stoped
-
Uttarkashi tunnel collapse: డ్రిల్లింగ్కు భారీ అవాంతరం
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఒకటి రెండు రోజుల్లో కార్మికులు సొరంగం నుంచి బయటకొస్తారన్న ఆశలకు గండి పడింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేస్తున్న ఆగర్ మెషీన్ డ్రిల్లింగ్‌ను నిలిపేశారు. శిథిలాల్లో ఉన్న ఇనుప కడ్డీలు డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను నాశనం చేయడమే ఇందుకు అసలు కారణం. సొరంగం అంతర్గత నిర్మాణంలో వాడిన ఇనుప కడ్డీలు సొరంగం కూలాక శిథిలాల్లో చిందరవందరగా పడి ఆగర్ మెషీన్ ముందుకు కదలకుండా అడ్డుపడుతున్నాయి. దీంతో డ్రిలింగ్ వేళ మెషీన్ బ్లేడ్లన్నీ ధ్వంసమయ్యాయి. డ్రిల్లింగ్ ప్లాన్‌ను పక్కనబెట్టి ఇక మాన్యువల్‌గా తవ్వాలని అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఇంకా దాదాపు 12 మీటర్లమేర శిథిలాల గుట్టను తొలగించాల్సి ఉంది. ‘‘ఇదంతా తొలగించి కార్మికులను బయటకు తెచ్చేందుకు ఇంకొన్ని రోజులు/వారాలు పట్టొచ్చు’ అంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సభ్యుడు, మాజీ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నాయిన్ చేసిన మీడియా ప్రకటన కార్మికుల కుటుంబాల్లో భయాందోళనలు పెంచేసింది. క్రిస్మస్ పండుగ లోపు కార్మికులను రక్షిస్తామంటూ అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ చెప్పడంచూస్తుంటే ఈ మొత్తం ప్రక్రియకు నెలరోజులు పట్టేట్టు ఉందని తెలుస్తోంది. ‘ మరో ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంగా ఉంది. కొండ పైనుంచి నిట్టనిలువునా డ్రిల్లింగ్ వచ్చే 24–36 గంటల్లో మొదలెడతాం’’ అని సయ్యద్ చెప్పారు. ‘ 25 మీటర్ల డ్రిల్లింగ్ పనులు పూర్తిచేసేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్‌ను తెప్పిస్తున్నాం’ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఘటనాస్థలిలో చెప్పారు. డ్రిల్లింగ్‌ను నిలిపేయడంతో డ్రిల్లింగ్ చోటుదాకా వెళ్లి తాజా పరిస్థితిని ధామీ పర్యవేక్షించారు. లోపలికి ల్యాండ్‌లైన్, ఘటనాస్థలిలో టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ ప్రస్తుతానికి కార్మికులు క్షేమంగా ఉన్నారు. అయితే లోపల ఉన్న కార్మికుల మానసిక స్తైర్థ్యం దెబ్బతినకుండా ఉండేందుకు సహాయకంగా లూడో వంటి బోర్డ్ ఆట వస్తువులతోపాటు మొబైల్ ఫోన్లను పంపించారు. నిరంతరం మాట్లాడేందుకు వీలుగా ‘ల్యాండ్‌లైన్’ను పంపుతున్నారు. ఇప్పటికే ఘటనాస్థలిలో టెలిఫోన్ ఎక్సే్ఛంజ్‌ను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటుచేసింది. అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు ఎండోస్కోపిక్ కెమెరాను వాడుతున్నారు. -
Uttarkashi Tunnel: డ్రిల్లింగ్ పనులకు మళ్లీ ఆటంకం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో ఇంకొన్ని మీటర్లు డ్రిల్లింగ్ చేస్తే కార్మికులు చిక్కుకున్న చోటుకు చేరుకోవచ్చన్న ఆశల నడుమ అనుకోని అవాంతరం ఎదురైంది. 25 టన్నుల బరువైన భారీ డ్రిల్లింగ్ మెషీన్ అమర్చిన ‘వేదిక’కు పగుళ్లు రావడంతో డ్రిల్లింగ్‌ను ఆపేశారు. బిగించిన వేదిక సరిగా లేకుంటే డ్రిల్లింగ్ మెషీన్ అటుఇటూ కదులుతూ కచి్చతమైన దిశలో డ్రిల్లింగ్ సాధ్యపడదు. అప్పుడు అసలుకే మోసమొస్తుంది. అందుకే ముందుజాగ్రత్తగా డ్రిల్లింగ్‌ను ఆపేశారు. ‘ మరికొన్ని గంటల్లో లేదా రేపటి కల్లా ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తవుతుంది’ అని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నయిన్ గురువారం సాయంత్రం చెప్పారు. ‘మనం చేస్తున్నది యుద్ధంలాంటిదే. ఖచి్చతంగా ఫలానా సమయంలోగా ఈ ఆపరేషన్ పూర్తిచేసి అందర్నీ బయటకు తెస్తామని ముందుగానే జోస్యం చెప్పడం సరైన విధానం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) సభ్యులు సొరంగం వద్దే ఉండి, లోపలున్న కారి్మకులను బయటకు తీసుకువచ్చే విషయంలో రిహార్సల్ చేస్తున్నారని హస్నయిన్ తెలిపారు. కారి్మకులను బయటకు తీసుకొచ్చే క్రమంలో అనుకోని విధంగా కాల హరణం జరుగుతున్నందున సమాంతర డ్రిల్లింగ్‌లో అనుకోని అవాంతరాలు ఎదురైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టామన్నారు. ఇందుకోసం అదనంగా యంత్రాలను తెప్పిస్తున్నామని వివరించారు. బార్కోట్ వైపు నుంచి డ్రిల్లింగ్ పనులను 9.10 మీటర్ల మేర పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయని వారు వెల్లడించారు. డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న టన్నెల్ ప్రాంతం -
పాక్‌కు సాయం ఆపండి
ఇస్లామాబాద్: అమెరికా అందిస్తున్న భారీ ఆర్థిక సాయాన్ని మానవ హక్కుల ఉల్లంఘనకు పాకిస్తాన్ వినియోగిస్తోందని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పాక్‌లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగి రాజ్యాంగబద్ధమైన రీతిలో ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా ఆ దేశానికి ఎలాంటి ఆర్థిక సాయమూ అందించొద్దని అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇలాన్ ఒమర్‌తో పాటు మరో 10 మంది కాంగ్రెస్ సభ్యులు ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాశారు. దైవ దూషణ చట్టాన్ని మరింత కఠినతరం చేయడం తదితర చర్యలకు పాక్ పాల్పడుతున్న వైనాన్ని అందులో ప్రస్తావించారు. ‘‘ఇవన్నీ పాక్‌లోని మతపరమైన మైనారిటీలను మరింతగా అణచివేసేందుకు తీసుకుంటున్న చర్యలే. ఎందుకంటే దైవదూషణ బిల్లును పాక్ పార్లమెంటు ఆమోదించిన కొద్ది రోజులకే మతోన్మాద మూకలు చర్చిలను ధ్వంసం చేయడంతో పాటు క్రైస్తవుల ఇళ్లకు నిప్పు పెట్టాయి’’ అంటూ వారు ఆందోళన వెలిబుచ్చారు. -
Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ సొరంగంలో డ్రిల్లింగ్ నిలిపివేత
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలోని సిలి్కయారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు ఇంకా బయటకురాలేదు. వారం రోజుల క్రితం సొరంగం కూలిపోవడంతో వారు అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కార్మికులు బయటకు రావడానికి వీలుగా ఎస్కేప్ మార్గాన్ని సిద్ధం చేయడానికి తలపెట్టిన డ్రిల్లింగ్ పనులను ఆదివారం నిలిపివేశారు. డ్రిల్లింగ్ యంత్రానికి అడ్డంకులు ఎదురు కావడమే ఇందుకు కారణం. గట్టి రాళ్లు రప్పలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం సమీక్షించారు. బాధితులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి భారీ డయామీటర్ స్టీల్ పైపులైన్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సొరంగం శిథిలాల గుండా ఈ పైపులైన్‌ను పంపించనున్నట్లు తెలిపారు. సొరంగంలో కార్మికులు ఉన్న చోటుకి చేరుకోవడానికి నిట్టనిలువుగా కంటే అడ్డంగా తవ్వడమే సరైందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా యంత్రానికి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుంటే రెండున్నర రోజుల్లో కార్మికులు ఉన్న చోటుకి చేరుకోవచ్చని వెల్లడించారు. సొరంగంలో కార్మికులు స్వేచ్ఛగా అటూ ఇటూ తిరగగలుగుతున్నారని, వారికి ఆహారం, నీరు, విద్యుత్, ఆక్సిజన్ అందుతున్నాయని, ప్రాణాపాయం లేదని నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు.అమెరికా యంత్రంతో అతిత్వరలో డ్రిల్లింగ్ ప్రారంభిస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. సొరంగంలో ఉన్న కార్మికులకు మల్టీ విటమిన్ మాత్రలు, ఎండు ఫలాలు తదితరాలు అందిస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ఆదివారం తెలిపారు. -
ఈకామ్ రుణాలు ఆపేయండి
ముంబై: ఈకామ్, ఇన్‌స్టా ఈఎంఐ కార్డు సాధనాల కింద రుణాల మంజూరు, వితరణ నిలిపివేయాలంటూ బజాజ్ ఫైనాన్స్‌ను ఆర్బీఐ ఆదేశించింది. డిజిటల్ రుణాల మార్గదర్శకాలను పాటించకపోవడమే ఇందుకు కారణం. సదరు లోపాలను సంతృప్తికరమైన విధంగా బజాజ్ ఫైనాన్స్ సరిచేసుకున్నాక ఆంక్షలను పునఃసమీక్షిస్తామని పేర్కొంది. -
ఎన్నికల రాష్ట్రాల్లో ‘వికసిత్ భారత్ సంకల్ప్’ వద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తమ పథకాలు తదితరాల గురించి ప్రజలకు వివరించేందుకు తలపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ ఐదో తేదీదాకా చేపట్టరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు గురువారం ఈ మేరకు లేఖ రాసింది. ‘నవంబర్ 20 నుంచి మొదలవుతున్న ఈ యాత్ర కోసం జిల్లా రథ్ ప్రహారీలుగా సీనియర్ ప్రభుత్వాధికారులను నామినేట్ చేయాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసినట్టు మా దృష్టికి వచి్చంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న ఐదు రాష్ట్రాల్లో, నాగాలాండ్‌లో ఉపఎన్నిక జరుగుతున్న తపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో డిసెంబర్ ఐదో తేదీదాకా ఇలాంటి కార్యకలాపాలేవీ చేపట్టరాదు’ అని ఆదేశించింది. -
అమర్నాథ్ యాత్రకు బ్రేక్
జమ్మూ: అమర్నాథ్ యాత్ర వరుసగా రెండో రోజు శనివారం కూడా నిలిచిపోయింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతూ ఉండడంతో అధికారులు యాత్రను నిలిపివేశారు. యాత్రకు వెళ్లే మార్గం మధ్యలో వేలాది మంది భక్తులు చిక్కుకుపోయారు. భక్తులెవరూ ఆందోళనకు గురి కావొద్దని అధికారులు అనుక్షణం పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. అధికారులు ఇచ్చిన ఆదేశాలను భక్తులందరూ తూచ తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్లో రెండు మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అమర్నాథ్ ఆలయం ఉన్న ప్రాంతంలో విపరీతంగా మంచుకురుస్తోంది. ‘‘అమర్నాథ్ యాత్రకు వెళ్లే రెండు మార్గాలైన పాహల్గామ్, బాల్టాల్ మార్గాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో యాత్రను నిలిపివేస్తున్నాం’అని ఒక అధికారి వెల్లడించారు. బేస్ క్యాంప్ అయిన భగవతి నగర్ నుంచి శనివారం కొత్త బ్యాచ్ ఎవరినీ అనుమతించలేదు. జులై 1న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 31తో ముగుస్తుంది. 80 వేల మందికి పైగా భక్తులు ఈ ఏడాది యాత్రకు డబ్బులు చెల్లించారు. -
బిహార్‌లో కుల గణనపై స్టే
పట్నా: బిహార్‌లో నితీశ్ కుమార్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కులగణనకు ఎదురు దెబ్బ తగిలింది. వెంటనే ఈ సర్వేని నిలిపివేయాలని పట్నా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు సేకరించిన డేటాని తాము తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎవరితోనూ పంచుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కులాల ఆధారంగా జనాభా లెక్కలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను గురువారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వినోద్ చంద్రన్ ఆధ్వర్యంలో హైకోర్టు బెంచ్ పిటిషన్‌దారులు డేటా సమగ్రత, భద్రతపై వెలిబుచ్చిన ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం నివారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. జనాభా లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టాలే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం లేదంటూ పిటిషన్‌దారులు పేర్కొనడాన్ని కూడా ప్రస్తావించింది. కులాల గణాంకాలు ఇతరుల చేతుల్లో పడితే దాని వల్ల రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు బెంచ్ తదుపరి విచారణను జులై 7కి వాయిదా వేసింది. నితీశ్ ప్రభుత్వం జనవరి 7 నుంచి 21 వరకు తొలి విడత కులగణన నిర్వహించింది. రెండో విడత ఏప్రిల్ 15 నుంచి మే 15వరకు జరగాల్సి ఉంది. ప్రభుత్వం ఇది కులగణన కాదని, ఆర్థికంగా వెనుకబడిన వారు ఏయే కులాల్లో ఉన్నారో తెలిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయన్న ఉద్దేశంతోనే దీనిని చేపట్టినట్టుగా వాదిస్తోంది. -
‘‘వై ఐ కిల్డ్ గాంధీ’’ సినిమా విడుదల ఆపండి
ముంబై: మహాత్మాగాంధీ వర్ధంతి రోజైన జనవరి 30న విడుదల కానున్న వై ఐ కిల్డ్ గాంధీ సినిమా విడుదల నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సినిమాతో జాత్యహంకార పోకడలు పెచ్చుమీరుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ ఒక లేఖ రాశారు. మహాత్ముని మార్గాలైన అహింస, శాంతిని స్మరించుకోవాల్సిన రోజు ఈ సినిమా విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్సీపీ ఎంపీ, నటుడు అమోల్ కొల్హె ఈ సినిమాలో మహాత్ముడిని చంపిన నాథూరామ్ గాడ్సే పాత్రని పోషించారు. -
నిత్యావసర సరుకుల డెలివరీకి జొమాటో గుడ్‌బై
న్యూఢిల్లీ: నిత్యావసర వస్తువుల డెలివరీ సేవలను సెపె్టంబర్ 17 నుంచి నిలిపివేస్తున్నట్టు జొమాటో ప్రకటించింది. ‘జొమాటోలో మా వినియోగదార్లకు ఉత్తమ సేవలను, వ్యాపార భాగస్వాములకు అతిపెద్ద వృద్ధి అవకాశాలను అందించాలని భావిస్తున్నాము. ఇందుకు ప్రస్తుత మోడల్ ఉత్తమ మార్గం అని మేము నమ్మడం లేదు. అందుకే ఈ పైలట్ గ్రాసరీ డెలివరీ సేవలను నిలిపివేయాలని అనుకుంటున్నాము’ అని కంపెనీ తన భాగస్వాములకు ఈ–మెయిల్ ద్వారా తెలిపింది. ‘స్టోర్లలో వస్తువుల జాబితా క్రియాశీలకం. నిల్వ స్థాయిలూ తరచూ మారుతున్నాయి. దీని కారణంగా ఆర్డర్లలో అంతరం ఏర్పడి పేలవమైన కస్టమర్ల అనుభూతికి దారితీస్తోంది. మా వేదిక ద్వారా ఇకపై సరుకుల డెలివరీని ఎట్టిపరిస్థితుల్లోనూ చేపట్టబోం. 10 నిముషాల్లోనే సరుకుల డెలివరీతో గ్రోఫర్స్ అధిక నాణ్యమైన సేవగా నిలిచింది. జొమాటో వేదిక ద్వారా సరుకుల డెలివరీ ప్రయత్నాల కంటే గ్రోఫర్స్లో కంపెనీ పెట్టుబడులు భాగస్వాములకు మెరుగైన ఫలితాల ను ఇస్తాయి’ అని జొమాటో స్పష్టం చేసింది. జొమాటో నిత్యావసర సరుకుల డెలివరీ సేవలను ఎంపిక చేసిన నగరాల్లో పైలట్ ప్రా జెక్ట్ కింద గతేడాది ప్రారంభించింది. కాగా, గ్రోఫర్స్లో మైనారిటీ వాటా కోసం రూ.745 కోట్లు వెచి్చంచినట్టు జొమాటో గతంలో తెలిపింది. -
కొన్ని ప్రాణాలు కాపాడగలిగామన్న సంతృప్తి ఉంది: నిఖిల్.
‘‘బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కోసం రిక్వెస్ట్ వస్తే మణికొండ నుంచి నా భార్యతో రాజేంద్రనగర్‌లోని ఫార్మా ఫ్యాక్టరీ గోడౌన్ వరకూ వెళ్లి, అక్కడ్నుంచి సోమాజిగూడ ఆసుపత్రి దాకావెళ్లి ఆ మెడిసిన్ అందజేశాను. రాత్రి 2 గంటల టైమ్‌లో నేనొస్తానని ఊహించలేదేమో.. ఆ కుటుంబ సభ్యుల కన్నీళ్లు చూస్తే నాకు కన్నీళ్లొచ్చాయి’’ అన్నారు హీరో నిఖిల్. నాలుగు రోజుల క్రితం నిఖిల్ అవసరార్ధుల కోసం సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రికి మెడిసిన్స్ తీసుకెళుతున్న సమయంలో పోలీసులు ‘ఈ పాస్’ లేదని అడ్డుకున్నారు. ‘‘ఆ రోజు ఏం జరిగిందంటే... మందులు తీసుకెళుతున్నప్పుడు పోలీసులు ఆపారు. మాస్క్ తీసి ముఖం చూపలేదు కానీ, ప్రిస్క్రిప్షన్ చూపించి, ఎమర్జెన్సీ అని చెప్పినా ‘ఈ పాస్’ ఉండాల్సిందే అన్నారు. రోడ్డు మీదే 20నిమిషాలు ట్రై చేసినా పాస్ దొరకలేదు. ఆ విషయాన్నే ట్వీట్ చేశా’’ అన్నారు నిఖిల్. ఈ ఉదంతం బయటకు వచ్చేవరకూ నిఖిల్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో నిఖిల్ పంచుకున్న అనుభవాలివి.. తుపాన్లు, వరదలు వస్తే నష్టాన్ని అంచనా వేసి తలా ఇంత అని సాయం చేయడం వేరు. కానీ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క, మందులు దొరక్క ప్రాణాలు పోయే పరిస్థితులు.. అంచనాలకు అందని వ్యాధులు.. వీటి మధ్య అవసరార్ధులకే కాదు సాయం చేయాలనుకున్నవారికీ కష్టమే. గత ఏప్రిల్‌లో నా భార్య, మా అంకుల్ కోవిడ్ బారిన పడినప్పుడు ఆసుపత్రుల్లో బెడ్స్ కోసం ఎదుర్కొన్న ఇబ్బందులు నన్ను ఆలోచింపజేశాయి. అప్పటికే ట్విట్టర్లో చూస్తే... పెద్ద సంఖ్యలో సాయం కోరుతూ రిక్వెస్టులు. కొంతమందికైనా సహాయం చేయాలనుకున్నాను. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్‌లలో వచ్చిన ప్రతీ రిక్వెస్ట్‌నీ పరిశీలించి, వీలైనంతవరకూ అటెండయ్యాం. ఇంజక్షన్ కావాలన్నవారికి ఇంజక్షన్, మెడిసిన్స్ అంటే మెడిసిన్స్, ఆసుపత్రి బిల్ కట్టలేకపోయిన వారికి బిల్లు... ఇలా వందలాది పేషెంట్స్‌కి కావాల్సినవి సమకూర్చగలిగాం. కాకినాడ కేజీహెచ్‌లో ఒకరికి బ్లాక్ ఫంగస్, విజయవాడ కామినేని ఆసుపత్రిలో ఇలా కొందరి గురించి ఆరోగ్యాంధ్రకు వారిని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తే.. వారు కూడా ఆయా పేషెంట్స్‌కి ఉచితంగా చికిత్స చేయించారు. నాకు విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ ఆసుపత్రుల్లో మంచి పరిచయాలు ఉండడం హెల్ప్ అయింది. రిక్వెస్టులు తగ్గాయి ఈ నెల 15 వరకూ రోజుకు దాదాపు 1000 దాకా రిక్వెస్టులు వచ్చాయి. అయితే ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపట్టడం వల్ల, బెడ్స్ బాగా పెరిగి అందుబాటులోకి రావడం వల్లనేమో ఆ తర్వాత తగ్గాయి. గతంలో తిత్లీ తుపాన్ టైమ్‌లో కూడా బాధితులకు సేవ చేసిన అనుభవం ఉంది. అయితే ఇన్ని రోజులు ఇంత కంటిన్యూగా చేయడం చాలా కొత్త అనుభవాలను, పాఠాలను నేర్పింది. ఒక అబ్బాయికి ఆక్సిజన్ సిలిండర్ పంపిస్తే అది ఇంటికి చేరేలోపు చనిపోయాడు. ఇలా చివరి నిమిషాల్లో రిక్వెస్ట్‌లు పెట్టడం వల్ల ప్రాణాలు కాపాడలేకపోవడమనే బాధ కలచివేసింది. ఏదేమైనా కొన్ని ప్రాణాలైనా కాపాడగలిగాం, కొంతమందికైనా ఉపశమనం ఇచ్చామనే సంతృప్తి అయితే ఉంది. పుట్టినరోజుకి ఫస్ట్ లుక్ నిఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘18 పేజెస్’. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ‘బన్ని’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. జూన్ 1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘18 పేజెస్’ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. అయితే బుధవారం అప్డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘18 పేజెస్’ టైటిల్ ఫిక్స్ చేసినప్పటినుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. గోపీసుందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బాబు, కెమెరా: వసంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శరణ్ రాపర్తి, అశోక్ బి. -
మళ్లీ ఆగిన మెట్రో రైలు!
సాక్షి, హైదరాబాద్: నగర మెట్రో రైలును సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-5 వద్ద మెట్రో 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులను మరో రైల్లో రాయదుర్గం తరలించారు. ఈ మార్గంలో అరగంట పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా ఇటీవల అసెంబ్లీ మెట్రో స్టేషన్ వద్ద సాంకేతిక సమస్యలతో మెట్రో రైల్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. సిగ్నలింగ్ లోపాలు, సాంకేతిక సమస్యలు తరచూ మెట్రోరైల్‌కు బ్రేకులు వేస్తున్నాయి. -
ఆఫర్ టికెట్ల అమ్మకాలు ఆపండి
న్యూఢిల్లీ: ప్రభుత్వం విధించిన చార్జీల పరిమితులు అమల్లో ఉన్నందున సోమవారం నుంచి ప్రారంభించిన ఐదు రోజుల రాయితీ టికెట్ల అమ్మకాలను నిలిపివేయాలని ఏవియేషన్ రెగ్యులేటర్ (డీజీసీఏ) చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ను కోరింది. రెండు నెలల క్రితం దేశీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైనప్పటి నుండి చార్జీల పరిమితులు అమలులో ఉన్నాయని డీజీసీఏ సీనియర్ అధికారులు తెలిపారు. చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఐదు రోజుల ‘1+1 ఆఫర్ సేల్‘ ను ప్రారంభించినట్లు సోమవారం ఉదయం ప్రకటించడంతో డీజీసీఏ వెంటనే స్పందించింది. దేశీ ప్రయాణాలకు పన్నులను మినహాయించి రూ .899 నుండి వన్–వే బేస్ చార్జీలను అందిస్తున్నట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది.అమ్మకం సమయంలో టికెట్ బుక్ చేసుకునే కస్టమర్లకు గరిష్టంగా రూ .2,000 విలువ కలిగిన కాంప్లిమెంటరీ వోచర్ లభిస్తుందని, భవిష్యత్తులో బుకింగ్ కోసం వీటిని ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. కరోనావైరస్ వ్యాప్తితో దాదాపు రెండు నెలల సస్పెన్షన్ తర్వాత దేశీయ ప్రయాణికుల సేవలు మే 25 న తిరిగి ప్రారంభమయ్యాయి. ఆగస్టు 24 వరకు విమాన చార్జీల పరిమితి ఉంటుందని మే 21 న పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రకటించిన తరువాత, మరిన్ని వివరాలతో డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. పతి విమానయాన సంస్థ తన టిక్కెట్లలో కనీసం 40 శాతం కనిష్ట గరిష్ట ధరల మద్య స్థాయి కన్నా తక్కువకు విక్రయించాలని రెగ్యులేటర్ స్పష్టం చేసింది. -
బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్
న్యూఢిల్లీ: బీఎస్4 ప్రమాణాల వాహనాల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్ పడింది. మార్చిలో లాక్డౌన్ విధించిన తర్వాత జరిగిన వాహన విక్రయాల అంశంపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెడితే .. గత ఆదేశాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బీఎస్4 ఇంధన ప్రమాణాలతో తయారైన వాహన విక్రయాలు నిల్చిపోవాలి. బీఎస్6 వాహన విక్రయాలు మాత్రమే జరగాలి.లాక్డౌన్ వల్ల బీఎస్4 వాహన విక్రయాల విషయంలో కాస్త సడలింపు దక్కింది. లాక్డౌన్ ఎత్తివేశాక 10 రోజుల పాటు వీటిని అమ్ముకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. కానీ మార్చి 25 తర్వాత లాక్డౌన్ అమలు కాలంలో కూడా భారీ స్థాయిలో బీఎస్4 వాహనాల విక్రయాలు జరగడాన్ని సుప్రీం తీవ్రంగా పరిగణించింది. -
నీరింకిన కళ్లు..!
కొడుకు చావుబతుకుల మధ్య ఉన్నాడని తెలిసి రోదిస్తున్న ఈ వలసకార్మికుని పేరు రామ్‌పుకార్ పండిట్. బిహార్‌లోని బెగూసరాయ్ ఈయన సొంతూరు. కొడుకును చూసేందుకు 1,200 కి.మీ.ల దూరమున్న సొంతూరుకు కాలినడకన బయల్దేరగా ఢిల్లీ సరిహద్దుల్లోని ఓ బ్రిడ్జిపై పోలీసులు ఆపేశారు. ఆకలిదప్పులకు సహిస్తూ మూడ్రోజులపాటు అక్కడే ఉండిపోయాడు. కొడుకు ఆఖరి చూపునకు నోచుకోకుండానే చనిపోయినట్లు తెలిసింది. వలస కార్మికుల వేదనకు అద్దంపడుతున్న ఇటీవలి ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
2,000 నోటు ఇక కనుమరుగే..!
న్యూఢిల్లీ: బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువగా రూ.2,000కు బదులు రూ.500 నోట్లే ఉంచుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధిక విలువ కరెన్సీ నోట్లను క్రమంగా వెనక్కు తీసుకోడానికి ఇది సంకేతమనీ ఆ వర్గాలు సూచిస్తున్నాయి. సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు గత ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమాధానం ఇస్తూ, రూ.2,000 నోట్ల ప్రింటింగ్‌ను నిలుపు చేసినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సంబంధిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ► ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలు ఏవీ లేనప్పటికీ, బ్యాంకులు తమకు తాముగా తమ ఏటీఎంలను తక్కువ విలువగల నోట్లతో నింపుతున్నాయి. ► ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ ఇప్పటికే ఒక ప్రకటన చేస్తూ, తమ ఏటీఎంల్లో రూ.2,000 నోట్ల వినియోగాన్ని నిలుపుచేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ► నిజానికి రూ.2,000 నోట్లను ఏటీఎంల్లో నింపడానికి వాటిని కొంత అప్‌గ్రేడ్ చేయాల్సిన పరిస్థితి. ఈ వ్యవహారం వ్యయాలపరంగా బ్యాంకింగ్‌పై అదనపు భారాన్ని మోపుతోంది. ఈ అంశం కూడా బ్యాంకులు రూ.2,000 నోట్లను ఏటీఎంలలో పెట్టడానికి కొంత వెనక్కుతగ్గేలా చేస్తోంది. ► సమాచార హక్కు చట్టం ప్రకారం, ఆర్బీఐ ఇచ్చిన సమాధానాన్ని చూస్తే, రూ.2,000కు సంబంధించి 2016–17లో 3,542.991 మిలియన్ నోట్లను ముద్రించడం జరిగింది. 2017–18లో ఈ సంఖ్య 111.507కు పడిపోయింది. 2018–19లో ఇది మరింతగా 46.690 మిలియన్ నోట్లకు తగ్గింది. దీని ప్రకారం చూస్తే రూ.2,000 నోటును ఆర్బీఐ క్రమంగా వెనక్కు తీసుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ► అధిక విలువ కలిగిన నోట్ల అక్రమ నిల్వ, నల్లధనం నిరోధం లక్ష్యంగా రూ.2,000 నోటును వ్యవస్థ నుంచి క్రమంగా తగ్గిస్తున్నట్లు సంకేతాలు ఉన్నాయి. ► 2016 నవంబర్‌లో కేంద్రం రూ.1,000, రూ.500 విలువ నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ► రూ.2,000 నోటును ఉపసంహరించే ప్రతిపాదనఏదీ ప్రభుత్వం వద్ద లేదని గత ఏడాది డిసెంబర్లో ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, చెలామణీలో ఉన్న నోట్ల (ఎన్ఐసీ) విలువ 2016 నవంబర్ 4న రూ.17,74,187 కోట్లు. 2019 డిసెంబర్ 2 నాటికి ఈ విలువ రూ.22,35,648 కోట్లకు పెరిగింది. ► వార్షిక ప్రాతిపదికన చూస్తే, 2014 అక్టోబర్ నుంచి 2016 అక్టోబర్ మధ్య చెలామణీలో ఉన్న నోట్ల విలువ సగటున 14.51 శాతం పెరిగింది. ఈ లెక్కన చూస్తే, 2019 డిసెంబర్ 2 నాటికి ఎన్ఐసీ రూ.25,40,253 కోట్లకు చేరి ఉండవచ్చు. -
కశ్మీర్ హై అలర్ట్!
కశ్మీరం వేడెక్కుతోంది. లోయలో భద్రతా బలగాల పెంపుపై ఊహాగానాలు కొనసాగుతుండగానే.. ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తూ శుక్రవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాత్రపై పాక్ ఉగ్రదాడికి పాల్పడే అవకాశముందనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రీకులు, ఇతర పర్యాటకులు తక్షణమే తమ పర్యటనను ముగించుకుని కశ్మీర్ నుంచి వెనక్కు వెళ్లాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదేశించింది. యాత్ర మార్గంలో పాకిస్తాన్లో తయారైన మందుపాతర, అమెరికా మేడ్ స్నైపర్ రైఫిల్ లభించాయని భారత ఆర్మీ ప్రకటించింది. యాత్రపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని కచ్చితమైన నిఘా సమాచారం వచ్చినట్లు పేర్కొంది. కశ్మీర్‌కు భారీగా బలగాలను పంపిస్తున్నారన్న వార్తలు స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అయితే, అలాంటిదేమీ లేదనీ, అంతర్గత భద్రత, సిబ్బంది మార్పిడి కోసం 10 వేల మందిని పంపేందుకు గత వారమే ఆదేశాలిచ్చామని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి ప్రజల కన్నా.. భూభాగమే ముఖ్యమని తేలిందని పీడీపీ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. శ్రీనగర్: అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం అనూహ్య ప్రకటన చేసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని కచ్చితమైన సమాచారం వచ్చినట్లు భారత ఆర్మీ శుక్రవారం హెచ్చరించింది. దీంతో యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి ఉన్నపళంగా వెనక్కు వెళ్లిపోవాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సూచించింది. దీంతో స్థానిక కశ్మీర్ ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితులు హింసాత్మకంగా మారే అవకాశం ఉందంటూ అక్కడి ప్రజలు నిత్యావసరాల కొనుగోలుకు దుకాణాల ముందు క్యూలు కడుతున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలన నడుస్తుండటం తెలిసిందే. జూలై 1న మొదలైన అమర్నాథ్ యాత్ర ఆగస్టు 15న ముగియాల్సి ఉంది. కాగా, యాత్ర సాగే మార్గాల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను సైన్యం గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుందని ఆర్మీ 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీవోసీ) లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ చెప్పారు. అమర్నాథ్ యాత్ర సాగే బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో భద్రతా దళాలు సోదాలు నిర్వహించగా, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, అమెరికాలో తయారైన ఎం–24 (స్నైపర్) తుపాకి లభించాయని వెల్లడించారు. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశామని ఆయన తెలిపారు. యాత్రికులపై దాడి చేయాలన్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసేందుకు భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని ధిల్లాన్ వెల్లడించారు. గత కొన్ని రోజుల్లో భద్రతా దళాలు జరిపిన సోదాల్లో, పాకిస్తాన్‌లోని ఆయుధ కర్మాగారంలో తయారైన మందుపాతర, భారీ స్థాయిలో ఇతర ఆయుధాలు దొరికాయని ధిల్లాన్ తెలిపారు. కశ్మీర్ లోయలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు పాకిస్తాన్, ఆ దేశ ఆర్మీ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్‌తో కలిసి ధిల్లాన్ సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘గత మూడు నాలుగు రోజుల నుంచి మాకు నిఘా వర్గాల ద్వారా కచ్చితమైన సమాచారం వస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ నేతృత్వం, సాయంతోనే ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికులపై దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని చెప్పారు. మరోవైపు అవసరమైతే కశ్మీర్ విమానాశ్రయం నుంచి అదనపు విమానాలను నడపడానికి సిద్ధంగా ఉండాలని విమానయాన సంస్థలను డీజీసీఏ ఆదేశించింది. ఇక కేంద్రం సిద్ధమైంది: మెహబూబా పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ ప్రభుత్వం కశ్మీర్‌పై సైనిక శక్తిని ఉపయోగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలగించే విషయంలో కీలక నిర్ణయం త్వరలోనే రావొచ్చన్న వార్తల నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ ‘ఎట్టకేలకు కేంద్రం సిద్ధమైనట్లుగా ఉంది. ప్రజల కన్నా భూభాగమే ముఖ్యమని ఇండియా నిర్ణయించుకున్నట్లుంది. మీరు (ప్రభుత్వం) దేశంలోని ముస్లిం ఆధిక్య రాష్ట్రం ప్రేమను గెలుచుకోవడంలో విఫలమయ్యారు. మతం ఆధారంగా దేశ విభజనను వ్యతిరేకించి లౌకిక రాజ్యమైన భారత్‌తో కలిసుండాలని నిర్ణయించుకున్న రాష్ట్రమిది. కానీ ఇప్పుడు ఇండియా సిద్ధమైనట్లుగా ఉంది. జమ్మూ కశ్మీర్ ప్రజలను దోపిడీ చేసేందుకు కేంద్రం సన్నద్ధమైనట్లుగా కనిపిస్తోంది’ అని ఆరోపించారు. అలాగే మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా అంశాన్ని కదిలించవద్దని కేంద్రాన్ని కోరింది. భద్రత కోసమే బలగాలు: కేంద్రం కశ్మీర్లో అంతర్గత భద్రతా పరిస్థితుల దృష్ట్యానే పారా మిలిటరీ బలగాలను కశ్మీర్‌కు పంపుతున్నట్లు కేంద్ర హోం శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇలాంటి విషయాలను బహిరంగంగా చర్చించాల్సిన అవసరం లేదని హోం శాఖ స్పష్టం చేసింది. కశ్మీర్‌కు 10 వేల సిబ్బందిని కేంద్రం జమ్మూ కశ్మీర్‌కు తరలిస్తోందనీ, వారం క్రితమే ఇందుకు సంబంధించిన ఆదేశాలు వచ్చాయని హోం శాఖ వర్గాలు చెప్పాయి. భయం రేకెత్తిస్తున్నారు: ఎన్సీ, పీడీపీ యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పడం ద్వారా కశ్మీర్ లోయలో ప్రభుత్వం భయం రేకెత్తిస్తోందనీ, ఇలాంటి పరిస్థితిని తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని జమ్మూ కశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) మండిపడ్డాయి. ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఓ ట్వీట్ చేస్తూ, ‘ఉన్నపళంగా వెళ్లిపోవాలని యాత్రికులు, పర్యాటకులకు ప్రభుత్వమే చెబితే వారిలో భయం కలగదా? వారంతా తక్షణం అన్నీ సర్దు కుని వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు విమానాశ్రయాలు, రహదారులు పూర్తిగా జనంతో కిక్కిరిసిపోతాయి’ అని అన్నారు. కశ్మీర్‌కు రాజ్యాంగం ఇస్తున్న హక్కులను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కోరింది. మాజీ ప్రధాని మన్మోహన్æ అధ్యక్షతన జమ్మూ కశ్మీర్ అంశంపై కాంగ్రెస్ ఓ భేటీ నిర్వహించిన అనంతరం కేంద్రానికి ఈ విజ్ఞప్తి చేసింది. కశ్మీర్లో భయం భయం.. ఉగ్రవాదులు దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నందున అమర్నాథ్ యాత్రికులు, పర్యాటకులు వెంటనే కశ్మీర్ నుంచి వెనక్కు వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం ప్రకటన చేయడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు సరకులు, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేసి ముందస్తుగా భద్రపరచుకునేందుకు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఏటీఎంలు, పెట్రోల్ బంకుల ముందు భారీ వరుసల్లో నిలబడుతున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించే విషయమై కీలక నిర్ణయం రానుందనీ, ఆ కారణంగా గొడవలు జరిగి శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పుకార్లు వస్తున్నాయి. దీంతో సరకులను ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకునేందుకు స్థానికులు క్యూలు కట్టారు. పోలీసు సోదాల్లో దొరికిన అమెరికా తయారీ అత్యాధునిక రైఫిల్ -
అణు పరీక్షలకు స్వస్తి
సియోల్: నిత్యం ఏదో ఒక ఆయుధ పరీక్షతో ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఉత్తర కొరియా ఎట్టకేలకు దిగొచ్చింది. అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలను నిలిపేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో అంతర్జాతీయ సమాజం ఆ దేశంపై విధించిన కఠిన ఆంక్షలు ఫలించినట్లయింది. త్వరలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భేటీ కానున్న నేపథ్యంలో శనివారం ఈ ప్రకటన వెలువడింది. ఈ వారమే కిమ్–మూన్‌ల భేటీ జరగనుండగా, ట్రంప్–కిమ్‌ల సమావేశం ఎప్పుడు జరుగుతుందో ఇంకా తేదీ ఖరారు కాలేదు. అణు, క్షిపణి పరీక్షలకు స్వస్తి పలుకుతామన్న కిమ్..ఇప్పటికే అభివృద్ధిచేసిన అణ్వాయుధాలు, క్షిపణులను త్యజించడంపై స్పష్టత ఇవ్వలేదు. అణు పరీక్షలకు వినియోగించిన ప్రయోగ కేంద్రాన్ని మూసివేస్తామని తెలిపారు. ఉ.కొరియా నిర్ణయాన్ని అమెరికా, జపాన్, చైనా, ఈయూ స్వాగతించాయి. ఇక వాటి అవసరం లేదు: కిమ్ అధికార వర్కర్స్ పార్టీ ప్లీనరీ సమావేశంలో సభ్యులకు కిమ్ తన నిర్ణయాన్ని తెలిపినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) వెల్లడించింది. ‘ అవసరమైన ఆయుధాలను ఇప్పటికే తయారుచేసుకున్నాం. క్షిపణులపై అమర్చే సూక్ష్మ వార్హెడ్లను కూడా అభివృద్ధి చేసుకున్నాం. ఇక మ నకు అణు పరీక్షలు, మధ్యంతర, ఖండాంతర క్షిపణుల అవసరం లేదు’ అని కిమ్ అన్నారు. అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి పరీక్షలను శనివారం నుంచి నిలిపేయాలని పార్టీ నిర్ణయించింది. భావి తరాలు గౌరవప్రద, సంతోషకర జీవితం గడపటానికి ఇప్పటికే అభివృద్ధిచేసిన అణ్వాయుధాలు భరోసా కల్పిస్తాయని కిమ్ వ్యాఖ్యానించారు. దేశాన్ని అణుశక్తిగా నిర్మించాలన్న లక్ష్యం నెరవేరిందని, ఇక పరిపుష్ట ఆర్థిక వ్యవస్థను తయారుచేసుకోవడంపై దృష్టిపెట్టనున్నట్లు వెల్లడించారు. గొప్ప పురోగతి: అమెరికా ఉ.కొరియా నుంచి ప్రకటన వెలువడిన వెంటనే ట్రంప్ స్పందించారు. ‘ఈ నిర్ణయం ఉ.కొరియాకే కాదు మొత్తం ప్రపంచానికి మేలు చేస్తుంది. ఇది గొప్ప పురోగతి. కిమ్‌తో సమావేశానికి ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఈ పరిణామాన్ని దక్షిణ కొరియా స్వాగతిస్తూ కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ దిశగా పడిన కీలక ముందడుగు అని వ్యాఖ్యానించింది. ఉ.కొరియా నిర్ణయం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించి, రాజకీయ స్థిరత్వానికి దోహదపడుతుందని మిత్ర దేశం చైనా పేర్కొంది. -
నిలిచిపోయిన డయాలసిస్
పార్వతీపురం: కిడ్నీవ్యాధిగ్రస్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉన్న పార్వతీపు రం ఏరియా ఆస్పత్రిలోని డయాలసిస్ కేంద్రంలో సేవలు నిలిచిపోయాయి. హైఓల్టేజ్ కారణంగా ముఖ్యమైన యంత్రాలు ధ్వంసం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటివరకు 72మంది రోగులు ఈ కేం ద్రం ద్వారా సేవలు పొందుతున్నారు. కేంద్రం ఏర్పాటు చేసి 13నెలలు అయినప్పటికీ ఇక్కడి సేవలకు ఎంతో గుర్తింపు లభించింది. గత శుక్రవారం హైఓల్టేజ్ రావడంతో డయాలసిస్ యూనిట్ వద్ద ఏర్పాటు చేసిన స్టెబిలైజర్ పాడైంది. డయాలసిస్ యంత్రాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో డయాలసిస్ కేంద్రం నిర్వాహకులు రోగులను పక్క జిల్లాలోని పాలకొండలో ఉన్న డయాలసిస్ కేంద్రానికి తరలిస్తున్నారు. అక్కడ వారికి సేవలు అందిస్తున్నారు. రూ. 10 లక్ష లమేర నష్టం.. ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి డయాలసిస్ కేంద్రానికి నేరుగా విద్యుత్ సరఫరాను అందించే కేబుల్‌ను కూడా డయాలసిస్ యూనిట్ నిర్వాహకులే ఏర్పాటు చేస్తున్నారు. స్టెబిలైజర్‌ను కూడా ఏర్పాటు చేశారు. అధిక విద్యుత్ సరఫరా అయిన సమయంలో వాటిని సరిదిద్ది పంపించే స్టెబిలైజర్‌లో న్యూట్రల్ వ్యవస్థ పాడవ్వడం, వైర్లు కాలిపోయి తెగిపోవడంతో ఒక్కసారిగా స్టెబిలైజర్ ద్వారా అత్యధిక ఓల్టేజీ ప్రసారం కావడంతో డయాలసిస్ కేంద్రంలోవున్న ఆరు మిషన్లకు విద్యుత్ సరఫరా జరగడంతో అందులోవున్న ఎస్‌ఎంపీఎస్ బోరŠుడ్స,(స్విచ్మోడ్ ఫవర్ సప్లై), కొన్ని హీటర్ ఫ్యూజులు కాలిపోవడంతో మిషన్లు పనిచేయకుండా పోయాయి. సుమారు రూ. 10లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి అవసరమైన స్పేర్ పాట్స్ వచ్చిన తరువాత యంత్రాలను బాగుచేస్తామని, తరువాత రోగులకు సేవలు అందిస్తామని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షిస్తున్నాం. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి అత్యధిక ఓల్టేజీ రావడంతో మిషన్లు పాడై రూ. 10 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం న్యూట్రల్ పాయింట్‌ను సరిచేశాం. తద్వారా సేవలు కొనసాగించడానికి పక్క కేంద్రాలనుంచి డయాలసిస్ మిషన్లను తెప్పిస్తాం. పూర్తి సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నాం. రెండు, మూడు రోజుల్లో తిరిగి సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.– డా. జి.నాగభూషణరావు,సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి న్యూట్రల్ పాయింట్ కాలిపోవడంవల్లే... డయాలసిస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్టెబిలైజర్ న్యూట్రల్ వైర్లు కాలిపోవడంవల్లే స్టెబిలైజర్ గుండా 450 ఓల్టేజ్ ప్రవహిం చింది. తద్వారా మిషన్లోవున్న ఎస్‌ఎంపీఎస్ బోర్లు కాలిపోయాయి. కేంద్రం లోవు న్న అన్ని మిషన్లు పనిచేయకుండా పోవడంతో రోగులకు ప్రత్యామ్నాయంగా పాలకొండ డయాలసిస్ కేంద్రానికి పంపిస్తున్నాం. – జితేంద్ర, నెప్రో ఇంజనీర్ -
మిలటరీ సాయం నిలిపేస్తున్నాం
వాషింగ్టన్/ఇస్లామాబాద్: ఉగ్రవాదానికి వంతపాడుతున్న పాకిస్తాన్‌కు అమెరికా మరోమారు హెచ్చరికలు జారీచేసింది. పాక్‌కు ఏటా భారీగా ఇస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12.66 వేల కోట్లు) భద్రతా సాయంలో కోతతోపాటుగా మిలటరీ సామగ్రి సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అఫ్గానిస్తాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌తో సహా పలు ఉగ్రవాద సంస్థలను అడ్డుకోవటంలో, పాక్‌లో వారి స్థావరాలను నిర్వీర్యం చేయటంలో విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు్ల ప్రకటించింది. అమెరికా కోరుకుంటున్నట్లు ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటే సాయం మళ్లీ మొదలవుతుందని సూచించింది. అయితే.. అమెరికా, అంతర్జాతీయ సమాజం కోరుకున్నట్లే వ్యవహరిస్తున్నామని పాక్ పేర్కొంది. భద్రత సాయం నిలుపుదలపై అమెరికా ప్రభుత్వాధికారులతో మాట్లాడుతున్నామని వెల్లడించింది. అలా చేస్తే మళ్లీ సాయం: అమెరికా ‘మేం పాకిస్తాన్‌కు జాతీయ భద్రత సాయాన్ని నిలిపివేస్తున్నాం. పాక్ ప్రభుత్వం అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకోనంతకాలం ఇది కొనసాగుతుంది. ఈ ఉగ్రవాద సంస్థలు అమెరికన్లను లక్ష్యంగా చేసుకోవటంతోపాటు దక్షిణాసియా ప్రాంతంలో అశాంతి చెలరేగేందుకు కారణమవుతున్నారు. అందుకే వీరిని నిర్వీర్యం చేయటంలో విఫలమవుతున్న పాక్‌కు మేం భద్రతాపరమైన సాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హీతర్ నార్ట్ పేర్కొన్నారు. ఈ నిధుల నిలుపుదలలో .. 2016 సంవత్సరానికి విదేశీ మిలటరీ నిధి రూపంలో ఇవ్వాలనుకున్న 225 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,425 కోట్లు), 2017 సంవత్సరానికి సంకీర్ణ మద్దతు నిధి రూపంలో ఇవ్వాలనుకున్న 900 మిలియన్ డాలర్ల (రూ.5.7వేల కోట్లు) సాయం ఉన్నాయి. అమెరికా నిర్ణయాన్ని గౌరవించనంతకాలం పాకిస్తాన్‌కు మిలటరీ పరికరాలను, సంబంధింత నిధులనూ నిలిపేస్తున్నట్లు ఆమె తెలిపారు. ‘ట్రంప్ కొంతకాలంగా దీనిపై స్పష్టమైన సూచనలు చేస్తున్నారు. టిల్లర్సన్, మాటిస్‌లు పాక్ ప్రభుత్వాన్ని కలిసి మరీ తమ ఆందోళన తెలియజేశారు. ఇది శాశ్వతంగా సాయాన్ని నిలిపేయటం కాదు. మేం చెప్పినట్లు చేస్తే (ఉగ్రవాదంపై చర్యలు) నిలిపేసిన సాయం మళ్లీ వారికే అందుతుంది’ అని నార్ట్ స్పష్టం చేశారు. 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను విడుదల చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికీ.. తాజాగా సాయం నిలిపివేతకు ఎటువంటి సంబంధం లేదని కూడా నార్ట్ ప్రకటించారు. మేం చేయాల్సింది చేస్తున్నాం: పాక్ ‘అస్పష్ట లక్ష్యాలు, ఏకపక్ష నిర్ణయాల వల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకోలేము’ అని అమెరికా తీరుపై పాకిస్తాన్ అసంతృప్తిని తెలియజేసింది. తాజా నిర్ణయాల నేపథ్యంలో భద్రతాపరమైన సాయంపై అమెరికా అధికారులతో మాట్లాడుతున్నట్లు పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ సమాజం, అమెరికా భద్రత ప్రయోజనాలకు అనుగుణంగానే పాకిస్తాన్ వ్యవహరిస్తోందని.. ఉగ్రవాదంపై పోరును కొనసాగిస్తోందని ప్రకటించింది. ‘అల్‌కాయిదా సహా ఇతర ఉగ్రవాద గ్రూపులను నిర్వీర్యం చేయటంలో అమెరికాకు సాయం చేశాం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవటంలో, అఫ్గాన్‌లో ప్రజాస్వామ్య రాజకీయ పరిస్థితులు నెలకొనేలా చొరవతీసుకున్నాం’ అని పాక్ పేర్కొంది. అమెరికా 15 ఏళ్లుగా పాకిస్తాన్‌కు ఏటా భారీ స్థాయిలో భద్రతా సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. -
యాక్టింగ్‌కి ఎండ్ కార్డా!?
