న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తమ పథకాలు తదితరాల గురించి ప్రజలకు వివరించేందుకు తలపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ ఐదో తేదీదాకా చేపట్టరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు గురువారం ఈ మేరకు లేఖ రాసింది.
‘నవంబర్ 20 నుంచి మొదలవుతున్న ఈ యాత్ర కోసం జిల్లా రథ్ ప్రహారీలుగా సీనియర్ ప్రభుత్వాధికారులను నామినేట్ చేయాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసినట్టు మా దృష్టికి వచి్చంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న ఐదు రాష్ట్రాల్లో, నాగాలాండ్‌లో ఉపఎన్నిక జరుగుతున్న తపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో డిసెంబర్ ఐదో తేదీదాకా ఇలాంటి కార్యకలాపాలేవీ చేపట్టరాదు’ అని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment