బీజేపీలోకి వీకే సింగ్, ఇతరుల చేరిక సందర్భంగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో అనుకోని అతిథిలా బాలీవుడ్ ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్ ప్రత్యక్షమైంది.
న్యూఢిల్లీ: బీజేపీలోకి వీకే సింగ్, ఇతరుల చేరిక సందర్భంగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో అనుకోని అతిథిలా ప్రత్యక్షమైన బాలీవుడ్ ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్ హల్ చల్ చేసింది. బీజేపీలో చేరిన మాజీ సైనికాధికారులకు రాఖీలు కూడా కట్టిన ఆమె రాజ్‌నాథ్ సింగ్‌తో సహా అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒప్పుకుంటే ఆయనను మనువాడతానంటూ గతంలో సంచలనం రేపిన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తాజాగా తన దష్టిని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపైకి మళ్లించింది. మోడీని పెళ్లి చేసుకుంటానని అనలేదు కానీ.. దేశానికి తర్వాతి ప్రధాన మంత్రి ఆయనేనని, ఆయన తరఫున వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తానని సెలవిచ్చింది.
దీంతో రాజకీయాల్లోకి ప్రవేశించాలని రాఖీ భావిస్తున్నారని సంకేతాలు అందినటై ్లంది. అయితే రాహుల్, మోడీ ఇద్దరి పట్లా ఆమె అభిమానం ప్రదర్శిస్తోంది కాబట్టి ఎవరి పార్టీలో చేరుతారోనన్నది ప్రస్తుతం ప్రశ్నగా మారింది.