తప్పదు... రాజకీయాల్లోకి చట్టబద్ధంగా ప్రవేశించాలనుకుంటే ‘యాక్టింగ్‌కి ఎండ్ కార్డ్’ వేయక తప్పదు! అంటున్నారు కమల్‌హాసన్. ఇటీవలే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన కమల్, వచ్చినప్పుడు ఓన్లీ పాలిటిక్స్ మీద కాన్సంట్రేట్ చేస్తానంటున్నారు. ‘‘బాధగానే ఉంటుంది (యాక్టింగ్‌కి ఎండ్ కార్డ్ వేయడం). బట్, సిన్మాకో నహి చోడేంగే’’ అన్నారాయన. అదేంటి? అంటే... సిన్మాల్లో యాక్టివ్‌గా ఉండకపోవచ్చు. కానీ, ఏదో రకంగా సిన్మా ఫీల్డ్కి కనెక్ట్ అయ్యే ఉంటానని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కమిట్మెంట్స్ వేరే విధంగా ఉంటాయని కమల్ అన్నారు. వచ్చే 2019 ఎన్నికల్లోపు కమల్‌హాసన్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
పెళ్లి వాహనాల అడ్డగింత
∙నూతన వధూవరులతో కలసి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా ∙పోలీసుల తీరును తప్పుబట్టిన వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఉషా, ఎల్ఎం కళ్యాణదుర్గం : రోడ్డు భద్రతా నియమాల పేరుతో పెళ్లి వాహనాలను పోలీసులు అడ్డగించడం వివాదాస్పదమైంది. పెళ్లి బందం ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి, వేధించడంతో నూతన వధూవరులతో సహా బంధువులు కలసి కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్ ముందు శనివారం రాత్రి బైఠాయించారు. వారికి వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి మద్దతు తెలిపా రు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు స్టేషన్ ముందు ధర్నా కొనసాగింది. గరుడాపురానికి చెందిన రామకష్ణ అనే యువకుడి పెళ్లి అనంతరం పెళ్లి బందం ట్రాక్టర్లో బోరంపల్లికి బయలుదేరింది. కంబదూరు మండలం కురాకులపల్లికి చెందిన రామ్మోహన్ పెళ్లికి హాజరైన బంధువులు కూడా మరో వాహనంలో బెళుగుప్ప మండలం బూదవర్తికి బయలుదేరారు. సీఐ శివప్రసాద్, ఎస్ఐ శంకర్‌రెడ్డి తమ సిబ్బందితో కలసి రెండు పెళ్లి వాహనాలను పట్టుకుని, స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు ఉషా, ఎల్ఎం పోలీసుల తీరును తప్పుపట్టారు. పెళ్లి వాహనాలు వదిలే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించారు. సీఐ, ఎస్ఐ పలుమార్లు చర్చలు జరిపినా వారు వినలేదు. తమకు ఎస్పీ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు ఉచిత సలహా ఇచ్చారు. చంటి బిడ్డల తల్లులు, చిన్నారులు ఆకలి, దాహంతో అలమటించారు. పోలీసుల తీరు పట్ల శాపనార్ధాలు పెట్టారు. కాగా ఇంత తతంగం జరుగుతుండగానే టీడీపీకి చెందిన వారి పెళ్లి లారీలు తమ కళ్లెదుటే వెళ్తున్నా పోలీసులు పట్టించుకోకవడం కొసమెరుపు. -
ఓటుకు కోట్లు ఆగేదెప్పుడు ?
-
స్తంభించిన రవాణా
చార్జీలపై లారీల సమ్మె ఫైనా¯Œ్స ఎంట్రీ వందల రెట్లు పెరుగుదల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆలస్యమైనా జేబు గుల్లే సాక్షి, రాజమహేంద్రవరం: రవాణారంగానికి సంబంధించిన చట్టానికి సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనివల్ల రవాణారంగం కుదేలవుతుందని రవాణాదార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మోటారు వెహికల్ నిబంధనల చట్టం (1989)లో చార్జీలకు సంబంధించిన రూల్ నం. 32, 81లను సవరించడంతో సరుకు రవాణా వాహనాలపై చార్జీలు భారీగా పెరిగిపోయాయి. దీన్ని నిరసిస్తూ పలు మార్లు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. గత నెల తొమ్మిదో తేదీన బంద్ పాటించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గురువారం నుంచి దేశ వ్యాప్తంగా సమ్మె చేపట్టారు. ఆందోళనలు ఇందుకే.. మోటార్‌సైకిల్ రిజిస్ట్రేష¯ŒS చార్జీ గతంలో రూ.450 ఉండగా ప్రస్తుతం రూ.685 చలానా కట్టించుకుంటున్నారు. కారుకు గతంలో రూ. 735 ఉండగా అది రూ. 1135కు పెరిగింది. కారు ఫైనా¯Œ్స ఎంట్రీ రూ. 735 ఉండగా అది కాస్త మూడురెట్లు పెరిగి రూ. 2,035లకు చేరుకుంది. ఆటో, లైట్వెహికల్, వ్యవసాయ అవసరాలకు వినియోగించే ట్రాక్టర్ రిజిస్ట్రేషన్, ట్రా¯Œ్సఫర్, ఫైనా¯Œ్స ఎంట్రీ చార్జీలు విపరీతంగా పెంచారు. ఈ వాహనాలకు గతంలో రిజిస్ట్రేష¯ŒS చార్జీ చలానా రూ.450 నుంచి రూ. 1150లకు పెంచారు. ట్రా¯Œ్సఫర్ రూ. 250 నుంచి రూ.650లకు, ఫైనా¯Œ్స ఎంట్రీ రూ.100 నుంచి ఏకంగా రూ.1650లకు పెంచేశారు. లారీ రిజిస్ట్రేష¯ŒS గతంలో రూ. 900 ఉండగా ఇప్పడు రెట్టింపయింది. ట్రా¯Œ్సఫర్ చలానా రూ. 600 నుంచి రూ.1050కు పెంచారు. ఫైనా¯Œ్స ఎంట్రీ రూ. 400 ఉండగా ఇప్పడు రూ. 3,300లకు చేరుకుంది. వాహనాలు రిజిస్ట్రేష¯ŒS చేయించడంలో ఆలస్యమైతే అపరాధ రుసుం ప్రతి మూడు నెలలకో విధంగా పెంచారు. గతంలో ఏదైనా వాహనం విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటే ఆవాహనాలపై చార్జీ రూ. 100 ఉండగా ఇప్పుడు దాన్ని రూ. 2,500 చేశారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆలస్యంపై బాదుడే.. సాధారణంగా ప్రతి ఏడాదీ వాహనాన్ని పరీక్షంపజేసుకుని ఫిట్¯ðనెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. కొత్త నిబంధనల ప్రకారం ఈ సర్టిఫికెట్ ఆలస్యమైతే గడువుతీరిన తర్వాత రోజుకు రూ. 50 చొప్పున అపరాధ రుసుం విధిస్తారు. ఆందోళనలు విరమించేది లేదు రాష్ట్ర విభజన తర్వాత రవాణా రంగం కుదేలయింది. అప్పటికే చార్జీలు కట్టినా తెలంగాణలోకి వెళితే తాజాగా చలానాలు కట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఈ చార్జీలు పెంచడం వల్ల రవాణా రంగం కోలుకోలేదు. ఆదాయమే పరమావధిగా చార్జీలను విపరీతంగా పెంచేశారు. ప్రభుత్వం తమ నిర్ణయంపై పునరాలోచన చేసే వరకు సమ్మె కొనసాగుతుంది. – వాసంశెట్టి గంగాధరరావు, ఆటోవర్కర్స్ యూనియ¯ŒS ప్రెసిడెంట్, రాజమహేంద్రవరం -
వర్మ పతనానికి నాంది
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి ‘వంగవీటి’ సినిమాపై మండిపాటు ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత వంగవీటి మోహనరంగాను ‘వంగవీటి’ సినిమాలో రౌడీగా చూపించడం సరికాదని, ఈ సినిమాయే దర్శకుడు రాంగోపాలవర్మ పతనానికి నాంది అని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో స్థానిక ట్రైనింగ్ కళాశాల వద్ద సోమవారం వంగవీటి రంగా 28వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి అహర్నిశలు పోరాడిన రంగా ఆశయాలను ప్రతిఒక్కరూ నెరవేర్చాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ రంగా పేద ప్రజల కోసం నిత్యం కోటీశ్వరులతో పోరాడుతూనే ఉండేవారని, రంగాతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ రంగా జీవించి ఉంటే రాష్ట్ర రాజకీయాలు వేరుగా ఉండేవని చెప్పారు. రంగాను రౌడీగా చూపించడాన్ని యువత తిప్పికొట్టాలన్నారు. వైఎస్సార్ సీపీ రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ వంగవీటి సినిమాపై యువత చాలా అసంతృప్తిగా ఉందని, వెంటనే ఈ సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రూరల్ కో–ఆర్డినేటర్ గిరజాల వీర్రాజు(బాబు) మాట్లాడుతూ కాపులంతా సంఘటితంగా పోరాడకపోతే, ఉనికి కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా పీసీసీ నేత రామినీడి మురళి, వివిధ సంఘాల కాపు నాయకులు నందెపు శ్రీనివాస్, అల్లు శేషునారాయణ, వడ్డి మల్లికార్జు¯ŒS ప్రసాద్, బెజవాడ రంగారావు, వడ్డి మురళి. సీసీసీ చానల్ ఎండీ పంతం కొండలరావు తదితరులు రంగా విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్ సీపీ నాయకులు డాక్టర్ లంక సత్యనారాయణ, మింది నాగేంద్ర, మాజీ కార్పొరేటర్లు ఇసుకపల్లి శ్రీనివాస్, మానే దొరబాబు, సుంకర శ్రీను తదితరులు పాల్గొన్నారు. ‘వంగవీటి’ సినిమా ప్రదర్శన నిలిపివేత పి.గన్నవరం : దివంగత కాపు నాయకుడు వంగవీటి మోహనరంగాపై రామ్‌గోపాల్‌వర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం రాత్రి స్థానిక బాలబాలాజీ థియేటర్లో సినిమా ప్రదర్శనను బోడపాటివారిపాలెం గ్రామ యువకులు నిలిపివేశారు. సినిమాను ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని, ఆందోళన చేపడతామని థియేటర్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. రంగాకు మద్దతుగా, వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, సుమారు అరగంట సేపు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో బోడపాటివారిపాలేనికి చెందిన రంగా మిత్రమండలి యూత్ నాయకులు పాల్గొన్నారు. -
ప్రహరీ నిర్మాణానికి బ్రేక్
లారీ స్టాండ్ స్థలానికి కంచె వేయాలన్న పాలక మండలి అభివృద్ధికి ఉపయోగపడనున్న రూ.49.40 లక్షల ప్రజాధనం సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరంలోని 10వ డివిజ¯ŒSలో ఉన్న లారీ స్టాండ్ స్థలం ఆక్రమణలకు గురికాకుండా తూర్పువైపు రూ.49.40 లక్షల వ్యయంతో ప్రహరీ నిర్మించాలన్న ప్రతిపాదనలకు బ్రేక్ పడింది. నగరం నడిబొడ్డున, శివారు ప్రాంతాల డివిజన్లలో అనేక ప్రాంతాలు అభివృద్ధికి దూరం ఉన్నా, పట్టించుకోని పాలక మండలి రూ. రెండు లక్షల కంచెతో పోయేదానికి రూ. అరకోటి వెచ్చిస్తోందని గత నెల 18న ‘ఆ అరకోటి అదో లూటీ’ అన్న శీరిక్షతో ‘సాక్షి’లో వార్త ప్రచురితమైంది. అధికార పార్టీలో కొంత మంది సీనియర్ కార్పొరేటర్లు తమ పలుకుబడితో తమ డివిజన్లలో పలు రకాల పనులు సృష్టించి భారీ మొత్తంలో నిధులు విడుదల చేయించుకుంటున్నారని పేర్కొంది. గత నెల 11న స్థాయీ సంఘం ముందుకు వచ్చిన ప్రతిపాదనల్లో ప్రహరీ గోడ అంశం ఒకటి. అప్పట్లో పలు కారణాల వల్ల ఆ సమావేశం వాయిదాపడింది. తాజాగా జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో ఈ ప్రతిపాదనను సభ్యులు తిరస్కరించారు. రూ. రెండు, మూడు లక్షలతో కంచె ఏర్పాటు చేయాలని కమిటీ సూచించడంతో సీనియర్ కార్పొరేటర్ దందాకు అడ్డుకట్ట పడింది. -
ఏమి ‘సేతు’ను స్వామీ!
