సంకల్ప్‌ యాత్రకు సన్నాహాలు | BJP MPs set to undertake 'sankalp yatras' for new India | Sakshi
Sakshi News home page

సంకల్ప్‌ యాత్రకు సన్నాహాలు

Published Mon, Aug 14 2017 10:25 AM | Last Updated on Fri, Mar 29 2019 8:33 PM

సంకల్ప్‌ యాత్రకు సన్నాహాలు - Sakshi

సంకల్ప్‌ యాత్రకు సన్నాహాలు

న్యూఢిల్లీః పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో మోడీ సర్కార్‌ విజయాలపై బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో సంకల్ప్‌ యాత్రలను చేపట్టనున్నారు.2022 నాటికి నూతన భారత్‌ ఆవిష్కరణకు సహకరిస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తారు.కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అవినీతి, ఉగ్రవాదం, పేదరిక నిర్మూలనకు చేపడుతున్న చర్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రధాని మోడీ పార్టీల ఎంపీలను కోరిన విషయం విదితమే.

ఈనెల 15 నుంచి 30 వరకూ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ మోడీ సర్కార్‌ విజయాలను వివరిస్తారని పార్టీ సీనియర్‌ నేత పేర్కొన్నారు.2002 నాటికి అవినీతి, పేదరికానికి చోటు లేని నూతన భారత్‌ ఆవిష్కరణకు ప్రజలతో పాటు తానూ ప్రతిజ్ఞ చేశానని ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. మరోవైపు ప్రధాని తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ నవ భారత్‌కు ప్రజలు ప్రతినబూనాలనే అంశాన్నినొక్కిచెబుతారని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement