sankalp yatras
-
CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర.. భీమలింగానికి రేవంత్ ప్రత్యేక పూజలు
సాక్షి, వరంగల్: సంగెం నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర శుక్రవారం మధ్యాహ్నాం నుంచి ప్రారంభమైంది. భీమలింగం వరకు 2.5 కి.మీ మేర ఈ పాదయాత్ర కొనసాగింది. తొలుత యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చేరుకున్న సీఎం రేవంత్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యాదాద్రి ఆలయంతో పాటు జిల్లా అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై చర్చించారు.అనంతరం వలిగొండ మండలం సంగెం గ్రామానికి చేరుకుని మూసీ పరీవాహక ప్రాంత రైతులతో కలిసి కాల్వల్ని పరిశీలించారు. తర్వాత రైతులు, కుల వృత్తిదారులతో సమావేశమై వారి యోగక్షేమాలు, మూసీ జలాలతో జరిగే నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు పాదయాత్ర కొనసాగింది. మూసీలో నీటి కాలుష్యాన్ని రేవంత్‌రెడ్డి పరిశీలించారు. భీమలింగంకు సీఎం పూజలు చేశారు. నాగిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసే సభలో సీఎం ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు చేరుకుంటారు. -
పేదల ప్రగతితో బలమైన భారత్
న్యూఢిల్లీ: పేదలు, రైతులు, మహిళలు, యువత సాధికారత సాధిస్తే దేశం శక్తివంతంగా మారుతుందని, బలమైన భారత్ ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కేవలం ప్రభుత్వ యాత్రగానే కాదు, దేశ యాత్రగా మారిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వాల హయాంలో రైతన్నలు నిర్లక్ష్యానికి గురయ్యారని, అప్పట్లో ప్రభుత్వ వ్యవసాయ విధానాలు కేవలం ఉత్పత్తి, అమ్మకానికే పరిమితం అయ్యాయని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్నదాతల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకు ఇప్పటిదాకా రూ.30,000 బదిలీ చేశామని తెలిపారు. వ్యవసాయ సహకార సంఘాలను, వ్యవసాయ ఉత్పత్తి సంస్థలను బలోపేతం చేశామని అన్నారు. గోదాములు నిర్మించామని, పంటల నిల్వ సామర్థ్యాలను పెంచామని, ఆహార శుద్ధి పరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించామని గుర్తుచేశారు. ‘‘కంది పప్పును ఆన్లైన్ ద్వారా నేరుగా ప్రభుత్వానికి విక్రయించే సదుపాయాన్ని కలి్పంచాం. వారికి మార్కెట్ రేటు కంటే మెరుగైన ధర చెల్లిస్తున్నాం. పప్పుల కొనుగోలు కోసం విదేశాలకు చెల్లించే సొమ్ము మన రైతుల చేతికే అందాలన్నది మా ఉద్దేశం’’ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రతి మూలకూ ‘మోదీ గ్యారంటీ’ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలన్నదే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదన్నారు. అర్హులకు సక్రమంగా, సంతృప్త స్థాయిలో పథకాలు అందితేనే ‘అభివృద్ధి చెందిన భారత్’ సాధ్యమని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబి్ధదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ యాత్ర ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుందని, దేశమంతటా 11 కోట్ల మంది ప్రజలతో నేరుగా అనుసంధానమైందని హర్షం వ్యక్తం చేశారు. ‘మోదీ కీ గ్యారంటీవాలీ గాడీ’ దేశంలో ప్రతి మూలకూ వెళ్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాల కింద లబ్ధి కోసం సుదీర్ఘకాలం ఎదురు చూసే పేదలు ఇప్పుడు ఒక అర్థవంతమైన మార్పును చూస్తున్నారని పేర్కొన్నారు. పథకాలు అర్హుల గడప వద్దకే వెళ్తున్నాయన్నారు. ప్రస్తుత, భావి తరాల యువత గత తరాల కంటే మెరుగైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. -
ఎన్నికల రాష్ట్రాల్లో ‘వికసిత్ భారత్ సంకల్ప్’ వద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తమ పథకాలు తదితరాల గురించి ప్రజలకు వివరించేందుకు తలపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ ఐదో తేదీదాకా చేపట్టరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు గురువారం ఈ మేరకు లేఖ రాసింది. ‘నవంబర్ 20 నుంచి మొదలవుతున్న ఈ యాత్ర కోసం జిల్లా రథ్ ప్రహారీలుగా సీనియర్ ప్రభుత్వాధికారులను నామినేట్ చేయాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసినట్టు మా దృష్టికి వచి్చంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న ఐదు రాష్ట్రాల్లో, నాగాలాండ్‌లో ఉపఎన్నిక జరుగుతున్న తపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో డిసెంబర్ ఐదో తేదీదాకా ఇలాంటి కార్యకలాపాలేవీ చేపట్టరాదు’ అని ఆదేశించింది. -
పోలీసులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం
సాక్షి, వైఎస్సార్ జిల్లా : బీజేపీ చేపట్టిన గాంధీ సంకల్ప యాత్రలో శుక్రవారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బద్వేలులో యాత్ర నిర్వహిస్తున్న బీజేపీ నేతలు స్థానిక గాంధీ విగ్రహం వద్ద సభ ఏర్పాటు చేశారు. సభలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆ పార్టీ నేతలను ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పక్కనుంచి వెళ్లమని పోలీసులు సూచించారు. దీంతో కోపోద్రిక్తులైన బీజేపీ నాయకులు పోలీసులపై ఫైర్ అయ్యారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే వాగ్వాదం ఉద్రిక్తంగా మారే అవకాశముండడంతో పోలీసులే వెనక్కు తగ్గారు. -
సంకల్ప్ యాత్రకు సన్నాహాలు
న్యూఢిల్లీః పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో మోడీ సర్కార్ విజయాలపై బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో సంకల్ప్ యాత్రలను చేపట్టనున్నారు.2022 నాటికి నూతన భారత్ ఆవిష్కరణకు సహకరిస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తారు.కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అవినీతి, ఉగ్రవాదం, పేదరిక నిర్మూలనకు చేపడుతున్న చర్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రధాని మోడీ పార్టీల ఎంపీలను కోరిన విషయం విదితమే. ఈనెల 15 నుంచి 30 వరకూ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ మోడీ సర్కార్ విజయాలను వివరిస్తారని పార్టీ సీనియర్ నేత పేర్కొన్నారు.2002 నాటికి అవినీతి, పేదరికానికి చోటు లేని నూతన భారత్ ఆవిష్కరణకు ప్రజలతో పాటు తానూ ప్రతిజ్ఞ చేశానని ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. మరోవైపు ప్రధాని తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ నవ భారత్‌కు ప్రజలు ప్రతినబూనాలనే అంశాన్నినొక్కిచెబుతారని భావిస్తున్నారు.