భారీ వాహనాలతో ఇబ్బందులు పడుతున్నా! కలెక్టర్ ఆపమన్నారు.. మంత్రి చలోచలో అన్నారు ‘‘అయ్యా! గౌరవనీయులైన కలెక్టర్‌గారికి.. నేను గుర్తున్నానా! సారూ! లొల్లలాకులపై నిర్మించిన వంతెనను. కాట¯ŒSదొర కాలంలో పుట్టిన నేను ప్రజలకు విశేష సేవలందించాను. ఎన్నో బరువులు మోసీ..మోసీ చివరికి ఇలా బలహీనపడిపోయాను. గతేడాది ఓ రోజు అటుగా వచ్చిన మీరు నా పరిస్థితిని గమనించి.. నా మీదుగా భారీ వాహనాలు రాకుండా నిషేధించారు. అంతేకాదు నిషేధాజ్ఞలను తెలిపేలా హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయించారు. మీలో స్పందించే గుణం ఉందని ఎంతో సంతోషించాను. కొన్నేళ్లు భూమిపై ఉండొచ్చని ఆశపడ్డాను.తీరా..ఇటీవల లొల్లలాకులను పరిశీలించిన జిల్లా ఇ¯ŒSచార్జి మంత్రి, రాష్ట్ర ఇరిగేష¯ŒS మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నా ఆశలపై నీళ్లు చల్లారు. నా మీదుగా భారీ వాహనాలు తిరగవచ్చనే ఆర్డర్ వేశారు. ఇంకేముంది? భారీ, అతి భారీ వాహనాలు రయ్రయ్ అంటూ వెళుతున్నాయి. రోజూ వందలాది ఇసుకలారీలు అతివేగంగా వెళుతుంటే.. నేను త్వరలోనే కుప్పకూలిపోతానేమోనని భయమేస్తోంది. ఇక నాకు ఈ భూమిపై నూకలు చెల్లినట్టేననిపిస్తోంది. మరోవైపు నా బాధను ఇరిగేష¯ŒS శాఖ వాళ్లు కూడా పట్టించుకోవడం లేదు. ఇసుక రీచ్ నిర్వాహకులతో లాలూచీ పడిపోయారు. యథేచ్ఛగా వాహనాల రాకపోకలకు అనుమతులిచ్చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు, రైతులకు సేవలందించిన నా పరిస్థితిని ఎవ్వరూ పట్టించుకునే వారే లేరా?’’ – ఆత్రేయపురం -
ఎంపీ, ఎమ్మెల్యేల కాన్వాయ్ అడ్డగింత
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ కొద్దిరోజులుగా దీక్షలు చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు ఎంపీ మాగంటి మురళీమోహన్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కాన్వాయ్‌లను సోమవారం అడ్డగించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల క్యాంపస్‌లో జాబ్‌మేళాను ప్రారంభించడానికి వెళ్తున్న వారిని ఆపి తమ సమస్యలపై నినాదాలు చేస్తూ గోడు వెళ్లబోసుకున్నారు. దీనికి ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందిస్తూ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ నాయకులు వి.కనకరాజు, జీఎల్ మాణిక్యం, యు.లక్ష్మణరావు, చిక్కాల నర్సింహారావు, కుమార్రాజు, సాంబశివనాయుడు, వాణి, బీవీ నాయుడు, వేదమూర్తి పాల్గొన్నారు. -
నిలిచిన గౌతమి ఎక్స్‌ప్రెస్
సామర్లకోట : కాకినాడ నుంచి బయలుదేరిన గౌతమి ఎక్్సప్రెస్ రైలు సర్పవరం వద్ద సుమారు అరగంటపాటు నిలిచిపోయింది. ఎస్–1 బోగీలో అంధకారం ఏర్పడడంతో ప్రయాణికులు చైన్‌లాగి రైలును నిలిపివేశారు. ఏం జరిగిందో తెలియక వారు అయోమయానికి గురై బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా అక్కడకు చేరుకున్నారు. స్థానిక రైల్వే గార్డు పరిశీలించగా ఎస్–1 బోగీ దిగువ భాగంలో ఉన్న డైనమెట్ బెల్ట్‌లు తెగిపోయినట్టు గుర్తించారు. దాంతో ఆ బోగీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం ఏర్పడిందన్నారు. -
ఆయిల్ ఇండియా పనులకు ఆటంకం
డిమాండ్లు పరిష్కరించాలన్న కర్రివాని చెరువు గ్రామస్తులు డ్రిల్లింగ్ సైట్ వద్ద పిల్లాపాపలతో వంటా వార్పు అధికారుల హామీతో సమసిన ఆందోళన ముమ్మిడివరం : మండలంలోని గాడిలంక ఆయిల్ ఇండియా సంస్థ చేపట్టిన డ్రిల్లింగ్ పనులను మంగళవారం కర్రివాని రేవు గ్రామస్తులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని డ్రిల్లింగ్ సైట్ మెయిన్ గేట్ వద్ద టెంట్ వేసి రిలే దీక్షలు చేపట్టారు. పిల్లా పాపలతో మహిళలు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. సైట్ సమీప గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా కాలుష్య నియంత్రణ చర్యలు గాని, అనుమతులు గాని లేకుండా డ్రిల్లింగ్ చేస్తున్నారన్నారు. డ్రిల్లింగ్ పాయింట్‌కు కేవలం 300 మీటర్ల సమీపంలో కర్రివానిరేవు గ్రామంలో 1997లో నిరుపేదలకు ఏఎంజీ సంస్థ నిర్మించిన గృహాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటి సామర్థ్యాన్ని ఇంజనీర్ల చేత నిర్ధారించాలని లేకపోతే డ్రిల్లింగ్ పనుల వల్ల ఆవి కూలిపోయే ప్రమాదముందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 9నెలల క్రితం ఆయిల్ ఇండియా ప్రతినిధులు సైట్ నుంచి పెన్నాడ పాలెం వరకు 1350 మీటర్ల కెనాల్ రోడ్డును బీటీ రోడ్డుగా ఆధునికీకరిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. డ్రిల్లింగ్ వల్ల నష్టపోతున్న గాడిలంక, కర్రివాని రేవు గ్రామాల్లో రహదారులు అభివృద్ధి చేయాలని, వీధి దీపాలు ఏర్పాటుచేయాలని, ప్రధాన పంట కాలువ వెంబడి రక్షణ గోడ నిర్మించాలని, ఆయా గ్రామాల పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, నెలనెలా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్ల నిర్మాణానికి మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. తహసీల్దార్ ఎం.వీర్రాజు, ముమ్మిడివరం, కాట్రేనికోన ఎస్సైలు ఎం.అప్పలనాయుడు, షేక్‌జాన్‌బాషా ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించినా ఆందోళనకారులు ససేమిరా అంటూ ఆర్డీఓ వచ్చి లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. ఆందోళనకారులతో సైట్ ఇంజనీర్ శ్యామలరావు, సీఐ కేటీవీవీ రమణారావు, ఎస్సై అప్పలనాయుడు రెండు నెలల్లో రహదారి ఆధునికీకరణ పనులు పూర్తిచేస్తామని, మిగిలిన పనులు రిగ్ పనులు మొదలయ్యాకా దశలవారీగా పూర్తిచేసేందుకు హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. చర్చల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులతో పాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి పాల్గొన్నారు.అంతకు ముందు ఆందోళనలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ, నాయకులు చింతా వెంకటరమణ,కాశి రామకృష్ణ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. గ్రామస్తుల డిమండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తానని పితాని కర్రివాని రేవు సర్పంచ్ చింతా వెంకటరమణ, గాడిలంక సర్పంచ్ దానం వేణుగోపాలస్వామి, ఎంపీటీసీ ఓలేటి సత్యవతి, మాజీ సర్పంచ్‌లు మోర్త వీరశూర్జ్యం తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి నదిలో డ్రెడ్జింగ్ పనులకు బ్రేక్
పిచ్చుకలంలో తాత్కలికంగా పనులు నిలుపుదల బొబ్బర్లంక (ఆత్రేయపురం) : ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ రక్షిత ప్రాంతంలో పిచ్చుకలంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చేపట్టిన గోదావరి డ్రెడ్జింగ్ పనులను తాత్కాలికంగా ఆదివారం నిలుపుదల చేశారు. ఇటీవల చేపట్టిన డ్రెడ్జింగ్ పనులను ఆదివారం నిలిచిపోవడం పట్ల ఇక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం ఇక్కడ పనులు తీరు తెన్నులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పరిశీలించారు. ఈ తరుణంలో డ్రెడ్జింగ్ పనులు నిర్వహిస్తుండగా పిచ్చుకలంకలో తుప్పలు, ముల్ల పొదలు అడ్డురావడం వల్ల తాత్కాలికంగా పనులు నిలుపుదల చేసినట్లు తెలిసింది. ఇక్కడ ఓషియన్ పార్కు ఆధ్వర్యంలో రూ .16 కోట్లతో బ్యారేజీకి ఎగువ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించారు. దీనిపై హెడ్ వర్క్స్ ఈఈ కృష్ణారావును వివరణ కోరగా ముళ్ల తుప్పలు, చెట్లు కారణంగా డ్రెడ్జింగ్ యంత్రాలు రిపేర్లు మరియు నిర్వహణ నిమిత్తం హైదరాబాద్ పంపినందున తిరిగి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. -
