్వండి. ప్రయివేట్ లైఫ్ కానివ్వండి. తెలుసుకుంటే అతడికి ఆనందం. తన ప్రవర్తనే కాదు ఎదుటివారి ప్రవర్తన కూడా మనిషికి ‘న్యూస్’గా ఉంటుంది. నేనిలా ఎందుకు చేశాను, వారు ఇలా ఎందుకు చేశారు అని పరిశీలించడంలో అతనికి చాలా టైమ్ పాస్ ఉంది. సాటి మనిషి గురించి గాసిప్ మాట్లాడటంలో ఎవరైనా ఆసక్తి చూపేది అందుకే. ‘ఏకాంతంలో మనిషి ఏం చేస్తుంటాడు’ అని తెలుసుకోవడానికి తలుపులకు కన్నాలు వేసే స్వభావం మనిషికి వచ్చింది. అదేదో బహిరంగంగా చూపిస్తే మంచి షో అవుతుంది కదా అనే ఆలోచన నెదర్లాండ్స్ దేశానికి చెందిన టీవీ ప్రెజెంటర్ జాన్ మోల్కు వచ్చింది. కొంతమందిని పట్టుకుని వారిని ఊరవతల ఇంట్లో పడేసి వాళ్ల ప్రతి కదలికను కెమెరాలతో చూపి మనకు నచ్చిన వారికి బహుమతి ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన అతడికి వచ్చింది. అలా 1999లో ఆ దేశంలో పుట్టిన సంచలనాత్మక టెలివిజన్ షో ‘బిగ్ బ్రదర్’. అతడు అంతా చూస్తున్నాడు... దేవుడున్నాడు... అంతా చూస్తున్నాడు అంటాం. ఈ షోలో దేవుడి స్థానంలో బిగ్ బ్రదర్ ఉంటాడు. అంటే బిగ్ బ్రదర్ అంటూ ఒక మనిషి ఉండడు. కెమెరానే బిగ్ బ్రదర్. షో నిర్వాకులందరి ప్రతినిధిగా ఒక కంఠం వినిపిస్తూ ఉంటుంది. ఆ కంఠమే బిగ్ బ్రదర్. అతడు బిగ్ హౌస్‌లోని ప్రతి ఒక్కరి కదలికలను చూస్తుంటాడు. తద్వారా మనకు చూపిస్తూ ఉంటాడు. ఇక ఈ షోకు అనుసంధాన కర్త ఒకడుడుంటాడు. ఇతణ్ణి హోస్ట్ అంటారు. ఈ హోస్ట్ వారాంతంలో ఒకసారి వచ్చి షోలో జరిగిన ఘటనలను వ్యాఖ్యానించి బిగ్ హౌస్‌లో ఎక్కువ మందికి నచ్చని వ్యక్తిని ఎలిమినేట్ అంటే షో నుంచి బయటకు సాగనంపుతుంటాడు. బిగ్‌బ్రదర్ కనిపించని మనిషైతే ఈ హోస్ట్ కనిపించే మనిషి. ఇండియాలో బిగ్ బాస్ నెదర్లాండ్స్‌లో పుట్టిన ‘బిగ్ బ్రదర్’ అతి తక్కువ కాలంలోనే 54 దేశాలలో పాకింది. అన్ని దేశాలలో కలిపి ఇప్పటికి దాదాపు 400 సీజన్ల బిగ్‌బ్రదర్ ఎపిసోడ్లు నడిచాయి. అమెరికాలో, బ్రిటన్‌లో ఇతర దేశాలలో దీనిని బిగ్ బ్రదర్ అంటున్నా ఇండియాలో మాత్రం ‘బిగ్ బాస్’ అన్నారు. 2006లో సోనీ టీవీలో మొదలైన బిగ్ బాస్ షో ఇప్పటికి 10 సీజన్లు ముగించుకుంది. బాలీవుడ్ నటులు అర్షద్ వర్సి, శిల్పా శెట్టి, అమితాబ్ బచ్చన్ వీటికి హోస్ట్‌లుగా వ్యవహరించారు. వీరి తర్వాత సల్మాన్ ఖాన్ సుదీర్ఘకాలంగా హోస్ట్‌గా ఉంటున్నాడు. తాజాగా దక్షిణ భారత భాషలలోకి వచ్చిన ఈ షోకు తమిళంలో కమలహాసన్, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, కన్నడలో సుదీప్ హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. సెలబ్రిటీ – కాంట్రవర్సీ హిందీ బిగ్ బాస్ ఇప్పటికి పది సీజన్లు గడిస్తే ఆ పది సీజన్లలో ఎన్నో గొడవలయ్యాయి. ⇔ బిగ్ బాస్ సీజన్ 1లో హౌస్ మేట్‌గా ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్‌ను తీసుకున్నారు. ఆమెకు కౌంటర్‌గా ఇంకో వ్యాంప్ నటి కాశ్మీరా షాను తీసుకున్నారు. బిగ్ బాస్‌లో ఉన్నన్ని రోజులు వీళ్లిద్దరూ సిగపట్లు పట్టుకున్నారు. ఈ షోలో ట్రాన్స్ జెండర్లకు కూడా చోటివ్వాలి అని ట్రాన్స్ జెండర్ అయిన బాబీకి అవకాశం ఇస్తే హౌస్‌లో ఉన్న మగవాళ్లు, ఆడవాళ్లు కూడా బాబీని ఏడిపించి రెండు వారాల్లోనే హౌస్ నుంచి బయటకు గెంటేశారు. ⇔ చట్ట సంబంధమైన చిక్కుల్లో ఉన్న వారిని హౌస్ మేట్స్‌గా పిలవడం బిగ్ బాస్ నియమంగా పాటిస్తుంది. అందులో భాగంగా సీజన్ 2లో డ్రగ్స్ వ్యవహారంలో న్యూస్‌లోకి వచ్చిన రాహుల్ మహాజన్‌ను, అబూ సలేమ్ కేసులో శిక్ష అనుభవించిన మోనికా బేడీని హౌస్ మేట్స్‌గా పిలిచింది. మోనికా బేడీ ఈ సీజన్లో తన సత్ప్రవర్తనతో సానుభూతిని సంపాదించుకుంటే రాహుల్ మహాజన్ మరో హౌస్ మేట్ పాయల్ రోహత్గీతో బహిరంగ శృంగారం వరకూ వెళ్లి హల్చల్ చేశాడు. ఇతడు విజేతగా ఎంపికయ్యే అవకాశాలు ఉండగా బిగ్ హౌస్‌లో ఉండలేక గోడ దూకి పారిపోయాడు. ⇔ రోజుల తరబడి ఒకే చోట ఉండటం వల్ల ఆకర్షణ ఏర్పడటం సహజం. బిగ్ బాస్ సీజన్ 2లోనే భోజ్ పురి నటి సంభావన్ టీవీ నటుడు రాజా చౌదరి క్లోజ్ అయ్యారు. వీళ్లిద్దరూ షోలో పెదాల ముద్దు పెట్టుకోవడం సంచలనం అయ్యింది. అలాగే సీజన్ 4లో పాల్గొన్న పాకిస్తాన్ ఐటమ్ గర్ల్ వీణా మాలిక్ అదే హౌస్‌లో ఉన్న మరో నటుడు అష్మిత్ పటేల్‌కు ఎడతెగని ముద్దులు పెట్టింది. తమ కదలికలు కెమెరాలో రికార్డ్ అవుతున్న సంగతిని కూడా వీళ్లు పట్టించుకోలేదు. వీణా మాలిక్ వ్యవహారం చూసి ఇది ఇస్లాంకు వ్యతిరేకం అని ఆమె మీద పాకిస్తాన్లో కేసు నమోదైంది. ఇక కాజోల్ చెల్లెలు తనీషా ముఖర్జీ కూడా బిగ్ బాస్‌లో పాల్గొంది. సీజన్ 7లో ఈమె పాల్గొని మరో నటుడు ఆర్మాన్ కోహ్లీతో రాత్రి పూట ఒకే మంచం మీద పడుకుని కెమెరాలకు చిక్కింది. ⇔ అమెరికా పార్న్ స్టార్ సన్నిలియోన్ బిగ్ బాస్ సీజన్ 5లో హౌస్ మేట్‌గా ఉంది. భారతదేశంలో విడ్డూరంగా భావించే ఇటువంటి నటిని బిగ్ బాస్ షోనే ప్రేక్షకులకు దగ్గర చేసిందని చెప్పాలి. ఈ షోలో గెస్ట్‌గా పాల్గొన్న మహేశ్ భట్ ఆమె చేయి పట్టుకుని జరిగిందంతా మర్చిపో... కొత్త జీవితం జీవించు అని ఊరడించాడు. అంతేకాదు నీకు సినిమాల్లో అవకాశం ఇసాను అని బిగ్ బాస్ సాక్షిగా మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం ‘జిస్మ్2’లో అవకాశం ఇచ్చి ఆమెను బాలీవుడ్లో స్థిరపడేలా చేశాడు. జీవితం బందీఖానా బిగ్ బాస్ షో కోసం ముంబై శివార్లలోని లోనావాలాలో సెట్ వేశారు. ఇందులో ఒక అధునాతనమైన భవంతిలో ఉండే ఏర్పాట్లన్నీ ఉంటాయి. బెడ్ రూమ్‌లు మాత్రం బహిరంగంగా డార్మెటరీలకు మల్లే ఎక్కువ బెడ్లతో ఉంటాయి. స్త్రీలకు ఒక బెడ్రూమ్ పురుషులకు ఒక బెడ్రూమ్ ఉన్నా ఇద్దరూ ఏ బెడ్రూములో అయినా అడ్జస్ట్ కావచ్చు. టాయిలెట్స్, బాత్రూములలో తప్ప మిగిలిన అన్ని చోట్ల కెమెరాలు ఉంటాయి. మొత్తం 11 మంది ‘హౌస్మేట్స్’ను ఆహ్వానిస్తారు. వీరు డెబ్బై రోజుల నుంచి 105 రోజుల వరకూ ఈ ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కోవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతూ ఉండగా ఎవరైతే ఆఖరున మిగులుతారో వారే విజేతగా నిలుస్తారు. అంటే పోటీలో నిలిచే కొద్దీ హౌస్‌లో గడిపే రోజులు పెరుగుతాయి. బిగ్ బాస్ హౌస్‌లో టీవీ ఇంటర్నెట్ ఉండవు. పేపర్ పెన్నూ ఇవ్వరు. ఫోన్ అసలు ఉండదు. అంటే బయట లోకంలో ఏం జరుగుతున్నదో తెలిసే వీలే లేదన్న మాట. ఇలాంటి వాతావరణంలో ఉండటానికి శారీరకంగానే కాదు మానసికంగా కూడా బలంగా ఉండాలి. గతంలో బిగ్ బాస్‌లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు అమిత్ సద్ రెండు వారాలు గడిచాక మానసిక ఉద్వేగానికి లోనయ్యి టీవీ కెమెరా ఎదురుగా పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. కమల్ హాసన్–బిగ్ బాస్ కాంట్రవర్సీ తమిళంలో టెలికాస్ట్ అవుతున్న బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా పని చేస్తున్న కమల్‌హాసన్ మీద అక్కడి హిందూ మక్కల్ కట్ఛి సంస్థ దాడి మొదలెట్టింది. కమల్‌హాసన్ ఈ ప్రొగ్రామ్‌ను హోస్ట్ చేయకూడదని డిమాండ్ చేస్తోంది. తమిళ ‘బిగ్ బాస్’ను ప్రసారం చేస్తోన్న విజయ్ టీవీ ఆఫీసు ముందు సుమారు రెండు వారాలు ధర్నాలు, గొడవలు చేసిన హిందూ మక్కల్ కట్ఛి సంస్థ ఈ నెల 12న చెన్నై కమిషనర్‌ను కలసి కంప్లైంట్ చేసింది. ‘బిగ్ బాస్’తో మీకు సమస్య ఏంటి? అని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన అర్జున్ సంపత్‌ను ప్రశ్నిస్తే... ‘కుటుంబ వ్యవస్థను నాశనం చేసేలా ‘బిగ్ బాస్’ కార్యక్రమం ఉంటోంది. అందులో కంటెస్టెంట్స్ వేసుకునే బట్టలు మన సంప్రదాయానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ‘బిగ్ బాస్’ మాత్రమే కాదు, టీవీ సీరియల్స్ అన్నీ కుటుంబ వ్యవస్థను నాశనం చేసేలా ఉన్నాయి. వాటన్నింటి కంటే ‘బిగ్ బాస్’ మరింత ప్రమాదకరం. దీని ద్వారా వామపక్ష (లెఫ్టిస్ట్), ద్రావిడ (ద్రవిడియన్) భావజాలాలను ప్రమోట్ చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. ‘జల్లికట్టు సమయంలో జులైనా అనే మహిళ మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడింది. కావాలనే ఆమెను యాంటీ–మోడీ పర్సన్‌గా షోలోకి ఆహ్వానించారు’ అని అన్నారు. అంతేనా... ఏడాది పాటు పదవీకాలం పూర్తిచేసుకున్న కేరళ సీయంను అభినందించిన కమల్, మోడీని గానీ ఇతర బీజేపీ సీయంలను గానీ ఎప్పుడూ ఎందుకు అభినందించలేదు? అని ప్రశ్నించారు. ‘విశ్వరూపం టైమ్‌లో మేం కమల్‌కు మద్ధుతు ఇచ్చాం. కానీ, ఆయనెప్పుడూ హిందూ వ్యతిరేక సందేశాలు ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను ఈ షోను హోస్ట్ చేయకూడదని కోరుతున్నాం’ అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. తెలుగే మాట్లాడాలి... ఈ వారం మా టీవీలో మొదలు కానున్న తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొనబోయే హౌస్మేట్స్ లిస్ట్ పూర్తిగా బయటకు రాలేదు. వారు ఎవరైనా సరే బిగ్ బాస్‌లో ఉన్నన్ని రోజులు స్థానిక ప్రేక్షకుల భాష అంటే తెలుగే మాట్లాడాలి. ఈ హౌస్ మేట్స్ మెడలో రిసీవర్ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్‌లో కెమెరాలతో పాటు అడుగడుగునా మైక్‌లు ఉంటాయి. ఎవరు ఎక్కడ నిలబడి మాట్లాడినా ప్రేక్షకులకు వినిపించేలా మాట్లాడాలి. పరాయిభాషలో మాట్లాడటం, గుసగుసలు పోవడం చెల్లదు. హిందీ బిగ్ బాస్‌లో అందరూ హిందీయే మాట్లాడతారు. బయటకు పంపండి బిగ్ బాస్‌లో ఉన్న హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరు బిగ్ బాస్ ఆదేశాలకు నిబద్ధులు. ప్రతి రోజూ వీరికి బిగ్ బాస్ నుంచి ఆదేశాలు అందుతాయి. హౌస్ మేట్స్‌లో ఫలానా వారు వంట చేయాలి, ఫలానా వారు హౌస్ క్లీన్ చేయాలి, ఫలానా టైములో సైరన్ మోగుతుంది వెంటనే అందరూ లాంజ్‌లోకి వచ్చి డాన్స్ చేయాలి... ఇలా బిగ్ బాస్ ఆదేశాలు ఇస్తాడు. బిగ్ బాస్ తన హౌస్ మేట్స్‌ను ఒక్కొక్కరిని ‘కన్ఫెషన్ రూమ్’లోకి పిలిచి మాట్లాడుతుంటాడు (అంటే గొంతు మాత్రమే వినపడుతుంటుంది. మనిషి ఉండడు. దీనిని మనం నిర్వహకుల గొంతు అని అర్థం చేసుకోవాలి). టీమ్‌లో మనకు నచ్చని వ్యక్తి పేరు చెప్పి వాళ్లను బయటకు సాగనంపమని బిగ్ బాస్‌కు చెప్పాలి. ఒక వారంలో ఎక్కువ మంది ఎవరి పేరు చెప్తారో వారిని ఆ వారం బయటకు పంపుతారు. తగాదాలు మొదలు... బిగ్ బాస్‌లో పాల్గొనేవారు ఎవరు ఏ రంగంలో ప్రముఖులు అయినా వారంతా ప్రాథమికంగా మనుషులు. బిగ్ హౌస్‌లో ఎంటర్ అయ్యాక కొందరు కొందరికి నచ్చుతారు. కొందరు కొందరికి నచ్చరు. మొదటి రోజు నుంచే తగాదాలు మొదలవడానికి ఆస్కారం ఎక్కువ. బిగ్ హౌస్‌లో పని వాళ్లు ఉండరు. ఎవరి పని వారే చేసుకోవాలి. వంట చేసుకోవాలి. బట్టలు ఉతుక్కోవాలి. బిగ హౌస్‌లో స్థానం నిలబెట్టుకోవడానికి ప్రయాస పడాలి. ఈ క్రమంలోనే తగాదాలు వస్తూ ఉంటాయి. బిగ్ బాస్‌లో హౌస్ మేట్స్ కూర్పు కూడా తెలివిగా గొడవలకు ఆస్కారం ఇచ్చే విధంగా ఉంటుంది. ముక్కోపులను, వదర బోతులను, ఎచ్చులకోరులను కూడా బిగ్ హౌస్‌లో కావాలని చోటు కల్పిస్తారు. అప్పుడు షోలో మజా వస్తుందని నిర్వాహకుల భావన. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రాఖీకి నాన్ బెయిలబుల్ వారంట్
లూథియానా: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీకి కోర్టు నోటిసులు జారీచేసింది. రాఖీ సావంత్ పవిత్ర రామాయణాన్ని రచించిన వాల్మీకిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన లూథియానా కోర్టు, రాఖీ సావంత్‌కు గురువారం నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ విషవ్ గుప్తా ఈ కేసు విచారణను జూన్ 2కు వాయిదా వేశారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని గత ఏడాది జూలై 9న స్థానిక న్యాయవాది నరీందర్ అదియా, రాఖీ సావంత్‌పై పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తును ఏప్రిల్ 10న ఆమె ఉపసంహరించుకున్నారు. మార్చి 9న ఆమెపై కోర్టు అరెస్టు వారంట్ జారీ చేయగా ఆమెను అరెస్టు చేయడానికి ఏప్రిల్‌లో ముంబై వెళ్లిన ఇద్దరు పోలీసు అధికారుల బృందం ఉత్త చేతులతో తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. -
పచ్చిమిర్చి
రాఖీసావంత్ మాట మిర్చిలా ఘాటుగా ఉంటుంది. మనసు నొప్పిస్తుంది. కోపం తెప్పిస్తుంది. మిర్చి స్వభావమే అంత. ఘాటు తగ్గేవరకు హాహాకారాలు వినిపిస్తూనే ఉంటాయి. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ముంబైలోనా? పంజాబ్లోనా? పోలీసుల అదుపులోనా లేదా తనకెంతో ఇష్టమైన చైనీస్ ఫుడ్ తింటూ ఏదైనా రెస్టారెంట్లోనా? ఎక్కడున్నా సరే, ఇవాళ మాత్రం ఆవిడ లూథియానా కోర్టుకు హాజరు కావలసిందే. నేడు ఆమె కేసు హియరింగ్‌కు వస్తోంది. గత ఏడాది జూలైలో నరీందర్ ఆదిత్య అనే న్యాయవాది రాఖీపై కేసు పెట్టారు. వాల్మీకి కులస్థుల మనోభావాలు గాయపడేలా ఒక టీవీ ఛానెల్లో రాఖీ మాట్లాడారని ఆయన ఆరోపణ. కేస్ ఫైల్ అయ్యాక రాఖీ ఇంతవరకు ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. దాంతో కోర్టు ఆదేశాలపై ఇద్దరు పంజాబ్ పోలీసులు గత నెల 9న అరస్టు వారెంటుతో రాఖీని వెతుక్కుంటూ ముంబై వెళ్లారు. తర్వాత రాఖీ కచ్చితంగా ఎక్కడ ఉన్నదీ నిన్న ఆదివారం నాటికి కూడా ఎవరికీ తెలియదు!చెడ్డవాళ్లు మంచివాళ్లుగా ఎలా మారతారో చెప్పడానికి రాఖీ సావంత్ వాల్మీకి మహర్షిని ఉదాహరణగా తీసుకోవడమే ఆమెను చిక్కుల్లో పడేసింది. అసలు ఇదంతా పంజాబీ గాయకుడు మికా సింగ్‌తో వచ్చింది. పదేళ్ల క్రితం తన బర్త్ డే పార్టీకి వచ్చిన రాఖీని అతడు బలవంతంగా పెదవులపై ముద్దు పెట్టడం, రాఖీ అతడిపై కేసు పెట్టడం.. అంత తేలిగ్గా లోకానికి మరపురానివ్వని సంఘటనలు. ‘అయితే ఇప్పుడతడు మంచివాడైపోయాడు. జస్ట్ లైక్ వాల్మీకి! దారికాసి దోపిడీలు చేసే వాల్మీకి.. ఆ తర్వాత మంచివాడైపోయిన విధంగానే మికా సింగ్ మారిపోయాడు’ అని రాఖీ అనడమే ఆమెను కోర్టుకు ఈడ్చింది. అలా అన్నందుకు ఆ తర్వాత ఆమె క్షమాపణ కోరారు కానీ, కేసు కొనసాగుతూనే ఉంది. ‘నేను చిన్నప్పుడు చదువుకున్న దానిని బట్టి అలా మాట్లాడాను. అంతే తప్ప ఎవర్నీ చిన్నబుచ్చాలన్న ఉద్దేశం నాకు లేదు’ అని రాఖీ ఓ చిన్న వీడియో ద్వారా వివరణ ఇచ్చినప్పటికీ వినేందుకెవరూ సిద్ధంగా లేరు. నిజానికి రాఖీ సావంత్‌ది వివరణ ఇచ్చుకునే తత్వం కాదు. ‘డ్రామా క్వీన్’ అని అమెకు పేరు వచ్చింది కానీ, అంతకన్నా కూడా ఆమెను ‘దుస్సాహసి’ అని అంటేనే సరిగ్గా సరిపోతుంది. వాల్మీకి కులస్తులను కించపరిచారన్న ఆరోపణలు వచ్చినప్పుడు రాఖీ సావంత్ స్పందన మొదట వేరేలా ఉంది. ‘‘నేను సల్మాన్‌ఖాన్‌ని కాదు. రాఖీ సావంత్‌ని. నా మీద ఆరోపణలు చేయడం వల్ల మీకు ఒనగూడేది ఏమీ ఉండదు. నేనొక మామూలు అమ్మాయిని’’ అని అన్నారు రాఖీ. రాఖీని ‘రాకింగ్ రాఖీ’ అనడానికి తగినంత ‘స్పంక్’ అమెలో ఉంది. స్పంక్ అంటే ధైర్యం, దృఢచిత్తం. మాట అనగలరు. మాట మీద నిలబడగలరు. పోనీలే పాపం అని అనిపించినప్పుడు మాట మీద నుంచి దిగగలరు కూడా. వాల్మీకిపై వ్యాఖ్యలకు సారీ చెప్పడం కూడా ఇలా దిగి చెప్పిందే. దిగడానికి కూడా ధైర్యం కావాలి. ఆ ధైర్యం రాఖీకి ఉంది. ‘‘దేవుడు ఇవ్వనిది డాక్టర్ ఇస్తాడు’’ అని తన బోటాక్స్ సర్జరీల గురించి దాపరికం లేకుండా ధైర్యంగా చెప్పుకున్న రాఖీ సావంత్ ఇవాళ కోర్టుకు వెళతారా? Good girls go to heaven, bad girls go every where...గ్రామీ అవార్డు విజేత జిమ్ స్టెయిన్మెన్ రాసిన పాట ఇది. మంచమ్మాయిలు స్వర్గానికి వెళితే, చెడ్డమ్మాయిలు ప్రతిచోటుకీ వెళ్తారట. రాఖీ బ్యాడ్ గర్ల్ అన్నదే కనుక మన ఒపీనియన్ అయితే.. నేచురల్‌గానే ఆమె ఎక్కడికైనా వెళ్లగలరు. ఎవరీ అమ్మాయి? రాఖీ సావంత్ ముంబై అమ్మాయి. 1978 నవంబర్ 25 రాఖీ డేటాఫ్ బర్త్. అసలు పేరు నీరూ భేడా. డాన్సర్, మోడల్, బాలీవుడ్ న టి, టెలివిజన్ టాక్ షో ల వాగుడుకాయ. హిందీ, కన్నడ, మరాఠీ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. కలర్స్ ఛానల్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో కూడా ఉంది. ‘రాష్ట్రీయ ఆమ్ పార్టీ’ అని ఒక సొంత పార్టీ పెట్టుకుని 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది రాఖీ. ఎన్నికలయ్యాక ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ)లో చేరింది. ‘ఎ’ అన్నది పార్టీ వ్యవస్థాపకుడు రామ్‌దాస్ బంధు అథావాల్ పేరు. ఇది ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’ (ఆర్.పి.ఐ.) నుంచి చీలిన పార్టీ. అంబేడ్కర్ నడిపిన ‘షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్’ నుంచి ఆర్.పి.ఐ. వచ్చింది. రాఖీ మాటలు, చేతలు నిరంతరం ఆమెను వార్తల్లో తాజా మనిషిగా ఉంచుతాయి. ఆమె వయసు 38. ఇంటి విషయాలు రాఖీ తల్లి పేరు జయా భేడా. ఆమె ఆనంద్ సావంత్‌ను చేసుకుంది. వొర్లి పోలీస్ స్టేషన్లో ఆయన కానిస్టేబుల్. జయ తన మొదటి వివాహం వల్ల కలిగిన పిల్లలకు కూడా రెండో భర్త ఇంటి పేరునే పెట్టుకుంది. రాఖీ సోదరుడు రాఖేశ్ సావంత్ సినిమా డైరెక్టర్. సోదరి ఒకప్పటి నటి ఉషా సావంత్. రాఖీ సావంత్ క్రైస్తవ మతాన్ని స్వీకరించిన హిందువుల అమ్మాయి. ముంబై సమీపంలోని గోక్లీబాయ్ హైస్కూల్లో రాఖీ చదివింది. మిథీబాయ్ కాలేజీలో డిగ్రీ చేసింది. 1997 టు 2017 రాఖీ సినిమాల్లోకి వచ్చిన సంవత్సరం 1997. తొలి సినిమా ‘అగ్నిచక్ర’. తర్వాతంతా చిన్న చిన్న సినిమాలు. పెద్ద పెద్ద ఐటమ్ సాంగ్స్. హిమేశ్ రేషమియా కంపోజ్ చేసిన ‘మొహబ్బత్ హై మిర్చి’ ఐటమ్ సాంగ్ (ఛురా లియా హై తుమ్నే సినిమాలోనిది) రాఖీ కెరీర్ గ్రాఫ్ వేగాన్ని ఒక్కసారిగా పైపైకి పెంచేసింది. ‘అగ్నిచక్ర’ మొదలు, ‘ఉపేక్ష’ (ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది) వరకు సుమారు 35 చిత్రాలో నటించారు. తెలుగులో ‘6 టీన్స్’ అనే సినిమాలో నటించారు. తెలుగులోనే ‘ద్రోణ’ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ (సయ్యారే.. సయ్యారే)లో కనిపించారు. అన్ని భాషల్లో కలిపి రాఖీ అకౌంట్లో 20 వరకు ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. ఇవి కాక, ఓ పది మ్యూజిక్ వీడియోలు, ముప్పై టీవీ షోలు రాఖీవి ఉన్నాయి. రాఖీ గాయని కూడా. 2007లో ఆమె తన తొలి ఆల్బమ్ ‘సూపర్ గర్ల్’తో సంగీత ప్రపంచాన్ని షేక్ చేసింది. దళితుల హక్కుల కోసం! 2019 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి, దళితుల హక్కుల కోసం పోరాడతానని రాఖీ అంటున్నారు. గత ఎన్నికల్లో ఆమె వాయవ్య ముంబై నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆమెకు కేవలం 2006 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పార్టీ ఎన్నికల గుర్తుగా ఆమె ‘గ్రీన్ చిల్లీ’ని కోరుకున్నారు. తన వ్యక్తిత్వాన్ని పచ్చి మిర్చితో పోల్చవచ్చని రాఖీ చెబుతుంటారు. ఎన్నికల్లో ఓడిపోయాక రాఖీ ఆర్.పి.ఐ (ఎ)లో చేరారు. అప్పుడే తొలిసారిగా ఆమె తనకు దళితుల కోసం పనిచేయాలని ఉందని ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, మహిళా విభాగం అధ్యక్షరాలిగా కూడా పని చేశారు. విశేషాలు–వివాదాలు ♦ రాఖీ తండ్రికి ఆమె సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. మొదట్లో ఇద్దరికీ గొడవలు అయ్యేవి. చివరికి ఆ పెంకి పిల్లతో వాదించడం ఆయన మానుకున్నారు ♦ టీనా మునిమ్ పెళ్లిలో రాఖీ (అప్పటికి 12 ఏళ్లు) భోజనాలు వడ్డించే అమ్మాయిగా పని చేసింది ♦ యోగా గురు రామ్‌దేవ్ బాబా అంటే తనకెంతో ఇష్టం అని, ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఉందని కొంతకాలం క్రితం రాఖీ చేసిన ప్రకటన దేశంలో కలకలం రేపింది ♦ కొల్హాపూర్‌లో ఓసారి స్టేజ్ షో ఇచ్చినప్పుడు రాఖీ అభ్యంతరకరమైన భంగిమలతో డాన్స్ చేశారని, ఒళ్లు కనిపించేలా దుస్తులు ధరించారని ఆమెపై కేసు నమోదు అయ్యింది ♦ 2006లో పంజాబీ సింగింగ్ సెన్సేషన్ మికా సింగ్ తన బర్త్‌డే పార్టీకి వచ్చిన రాఖీ సావంత్‌కు బలవంతంగా ముద్దు పెట్టడంతో ఆమె అతడిపై క్రిమినల్ కేసు పెట్టారు ♦ లెక్కలేనన్ని కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్నారని రాఖీపై ఓ విమర్శ ♦ ఓ ప్రీమియర్ షోలో రెండేళ్ల క్రితం నటి కైనాజ్ పర్వేజ్‌ను రాఖీ ముద్దు పెట్టుకోవడం పెద్ద చర్చ అయింది ♦ మోదీ బొమ్మ ఉన్న దుస్తుల్ని ధరించి ఆమె బీజేపీ అభిమానులకు కోపం తెప్పించారు. మిర్చి కోట్స్ ♦ రాఖీసావంత్‌కి తనను తాను గ్రీన్ మిర్చితో పోల్చుకోవడం ఇష్టం. ఆమె మాటలు కూడా పచ్చి మిర్చి అంత ఘాటుగానే ఉంటాయి. వాటిలో కొన్ని ♦ డొనాల్ట్ ట్రంప్ మీద పోటీ చేసి ఉంటే నేను తేలిగ్గా గెలిచి ఉండేదాన్ని ♦ నేను డిప్రెషన్లో పడే టైపు కాదు. డిప్రెషన్లో పడేసే టైపు ♦ షారుక్ ఖాన్ కనిపెట్టిన మణిమాణిక్యాన్ని నేను ♦ ఎవరేం చేస్తున్నారని కేజ్రీవాల్‌లా నేనో కన్నేసి ఉంచను. డైరెక్ట్‌గా మీడియాను స్పాట్‌లోకి తీసుకెళ్తానంతే ♦ సెక్స్ అప్పీల్ లేకుండా టాలెంట్ ఏమిటి! టాలెంట్ లేకుండా సెక్స్ అప్పీల్ ఏమిటి!! రాఖీకి పెళ్లయిందా? పెళ్లయిందీ, పెళ్లి పెటాకులూ అయింది. 2009లో రాఖీ తన 31వ యేట ‘రాఖీ కా స్వయంవర్’ అనే రియాలిటీ షోలో తన జీవిత భాగస్వామిని వరించి వివాహం చేసుకున్నారు. అలా ఆ ఏడాది ఆగస్టు 2న రాఖీ.. స్వయంవరానికి వచ్చిన కెనడా కుర్రాడు ఎలేష్ పారజాన్వాలా మెడలో పూలహారం వేశారు. అయితే, ఆ తర్వాత కొద్ది నెలలకే ‘మేమిద్దరం విడిపోయాం’ అని ఆమె ప్రకటించారు. ఆ తర్వాత రాఖీ నాలుగేళ్ల పాటు అభిషేక్ అవస్థితో డేటింగ్ చేశారు. బ్రేకప్ తర్వాత, శ్రద్ధాశర్మ తన బాయ్ ఫ్రెండ్‌ని దొంగిలించిందని రాఖీ ఆరోపించారు. అభిషేక్ అవస్థి యాక్టర్, కొరియోగ్రాఫర్, డాన్సర్, మోడల్. రాఖీ కన్నా వయసులో మూడేళ్లు చిన్న. బ్రేకప్ అయినప్పుడు రాఖీ అభిషేక్‌ను లాగిపెట్టి చెప్పదెబ్బ కూడా కొట్టింది. ఏక్ నిరంజని ‘అమ్మా లేదు, నాన్నా లేడు, అక్కా చెల్లి తంబీ లేడు.. ఏక్ నిరంజన్’ అని ‘ఏక్ నిరంజన్’ సినిమాలో ప్రభాస్ పాడతాడు. రాఖీ సావంత్‌కి వీళ్లందరూ ఉన్నారు కానీ, ‘నాకెవరూ లేరు’ అని ఆమె చెబుతుంటారు! ఆమె ఉద్దేశం.. ఎవరి సహాయమూ లేకుండా స్వయంకృషితో పైకొచ్చానని చెప్పడం. రాఖీ.. ‘రాఖీ’ పండుగను కూడా జరుపుకోరు. అందుకు ‘ఇదీ’ అని కారణం ఏమీ లేదు కానీ, క్రైస్తవ మతాన్ని స్వీకరించాక రాఖీ వదులుకున్న హైందవ సంప్రదాయాల్లో రాఖీ కూడా ఒకటి. రాఖీ సావంత్ ప్రస్తుతం ముంబైలోని లంకంత సొంత ఇంట్లో తనొక్కరే ఉంటున్నారు. అయితే తన లక్కీ మ్యాన్ కోసం రెండోసారి ‘స్వయంవరం’ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు!! రాఖీ బెస్ట్ ఫ్రెండ్, నటి అయిన సోఫియా హయత్ చెబుతున్న దానిని బట్టి రాఖీ ఈ ఏడాదిలో ఎప్పుడైనా వివాహం చేసుకోవచ్చని తెలుస్తోంది. -
నేను ఝాన్సీ లక్ష్మీబాయి లాంటిదాన్ని: నటి
తరచు వివాదాస్పద ప్రకటనలు, చర్యలతో వార్తలలో కనిపించే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోసారి అదే పని చేసింది. ప్రజాస్వామ్యంలో మాట్లాడాలంటే ఏ ఒక్కరూ భయపడకూడదని చెప్పింది. రాణీ ఝాన్సీ లక్ష్మీబాయిలాగే తనకూ భయమంటే ఏంటో తెలియదని అంటోంది. వాల్మీకి కులస్తుల సెంటిమెంట్లను దెబ్బతీసినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయడం, కోర్టులో విచారణకు హాజరు కాకపోవడంతో ఆమెపై అరెస్టు వారెంటు జారీచేసి, చివరకు అరెస్టు చేయడం లాంటివి తెలిసిందే. తన కెరీర్‌ను నాశనం చేయడానికి కొంతమంది తనను అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని, తాను ఎవరి సెంటిమెంట్లను దెబ్బ తీయలేదని రాఖీ చెప్పింది. అయినా దీనిపై వివాదం రేగడంతో తాను క్షమాపణలు చెబుతూ ఆన్లైన్లో ఒక వీడియోను కూడా అప్లోడ్ చేశానని తెలిపింది. తాను కూడా రాణీ లక్ష్మీబాయి లాగే ధైర్యవంతురాలినని, తనను వివాదాల్లోకి లాగేవాళ్లందరిపై పోరాడుతానని వివరించింది. తాను సమస్యలు ఎదుర్కోవడం ఇది మొదటిసారి ఏమీ కాదని, చాలాసార్లే ఇలా చేశారని అంటోంది. వాల్మీకి మహర్షిలాగే గాయకుడు మికా సింగ్ కూడా చెడు నుంచి మంచికి మారారని ఆమె ఒక షో సందర్భంగా వ్యాఖ్యానించింది. దాంతో వాల్మీకి కులస్థులు ఆమెపై తీవ్రంగా మండిపడ్డారు. తాను మికా సింగ్‌కు మద్దతుగా మాట్లాడినా, చివరకు అతడు కూడా స్పందించలేదని రాఖీ సావంత్ వాపోయింది. అయితే బాలీవుడ్ నటులు మాత్రం తనకు మద్దతుగా మెసేజిలు పెడుతున్నారని వివరించింది. ఆమిర్ ఖాన్, అనుపమ్ ఖేర్ లాంటి పెద్ద నటులు తనకు మద్దతునిస్తూ మెసేజిలు పెట్టారని రాఖీ చెప్పింది. -
బాలీవుడ్ నటి అరెస్టు
-
బాలీవుడ్ నటి అరెస్టు
ముంబై: బాలీవుడ్ హాట్ భామ రాఖీ సావంత్ అరెస్టయింది. పంజాబ్ పోలీసులు ఆమెను మంగళవారం ముంబైలో అరెస్టు చేశారు. రామాయణం రాసిన వాల్మీకి మహర్షి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదవ్వడంతో పంజాబ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ఓ ప్రైవేటు టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో వాల్మీకి మహర్షి మీద ఆమె చేసిన వ్యాఖ్యలు తమను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయని వాల్మీకీ కులస్తులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాఖీసావంత్‌ను అరెస్టు చేసేందుకు లూధియానా కోర్టు సోమవారం వారెంట్ జారీచేసింది. దీంతో ఇద్దరు లూధియానా పోలీసుల బృందం ముంబై వెళ్లి.. ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణకు హాజరుకావాలని పదే పదే సమన్లు పంపినా ఆమె రాకపోవడంతో మార్చి 9వ తేదీన వారంటు జారీ అయింది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 10వ తేదీన ఉంది. -
రాఖీ సావంత్‌కు అరెస్టు వారెంటు
బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్‌కు లూధియానా కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. రామాయణం రాసిన వాల్మీకి మహర్షి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఈ వారంటు జారీ అయింది. గత సంవత్సరం ఓ ప్రైవేటు టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో వాల్మీకి మహర్షి మీద ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల వాల్మీకు కులస్థులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాఖీసావంత్‌ను అరెస్టు చేసేందుకు లూధియానాకు చెందిన ఇద్దరు పోలీసుల బృందం అరెస్టువారంటుతో ముంబై వెళ్లిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలని పదే పదే సమన్లు పంపినా ఆమె రాకపోవడంతో మార్చి 9వ తేదీన వారంటు జారీ అయింది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 10వ తేదీన ఉంది. -
సన్నీ లియోన్‌పై వర్మ వ్యాఖ్యల్లో తప్పేముంది?