ఆగ్రహ జ్వాల
దివీస్ ల్యాబ్ పనులను అడ్డుకున్న రైతులు పాక ఏర్పాటుకు వేసిన స్తంభాల తొలగింపు తుని ఎమ్మెల్యే మద్దతు రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్న దాడిశెట్టి రాజా రూ.350 కోట్లు మిగుల్చుకునేందుకే ఈ కుట్ర అని వెల్లడి సెజ్ ఖాళీ భూములకు బదులు రైతుల భూములు ఇవ్వడమేమిటని నిలదీత తొండంగి : తొండంగి మండలం కోన తీరప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న దివీస్ లేబొరేటరీస్ పరిశ్రమ పనులను పరిసర గ్రామాల రైతులు అడ్డుకున్నారు. ఈ పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యంతో తీరప్రాంత గ్రామాల మనుగడ దెబ్బ తింటుందని పేర్కొంటూ.. పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు తమ భూములివ్వడానికి నిరాకరించారు. ఆ భూముల్లో బలవంతంగా పాకలు వేసేందుకు చేసిన యత్నాలను ఆదివారం అడ్డుకున్నారు. పాక వేసేందుకు ఏర్పాటు చేసిన స్తంభాలను తొలగించారు. ఆగ్రహంతో తాటాకులను దగ్ధం చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి పనులనూ జరగనివ్వబోమని నినదించారు. వారికి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పూర్తి మద్దతు తెలిపారు. అంతకుముందు పంపాదిపేటలో జరిగిన సభలో బాధిత రైతులు, మహిళలు తమ సమస్యలను ఆయనకు వివరించారు. దివీస్ పరిశ్రమ ప్రతినిధులు తమ భూముల్లో పనులు ప్రారంభించారని తెలిపారు. దీంతో ఆ మూడు గ్రామాల ప్రజలతో కలిసి ఎమ్మెల్యే రాజా, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు, సీనియర్ నాయకులు పేకేటి సూరిబాబు, యనమల వరహాలు, జిల్లా కమిటీ సభ్యుడు పేకేటి రాజేష్, సొసైటీ డైరెక్టర్ అంబుజాలపు సత్యనారాయణ తదితరులు దివీస్ పనులు జరుగుతున్న భూములను పరిశీలించారు. అక్కడ చెట్టు నరుకుతున్న కూలీలతో ఎమ్మెల్యే చర్చించారు. పనులు నిలిపివేయాలని కోరారు. ఈ సందర్భంగా తాటియాకులపాలెం రైతు నేమాల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తన భూమిలో బలవంతంగా పాకలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజాకు వివరించారు. దీనిపై ఆగ్రహించిన బాధిత రైతులు, మహిళలు పాక ఏర్పాటుకు వేసిన స్తంభాలను తొలగించారు. తాటాకులను, దూలాలను తగులబెట్టారు. కాలుష్య పరిశ్రమ తరలేవరకూ పోరాటం పంపాదిపేటలో జరిగిన సభలో ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ, తీరప్రాంత రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేదిలేదని, కాలుష్య పరిశ్రమ తరలిపోయే వరకూ రైతుల పక్షాన పోరాడతానని భరోసా ఇచ్చారు. అమాయక రైతుల వద్ద భూములను అప్పనంగా కొట్టేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. దివీస్ ల్యాబ్‌్సకు ఫలానా ప్రాంతంలోనే భూములు కేటాయిస్తామని ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదన్నారు. కానీ చౌకగా భూములు ఇప్పించేందుకు ఈ పరిశ్రమ కుంపటిని ఈ ప్రాంత అధికార పార్టీ నేతలు తెచ్చిపెట్టారన్నారు. ‘‘సెజ్ పేరుతో యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో వేలాది ఎకరాలు సేకరించారు. ఖాళీగా ఉన్న ఆ భూములను దివీస్‌కు ఎందుకు కేటాయించలేదు? చిన్న, సన్నకారు రైతులకు చెందిన సుమారు 505 ఎకరాల కోన భూములను కేటాయించడం వారికి పూర్తిగా అన్యాయం చేయడమే. సెజ్‌లో ఎకరాకు సుమారు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల చొప్పున చెల్లించి భూములు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ దివీస్ యాజమాన్యం ఖర్చు చేయాలి. కానీ అలా చేయకుండా ఎకరా రూ.5 లక్షలకే లాక్కొని పేదలైన కోన రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. పొరుగున ఉన్న విశాఖ జిల్లాలో మరో పరిశ్రమ ఏర్పాటుకు జరిగిన చర్చల్లో ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇప్పిస్తామని పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రకటించారు. దీనికి అక్కడి రైతులు అంగీకరించకపోవడంతో రూ.24 లక్షలు ఇప్పిస్తానని చెప్పారు. అయినా భూములు ఇచ్చేందుకు రైతులు సమ్మతించలేదు. ఆ భూములకంటే సారవంతమైన కోన భూములను ఎకరాకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చి సేకరించాలని చూడడం పూర్తిగా అన్యాయం’’ అని ఎమ్మెల్యే వివరించారు. ఈ కాలుష్య పరిశ్రమవల్ల తరతరాల నుంచి ఇక్కడ జీవిస్తున్న ప్రజలు భూములను వదిలి పూర్తిగా వలస వెళ్లాల్సిన దుస్థితి దాపురిస్తుందని, పుట్టబోయే బిడ్డలు అంగవైకల్యంతో జన్మించే ప్రమాదం ఉంటుందని అన్నారు. గాలి, నీరు, నేల కలుషితమయ్యే పరిశ్రమలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇప్పటికే పలు కేసులు పెట్టారని.. అధికార బలంతో ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. -
ఆగిన ‘మైనర్’ పెళ్లి
పుల్కల్: మరికొద్ది సేపట్లో జరగాల్సిన ఓ బాల్య వివాహాన్ని ఎస్ఐ సత్యనారాయణతో పాటు సీడీపీఓ ఎల్లయ్య అడ్డుకున్నారు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు ఆందోళనకు గురయ్యారు. వివాహ వయస్సు వచ్చాకే పెళ్లి జరిపిస్తామని రాత పూర్వకంగా తెలపడంతో వ్యవహారం సద్దుమణిగింది. చౌటకూర్‌లో బుధవారం జరిగిన సంఘటన వివరాలు... పుల్కల్ మండల పరిధిలోని చౌటకూర్‌కు చెందిన ఆకుల కిష్టయ్య రెవెన్యూ శాఖలో ఉద్యోగి. తన మూడో కుమార్తెను ఇటిక్యాల్‌కు చెందిన మన్నే ఆంజనేయులకు ఇచ్చి వివాహం జరిపించేందుకు బుధవారం ముహూర్తం నిర్ణయించారు. చౌటకూర్ జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో పెళ్లిపందిరి సైతం సిద్ధం చేశారు. కాగా, పెళ్లికుమార్తెకు 18 సంవత్సరాలు నిండలేదని గుర్తుతెలియని వ్యక్తులు 1098కు సమాచారం అందించారు. దీంతో జోగిపేట ఐసీడీఎస్ సీడీపీఓ బాలయ్యతో పాటు పుల్కల్ ఎస్ఐ సత్యనారాయణ, ఆర్ఐ సుకుమారి.. వివాహాన్ని అడ్డుకున్నారు. బాల్య వివాహాలు నేరమని, జరిపితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. దీంతో 18 ఏళ్లు నిండి న తర్వాతే పెళ్లిచేస్తామని వధూవరుల తరపు బంధువులు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. అనంతరం పెళ్లికుమారుడు ఆంజనేయులుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీడీపీఓ బాలయ్య మాట్లాడుతూ.. ఇప్పుడు నిలిపిన పెళ్లిని తిరిగి ఎక్కడైనా జరిపితే వరుడితో పాటు సహకరించినవారిపైనా కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. -
‘బంగారు తల్లి’కి మంగళం!
-
నిలిచిపోయిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్
వరంగల్: సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళుతోన్న గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం సాయంత్రం జనగామా స్టేషన్లో నిలిచిపోయింది. సాంకేతిక కారణాలవల్లే రైలు నిలిచిపోయినట్లు తెలిసింది. ఒకవైపు రైలు ఆగిపోవడం, మరో వైపు వర్షం కురుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థపడ్డారు.