ముంబై: ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ చేసిన ట్వీట్లపై బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ స్పందించింది. పైగా తన మద్దతు వర్మకేనని చెప్పింది. వివాదం ఏంటంటే.. బాలీవుడ్ హాట్ నటి సన్నీ లియోన్‌పై చేసిన ట్వీట్లకు గానూ వర్మపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెనక్కి తగ్గిన వర్మ.. తన వ్యాఖ్యలపై బాధ పడ్డవారికి మరో ట్వీట్లో సారీ చెప్పేశారు. సెన్సేషన్ కోసం లేని హడావుడి చేసిన వారికి, తనపై బెదిరింపు చర్యలకు పాల్పడ్డ వారికి క్షమాపణలు వర్తించవని చురకలు అంటించాడు వర్మ. వివాదం ముగిసిపోయిన తరుణంలో తన మద్దతు మాత్రం దర్శకుడు వర్మకే ఉంటుందని మీడియాతో మాట్లాడుతూ రాఖీ సావంత్ చెప్పింది. 'వర్మ చెప్పింది అక్షరాలా నిజమే. నా మద్దతు ఆయనకే ఉంటుంది. సన్నీ లియోన్‌ను ప్రశంసించడం, ఆమెను చూసి మహిళలు నేర్చుకోవాలని.. అందరూ తమ భర్తలకు అలాంటి ఆనందాన్ని పంచాలని చెప్పడంలో తప్పేముంది. మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకూడదు. సన్నీ తన పనిచేసుకుంటూనే భర్తను ఎంతో కేరింగ్‌గా చూసుకుంటుంది. అందుకే భర్తలను ఎలా సంతోషపెట్టాలో తెలుసుకునేందు భార్యలు ప్రత్యేక క్లాసులకు వెళ్లాలన్న వర్మ వ్యాక్యలను నేను పూర్తిగా సమర్ధిస్తున్నానని' రాఖీ సావంత్ మరో వివాదానికి తెరతీసింది. ప్రత్యేక క్లాసులతో మహిళలలో ఎంతో మార్పు వస్తుందని వ్యాఖ్యానించింది. ఈ ఐటమ్ గర్ల్ వ్యాఖ్యలపై మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సంబంధిత కథనాలు వెనక్కు తగ్గిన వర్మ దర్శకుడు వర్మను చెప్పులతో కొడతాం మరో వివాదంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ -
నేనే కాదు.. రాందేవ్, మోదీ కూడా బ్రహ్మచారులే
ఇప్పటివరకు ఒంటరిగా జీవించడమే ఆనందంగా ఉందని బాలీవుడ్ నటి రాఖీసావంత్ తెలిపింది. బాబా రామ్ దేవ్, ప్రధాని మోదీ, సల్మాన్ ఖాన్... వీళ్లంతా బ్రహ్మచారులేనని, వాళ్లను చూసి తాను కూడా ప్రస్తుతానికి అలాగే ఉండాలనుకుంటున్నానని చెప్పింది. అయితే తన సహచర భాగస్వామిని ఎంచుకునేందుకు మరోమారు 'రాఖీ కా స్వయంవర్' రియాలిటీ షోను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాఖీసావంత్ ఇంతకుముందు క్రేజీ 4,1920 వంటి సినిమాల్లో నటించారు. 2009లో నిర్వహించిన ఇదే రియాలిటీ షో మొదటి సీజన్లో కెనడియన్ వ్యాపారవేత్త ఈలేష్ పరుజన్‌వాలాను తన భర్తగా ఎంచుకుంది. అయితే తర్వాత కొన్ని అభిప్రాయ భేదాలతో ఇద్దరూ విడిపోయారు. డబ్బు కోసమే తాను ఈలేష్ను ఇష్టపడ్డానని ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో రాఖీ చెప్పింది. ధనవంతుడు, కష్టపడేవాడు, నలుగురిలో తిరిగేవాడు, శక్తిమంతుడైన వ్యక్తి దొరికేవరకు తాను పెళ్లి గురించి ఆలోచించేది లేదని ఇప్పుడు తాజాగా స్పష్టం చేసింది. అలాంటివాడిని వెతికి పట్టుకోవాలనే తన స్వయంవరాన్ని మరోసారి నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. కాగా, రాఖీ ఈ సంవత్సరమైనా పెళ్లి చేసుకుంటే మంచిదని ఆమె స్నేహితురాలు, హాలీవుడ్ నటి సోఫియా హయత్ అన్నారు. ఆ మాటలను మాత్రం రాఖీ పట్టించుకున్నట్లు లేదు. -
రాఖీ సావంత్ పెళ్లి చేసుకుంటోందా?
బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని ఆమె బెస్ట్ ఫ్రెండ్, హాలీవుడ్ నటి, మోడల్ సోఫియా హయత్ అంటోంది. రాఖీ సావంత్ చాలా కష్టపడి పనిచేస్తుందని, రాళ్ల మీద నుంచి కూడా ప్రవహిస్తూనే వెళ్లే నదిలాంటిదని, ఆమె ఎప్పటికీ ఆగదని కూడా చెప్పింది. అమ్మాయిలంతా రాఖీని స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికింది. ఆమె తన స్నేహితురాలు కావడం తన అదృష్టని ఓ ప్రకటనలో చెప్పింది. కానీ తాను ఆమె గురించి ఆందోళన చెందుతున్నానని, వీలైనంత త్వరగా రాఖీ పెళ్లి చేసుకుంటనే మంచిదని.. కనీసం ఈ ఏడాదైనా ఆమె పెళ్లి చేసుకోవాలని సూచించింది. ఆమెకు మంచి సంబంధం కూడా వెతుకుతున్నట్లు సోఫియా హయత్ వివరించిందది. గతంలో మాలామాల్ వీక్లీ, క్రేజీ 4, 1920 లాంటి సినిమాల్లో నటించిన రాఖీ సావంత్.. ఆ తర్వాత 'రాఖీ కా స్వయంవర్' అనే రియాల్టీ షో నిర్వహించింది. అందులో ఈలేష్ పరుజన్‌వాలా అనే వ్యక్తిని ఎంచుకుంది కూడా. కానీ తర్వాత ఇద్దరూ విడిపోయారు. రాఖీని చాలామంది సరిగా అర్థం చేసుకోలేదని.. ఆమె సెక్స్ సింబల్లాగే కనిపించినా, లోపల మాత్రం రుషిలాంటిదని చెప్పింది. ఆమెను పెళ్లి చేసుకునేవారు ఎవరైనా చాలా అదృష్టవంతులని తెలిపింది. -
‘మాయావతికి పోటీగా సినీ నటి’
అలహాబాద్: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి పోటీచేస్తే, ఆమెకు ప్రత్యర్థిగా తమ పార్టీ నుంచి సినీ నటి రాఖీ సావంత్‌ను నిలబెడతామని ఆర్పీఐ(రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. కేంద్ర సహాయ మంత్రి, ఆర్పీఐ అధ్యక్షుడు రామ్‌దాస్ అథవాలే ఆదివారం ఈ విషయం చెప్పారు. మాయావతి కొన్ని రోజులుగా ఎన్నికల నుంచి తప్పించుకు తిరుగుతున్నారని ఆయన అన్నారు. దళితుల మద్దతు బాగా ఉన్న ఆర్పీఐ.. బీజేపీతోనే పొత్తు పెట్టుకుంటుందని, కుదరని పక్షంలో 200 స్థానాల్లో సొంతంగా అభ్యర్థులను పోటీలో నిలబెడతామని అథవాలే వెల్లడించారు. ‘మాయావతి ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించుకుంటున్నారు. ఈసారి మనసు మార్చుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తే ఆమెపై మా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాఖీ సావంత్ ను బరిలోకి దించుతాం. మాయావతి ఎక్కడి నుంచి పోటీచేస్తే అక్కడి నుంచి సావంత్ బరిలో ఉంటార’ని రామ్‌దాస్ అథవాలే తెలిపారు. యూపీలో బీఎస్పీకి ప్రత్యామ్నాయం కోసం దళితులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాయావతి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. -
మోదీ బొమ్మలతో డ్రస్.. రాఖీసావంత్‌పై కేసు
బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌పై తాజాగా మరో కేసు నమోదైంది. గడిచిన ఆగస్టు నెలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బొమ్మలతో కూడిన ఒక అసభ్యకరమైన డ్రస్ ధరించినందుకు ఆమెపై ఈ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని ఒక పోలీసు స్టేషన్లో ఈ మేరకు ఒక ఎఫ్ఐఆర్ దాఖలైంది. స్థానికుడొకరు రెండు రోజుల క్రితం ఈ విషయమై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని, ఆమె ఆ దుస్తులు వేసుకోవడం ద్వారా ప్రధానమంత్రిని అవమానించడమే కాక, అసభ్యత కూడా ప్రదర్శించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్‌సమంద్ జిల్లాలోని కంక్రోలి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గణనాధుడికి రాఖీ సావంత్ ప్రత్యేక పూజలు
-
సెన్సార్ బోర్డుపై హీరోయిన్ చిందులు
న్యూఢిల్లీ: బాలీవుడ్ ఐటమ్ గర్ల్, నటి రాఖీ సావంత్ కేంద్ర సెన్సార్ బోర్డుపై విరుచుకుపడింది. రాఖీ తాజా సినిమా ఏక్ కహాని జూలీ కీ.. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం ఆమెకు కోపం తెప్పించింది. సెన్సార్ బోర్డుపై, చైర్మన్ పహ్లజ్ నిహలానీపై రాఖీ తీవ్ర విమర్శలు చేసింది. ‘సెన్సార్ బోర్డును మూసివేయాలి. పెద్ద నిర్మాతల నుంచి డబ్బులు తీసుకోవడం తప్ప వాళ్లు చేస్తున్నదేమీ లేదు. సెన్సార్ బోర్డు సభ్యులు చిన్న నిర్మాతలను వేధిస్తున్నారు. లంచం ఇవ్వాలని పబ్లిక్‌గా డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఏమీ తెలియనివారు ఉన్నారు. సెన్సార్ బోర్డు చైర్మన్ పదవి నుంచి నిహలానీని తప్పించాలి. ఆయనకు ఏమీ తెలియకుంటే పదవికి రాజీనామా చేయాలి. ఆ స్థానంలో నేను కూర్చుంటాను. నిహలానీ కంటే సమర్థవంతంగా పనిచేయగలను. వాళ్లకు మేం డబ్బులు ఇవ్వనందుకే ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. నేను ఈ సినిమాలో నటించడమే దీనికి కారణం. వాళ్లు బుద్ధి కోల్పోయారు. నేను బాలీవుడ్ స్టార్‌ను, నటిని, ఈ దేశ బిడ్డను. నేనేమీ పోర్న్ స్టార్ కాదు. ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఈ సినిమాలో అసభ్య దృశ్యాలు లేవు. ఈ విషయంపై బాంబే హైకోర్టును సంప్రదించాను. సెన్సార్ బోర్డుపై చర్యలు తీసుకోవాలని కోరాను. వాళ్లకు తగిన గుణపాఠం చెబుతా. వారిపై పోరాటం చేస్తాను. దేశంలో సెన్సార్ బోర్డు లేకుండా తొలగించాలి’ అని రాఖీ ఘాటుగా విమర్శించింది. -
మోదీ నా డ్రీమ్ మ్యాన్: బాలీవుడ్ నటి
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలతో ఉన్న డ్రెస్ ధరించి విమర్శలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తన చర్యను సమర్థించుకుంది. మోదీపై ఉన్న అభిమానంతోనే ఇలా చేశానని వివరణయిచ్చింది. మోదీ ఫొటోలతో ఉన్న స్కర్ట్ ధరించి చికాగోలో ఇటీవల జరిగిన భారత స్వాతంత్ర్య ముందస్తు వేడుకల్లో రాఖీ సావంత్ పాల్గొంది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై 'ఫస్ట్ పోస్ట్'తో రాఖీ సావంత్ మాట్లాడుతూ... 'బీజేపీని ఆకట్టుకోవాలని ఈ డ్రెస్ ధరించాను. ముఖ్యంగా మోదీ, అమిత్ షా దృష్టిలో పడాలని ఇలా చేశాను. వీరిద్దరినీ విపరీతంగా అభిమానిస్తాను. నన్ను రాజ్‌నాథ్ సింగ్ కూతురిలా భావిస్తారు. నేను ఇప్పటికే బీజేపీ కూతుర్ని. మోదీని ఇంప్రెస్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఫొటోలతో డ్రెస్ డిజైన్ చేయించుకున్నా. మోదీ నా డ్రీమ్ మ్యాన్. ఆయన మన ప్రధానమంత్రి కావడం నాకు ఆనందం కలిగించింది. మరో 15 ఏళ్లు ఆయన ప్రధానిగా ఉంటారు. ఎక్కడికి వెళ్లినా డ్రెస్ వేసుకుంటాను. మోదీ ఫొటోలతో చీర కూడా డిజైన్ చేయించుకుంటాన'నని రాఖీ సావంత్ తెలిపింది. తన దుస్తులపై విమర్శలు చేయడం మానుకుని సీరియస్ విషయాలపై దృష్టి పెట్టాలని విమర్శలకు సూచింది. 'మన ప్రియమైన ప్రధానమంత్రిపై నాకున్న అభిమానాన్ని ఈ విధంగా వ్యక్తం చేశాను. నా డ్రెస్ వివాదాలపై సృష్టించి సమయం వృధా చేసుకోకుండా, మీ కుటుంబంపై దృష్టి పెట్టాలని విమర్శకులకు చెప్పలనుకుంటున్నాను. బాలికలపై అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు వంటి తీవ్రమైన సమస్యలపై మాట్లాడితే బాగుంటుంది. నా డ్రెస్ గురించి మాట్లాడి టైమ్ వేస్ట్ చేసుకోవద్ద'ని రాఖీ సావంత్ పేర్కొంది. -
ఆ డ్రెస్ తో మోదీ పరువు తీసింది..!
సినీతారలు పబ్లిసిటీ కోసం పాకులాడటం అందరికీ తెలిసిందే. ఆ కోవలో ఉండేవారిలో రాఖీ సావంత్ దే ఫస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అయితే ఆ బాలీవుడ్ హాట్ గాల్ అమెరికాలో జరిగిన ఓ పార్టీలో అందర్నీ ఆకట్టుకోవడంలో భాగంగా ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీనే టార్గెట్ చేసింది. ఆయన చిత్రాలతో రూపొందించిన అభ్యంతరకర డ్రెస్ వేసుకొని మోదీ పరువు తీసింది. అమెరికా చికాగోలో జరిగిన ప్రీ ఇండిపెండెన్స్ పార్టీలో రాఖీ సావంత్ డ్రెస్.. చూపరులకు తీవ్ర ఇబ్బందిని కలిగించింది. నరేంద్ర మోదీ అభిమానులకు ఒకింత ఆగ్రహం కూడా తెప్పించింది. పార్టీకి ఓ కురచ గౌను వేసుకొచ్చిన రాఖీ.. ఆ డ్రెస్ పై నరేంద్ర మోదీ బొమ్మలను అతికించుకోవడం సంచలనంగా మారింది. రాఖీ డ్రెస్ ను చూసేందుకు అక్కడి జనం ఎంతో ఇబ్బంది పడ్డా.. ఆమె విషయాన్ని ఏమాత్రం పట్టించుకోపోవడం విశేషం. ఇలా ఓ దేశ ప్రధాని ఫోటోలను డ్రెస్ పై అతికించుకోవడమే కాక పబ్లిక్ గా ప్రదర్శన ఇవ్వడం.. మోదీనే కాక, ఏకంగా దేశాన్నే అవమానించినట్లని కొందరు రాఖీ సావంత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా పబ్లిసిటీకోసమేనా అని అడిగిన అక్కడి జర్నలిస్టుపైకూడా ఆమె తిట్లపురాణం విప్పడం.. చూపరులను షాక్ కు గురి చేసింది. సిగ్గుమాలిన చర్యలకు పూనుకోవడమే కాక, దాన్ని ప్రచారం చేసుకోడానికి వాడుకోవాలనుకోవడం రాఖీకే సొంతం. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తలకెక్కే రాఖీ సావంత్.. ఇప్పుడు అభిమానుల రెస్పాన్స్ కోసం మోదీ చిత్రాల డ్రెస్ తో దిగిన ఫోటోలను ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ ల్లో కూడా పోస్ట్ చేసింది. ఒక్క అభిమానులే కాదు.. రాఖీ ప్రయత్నం ఏకంగా మోదీ అటెన్షన్ కోసం కూడా అన్నట్లు దీన్నిబట్టి తెలుస్తోంది. -
హీరోయిన్ డ్రెస్‌పై మోదీ ఫొటోల కలకలం
బాలీవుడ్ నటి రాఖీ సావంత్, వివాదాలు వేరు కాదు. ఈ భామకు వివాదాలంటే చాలా ఇష్టం. అందుకేనేమో సినిమాల్లో కంటే వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. అన్నట్టు రాఖీ ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమానట! ఇలాంటి అభిమానులు ఉండాలని మోదీ కోరుకుంటారో లేదో కానీ.. రాఖీ మాత్రం మోదీపై తన అభిమానాన్ని ఏమాత్రం దాచుకోకుండా ప్రదర్శిస్తుంటుంది. రాఖీ తన డ్రెస్ (స్కర్ట్) పై మోదీ ఫొటోలను డిజైన్ చేయించుకుంది. రాఖీ వేసుకున్న స్కర్ట్ మొత్తం మోదీ ఫొటోలే ఉన్నాయి. స్కర్ట్ ముందు, వెనుక భాగంలో రెండు పెద్ద ఫొటోలు ఉన్నాయి. రాఖీ ఈ డ్రెస్ వేసుకుని ఇటీవల అమెరికాలో ఓ పార్టీలో పాల్గొంది. రాఖీ ఈ డ్రెస్‌లో అర్ధనగ్నంగా కనిపిస్తూ, సెక్సీగా పొజులిస్తూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడం కలకలం రేపింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. రాఖీ గతంలో కూడా మోదీని ఉద్దేశిస్తూ వింత వ్యాఖ్యలు చేసింది. గతంలో సీలింగ్ ఫ్యాన్లను నిషేధించాలని ఈ అమ్మడు మోదీని కోరింది. చాలామంది కూతుళ్లు, కోడళ్లు ఇంట్లో ఫ్యాన్లకు ఉరేసుకుని చనిపోతున్నారని, ఆత్మహత్యలను నివారించడానికి సీలింగ్ ఫ్యాన్లు లేకుండా చేయాలని రాఖీ సానుభూతి ప్రకటించింది. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్.. మోదీని చూసి నేర్చుకోవాలని ఇటీవల సలహా ఇచ్చింది. మహిళా సాధికారిత కోసం మోదీ ఎంతో కృషి చేస్తున్నారని రాఖీ ప్రశంసించింది. రాఖీ ప్రచారం కోసమే చౌకబారు చర్యలకు పాల్పడుతోందని మోదీ అభిమానులు విమర్శిస్తున్నారు. -
చిక్కుల్లో బాలీవుడ్ నటి
లుధియానా: రాజకీయ నాయకురాలిగా మారిన బాలీవుడ్ తార రాఖీ సావంత్ కు మరోసారి చిక్కులు ఎదురయ్యాయి. మహర్షి వాల్మికిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమెకు లుధియానా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న తమ ఎదుట హాజరుకావాలని జ్యుడీషియల్ మేజిస్ట్రేల్ ఆదేశించారు. స్థానిక న్యాయవాది నరీందర్ ఆదియా ఫిర్యాదు మేరకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఓ ఇంటర్వ్యూలో మహర్షి వాల్మికిపై రాఖీ సావంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ ఆరోపించారు. ఇంటర్వ్యూ వీడియోను సోషల్ మీడియాలోనూ పెట్టారని చెప్పారు. తన మనోభావాలను దెబ్బతీశారని పేర్కొంటూ ఆమెపై వాల్మికి సామాజిక వర్గానికి చెందిన వారు ఈనెల 22న జలంధర్ లోని రామమండి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఆమెపై 295(ఏ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రాఖీ సావంత్ కు వ్యతిరేకంగా వాల్మికి సామాజిక సంఘాలు ఆందోళనలు కూడా చేపట్టాయి. ఆమె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ నుంచి వచ్చిన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలును వాల్మికి టైగర్ ఫోర్స్ కార్యకర్తలు అడ్డుకున్నారు. -
మోదీని, కోహ్లిని, నన్ను ఇష్టపడ్డందుకే.. ఆ దారుణం!
-
మోదీని, కోహ్లిని, నన్ను ఇష్టపడ్డందుకే.. ఆ దారుణం!
బాలీవుడ్ లో వివాదాల రాణిగా పేరొందిన ఐటంగర్ల్ రాఖీ సావంత్ పాకిస్థాన్ మోడల్ ఖందీల్ బలోచ్ హత్యపై తనదైన శైలిలో వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా సెన్సేషన్ గా పేరొందిన బలోచ్ ను సొంత సోదరుడే దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. పరువు హత్యగా పోలీసులు దీనిని భావిస్తుండగా.. రాఖీ సావంత్ మాత్రం తనదైన కారణాలను చెప్పింది. 'ఎందుకు బలోచ్ ను చంపారు. ఆమె ఎక్స్ పోజింగ్ చేసినందుకా.. లేక నరేంద్రమోదీజీని, విరాట్ కోహ్లిని, కత్రినాను, కరీనాను, నన్ను ఇష్టపడ్డందుకు ఆమెను చంపేశారు. ఈ హత్యకు కారణాలేమిటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను' అంటూ రాఖీ పేర్కొంది. కందీల్ హత్య వెనుక పెద్ద కుట్ర ఉందని ఆమె ఆరోపించింది. ఆమె హత్యకు కారణమైన సోదరుడిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. -
'ఆకలితో అలమటిస్తుంటే నినాదాలా?'
గువాహటి: తనకు బీజేపీ ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేసినా తిరస్కరించానని బాలీవుడ్ ఐటమ్ గాళ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా-అథవాలే(ఆర్పీఐ-ఏ) నాయకురాలు రాఖీ సావంత్ వెల్లడించింది. 2014 సాధారణ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి లోక్ సభ టిక్కెట్ ఇస్తానంటే తిరస్కరించానని చెప్పింది. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసేందుకు గువాహటికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడింది. ఈ నెల 11న జరగనున్న అసోంలో ఎన్నికల్లో తమ పార్టీ తరపున 21 స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేయనున్నారని చెప్పింది. దళిత హక్కుల కోసం పోరాడుతున్నానని.. కాంగ్రెస్, బీజేపీలు పేదలకు చేసింది ఏమీ లేదని విమర్శించింది. ప్రజలు పేదరికంతో అలమటిస్తుంటే 'భారత్ మాతాకి జై' అని ఎలా నినదిస్తారని సూటిగా ప్రశ్నించింది. అసోంలో నివాసం ఏర్పచుకోవాలనుకుంటున్నానని, ఇక్కడి నుంచే పోరాటం చేయాలనుకుంటున్నట్టు రాఖీ సావంత్ తెలిపింది. -
ఐటమ్ గాళ్ సంచలన విషయాలు
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ ఐటమ్ గాళ్ రాఖీ సావంత్ సంచలన విషయాలు వెల్లడించింది. ప్రత్యూషను రాహుల్ రాజ్ సింగ్ నిత్యం చిత్రహింసలు పెట్టేవాడని విలేకరుల సమావేశంలో చెప్పింది. ప్రత్యూషను టార్చర్ పెట్టొద్దని రాహుల్ కు చాలాసార్లు చెప్పానని తెలిపింది. ప్రత్యూష కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రత్యూషను హత్య చేశారని ఆమె ఆరోపించింది. మహిళల ఆత్మహత్యల నివారణకు తనదైన శైలిలో సూచన చేసింది రాఖీ సావంత్. ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు నిషేధించాలని సూచించింది. సీలింగ్ ఫ్యాన్లపై నిషేధం విధించాలని మీడియా ముఖంగా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. 'కూతుళ్లు, సోదరీమణులు, కోడళ్లు సీలింగ్ ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటిని నిషేధించాలని ప్రధాని మోదీని కోరుతున్నా. మీ కుమార్తెలు లేదా సోదరీమణులపై ప్రేమ ఉంటే ఇళ్లలోని సీలింగ్ ఫ్యాన్లను పీకి బయటపడేయండి. టేబుల్ ఫ్యాన్లు లేదా ఏసీలు వాడండి' అని రాఖీ సావంత్ సూచించింది. కాగా, ప్రత్యూష ఆత్మహత్య కేసులో రాహుల్ పై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
అసలు ప్రేమికులే లేకపోతే..
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య ఉదంతంపై విభిన్న కథనాలు వివాదాన్ని సృష్టిస్తోంటే, బాలీవుడ్ నటి, ఐటం గర్ల్ రాఖీ సావంత్ తనదైన శైలిలో స్పందించింది. ప్రత్యూష బెనర్జీ , ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ప్రేమ వ్యవహారంలోనే ఎక్కువ కలత చెందేదని ఆమె తెలిపింది. ఆమె ఆత్మహత్య చేసుకుందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని రాఖీ పేర్కొంది. ప్రేమలు ప్రాణాలు తీస్తున్నాయని, ప్రేమికులు లేనిదే బతకలేరా అని ఆమె వ్యాఖ్యానించింది. అసలు ప్రేమికులే లేకపోతే ఈ ఆత్మహత్యలే ఉండవని రాఖీ చెప్పుకొచ్చింది. ఇటీవల తాను ప్రత్యుషను కలిసినపుడు చాలా ఆందోళనలో ఉన్నట్టు కనిపించిందని రాఖీ సావంత్ తెలిపింది. ప్రత్యూష చాలా ఎమోషనల్ గర్ల్ అని, అందుకే ఏమైంది తను అడగ్గానే కన్నీళ్లు పెట్టుకుందని, ఆమెకు జీవితంలో ఎన్నో కలలు ఉన్నాయని పేర్కొంది. రాహుల్ మాజీ ప్రియురాలు సలోని విషయంలో కలత చెందేదని చెప్పింది. రాహుల్ ...సలోనితో రిలేషన్ కొనసాగిస్తున్నాడని ప్రత్యుష బాధపడిందని, ఆమెకు పని విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదని, కేవలం ప్రేమ వ్యవహారమే ఆమెను తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని అభిప్రాయపడింది. రాహుల్ ని పిచ్చిగా ప్రేమించింది.. అతను లేకపోతే బతకలేనని కన్నీళ్లతో చెప్పిందని తెలిపింది. ముంబై పోలీసులు ఈ కేసును ఎలా విచారిస్తారో చూద్దాం అని మీడియాకు తెలిపింది. మరోవైపు ప్రత్యూష సన్నిహితుడు, ప్రముఖ డిజైనర్ రోహిత్ వర్మ మరో సంచలన విషయాన్ని వెల్లడించాడు. గత నెలలో పెళ్లి దుస్తులు తయారు చేయాల్సిందిగా ప్రత్యూష తనను కోరిందని తెలిపాడు. తనను హోలీ పార్టీకి ఆహ్వానించిందని, అయితే ఆ సమయంలో తాను లండన్ లో ఉండడం రాలేకపోయానని రోహిత్ పేర్కొన్నాడు. -
'మోదీజీ నా గుండెకు గాయంచేశారు'
ముంబై: బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తొలుత అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోటీపడుతున్న అభ్యర్థుల గురించి మాట్లాడింది. అందులో భాగంగా రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష స్థానానికి పోటీలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ గురించి కొన్ని విషయాఆలు మాట్లాడింది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్ని నెలలుగా దేశమంతా నమో మంత్రాన్ని జపిస్తోందని అయితే కొన్నిరోజుల నుంచి ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయని రాఖీ సావంత్ పేర్కొంది. ఇప్పటికీ తాను మోదీజీకి పెద్ద అభిమానినని, నిజం చెప్పాలంటే ఆయన తన గుండెకు గాయం చేయారని వ్యాఖ్యానించింది. ఆయన ఇచ్చిన వాగ్దాలు నెరవేరుస్తారని తనకు నమ్మకం ఉందని అయితే ఇప్పటివరకూ ఏం చేయలేదని అంటోంది. మనం అందరం ఇడియట్స్. నల్లధనాన్ని భారత్ కు తిరిగి తెప్పిస్తామని చెప్పారు కానీ, ఎక్కడుంది ఆ నల్లధనం అంటూ ప్రశ్నించింది. దేశమంతా ఇంకా ఆ నల్లధనం గురించి ఎంతో ఆశగా ఎదరుచూస్తున్నారని చెప్పుకొచ్చింది. దేశంలో చాలా మంది ఇంకా నిరుపేదలు గానే ఉన్నారనీ, లక్షల సంఖ్యల ప్రజల ప్రధాన సమస్య ఇదేనని రాఖీ అభిప్రాయపడింది. భారతీయుల ఎమోషన్స్ తో మోదీ ఆడుకుంటున్నారు.. 'అచ్చే దిన్' అని వాగ్దానాలు చేశారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చేలా కనిపించడంలేదంది. మోదీ చేతుల్లో అందరూ ఆడుతున్నందున మరికొన్ని సంవత్సరాలు భారతీయులు ఇబ్బందులకు గురికావలసిందేనని రాఖీ సావంత్ వివరించింది. -
ఎన్నికల ప్రచారంలో ఐటమ్ గర్ల్!
గువాహతి: అసోంలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో తాను ప్రచారం చేయాలని బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ నిర్ణయించుకుంది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) తరఫున అథవాలే నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఆర్పీఐ పార్టీ మహారాష్ట్రలోని దళితుల హక్కుల కోసం పోరాడుతోందన్ విషయం తెలిసిందే. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ బాటలో ఈ పార్టీ పోరాటం సాగిస్తోంది. ఆ పార్టీ రాజకీయాలలో ఈ మధ్య ప్రేవేశించింది. ఆర్పీఐ పార్టీ మహిళా విభాగానికి చీఫ్ గా రాఖీ పనిచేయనుంది. సింగర్, నటి సల్మా అఘ్నాను కూడా ప్రచారానికి దించనున్నట్లు ఆర్పీఐ కార్యదర్శి నాథుని తెలిపారు. అభ్యర్థుల తొలి జాబితాను ఇటీవలే ఆ పార్టీ ప్రకటించింది. త్వరలోనే మిగతా అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని నాథుని పేర్కొన్నారు. ఆమె ప్రచారం చేయడం, ఈ కార్యక్రమాలలో పాల్గొనడం తమకు కలిసొచ్చే అవకాశం ఉందని పార్టీ పెద్దలు చెబుతున్నారు. రాజ్యాంగబద్ధమైన హక్కులను రక్షించడమే తమ పార్టీ పని అని, రాఖీ సావంత్ తమ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సిద్దంగా ఉందని ఆర్పీఐ ప్రధాన కార్యదర్శి నాథుని వెల్లడించారు. అయితే, తనకు పోర్న్ స్టార్ అవ్వాలని ఉందని రాఖీ సావంత్ వ్యాఖ్యలు చేసిన నెలరోజుల్లోనే ఆర్పీఐ పార్టీ ఆమెకు ప్రచార బాధ్యతలు అప్పగించించడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. -
'నాకిప్పుడు పోర్న్ స్టార్ అవ్వాలని ఉంది'
సినిమాలతోకన్నా వివాదాలతోనే ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ మరోసారి రెచ్చిపోయింది. చాలాకాలం నుంచి సన్నీ లియోన్‌పై నోటికొచ్చిన కామెంట్ చేస్తూ తన అక్కసు వెళ్లగక్కుతున్న రాఖీ ఈసారి కూడా అవకాశాన్ని వదులుకోలేదు. ఇటీవలే ఓ టీవీ ఇంటర్వ్యూలో యాంకర్ నుంచి సన్నీ అభ్యంతరకర ప్రశ్నలు ఎదుర్కొన్న సమయంలో ఆమె ప్రవర్తించిన తీరుపై బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలతోపాటు మద్దతు లభించిన విషయం తెలిసిందే. ఆమీర్ ఖాన్ కూడా సన్నీతో నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. అయితే తాజాగా బుధవారం ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాఖీ సావంత్‌ను ఇంటర్యూ చేస్తున్న విలేకరులు.. సన్నీకి ఆమీర్ ఇచ్చిన మద్దతుపై స్పందన తెలియజేయమని అడగ్గా వెంటనే రాఖీ.. 'ఈ రోజు మీ అందరికీ నేనొక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను, రాఖీ సావంత్ త్వరలోనే పోర్న్ స్టార్ కానుంది. అవును.. నేనిప్పుడు పోర్న్ స్టార్ అవ్వాలనుకుంటున్నాను ' అంటూ విలేకరులనే కాదు అక్కడున్న అతిధులను సైతం అవాక్కయ్యేలా చేసింది. గత ఏడాది ఇలాంటి ఓ ఇంటర్వ్యూలోనే రాఖీ మాట్లాడుతూ.. ఓ పోర్న్ స్టార్ తో పోటీ పడేందుకు నేనెప్పటికీ పోర్న్ స్టార్ గా మారనంటూ వ్యాఖ్యానించింది. ఏదేమైనా సన్నీ నుంచి రాఖీ రసవత్తరమైన పోటీ ఎదుర్కొంటుందనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. -
నవంబర్ 25న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు రూపా గంగూలీ (నటి), రాఖీ సావంత్ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది వృత్తికారకుడైన శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం వీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరత్వాన్ని, అభివృద్ధిని సాధిస్తారు. సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల ఉంటుంది. వీరు ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లలకు వివాహాది శుభకార్యాలు జరిపిస్తారు. న్యాయవాద వృత్తిలో ఉన్న వారు, మేనేజిమెంట్ రంగంలోని వారు రాణిస్తారు. పుట్టిన తేదీ 25. ఇది కేతు సంఖ్య కావడం వల్ల దైవకృపతో నీతి నిజాయితీలతో పని చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. యోగ, ధ్యానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా మంచి మార్పు వస్తుంది. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పుణ్యక్షేత్ర సందర్శన ఈ సంవత్సర తప్పక చేస్తారు. అయితే బీపీ, గుండె సంబంధ వ్యాధులు తలెత్తే అవకాశం ఉండటం వల్ల యోగ, మెడిటేషన్ చేస్తూ వైద్య సలహాలు తీసుకుంటూ ఉండటం మంచిది. లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, గ్రే, క్రీమ్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం చేయడం, వృద్ధులను ఆదరించడం, కాకులకు, కోతులకు ఆహారం పెట్టడం, మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం,పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
ఇంద్రాణి పాత్రలో రాఖీ!
తాజాగా మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఇంద్రాణి ముఖర్జీ జీవితం తెరపైకి రానుంది. కన్నకూతురినే హత్య చేసిన మీడియా అధినేత్రి ఇంద్రాణి పాత్రలో రాఖీ సావంత్ కనిపించనున్నారు. సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన ఇంద్రాణి జీవిత క్రమాన్ని ‘ఏక్ కహానీ జూలి కి’ అనే చిత్రం ద్వారా ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని రాఖీసావంత్ స్వయంగా వెల్లడించారు. ‘‘నాకు వ్యక్తిగతంగా ఇంద్రాణి ఎప్పటినుంచో పరిచయం. ఆమె జీవితాన్ని ఎంతో దగ్గర్నుంచి చూశాను. ఇంద్రాణి ప్రతి క్షణం ఒత్తిడితోనే జీవితాన్ని గడిపేది. ఆమె భర్త పీటర్ ముఖర్జీ, కూతురు షీనాలు కూడా నాకు బాగా తెలుసు. అందుకే ఇంద్రాణి పాత్రకు నేనే కరెక్ట్’’అని చెప్పుకొచ్చారామె. -
ఐ డోంట్ కేర్!
‘‘సన్నీ లియోన్‌తో నాకు పోలిక పెట్టకండి. ఎందుకంటే, మంచి నటన, డ్యాన్స్, రియాల్టీ షోస్ అన్నీ చేసి, నా ప్రతిభ నిరూపించుకున్నా. సన్నీ లియోన్‌లా శృంగార చిత్రాల్లో నటించలేదు’’ అని ఆ మధ్య బహిరంగంగా సన్నీపై నోరు పారేసుకున్నారు రాఖీ సావంత్. అసలు సన్నీకి మన ఇండియాలో ఉండే అర్హత లేదని, తను అర్జంటుగా ఇక్కణ్ణుంచీ వెళ్లిపోవాలని కూడా రాఖీ పేర్కొన్నారు. విదేశీ భామ సన్నీపై వీలు కుదిరినప్పుడల్లా రాఖీ నానా దుర్భాషలాడుతూ వస్తున్నారు. దీనంతటికీ కారణం సన్నీ ఇక్కడ పాపులార్టీ సంపాదించుకోవడమే. ఉత్తరాదిన మాత్రమే కాకుండా దక్షిణాదిన కూడా సన్నీకి వచ్చిన గుర్తింపు చూసి, ఓర్వలేకే రాఖీ ఇలా దురుసుగా మాట్లాడుతున్నారని బాలీవుడ్లో చెప్పుకుంటున్నారు. రాఖీ తనను అంటున్న మాటల గురించి సన్నీ ఇన్నాళ్లూ స్పందించలేదు. కానీ, నోరు మూయించేలా సమాధానం చెప్పకపోతే రాఖీ ఇంకా రెచ్చిపోతుందనుకున్నారో ఏమో.. ‘ఎవరేమన్నా ఐ డోంట్ కేర్’ అనేశారు. ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న సన్నీ దగ్గర రాఖీ వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా, ఆమె ఈ విధంగా అన్నారు. ‘‘ఎవరో ఏదో అంటే నేనెందుకు పట్టించుకుంటాను. నేనిక్కడకు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను. ఎక్కడికీ వెళ్లను. వెళ్లాల్సిన అవసరంలేదు’’ అని ఆ వేడుకలో స్పష్టం చేశారు సన్నీ. ఒకరు విమర్శించడం వల్ల తన కెరీర్‌కి ఎలాంటి నష్టం జరగదనీ, తనకు ఏది దక్కాలో అది దక్కే తీరుతుందని కూడా ఈ హాట్ గాళ్ పేర్కొన్నారు. సినిమాల్లో నిలదొక్కువాలనే తన కలను నెరవేర్చుకుంటానని, తన ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని కూడా సన్నీ లియోన్ స్పష్టం చేశారు. -
నాపై చెత్త కామెంట్లు చేయకండి: సన్నీ లియోన్
ఐటెం గర్ల్ రాఖీ సావంత్, హీరోయిన్ సెలినా జైట్లీలు తనమీద చెత్త కామెంట్లు చేయడం సరికాదని సన్నీ లియోన్ మండిపడింది. 'ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా 8' కార్యక్రమం ఆవిష్కరణలో వాళ్లిద్దరూ చేసిన వ్యాఖ్యల మీద స్పందించాల్సిందిగా కోరినప్పుడు.. ఆమె తీవ్రంగా మండిపడింది. వాళ్లు చేసినవి పనికిమాలిన, చెత్త కామెంట్లని, వాటికి ఏమాత్రం ఆధారాలు లేవని, అలా వ్యాఖ్యానించడం అనైతికం అని చెప్పింది. నటీనటులు ఇంత దారుణంగా మాట్లాడం ఎప్పుడూ చూడరని వాపోయింది. అదేదో వాళ్ల సమస్య తప్ప తనది కాదని, వాటిని తాను లెక్కచేసేది లేదని సన్నీ స్పష్టం చేసింది. తానిక్కడ పని చేయడానికే వచ్చానని, దానిమీదే దృష్టి పెడతానని తెలిపింది. సన్నీ లియోన్ మరీ పల్చటి దుస్తులు వేసుకుంటోందని, దానివల్ల ఆమెలాగే మిగిలినవాళ్లు కూడా అలాంటి దుస్తులు వేసుకోవాల్సి వస్తోందని రాఖీ వ్యాఖ్యానించింది. సన్నీ లియోన్ భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని డిమాండ్ కూడా చేసింది. ఇక సెలెనా జైట్లీ అయితే.. సన్నీలియోన్, ఆమెభర్త తాము అద్దెకు తీసుకున్న ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోవాలని చెప్పింది. -
కార్లు, వాచీల కోసం హీరోయిన్ మోసం.. అరెస్టు
చిన్న సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ.. దాదాపు వెయ్యిమందిని కోట్లాది రూపాయల మేర మోసగించిన యువతిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆమె బాధితుల్లో ఐటెం బాంబ్ రాఖీ సావంత్ కూడా ఒకరు కావడం గమనార్హం. లీనా మారియా పాల్ (26), ఆమె సహజీవన భాగస్వామి శేఖర్ చంద్రశేఖర్ (25) మరికొందరితో కలిసి దాదాపు వెయ్యిమందికి టోపీ పెట్టి 9 లగ్జరీ కార్లు, 117 ఇంపోర్టెడ్ వాచీలు, ఒక స్పోర్ట్స్ బైకు, 12 సెల్ఫోన్లు, ఇంకా అనేక విలాసవంతమైన వస్తువులు సొంతం చేసుకున్నారు. దాంతో ముంబై క్రైం బ్రాంచి ఆర్థిక నేరాల విభాగం పోలీసులు వాళ్లను, వాళ్లతో పాటు అదిల్ జైపురి (24) అఖ్తర్ జైపురి (55), సల్మాన్ రిజ్వీ (28), నజీర్ జైపురి (50) అనే నలుగురిని కూడా అరెస్టు చేశారు. రెడ్ చిల్లీస్ అనే సినిమాలో మోహన్లాల్తోను, మద్రాస్ కేఫ్ సినిమాలో జాన్ అబ్రహంతోను పాల్ హీరోయిన్గా పనిచేసింది. లయన్ ఓక్ ఇండియా అనే బోగస్ కంపెనీ పెట్టి, వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు పెట్టుబడులుగా తీసుకున్నారు. పెట్టిన పెట్టుబడి మీద నెలకు 20 శాతం చొప్పున మూడు నెలల్లో 300 శాతం లాభాలు ఇస్తామని వీళ్లు చెప్పేవారు. వాళ్లు కట్టిన డబ్బుతో వ్యాపారాలు ఏమీ చేయకుండా.. పైపెచ్చు లగ్జరీ కార్లు కొనేవాళ్లు. బెంట్లీ, ఆడి, మెర్సిడిస్, మాసెరాటి, నిస్సాన్ లాంటి బ్రాండ్ కార్లు వాళ్ల వద్ద ఉన్నాయి. రూ. 23 లక్షల విలువైన హోండా స్పోర్ట్స్ బైకు కూడా ఉంది. అంతేకాదు, చంద్రశేఖర్ తనను తాను ఐఏఎస్ అధికారిగా చెప్పుకొని, ఓ బ్యాంకు నుంచి రూ. 19 కోట్ల రుణం కూడా తీసుకున్నాడు. నాకు 2.5 కోట్ల టోపీ: రాఖీసావంత్ ఈ స్కాం బాధితుల్లో బాలీవుడ్ ఐటెం బాంబు రాఖీ సావంత్ కూడా ఉన్నారు. తాను వీళ్ల వద్ద రూ.2.5 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఆమె చెప్పింది. వాళ్ల జీవనశైలి చూసి షాక్ తిన్నానని, తన డబ్బు ఎలా తిరిగి వస్తుందనే ఆలోచిస్తున్నానని తెలిపింది. -
లవ్ యూ విరాట్!
భారత క్రికెట్ వైస్‌కెప్టెన్ విరాట్ కొహ్లీతో తనకున్న రిలేషనేంటో... ప్రేమెంతో బాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్కాశర్మ ఇంతవరకు ఎక్కడా బయటపడలేదు. తాజాగా ఈ బ్యూటీకి పోటీ వచ్చింది ఐటెమ్ బాంబ్ రాఖీ సావంత్. ఓ స్పా లాంచ్ సందర్భంగా రాఖీ తన మనసులో మాట చెప్పేసింది. ‘విరాట్ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. అతడిపై తనకు ప్రేమ ఉన్నట్టు అనుష్కా ఇప్పటి వరకు పబ్లిక్‌గా ప్రకటించలేదు. కానీ నేనలా కాదు... విరాట్‌ను ప్రేమిస్తున్నా. ఆ విషయాన్ని చెప్పేందుకు నాకెలాంటి సందేహం లేదు’ అంటూ షాకిచ్చింది. ఇక వరల్డ్ కప్ మ్యాచ్ గ్యాప్‌లో విరాట్ కొహ్లీ అనుష్క లేటెస్ట్ మూవీ ‘ఎన్‌హెచ్10’ చూశాడట. వెంటనే ట్విట్టర్లో తన ఆనందాన్ని ఇలా షేర్ చేసుకున్నాడు... ‘సినిమా సూపర్. నా లవ్ అనుష్క యాక్షన్ అదుర్స్’ అని! మరి ఇప్పుడన్నా అనుష్క తొందర పడుతుందో లేదో చూడాలి! లేదంటే క్యూట్ బోయ్ని రాఖీ ఎగరేసుకుపోవడం ఖాయం! -
నాకెలాంటి పరిమితులూ లేవు..
బాలీవుడ్ బోల్డ్బ్యూటీ రాఖీ సావంత్ తనకు ఎలాంటి పరిమితులూ లేవని సెలవిస్తోంది. నటిగా తనకు ఎలాంటి పరిమితులూ లేవని, ఎక్స్పోజింగ్ చేసేందుకు మొహమాటాలకు పోనని చెబుతోంది. శచీంద్ర శర్మ దర్శకత్వంలో జనవరి 2న విడుదల కానున్న ‘ముంబై కెన్ డ్యాన్స్ సాలా’లో కీలక పాత్ర పోషిస్తున్న రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడుతూ, సినీరంగంలో తనకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదని, కేవలం కష్టాన్నే నమ్ముకుని పరిశ్రమలో నిలదొక్కుకున్నానని చెప్పుకొచ్చింది. -
దర్శకుణ్ణి కొట్టిన రాఖీ ఫ్రెండ్.. పబ్లిసిటీ స్టంటా!
-
దర్శకుడిని కొట్టిన రాఖీ సావంత్ ఫ్రెండ్
ముంబయి : బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆమె స్నేహితురాలు కారణంగా రాఖీకి ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది. వివరాల్లోకి వెళితే...ముంబైలో 'ముంబై కెన్ డ్యాన్స్ సాలా' (Mumbai Can Dance Saala) సినిమా మ్యూజిక్ లాంఛ్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రాఖీ సావంత్, డైరెక్టర్ సచేంద్ర శర్మ ఇతర టీమ్ మొత్తం స్టేజ్‌పై బిజీగా ఉంది. ఇంతలో రాఖీ ఫ్రెండ్, ఓ మోడల్ వేదికపైకి దూసుకొచ్చింది. వస్తూ వస్తూనే డైరెక్టర్‌ను లాగి పెట్టి ఒక్కటిచ్చింది. అమ్మడి చెంప దెబ్బకు డైరెక్టర్‌కు దిమ్మ తిరిగిపోయింది. దాంతో కాసేపు ఇద్దరి మధ్య ఢిష్యుం డిష్యూం జరిగింది. ఇంతకీ మ్యాటరేంటీ అంటే? రాఖీ స్నేహితురాలకి సినిమాలో ఛాన్స్ ఇస్తానంటూనే, అందుకోసం ఆమె చాలా చాలా పనులు చేయాలని దర్శకుడు శర్మ షరతులు పెట్టాడట. ఆ విషయాన్నే నిలదీస్తూ ఆమె స్టేజ్‌పై దర్శకుడికి సినిమా చూపించింది. అక్కడితో ఆగలేదు.. రాఖీ, ఆమె స్నేహితురులు కలిసి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే పబ్లిసిటి కోసమే రాఖీ సావంత్ ఇదంతా చేస్తోందని కొంతమంది ఆరోపిస్తుండగా .. అలాంటిదేమీ లేదని ఆమె కొట్టిపారేస్తోంది. మరోవైపు అసలేం జరిగిందంటూ దర్శకుడు శర్మను అడిగితే.. అదంతా చీప్ పబ్లిసిటి కోసం చేసిన డ్రామా అని చెప్పటం విశేషం. అయితే ఎప్పుడూ ఏదో వివాదంలో ఉండే.. రాఖీ సావంత్ తన ఫ్రెండ్‌తో కలిసి కావాలనే అలా చేసిందా లేక నిజంగానే అనేది వాళ్లకే తెలియాలి మరి. ఇంతకీ ఆ ఫ్రెండ్ పేరు కూడా ఎవరికీ తెలియక పోవటం గమనార్హం. -
రాఖీ సావంత్ కి నోటీసులు
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల వ్యయవివరాలను అందజేయని ఆరుగురికి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడై ఆరు నెలలు కావస్తున్నప్పటికీ నగర శివారు ప్రాంతానికి చెందిన ఆరుగురు అభ్యర్థులు ఇంతవరకు కలెక్టర్ కార్యాలయానికి ఖర్చుల వివరాలను అందజేయలేదు. నిబంధనల ప్రకారం ఫలితాలు వెల్లడైన నెలలోగా ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఏ రోజు ఖర్చుల వివరాలను అదే రోజు రాసి సమీపంలోని పోలీస్స్టేషన్లలో అందజేయాల్సి ఉంటుంది. అయితే ఓటమిపాలైన ఆరుగురు అభ్యర్థులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కాగా ఈసీ నోటీసు జారీ చేసిన జాబితాలో సినీనటుడు హేమంత్ బిర్జే, నటి రాఖీ సావంత్ కూడా ఉన్నారు. -
రాజ్ థాకరేకు రాఖీ సవాల్
ముంబై: బాలీవుడ్ నటి రాఖీ సావంత్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. ఆ పార్టీ జాతీయ మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. తాను ఎవరికీ భయపడే ప్రసక్తేలేదని రాఖీ అన్నారు. అవసరమైతే త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ థాకరేపై పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే ఇటీవల ప్రకటించారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. శివసేన ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది. ఆర్పీఐ కూడా బీజేపీ, శివసేనకు మద్దతు ఇస్తోంది. ఎంఎన్ఎస్ ఒంటరిగా పోటీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాఖీ ఆర్పీఐ చేరడాన్ని ఆ పార్టీ చీఫ్ రామదాస్ అతవాలే స్వాగతించారు. కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాఖీ రాషీయ ఆమ్ పార్టీని స్థాపించింది. అయితే ముంబై వాయవ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాఖీ కేవలం 1,995 ఓట్లు సాధించింది. -
సార్వత్రిక బరిలో సినీనటులు
సాక్షి, ముంబై: ఈ నెల 24న మహారాష్ట్రలో జరుగనున్న తుది విడత ఎన్నికల్లో సినీరంగానికి చెందినవారు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బాలీవుడ్ ఐటమ్ గర్ల్‌గా గుర్తింపు పొందిన రాఖీ సావంత్ వాయవ్య ముంబై నుంచి పోటీ చేస్తున్నారు. సమాజసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానంటూ రాఖీ సావంత్ రాష్ట్రవాది ఆమ్ ఆద్మీ పార్టీ (రాప్)ని స్థాపించారు. తనదైన శైలిలో ప్రచారం చేస్తున్న రాఖీ ప్రజాసేవకు ఒక్కసారీ అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇక్కడి నుంచి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన గురుదాస్ కామత్ ఎవరికీ అందుబాటులో లేరని, ప్రజల సమస్యలను కూడా పరిష్కరించడం లేదని తన ప్రచారంలో ఆమె ఆరోపిస్తున్నారు. తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉండడంతో పాటు స్థానిక సమస్యలను పరిష్కరిస్తానని రాఖీ సావంత్ హామీ ఇస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి మరాఠీ చలనచిత్ర పరిశ్రమకు ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటులైన మహేష్ మాంజ్రేకర్ను మహారాష్ట్ర నవ నర్మాణ సేన (ఎమ్మెన్నెస్) తరఫున బరిలో దిగారు. స్థానికంగా ఎమ్మెన్నెస్ పార్టీ పటిష్టంగా ఉండడంతో మహేష్ మాంజ్రేకర్ ప్రచారంలో ముందుకు దూసుకెళుతున్నారు. ఇక ఠాణే లోక్‌సభ నియోజకవర్గంలో కూడా ఎమ్మెన్నెస్ అభ్యర్థిగా మరాఠీ చలనచిత్ర పరిశ్రమ నిర్మాత అభిజీత్ పన్సే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాజ్ ఠాక్రే ప్రభావం ఉండడంతో ఆయన కూడా ఠాణేలో సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ అభ్యర్థి సంజీవ్ నాయక్, శివసేన అభ్యర్థి రాజన్ విచారేలకు గట్టి పోటీ ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. అయితే ఓటర్లు సినీరంగంవారిని ఆదరిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. -
రాఖీ సావంత్ ఆస్తులు రూ. 15 కోట్లు
ముంబై: ఇటీవల రాష్ట్రీయ ఆమ్ పార్టీని స్థాపించి వాయవ్య ముంబై నుంచి పార్టీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన బాలీవుడ్ ఐటెమ్ గర్ల్ రాఖీ సావంత్ (36) తన ఆస్తుల విలువను రూ. 14.69 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొంది. ఇందులో స్థిరాస్తులు రూ. 11.12 కోట్లు, చరాస్తులు రూ. 3.57 కోట్లు ఉన్నట్లు వివరించింది. తనకు రూ. 2.52 కోట్ల అప్పులున్నాయని, తనపై ఓ చీటింగ్ కేసు కూడా ఉన్నట్లు వివరించింది. నామినేషన్ పత్రాల్లో రాఖీ తాను నిరక్ష్యరాస్యురాలినని పేర్కొనడం గమనార్హం. కాగా, తమిళనాడులోని మైలదుతురాయ్ నుంచి బరిలో నిలిచిన కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ తన ఆస్తులను రూ. 11.68 కోట్లుగా అఫిడవిట్లో చూపారు. బీహార్ నుంచి బరిలో నిలిచిన అత్యంత ధనిక అభ్యర్థిగా ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆమ్రపాలి గ్రూప్ చైర్మన్ అయిన అనిల్ కుమార్ శర్మ నిలిచారు. జెహానాబాద్ ఎంపీ అభ్యర్థిగా జేడీయూ తరఫున పోటీ చేస్తున్న అనిల్... తన స్థిరచరాస్తులను రూ. 850 కోట్లుగా పేర్కొన్నారు. -
ఘాటు పచ్చిమిరపకాయ పార్టీ!
ఇక ముంబాయి వీధుల్లో రాప్ వినిపించబోతోంది. రాప్ అంటే నల్లజాతీయుల సంగీతం కాదు. రాష్ట్రీయ ఆమ్ పార్టీ. సంచలన డాన్సర్, రియాల్టీ షో క్వీన్ రాఖీ సావంత్ ఈ పార్టీని పెట్టింది. ఆమె ముంబాయి నార్త్ వెస్ట్ నుంచి లోకసభకు పోటీ చేయబోతున్నారు. 'ఇక నేను రాజకీయ అనాథను కాను. నాకంటూ ఒక పార్టీ ఉంది.' అని ఆమె ప్రకటించారు. అయితే ఆమె మొదలుపెట్టిన పార్టీకి ఆమె ఉపాధ్యక్షురాలు మాత్రమే. అధ్యక్షులెవరన్నది ఇంకా తెలియరాలేదు. ఆమెతోపాటు కొందరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వారి భార్యలు మహిళా విభాగం సభ్యులు. రాప్ పార్టీ ఎన్నికల గుర్తు ఏమిటో తెలుసా. పచ్చి మిరపకాయ. 'మంచి ఘాటుగా ఉంటుంది. నా వ్యక్తిత్వానికి పచ్చిమిరపకాయ సరిగా సరిపోతుంది,' అన్నారు రాఖీ. -
ఎంపీల మత్తు వదిలించేందుకే.. రాఖీ సావంత్
షిర్డీ: ప్రజా సమస్యల్ని విస్మరించి నిద్రమత్తులో కూరుకుపోయిన ఎంపీలను మేల్కొలిపేందుకే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ చెబుతున్నారు. సామాన్యుల సమస్యలపై ఎంపీలు దృష్టి సారించేలా చేయాలని భావిస్తున్నానని చెప్పారు. ముంబై వాయవ్య నియోజవర్గం నుంచి ఆమె బరిలో దిగుతున్నారు. సాయినాథుని దర్శనార్థం శుక్రవారం వచ్చిన షిర్డీ వచ్చిన రాఖీ సావంత్ విలేకరులతో మాట్లాడారు. ఎంపీలు ప్రజల రక్తం తాగుతున్నారని విమర్శించారు. ఏ పార్టీ టికెట్‌పై పోటీచేస్తున్నారన్న ప్రశ్నకు.. ఎదురు చూడండి అంటూ ఆసక్తిని రేకెత్తించారు. శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు చెప్పారు. బాలీవుడ్లో ఉన్నందుకు సంతోషంగా ఉందని, ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని రాఖీ సావంత్ చెప్పారు. -
రాజకీయాల్లోకి ఐటం గర్ల్!
-
'పచ్చి మిరపకాయ' గుర్తుతో రాఖీ సావంత్ కొత్త పార్టీ!
బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విల్లూరుతోంది. అవకాశం లభిస్తే బీజేపీ తరపున పోటీ చేస్తానని లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఇంకా విశేషమేమిటంటే పచ్చి మిరపకాయ గుర్తుతో ఓ పార్టీనే ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. తన ఆలోచణల్ని ఆచరణలో పెట్టేందుకుగాను జైన మతానికి చెందిన సాధువు పులక్ సాగర్ ను రాఖీ సావంత్ సోమవారం కలిసి ఆశీస్సుల్ని పొందారు. నిన్న ఆగ్రాకు చేరుకున్న రాఖీ సావంత్.. సాధువుతో రహస్య సమావేశం జరిపినట్టు సమాచారం. లోకసభ ఎన్నికల్లో ముంబై వాయవ్య ముంబై స్థానం నుంచి గురుదాస్ కామత్ పై పోటి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో కొత్త పార్టీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని పీఠంపై నరేంద్రమోడీని కూర్చుండ పెట్టేందుకు తాను కృషి చేస్తానని రాఖీ సావంత్ తెలిపారు. ఇకపై బాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ పాత్రలకు స్వస్తి చెప్పనున్నట్టు.. మంచి పాత్రలు లభిస్తే నటిస్టానని సావంత్ తెలిపింది. -
ఖాదీ, మోదీలకు లైక్ కొట్టేస్తున్న రాఖీ సావంత్
ఖాదీకి కాలం చెల్లిపోయిందని అంతా అంటున్నారు. కానీ ఖాదీ మళ్లీ ఫేషనబుల్ అయిపోతోంది. ఎందుకంటే సంచలన ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ ఇప్పుడు ఖాదీ కట్టుకుంటోంది. తెల్లని ఖాదీ కుర్తా, ఖాదీ చుడీదార్, ఖాదీ ఓవర్ కోట్ వేసుకున్న రాఖీ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. రాజకీయనాయకులకు దీటుగా ట్వీట్ చేస్తోంది. తాజాగా తన అభిమానమంతా నరేంద్ర మోదీపై కురిపిస్తోంది రాఖీ. ట్విట్టర్ లో మోడీపై ఈగ కూడా వాలనీయడం లేదు. ఆమె ట్వీట్లన్నీ మోదీ పొగడ్తలతో నిండిపోతున్నాయి. అంతటితో ఆగకుండా ఆమె ఫక్తు రాజకీయ నేతలా పోజులిస్తోంది. అంతే కాదు. మరో అడుగు ముందుకెళ్లి ఇంటింటికీ వెళ్లి చెత్త కుండీలను ఉచితంగా ఇస్తోంది. ముంబాయి మురికివాడల్లో తిరుగుతూ కుటుంబానికో చెత్త డబ్బా ఇస్తోంది. పారిశుధ్యం గురించి మచ్చ లేని తెల్ల ఖాదీలో వివరించేస్తోంది. "ఇదేదో పబ్లిసిటీ కోసం చేయడం లేదు. నేను నిజాయితీగానే పని చేస్తున్నాను" అంటోంది రాఖీ సావంత్. చెత్త రాజకీయాలకన్నా చెత్త కుండీ రాజకీయాలు ఎంతో మంచివని సెలవిస్తోంది. మొత్తానికి అటు ఖాదీ, ఇటు మోదీలను సపోర్టు చేస్తూ రాఖీ సావంత్ వార్తలకెక్కుతోంది. -
పదివేల చెత్తబుట్టలు!
కురచ దుస్తుల్లో కనిపించడానికి ఏమాత్రం మొహమాటపడని రాఖీ సావంత్, అడపా దడపా బోల్డ్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తుంటారు. ఒక్కోసారి వింత చర్యలు కూడా చేస్తుంటారు. కానీ, ఇటీవల మాత్రం ఓ వివేకవంతమైన పని చేశారు ఈ హాట్‌గాళ్. మురికివాడల్లో నివసించేవారికి మహిళా దినోత్సవం సందర్భంగా శుభ్రత-పరిశుభ్రత గురించి తెలియజేయాలనుకున్నారు. పదివేల చెత్తబుట్టలు, కొన్ని బహుమతులు, తినుబండారాలు కొనుక్కుని మురికివాడలకు వెళ్లారు రాఖీ. అక్కడున్నవారికి అవి పంచారు. డస్ట్‌బిన్స్ పంచుతున్నప్పుడు అందరూ అందులోనే చెత్త వేయాలని, తద్వారా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటాయని, దానివల్ల రోగాల బారినపడే అవకాశం తక్కువగా ఉంటుందని ఓ లెక్చర్ కూడా ఇచ్చారు రాఖీ. ఇన్నాళ్లు గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న ఆమెకు రాజకీయాల్లో చేరాలని ఉందట. అందులో భాగంగానే ఇదంతా చేశారన్నది కొంతమంది ఊహ. ఏదేమైనా రాఖీ చేసింది మంచి పనే కాబట్టి కొంతమంది మెచ్చుకుంటున్నారు కూడా. -
బీజేపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ సావంత్ హల్చల్!
న్యూఢిల్లీ: బీజేపీలోకి వీకే సింగ్, ఇతరుల చేరిక సందర్భంగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో అనుకోని అతిథిలా ప్రత్యక్షమైన బాలీవుడ్ ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్ హల్ చల్ చేసింది. బీజేపీలో చేరిన మాజీ సైనికాధికారులకు రాఖీలు కూడా కట్టిన ఆమె రాజ్‌నాథ్ సింగ్‌తో సహా అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒప్పుకుంటే ఆయనను మనువాడతానంటూ గతంలో సంచలనం రేపిన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తాజాగా తన దష్టిని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపైకి మళ్లించింది. మోడీని పెళ్లి చేసుకుంటానని అనలేదు కానీ.. దేశానికి తర్వాతి ప్రధాన మంత్రి ఆయనేనని, ఆయన తరఫున వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తానని సెలవిచ్చింది. దీంతో రాజకీయాల్లోకి ప్రవేశించాలని రాఖీ భావిస్తున్నారని సంకేతాలు అందినటై ్లంది. అయితే రాహుల్, మోడీ ఇద్దరి పట్లా ఆమె అభిమానం ప్రదర్శిస్తోంది కాబట్టి ఎవరి పార్టీలో చేరుతారోనన్నది ప్రస్తుతం ప్రశ్నగా మారింది. -
అనవసరంగా నా పేరు లాగకండి: రాఖీ సావంత్
రాజకీయ నాయకులు ప్రత్యర్థులను విమర్శించడానికి అనవసరంగా తన పేరు లేనిపోని వివాదాల్లోకి లాగడం తగదని బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ మండిపడింది. అరవింద్ కేజ్రీవాల్ కంటే రాఖీ సావంతే నయమని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై రాఖీ ఇలా చెప్పింది. ''కేజ్రీవాల్ కంటే నేను మంచి రాజకీయ నాయకురాలిని అవుతానని ఉద్ధవ్ ఠాక్రే భావిస్తే అందుకు ఆయనకు కృతజ్ఞతలు. కానీ, నా పేరును అనవసరంగా రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటే నాకు నచ్చదు. నేను కేవలం కష్టపడి పనిచేసే నటిని మాత్రమే'' అని ఆమె చెప్పింది. అంతకుముందు.. ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ కంటే, బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ చాలా నయమని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో.. నేరుగా కేజ్రీవాల్‌పై తన విమర్శలు ఎక్కుపెట్టారు. కేజ్రీవాల్ కంటే రాఖీ సావంత్‌ను ఆ కుర్చీలో కూర్చోబెడితే బాగా చేసేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో రాఖీని ఐటెం గర్ల్ అని విమర్శించినవాళ్లు ఇప్పుడామెను సన్మానించాలని తెలిపారు. -
'కేజ్రీవాల్ కంటే రాఖీసావంత్ నయం'
ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ కంటే, బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ చాలా నయమని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. పార్టీ పత్రిక సామ్నాలో బాల ఠాక్రేలాగే ఘాటుగా సంపాదకీయాలు రాస్తున్న ఉద్ధవ్ ఠాక్రే.. ఈసారి నేరుగా కేజ్రీవాల్‌పై తన విమర్శలు ఎక్కుపెట్టారు. కేజ్రీవాల్ కంటే రాఖీ సావంత్‌ను ఆ కుర్చీలో కూర్చోబెడితే బాగా చేసేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో రాఖీని ఐటెం గర్ల్ అంటూ విమర్శించినవాళ్లు ఇప్పుడామెను సన్మానించాలని తెలిపారు. ఇటీవల ఆయన ఉద్యమం చేయడాన్ని, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను ఏకవచనంలో సంబోధిస్తూ తిట్టడాన్ని ఆయన విమర్శించారు. కేజ్రీవాల్‌ను మరాఠీ యాసలో.. పిచ్చోడు అని అభివర్ణించారు. కేజ్రీవాల్ చేసిన తమాషా చూసి పార్టీలన్నీ సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని, ఆప్ సంస్కృతి ఇలాగే ఉంటుందని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇలా ఉన్నాయి.. దేశంలో పిచ్చోళ్ల సంత ఒకటి మొదలైంది. అరవింద్ కేజ్రీవాల్ అనే పిచ్చోడు దానికి నాయకుడు. సుశీల్ కుమార్ షిండేని కేజ్రీవాల్ ఏకవచనంతో పిలిచి, తిట్టారు. ఇదేం సంస్కృతి? ఇది దొంగలు, వైట్‌కాలర్ నేరగాళ్లు వాడే భాష చేతన్ భగత్ లాంటి మద్దతుదారులు కూడా సిగ్గుపడి, ఆప్‌ను ఐటెం గర్ల్‌తో పోల్చారు. షిండే అతడిని పిచ్చోడంటే, ఎన్సీపీకి చెందిన త్రిపాఠీ పాముతో పోల్చారు. కుమార్ విశ్వాస్ అనే మరో జోకర్ ఆ సర్కస్‌లో ఉన్నాడు. అతడు మహిళలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. కేజ్రీవాల్ పిచ్చిసంత ఎన్నాళ్లో ఉండబోదు. ఐటెం గర్ల్ ఎంతసేపు ఉండాలో అంతసేపే డాన్స్ చేయాలి. -
రాఖీసావంత్ సోదరుడి దర్శకత్వంలో 'అమావాస్య'
బాలీవుడ్ గ్లామర్ తార రాఖీసావంత్ సోదరుడు రాకేష్ సావంత్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘అమావాస్య’ చిత్రం రూపొందుతోంది. ఆకాష్ హీరో. నృపుర్ మెహతా, రూబీ అహ్మద్, సోనమ్, ముమైత్‌ఖాన్, కోట తదితరులు ముఖ్యతారలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాకేష్ సావంత్ మాట్లాడుతూ -‘‘ఓ దుర్మార్గుడి చేతిలో మానప్రాణాలు పోగొట్టుకున్న ఓ యువజంట ప్రేతాత్మలుగా మారి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారన్నది ఈ సినిమా ప్రధాన కథాంశం. పాటల్ని త్వరలోనే విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ద్రిడ్ బసు, సంగీతం: సయ్యద్ అహ్మద్.